
జాతీయ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రాంచైజీ టి20 లీగ్‌లవైపు మొగ్గుచూపుతున్న తమ దేశ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహ్మన్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీలపై గతవారం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆంక్షలు విధించింది.
ఇవి అమల్లోకి రావడంతో ఆ్రస్టేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ టి20 లీగ్‌లో మంగళవారం మెల్‌బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడాల్సిన ముజీబ్‌ను ఆ జట్టు తప్పించింది. ఈ సీజన్‌లో రెనెగెడ్స్ తరఫున ఆడిన ఏకైక మ్యాచ్‌లో ముజీబ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...