Mujeeb Ur Rahman
-
T20 WC 2024: అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో అంచనాలకు మించి అదరగొడుతున్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ధ్రువీకరించింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ అఫ్గన్ ప్రధాన జట్టులోకి చేరినట్లు తెలిపింది.కాగా అఫ్గనిస్తాన్ జట్టులోని కీలక సభ్యుల్లో ఒకడైన ముజీబ్ ఉర్ రహ్మాన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా.. టీ20లలో మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు.అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ 46 టీ20లు ఆడి.. 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2024లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఉగాండాపై మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.అయితే, ఆ తర్వాత ముజీబ్ మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ రైటార్మ్ బౌలర్ మధ్య వేలికి గాయమైన కారణంగా.. అతడి స్థానంలో నూర్ అహ్మద్ బరిలోకి దిగాడు.ముజీబ్ లేని లోటును నూర్ తీరుస్తాడా?స్పిన్ దళంలో కెప్టెన్ రషీద్ ఖాన్‌తో భాగమైన నూర్.. న్యూజిలాండ్, పపువా న్యూగినియాతో మ్యాచ్‌లలో భాగమయ్యాడు. ముజీబ్ లేని లోటును ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ తీర్చగలడని అఫ్గన్ మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది.కాగా గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. అయితే, స్పిన్‌కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్‌లపై ముజీబ్ ఉర్ రహ్మాన్ రూపంలో కీలక బౌలర్ సేవలు కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే! అయితే, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు జట్టులో ఉండటం సానుకూలాంశం. పేసర్ ఫజల్హక్ ఫరూకీ కూడా రాణిస్తుండటం ఊరట కలిగించే అంశం. మరో రోవైపు.. ముజీబ్ స్థానంలో జట్టులోకి హజ్రతుల్లా హిట్టర్‌గా పేరొందిన ఓపెనింగ్ బ్యాటర్.చదవండి: T20 WC: పాకిస్తాన్‌కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్ -
16 ఏళ్ల క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్లో ఎంట్రీ! ఎవరంటే?
ఐపీఎల్-2024 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు, అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడి స్ధానాన్ని అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లాహ్ ఘజన్‌ఫర్‌తో కేకేఆర్ ఫ్రాంచైజీ భర్తీ చేసింది. 16 ఏళ్ల ఘజన్‌ఫర్‌ను రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌కు కోల్‌కతా సొంతం చేసుకుంది. ఘజన్ఫర్ ఇటీవలే ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌తో అఫ్గానిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అతడు కేకేఆర్ తరపున క్యాప్ అందుకుంటే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కుతాడు. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ సైతం ప్రసిద్ధ్ కృష్ణ స్ధానాన్ని భర్తీ చేసింది. అతడి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్‌ను యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా ప్రసిద్ద్ ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నాడు. అశ్విన్,చాహల్‌కు బ్యాకప్ స్పిన్నర్‌గా మహారాజ్ ఉండనున్నాడు. కేశవ్ మహారాజ్ ఇప్పటి వరకు 27 టీ20లు, 44 వన్డేలు, 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 237 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ యాజమాన్యం అతడిని రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. -
ఐపీఎల్: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అఫ్గానిస్తాన్ త్రయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్లకు ఊరట లభించింది. ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గోనేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరుతులతో కూడిన నో-అబ్జెక్షన్స్ సర్టిఫికేట్లను (NOC) మంజూరు చేసింది. కాగా గత నెలలలో జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ ముగ్గరిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ కొన్ని ఆంక్షలు విధించింది. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు వీరి ముగ్గురు అంగీకరించడంతో అఫ్గాన్ క్రికెట్ తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంది. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అదే విధంగా ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. వీరిద్దరితో పాటు ఐపీఎల్-2024 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. చదవండి: T20 WC:రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ! -
టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్‌కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్‌గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్‌ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్‌కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
ఆంక్షల ఫలితం... అఫ్గాన్ స్టార్ క్రికెటర్‌పై వేటు!
జాతీయ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రాంచైజీ టి20 లీగ్‌లవైపు మొగ్గుచూపుతున్న తమ దేశ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహ్మన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూఖీలపై గతవారం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆంక్షలు విధించింది. ఇవి అమల్లోకి రావడంతో ఆ్రస్టేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ టి20 లీగ్‌లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడాల్సిన ముజీబ్‌ను ఆ జట్టు తప్పించింది. ఈ సీజన్లో రెనెగెడ్స్ తరఫున ఆడిన ఏకైక మ్యాచ్‌లో ముజీబ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని... -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ! -
ముజీబ్‌ను హత్తుకుని ఏడ్చేసిన బుడ్డోడు.. మ్యాచ్ కోసం ఏకంగా! వైరల్
ICC ODI WC 2023: ఆటలో గెలుపోటములు సహజం.. అయితే, ఒక్కోసారి భావోద్వేగాలు ఇలాంటి సహజ అంశాలపై పైచేయి సాధిస్తాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సందర్భాల్లో.. అది కూడా తమకు గతంలో సాధ్యం కాని ఘనత సాధిస్తే.. గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆదివారం అఫ్గనిస్తాన్ జట్టు ఇలాంటి అనుభూతిని ఆస్వాదించింది. ఇంగ్లండ్ ఆటగాడు మార్క్‌వుడ్‌ను తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌల్డ్ చేయగానే అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. మొట్టమొదటిసారిగా.. అది కూడా వన్డే ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నీ సందర్భంగా ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం అందుకోవడంతో అఫ్గన్ ఆటగాళ్ల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. View this post on Instagram A post shared by ICC (@icc) సంతోషం పట్టలేక.. కన్నీటి పర్యంతం డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించామన్న విజయగర్వంతో వారి కళ్లు మెరిసిపోయాయి. ఈ దృశ్యాల్ని చూసిన అభిమానుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి. అయితే, ఓ బుల్లి అభిమాని మాత్రం ఈ సంతోషాన్ని పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. ఇదేమీ ఫైనల్ మ్యాచ్ కాకపోయినా.. అఫ్గనిస్తాన్‌కు ఈ గెలుపు ఎంతటి సంతోషాన్నిచ్చిందో తన చర్య ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. 1100 కిలోమీటర్లు ప్రయాణించి పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ రాజధాని ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం దాకా వచ్చినందుకు తనకు దక్కిన బహుమతికి మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యూటీ ఆఫ్ క్రికెట్ ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘క్రికెట్లో ఉన్న అందమే ఇది’’ అంటూ ఆ చిన్నోడిని చూసి ఆనందిస్తూ.. అఫ్గనిస్తాన్ ఆటగాళ్లకు అభినందనలు తెలిజయజేస్తున్నారు. కాగా ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌పై అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఈ మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ 16 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్(11), హ్యారీ బ్రూక్(66), క్రిస్ వోక్స్(9) వికెట్లు తీశాడు. తద్వారా అఫ్గనిస్తాన్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం This is the way to celebrate the very beautiful game of cricket. An Afghanistan kid traveled 1100 KM & finally they upset England to win the WC match. This boy hugged Mujeeb in tears, they admire #Rashid & #Gurbaz to get little happiness from sports. What a game #ENGvsAFG.🔥 pic.twitter.com/T1D3Uvp4Zv — Amock (@Politics_2022_) October 15, 2023 -
WC 2023: వాళ్లు అద్భుతం.. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అవే.. కానీ: బట్లర్
వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్ చేతిలో ఊహించని రీతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓటమి చెంది విమర్శల పాలైంది. అఫ్గన్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చోట.. ఇంగ్లండ్ ‘పటిష్ట’ బ్యాటింగ్ ఆర్డర్ తేలిపోయింది. మెరుగైన భాగస్వామ్యాలు కరువై ఓటమిని కొనితెచ్చుకుంది. ఫలితంగా తాజా ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవైపు టీమిండియా, న్యూజిలాండ్ ఓటమి అన్నదే లేక రేసులో దూసుకుపోతున్న వేళ ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకీ వెనుబడిపోతోంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు అఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్. 57 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 80 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు అఫ్గన్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, ఆరో స్థానంలో బరిలోకి దిగిన వికెట్ కీపర్ ఇక్రం అలిఖిల్ అర్ద శతకం(58)తో రాణించగా... రషీద్ ఖాన్ 23, ముజీబ్ ఉర్ రహ్మమాన్ 28 పరుగులతో అఫ్గన్ మంచి స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి అఫ్గన్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. మలన్ 32 రన్స్ స్కోరు చేశాడు. జో రూట్(11) విఫలం కాగా.. హ్యారీ బ్రూక్(66) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహాయం కరువైంది. ఆఖర్లో ఆదిల్ రషీద్(20), మార్క్ వుడ్(18) బౌండరీలు బాది కాసేపు ఫ్యాన్స్‌ను సంతోషపెట్టగలిగారు గానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc) అఫ్గన్ బౌలర్ల దెబ్బకు 40.3 ఓవర్లకే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. 215 పరుగులకే ఆలౌటై 69 పరుగుల తేడాతో ఓడి రన్‌రేటు పరంగానూ వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. ‘‘టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని.. మొదటి బంతి నుంచే పరుగులు ఇవ్వడం నిరాశ పరిచింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ అద్భుతంగా ఆడింది. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మేము బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాం. వాళ్ల జట్టులో కొంతమంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. నిజానికి మేము ఊహించినట్లుగా పిచ్‌పై డ్యూ(తేమ) లేదు. మా బౌలర్లు విఫలమైన చోట వాళ్ల బౌలర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని బాధించేదే! కానీ.. అదే తలచుకుని బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మా ఆటగాళ్లకు పట్టుదల ఎక్కువ.. జట్టు మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తుంది. ఒత్తిడిని తట్టుకుని రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఆట తీరును ప్రశంసిస్తూ.. ఓటమిని హుందాగా అంగీకరిస్తూనే.. తిరిగి పుంజుకుంటామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో.. పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టిన ముజీబ్ ఉర్ రహ్మాన్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అఫ్గన్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేయడంతో పాటు 10 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులిచ్చి కీలక వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 AFG VS BAN: ఇదేం గ్రౌండ్ రా సామీ.. ఇసుక దిబ్బలే నయం..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నిన్న (అక్టోబర్ 7) ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెహది హసన్ మీరజ్ ఆల్‌రౌండర్ షోతో (9-3-25-3, 57) అదరగొట్టి బంగ్లాదేశ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కాగా, మ్యాచ్ అనంతరం ధర్మశాల మైదానంపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌండరీ లైన్ వద్ద గ్రౌండ్ పరిస్థితిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ కంటే ఇసుక, బుడద దిబ్బలు నయమని అంటున్నారు. గ్రౌండ్ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియోను (బౌండరీ లైన్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డ వీడియోను) వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే గ్రౌండ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది. This happened in Dharamsala today! How did the ICC deem this ground fit enough to host a World Cup match 🤦🏼♂️🤦🏼♂️I hope Mujeeb Ur Rahman isn't badly hurt. Crazy 🙏🏼 #CWC23 #WorldCup2023 pic.twitter.com/P5XpwLHmte— Farid Khan (@_FaridKhan) October 7, 2023 వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లో మ్యాచ్ నిర్వహించేందుకు ఈ గ్రౌండ్‌కు ఐసీసీ ఎలా అనుమతి ఇచ్చిందని క్రికెట్ ఫాలోవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు లేని బుడద మైదానంలో మ్యాచ్‌ను నిర్వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో జనాలు బీసీసీఐని నిందిస్తున్నారు. కాగా, ధర్మశాల మైదానం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉందన్న విషయం తెలిసిందే. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ శీతలంగా ఉంటుంది. ఇక్కడ ఎండ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ మైదానం కాస్త స్టికీగా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. ఇవాళ (అక్టోబర్ 8) తమ తొలి మ్యాచ్‌ను ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో నెదార్లండ్స్‌పై పాక్ సూపర్ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్.. శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయాలు నమోదు చేశాయి. -
వన్డేల్లో అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు. ఆసియాకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌వికెట్‌గా ఔటైన ముజీబ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరి ముజీబ్ హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్ హిట్ వికెట్‌గానే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా చేతిలో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. అదే విధంగా ఈ విజయంతో బంగ్లాదేశ్ తమ సూపర్- ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇక మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ సమయంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! చెత్త కారణాలు చెప్పారు -
ఇదెక్కడి దరిద్రం రా బాబు.. సిక్స్ కొట్టినా ఔటైపోయాడు!
ఆసియాకప్-2023ను ఆఫ్గానిస్తాన్ ఓటమితో ఆరంభించింది. లహోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ఓపెనర్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 112 రిటైర్డ్‌హర్ట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిలార్డర్లో నజ్ముల్ హోసేన్ షాంతో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్, గుల్బదిన్ చెరో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (74), కెపె్టన్ హష్మతుల్లా ( 51) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రహ్మాన్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా ముజీబ్ పెవిలియన్‌కు చేరాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ముజీబ్ భారీ షాట్ ఆడాడు. దెబ్బకు బంతి స్టాండ్స్‌కు వెళ్లింది. కానీ ఇక్కడే అస్సలు ట్విస్టు చోటుచేసుకుంది. బంతిని కొట్టి క్రమంలో ముజీబ్ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఇది గమనించిన వికెట్ కీపర్ రహీమ్ ఔట్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు కూడా సంబరాలు మునిగి తెలిపోయారు. పాపం ముజీబ్ సిక్స్ కొట్టి మరి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. తద్వారా అత్యంత చెత్త రికార్డును ఒకటి ముజీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు. చదవండి: వరుణుడు కరుణిస్తే! Mujeeb rehman got out by hit wicket but ball went to six 😃😃#AsiaCup #CricketTwitter #sundayvibes #ICC pic.twitter.com/KSKwI7DiXf — Abhishek Salian (@Abhishe76586692) September 3, 2023 -
అదే గనుక జరిగితే అఫ్గనిస్తాన్‌ను ఎవరూ ఆపలేరు! ప్రత్యర్థికి చుక్కలే!
Asia Cup 2023: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఒకవేళ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు గనుక వారికి లభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్-2023 బుధవారం(ఆగష్టు 30) ఆరంభం కానుంది. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్ ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా... గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సహా ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీతో పాటు నూర్ అహ్మద్‌కు ఈ 17 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. వాళ్లంతా కలిసి ప్రత్యర్థి జట్ల పని పడతారు ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ మెరుగ్గా బౌలింగ్ చేస్తుంది. వాళ్లకు గనుక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ దొరికితే ఇక అంతే సంగతులు. ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్.. అంతా కలిసి ప్రత్యర్థి జట్టు పని పట్టడం ఖాయం. ఒకవేళ పిచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించిందంటే.. తుదిజట్టులో నూర్ అహ్మద్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఊపిరి కూడా తీసుకోనివ్వరంటే అతిశయోక్తి కాదు అహ్మద్‌ను గనుక ఆడిస్తే.. అతడితో పాటు రషీద్, నబీ, ముజీబ్ ఒక్కొక్కరు పది ఓవర్లు వేస్తారు. ప్రత్యర్థి జట్టుకు ఊపిరి సలపనివ్వకుండా చెలరేగిపోతారు’’ అని అఫ్గన్ స్పిన్ దళాన్ని ఆకాశానికెత్తాడు. అయితే, అఫ్గన్‌కు చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం మాత్రం బలహీనతే అని ఆకాశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఆ ముగ్గురి రికార్డు ఇలా కాగా ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 87 వన్డేల్లో 170 వికెట్లు కూల్చాడు. ఇక ముజీబ్ ఉర్ రహ్మాన్ 64 మ్యాచ్‌లలో 91, మహ్మద్ నబీ 145 మ్యాచ్‌లు ఆడి 154 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 3న బంగ్లాదేశ్‌తో లాహోర్‌లో అఫ్గన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023 అఫ్గనిస్తాన్ జట్టు ఇదే హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్ ఆటగాడు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
ఆఫ్గానిస్తాన్ ఆటగాడు, స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్‌సెంచరీ చేసిన తొలి ఆఫ్గాన్ క్రికెటర్‌గా ముజీబ్ రికార్డులకెక్కాడు. కొలాంబో వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ముజీబ్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గానిస్తాన్ కేవలం 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో 9వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముజీబ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతులు ఎదుర్కొన్న ముజీబ్ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదే విధంగా మరోరికార్డును కూడా ముజీబ్ తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లొ పాకిస్తాన్‌పై తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ముజీబ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక వికెట్ కీపర్- బ్యాటర్ అటెర్ గై డి అల్విస్ రికార్డును ముజీబ్ బ్రేక్ చేశాడు. 1983 ప్రపంచ కప్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్‌పై 56 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 64 పరుగులు చేసిన ముజీబ్.. 40 ఏళ్ల అల్విస్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముజీబ్ దురదృష్టవశాత్తూ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. తద్వారా వన్డేల్లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆఫ్గాన్ క్రికెటర్‌గా చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్ Mujeeb Ur Rahman smashes fastest ODI fifty for Afghanistan in just 26 balls 💪#AFGvsPAK pic.twitter.com/UH631kKngj — FanCode (@FanCode) August 26, 2023 -
పాక్ భరతం పట్టిన ఆఫ్ఘన్ స్పిన్నర్లు.. పేక మేడలా కూలిన బాబర్ సేన
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ల ధాటికి వరల్డ్ నంబర్ 2 టీమ్ పేకమేడలా కూలింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1)లు పాక్ ఆటగాళ్ల భరతం పట్టారు. ఫలితంగా ఆ జట్టు 47.1 ఓవర్లలో కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆరంభంలోనే వణికించారు. ముఖ్యంగా ముజీబ్ పాక్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ముజీబ్ కీలకమైన బాబర్ ఆజమ్ (0), మహ్మద్ రిజ్వాన్‌లను (21) ఔట్ చేసి పాక్‌ను ఇరకాటంలో పడేశాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇమామ్ ఉల్ హాక్ (61).. ఇఫ్తికార్ అహ్మద్ (30), షాదాబ్ ఖాన్ (39)ల సాయంతో పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే మహ్మద్ నబీ.. స్వల్ప వ్యవధిలో ఇఫ్తికార్, ఇమామ్‌ల వికెట్లు పడగొట్టి పాక్‌ను భారీ స్కోర్ చేయనీకుండా కట్టడి చేశాడు. కీలక సమయంలో షాదాబ్ ఖాన్ కూడా రనౌట్ కావడంతో పాక్ తక్కువ స్కోర్‌కే పరిమితంకాక తప్పలేదు. రషీద్ ఖాన్ సైతం కీలకమైన అఘా సల్మాన్ (7), షాహీన్ అఫ్రిది (2) వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఫకర్ జమాన్ (2) ఔట్ చేసి ఫారూకీ పాక్ పతనానికి నాంది పలకగా.. హరీస్ రౌఫ్ (1)ను ఔట్ చేసి రెహ్మాత్ పాక్ ఇన్నింగ్స్‌ను లాంఛనంగా ముగించాడు. నసీం షా (18 నాటౌట్) పాక్‌ను 200 పరుగుల మార్కును దాటించడంతో సాయపడ్డాడు. -
బాబర్ ఆజమ్ డకౌట్.. ఆఫ్ఘన్ బౌలర్ అరుదైన ఘనత
శ్రీలంక వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను డకౌట్ చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాబర్‌ను అతని 100 వన్డేల కెరీర్లో ఏ స్పిన్నర్ డకౌట్ చేసింది లేదు. ముజీబ్ ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా ఖ్యాతి గడించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ తానెదుర్కొన్న మూడో బంతికి ముజీబ్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. బాబర్ రివ్యూకి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. బాబర్ తన వన్డే కెరీర్లో ఇప్పటివరకు ఆడిన 101 మ్యాచ్‌ల్లో 18 సెంచరీలు, 26 అర్ధసెంచరీల సాయంతో 5089 పరుగులు చేశాడు. .@Mujeeb_R88 is the first spinner to dismiss Babar Azam for a duck in ODIs.pic.twitter.com/Di1eMYUV1o — CricTracker (@Cricketracker) August 22, 2023 కాగా, ఈ మ్యాచ్‌కు ముందు బాబర్ ఆడిన 18 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇందులో బాబర్ కేవలం 3 సందర్భాల్లో మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఓ మ్యాచ్‌లో అతను 49 పరుగులు చేశాడు. గత 18 మ్యాచ్‌ల్లో ఇంత ఘనమైన రికార్డు కలిగిన బాబర్.. ముజీబ్ మాయాజాలాని చిక్కి తన వన్డే కెరీర్లో తొలిసారి ఓ స్పిన్నర్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫకర్ జమాన్ (2).. ఫజల్ హాక్ ఫారూకీ బౌలింగ్‌లో ఔట్ కాగా, ముజీబ్ వేసిన రెండో ఓవర్లో బాబర్ ఆజమ్ (0) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం 8, 17 ఓవర్లలో పాక్ మరో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్ రిజ్వాన్ (21)ను ముజీబ్.. అఘా సల్మాన్ (7) రషీద్ ఖాన్ ఔట్ చేశారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ స్కోర్ 99/4గా ఉంది. ఇమామ్ ఉల్ హాక్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (23) క్రీజ్‌లో ఉన్నారు. -
రాణించిన చండీమల్.. కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి..!
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ తొలి విజయం సాధించింది. దంబుల్లా ఔరాతో ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దినేశ్ చండీమల్ (48; 7 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో ఏంజెలో మాథ్యూస్ (28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడి క్యాండీని విజయతీరాలకు చేర్చాడు. మాథ్యూస్‌కు ఆసిఫ్ అలీ (16 నాటౌట్; 3 ఫోర్లు) సహకరించాడు. క్యాండీ టీమ్ కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి మ్యాచ్ గెలవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా.. ధనంజయ డిసిల్వ (61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో (32; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-17-2), ఉడాన (4-0-33-2) రాణించారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చండీమల్, ఏంజెలో మాథ్యూస్‌తో పాటు ఫకర్ జమాన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డంబుల్లా బౌలర్లలో ధనంజయ, హేడెన్ కెర్లకు తలో వికెట్ దక్కింది. -
వరల్డ్ నంబర్ 1 రషీద్! పాక్‌పై చెలరేగి టాప్-3లో అతడు.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ
ICC T20I Bowling Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఈ లెగ్ స్పిన్నర్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 2018లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన రషీద్ ఖాన్.. మరోసారి వరల్డ్ నంబర్ 1గా నిలిచాడు. కాగా షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి టీ20లో ఒక వికెట్ తీసిన ఈ అఫ్గన్ సారథి.. రెండో మ్యాచ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఆఖరిదైన మూడో టీ20లోనూ ఒక వికెట్‌తో మెరిశాడు. టాప్-3లో ఇద్దరు.. ఈ క్రమంలో 710 రేటింగ్ పాయింట్లతో హసరంగను అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అఫ్గన్‌కు చెందిన పేసర్ ఫజల్హక్ ఫారూకీ మూడో స్థానంలోకి దూసుకువచ్చాడు. పాక్‌తో సిరీస్‌లో 5 వికెట్లతో చెలరేగిన అతడు టాప్-5లో అడుగుపెట్టాడు. దీంతో ఐపీఎల్-2023కి ముందు మంచి బూస్టప్ లభించిందంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సీజన్లో ఫారూకీ ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన రషీద్ బృందం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఐసీసీ టీ20 బౌలింగ్ తాజా ర్యాంకింగ్స్ 1. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 710 పాయింట్లు 2. వనిందు హసరంగ- శ్రీలంక- 695 పాయింట్లు 3. ఫజల్హక్ ఫారూకీ- అఫ్గనిస్తాన్- 692 పాయింట్లు 4. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 690 పాయింట్లు 5. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 684 పాయింట్లు View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) -
ఆఫ్ఘనిస్తాన్‌తో జాగ్రత్త.. భారత్, పాక్‌లకు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..!
ఆసియా కప్ 2022లో అంచనాలకు మించి రాణిస్తూ.. తమకంటే మెరుగైన జట్లకు షాకిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. పసికూనే కాదా అని ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేసి ఏమరపాటుగా ఉంటే భారత్, పాక్‌లకు కూడా షాక్ తప్పదని హెచ్చరించాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, ఉరకలేస్తున్న ఆఫ్ఘన్‌ను నిలువరించడం భారత్, పాక్ లాంటి జట్లకు కూడా సవాలేనని పేర్కొన్నాడు. ఆఫ్ఘన్‌ను ముఖ్యంగా బౌలింగ్‌లో అస్సలు తక్కువ అంచనా వేయరాదని.. లంకతో మ్యాచ్‌లో యువ పేసర్ ఫజల్ హాక్ ఫారూఖీ (3/11), ముజీబ్ (2/24), నబీ (2/14).. బంగ్లాతో మ్యాచ్‌లో ముజీబుర్ రెహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) లు ప్రత్యర్ధులకు ఏ గతి పట్టించారో అందరూ చూశారని అన్నాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఆఫ్ఘాన్‌ను చిన్నచూపు చూడరాదని, బంగ్లాపై ఆ జట్టు బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు), నజీబుల్లా జద్రాన్ (17 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) ఏ రకంగా చెలరేగారో భారత్, పాక్‌లు గమనించాలని అల్టర్ జారీ చేశాడు. బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. జడేజా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, బంగ్లాపై విజయంతో ఆఫ్ఘాన్.. గ్రూప్-బి నుంచి సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి రెండో స్థానం కోసం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. పాక్‌పై తొలి మ్యాచ్‌లో విజయంతో టీమిండియా సూపర్-4 తొలి బెర్తును (గ్రూప్-ఏ) దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో ఇవాళ భారత్-హాంగ్‌కాంగ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ -
ముజీబ్ కోసం ఫిజియోను పంపిస్తామన్న అశ్విన్.. తెలుగులో బదులిచ్చిన రషీద్ ఖాన్
Rashid Khan Responds To Ashwin Offer For Afghanistan Ahead Of Their Clash Against Kiwis: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ విజయం సాధించాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకాంక్షించాడు. ఇందుకోసం గాయపడిన అఫ్గాన్ ప్రధాన స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు టీమిండియా ఫిజియో సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సరదాగా వ్యాఖ్యానించాడు. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అఫ్గాన్.. న్యూజిలాండ్‌ను ఓడించాల్సి ఉండడంతో అశ్విన్ ఈ మేరకు సరదా వ్యాఖ్యలు చేశాడు. Ashwin wants India’s physio to help Mujeeb get fit for Afghanistan’s match against New Zealand 😁 #T20WorldCup pic.twitter.com/xqWrfyzUZU — ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2021 ఈ వ్యాఖ్యలను ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ట్వీట్ చేయగా.. రషీద్ ఖాన్ స్పందించాడు. 'టెన్షన్ పడకు అశ్విన్ భాయ్.. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడా ముజీబ్‌ను చూసుకుంటున్నారు.' అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో "చూసుకుంటున్నారు" అన్న పదం తెలుగులో ఉండడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. రషీద్ తెలుగు పదాన్ని వాడి ట్వీట్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రషీద్.. జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర కొన్ని తెలుగు పదాలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Rohit Sharma: ఆ ముచ్చట తీరకుండా, ఎన్ని సెంచరీలు చేసి ఏం లాభం..! -
ఓహో లోకేశ్ రాహుల్
కింగ్స్ ఎలెవన్ మొదట స్పిన్‌తో కట్టేసింది. తర్వాత బ్యాటింగ్‌లో చితగ్గొట్టింది. దాని పంజా(బ్) ధాటికి రాజస్తాన్ రాయల్స్ నిలువలేకపోయింది. ముజీబ్ తన స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగా... తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్ కడదాకా నిలిచి గెలిపించాడు. జట్టును ప్లే–ఆఫ్‌కు చేరువ చేశాడు. ఇండోర్: పంజాబ్ ఆల్‌రౌండ్ షోకు రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. మొదట ముజీబుర్ రెహమాన్ (3/27) ముచ్చెమటలు పట్టించగా, లోకేశ్ రాహుల్ (54 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత ప్రదర్శనతో గెలిపించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో రాయల్స్‌పై నెగ్గింది. తొలుత రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ 3, ఆండ్రూ టై 2 వికెట్లు తీశారు. తర్వాత పంజాబ్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్లో రాజస్తాన్కిది ఆరో ఓటమి కాగా, పంజాబ్ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బట్లరే బాగా ఆడాడు... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ భారీ స్కోరు చేస్తుందనిపించేలా సాగలేదు. ఆ జట్టులో బట్లర్ ఒక్కడే నిలిచాడు. మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా అడేసిపోయారంతే. సంజు శామ్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ గోపాల్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఓ చెయ్యేశారు. టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను బట్లర్, షార్ట్ ప్రారంభించారు. కానీ ఆట మొదలైన మూడో బంతికే షార్ట్ (2), కాసేపటికి కెప్టెన్ రహానే (5) నిష్క్రమించారు. తర్వాత శామ్సన్ అండతో బట్లర్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. దీంతో పది ఓవర్ల దాకా మరో వికెట్ కోల్పోకుండా 81 పరుగులు చేసింది. కానీ ఆ మరుసటి ఓవర్లోనే శామ్సన్ ఔట్ కావడంతో రాయల్స్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. మరోవైపు బట్లర్ (37 బంతుల్లో, 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముజీబ్ మ్యాజిక్ అయితే ముజీబ్ సూపర్ స్పెల్‌తో రాజస్తాన్ ఇన్నింగ్స్ కకావికలమైంది. 13వ ఓవర్లో స్టోక్స్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను ఔట్ చేసిన ముజీబ్... 15వ ఓవర్ తొలి బంతికి బట్లర్‌ను, రెండో బంతికి ఆర్చర్ (0)ను పెవిలియన్ చేర్చాడు. వీరంతా 6 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో శ్రేయస్ గోపాల్ కాసేపు పోరాడంతో 150 దాటింది. అశ్విన్, రాజ్‌పుత్, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. పడుతూ... లేస్తూ... లక్ష్యం సునాయాసమే కానీ... పంజాబ్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఓపెనర్ గేల్ (8)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మయాంక్ (2) విఫలమయ్యాడు. దీంతో మరో ఓపెనర్ కె.ఎల్.రాహుల్ బాధ్యతగా ఆడాడు. కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మూడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక నాయర్‌ను అనురీత్, అక్షర్ పటేల్ (4)ను గౌతమ్ పెవిలియన్ చేర్చారు. 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా... స్టోయినిస్ (16 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో రాహుల్ (44 బంతుల్లో; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రన్‌రేట్ పెరిగిపోతున్న దశలో రాహుల్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. చివరి 24 బంతుల్లో 43 కొట్టాల్సిన సమయంలో ఆర్చర్ వేసిన ఓవర్లో సిక్స్, ఫోర్ సహా 16 పరుగులు వచ్చాయి. తర్వాత రాహుల్... ఉనాద్కట్ బౌలింగ్‌లో 15 పరుగులు చేశాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 12గా మారింది. రాహుల్ సిక్స్, ఫోర్ బాది 8 బంతులు మిగిలి ఉండగానే గెలుపు తీరం చేర్చాడు. రాయల్స్ బౌలర్లలో గౌతమ్, ఆర్చర్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) రాహుల్ (బి) ముజీబ్ 51; షార్ట్ (సి) టై (బి) అశ్విన్ 2; రహానే (సి) గేల్ (బి) పటేల్ 5; శామ్సన్ (సి) నాయర్ (బి) టై 28; స్టోక్స్ (సి) తివారి (బి) ముజీబ్ 12; త్రిపాఠి (సి) అశ్విన్ (బి) టై 11; ఆర్చర్ (బి) ముజీబ్ 0; గౌతమ్ (సి) స్టొయినిస్ (బి) రాజ్‌పుత్ 5; గోపాల్ రనౌట్ 24; ఉనాద్కట్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–3, 2–35, 3–84, 4–100, 5–106, 6–106, 7–114, 8–129, 9–152. బౌలింగ్: అశ్విన్ 4–0–30–1, రాజ్‌పుత్ 3–0–37–1, ముజీబ్ 4–0–27–3, అక్షర్ పటేల్ 4–0–21–1, టై 4–0–24–2, స్టొయినిస్ 1–0–6–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 84; గేల్ (సి) శామ్సన్ (బి) ఆర్చర్ 8; అగర్వాల్ (సి) త్రిపాఠి (బి) స్టోక్స్ 2; నాయర్ (బి) అనురీత్ సింగ్ 31; అక్షర్(సి) షార్ట్ (బి) గౌతమ్ 4; స్టొయినిస్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–23, 2–29, 3–79, 4–87. బౌలింగ్: గౌతమ్ 3–0–18–1, ఆర్చర్ 3.4–0–43–1, స్టోక్స్ 3–0–22–1, ఉనాద్కట్ 4–0–26–0, గోపాల్ 3–0–26–0, అనురీత్ సింగ్ 2–0–20–1. -
ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా..
సాక్షి, స్పోర్ట్స్ (మొహాలీ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ సరికొత్త రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 21వ శతాబ్దంలో జన్మించి ఐపీఎల్లో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా రహ్మాన్ నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు రహ్మాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అఫ్గానిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తరఫున అతిపిన్న వయసులో అరంగ్రేటం చేసిన ఆటగాడన్న విషయం తెలిసిందే. అతి తక్కువ వయసులో ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్‌గానూ ముజీబ్ ఉర్ రహ్మాన్ రికార్డు నమోదుచేశాడు. ఐపీఎల్ 11లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ తరఫున అరంగ్రేటం చేశాడు. 17 ఏళ్ల 11 రోజుల వయసులో తొలి ఐపీఎల్ ఆడుతున్న బౌలర్ రహ్మాన్ .. బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ రికార్డును చెరిపేశాడు. ఇప్పటివరకూ 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ పేరిట ఈ రికార్డ్ ఉండేది. పిన్న వయసులో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన టాప్-5 ఆటగాళ్లు ముజీబ్ ఉర్ రహ్మాన్ 17 ఏళ్ల 11 రోజులు సర్ఫరాజ్ ఖాన్ 17 ఏళ్ల 177 రోజులు ప్రదీప్ సంగ్వాన్ 17 ఏళ్ల 179 రోజులు వాషింగ్టన్ సుందర్ 17 ఏళ్ల 199 రోజులు రాహుల్ చహర్ 17 ఏళ్ల 247 రోజులు