అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయ జట్టుగా కొనసాగుతున్న భారత్.. నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లోనూ చెలరేగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్ (100), సచిన్ దాస్ (116) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ 21, అర్షిన్ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేసి ఔట్ కాగా.. ఈ టోర్నీలో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న చిచ్చరపిడుగు ముషీర్ ఖాన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో గుల్షన్ షా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ చాంద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే యువ భారత్ దర్జాగా సెమీస్‌కు చేరుకుంటుంది.
ఇవాళే జరుగుతున్న మరో రెండు సూపర్ సిక్స్ మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా-శ్రీలంక, ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (71), రీలే నార్టన్ (41 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహిరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు.
విండీస్‌తో జరుగుతున్న మరో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ (108) సెంచరీతో కదంతొక్కాడు. విండీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ 3, థోర్న్ 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment