టీ20 ప్రపంచకప్-2024లో అంచనాలకు మించి అదరగొడుతున్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.
టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ధ్రువీకరించింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ అఫ్గన్ ప్రధాన జట్టులోకి చేరినట్లు తెలిపింది.
కాగా అఫ్గనిస్తాన్ జట్టులోని కీలక సభ్యుల్లో ఒకడైన ముజీబ్ ఉర్ రహ్మాన్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముఖ్యంగా.. టీ20లలో మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు.
అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ 46 టీ20లు ఆడి.. 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2024లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఉగాండాపై మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
అయితే, ఆ తర్వాత ముజీబ్ మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ రైటార్మ్ బౌలర్ మధ్య వేలికి గాయమైన కారణంగా.. అతడి స్థానంలో నూర్ అహ్మద్ బరిలోకి దిగాడు.
ముజీబ్ లేని లోటును నూర్ తీరుస్తాడా?
స్పిన్ దళంలో కెప్టెన్ రషీద్ ఖాన్‌తో భాగమైన నూర్.. న్యూజిలాండ్, పపువా న్యూగినియాతో మ్యాచ్‌లలో భాగమయ్యాడు. ముజీబ్ లేని లోటును ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ తీర్చగలడని అఫ్గన్ మేనేజ్‌మెంట్ నమ్మకంగా ఉంది.
కాగా గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. అయితే, స్పిన్‌కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్‌లపై ముజీబ్ ఉర్ రహ్మాన్ రూపంలో కీలక బౌలర్ సేవలు కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే!
అయితే, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు జట్టులో ఉండటం సానుకూలాంశం. పేసర్ ఫజల్‌హక్ ఫరూకీ కూడా రాణిస్తుండటం ఊరట కలిగించే అంశం. మరో రోవైపు.. ముజీబ్ స్థానంలో జట్టులోకి హజ్రతుల్లా హిట్టర్‌గా పేరొందిన ఓపెనింగ్ బ్యాటర్.
చదవండి: T20 WC: పాకిస్తాన్‌కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
Comments
Please login to add a commentAdd a comment