వైభవ్ సూర్యవంశీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే?! (PC: Sony Sports X)
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడీ పేరు హాట్‌టాపిక్. పన్నెండేళ్ల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడిన ఈ బిహారీ చిచ్చరపిడుగు... ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పదమూడేళ్ల ఈ కుర్రాడి కోసం రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన వైభవ్ తన ఐడల్ ఎవరో చెప్పేశాడు.
సచిన్, కోహ్లి కాదు! అతడే ఆదర్శం
మెజారిటీ మంది టీమిండియా అభిమానులు ఊహించినట్లుగా వైభవ్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్, రోహిత్ శర్మల పేరు చెప్పలేదు. అతడికి వెస్టిండీస్ దిగ్గజం లారా ఆదర్శమట. ‘‘బ్రియన్ లారా నాకు ఆదర్శం. నేను ఆయనలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే, నాదైన సహజ శైలిని మాత్రం విడిచిపెట్టను.
నాకున్న నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ టోర్నీ మీదే ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంతో సంబంధం లేదు’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
పట్టించుకోను
ఐపీఎల్‌లో తన డిమాండ్, తన వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ వస్తున్న ఆరోపణలను పట్టించుకోనని వైభవ్ కుండబద్దలుకొట్టాడు. కాగా దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 44 పరుగుల తేడాతో అమాన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇక శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. యువ టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో ఆడనుంది.
చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు!
Vaibhav Sooryavanshi gears up for the big stage 🌟
🗣️ Hear from India’s rising star as the action unfolds against Pakistan 🎤 #SonySportsNetwork #NextGenBlue #AsiaCup #NewHomeOfAsiaCup #INDvPAK pic.twitter.com/PLG8UlvB6i— Sony Sports Network (@SonySportsNetwk) November 30, 2024
Comments
Please login to add a commentAdd a comment