
Asia Cup 2022 Final: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో లంక ఓపెనర్ కుషాల్ మెండిస్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. కుషాల్ మెండిస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి ఇది 26వ డకౌట్. అరంగేట్రం నుంచి అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్ జాబితాలో కుషాల్ మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక తొలి స్థానంలో జానీ బెయిర్ స్టో(ఇంగ్లండ్) 27 డకౌట్లతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మొయిన్ అలీ(ఇంగ్లండ్) 25 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. కగిసో రబడా(దక్షిణాఫ్రికా) 23 డకౌట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
చదవండి: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్
Comments
Please login to add a commentAdd a comment