
భారత జట్టుకు నిరాశ (PC: ACC X)
India U19 vs Pakistan U19- దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉదయ్ (60; 5 ఫోర్లు), సచిన్ (58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాకిస్తాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలిచింది. అజాన్ అవైస్ (105 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక షాజైబ్ ఖాన్ (63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాద్ బేగ్ (68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కాగా భారత్‌తో పాటు గ్రూప్-ఏలో ఉన్న పాక్ యువ క్రికెట్ జట్టుకు ఇది రెండో విజయం. ఇప్పటికే నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో దేవ్ ఖనాల్ బృందం గెలుపొందింది.
సెమీస్ చేరాలంటే
భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. ఇక ఈ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ నంబర్ 2 వేదిక కానుంది. మరోవైపు.. పాకిస్తాన్ కూడా మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోరకు సిద్ధమవుతోంది.
ACC Men's U19 Asia Cup | India-U19 vs Pakistan-U19 | Highlights. https://t.co/tdlQThbdXQ#ACCMensU19AsiaCup #ACC
— AsianCricketCouncil (@ACCMedia1) December 10, 2023
Comments
Please login to add a commentAdd a comment