ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై కాసుల వర్షం కురిసింది. వేలానికి ఒక్క రోజు ముందు ఎంట్రీ ఇచ్చిన ఆర్చర్ అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఆర్చర్‌ను రూ. 12.50 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన జోఫ్రా కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పోటీలోకి రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి ముంబై ఇడియన్స్, ఎల్‌ఎస్‌జీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆర్చర్‌ను రాజస్తాన్ సొంతం చేసుకుంది.
ఆర్చర్ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా ఈ ఆక్షన్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఇంగ్లండ్ నుంచి ఎన్‌వోసీ మంజారు కావడంతో ఆఖరినిమిషంలో ఆర్చర్ పేరును వేలంలోకి బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ 48 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment