India vs Nepal
-
ధనాధన్ ఇన్నింగ్స్.. కెరీర్ బెస్ట్ స్కోర్! కానీ..
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు సాధించింది.కానీ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024లో భాగంగా భారత్- నేపాల్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ టీమిండియాకు శుభారంభం అందించింది. కేవలం 48 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ హేమలత(42 బంతుల్లో 47) కలిసి షెఫాలీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.ఇక షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోరు(81) కావడం విశేషం. అంతేకాదు వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్‌గా షెఫాలీ నిలిచింది. 2018 నాటి టోర్నీలో 69 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ జాబితాలో షెఫాలీ కంటే ముందు వరుసలో ఉంది.ఓవరాల్‌గా శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(119 నాటౌట్) స్థానాన్ని మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ ఆక్రమించారు. ఇక భారత్ తరఫున టీ20లలో షెఫాలీ సాధించిన పదో అర్ధ శతకం ఇదే. అంతేకాదు టీమిండియా తరఫున అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కూడా షఫాలీ వర్మనే కావడం విశేషం. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1906 పరుగులు చేసింది.ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సగం ఆట(10 ఓవర్లు) ముగిసేసరికి నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్-2024లో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
సెంచరీల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయ జట్టుగా కొనసాగుతున్న భారత్.. నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లోనూ చెలరేగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్ (100), సచిన్ దాస్ (116) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ 21, అర్షిన్ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేసి ఔట్ కాగా.. ఈ టోర్నీలో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న చిచ్చరపిడుగు ముషీర్ ఖాన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో గుల్షన్ షా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ చాంద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే యువ భారత్ దర్జాగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఇవాళే జరుగుతున్న మరో రెండు సూపర్ సిక్స్ మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా-శ్రీలంక, ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (71), రీలే నార్టన్ (41 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహిరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. విండీస్‌తో జరుగుతున్న మరో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ (108) సెంచరీతో కదంతొక్కాడు. విండీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ 3, థోర్న్ 2 వికెట్లు పడగొట్టారు. -
U19 Asia Cup: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్, పాకిస్తాన్
ACC U19 Asia Cup, 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత టీనేజ్ సీమర్ రాజ్ లింబాని అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా నేపాల్‌తో మ్యాచ్‌లో (7/13) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో యువ భారత జట్టు అలవోక విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను 18 ఏళ్ల రాజ్ లింబాని స్పెల్ హడలెత్తించింది. దీంతో నేపాల్ 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. రాజ్ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. నేపాల్ ఓపెనర్ల నుంచి ఆఖరి వరుస బ్యాటర్ వరకు అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత జట్టు 7.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసి ఛేదించింది. అర్షిన్ కులకర్ణి (30 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అర్షిన్, ఆదర్శ్ సింగ్ (13 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన ఓపెనింగ్ బాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఇక ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను భారత యువ జట్టు చిత్తు చేసింది. గ్రూప్-ఏ టాపర్‌గా పాకిస్తాన్ ఈ క్రమంలో మొత్తంగా... ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన భారత్ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు.. దాయాది జట్టు పాకిస్తాన్ మంగళవారం నాటి రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 83 పరుగుల తేడాతో అఫ్గన్‌ను మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. తద్వారా ఆడిన మూడింట మూడు నెగ్గి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ACC Men's U19 Asia Cup | Pakistan-U19 vs Afghanistan-U19 | Highlights. https://t.co/E72GAXu9OB#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
ఏడు వికెట్లతో చెలరేగిన భారత పేసర్.. 52 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్
ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-‘ఏ’లో ఉన్న భారత్ తొలుత అఫ్గనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్ సహారన్ సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్‌తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్‌తో రాణించారు. ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్ 22.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఓపెనర్లే పూర్తి చేశారు భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్, అర్షిన్ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది. మరోవైపు.. గ్రూప్-‘ఏ’లో భాగమైన పాకిస్తాన్ మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోటీపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 48 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ చేరడం లాంఛనమే! దీంతో మరోసారి దాయాదులు భారత్- పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. చదవండి: Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్‌లో కింగ్ కోహ్లి ACC Men's U19 Asia Cup | India-U19 vs Nepal-U19 | Highlights. https://t.co/6wE0HM9pDH#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
Ind vs Pak: భారత క్రికెట్ జట్టుకు నిరాశ.. సెమీస్ చేరాలంటే..
India U19 vs Pakistan U19- దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉదయ్ (60; 5 ఫోర్లు), సచిన్ (58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాకిస్తాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలిచింది. అజాన్ అవైస్ (105 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక షాజైబ్ ఖాన్ (63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాద్ బేగ్ (68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కాగా భారత్‌తో పాటు గ్రూప్-ఏలో ఉన్న పాక్ యువ క్రికెట్ జట్టుకు ఇది రెండో విజయం. ఇప్పటికే నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో దేవ్ ఖనాల్ బృందం గెలుపొందింది. సెమీస్ చేరాలంటే భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. ఇక ఈ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ నంబర్ 2 వేదిక కానుంది. మరోవైపు.. పాకిస్తాన్ కూడా మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోరకు సిద్ధమవుతోంది. ACC Men's U19 Asia Cup | India-U19 vs Pakistan-U19 | Highlights. https://t.co/tdlQThbdXQ#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 10, 2023 -
అతడిని భారత క్రికెటర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ సాయి కిషోర్ నేపాల్‌పై టీమిండియా తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆసియాక్రీడలు-2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సాయి కిషోర్‌కు తన సహచర ఆటగాడు, వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అభినందనలు తెలిపాడు. "కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఆ దేవుడు ఖచ్చితంగా అన్ని తిరిగి ఇస్తాడు. తెల్ల బంతితో దేశవాళీ క్రికెట్లో అద్బుతాలు చేసిన ఈ ఆటగాడు.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఉదయం లేచి ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడి పేరు చూడగానే భావోద్వేగానికి లోనయ్యాను. మీరు అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నారు. కానీ అతడు ఎప్పుడూ నా దృష్టిలో నెంబర్1గానే ఉంటాడు. సాయి కిషోర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సత్తా ఉంది. అతడు తన బ్యాటింగ్‌ను కూడా బాగా మెరుగుపరుచుకున్నాడు. అతడు కేవలం టీ20 క్రికెట్‌కు మాత్రమే కాదు అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఆటగాడు. అతడిని ఇండియన్ క్రికెటర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉంది. నీవు మరిన్ని అద్బుతాలు సృష్టించు సాయి" అంటూ ఎక్స్(ట్విటర్)లో దినేష్ కార్తీక్ రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ జాతీయ గీతాలాపన సమయంలో సాయి కిషోర్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. తొలి మ్యాచ్‌లో సాయి కిషోర్ పర్వాలేదనపించాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు God has his ways of giving back to people who work hard This unbelievable player @saik_99 who has DOMINATED domestic cricket with white ball is an absolute superstar and I couldn't be happier for him. Woke up in the morning and when I saw his name in the 11 , i was… https://t.co/6RijBdRP6R — DK (@DineshKarthik) October 3, 2023 -
టీమిండియా స్టార్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి!
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ సాయి కిషోర్ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్‌పై సాయి కిషోర్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో సాయి కిషోర్ తన తొలి మ్యాచ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. జాతీయ గీతం ప్రారంభం కాగానే సాయి కిషోర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సాయి తన తొలి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 23 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్(37 నాటౌట్ ), శివమ్ దుబే(25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్‌దీప్ రెండు, సాయి కిషోర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు Emotions aplenty as Sai Kishore swelled up during the national anthem of 🇮🇳, making his T20I debut today 🆚🇳🇵 Drop a 💙 if you believe hard work always pays off 🙌💯#Cheer4India #TeamIndia #Cricket #HangzhouAsianGames #AsianGames2023 #SonyLIV pic.twitter.com/x9fdZjIGg2 — Sony LIV (@SonyLIV) October 3, 2023 -
23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్‌కు చేరిన టీమిండియా
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. హాంగ్జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్-1లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్‌దీప్ రెండు, సాయి కిషోర్ ఒక్క వికెట్ సాధించారు. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నేపాల్ ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్(37 నాటౌట్ ), శివమ్ దుబే(25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లమిచానే,కామి ఒక్క వికెట్ పడగొట్టారు. -
జైశ్వాల్, రింకూ సింగ్ మెరుపులు.. నేపాల్ బౌలర్లకు చుక్కలు
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌పై భారత జట్టు అదరగొట్టింది. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆఖరిలో రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 15 బంతులు ఎదుర్కొన్న రింకూ రెండు ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ తన స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయయాడు. 23 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా తిలక్ వర్మ(2), అరంగేట్ర ఆటగాడు జితేష్ శర్మ(5) తీవ్ర నిరాశపరిచాడు. ఇక నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లమిచానే,కామి ఒక్క వికెట్ పడగొట్టారు. చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే' -
యశస్వీ జైశ్వాల్ విధ్వంసకర సెంచరీ..
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇది అతడికి తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో జైశ్వాల్‌తో పాటు రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతులు ఎదుర్కొన్న రింకూ రెండు ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే' Indian left-handed batters to score a T20I century: Suresh Raina v SA, 2010 Yashasvi Jaiswal v NEP, today#INDvNEP #AsianGamespic.twitter.com/IKDDDPamHP — Kausthub Gudipati (@kaustats) October 3, 2023 -
సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు!
IND vs NEP Asia Cup 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. మనతో మాట్లాడుతున్న వాళ్లు ఎలాంటి వారో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ విమర్శిస్తున్నారు. నీలాంటి స్టార్లు ఇలాంటి పని చేసే ముందుకు ఒక్కసారైనా ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు. అండగా అభిమానులు అయితే, హిట్‌మ్యాన్ అభిమానులు మాత్రం.. ‘‘యువ ఆటగాడిని ప్రోత్సహించే క్రమంలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించినా తప్పేనా?’’ అని ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఆసియా కప్-2023లో గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా.. సోమవారం నేపాల్‌తో తలపడిన విషయం తెలిసిందే. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, వర్షం ఆటంకం కలిగించిన కారణంగా వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసిన రోహిత్ సేన డీఎల్ఎస్ పద్ధతిలో విజయం సాధించింది. ఊహించని సర్ప్రైజ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మ్యాచ్‌లో నేపాల్.. టీమిండియాతో తలపడటం ఇదే తొలిసారి. ఇలా మొదటిమ్యాచ్లోనే పటిష్ట భారత జట్టుకు సవాల్ విసిరిన పసికూనకు.. టీమిండియా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లి మెడల్స్‌తో సత్కరించారు. ఈ క్రమంలో.. నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి తన జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిగ్గుపడు రోహిత్ ఇది గమనించిన నెటిజన్లు.. ‘‘సిగ్గుపడాలి రోహిత్ శర్మ.. జీవితంలో నువ్వు చేసిన చెత్త పని ఇదే అనుకుంటా! నువ్వసలు మా కెప్టెన్‌వే కాదు’’ అంటూ ట్రోల్ చేశారు. కాగా సందీప్ లమిచానేపై అత్యాచార(మైనర్‌పై) ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో అతడు అరెస్టయ్యాడు కూడా! అయితే, స్థానిక కోర్టు షరతులకు లోబడి బెయిల్‌పై విడుదలైన సందీప్‌పై నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం ఎత్తివేయగా.. స్కాట్లాండ్, నమీబియాలతో ట్రై సిరీస్ నేపథ్యంలో క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో నమీబియా, స్కాట్లాండ్ ఆటగాళ్లు మ్యాచ్ ముగిసిన తర్వాత సందీప్నకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా.. నిరసన వ్యక్తం చేశారు. వాళ్లకు ఉన్న బుద్ధి నీకు లేదు మహిళలపై హింస, లింగవివక్షకు వ్యతిరేకంగా అతడికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయం గురించి సందీప్నకు నేపాల్ క్రికెట్ బోర్డు ముందే చెప్పగా.. అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటిది.. ఇప్పుడు రోహిత్ శర్మ ఏకంగా అతడితో ఫొటోలు దిగడం సహా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం క్రికెట్ అభిమానులకు నచ్చడం లేదు. రోహిత్ లాంటి స్టార్లు ఇలాంటి వ్యక్తులతో సన్నిహితంగా కనబడటం పరోక్షంగా వారిని ప్రోత్సహించినట్లే అవుతుందని మండిపడుతున్నారు. కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. 74 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం Sandeep Lamichhane taking Indian Captain Rohit Sharma's autograph on his shirt. - The Hitman always there for youngsters - The Icon! pic.twitter.com/SOq7LSAgLk — CricketMAN2 (@ImTanujSingh) September 5, 2023 what a shame ... someone tell Rohit about him — Ishaan (@Ishaan_s8) September 5, 2023 Virat refused to shake hands with him but Rohit js shamelessly posing with this rape accussed. Even minnow scottish players are of better standard than Rohit Sharma. Shame. — Avishek Goyal (@AG_knocks) September 5, 2023 -
నేపాల్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన టీమిండియా..
నేపాల్.. ఆసియాకప్ చరిత్రలో తొలిసారి భాగమైంది. ఈ టోర్నీలో నేపాల్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినప్పటికీ తమ అద్బుతమైన ఆటతీరుతో అందరని అకట్టుకుంది. భారత్, పాకిస్తాన్ వంటి అగ్రశేణి జట్లపై నేపాల్ చూపిన పోరాట పటిమ.. మిగితా చిన్న జట్లకు ఆదర్శంగా నిలుస్తుంది. పాకిస్తాన్‌పై బౌలింగ్‌లో సత్తాచాటిన నేపాల్.. భారత్‌పై బ్యాటింగ్‌లో అదరగొట్టింది. షమీ, సిరాజ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లకు నేపాల్ బ్యాటర్లు ఆడిన తీరు ఎంత చెప్పుకున్న తక్కువే. నేపాల్ ఫైటింగ్ స్పిరిట్‌కు భారత జట్టు కూడా ఫిదా అయిపోయింది. మెడల్స్‌తో సత్కరించిన భారత్ కాగా టీమిండియా మరోసారి క్రీడా స్పూర్తిని చాటుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం నేపాల్ డ్సెస్సింగ్ రూమ్‌కు వెళ్లి భారత ఆటగాళ్లు ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా నేపాల్ ఆటగాళ్లను మెడల్స్‌తో సత్కరించారు. ఈ క్రమంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా నేపాల్ ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకున్నారు. భారత్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం నేపాలీలలో ఆత్మస్థైర్యాన్ని నింపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్యాండీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. చదవండి: ODI WC 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. వారిద్దరూ ఔట్ -
కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు
"Stay on Instagram but be here as well": టీమిండియా క్రికెటర్ల ఆట తీరుపై మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. కండలు పెంచి ఫొటోలు షేర్ చేస్తే సరిపోదని.. మైదానంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యమంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఆసియా కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో భారత జట్టు సోమవారం నేపాల్‌తో తలపడిన విషయం తెలిసిందే. మూడు గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్ శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలోనే మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లను దింపినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలతో లైఫ్ పొందిన నేపాల్ ఓపెనర్లు కుశాల్ భుర్తేల్(38), ఆసిఫ్ షేక్(58) మెరుగైన స్కోర్లు సాధించారు. PC: Star Sports ఆరంభంలో వీళ్లిద్దరు ఇచ్చిన మూడు గోల్డెన్ మ్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిస్ చేయడం వల్ల ఈ మేరకు భారత బౌలర్లకు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్.. క్యాచ్ డ్రాప్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పెద్ద పెద్ద కండలు ఉంటే సరిపోదు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..‘‘మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారన్న విషయంతో సంబంధం లేదు. మీకు పెద్ద పెద్ద కండలు ఉండొచ్చు. జిమ్‌లో వర్కౌట్లతో మీరు నిరంతరం శ్రమిస్తూ ఉండవచ్చు. అంతేనా... అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయనూ వచ్చు. అయితే, మైదానంలో మీరు చురుగ్గా కదలలేకపోతే.. ఏం లాభం? ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లు ఇక్కడా ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకోవాలి కదా!’’ అని అయ్యర్, కోహ్లి, ఇషాన్‌లను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. శ్రేయస్ అయ్యర్ కోహ్లికి ఇదేం మొదటిసారి కాదు అదే విధంగా స్టార్ బ్యాటర్, ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేపాల్‌తో మ్యాచ్‌లో కోహ్లి నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. అయినా విరాట్ కోహ్లి క్యాచ్‌లు డ్రాప్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్‌లోనూ ఇలాగే చేశాడు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లలోనూ ఇలాంటి తప్పులే చేశాడు. ఈ విషయంలో నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. వాస్తవం మాట్లాడుతున్నా’’ అంటూ మహ్మద్ కైఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. సూపర్-4లో టీమిండియా ఎంట్రీ కోహ్లి ఫిట్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలుసని, అయితే మైదానంలో కూడా ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందంటూ చురకలు అంటించాడు. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో మెరుగైన ఆట తీరు కనబరిచిన నేపాల్.. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... వర్షం అంతరాయం కలిగిన నేపథ్యంలో డీఎల్ఎస్ పద్ధతిలో విధించిన లక్ష్యాన్ని టీమిండియా 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. తద్వారా పది వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4లో ఎంట్రీ ఇచ్చింది. చదవండి: WC 2023: శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! అనూహ్యంగా వాళ్లిద్దరికి చోటు.. ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత ఆటగాడిగా! సచిన్ రికార్డు బద్దలు
ఆసియాకప్-2023లో టీమిండియా సూపర్-4లో అడుగుపెట్టింది. సోమవారం క్యాండీ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్ తలా మూడు వికెట్లు సాధించగా.. షమీ, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. నేపాల్ బ్యాటర్లలో ఆసిఫ్ షేక్(58) అర్ధ సెంచరీ సాధించగా.. సోంపాల్ కామి(48), కుశాల్ భుర్తేల్(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం వర్షం కారణంగా డకవర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74) శుబ్‌మన్ గిల్(67) ఆజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక భారత్ సూపర్-4 దశకు చేరడంతో సెప్టెంబర్ 10న పాకిస్తాన్‌తో మరోసారి తలపడనుంది. రోహిత్ శర్మ అరుదైన ఘనతలు.. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.ఆసియాకప్ టోర్నీలో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు ఆసియాకప్‌లో 10 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(9) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ తన 250వ సిక్స్ మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్ మూడో స్ధానంలో నిలిచాడు. చదవండి: Asia Cup 2023: నేపాల్ చిత్తు.. సూపర్-4కు భారత్ 5️⃣0️⃣ for @ImRo45! 👏👏 The #TeamIndia skipper has been a sight for sore eyes, marrying elegance & power to bring up a beautiful half century! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvNEP #Cricket pic.twitter.com/Y9T3erXfmh — Star Sports (@StarSportsIndia) September 4, 2023 -
Asia Cup 2023: నేపాల్ చిత్తు.. సూపర్-4కు భారత్
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్... కాస్త నిరాశపర్చింది. రెండో మ్యాచ్‌లో బౌలింగ్ ప్రాక్టీస్... ఇది అంతంత మాత్రమే! నేపాల్ లాంటి జట్టును కుప్పకూల్చలేకపోయిన టీమిండియా బౌలింగ్ వైఫల్యం కనిపించింది... మధ్యలో వాన... అయితే ఎట్టకేలకు సాధికారిక బ్యాటింగ్‌తో ఉత్కంఠ లేకుండా భారత్ మ్యాచ్ ముగించింది. కుదించిన పోరులో అలవోక విజయంతో ‘సూపర్–4’ దశకు ముందంజ వేసింది. పల్లెకెలె: ఆసియా కప్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. సోంపాల్ కామి (48; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కుశాల్ భుర్తేల్ (38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం వాన కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కలిసి అజేయంగా జట్టును గెలిపించారు. ఈ విజయంతో భారత్ ‘సూపర్–4’ దశకు చేరగా, నేపాల్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. కీలక భాగస్వామ్యాలు... భారత ఫీల్డింగ్ వైఫల్యాలను సొమ్ము చేసుకుంటూ నేపాల్‌కు ఓపెనర్లు భుర్తేల్, ఆసిఫ్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగులు భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు పదో ఓవర్లో శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత జడేజా తన బౌలింగ్‌లో 11 పరుగుల వ్యవధిలోనే తర్వాతి 3 వికెట్లు పడగొట్టి నేపాల్‌ను దెబ్బ కొట్టాడు. మరో ఎండ్‌లో ఆసిఫ్ 88 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే ఆసిఫ్‌తో పాటు గుల్షన్ (23)ను సిరాజ్ పెవిలియన్ పంపించడంతో నేపాల్ 144/6 వద్ద నిలిచింది. ఈ దశలో సోంపాల్, దీపేంద్ర సింగ్ (29; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు 50 పరుగులు జత చేయడంతో పరిస్థితి మెరుగైంది. హార్దిక్ ఈ పార్ట్నర్íÙప్ను విడగొట్టినా... చివర్లో చెలరేగి ఆడిన సోంపాల్ నేపాల్ స్కోరును 200 దాటించాడు. ఛేదనలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు రోహిత్, గిల్ తమదైన శైలిలో స్వేచ్ఛగా, అలవోకగా షాట్లు ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించారు. వాన అడ్డు పడుతూ... మ్యాచ్‌లో నాలుగుసార్లు వర్షం ఆటకు అంత రాయం కలిగించింది. నేపాల్ ఇన్నింగ్స్ సమయంలో 30 ఓవర్ల తర్వాత, 34 ఓవర్ల తర్వాత వాన కురిసింది. అయితే ఈ రెండు సందర్భాల్లో పెద్దగా ఇబ్బంది రాలేదు కానీ 37.5 ఓవర్ల తర్వాత కురిసిన వానతో సరిగ్గా గంటసేపు ఆట ఆగిపోయింది. అయినా సరే ఓవర్ల కోత లేకుండా నేపాల్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో 2.1 ఓవర్ల తర్వాత వాన పడింది. సుమారు రెండు గంటలు అంతరాయం కలగడంతో చివరకు భారత్ ఇన్నింగ్స్‌ను కుదించి లక్ష్యాన్ని సవరించారు. ఇదేమి ఫీల్డింగ్? సునాయాస క్యాచ్‌లు వదిలేయడం, మిస్‌ఫీల్డింగ్, రనౌట్ అవకాశాలు చేజార్చడం, ఓవర్‌త్రోలు... ఇవన్నీ సోమవారం భారత ఫీల్డింగ్‌లో కనిపించాయి. మైదానంలో మన ఆటగాళ్లు ఇంత పేలవంగా కనిపించడం ఆశ్చర్యపర్చింది. తొలి 4.2 ఓవర్లు ముగిసేసరికి భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేశారు. షమీ బౌలింగ్‌లో భుర్తేల్ ఇచ్చిన క్యాచ్‌లను శ్రేయస్, కిషన్ వదిలేయగా, సిరాజ్ బౌలింగ్‌లో ఆసిఫ్ క్యాచ్‌ను కోహ్లి వదిలేశాడు. చివర్లో సోంపాల్ క్యాచ్‌నూ కిషన్ అందుకోలేకపోయాడు. స్కోరు వివరాలు నేపాల్ ఇన్నింగ్స్: కుశాల్ భుర్తేల్ (సి) కిషన్ (బి) శార్దుల్ 38; ఆసిఫ్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 58; భీమ్ (బి) జడేజా 7; పౌడేల్ (సి) రోహిత్ (బి) జడేజా 5; కుశాల్ మల్లా (సి) సిరాజ్ (బి) జడేజా 2; గుల్షన్ (సి) కిషన్ (బి) సిరాజ్ 23; దీపేంద్ర సింగ్ (ఎల్బీ) (బి) పాండ్యా 29; సోంపాల్ (సి) కిషన్ (బి) షమీ 48; లమిచానే (రనౌట్) 9; కరణ్ (నాటౌట్) 2; రాజ్‌భన్సీ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1–65, 2–77, 3–93, 4–101, 5–132, 6–144, 7–194, 8–228, 9–229, 10–230. బౌలింగ్: షమీ 7–0–29–1, సిరాజ్ 9.2–1–61–3, పాండ్యా 8–3–34–1, శార్దుల్ 4–0–26–1, జడేజా 10–0–40–3, కుల్దీప్ 10–2–34–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 74; గిల్ (నాటౌట్) 67; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 147. బౌలింగ్: కరణ్ 4–0–26–0, సోంపాల్ 2–0–23–0, రాజ్‌భన్సీ 4–0–24–0, సందీప్ లమిచానే 4–0–39–0, దీపేంద్ర సింగ్ ఐరీ 2–0–12–0, కుశాల్ మల్లా 3–0–11–0, గుల్షన్ 1.1–0–11–0. -
చెత్త ఫీల్డింగ్! క్యాచ్ అంటే ఇలా పట్టాలి.. రోహిత్ శర్మ రియాక్షన్! వీడియో
Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కీలక సమయంలో నేపాల్ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత రోహిత్ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆసియా కప్-2023లో రెండో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు.. పల్లెకెలె వేదికగా సోమవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఆరంభంలో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ సులభమైన క్యాచ్‌లను వదిలేశారు. చెత్త ఫీల్డింగ్ వల్లే.. వాళ్లు రెచ్చిపోయారు దీంతో లైఫ్ పొందిన నేపాల్ ఓపెనర్లు కుశాల్ భుర్తాల్(38), ఆసిఫ్ షేక్(58) మంచి స్కోర్లు సాధించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదం వారి పాలిట వరంగా మారిందనడంలో సందేహం లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఈ మేరకు స్కోర్ చేశారంటే అది మన చెత్త ఫీల్డింగ్ వల్లేనని అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. క్యాచ్ పట్టేసిన రోహిత్ శర్మ నేపాల్ ఇన్నింగ్స్ 20వ ఓవర్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ పౌడేల్ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బ్యాక్‌ఫుట్ షాట్ ఆడబోయి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఈ సింపుల్ క్యాచ్‌ను ఒడిసిపట్టేసిన టీమిండియా సారథి సంబరాల్లో మునిగిపోయాడు. రోహిత్ పట్టిన క్యాచ్.. వీడియో వైరల్ అంతేకాదు.. క్యాచ్ అంటే ఇలా పట్టాలి అన్నట్లుగా సహచర ఆటగాళ్ల వైపు ఓ లుక్కేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇక రోహిత్ శర్మ క్యాచ్‌ను నమ్మలేని... నేపాల్ కెప్టెన్ రోహిత్(5) బిక్కమొఖం వేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. వరుణుడి ఆటంకం కాగా 37.5 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి నేపాల్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, సిరాజ్‌కు రెండు, శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ఇన్నింగ్స్ తర్వాత ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో చెరో పాయింట్ లభించింది. చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా? A remarkable catch by Rohit Sharma has him pumped and energized. #INDvsNEP pic.twitter.com/zLu2klpiY6 — MI Fans Army™ (@MIFansArmy) September 4, 2023 -
3 గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన నేపాల్ ఓపెనర్
Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై అభిమానులు మండిపడుతున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించకతప్పని దుస్థితి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆసియా కప్-2023లో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ముల్తాన్‌లో ఆగష్టు 30న జరిగిన మ్యాచ్‌లో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌కు ఆతిథ్య జట్టు బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ బౌలర్ల ముందు చిత్తు ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 8 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. ఆసిఫ్ షేక్ 5 పరుగులకే వెనుదిరిగాడు. ఇక తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ వచ్చిన నేపాల్ క్రికెటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 26, 28, 13, 3, 6, 0, 7, 0. కానీ టీమిండియా మ్యాచ్‌కు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. టీమిండియా బౌలింగ్‌లో మాత్రం పాక్‌తో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమైన కుశాల్, ఆసిఫ్.. భారత పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇందుకు తోడు టీమిండియా ఫీల్డర్ల వైఫల్యం వారికి కలిసి వస్తోంది. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన కుశాల్ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి సహా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మూడు గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్ చేశారు. ఆసిఫ్, కుశాల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను వదిలేశారు. నేపాల్ ఇన్నింగ్స్ మొదటి, రెండో, ఐదో ఓవర్లో ఈ తప్పిదాలు చేశారు. ఈ క్రమంలో లైఫ్ పొందిన కుశాల్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే, పదో ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుశాల్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టడంలో ఇషాన్ కిషన్ సఫలమయ్యాడు. ఎట్టకేలకు.. శార్దూల్‌కు తొలి వికెట్ దీంతో ఎట్టకేలకు టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. పదో ఓవర్ ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి నేపాల్ 65 పరుగుల మెరుగైన స్కోరు చేసింది. మరోవైపు.. 10 ఓవర్లు ముగిసే సరికి ఆసిఫ్ 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి.. భీమ్ షర్కీతో కలిసి క్రీజులో ఉన్నాడు. కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం విదితమే! చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే.. షమీకి చోటు 3 Dropped Catches 😱 #IndvsNep pic.twitter.com/LQOnqv3yEN — Susanta Sahoo (@ugosus) September 4, 2023 Indian Fielders today 😭#IndvsNeppic.twitter.com/nQEWm5Ybp1 — 🏆 𝕏 3 (@thegoat_msd_) September 4, 2023 -
IND VS NEP: నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం.. సూపర్ 4లో ఎంట్రీ
Asia Cup, 2023 India vs Nepal: ఆసియా వన్డే కప్-2023 టీమిండియా వర్సెస్ నేపాల్ అప్డేట్స్ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో టీమిండియా మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరుకుంది. రోహిత్ శర్మ (74), శుభ్‌మన్ గిల్ (67) పరుగులతో రాణించారు. వర్షం కారణంగా అంపైర్లు DLS పద్ధతిలో 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు అందించారు. ఈ టార్గెట్‌ను రోహిత్-గిల్ జోడీ 20.1 ఓవర్లలో సాధించారు. టీమిండియా టార్గెట్ 145 వర్షం తగ్గిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన టీమిండియా టార్గెట్‌ను 145గా నిర్ధేశించారు. 23 ఓవర్లలో భారత్ ఈ టార్గెట్‌ను ఛేజ్ చేయాల్సి ఉంటుంది. వర్షం అంతరాయం.. ఓవర్లు కుదిస్తే భారత్ టార్గెట్ ఎంతంటే..? 45 ఓవర్లలో 220 40 ఓవర్లలో 207 35 ఓవర్లలో 192 30 ఓవర్లలో 174 20 ఓవర్లలో 130 బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. మళ్లీ మొదలైన వర్షం 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు వరుణుడు మరోసారి స్వాగతం పలికాడు. 2 ఓవర్ల తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. 2.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 17/0గా ఉంది. శుభ్‌మన్ గిల్ (12), రోహిత్ శర్మ (4) క్రీజ్‌లో ఉన్నారు. రాణించిన జడ్డూ, సిరాజ్.. నేపాల్ 230 ఆలౌట్ వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్-నేపాల్ మ్యాచ్‌లో నేపాల్ 230 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ షేక్ (58), సోంపాల్ కామీ (48), కుషాల్ భుర్టెల్ (38), దీపేంద్ర సింగ్ (29), గుల్షన్ ఝా (23) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 47 ఓవర్లలో నేపాల్ స్కోరు: 227/7 ఏడో వికెట్ కోల్పోయిన నేపాల్ 41.1: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ 29(25) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో నేపాల్ ఏడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 194/7 (41.1). సందీప్ లమిచానే, సోంపాల్ కమీ(25) క్రీజులో ఉన్నారు. వర్షం తర్వాత మొదలైన ఆట 40 ఓవర్లలో నేపాల్ స్కోరు: 184-6 భారత్‌తో వర్సెస్ నేపాల్.. మళ్లీ వర్షం మొదలు సమయం సాయంత్రం 05:44: టీమిండియా- నేపాల్ మ్యాచ్‌కు వరణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. స్కోరు: 178/6 (37.5) ఆరో వికెట్ కోల్పోయిన నేపాల్ 31.5: గుల్షన్ ఝా 23(35) రూపంలో నేపాల్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి గుల్షన్ పెవిలియన్ చేరాడు. స్కోరు: 144/6 (31.5) ►మొదలైన ఆట.. చినుకులు తగ్గడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. ►సమయం సాయంత్రం 05:05: చిరుజల్లులు మొదలుకావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. 29.5: హాఫ్ సెంచరీ హీరో అవుట్ నిలకడగా ఆడుతున్న నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్(58(97)ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో నేపాల్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 132/5 27.2: అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఆసిఫ్ షేక్.. స్కోరు: 114/4 (27.3 25 ఓవర్లలో నేపాల్ స్కోరు: 109-4 21.5: నాలుగో వికెట్ కోల్పోయిన నేపాల్ జడేజా బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన కుశాల్ మల్లా 2(5). అసిఫ్ షేక్ 45, గుల్షన్ ఝా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన నేపాల్.. 20 ఓవర్లలో నేపాల్ స్కోరు 19.6: రవీంద్ర జడేజా మరోసారి తన స్పిన్ బౌలింగ్‌తో మాయ చేశాడు. దీంతో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ 5(8) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 20 ఓవర్లలో నేపాల్ స్కోరు: 93-3 18.5: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆసిఫ్ షేక్ అవుటైనట్లు అంపైర్ సిగ్నల్ ఇవ్వగా రివ్యూకు వెళ్లిన నేపాల్‌కు సానుకూలంగా నిర్ణయం వచ్చింది. స్కోరు: 92/2 (19.4) రెండో వికెట్ కోల్పోయిన నేపాల్ 15.6: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నేపాల్ వన్‌డౌన్ బ్యాటర్ భీమ్ షర్కీ 7(17) బౌల్డ్. దీంతో నేపాల్ రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు 77/2 (16). 15 ఓవర్లలో నేపాల్ స్కోరు: 73-1 తొలి వికెట్ కోల్పోయిన నేపాల్ 9.5: ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. పదో ఓవర్ ఐదో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుశాల్ 38(25) [4s-3 6s-2] ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆసిఫ్(23), భీమ్ షార్కీ క్రీజులో ఉన్నారు. దంచికొడుతున్న నేపాల్ ఓపెనర్లు 8.5: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న నేపాల్. కుశాల్ 29, ఆసిఫ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న నేపాల్ ఓపెనర్లు.. స్కోరు: 42-0(8) 5 ఓవర్లు ముగిసే సరికి నేపాల్ స్కోరు: 23/0 టీమిండియా ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు వదిలేస్తున్న క్రమంలో ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 12, ఆసిఫ్ షేక్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన టీమిండియా నేపాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. గత మ్యాచ్‌లో మెరుగైన స్కోరు కోసం మేము పోరాడాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ పాక్‌తో మ్యాచ్‌లో అద్బుతంగా రాణించారు. ఈసారి బౌలర్లకు అవకాశం ఇవ్వాలని భావించాం’’ అని పేర్కొన్నాడు. బుమ్రా లేడు.. షమీ వచ్చాడు నేపాల్‌తో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో.. ‘‘వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. బుమ్రా ఈరోజు అందుబాటులో లేడు. కాబట్టి షమీ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక నేపాల్ సారథి రోహిత్ పౌడేల్ ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షర్కీ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. తుది జట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. నేపాల్ కుశాల్ భుర్తేల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షార్కి, సోంపాల్ కామి, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లమిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షీ. ఓడితే అంతే సంగతి ►గ్రూప్-ఏలో భాగమైన నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ముల్తాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో పటిష్ట టీమిండియాతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇందులో ఓడితే ఇంటిబాట పడుతుంది.