IPL 2025 Mega Auction
-
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
మంజ్రేకర్‌పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్‌మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్‌స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్‌లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!
ఐపీఎల్-2025 మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమని.. లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని అంచనా వేశాడు.రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడుపంజాబ్ కింగ్స్ పంత్‌ను సొంతం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చన్న ఊతప్ప.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పంత్ కోసం పోటీపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ వైపు మొగ్గుచూపుతాయని అంచనా వేసిన ఊతప్ప.. ఏదేమైనా ఈసారి అతడు వేలంలో రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడని జోస్యం చెప్పాడు.కాగా ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. కోలుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. సారథిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఢిల్లీ ఈసారి పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ రిషభ్ పంత్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకునే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తిగా భిన్నమైంది. అది ఎలా సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు.కానీ నా అంచనా ప్రకారం పంత్‌ను ఢిల్లీ మళ్లీ తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఆటగాళ్ల రిటెన్షన్ అనేది సదరు ప్లేయర్‌కు, ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం. తాను ఆశించినంత ధర రాకపోతే ఆ ఆటగాడు... తాము చెల్లించే ధరకు ఆడకపోతే ఫ్రాంచైజీ నిర్ణయాలకు విభేదించే జట్లను వీడతారు. పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నా. రిటెన్షన్ కుదరకపోయినా... పంత్‌లాంటి కెప్టెన్ అవసరం ఢిల్లీకే ఉంది. అతను లేకపోతే ఫ్రాంచైజీ కొత్త సారథి వేటలో పడాలి. నా అంచనా ప్రకారం ఢిల్లీ కచ్చితంగా పంత్‌ను తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డారు.అయితే, పంత్ మాత్రం గావస్కర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఢిల్లీతో కొనసాగకపోవడానికి డబ్బు మాత్రం కారణం కానే కాదని పంత్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ మెగా వేలానికి అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీలన్నీ అతడిపై కన్నేశాయి. రూ.24.75 కో ట్లతో రికార్డుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప సహా ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంత్‌కు ఈసారి కళ్లు చెదిరే మొత్తం దక్కుతుందని.. పంజాబ్ కింగ్స్ పంత్‌ను దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా.. ఆ తర్వాత విజృంభించిన స్టార్క్.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, మెగా వేలానికి ముందు కోల్‌కతా స్టార్క్‌తో పాటు తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను విడుదల చేసింది. ఇక పంత్‌తో పాటు అయ్యర్, కేఎల్ రాహుల్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది. -
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
వాషింగ్టన్ సుందర్‌కు భారీ ధర.. ఏకంగా రూ. 15.5 కోట్లు!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి కళ్లు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్‌లో ఉన్న సుందర్ ఎంత ధరకు అమ్ముడు పోతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో వాషింగ్టన్కు కళ్లు చెదిరే ధర దక్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్టన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుందర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఎస్ఆర్హెచ్ క్రమక్రమంగా వాషింగ్టన్ ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకొని గుజరాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ సుందర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుందర్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు.న్యూజిలాండ్‌పై అదుర్స్..కాగా ఐపీఎల్-2024లో సుందర్ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్‌పీఎల్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సుందర్ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్.. న్యూజిలాండ్‌పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!? -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
ఐపీఎల్-2025 వేలంలో పాల్గొనని ఇద్దరు స్టార్లు..!
ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. ఈసారి వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. ఈసారి వేలం మొత్తం 204 స్లాట్లకు జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.ఈసారి మెగా వేలంలో ఇద్దరు స్టార్ ప్లేయర్ల పేర్లు కనిపించలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియాకు చెందిన కెమరూన్ గ్రీన్ వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. ఆర్చర్ జాతీయ జట్టుకు సేవలందించేందుకు వేలానికి దూరంగా ఉండగా.. గ్రీన్ సర్జరీ కారణంగా వేలంలో పాల్గొనడం లేదు. ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 2023 మెగా వేలంలో రూ. 8 కోట్లకు సొంతం చేసుకోగా.. గ్రీన్‌ను ఆర్సీబీ 2024 వేలంలో రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొని ఉంటే మరోసారి భారీ మొత్తం దక్కేది.మెగా వేలంలో పాల్గొనని మరో ముగ్గురు స్లార్లు..బెన్ స్టోక్స్జేసన్ రాయ్శిఖర్ ధవన్అత్యంత పిన్నవయస్కుడు..ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల ఈ బీహార్ చిన్నోడు జూనియర్ క్రికెట్లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇక వేలంలో పాల్గొనబోయే అత్యంత పెద్ద వయస్కుడిగా జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు. ఆండర్సన్ 41 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.వేలంలో పాల్గొనబోయే ఆసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు..ఉన్ముక్త్ చంద్ (యూఎస్ఏ)అలీ ఖాన్ (యూఎస్ఏ)బ్రాండన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్)ఈ ముగ్గురు 30 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574 -
