రీ ఎంట్రీలో అదరగొట్టిన రషీద్‌ ఖాన్‌.. 14 ఏళ్ల రికార్డు బద్దలు | Afghanistan's Rashid Khan breaks 14-year-old record | Sakshi
Sakshi News home page

AFG vs IRE: రీ ఎంట్రీలో అదరగొట్టిన రషీద్‌ ఖాన్‌.. 14 ఏళ్ల రికార్డు బద్దలు

Published Sat, Mar 16 2024 5:34 PM | Last Updated on Sat, Mar 16 2024 5:44 PM

Rashid Khan breaks 14 year old record  - Sakshi

అఫ్గానిస్తాన్‌ టీ20 కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న రషీద్‌.. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో రషీద్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో రషీద్‌ సత్తాచాటాడు. తన 4 ఓవర్ల కోటా స్పెల్‌లో 19 పరుగులిచ్చి రషీద్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. పాల్‌ స్టిర్లింంగ్‌, క్యాంప్‌హెర్‌ వంటి కీలక వికెట్లను ఖాన్‌ పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్‌ ఖాన్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసిన అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌గా రషీద్‌ నిలిచాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ న‌వ్‌రోజ్ మంగ‌ల్ పేరిట ఉండేది. 2014 వర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో ఐర్లాండ్‌పై మంగ‌ల్ 4 ఓవ‌ర్ల‌లో 23 ర‌న్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.  తాజా మ్యాచ్‌తో మంగల్‌ ఆల్‌టైమ్‌ రికార్డును రషీద్‌ ఖాన్‌ బ్రేక్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ అనుహ్యంగా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు రషీద్‌ ఫుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడం​ గుజరాత్‌ టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement