Dambulla Aura Captain Kusal Mendis Slams 8 Sixers Vs Colombo Strikers In LPL 2023, Video Viral - Sakshi
Sakshi News home page

LPL 2023 Match 8 Highlights: 8 సిక్సర్లతో వీరవిహారం చేసిన లంక బ్యాటర్‌

Published Sat, Aug 5 2023 6:01 PM | Last Updated on Sat, Aug 5 2023 7:21 PM

Kusal Mendis Slams 8 Sixers Vs Colombo Strikers In LPL 2023 - Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా కొలొంబో స్ట్రయికర్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 5) జరుగుతున్న మ్యాచ్‌లో దంబుల్లా ఔరా కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదిన మెండిస్‌ వీరవిహారం చేశాడు. మరో ఎండ్‌లో సమరవిక్రమ (35 బంతుల్లో 59; 7 ఫోర్లు, సిక్స్‌) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన డంబుల్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

డంబుల్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా మరెవ్వరూ రాణించలేదు. అవిష్క ఫెర్నాండో (12), కుశాల్‌ పెరీరా (2), అలెక్స్‌ రాస్‌ (4), హేడెన్‌ కెర్‌ (0) నిరాశపరిచారు. కొలొంబో బౌలర్లలో మతీష పతిరణ 3 వికెట్లతో విజృంభించగా.. నసీం షా (2/21) పర్వాలేదనిపించాడు. కరుణరత్నే భారీగా పరుగులు సమర్పించుకుని (4-0-55-1) ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో.. 9.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఈ సమయంలో ఫ్లడ్‌ లైట్లు ఆగిపోవడంతో మ్యాచ్‌ను కాసేపు ఆపేశారు. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన ఓపెనర్లు నిరోషన్‌ డిక్వెల్లా (8 బంతుల్లో 16; 3 ఫోర్లు), బాబర్‌ ఆజమ్‌ (24 బంతుల్లో 41; 7 ఫోర్లు) భారీ స్కోర్లు చేయకుండానే ఔటయ్యారు. డిక్వెల్లా వికెట్‌ ధనంజయ డిసిల్వ పడగొట్టగా.. బాబర్‌ ఆజమ్‌ వికెట్‌ను నూర్‌ అహ్మద్‌ దక్కించుకున్నాడు. పథుమ్‌ నిస్సంక (20), నువనిదు ఫెర్నాండో (4) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఈ లీగ్‌ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి జాఫ్నా కింగ్స్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత గాలే టైటాన్స్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), దంబుల్లా ఔరా (3 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), కొలొంబో స్ట్రయికర్స్‌ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), బి లవ్‌ క్యాండీ (3 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం) వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement