lanka premier league
-
రిలీ రొస్సో విధ్వంసకర శతకం.. లంక ప్రీమియర్ లీగ్ విజేత జాఫ్నా కింగ్స్
లంక ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్‌ను జాఫ్నా కింగ్స్ ఎగరేసుకుపోయింది. నిన్న (జులై 21) జరిగిన ఫైనల్లో గాలే మార్వెల్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, నాలుగో టైటిల్‌ను సొంతం చేసుకుంది. రిలీ రొస్సో మెరుపు సెంచరీ చేసి జాఫ్నాను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. లంక ప్రీమియర్ లీగ్ ఐదు ఎడిషన్లలో (2020, 2021, 2022, 2023, 2024) జాఫ్నాకు ఇది నాలుగో టైటిల్.రాజపక్స మెరుపు ఇన్నింగ్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గాలే.. భానుక రాజపక్స (34 బంతుల్లో 82; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టిమ్ సీఫర్ట్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించాడు. జాఫ్నా బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, బెహ్రెన్‌డార్ఫ్ 2, అజ్మతుల్లా ఓ వికెట్ పడగొట్టారు.రిలీ రొస్సో విధ్వంసకర శతకం185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. రిలీ రొస్సో విధ్వంసకర శతకంతో (53 బంతుల్లో 106 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో 15.4 ఓవర్లలోనే విజయతీరాలకు (వికెట్ నష్టానికి) చేరింది. రొస్సోకు జతగా కుశాల్ మెండిస్ (40 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ఫైనల్లో సుడిగాలి శతకంతో రెచ్చిపోవడంతో పాటు సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రొస్సోకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ ఎడిషన్‌లో రొస్సో 11 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 389 పరుగులు చేసి ఎడిషన్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
LPL 2024: ఫాల్కన్స్‌ను గెలిపించిన షకన, మెండిస్.. కొలొంబో ఔట్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ నుంచి కొలొంబో స్ట్రయికర్స్ నిష్క్రమించింది. నిన్న (జులై 18) క్యాండీ ఫాల్కన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ జట్టు 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన కొలొంబో.. స్వల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. కమిందు మెండిస్ (54), దుసన్ షనక (39) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఫాల్కన్స్‌ను గెలిపించారు.రాణించిన సమరవిక్రమసమరవిక్రమ (62) అర్ద సెంచరీతో రాణించడంతో కొలొంబో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కొలొంబో ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (30), వెల్లలగే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. ఫాల్కన్స్ బౌలర్లలో హస్నైన్ 3, హసరంగ 2, ఏంజెలో మాథ్యూస్, షనక తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. కమిందు మెండిస్, షనక సత్తా చాటడంతో 18.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కొలొంబో బౌలర్లలో బినర ఫెర్నాండో, మతీష పతిరణ తలో 3, ఇషిత విజేసుందర, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో గెలుపొందిన ఫాల్కన్స్.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2లో జాఫ్నా కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 21న జరిగే ఫైనల్లో గాలే మార్వెల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
నిప్పులు చెరిగిన ప్రిటోరియస్.. ఫైనల్లో మార్వెల్స్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (జులై 18) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గాలే మార్వెల్స్.. జాఫ్నా కింగ్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. మార్వెల్స్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నిప్పులు చెరిగిన ప్రిటోరియస్తొలుత బౌలింగ్ చేసిన మార్వెల్స్.. డ్వేన్ ప్రిటోరియస్ నిప్పులు చెరగడంతో (4-0-23-4) జాఫ్నాను 177 పరుగులకు పరిమితం చేయగలిగింది. ఉడాన 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ తీశారు. జాఫ్నా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ 46, రిలీ రొస్సో 40, అవిష్క ఫెర్నాండో 52 పరుగులు చేశారు.చెలరేగిన సీఫర్ట్, లియనగే178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్.. టిమ్ సీఫర్ట్ (41 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్), జనిత్ లియనగే (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్వెల్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. జాఫ్నా బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫేబియన్ అలెన్, తబ్రేజ్ షంషి తలో వికెట్ పడగొట్టారు.జాఫ్నాకు మరో అవకాశంఈ మ్యాచ్‌లో ఓడినా జాఫ్నా ఫైనల్‌కు చేరాలంటే మరో అవకాశం ఉంది. ఇవాళ రాత్రి జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో (కొలొంబో స్ట్రయికర్స్ వర్సెస్ క్యాండీ ఫాల్కన్స్) గెలిచే జట్టుతో జాఫ్నా క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ జులై 20న జరుగుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు జులై 21న జరిగే అంతిమ సమరంలో గాలే మార్వెల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
సిక్సర్ల మోత మోగించిన ఫ్లెచర్, మాథ్యూస్
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఐదుగురు బ్యాటర్లు కలిసి ఏకంగా 17 సిక్సర్లు బాదారు. వీరిలో ఆండ్రీ ఫ్లెచర్ (7), ఏంజెలో మాథ్యూస్ (5) మాత్రమే 12 సిక్సర్లు కొట్టారు. కమిందు మెండిస్, మొహమ్మద్ హరీస్ తలో 2, చండీమల్ ఓ సిక్సర్ బాదారు. బ్యాటర్లంతా తలో చేయి వేసి సిక్సర్ల మోత మోగించడంతో ఫాల్కన్స్ భారీ స్కోర్ చేసింది.ఫ్లెచర్, మెండిస్ అర్ద సెంచరీలుఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ ఫాల్కన్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (34 బంతుల్లో 60; ఫోర్, 7 సిక్సర్లు), కమిందు మెండిస్ (24 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 44 నాటౌట్; 5 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. డంబుల్లా బౌలర్లలో దుషన్ హేమంత ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. సోనల్ దినుషకు ఓ వికెట్ దక్కింది.హసరంగ మాయాజాలం223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిక్సర్స్.. హసరంగ (4-0-35-4), దసున్ షకన (4-0-29-3) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు (9 వికెట్ల నష్టానికి) మాత్రమే చేసి, 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరీరా (74) ఒక్కడే రాణించాడు. -
వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరు..!
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఓ అద్భుత విన్యాసం చేశాడు. ఈ మ్యాచ్ ఆరో ఓవర్లో కుశాల్ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ పక్షిలా గాల్లోకి ఎగిరి గాల్లోనే బంతిని బౌండరీ రోప్ లోపలికి నెట్టాడు. GLENN PHILLIPS IS NEXT LEVEL. 🤯- Probably the greatest athlete from New Zealand. 🫡 pic.twitter.com/DIheKFMVCn— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024ఫిలిప్స్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫిలిప్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ జరిగి ఐదు రోజులైనా నెట్టింట ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరని నెటిజన్లు జేజేలు పలుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. అద్భుతమైన క్యాచ్‌తో అబ్బురపరిచిన ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. అయినా ఈ మ్యాచ్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన కొలొంబో టీమ్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. ఫిలిప్స్ (52), ఏంజెలో పెరారీ (41), గుర్బాజ్ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. కుశాల్ పెరీరా (80), రీజా హెండ్రిక్స్ (54) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీకరాలకు చేరింది. -
అలెక్స్ హేల్స్ విధ్వంసం
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో గాలే మార్వెల్స్ నాలుగో విజయం సాధించింది. నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో మార్వెల్స్.. క్యాండీ ఫాల్కన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (43 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), చండీమల్ (14 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (15 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రమేశ్ మెండిస్ (14 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మార్వెల్స్ బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 3, ప్రిటోరియస్ 2, ఉడాన, తీక్షణ, నదీశన్ తలో వికెట్ పడగొట్టారు.హేల్స్ విధ్వంసం188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్.. అలెక్స్ హేల్స్ (55 బంతుల్లో 86 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), భానుక రాజపక్స (26 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్వెల్స్ ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా 25, టిమ్ సీఫర్ట్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. హసరంగ, ఫ్లెచర్ మాత్రం తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. జులై 7న కొలొంబో స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డంబుల్లా సిక్సర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా 50 బంతుల్లో శతక్కొట్టగా.. ఇవాళ (జులై 10 అదే కొలొంబో స్ట్రయికర్స్పై జాఫ్నా కింగ్స్ ఆటగాడు రిలీ రొస్సో 44 బంతుల్లో సెంచరీ చేశాడు. జాఫ్నాతో జరిగిన మ్యాచ్‌లో రొస్సో 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు (నాటౌట్) చేశాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఇది మూడో అత్యధిక స్కోర్ కూడా కావడం విశేషం. రొస్సో పేరిట పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదై ఉండటం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. గ్లెన్ ఫిలిప్స్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (34), రహ్మానుల్లా గుర్బాజ్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాఫ్నా బౌలర్లలో అజ్మతుల్లా, అశిత ఫెర్నాండో చెరో 2 వికెట్లు.. మధుషన్, షంషి, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. రిలీ రొస్సో మెరుపు శతకంతో విజృంభించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాఫ్నా ఇన్నింగ్స్‌లో రొస్సోతో పాటు చరిత్ అసలంక (58) రాణించారు. కొలొంబో బౌలర్లలో వెల్లలగే, తస్కిన్ అహ్మద్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు. -
చెలరేగిన చండీమాల్.. 225 పరుగుల లక్ష్యం హాం ఫట్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (జులై 9) రసవత్తర సమరం జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని క్యాండీ ఫాల్కన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. పథుమ్ నిస్సంక శతక్కొట్టండతో (59 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం 225 పరుగుల భారీ లక్ష్య ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ ఆది నుంచే దూకుడుగా ఆడింది. దినేశ్ చండీమాల్ (37 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కమిందు మెండిస్ (36 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (13 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (18 బంతుల్లో 25; 5 ఫోర్లు) బ్యాట్‌ను పని చెప్పారు. ఫలితంగా క్యాండీ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది. -
52 బంతుల్లో శతక్కొట్టిన లంక ఓపెనర్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మూడో సెంచరీ (టిమ్ సీఫర్ట్, కుశాల్ పెరీరా) నమోదైంది. క్యాండీ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ పథుమ్ నిస్సంక సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక మెరుపు శతకంతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది.52 బంతుల్లోనే శతక్కొట్టిన నిస్సంకనిస్సంక కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొన్న నిస్సంక 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేసి ఔటయ్యాడు. నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించడంతో జాఫ్నా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంక, రొస్సో మినహా చెప్పుకోదగ్గ స్కోర్లు ఎవరూ చేయలేదు. కుశాల్ మెండిస్ 26, అవిష్క ఫెర్నాండో 16, కెప్టెన్ చరిత్ అసలంక 2, అజ్మతుల్లా 1, వనుజ సహన్ 0 పరుగులకే ఔటయ్యారు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో క్యాండీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఆండ్రీ ఫ్లెచర్ (13), మొహమ్మద్ హరీస్ (25) ఔట్ కాగా.. చండీమాల్తో (32 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) పాటు కమిందు మెండిస్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాండీ గెలవాలంటే 48 బంతుల్లో 88 పరుగులు చేయాల్సి ఉంది. -
LPL 2024: డిక్వెల్లా మెరుపు అర్దశతకం.. ఉడాన ఆల్‌రౌండర్ షో
లంక ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా నిన్న (జులై 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో గాలే మార్వెల్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్ట్రయికర్స్పై మార్వెల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మార్వెల్స్ నిర్ణీత ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో స్ట్రయికర్స్ చివరి వరకు పోరాడి (172/9) ఓటమిపాలైంది.డిక్వెల్లా, ఉడాన మెరుపు అర్దశతకాలునిరోషన్ డిక్వెల్లా (18 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇసురు ఉడాన (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మార్వెల్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. స్ట్రయికర్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ (4-0-21-4), బినుర ఫెర్నాండో (4-0-22-3) అద్భుతంగా బౌలింగ్ చేశారు.బంతితోనూ రాణించిన ఉడాన180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. ఉడాన (2/34), తీక్షణ (2/20), అరచ్చిగే (2/21) చెలరేగడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (172/9) నిలిచిపోయింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో దనిత్ వెల్లలగే (45) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. -
శ్రీలంక ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. అయినా పాపం!
లంక ప్రీమియర్-2024లో జఫ్నా కింగ్స్ బోణీ కొట్టింది. బుధవారం పల్లెకెలె వేదికగా దంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జఫ్నా కింగ్స్ ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని జఫ్నా 6 వికెట్లు కోల్పోయి చేధించింది.జఫ్నా బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ అసలంక(50) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. దంబుల్లా బౌలర్లలో తుషారా, రెహ్మాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కుశాల్ సెంచరీ వృథా..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. దంబుల్లా బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ పెరీరా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 52 బంతులు ఎదుర్కొన్న పెరీరా.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు నువనీడు ఫెర్నాండో(40) పరుగులతో రాణించాడు. ఏదేమైనప్పటికి దంబుల్లా ఓటమి పాలవ్వడంతో కుశాల్ సెంచరీ వృథా అయిపోయింది. కాగా ఎల్పీఎల్-2024లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా కుశాల్ పెరీరా నిలిచాడు. -
అలెక్స్ హేల్స్ మెరుపులు
లంక ప్రీమియర్ లీగ్ 2024లో గాలె మార్వెల్స్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రెచ్చిపోయాడు. జాఫ్నా కింగ్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో (47 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. హేల్స్‌తో పాటు నిరోషన్ డిక్వెల్లా (27 బంతుల్లో 47; 8 ఫోర్లు, సిక్స్), జనిత్ లియనాగే (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), జహూర్ ఖాన్ (4-0-24-3), ప్రిటోరియస్ (4-0-23-2), ఉడాన (4-0-60-2) రాణించడంతో మార్వెల్స్ 5 వికెట్ల తేడాతో జాఫ్నాపై విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక (51), అవిష్క ఫెర్నాండో (59), అసలంక (33) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్ చివరి బంతికి విజయం సాధించింది. మార్వెల్స్ గెలుపు చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. సహన్ బౌండరీ బాదాడు. జాఫ్నా బౌలర్లలో అశిత ఫెర్నాండో, ఫేబియన్ అలెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డిసిల్వ ఓ వికెట్ దక్కించుకున్నాడు.రాణించిన వెల్లలగే, షాదాబ్ ఖాన్నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌పై కొలొంబో స్ట్రయికర్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. సమరవిక్రమ (48), తిసార పెరీరా (38), ముహమ్మద్ వసీం (32) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో రజిత, హసరంగ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. షనక, చమీరా, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ.. దునిత్ వెల్లలగే (4/20). షాదాబ్ ఖాన్ (4/22) రెచ్చిపోవడంతో 15.5 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. చండీమల్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
షనక ఊచకోత.. చాప్మన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాండీ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో దంబుల్లా సిక్సర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), చమిందు విక్రమసింఘే (42 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. గుణతిలక 11, కుశాల్ పెరీరా 0, నువనిదు ఫెర్నాండో 4, తౌహిద్ హ్రిదోయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో షనక 3 వికెట్లు పడగొట్టగా.. హస్నైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. దినేశ్ చండీమల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), షనక (15 బంతుల్లో 46 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. షనక సిక్సర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్లో మూడు సిక్సర్లు, బౌండరీ సహా 23 పరుగులు పిండుకున్నాడు. సిక్సర్స్ బౌలర్లలో నువాన్ తుషార, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ, చమిందు విక్రమసింఘే తలో వికెట్ పడగొట్టారు.లీగ్‌లో భాగంగా ఇవాళ (జులై 2) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్, క్యాండీ ఫాల్కన్స్ పోటీపడనున్నాయి. -
నేటి నుంచి (జులై 1) లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభం
టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన రెండు రోజుల్లోనే మరో క్రికెట్ ఫెస్టివల్ మొదలు కానుంది. నేటి నుంచి (జులై 1) శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో శ్రీలంక ఆటగాళ్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (బి-లవ్ క్యాండీ, కొలొంబో స్ట్రయికర్స్, డంబుల్లా సిక్సర్స్, గాలే మార్వెల్స్, జాఫ్నా కింగ్స్) పోటీపడనున్నాయి. 21 రోజుల పాటు జరుగనున్న ఈ లీగ్ జులై 21న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.జట్ల వివరాలు..బి-లవ్ క్యాండీ: ఆషేన్ బండార, పవన్ రత్నాయకే, దిముత్ కరుణరత్నే, అఘా సల్మాన్, చతురంగ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ (కెప్టెన్), రమేశ్ మెండిస్, దినేశ్ చండీమల్, ఆండ్రీ ఫ్లెచర్, మొహమ్మద్ హరీస్, షమ్ము అషన్, దుష్మంత చమీర, మొహమ్మద్ హస్నైన్, కసున్ రజిత, లక్షన్సందకన్, చమత్ గోమెజ్, మొహమ్మద్ అలీ, కవిందు పతిరత్నేకొలొంబో స్ట్రయికర్స్: కవిన్ బండార, ముహమ్మద్ వసీం, గ్లెన్ ఫిలిప్స్, షెవాన్ డేనియల్, నిపున్ ధనుంజయ, షెహాన్ ఫెర్నాండో, తిసార పెరీరా (కెప్టెన్), దునిత్ వెల్లలగే, ఏంజెలో పెరీరా, చమిక కరుణరత్నే, షాదాబ్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సదీర సమరవిక్రమ, బినుర ఫెర్నాండో, అల్లా ఘజన్ఫర్, చమిక గుణశేఖర, మతీశ పతిరణ, గరుక సంకేత్, తస్కిన్ అహ్మద్, ఇసిత విజేసుందరడంబుల్లా స్ట్రయికర్స్: నవిందు ఫెర్నాండో, రీజా హెండ్రిక్స్, తౌహిద్ హ్రిదోయ్, చమిందు విక్రమ సింఘే, దనుష్క గుణతిలక, లహిరు మధుషంక, అషంక మనోజ్, మార్క్ చాప్మన్, ఇబ్రహీం జద్రాన్, సోనల్ దినుష, దుషన్ హేమంత, మొహమ్మద్ నబీ (కెప్టెన్), నిమేశ్ విముక్తి, రనేశ్ సిల్వ, లహీరు ఉడార, కుశాల్ పెరీరా, నువాన్ ప్రదీప్, ప్రవీణ్ జయవిక్రమ, దిల్షన్ మధుషంక, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నువాన్ తుషార, సచిత జయతిలక, అఖిల ధనంజయగాలే మార్వెల్స్: లసిత్ క్రూస్పుల్లే, పసిందు సూరియబండార, సదిష రాజపక్సే, సహాన్ అరచ్చిగే, జనిత్ లియనగే, ధనంజయ లక్షన్, డ్వెయిన్ ప్రిటోరియస్, సీన్ విలియమ్స్, కవిందు నదీషన్, అలెక్స్ హేల్స్, ఇసురు ఉడాన, నిరోషన్ డిక్వెల్లా (కెప్టెన్), భానుక రాజపక్స, టిమ్ సీఫర్ట్, మల్షా తరుపతి, చమిందు విజేసింఘే, లహీరు కుమార, ప్రభాత్ జయసూర్య, ముజీబ్ రెహ్మాన్, జాఫ్రే వాండర్సే, మొహమ్మద్ షిరాజ్, జహూర్ ఖాన్జాఫ్నా కింగ్స్: అవిష్క ఫెర్నాండో, అలెక్స్ రాస్, అహాన్ విక్రమసింఘే, ఫేబియన్ అలెన్, ధణంజయ డిసిల్వ, చరిత్ అసలంక (కెప్టెన్), ఎషాన్ మలింగ, పథుమ్ నిస్సంక, రిలీ రొస్సో, అజ్మతుల్లా ఒమర్జాయ్, విషద్ రండిక, నిషన్ మధుష్క, కుశాల్ మెండిస్, వనుజ సహాన్, లహీరు సమరకూన్, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, అషిత్ ఫెర్నాండో, నిసల తారక, నూర్ అహ్మద్, ప్రమోద్ మధుషన్, తీసన్ వితుషన్, విజయ్‌కాంత్ వియాస్కాంత్, ముర్విన్ అభినాశ్, అరుల్ ప్రగాసమ్ -
లంక ప్రీమియర్ లీగ్ 2023 విజేత బి లవ్ క్యాండీ.. ఫైనల్లో డంబుల్లా చిత్తు
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ విజేతగా బి లవ్ క్యాండీ అవతరించింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో క్యాండీ టీమ్.. డంబుల్లా ఔరాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కెప్టెన్ హసరంగ లేకుండానే ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన క్యాండీ.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి విజేతగా నిలిచింది. తాత్కాలిక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (21 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) టెయిలెండర్ల సాయంతో ఎంతో ఓర్పుగా బ్యాటింగ్ చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు మాథ్యూస్ బంతితోనూ (2-0-11-0) పర్వాలేదనిపించాడు. గాయం కారణంగా చాలాకాలంగా బంతి పట్టని మాథ్యూస్ రెగ్యులర్ కెప్టెన్ హసరంగ గైర్హాజరీలో తప్పనిసరి పరిస్థితుల్లో బౌలింగ్ చేసి మెప్పించాడు. ఫలితంగా అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (10 బంతుల్లో 5), విఫలం కాగా, కుశాల్ మెండిస్ (22), సమరవిక్రమ (36), కుశాల్ పెరీరా (31 నాటౌట్), ధనంజయ డిసిల్వ (40) రాణించారు. క్యాండీ బౌలర్లలో చతురంగ డిసిల్వ 2, నువాన్ ప్రదీప్, మహ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బి లవ్ క్యాండీ మరో బంతి మిగిలుండగా (19.5 ఓవర్లలో) 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (26), కమిందు మెండిస్ (44), దినేశ్ చండీమల్ (24), ఏంజెలో మాథ్యూస్ (25 నాటౌట్), ఆసిఫ్ అలీ (19) రాణించగా.. చతురంగ డిసిల్వ డకౌటయ్యారు. డంబుల్లా బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. బినుర ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నాడు. సిరీస్ ఆధ్యాంతరం అద్భుతంగా రాణించిన క్యాండీ కెప్టెన్ హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో హసరంగ లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 279 పరుగులు), లీడింగ్ వికెట్ టేకర్‌గా (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు), అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా (10 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు) పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. -
