U19 Asia Cup
-
U19 Asia Cup: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్, పాకిస్తాన్
ACC U19 Asia Cup, 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత టీనేజ్ సీమర్ రాజ్ లింబాని అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా నేపాల్‌తో మ్యాచ్‌లో (7/13) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో యువ భారత జట్టు అలవోక విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను 18 ఏళ్ల రాజ్ లింబాని స్పెల్ హడలెత్తించింది. దీంతో నేపాల్ 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. రాజ్ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. నేపాల్ ఓపెనర్ల నుంచి ఆఖరి వరుస బ్యాటర్ వరకు అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత జట్టు 7.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసి ఛేదించింది. అర్షిన్ కులకర్ణి (30 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అర్షిన్, ఆదర్శ్ సింగ్ (13 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన ఓపెనింగ్ బాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఇక ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను భారత యువ జట్టు చిత్తు చేసింది. గ్రూప్-ఏ టాపర్‌గా పాకిస్తాన్ ఈ క్రమంలో మొత్తంగా... ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన భారత్ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు.. దాయాది జట్టు పాకిస్తాన్ మంగళవారం నాటి రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 83 పరుగుల తేడాతో అఫ్గన్‌ను మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. తద్వారా ఆడిన మూడింట మూడు నెగ్గి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ACC Men's U19 Asia Cup | Pakistan-U19 vs Afghanistan-U19 | Highlights. https://t.co/E72GAXu9OB#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
ఏడు వికెట్లతో చెలరేగిన భారత పేసర్.. 52 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్
ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-‘ఏ’లో ఉన్న భారత్ తొలుత అఫ్గనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్ సహారన్ సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్‌తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్‌తో రాణించారు. ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్ 22.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఓపెనర్లే పూర్తి చేశారు భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్, అర్షిన్ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది. మరోవైపు.. గ్రూప్-‘ఏ’లో భాగమైన పాకిస్తాన్ మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోటీపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 48 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ చేరడం లాంఛనమే! దీంతో మరోసారి దాయాదులు భారత్- పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. చదవండి: Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్‌లో కింగ్ కోహ్లి ACC Men's U19 Asia Cup | India-U19 vs Nepal-U19 | Highlights. https://t.co/6wE0HM9pDH#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
Ind vs Pak: భారత క్రికెట్ జట్టుకు నిరాశ.. సెమీస్ చేరాలంటే..
India U19 vs Pakistan U19- దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉదయ్ (60; 5 ఫోర్లు), సచిన్ (58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాకిస్తాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలిచింది. అజాన్ అవైస్ (105 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక షాజైబ్ ఖాన్ (63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాద్ బేగ్ (68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కాగా భారత్‌తో పాటు గ్రూప్-ఏలో ఉన్న పాక్ యువ క్రికెట్ జట్టుకు ఇది రెండో విజయం. ఇప్పటికే నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో దేవ్ ఖనాల్ బృందం గెలుపొందింది. సెమీస్ చేరాలంటే భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. ఇక ఈ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ నంబర్ 2 వేదిక కానుంది. మరోవైపు.. పాకిస్తాన్ కూడా మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోరకు సిద్ధమవుతోంది. ACC Men's U19 Asia Cup | India-U19 vs Pakistan-U19 | Highlights. https://t.co/tdlQThbdXQ#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 10, 2023 -
ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
అండర్-19 ఆసియాకప్ 2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ జట్టుతో పాటు ముగ్గురు ట్రావిలింగ్ స్టాండ్‌బై ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ మెగా టోర్నీ దుబాయ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్-ఎలో భారత్, నేపాల్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? డిసెంబర్ 8న భారత్- ఆఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్ మధ్య పోరులో లీగ్ మ్యాచ్‌లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్-1, ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక ఈ టోర్నీలో డిసెంబర్ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. భారత అండర్-19 జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), అభిషేక్, ఇన్నేష్ మహాజన్ , ఆరధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. స్టాండ్‌బై ఆటగాళ్లు: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. రిజర్వ్ ఆటగాళ్లు: దిగ్విజయ్ పాటిమ్ జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. 17 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! -
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అండర్-19 పురుషుల ఆసియాకప్-2023 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ దుబాయ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ 8 జట్లను మొత్తం రెండు గ్రూపులుగా ఏసీసీ విభజించింది. గ్రూప్-ఎలో భారత్, నేపాల్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. డిసెంబర్ 8న భారత్- ఆఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్ మధ్య పోరులో లీగ్ మ్యాచ్‌లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్-1, ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక ఈ టోర్నీలో డిసెంబర్ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. కాగా ఈవెంట్లో భారత్ డిఫెండింగ్ ఛాపింయన్స్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరగా 2021లో జరిగిన ఆసియాకప్‌లో శ్రీలంకను చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది. చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... హైదరాబాదీలకు బ్యాడ్‌న్యూస్! -
U19 Asia Cup: భారత జట్టు ప్రకటన.. హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కు చోటు
U19 Asia Cup 2021: India Squad Announced, Yash Dhull To Lead Rishith Reddy Got Place: ఏసీసీ ఆసియా అండర్ 19 కప్-2021నేపథ్యంలో ఆల్ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా డిసెంబరు 23 నుంచి ఆరంభం కానున్న టోర్నీ కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఢిల్లీ క్రికెటర్ యశ్ ధుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వినోద్ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు(302) సాధించిన బ్యాటర్లలో ఒకడైన యశ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డికి ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్‌తో తలపడిన ఇండియా ఏ జట్టులో భాగమైన రిషిత్.. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా.. మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా.. డిసెంబరు 11 నుంచి 19 వరకు జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే 25 మంది సభ్యుల జట్టును కూడా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు ఏడు సార్లు అండర్ 19 ఆసియా కప్ గెలిచిన భారత జట్టు ఈసారి కూడా ఎలాగేనా చాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక 2019లో బంగ్లాదేశ్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇండియా అండర్ 19 ఆసియా కప్ జట్టు హర్నూర్ సింగ్ పన్ను, అంగ్క్రిష్ రఘువన్శి, అన్ష్ గోసాయి, ఎస్ కే రషీద్, యశ్ ధుల్(కెప్టెన్), అనేశ్వర్ గౌతమ్, సిద్దార్థ్ యాదవ్, కౌశల్ థంబే, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), రాజంగడ్ బవా, రాజ్వర్ధన్ హంగ్రేకర్, గర్వ్ సంగ్వాన్, రవి కుమార్, రిషిత్ రెడ్డి, మానవ్ ప్రకాశ్, అమ్రిత్ రాజ్ ఉపాధ్యాయ్, విక్కీ ఒత్వాల్, వాసు వట్స్. స్టాండ్ బై ప్లేయర్స్: ఆయుశ్ సింగ్ ఠాకూర్ ,ఉదయ్ సహరాన్, షశ్వత్ దంగ్వాల్, ధనుశ్ గౌడ, పీఎం సింగ్ రాథోడ్. చదవండి: Vijay Hazare Trophy: సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్ NEWS 🚨: India U19 squad for Asia Cup & preparatory camp announced. More details 👇https://t.co/yJAHbfzk6A — BCCI (@BCCI) December 10, 2021 -
ప్రతి బంతీ ఓ యుద్ధంలా...
న్యూఢిల్లీ: ఆసియా కప్ అండర్-19 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రతి బంతి ఓ యుద్ధాన్ని తలపిం చిందని భారత అండర్-19 సారథి విజయ్ జోల్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్ సంజూ శామ్సన్ సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ 40 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచిన సంగతి తెలిసిందే. ‘దాయాదుల సమరంలో తీవ్రమైన ఉద్వేగం ఉంటుంది. ప్రతి బంతి యుద్ధంలా ఉంటుంది. ఇది మ్యాచ్ ఆరంభంలో కొంత ఇబ్బందిగా అనిపించింది. దానికి ప్రేక్షకుల గోల కూడా తోడయ్యింది... కానీ మ్యాచ్ సాగేకొద్దీ అంతా సర్దుకుంది’ అని జోల్ చెప్పాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, పాక్‌తో మ్యాచ్ అంటే ఆషామాషీ కాదన్నాడు. ఈ విషయం తమకు బాగా తెలుసు కాబట్టే చక్కగా ఆరంభించామన్నాడు. మధ్యలో కాస్త ఇబ్బందికర పరిస్థితులెదురైనప్పటికీ తాను క్రీజ్‌లోకి వెళ్లి అనుకున్న ప్రణాళికను అమలు చేయడంతో అంతా సర్దుకుందని అన్నాడు. ‘ముందుగా మా బ్యాటింగ్ ముగిశాక, ఇన్నింగ్స్ విరామంలో అంతా కూర్చుని మాట్లాడుకున్నాం. బ్యాట్స్‌మెన్ తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారని... ఇప్పుడిక బౌలర్ల వంతని చెప్పుకున్నాం. అనుకున్నట్లే బౌలర్లూ బాగా రాణించారు. నిజానికి టోర్నీ ఆసాంతం మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు’ అని మ్యాచ్ విశేషాల్ని జోల్ వివరించాడు.