ఐపీఎల్ మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితా విడుదల
మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 15) విడుదల చేసింది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు లిస్ట్ అయ్యారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు.వేలంలో 318 మంది భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు.. 12 మంది విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు పాల్గొననున్నారు. మొత్తం 204 స్లాట్లకు వేలం జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో మొత్తం 81 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574సెట్-1..జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్, అర్షదీప్ సింగ్సెట్-2..యుజ్వేంద్ర చహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్సెట్-3..హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, ఎయిడెన్ మార్క్రమ్, దేవ్‌దత్ పడిక్కల్, రాహుల్ త్రిపాఠి, డేవిడ్ వార్నర్సెట్-4..అశ్విన్, వెంకటేశ్ అయ్యర్ మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, సోయినిస్సెట్-5..బెయిర్‌స్టో, డికాక్, గుర్బాజ్, ఇషాన్‌కిషన్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మసెట్-6..బౌల్ట్, హాజిల్‌వుడ్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, నటరాజన్, నోర్జే, ఖలీల్ అహ్మద్సెట్-7..నూర్ అహ్మద్, రాహుల్ చాహర్, హసరంగ, సలామ్‌ఖీల్, తీక్షణ, ఆడమ్ జంపాకాగా, జెద్దా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. -
చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 24, 25వ తేదీలలో జెడ్డా వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.ఈ మెగా వేలం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్లను ఏ ఫ్రాంచైజీ దక్కుంచుకుంటుందోనని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కోసం ఫ్యాన్స్ ఆన్లైన్లో మాక్ వేలం నిర్వహించారు. ఈ మెగా వేలం కోసం చహల్ తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో రూ. 2 కోట్ల బిడ్డింగ్ నుంచే మాక్ వేలం ప్రారంభమైంది. ఈ క్రమంలో చాహల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లకు పైగా ఆర్సీబీ వెచ్చించేందుకు సిద్దం కావడంతో పోటీ నుంచి పంజాబ్, గుజరాత్ తప్పుకొన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలోకి వచ్చింది. చహల్ కోసం రూ. 11.5 కోట్లకు బిడ్ వేసింది. ఆఖరికి ఈ మాక్ వేలంలో చాహల్‌ను రూ. 12 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చహల్ ఐపీఎల్ జర్నీ ఇదే.. చహల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడు ఆర్సీబీకి 8 సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఎన్నో అద్బుత విజయాలు అందించాడు. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్ తరపున తొలి సీజన్లోనే పర్పుల్ క్యాప్‌ను చహల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు రాజస్తాన్ కూడా చహల్ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. కాగా చహల్ ప్రస్తుతం ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 155 మ్యాచ్‌లు ఆడిన చహల్.. 22.12 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల(96) వీరుడిగానూ ఉన్నాడుచదవండి: NPL 2024: మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్.. -
ఐదు వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. మెగా వేలంలో...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్‌రౌండర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్ అయింది.గోవాకు ప్రాతినిథ్యంకాగా ముంబైకి చెందిన అర్జున్ టెండుల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది.పొర్వోరిమ్లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.టాప్-5 వికెట్లు అతడి ఖాతాలోనేఅర్జున్ ధాటికి టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కకావికలమైంది. ఓపెనర్ నబాం హచాంగ్‌ను డకౌట్ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్.. మరో ఓపెనర్ నీలం ఒబి(22), వన్‌డౌన్ బ్యాటర్ చిన్మయ్ పాటిల్(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్(0), ఐదో నంబర్ బ్యాటర్ మోజీ ఎటె(1)లను పెవిలియన్‌కు పంపాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతద్వారా అర్జున్ టెండుల్కర్.. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్‌తో పాటు గోవా బౌలర్లలో కేత్ పింటో రెండు, మోహిత్ రేడ్కర్ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్ ప్రదేశ్.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.ముంబై తరఫున కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. అయితే, రిటెన్షన్స్‌లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలంపాట జరుగనుంది.చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ మా దేశంలోనే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే! -
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: కామెంటేటర్‌గా పాంటింగ్ అవుట్!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు మేటి జట్లు ఈ టెస్టు సిరీస్‌లో నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతుంటే క్రికెట్ ప్రేమికులకు లభించే ఆ కిక్కే వేరు. ఆసీస్- భారత ఆటగాళ్ల మధ్య పరస్పర స్లెడ్జింగ్‌తో పాటు.. మ్యాచ్‌ను విశ్లేషిస్తూ కామెంటేటర్లు విసిరే ఛలోక్తులు, చమక్కులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.కామెంట్రీకి దూరంఇరుజట్లకు చెందిన మాజీ క్రికెటర్లలో చాలా మంది ఆసీస్ - భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్‌ను తమ వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఉంటారు. ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా ఈ కోవకు చెందినవాడే. అయితే, అతడు ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు కామెంట్రీకి దూరం కానున్నట్లు సమాచారం.కారణం ఇదేపాంటింగ్తో పాటు ఆసీస్ మరో మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా పెర్త్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధుల కారణంగా.. పాంటింగ్- లాంగర్ పెర్త్‌లో జరిగే.. మొదటి టెస్టు కామెంట్రీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.కాగా రిక్కీ పాంటింగ్ ఇటీవలే.. ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. అదే విధంగా.. జస్టిన్ లాంగర్ సైతం లక్నో సూపర్ జెయింట్స్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగే ఆక్షన్‌కు కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు.బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియాఅయితే, అంతకు రెండు రోజుల ముందే.. అంటే నవంబరు 22న ఆసీస్- భారత్ మొదటి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ఏజ్’ పాంటింగ్- లాంగర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. బీసీసీఐపై పరోక్షంగా అక్కసు వెళ్లగక్కింది.‘‘సెవెన్ చానెల్, క్రికెట్ ఆస్ట్రేలియా గనుక.. ఇండియాలోని శక్తిమంతమైన క్రికెట్ అధికారుల నుంచి తమ ప్రయోజనాలను కాపాడుకోలేకపోతే.. పాంటింగ్, లాంగర్, ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరీ సైతం సౌదీ అరేబియాకు వెళ్లే పరిస్థితి ఉంది.అక్కడి జెద్దా నగరంలో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటూ.. ఆటగాళ్ల కోసం వీళ్లంతా కార్డులు చూపిస్తూ మనకు కనిపిస్తారు. అప్పటికి తొలి టెస్టు ముగింపునకు వస్తుంది’’ అని ‘ది ఏజ్’ పేర్కొంది.నేను కోహ్లిని అవమానించలేదు: పాంటింగ్ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. తానేమీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని అవమానించలేదని.. ఆస్ట్రేలియా గడ్డపై అతడు ఫామ్‌లోకి రావాలని మాత్రమే ఆశించానన్నాడు. ఏదేమైనా కోచ్‌గా గౌతీ తన జట్టును డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.కాగా కోహ్లి గత ఐదేళ్లలో కేవలం రెండే టెస్టు సెంచరీలు చేయడం ఏమిటని పాంటింగ్ విమర్శించగా.. మీడియా వేదికగా గౌతీ అతడికి కౌంటర్ ఇచ్చాడు. భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతగా కావాలంటే.. ఆసీస్ ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించుకోవాలని హితవు పలికాడు.చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్ -
17 ఏళ్ల యువ సంచలనంపై కన్నేసిన సీఎస్కే.. రుతురాజ్ జోడీగా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సమయం అసన్నమవుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో ముంబై యువ ఆటగాడు ఆయుష్ మహాత్రేపై 5 సార్లు ఛాపింయన్ చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసినట్లు తెలుస్తోంది.మెగా వేలానికి ముందు మహాత్రేని సెలక్షన్ ట్రయల్ కోసం సీఎస్కే పిలిచినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. మహాత్రే సీఎస్కే టాలెంట్ స్కౌట్‌లతో పాటు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని దృష్టిని కూడా ఆకర్షించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే అతడికి ఈ నెలఖారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో సెలక్షన్ ట్రయల్‌కు హాజరు అవ్వమని సీఎస్కే పిలుపునిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల మహాత్రే ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై తరపున ఆడుతున్నాడు.ఈ టోర్నీలో భాగంగా ముంబై బుధవారం ప్రారంభం కానున్న తమ ఐదవ-రౌండ్ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే మహాత్రేని సీఎస్కే సెలక్షన్ ట్రయల్‌కు హాజరు కానున్నాడు. ఆ తర్వాత నవంబర్ 23న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు ఈ యువ ఓపెనర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.ఇరానీ కప్‌తో అరంగేట్రం..మహాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరానీ కప్‌లో లక్నో వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు (తొమ్మిది ఇన్నింగ్స్‌లు) ఆడిన అతను 35.66 సగటుతో 321 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే మహాత్రేకి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడిని వేలంలో సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని సీఎస్కే యోచిస్తుందంట.చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే ‘కొత్త రాజు’ అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
IPL 2025: అందుకే లక్నోకు గుడ్‌బై.. కారణం వెల్లడించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌తో తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన కేఎల్ రాహుల్సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం తెంచుకున్నట్లు వెల్లడైంది. అయితే, ఇందుకు గల కారణాన్ని ఈ టీమిండియా స్టార్ తాజాగా బయటపెట్టాడు. ‘‘నా ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న ఆప్షన్లను పరిశీలించాలని భావిస్తున్నా. ముఖ్యంగా ఎక్కడైతే నాకు స్వేచ్ఛగా ఆడే వీలు ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదుఅక్కడి వాతావరణం కాస్త తేలికగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అందుకే మన మంచి కోసం మనమే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు’’ అని కేఎల్ రాహుల్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా 2022లో లక్నో ఫ్రాంఛైజీ ఐపీఎల్లో అడుగుపెట్టింది. తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించుకుంది.కెప్టెన్‌గా రాణించినాఅయితే, యాజమాన్యం అంచనాలకు తగ్గట్లుగానే రాహుల్.. లక్నోను అరంగేట్ర సీజన్లోనే ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లోనూ టాప్-4లో నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం లక్నో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ.. ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే.. లక్నో జట్టు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్ సందర్భంగా.. రాహుల్‌ను అందరి ముందే తిట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కెప్టెన్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాహుల్‌కు ఘోర అవమానంఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అతడు నష్టనివారణ చర్యలే చేపట్టి.. రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి ఫొటోలు విడుదల చేశాడు. కానీ.. అందరి ముందు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయిన రాహుల్ ఆ జట్టును వీడినట్లు అతడి తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇక టీమిండియా టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా తాను ఇకపై అడుగులు వేస్తానని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా లక్నో తరఫున కేఎల్ రాహుల్ 2022లో 616 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో కలిపి 23 మ్యాచ్‌లు ఆడి 800 రన్స్ స్కోరు చేశాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 2265 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!? -
IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు రూ.20 కోట్లు! ఆర్సీబీ కెప్టెన్‌గా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లలో తమ సారథిగా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో ఈసారి రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ కర్ణాటక బ్యాటర్-కీపర్ నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో వేదికగా జరగనున్న మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులు రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్-2025లో సీజన్లో కేఎల్ ఆర్సీబీ తరపున ఆడితే చూడాలని ఆశపడుతున్నారు. కాగా గతంలో రాహుల్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రాహుల్‌కు రూ.20 కోట్లు!ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో మాక్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చాలా మంది అభిమానులు పాల్గోన్నారు. కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకోవడానికి రూ. 20 కోట్లు వెచ్చిందేందుకు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. మరికొంతమంది ఫ్యాన్స్ రిషబ్ పంత్ కోసం పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?అయితే ఆర్సీబీ యాజమాన్యం కూడా రాహుల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. తమ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను వేలంలోకి ఆర్సీబీ విడిచిపెట్టింది. విరాట్ కోహ్లి,యశ్ దయాల్, పాటిదార్‌ను మాత్రం బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ప్రస్తుతం రూ. 83 కోట్లు ఉన్నాయి.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల -
మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను..! ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆడాలని తాను పట్టుదలతో ఉన్నట్లు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు. ఇప్పటికీ తనలో క్రికెట్ ఆడగల సత్తా ఉందని.. అందుకే మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు వెల్లడించాడు. కాగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.సౌదీ అరేబియాలోని జిద్దా నగరాన్ని బీసీసీఐ వేలంపాటకు వేదికగా ఎంచుకుంది. ఈ క్రమంలో 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ఇంగ్లండ్ లెజెండరీ బౌలర్ ఆండర్సన్ కూడా ఉన్నాడు. అయితే, అతడు 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరఅయినప్పటికీ.. 42 ఏళ్ల ఆండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరతో తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ విషయం గురించి తాజాగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాలో క్రికెట్ ఆడగల సత్తా మిగిలే ఉంది. నేను వేలంలోకి రావడానికి ప్రధాన కారణం అదే.నన్ను ఎవరైనా కొనుక్కుంటారా? లేదా? అన్న అంశంతో నాకు అవసరం లేదు. నాకైతే తిరిగి మళ్లీ క్రికెట్ ఆడాలని ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఏ ఫార్మాట్లో ఆడేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా’’ అని ఆండర్సన్ పేర్కొన్నాడు. అయితే, ఇప్పటి వరకు తన ఏ ఫ్రాంఛైజీ ఆశ్రయించలేదని.. అయినా తాను ఏదో ఒక జట్టుకు ఆడాతననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టెస్టుల్లో 704 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా కొనసాగుతున్న ఆండర్సన్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ టెస్టు జట్టు మెంటార్‌గా కొత్త అవతారమెత్తాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆండర్సన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆ జట్టును వీడిన బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో స్థానంలో ఆండర్సన్ సేవలను ఉపయోగించుకునే దిశగా చెన్నై అడుగులు వేయవచ్చు.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
IPL 2025: ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ జాబితా బాగానే ఉందని.. అయితే వేలంపాటలో అనుసరించే వ్యూహాలపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి జట్టుతోనే ఉండటం సంతోషకరమన్న ఏబీడీ.. చహల్‌ను కూడా తిరిగి తీసుకువస్తే జట్టు మరింత బలోపేతమవుతుందన్నాడు.కాగా నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో మెగా వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇక ఆర్సీబీ తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(రూ. 21 కోట్లు)తో పాటు రజత్ పాటిదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాళ్(రూ. 5 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రిటెన్షన్ పోగా.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ. 83 కోట్లు మిగిలి ఉన్నాయి.ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుందిఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ వేలంలో ఆర్సీబీ అనుసరించాల్సిన వ్యూహాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనైతే ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తాను. యజువేంద్ర చహల్, కగిసో రబడ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్... ఈ నలుగురిని కొనుగోలు చేసిన తర్వాత పర్సులో ఎంత మిగిలిందన్న అంశం ఆధారంగా మిగతా ప్లేయర్లను ప్లాన్ చేసుకోవాలి.ఒకవేళ మీకు రబడను కొనేంత సొమ్ము లేకపోతే.. మహ్మద్ షమీని దక్కించుకోండి’’ అని డివిలియర్స్ ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. కాగా సుదీర్ఘకాలం పాటు తమతో కొనసాగిన భారత మణికట్టు స్పిన్నర్ చహల్‌ను 2022లో ఆర్సీబీ వదిలేసిన విషయం తెలిసిందే.లీడింగ్ వికెట్ టేకర్అయితే, అదే ఏడాది రాజస్తాన్ రాయల్స్ చహల్‌ను కొనుక్కోగా.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 160 మ్యాచ్‌లు ఆడి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(295) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు చహల్.ఈ నేపథ్యంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ తిరిగి జట్టులో చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరినా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
ఖరీదైన ఇంటిని కొన్న రింకూ సింగ్.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను రూ. 13 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీ నుంచి భారీగా సొమ్ము రావడంతో రింకూ సింగ్ ఎట్టకేలకు తన సొంతంటి కలను నేరవేర్చుకున్నాడు.అలీఘర్‌లోని ఓజోన్ సిటీలో ఖరీదైన విల్లాను రింకూ సింగ్ కొనుగోలు చేశాడు. 500 చదరపు గజాల స్థలం గల ఇంటిని రూ. 3.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి రింకూ సొంతం చేసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఒకప్పుడు ఇదే ఓజోన్ సిటీలోని రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లు వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు అదే సొసైటీలో కొడుకు విల్లాను కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీంతో రింకూపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కాదా సక్సెస్ అని రింకూను కొనియాడుతున్నారు.ఒకే ఓవర్లో 5 సిక్సర్లు..కాగా ఐపీఎల్-2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది రింకూ ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత భారత జట్టులోకి రింకూ ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా రింకూ తన మార్క్‌ను చూపించాడు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ రింకూ సింగ్‌కు రూ. 55 లక్షల వేతనం మాత్రమే వచ్చేది. కానీ తన అద్బుతప్రదర్శనలతో రింకూ ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు.ఈ ఏడాది నుంచి అతడు రూ. 13 కోట్లు అందుకుంటాడు. కేకేఆర్ అంటిపెట్టుకున్న వారిలో రింకూనే టాప్ రిటెన్షన్ కావడం గమనార్హం. రింకూ సింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
‘ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు.. నన్ను మళ్లీ కొనుక్కుంటారు’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని పేర్కొన్నాడు. వేలంపాటలో ఫ్రాంఛైజీ తనను తిరిగి కొనుక్కునే అవకాశం ఉందన్నాడు.బాధ లేదు..ఇక రిటెన్షన్ విషయంలో ఆర్సీబీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయన్న మాక్సీ.. తనను విడిచిపెట్టడం వల్ల పెద్దగా బాధ కలగలేదని తెలిపాడు. కాగా ఈసారి ఆర్సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సహా రజత్ పాటిదార్, యశ్ దయాళ్‌లను అట్టిపెట్టుకుని.. మిగతా ప్లేయర్లందరినీ రిలీజ్ చేసింది.ఈసారి పర్సు వాల్యూ రూ. 120 కోట్లకు పెంచడంతో.. రిటెన్షన్స్ పోనూ ఆర్సీబీ పర్సులో రూ. 83 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్వెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వారు ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. పటిష్టమైన జట్టును నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదుముఖ్యంగా స్థానిక ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదు. నేను తిరిగి అక్కడికి వెళ్లాలనే కోరుకుంటున్నాను. ఆర్సీబీ అద్భుతమైన ఫ్రాంఛైజీ. అక్కడి వారితో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.రిటెన్షన్ సమయంలోనూ నాకు వారి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్ , మొ బొబాట్ నాకు జూమ్ కాల్లో అంతా వివరించారు. వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. నాకు వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు. నిరాశపరిచిన మాక్సీకాగా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తే మాక్సీ ఐపీఎల్-2024లో ఆర్సీబీ యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశపరిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులే చేశాడు. అయితే, తనదైన రోజు చెలరేగి ఆడే ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తిరిగి సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక ఆర్సీబీ స్టార్, టీమిండియా కింగ్ విరాట్ కోహ్లితో మాక్సీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
IPL 2025 Mega Auction: ఏ దేశం నుంచి ఎంత మంది పాల్గొంటున్నారంటే..?
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనుంది. ఈ మెగా వేలంలో 17 దేశాలకు చెందిన 1574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. వీరిలో భారత్‌కు చెందిన 1165 ప్లేయర్లు ఉన్నారు. ఈ 1165 మందిలో 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సిరాజ్ లాంటి 48 మంది దేశీయ స్టార్ క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు.ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికొస్తే.. అసోసియేట్ దేశాలకు చెందిన 30 మందిని కలుపుకుని మొత్తం 409 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా సౌతాఫ్రికా (91) నుంచి పేర్లు నమోదు చేసుకున్నారు. విదేశీ ఆటగాళ్లలో బట్లర్, స్టార్క్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, బెయిర్‌స్టో, రబాడ, జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్లు ఉన్నారు.దేశాల వారీగా ఆటగాళ్ల సంఖ్య..ఆఫ్ఘనిస్తాన్- 29ఆస్ట్రేలియా- 76బంగ్లాదేశ్- 13కెనడా- 4ఇంగ్లండ్- 52భారత్- 1165ఐర్లాండ్- 9ఇటలీ- 1నెదర్లాండ్స్- 12న్యూజిలాండ్- 39స్కాట్లాండ్- 2సౌతాఫ్రికా- 91శ్రీలంక- 29యూఏఈ- 1యూఎస్ఏ- 10వెస్టిండీస్- 33జింబాబ్వే- 8ఐపీఎల్ మెగా వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య- 1574ఖాళీల సంఖ్య- 20470 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఖర్చు చేయబోయే బడ్జెట్- రూ. 641.5 కోట్లుఏయే ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ బ్యాలెన్స్ ఉంది..?పంజాబ్ కింగ్స్- రూ. 110.5 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 45 కోట్లులక్నో- రూ. 69 కోట్లు కేకేఆర్- రూ. 51 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు ఆర్సీబీ- రూ. 83 కోట్లు సీఎస్కే- రూ. 55 కోట్లుముంబై ఇండియన్స్- రూ. 45 కోట్లు గుజరాత్- రూ. 69 కోట్లు రాజస్థాన్ రాయల్స్- రూ. 83 కోట్లు -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్‌కు కొత్త కెప్టెన్ -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్‌లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్‌పై దృష్టి -
IPL 2025: మెగా వేలం వేదిక మార్పు..?
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం, వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. తొలుత మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే తాజాగా వేదికను జెద్దా నగరానికి మార్చినట్లు సమాచారం. అబేది అల్ జోహార్ అరీనా (బెంచ్‌మార్క్ అరీనా) మెగా వేలానికి వేదిక కానున్నట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఫ్రాంచైజీ ప్రముఖులకు వసతి ఏర్పాట్లను అబేది అల్ జోహార్ అరీనా సమీపంలో గల హోటల్ షాంగ్రీ-లాలో సిద్దం చేసినట్లు తెలుస్తుంది. వేలం తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరుగనుందని సమాచారం.కాగా, వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే కావడం విశేషం. ఈ సారి మెగా వేలానికి మొత్తం 1574 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో 1165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 409 మంది విదేశీ ఆటగాళ్లని సమాచారం. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుని వదిలేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా..పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుశశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లుపంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుశిఖర్ ధవన్ (కెప్టెన్)రిలీ రొస్సోహర్ప్రీత్ సింగ్ భాటియాశివమ్ సింగ్అధర్వ తైడేఅశుతోష్ శర్మవిశ్వనాథ్ సింగ్సికందర్ రజాసామ్ కర్రన్క్రిస్ వోక్స్రిషి ధవన్తనయ్ త్యాగరాజన్జానీ బెయిర్స్టోజితేశ్ శర్మరాహుల్ చాహర్విధ్వత్ కావేరప్పహర్షల్ పటేల్నాథన్ ఎల్లిస్అర్షదీప్ సింగ్ప్రిన్స్ చౌదరీహర్ప్రీత్ బ్రార్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుపాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఆటగాళ్లుగ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చులక్నో సూపర్ జెయింట్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లునికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్ వదిలేసిన ఆటగాళ్లుప్రేరక్ మన్కడ్దేవ్దత్ పడిక్కల్కైల్ మేయర్స్కృనాల్ పాండ్యామార్కస్ స్టోయినిస్అర్షిన్ కులకర్ణిదీపక్ హుడాఆస్టన్ అగర్కృష్ణప్ప గౌతమ్క్వింటన్ డికాక్కేఎల్ రాహుల్ (కెప్టెన్)మణిమారన్ సిద్దార్థ్యుద్ద్వీర్సింగ్ చరక్నవీన్ ఉల్ హక్యశ్ ఠాకూర్షమార్ జోసఫ్అమిత్ మిశ్రాఅర్షద్ ఖాన్మ్యాట్ హెన్రీవేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్‌రైడర్స్ ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లురింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుకోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసిన ఆటగాళ్లుమనీశ్ పాండేనితీశ్ రాణాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)సకీబ్ హుసేన్షెర్ఫాన్ రూథర్ఫోర్డ్వెంకటేశ్ అయ్యర్అనుకుల్ రాయ్అంగ్క్రిష్ రఘువంశీరహ్మానుల్లా గుర్భాజ్శ్రీకర్ భరత్వైభవ్ అరోరాసుయాశ్ శర్మచేతన్ సకారియామిచెల్ స్టార్క్దుష్మంత చమీరాఅల్లా ఘజన్ఫర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదుఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ఆటగాళ్లురికీ భుయ్యశ్ ధుల్డేవిడ్ వార్నర్పృథ్వీ షాజేక్ ఫ్రేసర్ మెక్గుర్క్స్వస్తిక్ చికారలలిత్ యాదవ్సుమిత్ కుమార్గుల్బదిన్ నైబ్షాయ్ హోప్కుమార్ కుషాగ్రారిషబ్ పంత్ (కెప్టెన్)ఇషాంత్ శర్మజై రిచర్డ్సన్రసిఖ్ దార్ సలామ్విక్కీ ఓస్త్వాల్ఖలీల్ అహ్మద్ముకేశ్ కుమార్అన్రిచ్ నోర్జేప్రవీణ్ దూబేలిజాడ్ విలియమ్స్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్లుసుయాశ్ ప్రభుదేశాయ్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్మహిపాల్ లోమ్రార్మనోజ్ భండగేసౌరవ్ చౌహాన్స్వప్నిల్ సింగ్టామ్ కర్రన్అనూజ్ రావత్కర్ణ్ శర్మవిజయ్కుమార్ వైశాఖ్అల్జరీ జోసఫ్రాజన్ కుమార్మయాంక్ డాగర్లోకీ ఫెర్గూసన్మొహమ్మద్ సిరాజ్హిమాన్షు శర్మఆకాశ్దీప్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లుమతీశ పతిరణ- రూ. 13 కోట్లుశివమ్ దూబే- రూ. 12 కోట్లురవీంద్ర జడేజా- రూ. 18 కోట్లుఎంఎస్ ధోని- రూ. 4 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుఅజింక్య రహానేషేక్ రషీద్సమీర్ రిజ్విడారిల్ మిచెల్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రనిషాంత్ సంధుమిచెల్ సాంట్నర్అరవెల్లి అవనీశ్అజయ్ జాదవ్ మండల్హంగేర్కర్ముకేశ్ చౌదరీప్రశాంత్ సోలంకిశార్దూల్ ఠాకూర్సిమ్రన్జీత్ సింగ్తుషార్ దేశ్పాండేమహీశ్ తీక్షణరిచర్డ్ గ్లీసన్దీపక్ చాహర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుజస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లుసూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లుహార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లురోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లుతిలక్ వర్మ- రూ. 8 కోట్లుముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లుటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్నేహల్ వధేరానమన్ ధిర్శివాలిక్ శర్మషమ్స్ ములానీశ్రేయస్ గోపాల్రొమారియో షెపర్డ్కుమార్ కార్తీకేయమొహమ్మద్ నబీఅర్జున్ టెండూల్కర్ఇషాన్ కిషన్హార్విక్ దేశాయ్పియూశ్ చావ్లాఅన్షుల్ కంబోజ్గెరాల్డ్ కొయెట్జీఆకాశ్ మధ్వాల్నువాన్ తుషారక్వేనా మపాకాలూక్ వుడ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుగుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురషీద్ ఖాన్- రూ. 18 కోట్లుశుభ్మన్ గిల్- రూ. 16.5 కోట్లుసాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లురాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లుషారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లుగుజరాత్ టైటాన్స్ వదిలేసిన ఆటగాళ్లుడేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్అభినవ్ మనోహర్విజయ్ శంకర్అజ్మతుల్లా ఒమర్జాయ్వృద్దిమాన్ సాహామాథ్యూ వేడ్శరత్ బీఆర్కార్తీక్ త్యాగినూర్ అహ్మద్రవిశ్రీనివాసన్ సాయి కిషోర్జాషువ లిటిల్స్పెన్సర్ జాన్సన్మొహిత్ శర్మదర్శన్ నల్కండేజయంత్ యాదవ్ఉమేశ్ యాదవ్సందీప్ వారియర్మారవ్ సుతార్గుర్నూర్ బ్రార్పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చురాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..సంజూ శాంసన్- రూ. 18 కోట్లుయశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లురియాన్ పరాగ్- రూ. 14 కోట్లుదృవ్ జురెల్- రూ. 14 కోట్లుషిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లుసందీప్ శర్మ- రూ. 4 కోట్లురాజస్థాన్ రాయల్స్ వదిలేసిన ఆటగాళ్లు..రోవ్‌మన్ పొవెల్శుభమ్ దూబేతనుశ్ కోటియన్రవిచంద్రన్ అశ్విన్డొనొవన్ ఫెరియెరాకునాల్ సింగ్ రాథోర్టామ్ కొహ్లెర్-కాడ్మోర్ఆవేశ్ ఖాన్ట్రెంట్ బౌల్ట్నవ్దీప్ సైనీనండ్రే బర్గర్యుజ్వేంద్ర చహల్కుల్దీప్ సేన్ ఆబిద్ ముస్తాక్కేశవ్ మహారాజ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు -
IPL 2025: మెగా వేలం డేట్స్ ఫిక్స్! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని.. ఈ నెల ఆఖరి వారంలో రియాద్ వేదికగా ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వేలం రెండు రోజుల పాటు సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రైట్ టూ మ్యాచ్ కార్డు అందుబాటులోకికాగా మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచడం సహా రైట్ టూ మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డు అందుబాటులోకి రావడంతో ఫ్రాంఛైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. కీలకమైన ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని.. స్టార్లు అయినా సరే తమకు భారం అనుకుంటే.. వాళ్లను వదిలించుకున్నాయి.వదిలించుకున్నాయిరాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్(ఇంగ్లండ్), సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐడెన్ మార్క్రమ్(సౌతాఫ్రికా), ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ ఏడాది టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌లను రిలీజ్ చేయడం ఇందుకు ఉదాహరణ.ఆ తేదీల్లోనే వేలం!ఇక పది జట్లు కలిపి మొత్తంగా 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఇక ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే.. అందులోనూ పది మంది అన్క్యాప్డ్ ఇండియన్స్ కావడం విశేషం. కాగా ఈ సీజన్లో కూడా సొంతగడ్డపై కాకుండా విదేశంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందుకోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబరు 24, 25 తేదీల్లో వేలం నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబరు 19న దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మెగా వేలం-2025 రిటెన్షన్స్ పోనూ ఎవరి పర్సులో ఎంత?రాజస్తాన్ రాయల్స్ 👉సంజూ సామ్సన్-భారత్- రూ. 18 కోట్లు 👉యశస్వి జైస్వాల్- భారత్- రూ. 18 కోట్లు 👉రియాన్ పరాగ్- భారత్- రూ. 14 కోట్లు 👉ధ్రువ్ జురెల్- భారత్- రూ. 14 కోట్లు 👉హెట్‌మైర్-వెస్టిండీస్ రూ. 11 కోట్లు 👉సందీప్ శర్మ- భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదుగుజరాత్ టైటాన్స్👉రషీద్ ఖాన్-అఫ్గానిస్తాన్- రూ. 18 కోట్లు 👉శుబ్‌మన్ గిల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉సాయి సుదర్శన్- భారత్- రూ. 8.50 కోట్లు 👉రాహుల్ తెవాటియా- భారత్ రూ. 4 కోట్లు 👉షారుఖ్ ఖాన్ భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుఢిల్లీ క్యాపిటల్స్ 👉అక్షర్ పటేల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉కుల్దీప్ యాదవ్- భారత్ రూ. 13.25 కోట్లు 👉ట్రిస్టన్ స్టబ్స్- దక్షిణాఫ్రికా రూ. 10 కోట్లు 👉అభిషేక్ పొరెల్- భారత్ రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్ 👉నికోలస్ పూరన్- వెస్టిండీస్- రూ. 21 కోట్లు 👉రవి బిష్ణోయ్- భారత్- రూ. 11 కోట్లు 👉మయాంక్ యాదవ్ -భారత్- రూ. 11 కోట్లు 👉మోహసిన్ ఖాన్- భారత్- రూ. 4 కోట్లు 👉ఆయుష్ బదోని- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు సన్‌రైజర్స్ హైదరాబాద్ 👉హెన్రిచ్ క్లాసెన్- దక్షిణాఫ్రికా- రూ. 23 కోట్లు 👉ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- రూ. 18 కోట్లు 👉అభిషేక్ శర్మ- భారత్- రూ. 14 కోట్లు 👉ట్రావిస్ హెడ్- ఆస్ట్రేలియా- రూ. 14 కోట్లు 👉నితీశ్ రెడ్డి- భారత్- రూ. 6 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ 👉జస్ప్రీత్ బుమ్రా- భారత్- రూ. 18 కోట్లు 👉సూర్యకుమార్- భారత్- రూ. 16.35 కోట్లు 👉హార్దిక్ పాండ్యా- భారత్- రూ. 16.35 కోట్లు 👉రోహిత్ శర్మ- భారత్- రూ. 16.30 కోట్లు 👉తిలక్ వర్మ- భారత్- రూ. 8 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ 👉రుతురాజ్ గైక్వాడ్- భారత్- రూ. 18 కోట్లు 👉మతీశా పతిరన- శ్రీలంక- రూ. 13 కోట్లు 👉శివమ్ దూబే- భారత్- రూ. 12 కోట్లు 👉రవీంద్ర జడేజా- భారత్- రూ. 18 కోట్లు 👉ధోనీ - భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్ రైడర్స్ 👉రింకూ సింగ్- భారత్- రూ. 13 కోట్లు 👉వరుణ్ చక్రవర్తి- భారత్ -రూ. 12 కోట్లు 👉సునీల్ నరైన్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉ఆండ్రె రసెల్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉హర్షిత్ రాణా- భారత్- రూ. 4 కోట్లు 👉రమణ్‌దీప్ సింగ్- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదురాయల్ చాలెంజర్స్ బెంగళూరు 👉విరాట్ కోహ్లి- భారత్- రూ. 21 కోట్లు 👉రజత్ పాటిదార్- భారత్ -రూ. 11 కోట్లు 👉యశ్ దయాళ్- భారత్- రూ. 5 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుపంజాబ్ కింగ్స్ 👉శశాంక్ సింగ్- భారత్- రూ. 5.5 కోట్లు 👉ప్రభ్‌సిమ్రన్ సింగ్ -భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.చదవండి: BGT 2024: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైన విషయం విధితమే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓటమి చవిచూసినప్పటకి.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన విరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న విలవిల్లాడిన చోట రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారత్ డగౌట్లో ఆశలు రేకెత్తించాడు. కానీ అనూహ్యంగా పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ సిరీస్ అసాంతం పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 89.38 స్ట్రైక్ రేటుతో పంత్ 261 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను బాసిత్ అలీ మెచ్చుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోతాడని అలీ జోస్యం చెప్పాడు.రూ. 50 కోట్లు ఇవ్వాలి.."రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్‌పై మిగితా ప్లేయర్లంతా ఇబ్బంది పడితే పంత్ ఒక్కడే ప్రత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేశాడు. అతడు ప్లాట్ పిచ్‌పై ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడి షాట్ సెలక్షన్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే.అతడు ఎటువైపు ఆడాలనుకుంటే ఆటువైపు ఈజీగా షాట్లు ఆడాడు. మిగితా ఆటగాళ్లు పంత్‌లా ఆడలేకపోయారు. రిషబ్ తొలి ఇన్నింగ్స్‌లో 60, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. అతడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు. పంత్ రూ.25 కోట్లకు అమ్ముడుపోతాడని అంతా అనుకుంటున్నారు.కానీ నావరకు అయితే పంత్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి తీసుకున్నా తప్పులేదు అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్‌లను మాత్రమే ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అయితే పంత్‌ను వేలంలోకి విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు తమ కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అయ్యర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని జీఎంఆర్( (GMR) గ్రూప్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.మళ్లీ సొంతగూటికి?కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయ్యర్ 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్‌డేవిల్స్ అతడిని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్-2021 వరకు ఢిల్లీ ఆధారిత ఫ్రాంచైజీకే అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్‌గా కూడా శ్రేయస్ వ్యవహరించాడు. ఐపీఎల్-2020లో అయ్యర్ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత అయ్యర్ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్-2022 సీజన్ ముందు విడిచిపెట్టింది. ఈ క్రమంలో అయ్యర్ స్ధానంలోనే తమ రెగ్యూలర్ కెప్టెన్‌గా రిషబ్‌ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు మళ్లీ రివర్స్‌గా రిషబ్‌ను విడిచిపెట్టి అయ్యర్‌ను తమ సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఢిల్లీ పర్స్‌లో ప్రస్తుతం రూ.73 కోట్లు ఉన్నాయి. వేలంలో ఈ భారీ మొత్తాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ఖర్చుచేయనుంది.చదవండి: IND vs NZ: నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో