Zimbabwe
-
ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలు
కోస్టా నవారినో (గ్రీస్): విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారి మహిళను వరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా జింబాబ్వేకు చెందిన విఖ్యాత స్విమ్మర్, ప్రస్తుతం జింబాబ్వే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న కిర్స్టీ కొవెంట్రీ ఎన్నికయింది. ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీపడగా... బరిలో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఐఓసీలోని 97 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా... విజయానికి అవసరమైన 49 ఓట్లు కొవెంట్రీకి తొలి రౌండ్లోనే లభించాయి. ఒలింపిక్ దినోత్సవమైన జూన్ 23న ఐఓసీ అధ్యక్ష పదవిని అలంకరించనున్న కొవెంట్రీ ఎనిమిదేళ్లపాటు (2033 వరకు) ఈ పదవిలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్ ఈ పదవిలో గరిష్టంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. కొవెంట్రీ అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖరారవుతుంది. ఏడు ఒలింపిక్ పతకాలు... ఐఓసీ అత్యున్నత పదవి దక్కించుకున్న తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందిన కొవెంట్రీకి విశ్వ క్రీడల్లో ఘనమైన రికార్డు ఉంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడిన ఆమె మొత్తం 7 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం) సాధించింది. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో కాంస్యం దక్కించుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించగా... 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో రజతం, 400 మీటర్ల మెడ్లీలో రజతం కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు ఆమె సంపాదించింది. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో 200 మీటర్ల మెడ్లీలో స్వర్ణం నెగ్గిన కొవెంట్రీ... ఆల్ ఆఫ్రికా గేమ్స్‌లో 14 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం సాధించింది. -
జింబాబ్వేదే టి20 సిరీస్
హరారే: సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి పోరు వర్షం కారణంగా రద్దు కాగా... జింబాబ్వే 1–0తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. రెండో టి20లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగిన చివరి టి20లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (27 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), టోనీ (26), తషింగా (26 నాటౌట్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్, గారెత్ డెలానీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఐర్లాండ్ జట్టు లక్ష్యఛేదనకు దిగకముందే భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ సాధ్యపడలేదు. ఫలితంగా జింబాబ్వేకు సిరీస్ దక్కింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ జట్టు విజయం సాధించగా... అనంతరంమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వే 2–1తో గెలుపొందింది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఐర్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వెల్లింగ్టన్ మసకద్జ (35), బ్రియాన్ బెన్నెట్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్ కర్రన్ (18), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (4), జోనాథన్ క్యాంప్‌బెల్ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు, కర్టిస్ క్యాంఫర్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్, జాషువ లిటిల్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (89), వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ క్యాంఫర్ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్ టక్కర్ (36 నాటౌట్), జార్జ్ డాక్రెల్ (20 నాటౌట్) ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది. -
బెన్నెట్ విధ్వంసకర సెంచరీ.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే
ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను జింబాబ్వే విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 49 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (163 బంతుల్లో 169; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బెనెట్ చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (61 బంతుల్లో 66; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)... బెనెట్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.ఏకైక టెస్టులో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన జింబాబ్వే తొలి వన్డేలో దానికి బదులు తీర్చుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 46 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ స్టిర్లింగ్ (32), క్యాంపెర్ (44), టెక్టర్ (39), టకర్ (31), డాక్రెల్ (34), మెక్‌బ్రైన్ (32) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎన్గరవా మూడు వికెట్లు పడగొట్టారు. బెనెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్? -
సచిన్, కోహ్లికి సాధ్యం కాని ఘనతను సాధించిన జింబాబ్వే ఆటగాడు
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) సాధించలేని ఘనతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఓ ఘనతను ఇవాళ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) సాధించాడు. బెన్నెట్.. 22 ఏళ్లు నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్, విరాట్ ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించలేదు. విరాట్ 23 ఏళ్ల 134 రోజుల వయసులో .. సచిన్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ సాధించారు.వన్డే క్రికెట్ చరిత్రలో బ్రియాన్ కంటే చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 4 రోజులు) అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించగా.. బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (20 ఏళ్ల 149 రోజులు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (20 ఏళ్ల 353 రోజులు) ఆతర్వాతి ఉన్నారు. తాజాగా బ్రియాన్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న వన్డేలో బ్రియాన్ 163 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. కెరీర్లో కేవలం ఏడో వన్డేలోనే బ్రియాన్ రికార్డు సెంచరీ సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో 150 పరుగుల మార్కును తాకిన ఐదో క్రికెటర్‌గా బ్రియాన్ రికార్డుల్లోకెక్కాడు. దీనికి ముందు బ్రియాన్ జింబాబ్వే తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ క్రెయిగ్ ఐర్విన్ (66) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్ 28, సికందర్ రజా 8, మెదెవెరె 8, జోనాథన్ క్యాంప్‌బెల్ (అలిస్టర్ క్యాంప్‌బెల్ కొడుకు) 6, మరుమణి 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, జాషువ లిటిల్, హ్యూమ్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 31 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. పాల్ స్టిర్లింగ్ 32, కర్టిస్ క్యాంపర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. హ్యారీ టెక్టార్ (33), లోర్కాన్ టక్కర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. -
జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్‌బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. మెక్‌బ్రైన్, అదైర్తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్‌కార్తీ 4, ఆండీ మెక్‌బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్‌బెల్ చెరో వికెట్ పడగొట్టారు.292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్‌కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్‌తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. -
రాణించిన ఐరీష్ కెప్టెన్.. జింబాబ్వే లక్ష్యం 292
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐర్లాండ్... ఆతిథ్య జట్టు ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారం మూడో రోజు 83/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్ 93.3 ఓవర్లలో 298 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (60; 2 ఫోర్లు), లార్కన్ టక్కర్ (58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ 4, ట్రెవర్ వాండు, వెస్లీ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం కలిపి 292 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే... మూడో రోజు ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.టాపార్డర్ బ్యాటర్లు కైటానో (14; 3 ఫోర్లు), బెన్ కరన్ (4), నిక్ వెల్చ్ (5) వికెట్లను పారేసుకోగా... ఆట నిలిచే సమయానికి బ్రియాన్ బెన్నెట్ (15 బ్యాటింగ్, 1 ఫోర్), ట్రెవర్ వాండు (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడేర్, బారీ మెకార్తీ, మాథ్యూ హంఫ్రేస్ తలా ఒక వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్నప్పటికీ జింబాబ్వే విజయానికి 254 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లున్నాయి.చదవండి: SA T20: ఫైనల్లో సన్‌రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్ -
సంచలనం.. అరంగేట్రంలోనే టీమ్ కెప్టెన్‌గా
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌తో లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ క్యాంప్‌బెల్ తనయుడు జోనాథన్ కాంప్‌బెల్ జింబాబ్వే తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా తన అరంగేట్ర మ్యాచ్‌లోనే జింబాబ్వే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం కాంప్‌బెల్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రెగ్యూలర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారంణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో 27 ఏళ్ల జోనాథన్‌కు జట్టు పగ్గాలను జింబాబ్వే టీమ్ మెనెజ్‌మెంట్ అప్పగించింది. తద్వారా కాంప్‌బెల్ ఓ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రంలోనే జింబాబ్వే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో ప్లేయర్‌గా కాంప్‌బెల్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ డేవ్ హౌటన్ ఉన్నాడు. హౌటన్ 1992లో హరారే వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే సారథిగా వ్యవహరించాడు.ఇక ఓవరాల్‌గా 21వ శతాబ్దంలో డెబ్యూలోనే టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో ప్లేయర్‌గా జోనాథన్ కాంప్‌బెల్ రికార్డులకెక్కాడు. కాంప్‌బెల్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లీ జెర్మెన్ 1995లో భారత్‌తో జరిగిన టెస్టులో తన అరంగేట్రంలోనే కెప్టెన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత స్ధానాల్లో నైమూర్ రెహమాన్ (2000లో బంగ్లాదేశ్), విలియం పోర్టర్‌ఫీల్డ్ (2018లో ఐర్లాండ్), అస్గర్ ఆఫ్ఘన్ (2018లో ఆఫ్ఘనిస్తాన్) ఉన్నారు. వీరిందరూ అరంగేట్రంలోనే తమ జట్ల టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. జోనాథన్ కాంప్‌బెల్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. 34 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలతో సహా 1,913 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 42 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు:జింబాబ్వే (ప్లేయింగ్ XI): బెన్ కుర్రాన్, టకుద్జ్వానాషే కైటానో, నిక్ వెల్చ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ కాంప్‌బెల్(కెప్టెన్), వెస్లీ మాధవెరె, న్యాషా మాయావో(వికెట్ కీపర్), న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ న్గారవ, బ్లెస్సింగ్ ముజారబానీ, ట్రెవర్ గ్వాండుఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పీటర్ మూర్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్‌కీపర్), ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, క్రెయిగ్ యంగ్చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు సమం -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్‌ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్ ఆరు టెస్ట్‌ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్‌ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ తర్వాతి స్థానంలో ఉన్నారు.జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్‌లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.రెండో స్థానంలో రషీద్ఆరు టెస్ట్‌ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (45) సౌతాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చార్లీ టర్నర్ టాప్‌లో నిలిచాడు. టర్నర్ ఆరు టెస్ట్‌ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లుఈ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రషీద్‌తో పాటు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రమే వరుసగా రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.జింబాబ్వేతో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్ షా (139), ఇస్మత్ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇస్మత్ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి డెబ్యూలో సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్ ఆలం రికార్డుల్లోకెక్కాడు.జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్ తన స్పిన్ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 72 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు అఫ్గన్ క్రికెట్ జట్టు జింబాబ్వే(Afghanistan tour of Zimbabwe, 2024-25) పర్యటనకు వెళ్లింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసంఈ క్రమంలో హరారే వేదికగా తొలుత టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన అఫ్గన్.. వన్డే సిరీస్‌ను కూడా 2-1తో నెగ్గింది. అనంతరం బులవాయోలో టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ క్రమంలో అఫ్గన్- జింబాబ్వే(Zimbabwe vs Afghanistan) మధ్య గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధీటుగా బదులిచ్చినాఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందుకు జింబాబ్వే ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు సాధించింది. సికందర్ రజా(61), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(75) అర్ధ శతకాలతో రాణించగా.. సీన్ విలియమ్స్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురి పోరాటం కారణంగా అఫ్గన్ కంటే.. జింబాబ్వే 86 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో హష్మతుల్లా బృందం పొరపాట్లకు తావివ్వలేదు. రహ్మత్ షా(Rahmat Shah) భారీ శతకం(139)తో చెలరేగగా.. ఇస్మత్ ఆలం(101) కూడా శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అఫ్గన్ 363 పరుగులు చేయగలిగింది. తద్వారా జింబాబ్వేకు 278 పరుగుల టార్గెట్ విధించింది.13 నిమిషాల్లోనే ఖేల్ ఖతంలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ జింబాబ్వే.. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి.. ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తద్వారా విజయానికి 73 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, అఫ్గన్ స్పిన్నర్ల ధాటికి ఆఖరి రోజు ఆటలో కేవలం 13 నిమిషాల్లోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అఫ్గన్ 72 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర2017లో అఫ్గనిస్తాన్ టెస్టు జట్టు హోదా పొందింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా.. ఇది నాలుగో విజయం. అదే విధంగా జింబాబ్వేపై రెండోది. కాగా 2021లోనూ జింబాబ్వేతో అఫ్గనిస్తాన్ రెండు టెస్టుల్లో తలపడగా.. 1-1తో నాటి సిరీస్ డ్రా అయింది. అయితే, ఈసారి మాత్రం అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేపై రెండో టెస్టులో గెలిచి.. తొలిసారి ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.చదవండి: Ind vs Pak: ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు -
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
సూపర్ సెంచరీతో ఆదుకున్న రహ్మత్ షా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఆదుకున్న షా69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్‌ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జింబాబ్వేకు ఆధిక్యం
బులవాయో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జింబాబ్వేకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 86 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఎర్విన్ (75) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సికందర్ రజా (61), సీన్ విలియమ్స్ (49) రాణించారు. జింబాబ్వే జట్టులో జాయ్‌లార్డ్ గుంబీ 8, బెన్ కర్రన్ 15, కైటానో 0, డియాన్ మైయర్స్ 5, బ్రియాన్ బెన్నెట్ 2, న్యూమ్యాన్ న్యామ్హురి 11, రిచర్డ్ నగరవ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అహ్మద్జాయ్ మూడు, ఫరీద్ అహ్మద్ రెండు, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. అబ్దుల్ మాలిక్ 1, రియాన్ హసన్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. రహ్మత్ షా (6), హస్మతుల్లా షాహిది (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 67 పరుగులు వెనుకపడి ఉంది. రెండో రోజు ఆట కొనసాగుతుంది.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ 17, రియాజ్ హసన్ 12, రహ్మద్ షా 19, షాహిది 13, జజాయ్ 16, షహీదుల్లా 12, ఇస్మత్ అలామ్ 0, అహ్మద్ జాయ్ 2, జియా ఉర్ రెహ్మాన్ 8 (నాటౌట్), ఫరీద్ అహ్మద్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమ్యాన్ న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని రెండు, నగరవ ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్ 157 ఆలౌట్
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్‌తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరస కట్టారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్‌లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs AUS: రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే? -
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్‌లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్‌ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్‌కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షాహిదీ ఆల్‌టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో -
ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోత
బులవాయో: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు కూడా జింబాబ్వే జోరే కొనసాగింది. దీంతో ఆ జట్టు తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (176 బంతుల్లో 104; 10 ఫోర్లు), బ్రియాన్ బెనెట్ (124 బంతుల్లో 110 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో మొత్తం మూడు శతకాల మోత మోగింది. తొలిరోజు ఆటలో సీన్ విలియమ్స్ సెంచరీ సాధించాడు.ఓవర్‌నైట్ స్కోరు 363/4తో రెండో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 135.2 ఓవర్లలో 586 పరుగుల వద్ద ఆలౌటైంది. 2001లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జింబాబ్వే చేసిన 563/9 స్కోరే ఇప్పటిదాకా అత్యధిక పరుగులు కాగా... ఇప్పుడా రికార్డును సవరించింది.ఓవర్‌నైట్ బ్యాటర్లలో విలియమ్స్ ఎంతోసేపు నిలువలేదు. ఇర్విన్... తర్వాత వచ్చిన బెనెట్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. టెయిలెండర్లు న్యుమన్ న్యామ్హురి (26; 2 ఫోర్లు, 1 సిక్స్), ముజరబని (19; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులతో జింబాబ్వే అత్యధిక స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 3, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్, జియావుర్ రహ్మాన్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్లు సిదిఖుల్లా అతల్ (3), అబ్దుల్ మాలిక్ (23; 1 ఫోర్) నిష్క్రమించగా.. రహ్మత్ షా (49 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ ఇంకా 491 పరుగులు వెనుకబడి ఉంది. -
సీన్ విలియమ్స్ అజేయ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా జింబాబ్వే
బులవాయో: జింబాబ్వే పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్‌కు తొలి టెస్టులో ఆతిథ్య బ్యాటర్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ కరన్ (74 బంతుల్లో 68; 11 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ కైటానో (115 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 49 పరుగులు జతచేశారు. కరన్ నిష్క్రమించాక వచ్చిన సీన్ విలియమ్స్ (161 బంతుల్లో 145 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అఫ్గాన్ బౌలర్లపై వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. విలువైన భాగస్వామ్యాలతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు.కైటానోతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు, అనంతరం మైయెర్స్ (27; 3 ఫోర్లు)తో నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. తర్వాత విలియమ్స్, కెప్టెన్ ఇర్విన్ (94 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లోనే విలియమ్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇర్విన్ కూడా అర్ధసెంచరీ సాధించడంతో ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 2, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. -
చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్
Zimbabwe vs Afghanistan, 2nd ODI: అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత హరారేలో టీ20 సిరీస్ జరుగగా.. అఫ్గనిస్తాన్ 2-1తో నెగ్గింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై మంగళవారం వన్డే సిరీస్ మొదలైంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.అతల్ సెంచరీఈ నేపథ్యంలో జింబాబ్వే- అఫ్గనిస్తాన్ మధ్య గురువారం రెండో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. అఫ్గన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకంతో మెరిశాడు. అటల్ 128 బంతుల్లో 104 పరుగులు చేయగా.. అబ్దుల్ 101 బంతుల్లో 84 పరుగులు రాబట్టాడు.ఇలా ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా(5), నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(1) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(30 బంతుల్లో 29 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా.. మహ్మద్ నబీ(16 బంతుల్లో 18) అతడికి సహకారం అందించాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ 5 పరుగులు చేశాడు.54 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే(17.5 ఓవర్లలో) కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ జయభేరి మోగించింది.తద్వారా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా సాధించిన 19 పరుగులే టాప్ స్కోర్. అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.సింగిల్ డిజిట్ స్కోర్లుఓపెనర్లు బెన్ కర్రన్(0), తాడివనాషి మరుమాణి(3).. అదే విధంగా మిగతా ఆటగాళ్లలో డియాన్ మైయర్స్(1), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(4), బ్రియాన్ బెనెట్(0), న్యూమన్ నియామురి(1), రిచర్డ్ ఎంగర్వ(8), ట్రెవర్ గ్వాండు(0), టినోడెండా మపోసా(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సీన్ విలియమ్స్ 16 పరుగులు చేయగలిగాడు.ఇక అఫ్గనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నవీద్ జద్రాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఫజల్హక్ ఫారూకీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు సెదికుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో వన్డే జరుగనుంది. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్‌లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు. -
టెస్ట్ జట్టులో రషీద్ ఖాన్
త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్‌రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.మరో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్‌లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.జింబాబ్వేతో రెండు టెస్ట్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్‌కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ -
మూడో టీ20లో జింబాబ్వే ఓటమి.. సిరీస్ అఫ్గాన్ సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో పర్యాటక అఫ్గాన్ జట్టు సొంతం చేసుకుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జింబాబ్వేను దెబ్బతీశాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌తో పాటు ఓమర్జాయ్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాధవిరే(21), మజకజ్దా(17) పరుగులతో రాణించారు. అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు అఫ్గానిస్తాన్ తీవ్రంగా శ్రమించింది. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నబీ(24 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, గ్వాండు, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సోదరుడు
ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్ల సోదరుడు బెన్ కర్రన్ జింబాబ్వే జాతయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జింబాబ్వే వన్డే జట్టులో బెన్ చోటు దక్కించుకున్నాడు. 28 ఏళ్ల బెన్ జింబాబ్వే మాజీ ఆటగాడు, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ కెవిన్ కర్రన్ తనయుడు. కెవిన్‌కు ముగ్గురు కుమారులు. వీరిలో సామ్, టామ్ కర్రన్లు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా బెన్ జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే దేశవాలీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడం ద్వారా బెన్ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపునందుకున్నాడు. బెన్ ఎడమ చేతి వాటం బ్యాటర్.కాగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. టీ20 జట్టుకు సికందర్ రజా, వన్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బెన్ కర్రన్ కేవలం వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బెన్‌తో పాటు న్యూమ్యాన్ న్యామ్హురి కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. న్యూమ్యాన్ వన్డేతో పాటు టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మొదలవుతాయి. జింబాబ్వే టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా డి ముసెకివాని, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురివన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి, విక్టర్ న్యూయుచి, సికందర్ రజా, సీన్ విలియమ్స్ -
పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించిన పసికూన
బులవాయో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి 132 పరుగులకే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం కాగా.. సల్మాన్ అఘా (32), తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే అష్టకష్టాలు పడి ఎట్టకేలకే విజయతీరాలకు చేరింది. జింబాబ్వే మరో బంతి మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరుమణి (15), డియాన్ మైర్స్ (13), సికంబర్ రజా (19) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. జహన్దాద్ ఖాన్ 2, సల్మాన్ అఘా, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్‌పై జింబాబ్వేకు టీ20ల్లో ఇది మూడో గెలుపు మాత్రమే.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్ నామమాత్రంగా సాగింది. ఈ మ్యాచ్‌లో గెలిచి జింబాబ్వే క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. అంతకుముందు వన్డే సిరీస్‌లోనూ జింబాబ్వే ఓ మ్యాచ్ గెలవగా.. పాక్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
రాణించిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పాకిస్తాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో సల్మాన్ అఘా (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ టాపార్డర్ బ్యాటర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఒమైర్ యూసఫ్ (0), ఉస్మాన్ ఖాన్ (5) విఫలమయ్యారు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన పాక్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను సైతం పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లలో జింబాబ్వే తొలి వన్డేలో మాత్రమే గెలిచింది. -
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ రిస్ట్ స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్రపుటల్లోకెక్కాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ముఖీమ్ 2.4 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున టీ20ల్ల ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఉమర్ గుల్ రెండు సార్లు 5/6 గణాంకాలు నమోదు చేశాడు. పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గానూ ముఖీమ్ రికార్డుల్లోకెక్కాడు. ముఖీమ్, గుల్, ఇమాద్ వసీం (5/14) పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించారు. ముఖీమ్ తన ఏడో టీ20లోనే ఈ ఘనత సాధించడం విశేషం.ముఖీమ్ దెబ్బకు జింబాబ్వే టీ20ల్లో తమ అత్యల్ప స్కోర్‌ను (57) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ మరో 87 బంతులు మిగిలుండగానే జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని (58) ఛేదించింది. టీ20ల్లో బంతుల పరంగా పాక్‌కు ఇది భారీ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 12.4 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. ముఖీమ్ 5, అబ్బాస్ అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (21), మరుమణి (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. అనంతరం 20 పరుగుల వ్యవధిలో జింబాబ్వే 10 వికెట్లు కోల్పోయింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 5.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. సైమ్ అయూబ్ (36), ఒమైర్ యూసఫ్ (22) అజేయంగా నిలిచారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 5న జరుగనుంది. -
Zim vs Pak: తొలి టీ20లో పాకిస్తాన్ గెలుపు
జింబాబ్వేతో తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ శుభారంభం చేసింది. బులవాయోలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై నెగ్గింది. సల్మాన్ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తయ్యబ్ తాహిర్ (25 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (15 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.108 పరుగులకే ఆలౌట్జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, సికందర్ రజా, మసకద్జా, బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 15.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), తదివనషి మరుమని (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.ఇక మిగతా 9 మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం పది పరుగులైనా చేయలేకపోయారు. పాక్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ చెరో మూడు వికెట్లు తీయగా, రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.ఇక మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగుతుంది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్ విజయంపై కూడా కన్నేసింది.పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 స్కోర్లు👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: పాకిస్తాన్.. బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు: 165/4 (20)👉జింబాబ్వే స్కోరు:108 (15.3)👉ఫలితం: జింబాబ్వేపై 57 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తయ్యబ్ తాహిర్.చదవండి: ‘పింక్’ మ్యాచ్‌లో భారత్‌దే విజయం -
జింబాబ్వేతో తొలి టీ20.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఒమైర్ యూసఫ్ 16, సైమ్ అయూబ్ 24, ఉస్మాన్ ఖాన్ 39, సల్మాన్ అఘా 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో తయ్యబ్ తాహిర్ (39), ఇర్ఫాన్ ఖాన్ (27) వేగంగా పరుగులు రాబట్టి అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, సికందర్ రజా, వెల్లింగ్టన్ మసకద్జ, ర్యాన్ బర్ల్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇవాళ (డిసెంబర్ 1) బులవాయోలో జరుగుతుంది. తొలి టీ20కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డే గెలిచి సంచనలం సృష్టించిన జింబాబ్వే ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. -
జింబాబ్వేను చిత్తు చేసిన పాకిస్తాన్.. సిరీస్ సొంతం
బులవాయో స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 99 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. ఇక 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 40.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది.ఆతిథ్య జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ క్రెయిగ్ ఎర్వైన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్నెట్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, ఆర్బర్ ఆహ్మద్, హ్యారీస్ రౌఫ్, జమాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కమ్రాన్ గులాం సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ గులాం(103) తొలి వన్డే సెంచరీ సాధించగా.. షఫీక్(50), మహ్మద్ రిజ్వాన్(37), సల్మాన్ ఆఘా(30) పరుగులతో రాణించారు.జింబాబ్వే బౌలర్లలో రజా,నగరవా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజాబ్రనీ, అక్రమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. -
అరంగేట్రంలోనే రికార్డుల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ అరంగేట్రంలోనే (వన్డే) రికార్డుల్లోకెక్కాడు. అబ్రార్ తొలి మ్యాచ్‌లోనే తమ దేశ దిగ్గజ బౌలర్ అబ్దుల్ ఖాదిర్ సరసన చేరాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (రెండో వన్డే) 4 వికెట్లు తీసిన అబ్రార్, అబ్దుల్ ఖాదిర్‌తో పాటు ఎలైట్ గ్రూప్‌లో చేరాడు. 1984లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అబ్దుల్ ఖాదిర్ కూడా తన అరంగేట్రంలో 4 వికెట్లు తీశాడు. పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో ఇవే అత్యధిక వికెట్లు. అబ్దుల్ ఖాదిర్, అబ్రార్ అహ్మద్‌తో పాటు జాకిర్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్ కూడా పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీశారు. కాగా, జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాక్, ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.విజృంభించిన అబ్రార్.. 145 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వేఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. అబ్రార్ అహ్మద్ (8-2-33-4), అఘా సల్మాన్ (7-0-26-3), సైమ్ అయూబ్ (4-0-16-1), ఫైసల్ అక్రమ్ (5.3-0-19-1) జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.53 బంతుల్లో శతక్కొటిన సైమ్ అయూబ్146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 18.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సైమ్ అయూబ్ విధ్వంసకర సెంచరీతో పాక్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ 53 బంతుల్లో శతక్కొట్టాడు. పాక్ తరఫున వన్డేల్లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ (జాయింట్). ఈ మ్యాచ్‌లో సైమ్ ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ 48 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 28న జరుగనుంది. -
పాక్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఊచకోత
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఓటమికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన రెండో వన్డేలో 10 వికెట్లను తేడాతో జింబాబ్వేను పాక్ చిత్తు చేసింది. 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షషీక్ ఊదిపడేశారు.కేవలం 18.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా పాక్ లక్ష్యాన్ని చేధించింది. సైమ్ ఆయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ షఫీక్(32 నాటౌట్) రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 32.3 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పాక్ బౌలర్లలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. అఘా సల్మాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఇదే వేదికలో నవంబర్ 28న జరగనుంది.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
సంచలనం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన జింబాబ్వే
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. బులవాయో వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగుల(డీఎల్ఎస్) తేడాతో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో నగరవా(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజా(39) పరుగులతో రాణించారు. మరోవైపు పాక్ బౌలర్లలో ఆఘా సల్మాన్, ఫైజల్ ఆక్రమ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ఆతిథ్య జట్టు బౌలర్లు దాటికి పాక్ జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో జింబాబ్వేను విజేతగా అంపైర్లు నిర్ణయించారు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్ రానీ, సికిందర్ రజా, సీన్ విలియమ్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా వన్డేల్లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఓడించడం ఇదే ఆరోసారి కావడం గమనార్హం. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 26న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IPL 2025: వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు -
పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం జింబాబ్వే జట్ల ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా క్రెయిస్ ఎర్విన్.. టీ20 జట్టు సారధిగా సికందర్ రజా ఎంపికయ్యారు. వన్డే జట్టులో కొత్తగా ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (ట్రెవర్ గ్వాండు, తషింగ ముసెకివా, టినొటెండా మపోసా) చోటు దక్కింది. వన్డే జట్టులో సికందర్ రజా, సీన్ విలియమ్స్, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ లాంటి సీనియర్ ప్లేయర్లు.. క్లైవ్ మదండే, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైర్స్ లాంటి యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీ20 జట్టులో వన్డే జట్టు కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్, జాయ్‌లార్డ్ గుంబీకు చోటు దక్కలేదు. పాకిస్తాన్ జట్టు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం పాక్ జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌ల కోసం పాక్ మేనేజ్మెంట్ బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.జింబాబ్వే పర్యటనలో పాక్ షెడ్యూల్..నవంబర్ 24- తొలి వన్డే నవంబర్ 26- రెండో వన్డేనవంబర్ 28- మూడో వన్డేడిసెంబర్ 1- తొలి టీ20డిసెంబర్ 3- రెండో టీ20డిసెంబర్ 5- మూడో టీ20మ్యాచ్‌లన్నీ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనున్నాయి.జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్.జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ -
వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!
అక్కడ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.కొత్త రూల్ ఎందుకంటే..తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు! -
ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు పాక్ జట్ల ప్రకటన
నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం వేర్వేరు పాకిస్తాన్ జట్లను ఇవాళ (అక్టోబర్ 27) ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వి ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి కెప్టెన్‌ను అనౌన్స్ చేస్తాడు.ఆస్ట్రేలియా పర్యటన నవంబర్ 4 నుంచి 18 వరకు జరుగనుంది.ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి.జింబాబ్వే పర్యటన నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతుంది.ఈ పర్యటనలోనూ మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి.ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లకు రెస్ట్ ఇచ్చిన బాబర్ ఆజమ్, నసీం షా, షాహీన్ అఫ్రిదిలను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు.వీరికి తిరిగి జింబాబ్వేతో సిరీస్‌లకు విశ్రాంతినిచ్చారు.స్టార్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ జింబాబ్వేతో టీ20లకు మినహా మిగతా మ్యాచ్‌లకు అన్నింటికీ అందుబాటులో ఉంటాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిదిఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పాక్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షానవాజ్ దహానీ, తయ్యబ్ తాహిర్జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు..అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా, సుఫ్యాన్ మొఖిమ్, ఉస్మాన్ ఖాన్ -
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో పెను సంచలనం
-
స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా
జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లిలను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా గాంబియాతో నిన్న (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్‌లో సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇది అతని కెరీర్లో 17వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు రజా, స్కై, విరాట్, విరన్‌దీప్ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా తలో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా రజా.. స్కై, విరాట్, విరన్లను అధిగమించి తన పేరిట సింగిల్‌గా ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా, స్కై, విరాట్, విరన్ తర్వాత రోహిత్ శర్మ (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.జింబాబ్వే, గాంబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే వరల్డ్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్‌లో సికందర్ రజా సుడిగాలి శతకం (43 బంతుల్లో 133 నాటౌట్; 7 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదాడు. బ్రియాన్ బెన్నెట్ (26 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), మరుమణి (19 బంతుల్లో 62; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మదండే (17 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించారు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలి 290 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా!
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.ఫాస్టెస్ట్ సెంచరీనైరోబీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో సెంచరీ3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో శతకంఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డుఇక గాంబియాతో మ్యాచ్‌లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్‌ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్‌లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
టీ10 క్రికెట్లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం
టీ10 క్రికెట్లో సంచనలం నమోదైంది. జిమ్ ఆఫ్రో లీగ్-2024లో స్కాట్లాండ్ క్రికెటర్ జార్జ్ మున్సే సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. డర్బన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో మున్సే (హరారే బోల్ట్స్) కేవలం 38 బంతుల్లో శతక్కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. జిమ్ ఆఫ్రో లీగ్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ. మున్సే సెంచరీతో శివాలెత్తడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హరారే బోల్ట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. బోల్ట్స్ ఇన్నింగ్స్‌లో మున్సే సెంచరీ తర్వాత ఎక్స్‌ట్రాల రూపంలో (29) అత్యధిక పరుగులు వచ్చాయి. జనిష్క పెరీరా 24, లహీరు మిలంత 13, దసున్ షనక 7 పరుగులు చేశారు. వోల్వ్స్ బౌలర్లలో దౌలత్ జద్రాన్ రెండు వికెట్లు తీశాడు.174 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వోల్వ్స్.. ఏ దశలో గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కొలిన్ మున్రో (32), షర్జీల్ ఖాన్ (25), విల్ స్మీడ్ (16), ఇన్నోసెంట్ కాలా (16), రిచ్మండ్ ముతుంబామి (15) రెండంకెల స్కోర్లు చేశారు. బోల్ట్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, బ్రాండన్ మవుటా, దసున్ షనక, జేమ్స్ నీషమ్, అరినెస్టో వెజా తలో వికెట్ పడగొట్టారు.చదవండి: కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..! -
డేవిడ్ మలాన్ విధ్వంసం.. 25 బంతుల్లోనే..!
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో కేప్ టౌన్ సాంప్ ఆర్మీ (ఇంగ్లండ్) ఆటగాడు డేవిడ్ మలాన్ విధ్వంసం సృష్టించాడు. నైస్ లాగోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. మలాన్‌తో పాటు రోహన్ ముస్తఫా కూడా మెరుపు అర్ద సెంచరీతో (23 బంతుల్లో 50; 10 ఫోర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ.. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ 0, మరుమణి 7, లియోనార్డో జూలియన్ 10, ఖయాస్ అహ్మద్ 8 పరుగులు చేశారు. లాగోస్ బౌలర్లలో బినుర ఫెర్నాండో, ముజరబానీ, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లాగోస్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సాంప్ ఆర్మీ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. లాగోస్ ఇన్నింగ్స్‌లో తిసార పెరీరా (17 బంతుల్లో 48; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రస్సీ వాన్ డెర్ డస్సెన్ 19, అవిష్క ఫెర్నాండో 19, నజీబుల్లా జద్రాన్ 11, ర్యాన్ బర్ల్ 17*, జాషువ బిషప్ 6 పరుగులు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో అమీర్ హంజా 2, డేవిడ్ విల్లే, రోహన్ ముస్తఫా, ఖయాస్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.నిన్ననే (సెప్టెంబర్ 23) జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్‌పై హరారే బోల్ట్స్.. డర్బన్ వోల్వ్స్‌పై బులవాయో జాగ్వర్స్ విజయాలు సాధించాయి. జోబర్గ్ బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరారే బోల్ట్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ 9.4 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. 20 పరుగులు చేసిన సికందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బోల్ట్స్ 9.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దసున్ షనక (21 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో బోల్ట్స్‌ను గెలిపించాడు.డర్బన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో బులవాయో జాగ్వర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వోల్వ్స్.. విల్ స్మీడ్ (55 నాటౌట్), మార్క్ చాప్మన్ (38 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం లారీ ఈవాన్స్ (26), నిక్ హబ్సన్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో జాగ్వర్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: చరిత్ర సృష్టించిన పూరన్ -
క్రికెట్ చరిత్రలో ఓ ఆశ్చర్య ఘటన..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 18వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1997లో ఈ రోజు మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో మూడు అన్నదమ్ములు జోడీలు ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించాయి. నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున ఫ్లవర్ సోదరులు (ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్), స్ట్రాంగ్ సోదరులు (పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్), రెన్నీ సోదరులు (జాన్ రెన్నీ, గావిన్ రెన్నీ) తుది జట్టులో ఆడారు.ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జింబాబ్వే జట్టులో 12వ నంబర్ ఆటగాడు ఆండీ విట్టల్.. జింబాబ్వే ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్న గయ్ విట్టల్‌కు సోదరుడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆండీ విట్టల్ కూడా ఆడి ఉంటే నాలుగు బ్రదర్స్ జోడీలు బరిలో ఉండేవి. క్రికెట్ చరిత్రలో మూడు అన్నదమ్ముల జోడీలు ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగడం అదే మొదటిసారి, చివరిసారి. క్రికెట్లో అన్నదమ్ములు జోడీలు చాలానే ఉన్నప్పటికీ.. ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో మూడు జోడీలు బరిలోకి దిగింది లేదు.ఒకే మ్యాచ్‌లో ఒకే జట్టు తరఫున బరిలోకి దిగిన అన్నదమ్ముల జోడీలు..హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా (భారత్)షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)టామ్ కర్రన్, సామ్ కర్రన్ (ఇంగ్లండ్)ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ (భారత్)స్టీవ్ వా, మార్క్ వా (ఆస్ట్రేలియా)ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే)గై విట్టల్, ఆండీ విట్టల్ (జింబాబ్వే)పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్ (జింబాబ్వే)అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ (సౌతాఫ్రికా)బ్రెండన్ మెక్కల్లమ్, నాథన్ మెక్కల్లమ్ (న్యూజిలాండ్)మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ (ఆస్ట్రేలియా)కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్ (పాకిస్తాన్)బ్రెట్ లీ, షేన్ లీ (ఆస్ట్రేలియా)గ్రెగ్ ఛాపెల్, ఇయాన్ ఛాపెల్, ట్రెవర్ ఛాపెల్ (ఆస్ట్రేలియా)జెస్సీ రైట్, ఫ్రాంక్ రైట్, రిచర్డ్ రైట్ (న్యూజిలాండ్)చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్‌లో..! -
IRE Vs ZIM: బౌండరీని ఆపబోతే ఇలా అయ్యిందేంటి..?
ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతంది.Fielder saves 4, batters run 5.pic.twitter.com/UgZqOp7iBc— CricTracker (@Cricketracker) July 28, 2024వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో ఆండీ మెక్‌బ్రైన్ కవర్ డ్రైవ్ ఆడగా.. టెండాయ్ చటార బౌండరీ లైన్ వరకు ఛేజింగ్ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్‌బ్రైన్, లోర్కాన్ టక్కర్ ఐదు పరుగులు తీశారు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్‌బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
ఐర్లాండ్ బ్యాటర్ల వీరోచిత పోరాటం.. జింబాబ్వేపై సంచలన విజయం
స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుత విజయం నమోదు చేసింది. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్‌బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఐర్లాండ్‌కు చారిత్రక విజయం అందించారు. ఓవర్‌నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాది ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
నిప్పులు చెరిగిన నగరవ.. ఓటమి దిశగా ఐర్లాండ్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ మూడో రోజు ఆఖరి సెషన్లో నిప్పులు చెరిగాడు. నగరవ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. బ్లెస్సింగ్ ముజరబాని ఓ వికెట్ పడగొట్టాడు. నగరవ ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ ఏకంగా ముగ్గురు (పీటర్ మూర్, కర్టిస్ క్యాంఫర్, హ్యారీ టెక్టార్) డకౌట్లయ్యారు. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 4, పాల్ స్టిర్లింగ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. లొర్కాన్ టక్కర్ 9, ఆండీ మెక్ బ్రైన్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఐర్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే మరో 125 పరుగులు చేయల్సి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగా చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసింది. -
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే క్రికెటర్ క్లైవ్ మండాడే టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో ‘బై’స్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో టెస్టు సందర్భంగా ఈ పరాభవం మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే చేదు జ్ఞాపకాన్ని పోగుచేసుకున్నాడు.అరంగేట్రంలో డకౌట్ఏకైక టెస్టు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా గురువారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. 71.3 ఓవర్లలో 210 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.ఓపెనర్లు గుంబీ 49, మస్వారే 74 పరుగులతో రాణించారు. సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మండాడే ఏడో స్థానంలో బరిలోకి దిగి.. డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మూర్ 79 రన్స్ చేయగా.. ఆండీ మెక్‌బ్రైన్ 28 పరుగులతో ఐరిష్ ఇన్నింగ్స్‌లో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కంటే.. 40 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.90 ఏళ్ల రికార్డు బద్దలుఅయితే, ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 24 ఏళ్ల క్లైవ్ మండాడే బైస్ రూపంలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ వికెట్ కీపర్ లెస్ ఆమ్స్ నమోదు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా 147 ఏళ్ల చరిత్రలో ఇలాంటి అన్వాంటెడ్ రికార్డు సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే, ఇందులో కేవలం క్లైవ్‌ను మాత్రమే తప్పుపట్టడానికి లేదు. జింబాబ్వే బౌలర్లకు కూడా ఇందులో భాగం ఉంది. కాగా 1934లో ఆమ్స్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 37 పరుగులు బైస్ రూపంలో ఇచ్చుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే ఐర్లాండ్ కంటే 28 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది జింబాబ్వే.తుదిజట్లుజింబాబ్వేజోయ్ లార్డ్ గుంబీ, ప్రిన్స్ మస్వారే, డియాన్ మేయర్స్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మాండాడే (వికెట్ కీపర్), బ్లెస్సింగ్ ముజరాబానీ, రిచర్డ్ నగరవా, తనకా చివంగా, టెండాయ్ చటారా.ఐర్లాండ్ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), పీటర్ మూర్, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, మాథ్యూ హంఫ్రీస్. -
ఐర్లాండ్ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన జింబాబ్వేృ
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి రోజే ప్రత్యర్ధిని 210 పరుగులకు ఆలౌట్ చేశారు. బ్యారీ మెక్ కార్తీ, ఆండీ మెక్‌బ్రైన్ చెరి మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించగా.. మార్క్ అదైర్ 2, క్రెయిగ్ యంగ్, కర్టిస్ క్యాంఫర్ తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ప్రిన్స్ మస్వౌరే 74 పరుగులతో రాణించగా.. జాయ్‌లార్డ్ గుంబీ (49), సీన్ విలియమ్స్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డియాన్ మైయర్స్ (10), కెప్టెన్ క్రెయిర్ ఎర్విన్ (5), బ్రియాన్ బెన్నెట్ (8), క్లైవ్ మదండే (0), బ్లెస్సింగ్ ముజరబానీ (4), రిచర్డ్ నగరవ (5), టెండయ్ చటార (0) నిరాశపరిచారు.కాగా, సొంతగడ్డపై ఐర్లాండ్‌కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. -
జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన
స్వదేశంలో జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్ జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. 22 ఏళ్ల అన్ క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ గావిన్ హోయ్ జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. ఈ ఒక్క ఎంపిక మినహా మిగతా జట్టంతా ఊహించిన విధంగానే ఉంది. సొంతగడ్డపై ఐర్లాండ్‌కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ఈ నెల 25-29 మధ్యలో బెల్ఫాస్ట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం జింబాబ్వే జట్టును ఇదివరకే ప్రకటించారు. జింబాబ్వే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారథ్యం వహించనున్నాడు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌కు ఐర్లాండ్ జట్టు..ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గావిన్ హోయ్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, ఆండీ మెక్‌బ్రైన్, బారీ మెక్‌కార్తీ, జేమ్స్ మెక్‌కొల్లమ్, పిజె మూర్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రైగ్ యంగ్జింబాబ్వే జట్టు..డియోన్ మైర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, ప్రిన్స్ మస్వౌర్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, రాయ్ కయా, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, క్లైవ్ మదండే, టనకా చివంగ, టెండాయ్ చటారా, బ్లెస్సింగ్ ముజరబాని, వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యాయుచి -
IND vs ZIM: ఆఖరి పంచ్ కూడా మనదే.. 4-1తో సిరీస్ విజయం
హరారే: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు జింబాబ్వే పర్యటనను ఘనవిజయంతో ముగించింది. ఆదివారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో టీమిండియా 42 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. వరుసగా నాలుగో గెలుపుతో భారత బృందం సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. కెప్టెన్ హోదాలో శుబ్‌మన్ గిల్ భారత్‌కు తొలి సిరీస్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌కంటే ముందే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కనబరిచింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు సాధించింది.సంజూ సామ్సన్ (45 బంతుల్లో 58; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అలరించాడు. అనంతరం జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. 26 పరుగులు చేయడంతోపాటు రెండు వికెట్లు పడగొట్టిన శివమ్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 8 వికెట్లు తీయడంతోపాటు 28 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిక్స్‌తో మొదలు... భారత్ ఇన్నింగ్స్ వరుసగా రెండు సిక్స్‌లతో మొదలైంది. సికందర్ రజా వేసిన తొలి బంతినే యశస్వి జైస్వాల్ (5 బంతుల్లో 12; 2 సిక్స్‌లు) సిక్స్‌గా మలిచాడు. ఇది నోబాల్ కూడా కావడంతో భారత్ ఖాతాలో తొలి బంతికే ఏడు పరుగులు చేరాయి. రెండో బంతిపై కూడా జైస్వాల్ సిక్స్ కొట్టాడు. అయితే మరో రెండు బంతుల తర్వాత జైస్వాల్ బౌల్డ్ అవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మూడో ఓవర్లో అభిõÙక్ ఒక సిక్స్ కొట్టగా... గిల్ రెండు ఫోర్లు బాదాడు.ముజరబాని వేసిన నాలుగో ఓవర్లో అభిõÙక్ (11 బంతుల్లో 14; 1 సిక్స్), ఎన్‌గరావా వేసిన ఐదో ఓవర్లో గిల్ (14 బంతుల్లో 13; 2 ఫోర్లు) అవుటయ్యారు. దాంతో భారత్ ఐదు ఓవర్లు ముగిసేసరికి 40/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో సంజూ సామ్సన్, రియాన్ పరాగ్ (24 బంతుల్లో 22; 1 సిక్స్) జాగ్రత్తగా ఆడి నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సామ్సన్ 39 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పరాగ్ పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో భారత స్కోరు 150 దాటింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఒకదశలో 85/3తో పటిష్టంగా కనిపించింది. అయితే మైర్స్ (32 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాకజింబాబ్వే తడబడింది. తొమ్మిది పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) సికందర్ రజా 12; శుబ్‌మన్ గిల్ (సి) సికందర్ రజా (బి) ఎన్‌గరావా 13; అభిõÙక్ శర్మ (సి) మందాడె (బి) ముజరబాని 14; సంజూ సామ్సన్ (సి) మరుమాని (బి) ముజరబాని 58; రియాన్ పరాగ్ (సి) ఎన్‌గరావా (బి) మవూటా 22; శివమ్ దూబే (రనౌట్) 26; రింకూ సింగ్ (నాటౌట్) 11; వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–40, 4–105, 5–135, 6–153. బౌలింగ్: సికందర్ రజా 4–0–37–1, ఎన్‌గరావా 4–0–29–1, ఫరాజ్ అక్రమ్ 4–0– 39–0, ముజరబాని 4–0–19–2, మవూటా 4–0–39–1. జింబాబ్వే ఇన్నింగ్స్: మధెవెరె (బి) ముకేశ్ 0; మరుమాని (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 27; బెనెట్ (సి) దూబే (బి) ముకేశ్ 10; మైర్స్ (సి) అభిõÙక్ (బి) దూబే 34; సికందర్ రజా (రనౌట్) 8; క్యాంప్‌బెల్ (సి) తుషార్ (బి) దూబే 4; మదాండె (సి) సామ్సన్ (బి) అభిõÙక్ శర్మ 1; ఫరాజ్ అక్రమ్ (సి) సామ్సన్ (బి) ముకేశ్ 27; మవూటా (సి అండ్ బి) తుషార్ దేశ్‌పాండే 4; ముజరబాని (నాటౌట్) 1; ఎన్‌గరావా (బి) ముకేశ్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 125. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–59, 4–85, 5–87, 6–90, 7–94, 8–120, 9–123, 10–125. బౌలింగ్: ముకేశ్ 3.3–0–22–4, తుషార్ దేశ్‌పాండే 3–0–25–1, రవి బిష్ణోయ్ 3–0–23–0, వాషింగ్టన్ సుందర్ 2–0–7–1, అభిõÙక్ శర్మ 3–0–20–1, శివమ్ దూబే 4–0–25–2.5 ఇప్పటి వరకు భారత జట్టు ఐదు మ్యాచ్‌లతో కూడిన ఏడు టి20 ద్వైపాక్ష సిరీస్‌లను ఆడింది. ఇందులో ఐదు సిరీస్‌లను (2020లో న్యూజిలాండ్‌పై; 2021లో ఇంగ్లండ్‌పై; 2022లో వెస్టిండీస్‌పై; 2023లో ఆ్రస్టేలియాపై, 2024లో జింబాబ్వేపై) భారత్ దక్కించుకుంది. ఒక సిరీస్‌ను (2023లో వెస్టిండీస్ చేతిలో) కోల్పోయి, మరో సిరీస్‌ను (2022లో దక్షిణాఫ్రికాతో) సమంగా ముగించింది. -
ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు.టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు. టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు. రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియాఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాతొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాసికందర్ రజా వేసిన తొలి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియాహరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
IND VS ZIM 5th T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో విధ్వంసకర వీరుడు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ స్థానంలో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
జైస్వాల్, గిల్ ఘనంగా...
ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా వెళ్లిన యువ జట్టు అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి జింబాబ్వేపై టి20 సిరీస్ విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ సారి సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. నాలుగో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దూకుడైన బ్యాటింగ్ ముందు జింబాబ్వే ఏమాత్రం పోటీనివ్వలేకపోవడంతో జట్టు అలవోకగా లక్ష్యం చేరింది.హరారే: టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన తొలి సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరింది. జింబాబ్వే గడ్డపై జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల పోరులో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...మరుమని (31 బంతుల్లో 32; 3 ఫోర్లు), మదివెరె (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా జట్టును గెలిపించారు. సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు ఇక్కడే జరుగుతుంది. రజా రాణించినా... జింబాబ్వేకు ఓపెనర్లు మరుమని, మదివెరె కొన్ని చక్కటి షాట్లతో మెరుగైన ఆరంభాన్ని అందించారు. సిరీస్‌లో తొలిసారి ఆ జట్టు పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత పేసర్లు ఆరంభంలో కట్టు తప్పడం జింబాబ్వేకు కలిసొచ్చింది.తొలి వికెట్‌కు 52 బంతుల్లో 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ తన తొలి అంతర్జాతీయ వికెట్‌గా మరుమనిని వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లో మదివెరె కూడా అవుట్ కాగా...10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 67/2కు చేరింది. ఈ దశలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టి పడేశారు. నాలుగు పరుగుల వ్యవధిలో బెన్నెట్ (9), క్యాంప్‌బెల్ (3) అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. అయితే రజా దూకుడుగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో జింబాబ్వే 54 పరుగులు సాధించింది. దూబే, రుతురాజ్ ఒక్కో క్యాచ్ వదిలేసినా...భారత్‌కు వాటి వల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఆడుతూ పాడుతూ... జింబాబ్వే ఇన్నింగ్స్ మొత్తంలో 10 ఫోర్లు ఉండగా...భారత ఓపెనర్లు తొలి 4 ఓవర్లలోనే 10 ఫోర్లు బాదారు. ఎన్‌గరవ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన జైస్వాల్...చటారా ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అక్రమ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన గిల్ 35 బంతుల్లో సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బెన్నెట్ ఓవర్లో గిల్ 2 సిక్స్‌లు బాదడంతో మరో ఎండ్‌లో జైస్వాల్‌కు సెంచరీ అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున రాణించి గుర్తింపు తెచ్చుకున్న పేసర్ తుషార్ దేశ్‌పాండే ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 115వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదివెరె (సి) రింకూ సింగ్ (బి) దూబే 25; మరుమని (సి) రింకూ సింగ్ (బి) అభిõÙక్ 32; బెన్నెట్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 9; రజా (సి) గిల్ (బి) దేశ్‌పాండే 46; క్యాంప్‌బెల్ (రనౌట్) 3; మయర్స్ (సి) అండ్ (బి) ఖలీల్ 12; మదాందె (సి) రింకూ సింగ్ (బి) ఖలీల్ 7; అక్రమ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–63, 2–67, 3–92, 4–96, 5–141, 6–147, 7–152. బౌలింగ్: ఖలీల్ 4–0–32–2, దేశ్‌పాండే 3–0–30–1, బిష్ణోయ్ 4–0–22–0, సుందర్ 4–0–32–1, అభిõÙక్ 3–0–20–1, దూబే 2–0–11–1. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 93; గిల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 156. బౌలింగ్: ఎన్‌గరవ 3–0–27–0, ముజరబాని 3.2–0–25–0, చటారా 2–0–23–0, అక్రమ్ 4–0–41–0, రజా 2–0–24–0, బెన్నెట్ 1–0–16–0. -
సిరీస్ విజయమే లక్ష్యంగా...
హరారే: జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోంది. తక్కువ స్కోర్ల తొలి టి20లో తడబడి అనూహ్యంగా ఓటమి పాలైనా... తర్వాతి రెండు మ్యాచ్‌లలో జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారీ స్కోర్లు చేసిన అనంతరం వాటిని నిలబెట్టుకుంది. ఇదే జోరులో మరో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని శుబ్‌మన్ గిల్ బృందం పట్టుదలగా ఉంది. జట్టు సభ్యులంతా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. రుతురాజ్ నిలకడగా ఆడుతుండగా... అభిషేక్ శర్మ రెండో మ్యాచ్‌లో సెంచరీతో తన ధాటిని చూపించాడు. కెప్టెన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి రాగా... వరల్డ్ కప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత యశస్వి జైస్వాల్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ సింగ్ కూడా రెండో టి20లో సిక్సర్ల మోత మోగించగా, గత మ్యాచ్‌లో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాని సంజూ సామ్సన్ కూడా చెలరేగిపోగలడు. శివమ్ దూబే కూడా తన దూకుడును ప్రదర్శిస్తే ఇక ఈ లైనప్‌ను నిలువరించడం జింబాబ్వే బౌలర్లకు అంత సులువు కాదు. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన అవేశ్ స్థానంలో ముకేశ్‌కు మళ్లీ తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఈ మార్పు మినహా అదే జట్టు కొనసాగనుంది. మరోవైపు సిరీస్‌ను కోల్పోకుండా ఉండేందుకు జింబాబ్వే రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు పేలవ ఫీల్డింగ్‌తో 7 క్యాచ్‌లు వదిలేయడంతో పాటు అదనపు పరుగులూ ఇచ్చింది. దీనిని నివారించగలిగితే టీమ్ పోటీనివ్వగలదు. మరోసారి కెప్టెన్ సికందర్ రజానే కీలకం కానుండగా... బెన్నెట్, మైర్స్, క్యాంప్‌బెల్‌లపై బ్యాటింగ్ భారం ఉంది. బౌలింగ్‌లో పేసర్ ముజరబాని, చటారా నిలకడగా ఆడుతున్నారు. సొంతగడ్డపై జింబాబ్వే తమ స్థాయికి తగినట్లు ఆడితే పోరు ఆసక్తికరంగా సాగవచ్చు. -
మళ్లీ మనదే గెలుపు
జింబాబ్వేపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు చక్కటి ప్రదర్శన చేయడంతో మరో పోరులో టీమిండియాకు సునాయాస విజయం దక్కింది. టి20 వరల్డ్ కప్‌లో ఆడిన ముగ్గురు ఆటగాళ్ల పునరాగమనంతో బ్యాటింగ్ ఆర్డర్లో కొంత మార్పు వచ్చినా... చివరకు భారత్‌దే పైచేయి అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పేలవ బ్యాటింగ్‌తోనే ఆతిథ్య జింబాబ్వే జట్టు ఆరంభంలోనే ఆటను అప్పగించింది. ఇక శనివారం జరిగే నాలుగో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ మన ఖాతాలో చేరుతుంది. హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 2–1తో ముందంజలో నిలిచింది. బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. డియాన్ మైర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), క్లయివ్ మదాండె (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాషింగ్టన్ సుందర్ (3/15) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. శనివారం ఇదే మైదానంలో నాలుగో టి20 జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... భారత్ తమ ఇన్నింగ్స్‌ను జోరుగా ప్రారంభించింది. తొలి ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, రెండో ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 55 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు గిల్‌తో 50 బంతుల్లో 67 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో అభిõÙక్ శర్మ (10) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జత కలిసిన గిల్, రుతురాజ్ మరింత ధాటిగా ఆడారు. మదెవెరె ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ కొట్టగా... ఆ తర్వాత సికందర్ రజా ఓవర్లోనూ ఇదే పునరావృతమైంది. ఎట్టకేలకు గిల్‌ను అవుట్ చేసి ముజరబాని ఈ భాగస్వామ్యాన్ని ముగించాడు. గిల్, రుతురాజ్ మూడో వికెట్‌కు 44 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు. 36 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ చేయగా... ఎన్‌గరవ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రుతురాజ్ అర్ధ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. జింబాబ్వే పేలవ ఫీల్డింగ్‌తో భారత్‌కు అదనపు అవకాశాలు కల్పించింది. గిల్, జైస్వాల్, రుతురాజ్ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేశారు. చివరి 4 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. టి20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన జైస్వాల్, సామ్సన్, దూబే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగగా... పరాగ్, సాయిసుదర్శన్, జురేల్‌లను పక్కన పెట్టారు. టపటపా... భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు నిలవలేకపోయారు. 13 బంతుల వ్యవధిలో తొలి 3 వికెట్లు కోల్పోయిన జట్టు ఆ తర్వాత ఒకే ఓవర్లో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి 39/5తో జింబాబ్వే ఓటమికి బాటలు వేసుకుంది. ఈ దశలో మైర్స్, మదాండె కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 57 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. అనంతరం 45 బంతుల్లో మైర్స్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో ఓవర్లో మైర్స్, మసకద్జా (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి 18 పరుగులు రాబట్టినా... అప్పటికే ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బెన్నెట్ (బి) రజా 36; గిల్ (సి) రజా (బి) ముజరబాని 66; అభిõÙక్ (సి) మరుమని (బి) రజా 10; రుతురాజ్ (సి) మదెవెరె (బి) ముజరబాని 49; సామ్సన్ (నాటౌట్) 12; రింకూ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–67, 2–81, 3–153, 4–177. బౌలింగ్: బెన్నెట్ 1–0–15–0, ఎన్‌గరవ 4–0–39–0, చటారా 3–0–30–0, ముజరబాని 4–0–25–2, రజా 4–0–24–2, మసకద్జా 3–0–25–0, మదెవెరె 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (సి) అభిషేక్ (బి) అవేశ్ 1; మరుమని (సి) దూబే (బి) ఖలీల్ 13; బెన్నెట్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 4; మైర్స్ (నాటౌట్) 65; రజా (సి) రింకూ (బి) సుందర్ 15; క్యాంప్‌బెల్ (సి) (సబ్) పరాగ్ (బి) సుందర్ 1; మదాండె (సి) రింకూ (బి) సుందర్ 37; మసకద్జా (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–19, 4–37, 5–39, 6–116. బౌలింగ్: ఖలీల్ 4–0–15–1, అవేశ్ 4–0–39–2, రవి బిష్ణోయ్ 4–0–37–0, వాషింగ్టన్ సుందర్ 4–0–15–3, అభిషేక్ 2–0–23–0, దూబే 2–0–27–0. 150 అంతర్జాతీయ టి20ల్లో భారత్ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు 230 టి20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 150 మ్యాచ్‌ల్లో గెలిచి ఈ మైలురాయి అందుకున్న తొలి జట్టుగా నిలిచింది. పాకిస్తాన్ (142), న్యూజిలాండ్ (111), ఆ్రస్టేలియా (105), దక్షిణాఫ్రికా (104), ఇంగ్లండ్ (100) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
గౌతముడే శిక్షకుడు.. బీసీసీఐ అధికారిక ప్రకటన
ముంబై: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇకపై కొత్త పాత్రలో టీమిండియాతో కలిసి పని చేయనున్నాడు. 43 ఏళ్ల గంభీర్‌ను భారత హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది. ఈ నెల 27 నుంచి శ్రీలంక గడ్డపై భారత జట్టు 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది. ఇదే సిరీస్ నుంచి గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. డిసెంబర్ 2027 వరకు అతని పదవీ కాలం ఉంటుంది. కొత్త కోచ్ కోసం మే 13 నుంచి బీసీసీఐ దరఖాస్తులు కోరింది. అంతకుముందే కోచ్ పదవిని స్వీకరించమంటూ మరో మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ కోరినా... అతను తిరస్కరించాడు.తన ఆసక్తిని బహిరంగంగానే ప్రకటిస్తూ గంభీర్ కూడా దరఖాస్తు చేసుకోగా, ఒక్క డబ్ల్యూవీ రామన్ మాత్రమే అతనితో పోటీ పడ్డాడు. ఎలాగూ ముందే నిర్ణయించేశారనే భావన వల్ల కావచ్చు, విదేశీ కోచ్‌లు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు ఊహించినట్లుగా గంభీర్‌కు పగ్గాలు లభించాయి. ఆటగాడిగా ఘనమైన రికార్డు... 2004–2012 మధ్య కాలంలో మూడు ఫార్మాట్లలో గంభీర్ ఓపెనర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 58 టెస్టుల్లో 41.95 సగటుతో 4154 పరుగులు చేసిన అతను 9 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు చేశాడు. 147 వన్డేల్లో 39.68 సగటుతో 5238 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 37 అంతర్జాతీయ టి20ల్లో 119.02 స్ట్రయిక్ రేట్, 7 హాఫ్ సెంచరీలతో 932 పరుగులు పరుగులు సాధించాడు. అన్నింటికి మించి చిరకాలం గుర్తుంచుకునే గంభీర్ రెండు అత్యుత్తమ ప్రదర్శనలు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో వచ్చాయి. పాకిస్తాన్‌తో 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో 75 పరుగులతో, శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 97 పరుగులతో అతను టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నేపియర్‌లో న్యూజిలాండ్‌తో 11 గంటల పాటు క్రీజ్‌లో నిలిచి 436 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి కాపాడటం టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్లో ముందుగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్ ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారాడు. 2012, 2014లలో కెపె్టన్‌గా కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్ అందించాడు. కోచ్‌గా తొలిసారి... రిటైర్మెంట్ తర్వాత చాలామందిలాగే గంభీర్ కూడా కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా పని చేశాడు. 2019లో బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయిన అతను పదవీకాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే అధికారికంగా కోచ్ హోదాలో పని చేయడం గంభీర్‌కు ఇదే తొలిసారి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు 2022, 2023 సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించగా, రెండుసార్లు కూడా లక్నో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. అయితే 2024 సీజన్లో కోల్‌కతాకు మెంటార్‌గా వెళ్లిన అతను టీమ్‌ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సాఫల్యమే అతడిని భారత జట్టు కోచ్ రేసులో ముందంజలో నిలిపింది. మరోవైపు టి20 వరల్డ్ కప్ వరకు జట్టుతో పని చేసిన విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్ ), పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) పదవీ కాలం కూడా ముగిసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో తన ఆలోచనలకు అనుగుణంగా కొత్త బృందాన్ని ఎంచుకునే అధికారం గంభీర్‌కు ఉంది. -
అభిషేక్ అదరహో...
హరారే: అంతర్జాతీయ వేదికపై తన ఆగమనాన్ని అదరగొట్టే ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ చాటుకున్నాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. శనివారం జరిగిన తొలి టి20లో ‘సున్నా’కే అవుటైన ఈ పంజాబ్ బ్యాటర్ రెండో టి20లో మాత్రం ‘శత’క్కొట్టాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిపోయిన అభిõÙక్ సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77; 11 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా మెరిపించడంతో భారత జట్టు 100 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. టి20ల్లో జింబాబ్వేపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మధెవెరె (39 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోంగ్వి (26 బంతుల్లో 33; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11) రాణించారు. అభిõÙక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (2) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. గిల్ అవుటయ్యాక అభిõÙక్, రుతురాజ్ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. వ్యక్తిగత స్కోరు 27 పరుగులవద్ద అభిõÙక్ ఇచ్చిన క్యాచ్‌ను మసకద్జా వదిలేశాడు. ఆ తర్వాత అభిõÙక్ చెలరేగిపోయాడు. మైర్స్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అభిషేక్ 2,4,6,4,6,4తో 28 పరుగులు సాధించాడు. దాంతో భారత స్కోరు 100 పరుగులు దాటింది.మసకద్జా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అభిõÙక్ వరుసగా 3 సిక్స్‌లు కొట్టి 46 బంతుల్లోనే తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మైర్స్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరుకన్నాడు. రుతురాజ్‌తో కలిసి అభిõÙక్ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. అభిషేక్ నిష్క్రమించాక వచ్చిన రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడటంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. భారత్ చివరి 10 ఓవర్లలో 160 పరుగులు చేయడం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) బెనెట్ (బి) ముజరబాని 2; అభిషేక్ శర్మ (సి) మైర్స్ (బి) మసకద్జా 100; రుతురాజ్ గైక్వాడ్ (నాటౌట్) 77; రింకూ సింగ్ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–10, 2–147. బౌలింగ్: బెనెట్ 2–0–22–0, ముజరబాని 4–1–30–1, చటారా 4–0–38–0, సికందర్ రజా 3–0–34–0, జోంగ్వి 4–0–53–0, మైర్స్ 1–0–28–0, మసకద్జా 2–0–29–1. జింబాబ్వే ఇన్నింగ్స్: ఇన్నోసెంట్ కాయా (బి) ముకేశ్ కుమార్ 4; మధెవెరె (బి) రవి బిష్ణోయ్ 43; బెనెట్ (బి) ముకేశ్ కుమార్ 26; మైర్స్ (సి) రింకూ సింగ్ (బి) అవేశ్ ఖాన్ 0; సికందర్ రజా (సి) ధ్రువ్ జురేల్ (బి) అవేశ్ ఖాన్ 4; క్యాంప్‌బెల్ (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 10; మదాండె (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 0; మసకద్జా (రనౌట్) 1; జోంగ్వి (సి) రుతురాజ్ (బి) ముకేశ్ కుమార్ 33; ముజరబాని (సి) సుందర్ (బి) అవేశ్ ఖాన్ 2; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–41, 4–46, 5–72, 6–73, 7–76, 8–117, 9–123, 10–134. బౌలింగ్: ముకేశ్ 3.4–0– 37–3, అభిషేక్ శర్మ 3–0–36–0, అవేశ్ 3–0– 15–3, రవి బిష్ణోయ్ 4–0–11–2, వాషింగ్టన్ సుందర్ 4–0– 28–1, పరాగ్ 1–0–5–0. -
కుర్రాళ్లు నిలవలేకపోయారు...
ఐపీఎల్ అనుభవంతో జింబాబ్వే గడ్డపై అడుగు పెట్టిన భారత యువ బృందం అంతర్జాతీయ వేదికపై ఆ మెరుపులు చూపించలేకపోయింది. తమతో పోలిస్తే టి20 క్రికెట్లో తక్కువ అనుభవం ఉన్న బలహీన ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జింబాబ్వే ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాపై విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో సొంత అభిమానుల్లో ఆనందం పంచింది. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన టీమ్‌లోని ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా... అధికారిక రికార్డుల ప్రకారం వరల్డ్ చాంపియన్ అయిన తర్వాత భారత్‌కు ఇది ఓటమి! హరారే: సొంత గడ్డపై ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్లైవ్ మదాందె (25 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా...మైర్స్ (23), బెన్నెట్ (22), మదివెరె (21) స్కోరులో తలా ఓ చేయి వేశారు. రవి బిష్ణోయ్ (4/13) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, సుందర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్‌మన్ గిల్ (29 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (3/25), చటారా చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. రెండో టి20 నేడు ఇక్కడే జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. రవి బిష్ణోయ్‌కు 4 వికెట్లు... రెండో ఓవర్లోనే కయా (0) అవుటైనా...ఖలీల్ ఓవర్లో 4 ఫోర్లతో జింబాబ్వే బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాత ఈ జోరుకు బ్రేక్ పడింది. బిష్ణోయ్ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లతో జింబాబ్వేను దెబ్బ తీశాడు. 10 ఓవర్లలో స్కోరు 69/3కి చేరింది. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయిన జట్టు 74/5 వద్ద నిలిచింది. కొద్ది సేపటికే సుందర్ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా నిలువరించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన బిష్ణోయ్ కూడా మరో 2 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 100 లోపే ఆలౌట్ అయ్యేలా అనిపించింది. అయితే చటారా, మదాందె కలిసి తర్వాతి 27 బంతులను జాగ్రత్తగా ఆడి అభేద్యంగా 25 పరుగులు జోడించారు. 90/9 నుంచి స్కోరు 115 వరకు చేరింది. మ్యాచ్ తుది ఫలితంతో ఈ చివరి పరుగులే కీలకంగా మారాయి. టపటపా... తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (0) నాలుగు బంతులు ఆడితే, రియాన్ పరాగ్ (2) ఆట మూడు బంతుల్లో ముగిసింది. రుతురాజ్ (7) విఫలం కాగా, రింకూ సింగ్ (0) పేలవంగా నిష్క్రమించాడు. దాంతో స్కోరు 22/4. మరో అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురేల్ (6) విఫలం కావడంతో 9.5 ఓవర్లలో సగం టీమ్ పెవిలియన్‌కు! ఇదీ భారత జట్టు పరిస్థితి. మరో వైపు జాగ్రత్తగా ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే రజా బౌలింగ్‌లో అతను వెనుదిరగడంతో 47/6 వద్ద భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సుందర్ పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 5 బంతుల్లో 2 పరుగులే చేసిన జట్టు చివరి వికెట్ కోల్పోయింది. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (బి) బిష్ణోయ్ 21; కయా (బి) ముకేశ్ 0; బెన్నెట్ (బి) బిష్ణోయ్ 22; రజా (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 17; మయర్స్ (సి) అండ్ (బి) సుందర్ 23; క్యాంప్‌బెల్ (రనౌట్) 0; మదాందె (నాటౌట్) 29; మసకద్జ (స్టంప్డ్) జురేల్ (బి) సుందర్ 0; జాంగ్వే (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 1; ముజరబాని (బి) బిష్ణోయ్ 0; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–6, 2–40, 3–51, 4–74, 5–74, 6–89, 7–89, 8–90, 9–90. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, ముకేశ్ 3–0–16–1, రవి బిష్ణోయ్ 4–2–13–4, అభిõÙక్ 2–0–17–0, అవేశ్ 4–0–29–1, సుందర్ 4–0–11–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మసకద్జ (బి) బెన్నెట్ 0; గిల్ (బి) రజా 31; రుతురాజ్ (సి) కయా (బి) ముజరబాని 7; పరాగ్ (సి) (సబ్) మవుతా (బి) చటారా 2; రింకూ సింగ్ (సి) బెన్నెట్ (బి) చటారా 0; జురేల్ (సి) మదెవెరె (బి) జాంగ్వే 6; సుందర్ (సి) ముజరబాని (బి) చటారా 27; బిష్ణోయ్ (ఎల్బీ) (బి) రజా 9; అవేశ్ (సి) రజా (బి) మసకద్జా 16; ముకేశ్ (బి) రజా 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1–0, 2–15, 3–22, 4–22, 5–43, 6–47, 7–61, 8–84, 9–86, 10–102. బౌలింగ్: బెన్నెట్ 1–1–0–1, మసకద్జ 3–0–15–1, చటారా 3.5–1–16–3, ముజరబాని 4–0–17–1, జాంగ్వే 4–0–28–1, రజా 4–0–25–3. -
Ind vs Zim: గిల్ కెప్టెన్సీలో కుర్రాళ్లతో కొత్తగా...
టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది...ఇంకా దేశంలో సంబరాలు, వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు టీమిండియా మరో టి20 పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆటతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైంది. రోహిత్, కోహ్లి, జడేజాల రిటైర్మెంట్ తర్వాత జట్టు కాస్త కొత్తగా కనపడబోతోంది.తమ అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువ ఆటగాళ్ల సత్తాను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది. వరల్డ్ కప్ టీమ్‌లో అవకాశం దక్కించుకోలేకపోయిన గిల్ నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్ష కానుండగా... సొంతగడ్డపై జింబాబ్వేవిజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. హరారే: పేరుకే ఇది భారత్‌కు చెందిన ద్వితీయ శ్రేణి జట్టు కావచ్చు. కానీ అగ్రశ్రేణి ఆటగాళ్లందరితో కలిసి ఆడిన, ఎదుర్కొన్న అపార ఐపీఎల్ అనుభవంతో యువ ఆటగాళ్లంతా కూడా అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు స్వదేశానికి వచ్చిన సామ్సన్, యశస్వి, దూబే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. మూడో టి20 సమయానికి వీరు జట్టుతో చేరతారు. 2026 టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని భారత సెలక్టర్లు సిద్ధం చేయదలిచే బృందంలో కొందరి ప్రదర్శనపై ఇక్కడినుంచే ఒక అంచనాకు రావచ్చు. గిల్ కెప్టెన్సీలో... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించి సరైన ఫలితాలు రాబట్టలేకపోయిన శుబ్‌మన్ గిల్ తొలి సారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్‌గా అతనితో పాటు అతని బాల్య మిత్రుడు, అండర్–19 వరల్డ్ కప్ సహచరుడు అభిషేక్ శర్మ ఆడటం ఖాయమైంది. అభిషేక్ కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.ఇటీవల ఐపీఎల్లో భీకర ఫామ్‌తో అదరగొట్టిన అభిõÙక్ ఇక్కడ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మూడో స్థానంలో రుతురాజ్ ఖాయం కాగా, రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌లో రిజర్వ్‌గా ఉండి ఆడే అవకాశం రాని రింకూ సింగ్‌పై కూడా అందరి దృష్టీ నిలిచింది. తన దూకుడును ప్రదర్శించేందుకు రింకూకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. బౌలింగ్‌లో కూడా ఐపీఎల్లో ఆకట్టుకున్న ఖలీల్, అవేశ్, బిష్ణోయ్‌లపై జట్టు ఆధారపడుతోంది. ప్రతిభ ఉన్నా...వరుస గాయాలతో పదే పదే సీనియర్ జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కీపర్‌గా తొలి ప్రాధాన్యత జురేల్‌కు దక్కవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్‌నుంచి ఎంత మంది అరంగేట్రం చేస్తారనేది ఆసక్తికరం. రజాపైనే భారం... జింబాబ్వే కూడా కొత్త కుర్రాళ్లపైనే దృష్టి పెట్టింది. అందుకే సీనియర్లలో ర్యాన్ బర్ల్పై వేటు వేసిన జట్టు సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఇర్విన్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చి0ది. డ్రగ్స్ వాడిన ఆరోపణలతో నాలుగు నెలలు సస్పెన్షన్‌కు గురైన మదవెర్, మవుతా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కెప్టెన్ సికందర్ రజాపైనే జింబాబ్వే ప్రధానంగా ఆధారపడుతోంది. ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్‌లో చెలరేగిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. మసకద్జ, ముజరబానిలనుంచి అతనికి సహకారం అందాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), అభిషేక్, రుతురాజ్, పరాగ్, రింకూ, జురేల్, సుందర్, బిష్ణోయ్, అవేశ్, తుషార్, ఖలీల్ జింబాబ్వే: రజా (కెప్టెన్ ), బెనెట్, మరుమని, క్యాంప్‌బెల్, నక్వి, మదాందే, మదవెర్, జాంగ్వే, ఫరాజ్, మసకద్జ, ముజరబాని పిచ్, వాతావరణం నెమ్మదైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 మ్యాచ్‌లలో 5 సార్లు మాత్రమే స్కోరు 150 పరుగులు దాటింది. పొడి వాతావరణం. వర్ష సూచన లేదు. 8 భారత్, జింబాబ్వే మధ్య 8 టి20లు జరిగాయి. 6 భారత్ గెలవగా, 2 జింబాబ్వే గెలిచింది. -
టీమిండియా బాటలో పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమిండియా బాటలో అడుగులేస్తుంది. ఆర్దికంగా వెనుకబడిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు చేయూతనిచ్చేందుకు పాక్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. పెద్ద జట్లు స్వదేశంలో మ్యాచ్‌లు ఆడితే జింబాబ్వే క్రికెట్ బోర్డును లబ్ది చేకూరుతుంది. అందుకే భారత్ జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు ముందుకువచ్చింది. రేపటి నుంచే (జులై 6) భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టీ20లు జరుగనున్నాయి. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుతాయి. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటనలో యంగ్ ఇండియాకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.పాక్ షెడ్యూల్ ఇలా..పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే ఈ పర్యటనలో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత వన్డే సిరీస్ (నవంబర్ 24, 26, 28).. అనంతరం టీ20 సిరీస్ (డిసెంబర్ 1, 3, 5) జరుగనున్నాయి. మ్యాచ్‌లన్నీ బులవయోలోని క్లీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగతాయి. కాగా, పాక్ స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జింబాబ్వే సిరీస్‌ను భావిస్తుంది. -
జులై 6 నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటన.. షెడ్యూల్ వివరాలు
టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన వారం రోజుల్లోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ నెల (జులై) 6 నుంచి మొదలుకానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. వరల్డ్‌కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనకు ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్‌లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే -
శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు
ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ (కేకేఆర్) శ్రేయస్ అయ్యర్ జులై, ఆగస్ట్ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్.. లంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపికైన శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. జింబాబ్వే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. -
BAN Vs ZIM: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. దీంతో క్లీన్‌స్వీప్ నుంచి జింబాబ్వే తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(36) పరుగులతో రాణించాడు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్రానీ, బెన్నెట్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాంగ్వే, మసకజ్డా చెరో వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బెన్నెట్(70 ), సికిందర్ రజా(72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్హసన్, సైఫుద్దీన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు 3–0తో సొంతం చేసుకుంది. చట్టోగ్రామ్‌లో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తౌహిద్ హృదయ్ (38 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్ అలీ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడిపోయింది. -
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన మాజీ స్టార్ క్రికెటర్
జింబాబ్వే మాజీ స్టార్ క్రికెటర్ గై విట్టల్ చిరుత పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. విట్టల్ తల, చేతి భాగంపై చిరుత తీవ్రమైన గాయాలు చేసింది. విట్టల్‌ను హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అతనికి మరిన్ని శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విట్టల్ పరిస్థితి నిలకడగా ఉందని అతని భార్య హన్నా ఫేస్బుక్ ద్వారా తెలిపింది. 51 ఏళ్ల గై విట్టల్ కుటుంబంతో కలిసి హ్యూమని అనే అటవీ ప్రాంతంలో సఫారీ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. గత మంగళవారం విట్టల్ తన పెంపుడు శునకం చికారాతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో చిరుత అమాంతం విట్టల్‌పై దాడికి దిగింది. ఇది గమనించిన చికారా చిరుతతో కలబడింది. చికారా ప్రతిఘటించడంతో చిరుత మెత్తబడి పారిపోయింది.చికారా లేకుంటే విట్టల్ ప్రాణాలతో బయటపడేవాడు కాదని అతని భార్య హన్నా తెలిపింది. సఫారీలో విట్టల్‌కు ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. పదేళ్ల క్రితం ఓ భారీ మొసలి తన గేమ్ రిజర్వ్‌లోని బెడ్రూమ్లోకి ప్రవేశించి, రాత్రి అక్కడే గడిపింది. ఈ విషయం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉండింది. గై జేమ్స్ విట్టల్ 1993-2003 మధ్యలో జింబాబ్వే తరఫున 46 టెస్ట్‌లు, 147 వన్డేలు ఆడాడు.టెస్ట్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 2207 పరుగులు చేసిన విట్టల్.. 51 వికెట్లు కూడా పడగొట్టాడు. వన్డేల్లో 11 హాఫ్ సెంచరీల సాయంతో 2705 పరుగులు చేసిన విట్టల్.. 88 వికెట్లు పడగొట్టాడు.రైట్ ఆర్మ్ మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన విట్టల్.. 21వ శతాబ్దం ఆరంభంలో ఫ్లవర్, స్ట్రాంగ్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్‌లతో కలిసి జింబాబ్వే క్రికెట్లో ఓ వెలుగు వెలిగాడు. గై విట్టల్ కజిన్ ఆండీ విట్టల్ కూడా అదే సమయంలో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. -
టీ20 క్రికెట్లో సంచలనం.. కేవలం 16 పరుగలకే ఆలౌట్
జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఈగల్స్ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్ చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ అగ్రస్ధానంలో ఉంది. బిగ్‌బాష్ లీగ్-2022లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ సాధిచింది. డర్హామ్ బ్యాటర్లలో బాస్ డి లీడ్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మస్టర్డ్(46), రాబిన్సన్(49) పరుగులతో అదరగొట్టారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది. డర్హామ్ బౌలర్లలో కాఫ్లీన్, పార్కిన్సన్, లూక్ రాబిన్సన్ తలా రెండు వికెట్లతో డర్హామ్ పతనాన్ని శాసించగా.. బాస్ డీ లీడ్, సౌటర్ తలా వికెట్ సాధించారు. మిగితా రెండు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి. ఈగల్స్ బ్యాటర్లలో చిబావా(4) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్.. షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు. మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అంటూ తవెంగ్వా ట్వీట్లో పేర్కొన్నాడు. కాగా, టీమిండియాకు ఆతిథ్యమివ్వడం వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధిక స్థితిగతుల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ దేశంలో భారత ద్వితియ శ్రేణి జట్టు పర్యటించినా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురువడం ఖాయం. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ప్రజాధరణ వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు దశ మారిపోతుంది. తమ క్రికెటర్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జింబాబ్వే బోర్డుకు భారత పర్యటన ద్వారా భారీ లబ్ది చేకూరనుంది. -
SL Vs ZIM, 3rd T20I: హసరంగ మ్యాజిక్.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 శ్రీలంక స్పిన్ సెన్సేషన్, ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ (4-0-15-4) మ్యాజిక్ చేశాడు. ఫలితంగా శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. హసరంగ, తీక్షణ (3.1-0-14-2), ఏంజెలో మాథ్యూస్ (2-0-15-2), ధనంజయ డిసిల్వ (1-0-1-1), మధుషంక (2-0-22-1) ధాటికి 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కమున్హుకామ్వే (12), బ్రియన్ బెన్నెట్ (29), సీన్ విలియమ్స్ (15), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 10.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. పథుమ్ నిస్సంక (39 నాటౌట్), కుశాల్ మెండిస్ (33) రాణించగా.. ధనంజయ డిసిల్వ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్ వికెట్ సీన్ విలియమ్స్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో శ్రీలంక గెలువగా.. రెండో మ్యాచ్ జింబాబ్వే, ఇప్పుడు మూడో మ్యాచ్ మళ్లీ శ్రీలంకనే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
ఏంజెలో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకకు ఊహించని పరాభవం
కొలొంబో: పసికూన జింబాబ్వే.. తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 16) జరిగిన రెండో మ్యాచ్‌లో లంకేయులు ఓ మోస్తరు స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ (1.5-0-35-0) చివరి ఓవర్లో 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. లూక్ జాంగ్వే.. మాథ్యూస్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, బౌండరీ బాది జింబాబ్వేకు అద్భుత విజయాన్నందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే 1-1తో సిరీస్‌ను సమం చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలువగా.. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక, మాథ్యూస్ మినహా అంతా విఫలమయ్యారు. నిస్సంక 1, కుశాల్ మెండిస్ 4, కుశాల్ పెరీరా 0, సమరవిక్రమ 16, షనక 9 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నగరవ, మసకద్జ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆఖరి ఓవర్లో జాంగ్వే మెరుపులు (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అంతకుముందు క్రెయిగ్ ఎర్విన్ (70) జింబాబ్వే ఇన్నింగ్స్‌కు పునాది వేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు. వరుస హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సికందర్ రజా (8) ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఆఖర్లో జాంగ్వే.. క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హసరంగ భారీ పరుగులు (4 ఓవర్లలో 41) సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. -
రాణించిన మాథ్యూస్, హసరంగ.. సికందర్ రజా ఆల్‌రౌండ్ షో వృధా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో (కొలొంబో వేదికగా) జరిగిన తొలి టీ20లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (62) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సికందర్ రజా మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కమున్హుకంవే 26, క్రెయిగ్ ఎర్విన్ 10, సీన్ విలియమ్స్ 14, ర్యాన్ బర్ల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ 10, జోంగ్వే 13 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో తీక్షణ (4-0-16-2), హసరంగ (4-0-19-2), చమీరా (4-0-38-1) వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక సైతం తడబడింది. ఆ జట్టు అతి కష్టం మీద చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఏంజెలో మాథ్యూస్ (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండు బౌండరీలు బాది లంక విజయాన్ని ఖరారు చేశాడు. ఆతర్వాత చమీరా ఐదు, ఆరు బంతులకు ఆరు పరుగులు (4, 2) సాధించి లంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్, షనక (18 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించగా.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (4-0-13-3) బంతితోనూ సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 2, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఇదే వేదికపై జనవరి 16న జరుగనుంది. -
హసరంగ 7/19
కొలంబో: గాయం నుంచి కోలుకున్నాక శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఘనంగా పునరాగమనం చేశాడు. జింబాబ్వేతో గురువారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హసరంగ బంతితో మాయ చేశాడు. 5.5 ఓవర్లు వేసిన హసరంగ కేవలం 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్లో ఇవి ఐదో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు హసరంగ ధాటికి 22.5 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. వన్డే మ్యాచ్‌లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్‌గా... చమిందా వాస్ (8/19; జింబాబ్వేపై 2001లో), ముత్తయ్య మురళీధరన్ (7/30; భారత్‌పై 2000లో) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో శ్రీలంక బౌలర్‌గా హసరంగ గుర్తింపు పొందాడు. జింబాబ్వే నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. ఈ గెలుపుతో శ్రీలంక సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షంతో రద్దయింది. -
SL vs ZIM, 2nd ODI: రసవత్తర సమరం.. అంతిమంగా శ్రీలంకదే విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో శ్రీలంక మరో ఓవర్ మాత్రమే మిగిలి ఉండగా విజయతీరాలకు చేరింది. జనిత్ లియనగే (95) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ ఐదు వికెట్ల ఘనతతో (5/32) శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు. అయినా అంతిమంగా శ్రీలంకనే విజయం వరించింది. కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నగరవ రికార్డు స్థాయిలో వరుసగా 28వ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తీక్షణ (4/31), చమీరా (2/44), వాండర్సే (2/47), మధుషంక (1/24) ధాటికి 44.4 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (82) మాత్రమే రాణించాడు. జాయ్‌లార్డ్ గుంబీ (30), మిల్టన్ షుంబ (26), ర్యాన్ బర్ల్ (31), క్లైవ్ మదాండే (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు నగరవ ముచ్చెమటలు పట్టించాడు. నగరవ ధాటికి శ్రీలంక ఓ దశలో ఓడిపోయేలా కనిపించింది. అయితే లియనగే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తన జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఆఖర్లో సహన్ అరచ్చిగే (21), తీక్షణ (18), చమీరా (18 నాటౌట్), వాండర్సే (19 నాటౌట్) తలో చేయి వేయడంతో శ్రీలంక విజయతీరాలకు చేరింది. జింబాబ్వే బౌలర్లలో నగరవతో పాటు సికందర్ రజా (2/32), ముజరబానీ (1/41) వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 11న జరుగుతుంది. వర్షం కారణంగా తొలి వన్డే తుడిచిపెట్టుకపోయిన విషయం తెలిసిందే. -
లంక, జింబాబ్వే వన్డే రద్దు..
కొలంబో: శ్రీలంక, జింబాబ్వే మధ్య శనివారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ముందుగా లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. చరిత్ అసలంక (95 బంతుల్లో 101; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...కుశాల్ మెండిస్ (46), సమరవిక్రమ (41) రాణించారు. అనంతరం జింబాబ్వే 4 ఓవర్లలో 2 వికెట్లకు 12 పరుగులు చేసింది. వర్షం రాగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జనవరి 8న కొలంబో వేదికగా జనవరి 8న జరగనుంది. చదవండి: T20 WC: రోహిత్ ఒక్కడే రీఎంట్రీ.. కోహ్లికి నో ఛాన్స్? అగార్కర్ అంతటి సాహసం చేస్తాడా? -
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన
జనవరి 6 నుంచి శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జింబాబ్వే జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. వన్డే, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు.. వన్డే సారధిగా క్రెయిగ్ ఎర్విన్‌ను, టీ20 కెప్టెన్‌గా సికందర్ రజాను ఎంపిక చేసింది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఎర్విన్.. తిరిగి జట్టులో చేరడంతో పాటు వన్డే జట్టు పగ్గాలు చేపట్టాడు. మరోవైపు ఈ సిరీస్‌ల కోసం శ్రీలంక సైతం ప్రిలిమినరీ జట్లను ప్రకటించింది. లంక జట్టు సైతం రెండు ఫార్మాట్లలో కెప్టెన్లను మార్చింది. వన్డే జట్టుకు కుశాల్ మెండిస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20 జట్టుకు హసరంగ సారధిగా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. జనవరి 6, 8, 11 తేదీల్లో వన్డేలు.. 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లకు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రన్, ర్యాన్ బర్ల్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, తకుద్జ్వనషే కైతానో, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, టాపివా ముఫుద్జా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, మిల్టన్ షుంభ జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రాజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, క్రెయిగ్ ఎర్విన్, జాయిలార్డ్ గుంబీ, ల్యూక్ జాంగ్వే, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, కార్ల్ ముంబా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, ఐన్స్లీ ఎండిలోవు. రిచర్డ్ నగరవ, మిల్టన్ షుంభ శ్రీలంక వన్డే ప్రిలిమినరీ స్క్వాడ్: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సాహన్ అరాచ్చిగే, నువనిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియనాగే, వనిందు హసరంగ, మషీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్, అషిత ఫెర్నాండో, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమికా గుణశేఖర శ్రీలంక టీ20 ప్రిలిమినరీ స్క్వాడ్: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సధీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, మహీశ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భానుక రాజపక్ష, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, దిల్షన్ మధుషంక, బినుర ఫెర్నాండో, నుదాన్ తుషార, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్ల సస్పెన్షన్
డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించారని రుజువు కావడంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లను సస్పెండ్ చేసింది. వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటా బ్లడ్ శాంపిల్స్‌లో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మధేవెరె, మవుటాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ZC ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరూ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనరని పేర్కొంది. 26 ఏళ్ల మవుటా ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించగా.. మధేవెరె గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్ అయిన మవుటా జింబాబ్వే తరఫున 4 టెస్ట్‌లు, 12 వన్డేలు, 10 టీ20లు ఆడి ఓవరాల్‌గా 26 వికెట్లు పడగొట్టాడు. మవుటా టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. మధేవెరె విషయానికొస్తే.. 23 ఏళ్ల ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జింబాబ్వే తరఫున 2 టెస్ట్‌లు, 36 వన్డేలు, 60 టీ20లు ఆడి 26 వికెట్లు, 1100 పైగా పరుగులు సాధించాడు. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఇటీవలే ఆ జట్టు హెడ్ కోచ్ డేవ్ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాత్కాలిక హెడ్ కోచ్‌గా వాల్టర్ చాగుటా నియమితుడయ్యాడు. -
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు మరో భారీ షాక్
వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లకు అర్హత సాధించలేకపోవడంతో పాటు స్వదేశంలో నమీబియా, ఐర్లాండ్ లాంటి చిన్న జట్ల చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న జింబాబ్వే జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నించిన ప్రధాన కోచ్ డేవ్ హటన్ తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. డేవ్ హటన్ కెప్టెన్‌గా, కోచ్‌గా ఉన్న కాలంలో జింబాబ్వే స్వర్ణ యుగాన్ని చవిచూసింది. ఒక సమయంలో డేవ్‌తో కూడాని జింబాబ్వే.. ఆస్ట్రేలియా, భారత్ లాంటి జట్లను సైతం గడగడలాడించింది. అలాంటి జట్టు ప్రస్తుతం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో హటన్ తన గట్టెక్కించేందుకు విఫలయత్నం చేసి చేత కాక తప్పుకున్నాడు. జింబాబ్వే జట్టులో కొత్తగా కెప్టెన్‌గా నియమితుడైన సికందర్ రజా ఒక్కడే రాణిస్తుండగా, మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తున్నారు. పరాయి దేశస్తుడిని తీసుకు వచ్చి కెప్టెన్‌గా చేయడం వల్లే, జట్టులోని మిగతా ఆటగాళ్లు అతనికి సహకరించడం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జింబాబ్వే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్‌లలోనూ గెలుపు
అంతర్జాతీయ వన్డేల్లో ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0 తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20, మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఐరిష్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా.. డిసెంబరు 7న మొదలైన టీ20 సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న ఐర్లాండ్.. వన్డేల్లోనూ సత్తా చాటింది. బుధవారం (డిసెంబరు 13) నాటి తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గిన ఐర్లాండ్.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాల్ స్టిర్లింగ్ బృందం జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐరిష్ పేసర్లు గ్రాహం హ్యూమ్, కర్టిస్ కాంఫర్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో 40 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ జాయ్‌లార్డ్ గుంబీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వన్‌డౌన్ బ్యాటర్ కైటానో 13 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగారు. అయితే, వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ టార్గెట్‌ను 201గా నిర్దేశించారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మొత్తంగా 102 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(8) నిరాశపరచగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కర్టిస్ కాంఫర్ 40, హ్యారీ టెక్టార్ 33 పరుగులు సాధించారు. బల్బిర్నీతో కలిసి లోర్కాన్ టకర్ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో సొంతం చేసుకుంది. బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. కర్టిస్ కాంఫర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్? -
ఆరేసిన జాషువ లిటిల్.. జింబాబ్వేకు మరో షాకిచ్చిన ఐర్లాండ్
ఐర్లాండ్ జట్టు తమ కంటే కాస్త మెరుగైన జింబాబ్వేకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐరిష్ టీమ్.. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని తాజాగా ఆతిథ్య జట్టుకు మరో షాకిచ్చింది. వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జాషువ లిటిల్ ఆరు వికెట్లు (10-2-36-6) తీసి జింబాబ్వేను ఒంటిచేత్తో ఓడించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. లిటిల్ ధాటికి 42.5 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మసకద్జ (40), ర్యాన్ బర్ల్ (38), క్లైయివ్ మదాండే (33), ముజరబానీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిటిల్‌కు జతగా మార్క్ అడైర్ (1/23), క్రెయిగ్ యంగ్ (1/30), ఆండీ మెక్‌బ్రెయిన్ (1/34), హ్యారీ టెక్టార్ (1/5) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 40.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్టిస్ క్యాంఫర్ (66) అర్ధసెంచరీతో రాణించగా.. లోర్కాన్ టక్కర్ (28), మార్క్ అడైర్ (25 నాటౌట్), హ్యారీ టెక్టార్ (21) ఒ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్ మవుటా, ముజరబానీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగరవ, చివంగ తలో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 17న జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. -
సికందర్ రజా ఆల్‌రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో జింబాబ్వే గెలుపు
సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (4-0-28-3, 42 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో 11వ నంబర్ ఆటగాడు ముజరబానీ ఆఖరి బంతికి 2 పరుగులు తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను జింబాబ్వే ఆటగాళ్లు ఆఖరి బంతి వరకు తీసుకెళ్లారు. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో జింబాబ్వే ఆటగాళ్లు తడబడ్డారు. 18వ ఓవర్లో వికెట్ నష్టపోయి 5 పరుగులు, 19వ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 4 పరుగులు, ఆఖరి ఓవర్లో వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసి అతి కష్టం మీద విజయతీరాలకు చేరారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. సికందర్ రజా, నగరవ (4-0-23-2), ముజరబానీ (4-0-24-2), సీన్ విలియమ్స్ (3-0-18-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బల్బిర్నీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. సికందర్ రజా రాణించడంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో ఐర్లాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని జింబాబ్వేకు గెలుపును అంత ఈజీగా దక్కనీయలేదు. అతి కష్టం మీద జింబాబ్వే చివరి బంతికి విజయం సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ డాక్రెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రజాకు ఈ ఏడాది టీ20ల్లో ఇది ఎనిమిదో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం. కాగా, 3 టీ20లు, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న 20 జట్లు ఇవే..
2024 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే 20 జట్లు ఏవేవో నిన్నటితో తేలిపోయాయి. ఆఫ్రికా క్వాలిఫయర్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన నమీబియా, ఉగాండ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. టోర్నీలో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన మ్యాచ్‌లో రువాండపై విజయం సాధించడం ద్వారా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. ఇదే టోర్నీలో నమీబియా టేబుల్ టాపర్‌గా నిలిచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కాగా 2024 టీ20 వరల్డ్‌కప్ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే 20 జట్లలో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి. -
జింబాబ్వేకు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా ఆర్హత
ఉగాండా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. యూఎస్ఎ, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2024కు ఉగాండా అర్హత సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆఫ్రికన్ రీజినల్ క్వాలిఫియర్స్‌లో భాగంగా గురువారం రువాండాతో జరిగిన ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉగాండా.. వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్వాలిఫియర్స్‌లో భాగంగా ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ఉగాండా పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రువాండా కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. ఉగండా బౌలర్లలో అల్పేష్ రాంజానీ, దినేష్ నక్రానీ, మసబా, స్సెన్యోండో తలా రెండు వికెట్లతో రువాండా పతనాన్ని శాసించారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉగండా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. కాగా ఉగండా విజయంతో మరో ఆఫ్రికా జట్టు జింబాబ్వే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. పాయింట్ల పట్టికలో జింబాబ్వే మూడో స్ధానంలో నిలిచింది. ఈ క్వాలిఫై టోర్నీలో భాగంగా ఉగండా చేతిలో 5 వికెట్ల తేడాతో జింబాబ్వే ఓటమి చవిచూసింది. అప్పుడే జింబాబ్వే వరల్డ్‌కప్ క్వాలిఫై ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఆఫ్రికన్ రీజినల్ క్వాలిఫియర్స్ నుంచి ఉగండాతో పాటు నబీబియా కూడా టీ20 ప్రపంచకప్-2024కు క్వాలిఫై అయింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు ఆర్హత సాధించిన ఐదో ఆఫ్రికన్ జట్టుగా ఉగాండా నిలిచింది. 20 జట్లు బరిలోకి.. 2024 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. టీ20 వరల్డ్‌కప్-2022 టాప్-8లో నిలిచిన జట్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించాయి. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం 9, 10 స్ధానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా డైరక్ట్‌గా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. క్వాలిఫయర్స్ ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా నేపాల్, ఒమన్ ఇప్పటికే అర్హత సాధించగా.. తాజాగా నబీబియా, ఉగాండా ఈ జాబితాలో చేరాయి. చదవండి: IPL 2024: అతడొక ఫినిషర్.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు -
విరాట్ కోహ్లిని దాటేసిన సికందర్ రజా
జింబాబ్వే ఆటగాడు, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రజా.. ఈ ఏడాది అత్యధిక సార్లు ఈ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రజా ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరాడు. కోహ్లి ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 6 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. సికందర్ రజా 7 అవార్డులతో టాప్‌లో నిలిచాడు. రజా ప్రస్తుత వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలోనే మూడుసార్లు (టాంజానియా, రువాండ, నైజీరియా) ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలవడం విశేషం. ఇదిలా ఉంటే, నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో రజా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో (3-1-13-2, 37 బంతుల్లో 65; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగుల నామమాత్రపు స్కోర్ చేయగా.. జింబాబ్వే కేవలం 14 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో జింబాబ్వే 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు మరింత చేరువైంది. ఇవాళ కెన్యాతో జరిగే మ్యాచ్‌లో ఈ జట్టు గెలిస్తే నమీబియాతో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. -
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్‌తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు. ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్‌కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది. కాగా, రువాండతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. -
ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే!
సాధారణంగా గనుల్లో పనిచేసేందుకు పురుషులనే నియమిస్తుంటారు. గనుల్లోని పనులు ఎంతో కష్టమైనందున వాటిని పురుషులతోనే చేయిస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో దీనికి విరుద్ధమైన పనితీరు కలిగిన ఒక గని ఉంది. దీనిలో మహిళలు మాత్రమే పని చేస్తుంటారు. దీని వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఈ గనిలో పని చేసే మహిళలకు భారీ వేతనం కూడా లభిస్తుంది . ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఆ గనిలో జరిగే పనితీరును ప్రశంసిస్తుంటాయి. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ రత్నాల కోసం వెదుకులాట సాగిస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు మహిళలను మాత్రమే తీసుకుంటారు. డ్రిల్లింగ్ అయినా, సుత్తితో కొట్టే పని అయినా, పెద్ద పెద్ద రాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీపనిని మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో పేలుళ్లు లాంటి పనులు చేయరు. జాతి రాళ్లు, రత్నాలు భూమి లోపలి పొరలలో కనిపిస్తాయి. ఉలి, సుత్తి సహాయంతోనే ఇక్కడ తవ్వకాల పనులు చేపడతారు. ఈ విధమైన పనితీరుతో పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించరు. నీటిని కూడా తక్కువగానే ఉపయోగిస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలకు ప్రతినెలా 180 (ఒక యూరో రూ.91) యూరోలు అందుతుంటాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇక్కడ పనిచేసే మహిళలు తమ తీరిక సమయంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తుంటారు. ఇక్కడి గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలు మహిళా సాధికారతను కాంక్షిస్తూ, వారికే ఉపాధి కల్పిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడి మహిళలు తమ పిల్లల చేత ఉన్నత చదువులు చదివిస్తున్నారు. నిరుద్యోగ భర్తలకు అండగా నిలుస్తున్నారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి మహిళలు. ఇది కూడా చదవండి: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు! -
పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్ మార్పు.. నూతన సారధిగా స్టార్ ఆల్‌రౌండర్
జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ టీ20 జట్టుకు నూతన కెప్టెన్‌ను నియమించింది. ఇటీవల స్వదేశంలో పసికూన నమీబియాతో చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్‌పై వేటు వేసింది. ఎర్విన్ స్థానంలో జింబాబ్వే టీ20 జట్టు సారధిగా స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా నియమించబడ్డాడు. ఎర్విన్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా పరిమితం చేయబడ్డాడు. వచ్చే నెలలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌ను దృష్టిలో ఉంచుకుని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ కీలక మార్పు చేసింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు టీ20 జట్టు కెప్టెన్‌ను మార్చడంతో పాటు మరిన్ని కీలక మార్పులు కూడా చేసింది. మాజీ హెడ్ కోచ్ డేవ్ హటన్‌కు మరోసారి అవే బాధ్యతలు అప్పజెప్పింది. అదనంగా హటన్‌కు సెలక్షన్ ప్యానెల్లో చోటు కల్పించింది. హటన్తో పాటు మాజీ కెప్టెన్ ఎల్టన్ చిగుంబరకు కూడా సెలక్షన్ ప్యానెల్లో చోటు దక్కింది. జింబాబ్వే క్రికెట్ కమిటీ నూతన చైర్మన్‌గా బ్లెస్సింగ్ గొండోను నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా హమిల్టన్ మసకద్జ, కెన్యోన్ జెహ్లా, రసెల్ టిఫిన్, జూలియా చిబాబ, డేవ్ హటన్, చిగుంబరలకు చోటు దక్కింది. కాగా, స్వదేశంలో ఇటీవల నమీబియాతో జరిగిన టీ20 సిరీస్‌లో జింబాబ్వే 2-3 తేడాతో ఓటమిపాలైంది. -
జింబాబ్వేకు షాక్.. మరో పసికూన చేతిలో ఘోర పరాభవం
ఐసీసీ సభ్య దేశమైన జింబాబ్వేకు ఊహించని పరాభవం ఎదురైంది. తమ కంటే చిన్న జట్టైన నమీబియా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నమీబియా.. మూడుసార్లు వన్డే ప్రపంచకప్ ఆడిన జింబాబ్వేను ఓడించి సంచలన సృష్టించింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నమీబియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో నమీబియన్లు 8 పరుగులు తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 18.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ కాగా.. జింబాబ్వే 19.2 ఓవర్లలో 93 పరుగులకు చాపచుట్టేసి పరాజయంపాలైంది. రాణించిన సికందర్ రజా.. ఇటీవలికాలంలో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న సికందర్ రజా (జింబాబ్వే) నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిశాడు. రజా 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాశించాడు. రజాతో పాటు చటారా (3/7), నగరవ (2/6), ర్యాన్ బర్ల్ (1/33) కూడా రాణించడంతో నమీబియా 101 పరుగులకే చాపచుట్టేసింది. బ్యాటింగ్‌లో తేలిపోయిన జింబాబ్వే.. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆది నుంచే తడబుడతూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 93 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లు బెర్నార్డ్, స్మిట్ చెరో 3 వికెట్లు.. లుంగమెని, ఎరాస్మస్, ఫ్రైలింక్ తలో వికెట్ తీసి జింబాబ్వేను మట్టికరిపించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో లూక్ జాంగ్వే (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన నమీబియా ఆతర్వాత నాలుగు, ఐదు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ చేజిక్కించుకుంది. -
ప్లేన్ క్రాష్.. బిలియనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ఒక్కరూ మిగల్లేదు!
