Rashid Khan
-
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్‌ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్ ఆరు టెస్ట్‌ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్‌ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ తర్వాతి స్థానంలో ఉన్నారు.జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్‌లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.రెండో స్థానంలో రషీద్ఆరు టెస్ట్‌ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (45) సౌతాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చార్లీ టర్నర్ టాప్‌లో నిలిచాడు. టర్నర్ ఆరు టెస్ట్‌ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లుఈ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రషీద్‌తో పాటు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రమే వరుసగా రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.జింబాబ్వేతో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్ షా (139), ఇస్మత్ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇస్మత్ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి డెబ్యూలో సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్ ఆలం రికార్డుల్లోకెక్కాడు.జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్ తన స్పిన్ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్ 157 ఆలౌట్
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్‌తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరస కట్టారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్‌లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs AUS: రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే? -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా రషీద్ ఖాన్..
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను ముంబై కేప్ టౌన్ తిరిగి నియమించింది. కాగా తొట్ట తొలి సీజన్లో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్.. గాయం కారణంగా రెండో సీజన్‌కు దూరమయ్యాడు.ఇప్పుడు వచ్చే ఏడాది సీజన్‌కు అతడు అందుబాటులోకి రావడంతో మరోసారి కేప్‌టౌన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. తొలి సీజన్లో అతడి సారథ్యంలోని కేప్ టౌన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచి గ్రూపు స్టేజిలోనే రషీద్ జట్టు ఇంటిముఖం పట్టింది. రెండో సీజన్లో కూడా ముంబై తలరాత మారలేదు.రషీద్ స్ధానంలో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా విండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్ వ్యవహరించాడు. రెండో సీజన్లో కూడా ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికే పరిమితమైంది. కనీసం మూడో స్ధానంలోనైనా ముంబై కేప్ టౌన్ తలరాత మారుతుందో లేదో చూడాలి.కాగా ఎస్ఏ 20-2025 సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై కేప్‌టౌన్ జట్టులో స్టోక్స్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కాగా ముంబై కేప్‌టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందినదే అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్ఎ టీ20 లీగ్ మూడో సీజన్ జనవరి 9, 2025న ప్రారంభం కానుంది.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్హ్యుజెన్చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
టెస్ట్ జట్టులో రషీద్ ఖాన్
త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్‌రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.మరో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్‌లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.జింబాబ్వేతో రెండు టెస్ట్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్‌కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ యువ సంచలనం.. ప్రపంచంలోనే?
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఘజన్ఫర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని బంగ్లా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఈ మ్యాచ్‌లో 6.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఘజన్ఫర్ కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఘజన్ఫర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఘజన్ఫర్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో అఫ్గానిస్తాన్ బౌలర్‌గా 18 ఏళ్ల ఘజన్ఫర్ నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2018లో గ్రాస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ వన్డేల్లో 6 వికెట్ల ఘనత సాధించిన మూడో అత్యంత పిన్న వయష్కుడిగా ఘజన్ఫర్ రికార్డులకెక్కాడు. ఈ అఫ్గానీ 18 సంవత్సరాల 231 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్(18 సంవత్సరాల 164 రోజులు) అగ్రస్ధానంలో ఉండగా, రషీద్ ఖాన్(18 సంవత్సరాల 174 రోజులు) రెండో స్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా బంగ్లాదేశ్-అఫ్గాన్ వన్డేల్లో గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా ఘజన్‌ఫన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్హసన్ పేరిట ఉండేది. 2019లో సౌతాంప్టన్‌లో అఫ్గాన్‌తో జరిగిన వన్డేల్లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఘజన్‌ఫన్.. షకీబ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. From 132/3 to 143 all out! 🤯Bangladesh have just been routed by the spin wizardry of AM Ghazanfar! 🪄#AFGvBANonFanCode pic.twitter.com/vLUXe6Xc56— FanCode (@FanCode) November 6, 2024 -
BAN Vs AFG: ఘజన్ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు...బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి పోరులో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 84; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా... కెపె్టన్ హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 52; 2 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. గుర్బాజ్ (5), రహమత్ షా (2), అజ్మతుల్లా (0) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజుర్, తస్కిన్ అహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా మొహమ్మద్ ఘజన్ఫర్ 26 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టాడు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజుమల్ హోస్సేన్ షాంటో (68 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ నిలిచాడు. సౌమ్య సర్కార్ (33), మిరాజ్ (28) మినహా ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తంజీద్ హసన్ (3), మహ్ముదుల్లా (2), ముష్పికర్ (1), రిషాద్ (1), తౌహిద్ (11) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.చదవండి: టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్ -
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్ గిల్‌పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్‌ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్‌గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్‌ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
#RashidKhanMarriage : వైరలవుతున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్లి (ఫొటోలు)
-
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. రషీద్ వివాహం నిన్న (అక్టోబర్ 3) రాత్రి ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో జరిగింది. పష్తూన్ సంప్రదాయం ప్రకారం రషీద్ పెళ్లి చేసుకున్నాడు. రషీద్ వివాహ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ సహా చాలా మంది స్వదేశీ క్రికెటర్లు హాజరయ్యారు. Historical Night 🌉 Kabul is hosting the wedding ceremony of the prominent Afghan cricket star and our CAPTAIN 🧢 Rashid Khan 👑 🇦🇫 @rashidkhan_19Rashid Khan 👑 and his three brother got married at same day.Wishing him a and his thee brother happy and healthy life ahead! pic.twitter.com/YOMuyfMMXP— Afghan Atalan 🇦🇫 (@AfghanAtalan1) October 3, 2024రషీద్‌తో పాటు అతని ముగ్గురు సోదరులకు ఒకే సారి వివాహం జరిగినట్లు తెలుస్తుంది. రషీద్ పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. రషీద్ వివాహ వేదిక వద్ద కొందరు తుపాకులు పట్టుకుని పహారా కాస్తూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 202426 ఏళ్ల రషీద్‌కు ప్రపంచంలో మేటి స్పిన్నర్‌గా పేరుంది. రషీద్ పొట్టి క్రికెట్లో తిరుగులేని బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. రషీద్ విశ్వవ్యాప్తంగా జరిగే ప్రతి లీగ్‌లో పాల్గొంటాడు. టీ20ల్లో రషీద్ సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా (613 వికెట్లు) కొనసాగుతున్నాడు. Congratulations to the one and only King Khan, Rashid Khan, on your wedding! Wishing you a lifetime of love, happiness, and success ahead.@rashidkhan_19 pic.twitter.com/fP1LswQHhr— Mohammad Nabi (@MohammadNabi007) October 3, 2024రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 5 టెస్ట్‌లు, 105 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో రషీద్ 376 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ రషీద్ 121 మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు తీశాడు. రషీద్ ఖాతాలో ఐదు వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి.The wedding hall that will host Rashid Khan’s wedding ceremony in Kabul, Afghanistan today 🔥#ACA pic.twitter.com/FOM2GCkqZw— Afghan Cricket Association - ACA (@ACAUK1) October 2, 2024Black is the ultimate style statement. Congratulations Mr. Magician @rashidkhan_19 🎉🎊 pic.twitter.com/KlMYqzpJ32— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) October 3, 2024 -
53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. యాభై మూడేళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత వరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా ఐదు వికెట్లతో చెలరేగి రేర్ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకీ అదేంటంటారా?!..అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య యూఏఈ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. వన్డేల్లో ప్రొటిస్‌పై మొదటి విజయం అందుకున్న హష్మతుల్లా బృందం.. రెండో వన్డేలో సంచలన విజయం సాధించింది. బవుమా సేనను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది.షార్జా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై నెగ్గి.. అఫ్గన్ సిరీస్ గెలవడంలో 26 ఏళ్ల రషీద్ ఖాన్‌ది కీలక పాత్ర. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు బౌల్ చేసిన ఈ స్పిన్ మాంత్రికుడు కేవలం 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ డి జోర్జి(17), ఐడెన్ మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2) రషీద్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు.ఇదిలా ఉంటే.. శుక్రవారం(సెప్టెంబరు 20) రషీద్ ఖాన్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలో వన్డే చరిత్రలో పుట్టినరోజున ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఈ అఫ్గన్ స్టార్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు తమ బర్త్‌డే నాడు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వెర్నర్ ఫిలాండర్ 2007లో ఐర్లాండ్ మీద 4/12, ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 2010లో ఆస్ట్రేలియా మీద 4/44 గణాంకాలు నమోదు చేశారు.High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్‌ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్‌తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
సౌతాఫ్రికాతో అఫ్గన్ వన్డే సిరీస్.. స్టార్ స్పిన్నర్ రీఎంట్రీ
అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేయనున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా షార్జా వేదికగా అఫ్గన్ జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది.ఆ ఇద్దరు దూరంఇందుకు సెప్టెంబరు 18- 22 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. హహ్మతుల్లా షాహిది కెప్టెన్సీలోని ఈ టీమ్‌లోకి రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. మరో కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సైతం చీలమండ నొప్పి వల్ల సెలక్షన్‌కు అందుబాటులోకి రాలేకపోయాడని వెల్లడించింది.రషీద్ రావడం సంతోషంవీరి స్థానాల్లో అబ్దుల్ మాలిక్, దార్విష్ రసూలీలను జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా వెన్నునొప్పి కారణంగా రషీద్ ఖాన్ కొన్నిరోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తాము ఆడబోతున్న ఏకైక జట్టుకు రషీద్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అఫ్గన్ బోర్డు గతంలో విచారం వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు అతడు జట్టుతో చేరడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసింది.కివీస్‌తో టెస్టు మొదలుకాకుండానేఇక భారత్‌లోని నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఏకైక టెస్టుకు అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. నోయిడా స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో.. చిత్తడిగా మారిన అవుట్‌ఫీల్డ్ ఎండకపోవడంతో తొలిరెండు రోజుల ఆట రద్దైంది. ఇక మూడో రోజు నుంచి వర్షం మొదలుకావడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో సోమవారం మొదలుకావాల్సిన టెస్టు మ్యాచ్ నాలుగు రోజులైనా.. కనీసం టాస్ కూడా పడలేదు. శుక్రవారం నాటి ఐదో రోజు ఆట కూడా రద్దైతే.. అఫ్గన్-కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోనుంది.సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, దార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతి, అల్లా మొహమ్మద్ గజన్ఫర్, ఫజల్ హక్ ఫారూఖీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
కివీస్‌తో టెస్టుకు అఫ్గన్ జట్టు ప్రకటన.. రషీద్ లేకుండానే!
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్‌లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది. నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానేఅయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్‌కు కీలకం కానున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్‌కు నో ప్లేస్అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు. ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట గెలిచింది.న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్. -
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్.. రషీద్ ఖాన్‌కు విశ్రాంతి
సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్‌ను ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. 20 సభ్యులున్న ఈ జట్టుకు హష్మతుల్లా షాహిది సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు చోటు దక్కలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా రషీద్ ఖాన్‌కు విశ్రాంతి ఇస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రషీద్‌కు టెస్ట్ మ్యాచ్ ఆడే ఫిట్నెస్ లేదని ఏసీబీ పేర్కొంది. రషీద్ ఆగస్ట్ 12న జరిగిన హండ్రెడ్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అర్దంతరంగా అతను ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ ఇటీవల జరిగిన ఓ లోకల్ టోర్నీలో పాల్గొన్నా టెస్ట్ క్రికెట్ ఆడే స్థాయి అతనికి లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. రషీద్.. న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ అనంతరం జరిగే సౌతాఫ్రికా వన్డే సిరీస్కంతా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఏసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 18-22 మధ్య తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు 20 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ ఈనెల 28న గ్రేటర్ నొయిడాలోకి సన్నాహక శిబిరానికి చేరుకుంటుంది. ఈ సన్నాహక శిబిరంలో ప్రతిభ ఆధారంగా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తారు. బీసీసీఐ గ్రేటర్ నోయిడాను ఆఫ్ఘనిస్తాన్‌కు హోం గ్రౌండ్ కింద అలాట్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, బహీర్ షా మహబూబ్, ఇక్రమ్ అలీఖేల్ (వికెట్‌కీపర్), షాహిదుల్లా కమల్, గుల్బాదిన్ నాయబ్, అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, షాహమ్సుర్ రెహ్మాన్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్, నిజత్ మసూద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీద్ జద్రాన్, ఖలీల్ అహ్మద్, యమా అరబ్. -
ట్రెంట్ రాకెట్స్‌కు బిగ్ షాక్.. హండ్రెడ్ లీగ్ నుంచి రషీద్ ఖాన్ ఔట్
హండ్రెడ్ లీగ్ నుంచి ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఔటయ్యాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ స్థానాన్ని ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ భర్తీ చేయనున్నాడు.ప్రస్తుతం హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్ దశలో ఈ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా రాకెట్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే.ప్రస్తుతానికి ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. వెల్ష్ ఫైర్, లండన్ స్పిరిట్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి.కాగా, ఇటీవల సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు సమర్పించుకుని ట్రెంట్ రాకెట్స్ ఓటమికి పరోక్ష కారకుడైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. -
వరుసగా ఐదు సిక్సర్లు.. రషీద్ ఖాన్‌కు చుక్కలు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్
హండ్రెడ్ లీగ్‌లో సథరన్ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఆగస్ట్ 10) ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన పోలార్డ్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు రెండుసార్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు పోలార్డ్ శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ టీ20లో అఖిల ధనంజయం బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తాజాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఓ సెట్లో (హండ్రెడ్ లీగ్‌లో ఐదు బంతులను ఓ సెట్‌గా పరిగణిస్తారు) ఐదుకు ఐదు సిక్సర్లు కొట్టాడు. పొట్టి క్రికెట్లో రషీద్‌ను ఈ స్థాయిలో చితక్కొట్టిన బౌలర్ కూడా లేడు. ఈ మ్యాచ్‌కు ముందు రషీద్ బౌలింగ్‌లో ఓ ఓవర్లో అత్యధికంగా నాలుగు సిక్సర్లు మాత్రమే వచ్చాయి. Kieron Pollard against yellow teams. 🥶- Rashid Khan taken to the cleaners, 5 sixes in a row. 🤯pic.twitter.com/CjrB63JwWD— Mufaddal Vohra (@mufaddal_vohra) August 11, 20242016 టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ డివిలియర్స్ రషీద్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 2018 ఐపీఎల్లో క్రిస్ గేల్, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్కో జన్సెన్, 2024 ఐపీఎల్లో విల్ జాక్స్ రషీద్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదారు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పోలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల వర్షం కురిపించాడు. 127 పరుగుల ఛేదనలో 14 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్.. రషీద్ వేసిన 16వ సెట్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఐదు సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లో తన జట్టు విజయానికి 49 పరుగులు అవసరం కాగా.. పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ బౌలింగ్‌ను ఊచకోత కోసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పోలార్డ్ 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. పోలార్డ్ విధ్వంసం ధాటికి బ్రేవ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
కిరాన్ పొలార్డ్ విధ్వంసం.. వరుసగా 5 సిక్స్‌లు! వీడియో వైరల్
ది హండ్రెడ్ లీగ్-2024లో శనివారం సౌతాంప్టన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సదరన్ బ్రేవ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు.127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ తొలుత కాస్త ఆచితూచి ఆడాడు. బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఒకనొక దశలో 14 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అభిమానులకు విసుగు తెప్పించాడు. ఆఖరి 20 బంతుల్లో సదరన్ బ్రేవ్ విజయానికి 49 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో అప్పటివరకు జిడ్డు బ్యాటింగ్ చేసిన పొలార్డ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ట్రెంట్ రాకెట్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను పొలార్డ్ ఊచకోత కోశాడు. 16వ సెట్ బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పొలార్డ్ వరుసగా 5 సిక్స్‌లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్.. 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు. 127 పరుగుల లక్ష్యాన్ని 99 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. View this post on Instagram A post shared by Southern Brave (@southernbrave) -
చరిత్రపుటల్లోకెక్కిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నంబర్ వన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్రపుటల్లోకెక్కాడు. టీ20 ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2024లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 29 జరిగిన మ్యాచ్‌లో రషీద్ 600 వికెట్ల క్లబ్లో చేరాడు. ఒరిజినల్స్ బ్యాటర్ పాల్ వాల్టర్ వికెట్ తీయడంతో 600 వికెట్ల మైలురాయిని తాకడు. టీ20ల్లో రషీద్‌కు ముందు విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రమే 600 వికెట్లు తీశాడు. బ్రావో 578 మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టగా.. రషీద్ కేవలం 441 మ్యాచ్‌ల్లో 600 వికెట్ల ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో, రషీద్ తర్వాత సునీల్ నరైన్ (557), ఇమ్రాన్ తాహిర్ (502), షకీబ్ అల్ హసన్ (492), ఆండ్రీ రసెల్ (462) ఉన్నారు. భారత్ నుంచి అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ ఉన్నాడు. చహల్ 305 మ్యాచ్‌ల్లో 354 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న రషీద్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. రషీద్‌తో పాటు ఇమాద్ వసీం (2/21), సామ్ కుక్ (2/37) రాణించడంతో రసవత్తర పోరులో ఒరిజినల్స్‌పై రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు. -
హండ్రెడ్ లీగ్‌లో రసవత్తర సమరం.. పరుగు తేడాతో రషీద్ ఖాన్ టీమ్ విజయం
హండ్రెడ్ లీగ్ 2024లో నిన్న (జులై 29) ఓ రసవత్తర సమరం జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డన్ ఉన్నాడు. జోర్డన్ థాంప్సన్ బౌలింగ్ చేస్తున్నాడు. మామూలు షాట్ ఆడినా ఓ పరుగు సులువుగా వచ్చేది. అయితే హోల్డన్ భారీ షాట్‌తో మ్యాచ్ ముగిద్దామని ప్రయత్నించి సామ్ హెయిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా రాకెట్స్ మ్యాచ్‌ను చేజార్చుకుంది. 2 runs needed off 1 ball and then this happened 🤯🤯🤯The craziest match of the year already 🔥#TheHundred #tapmad #HojaoADFree pic.twitter.com/2ByQfycxNJ— Farid Khan (@_FaridKhan) July 29, 2024ఈ మ్యాచ్‌లో రాకెట్స్ సునాయాసంగా గెలవాల్సింది. చివరి ఐదు బంతుల్లో ఆ జట్టు ఆరు పరుగులు చేస్తే గెలిచి ఉండేది. సికందర్ రజా తొలి రెండు బంతులకు రెండు డబుల్స్ తీసి రాకెట్స్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మూడో బంతికి పరుగు రాకపోగా.. నాలుగో బంతికి సికందర్ రజా రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. జోర్డన్ థాంప్సన్ లెంగ్త్ డెలివరిని వేయగా హోల్డన్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్వర్డ్ స్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు.నిన్ననే ఇరు జట్ల మధ్య జరిగిన మహిళల మ్యాచ్‌లో ఫలితం రివర్స్ అయ్యింది. ట్రెంట్ రాకెట్స్‌పై మాంచెస్టర్ ఒరిజినల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 137 పరుగులు చేయగా.. రాకెట్స్ 100 బంతుల్లో 136 పరుగులకే ఓటమిపాలైంది. -
డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీ.. రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ 22, జాషువ ట్రంప్ 3, మిలింద్ కుమార్ 2, సావేజ్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. స్టోయినిస్ 24, డ్వేన్ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ 2, నోష్తుష్ కెంజిగే, ఎహసాన్ ఆదిల్ తలో వికెట్ పడగొట్టారు.రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం వృధా177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్ పటేల్ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్ ఖాన్ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. రషీద్ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (17 బంతుల్లో 5), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్ 4, జియా ఉల్ హక్ 2, మొహమ్మద్ మోహిసిన్ ఓ వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ జైత్రయాత్ర ముగిసింది. ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ ఓటమితో ఆఫ్ఠనిస్తాన్ వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ సెమీస్ దాకా చేరిన ఆఫ్ఘనిస్తాన్ అవమానకర రీతిలో వైదొలగడం ప్రతి క్రికెట్ అభిమానిని కలిచి వేస్తుంది. ఈ ఓటమి అనంతరం ఆఫ్ఘన్ల గుండెలు బద్దలయ్యాయి. ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దేశ అభిమానుల బాధ అయితే వర్ణణాతీతంగా ఉంది. ఆఫ్ఘన్ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిన అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్, కోచ్ జోనాథన్ ట్రాట్ ముఖాల్లో విషాద ఛాయలు కనిపించాయి. వారి ముఖాలు చూస్తే ఎంత కఠినాత్ములకైనా జాలేయాల్సిందే. రషీద్ ఖాన్ కన్నీటిపర్యంతమవుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఓటమి అనంతరం డగౌట్‌కు చేరుకునే క్రమంలో ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఏడ్చినంత పని చేశారు. ఆఫ్ఘన్ ఆటగాళ్ల విషాద ముఖాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఆఫ్ఘన్లను ఓదారుస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే తలెత్తుకో కెప్టెన్ అని ట్వీట్ చేసింంది. Chin up, Skipp! You've given us the World this event! 🙌@RashidKhan_19#AfghanAtalan | #T20WorldCup | #GloriousNationVictoriousTeam pic.twitter.com/jFu6SO2vmX— Afghanistan Cricket Board (@ACBofficials) June 27, 2024మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్‌కు తొలిసారి సెమీస్‌కు చేరామన్న సంతోషం కనీసం రెండ్రోజులైనా లేకుండా పోయింది. ఈ బాధ నుంచి వారు బయటపడాలంటే సమయం తీసుకుంటుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మెరుగైన జట్లకు షాకిచ్చి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆసీస్, బంగ్లాదేశ్‌లపై విజయాల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంతోషం వర్ణణాతీతంగా ఉండింది. ఆఫ్ఘన్ల సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా సెమీఫైనల్లో ఓటమి ఆ జట్టు ఆటగాళ్లను, ఆ దేశ అభిమానులను కలిచి వేస్తుంది.ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల తేడాతో చిత్తు ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.ఇవాళ రాత్రి 8 గంటలకు జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంది ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
T20 World Cup 2024: రషీద్ ఖాన్‌కు మందలింపు
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బ్యాట్‌ను నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను ఫైన్‌గా విధించింది. 24 నెలల వ్యవధిలో రషీద్ చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐసీసీ స్వల్ప చర్యలతో సరిపెట్టింది. బ్యాట్‌ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని లెవెల్ 1 తప్పిదంగా పరిగణిస్తారు.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ సందర్భంలో తన బ్యాటింగ్ భాగస్వామి కరీం జనత్ స్ట్రైక్‌ను తిరస్కరించినందుకు (రెండో పరుగు) రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో ఆ జట్టుకు సౌతాఫ్రికా చేతిలో చుక్కెదురైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది. ఇవాళే (జూన్ 27, రాత్రి 8 గంటలకు) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
భారత్‌కు ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్ ఖాన్ బృందం టీ20 వరల్డ్‌కప్-2024లో సెమీస్ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే. న్యూజిలాండ్‌పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దాకా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో అఅఫ్గన్ క్రికెట్ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్‌కు తాలిబన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ ఖాన్ ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక అఫ్గన్ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్ నేతలు, అఫ్గన్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..రషీద్ ఖాన్కెప్టెన్గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ఓపెనర్గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్ ఉల్ హక్ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.ట్రవిస్ హెడ్‌ను క్లీన్»ౌల్డ్ చేసిన అతని అవుట్‌స్వింగర్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్ జడేజా (వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్ బ్రేవో (బౌలింగ్ కన్సల్టెంట్): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్ ట్రాట్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన ట్రాట్ హెడ్ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్ కొనసాగించింది. ట్రాట్ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. మహ్మద్ నబీ15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్–డివిజన్–5లో జపాన్, బోట్స్వానావంటి జట్లతో తలపడిన టీమ్ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్ కప్ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్ టీమ్ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. కల నిజమైందిసెమీస్కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్ ఖాన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్ -సాక్షి. క్రీడా విభాగం -
సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
ఐసీసీ వరల్డ్‌కప్‌లలో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఎదైనా ఉందంటే మనకు టక్కున గుర్తుచ్చేది దక్షిణాఫ్రికానే. టోర్నీ మొత్తం ఆసాధరణమైన ప్రదర్శన.. వరుసగా విజయాలు. కానీ కీలకమైన సెమీఫైనల్స్‌లో మాత్రం ఒత్తిడికి చిత్తు. ఇప్పటివరకు అటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ, ఇటు టీ20 వరల్డ్‌కప్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ సఫారీలు మరోసారి టైటిల్ రేసులో నిలబడ్డారు. పొట్టి వరల్డ్‌కప్‌లలో ముచ్చటగా మూడోసారి సెమీస్‌లో సౌతాఫ్రికా అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 తొలి సెమీఫైనల్లో భాగంగా ట్రినడాడ్ వేదికగా శుక్రవారం సంచలనాల అఫ్గానిస్తాన్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.ఈ సారైనా గట్టుకెక్కుతుందా?ఓవరాల్‌గా వన్డే, టీ20 ప్రపంచకప్‌ల నాకౌట్స్‌లో దక్షిణాఫ్రికా 10 సార్లు తలపడింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించింది. అది కూడా క్వార్టర్ ఫైనల్లో కావడం గమనార్హం. ఇక 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండు సార్లు సెమీఫైన్సల్ ఆడిన దక్షిణాఫ్రికా ఓసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వగా.. మరోసారి ఇండియా చేతిలో పరాజయం పాలైంది. కానీ ఈసారి మాత్రం తమ పేరిట ఉన్న చోకర్స్ ముద్రను ఎలాగైనా చెరేపేయాలన్న కసితో దక్షిణాఫ్రికా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా ఉన్న సౌతాఫ్రికా అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.దక్షిణాఫ్రికా బలబలాలు..దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు అంతా మంచి రిథమ్‌లో కూడా ఉన్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ మాత్రం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అదేవిధంగా స్పిన్‌ను కూడా ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అఫ్గాన్ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సఫారీ బౌలర్లు అదరగొడుతున్నారు. నోర్జే, రబాడ, జానెసన్ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పేస్ త్రయం చెలరేగితే అఫ్గాన్ బ్యాటర్లకు కష్టాల్లు తప్పవు.అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..అయితే ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న అఫ్గానిస్తాన్‌ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వంటి పటిష్టమైన జట్లను ఓడించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలను ఢీ కొట్టనుంది. అఫ్గాన్ బ్యాటింగ్ పరంగా కాస్త వీక్‌గా కన్పిస్తున్నప్పటకి బౌలింగ్‌లో మాత్రం బలంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అదేవిధంగా పేస్ బౌలింగ్‌లోనూ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ సత్తాచాటుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా ఓపెనర్లపైనే అఫ్గాన్ ఆధారపడుతోంది. సెమీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అఫ్గాన్ అదరగొడితే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు.