జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. బులవాయో వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగుల(డీఎల్‌ఎస్) తేడాతో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది.
జింబాబ్వే బ్యాటర్లలో నగరవా(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజా(39) పరుగులతో రాణించారు. మరోవైపు పాక్ బౌలర్లలో ఆఘా సల్మాన్, ఫైజల్ ఆక్రమ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు.
ఆతిథ్య జట్టు బౌలర్లు దాటికి పాక్ జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో జింబాబ్వేను విజేతగా అంపైర్‌లు నిర్ణయించారు.
జింబాబ్వే బౌలర్లలో ముజాబ్ రానీ, సికిందర్ రజా, సీన్ విలియమ్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా వన్డేల్లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఓడించడం ఇదే ఆరోసారి కావడం గమనార్హం. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 26న ఇదే వేదికలో జరగనుంది.
చదవండి: IPL 2025: వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు
Comments
Please login to add a commentAdd a comment