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం భారత్‌కు చెందిన మైనింగ్ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలిసింది. బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. తమ వజ్రాల గని వద్దే ప్రమాదం రియోజిమ్ కంపెనీకి చెందిన ‘సెస్నా 206’ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ కంపెనీకి చెందిన చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలోనే ఈ సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోవడం గమనార్హం. ఒక్కరూ మిగల్లేదు.. జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్‌లోకి దూసుకెళ్లే ముందు విమానం సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలుస్తోంది. గాల్లోనే విమానం పేలిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదిక పేర్కొంది. మృతుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే దేశీయులు అని పోలీసులను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక హెరాల్డ్ పేర్కొంది. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు, చిత్రనిర్మాత హోప్వెల్ చినోనో ఆయన మరణాన్ని ధ్రవీకరించారు. రంధావా 4 బిలియన్ డాలర్ల (రూ.33 వేల కోట్లకు పైగా) ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు. -
మేటి బ్యాటర్లను సైతం వణికించాడు.. కానీ ఇలా: టీమిండియా మాజీ ఓపెనర్
Aakash Chopra pays tribute to Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, దివంగత హీత్ స్ట్రీక్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. స్ట్రీక్ బౌలింగ్ చేస్తుంటే మేటి బ్యాటర్లు సైతం వణికిపోయేవారని గుర్తుచేసుకున్నాడు. జింబాబ్వేకు దొరికిన క్రికెట్ ఆణిముత్యం ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోక తప్పదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ మరణించాడంటూ కొన్ని రోజుల క్రితం నకిలీ వార్త చక్కర్లు కొట్టిన విషయం విదితమే. స్ట్రీక్ సహచర క్రికెటర్ ఒలంగో చేసిన ట్వీట్ గందరగోళానికి దారితీయడంతో.. తాను బతికే ఉన్నానంటూ స్వయంగా అతడు మీడియాకు వెల్లడించాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 49 ఏళ్ల వయసులోనే లోకాన్ని వీడాడు కానీ.. రోజుల వ్యవధిలోనే హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని అతడి భార్య బయటపెట్టడంతో మళ్లీ కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. తన బౌలింగ్ నైపుణ్యాలతో దిగ్గజ బ్యాటర్లను హడలెత్తించిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ క్యాన్సర్‌తో పోరాడి ఓడి.. 49 ఏళ్ల వయసులోనే కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే లెజెండ్ ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. హీత్ స్ట్రీక్‌కు నివాళి అర్పిస్తూ.. ‘‘హీత్ స్ట్రీక్ ఇకలేడు. గతంలో ఓసారి ఇలాంటి వార్త నకిలీదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈసారి నిజంగానే తను లేడు. గొప్ప ఆటగాడు. ఏమాత్రం సందేహం లేకుండా.. అతడిని మనం జింబాబ్వే లెజెండ్ అని పిలవవచ్చు. ఈ మాట నేను అంటున్నది కాదు.. అతడు నిజంగానే ఓ దిగ్గజం. జింబాబ్వే క్రికెట్‌కు దొరికిన అత్యంత గొప్ప క్రికెటర్లతో ఒకడు. మేటి బ్యాటర్లను సైతం హడలెత్తించాడు బౌలింగ్‌లో తనకు తానే సాటి. హరారేలో అతడు బౌలింగ్ చేస్తున్నాడంటే హడలెత్తిపోని బ్యాటర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. మేము జింబాబ్వే పర్యటనకు వెళ్లినపుడు ఇలాంటి పరిస్థితే ఉండేది. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. హీత్ స్ట్రీక్ బ్యాటింగ్ కూడా గొప్పగా ఉండేది. అందుకే అభిమానులతో పాటు అతడి సమకాలీన క్రికెటర్లు కూడా ఆరాధ్యభావంతో చూసేవారు. కానీ ఇలా చిన్న వయసులోనే స్ట్రీక్ వెళ్లిపోవడం బాధాకరం. ఓడిపోయాడు.. మై ఫ్రెండ్ రెస్ట్ ఇన్ పీస్ క్యాన్సర్‌తో పోరులో అతడు ఓడిపోవడం నిజంగా దురదృష్టకరం. మై ఫ్రెండ్.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి హీత్. నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని విచారం వ్యక్తం చేశాడు. పదమూడేళ్లపాటు దిగ్విజయంగా కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 89 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. టీమిండియాను ఓడించి టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి ఈనాటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పలు మ్యాచ్‌లలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన హీత్ స్ట్రీక్ 4 వేల పరుగులు చేయడం విశేషం. ఇక 2001లో స్ట్రీక్ కెప్టెన్సీలో జింబాబ్వే.. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా సెప్టెంబరు 3న హీత్ స్ట్రీక్ కన్నుమూసిన విషయం విదితమే. చదవండి: సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా.. -
Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్
Henry Olonga confirms Heath Streak is well: హీత్ స్ట్రీక్ అభిమానులకు శుభవార్త! ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ బతికే ఉన్నట్లు సహచర క్రికెటర్ హెన్రీ ఒలంగ ప్రకటించాడు. థర్డ్ అంపైర్ అతడిని వెనక్కి పిలిచాడంటూ మరో ట్వీట్ చేశాడు. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ మరణించాడన్న వార్తను తొలుత సోషల్ మీడియాలో షేర్ చేసింది ఒలంగానే కావడం గమనార్హం. పిచ్చి పిచ్చి ట్వీట్లు ఎందుకు? అయితే, అవన్నీ వదంతులేనంటూ తాజాగా మరో ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి విషాదకర వార్తలను ధ్రువీకరించకుండా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం ఎందుకని మండిపడుతున్నారు. కాగా క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్ స్ట్రీక్ చనిపోయాడని ఒలంగ బుధవారం ట్విటర్లో తెలిపాడు. నీకసలు బుద్ధుందా? జింబాబ్వే ప్రస్తుత కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో హీత్ స్ట్రీక్ అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే, అతడు బతికే ఉన్నాడంటూ ఒలంగ ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటి గందరగోళానికి కారణమైన ఒలంగను నీకసలు బుద్ధుందా అంటూ ఏకిపారేస్తున్నారు. 13 ఏళ్ల కెరీర్ కాగా 13 ఏళ్ల పాటు జింబాబ్వే క్రికెటర్‌గా పలు అరుదైన ఘనతలు సాధించిన హీత్ స్ట్రీక్ 2005లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. జింబాబ్వేతో పాటు పలు క్రికెట జట్లకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల హీత్ స్ట్రీక్ ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కాగా జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌గా హీత్ స్ట్రీక్ చరిత్రకెక్కాడు. చదవండి: ఆసియా కప్ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం! హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి.. I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB — Henry Olonga (@henryolonga) August 23, 2023 #Heathstreak fake news failane walo ke sath pic.twitter.com/jPTkLzsOwd — Raja Babu (@GaurangBhardwa1) August 23, 2023 Zimbabwean legend Heath Streak confirms he's alive.#HeathStreak pic.twitter.com/eAS2VKsker — Manjeet Singh Ghoshi (@ghoshi_manjeet) August 23, 2023 Heath Streak at 6:00 AM : Dead Heath Streak at 10:00 AM : Alive Review successful, Yamraj's decision overturned.#HeathStreak pic.twitter.com/RqbcXphfBG — Roshan Rai (@RoshanKrRaii) August 23, 2023 -
అతడి ట్వీట్‌తో గందరగోళం.. స్ట్రీక్ బతికే ఉన్నాడు..
Update: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడని హెన్రీ ఒలంగ తాజాగా ట్వీట్ చేశాడు. Legend Heath Streak: జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ మరణించాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఈ విషయాన్ని జింబాబ్వే మాజీ పేసర్ ఒలంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. జింబాబ్వే లెజెండ్ ఇకలేరంటూ విషాదకర వార్తను అభిమానులతో పంచుకున్నాడు. గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ ‘‘అత్యంత బాధాకర వార్త. హీత్ స్ట్రీక్ ఇక మనకులేరు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్. జింబాబ్వేకు దొరికిన గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్. నీ కలిసి ఆడడం నాకు దొరికిన గొప్ప అనుభూతి. నా ఆట ముగిసిన తర్వాత నిన్ను కలుస్తాను’’ అంటూ హెన్రీ ఒలంగా భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. మా హృదయాలు ముక్కలు చేశావు ఇక జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం ట్విటర్ వేదికగా హీత్ స్ట్రీక్‌కు నివాళి అర్పించాడు. ‘‘స్ట్రీకీ.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నీ కుటుంబంతో పాటు మా అందరి హృదయాలు ముక్కలు చేశావు. అందమైన నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్లావు. నీ లెగసీని మేము కొనసాగిస్తాం. నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి స్ట్రీకీ’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్ -
యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఫైనల్‌కు చేరుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా క్వాలిఫయర్-1లో తో డర్బన్ క్వాలండర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన జోబర్గ్.. ఫైనల్లో అడుగుపెట్టింది. 141 పరుగుల భారీ లక్ష్యాన్ని 9.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జో బర్గ్ ఛేదించింది.ఇక ఈ మ్యాచ్‌లో జోబర్గ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతుల్లోనే 80 పరుగులు సాధించిన ఫఠాన్.. ఒంటి చేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో జోబర్గ్ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. పఠాన్ వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డర్బన్ క్వాలండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. డర్బన్ బ్యాటర్లలో ఫ్లెచర్(39), ఆసిఫ్ అలీ(32) పరుగులతో రాణించారు. ఇక ఇది ఇలా ఉండగా.. క్వాలిఫయర్-1లో ఓటమి పాలైన డర్బన్ క్వాలండర్స్.. క్వాలిఫయర్-2లో మాత్రం విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్ జట్లు తలపడనున్నాయి. Yusuf Pathan smashed 6, 6, 0, 6, 2, 4 in a single over against Amir. What a beast. 🔥pic.twitter.com/8nCf1H8l8c — Johns. (@CricCrazyJohns) July 28, 2023 -
రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్ మెరుపులు
జింబాబ్వే టీ10 లీగ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు, హరారే హరికేన్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్ ఖలందర్స్‌తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఖలందర్స్ బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్ (25 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్ బౌలర్ లూక్ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు. మెరిసిన కాలా.. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్.. జోబర్గ్ బఫెలోస్పై కేప్‌టౌన్ విజయాలు సాధించాయి. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. ఇన్నోసెంట్ కాలా (52 నాటౌట్), వెబ్‌స్టర్ (23 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇచ్చిన కేప్‌టౌన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది. రాణించిన హఫీజ్, బొపారా.. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ (40 నాటౌట్), రవి బొపారా (30 నాటౌట్) రాణించడంతో జోబర్గ్ బఫెలోస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్, బొపారా రాణించడంతో బఫెలోస్ టీమ్ 6.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
రసవత్తర సమరం.. సౌతాఫ్రికా బ్యాటర్ ఉగ్రరూపం.. పొట్టి క్రికెట్లో అద్భుతం
జింబాబ్వే టీ10 లీగ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి. బ్యాటింగ్‌లో హరారే హరికేన్స్ ఆటగాడు డొనవాన్ ఫెరియెరా (33 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) నిర్ణీత బంతుల్లో సగానికిపైగా ఎదుర్కొని బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించగా.. బౌలింగ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ బౌలర్, విండీస్ ఆటగాడు షెల్డన్ కాట్రెల్ తన కోటా 2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి, మరో ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తంగా 3 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్లోనే మెయిడిన్ ఓవర్ వేయడం గగనమైపోయిన ఈ రోజుల్లో టీ10 ఫార్మాట్లో మెయిడిన్ వేసిన కాట్రెల్ రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్ విషయానికొస్తే.. 60 బంతుల మ్యాచ్‌లో ఒకే బ్యాటర్ సగానికి పైగా బంతులు (33) ఎదుర్కోవడం ఆషామాషి విషయం కాదు. ఇది ఓ రికార్డు కూడా. గతంలో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ఎదుర్కొన్న 32 బంతులే టీ10 క్రికెట్లో ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యుత్తమం. తొలి ఓవర్ మెయిడిన్ అయ్యాక, ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బరిలోకి దిగిన ఫెరియెరా ఆఖరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడి టీ10 ఫార్మాట్లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో క్రిస్ లిన్ (30 బంతుల్లో 91; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. Best knock of #ZimAfroT10 💥 Our ZCC Player of the match is Donnovan Ferreira 🤝#CricketsFastestFormat #T10League #InTheWild #CTSAvHH pic.twitter.com/ypG0GZs4MJ — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 టీ10 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్‌కు సంబంధించి అత్యుత్తమ గణాంకాలు ఒకే మ్యాచ్‌లో, ఒకే ఇన్నింగ్స్‌లో నమోదు కావడం విశేషం. హరారే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ ఎదుర్కొన్న ఫెరియెరా.. కరీమ్ జనత్ బౌలింగ్‌లో ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. తొలి బంతి డాట్ కాగా.. ఆఖరి 5 బంతులను ఫెన్సింగ్ దాటించాడు ఫెరియెరా. A peak at the how our 5️⃣ teams stand at the close of Day 5️⃣! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild pic.twitter.com/ZxldzNX3kE — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 అంతకుముందు ఓవర్లోనూ హ్యాట్రిక్ బౌండరీలు బాదిన ఫెరియెరా.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, ఆతర్వాత 8 బంతుల్లో 35 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.హరికేన్స్ ఇన్నింగ్స్ ఫెరియెరా ఒక్కడే రాణించాడు. మరో ఆటగాడు జాంగ్వే (10 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశాడు. కేప్‌టౌన్ బౌలర్లలో కాట్రెల్ 3, నగరవా 2, హాట్జోగ్లూ ఓ వికెట్ పడగొట్టారు. టైగా ముగిసిన మ్యాచ్.. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్.. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (26 బంతుల్లో 56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టైగా ముగిసింది. అంత చేసి, ఆఖరి ఓవర్లో బొక్కబోర్లా పడిన కేప్‌టౌన్.. 116 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లలో 108 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉండిన కేప్‌టౌన్, ఆఖరి ఓవర్లో విజయానికి కావల్సిన 8 పరుగులు చేయలేక డ్రాతో సరిపెట్టుకుంది. తొలి 4 బంతులకు 6 పరుగులు వచ్చినా, చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయలేకపోయింది. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ వేసిన ఈ ఓవర్లో ఐదో బంతికి విలియమ్స్ రనౌట్ కాగా.. ఆఖరి బంతికి లెగ్ బై రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. First over in the tournament ☝️ 8 runs to defend 😬@sreesanth36 rolls the clock back to take the game to the Super over 😵💫 🕰️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild #CTSAvHH pic.twitter.com/tMjN1FGdJw — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 సూపర్ ఓవర్లో హరికేన్స్ విజయం.. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. ఇక్కడ హరికేన్స్ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. వికెట్ కోల్పోయి 7 పరుగులు చేయగా.. హరికేన్స్ 5 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!
జింబాబ్వే టీ10 లీగ్‌లో ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్‌తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్ కెప్టెన్).. లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్ హెఫ్ట్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్.. భారత వెటరన్ రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్ వీరుడు ఎవిన్ లివిస్ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 18 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్ డూలీ 2, తిస్కిన్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్.. సికందర్ రజా, కోబ్ హెఫ్ట్, వెబ్‌స్టర్ (12 నాటౌట్; ఫోర్, సిక్స్) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో బెన్ మెక్‌డెర్మాట్ (8) నిరాశపరచగా.. హరికేన్స్ బౌలర్లలో మహ్మద్ నబీ, నండ్రే బర్గర్ తలో వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్‌దే.. టీ10 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్ 2021 సీజన్లో బాస్ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్ 2018 సీజన్లో ఆఫ్ఘన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. -
సరిపోని టిమ్ సీఫర్ట్ మెరుపులు.. ఇర్ఫాన్ పఠాన్ ఊచకోత
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో డర్బన్ ఖలందర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్‌కు నిక్ వెల్చ్ (9 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ (3), ఆండ్రీ ఫ్లెచర్ (2) విఫలం కాగా.. ఆసిఫ్ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. Irfan Pathan rolling back the 🕰️ for some Sunday entertainment! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/OV44qCpSeG — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్‌కు ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. హరారే ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) విఫలమయ్యారు. ఖలందర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 2, బ్రాడ్ ఈవాన్స్, జార్జ్ లిండే, టెండాయ్ చటారా తలో వికెట్ పడగొట్టారు. Seifert Storm in Harare! 🌪️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/DvxQ84T4hr — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 -
రాణించిన ఉతప్ప.. నిరాశపరిచిన పఠాన్ సోదరులు
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కేప్ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్ చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్ ఖలందర్స్మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) డర్బన్ను గెలిపించాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్.. పొట్టి క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ టీ10 క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ పాక్ మాజీ పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో భాగంగా బులవాయో బ్రేవ్స్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌల్ చేసిన హఫీజ్ (జోబర్గ్ బఫెలోస్).. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ట్రిపుల్ వికెట్ మొయిడిన్ ఓవర్ ఉంది. హఫీజ్ వేసిన 12 బంతుల్లో కేవలం ఒకే ఒక బౌండరీ ఇచ్చి 11 డాట్ బాల్స్ వేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో హాఫీజ్‌వే అత్యుత్తమ గణాంకాలు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 400 మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 250కిపైగా వికెట్లు తీసినప్పటికీ, ఒక్కసారి కూడా 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టలేకపోయాడు. టెస్ట్‌ల్లో 4/16, వన్డేల్లో 4/41, టీ20ల్లో 4/10 హఫీజ్ అత్యుత్తమ గణాంకాలు. Pakistan Chief Selector Got Six Wickets for four runs in his two overs T10 Match. Professor Mohammad Hafeez at his Best🔥♥️.#MohammadHafeez #ZimAfroT10 pic.twitter.com/bOzfgQyguE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 21, 2023 ఇదిలా ఉంటే, బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (23 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) చెలరేగగా.. ఓపెనర్ టామ్ బాంటన్ (18 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్రేవ్స్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫరాజ్, వెబ్‌స్టర్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బ్రేవ్స్.. మహ్మద్ హఫీజ్ (2-1-4-6) ధాటికి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. హఫీజ్ బ్రేవ్స్ పతనాన్ని శాశిస్తే.. వెల్లింగ్టన్ మసకద్జ (2-0-11-3) మరో ఎండ్ నుంచి అతనికి సహకరించాడు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్ (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ మెక్‌డెర్మాట్ (13), ర్యాన్ బర్ల్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్ డకౌట్లు కావడం విశేషం. -
జింబాబ్వే టీ10 లీగ్ షెడ్యూల్ విడుదల.. బరిలో ఆరుగురు టీమిండియా ప్లేయర్స్
జింబాబ్వే క్రికెట్ మరియు టీ టెన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. జులై 20 నుంచి ప్రారంభంకాబోయే ఈ లీగ్‌లో 5 ప్రాంచైజీలు (బులవాయో బ్రేవ్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, డర్బన్ ఖలందర్స్, హరారే హరికేన్స్, జోహనెస్బర్గ్ బఫెలోస్) 24 మ్యాచ్‌ల్లో తలపడతాయి. లీగ్‌లో జరుగబోయే మ్యాచ్‌లన్నిటికీ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం 11:30 గంటలకు, 1:30 గంటలకు.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు (20), రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, తదనంతరం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జులై 20: హరారే హరికేన్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (3:30) జులై 21: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (11:30) జులై 21: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30) జులై 21: హరారే హరికేన్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (3:30) జులై 22: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (11:30) జులై 22: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30) జులై 22: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ హరారే హరికేన్స్ (3:30) జులై 23: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (11:30) జులై 23: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ కేప్‌టౌన్ కాంప్ ఆర్మీ (1:30) జులై 23: హరారే హరికేన్స్ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (3:30) జులై 24: బులవాయో బ్రేవ్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (1:30) జులై 24: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (3:30) జులై 25: కేప్‌టౌన్ వర్సెస్ హరారే హరికేన్స్ (11:30) జులై 25: బులవాయో వర్సెస్ డర్బన్ (1:30) జులై 25: హరారే వర్సెస్ జోబర్గ్ (3:30) జులై 26: బులవాయో వర్సెస్ హరారే (11:30) జులై 26: డర్బన్ వర్సెస్ కేప్‌టౌన్ (1:30) జులై 26: బులవాయో వర్సెస్ జోబర్గ్ (3:30) జులై 27: డర్బన్ వర్సెస్ హరారే (11:30) జులై 27: కేప్‌టౌన్ వర్సెస్ జోబర్గ్ (3:30) జులై 28: క్వాలిఫయర్ 1 (11:30) జులై 28: ఎలిమినేటర్ (1:30) జులై 28: క్వాలిఫయర్ 2 (3:30) జులై 29: ఫైనల్ (1:30) లీగ్‌లో ఆడబోయే భారత ఆటగాళ్లు.. స్టువర్ట్ బిన్నీ పార్థివ్ పటేల్ రాబిన్ ఉతప్ప శ్రీశాంత్ ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ Squad Check 🗒️ A look at all the rosters after the #ZimAfroT10Draft! 🔥 Which team do you reckon are the early favorites for the inaugural #ZimAfroT10? 🏆#T10League #CricketsFastestFormat pic.twitter.com/JXMx5xnNBU — T10 League (@T10League) July 3, 2023 -
క్వాలిఫయర్స్ టీమ్ ఆఫ్ ది టోర్నీ ప్రకటన.. విండీస్ నుంచి ఒక్కరు కూడా లేరు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నీని ఐసీసీ కొద్ది సేపటి కిందట ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్ నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్‌గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టులో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. సూపర్ సిక్స్ దశలో విండీస్ ఐదో స్థానానికి పరిమితం కావడంతో ఐసీసీ ఆ జట్టును పరిగణలోకి తీసుకోలేదు. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షాయ్ హోప్ (7 మ్యాచ్‌ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (శ్రీలంక, 417 పరుగులు, 2 సెంచరీలు), విక్రమ్‌జీత్ సింగ్ (నెదర్లాండ్స్, 326, సెంచరీ)లను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్, 364, 2 సెంచరీలు, 13 వికెట్లు), నాలుగో స్థానంలో క్వాలిఫయర్స్ టాప్ స్కోరర్ సీన్ విలియమ్స్ (జింబాబ్వే, 600, 3 సెంచరీలు), ఐదో స్థానంలో యువ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్, 285, సెంచరీ, 15 వికెట్లు), ఆరో ప్లేస్‌లో సికందర్ రజా (జింబాబ్వే, 325, సెంచరీ, 9 వికెట్లు), ఏడో స్థానంలో స్కాట్ ఎడ్వర్డ్స్ (నెదర్లాండ్స్, 314, 4 అర్ధసెంచరీలు), స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా క్వాలిఫయర్స్ లీడింగ్ వికెట్ టేకర్లు హసరంగ (22 వికెట్లు), తీక్షణ (21) (శ్రీలంక), ఫాస్ట్ బౌలర్లుగా క్రిస్ సోల్ (స్కాట్లాండ్, 11 వికెట్లు), రిచర్డ్ నగరవ (జింబాబ్వే, 14 వికెట్లు)లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. -
వరల్డ్‌కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్.. స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ
బులవాయో: తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడటంతో... జింబాబ్వే జట్టు వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించలేకపోయింది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన తమ ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు సాధించింది. మైకేల్ లీస్క్ (48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూ క్రాస్ (38; 2 ఫోర్లు), బ్రెండన్ మెక్‌ములెన్ (34; 6 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు, చటారా రెండు వికెట్లు తీశారు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. రియాన్ బర్ల్ (83; 8 ఫోర్లు, 1 సిక్స్), సికందర్ రజా (34; 2 ఫోర్లు, 1 సిక్స్), మధెవెరె (40; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ సోల్ (3/33) జింబాబ్వేను దెబ్బ కొట్టాడు. మెక్‌ములెన్, లీస్క్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 2019లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీలోనే వెనుదిరిగింది. జింబాబ్వేపై విజయంతో స్కాట్లాండ్ దాదాపుగా ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈనెల 6న నెదర్లాండ్స్‌తో జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెగా ఈవెంట్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ ఓడిపోయినా నెదర్లాండ్స్ కంటే రన్‌రేట్ తక్కువ కాకుండా చేసుకుంటే స్కాట్లాండ్‌కే ప్రపంచకప్ బెర్త్ ఖరారవుతుంది. నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. కాగా, క్వాలిఫయర్స్‌లో అజేయంగా ఉన్న శ్రీలంక, భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్
జింబాబ్వే జట్టును దురదృష్టం వెంటాడింది.వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాలన్న కల చెదిరింది. సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్ దశలో వరుస విజయాలతో చెలరేగింది. సీన్ విలియమ్స్ వరుస సెంచరీలకు తోడుగా సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తుండడంతో జింబాబ్వే ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే సూపర్ సిక్స్ దశకు వచ్చేసరికి చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంతో జింబాబ్వే అవమాన భారంతో వరల్డ్‌కప్ అర్హత రేసు నుంచి నిష్క్రమించింది. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ రేసులో భాగంగా మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ ఆరో మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 84 బంతుల్లో 83 పరుగులు వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది. మెస్లీ మెద్వెర్ 40, సికందర్ రజా 34 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ మూడు వికెట్లు తీయగా, బ్రాండన్ మెక్ముల్లన్ రెండు, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 48, మాథ్యూ క్రాస్ 38, బ్రాండన్ మెక్ముల్లన్ 34, మున్సే 31, మార్క్ వాట్ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. చటారా రెండు, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సిక్స్‌లో వరుస రెండు ఓటములు జింబాబ్వే కొంపముంచితే.. తొలి మ్యాచ్‌లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్ రన్‌రేట్‌తో ఉన్న స్కాట్లాండ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే చాన్స్ ఉంది. స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా స్కాట్లాండ్కు అవకాశం ఉంటుంది. కాకపోతే నెదర్లాండ్స్ చేతిలో భారీ ఓటమి పాలవ్వకుండా జాగ్రత్తపడాలి. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 30 కంటే ఎక్కువ పరుగులతో గెలవాలి లేదంటే చేజింగ్‌లో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకోవాలి. అప్పుడే నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. స్కాట్లాండ్ను ఓడించినా ఆ జట్టు ఆరు పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. Final World Cup 2023 spot qualification scenario: Scotland - win and grab their tickets for India. Netherlands - win by 30+ runs or chase the target with 6 overs to spare. pic.twitter.com/R0HzIljTSl — Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2023 చదవండి: #AlexCarey: 'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి' -
4597 రోజుల తర్వాత.. అదే వాంఖడేలో భారత్-శ్రీలంక మ్యాచ్!
దసన్ శనక సారధ్యంలోని శ్రీలంక జట్టు భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన శ్రీలంక.. 9వ జట్టుగా ప్రధాన టోర్నీలో అడుగుపెట్టనుంది. ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫయర్-2 జట్టుగా శ్రీలంక అర్హత సాధించింది. వాస్తవానికి ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన వాంఖడే మైదానంలో భారత్ క్వాలిఫయర్-2 జట్టుతో తలపడనుంది. ఇప్పుడు శ్రీలంక క్వాలిఫయర్-2 జట్టుగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టడంతో మరోసారి ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 4597 రోజుల తర్వాత... ఇక 4597 రోజుల తర్వాత తొలిసారి ముంబైలోని వాంఖడే స్టేడియం భారత్-శ్రీలంక మ్యాచ్‌కు వేదిక కానుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే వాఖండే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయంతో భారత్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ధోని సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఏప్రిల్ 2, 2011న భారత్-శ్రీలంక మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. జింబాబ్వే-స్కాట్లాండ్ ఫైట్ ఇక వన్డే ప్రపంచకప్‌లో రెండో జట్టుగా అడుగుపెట్టేందుకు జింబాబ్వే-స్కాట్లాండ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జింబాబ్వే 6 పాయింట్లతో ఉండగా, స్కాట్లాండ్ 4 పాయింట్లతో ఉంది. జూలై 4న హరారే వేదికగా జింబాబ్వే-స్కాట్లాండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే జింబాబ్వేతో సమంగా నిలుస్తోంది. అప్పుడు నెట్రన్ రేట్ కీలకం కానుంది. అయితే జింబాబ్వే(+0.030) కంటే స్కాట్లాండ్(+0.188) రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి స్కాటిష్ జట్టు క్వాలిఫయర్-1గా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: IND vs WI: బీచ్‌లో వాలీబాల్ ఆడిన భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్ -
World Cup 2023: జింబాబ్వేను చిత్తు చేసిన శ్రీలంక.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన శ్రీలంక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ కు అర్హత సాధించింది. తద్వారా భారత్ వేదికగా జరగనున్న వన్డేప్రపంచకప్-2023కు శ్రీలంక క్వాలిఫై అయింది. ఫైనల్‌కు చేరిన రెండు జట్లు ప్రధాన టోర్నీలో భాగం కానున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్(57 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లతో చెలరేగగా.. మదుషంక 3 వికెట్లు, పతిరణ 2 వికెట్లు సాధించారు. అనంతరం 166 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33.1 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సంక(101) అజేయ శతకంతో చెలరేగాడు. అతడితో పాటు కరుణరత్నే(30) రాణించాడు. చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే -
కొనసాగుతున్న సీన్ విలియమ్స్ భీకర ఫామ్.. వదిలితే రన్‌మెషీన్‌ను మించిపోయేలా ఉన్నాడు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు (102*, 174, 142), ఓ భారీ హాఫ్ సెంచరీ (91) సాయంతో 532 పరుగులు చేసిన విలియమ్స్.. ఇవాళ (జులై 2) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధసెంచరీ (56) సాధించి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని మరిపించాడు. విరాట్ 5 వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాల సాయంతో 596 పరుగులు చేస్తే.. విలియమ్స్ ఇంచుమించు విరాట్ రికార్డును సమం చేసినంత పని చేశాడు. సీన్ విలియమ్స్ ఫామ్ వన్డేల వరకే పరిమితమైందనుకుంటే పొరపాటే. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ టెస్ట్‌ల్లోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్స్ చివరిగా ఆడిన 5 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, విలియమ్స్ పరుగుల ప్రవాహం కొనసాగుతుండటంతో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే విజయ యాత్ర కొనసాగుతుంది. ఆ జట్టు సూపర్ సిక్స్‌లో శ్రీలంకతో సమానంగా 6 పాయింట్లు సాధించి , వన్డే వరల్డ్‌కప్-2023 బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే, శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న కీలక మ్యాచ్‌లో మాత్రం జింబాబ్వే చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 32.2 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. సీన్ విలియమ్స్ (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (31) కాస్త పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ (4/25), మధుశంక (3/15), పతిరణ (2/18), షనక (1/30) చెలరేగిపోయారు. -
WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే!
బులవాయో: మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే జట్టు వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అర్హత సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన జింబాబ్వే... గురువారం మొదలైన ‘సూపర్ సిక్స్’ దశలోనూ శుభారంభం చేసింది. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ఒమన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 332 పరుగులు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (103 బంతుల్లో 142; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడి ఈ టోర్నీ రెండో సెంచరీ, కెరీర్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రజా, విలియమ్స్ అదుర్స్ సికందర్ రజా (49 బంతుల్లో 42; 6 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు సీన్ విలియమ్స్ 102 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. చివర్లో ల్యూక్ జోంగ్వి (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో జింబాబ్వే భారీ స్కోరు నమోదు చేసింది. ఒమన్ బౌలర్ ఫయాజ్ భట్ 79 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కశ్యప్ ప్రజాపతి సెంచరీ ఇక 333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగులు చేసి ఓడిపోయింది. గుజరాత్లో జన్మించి ఒమన్ జట్టుకు ఆడుతున్న ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి (97 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. ఆకీబ్ ఇలియాస్ (45; 5 ఫోర్లు), జీషాన్ మక్సూద్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), అయాన్ ఖాన్ (47; 5 ఫోర్లు), నదీమ్ (30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా పోరాడటంతో ఒకదశలో ఒమన్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. తప్పని ఓటమి అయితే కీలక తరుణాల్లో జింబాబ్వే బౌలర్లు వికెట్లు పడగొట్టి ఒమన్ ఓటమిని ఖరారు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చటారా, ముజరబాని మూడు వికెట్ల చొప్పున తీయగా... ఎన్గరవాకు రెండు వికెట్లు దక్కాయి. సీన్ విలియమ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే రెండో ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తలపడుతుంది. విండీస్ కొంపముంచిన జింబాబ్వే.. ‘టాప్ ర్యాంక్’లోకి దూసుకొచ్చి ఒమన్‌పై విజయంతో జింబాబ్వే ‘సూపర్ సిక్స్’ దశలో ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. లీగ్ దశలో గ్రూప్ ‘ఎ’లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లపై జింబాబ్వే గెలవడం... ఆ రెండు జట్లు కూడా ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకోవడంతో... జింబాబ్వే ‘సూపర్ సిక్స్’ పోటీలను నాలుగు పాయింట్లతో మొదలుపెట్టింది. ఒక్కటి ఓడినా అంతే సంగతులు! తాజాగా ఒమన్‌పై నెగ్గిన జింబాబ్వే రెండు పాయింట్లు సాధించింది. జింబాబ్వే రన్‌రేట్ కూడా (0.75) బాగుంది. ఫలితంగా రన్‌రేట్‌లో చాలా వెనుకబడ్డ వెస్టిండీస్ (–0.35) జట్టు వన్డే ప్రపంచకప్‌కు అర్హత పొందాలంటే ‘సూపర్ సిక్స్’లో మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ‘సూపర్ సిక్స్’లో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరే రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి. ఇందుకోసం ఒకప్పుడు మేటి జట్లుగా పేరొందిన వెస్టిండీస్, శ్రీలంక ప్రధానంగా పోటీపడతాయని భావించగా.. అనూహ్యంగా జింబాబ్వే రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఇక రన్‌రేటు పరంగా వెనుకబడి ఉన్న విండీస్ ఒక్క మ్యాచ్ ఓడినా వరల్డ్‌కప్-2023 ఆశలు వదులుకోకతప్పని దుస్థితి నెలకొంది. కాగా సూపర్‌సిక్స్‌లో భాగంగా విండీస్ శనివారం తమ మొదటి మ్యాచ్ స్కాట్లాండ్తో ఆడనుంది. చదవండి: టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్.. వాళ్లంతా జట్టుకు దూరం -
ఒమన్‌పై విజయం.. వరల్డ్‌కప్ అర్హత దిశగా జింబాబ్వే
సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది. గురువారం మొదలైన సూపర్ సిక్స్ పోటీల్లో జింబాబ్వే, ఒమన్‌లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో మరింత దగ్గరైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్సన్(103 బంతుల్లో 142 పరుగులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) టోర్నీలో మూడో శతకంతో చెలరేగాడు. సికందర్ రజా 49 బంతుల్లో 42 పరుగులు చేయగా.. ఆఖర్లో జాంగ్వే 28 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 333 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ శక్తికి మించి పోరాటం చేసింది. ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి 97 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో అకీబ్ ఇల్యాస్ 45, జీషన్ మక్సూద్ 37, ఆయానా ఖాన్ 47 పరుగులు చేశాడు. ఒక దశలో 42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులతో గెలిపించేలా అనిపించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మొహమ్మద్ నదీమ్ 18 బంతుల్లోనే 30 పరుగులు నాటౌట్ ఆశలు రేపినా మిగతావారు సహకరించడంలో విఫలమయ్యారు. దీంతో ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానిక 318 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ, తెందయి చతారాలు చెరో మూడు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా రెండు,సికందర్ రజా ఒక వికెట్ పడగొట్టాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన జింబాబ్వే 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌లో రెండో టాపర్‌గా అడుగుపెట్టింది. తాజాగా ఒమన్‌పై విజయంతో పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. మరొక విజయం సాధిస్తే జింబాబ్వే అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్ను వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. A hard-fought win! 🇿🇼 beat Oman by 1⃣4⃣ runs in the first match of the Super Six 🙌 📝: https://t.co/wBKKKFmDjo #ZIMvOMA | #CWC23 pic.twitter.com/aTn5aruPjo — Zimbabwe Cricket (@ZimCricketv) June 29, 2023 చదవండి: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. 23 ఏళ్ల రికార్డు బద్దలు!
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023లో క్వాలిఫియర్స్‌లో జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లో రజా 42 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సికిందర్ రజా ఓ అరుదైన రికార్డును సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రజా నిలిచాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రజా నమోదు చేశాడు. రజా కేవలం 127 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు జింబాబ్వే దిగ్గజం గ్రాంట్ ఫ్లవర్ పేరిట ఉండేది. 2000లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రాంట్ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు. 128 ఇన్నింగ్స్‌లో ఫ్లవర్ ఈ రికార్డును అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో 23 ఏళ్ల ఫ్లవర్ రికార్డును రజా బ్రేక్ చేశాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన రజా.. 86.67 సగటుతో 260 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ అద్భుత సెంచరీ కూడా ఉంది. చదవండి: #SeanWilliams: హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా! -
విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!
రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్‌కు ఘోర అవమానం ఎదురైన సంగతి తెలిసిందే. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ మెగా సమరానికి అర్హత సాధించని విండీస్ జట్టు క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లోనూ దారుణ ఆటతీరు కనబరిచి వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయినప్పటికి.. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిన విండీస్‌కు సూపర్ సిక్స్‌లో సున్నా పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో లీగ్ దశలో నెదర్లాండ్స్, వెస్టిండీస్(సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్లు)లపై విజయాలు సాధించిన జింబాబ్వే నాలుగు పాయింట్లతో టాపర్‌గా ఉంది. ఇక నెదర్లాండ్స్ విండీస్‌పై సూపర్ ఓవర్లో విజయం సాధించి రెండు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ దశలో వెస్టిండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం అసాధ్యమని తెలుసు. కానీ వెస్టిండీస్‌కు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు ఇప్పటికి ఒక అవకాశం మిగిలి ఉంది. కష్టసాధ్యమైనప్పటికి అదృష్టం కూడా కలిసివస్తే మాత్రం విండీస్ మెగా సమరానికి వెళ్లే అవకాశముంటుంది.అదెలా అంటే.. ఒకే గ్రూప్‌లో ఉన్న జింబాబ్వే వద్ద ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. మరో గ్రూప్‌లో ఉన్న శ్రీలంక ఖాతాలోనూ 4 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో ముందు వరుసలో ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే.. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్‌లో వెస్టిండీస్ శ్రీలంక, ఒమన్, స్కాట్లాండ్లతో ఆడుతుంది. తొలుత ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ కచ్చితంగా గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా విండీస్ ఇంటిబాట పట్టాల్సిందే. ఒకవేళ విండీస్ మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆరు పాయింట్లు తన ఖాతాలో ఉంటాయి. ఇక జింబాబ్వే, శ్రీలంకలు తాము ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమి పాలవ్వాలి. అలా జరిగితేనే వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేలు ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఒకవేళ శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు విజయాలు సాధిస్తే అప్పుడు రెండు జట్లు 8 పాయింట్లతో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే.. విండీస్ ఇంటిబాట పడుతుంది. నెట్ రన్‌రేట్ పెంచుకోవాల్సిందే.. ఒకవేళ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు మ్యాచ్‌లు ఓడినా విండీస్‌కు అవకాశాలు అంతంతే. ఎందుకంటే ఆ సమయంలో నెట్‌రన్‌రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం విండీస్ రన్‌రేట్ (-0.350)గా ఉంది. మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడంతో పాటు భారీ విజయాలతో విండీస్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోవాలి. ఇప్పటికైతే విండీస్‌కు, శ్రీలంక(+2.698)కు నెట్‌రన్‌రేట్ విషయంలో చాలా తేడా ఉంది. ఒమన్‌పై 99 పరుగుల టార్గెట్‌ను 35 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించడం లంక రన్‌రేట్‌ను బాగా మెరుగుపరిచింది. ఇక జింబాబ్వే నెట్ రన్‌రేట్ కూడా +0.982గా ఉంది. ఇది కూడా విండీస్‌కు ఒక దెబ్బ అని చెప్పొచ్చు జింబాబ్వే అన్ని మ్యాచ్‌లు ఓడిపోతే.. అయితే విండీస్‌కు నెట్ రన్‌రేట్ పెంచుకోవడంలో విఫలమైనా ఆఖరిగా ఒక చాన్స్ ఉంది. అదేంటంటే.. జింబాబ్వే సూపర్ సిక్స్‌లో తాను ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూడాలి.. అదే సమయంలో విండీస్ అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలి. అప్పుడు జింబాబ్వే ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటే.. విండీస్ ఆరు పాయింట్లు సాధించి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో శ్రీలంక విండీస్ చేతిలో ఓడి.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఇక ఒమన్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్లు తలా ఒక విజయం సాధించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్‌కు ఇది అంత సులువు కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫామ్ దృశ్యా శ్రీలంక, జింబాబ్వేలను ఓడగొట్టడం మిగతా జట్లకు పెద్ద సవాల్. అందునా మరీ రెండు మ్యాచ్‌లు ఓడిపోయే దుస్థితిలో ఈ రెండు జట్లు ఎంతమాత్రం లేవు. ఇన్ని ఇబ్బందుల మధ్య విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని ఆశించడం వ్యర్థం.. కానీ ఏ మూలనో ఆ జట్టుకు అదృష్టం రాసి ఉంటే తప్ప. చదవండి: వరల్డ్‌కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ 2011 టోర్నీ మొత్తం ధోని అదే తిన్నాడు: సెహ్వాగ్.. రోహిత్ ఆ వడాపావ్ మానేసి.. -
ఘన కీర్తి కలిగిన వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. వరల్డ్‌కప్ అవకాశాలు గల్లంతు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమితో విండీస్ ఖాళీ ఖాతాతో సూపర్ సిక్స్‌కు అడుగుపెట్టనుంది. తద్వారా ఫైనల్‌కు చేరే ఛాన్స్‌తో పాటు వరల్డ్‌కప్ అవకాశాలను ఆవిరి చేసుకుంది. సూపర్ సిక్స్‌కు పాయింట్లు ఎలా..? సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్టు తమతో పాటు ఆ దశకు చేరుకున్న మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే, మ్యాచ్‌కు రెండు పాయింట్ల చొప్పున 4 పాయింట్లు.. ఒక జట్టుపై గెలిచి మరో జట్టు చేతిలో ఓడితే 2 పాయింట్లు.. రెండు జట్ల చేతిలో ఓడితే పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశలో అడుగుపెడతుంది. జింబాబ్వే 4, నెదర్లాండ్స్ 2, వెస్టిండీస్ 0 గ్రూప్-ఏ నుంచి సూపర్ సిక్స్‌కు చేరుకున్న మూడు జట్లలో ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు,నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు, వెస్టిండీస్ ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించడంతో జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. జింబాబ్వే చేతిలో ఓడి, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడటంతో వెస్టిండీస్ పాయింట్లు ఏమీ లేకుండానే సూపర్ సిక్స్ దశలో పోటీపడుతుంది. గ్రూప్-బి నుంచి ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది..? గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. అయితే శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య ఇవాళ (జూన్ 27) జరుగబోయే మ్యాచ్‌తో ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుందో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే 4 పాయింట్లు, స్కాట్లాండ్ గెలిస్తే 2 పాయింట్లు.. శ్రీలంక, స్కాట్లాండ్ చేతుల్లో ఓడింది కాబట్టి ఒమన్ 0 పాయింట్లతో తదుపరి దశలో పోటీపడతాయి. సూపర్ సిక్స్ దశలో ఎలా..? గ్రూప్ దశలో సాధించిన అదనపు పాయింట్లతో (4 లేదా 2 లేదా 0) ప్రతి జట్టు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఈ దశలో ఓ గ్రూప్‌లోని ఓ జట్టు మరో గ్రూప్‌లోని 3 జట్లతో ఒక్కో మ్యాచ్ అడుతుంది. అన్ని జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాత టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అలాగే ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు కలిగిన వెస్టిండీస్ జట్టు.. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా ఆవిరి చేసుకుంది. పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశకు చేరిన ఆ జట్టు.. ఈ దశలో ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా 6 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. మరోవైపు జింబాబ్వే ఇప్పటికే 4 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఏదో ఒక జట్లు 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుతుంది. గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ ఇదివరకు 2 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఓ జట్టు 2 పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్‌లో పోటీపడుతుంది. 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచినా 8 పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇది కాదని విండీస్ సూపర్ సిక్స్ దశలో క్వాలిఫయర్స్‌లో తమకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన శ్రీలంక, స్కాట్లాండ్లతో తలపడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా సంచలనం నమోదైతే తప్ప విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు. -
కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత..
ICC Cricket World Cup Qualifiers 2023: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసింది. హరారే వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో యూఎస్ఏను ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచింది. ఇప్పటికే సూపర్ సిక్సెస్‌లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో ఇప్పటికే సూపర్ సిక్సెస్‌కు అర్హత సాధించిన జింబాబ్వే జూన్ 26న యూఎస్ఏతో నామమాత్రపు మ్యాచ్‌లో తలపడింది. టాస్ గెలిచిన యూఎస్ఏ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ ఊచకోత.. ఏకంగా వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ సీన్ విలియమ్స్ 101 బంతుల్లో ఏకంగా 21 ఫోర్లు, 5 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 174 పరుగులు సాధించాడు. ఓపెనర్ గుంబీ 78 పరుగులు సాధించగా.. సికందర్ రజా 48, రియాన్ బర్ల్ 47 పరుగులతో రాణించారు. మరీ దారుణం ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన యూఎస్ఏ 104 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్ల సమిష్టి ప్రదర్శన కారణంగా 25.1 ఓవర్లకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ బ్యాటర్లు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0.6,9,8,13,0,24,2,21,6,0. బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో.. ముఖ్యంగా టాపార్డర్ దారుణ వైఫల్యం కారణంగా యూఎస్ఏకు 304 పరుగుల భారీ తేడాతో ఓటమి తప్పలేదు. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన జింబాబ్వే సారథి సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీమిండియా తర్వాతి స్థానం జింబాబ్వేదే యూఎస్ఏపై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. మేటి జట్లను వెనక్కి నెట్టి.. టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయాలివే ►2023- తిరువనంతపురంలో శ్రీలంక మీద భారత్- 317 పరుగులు ►2023- హరారేలో యూఎస్ఏ మీద జింబాబ్వే- 304 పరుగులు ►2008- అబెర్డీన్లో ఐర్లాండ్ మీద న్యూజిలాండ్- 290 పరుగులు ►2015- పెర్త్‌లో అఫ్గనిస్తాన్ మీద ఆస్ట్రేలియా- 275 పరుగులు ►2010- బెనోనిలో జింబాబ్వే మీద సౌతాఫ్రికా-272 పరుగుల తేడాతో విజయం సాధించాయి. చదవండి: ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా.. ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ.. -
CWC Qualifier 2023: సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు, తదుపరి షెడ్యూల్ వివరాలు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. నేపాల్, యూఎస్ఏ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. ఐర్లాండ్, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లు జూన్ 29 నుంచి ప్రారంభమవుతాయి. సూపర్ సిక్స్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు జరుగనుండగా.. ఓ గ్రూప్‌లోని మూడు జట్లు మరో గ్రూప్‌లోని మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టోర్నీలో మరో నాలుగు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఏ పొజిషన్లో ఉంటుందో డిసైడ్ కాలేదు. గ్రూప్-ఏలో జింబాబ్వే తొలి స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకోగా.. వెస్టిండీస్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 26) విజేత రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రూప్-బి నుంచి శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 27) విజేత గ్రూప్ టాపర్ నిలుస్తుంది. మరో జట్టు ఒమన్ తమ కోటా మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడంతో ఓడిన జట్టు రెండో స్థానంలో ఉంటుంది. సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే 2 పాయింట్లతో తదుపరి దశకు చేరతాయి. గ్రూప్-ఏలో జింబాబ్వే.. తమ గ్రూప్‌లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్‌లపై విజయాలు సాధించడంతో సూపర్ సిక్స్ దశకు రెండు పాయింట్లతో అడుగుపెడుతుంది. అలాగే గ్రూప్-బిలో శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది. సూపర్ సిక్స్ షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి).. జూన్ 29: ఏ2 వర్సెస్ బి2 జూన్ 30: ఏ3 వర్సెస్ బి1 జులై 1: ఏ1 వర్సెస్ బి3 జులై 2: ఏ2 వర్సెస్ బి1 జులై 3: ఏ3 వర్సెస్ బి2 జులై 4: ఏ2 వర్సెస్ బి3 జులై 5: ఏ1 వర్సెస్ బి2 జులై 6: ఏ3 వర్సెస్ బి3 జులై 7: ఏ1 వర్సెస్ బి1 సూపర్ సిక్స్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు జులై 9న జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఫైనల్లో తలపడటంతో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న వెస్టిండీస్‌కు మరో బిగ్ షాక్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 24) పెను సంచలనం నమోదైంది. రెండు సార్లు ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. ఈ ఓటమితో విండీస్ వన్డే వరల్డ్‌కప్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ భారీ పరాభవం నుంచి తేరుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలో విండీస్ బౌలర్లు 3 ఓవర్లు తక్కువ వేసినందున ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్.. జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోల్పోవడంలో లాసైన 2 పాయింట్లు విండీస్‌కు తదుపరి దశలో అత్యంత కీలకంగా మారతాయి. అవి విండీస్ వరల్డ్‌కప్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్ కలవరపడుతుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్ రజా (68, 2/45) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, టెండాయ్ చటార (3/52), బ్లెస్సింగ్ ముజరబాని (2/33), రిచర్డ్ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ కాగా, విండీస్ 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ దేశాలు సూపర్ సిక్స్ దశకు చేరే అవకాశం ఉంది. -
పెను సంచలనం.. విండీస్‌ను మట్టికరిపించిన పసికూన
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 24) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్ రజా (68, 2/45) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, టెండాయ్ చటార (3/52), బ్లెస్సింగ్ ముజరబాని (2/33), రిచర్డ్ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఓ మోస్తరు లక్ష్యఛేదనలో జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజాతో పాటు ర్యాన్ బర్ల్ (50), క్రెయిగ్ ఎర్విన్ (47) రాణించగా.. గుంబీ (26), సీన్ విలియమ్స్ (23) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3, అల్జరీ జోసఫ్, అకీల్ హొసేన్ చెరో 2, కైల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. ఆదిలోనే తడబడింది. ఆ జట్టు 46 పరుగులకే 2 వికెట్లు (బ్రాండన్ కింగ్ (20), జాన్సన్ ఛార్లెస్ (1)) కోల్పోయింది. కైల్ మేయర్స్ (56), షాయ్ హోప్ (30), పూరన్ (34), రోస్టన్ ఛేజ్ (44) విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లు క్రమంగా వికెట్లు పడగొట్టడంతో విండీస్ ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఆ జట్టు 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)ఆతిథ్య జట్టు జింబాబ్వే ఎదురులేకుండా దూసుకెళుతుంది. టోర్నీలో జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సికందర్ రజా (54 బంతుల్లోనే 102 పరుగులు) వీరోచిత సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో జింబాబ్వే తరపున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్‌గా సికందర్ రజా గుర్తింపు పొందాడు. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. విక్రమ్‌జిత్ సింగ్(88 పరుగులు), మాక్స్ ఒడౌడ్(59 పరుగులు), స్కాట్ ఎడ్వర్డ్స్(83 పరుగులు) రాణించగా.. సికందర్ రజా 55 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 316 టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. క్రెయిగ్ ఇర్విన్(50 పరుగులు), సీన్ విలియమ్స్(91 పరుగులు) రాణించగా.. సికందర్ రజా(54 బంతుల్లో 102 నాటౌట్, ఆరు ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. Hosts Zimbabwe make it two wins out of two after Sikandar Raza's heroics ✌️ 📝: #ZIMvNED: https://t.co/6sP9VYrxb0 | #CWC23 pic.twitter.com/u52nPJgmF6 — ICC Cricket World Cup (@cricketworldcup) June 20, 2023 చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
సికందర్ రజా మాయాజాలం.. అయినా భారీ స్కోర్ చేసిన నెదర్లాండ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్-ఏలో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్ (88), మ్యాక్స్ ఒడౌడ్ (59), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (83), ఆఖర్లో సకీబ్ జుల్ఫికర్ (34 నాటౌట్) చెలరేగడంతో డచ్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా (4/55), రిచర్డ్ నగరవ (2/40) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా బౌలర్లను డచ్ బ్యాటర్లు ఆడుకున్నారు. జింబాబ్వే మొత్తం 8 మంది బౌలర్లను ప్రయోగించినా పరుగులను నియంత్రించలేకపోయింది. నెదర్లాండ్స్ కోల్పోయిన 6 వికెట్లలో 4 క్లీన్ బౌల్డ్ అయినవే కావడం విశేషం. సికందర్ రజా ముగ్గురిని, నగరవ ఒకరిని క్లీన్ బౌల్డ్ చేశారు. షయాన్ జహంగీర్ సూపర్ సెంచరీ.. ఇవాలే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో యూఎస్ఏ-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. 49 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్ షయాన్ జహంగీర్ (79 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో యూఎస్ఏను ఆదుకున్నాడు. జహంగీర్‌కు సుశాంత్ మొదానీ (42), గజానంద్ సింగ్ (26) ఓ మోస్తరుగా సహకరించడంతో యూఎస్ఏ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కరణ్ 4, గుల్షన్ షా 3, దీపేంద్ర సింగ్ 2, లలిత్ రాజబంశీ ఓ వికెట్ పడగొట్టారు. -
లేటు వయసులో శతక్కొట్టారు.. ఒకరిది ఫాస్టెస్ట్ హండ్రెడ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకం బాదాడు. రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో ముగ్గురు సెంచరీలు చేయడం సాధారణ విషయమే అయినప్పటికీ.. సెంచరీలు చేసిన వారు 35 ఏళ్ల వయసు పైబడ్డ వారు కావడం విశేషం. అందులోనూ ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలిచారు. వీరిలో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్‌ది ఆ దేశం తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (70) కావడం మరో విశేషం. శతక్కొట్టిన బ్యాటర్లలో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్‌కు 35 ఏళ్లు కాగా.. సీన్ విలియమ్స్‌కు 36, క్రెయిగ్ ఎర్విన్‌కు 37 ఏళ్లు. లేటు వయసులో ఈ ముగ్గురు బ్యాటర్లు తమ జట్లను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రత్నించడంతో నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ సెంచరీలు చేసి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చగా.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గజానంద్ వీరోచిత సెంచరీ చేసి తన జట్టును (యూఎస్ఏ) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ మెరుపు శతకం బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విలియమ్స్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియమ్స్, చకబ్వా తర్వాత బ్రెండన్ టేలర్ (2015లో ఐర్లాండ్‌పై 79 బంతుల్లో), సికందర్ రజా (2022లో బంగ్లాదేశ్‌పై 81 బంతుల్లో) ఉన్నారు. కాగా, నేపాల్‌తో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇవాలే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏను గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకం సాయంతో గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గజానంద్తో పాటు ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) పోరాడటంతో విండీస్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఓటమిపాలైంది. -
శతక్కొట్టిన సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్.. జింబాబ్వే ఘన విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే ఘన విజయం సాధించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 18) జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో నగరవా 4 వికెట్లు తీసి నేపాల్‌ను దారుణంగా దెబ్బకొట్టిగా.. మసకద్జ 2, చటారా, ముజరబాని తలో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఆటగాడు జాయ్‌లార్డ్ గుంబీ (25) వికెట్ సొంపాల్ కామీకి, వెస్లీ మధెవెరె (32) వికెట్ గుల్సన్ ఝాకు దక్కాయి. ఈ విజయంతో జింబాబ్వే.. గ్రూప్-ఏలో మెరుగైన రన్‌రేట్‌తో (0.789) అగ్రస్థానానికి చేరుకుంది. గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్‌తో పాటు వెస్టిండీస్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భాగంగానే ఇవాళ వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా.. బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) విఫలమయ్యారు. యూఎస్ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లు, నోషటష్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో యూఎస్ఏ తడబడుతుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి, ఓటమి దిశగా పయనిస్తుంది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ తలపడనున్నాయి. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించిన అనామక బ్యాటర్
ఇవాళ (జూన్ 18) మొదలైన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023లో అనామక జట్టు నేపాల్.. వారి కంటే ఎన్నో రెట్లు మెరుగైన జింబాబ్వేను గడగడలాడిస్తుంది. నేపాల్ టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఓపెనర్ కుశాల్ భూర్టెల్ (95 బంతుల్లో 99; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించి, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మసకద్జ.. కుశాల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మాల్ల (41), రోహిత్ పౌడెల్ (31) రాణించారు. 47 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 271/5గా ఉంది. గుల్సన్ ఝా (6), దీపేంద్ర సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవా తలో 2 వికెట్లు, టెండాయ్ చటారా ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు జింబాబ్వే వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. గ్రూప్-ఏలో భాగంగా నేపాల్-జింబాబ్వే జట్లు.. వెస్టిండీస్-యూఎస్ఏ జట్లు ఇవాళ తలపడుతున్నాయి. విండీస్-యూఎస్ఏ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న విండీస్.. 43 ఓవర్ల తర్వాత 243/6 స్కోర్ చేసింది. రోప్టన్ ఛేజ్ (45), జేసన్ హోల్డర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0) విఫలం కాగా.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), నికోలస్ పూరన్ (43) రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్ 3, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్, నోషటష్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
నేను బతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ఇంతకంటే దిగజారడం అంటే!
ICC Cricket World Cup Qualifiers 2023: వెస్టిండీస్‌కు ఇలాంటి గడ్డుకాలం వస్తుందని అస్సలు ఊహించలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించలేని దుస్థితికి చేరుకుంటామని అనుకోలేదని వాపోయాడు. కాగా ఒకప్పుడు క్రికెట్లో దేదీప్యమానంగా వెలుగొందిన వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2022, వన్డే ప్రపంచకప్-2023కి నేరుగా క్వాలిఫై కాలేకపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జింబాబ్వే వేదికగా ఆదివారం (జూన్ 18) నుంచి మొదలైన క్వాలిఫయర్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ అసిస్టెంట్ కోచ్ కార్ల్ హూపర్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘గతేడాదికి ఇప్పటికి మా స్థాయిలో ఎలాంటి మార్పులేదు. ఇంతకంటే దిగజారడం అంటే ఇంతకంటే దిగజారడం అంటూ ఇంకేమీ ఉండదు అనుకుంటే పొరపాటే! ఒకవేళ మేము వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయినట్లయితే పాతాళానికి పడిపోయినట్లే! ఐసీసీ టోర్నమెంట్లలో ఆడే క్రమంలో అర్హత సాధించేందుకు వెస్టిండీస్ ఇలా పాట్లు పడటం నేను బతికుండగా జరుగుతుందని అనుకోలేదు. అప్పుడు ఆస్ట్రేలియాలో టీ20, ఇప్పుడు జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెట్టేందుకు ఇలా చెమటోడ్చాల్సి వస్తోంది. ఇతర జట్లను అవమానించడమో లేదంటే తక్కువ చేసి మాట్లాడటమనే ఉద్దేశం నాకు లేదు. నిజానికి జింబాబ్వేలో మేము అమెరికా, నేపాల్, స్కాట్లాండ్ వంటి జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఆఖరికి అఫ్గనిస్తాన్ కూడా! ఆఖరికి అఫ్గనిస్తాన్ కూడా మాకంటే ముందే ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటికే వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెట్టింది. కానీ మేము.. మా స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో మేము యూఎస్ఏను సులభంగా ఓడిస్తామని అనుకుంటున్నాను’’ అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు. కాగా హరారే వేదికగా ఆదివారం మొదలైన క్వాలిఫయర్స్‌లో విండీస్ యూఎస్ఏతో తలపడుతోంది. టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి షాయీ హోప్ బృందం 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కాగా ప్రపంచకప్ ఈవెంట్‌కు అర్హత సాధించే క్రమంలో రెండు బెర్త్‌ల కోసం వెస్టిండీస్‌తో పాటు శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, నేపాల్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, అమెరికా, ఒమన్, యూఏఈ బరిలో ఉన్నాయి. చదవండి: రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై.. -
వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు
వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఆదివారం(జూలై 18) నుంచి జింబాబ్వేలో క్వాలిఫియర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హరారే వేదికగా జింబాబ్వే,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ షురూ కానుంది. ఈ అర్హత టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ఫైనల్స్‌కు చేరే రెండు జట్లు అక్టోబర్–నవంబర్లలో భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇక ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు శనివారం 10 జట్లు కెప్టెన్లు ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోషూట్ హరారేలోని వైల్డ్ ఈజ్ లైఫ్ శాంక్చురీలో జరిగింది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ 2023 పూర్తి షెడ్యూల్ 18 జూన్ జింబాబ్వే v నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్) వెస్టిండీస్ v , (తకాషింగా క్రికెట్ క్లబ్) 19 జూన్ శ్రీలంక వర్సెస్ యూఏఈ, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్) ఐర్లాండ్ వర్సెస్ ఒమన్, (బులవాయో అథ్లెటిక్ క్లబ్) 20 జూన్ జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్, (హరారే స్పోర్ట్స్ క్లబ్) నేపాల్ v యూఎస్ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్) 21 జూన్ ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్) ఒమన్ వర్సెస్, (బులవాయో అథ్లెటిక్ క్లబ్) 22 జూన్ వెస్టిండీస్ వర్సెస్ నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్) నెదర్లాండ్స్ వర్సెస్ యూఎస్ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్) 23 జూన్ శ్రీలంక వర్సెస్ ఒమన్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ స్కాట్లాండ్ v యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్ 24 జూన్ జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్, హరారే స్పోర్ట్స్ క్లబ్ నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్, తకాషింగా క్రికెట్ క్లబ్ 25 జూన్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ స్కాట్లాండ్ వర్సెస్ ఒమన్, బులవాయో అథ్లెటిక్ క్లబ్ 26 జూన్ జింబాబ్వే వర్సెస్ యూఎస్ఏ , హరారే స్పోర్ట్స్ క్లబ్ వెస్టిండీస్ వర్సెస్ నెదర్లాండ్స్, తకాషింగా క్రికెట్ క్లబ్ 27 జూన్ శ్రీలంక వర్సెస్ స్కాట్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ఐర్లాండ్ వర్సెస్ యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్ 29 జూన్ సూపర్ 6: A2 v B2, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ 30 జూన్ సూపర్ 6: A3 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: A5 v B4, తకాషింగా క్రికెట్ క్లబ్ 1 జూలై సూపర్ 6: A1 v B3, హరారే స్పోర్ట్స్ క్లబ్ 2 జూలై సూపర్ 6: A2 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: A4 v B5, తకాషింగా క్రికెట్ క్లబ్ 3 జూలై సూపర్ 6: A3 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్ 4 జూలై సూపర్ 6: A2 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: 7వ v 8వ తకాషింగా క్రికెట్ క్లబ్ 5 జూలై సూపర్ సిక్స్: A1 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్ 6 జూలై సూపర్ సిక్స్: A3 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: 9వ v 10వ తకాషింగా క్రికెట్ క్లబ్ 7 జూలై సూపర్ సిక్స్: A1 v B1, హరారే స్పోర్ట్స్ క్లబ్ 9 జూలై ఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్ -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే, సిరీస్ కైవసం
క్రికెట్ పసికూన జింబాబ్వే.. పాకిస్తాన్‌కు షాకిచ్చింది. 6 మ్యాచ్‌ల అనధికార వన్డే సిరీస్‌లో జింబాబ్వే-ఏ టీమ్.. 4-2 తేడాతో పాకిస్తాన్-ఏ టీమ్‌ను చిత్తు చేసింది. నిన్న (మే 27) జరిగిన ఆరో వన్డేలో జింబాబ్వే.. పాక్‌ను 32 పరుగుల తేడాతో మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆరో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. క్రెయిగ్ ఇర్విన్ (148 బంతుల్లో 195; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇర్విన్‌కు జతగా ఓపెనర్ ఇన్నోసెంట్ కాలా (79 బంతుల్లో 92; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ముబాసిర్ ఖాన్ (77 బంతుల్లో 115; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా.. రోహైల్ నజీర్ (87), కెప్టెన్ కమ్రాన్ గులామ్ (56) అర్ధసెంచరీలతో రాణించారు. ఫలితంగా పాక్ 49.2 ఓవర్లలో 353 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 3, బ్లెసింగ్ ముజరబాని, తనక చివంగ, లూక్ జాంగ్వే తలో 2 వికెట్లు, సీన్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 2 మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌ను పాక్ 2-0తో కైవసం చేసుకుంది. 2 టెస్ట్‌లు, 6 వన్డేల సిరీస్‌ల కోసం పాక్-ఏ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. చదవండి: వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. జై షా కీలక ప్రకటన -
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమం
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ క్రీడల మంత్రి డేవిడ్ కోల్టార్ట్ సైతం ట్విట్టర్లో షేర్ చేశారు. స్ట్రీక్ కోలుకుని, తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు ప్రార్థించాలని ఆయన తన దేశ ప్రజలకు, దేశం వెలుపల ఉన్న ప్రార్ధన యోధులకు పిలుపునిచ్చారు. జింబాబ్వేకు పాత్రినిధ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, అతనికి మనందరి ప్రార్ధనలు చాలా అవసరమని డేవిడ్ కోల్టార్ట్ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్ట్రీక్ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్ట్రీక్ సౌతాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం. కాగా, జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్రౌండర్లలో ఒకరైన స్ట్రీక్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా ముజుందార్! -
స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. నాలుగు నెలలకే క్రికెట్‌కు గుడ్‌బై! షాక్‌లో ఫ్యాన్స్
జింబాబ్వే స్టార్ క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు బ్యాలెన్స్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా జింబాబ్వే జట్టులో చేరిన నాలుగు నెలలకే బ్యాలెన్స్ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. గ్యారీ అంతకుమందు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 42 మ్యాచ్‌లు ఆడాడు. 2014 నుంచి 2017 మధ్య ఇంగ్లండ్ తరపున 23 టెస్టులు ఆడాడు. ఆ తర్వాత అతడు ఫామ్ కోల్పోవడంతో 2017లో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే ఆ తర్వాత గతేడాది డిసెంబర్లో తన సొంత దేశం తరపున ఆడేందుకు జింబాబ్వే క్రికెట్‌తో రెండేళ్ల ఒప్పందం కుదర్చుకున్నాడు. జింబాబ్వే తరపున తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై బ్యాలెన్స్ సెంచరీ సాధించాడు. 33 ఏళ్ల గ్యారీ ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 137 పరుగులు చేశాడు. అద్భుతఫామ్‌లో ఉన్న అతడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాలెన్స్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ నాలుగు నెలలపాటు తనకు మద్దతుగా నిలిచిన జింబాబ్వే క్రికెట్ ధన్యవాదాలు తెలిపాడు. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి.. -
నెదర్లాండ్స్ కలను నాశనం చేసిన జింబాబ్వే
నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 2-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి వన్డేలో జింబాబ్వే 7 వికెట్లతో విజయాన్ని అందుకుంది. కాగా జింబాబ్వేపై సిరీస్ నెగ్గి వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో చోటు సంపాదించాలన్న కల డచ్‌కు తీరలేదు. ఇక సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో గెలిస్తేనే నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. మ్యాక్స్ ఒ డౌడ్ (38), స్కాట్ ఎడ్వర్డ్స్ (34) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. సికందర్ రజా రెండు, ముజరబాని, మదవెరె, నగరవా, చతరాలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం జింబాబ్వే 41.4 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ (64 నాటౌట్), మదెవెర్ (50), క్రెయిగ్ ఇర్విన్ (44), సీన్ విలియమ్స్ (43) జట్టును గెలిపించారు. సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. 🇿🇼seal 2⃣-1⃣ series victory with a comfortable 7-wicket win over @KNCBcricket at Harare Sports Club.#ZIMvNED | #ICCSuperLeague | #VisitZimbabwe | #FillUpHarareSportsClub pic.twitter.com/5DdjTHyHYO — Zimbabwe Cricket (@ZimCricketv) March 25, 2023 -
జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్.. ఉత్కంఠ సమరంలో పరుగు తేడాతో విజయం
స్వదేశంలో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో పర్యాటక నెదర్లాండ్స్.. తమ కంటే మెరుగైన జింబాబ్వేపై సంచలన విజయం సాధించగా, ఇవాళ (మార్చి 23) జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే.. పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో జింబాబ్వే పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపు దిశగా సాగుతున్న నెదర్లాండ్స్‌ను జింబాబ్వే స్పిన్ ఆల్‌రౌండర్ వెస్లీ మదెవెరె హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి కట్టడి చేశాడు. నెదర్లాండ్స్ గెలుపు దిశగా సాగుతుండగా (272 పరుగుల లక్ష్య ఛేదనలో 42 బంతుల్లో 59 పరుగులు, చేతిలో 7 వికెట్లు).. 44వ ఓవర్లో బంతినందుకున్న మదెవెరె తొలి 3 బంతులకు 3 వికెట్లు తీసి, ప్రత్యర్ధిని దారుణంగా దెబ్బకొట్టాడు. Colin Ackermann ☝ Teja Nidamanuru ☝ Paul van Meekeren ☝ A stunning hat-trick for Wessly Madhevere 🤩 Watch #ZIMvNED live and FREE on https://t.co/MHHfZPzf4H 📺#CWCSL | https://t.co/bQxE1Jd6HT pic.twitter.com/9VYKdfNReN — ICC (@ICC) March 23, 2023 ఈ దెబ్బతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. నెదర్లాండ్స్ గెలవాలంటే 39 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయినా ఏ మాత్రం తగ్గని నెదర్లాండ్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చింది. ఆఖరి ఓవర్లో నెదర్లాండ్స్ గెలుపుకు 19 పరుగులు అవసరం కాగా (చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది).. ర్యాన్ క్లెయిన్, క్లాసెన్ అద్భుతంగా పోరాడి 17 పరుగులు పిండుకున్నారు. ఆఖరి బంతికి బౌండరీ సాధించాల్సి ఉండగా..ర్యాన్ 2 పరుగులు తీసి రనౌట్ కావడంతో జింబాబ్వే పరుగు తేడాతో బయటపడింది. అగ్రశ్రేణి జట్ల పోరాటాన్ని తలపించిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్ మజాను అందించింది. మదెవెరె హ్యాట్రిక్ విషయానికొస్తే.. తొలి బంతికి ఆకెర్మన్ స్టంపౌట్ కాగా, ఆతర్వాత బంతికి తెలుగబ్బాయి నిడమనూరు తేజను, ఆమరుసటి బంతికి వాన్ మీకెరెన్ను మదెవెరె క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మార్చి 25న జరుగుతుంది. -
శతకంతో అదరగొట్టిన తెలుగు క్రికెటర్; జింబాబ్వేపై నెదర్లాండ్స్ విజయం
నెదర్లాండ్స్‌కు జట్టుకు ఆడుతున్న తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు అదరగొట్టాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయ సెంచరీతో మెరవడమే గాక జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 49.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తేజ నిడమనూరు (96 బంతుల్లో 110 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ మార్క్ సాధించాడు. అతనికి షారిజ్ అహ్మద్ 30 పరుగులతో సహకరించాడు. చివర్లో షారిజ్ రనౌట్ అయినప్పటికి పాల్ వాన్ మెక్రిన్ 21 పరుగులు నాటౌట్ అండతో తేజ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకముందు కొలిన్ అకెర్మన్ 50 పరుగులతో రాణించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 47.3 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటింగ్‌లో కూడా ఏడో స్థానంలో వచ్చిన క్లైవ్ మదానే 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మసకద్జ 34, నగరవా 35 పరుగులు చేశారు. డచ్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్ మూడు వికెట్లు తీయగా.. వాన్ మెక్రిన్ రెండు, గ్లోవర్, విక్రమ్‌జిత్ సింగ్, షారిజ్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. ► కాగా శతకంతో అలరించిన తేజ నిడమనూరు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు మైకెల్ బ్రాస్‌వెల్(127 పరుగులు నాటౌట్ వర్సెస్ ఐర్లాండ్), థామస్ ఒడయో(111 పరుగులు నాటౌట్ వర్సెస్ కెనడా), అబ్దుల్ రజాక్( 109 పరుగులు నాటౌట్ వర్సెస్ సౌతాఫ్రికా), గ్లెన్ మ్యాక్స్‌వెల్( 108 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్).. తాజాగా తేజ నిడమనూరు(110 పరుగులు నాటౌట్ వర్సెస్ జింబాబ్వే) ఈ జాబితాలో చేరాడు. ► ఇక వన్డేల్లో చేజింగ్‌లో భాగంగా ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఐదో జంటగా తేజ నిడమనూరు, షారిజ్ అఫ్రిది నిలిచారు . ఈ జోడి 110 పరుగులు జోడించారు. ఇంతకముందు అఫిఫ్ హొసెన్-మెహదీ హసన్(బంగ్లాదేశ్) జోడి 174 పరుగులు, బసిల్ హమీద్- కాషిఫ్ దౌడ్(యూఏఈ) జోడి 148 పరుగులు, మహేల జయవర్దనే-ఉపుల్ చందన(శ్రీలంక) జోడి 126 పరుగులు, హారిస్ సోహైల్-షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్) జోడి 110 పరుగులు వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా తేజ నిడమనూరు- షారిజ్ అహ్మద్(నెదర్లాండ్స్) జోడి 110 పరుగులతో వీరి సరసన చేరింది. Walking in to bat at No.7, Teja Nidamanuru has made a maiden ODI hundred 😮 Watch #ZIMvNED live and FREE on https://t.co/CPDKNxoJ9v 📺 📝 https://t.co/W6FjF8WDYn | #CWCSL pic.twitter.com/opKgtxR8pP — ICC (@ICC) March 21, 2023 చదవండి: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఉదేశారు -
జింబాబ్వే పతనం శాసించిన విండీస్ బౌలర్.. సిరీస్ సొంతం
జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో కైవసం చేసుకుంది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్ ఇన్నింగ్స్ 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 177 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే 173 పరుగులకే కుప్పకూలింది. గుదకేష్ మోతీ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. క్రెయిగ్ ఇర్విన్ 72 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అంతకముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత వెస్టిండీస్ 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్‌కు 177 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక తొలి టెస్టు డ్రాగా ముగియడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ 1-0తో సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా గుదకేశ్ మోతీ సొంతం చేసుకున్నాడు. -
విండీస్ బౌలర్ ధాటికి విలవిలలాడిన జింబాబ్వే
Gudakesh Motie: వెస్టిండీస్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. మోటీతో పాటు జేసన్ హోల్డర్ (2/18), అల్జరీ జోసఫ్ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్ కాలా (38) టాప్ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (22), ట్రిపానో (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్ రీఫర్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (36), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్ మేయర్స్ (8), రోస్టన్ చేజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్ దక్కంది. రీఫర్ రనౌటయ్యాడు. కాగా, తొలి టెస్ట్ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. -
Zim Vs WI: జింబాబ్వే- వెస్టిండీస్ టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత
Zimbabwe vs West Indies, 1st Test- బులవాయో: వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 5 వికెట్లకు 203 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. బ్రాత్‌వైట్ (25; 3 ఫోర్లు), తేజ్‌నరైన్ (15) టెస్టు మ్యాచ్‌లో వరుసగా ఐదు రోజులు ఆడిన తొలి ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందింది. ఇక ఈ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ(207)తో మెరిసిన తేజ్‌నరైన్ చందర్‌పాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు 2023 మ్యాచ్ స్కోర్లు వెస్టిండీస్- 447/6 డిక్లేర్డ్ & 203/5 డిక్లేర్డ్ జింబాబ్వే- 379/9 డిక్లేర్డ్ & 134/6 చదవండి: Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు -
Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు
WI VS ZIM 1st Test: 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ (137 నాటౌట్) అజేయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో బ్యాలెన్స్ పలు అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే శతకం బాదిన 24వ క్రికెటర్‌గా, రెండు దేశాల తరఫున సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా (కెప్లర్ వెసెల్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తరఫున) రికార్డు పుటల్లోకెక్కాడు. బ్యాలెన్స్ ఈ రికార్డులు సాధించే క్రమంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. జింబాబ్వేలోనే పుట్టి పెరిగిన బ్యాలెన్స్ తొలుత తన సొంత దేశం తరఫున కాకుండా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేల్లో 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున అవకాశాలు రాకపోవడంతో సొంత గూటికి చేరుకున్న బ్యాలెన్స్ అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ బాదాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. బ్యాలెన్స్ 8 ఏళ్ల కిందట తన చివరి టెస్ట్ సెంచరీని వెస్టిండీస్‌పైనే సాధించాడు. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టులో శివ్‌నరైన్ చంద్రపాల్ ఉండగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ సెంచరీ బాదిన మ్యాచ్‌లో శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ చంద్రపాల్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్ అజేయమైన డబుల్ సెంచరీ బాది తన తండ్రి అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ను అధిగమించాడు. ఇదిలా ఉంటే, విండీస్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. ఆట చివరి రోజు విండీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. జింబాబ్వే 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఆటలో చివరి సెషన్ మాత్రమే మిగిలింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టం. గ్యారీ బ్యాలెన్స్ (10), తఫడ్జా సిగా (10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 447 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్ చంద్రపాల్ అజేయమైన 207 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 182 రన్స్ చేశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాలెన్స్ సెంచరీ చేయగా.. బ్రాండన్ మవుటా (56) అర్ధ శతకంతో రాణించాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో రీఫర్ (58), బ్లాక్‌వుడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో చాము చిబాబా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అరంగేట్రం టెస్టులోనే శతకంతో అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గ్యారీ బ్యాలెన్స్ ఈ ఫీట్ సాధించాడు. కష్టాల్లో ఉన్న జింబాబ్వే ఇన్నింగ్స్‌ను తన శతకంతో నిలబెట్టాడు. బ్రాండన్ మవుటా(52 బ్యాటింగ్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించాడు. ఎంతో ఓపికతో ఆడిన బ్యాలెన్స్ 190 బంతుల్లో 9ఫోర్లు, రెండు సిక్సర్లతో శతకాన్ని అందుకున్నాడు. టీ విరామ సమయానికి జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ 107 పరుగులు, బ్రాండన్ మవుటా 52 పరుగులు క్రీజులో ఉన్నారు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌ను 447 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తన అరంగేట్రం టెస్టులోనే శతకంతో మెరిసిన గ్యారీ బ్యాలెన్స్ టెస్టు క్రికెట్లో సరికొత్త రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి గ్యారీ బ్యాలెన్స్‌కు టెస్టుల్లో ఇది ఐదో సెంచరీ. అయితే ముందు వచ్చిన నాలుగు టెస్టు సెంచరీలు ఇంగ్లండ్ తరపున చేశాడు. తాజాగా మాత్రం జింబాబ్వే తరపున శతకం మార్క్‌ను అందుకున్నాడు. 2013 నుంచి 2017 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్యారీ బ్యాలెన్స్ నాలుగు టెస్టు శతకాలు సాధించడం విశేషం. ఇలా రెండు దేశాల తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గ్యారీ బ్యాలెన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకముందు కెప్లర్ వెసెల్స్ ఈ ఫీట్ సాధించాడు. 1982-85 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు.. ఆ తర్వాత 1991-94 మధ్య తన స్వంత దేశమైన సౌతాఫ్రికాకు ఆడాడు. ఈ సమయంలోనే రెండు దేశాల తరపున టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. తాజాగా గ్యారీ బ్యాలెన్స్ ఇంగ్లండ్, జింబాబ్వే తరపున టెస్టుల్లో శతకాలు చేసిన క్రికెటర్‌గా కెప్లర్ వెసెల్స్ సరసన చేరాడు. ఇక గ్యారీ బ్యాలెన్స్ మరో అరుదైన ఫీట్‌ను కూడా అందుకున్నాడు. అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన 24వ క్రికెటర్‌గా నిలిచాడు. గ్యారీ బ్యాలెన్స్ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. Century on Zimbabwe Test debut for Gary Ballance 💪 Watch #ZIMvWI live and FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 Scorecard: https://t.co/kWH1ac3IPs | 📸: @ZimCricketv pic.twitter.com/7CCIADlD2Z — ICC (@ICC) February 7, 2023 Fifth Test 💯 for Gary Ballance on debut for Zimbabwe. He also becomes the second batter after Kepler Wessels to have Test tons for two countries👏#ZIMvWI #Cricket #TestCricket — Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) February 7, 2023 Gary Ballance has scored a hundred in his first Test for Zimbabwe - and he brought up with a good ol' slog over mid-wicket - and 24th Test overall. He has four Test centuries for England. This one will likely save the Test for Zimbabwe. #cricket #ZIMvWI — Firdose Moonda (@FirdoseM) February 7, 2023 చదవండి: ఐపీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. రేసులో గిల్, సిరాజ్ -
చరిత్ర సృష్టించిన తేజ్‌నరైన్ చంద్రపాల్.. తండ్రిని మించిపోయాడు..!
టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ యువ ఓపెనర్ తేజ్‌నరైన్ చంద్రపాల్, తన తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌తో కలిసి ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలో తేజ్‌నరైన్ తన తండ్రిని కూడా వెనక్కునెట్టాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తేజ్‌నరైన్ అజేయ డబుల్ సెంచరీ (467 బంతుల్లో 207 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. The moment Tagenarine Chanderpaul complete his maiden double hundred in Test cricket - The future of West Indies cricket.pic.twitter.com/2ZRmKZ7ZUV — CricketMAN2 (@ImTanujSingh) February 6, 2023 కెరీర్లో మూడో టెస్ట్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన తేజ్.. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ విభాగంలో తండ్రి శివ్నరైన్నే మించిపోయాడు. శివ్‌నరైన్ 164 టెస్ట్‌ల కెరీర్లో 203 నాటౌట్ అత్యధిక స్కోర్ కాగా.. తేజ్ తన మూడో టెస్ట్‌లో తండ్రి అత్యధిక స్కోర్‌ను అధిగమించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల జోడీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా శివ్-తేజ్ జోడీ రికార్డుల్లోకెక్కింది. క్రికెట్ చరిత్రలో ఏ తండ్రి కొడుకులు ఈ ఘనత సాధించలేదు. భారత్‌కు చెందిన తండ్రి కొడుకులు లాలా అమర్నాథ్-మొహిందర్ అమర్నాథ్, విజయ్ మంజ్రేకర్-సంజయ్ మంజ్రేకర్, ఇఫ్తికార్ (ఇంగ్లండ్)-మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టెస్ట్‌ల్లో సెంచరీలు చేసినప్పటికీ తండ్రి కొడుకులు ఇద్దరూ డబుల్ సెంచరీలు మాత్రం సాధించలేకపోయారు. తేజ్‌నరైన్ కెరీర్లో 5 ఇన్నింగ్స్‌లు ఆడి హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ సాయంతో 91.75 సగటున 367 పరుగులు చేశాడు. మరోపక్క తేజ్ తండ్రి శివ్‌నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విండీస్ టీమ్.. తొలి టెస్ట్‌లో 447/6 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తేజ్నరైన్తో పాటు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (182) సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. -
తేజ్‌నారాయణ్, బ్రాత్‌వైట్ అజేయ సెంచరీలు
వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టును వర్షం వెంటాడుతోంది. తొలి రోజు 51 ఓవర్ల ఆట సాధ్యమైతే... రెండో రోజు 38 ఓవర్లు మాత్రమే పడ్డాయి. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు కూడా జింబాబ్వే బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 112/0తో ఆట కొనసాగించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 బ్యాటింగ్; 7 ఫోర్లు)... తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (291 బంతుల్లో 101 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడైన తేజ్‌నారాయణ్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... క్రెయిగ్ బ్రాత్వైట్కిది 12వ శతకం. 1999లో న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఓపెనర్లు అడ్రియన్ గ్రిఫిత్ (114), షెర్విన్ క్యాంప్‌బెల్ (170) సెంచరీలు చేసిన తర్వాత... మళ్లీ విండీస్ ఓపెనర్లు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు చేయడం విశేషం. -
టెస్ట్‌ల్లో తొలి సెంచరీ బాదిన శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు
వెస్టిండీస్ యువ క్రికెటర్ టగెనరైన్ చంద్రపాల్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌ను పుత్రోత్సాహంతో పరవశించేలా చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ బాదిన టగెనరైన్.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. బ్యాటింగ్ శైలితో పాటు హావభావలు సైతం తండ్రిలాగే ప్రదర్శించే టగెనరైన్.. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంలోనూ, పరుగులు సాధించడంలోనూ తండ్రికి సరిసాటి అనిపించుకుంటున్నాడు. A maiden Test ton for Tagenarine Chanderpaul as the Windies openers put on a double century stand 🙌Watch #ZIMvWI live and FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺📝 Scorecard: https://t.co/kWH1ac3IPs pic.twitter.com/GuyFrenHUF— ICC (@ICC) February 5, 2023 జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (291 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. జింబాబ్వే బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించినా వీరిద్దరిని ఔట్ చేసుకోలేకపోయారు. ముఖ్యంగా టగెనరైన్ వికెట్ల ముందు గోడలా నిలబడి, బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. టగెనరైన్ సెంచరీ సాధించడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. 26 ఏళ్ల టగెనరైన్ 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 65.25 సగటున 261 పరుగులు చేశాడు. టగెనరైన్ తండ్రి శివ్‌నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం అంతరాయం నడుమ తొలి టెస్ట్ ఆటంకాలతో సాగుతోంది. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్.. అత్యంత అరుదైన ఘనత సొంతం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బాలెన్స్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్, జింబాబ్వే) తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 16వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. బ్యాలెన్స్ తొలుత పరాయి దేశం (ఇంగ్లండ్) తరఫున ఆడి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం. చరిత్రలో ఇలా ఓ క్రికెటర్ తొలుత ఇతర దేశానికి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం ఇదే మొదటిసారి. రెండు దేశాల తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత సొంత దేశం తరఫున.. ఆతర్వాత వివిధ కారణాల చేత ఇతర దేశాల తరఫున ఆడారు. బ్యాలెన్స్ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 4) మొదలైన టెస్ట్ మ్యాచ్ ద్వారా బ్యాలెన్స్ జింబాబ్వే తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (55), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (55) అజేయమైన అర్ధసెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. రెండు దేశాల తరఫున టెస్టులు ఆడిన క్రికెటర్లు.. బిల్లీ మిడ్ వింటర్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) విలియమ్ లాయిడ్ ముర్డాక్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) జె జె ఫెర్రిస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) సామీ వుడ్స్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ హియర్న్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) అల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ మిచెల్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడి (ఇంగ్లండ్, ఇండియా) గుల్ మహ్మద్ (ఇండియా, పాకిస్తాన్) అబ్దుల్ హఫీజ్ కర్దార్ (ఇండియా, పాకిస్తాన్) అమీర్ ఇలాహి (ఇండియా, పాకిస్తాన్) సామీ గుయిలెన్ (వెస్టిండీస్, న్యూజిలాండ్) జాన్ ట్రైకోస్ (సౌతాఫ్రికా, జింబాబ్వే) కెప్లర్ వెసల్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) బాయ్డ్ రాంకిన్ (ఇంగ్లండ్, ఐర్లాండ్) గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లండ్, జింబాబ్వే) -
కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన చందర్‌పాల్ కుమారుడు
జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ కొట్టింది. బులవాయోలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులు సాధించింది. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ కుమారుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (170 బంతుల్లో 55 బ్యాటింగ్; 8 ఫోర్లు) కెరీర్లో రెండో అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (138 బంతుల్లో 55 బ్యాటింగ్; 2 ఫోర్లు) కూడా క్రీజులో ఉన్నాడు. -
శతకాలతో విరుచుకుపడిన ఐర్లాండ్ ఆటగాళ్లు
మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐర్లాండ్ క్రికెట్ టీమ్.. వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (137 బంతుల్లో 121 రిటైర్డ్ హర్ట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (13), స్టీఫెన్ డోహెనీ (3), జార్జ్ డాక్రెల్ (12), కర్టిస్ క్యాంఫర్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టగా.. బల్బిర్నీ, హ్యారీ టెక్టార్ అన్నీ తామై వ్యవహరించారు. జింబాబ్వే బౌలర్లలో విక్టర్ న్యాయుచి 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగర్వా, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిధ్య జింబాబ్వే 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20లో జింబాబ్వే నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్, నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో జింబాబ్వే గెలిచాయి. -
Zim Vs Ire: ఐర్లాండ్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సిరీస్ కైవసం
Zimbabwe vs Ireland, 3rd T20I: సొంతగడ్డపై జింబాబ్వే సత్తా చాటింది. ఐర్లాండ్‌తో మూడో టీ20లో విజయం సాధించింది. పర్యాటక జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకై ఐర్లాండ్ జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో జింబాబ్వే ఆఖరి వరకు పోరాడి ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది. టెక్టర్ ఒక్కడే ఐర్లాండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 47 పరుగులతో ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కర్టిస్ కాంఫర్ 27, డాక్రెల్ 23 పరుగులతో రాణించారు. సిరీస్ విజేత జింబాబ్వే (PC: Zimbabwe Cricket) చివరి వరకు పోరాడినా ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకం(54)తో రాణించి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నాడు. అయితే, ఐర్లాండ్ మాత్రం పట్టు సడలించలేదు. ఈ దశలో ఆల్‌రౌండర్ ర్యాన్ బర్ల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత రెండు మ్యాచ్‌లలోనూ రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మూడో టీ20 స్కోర్లు ఐర్లాండ్- 141/9 (20) జింబాబ్వే- 144/6 (19) చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? -
చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో
Zimbabwe vs Ireland, 1st T20I: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం ఐర్లాండ్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్లో గురువారం మొదటి టీ20 జరిగింది. టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ టాస్ ఛాయిస్‌కు సార్థకత చేకూరేలా ఆతిథ్య జట్టు బౌలర్లు.. ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ర్యాన్ బర్ల్ మూడు వికెట్లు కూల్చగా.. చటారా, నగరవ, మసకద్జ రెండేసి వికెట్లు తీశారు. బ్రాడ్ ఎవాన్స్‌కు ఒక వికెట్ దక్కింది. టీమిండియా వంటి పటిష్ట జట్లపై మెరుగ్గా ఆడగలిగిన ఐరిష్ కెప్టెన్ బల్బిర్నీ(5), హ్యారీ టెక్టార్(5) వంటి కీలక బ్యాటర్లు విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో డెలని టాప్ స్కోరర్ అనిపించుకున్నాడు. ఇలా జింబాబ్వే బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి ఐర్లాండ్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగినప్పటికీ జింబాబ్వే విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనింగ్ జోడీ ఎర్విన్, మరునణి చెరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో మధెవెరె 16 పరుగులకు అవుటయ్యాడు. టాపార్డర్ విఫలమైన వేళ నాలుగో స్థానంలో వచ్చిన గ్యారీ బ్యాలన్స్ 30 పరుగులు చేయగా , సీన్ విలియమ్స్(34) పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన జింబాబ్వే జయకేతనం ఎగురవేసింది. చదవండి: దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
SA Vs NED: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం యూఏఈ!
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో ప్రొటిస్ చేతులెత్తేస్తుందన్న అపవాదును నిజం చేస్తూ కనీసం సెమీస్ చేరకుండానే బవుమా బృందం వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అది కూడా పసికూన చేతిలో ఓటమి పాలై సఫారీ జట్టు ఇలా ఇంటిబాట పట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మరీ ఇంత ఘోరంగా ఎలాంటి సమీకరణాలతో సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆదివారం అడిలైడ్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటిస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లకు అనుకూలించే పిచ్‌లపై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాటర్లే సవాలు ఎదుర్కొన్న వేళ.. డచ్ జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్ అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ నెదర్లాండ్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. అయినా సౌతాఫ్రికాకు ఇదేమీ పెద్ద లక్ష్యం కాబోదని ఫ్యాన్స్ భావించారు. కానీ డచ్ బౌలర్ల ధాటికి ప్రొటిస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. ఈ ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన రిలీ రోసో 25 పరుగులతో సఫారీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే ప్రొటిస్ బ్యాటింగ్ వైఫల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డికాక్ 13, కెప్టెన్ తెంబా బవుమా 20, మార్కరమ్ 17, డేవిడ్ మిల్లర్ 17, క్లాసెన్ 21, కేశవ్ మహరాజ్ 13 పరుగులు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 13 పరుగుల తేడాతో గెలుపొందిన నెదర్లాండ్స్.. సౌతాఫ్రికా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ రోజు అలా నిజానికి సూపర్-12లో జింబాబ్వేతో మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించకపోతే సౌతాఫ్రికా ఈ ఓటమి తర్వాత కూడా సెమీస్ రేసులో నిలిచేదే! కానీ దురదృష్టం వెంటాడింది. ఆ మ్యాచ్ రద్దు కావడంతో ప్రొటిస్‌కు ఒక్క పాయింట్ మాత్రమే వచ్చింది. తాజా పరాజయంతో పట్టికలో ఐదు పాయింట్లకే పరిమితమైన బవుమా బృందం భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఏఈ వల్లే ఇదంతా ఇదిలా ఉంటే.. అనూహ్య పరిస్థితుల్లో సూపర్-12కు చేరుకున్న ‘పసికూన’ నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను ఎలిమినేట్ చేసి సంచలనం చేసింది. కాగా క్వాలిపైయర్స్(గ్రూప్-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక పోరులో నమీబియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా యూఏఈ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం అన్నట్లుగా నమీబియా ఓటమితో నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించింది. సూపర్-12 రేసులో పోటీపడిన నమీబియాను ఓడించిన యూఏఈ దగ్గరుండి మరీ డచ్ జట్టును ముందుకు నడిపినట్లయింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సౌతాఫ్రికా ఇంటికి వెళ్లడానికి పరోక్షంగా వర్షం, యూఏఈ కారణం.. ఆరోజు వర్షం రాకపోయినా.. యూఏఈ గెలవకపోయినా పాపం ప్రొటిస్ సెమీస్ చేరేదేమో అంటూ తోచిన రీతిలో విశ్లేషిస్తున్నారు. చదవండి: T20 WC 2022: సెమీస్‌కు టీమిండియా.. ఆశల పల్లకీలో పాకిస్తాన్, అనూహ్యంగా రేసులోకి బంగ్లా టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకు షాక్.. అత్యాచారం కేసులో క్రికెటర్ అరెస్ట్ View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటా: పాకిస్తాన్ నటి
ICC Mens T20 World Cup 2022 - India vs Zimbabwe: పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ భారత్- జింబాబ్వే మ్యాచ్ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా నవంబర్ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాను చిత్తుగా జింబాబ్వే ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడతానని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ‘తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లయితే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ పాకిస్తాన్ నటి గతంలో కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్- భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్ చేసింది. అంతకుముందు.. స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినపుడు కూడా భారత జట్టుపై విమర్శలు గుప్పించింది. I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂 — Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022 కాగా పాకిస్తాన్ నటి చేసిన ఈ ట్వీట్లు నెట్టింట్లో విమర్శలకు దారి తీసింది. క్రికెట్ లవర్స్, భారత్ అభిమానులు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు. పాపం మీ జీవితమంతా పెళ్లి లేకుండా ఒంటరిగా ఎలా జీవిస్తారో తలుచుకుంటేనే బాధగా ఉంది’ అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది జింబాబ్వేను భారత్ ఓడిస్తే మీరు మీ ట్విటర్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వే ఒక్క పరుగుతో ఓడించడానికి మాది పాకిస్తాన్ జట్టు కాదంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..! -
నెదర్లాండ్స్‌కు తొలి విజయం
అడిలైడ్: టి20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు ‘సూపర్–12’లో బోణీ కొట్టింది. గ్రూప్–2లో బుధవారం జరిగిన పోరులో ఆరెంజ్ టీమ్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లు మీకెరన్ (3/29), బస్‌డి లీడే (2/14), వాన్ బిక్ (2/17), గ్లోవెర్ (2/29) సమష్టిగా దెబ్బతీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆరెంజ్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్ ఒడౌడ్ (47 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో డచ్ జట్టుకిది మూడో గెలుపు. తొలి రౌండ్లో యూఏఈ, నమీబియాలను ఓడించి సూపర్–12కు అర్హత సాధించింది. పవర్‌ప్లేలోనే జింబాబ్వే టాపార్డర్‌ను కోల్పోయింది. వెస్లీ మదెవెర్ (2)ను మీకెరన్, కెప్టెన్ ఇర్విన్ (3), చకబ్వా (5)లను బ్రాండన్ గ్లోవెర్ అవుట్ చేయడంతో జింబాబ్వే 6 ఓవర్లలో 20/3 స్కోరు చేసింది. ఈ దశలో సీన్ విలియమ్స్ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు), సికందర్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అయితే జట్టుస్కోరు 68 వద్ద మీకెరన్ ఆ జోడీని విడగొట్టి మళ్లీ కష్టాలపాలు చేశాడు. వరుస విరామాల్లో వాన్ బిక్, డి లీడే జింబాబ్వే వికెట్లను పడగొట్టారు. మరోవైపు సికందర్ రజా భారీ సిక్సర్లతో జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ సహచరులు మిల్టన్ (2), రియాన్ బర్ల్ (2), జాంగ్వే (6), ఎన్‌గరవ (9), ముజరబని (1) ఎవరూ పది పరుగులైనా చేయలేకపోయారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్ స్టీఫన్ మిబర్గ్ (8) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో ఓపెనర్ మ్యాక్స్ ఒడౌడ్, వన్‌డౌన్‌లో వచ్చిన టామ్ కూపర్ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించడంతో నెదర్లాండ్స్ గెలుపుబాట పట్టింది. మిడిలార్డర్ బ్యాటర్స్ అకెర్మన్ (1), కెప్టెన్ ఎడ్వర్డ్స్ (5) విఫలమైనా ఇబ్బంది లేకుండా బస్ డి లీడే (12 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించాడు. జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, ముజరబాని రెండు వికెట్లు చొప్పున తీశారు. -
T20 WC ZIM Vs NED: జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్‌లో జింబాబ్వే తలపడతోంది. ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగగా.. జింబాబ్వే కూడా ఓ మార్పుతో ఆడనుంది. ఇక వరుస ఓటములతో నెదర్లాండ్స్ ఇప్పటికే ఇంటిముఖం పట్టగా.. జింబాబ్వే మాత్రం సెమీస్ రేసులో ఉంది. జింబాబ్వే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అనంతరం భారత్‌పై గెలిపొందితే నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతోంది. తుది జట్లు: నెదర్లాండ్స్ : స్టీఫన్ మైబర్గ్, మాక్స్ ఓడౌడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, బ్రాండన్ గ్లోవర్ జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ శుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, టెండై చటారా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
ఆఖరి ఓవర్లో డ్రామా.. ఆ ‘నో బాల్’ ఎందుకంటే...! గతంలో ఐపీఎల్లో కూడా!
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఉత్కంఠ పోరులో మూడు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ అఖరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది. చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి లెగ్ బైస్ రూపంలో ఒక పరగు రాగా.. రెండో బంతికి ఎవెన్స్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ సమీకరణం నాలుగు బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఈ క్రమంలో మూడో బంతికి లెగ్ బైస్ రూపంలో నాలుగు పరుగులు, నాలుగో బంతికి నగరవా భారీ సిక్స్ బాదాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ జింబాబ్వే వైపు మలుపు తిరిగింది. అఖరి రెండు బంతులకు జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఐదో బంతికి నగరవా భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అఖరి బంతికి కూడా ముజారబానీ కూడా స్టంపౌటయ్యాడు. దీంతో గెలుపు సంబురాల్లో మునిగి తేలిపోయింది. ఓటమి బాధతో జింబాబ్వే ఆటగాళ్లు కూడా డగౌట్‌కు చేరుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అఖరి బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. నో బాల్’ ఎందుకంటే... స్టంప్ చేసే క్రమంలో బంగ్లాదేశ్ కీపర్ నూరుల్ అత్యుత్సాహంతో వికెట్లను దాటి వాటి ముందే బంతిని అందుకున్నాడు. ఐసీసీ నిబంధన 27.3.1 ప్రకారం కీపర్ ఇలా చేయకూడదు. బంతి బ్యాట్‌ను లేదా బ్యాటర్‌ను తాకిన తర్వాత లేదా వికెట్లను దాటిని తర్వాతే బంతిని అందుకోవాలి. 27.3.2 ప్రకారం దానిని ‘నో బాల్’గా ప్రకటిస్తారు కూడా. దాంతో మరోసారి ఆఖరి బంతికి 5 పరుగులు చేస్తే గెలిచే అవకాశం జింబాబ్వేకు వచ్చింది. అయితే మొసద్దిక్ మరో చక్కటి బంతి వేసి సింగిల్ కూడా ఇవ్వలేదు. దాంతో బంగ్లా ఆటగాళ్ల మొహాల్లో మళ్లీ నవ్వు కనిపించింది. గతంలో ఐపీఎల్లో కోల్‌కతా కీపర్ ఉతప్ప, రైనా మధ్య ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుంది. చదవండి: #OnThisDay: నాడు నిరాశపరిచిన సచిన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని! మిస్టర్ కూల్ తుపాన్ ఇన్నింగ్స్ చూశారా! -
WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు..
T20 World Cup 2022- Group 2 Teams Semis Chances: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఆ జట్టు ముందంజ వేయడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే సాంకేతికంగా మాత్రం పాక్‌కు ఇంకా చాన్స్ ఉంది. పాక్ మిగిలిన రెండూ గెలిచినా గరిష్టంగా 6 పాయింట్లు సాధించగలదు. నెదర్లాండ్స్‌పై గెలిస్తే 7 పాయింట్లతో దక్షిణాఫ్రికా ముందంజ వేస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్, జింబాబ్వేలపై గెలిస్తే భారత్‌కు 8 పాయింట్లు అవుతాయి. భారత్ ఒక మ్యాచ్ గెలిచి ఒకటి ఓడితే 6 పాయింట్లతో పాక్‌తో రన్‌రేట్‌లో పోటీ పడుతుంది. అయితే పాక్‌కంటే భారత్ రన్‌రేట్ ప్రస్తుతానికి ఎంతో మెరుగ్గా ఉండటంతో పాటు రోహిత్ సేన రెండూ గెలిచే అవకాశాలే పుష్కలం. గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే అక్కడే పాక్ కథ ముగుస్తుంది! అయితే, టీ20 ఫార్మాట్ అంటేనే సంచనాలకు మారుపేరు! ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం! గ్రూప్-2లో ఉన్న జట్ల సెమీస్ అవకాశాలు ఇలా సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు- 3 పాయింట్లు-5 నెట్ రన్‌రేటు: 2.772 మిగిలి ఉన్న మ్యాచ్‌లు: పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో.. ఈ రెండింటిలో ఏ ఒక్క జట్టుపై గెలిచినా ఏడు పాయింట్లతో బవుమా బృందం ముందంజ వేస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్, జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లలో గెలిస్తే వరుసగా 8,7 పాయింట్లు సాధిస్తాయి. అయితే, రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న కారణంగా ప్రొటిస్‌కు వచ్చిన భయమేమీ లేదు. అంతేకాకుండా ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో టీమిండియా చేతిలో ఓడినట్లైతే ఇక సౌతాఫ్రికా సెమీస్ చేరడం నల్లేరు మీద నడకే! ఇండియా ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు-3 పాయింట్లు-4 నెట్రన్ రేటు: 0.844 మిగిలిన మ్యాచ్‌లు: బంగ్లాదేశ్, జింబాబ్వే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ చేరాలంటే టీమిండియా తప్పకుండా తమ తదుపరి మ్యాచ్‌లలో గెలవాలి. ఒకవేళ బంగ్లాదేశ్‌ను ఓడించి.. అనూహ్య పరిస్థితుల్లో జింబాబ్వే చేతిలో ఓడితే మాత్రం.. అప్పుడు సౌతాఫ్రికా, జింబాబ్వే ఏడు పాయింట్లతో ముందంజలో నిలుస్తాయి. అలా కాకుండా రోహిత్ సేన జింబాబ్వేపై గెలిచి బంగ్లాదేశ్ చేతిలో ఓడినట్లయితే.. సౌతాఫ్రికాతో పాటు బంగ్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఒకటి ఓడి ఒకటి గెలిచి.. అదే సమయంలో పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు సాధిస్తే నెట్ రన్ రేటు పరంగా పోటీపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బంగ్లా, జింబాబ్వేపై రోహిత్ సేన తప్పకుండా గెలిస్తే నేరుగా సెమీస్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంటుంది. బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు-3 పాయింట్లు-4 నెట్ రన్‌రేటు: -1.533 మిగిలిన మ్యాచ్‌లు: ఇండియా, పాకిస్తాన్ పాయింట్ల పరంగా టీమిండియాతో సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్‌రేటు పరంగా వెనుకబడి ఉంది బంగ్లాదేశ్. మిగతా రెండు మ్యాచ్‌లో భారత్, పాక్‌తో పోటీ పడనున్న బంగ్లా.. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. రెండూ గెలిస్తే మొత్తంగా 8 పాయింట్లు సాధించి ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే అవకాశాలు పుష్కలం. జింబాబ్వే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు: 3 పాయింట్లు: 3 నెట్ రన్‌రేటు: -0.050 మిగిలిన మ్యాచ్‌లు: నెదర్లాండ్స్, ఇండియా సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. ఒకవేళ నెదర్లాండ్స్‌ను ఓడించి ఇండియా చేతిలో ఓడితే వాళ్లకు ఐదు పాయింట్లు మాత్రమే వస్తాయి. సెమీస్ చేరేందుకు ఈ పాయింట్లు సరిపోవు మరి! పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆడినవి: 3 పాయింట్లు: 2 నెట్ రన్‌రేటు: 0.765 మిగిలిన మ్యాచ్‌లు: సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిన కారణంగా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా పాక్ ఆరు పాయింట్లు సాధిస్తుంది. ఒకవేళ భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి ఓడితే ఆరు పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి రన్‌రేటు పరంగా పాక్ పోటీ పడే అవకాశం ఉంటుంది. కానీ.. టీమిండియా ప్రస్తుత ఫామ్‌ను బట్టి రెండూ గెలిచే ఛాన్స్‌లే ఎక్కువ కాబట్టి.. పాక్‌ది దింపుడు కళ్లెం ఆశే అని చెప్పవచ్చు. అయితే, ఒకవేళ పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి, బంగ్లాదేశ్ టీమిండియాను ఓడిస్తే.. భారత్ జింబాబ్వేపై విజయం సాధిస్తే.. ఈ మూడు ఆసియా జట్ల మధ్య పోటీ నెలకొంటుంది. ఇక నెదర్లాండ్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఓడి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా టి20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన ‘సూపర్ 12’ గ్రూప్–2 లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నీలో తొలి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక పాక్ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. చదవండి: T20 World Cup 2022: ఎంత పనిచేశావు కోహ్లి.. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే! వీడియో వైరల్ T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం సూర్య బౌలర్ల మైండ్‌తో ఆటలు ఆడుకుంటాడు: పాక్ క్రికెటర్