Kushal Mendis
-
SL vs NZ: న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టింది శ్రీలంక. డంబుల్లా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో పర్యాటక కివీస్ జట్టును ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.సెంచరీలతో చెలరేగిన అవిష్క, కుశాల్తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(12) నిరాశపరిచినా.. అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 100) అద్భుత శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(128 బంతుల్లో 143) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఇక చరిత్ అసలంక సైతం కెప్టెన్ ఇన్నింగ్స్(28 బంతుల్లో 40) అలరించాడు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా శ్రీలంక 49.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 324 పరుగులు స్కోరు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.కివీస్ లక్ష్యం 221అనంతరం.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 221 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 27 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 175 పరుగులే చేసింది. ఓపెనర్లు విల్ యంగ్(48), టిమ రాబిన్సన్(35), మిడిలార్డర్ మిచెల్ బ్రాస్‌వెల్(34 నాటౌట్) ఫర్యాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమిహెన్రీ నికోల్స్(6), మార్క్ చాప్మన్(2), గ్లెన్ ఫిలిప్స్(9) పూర్తిగా నిరాశపరచగా.. మిచ్ హే(10), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(9), నాథన్ స్మిత్(9), ఇష్ సోధి(0), జాకోబ్ డఫీ(4 నాటౌట్).. లంక బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. దీంతో 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఇక.. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక మూడు, మహీశ్ తీక్షణ, చరిత్ అసలంక చెరో రెండు, జాఫ్రీ వాండర్సే ఒక వికెట్ కూల్చారు. భారీ శతకంతో మెరిసిర కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!కాగా 2015 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా గత 12 వన్డేల్లోనూ లంక కివీస్‌పై వన్డేలో గెలవడం ఇదే తొలిసారి. కాగా 2015, డిసెంబరులో న్యూజిలాండ్ గడ్డపైనే కివీస్‌ను లంక వన్డే మ్యాచ్‌లో చివరగా ఓడించింది. ఇక 2024లో ఇప్పటి వరకు సొంతగడ్డపై 13 వన్డేలు ఆడిన శ్రీలంకకు ఇది పదో విజయం.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
SL vs WI 2nd T20I: విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్‌ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.పరిమిత ఓవర్ల సిరీస్ కోసంకాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్‌కు దంబుల్లా, వన్డే సిరీస్‌కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.నిసాంక హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా... కుశాల్ మెండిస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కుశాల్ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.బౌలర్లు పడగొట్టేశారుఇక విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రావ్మన్ పావెల్ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్) టాప్ స్కోరర్. బ్రాండన్ కింగ్ (5), ఎవిన్ లూయిస్ (7), ఆండ్రూ ఫ్లెచర్ (4), రోస్టన్ చేజ్ (0) పూర్తిగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్ వెల్లలాగె 3, మహీశ్ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్ -
శ్రీలంకకు మరో భారీ షాక్! ఘోర పరాభవంతో నిష్క్రమణ.. అదొక్కటేనా?
ICC WC 2023- NZ vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో మాజీ చాంపియన్ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో తాజా ప్రపంచకప్ ఎడిషన్‌లో ఏడో పరాజయాన్ని చవిచూసింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ-2025 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కాగా భారత్ వేదికగా జరుగుతున్న ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక తొలుత క్వాలిఫయర్స్ ఆడింది. జింబాబ్వేలో జరిగిన ఈ ఈవెంట్లో గెలిచి.. నెదర్లాండ్స్‌తో కలిసి టాప్-10లో చేరి ప్రపంచకప్-2023లో అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 102 పరుగులతో చిత్తుగా ఓడిన శ్రీలంకను తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన లంక తర్వాత ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది. మళ్లీ పాత కథే తర్వాత నెద్లాండ్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా మళ్లీ పాత కథనే పునరావృతం చేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తై భంగపడింది. ఇక ఈ టోర్నీలో అన్నింటికంటే శ్రీలంకకు అతిపెద్ద ఓటమి ఎదురైంది మాత్రం టీమిండియా చేతిలోనే! ఆసియా కప్-2023 ఫైనల్లో కొలంబోలో లంకను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. ప్రపంచకప్‌లో ముంబై వేదికగా మరోసారి మట్టికరిపించింది. ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించి ఆధిపత్యం చాటుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి.. ఈ దెబ్బకు సెమీస్ అన్న మాటను పూర్తిగా మరిచిపోయిన లంకన్ టీమ్.. కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025కైనా అర్హత సాధించాలని భావించింది. లీగ్ దశలో తమకు మిగిలిన మ్యాచ్‌లో గెలుపొందాలని బెంగళూరులో బరిలోకి దిగింది. అయితే, న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం కావడం.. 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 23.2 ఓవర్లలోనే ఛేదించడంతో మరోసారి ఓటమే ఎదురైంది. ఆ మ్యాచ్ ఫలితం తేలిన తర్వాతే దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదోస్థానంలో నిలిచింది శ్రీలంక. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్ల జాబితా నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్, ఇంగ్లండ్- పాకిస్తాన్, ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచ్‌ల ఫలితం తర్వాత శ్రీలంక భవితవ్యం పూర్తిగా తేలనుంది. రన్‌రేటు పరంగానూ వెనుకబడి ఉన్న కారణంగా ఈ మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా శ్రీలంక ఆశలు వదులుకోవాల్సిందే! వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన శ్రీలంకను గాయాల సమస్య వేధించింది. కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. మాజీ చాంపియన్‌కు అవమానకరరీతిలో ఇలాంటి తరుణంలో పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ నాయకుడిగా సఫలం కాలేకపోయాడు. వరుస ఓటములతో డీలా పడ్డ జట్టును పరాజయాల ఊబి నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కాక చేతులెత్తేశాడు. కాగా వరల్డ్‌కప్-1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన శ్రీలంక ట్రోఫీ గెలిచింది. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది. కానీ ఈసారి ఇలా.. అవమానకరరీతిలో ఇంటిబాట పట్టింది. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! నాడు పాక్‌లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్ కావాలనుకున్న రషీద్ ఇప్పుడిలా -
WC 2023: టీమిండియా చేతిలో చావుదెబ్బ! బాధ్యులు మీరే.. బదులివ్వండి
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023 శ్రీలంకకు అస్సలు కలిసి రావడం లేదు. నేరుగా టోర్నీకి అర్హత సాధించని కారణంగా క్వాలిఫయర్స్ ఆడి ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టిన ఈ మాజీ చాంపియన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్టార్లు దూరం గాయాల కారణంగా కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి తరుణంలో జట్టు పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ జట్టును విజయవంతంగా ముందుకు నడపడంలో విఫలమవుతున్నాడు. టీమిండియా చేతిలో చావుదెబ్బ దీంతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక(అనధికారికంగా).. వాంఖడేలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముంబైలో గురువారం నాటి మ్యాచ్‌లో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెండిస్ బృందం మరీ ఘోరంగా 55 పరుగులకే కుప్పకూలింది. View this post on Instagram A post shared by ICC (@icc) టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కకావికలం కాగా.. మరో ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో లంక 302 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ‘సమిష్టి వైఫల్యం’ ఇదిలా ఉంటే.. ఆరంభంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏకంగా 428 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడితే.. టీమిండియాతో మ్యాచ్‌లో బ్యాటర్లు విఫలమైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో జట్టు ఆట తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఘోర వైఫల్యాలకు గల కారణాలేమిటో వెల్లడించాలంటూ సెలక్టర్లు, కోచ్, ఆటగాళ్లకు నోటీసులు ఇచ్చింది. షాకింగ్ ఓటములు ఈ మేరకు.. ‘‘ఇప్పటి వరకు ఓవరాల్ ప్రదర్శన.. ఇటీవల విస్మయకరరీతిలో భారీ పరాజయాలను చూసిన తర్వాత మెగా టోర్నీకి జట్టు సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం చర్చనీయాంశమైంది. నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెషనల్ స్టాఫ్ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోదు. వారి విధులు, బాధ్యతలకు ఆటంకం కలిగించదు. బాధ్యులు మీరే.. బదులివ్వండి కానీ.. మీ నుంచి మేము జవాబుదారీతనం, పారదర్శకత కోరుకుంటున్నాం. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయట పడాలన్న అంశంపై దృష్టి పెట్టండి. మన జట్టు ఎంపిక, సన్నద్ధత.. తుదిజట్టు కూర్పు విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచించారో వివరించండి. జట్టుతో పాటు ప్రతి ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనను అంచనా వేసి.. వారి బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోండి. View this post on Instagram A post shared by ICC (@icc) దృష్టి సారించండి ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందే మా దృష్టికి తీసుకురండి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితాన్ని విశ్లేషించి భవిష్యత్తులో పొరపాట్లు దొర్లకుండా చూసుకోండి. కోచింగ్ టీమ్ ఈ విషయంమై లోతుగా అధ్యయనం చేయాలి’’ అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది. మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి? కాగా ముంబైలోని వాంఖడేలో 2011లో ఫైనల్లో టీమిండియాకు గట్టిపోటీనిచ్చిన లంక.. ఈసారి అదే వేదికపై 55 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులతో పాటు లంక మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీస్ మాట పక్కన పెడితే మరీ ఇంత అధ్వాన్న రీతిలో ఓడిపోవాలా? మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! ఐసీసీ ప్రకటన విడుదల -
WC 2023: టీమిండియా పేసర్ల దెబ్బ.. 302 పరుగుల తేడాతో లంకపై జయభేరి
ICC Cricket World Cup 2023- India vs Sri Lanka Updates: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం నాటికి మ్యాచ్‌కు సంబంధించిన అప్డేట్స్.. 302 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం మధుషాంక వికెట్ తీసి రవీంద్ర జడేజా టీమిండియా విజయ లాంఛనం పూర్తి చేశాడు. తొమ్మిదో వికెట్ డౌన్ 17.6: షమీ బౌలింగ్‌లో కసున్ రజిత(14) పెవిలియన్ చేరడంతో శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 49/9(18) శ్రీలంక ఓటమికి చేరువైంది. 29 పరుగులకే శ్రీలంక 8 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో మాథ్యూస్ క్లీన్ బౌల్డయ్యాడు. 22 పరుగులకే 7 వికెట్లు.. శ్రీలంక 22 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో చమీరా పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లలో లంక స్కోరు: 21/6 ఏంజెలో మాథ్యూస్ 10, దుష్మంత చమీర సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) పవర్ ప్లేలో శ్రీలంక స్కోరు: 14/6 (10) View this post on Instagram A post shared by ICC (@icc) షాకుల మీద షాకులు.. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక 9.4: హేమంత డకౌట్ 9.3: షమీ బౌలింగ్‌లో అసలంక(1) అవుట్. 8 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 12/4 ఏంజెలో మాథ్యూస్ 6, చరిత్ అసలంక 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3.1: సిరాజ్ బౌలింగ్‌లో కుశాల్ మెండిస్ బౌల్డ్ కెప్టెన్ కుశాల్ మెండిస్ రూపంలో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు మెండిస్(1). మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక టీమిండియా పేసర్లు బుమ్రా, సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుదేలైంది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. రెండో వికెట్ డౌన్.. 2 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ కరుణ రత్నే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. View this post on Instagram A post shared by ICC (@icc) తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో నిస్సాంక గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ కుశాల్ మెండిస్ వచ్చాడు. ఐదేసిన మధుషాంక.. శ్రీలంక లక్ష్యం 358 రన్స్ శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శుబ్‌మన్ గిల్(92), విరాట్ కోహ్లి(88), శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అదరగొట్టారు. వీరి ముగ్గురి అద్భుతమైన అర్ధ శతకాలతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో పేసర్ మధుషాంక అత్యధికంగా 5 వికెట్లు తీయగా.. దుష్మంత చమీరకు ఒక వికెట్ దక్కింది. రనౌట్ల రూపంలో లంకు రెండు వికెట్లు లభించాయి. 49.6: జడేజా రనౌట్ 49.3: షమీ రనౌట్ శ్రేయస్ అయ్యర్ అవుట్ 47.3: 56 బంతుల్లో 82 పరుగులతో జోరు మీదున్న శ్రేయస్ అయ్యర్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మధుషాంక బౌలింగ్‌లో తీక్షణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఐదో వికెట్ డౌన్.. టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. మధుశంక బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 42 ఓవర్లకు టీమిండియా స్కోర్: 279/5 నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన రాహుల్.. చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 40 ఓవర్లకు భారత్ స్కోర్: 264/4 37 ఓవర్లలో టీమిండియా స్కోరు: 240-3 శ్రేయస్ అయ్యర్ 27, కేఎల్ రాహుల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 31.3: కోహ్లి అవుట్.. మూడో వికెట్ డౌన్ సెంచరీ చేస్తాడని భావించిన కోహ్లి 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కాగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ వికెట్లు తీసిన లంక పేసర్ మధుషాంక కోహ్లిని సైతం అవుట్ చేసి మూడో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ మిస్ అయిన గిల్ వరల్డ్‌కప్‌లో తొలి శతకం బాదే అవకాశాన్ని టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మిస్సయ్యాడు. దూకుడుగా ఆడుతూ 92 పరుగులు పూర్తి చేసుకున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 30వ ఓవర్ ఆఖరి బంతికి మధుషాంక బౌలింగ్‌లో కీపర్ కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు: 193-2. కోహ్లి 87, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) 29 ఓవర్లలో టీమిండియా స్కోరు: 185/1. కోహ్లి 86, గిల్ 86 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు:162-1 కోహ్లి 82, గిల్ 67 పరుగులతో క్రీజులో ఉన్నారు. 21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 126-1 కోహ్లి 58, గిల్ 55 పరుగులతో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) 18.3: వన్డే వరల్డ్‌కప్-2023లో రెండో హాఫ్ సెంచరీ సాధించిన గిల్ కోహ్లి 52, గిల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. 19 ఓవర్లలో టీమిండియా స్కోరు: 119-1 16.1: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి హేమంత బౌలింగ్‌లో రెండు పరుగులు రాబట్టి కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అర్థ శతకానికి చేరువలో కోహ్లి 15 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 41 పరుగులు, గిల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 88-1 13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 82/1 కోహ్లి 37, గిల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్.. పవర్ ప్లేలో ముగిసేసరికి ఆరంభంలోనే రోహిత్ శర్మ అవుటైన నేపథ్యంలో టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి, మరో ఓపెనర్ గిల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 28, గిల్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 60-1 6 ఓవర్లలో టీమిండియా స్కోరు: 33/1 చమీర బౌలింగ్‌లో కోహ్లి రెండు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం కోహ్లి 18, గిల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 25/1 కోహ్లి 10, గిల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియాకు ఊహించని షాక్ భారత ఇన్నింగ్స్ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషాంక ఊహించని షాకిచ్చాడు. అద్భుతమైన బంతితో టీమిండియా సారథి రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు. శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత బౌలింగ్ ►టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తుదిజట్లు టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్. శ్రీలంక: పాతుమ్ నిసాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుషంక చదవండి: World Cup 2023: వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా షాహిన్ అఫ్రిది.. -
WC 2023: శ్రీలంకతో మ్యాచ్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్! తుది జట్లు ఇవే
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌కు షాక్.. అతడు దూరం క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్సన్, హ్యారీ బ్రూక్‌లు కూడా లంకతో మ్యాచ్‌లో ఆడటం లేదని తెలిపాడు. వాళ్లిద్దరు అవుట్ ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచ్‌లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే! తుది జట్లు: శ్రీలంక కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. ఇంగ్లండ్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. స్టార్ పేసర్‌కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే? -
పాక్ అదరగొట్టింది
345 పరుగులు... వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోలేదు... శ్రీలంకతో మ్యాచ్‌లో 37 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో పాకిస్తాన్‌కు ఇది దాదాపు అసాధ్యం అనిపించింది. కానీ రిజ్వాన్, షఫీక్ కలిసి దానిని చేసి చూపించారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌లో గేర్లు మారుస్తూ చివరకు మరో 8 బంతులు మిగిలి ఉండగా పాక్‌కు విజయాన్నందించారు. అంతకుముందు మెరుపు బ్యాటింగ్‌తో కుశాల్ మెండిస్, సమరవిక్రమ చేసిన శతకాలు చివరకు జట్టుకు ఉపయోగపడలేదు. మొత్తం 689 పరుగుల ఈ పోరుతో హైదరాబాద్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగిశాయి. సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌లనూ సంతృప్తిగా ముగించింది. మంగళవారం జరిగిన పోరులో పాక్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 122; 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (89 బంతుల్లో 108; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా, పతుమ్ నిసాంక (61 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మెండిస్ రెండో వికెట్‌కు నిసాంకతో 102 పరుగులు, మూడో వికెట్‌కు సమరవిక్రమతో 111 పరుగులు జోడించాడు. 65 బంతుల్లో సెంచరీ సాధించిన మెండిస్ శ్రీలంక తరఫున ప్రపంచకప్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్ 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిజ్వాన్ (121 బంతుల్లో 131 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (103 బంతుల్లో 113; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు బాది జట్టును గెలిపించారు. కండరాల నొప్పితో బాధపడుతూనే రిజ్వాన్ తన జట్టును విజయతీరానికి చేర్చాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 176 పరుగులు జత చేశారు. ఆరంభంలో శ్రీలంక చెలరేగినా... చివరి పది ఓవర్లలో 61 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) షఫీక్ (బి) షాదాబ్ 51; పెరీరా (సి) రిజ్వాన్ (బి) హసన్ 0; మెండిస్ (సి) ఇమామ్ (బి) హసన్ 122; సమరవిక్రమ (సి) రిజ్వాన్ (బి) హసన్ 108; అసలంక (సి) రిజ్వాన్ (బి) హసన్ 1; ధనంజయ (సి) షాహిన్ (బి) నవాజ్ 25; షనక (సి) బాబర్ (బి) షాహిన్ 12; వెలలాగె (సి) షఫీక్ (బి) రవూఫ్ 10; తీక్షణ (బి) రవూఫ్ 0; పతిరణ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 344. వికెట్ల పతనం: 1–5, 2–107, 3–218, 4–229, 5–294, 6–324, 7–335, 8–343, 9–344. బౌలింగ్: షాహిన్ 9–0–66–1, హసన్ అలీ 10–0–71–4, నవాజ్ 9–0–62–1, రవూఫ్ 10–0–64–2, షాదాబ్ 8–0–55–1, ఇఫ్తికార్ 4–0–22–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) (సబ్) హేమంత (బి) పతిరణ 113; ఇమామ్ (సి) పెరీరా (బి) మదుషంక 12; బాబర్ ఆజమ్ (సి) సమరవిక్రమ (బి) మదుషంక 10; మొహమ్మద్ రిజ్వాన్ (నాటౌట్) 131; షకీల్ (సి) వెలలాగె (బి) తీక్షణ 31; ఇఫ్తికార్ అహ్మద్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (48.2 ఓవర్లలో 4 వికెట్లకు) 345. వికెట్ల పతనం: 1–16, 2–37, 3–213, 4–308. బౌలింగ్: తీక్షణ 10–0–59–1, మదుషంక 9.2– 0–60–2, షనక 5–0–28–0, పతిరణ 9–0– 90–1, వెలలాగె 10–0–62–0, ధనంజయ డిసిల్వా 4–0– 36–0, అసలంక 1–0–10–0. 3 ఒక వన్డే మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే కాగా, వరల్డ్ కప్‌లో మొదటిసారి. 1998లో లాహోర్‌లో ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ యూసుఫ్, పాంటింగ్, గిల్‌క్రిస్ట్...2013లో నాగపూర్‌లో కోహ్లి, ధావన్, బెయిలీ, వాట్సన్ సెంచరీలు చేశారు. -
మేము పాకిస్తాన్‌కు ఛాన్స్ ఇచ్చాం.. కానీ మా వాడు అదరగొట్టాడు: షనక
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు మేము పాకిస్తాన్‌కు అవకాశం ఇచ్చాము. కానీ.. చరిత్ అసలంక మమ్మల్ని గెలిపిస్తాడని మాకు ముందే తెలుసు. టీమిండియాతో మ్యాచ్‌లో తప్పిదాలు బ్యాటింగ్‌కు వెళ్లే ముందు.. టీమిండియాతో మ్యాచ్‌లో మేము చేసిన తప్పిదాల గురించి చర్చించుకున్నాం. మొదటి 10 ఓవర్లలో వికెట్లు పారేసుకున్నాం. ఏదేమైనా కుశాల్, సదీర అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వారిద్దరు శ్రీలంక జట్టులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు. అయితే, ఆఖరి వరకు చరిత్ పట్టుదలగా పోరాడిన తీరు ప్రశంసనీయం’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. అదరగొట్టిన కుశాల్, సదీర ఆసియా కప్-2023 సూపర్-4 దశలో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే. కొలంబోలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లంక టార్గెట్ 252గా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(91), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సదీర సమరవిక్రమ(48) అద్భుత ఇన్నింగ్స్‌తో లంక గెలుపునకు బాటలు వేశారు. అసలంక ఆదుకున్నాడు అయితే, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో మిగతా వాళ్లంతా విఫలం కాగా ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో ఒత్తిడిని జయించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా కప్‌లో శ్రీలంక ఏకంగా 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్‌కు చేరింది. గతేడాది చాంపియన్ శ్రీలంక.. ఈసారీ ఫైనల్లో ఇక ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ దసున్ షనక కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో శ్రీలంక చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఈసారి ఫిఫ్టీ ఓవర్ల ఫార్మాట్లో సెప్టెంబరు 17న టీమిండియాతో ఫైనల్లో దసున్ షనక బృందం తలపడనుంది. చదవండి: అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్ మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
Asia Cup, 2023- Pakistan vs Sri Lanka- Babar Azam Comments On Loss: ఆసియా కప్-2023 టోర్నీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. చివరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు సాగిన గురువారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. కొలంబోలో లంక చేతిలో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. శ్రీలంక జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని.. అందుకే గెలుపు వారినే వరించిందని పేర్కొన్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ పేలవంగా సాగిందని అందుకే ఓడిపోయామని తెలిపాడు. వాళ్లిద్దరు అద్భుతంగా ఆడి లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సమరవిక్రమ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ‘‘మేము ఆరంభంలో.. మ్యాచ్ చివర్లో మెరుగ్గా రాణించగలుగుతున్నాం. కానీ మిడిల్ ఓవర్లలో సరిగ్గా ఆడలేకపోతున్నాం. ఈ రెండే కొంప ముంచాయి ఈరోజు కూడా అదే జరిగింది. మిడిల్ ఓవర్లలో మా బౌలింగ్ అస్సలు బాలేదు. ఫీల్డింగ్ కూడా స్థాయికి తగ్గట్లు లేదు. ఈ రెండు కారణాల వల్ల మేము భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని బాబర్ ఆజం లంక చేతిలో తాము ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించాడు. అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాను ఇక ఆఖరి ఓవర్లో బాల్‌ను వన్డే అరంగేట్ర బౌలర్‌కు ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ చివరి ఓవర్ వరకు పోరాటం కొనసాగించే క్రమంలో.. ఆఖర్లో అత్యుత్తమ బౌలర్లనే బరిలోకి దించాలని భావించాను. అందుకే సెకండ్ లాస్ట్ ఓవర్లో బంతిని షాహిన్ ఆఫ్రిది చేతికి ఇచ్చాను. ఫైనల్ ఓవర్లో జమాన్ ఖాన్‌పై నమ్మకం ఉంచాను. అయితే, శ్రీలంక మా కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించింది’’ అని బాబర్ ఆజం ఓటమిని అంగీకరించాడు. శ్రీలంక అసాధారణ పోరాటం.. ఫైనల్లో టీమిండియాతో కాగా ఆసియా కప్-2023 సూపర్-4 దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 86 పరుగులు(నాటౌట్) పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 91 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సమరవిక్రమ 48, ఆఖరి వరకు క్రీజులో ఉన్న చరిత్ అసలంక 49 పరుగులతో రాణించారు. 42వ ఓవర్ చివరి బంతికి జమాన్ ఖాన్ వేసిన బాల్‌కు రెండు పరుగులు తీసిన లంక ఆటగాళ్లు జట్టు ఫైనల్ బెర్తును ఖరారు చేశారు. సెప్టెంబరు 17న టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: Ind Vs Ban: జోరు కొనసాగించేందుకు... అయ్యర్ బరిలోకి... Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 Some effort this from @iamharis63! 🔥#PAKvSL | #AsiaCup2023 pic.twitter.com/rHE9xkV2il — Pakistan Cricket (@TheRealPCB) September 14, 2023 -
అతిపెద్ద పొరపాటు.. తప్పని భారీ మూల్యం.. కనీసం సింగిల్ తీసినా..
Afghanistan vs Sri Lanka: ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడి నిరాశగా ఇంటిబాట పట్టింది. గ్రూప్-బిలో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో అఫ్గన్‌పై గెలిచిన దసున్ షనక బృందం సూపర్-4లో ఎంట్రీ ఇచ్చి ముందడుగు వేసింది. కచ్చితంగా సూపర్-4కి అర్హత సాధిస్తారనుకున్నాం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక- అఫ్గన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా వాళ్లు సూపర్-4కు అర్హత సాధిస్తారని అనిపించింది. కానీ.. ఎప్పుడైతే ముజీబ్ ఉర్ రహమాన్ వికెట్ కోల్పోయిందో.. ఫజల్హక్ ఫారూకీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా తలకిందులైంది. అతడు కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. క్రీజులోకి వచ్చాడు.. అలా స్టక్ అయిపోయాడు. బహుశా.. కనీసం సింగిల్ అయినా తీయాలని ఎవరూ అతడికి చెప్పలేదేమో! ముజీబ్ అవుట్ కాకపోయినా.. ఫారూకీ సింగిల్ తీసినా.. తర్వాతి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాది ఉంటే.. అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉండేది. అతిపెద్ద పొరపాటు కానీ అలా జరుగలేదు. బహుశా.. ఇంకా తాము రేసులో ఉన్నామనే విషయాన్ని తెలిపే షీట్ మైదానంలో ఉన్న వాళ్లకు అంది ఉండదు. కీలక సమయంలో అఫ్గనిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పీయూశ్ చావ్లా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 92 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గన్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(45), కెప్టెన్ హష్మతుల్లా షాహిది(59), మహ్మద్ నబీ(65) ఇన్నింగ్స్‌తో గాడిన పడింది. ఆ విషయం తెలియదా? అయితే, రన్‌రేటు పరంగా వెనుకబడ్డ అఫ్గనిస్తాన్ 37.1 ఓవర్లలో టార్గెట్ ఛేదిస్తే సూపర్-4లో అడుగుపెట్టే అవకాశం. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేయగా.. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి ఇంకో 3 పరుగులు తీస్తే చాలు విజయం సాధిస్తామనగా.. ధనంజయ డిసిల్వా అఫ్గనిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్‌లో 37.1వ ఓవర్ వద్ద ముజీబ్ ఉర్ రహమాన్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అఫ్గనిస్తాన్ సాంకేతికంగా.. 37.3 ఓవర్లలో 294 పరుగులు, 37.4 ఓవర్లలో 295 పరుగులు సాధిస్తే.. క్వాలిఫై అయ్యే అవకాశం ముంగిట నిలవగా.. ధనుంజయ మళ్లీ దెబ్బేశాడు. సింగిల్ కూడా తీయకుండా బిగుసుకుపోయిన ఫారూకీని ఎల్బీ డబ్ల్యూ చేశాడు. దీంతో అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం What a thrilling match! Sri Lanka secures a spot in the Super 4s with a heart-pounding 2-run victory over Afghanistan! 🇱🇰🇦🇫#AsiaCup2023 #AFGvSL pic.twitter.com/PxL53z217r — AsianCricketCouncil (@ACCMedia1) September 5, 2023 -
LPL 2023: చెలరేగిన కుశాల్ పెరీరా.. ఫైనల్లో డంబుల్లా
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 17) జరిగిన క్వాలిఫయర్-1 ఫలితంతో ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మరో బెర్త్ కోసం ఇవాళే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వాలిఫయర్-1 విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌పై డంబుల్లా ఔరా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో లసిత్ ఒక్కడే రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు. షకీబ్ (19), షనక (12), లహీరు సమరకూన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. డంబుల్లా బౌలర్లలో హేడెన్ కెర్ 3, నూర్ అహ్మద్ 2, ఫెర్నాండో, హసన్ అలీ, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కుశాల్ పెరీరా (53), కుశాల్ మెండిస్ (49) రాణించగా.. అవిష్క షెర్నాండో (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టైటాన్స్ బౌలర్లలో షకీబ్, ప్రసన్న, షంషి, షనక తలో వికెట్ పడగొట్టారు. -
8 సిక్సర్లతో వీరవిహారం చేసిన లంక బ్యాటర్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా కొలొంబో స్ట్రయికర్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో దంబుల్లా ఔరా కెప్టెన్ కుశాల్ మెండిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదిన మెండిస్ వీరవిహారం చేశాడు. మరో ఎండ్‌లో సమరవిక్రమ (35 బంతుల్లో 59; 7 ఫోర్లు, సిక్స్) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. Mendis left a strong bowling attack in disarray to secure 87 off 46!#LPL2023 #LiveTheAction pic.twitter.com/Wihg7wUCr8 — LPL - Lanka Premier League (@LPLT20) August 5, 2023 డంబుల్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా మరెవ్వరూ రాణించలేదు. అవిష్క ఫెర్నాండో (12), కుశాల్ పెరీరా (2), అలెక్స్ రాస్ (4), హేడెన్ కెర్ (0) నిరాశపరిచారు. కొలొంబో బౌలర్లలో మతీష పతిరణ 3 వికెట్లతో విజృంభించగా.. నసీం షా (2/21) పర్వాలేదనిపించాడు. కరుణరత్నే భారీగా పరుగులు సమర్పించుకుని (4-0-55-1) ఓ వికెట్ పడగొట్టాడు. Magic from Mendis and Samarawickrama leave Colombo Strikers with the highest total of LPL season 4 to chase!#LPL2023 #LiveTheAction pic.twitter.com/k4Kuvxd1c7 — LPL - Lanka Premier League (@LPLT20) August 5, 2023 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో.. 9.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఈ సమయంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో మ్యాచ్‌ను కాసేపు ఆపేశారు. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (8 బంతుల్లో 16; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 41; 7 ఫోర్లు) భారీ స్కోర్లు చేయకుండానే ఔటయ్యారు. డిక్వెల్లా వికెట్ ధనంజయ డిసిల్వ పడగొట్టగా.. బాబర్ ఆజమ్ వికెట్‌ను నూర్ అహ్మద్ దక్కించుకున్నాడు. పథుమ్ నిస్సంక (20), నువనిదు ఫెర్నాండో (4) క్రీజ్‌లో ఉన్నారు. A world-class batter lets his bat do the talking!#LPL2023 #LiveTheAction pic.twitter.com/MFaaccJRlJ — LPL - Lanka Premier League (@LPLT20) August 5, 2023 ఇదిలా ఉంటే, ఈ లీగ్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి జాఫ్నా కింగ్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత గాలే టైటాన్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), దంబుల్లా ఔరా (3 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), కొలొంబో స్ట్రయికర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), బి లవ్ క్యాండీ (3 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం) వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. -
తొలి వన్డేలో పరాభవం ఎఫెక్ట్.. రెండో వన్డేలో లంక బ్యాటర్ల ఉగ్రరూపం
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) రెండో వన్డే ఆడుతుంది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం (ఓటమి) నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. భారీ స్కోర్ చేశారు. ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 11 పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా ఆడే రహ్మానుల్లా గుర్భాజ్ 12 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చమీర బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 28/1గా ఉంది. రహ్మత్ షా (9), ఇబ్రహీమ్ జద్రాన్ (14) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, అంతకుముందు తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్.. తమ కంటే మెరుగైన శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేదనలో ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. -
కరుణరత్నే, కుశాల్ భారీ శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్
2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య శ్రీలంక భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (140) భారీ శతకాలతో విరుచుకుపడ్డారు. టెస్ట్‌ల్లో కరుణరత్నేకు ఇది 15వ సెంచరీ కాగా.. మెండిస్‌కు 8వది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దినేశ్ చండీమాల్ (18), ప్రభాత్ జయసూర్య (12) క్రీజ్‌లో ఉన్నారు. నిషాన్ మదుష్క (29), ఏంజెలో మాథ్యూస్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, కర్టిస్ క్యాంపర్, జార్జ్ డాక్రెల్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా కరుణరత్నే.. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య, స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు. జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్ కెరీర్లలో 14 టెస్ట్ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్టేక్ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు (15) చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. -
జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన కరుణరత్నే
శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టెస్ట్‌ల్లో 15వ సెంచరీ బాదాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో కరుణరత్నే ఈ ఫీట్‌ను సాధించాడు. 139 బంతులను ఎదుర్కొన్న కరుణరత్నే..12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అతను లంక దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్య, స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు. జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్ కెరీర్లలో 14 టెస్ట్ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్టేక్ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. ఇప్పటివరకు కెరీర్లో 85 టెస్ట్‌లు ఆడిన కరుణరత్నే 15 సెంచరీలు, 34 అర్ధసెంచరీల సాయంతో 40.66 సగటున 6344 పరుగులు సాధించాడు. కాగా, కరుణరత్నే (114 నాటౌట్)కు జతగా కుశాల్ మెండిస్ (94 నాటౌట్) కూడా రాణించడంతో టీ సమయానికి శ్రీలంక వికెట్ నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రీలంక కోల్పోయిన నిషాన్ మదుష్క (29) వికెట్ కర్టిస్ క్యాంపర్ ఖాతాలోకి వెళ్లింది. ఐర్లాండ్.. ప్రస్తుత లంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్‌లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్‌నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య కివీస్‌కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్‌దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్‌ను గెలుపుబాట పట్టించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో ఫైనల్లో!
New Zealand Vs Sri Lanka 2023- Test Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. దిముత్ కరుణరత్నె సారథ్యంలోని ఈ జట్టులో లాహిరు కుమార, చమిక కరుణరత్నె, కసున్ రజిత, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తదితరులకు చోటు దక్కింది. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే క్రమంలో కివీస్‌తో సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వరుసగా రెండు టెస్టుల్లో ఓడించడం లంక పాలిట వరంలా మారింది. రోహిత్ సేన అదే జోరులో ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సహా కివీస్‌ను గనుక లంక వైట్‌వాష్ చేస్తే.. సౌతాఫ్రికా- వెస్టిండీస్ ఫలితం తమకు అనుకూలంగా వస్తే టీమిండియాతో పాటు ఫైనల్ చేరే అవకాశాలు లేకపోలేదు. అయితే, న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంకకు ఇది కత్తిమీద సాములాంటిదే. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. టాప్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా అంత ఈజీ కాదు గత రికార్డులు పరిశీలిస్తే కివీస్‌తో ముఖాముఖి తలపడిన 19 సందర్భాల్లో శ్రీలంక కేవలం రెండు టెస్టులు మాత్రమే గెలిచింది. అయితే, ప్రస్తుత కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మార్గదర్శనంలో లంక జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రతిభకు అదృష్టం తోడైతే కరుణరత్నె బృందం ఫైనల్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, గత డబ్ల్యూటీసీ విన్నర్ కివీస్‌ను ఓడించడం అది కూడా సొంత గడ్డపై వైట్‌వాష్ చేయడం అంటే ఆషామాషీ కాదు! మార్చి9 - ఏప్రిల్ 8 వరకు టూర్ ఇందుకోసం లంక సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించిన కేన్ విలియమ్సన్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. కాగా మార్చి 9- ఏప్రిల్ 8 వరకు కివీస్- లంక మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు లంక జట్టు: దిముత్ కరుణరత్నె(కెప్టెన్), ఒషాడా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వ, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, నిషాన్ మదుష్క, రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, చమిక కరుణరత్నె, కసున్ రజిత, లాహిరు కుమార, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్ననాయకె. చదవండి: T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ -
Ind Vs SL: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్
Virat Kohli Goes Dumbstruck: టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్ అయిన ఈ వికెట్ కీపర్.. కోల్‌కతా మ్యాచ్‌లో 34 పరుగులు చేయగలిగాడు. అయితే, 18 ఓవర్ మొదటి బంతికి టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతికి చిక్కి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌లో మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న మెండిస్ 34 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో)చేశాడు. అయితే, టీమిండియా పేస్ యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అతడు కొట్టిన ఏకైక సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. లంక ఇన్నింగ్స్‌లో 16 ఓవర్ ఉమ్రాన్ వేశాడు. వారెవ్వా! కోహ్లి షాక్! ఈ క్రమంలో మూడో బంతిని అద్భుత రీతిలో మెండిస్ సిక్స్‌గా మలిచాడు. ఉమ్రాన్ సంధించిన షార్ట్ బాల్‌ను డీప్ ఫైన్ లెగ్ మీదుగా షాట్ బాదాడు. ఇక మెండిస్ కొట్టిన సిక్స్ చూసి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆశ్చర్యపోయాడు. ‘ఇదెలా సాధ్యమైందిరా బాబు’ అన్నట్లుగా నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని.. షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అరంగేట్ర ఓపెనర్ నువానీడు ఫెర్నాండో(50), మెండిస్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో లంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో వన్డేలో శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రోహిత్ సేన.. సిరీస్ విజయమే లక్ష్యంగా ఛేదనకు దిగనుంది. ఇక ఇప్పటికే గువహటి మ్యాచ్‌లో భారీ విజయం సాధించి ఆతిథ్య భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం.. IPL 2023: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా 'బేబీ ఏబీడీ'.. మరి రోహిత్? pic.twitter.com/UEC503KNOR — cricket fan (@cricketfanvideo) January 12, 2023 -
Ind Vs SL: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లు.. శ్రీలంక జట్టు ప్రకటన
India vs Sri Lanka 2023 T20 And ODI Series- కొలంబో: భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లలో పాల్గొనే శ్రీలంక జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కలిపి 20 మంది సభ్యులతో కూడిన జట్టుకు షనక సారథ్యం వహిస్తాడు. కాగా వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. టీమిండియాతో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంక బోర్డు సైతం టీమిండియాను ఢీకొట్టే తమ జట్టు వివరాలు బుధవారం వెల్లడించింది. రెండు సిరీస్‌లకు దసున్ షనక కెప్టెన్ కాగా.. వన్డేలకు కుశాల్ మెండిస్, టీ20లకు వనిందు హసరంగ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక టీమిండియా- శ్రీలంక మధ్య 3, 5, 7 తేదీల్లో టీ20, 10, 12, 15 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్‌తో సిరీస్- శ్రీలంక జట్టు వివరాలు: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్ కెప్టెన్), ఆషేన్ బండార, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే) ►టి20లకు మాత్రమే: భానుక రాజపక్స, తుషార. ►వన్డేలకు మాత్రమే: వండెర్సే, నువానిడు ఫెర్నాండో. చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
SL Vs NED: ఈ గ్రూపులో మేమే నంబర్ 1గా ఉంటామని తెలుసు.. కానీ..
ICC Mens T20 World Cup 2022 - Sri Lanka vs Netherlands, 9th Match, Group A: టీ20 ప్రపంచకప్-2021లో ఆకట్టుకోలేకపోయిన శ్రీలంక ఈసారి పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడింది. ఇందులో భాగంగా.. ఆసియా కప్-2022 విజేతగా నిలిచి అదే జోష్‌లో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అడుగుపెట్టిన లంకకు ఆరంభ మ్యాచ్‌లోనే నమీబియా షాకిచ్చింది. దీంతో సూపర్-12కు అర్హత సాధించాలంటే గ్రూప్-ఏలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో యూఏఈని ఓడించింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక 74 పరుగులతో చెలరేగగా.. బౌలర్లు విశ్వరూపం చూపించడంతో 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నెట్ రన్‌రేటును మెరుగుపరచుకుంది. గట్టి పోటీ ఎదురైంది! అదే జోరులో గురువారం(అక్టోబరు 20) నెదర్లాండ్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌లో బరిలోకి దిగిన శ్రీలంకకు.. ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓపెనర్ కుశాల్ మెండిస్(79) రాణించడంతో 162 పరుగుల స్కోరు చేయగలిగిన లంక.. వనిందు హసరంగ 3 వికెట్లతో చెలరేగడంతో ఆఖరికి 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మేము నంబర్ 1.. తద్వారా గ్రూప్-ఏ నుంచి సూపర్-12కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రూపులో మేము నంబర్ 1గా ఉంటామని తెలుసు. కానీ ఆరంభ మ్యాచ్‌లోనే మాకు చేదు అనుభవం ఎదురైంది. అయితే, మా ఆటగాళ్ల ప్రదర్శన బాగానే ఉంది. ముఖ్యంగా బౌలింగ్ గ్రూపు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రోజు వికెట్‌ను దృష్టిలో పెట్టుకుని మొదటి 10 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా ప్రణాళికను అమలు చేయగలిగాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2022: క్వాలిఫైయర్స్ గ్రూప్-ఏ: శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ రౌండ్‌రాబిన్ పద్ధతిలో నిర్వహణ చదవండి: T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! ఆసియా కప్ నిర్వహణపై పాక్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన కేంద్ర క్రీడల మంత్రి View this post on Instagram A post shared by ICC (@icc) -
అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు
Asia Cup 2022 Final: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో లంక ఓపెనర్ కుషాల్ మెండిస్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. కుషాల్ మెండిస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో అతనికి ఇది 26వ డకౌట్. అరంగేట్రం నుంచి అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్ జాబితాలో కుషాల్ మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో జానీ బెయిర్ స్టో(ఇంగ్లండ్) 27 డకౌట్లతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మొయిన్ అలీ(ఇంగ్లండ్) 25 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. కగిసో రబడా(దక్షిణాఫ్రికా) 23 డకౌట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్ -
Asia Cup 2022: లంక చేతిలో మా ఓటమికి ప్రధాన కారణం అదే: బంగ్లా కెప్టెన్
Asia Cup 2022 SL Vs Ban- Bangladesh Knocked Out Of Tourney: ఆసియా కప్-2022 టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసింది. దుబాయ్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బృందం ఓటమి పాలైంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మెగా ఈవెంట్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఇక గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్‌తో పాటు లంక సూపర్-4కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఓటమిపై స్పందించాడు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో పరాజయంతో ఇంటిబాట పట్టినందుకు చింతిస్తున్నామంటూ అభిమానులను క్షమాపణ కోరాడు. అదరగొట్టిన కుశాల్, దసున్ గురువారం(సెప్టెంబరు 1) నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆఫిఫ్ హొసేన్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుత ఆరంభం అందించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 60 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ విఫలం కావడంతో లంక కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ దసున్ షనక 33 బంతుల్లో 45 పరుగులు చేసి లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కొంప ముంచిన ఇబాదత్! కానీ.. ఆ తర్వాత వనిందు హసరంగ 2 పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో గెలుపు కోసం చివరి 2 ఓవర్లలో లంకకు 25 పరుగులు అవసరమయ్యాయి. దీంతో బంగ్లా విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. అయితే 19వ ఓవర్ వేసిన బంగ్లా బౌలర్ ఇబాదత్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో లంక గెలుపు సమీకరణం 8 పరుగులకు చేరగా.. అసిత ఫెర్నాండో లాంఛనం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వైడ్లు, 4 నోబాల్‌లు వేసిన బంగ్లాకు చేదు అనుభవం తప్పలేదు. మా ఓటమికి కారణం అదే! ఈ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. ‘‘చెత్త బౌలింగ్ కారణంగా ముఖ్యంగా డెత్ ఓవర్లలో విఫలమైనందున భారీ మూల్యం చెల్లించాం. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి చేతిలో నాలుగు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మా బౌలింగ్ అధ్వాన్నంగా సాగింది. నిజానికి, శ్రీలంక బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దసున్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మేము వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలని అనుకున్నాం. కానీ.. మా బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. గత ఆర్నెళ్లుగా మా జట్టు ప్రదర్శన అస్సలు బాగుండటం లేదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో బాగానే ఆడాం. ఏదేమైనా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పకతప్పదు. ఎక్కడివెళ్లినా మా మీద మీ ప్రేమ తగ్గడం లేదు. అయితే, మేము మిమ్మల్ని నిరాశ పరుస్తున్నాం. సారీ’’ అని పేర్కొన్నాడు. చదవండి: Asia cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు' -
యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు
టెస్టు క్రికెట్లో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఆస్ట్రేలియన్ దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. జూన్ 4, 1993న వార్న్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన విధానం ఎవరు మరిచిపోలేరు. పూర్తిగా లెగ్‌స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టి.. క్రీజులో ఉన్న మైక్ గాటింగ్ సహా.. ఆసీస్ తోటి ఆటగాళ్లు, అభిమానులు సహా యావత్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. క్రికెట్ బతికున్నంతవరకు షేన్ వార్న్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆ తర్వాత ఎంతో మంది బౌలర్లు వార్న్ లాగే ఆ ఫీట్ అందుకున్నప్పటికీ వార్న్ వేసిన బంతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ స్టార్ యాసిర్ షా కూడా అచ్చం వార్న్ తరహాలోనే వేసిన బంతిని క్రికెట్ అభిమానులు సహా కామెంటేటర్స్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా అభివర్ణిస్తున్నారు. అయితే యాసిర్ వేసిన బంతిని దిగ్గజ బౌలర్‌తో పోల్చడం ఏంటని కొందరు అభిమానులు కొట్టిపారేసినప్పటికి.. అచ్చం వార్న్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉండే.. యాసిర్ షా వేసిన బంతి కూడా అదే తరహాలో చరిత్రలో నిలిచిపోనుంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. యాసిర్ షా డెలివరీకి అప్పటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కుషాల్ మెండిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. కుషాల్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 56వ ఓవర్లో యాసిర్ షా బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్‌కు పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్ అవుతుందని యాషిర్ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో లంక పాక్ ముందు 342 పరుగుల టార్గెట్ ఉంచింది. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 3, బాబర్ ఆజం 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 185 పరుగులు దూరంలో ఉండగా.. మరొక రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో శ్రీలంక మిగిలిన 8 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. Ball of the Century candidate❓ Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 18, 2022 The greatest Test delivery ever? pic.twitter.com/MQ8n9Vk3aI — cricket.com.au (@cricketcomau) March 4, 2022 చదవండి: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్ Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
SL vs AUS: జోరు మీదున్న శ్రీలంక.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు ఇదే!
Sri Lanka Vs Australia Test Series 2022: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగబోయే టెస్టు సిరీస్‌కు శ్రీలంక బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆసీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడే క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన వివరాలు శనివారం వెల్లడించింది. దిముత్ కరుణ కెప్టెన్సీలోని ఈ జట్టులో స్పిన్నర్ జాఫ్రీ వాండర్సేకు చోటు దక్కింది. వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న అతడు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. జాఫ్రీతో పాటు కుశాల్ మెండిస్, పాథుమ్ నిశాంక, చమిక కరుణ రత్నే, ధనంజయ డి సిల్వ, నిరోషన్ డిక్విల్లా తదితర వన్డే ప్లేయర్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా జూన్ 29 నుంచి గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లంక- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంకకు వచ్చింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో పర్యాటక కంగారూ జట్టు సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టు ఇదే! దిముత్ కరుణరత్నే(కెప్టెన్), పాథుమ్ నిశాంక, ఒషాడా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనుంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్విల్లా(వికెట్ కీపర్), దినేశ్ చండిమాల్(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, ఆసిత ఫెర్నాండో, దిల్షాన్ ముదుషంక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డెనియా, జాఫ్రీ వాండర్సే. చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు! -
దురదృష్టమంటే మెండిస్‌దే.. బంతిని కొట్టబోయి పొరపాటున..!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన రిచర్డ్సన్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి మెండీస్ ప్రయత్నించాడు. అయితే ఫుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన మెండిస్ తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా మెండిస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో హిట్ వికెట్‌గా ఔటైన 20 ఆటగాడిగా మెండిస్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! Kusal Mendis Hit Wicket 36(36*) pic.twitter.com/ASwAial22l — Six Cricket (@Six6Cricket) June 8, 2022