లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ తొలి విజయం సాధించింది. దంబుల్లా ఔరాతో ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దినేశ్ చండీమల్ (48; 7 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో ఏంజెలో మాథ్యూస్ (28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడి క్యాండీని విజయతీరాలకు చేర్చాడు. మాథ్యూస్‌కు ఆసిఫ్ అలీ (16 నాటౌట్; 3 ఫోర్లు) సహకరించాడు. క్యాండీ టీమ్ కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి మ్యాచ్ గెలవడం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా.. ధనంజయ డిసిల్వ (61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో (32; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-17-2), ఉడాన (4-0-33-2) రాణించారు.
అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చండీమల్, ఏంజెలో మాథ్యూస్‌తో పాటు ఫకర్ జమాన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డంబుల్లా బౌలర్లలో ధనంజయ, హేడెన్ కెర్‌లకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment