శ్రీలంక వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను డకౌట్ చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాబర్‌ను అతని 100 వన్డేల కెరీర్‌లో ఏ స్పిన్నర్ డకౌట్ చేసింది లేదు. ముజీబ్ ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా ఖ్యాతి గడించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ తానెదుర్కొన్న మూడో బంతికి ముజీబ్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. బాబర్ రివ్యూకి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. బాబర్ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 101 మ్యాచ్‌ల్లో 18 సెంచరీలు, 26 అర్ధసెంచరీల సాయంతో 5089 పరుగులు చేశాడు.
.@Mujeeb_R88 is the first spinner to dismiss Babar Azam for a duck in ODIs.pic.twitter.com/Di1eMYUV1o
— CricTracker (@Cricketracker) August 22, 2023
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు బాబర్ ఆడిన 18 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇందులో బాబర్ కేవలం 3 సందర్భాల్లో మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఓ మ్యాచ్‌లో అతను 49 పరుగులు చేశాడు. గత 18 మ్యాచ్‌ల్లో ఇంత ఘనమైన రికార్డు కలిగిన బాబర్.. ముజీబ్ మాయాజాలాని చిక్కి తన వన్డే కెరీర్‌లో తొలిసారి ఓ స్పిన్నర్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫకర్ జమాన్ (2).. ఫజల్ హాక్ ఫారూకీ బౌలింగ్‌లో ఔట్ కాగా, ముజీబ్ వేసిన రెండో ఓవర్‌లో బాబర్ ఆజమ్ (0) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం 8, 17 ఓవర్లలో పాక్ మరో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్ రిజ్వాన్ (21)ను ముజీబ్.. అఘా సల్మాన్ (7) రషీద్ ఖాన్ ఔట్ చేశారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ స్కోర్ 99/4గా ఉంది. ఇమామ్ ఉల్ హాక్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (23) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment