స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి రోజే ప్రత్యర్ధిని 210 పరుగులకు ఆలౌట్ చేశారు. బ్యారీ మెక్ కార్తీ, ఆండీ మెక్‌బ్రైన్ చెరి మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించగా.. మార్క్ అదైర్ 2, క్రెయిగ్ యంగ్, కర్టిస్ క్యాంఫర్ తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ప్రిన్స్ మస్వౌరే 74 పరుగులతో రాణించగా.. జాయ్‌లార్డ్ గుంబీ (49), సీన్ విలియమ్స్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డియాన్ మైయర్స్ (10), కెప్టెన్ క్రెయిర్ ఎర్విన్ (5), బ్రియాన్ బెన్నెట్ (8), క్లైవ్ మదండే (0), బ్లెస్సింగ్ ముజరబానీ (4), రిచర్డ్ నగరవ (5), టెండయ్ చటార (0) నిరాశపరిచారు.
కాగా, సొంతగడ్డపై ఐర్లాండ్‌కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది.
Comments
Please login to add a commentAdd a comment