IRELAND
-
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్ మహిళలలతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. తద్వారా ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో మొత్తం రెండు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండింట కూడా పరాజయం పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.ఐర్లాండ్ బ్యాటర్లలో వాల్ష్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అన్నాబెల్ స్క్వైర్స్(13), హర్సిన్(10) రాణించారు. పాక్ బౌలర్లలో మెమూనా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టగా.. మనహర్ జెబ్, హషిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులకే పరిమితమైంది.పాక్ బ్యాటర్లలో కోమాల్ ఖాన్(12) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో ఎల్లీ మెక్‌గీ రెండు వికెట్లు పడగొట్టగా.. సార్జెంట్, లారా మెక్‌బ్రైడ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. -
T20 WC 2025 USA vs Ire: ధనాధన్.. 9.4 ఓవర్లలోనే..
ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025)లో అమెరికా తొలి గెలుపు నమోదు చేసింది. అమెరికా యువతుల జట్టు ఐర్లాండ్(Ireland Women U19 vs USA Women U19)పై మెరిక విజయం సాధించింది. కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జొహూర్ బహ్రూ వేదికగా సోమవారం జరిగిన ఈ ‘సూపర్ షో’ టోర్నీకే వన్నె తెచ్చింది. 75 పరుగులకే ఆలౌట్ముందుగా ఐర్లాండ్ 17.4 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అలైస్ వాల్ష్ (16; 2 ఫోర్లు), లాలా మెక్బ్రిడ్ (13), అబీ హ్యారిసన్ (13), ఫ్రెయా సర్జెంట్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.ఇసాని వాఘెలా 3, అదితిబా, రీతూ సింగ్, చేతన ప్రసాద్ తలా 2 వికెట్లు తీశారు. తెలుగు సంతతి అమ్మాయి ఇమ్మడి శాన్వీ ఒక వికెట్ తీసింది. తర్వాత అమెరికా జట్టు 9.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు దిశా ఢీంగ్రా (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తెలుగు సంతతి అమ్మాయి పగిడ్యాల చేతన రెడ్డి (25 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. ఆ మరుసటి బంతికే ఇసాని వాఘేలా (4 నాటౌట్) బౌండరీ బాదడంతో ఇంకా 10.2 ఓవర్లు మిగిలుండగానే అమెరికా అమోఘ విజయం సాధించింది. ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో శ్రీలంకతో వెస్టిండీస్ (ఉదయం 8 గంటల నుంచి), మలేసియాతో భారత్ (మధ్యాహ్నం 12 గంటల నుంచి) తలపడతాయి.సంచలన విజయంఈ మెగా టోర్నీతోనే వరల్డ్‌కప్‌లో అరంగేట్రం చేసిన ఆఫ్రికా దేశం నైజీరియా యువతుల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన పోరులో నైజీరియా... న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మహిళల క్రికెట్లో కివీస్ బలమైన జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు ఏమాత్రం తీసిపోని గట్టి ప్రత్యర్థి. అలాంటి జట్టును తాము నిర్దేశించిన 66 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించకుండా నిలువరించడం పెద్ద విశేషం.గ్రూప్ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నైజీరియా నిర్ణీత 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ లక్కీ పియెటి (25 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్‌స్కోరర్ కాగా, లిలియన్ ఉడే (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రెండంకెల స్కోరు చేసింది.ఇతరుల్లో ఇంకెవరూ కనీసం పది పరుగులైనా చేయలేదు. తర్వాత స్వల్ప లక్ష్యమే అయినా కివీస్ 13 ఓవర్లలో 6 వికెట్లకు 63 పరుగులే చేసి ఓడింది. అనిక టాడ్ (27 బంతుల్లో 19; 1 ఫోర్), ఇవ్ వొలాండ్ (15 బంతుల్లో 14; 1 ఫోర్) మెరుగ్గా ఆడారంతే! లలియన్ ఉడే (3–0–8–1) బౌలింగ్‌లోనూ అదరగొట్టింది.ఆఖరి ఓవర్ డ్రామా... కివీస్ 57/5 స్కోరు చేసి గెలుపు వాకిట నిలబడింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు చేస్తే చాలు. కానీ నైజీరియన్ బౌలర్ లక్కీ పియెటి 6 పరుగులే ఇచ్చింది. దీంతో 2 పరుగుల తేడాతో ఊహించని విధంగా న్యూజిలాండ్ కంగుతింది. లక్కీ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులే ఇచ్చింది. ఇందులో రెండో బంతి ‘బై’ కాగా, నాలుగో బంతి లెగ్‌బై!అంటే బ్యాటర్లు కొట్టింది 2 పరుగులే అన్నమాట! ఐదో బంతికి పరుగే ఇవ్వలేదు. ఇక మిగిలింది. చివరి బంతి... కివీస్ గెలిచేందుకు 5 పరుగులు కావాలి. అయాన్ లంబట్ (6 నాటౌట్) కొట్టిన షాట్‌కు 2 పరుగులే రాగా, మరో పరుగుకు ప్రయతి్నంచడంతో కెప్టెన్ టష్ వేక్లిన్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) రనౌటైంది. చదవండి: 10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం -
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
రాజ్‌కోట్: భారత పర్యటనలో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ జట్టు మందకొడిగా బౌలింగ్ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్ రిఫరీ జి.ఎస్.లక్షి... ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్‌ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్‌ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
ఐర్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్..
-
టాప్ ఫోర్... వైల్డ్ ఫైర్
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్‌పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్‌కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్‌కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్‌పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్‌పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్ బ్యాటింగ్‌కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్‌ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్‌కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్‌గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్‌గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్: వోర్లా ప్రెండర్‌గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0. -
టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. గతంలో భారత అత్యధిక స్కోర్ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్‌పై భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లో భారత్ విండీస్‌పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్ దక్కించకుంది.వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు..370/5 ఐర్లాండ్‌పై (2025)358/2 ఐర్లాండ్‌పై (2017)358/5 వెస్టిండీస్‌పై (2024)333/5 ఇంగ్లండ్‌పై (2022)325/3 సౌతాఫ్రికాపై (2024)317/8 వెస్టిండీస్‌పై (2022)314/9 వెస్టిండీస్‌పై (2024)302/3 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసింది. లియా పాల్ (59) అర్ద సెంచరీతో రాణించింది.భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్ ఏమీ మగూర్ 3 వికెట్లు పడగొట్టింది. -
సిరీస్ విజయంపై గురి
రాజ్‌కోట్: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో ప్రతీక రావల్, తేజల్ హసబ్నిస్ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్‌లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్ ఫామ్ కొనసాగించాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టిటాస్ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్ అదే జోష్‌లో సిరీస్ సమం చేయడంతో పాటు... భారత్‌పై తొలి విజయం సాధించాలని చూస్తోంది. -
ప్రతీక, తేజల్ గెలిపించగా...
రాజ్‌కోట్: భారత మహిళల క్రికెట్ జట్టులో ఇటీవలే కొత్తగా వచ్చిన ఇద్దరు యువ బ్యాటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సత్తా చాటారు. వన్డే కెరీర్లో కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ప్రతీక రావల్, తేజస్ హసబ్నిస్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఆటకు సీనియర్ స్మృతి మంధాన తోడవటంతో ఐర్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డే భారత్ ఖాతాలో చేరింది. జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేయగా... భారత్ 34.3 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. రాణించిన గాబీ, లియా... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక ఐర్లాండ్ ఇబ్బంది పడింది. 29 పరుగుల వ్యవధిలో జట్టు తొలి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెప్టెన్ గాబీ లూయిస్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు), లియా పాల్ (73 బంతుల్లో 59; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 25 ఓవర్ల పాటు పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన ఈ జోడీ ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించింది. ఈ క్రమంలో గాబీ 75 బంతుల్లో, లియా 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కండరాల నొప్పితో బాధపడుతూ ఆడిన గాబీ త్రుటిలో తన తొలి సెంచరీని చేజార్చుకుంది. భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా ఐర్లాండ్‌కు కలిసొచ్చిoది.మన ఫీల్డర్లు నాలుగు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో ఒకటి గాబీ క్యాచ్, మరో రెండు లియా క్యాచ్‌లు కాగా...చివర్లో ఎర్లీన్ కెల్లీ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్యాచ్ కూడా వదిలేయడంతో ఐర్లాండ్ 50 ఓవర్లు ఆడగలిగింది. భారీ భాగస్వామ్యం... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రతీక రావల్ (96 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ స్మృతి మంధాన (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి వేగంగా ఛేదనను ప్రారంభించారు. వీరిద్దరు 10.1 ఓవర్లలోనే 70 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (6 బంతుల్లో 9; 2 ఫోర్లు) వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలో ప్రతీకకు తేజల్ (46 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు) జత కలిసింది. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ జట్టును వేగంగా గెలుపు దిశగా తీసుకుపోయారు. 70 బంతుల్లో ప్రతీక, 43 బంతుల్లో తేజల్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. భారత్ విజయం కోసం మరో 21 పరుగులు కావాల్సి ఉండగా, ప్రతీక 75 పరుగుల వద్ద ఉంది. ఈ దశలో మాగ్వైర్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 89కి చేరిన ఆమె మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగింది. తేజల్తో కలిసి రిచా ఘోష్ (8 నాటౌట్) ఆట ముగించింది. ఈ మ్యాచ్‌తో సయాలీ సత్ఘరే భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 152వ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా ఫోర్బ్స్ (సి) దీప్తి (బి) సాధు 9; గాబీ లూయిస్ (సి అండ్ బి) దీప్తి 92; యునా రేమండ్ (రనౌట్) 5; ప్రెండర్‌గాస్ట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రియ 9; డెలానీ (బి) ప్రియా మిశ్రా 0; లియా పాల్ (రనౌట్) 59; క్రిస్టినా కూల్టర్ (నాటౌట్) 15; ఎర్లీన్ కెల్లీ (ఎల్బీ) (బి) సయాలీ 28; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–27, 2–34, 3–56, 4–56, 5–173, 6–194, 7–230. బౌలింగ్: టిటాస్ సాధు 9–1–48–1, సయాలీ సత్ఘరే 10–2–43–1, సైమా ఠాకూర్ 10–0–30–0, ప్రియా మిశ్రా 9–1–56–2, దీప్తి శర్మ 10–1–41–1, ప్రతీక రావల్ 2–0–14–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) సార్జంట్ 41; ప్రతీక రావల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 89; హర్లీన్ డియోల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 20; జెమీమా (స్టంప్డ్) కూల్టర్ (బి) మాగ్వైర్ 9; తేజల్ (నాటౌట్) 53; రిచా ఘోష్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (34.3 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–70, 2–101, 3–116, 4–232. బౌలింగ్: ఒర్లా ప్రెండర్‌గాస్ట్ 4.4–0–28–0, జార్జినా డెంప్సీ 5.3–0– 50–0, ఎర్లీన్ కెల్లీ 6–0–29–0, ఫ్రేయా సార్జంట్ 8–0–38–1, ఎయిమీ మాగ్వైర్ 8–1–57–3, లౌరా డెలానీ 2.2–0–36–0. -
భారత జట్టు తరపున అరంగేట్రం.. ఎవరీ సయాలీ గణేష్?
రాజ్‌కోట్ వేదికగా భారత మహిళల జట్టు తొలి వన్డేలో ఐర్లాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హర్మాన్ ప్రీత్ కౌర్ గైర్హజరీలో స్మతి స్మృతి మంధాన భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌తో ముంబైకి చెందిన ఆల్‌రౌండర్ సయాలీ సత్ఘరే గణేష్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెప్టెన్ స్మతి స్మృతి మంధాన చేతుల మీదగా ఆమె ఇండియా క్యాప్‌ను అందుకుంది. ఈ క్రమంలో నెటిజన్లు ఎవరీ సయాలీ అని వెతుకుతున్నారు.ఎవరీ సయోలీ?24 ఏళ్ల సయోలీ సత్ఘరే దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2015లో అరంగేట్రం చేసిన ఆమె.. అప్పటినుంచి నిలకడగా రాణిస్తోంది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. గతేడాది డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ఆమె ప్రాతినిథ్యం వహించింది. ఆ సీజన్లో తొలుత ఆమె చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైంది.కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సయోలీకి సువర్ణ అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డి హేమలతకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆమె బరిలోకి దిగింది. ఆ మ్యాచ్‌లో ఆమె పర్వాలేదన్పించింది. దీంతో డబ్ల్యూపీఎల్-2025 సీజన్‌కు ముందు గుజరాత్ ఆమెను రూ.10 లక్షలకు రిటైన్ చేసుకుంది. సయోలీ సత్ఘరే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది.దేశీవాళీ క్రికెట్లో అదుర్స్..లిస్ట్-ఎ క్రికెట్లో ఇప్పటివరకు 51 మ్యాచ్‌లు ఆడిన సయోలీ.. 20.81 సగటుతో 666 పరుగులు, 56 వికెట్లు పడగొట్టింది. 2023–24 సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై ఆమె ఆజేయ సెంచరీతో మెరిసింది. బౌలింగ్‌లో 7/5 స్పెల్ అత్యుత్తమ గణాంకాలుగా ఉన్నాయి.తుది జట్లుభారత మహిళల జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సయాలీ సత్ఘరే, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధుఐర్లాండ్ మహిళల జట్టు: సారా ఫోర్బ్స్, గాబీ లూయిస్(కెప్టెన్), ఉనా రేమండ్-హోయ్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా డెలానీ, లేహ్ పాల్, కౌల్టర్ రీల్లీ(వికెట్ కీపర్), అర్లీన్ కెల్లీ, జార్జినా డెంప్సే, ఫ్రెయా సార్జెంట్, ఐమీ మాగైర్ -
వన్డే సమరం!
భారత్, ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య 1993 నుంచి ఇప్పటి వరకు 12 వన్డేలు జరిగాయి. వీటన్నింటిలోనూ భారతే గెలవగా, ఐర్లాండ్‌కు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లన్నీ ఐసీసీ టోర్నీల్లో భాగంగానే నిర్వహించారు ఒక్కసారి కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో ద్వైపాక్షిక పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉండగా... ఐర్లాండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. రాజ్‌కోట్: స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల జట్టు దేశంలోని వేర్వేరు వేదికలపై సిరీస్‌లు ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో బెంగళూరులో, న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో, వెస్టిండీస్‌తో వడోదరలో ఆడిన జట్టు ఇప్పుడు మరో కొత్త వేదిక రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు ఆడనుంది. ప్రస్తుతం ఇరు జట్ల బలబలాలు చూస్తే భారత్ సంపూర్ణ ఆధిక్యంలో కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని జట్టు పట్టుదలగా ఉంది. కొత్త ప్లేయర్లకు అవకాశం... రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. స్మృతి వన్డేల్లో గతంలో ఒకే ఒక మ్యాచ్‌లో కెపె్టన్‌గా వ్యవహరించింది. టాప్ పేసర్ రేణుకా సింగ్ లేకపోవడంతో కాస్త అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్లతోనే ఆమె ఫలితాలు రాబట్టాల్సి ఉంది. అయితే కొత్త ప్లేయర్లను మరింతగా పరీక్షించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. హర్మన్ స్థానంలో రాఘ్వీ బిస్త్ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. మహిళల దేశవాళీ వన్డే టోర్నీలో ఉత్తరాఖండ్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన రాఘ్వీ భారత్ ‘ఎ’ తరఫున ఆసీస్ ‘ఎ’ తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసింది. రేణుక, పూజ వస్త్రకర్తో పాటు అరుంధతి రెడ్డి కూడా జట్టులో లేకపోవడంతో టిటాస్ సాధు, సైమా ఠాకూర్లపై పేస్ బౌలింగ్ భారం ఉంది. ఆల్‌రౌండర్ కావాలంటే సయాలీ సత్ఘరే అందుబాటులో ఉండగా... దీప్తి శర్మ, ప్రియా మిశ్రాకు తోడుగా తుది జట్టులో మరో స్పిన్నర్ కావాలంటే తనూజ కన్వర్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే సైమా, సాధు, ప్రియా కలిపి మొత్తం 20 వన్డేలు కూడా ఆడలేదు. ఓపెనర్‌గా తన స్థానం సుస్ధిరం చేసుకునేందుకు ప్రతీక రావల్‌కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత షఫాలీ వర్మ మరోవైపు దేశవాళీ క్రికెట్లో చెలరేగిపోతోంది. సీనియర్ వన్డే ట్రోఫీలో 527 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆమె వన్డే చాలెంజర్ ట్రోఫీలో కూడా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో మెరుపు వేగంతో రెండు అర్ధసెంచరీలు సాధించింది. ఈ నేపథ్యంలో ప్రతీక ఆ స్థాయి దూకుడును చూపించాల్సి ఉంది. మరో ఓపెనర్‌గా స్మృతి సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలాంశం. హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లపై భారత బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్లే బలం... గాబీ లూయిస్ సారథ్యంలో ఐర్లాండ్ ఈ సిరీస్‌కు సన్నద్ధమైంది. ఈ టీమ్‌లో కూడా కొందరు అనుభవజు్ఞలతో పాటు ఎక్కువ మంది యువ ప్లేయర్లు ఉన్నారు. 2024లో జింబాబ్వే, శ్రీలంకలపై వన్డే సిరీస్‌లు నెగ్గిన ఐర్లాండ్... ఇంగ్లండ్, బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్‌పై 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక వన్డే మ్యాచ్‌లో గెలవగలిగింది. ఐర్లాండ్ టీమ్‌లో ఒర్లా ప్రెండర్ఘాస్ట్ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఆల్‌రౌండర్‌గా గత ఏడాది జట్టు తరఫున అత్యధిక పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకపై చేసిన సెంచరీ ఆమె సత్తాను చూపించింది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆమెకు మంచి అనుభవం ఉంది. మరో ఆల్‌రౌండర్ లౌరా డెలానీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎయిమీ మగ్వైర్, జొవానా లాఫ్రన్ టీమ్‌లో ఇతర ప్రధాన ప్లేయర్లు. అయితే గత కొంతకాలంగా సంచలన ఆటతో 19 ఏళ్ల ఐర్లాండ్ స్టార్‌గా ఎదిగిన ఎమీ హంటర్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడం జట్టును కాస్త బలహీనపర్చింది. -
స్మృతి సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు స్మృతినే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. విండీస్‌తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్‌కు కూడా విరామం ఇచ్చారు. విండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్‌కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్‌కోట్‌లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది. జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్‌కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్ఘరే. -
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్‌గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్‌కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్‌ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్‌గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్‌కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్‌గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టబ్స్ విధ్వంసర సెంచరీ.. సౌతాఫ్రికా చేతిలో ఐర్లాండ్ చిత్తు
అబుదాబి వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 174 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రోటీస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. సఫారీ బౌలర్ల దాటికి కేవలం 169 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ పేసర్ లిజార్డ్ విలియమ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, జార్న్ ఫోర్టుయిన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, బార్టమన్ చెరో వికెట్ పడగొట్టారు. ఐరీష్ బ్యాటర్లలో క్రెయిగ్ యంగ్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సెంచరీతో చెలరేగిన స్టబ్స్..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 81 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. స్టబ్స్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. స్టబ్స్‌తో పాటు వెర్నయనే(67), ముల్డర్(43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్, కాంఫ్హర్, హోయ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఆక్టోబర్ 7న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: T20 WC: న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే? -
చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం
పరిమిత ఓవర్ల క్రికెట్లో సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. టీ20 వరల్డ్‌కప్ అనంతరం ఆ జట్టు వెస్టిండీస్ (టీ20 సిరీస్‌లో 0-3 తేడాతో ఓటమి), ఆఫ్ఘనిస్తాన్ (వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి) లాంటి సాధారణ జట్ల చేతుల్లో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ పసికూన ఐర్లాండ్ చేతుల్లోనూ ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. టీ20ల్లో ఐర్లాండ్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం.THE HISTORIC MOMENT FOR IRELAND.- First time ever Ireland beat South Africa in a T20i match. 🇮🇪pic.twitter.com/Hp6BtushbB— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024మెరుపు శతకంతో అలరించిన రాస్ అదైర్అబుదాబీ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అదైర్ బ్రదర్స్ బ్యాట్‌తో, బంతితో చెలరేగి ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. రాస్ అదైర్ మెరుపు శతకంతో (58 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (31 బంతుల్లో 52) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్ 2, ఎంగిడి, విలియమ్స్, క్రుగెర్ తలో వికెట్ పడగొట్టారు.బంతితో చెలరేగిన మార్క్ అదైర్196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మార్క్ అదైర్ (4-0-31-4), గ్రహం హ్యూమ్ (4-0-25-3) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాథ్యూ హంఫ్రేస్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (51), మాథ్యూ బ్రీట్జ్కీ (51) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ (36) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చదవండి: ఐదో వన్డేలో ఆసీస్ విజయం.. సిరీస్ కైవసం -
ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం
మహిళల టీ20 క్రికెట్లో పసికూన ఐర్లాండ్ పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాకిచ్చింది. నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఓర్లా ప్రెండర్‌గాస్ట్ ఆల్‌రౌండ్ షోతో (2/31, 51 బంతుల్లో 80; 13 ఫోర్లు) అదరగొట్టి ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఆఖరి ఓవర్లో ఐర్లాండ్ గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. మ్యాడీ విలియర్స్ (ఇంగ్లండ్ బౌలర్) వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి భయపెట్టింది. అయినా ఐర్లాండ్ ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం. ఈ గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.The celebrations by Irish women after beating England women for the first time ever in a T20i. ❤️pic.twitter.com/H6pdzWzLuL— Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బేమౌంట్ (40), స్కోల్ఫీల్డ్ (34), బ్రైయోనీ స్మిత్ (28), జార్జియా ఆడమ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్, ఆర్లీన్ కెల్లీ, ఆమీ మాగ్యూర్ తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. మరో బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రెండర్‌గాస్ట్ (80).. గ్యాబీ లెవిస్ (38), లియా పాల్ (27 నాటౌట్) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించింది. చివరి ఓవర్లో కాసేపు నాటకీయ పరిణామాలు (ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది) చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా ఐర్లాండ్‌నే విజయం వరించింది. ఐర్లాండ్ దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు -
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్‌కు ఆడిన సిమికాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లిఅయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ భారీ విజయం
మహిళల ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 9) జరిగిన వన్డే మ్యాచ్‌లో (రెండో వన్డే) ఇంగ్లండ్ 275 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. టామీ బేమౌంట్ (150 నాటౌట్) భారీ శతకంతో సత్తా చాటింది. బేమౌంట్‌కు ఫ్రేయా కెంప్ (65) సహకారం అందించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లీనా కెల్లీ, ఫ్రేయా సర్జంట్ చెరో రెండు.. అలీస్ టెక్టార్, జేన్ మగూర్, ఏమీ మగూర్ తలో వికెట్ పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 16.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు (ఉనా రేమండ్ (22)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్, లారెన్ ఫైలర్ తలో మూడు.. ఫ్రేయా కెంప్, జార్జియా డేవిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న జరుగనుంది. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. -
సౌతాఫ్రికా జట్ల ప్రకటన.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం మూడు వేర్వేరు దక్షిణాఫ్రికా జట్లను ఇవాళ (సెప్టెంబర్ 9) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో సౌతాఫ్రికా తొలుత ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు షార్జా వేదికగా జరుగనున్నాయి. ఆతర్వాత సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అబుదాబీ వేదికగా జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్ స్మిత్, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 18, 20, 22 తేదీల్లో జరుగనుంది. ఐర్లాండ్‌తో టీ20లు సెప్టెంబర్ 27, 29.. వన్డేలు అక్టోబర్ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రైన్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెయిన్, లిజాడ్ విలియమ్స్ -
ప్రాణాపాయ స్థితిలో ఐర్లాండ్ టాప్ క్రికెటర్.. ఇండియాలో చికిత్స
ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్‌జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్‌జిత్‌కు కాలేయ మార్పిడి జరుగనుందని.. ఆస్పత్రి సిబ్బంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.మొహాలీ నుంచి ఐర్లాండ్‌కు సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సిమి.. దేశవాళీ క్రికెట్ ఆడాడు. అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.అయితే, ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో హోటల్ మేనేజ్మెంట్ చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి ఏడాది డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికాపై శతకం బాదిఅద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. ఐర్లాండ్ టాప్ క్రికెటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శతకం బాది సంచలనం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సిమి వంద పరుగుల మార్కు అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను అలరించింది. ఇక 2020లో ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న సిమి సింగ్.. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అతడి లివర్ పూర్తిగా పాడైపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొంది. భార్య కాలేయదానంకాగా సిమి భార్య అగమ్‌దీప్ కౌర్ అతడికి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. డబ్లిన్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తను కాపాడుకునేందుకు ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐర్లాండ్‌లో ఉన్నపుడు ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లకు సిమి సమస్య అర్థం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతడిని భారత్‌కు తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.చదవండి: T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్ -
శ్రీలంకకు వరుస షాక్‌లు
మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టుకు వరుస షాక్‌లు తగలుతున్నాయి. ఆ జట్టు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో వరుస మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతుంది. తొలుత టీ20 సిరీస్‌ను సమం చేసుకుని బయటపడ్డ శ్రీలంక.. తాజాగా వన్డే సిరీస్‌ను ఐర్లాండ్‌కు కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై ఐర్లాండ్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆమీ హంటర్ (66), లేయా పాల్ (81), రెబెకా స్టోకెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, అచిని కులసూరియ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చమారి ఆటపట్టు ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను హర్షిత సమరవిక్రమ (105) సెంచరీతో గెలిపించే ప్రయత్నం చేసింది. లంక ఇన్నింగ్స్‌లో హర్షితతో పాటు కవిష దిల్హరి (53) కూడా రాణించింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ 3, జేన్ 2, ఓర్లా, ఆమీ, ఫ్రేయా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఐర్లాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడు వన్డే ఆగస్ట్ 20న జరుగనుంది. -
సూపర్ సెంచరీ: శ్రీలంకపై ఐర్లాండ్ తొలి గెలుపు
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తొలిసారి శ్రీలంక జట్టుపై గెలుపు నమోదు చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత శతకంతో ఇది సాధ్యమైంది. కాగా రెండు టీ20, ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక మహిళా జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.17 ఫోర్లు, 2 సిక్సర్లుఇరు జట్ల మధ్య ఆదివారం నాటి (ఆగష్టు 11) తొలి టీ20లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలవగా.. మంగళవారం రాత్రి నాటి రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను అనూహ్య రీతిలో విజయం వరించింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆమీ హంటర్ 9 పరుగులకే అవుటైనా.. మరో ఓపెనర్ గాబీ లూయిస్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.#Champion https://t.co/RSI0agcCbl— Cricket Ireland (@cricketireland) August 13, 2024 ఏకంగా 17 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 75 బంతుల్లోనే 119 పరుగులతో సత్తా చాటింది. గాబీకి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్(38) రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 173 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే తమ ఓపెనర్ విష్మి గుణరత్నె(1) వికెట్ కోల్పోయింది.రాణించిన హర్షిత, కవిశా.. కానీ ఓటమి తప్పలేదుఅయితే, మరో ఓపెనింగ్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది. నాలుగో స్థానంలో వచ్చిన కవిశా దిల్హారీ 51 పరుగులతో అజేయంగా నిలవగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగిన శ్రీలంక ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మహిళా జట్టుకు శ్రీలంకపై తొలి అంతర్జాతీయ విజయం దక్కింది. ఐరిష్ బౌలర్లలో ఫ్రెయా సార్గెంట్, ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్ రెండేసి వికెట్లు తీయగా.. జానే మాగ్విరే, అవా కానింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండో టీ20లో విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఐర్లాండ్. గాబీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.What. A. Game. https://t.co/PL5dcMepch— Cricket Ireland (@cricketireland) August 13, 2024 చదవండి: The Hundred 2024: కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో) -
IRE Vs ZIM: బౌండరీని ఆపబోతే ఇలా అయ్యిందేంటి..?
ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతంది.Fielder saves 4, batters run 5.pic.twitter.com/UgZqOp7iBc— CricTracker (@Cricketracker) July 28, 2024వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో ఆండీ మెక్‌బ్రైన్ కవర్ డ్రైవ్ ఆడగా.. టెండాయ్ చటార బౌండరీ లైన్ వరకు ఛేజింగ్ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్‌బ్రైన్, లోర్కాన్ టక్కర్ ఐదు పరుగులు తీశారు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్‌బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
ఐర్లాండ్ బ్యాటర్ల వీరోచిత పోరాటం.. జింబాబ్వేపై సంచలన విజయం
స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుత విజయం నమోదు చేసింది. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్‌బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఐర్లాండ్‌కు చారిత్రక విజయం అందించారు. ఓవర్‌నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాది ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
నిప్పులు చెరిగిన నగరవ.. ఓటమి దిశగా ఐర్లాండ్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ మూడో రోజు ఆఖరి సెషన్లో నిప్పులు చెరిగాడు. నగరవ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. బ్లెస్సింగ్ ముజరబాని ఓ వికెట్ పడగొట్టాడు. నగరవ ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ ఏకంగా ముగ్గురు (పీటర్ మూర్, కర్టిస్ క్యాంఫర్, హ్యారీ టెక్టార్) డకౌట్లయ్యారు. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 4, పాల్ స్టిర్లింగ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. లొర్కాన్ టక్కర్ 9, ఆండీ మెక్ బ్రైన్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఐర్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే మరో 125 పరుగులు చేయల్సి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగా చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసింది. -
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే క్రికెటర్ క్లైవ్ మండాడే టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో ‘బై’స్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో టెస్టు సందర్భంగా ఈ పరాభవం మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే చేదు జ్ఞాపకాన్ని పోగుచేసుకున్నాడు.అరంగేట్రంలో డకౌట్ఏకైక టెస్టు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా గురువారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. 71.3 ఓవర్లలో 210 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.ఓపెనర్లు గుంబీ 49, మస్వారే 74 పరుగులతో రాణించారు. సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మండాడే ఏడో స్థానంలో బరిలోకి దిగి.. డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మూర్ 79 రన్స్ చేయగా.. ఆండీ మెక్‌బ్రైన్ 28 పరుగులతో ఐరిష్ ఇన్నింగ్స్‌లో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కంటే.. 40 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.90 ఏళ్ల రికార్డు బద్దలుఅయితే, ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 24 ఏళ్ల క్లైవ్ మండాడే బైస్ రూపంలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ వికెట్ కీపర్ లెస్ ఆమ్స్ నమోదు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా 147 ఏళ్ల చరిత్రలో ఇలాంటి అన్వాంటెడ్ రికార్డు సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే, ఇందులో కేవలం క్లైవ్‌ను మాత్రమే తప్పుపట్టడానికి లేదు. జింబాబ్వే బౌలర్లకు కూడా ఇందులో భాగం ఉంది. కాగా 1934లో ఆమ్స్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 37 పరుగులు బైస్ రూపంలో ఇచ్చుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే ఐర్లాండ్ కంటే 28 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది జింబాబ్వే.తుదిజట్లుజింబాబ్వేజోయ్ లార్డ్ గుంబీ, ప్రిన్స్ మస్వారే, డియాన్ మేయర్స్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మాండాడే (వికెట్ కీపర్), బ్లెస్సింగ్ ముజరాబానీ, రిచర్డ్ నగరవా, తనకా చివంగా, టెండాయ్ చటారా.ఐర్లాండ్ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), పీటర్ మూర్, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, మాథ్యూ హంఫ్రీస్.