హసరంగా ఆల్ రౌండ్ షో.. ఫైనల్లో బీ-లవ్ కాండీ
లంకప్రీమియర్ లీగ్-2023 ఫైనల్లో బీ-లవ్ కాండీ అడుగుపెట్టింది. కొలాంబో వేదికగా గాలే టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో 34 పరుగుల తేడాతో విజయం సాధించిన బీ-లవ్ కాండీ.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బీ-లవ్ కాండీ కెప్టెన్ వనిందు హసరంగా ఆల్‌రౌండ్ షో తో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హసరంగా.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి తమ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కాండీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కాండీ బ్యాటర్లలో హసరంగాతో పాటు చండీమాల్(38) పరుగులతో రాణించాడు. గాలే బౌలర్లలో కుమారా, దినుష్క తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షకీబ్, రజితా ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గాలే.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగల్గింది. గాలే బ్యాటర్లలో లిటన్ దాస్(25), దినుష్క(28) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. కాండీ బౌలర్లలో హసరంగా, హస్నేన్, డి సిల్వా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆదివారం కొలాంబో వేదికగా జరగనున్న ఫైనల్లో దంబుల్లా ఔరాతో కాండీ అమీతుమీ తెల్చుకోనుంది. చదవండి: Asia Cup: హార్దిక్ పాండ్యాకు బిగ్‌షాక్.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ అతడే! -
హరీస్ ఉతుకుడు.. హసరంగ 'ఆరే'సుడు
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో నిన్న (ఆగస్ట్ 17) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ ఘన విజయం సాధించింది. క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగ తన స్పిన్ మాయాజాలంతో జాఫ్నా కింగ్స్‌ను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేశాడు. అంతకుముందు మహ్మద్ హరీస్ బ్యాట్‌తో చెలరేగడంతో క్యాండీ టీమ్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. Highlights from the best bowling figures in LPL history by Wanindu Hasaranga.#LPL2023 #LiveTheAction pic.twitter.com/wkyK1kIzxG — LPL - Lanka Premier League (@LPLT20) August 17, 2023 హరీస్ ఉతుకుడు.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. ఓపెనర్ మహ్మద్ హరీస్ (49 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ చండీమల్ (24 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో హరీస్, చండీమల్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. జాఫ్నా బౌలర్లలో నువాన్ తుషార 4 వికెట్లతో విజృంభించగా.. మహీష్ తీక్షణ, గుణరత్నే తలో 2 వికెట్లు పడగొట్టారు. Highlights from Mohammad Haris' splendid knock.#LPL2023 #LiveTheAction pic.twitter.com/qzWS5uwzsO — LPL - Lanka Premier League (@LPLT20) August 17, 2023 హసరంగ 'ఆరే'సుడు.. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. హసరంగ (3.2-0-9-6) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా క్యాండీ టీమ్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. రేపు (ఆగస్ట్ 19) జరుగబోయే క్వాలిఫయర్-2లో క్యాండీ టీమ్.. గాలే టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. క్యాండీ చేతిలో ఓటమిపాలైన జాఫ్నా లీగ్ నుంచి నిష్క్రమించింది. కాగా, ఈ మ్యాచ్‌లో హసరంగ నమోదు చేసిన గణాంకాలు (6/9) లంక ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. For King Babar, reaching the top was easy. Staying there seems easier! Be part of the LPL playoffs action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/wKS7BGZ0VV — LPL - Lanka Premier League (@LPLT20) August 18, 2023 బ్యాట్‌తోనూ చెలరేగిన హసరంగ.. జాఫ్నాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్ హసరంగ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న హసరంగ 2 భారీ సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ప్రస్తుత LPL సీజన్లో హసరంగ బంతితో పాటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 17 వికెట్లు పడగొట్టడంతో పాటు 8 ఇన్నింగ్స్‌ల్లో 231 పరుగులు చేసి, సీజన్ నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. It comes as no surprise, one of T20 most wanted, Wanindu is back on top! Be part of the LPL playoffs action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/wdZiJKvobN — LPL - Lanka Premier League (@LPLT20) August 18, 2023 ఫైనల్లో డంబుల్లా.. నిన్ననే జరిగిన క్వాలిఫయర్-1లో డంబుల్లా ఔరా.. గాలే టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ కాగా.. డంబుల్లా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ పెరీరా (53) అర్ధసెంచరీతో రాణించి, డంబుల్లాను గెలిపించాడు. -
LPL 2023: చెలరేగిన కుశాల్ పెరీరా.. ఫైనల్లో డంబుల్లా
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 17) జరిగిన క్వాలిఫయర్-1 ఫలితంతో ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మరో బెర్త్ కోసం ఇవాళే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వాలిఫయర్-1 విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌పై డంబుల్లా ఔరా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో లసిత్ ఒక్కడే రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు. షకీబ్ (19), షనక (12), లహీరు సమరకూన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. డంబుల్లా బౌలర్లలో హేడెన్ కెర్ 3, నూర్ అహ్మద్ 2, ఫెర్నాండో, హసన్ అలీ, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కుశాల్ పెరీరా (53), కుశాల్ మెండిస్ (49) రాణించగా.. అవిష్క షెర్నాండో (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టైటాన్స్ బౌలర్లలో షకీబ్, ప్రసన్న, షంషి, షనక తలో వికెట్ పడగొట్టారు. -
షంషి మాయాజాలం.. ఇంటిదారి పట్టిన బాబర్ ఆజమ్ జట్టు
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా కొలొంబో స్ట్రయికర్స్‌తో నిన్న (ఆగస్ట్ 15) జరిగిన మ్యాచ్‌లో గాలే టైటాన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఓడిన కొలంబో జట్టు ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. గాలే స్పిన్నర్లు తబ్రేజ్ షంషి (4-0-20-4), సీక్కుగ్గే ప్రసన్న (3-0-14-3), షకీబ్ అల్ హసన్ (3.4-0-8-1) ధాటికి 15.4 ఓవర్లలో 74 పరుగులకు చాపచుట్టేసింది. గాలే స్పిన్ త్రయానికి పేసర్ లహీరు కుమార (2-1-9-2) తోడవ్వడంతో కొలొంబో ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. Colombo fail to ‘strike’ as the Titans bundle them out for 74, their lowest total!#LPL2023 #LiveTheAction pic.twitter.com/JdkUZ6pL0W — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 కొలంబో ఇన్నింగ్స్‌లో నువనిదు ఫెర్నాండో (14) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లహీరు ఉదాన (14), నిపున్ ధనంజయ (13), మహ్మద్ నవాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (2), స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (5), కరుణరత్నే (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. షోరిఫుల్ ఇస్లాం, వాండర్సే ఖాతా కూడా తెరవలేకపోయారు. Galle Titans finish second on the points table with this win, ease into the playoffs!#LPL2023 #LiveTheAction pic.twitter.com/u6vxWRW0cd — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే టైటాన్స్.. ఓపెనర్ లసిత్ క్రూస్పుల్లే (42 నాటౌట్), షకీబ్ (17 నాటౌట్) రాణించడంతో కేవలం 8.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. తద్వారా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గాలే ఇన్నింగ్స్‌లో భానుక రాజపక్ష (6), లిటన్ దాస్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా..వీరి వికెట్లు ఇఫ్తికార్ అహ్మద్‌కు, జెఫ్రీ వాండర్సేకు దక్కాయి. Dasun’s men gave no quarter as they demolished a strong Colombo side! Be part of the action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/RCOtOmLeSu — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 ఈ గెలుపుతో గాలే దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరగా.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన కొలొంబో ఇంటిదారి పట్టింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన దంబుల్లా ఔరా టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు కాగా.. గాలే టైటాన్స్ రెండో స్థానంలో, బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ 3, 4 స్థానాల్లో నిలిచాయి. గాలే-కొలొంబో మ్యాచ్‌తో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా.. ఆగస్ట్ 17 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలవుతాయి. Shamsi’s spin left the Strikers in ruins! Be part of the action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIrFVZ#LPL2023 #LiveTheAction pic.twitter.com/PnY9IvXFNA — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 We’re into the playoffs, and four of the season’s best performers will lock horns!#LPL2023 #LiveTheAction pic.twitter.com/2fRO8uUUUf — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 ఆగస్ట్ 17: దంబుల్లా వర్సెస్ గాలే (క్వాలిఫయర్ 1) బి లవ్ క్యాండీ వర్సెస్ జాఫ్నా కింగ్స్ (ఎలిమినేటర్) ఆగస్ట్ 19: క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు (క్వాలిఫయర్ 2) ఆగస్ట్ 20: క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు వర్సెస్ క్వాలిఫయర్ 2లో గెలిచిన జట్టు (ఫైనల్) -
తుస్సుమన్న విధ్వంసకర ప్లేయర్లు.. రాణించిన టిమ్ సీఫర్ట్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్‌లో గాలే టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిర్ణీత 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. టైటాన్స్ బౌలర్లు కసున్ రజిత (4-0-20-4), లహీరు కుమార (4-1-13-2), తబ్రేజ్ షంషి (4-0-19-2), షకీబ్ అల్ హసన్ (4-0-13-1) ధాటికి జాఫ్నా విధ్వంసకర బ్యాటర్లంతా తేలిపోయారు. The three-time LPL champions are bundled out for 89!#LPL2023 #LiveTheAction pic.twitter.com/0VyIVmdp3c — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 రహ్మానుల్లా గుర్బాజ్ (0), క్రిస్ లిన్ (4), షోయబ్ మాలిక్ (0), డేవిడ్ మిల్లర్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జాప్నా ఇన్నింగ్స్‌లో దునిత్ వెల్లలగే (22), తిసార పెరీరా (13), తక్షణ (13 నాటౌట్), మధుశంక (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. There’s no stopping a true champ! It’s a Seifert-masterclass!#LPL2023 #LiveTheAction pic.twitter.com/PRP2Y8UMdy — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైటాన్స్.. 13.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో రాణించగా.. భానుక రాజపక్ష 15, చాడ్ బోవ్స్ 13, షకీబ్ 2, షకన 2 పరుగులు చేశారు. జాఫ్నా బౌలర్లలో మధుశంక, తీక్షణ, షోయబ్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. They held nothing back. The Titans crush the defending champs!#LPL2023 #LiveTheAction pic.twitter.com/8inlxnSZyT — LPL - Lanka Premier League (@LPLT20) August 13, 2023 -
లంక ప్రీమియర్ లీగ్‌లో మరోసారి పాము కలకలం.. తృటిలో తప్పించుకున్న ఉదాన
లంక ప్రీమియర్ లీగ్-2023లో మరోసారి పాము కలకలం రేపింది. లీగ్‌లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన పాము.. నిన్న (ఆగస్ట్ 12) కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, బి లవ్ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్చల్ చేసింది. Lucky escape for @IAmIsuru17 from the RPS snake #LPL2023 🐍🇱🇰🏏 pic.twitter.com/OnYokQxzvW — Azzam Ameen (@AzzamAmeen) August 13, 2023 మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్ 18వ ఓవర్) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్ ప్రదీప్ బౌలింగ్ చేసే ముందు ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్ అడ్జస్ట్మెంట్లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. All these snakes showing up in anticipation of a Naagin dance celebration? 🐍 #LPL2023 #LPLOnFanCode pic.twitter.com/quKUACGr9u — FanCode (@FanCode) August 13, 2023 ఇదిలా ఉంటే, బి లవ్ క్యాండీ-జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (51 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. ఫకర్ జామన్ (22), ఏంజెలో మాథ్యూస్ (22) ఓ మోస్తరు పరుగులు చేశారు. LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023 — Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023 జాఫ్నా బౌలర్లలో తషార 3, వెల్లలగే, మధుశంక తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జాఫ్నాను షోయబ్ మాలిక్ (55), తిసార పెరీరా (36), క్రిస్ లిన్ (27), డేవిడ్ మిల్లర్ (24) గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాండీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 3, నువాన్ ప్రదీప్ 2, ఇసురు ఉదాన ఓ వికెట్ పడగొట్టారు. -
వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీసిన హసరంగ.. బ్యాట్‌తో విధ్వంసం, బంతితో మ్యాజిక్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆగస్ట్ 5న జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (4-0-9-3, 22 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టిన హసరంగ.. ఇవాళ (ఆగస్ట్ 8) గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రెచ్చిపోయాడు. Into the halfway mark with the Titans on 58 for 6!#LPL2023 #LiveTheAction pic.twitter.com/I3WiwI0oiP — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 తొలుత బ్యాట్‌తో విధ్వంసం (27 బంతుల్లో 64; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సృష్టించిన హసరంగ.. ఆతర్వాత బంతితో (3.4-0-17-4) తనదైన స్టయిల్లో మ్యాజిక్ చేశాడు. హసరంగ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీయడంతో గాలేపై క్యాండీ 89 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. World-class Wanindu welcomes 200 T20 wickets!#LPL2023 #LiveTheAction pic.twitter.com/E920VBNQa8 — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. హసరంగ, ఫకర్ జమాన్ (35 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), చండీమల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మహ్మద్ హరీస్ (14 బంతుల్లో 17; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. గాలే బౌలర్లలో లహిరు సమరకూన్ 2 వికెట్లు పడగొట్టగా.. కసున్ రజిత, నగరవ, షంషి తలో వికెట్ దక్కించుకున్నారు. B-Love Kandy treats their home crowd to the season’s first 200 total!#LPL2023 #LiveTheAction pic.twitter.com/8uc4aEQuws — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే.. హసరంగ, నువాన్ ప్రదీప్ (3-0-21-3), ముజీబ్ (4-0-26-2), దుష్మంత చమీర (3-0-17-1) ధాటికి 16.4 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. గాలే ఇన్నింగ్స్‌లో లహిరు సమరకూన్ (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లసిత్ క్రూస్పుల్లే (27), అషాన్ ప్రియజన్ (25), షకీబ్ అల్ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
బాబర్ అంటే ప్రేమ.. అతడిని పెళ్లి చేసుకోవాలని కోరిక: రమీజ్ రాజా
Ramiz Raja bizarre comment on Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా బాబర్ ఆజంను ఉద్దేశించి వింత వ్యాఖ్యలు చేశాడు. బాబర్ బ్యాటింగ్ మెరుపుల నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ కాస్త అతిగా స్పందించాడు. కాగా లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం. యూనివర్సల్ బాస్ తర్వాత గాలే టైటాన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా సుడిగాలి శతకం బాది రికార్డులకెక్కాడు. 59 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో భాగంగా 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి.. టీ20 ఫార్మాట్లో మొత్తంగా 10 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అతడంటే ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని ఉంది ఈ క్రమంలో బాబర్ ఆజం తుపాన్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ.. ‘‘అద్బుతం.. క్లాస్.. క్వాలిటీ ఫిఫ్టీ. జట్టును ఆదుకునే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతడంటే నాకు పిచ్చి ప్రేమ. అతడి పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో ఉండిపోయింది’’ అంటూ కామెంటేటర్ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు బాబర్‌ను ఉద్దేశించి ఈ మాజీ బ్యాటర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు ‘గే’ అంటూ విపరీతపు కామెంట్లతో రమీజ్ రాజాను ట్రోల్ చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్ అభిమానులు మాత్రం.. తన శిష్యుడిపై ప్రేమతో ఇలా స్పందించాడే తప్ప.. ఇందులోనూ విపరీతార్థాలు వెదకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంతోషంగా ఉంది ఇదిలా ఉంటే.. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడటం సంతోషంగా ఉందన్న బాబర్ ఆజం.. లీగ్ మ్యాచ్‌లతో పాటు రానున్న ప్రతి సిరీస్ రానున్న ఐసీసీ ఈవెంట్లకు తమకు సన్నాహకంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ప్రస్తుతం తన దృష్టి మొత్తం లంక ప్రీమియర్ లీగ్ మీదే ఉందని చెప్పుకొచ్చాడు. చదవండి: టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. 'I absolutely love him, want to marry him' - Former PCB chairman Ramiz Raja re Babar Azam ♥️#LPL2023 #LPLT20 pic.twitter.com/4uQwXVz4vR — Farid Khan (@_FaridKhan) August 8, 2023 -
షోయాబ్ మాలిక్ విధ్వంసం.. 6 సిక్స్‌లు, 5 ఫోర్లతో! అయినా పాపం..
లంక ప్రీమియర్ లీగ్-2023లో దంబుల్లా ఆరా వరుసగా రెండో విజయం సాధిచింది. పల్లెకెలె వేదికగా జాఫ్నా కింగ్స్ తో జరిగిన స్కోరింగ్ థ్రిల్లర్‌లో 9 పరుగుల తేడాతో దంబుల్లా విజయం సాధించింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్ షోయాబ్ మాలిక్ ఆఖరి వరకు పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జాఫ్నా కింగ్స్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులొకి వచ్చిన మాలిక్.. అచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ.. మాలిక్ మాత్రం పట్టుదలో క్రీజులో నిలిచాడు. 14 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన మాలిక్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవరాల్‌గా 53 బంతులు ఎదుర్కొన్న మాలిక్.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. లక్ష్య ఛేదనలో జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. దంబుల్లా బ్యాటర్లలో కుశాల్ పెరీరా(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫ్నా కింగ్స్ బౌలర్లలో మాలిక్, తుషారా తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో మూడో టీ20.. కిషన్‌పై వేటు! యువ సంచలనం ఎంట్రీ! అతడికి ఆఖరి ఛాన్స్ -
లంక ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పొట్టి క్రికెట్లో (అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లు) అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 10 శతకాలు బాదిన రెండో బ్యాటర్ రికార్డుల్లోకెక్కాడు. Maiden LPL century for Babar Azam 👏 📸: Fan Code pic.twitter.com/S0KaiJmuAh — CricTracker (@Cricketracker) August 7, 2023 బాబర్‌కు ముందు విధ్వంకర వీరుడు, విండీస్ యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. గేల్ తన 463 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో ఏకంగా 22 శతకాలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2005 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్‌ల్లో పాల్గొన్న గేల్ 22 సెంచరీలతో పాటు 88 హాఫ్‌సెంచరీలు బాది 14562 పరుగులు చేశాడు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఇందులో గేల్ 2013 ఐపీఎల్లో పూణే వారియర్స్‌పై చేసిన 175 నాటౌట్ (66 బంతుల్లో) అత్యధికంగా ఉంది. గేల్ తర్వాతి స్థానంలో ఉన్న బాబర్ 2012 నుంచి నేటి వరకు 264 టీ20లు ఆడి 10 సెంచరీలు 77 హాఫ్ సెంచరీల సాయంతో 9412 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, బాబర్‌ల తర్వాత క్లింగర్ (206 మ్యాచ్‌ల్లో 5960 పరుగులు, 8 సెంచరీలు), డేవిడ్ వార్నర్ (11695 పరుగులు, 8 సెంచరీలు), విరాట్ కోహ్లి (11965, 8), ఆరోన్ ఫించ్ (11392, 8) తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు. Meet the duo with over ten or more centuries each in T20s🥶 pic.twitter.com/Wnkl8cn2SV — CricTracker (@Cricketracker) August 7, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
బాబర్ ఆజమ్ విశ్వరూపం.. సుడిగాలి శతకంతో విధ్వంసం
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Colombo Strikers win the last over thriller in Pallekele. Babar Azam leads the batting side with a sensational century. pic.twitter.com/sM8bkYU1jT — CricTracker (@Cricketracker) August 7, 2023 ఆఖరి ఓవర్లో వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో బాబర్ (104) ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మహ్మద్ నవాజ్ 4 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి కొలంబోను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బాబర్‌కు జతగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన పథుమ్ నిస్సంక (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో రాణించగా.. నువనిదు ఫెర్నాండో (8) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. నవాజ్‌తో పాటు చమిక కరుణరత్నే (2) అజేయంగా నిలిచారు. ఆఖరి ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాది నవాజ్ కొలొంబోను గెలిపించాడు. గాలే బౌలర్లలో తబ్రేజ్ షంషి 2, కసున్ రజిత ఓ వికెట్ పడగొట్టారు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలే టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (19 బంతుల్లో 36; 4 ఫోర్లు,2 సిక్సర్లు), షెవాన్ డేనియల్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), భానుక రాజపక్స (31 బంతుల్లో 30; 2 ఫోర్లు), టిమ్ సీఫర్ట్ (35 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, రమేశ్ మెండిస్, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన బాబర్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
శ్రీలంక స్టార్ ఆటగాడు విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
లంక ప్రీమియర్ లీగ్-2023లో బి లవ్ క్యాండీ జట్టు రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బి లవ్ క్యాండీ ఘన విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ.. కేవలం 13 ఓవర్లలోనే ఊదిపడేసింది. హసరంగా ఆల్ రౌండ్ షో.. ఈ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి జాఫ్నా కింగ్స్ పతనాన్ని శాసించిన హసరంగా.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ము రేపాడు. కేవలం 21 బంతుల్లోనే హసరంగా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వనిందు నిలిచాడు. ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కొన్న హసరంగా.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగుల చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఫఖర్ జమాన్(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 117 పరుగులు మాత్రమే చేయగల్గింది. క్యాండీ బౌలర్లలో హసరంగాతో పాటు ప్రదీప్ మూడు వికెట్లు పడగొట్టి జాఫ్నాను దెబ్బతీశాడు. జాఫ్నా బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే(38) పరుగలతో ఒంటరి పోరాటం చేశాడు. చదవండి: Asia cup 2023: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు! -
8 సిక్సర్లతో వీరవిహారం చేసిన లంక బ్యాటర్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా కొలొంబో స్ట్రయికర్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో దంబుల్లా ఔరా కెప్టెన్ కుశాల్ మెండిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదిన మెండిస్ వీరవిహారం చేశాడు. మరో ఎండ్‌లో సమరవిక్రమ (35 బంతుల్లో 59; 7 ఫోర్లు, సిక్స్) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. Mendis left a strong bowling attack in disarray to secure 87 off 46!#LPL2023 #LiveTheAction pic.twitter.com/Wihg7wUCr8 — LPL - Lanka Premier League (@LPLT20) August 5, 2023 డంబుల్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా మరెవ్వరూ రాణించలేదు. అవిష్క ఫెర్నాండో (12), కుశాల్ పెరీరా (2), అలెక్స్ రాస్ (4), హేడెన్ కెర్ (0) నిరాశపరిచారు. కొలొంబో బౌలర్లలో మతీష పతిరణ 3 వికెట్లతో విజృంభించగా.. నసీం షా (2/21) పర్వాలేదనిపించాడు. కరుణరత్నే భారీగా పరుగులు సమర్పించుకుని (4-0-55-1) ఓ వికెట్ పడగొట్టాడు. Magic from Mendis and Samarawickrama leave Colombo Strikers with the highest total of LPL season 4 to chase!#LPL2023 #LiveTheAction pic.twitter.com/k4Kuvxd1c7 — LPL - Lanka Premier League (@LPLT20) August 5, 2023 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో.. 9.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఈ సమయంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో మ్యాచ్‌ను కాసేపు ఆపేశారు. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (8 బంతుల్లో 16; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 41; 7 ఫోర్లు) భారీ స్కోర్లు చేయకుండానే ఔటయ్యారు. డిక్వెల్లా వికెట్ ధనంజయ డిసిల్వ పడగొట్టగా.. బాబర్ ఆజమ్ వికెట్‌ను నూర్ అహ్మద్ దక్కించుకున్నాడు. పథుమ్ నిస్సంక (20), నువనిదు ఫెర్నాండో (4) క్రీజ్‌లో ఉన్నారు. A world-class batter lets his bat do the talking!#LPL2023 #LiveTheAction pic.twitter.com/MFaaccJRlJ — LPL - Lanka Premier League (@LPLT20) August 5, 2023 ఇదిలా ఉంటే, ఈ లీగ్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి జాఫ్నా కింగ్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత గాలే టైటాన్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), దంబుల్లా ఔరా (3 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), కొలొంబో స్ట్రయికర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), బి లవ్ క్యాండీ (3 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం) వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. -
రాణించిన చండీమల్.. కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి..!
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ తొలి విజయం సాధించింది. దంబుల్లా ఔరాతో ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దినేశ్ చండీమల్ (48; 7 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో ఏంజెలో మాథ్యూస్ (28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడి క్యాండీని విజయతీరాలకు చేర్చాడు. మాథ్యూస్‌కు ఆసిఫ్ అలీ (16 నాటౌట్; 3 ఫోర్లు) సహకరించాడు. క్యాండీ టీమ్ కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి మ్యాచ్ గెలవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా.. ధనంజయ డిసిల్వ (61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో (32; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-17-2), ఉడాన (4-0-33-2) రాణించారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చండీమల్, ఏంజెలో మాథ్యూస్‌తో పాటు ఫకర్ జమాన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డంబుల్లా బౌలర్లలో ధనంజయ, హేడెన్ కెర్లకు తలో వికెట్ దక్కింది. -
మ్యాచ్ మధ్యలో పాము కలకలం.. ఉలిక్కిపడిన క్రికెటర్లు! వీడియో వైరల్
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కొలంబో వేదికగా గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఓ అనుకోని అతిథి వచ్చింది. దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాము మైదానంలోకి ప్రవేశించింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. ఇంతలోనే పాము మైదానంలోకి వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు. ఒక్క సారిగా ఆటగాళ్లు పామును చూసి ఉలిక్కిపడ్డారు. అంపైర్లు వెంటనే స్టేడియం భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. పామును పట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో 10 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ ఓవర్లో దంబుల్లాపై గాలే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గాలే బ్యాటర్లలో భానుక రాజపక్స (48), కెప్టెన్ దాసున్ షనక (42 నాటౌట్) రాణించారు. అనంతరం లో దంబుల్లా కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులే చేసింది. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గాలె టైటాన్స్ కేవలం రెండు బంతుల్లోనే 11 పరుగులు చేసి విజయం సాధించింది. సూపర్ ఓవర్లో గాలె ఓపెనర్ రాజపాక్స వరుసగా సిక్స్ ఫోర్ బాది తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు Hello, stranger. Where is your accreditation card? 🐍 Even the Sri Lankan wildlife can't resist the action at the LPL! 🏏#LPL2023 #LiveTheAction pic.twitter.com/R9Fa5k1D3p — LPL - Lanka Premier League (@LPLT20) July 31, 2023 -
తుస్సుమన్న బాబర్ ఆజమ్.. తిప్పేసిన అనామక బౌలర్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ నిన్న (జులై 30) ప్రారంభమైంది. కొలొంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. తౌహిద్ హ్రిదోయ్ (39 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. A few moments from the opening ceremony earlier this evening.#LPL2023 #LiveTheAction pic.twitter.com/QlczC1FX4Y — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 నిషాన్ మధుష్క (12), గుర్భాజ్ (21), అసలంక (12), ప్రియమల్ పెరీర (22) రెండంకెల స్కోర్లు చేసినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఖర్లో దునిత్ వెల్లలగే (25 నాటౌట్), కెప్టెన్ తిసార పెరీరా (14 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో జాఫ్నా కింగ్స్ ఓ మోస్తరు స్కోర్‌ను ప్రత్యర్ధి ముందు ఉంచగలిగింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, మతీష పతిరణ, చమిక కరుణరత్నే, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. As promised, a spectacular opening ceremony and one to remember for a long time! Here are a few clicks. #LPL2023 #LiveTheAction pic.twitter.com/sY3FsYdQ6k — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 The young star from Bangladesh took on a powerful bowling attack like a boss, and constructed a spirited half century! #LPL2023 #LiveTheAction pic.twitter.com/kHiAwvwTWF — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తిప్పేసిన అనామక బౌలర్.. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొలొంబో.. జాఫ్నా బౌలర్, అనామక కుర్రాడు విజయకాంత్ వియాస్కాంత్ (4-0-17-2) మాయాజాలం ధాటికి 19.4 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. విజయకాంత్‌తో పాటు హర్దుస్ విల్జోయెన్ (3/31), దిల్షన్ మధుషంక (2/18), తిసార పెరీరా (1/29) రాణించడంతో కొలొంబో టీమ్ ఓ మోస్తరు స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. Jaffna Kings stars shine bright with the ball! #LPL2023 #LiveTheAction pic.twitter.com/mxfUmeGa0T — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తుస్సుమన్న బాబర్ ఆజమ్.. జాఫ్నాతో పోలిస్తే చాలా రెట్టు పటిష్టమైన కొలొంబో స్ట్రయికర్స్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కెప్టెన్ నిరోషన్ డిక్వెల్లా (34 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) ఒక్కడు అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తుస్సుమన్నాడు. తిసార పెరీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన అనంతరం బాబర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన నిస్సంక (1), ఫెర్నాండో (17), మహ్మద్ నవాజ్ (3), యశోధ లంక (11), నసీం షా (0), పతిరణ (8) నిరాశపరచగా.. తమిక కరుణరత్నే (23) పర్వాలేదనిపించాడు. Dickwella came back with a bang this season and showcased his batting prowess! He was a one-man army!#LPL2023 #LiveTheAction pic.twitter.com/rcfL5IeJir — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్‌లోని (జిమ్-ఆఫ్రో టీ10 లీగ్) హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంజూ బాబా.. తాజాగా లంక ప్రీమియర్ లీగ్‌లోని (శ్రీలంక టీ20 లీగ్) బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. I, along with my brothers Omar Khan (OK) and H.H. Sheikh Marwan Bin Mohammed Bin Rashid Al Maktoum, are excited to announce that we have acquired the B-Love Kandy Cricket Team for the Lanka Premier League T20 2023. pic.twitter.com/ksMauYsHbH — Sanjay Dutt (@duttsanjay) June 25, 2023 తనతో పాటు ఒమర్ ఖాన్, షేక్ మర్వాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కలిసి బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ బాబా ప్రకటించాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ బరిలో బి-లవ్ క్యాండీ బరిలో నిలువనున్నట్లు తెలిపాడు. కాగా, లంక ప్రీమియర్ లీగ్ 2023 జులై 30 నుంచి ఆగస్ట్ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20 నుంచి 29 వరకు జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్) పాల్గొంటాయి. ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్‌తో కలిసి సంజూ ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. -
మర్చిపోయారా? లేక తొలగించారా? కన్ఫ్యూజ్ చేస్తున్న రైనా..!
-
ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?
శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2023) చరిత్రలో తొలిసారి వేలం జరిగింది. జూన్ 14న(బుధవారం) ఎల్పీఎల్లో వేలం నిర్వహించారు. మొత్తం 360 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో భారత్ తరపున రిజిస్టర్ చేసుకుంది కేవలం సురేశ్ రైనా మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం.. ఐపీఎల్లో కూడా ఏ జట్టు తరపున ఆడకపోవడంతో రైనాకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో మంచి ధర పలుకుతుందని అభిమానులు ఊహించారు. ఒక దశలో సురేశ్ రైనా పేరును లంక క్రికెట్ బోర్డు ఎల్‌పీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ వేలం సమయానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వేలం జరుగుతున్న సమయంలో సురేశ్ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అన్‌సోల్డ్ లిస్ట్‌లో ఉన్నాడా అంటే అది లేదు. మరి రైనా పేరు ఏమైనట్లు అని అభిమానులు కన్ఫూజ్కు గురయ్యారు. అయితే విషయమేంటంటే వేలంలో హోస్ట్‌గా వ్యవహరించిన చారుశర్మ సురేశ్ రైనా పేరును మరిచిపోయాడా లేక కావాలనే పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అటు రైనా కానీ ఇటు లంక క్రికెట్ బోర్డు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడతాడా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైనా తన బేస్‌ప్రైస్ ధరతో సెట్ నెంబర్ 11లో ఉన్నాడు. ఇదే సెట్లో రాసీ వాండర్ డుసెన్(సౌతాఫ్రికా), ఇమాముల్ హక్(పాకిస్తాన్), ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) వంటి స్టార్లు ఉన్నారు. వీరిందరి పేర్లను పలికిన చారు శర్మ రైనా పేరు పలకడం మాత్రం మరిచిపోయాడు. అయితే ఇదే అభిమానులను కన్ఫూజ్న్కు గురయ్యేలా చేసింది. నిజంగా చారుశర్మ రైనా పేరును పలకడం మరిచిపోయారా.. లేదంటే చివరి నిమిషంలో రైనా పేరును వేలంలో తొలగించారా అనేది క్లారిటీ లేదు. టి20 క్రికెట్లో సురేశ్ రైనాకు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా పేరు పొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. అంతేకాదు టీమిండియా తరపున 78 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1609 పరుగులు చేసిన రైనా ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. మరి ఇంతటి ట్రాక్ రికార్డు కలిగిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేవరకు రైనా ఎల్పీఎల్ ఆడతాడా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే రైనా ఎల్పీఎల్లో ఆడనట్లే. ఇక ఎల్పీఎల్లో ఈసారి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నాడు. కొలంబో స్ట్రైకర్స్‌కు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక నిన్నటి వేలంలో దిల్షాన్ మధుషనక అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. మధుషనకను లైకా జఫ్నా కింగ్స్ 92వేల డాలర్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో చరిత్ అసలంక 80వేల డాలర్లకు(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు) జఫ్నా కింగ్స్.. మూడో స్థానంలో ధనుంజయ డిసిల్వా(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు)ను దంబుల్లా ఆరా 76వేల డాలర్లకు కొనుగోలు చేసింది. చదవండి: ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. అందరి దృష్టి ఆ క్రికెటర్‌పైనే -
ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్‌పైనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంత కాకపోయినా లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) కూడా బాగానే ప్రజాధరణ పొందుతుంది. గత సీజన్ ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు ఐపీఎల్ మినహా మిగతా లీగ్‌ల్లో ఆడేందుకు సముఖత చూపని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇప్పుడు బయటి లీగుల్లోనూ దర్శనమిస్తున్నారు. తాజాగా 2023 సీజన్‌కు సంబంధించి జూన్ 14న(బుధవారం) లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి వేలం జరగనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ వేలానికి 500 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననుండగా.. ఐపీఎల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ అమలు చేయనున్నారు. మొత్తం ఆటగాళ్ల కోసం 5లక్షల అమెరికన్ డాలర్డు ఖర్చు చేయనున్నారు. ఇక తొలిసారి జరగనున్న వేలానికి చారు శర్మ హోస్ట్‌గా వ్యవహరించనుండడం విశేషం. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పొందిన రైనాకు మంచి ధర పలికే అవకాశం ఉంది. 50వేల యూఎస్ డాలర్ల కనీస ధరతో రైనా వేలంలోకి రానున్నాడు. సెప్టెంబర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ఆ తర్వాత 2023లో అబుదాబి టి10 టోర్నీలో పాల్గొన్నాడు. అయితే వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ప్లేయర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారిలో బాబర్ ఆజం, షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ► కొలంబో స్ట్రైకర్స్: బాబర్ ఆజం, మతీషా పతిరనా, నసీమ్ షా, చమికా కరుణరత్నే ► దంబుల్లా ఆరా: మాథ్యూ వేడ్, కుసల్ మెండిస్, లుంగి ఎన్గిడి, అవిష్క ఫెర్నాండో ► జాఫ్నా కింగ్స్: మహేశ్ తీక్షణ, డేవిడ్ మిల్లర్, తిసర పెరీరా, రహ్మానుల్లా గుర్బాజ్ ► క్యాండీ ఫాల్కన్స్: వనిందు హసరంగా, ఏంజెలో మాథ్యూస్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫఖర్ జమాన్ ► గాలే గ్లాడియేటర్స్: భానుక రాజపక్స, దసున్ షనక, షకీబ్ అల్ హసన్, తబ్రైజ్ షమ్సీ ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతం కాగా నాలుగో సీజన్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ జరగనుంది. Charu Sharma thrilled to be auctioneer for LPL 2023, the league's first ever auction! 🏏🔨https://t.co/xu1EFeab3C #lpl2023 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 12, 2023 చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే?
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా లంక ప్రీమియర్ లీగ్-2023లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రాబోయే ఎడిషన్ కోసం జూన్ 14న వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో సురేష్ రైనా తన పేరును నమోదు చేసుకున్నాడు. అతడు తన బేస్‌ప్రైస్ 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు)గా నిర్ణయించినట్లు సమాచారం. ఇక గతేడాది సెప్టెంబర్‌లో అన్నిరకాల క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రైనా విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అబుదాబి టీ10 లీగ్-2022లో డెక్కన్ గ్లాడియేటర్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను ఈ మిస్టర్ ఐపీఎల్ అలరించనున్నాడు. ఇక ఈ ఏడాది ఎల్పీఎల్ జూలై 30 నుంచి ఆగస్టు 20వరకు జరగనుంది. కాగా లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించబోతున్నారు. మొదటి మూడు సీజన్లలో ప్లేయర్లను నేరుగా డ్రాఫ్ట్ రూపంలో ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది వేలంలో 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్, ఆసీస్ క్రికెటర్ మాథ్యూవేడ్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. అయితే ఇప్పటివరకు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఒకే ఒక్క భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే. ఒక వేళ రైనాను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే ఈ లీగ్‌లో భాగమైన రెండో ఆటగాడిగా రైనా నిలుస్తాడు. చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
ఫిక్సింగ్ కలకలం.. విండీస్ క్రికెటర్‌పై వేటు
వెస్టిండీస్ వికెట్‌కీపర్, బ్యాటర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ సస్సెన్షన్ వేటు వేసింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే యూఏఈ, కరీబియన్ లీగ్‌ల్లో బుకీలు కలిసిన విషయాన్ని దాచిపెట్టాడని, వీటిపై విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొంది. థామస్‌పై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని.. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) యొక్క అవినీతి నిరోధక కోడ్ల ప్రకారం అతనిపై ఏడు అభియోగాలు మోపినట్లు వెల్లడించింది. కాగా, డెవాన్ థామస్ గతేడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను విండీస్ తరఫున ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023 QF 1: సీఎస్కే-గుజరాత్ మ్యాచ్‌పై అనుమానాలు.. ఫిక్స్ అయ్యిందా..? -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ధోని శిష్యుడు ఒకే టీమ్‌లో..!
లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ (2023)కు సంబంధించి, లీగ్‌లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్ (లోకల్, ఓవర్సీస్), ప్లాటినం (లోకల్, ఓవర్సీస్) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌కు నిర్ధేశిత తేదీ జూన్ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది. ఎల్పీఎల్లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్.. తమ ఐకాన్ ప్లేయర్‌గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను, మిగతా సభ్యులుగా పాక్ స్పీడ్‌స్టర్ నసీం షా, లోకల్ టీ20 స్టార్ చమిక కరుణరత్నే, ఐపీఎల్-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్.. బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్‌ను.. క్యాండీ ఫాల్కన్స్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను.. జాఫ్నా కింగ్స్ డేవిడ్ మిల్లర్‌ను తమ ఓవర్సీస్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి. ఎల్పీఎల్-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చదవండి: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల -
లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం..
India vs Sri Lanka, 2nd ODI- Nuwanidu Fernando: శ్రీలంక యువ ఆటగాడు నువానీడు ఫెర్నాండో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగతున్న వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. అర్ధ శతకంతో అందరిని ఆకట్టుకున్నాడు. వెన్ను నొప్పి కారణంగా పాతుమ్ నిసాంక దూరం కావడంతో అతడి స్థానంలో నువానీడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన ఫెర్నాండో దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 బౌండరీలు ఉన్నాయి. కాగా వన్డే డెబ్యు మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆరో శ్రీలంక బ్యాటర్‌గా నువానీడు రికార్డులకెక్కాడు. ఇక తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫెర్నాండో గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ నువానీడు ఫెర్నాండో? ఫెర్నాండో అక్టోబర్ 13, 1999న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. అతడు 2016లో కోలంబో తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అదే విధంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న ఫెర్నాండోకు 2018 అండర్-19 ప్రపంచకప్ శ్రీలంక జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన 132 పరుగులతో రాణించాడు. అనంతరం 2019లో లిస్ట్-ఏ క్రికెట్లోకి నువానీడు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 31 మ్యాచ్‌లు ఆడిన అతడు 1771 పరుగులు సాధించాడు. అదే విధంగా 23 లిస్ట్-ఏ క్రికెట్లో 748 పరుగులు, 34 టీ20ల్లో 760 పరుగులు చేశాడు. కాగా లంక సీనియర్ పేసర్ విశ్వ ఫెర్నాండో సోదరుడే ఈ నువానీడు ఫెర్నాండో కావడం విశేషం. లంక ప్రీమియర్ లీగ్‌లో అదుర్స్ గతేడాది ఆఖరిలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్‌లో ఫెర్నాండో అదరగొట్టాడు. గాలే గ్లాడియేటర్స్ తరపున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డేలకు శ్రీలంక జట్టులో ఫెర్నాండోకు చోటు దక్కింది. చదవండి: Prithvi Shaw: నాకు తల పొగరా? హర్ట్ అయ్యాను! పర్లేదు.. పంత్ స్థానంలో నువ్వే! జై షా ట్వీట్ వైరల్ -
పాకిస్తాన్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. మ్యాచ్ మధ్యలోనే ఆసుపత్రికి!
శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు వరుస పెట్టి గాయాల బారినపడుతున్నారు. శ్రీలంక చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకున్న ఘటన మరవక ముందే.. మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ యువ ఆటగాడు ఆజాం ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌కు ఆజాం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్.. మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ఆజాం ఖాన్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచానా వేయడంలో అజం విఫలమవ్వడంతో.. అది నేరుగా అతడి తలకి తాకింది. దీంతో నేలపై పడుకుని అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజెయో వచ్చి అతడిని పరిశీలించాడు. అతడిని స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. అతడిని ఆసుపత్రికి తరలించిన వెంటనే స్కానింగ్ చేశారు. స్కాన్ రిపోర్టులు పరిశీలించిన వైద్యలు అతడు బాగానే ఉన్నాడని తెలిపారు. దీంతో పాక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆజాం ఖాన్ పాకిస్తాన్ దిగ్గజం మొయీన్ ఖాన్ తనయడు అన్న సంగతి తెలిసిందే. Azam Khan got injured of Galle Gladiators in LPL during T20 Match.#LPL2022 #Cricket #T20 pic.twitter.com/hJGKP79YDD — Ada Derana Sports (@AdaDeranaSports) December 12, 2022 చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ కెప్టెన్‌కు ఏమైంది? స్టేడియంలోకి అంబులెన్స్! ఆసుపత్రికి తరలింపు -
chamika Karunaratne: 'ఊడిన పళ్లు వెనక్కి.. మూతికి 30 కుట్లు'
శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ పట్టబోయి మూతిపళ్లు రాలగొట్టుకున్న సంగతి తెలిసిందే. లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా నోటి నుంచి రక్తం కారడంతో ప్రథమ చికిత్స తీసుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్ తర్వాత కరుణరత్నేను ఆసుపత్రికి తరలించి మూతికి సర్జరీ నిర్వహించారు. మూతికి 30 కుట్లు కూడా పడ్డాయి. ప్రస్తుతం కరుణరత్నే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని కరుణరత్నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. ''నాలుగు పళ్లు ఉడినా తిరిగి వచ్చాయి.. మూతికి 30 కుట్టు పడ్డాయి.. కానీ నేను ఇప్పటికి నవ్వగలను. త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తా.. సీ యూ సూన్'' అంటూ మెసేజ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 View this post on Instagram A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne) చదవండి: LPL 2022: మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? -
మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు
లంక ప్రీమియర్ లీగ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ తీసుకునే క్రమంలో మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు లంక క్రికెటర్ చమిక కరుణరత్నే. కాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. గాలె గ్లాడియేటర్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు కరుణరత్నే పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో మరో ఇద్దరు ఫీల్డర్లు కూడా రావడం చూసిన కరుణరత్నే వారిని వద్దని వారించాడు. ఇక క్యాచ్‌ను సులువుగా పట్టుకున్నట్లే అని మనం అనుకుంటున్న దశలో బంతి అతని మూతిపై బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముందు పళ్లు ఊడివచ్చాయి. నోటి నుంచి రక్తం కారుతున్నప్పటికి క్యాచ్‌ను మాత్రం జారవిడవలేదు. ఆ తర్వాత పెవిలియన్ వెళ్లి ప్రథమ చికిత్స తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 చదవండి: క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా పడిపోతున్నారు.. టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్ -
10 ఫోర్లు, 4సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్!
లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్21న దంబుల్లా జెయింట్సతో జరిగిన క్వాలిఫైయర్ 2లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లో అవిష్క ఫెర్నాండో 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జాఫ్నా కింగ్స్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, అవిష్క ఫెర్నాండో 122 పరుగల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్బాజ్ 40 బంతుల్లో 70 పరుగలు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవరల్లో జాఫ్నా కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమైంది. కాగా అఖరిలో 75 పరగులతో దంబుల్లా బౌలర్ కరుణరత్నే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఫలితం లేకుండా పోయింది. ఇక జాఫ్నా కింగ్స్ బౌలర్లలో సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షణ, పెరెరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా డిసెంబర్23న ఫైనల్లో గాలె గ్లాడియటర్స్తో జాఫ్నా కింగ్స్ తలపడనుంది. చదవండి: ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ -
ఆమిర్.. ఎక్కడున్నా ఇవే కవ్వింపు చర్యలా!
లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆదివారం గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జఫ్నా కింగ్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను ఆమిర్ వేశాడు. అయితే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆమిర్ వేసిన తొలి బంతినే సిక్స్ బాదాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ తన తర్వాతి బంతికి ఫెర్నాండోను క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకు దెబ్బ తీశాడు. ఈ సమయంలో ఆమిర్ కోపంతో అవిష్క ఫెర్నాండోవైపే చూస్తూ ''గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్'' అంటూ ఇచ్చిన హావభావాలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఆమిర్‌ను ట్రోల్ చేస్తూ అభిమానులు కామెంట్ చేశారు. ''ఆమిర్ ఎక్కడున్నా సరే.. నీ కవ్వింపు చర్యలు అలాగే ఉంటాయి.. ఇక నువ్వు మారవా'' అంటూ పేర్కొన్నారు. మ్యాచ్‌లో విజయం సాధించిన గాలే గ్లాడియేటర్స్ ఎల్పీఎల్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినంతకాలం వివాదాలతో పేరు పొందిన ఆమిర్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా అంతే అగ్రెసివ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ తరపున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: BBL 2021: మ్యాచ్ మధ్యలో బ్రొమాన్స్ ఏంటి.. తట్టుకోలేకపోతున్నాం?! First ball hit for Six then 👑 Clean bowled with an Inswinger @iamamirofficial Aggression 🔥 pic.twitter.com/6p2LmWyy6r — Mustafa Abid (@mmustafa_abid) December 19, 2021 -
బౌలర్ మ్యాజిక్ స్పెల్.. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా
Jeffrey Vandersay Magic Bowling Spell(4-1-25-6) LPL 2021.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో కొలంబో స్టార్స్ బౌలర్ జెఫ్రీ వాండర్సే అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా 6 వికెట్లతో చెలరేగి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా జెఫ్రీ వాండర్సే(4-1-25-6) కెరీర్ బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. డిసెంబర్ 17(శుక్రవారం) క్యాండీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలంబో స్టార్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కొలంబో స్టార్స్ 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం. చదవండి: LPL 2021: బౌలర్ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్ షాక్ ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (38 బంతుల్లో 58, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనుంజయ్ డిసిల్వా 40 పరుగులు చేయగా.. చివర్లో దినేష్ చండీమల్ 29 బంతుల్లో 44 పరుగులు నాటౌట్ మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ వాండర్సే దాటికి 17 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. రవి బొపారా 47 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Diego Maradona: వేలానికి మారడోనా సిగరెట్లు, కార్లు, లగ్జరీ విల్లా It's @Vandersay all the way!#LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere @ipg_productions @SatsportNews @OfficialSLC pic.twitter.com/vU428h2ONe — LPL - Lanka Premier League (@LPLT20) December 17, 2021 -
బౌలర్ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్ షాక్
Bowler Celebration Became Viral After Getting Wicket.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో భాగంగా కాండీ వారియర్స్, డంబుల్లా జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాండీ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విషయం పక్కనపెడితే.. కాండీ వారియర్స్ బౌలర్ బినురా ఫెర్నాండో సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డంబుల్లా జెయింట్స్ బ్యాట్స్‌మన్ ఫిలిప్ సాల్ట్‌ను బినురా ఫెర్నాండో ఒక తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో వికెట్ తీశాననే ఆనందంలో ఫెర్నాండో.. యూట్యూట్‌లో బాగా ఫేమస్ అయిన సాల్ట్ బే సెలబ్రేషన్‌ను తనదైన స్టైల్లో చేశాడు. అయితే ఔటైన బ్యాట్స్‌మన్ ఫిలిప్ సాల్ట్ పేరులో ''సాల్ట్'' ఉండడం విశేషం. చదవండి: PAK Vs WI: ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్‌సీన్ రిపీట్ ఫెర్నాండో సెలబ్రేషన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఫిలిప్ సాల్ట్.. తననేమైనా కామెంట్ చేస్తున్నాడా అన్నట్లు గమనించాడు. కానీ ఫెర్నాండో చివరలో పెవిలియన్ వైపు వెళ్తున్న సాల్ట్ వైపు నవ్వుతూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అయితే సాల్ట్ బే సెలబ్రేషన్‌కు ఇంత పాపులారిటి రావడానికి కారణం.. ఒక తుర్కీష్ చెఫ్ వంటకాలు తయారు చేసే సమయంలో తనదైన స్టైల్లో స్ప్రింకిల్ చేయడం అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించి పెట్టింది. ఇక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కాండీ వారియర్స్ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆర్ మెండిస్ 41 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జయతిలకే 34 పరుగులు చేశాడు. బినురా ఫెర్నాండో, అల్ అమిన్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కాండీ వారియర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రవి బొపారా (59 పరుగులు నాటౌట్) విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: కోపంతో ఊగిపోయిన బౌలర్.. తన స్టైల్లో ప్రతీకారం pic.twitter.com/yW8KDIiKQM https://t.co/oAs61Adv1Y — Estelle Vasudevan (@Estelle_Vasude1) December 16, 2021 -
6 బంతుల్లో ఐదు సిక్సర్లు.. వీడియో వైరల్
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కాండీ వారియర్స్, కొలంబో స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కాండీ వారియర్స్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని కొలంబో స్టార్స్ 19.4 ఓవర్లలో చేధించింది. అయితే చివరి 13 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో.. కొలంబో స్టార్స్ ఆటగాడు సీక్కుగే ప్రసన్న అద్భుతం చేసి చూపించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన ప్రసన్న.. ఆ తర్వాతి ఓవర్లో రూథర్‌ఫర్డ్ ఒక ఫోర్ కొట్టాడు. అనంతరం సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 18.5 ఓవర్లో మరో సిక్స్ బాదడంతో సమీకరణం మారిపోయింది. చదవండి: BBL 2021: బ్యాట్స్‌మన్ భారీ సిక్స్.. అభిమాని తల పగిలి రక్తం ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఓవర్ తొలి బంతికి రూథర్‌ఫర్డ్ సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రసన్న వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడడు. అంతకముందు కాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కేన్నార్ లూయిస్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Some heroes don’t wear capes! When all seemed lost, #SeekkugePrasanna rose to the occasion. @SLColomboStars @ipg_productions @SatsportNews @OfficialSLC #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/zx4wJEmqsC — LPL - Lanka Premier League (@LPLT20) December 14, 2021 -
లంక ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి.. శ్రీలంక క్రికెటర్ మనసులో మాట..!
కొలొంబో: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని అమితంగా ఆరాధించే చాలామంది ప్రస్తుత తరం క్రికెటర్లలో ఒకరైన శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స తన ఆరాధ్య క్రికెటర్ గురించిన ప్రస్తావన సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి ఆడితే చూడలని ఉందంటూ తన మనసులో దాగి ఉన్న కోర్కేను బయటపెట్టాడు. ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్ ఎవరన్న అంశంపై జాతీయ మీడియా అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కోహ్లి ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడని, అతనిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, కోహ్లిని చూసే తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని తెలిపాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ నుంచి షాహిద్ అఫ్రిది తప్పుకోవడంతో రాజపక్సకు గాలె గ్లాడియేటర్స్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. లీగ్‌లో భాగంగా గాలె గ్లాడియేటర్స్ ఇవాళ(డిసెంబర్ 14) డంబుల్లా జెయింట్స్‌తో తలపడాల్సి ఉంది. చదవండి: KS Bharat: మరోసారి శ'చి'తక్కొట్టిన ఆంధ్రావాలా.. -
విధ్వంసం సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ..
Thisara Perera scores a half century as Jaffna Kings defeat Colombo Stars by 93 runs: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ కెప్టెన్ తిసార పెరీరా విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. దీంతో కొలంబో స్టార్స్‌పై జాఫ్నా కింగ్స్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్లలో కోహ్లర్-కాడ్మోర్(44), మాలిక్(44), బండారా(42)పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్టార్స్ జాఫ్నా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. కొలంబో స్టార్స్ బ్యాటర్లలో ఆషాన్ ప్రియాంజన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫ్నా బౌలర్లలో మహేశ్ తీక్షణ,వహాబ్ రియాజ్ చెరో నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
'విజయ్ హజారే, బీబీఎల్, ఎల్పీఎల్పై కన్నేసి ఉంచండి'
IPL Scouts Keep Eyes On Vijay Hazare, BBL 2021 & LPL 2021.. జనవరిలో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను కూడా ప్రకటించాయి. ఇక వచ్చే ఐపీఎల్‌కు అహ్మదాబాద్, లక్నోల రూపంలో కొత్త ఫ్రాంచైజీలు రానుండడంతో మెగావేలంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమకు సమాచారం అందించే స్కౌట్స్‌కు పెద్ద పని అప్పజెప్పింది. మెగావేలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021), లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)పై ఒక కన్నేసి ఉంచాలని తెలిపాయి. జై రిచర్డ్సన్(రూ.14 కోట్లు, పంజాబ్ కింగ్స్) భారీ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్‌లను గెలిపించే యువ ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని.. వారిని వేలంలో దక్కించుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని ఆయా ఫ్రాంచైజీలు కోరాయి. ఇంతకముందు కూడా జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్ లాంటి ఆటగాళ్లు బీబీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇక విజయ్ హజారే ట్రోపీ ద్వారా పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లాంటి వారికి గుర్తింపు రావడం.. ఆ తర్వాత ఐపీఎల్లో దుమ్మురేపడం చూశాం. ఇక టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్‌తో మెరిసిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రస్తుతం ఎల్పీఎల్లో బిజీగా ఉన్నాడు. అతనితో పాటు మరికొంతమంది ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. -
IPL 2022 Auction: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్.. ఐపీఎల్ వేలంలోకి వస్తే!
IPL 2022: Sri Lanka New SIXER KING Avishka Fernando May Break Bank In Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా సమర్పించగా... కారణాలేవైనా డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లను వదిలేశాయి. వీళ్లంతా వేలంలోకి వస్తే కొనడానికి పలు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి కూడా. అదే సమయంలో.. టీ20 వరల్డ్‌కప్-2021 హీరోలు, ఇతర లీగ్ మ్యాచ్‌లలో అదరగొడుతున్న ఆటగాళ్లపై కూడా దృష్టిసారించాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో లంక ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలంక క్రికెటర్ అవిష్క ఫెర్నాండో ఈసారి ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమే అంటున్నారు క్రీడాభిమానులు. ఇప్పటికే వనిందు హసరంగ, దుష్మంత చమీరా క్యాష్ రిచ్ లీగ్‌లో భాగం కాగా.. 23 ఏళ్ల అవిష్క ఫెర్నాండో కూడా ఐపీఎల్లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లంక ప్రీమియర్‌లో అతడి సిక్సర్ల ప్రదర్శన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది మరి! ఈ లీగ్‌లో జఫ్నా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవిష్క.. కాండీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వరుస సిక్సర్లు బాదాడు. 23 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 సిక్స్‌లు కొట్టి ఎల్పీఎల్ మ్యాచ్‌లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. అంతేగాక ఇతర మ్యాచ్‌లలోనూ తనదైన శైలిలో హిట్టింగ్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. మరి ఇలాంటి పవర్ఫుల్ హిట్టర్ ఐపీఎల్‌లోనూ ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 74 టీ20లు ఆడిన అవిష్క 1600కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు.. టీ20 వరల్డ్‌కప్-2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వనిందు హసరంగ, చరిత్ అసలంక కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. చదవండి: IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే! What a show by Avishka Fernando tonight! 🏏💪 53 off 23 balls | 7 sixes 🔥 #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #WinTogether #TheFutureisHere pic.twitter.com/kD7kuD4nXE — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 8, 2021 -
సిక్సర్లతో హోరెత్తించాడు.. విజయానికి చేరువగా
Rovman Powell Hitting 61 Runs From 19 Balls In LPL.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో భాగంగా కాండీ వారియర్స్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 14 ఓవర్లుకు కుదించారు. తొలుత బ్యాటింత్ చేసిన జఫ్నా కింగ్స్ 14 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 181 పరుగులు భారీ స్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (23 బంతుల్లో 53, 7 సిక్సర్లు), తిసారా పెరీరా( 21 బంతుల్లో 53 , 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించారు. చదవండి: Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం అనంతరం బ్యాటింగ్ చేసిన కాండీ వారియర్స్‌కు ఓపెనర్లు కెన్నార్ లూయిస్ (41), చరిత్ అసలంక(42) మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత వచ్చిన రోవ్‌మన్ పావెల్ భీకర ఇన్నింగ్స్ ఆడడంతో కాండీ వారియర్స్ 11 ఓవర్లలో 145 పరుగులు చేసి విజయానికి దగ్గరగా వచ్చింది. అయితే పావెల్ ఔటైన అనంతరం మ్యాచ్ జఫ్నా కింగ్స్ వైపు మళ్లింది. ఇక అక్కడినుంచి జఫ్నా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు 14 ఓవర్లలో 166 పరుగులకు పరిమితమై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. Powell's dominance from start was a testament to his reputation as a power-hitter! @Ravipowell26 @ipg_productions #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/aiQTDa4pmp — LPL - Lanka Premier League (@LPLT20) December 8, 2021 -
లంక ప్రీమియర్ లీగ్‌లో ఐపీఎల్ విధ్వంసకర వీరులు
Gayle, Du Plessis Among LPL 2021 Picks: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధ్వంసకర వీరులు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న లంక ప్రీమియర్ లీగ్-2021లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్-2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించి రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, సీఎస్కే తరఫున బౌలింగ్‌లో సత్తా చాటిన ఇమ్రన్ తాహిర్ తదితర ఆటగాళ్లతో పాటు టీ20 నంబర్ వన్ బౌలర్, దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్ షంషి, పాక్ స్టార్ ఆల్‌రౌండర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు మెరుపు ప్రదర్శనలతో అలరించేందుకు రెడీ అయ్యారు. వీరే కాకుండా బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్, విండీస్ రోవ్‌మన్ పావెల్, లంక స్టార్ ఆటగాళ్లు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా, అఖిల ధనంజయ, దినేశ్ చండీమాల్, ధనంజయ డిసిల్వ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ ఫ్రాంఛైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 5 జట్ల(కొలొంబో స్టార్స్, దంబుల్లా జెయింట్స్, గాలే గ్లాడియేటర్స్, జాఫ్నా కింగ్స్, కాండీ వారియర్స్)తో జరగనున్న ఈ లీగ్ డిసెంబర్ 5 నుంచి 23 వరకు జరగనుంది. చదవండి: ట్విటర్లో సచిన్ హవా.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం