తొమ్మిది నెలల వ్యవధిలో టీమిండియా అభిమానుల గుండె మూడోసారి కోతకు గురైంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మేజర్ ఈవెంట్ల ఫైనల్స్‌లో టీమిండియా వరుస పరాభవాలను ఎదుర్కొంది. భారత్‌కు ఓటములు ఎదురైన మూడు సందర్భాల్లో ప్రత్యర్ధి ఆస్ట్రేలియానే కావడం విశేషం.
తొలుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా టీమిండియాను చిత్తు చేసింది. ఆతర్వాత గతేడాది చివర్లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో, తాజాగా అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత క్రికెట్ జట్టు ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.
సీనియర్ల బాటలోనే జూనియర్లు..
భారత క్రికెట్ జట్టును వరల్డ్‌కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ సీనియన్ టీమిండియాలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది.
ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment