golden duck
-
బుమ్రా అరుదైన ఫీట్.. ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడి ధాటికి కంగూరులు బెంబేలెత్తిపోయారు. తొలుత అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీని ఔట్ చేసి ఆసీస్‌ను ఆదిలోనే దెబ్బ కొట్టిన బుమ్రా.. ఆ తర్వాత స్మిత్, ఉస్మాన్ ఖావాజా, కమ్మిన్స్ ఔట్ చేసి ఆతిథ్య జట్టును కష్టాల్లో నెట్టేశాడు.ఇప్పటివరకు మొదటి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జస్ప్రీత్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో స్మిత్ తొలి బంతికే ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా టెస్టుల్లో స్మిత్‌ను బుమ్రా కంటే ముందు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. గెబెర్హా వేదికగా 2014లో ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్మిత్‌ను స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత స్మిత్ రెండో సారి గోల్డెన్ డకౌటయ్యాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.చదవండి: IND vs AUS: వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్ -
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్లు మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.తుదిజట్టులో ధోని అవసరమా?పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ రావడం ఏమిటి? ఠాకూర్ ఎప్పుడైనా హిట్టింగ్ ఆడాడా?ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదుధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.డెత్ ఓవర్లలో సీఎస్కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బాగుంటుందని హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.రవీంద్రుడి మాయాజాలం కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌తో ఆదివారం నాటి మ్యాచ్ సీఎస్కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. ఇక ఫినిషింగ్ స్టార్ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 110 పరుగులు చేశాడు.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024 -
T20I: గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్లో ఇదే తొలిసారి
Ind vs Afg- Virat Kohli Golden Duck: అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్‌తోనే కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమైన ఈ రన్‌మెషీన్.. ఇండోర్‌లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 16 బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న మూడో టీ20లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి.. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలిసారిగా గోల్డెన్ డక్ అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో.. టీమిండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి.. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి విఫలమయ్యాడు. ఈ క్రమంలో మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలిసారిగా గోల్డెన్ డక్ నమోదు చేశాడు కోహ్లి. అది కూడా ఐపీఎల్లో తన సొంతమైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ చెత్త రికార్డు మూటగట్టుకోవడం గమనార్హం. స్టేడియం మొత్తం గప్‌చుప్ దీంతో.. కోహ్లి బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. విరాట్ కోహ్లి అవుట్ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. -
గతేడాది ఫినిషర్‌గా రికార్డు.. ఈ సీజన్లో డకౌట్ల రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాల్సింది పోయి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవర్లో యష్ దయాల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యి చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. గతేడాది ఫినిషర్‌గా దినేశ్ కార్తిక్ మంచి ప్రదర్శన కనబరిచాడు. లాస్ట్ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన కార్తిక్ 330 పరుగులు చేశాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉన్నప్పటికి ఫినిషర్‌గా మాత్రం రికార్డులు సాధించాడు. కానీ ఈ ఏడాది సీన్ మొత్తం రివర్స్ అయింది. ఫినిషర్‌గా అదరగొట్టిన ఏడాది వ్యవధిలోనే డకౌట్ల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా దినేశ్ కార్తిక్ తొలి స్థానంలో నిలిచాడు. 17 డకౌట్లతో కార్తిక్ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 16 డకౌట్లతో రెండు, 15 డకౌట్లతో మణిదీప్‌సింగ్, సునీల్ నరైన్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్ 16వ సీజన్లో దినేశ్ కార్తిక్ డకౌట్‌గా వెనుదిరగడం ఇది నాలుగోసారి. ఒక సీజన్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో దినేశ్ కార్తిక్ చేరిపోయాడు. జాస్ బట్లర్(2023, ఐదు డకౌట్లు) తొలి స్థానంలో ఉండగా.. గిబ్స్(2009), మిథున్ మార్ష్(పుణే వారియర్స్), మనీష్ పాండే(2012), శిఖర్ ధావన్(2020), ఇయాన్ మోర్గాన్(2021), నికోలస్ పూరన్(2021), దినేశ్ కార్తిక్(2023) నాలుగేసిసార్లు ఒకే సీజన్లో డకౌట్ అయ్యారు. చదవండి: కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా -
గోల్డెన్ డకౌట్.. ఓపెనర్‌గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. మధ్యలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికి 9 మ్యాచ్‌లాడి 356 పరుగులు చేయడం విశేషం. ధావన్ ఖాతాలో మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. అయితే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం గబ్బర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ధావన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్‌గా వచ్చి అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు. ఇప్పటివరకు ఓపెనర్‌గా ధావన్(తాజా దానితో కలిపి) పదిసార్లు డకౌట్ కాగా.. తొలి స్థానంలో పార్థివ్ పటేల్ 11 సార్లు ఓపెనర్‌గా డకౌట్ అయ్యాడు. ధావన్‌తో కలిసి గౌతమ్ గంభీర్, అజింక్యా రహానేలు కూడా పదిసార్లు డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ తొమ్మిదిసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. -
ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు.. ఇలాంటి ప్లేయర్ అవసరమా?
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏది కలిసిరావడం లేదు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నా.. బ్యాటింగ్ ఎంచుకున్నా ఫలితం మాత్రం ఢిల్లీకి ప్రతికూలంగానే ఉంటుంది. తాజాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతిని కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న మిల్లర్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో సాల్ట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సాల్ట్ సీజన్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ప్రబ్‌సిమ్రన్ సింగ్, రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. మరో విశేషమేంటంటే.. ఫిల్ సాల్ట్ తాను ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో బంగ్లాదేశ్‌తో ఒక అంతర్జాతీయ టి20 కాగా.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రెండోసారి గోల్డెన్ డక్ కాగా.. తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో మూడోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరి ఇంత దారుణంగా ఆడుతున్నా అవకాశమివ్వడం ఏంటని.. ఇలాంటి ప్లేయర్ అవసరమా అని అభిమానులు పేర్కొన్నారు. In Phil Salt's last 5 T20 inns, he's scored a golden duck every-other dig 0(1) ENG v BNG 5(3) DC v KKR 0(1) DC v SRH 59(35) DC v SRH 0(1) DC v GT (today) — Mark Puttick (@GryllidaeC) May 2, 2023 చదవండి: చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్ గొడవకు మూల కారకుడు? -
RCB VS RR: కోహ్లి సెంచరీ కొట్టాడు.. గోల్డెన్ డకౌట్ అయిన మ్యాచ్‌లోనే..!
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటైన విరాట్ కోహ్లి.. ఫీల్డర్‌గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ క్యాచ్ పట్టడం ద్వారా ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో మరో క్యాచ్ (యశస్వి జైస్వాల్) కూడా పట్టిన కోహ్లి.. 230 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 205 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు అందుకోగా.. రెండో స్థానంలో ఉన్న కీరన్ పోలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు పట్టాడు. వీరిద్దరి తర్వాత కోహ్లి మూడో స్థానంలో, రోహిత్ శర్మ (98 క్యాచ్‌లు), శిఖర్ ధవన్ (93) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇదే మ్యాచ్‌లో మరో ఆటగాడు కూడా కోహ్లిలాగే సెంచరీ చేశాడు. అది కూడా కోహ్లినే ఔట్ చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోహ్లి వికెట్ పడగొట్టడం ద్వారా ఐపీఎల్లో 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్.. 101 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేయగా,. ఛేదనలో తడబడిన ఆర్ఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి, ఓటమిపాలైంది. -
ఏప్రిల్ 23.. కోహ్లికి కలిసిరాని రోజు!
ఏప్రిల్ 23.. ఆర్సీబీ స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఏ మాత్రం కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ తేదీన ఆర్సీబీ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం గమనార్హం. మరో విచిత్రమేంటంటే.. ఏప్రిల్ 23న కోహ్లి గోల్డెన్ డక్ అయిన రెండు సందర్భాల్లో ఆర్సీబీకి ఓటములే ఎదురయ్యాయి. మరి కోహ్లికి చీకటి రోజుగా మిగిలిపోయిన రెండు సందర్భాలను ఒకసారి చూసేద్దాం. ఏప్రిల్ 23, 2017: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చి తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. నాథన్ కౌల్టర్‌నీల్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 82 పరుగులతో ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 23, 2022: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన కోహ్లి మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 68 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 8 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఏప్రిల్ 23,2023: ఆర్సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో ఆదివారం(ఏప్రిల్ 23న) రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి బౌల్ట్ వేసిన తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. మరి ఈ మ్యాచ్ ఫలితం ఆర్సీబీకి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 23rd April - A day to forget for Virat Kohli. 📸: IPL#ViratKohli #TrentBoult #RCBvsRR pic.twitter.com/tyxVr7ciwy — CricTracker (@Cricketracker) April 23, 2023 ̶L̶i̶g̶h̶t̶n̶i̶n̶g̶ 𝐁𝐨𝐮𝐥𝐭 𝐬𝐭𝐫𝐢𝐤𝐞𝐬 𝐭𝐰𝐢𝐜𝐞 ⚡⚡#RCBvRR #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/SwM0SekfBQ — JioCinema (@JioCinema) April 23, 2023 చదవండి: చెత్త రికార్డు.. మొహం చూపించడానికి ఇష్టపడని కోహ్లి -
చెత్త రికార్డు.. మొహం చూపించడానికి ఇష్టపడని కోహ్లి
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లి గోల్డెన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి ఆశ్చర్యపరిచాడు. అప్పటివరకు కోహ్లి నామస్మరణతో హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం కోహ్లి ఔట్‌తో ఒక్కసారిగా మూగబోయింది. తాను ఔట్ అవ్వడంపై తీవ్ర నిరాశ చెందిన కోహ్లి కనీసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్ మొహం కూడా చూడకుండా తల కిందికేసుకొని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్ అయిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి తాజా దానితో కలిపి ఏడుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగ్గా.. సునీల్ నరైన్, హర్బజన్ సింగ్‌లతో కలిసి కోహ్లి సంయుక్తంగా ఉన్నాడు. ఇక తొలి స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పది గోల్డెన్ డకౌట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. Only Rashid Khan has more golden ducks in the IPL than Virat Kohli 🤯 #IPL2023 pic.twitter.com/XFkYHPf0Iq — ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2023 ̶L̶i̶g̶h̶t̶n̶i̶n̶g̶ 𝐁𝐨𝐮𝐥𝐭 𝐬𝐭𝐫𝐢𝐤𝐞𝐬 𝐭𝐰𝐢𝐜𝐞 ⚡⚡#RCBvRR #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/SwM0SekfBQ — JioCinema (@JioCinema) April 23, 2023 చదవండి: RCB VS RR: కోహ్లి గోల్డెన్ డక్.. మహిళా అభిమాని ఏం చేసిందంటే..! -
మరో గోల్డెన్ డక్.. టి20ల్లో కూడా పనికిరాడా?
ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు యత్నించి కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకు ఇది నాలుగో గోల్డెన్ డక్ కావడం గమనార్హం. ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్య మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఐపీఎల్లో తొలి మ్యాచ్‌లో 16 బంతుల్లో 15 పరుగులు, రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటైన సూర్య.. తాజాగా మాత్రం గోల్డెన్ డక్ అయ్యి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. సూర్య ఆటతీరు తమను బాధిస్తుందని అభిమానులు పేర్కొన్నారు. ''టెస్టుల్లో అవకాశమిస్తే విఫలమ్యాడు.. వన్డేల్లో గోల్డెన్‌డక్ అయ్యాడు.. ఇప్పుడు టి20ల్లో విఫలమవుతూ ఈ ఫార్మాట్లో కూడా పనికిరాడా అన్నట్లుగా తయారవుతున్నాడంటూ'' కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. सुना है आज फिर आसमां (SKY) में सुराख़ कर गया कोई। #SuryakumarYadav फिर गोल्डन डक हुए हैं।#IPL2023 | #MIvsDC | #IPL pic.twitter.com/u8QpOpjAb0 — Jay Shukla 🇮🇳 (@JayShukla08) April 11, 2023 చదవండి: ఒక్క హాఫ్ సెంచరీతో రెండేళ్ల నిరీక్షణకు తెర var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ అన్నా!
''అన్నొచ్చేశాడు.. ఇక ఎస్ఆర్హెచ్ కథ మారిపోనుంది''.. ''మార్క్రమ్ ఎంట్రీతో ఎస్ఆర్హెచ్లో కొత్త జోష్ కనిపిస్తుంది''..'' కొత్త కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అదరగొట్టనుంది''.. ''వాతి(మార్క్రమ్) కమింగ్.. బి కేర్‌ఫుల్ అపోజిట్ టీం మెంబర్స్''.. మార్క్రమ్ ఎరా మొదలైంది.. ఇక ఎవరు ఆపలేరు''.. ఇదంతా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ఎయిడెన్ మార్క్రమ్ ఎంట్రీ గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియలో ఇలా ఊదరగొట్టారు. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న మార్క్రమ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లక్నోతో మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కనీసం బంతిని కూడా అంచనా వేయడంలో విఫలమైన మార్క్రమ్ పేలవ రీతిలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మార్క్రమ్ వచ్చాడు ఏదో చేస్తాడనుకుంటే ఇలా గోల్డెన్ డకౌట్ అవ్వడం ఏంటని ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడ్డారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ ఇచ్చావ్ అన్నా అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అయితే మార్క్రమ్ వచ్చినా ఎస్ఆర్హెచ్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. పరుగులు చేయాల్సిన బ్యాటర్లు పోటీ పడి మరి వికెట్లు సమర్పించుకున్నారు. పార్ట్‌టైం బౌలర్‌గా వ్యవహరించే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారంటే ఎస్ఆర్హెచ్ ఎంత బాగా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. Headline for tomorrow's 𝐓𝐡𝐞 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰 𝐓𝐢𝐦𝐞𝐬 📰 𝘏𝘶𝘮𝘢𝘢𝘳 𝘗𝘢𝘯𝘥𝘺𝘢 𝘣𝘩𝘢𝘪𝘺𝘢, 𝘮𝘢𝘴𝘵 𝘣𝘢𝘢#LSGvSRH #TATAIPL #IPLonJioCinema | @krunalpandya24 pic.twitter.com/mQ7dui048U — JioCinema (@JioCinema) April 7, 2023 Golden duck for Aiden Markram on captaincy debut. Krunal Pandya on fire! pic.twitter.com/mfv0bPn3Zk — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023 Golden Duck on debut match as a captain in IPL 🔥🔥 Aiden Markram era starts from here they said, well said😍😍 #LSGvSRH pic.twitter.com/Gg69nUxQGG — TukTuk Academy (@TukTuk_Academy) April 7, 2023 Search: Markram Era 😂😂🤣🤣🤣🤣🤣 — Dileep (@dileeptweetsz) April 7, 2023 చదవండి: ''గ్లాడియేటర్' సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తా' ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్‌ను ఏలేవారేమో! -
డకౌట్ల విషయంలో పరువు తీసుకున్న కేకేఆర్ బ్యాటర్
కేకేఆర్ బ్యాటర్ మణిదీప్ సింగ్ డకౌట్ల విషయంలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మణిదీప్ సింగ్ నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మణిదీప్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్లో మణిదీప్‌కు ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం. ఇక మణిదీప్ తర్వాత ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తిక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు 14 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో ఉండగా.. పార్థివ్ పటేల్, అజింక్యా రహానే, అంబటి రాయుడులు 13సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. Two in Two by David Willey! A double wicket maiden by @david_willey 🔥🔥 Venkatesh Iyer and Mandeep Singh depart. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/FjuJoHWzLH — IndianPremierLeague (@IPL) April 6, 2023 చదవండి: Dinesh Karthik: కార్తిక్ తెలివికి కెప్టెన్ డుప్లెసిస్ ఫిదా -
సూర్యకుమార్ వన్డే కెరీర్ ముగిసినట్లే!
ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయినప్పటికి టీమిండియా మళ్లీ ఫుంజుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క ఆటగాడి వన్డే కెరీర్ మాత్రం ప్రమాదంలో పడినట్లే. అతనే సూర్యకుమార్ యాదవ్. టి20ల్లో సూపర్‌స్టార్‌గా పేరు పొందిన సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి చెత్త ప్రదర్శన కనబరిచాడు. టి20ల్లో దూకుడుగా ఆడినప్పటికి బంతిని చూసి ఆడడం అతనికి అలవాటు. కానీ వన్డేలకు వచ్చేసరికి అతని బ్యాట్ మూగబోయింది. క్రీజులో నిలదొక్కుకునే సమయం కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బౌలర్లు అతన్ని పెవిలియన్ చేరుస్తున్నారు. వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడంటే వన్డేలకు సూర్య పనికిరానట్లే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సూర్య ఔటైన విధానం చూస్తే అసలు ఆడుతుంది సూర్యనేనా అన్న అనుమానం వచ్చింది. మూడుసార్లు తొలి బంతికే వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ లోటును తీరుస్తాడని సూర్యను వన్డేలకు ఎంపికచేస్తే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇక రానున్న కాలంలో సూర్య వన్డేలు ఆడేది అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం సూర్యకుమార్ వయస్సు 32 ఏళ్లు. మహా అయితే మరో రెండేళ్లు ఆడొచ్చు. ఈ ప్రదర్శనతో అతను వన్డే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవడం కూడా అనుమానమే. అందుకే అభిమానులు కూడా సూర్యకుమార్‌పై దుమ్మెత్తిపోశారు. కొందరి కోసం టాలెంట్ ఉన్న ఆటగాళ్లను తొక్కేస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య కేవలం టి20 మెటిరీయల్ మాత్రమే.. సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చినా బాగుండేది.. కొద్దిరోజులయితే టి20ల్లో కూడా సూర్య భారంగా మారే అవకాశం ఉంది. అంటూ కామెంట్స్ చేశారు. WOW 😮 #INDvAUS pic.twitter.com/NL11tnLbBY — ESPNcricinfo (@ESPNcricinfo) March 22, 2023 One Golden Duck is enough to give you top tier respect in NBDC Department but you chose to score THREE back to back golden ducks, I repeat three golden ducks in a row, Take a bow for King Suryakumar Yadav🔥🙇♂️ #INDvAUS pic.twitter.com/RQV6mxVH6I — TukTuk Academy (@TukTuk_Academy) March 22, 2023 -
తనయుడి బౌలింగ్‌లో తండ్రి గోల్డెన్ డక్
కళ్లముందే బిడ్డ ప్రయోజకుడై ఎదుగుతుంటే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. అలాంటిది తనకే సవాల్‌గా మారి విజయం సాధిస్తే ఏ తండ్రైనా గర్వపడతాడు. ఇలాంటివి చాలా తక్కువగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌ను తనయుడు అలీ రజాక్ గోల్డెన్ డక్ చేయడం వైరల్‌గా మారింది. కింగ్డమ్ వాలీ మెగాస్టార్స్ లీగ్(ఎంఎస్ఎల్) 2022 లీగ్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రావల్పిండి వేదికగా పెషావర్ పఠాన్స్, కరాచీ నైట్స్ మధ్య టి10 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అబ్దుల్ రజాక్ పెషావర్ పఠాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తే.. తనయుడు అలీ రజాక్ కరాచీ నైట్స్ తరపున ఆడాడు. పెషావర్ పఠాన్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌నే అలీ రజాక్ వేశాడు. అబ్దుల్ రజాక్ ఓపెనర్‌గా వచ్చాడు. ఓవర్ తొలి బంతినే ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ డెలివరీ వేయగా.. రజాక్ బ్యాట్‌ను తగిలించి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో బ్యాట్ ఎడ్జ్‌కు తాకి కీపర్ చేతుల్లో పడడంతో అబ్దుల్ రజాక్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతే తండ్రిని గోల్డెన్ డక్ చేశానన్న సంతోషాన్ని సహచర ఆటగాళ్లతో పంచుకున్నాడు. అయితే పెవిలియన్ బాట పట్టిన అబ్దుల్ రజాక్ పైకి బాధపడినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం తనయుడు తనను ఔట్ చేశాడన్న ఆనందం కచ్చితంగా ఉండి ఉంటుంది అని అభిమానులు పేర్కొన్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్ ఉల్ హక్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులు చేశాడు. Ali Razzaq takes wicket of his Father Abdul Razzaq | PP VS KK | Kingdom Valley MSL 2022 at Rawalpindi Cricket Stadium | Day 5 | Peshawar Pathans vs Karachi Knights#KingdomValleyMSL2022 #MegaStarsLeague #Cricketainment #ShahidAfridi #PeshawarPathans #KarachiKnights pic.twitter.com/S5c34sR6qq — Mega Stars League (@megastarsleague) December 22, 2022 చదవండి: విజయం దిశగా.. టీమిండియా టార్గెట్ 145 -
అప్పుడు రోహిత్.. ఇప్పుడు బాబర్; లెక్క సరిచేశారు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న రోహిత్ నిర్ణయం సరైందేనని టీమిండియా బౌలర్లు నిరూపించారు. తొలి ఓవర్లో భువనేశ్వర్ ఒక వైడ్ మినహా మెయిడెన్ వేశాడు. ఇక రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ తన తొలి బంతికే బాబర్ ఆజంను పెవిలియన్ చేర్చాడు. అర్షదీప్ వేసిన ఇన్‌స్వింగర్ బాబర్ ప్యాడ్లను తాకుతు వెళ్లింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఎల్బీకీ అప్పీల్ చేశారు. అంపైర్ ఔటివ్వగా బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు క్లియర్‌గా కనిపించడంతో రివ్యూ వ్యర్థమయింది. దీంతో బాబర్ ఆజం తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇదే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అప్పటి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అప్పుడు షాహిన్ అఫ్రిది రోహిత్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. తాజాగా బాబర్ కూడా అదే తరహాలో ఔట్ కావడంతో రోహిత్ శర్మ సంతోషంలో మునిగిపోయాడు. ఇక అభిమానులు మాత్రం అప్పుడే పాక్ ఆటపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు రోహిత్.. ఇప్పుడు బాబర్ ఆజం గోల్డెన్ డక్.. లెక్క సరిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: T20 WC Ind Vs Pak: రిజ్వాన్ (4) ఔట్.. అర్ష్‌దీప్‌కు రెండో వికెట్ ఔట్ కాదనుకుంటా.. పాల్ స్టిర్లింగ్ మోసపోయాడు -
అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు
Asia Cup 2022 Final: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో లంక ఓపెనర్ కుషాల్ మెండిస్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. కుషాల్ మెండిస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో అతనికి ఇది 26వ డకౌట్. అరంగేట్రం నుంచి అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్ జాబితాలో కుషాల్ మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో జానీ బెయిర్ స్టో(ఇంగ్లండ్) 27 డకౌట్లతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మొయిన్ అలీ(ఇంగ్లండ్) 25 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. కగిసో రబడా(దక్షిణాఫ్రికా) 23 డకౌట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్ -
గోల్డెన్ డక్.. సేమ్ సీన్; బౌలర్ మారాడంతే!
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. బంతిని అంచనా వేయడంలో పొరబడిన రాహుల్ వికెట్ల మీదకు ఆడుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రగల్బాలు పలికిన కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పాకిస్తాన్ అరంగేట్ర బౌలర్ నసీమ్ షా వేసిన తొలి ఓవర్లోనే రాహుల్ వికెట్ల మీదకు ఆడుకొని క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. టి20 క్రికెట్లో డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న నసీమ్ షాకు ఇదే మొయిడెన్ వికెట్. ఇక రాహుల్ ఔటైన విధానం చూస్తే గతేడాది టీ20 ప్రపంచకప్ లో షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన సీన్ మరోసారి కనిపించింది. అప్పుడు కూడా రాహుల్.. 8 బంతులాడి 3 పరుగులే చేసి అఫ్రిది బౌలింగ్‌లో అచ్చం అదే తరహాలో బౌల్డ్ అయ్యాడు. తాజా మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ తొలి బంతికే వెనుదిరిగాడు. ప్రస్తుతం రాహుల్ ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Kl Rahul duck 😂 I have already predicted this. #INDvsPAK #AsiaCup2022 #IndiaVsPakistan pic.twitter.com/H7Nstgjlt6 — Dhriti banerjee (@dhriti908) August 28, 2022 చదవండి: IND Vs PAK Asia Cup 2022: టీమిండియా పేసర్ల సరికొత్త రికార్డు.. టి20 క్రికెట్లో ఇదే తొలిసారి -
IND VS IRE 2nd T20: హార్దిక్ సేన ఖాతాలో చెత్త రికార్డు
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు రికార్డు విజయాన్నినమోదు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య ఐర్లాండ్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్.. రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్(తొలి బంతికే ఔట్ కావడం)గా వెనుదిరిగారు. దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్‌లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై పెవిలియన్ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా (టీ20ల్లో) తరఫున ఇన్ని(3) గోల్డెన్ డకౌట్లు రికార్డు కావడం ఇదే తొలిసారి. కాగా, దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో, సంజూ శాంసన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చి ఓటమిపాలైంది. చివర్లో ఐర్లాండ్ ఆటగాళ్లు జార్జ్ డాక్రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్ అడైర్ (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) టీమిండియాను బయపెట్టారు. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు) భారీ షాట్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. చదవండి: కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు -
గోల్డెన్ డక్ తప్పించుకొని మ్యాచ్ విన్నర్‌గా.. రూల్స్ మార్చాల్సిందే!
ఐపీఎల్ 2022 సీజన్లో గురువారం ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్‌పై కీలక విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కోహ్లి దంచుడు.. మ్యాక్స్‌వెల్ మెరుపులతో 18.4 ఓవరల్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే మ్యాక్స్‌వెల్ తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే కోహ్లి, డుప్లెసిస్ మధ్య 115 పరుగుల సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది. 38 బంతుల్లో 44 పరుగులు చేసిన డుప్లెసిస్‌ను రషీద్ ఆ ఓవర్ రెండో బంతికి పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. అయితే రషీద్ మ్యాక్సీకి గూగ్లీ వేశాడు. స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నంలో మ్యాక్సీ బంతిని మిస్ చేయగా.. నేరుగా వికెట్లను తాకింది. అయితే బెయిల్స్ ఎగిరినప్పటికి అవి కిందపడలేదు. రూల్ ప్రకారం బెయిల్స్ కింద పడితేనే బ్యాట్స్‌మన్ ఔట్ అయినట్లు. వరుసగా రెండో వికెట్ తీశానన్న ఆనందంలో ఉన్న రషీద్ అసలు విషయం తెలిసి తల పట్టుకున్నాడు. అలా గోల్డెన్ డక్ నుంచి తప్పించుకున్న మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా ఈ సీజన్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇంతకముందు రాజస్తాన్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో చహల్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ కూడా ఇలాగే తప్పించుకున్నాడు. బంతి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్ కిందపడకపోవడంతో వార్నర్ బతికిపోయాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ''రూల్ మార్చండి.. బంతి వికెట్లను తాకి బెయిల్స్ కిందపడినా.. పడకపోయినా ఔట్ ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు ఇవే మ్యాచ్‌ను మలుపుతిప్పుతాయి. మ్యాక్స్‌వెల్ విషయంలో ఇదే జరిగింది. గోల్డెన్ డక్ నుంచి తప్పించుకొని మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్ Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా A Lucky Escape For Glenn Maxwell.#IPL2022 #RCBvGT pic.twitter.com/r2FjmbIbVV — Rahul Choudhary (@Rahulc7official) May 19, 2022 Miracle no 2 of the day. After failure of ball tracker to trace edge, bails didn't fall when @rashidkhan_19 bowled @Gmaxi_32 #IPL20222 #IPL #GTvRCB — Ajay Dhaka (@ajaydhakaajay) May 19, 2022 -
కోహ్లి పరిస్థితి ఇంతలా దిగజారుతుందని ఊహించలేదు.. రణ్వీర్ సింగ్ ఆవేదన
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శన రోజురోజుకు తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ పరుగుల యంత్రం అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుండటం ఇందుకో నిదర్శనం. అంతర్జాతీయ కెరీర్‌తో పోలిస్తే ఐపీఎల్లో కోహ్లి మెరుపులు అడపాదడపా కనిపించేవి. ఇప్పుడవి కూడా దాదాపుగా కనుమరుగయ్యాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అయితే కోహ్లి ప్రదర్శన పాతాళానికి పడిపోయింది. View this post on Instagram A post shared by ESPNcricinfo (@espncricinfo) సన్‌రైజర్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటైన కోహ్లి ఈ సీజన్లో ఇలా (గోల్డన్ డకౌట్) మూడు సార్లు ఔటయ్యాడు. ఇది అతనితోపాటు అతని అభిమానులను తీవ్రంగా కలచి వేస్తుంది. కోహ్లి తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఆరు సార్లు గోల్డన్ డకౌట్ కాగా, ప్రస్తుత సీజన్లోనే మూడు సార్లు ఆ అప్రతిష్టను మూటగట్టుకోవడాన్ని అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లి ఫామ్ ఇంతలా దిగజారుతున్నప్పటికీ అభిమానులు అతనికి అండగా నిలుస్తుండటం విశేషం. ఫామ్ విషయంలో కోహ్లి ఇంత కంటే హీన స్థితికి దిగజారినప్పటికీ తాము అండగా ఉంటామంటూ వారు సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కోహ్లి తన కెరీర్లో ఎదుర్కొంటున్న హీన దశపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సైతం స్పందించాడు. కోహ్లి ఇలా తొలి బంతికే ఔటవ్వడం చూస్తుంటే బాధగా ఉందని, కోహ్లి పరిస్థితి ఇంతలా దిగజారుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ వైఫల్యాలు కోహ్లిని ఏమీ చేయలేవని, అతను తిరిగి తప్పక పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ఎప్పటికీ గొప్ప క్రికెటరేనని, అతని స్థాయి ఎప్పటికీ పడిపోదని, రన్ మెషీన్ త్వరగా ఈ చెడు దశ నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించాడు. త్వరలో జరగుబోయే టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి దెబ్బ తిన్న పులిలా విరుచుకుపడటం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో కూడా కోహ్లి త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని, అంతేకాకుండా తన జట్టును ఛాంపియన్‌గా నిలబెడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022: డెవాన్ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: కోహ్లి గోల్డెన్ డక్.. ఇది ‘ఆరోసారి’.. నువ్వు మారవా?
IPL 2022 SRH Vs RCB- Virat Kohli Golden Duck: ఐపీఎల్-2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్ మొదటి బంతికే అవుటయ్యాడు. ఇన్నింగ్స్ ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ‘‘ఏంటిది కోహ్లి.. గాడిలో పడుతున్నావు అనుకుంటే! మళ్లీనా.. మా గుండె పగిలింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది కోహ్లి ఆట తీరును విమర్శిస్తూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ‘‘నిలకడగా ఆడాలని కోరుకుంటే గోల్డెన్ డక్లలో నిలకడ చూపిస్తావా? నువ్వు మారవా!’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా కోహ్లి ఈ విధంగా అవుట్ కావడం ఐపీఎల్ చరిత్రలో ఆరోసారి. ఈ సీజన్లో ఇది మూడోసారి. అదే విధంగా సన్‌రైజర్స్ బౌలర్ల చేతిలో రెండోసారి. తొలుత మార్కో జాన్సెన్.. తర్వాత జగదీశ సుచిత చేతిలో కోహ్లికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇక ఈ సీజన్లో కోహ్లి ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 216. అత్యధిక స్కోరు 58. ఐపీఎల్లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సందర్భాలు: ►2008- ఆశిష్ నెహ్రా(ముంబై ఇండియన్స్) బౌలింగ్‌లో ►2014- సందీప్ శర్మ(పంజాబ్ కింగ్స్) బౌలింగ్‌లో ►2017- నాథన్ కౌల్టర్ నైల్(కోల్‌కతా నైట్‌రైడర్స్) బౌలింగ్‌లో ►2022- దుష్మంత చమీర(లక్నో సూపర్ జెయింట్స్) బౌలింగ్‌లో ►2022- మార్కో జాన్సెన్(సన్‌రైజర్స్ హైదరాబాద్) బౌలింగ్‌లో ►2022- జగదీశ సుచిత్(సన్‌రైజర్స్ హైదరాబాద్) బౌలింగ్‌లో చదవండి👉🏾Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు? Ohhhhh " Ben Stokes " Unreal consistency of choking by Virat Kohli pic.twitter.com/iLpDvmm49k — MSDIAN FOREVER (@Akshay_MyName) May 8, 2022 After being so innocent No he will be showing same unwanted aggression and make pur rcb out of play-off thats vk for us 😒💔#ViratKohli #virat #kohli #rcb #RCBvSRH pic.twitter.com/VKW2Cgv9Jf — Sagar Batulwar (@sagarbatulwar) May 8, 2022 We want consistency from #ViratKohli𓃵 but not this type of #consistency. #KingKohli #IPL2022 #RCBvSRH — Shubham Bhaskar (@S_Bhaskar00) May 8, 2022 Man needs his difficulties so that he can enjoy his successes.#ViratKohli pic.twitter.com/CeDuBqE5wk — Karthik Reddy 🇮🇳 (@bykarthikreddy) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మేము చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరో!
ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లి వైఫల్యం కొనసాగుతూనే ఉంది. శనివారం రాత్రి ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. మార్కోజాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తద్వారా సీజన్లో రెండో గోల్డెన్ డక్ నమోదు చేసిన కోహ్లి.. ఓవరాల్‌గా ఐదుసార్లు గోల్డెన్ డక్ అయిన కోహ్లి.. మరో మూడుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంకో విషయమేంటంటే.. ఆర్సీబీకి కలిసిరాని రోజుగా మిగిలపోనున్న ఏప్రిల్ 23.. కోహ్లికి కూడా చేదు అనుభవాన్నే మిగిల్చనుంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున(ఏప్రిల్ 23, 2017) కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డక్ అయ్యాడు. నాథన్ కౌల్టర్‌నీల్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మరోసారి అదే రోజున కోహ్లి గోల్డెన్ డక్ కావడం యాదృశ్చికమనే చెప్పాలి. ఇక ఆ మ్యాచ్‌లో 49 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును తమ పేరిట నమోదు చేసింది. కోహ్లి ఆటతీరుపై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపించారు. మేం చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరినో.. కోహ్లి ఏమైంది నీకు.. ఈ సీజన్ మొత్తం తల కిందకేసి పెవిలియన్ చేరుతున్నావు.. మేమెప్పుడు తలెత్తుకునేది.. కోహ్లి మా గుండె ముక్కలవుతుంది.. నిన్నలా చూడలేకపోతున్నాం..అంటూ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త ఫామ్‌ను చూపిస్తున్నాడు. 2019 నవంబర్‌లో సెంచరీ చేసిన కోహ్లి బ్యాట్ నుంచి మరో శతకం జాలువారలేదు. ఈ గ్యాప్‌లో వంద మ్యాచ్‌లు ఆడినప్పటికి సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. పరుగులు చేయడం పక్కనబెడితే ..ఇప్పుడు గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి పోటీపడుతున్నాడు. చదవండి: IPL 2022: ఏప్రిల్ 23.. ఆర్సీబీకి కలిసిరాని రోజు This is not the Virat Kohli I know. This is not the Virat Kohli I would ever want to know. 💔 — Prajakta (@18prajakta) April 23, 2022 Head down, switch off the television , walk off Virat Kohli ain't the same anymore 💔 pic.twitter.com/RGbjT6KCKl — Akshat (@AkshatOM10) April 23, 2022 This is just not the Virat Kohli I know, it's heartbreaking yaar. I waited the whole day to watch you bat. Please @imVkohli, do something! But don't call it a day.#ViratKohli𓃵 • #IPL2022 pic.twitter.com/6UuArLnJzG — Shreyas Sahoo (@imShreyas02) April 23, 2022 -
తొలి బంతికే డకౌట్..కోహ్లికి ఏమైంది.. తలదించుకుని పెవిలియన్‌కు!
ఐపీఎల్-2022లో విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ డుప్లెసిస్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. జానెసన్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని నేరుగా సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాక్రమ్ చేతికి వెళ్లింది. దీంతో తొలి బంతికే ఔటయ్యన కోహ్లి ఒక్క సారిగా దిగులుగా అలానే చూస్తుండు పోయాడు. ఇక కోహ్లి రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో కోహ్లికి వరుసగా రెండో గోల్డన్ డక్. ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్లో కోహ్లికి ఇది ఐదో గోల్డన్ డక్. ఇక ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. pic.twitter.com/OOpGL16KdS — Diving Slip (@SlipDiving) April 23, 2022 చదవండి: IPL 2022: 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జోస్ బట్లర్.. తొలి ఆటగాడిగా! -
అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు
ఐపీఎల్ 2022లో కోహ్లి మరోసారి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి బయటపెడుతూ వికెట్ ఇచ్చుకున్నాడు. అప్పటికే దుశ్మంత చమీర మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తూ అనూజ్ రావత్‌ను ఔట్ చేశాడు. కోహ్లి బలహీనత తెలిసిన రాహుల్.. చమీరను ఆఫ్‌స్టంప్ దిశగా బంతి వేయమని సలహా ఇచ్చాడు. అంతే చమీర ఆఫ్సంప్పై ఊరిస్తూ వేసిన బంతిని కోహ్లి ఏ మాత్రం ఆలోచించకుండా ఫోర్ కొట్టే ప్రయత్నంలో సరిగ్గా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కోహ్లి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఒక అనవసర రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి గోల్డెన్ డక్ కావడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 2008లో ఆశిష్ నెహ్రా , 2014లో సందీప్ శర్మ , 2017లో నాథన్ కౌల్టర్‌నీల్.. తాజగా దుష్మంత చమీరలు కోహ్లిని గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చారు. అంతేకాదు ఈ సీజన్లో కోహ్లి పవర్ ప్లేలో ఔటవ్వడం ఇది మూడోసారి. నాలుగు మ్యాచ్‌ల్లో కోహ్లి పవర్ ప్లే సమయానికి క్రీజులోకి వచ్చి మూడుసార్లు ఔటయ్యాడు. ఈ నాలుగు సందర్భాల్లో కోహ్లి 25 పరుగులు మాత్రమే చేశాడు. First ball duck for Virat Kohli 😔 #IPL2022 #LSGvRCB pic.twitter.com/27qr5AF1oC — That-Cricket-Girl (@imswatib) April 19, 2022 కోహ్లి గోల్డెన్ డక్ కోసం క్లిక్ చేయండి -
2016 టి20 ప్రపంచకప్ హీరోకు వింత అనుభవం..
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్కు వింత అనుభవం ఎదురైంది. గాయం కారణంగా జట్టుకు ఆరు నెలలపాటు దూరమైన బ్రాత్‌వైట్ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి డొమొస్టిక్ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్ బర్మింగ్హమ్ డిస్ట్రిక్ట్ ప్రీమియర్ లీగ్‌లో నోల్ అండ్ డోరిడ్జ్ సీసీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరు నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రాత్వైట్కు నిరాశే ఎదురైంది. లీమింగ్టన్ సీసీతో మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ తొలి బంతికే ఔటయ్యాడు. భారీషాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి గోల్డెన్‌డక్ అయ్యాడు.ఆ తర్వాత బౌలింగ్‌లోనూ బ్రాత్‌వైట్ పెద్దగా రాణించలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా నిరాశజనక ప్రదర్శనతో రోజును ముగించే పనిలో ఉన్న బ్రాత్వైట్కు మరొక బిగ్‌షాక్ తగిలింది. తనకు ఎంతో ఇష్టమైన కారును కూడా ఎవరో దొంగలించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రాత్‌వైట్ ట్విటర్లో తెగ బాధపడిపోయాడు. ''నిన్నటి రోజు నాకు పీడకల లాంటిది.. ఆరు నెలల తర్వాత మ్యాచ్ ఆడాను.. డకౌట్ అయ్యాడు.. బౌలింగ్ వేశాను.. అందులోనూ నిరాశే ఎదురైంది.. ఇక రోజు చివరలో నా కారును ఎవరో దొంగతనం చేశారు.. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. ఇన్ని చెత్త విషయాల మధ్య ఒక మంచి విషయం ఏంటో చెప్పనా.. మరుసటిరోజు తెల్లవారుజామునే సూర్యుడు మెరుస్తూ నాకు వెల్కమ్ చెప్పాడు.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా బ్రాత్‌వైట్ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన దశలో బ్రాత్‌వైట్ నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్ రెండోసారి టి20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బ్రాత్‌వైట్ విండీస్ తరపున 3 టెస్టులు, 44 వన్డేలు, 41 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: BCCI: 'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు' Wasim Jaffer: 'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే What a day yesterday - First time bowling in a game after injury for six months 💩 - First ball duck from a long hop 😫 - Car stolen 🤬 But you know what , woke up this morning , Sun is shining and giving thanks 🙏🏾 — Carlos Brathwaite (@CRBrathwaite26) April 17, 2022 Carlos Braithwaite Golden Duck for Knowle & Dorridge today 😳 pic.twitter.com/92P8fIcpSm — Will (@Will27375624) April 16, 2022 -
అఫ్రిది గోల్డెన్ డక్ చేశాడంటే పాక్‌దే విజయం!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించిన పాక్ ఈ మ్యాచ్‌లో ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. 67 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్లతో పోరాడుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది మరోసారి తొలి బంతికే వికెట్‌తో మెరిశాడు. రెండో వన్డేలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను గోల్డెన్ డక్ చేసిన అఫ్రిది.. ఈసారి ట్రెవిస్ హెడ్‌ను గోల్డెన్ డక్ చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్ తొలి బంతికే షాహిన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. అఫ్రిది బౌలింగ్‌లో తొలి బంతికే ట్రెవిస్ హెడ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో సున్నా పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత హారిస్ రౌఫ్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఫించ్ కూడా డకౌట్ కావడంతో ఆసీస్ ఖాతా తెరవకుండానే రెండో వికెట్ కోల్పోయింది. అయితే అఫ్రిది గోల్డెన్ డక్ చేశాడంటే.. పాకిస్తాన్ వన్డే మ్యాచ్ గెలుస్తుందని పలువురు అభిమానులు జోస్యం చెబుతున్నారు. చదవండి: AUS vs PAK: పాపం గెలవాలన్న కసి అనుకుంటా.. అందుకే గోల్డెన్ డక్ Doing what he does best- @iShaheenAfridi strikes on the very first delivery! #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/HwZKoW8rAO — Pakistan Cricket (@TheRealPCB) April 2, 2022 -
పాపం గెలవాలన్న కసి అనుకుంటా.. అందుకే గోల్డెన్ డక్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో ఎలాగైనా విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేయాలని పాక్ బలంగా అనుకుంటుంది. ఆ కసిని పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది తన బౌలింగ్‌లో చూపించాడు. తొలి ఓవర్ రెండో బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. బులెట్ వేగంతో దూసుకొచ్చిన బంతి పించ్ కాళ్లను తాకుతూ వెళ్లింది. దీంతో షాహిన్ అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్ వెంటనే ఔట్ ఇచ్చేశాడు. కనీసం ఫించ్‌కు రివ్యూకు వెళ్లే అవకాశం కూడా లేదంటే బంతి ఎంత కచ్చితంగా పడిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే షాహిన్ అఫ్రిది తొలి వన్డేకు దూరమయ్యాడు. ఎలాగైనా తన జట్టును గెలిపించాలన్న కసితో బౌలింగ్ వేసిన అఫ్రిది ఫలితం అందుకున్నాడు. పనిలో పనిగా ఫించ్‌పై తన రికార్డును నిలబెట్టుకున్నాడు. అదేంటంటే గతేడాది టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇదే ఫించ్‌ను షాహిన్ గోల్డెన్‌డక్‌గా పెవిలియన్ చేర్చాడు. తాజాగా ఫించ్‌ను షాహిన్ మరోసారి గోల్డెన్‌డక్ చేశాడు.దీనికి సంబంధించిన వీడియోను పీసీబీ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఫించ్ వికెట్ కోల్పోయిన ఆసీసీ మళ్లీ పాకిస్తాన్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. పాక్ బౌలర్లను ఉతికారేస్తూ తొలి వన్డే తరహాలో మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరో సెంచరీకి దగ్గరైన తరుణంలో ట్రెవిస్ హెడ్ 89 పరుగుల వద్ద జహీద్ మహమూద్ బౌలింగ్‌లో అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. బెన్ మెక్డెర్మొట్ 93, మార్నస్ లబుషేన్ 31 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: IPL 2022: అరె ఇషాంత్ భయ్యా.. ఇదేం కర్మ! IPL 2022: ప్చ్.. వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్‌లు చూస్తుంటే చిరాగ్గా ఉంది Shaheen hit's the bullseye 🎯#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/NcwtN06Ht2 — Pakistan Cricket (@TheRealPCB) March 31, 2022 -
'డమ్మీ ద్రవిడ్' గోల్డెన్ డక్ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్
Fans Troll Cheteshwar Pujara After Golden Duck.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ అయ్యాడు. లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎన్గిడి వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతి పుజారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అయి కీగన్ పీటర్సన్ చేతిలో పడింది. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డక్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా ఔట్ కావడం ఇక్కడ మరో విశేషం. 2107-18లో సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. అప్పుడు ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న పుజారా పరుగులేమి చేయకుండానే రనౌట్ రూపంలో గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా మరోసారి పుజారా ఎన్గిడి బౌలింగ్‌లోనే అదే సెంచూరియన్‌లో గోల్డెన్ డక్ కావడం ఆసక్తి కలిగించింది. ఇక పుజారా చెత్త ప్రదర్శనపై నెటిజన్లు ఏకిపారేశారు. ''నిన్ను మరో ద్రవిడ్‌లా ఊహించుకున్నాం.. మా ఆశలన్నీ వ్యర్థమవుతున్నాయి''.. ''డమ్మీ ద్రవిడ్ గోల్డెన్ డక్ అయ్యాడు''..'' మొన్న రహానే.. ఇవాళ నువ్వు.. మీరిద్దరు జట్టుకు చోకర్స్‌గా మారారు''.. ''పుజారా స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశమిచ్చినా బాగుండేది''.. పుజారా డకౌట్లు అవుతూనే ఉన్నాడు.. ఇంకా ఎన్ని చాన్స్‌లు ఇస్తారు.. హనుమ విహారి లాంటి ఆటగాళ్లు బెంచ్‌పై కూర్చొని కోపంతో రగిలపోతున్నారు.. వాళ్లకు అవకాశమివ్వండి'' అంటూ కామెంట్స్ చేశారు. #INDvsSA#pujara#Rahane Dummy Dravid gone on duck. Let us see what dummy Laxman will do.. — Super अण्णा (@Superanna92) December 26, 2021 Golden duck for #Pujara. His nightmare continues. Much more is expected out of no. 3 batsman in Test matches. I am afraid he will not get many more chances now. So sad to him struggle like this for runs. Che Pujara team se "jara"ha lagta hai.#INDvSA #INDvsSA #duck #goldenduck — Raman Gujral (@gujral_raman5) December 26, 2021 Why is Pujara still in the team? Has been struggling for months now. Can't we give Rahane/Vihari a chance at no 3, and play Shreyas a 5? #INDvsSA — FPL Balor ⭐⭐ (@FPLBalor) December 26, 2021 I think Ngidi planned Pujara's wicket in #CSK nets. 😅🤔😉 #SAvsIND #BCCI — Abhijeet Andansare (@ImAbhijeet01) December 26, 2021 -
అప్పుడు 'గోల్డెన్' రనౌట్.. ఇప్పుడు 'గోల్డెన్' డక్
Cheteswar Pujara Golden Duck 2 Times By Lungi Ngidi.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరోసారి నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్‌లో పుజారా అంతగా ఆకట్టుకోలేదు. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు కలిపి.. నాలుగు ఇన్నింగ్స్‌లో 0, 47, 26,22 పరుగులు మాత్రమే చేశాడు. తాజగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా అదే పూర్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. చదవండి: IND VS SA 1st Test: లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి ఎన్గిడి వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతికి పుజారా ఔట్ కాగా.. అంతకముందు బంతికే మయాంక్(60) ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా డకౌట్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా డకౌట్ కావడం విశేషం. 2107-18లో సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. అప్పుడు ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న పుజారా పరుగులేమి చేయకుండానే రనౌట్ రూపంలో గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా మరోసారి పుజారా ఎన్గిడి బౌలింగ్‌లోనే అదే సెంచూరియన్‌లో గోల్డెన్ డక్ కావడం ఆసక్తి కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పుజారాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొన్న కివీస్‌తో టెస్టు సిరీస్‌లో రహానే .. ఇప్పుడు ప్రొటీస్ సిరీస్‌లో నువ్వు తయారయ్యావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: Trolls As Ajinkya Rahane In Playing XI: మరీ ఇంత దారుణమా.. పాపం విహారి.. తనకే ఎందుకిలా! -
రోహిత్ శర్మ గోల్డెన్ డక్.. ఏంటయ్యా ఇది
Rohit Sharma Golden Duck: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు ఘనమైన ఆరంభం లభించలేదు. అంతేగాక మరుసటి ఓవర్లోనే రాహుల్ కూడా క్లీన్ బౌల్డ్ అవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. అయితే రోహిత్ శర్మ ఔటైన తీరుపై టీమిండియా ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ఏంటి రోహిత్ ఇలా చేశావు.. పాక్‌తో మ్యాచ్ మనకు కీలకమని తెలుసుగా.. రోహిత్ మమ్మల్ని నిరాశపరిచావు. అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: SL Vs BAN: బ్యాట్స్‌మన్ కంటే వేగంగా పరిగెత్తాడు.. రిస్క్ అని తెలిసినా Shaheen Afridi traps Rohit Sharma plumb via @t20worldcup https://t.co/kbNoHGNYWY — varun seggari (@SeggariVarun) October 24, 2021 -
మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్.. కలిసిరాని పుట్టినరోజు
Mitchell Marsh Golden Duck.. టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఈరోజు(అక్టోబర్ 20) మిచెల్ మార్ష్ 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరి అలాంటి మార్ష్‌కు తన పుట్టినరోజు నాడే టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయితే బాధ ఉండదా.. మీరే చెప్పండి. డేవిడ్ వార్నర్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన మార్ష్ ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఐదో బంతిని ఫ్లిక్ చేయగా.. అది వెళ్లి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది. దీంతో మార్ష్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 4 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 2, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. చదవండి: T20 WC 2021 IND Vs AUS: అటు హార్దిక్.. ఇటు స్టోయినిస్.. ఇద్దరి పరిస్థితి ఒకటే -
గోల్డెన్ డక్ విషయంలో నితీష్ రాణా చెత్త రికార్డు
Nitish Rana Golden Duck.. గోల్డెన్ డక్ విషయంలో కేకేఆర్ బ్యాటర్ నితీష్ రాణా చెత్త రికార్డు నమోదు చేశాడు. 2020 ఏడాది ఆరంభం మొదలైనప్పటి నుంచి నితీష్ రాణా ఐదుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. -
ఐదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు
లండన్: టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి ఐదేళ్ల తర్వాత ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాడు హసీబ్ హమీద్ బెంబేలెత్తిపోయాడు. టెప్ట్ క్రికెట్లో 1717 రోజు తర్వాత తానెదుర్కొన్న తొలి బంతికే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని సిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన హమీద్.. క్లీన్ బౌల్డయ్యాడు. ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతుండటం.. హమీద్ తడబాటుకు కారణమైనట్లు స్పష్టమైంది. హమీద్ చివరిసారి 2016 నవంబర్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. Two in two balls for India as Siraj takes out Sibley and Hameed right after tea Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Siraj pic.twitter.com/ERCbf3Ttk1 — Sony Sports (@SonySportsIndia) August 13, 2021 కాగా, ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ డొమినిక్ సిబ్లే(11)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆమరుసటి బంతికే హసీబ్ హమీద్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటవ్వగా.. మిగితా జట్టంతా పేకమేడలా కూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగగా, రాబిన్సన్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు, మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364. బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108. బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0. -
మరోసారి గోల్డెన్ డక్ అవ్వకూడదని సీరియస్‌గా ప్రాక్టీస్
నాటింగ్హమ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అండర్సన్ బౌలింగ్‌లో కోహ్లి బంతిని అంచనా వేయడంలో పొరబడి కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కోహ్లిని విమర్శిస్తూ భారత అభిమానులు కామెంట్స్ చేశారు. మరోసారి ఇది రిపీట్ కాకూడదని భావించాడేమో. అందుకే కోహ్లి నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత గ్రౌండ్లోకి వచ్చి సీరియస్‌గా ప్రాక్టీస్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి. కాగా కోహ్లి టెస్టుల్లో ఇప్పటివరకు ఐదుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో కోహ్లి మూడుసార్లు టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గోల్డెన్ డక్ అవడం ద్వారా చెత్త రికార్డును నమోదు చేశాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా తొలి టెస్టులో విజయానికి ఇంకా 157 పరుగుల దూరంలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రూట్ సెంచరీతో(109 పరుగులు) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్, ఠాకూర్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. WOWWWW! 🔥@jimmy9 gets Kohli first ball and Trent Bridge is absolutely rocking! Scorecard/Clips: https://t.co/5eQO5BWXUp#ENGvIND pic.twitter.com/g06S0e4GN7 — England Cricket (@englandcricket) August 5, 2021 -
కోహ్లి గోల్డెన్ డక్.. టీమిండియా కెప్టెన్‌గా చెత్త రికార్డు
నాటింగ్హమ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆడిన తొలి బంతికే ఔటయిన కోహ్లి గోల్డెన్ డక్ అయ్యాడు. అండర్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ కోహ్లి స్లిప్‌లో ఉన్న బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కోహ్లి టెస్టుల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి. ఈ ఐదింటిలో మూడుసార్లు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లి గోల్డెన్‌డక్‌గా వెనుదిరగడం విశేషం. ఇందులో 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో, 2018లో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో రెండుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా అండర్సన్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. కాగా గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా మూడుసార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి తొలిస్థానంలో ఉన్నాడు. లాలా అమర్నాథ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు టెస్టు కెప్టెన్లుగా రెండేసీ సార్లు గోల్డెన్ డక్ అయ్యారు. ఇక అండర్సన్ 12 టెస్టుల తర్వాత కోహ్లిని అవుట్ చేయడం మరో విశేషం. చివరగా 2014లో ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో కోహ్లిని అండర్సన్ అవుట్ చేశాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలిరోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు ఆటలో తడబడుతుంది. లంచ్ విరామం వరకు వికెట్ నష్టానికి 97 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్.. అనంతరం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వెలుతురు సరిగా లేని కారణంగా ప్రస్తుతం అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇప్పటివరకు టీమిండియా 46.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57, పంత్ 7 పరుగులతో ఆడుతున్నారు. -
కోహ్లి ‘గోల్డెన్ డక్’.. ఎన్నోసారో తెలుసా?
కింగ్స్టన్ (జమైకా): వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ‘గోల్డెన్ డక్’ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కీమర్ రోచ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే కోహ్లి పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టెస్టుల్లో ‘గోల్డెన్ డక్’ కావడం కోహ్లికి ఇది నాలుగోసారి. మొత్తం తొమ్మిదిసార్లు టెస్టుల్లో కోహ్లి డకౌట్ అయ్యాడు. కాగా, వెస్టిండీస్‌కు టీమిండియా 468 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు భారత్ 168/4 స్కోరు వద్ద సెకండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటిన తెలుగు కుర్రాడు హనమ విహారి రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. రహానేతో కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహనే(64), విహారి(53) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విండీస్ 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. (ఇది చదవండి: వహ్వా విహారి...) -
బీజేపీకి దేశం బంగారు బాతు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గంగానది అంత పవిత్రంగా చూస్తుంటే బీజేపీ మాత్రం దేశాన్ని బంగారు బాతులా చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. దేశంలోని సంపదను తన స్నేహితులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన సంజీ విరాసత్ బచావో సమ్మేళన్ కార్యక్రమానికి రాహుల్ హాజరై మాట్లాడారు. జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీఎస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్ఎల్డీ, ఎన్సీపీ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. ఈ బంగారు బాతును బంధించేందుకు బీజేపీ పంజరాన్ని తయారుచేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు తాము సర్వశక్తులా పోరాడతామని స్పష్టం చేశారు. తాము బీజేపీ ముక్త్ భారత్‌ను కోరుకోవడం లేదని, బీజేపీని నాశనం చేయాలనుకోవడం లేదని రాహుల్ అన్నారు. తమ సిద్ధాంతాలు, భావజాలం బీజేపీ కంటే బలమైనవని మాత్రమే నిరూపించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతిపక్షాలన్నీ కలసి రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశమంతా బీజేపీని ఓడిస్తాయని రాహుల్ జోస్యం చెప్పారు. అలాగే రూ.524 కోట్ల విలువైన ఒక్కో రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్రం రూ.1,600 కోట్లు చెల్లిస్తోందని దుయ్యబట్టారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఒక్కో వాక్యం పూర్తిచేశాక మోదీ అక్కడ ఉన్న టీచర్లవైపు చూస్తారనీ, దీంతో వాళ్లు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తున్నారని రాహుల్ అన్నారు. ఇదంతా పక్కా డ్రామాలా సాగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ నాయకుడు చన్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్: బర్త్ డే రోజే గోల్డెన్ డక్!
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్, బర్త్‌డే బాయ్ ఆండ్రూ రస్సెల్ గోల్డెన్ డక్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఏప్రిల్ 29న(ఆదివారం) ఈ విండీస్ క్రికెటర్ 30వ ఏట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు విరాట్ కోహ్లి(68 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్ క్రిస్‌లిన్(62 నాటౌట్) విజృంభించడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కతా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతికి నితీశ్ రాణా ఫోర్ బాదాడు. అనంతరం వెన్ను నొప్పి కారణంగా అతడు మైదానాన్ని వీడాడు. ఈ దశలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ క్రీజులోకి వచ్చాడు. అతను క్రీజులోకి వస్తుండుగా అభిమానులంతా హ్యాపీ బర్త్‌డే రస్సెల్ అని స్వాగతం పలికారు. కానీ మూడో బంతిని ఎదుర్కొన్న రస్సెల్ తొలి బంతిని భారీ షాట్ ఆడటంతో బంతి కీపర్‌కు సమీపంలో చాలా ఎత్తులో లేచింది. ఈ సులువైన క్యాచ్‌ను డికాక్ అందుకోవడంతో పరుగులేమీ చేయకుండా తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అయితే బ్యాట్‌తో నిరాశ పరిచిన రస్సెల్ బంతితో మూడు వికెట్లు సాధించి బెంగళూరును కట్టడి చేశాడు. ఇక రస్సెల్.. ఆర్సీబీ బ్యాట్స్‌మన్ మనన్ వోహ్రాను గోల్డెన్ డక్ చేయడం విశేషం. -
విధ్వంసకర బ్యాట్స్‌మన్.. తొలి బంతికే అవుట్!
-
విధ్వంసకర బ్యాట్స్‌మన్.. తుస్
హరారే: స్కాట్లాండ్తో బుధవారం జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. టాస్ గెలిచి విండీస్‌కు బ్యాటింగ్ అప్పగించిన స్కాట్లాండ్ అద్భుతం చేసింది. ఇద్దరు టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్లను డకౌట్ చేసి సంచలనం సృష్టించింది. విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయి ‘గోల్డెన్ డక్’గా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన షాయ్ హోప్ ఆరు బంతులు ఆడి డకౌటయ్యాడు. వీరిద్దరినీ స్కాట్లాండ్ బౌలర్ సఫయాన్ మహ్మద్ షరీఫ్ అవుట్ చేశాడు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ కుదురుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులు మాత్రమే చేసింది. -
రోహిత్ శర్మ చెత్తరికార్డు.. ట్విటర్ ఫైర్.!
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనలో నిలకడలేమి ప్రదర్శనతో తీవ్ర తడబాటుకు గురవుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాట్స్‌మన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇప్పటికే పర్యటనలో పేలవ ప్రదర్శనతో అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ హిట్‌మ్యాన్ తాజా రికార్డుతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు ఈ చెత్తరికార్డు మాజీక్రికెటర్ ఆశిశ్నెహ్రా, యూసఫ్ పఠాన్ల పేరిట సంయుక్తంగా ఉండగా రోహిత్ అధిగమించాడు. రోహిత్ నాలుగు సార్లు డకౌట్ కాగా నెహ్రా, పఠాన్లు మూడు సార్లు అవుటయ్యారు. అంతేకాకుండా గోల్డెన్ డకౌట్ అయిన భారత క్రికెటర్ల జాబితోలోకి సైతం రోహిత్ ప్రవేశించాడు. తాజా గోల్డెన్ డకౌట్‌తో అంతకు ముందు జాబితాలో ఉన్న కేఎల్ రాహుల్, అజింక్యా రహానే, మురళి విజయ్‌ల సరసన చేరాడు. ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ చెత్తరికార్డుపై ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. ‘రోహిత్ దక్షిణాఫ్రిక పర్యటనలో గోల్డెన్ డక్‌తో గోల్డ్ సాధించావు’..అని ఒకరంటే.. ‘బ్యాట్స్‌మన్ ఆఫ్‌దిడే.. రోహిత్, బౌలర్ ఆఫ్‌దిడే చహల్’ అని మరోకరు ట్రోల్ చేస్తున్నారు. మనీష్‌పాండే, ధోనిల అద్భుత ప్రదర్శనతో సఫారీలకు భారీ లక్ష్యమే విధించినా.. చాహల్ పేలవ బౌలింగ్, క్లాసన్ విజృంభణతో భారత్ రెండో టీ20లో ఓడిన విషయం తెలిసిందే. ఇక సిరీస్ నిర్ణయాత్మక టీ20 శనివారం కేప్‌టౌన్ వేదికగా జరగనుంది. #RohitSharma's "Golden Duck" is the only Gold he got from this series....#INDvSA #SAvIND #INDvsSA — Akshay mane (@akashaymane) 21 February 2018 -
ఊహించని రికార్డు
సెంచూరియన్: టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో నిరాశపరిచాడు. ముఖ్యంగా రెండో టెస్టులో అతడు అవుటైన విధానం అభిమానులకు మింగుడుపడటం లేదు. నిలకడకు చిరునామాగా పేరుగాంచిన పుజారా రెండు ఇన్నింగ్స్‌లోనూ అనూహ్యంగా రనౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో ఊహించని రికార్డు అతని పేరిట నమోదైంది. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లోనూ రనౌటైన మొదటి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు 25 మంది ఈవిధంగా అవుటయ్యారు. ఎంతో సంయమనంతో ఆచితూచి ఆడే పుజారా రెండుసార్లు కీలక సమయంలో అవుట్ కావడంతో ఆ ప్రభావం జట్టుపై పడింది. అడ్డుగోడగా నిలబడే ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ తొందరగా పెవిలియన్ చేరడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ పుజారా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి 30 పరుగులు మాత్రమే చేశాడు. చివరి టెస్టులోనైనా అతడు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర పుజారా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించిన పుజారా రనౌట్‌గా నిష్ర్కమించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా మోర్నీమోర్కెల్ వేసిన తొమ్మిదో ఓవర్ నాల్గో బంతిని ఎదుర్కొన్న పుజారా మిడాన్ మీదుగా ఆడాడు. అయితే అదే క్రమంలో రాని పరుగు కోసం ప్రయత్నించాడు. -
కోహ్లిని డిస్టర్బ్ చేసిందెవరు?
కోల్ కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాను ‘గోల్డెన్ డక్’గా అవుటవడం పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ‘మిస్టర్ ఫైర్’ డకౌటయ్యాడు. కౌంటర్-నీలె బౌలింగ్ లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చేతికిలోకి వచ్చిన బంతిని రెండో ప్రయత్నంలో పాండే ఒడిసిపట్టాడు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కోహ్లి అసంతృప్తితో మైదానాన్ని వీడాడు. కోపంతో కాలికి కట్టుకున్న ప్యాడ్లపై బ్యాట్ తో బాదుకున్నాడు. డ్రెస్సింగ్ రూమువైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందని అంపైర్ అడగ్గా.. ప్రేక్షకుల్లో ఒకరు తన ఏకాగ్రతకు భంగం కలిగించారని వెల్లడించాడు. సైట్ స్క్రీన్ దగ్గర ఓ వ్యక్తి తచ్చాడుతుండాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు జోక్యం చేసుకుని సైట్ స్క్రీన్ దగ్గర అతడిని పంపించివేయడంతో కోహ్లి శాంతించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ... ‘ ఇక్కడ సైట్ స్క్రీన్ చాలా చిన్నదిగా ఉంది. దాని దగ్గర ఓ వ్యక్తి నిలబడి బౌలర్ లా విన్యాసాలు చేశాడు. దీంతో నా ఏకాగ్రత భంగం కలిగి నేను ఆటపై దృష్టి పెట్టలేకపోయాను. కానీ పెద్ద విషయం కాద’ని కోహ్లి అన్నాడు. -
క్రిస్ గేల్ గోల్డెన్ డక్
గయానా: కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ఆదివారం జమైకా తలవాహ్స్ తో జరిగిన మ్యాచ్ లో గయానా అమెజాన్ వారియర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ విఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. సొహైల్ తన్వీర్ బౌలింగ్ లో ’గోల్డెన్ డక్’గా పెవిలియన్ కు చేరాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన జమైకా 18 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. పావెల్(38) టాప్ స్కోరర్ గా నిలిచాడు. షకీబ్ 25, వాల్టన్ 12 పరుగులు చేశారు. జమైకా ఆటగాళ్లు మొత్తం ముగ్గురు డకౌట్ కాగా, నలుగురు ఒక అంకె స్కోరుకు పరిమితమయ్యారు. గయానా బౌలర్లలో పెర్మాల్ 3, తన్వీర్ 2, ఎమ్రిట్ 2, జంపా 2 వికెట్లు పడగొట్టారు. 101 పరుగుల లక్ష్యాన్ని గయానా టీమ్ 3 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేరుకుంది. లిన్ 39, బ్రాంబ్లీ 27, మహ్మద్ 22 పరుగులతో రాణించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పెర్మాల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు.