cricket
-
బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో హరికేన్స్
బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్లోకి హోబర్ట్ హరికేన్స్ ప్రవేశించింది. నిన్న (జనవరి 21) జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కాలెబ్ జువెల్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు), బెన్ మెక్‌డెర్మాట్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. మథ్యూ వేడ్ 7 బంతుల్లో 4, నిఖిల్ చౌదరీ 11 బంతుల్లో 14, క్రిస్ జోర్డన్ 3 బంతుల్లో 2 (నాటౌట్), కెప్టెన్ నాథన్ ఇల్లిస్ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశారు. సిక్సర్స్ బౌలర్లలో జాఫర్ చోహాన్, బెన్ డ్వార్షుయిస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ పెర్రీ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సిక్సర్స్ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సిక్సర్స్‌ను కర్టిస్ ప్యాటర్సన్ (33 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డన్ సిల్క్ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు), లాచ్లన్ షా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే హరికేన్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వీరి ప్రయత్నం వృధా అయ్యింది. రిలే మెరిడిత్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గానన్ 3 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీశాడు. నాథన్ ఇల్లిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటర్లు జోష్ ఫిలిప్ (0), జాక్ ఎడ్వర్డ్ (0), కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ (1) దారుణంగా విఫలమయ్యారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓడినా సిక్సర్స్‌కు మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్‌లో నాకౌట్ విజేతతో తలపడుతుంది. ఇవాళ (జనవరి 22) జరుగబోయే నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో మెగా ఫైనల్ జనవరి 27న జరుగనుంది. ఛాలెంజర్ విజేతతో హరికేన్స్ ఫైనల్లో తలపడుతుంది. -
2032 ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను కొనసాగించాలి..!
లూసానే: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో భేటీ అయ్యారు. త్వరలో లూసానేలోనే ఐఓసీ ఉన్నతస్థాయి అధికారులు పాల్గొనే అసాధారణ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మేటి క్రీడా కమిటీల చీఫ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరున (30వ తేదీ) జరిగే ఈ కీలకమైన సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించే అంశంపై చర్చ జరుగనుంది. దీంతో ఈ చర్చ కంటే ముందుగా జై షా, థామస్ బాచ్లు అ అంశంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోను పోస్ట్ చేసింది. ‘లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ ఈవెంట్ జరగనుంది. అయితే 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. దాంతో తదుపరి విశ్వక్రీడల్లోనూ క్రికెట్ క్రీడను కొనసాగించే విషయంపై ప్రాథమిక దశ సంప్రదింపులు మొదలయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ అంశమై ఐఓసీ చీఫ్ బాచ్‌తో సమావేశమయ్యారు’ అని ఐసీసీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది.The Celebrations of Team India after winning Physical Disabled Champions Trophy 2025. 🇮🇳- A WHOLESOME VIDEO..!!!! 🥹❤️pic.twitter.com/HJ9Ic38RgT— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025భారత దివ్యాంగ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన విషయాన్ని భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఎక్స్ వేదికగా ప్రకటించింది. కృషి, దృఢ సంకల్పం మరియు నైపుణ్యం యొక్క అసాధారణ ప్రదర్శన అంటూ కామెంట్ చేసింది.మెగా టోర్నీలో విక్రాంత్ కేనీ భారత జట్టును ముందుండి నడిపించాడు (కెప్టెన్‌గా). అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్‌కు గర్వకారణమని కేనీ అన్నాడు. ప్లేఆఫ్‌లో ప్రయాణం తమ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపిస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డాడని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి చెందుతుందని అని DCCI విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉటంకించారు.యోగేంద్ర భదోరియా విధ్వంసంఫైనల్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ కొనియాడాడు. తన జట్టు అసాధారణ ప్రదర్శన మరియు సన్నద్ధతను ప్రశంసించాడు. టోర్నీ ఆధ్యాంతం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ఆకాశానికెత్తాడు. విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సవాలును తమ ఆటగాళ్లు అధిగమించారని అన్నాడు. -
ఆ జట్టులో నితీశ్ రెడ్డి లేడు కారణం అదేనా
-
రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్ పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తూఫానీ సరోజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రియా తిరువనంతపురంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌తో బిజీగా ఉందని తూఫానీ పేర్కొన్నారు. రింకూ కూడా త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడని అన్నారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థం జరిగిందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అనంతరం రింకూ, ప్రియా ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. లక్నోలో ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుందని స్పష్టం చేశారు.కాగా, రింకూ సింగ్, ప్రియా సరోజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడయ్యారు. తాజాగా ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ప్రియా తండ్రి వెల్లడించారు. స్నేహితురాలి తండ్రి ద్వారా ప్రియాకు రింకూతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.27 ఏళ్ల రింకూ భారత్ తరఫున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు. వారణాసికి చెందిన ప్రియా పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందింది. ప్రియా తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు. ఇందు కోసం అతను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. -
శతక్కొట్టిన టామ్ బాంటన్.. ముంబై ఇండియన్స్ తరఫున తొలి సెంచరీ
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్‌లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్‌తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. బాంటన్‌కు ముందు ఐఎల్టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్‌లో మూడో సెంచరీ ఇదే సీజన్లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్‌పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా అత్యధికం. 2023 సీజన్లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
స్టార్ క్రికెటర్‌పై అరెస్టు వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. అవామీ లీగ్ ఎంపీగానూ వ్యవహరించిన షకీబ్‌పై చెక్ బౌన్స్‌కు సంబంధించిన కేసులో ఢాకా న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ‘అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జైదుర్ రహమాన్.. షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. మార్చి 24 నాటి ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశించారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా... ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. ఆ సమయంలో జరిగిన గొడవల్లో షకీబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అప్పటి నుంచి షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రాకుండా విదేశాల్లో ఉంటున్నాడు. స్వదేశంలో చివరి టెస్టు ఆడాలని షకీబ్ ఆశించినా... భద్రత ఏర్పాట్ల విషయంలో హామీ లభించకపోవడంతో అతడు వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్ ఎదుర్కొంటున్న షకీబ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాంపియన్స్ ట్రోఫీకి పరిగణించలేదు. -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ చేతులెత్తేసింది. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్ (15-3-50-5), అబ్రార్ అహ్మద్ (11.3-2-27-4), నౌమన్ అలీ (10-1-42-1) చెలరేగడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ను గెలిపించేందుకు అలిక్ అథనాజ్ (55) విఫలయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (12), మికైల్ లూయిస్ (13), టెవిన్ ఇమ్లాచ్ (14), కెవిన్ సింక్లెయిర్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కీసీ కార్తీ 6, జస్టిన్ గ్రీవ్స్ 9, కవెమ్ హాడ్జ్, మోటీ, వార్రికన్ డకౌటయ్యారు.ఏడేసిన వార్రికన్విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రకన్ (18-3-32-7) స్పిన్ మాయాజాలం దెబ్బకు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీయగా.. ఇద్దరు పాక్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. పాక్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (52) టాప్ స్కోరర్ కాగా.. ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.పాక్ స్పిన్నర్ల మాయాజాలంఅంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. బ్రాత్‌వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. మికైల్ లూయిస్ (1), కీసీ కార్తీ (0), కవెమ్ హాడ్జ్ (4), అలిక్ అథనాజ్ (6), జస్టిన్ గ్రీవ్స్ (4), టెవిన్ ఇమ్లాచ్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశారు.రాణించిన షకీల్, రిజ్వాన్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఇదే వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. -
విండీస్ స్పిన్నర్ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే కుప్పకూలింది. విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ ఏడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీశాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు (షాన్ మసూద్, ఖుర్రమ్ షెహజాద్) రనౌట్ అయ్యారు. షాన్ మసూద్ 52, ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని పాక్ విండీస్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో విండీస్ సైతం తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాలంటే మరో 221 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్(12), కీసీ కార్తీ (6) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (11), కవెమ్ హాడ్జ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. సాజిద్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. వీరిద్దరు చివరి వికెట్‌కు 46 పరుగులు జోడించి విండీస్ పరువు కాపాడారు. లేకపోతే విండీస్ 100లోపే ఆలౌటయ్యేది. విండీస్ ఇన్నింగ్స్‌లో వీరితో పాటు బ్రాత్‌వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మికైల్ లూయిస్ 1, కీసీ కార్తీ 0, కవెమ్ హాడ్జ్ 4, అలిక్ అథనాజ్ 6, జస్టిన్ గ్రీవ్స్ 4, టెవిన్ ఇమ్లాచ్ 6 పరుగులు చేశారు. -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
షార్జా స్టేడియంలో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
BCCI: ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
-
భారత ఆటగాళ్లు.. బహుపరాక్.. ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించేందుకు బీసీసీఐ 10 పాయింట్ల మార్గదర్శకాలను రూపొందించింది. భారత ఆటగాళ్లు కింద పేర్కొన్న గైడ్‌లైన్స్‌ను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలికాలంలో భారత జట్టు వరుస వైఫల్యాలకు క్రమశిక్షణ లేమి కారణమని భావిస్తున్న బీసీసీఐ ఈ కఠిన మార్గదర్శకాలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.బీసీసీఐ ప్రవేశపెట్టిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలు..దేశవాలీ క్రికెట్ ఆడటం తప్పనిసరిజాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలంటే ఇకపై ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి. ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే కూడా దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి.కుటుంబాలతో వేరుగా ప్రయాణం చేయడం నిషేధంమ్యాచ్లు జరిగే సమయంలో లేదా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి వేరుగా ప్రయాణాలు చేయడం నిషేధం. మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లు వేరుగా కుటుంబాలతో కలిసి ప్రయాణించడం జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని బీసీసీఐ భావిస్తుంది.అధిక లగేజీ భారాన్ని ఆటగాళ్లే మోయాల్సి ఉంటుందిఆటగాళ్లు పరిమితికి మించి లగేజీని క్యారీ చేస్తే సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది.వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణాలు ఆపండివిదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ళు వంటవారు, హెయిర్ డ్రెస్సర్లు, స్టైలిస్టులు, సెక్యూరిటీ గార్డులతో ప్రయాణించడాన్ని నిషేధించాలని బీసీసీఐ నిర్ణయించింది.అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలిబీసీసీఐ అధికారిక కార్యక్రమాలకు (షూటింగ్‌లు, ప్రమోషన్స్, ఫంక్షన్లు) ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి.టూర్ ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలిఆటగాళ్లు టూర్ లేదా సిరీస్ అధికారికంగా ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలి. మ్యాచ్ తొందరగా ముగిసినా జట్టును వీడ కూడదు.ప్రాక్టీస్ తర్వాత ప్రయాణంషెడ్యూల్ ప్రాక్టీస్ పూర్తయ్యే వరకు ప్లేయర్లందరూ కలిసి ఉండాలి. ప్లేయర్లు ప్రాక్టీస్ అనంతరం కలిసి ప్రయాణించాలి.ఎండార్స్మెంట్లపై నిబంధనలుపర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూట్లు లేదా ఎండార్స్మెంట్లకు అనుమతి లేదు. ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఇది నిర్దేశించబడింది.కుటుంబ సభ్యుల అనుమతి45 రోజుల కంటే ఎక్కువ గల విదేశీ పర్యటనల్లో మాత్రమే ప్లేయర్ల కుటుంబ సభ్యులకు రెండు వారాల అనుమతి ఉంటుంది.ఈ కొత్త పాలసీ ప్రకారం జట్టు సభ్యులందరూ క్రమశిక్షణతో ఉంటూ, జట్టు కోసం కట్టుబడి పనిచేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
మహిళల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 14వ తేదీన మొదలవుతుంది. వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) నగరాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడా వేదికగా ఫిబ్రవరి 14న జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. మార్చి 15న ముంబైలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. గుజరాత్, బెంగళూరు జట్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. తదుపరి డబ్ల్యూపీఎల్ గడిచిన రెండు సీజన్ల (2023, 2024) తరహాలో రెండు వేదికలపై కాకుండా నాలుగు వేదికల్లో జరుగనుంది. ఓపెనింగ్ లెగ్ మ్యాచ్‌లకు కొటాంబి స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. రెండో వారం మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు షిఫ్ట్ అవుతాయి. అనంతరం నాలుగు లీగ్ మ్యాచ్‌లు లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుండగా.. ఎలిమినేటర్ (మార్చి 13), ఫైనల్ మ్యాచ్‌లు (మార్చి 15) సహా నాలుగు మ్యాచ్‌లకు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మహిళల ఐపీఎల్-2025 పూర్తి షెడ్యూల్..వడోదర లెగ్:14 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్16 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ 17 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్19 ఫిబ్రవరి 2025 యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్బెంగళూరు లెగ్:21 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ 22 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ 23 ఫిబ్రవరి 2025 బ్రేక్24 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్ 25 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్26 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్27 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ 28 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్1 మార్చి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ 2 మార్చి 2025 బ్రేక్లక్నో లెగ్:3 మార్చి 2025 యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్4 మార్చి 2025 బ్రేక్5 మార్చి 2025 బ్రేక్6 మార్చి 2025 యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స7 మార్చి 2025 గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్8 మార్చి 2025 యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు9 మార్చి 2025 బ్రేక్ముంబై లెగ్:10 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ 11 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు12 మార్చి 2025 బ్రేక్13 మార్చి 2025 ఎలిమినేటర్14 మార్చి 2025 బ్రేక్15 మార్చి 2025 ఫైనల్ -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో మరో వ్యక్తి కొత్తగా చేరాడు. సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ సితాన్షు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టి20 సిరీస్ నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. 52 ఏళ్ల సితాన్షు 2019 నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. భారత ‘ఎ’ జట్టు పర్యటనల్లో పలు మార్లు కోచ్‌గా పని చేసిన సితాన్షు... సీనియర్ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లిన సిరీస్‌లలో అతనికి అసిస్టెంట్‌గా కూడా వ్యవహరించాడు. సితాన్షు లెవల్–3 క్వాలిఫైడ్ కోచ్ కూడా. తాజా ఎంపికతో భారత టీమ్‌లో అసిస్టెంట్ కోచ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా ...మోర్నీ మోర్కెల్ (బౌలింగ్), టి.దిలీప్ (ఫీల్డింగ్)లతో పాటు అభిషేక్క్ నాయర్, టెన్ డస్కటేలకు కూడా ఇప్పటికే అసిస్టెంట్ కోచ్ హోదా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని బీసీసీఐ తాజా సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. దాంతో మన బ్యాటర్లను సాంకేతికంగా మరింత మెరుగుపర్చే క్రమంలో భాగంగానే కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దశాబ్ద కాలానికి పైగా సాగిన దేశవాళీ కెరీర్లో సౌరాష్ట్ర టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన సితాన్షు 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 41.76 సగటుతో 8061 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 89 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు కూడా ఆడిన సితాన్షు 42.23 సగటుతో 3083 పరుగులు సాధించాడు. -
ఆర్సీబీలోకి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఛార్లీ డీన్ మహిళల ఆర్సీబీ జట్టుకు ఎంపికైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ గాయపడటంతో ఆమె స్థానంలో ఛార్లీ డీన్ ఆర్సీబీలోకి వచ్చింది. డీన్‌ను ఆర్సీబీ 30 లక్షలకు సొంతం చేసుకుంది. మోకాలి గాయం కారణంగా మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ తదుపరి ఎడిషన్‌కు (2025) దూరం కానుందని ఆర్సీబీ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.మోలినెక్స్: లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మోలినెక్స్ ఆసీస్ తరఫున 3 టెస్ట్‌లు, 13 వన్డేలు, 28 టీ20లు ఆడింది. మోలినెక్స్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 71 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 23, టీ20ల్లో 41 వికెట్లు) తీసింది.ఛార్లీ డీన్: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన డీన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 39 వన్డేలు, 36 టీ20లు ఆడింది. ఇందులో మొత్తంగా 122 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 69, టీ20ల్లో 46 వికెట్లు) తీసింది.కాగా, మహిళల ఐపీఎల్ ఇప్పటివరకు రెండు ఎడిషన్ల పాటు విజయవంతంగా సాగింది. తొలి ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు జరుగనుంది. 2025 డబ్ల్యూపీఎల్ మొత్తం నాలుగు వేదికల్లో జరుగనుంది. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరాలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తదుపరి సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.డబ్ల్యూపీఎల్-2025లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు..ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగెజ్, మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, స్నేహ దీప్తి, తనియా భాటియా, సారా బ్రైస్, నందిని కశ్యప్, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, మారిజన్ కాప్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, నికీ ప్రసాద్, నల్లపురెడ్డి చరణి, టిటాస్ సాధుగుజరాత్ జెయింట్స్: భారతి ఫుల్మలి, లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రన్ షేక్, బెత్ మూనీ, ఆష్లే గార్డ్నర్, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, సయాలి సత్గరే, తనూజా కన్వర్, డేనియల్ గిబ్సన్, డియండ్రా డొట్టిన్, కష్వీ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా, కమలిని, అమన్‌దీప్ కౌర్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, కీర్తన బాలకృష్ణన్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సజనా, అక్షిత మహేశ్వరి, సంస్కృతి గుప్త, నదినే డి క్లెర్క్, సైకా ఇషాఖీ, షబ్నిమ్ ఇస్మాయిల్ఆర్సీబీ: డేనియల్ వ్యాట్ హాడ్జ్, సబ్బినేని మేఘన, స్మృతి మంధన, రిచా ఘోష్, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, సోఫీ డివైన్, జోషిత, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, రేణుకా సింగ్, జాగ్రవి పవార్, ఛార్లీ డీన్యూపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, వృందా దినేశ్, ఆరూషి గోయల్, అలైసా హీలీ, చమారీ ఆటపట్టు, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, గౌహెర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అలానా కింగ్ -
ఈ పాపమంతా భార్యలదేనంట..!
-
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్‌ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్‌లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..87(50) vs హోబర్ట్ హరికేన్స్1(8) vs మెల్బోర్న్ స్టార్స్2(9) vs పెర్త్ స్కార్చర్స్49(36) vs మెల్బోర్న్ స్టార్స్21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్2(4) vs సిడ్నీ థండర్30(22) vs పెర్త్ స్కార్చర్స్3(6) vs హోబర్ట్ హరికేన్స్ -
పాక్ యువ పేసర్ సంచలన నిర్ణయం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఇహసానుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌కు (PSL) గుడ్‌బై చెప్పాడు. నిన్న జరిగిన పీఎస్ఎల్-10 డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో చిర్రెత్తిపోయిన ఇహసానుల్లా ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడనని శపథం చేశాడు. వాస్తవానికి ఇహసానుల్లా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా ఇహసానుల్లాపై ఫ్రాంచైజీలు ఆనాసక్తిని ప్రదర్శించాయి. ఇహసానుల్లా గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇహసానుల్లాకు పేస్ కింగ్‌గా పేరుంది. పీఎస్ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఇహసానుల్లా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను కోపంలో ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే పీఎస్ఎల్ ఫ్రాంచైజీలపై అసహనం వ్యక్తిం చేశాడు. నెలన్నర రోజుల్లో పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు తానేంటో తెలిసొచ్చేలా చేస్తానని అన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడి సత్తా చాటుతానని తెలిపాడు. పీఎస్ఎల్లో కాకుండా దేశవాలీ క్రికెట్లో బాగా పెర్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జట్టుకు ఎంపికవుతానని అన్నాడు.కాగా, నిన్న జరిగిన పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. డ్రాఫ్ట్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రస్సీ వాన్ డర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. పీఎస్ఎల్ 2025లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఒకే ఫ్రాంచైజీకి ఆడనున్నారు. వీరిద్దరిని కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది. వార్నర్, కేన్ ద్వయం గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్లు..కరాచీ కింగ్స్- డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేమ్స్ విన్స్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, మొహమ్మద్ నబీ, లిటన్ దాస్లాహోర్ ఖలందర్స్- కుసాల్ పెరీరా, డారిల్ మిచెల్, సికందర రజా, సామ్ కర్రన్, రిషద్ హొసేన్, డేవిడ్ వీస్, సామ్ బిల్లింగ్స్ముల్తాన్ సుల్తాన్స్- మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, గుడకేశ్ మోటీ, జాన్సన్ ఛార్లెస్, షాయ్ హోప్, జాషువ లిటిల్, క్రిస్ జోర్డన్ఇస్లామాబాద్ యునైటెడ్- మాథ్యూ షార్ట్, ఆండ్రియస్ గౌస్, బెన్ డ్వార్షుయిష్, రిలే మెరిడిత్, జేసన్ హోల్డర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కొలిన్ మున్రోక్వాట్టా గ్లాడియేటర్స్- ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, అకీల్ హొసేన్, రిలీ రొస్సో, మార్క్ చాప్మన్, సీన్ అబాట్, కుసాల్ మెండిస్పెషావర్ జల్మీ- బ్రైయాంట్, కొర్బిన్ బాష్, అల్జరీ జోసఫ్, ఇబ్రహీం జద్రాన్, నహిద్ రాణా, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ -
టీ20ల్లో అరుదైన ప్రదర్శన.. రికార్డుల వెల్లువ
టీ20ల్లో అరుదైన ప్రదర్శన నమోదైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు (తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్) సెంచరీలు చేశారు. టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది తొమ్మిదో సారి.టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేసిన సందర్భాలు..కెవిన్ ఓ'బ్రియన్ & హమీష్ మార్షల్ vs మిడిల్సెక్స్, ఉక్స్బ్రిడ్జ్, 2011విరాట్ కోహ్లీ & ఎబి డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016అలెక్స్ హేల్స్ & రిలీ రోసౌ vs చిట్టగాంగ్ వైకింగ్స్, చట్టోగ్రామ్, 2019డేవిడ్ వార్నర్ & జానీ బెయిర్‌స్టో vs ఆర్సిబి, హైదరాబాద్, 2019సబావూన్ డేవిజి & డిలాన్ స్టెయిన్ vs బల్గేరియా, మార్సా, 2022లాచ్లాన్ యమమోటో-లేక్ & కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ vs చైనా, మోంగ్ కోక్, 2024శుభ్‌మన్ గిల్ & బి సాయి సుదర్శన్ vs CSK, అహ్మదాబాద్, 2024సంజు సామ్సన్ & తిలక్ వర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2024తాంజిద్ హసన్ తమీమ్ & లిట్టన్ దాస్ vs దర్బార్ రాజ్షాహి, సిల్హెట్, 2025మ్యాచ్ విషయానికొస్తే.. దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ చేసింది. తంజిద్ హసన్ (64 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), లిటన్ దాస్ (55 బంతుల్లో 125 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఢాకా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 254 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్ 44 బంతుల్లో శతక్కొట్టాడు. బీపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టులో లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. తనను జట్టు నుంచి తప్పించిన రోజే దాస్ సెంచరీతో కదంతొక్కడం విశేషం.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు జపాన్ ఆటగాళ్లు యమమోటో, కడోవాకీ పేరిట ఉంది. ఈ జోడీ 2024లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 258 పరుగులు జోడించింది. ఢాకా క్యాపిటల్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దర్బార్ రాజ్‌షాహీ చేతులెత్తేసింది. ఆ జట్టు 15.2 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఢాకా క్యాపిటల్స్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే భారీ విజయం. ఈ సీజన్లో ఢాకా క్యాపిటల్స్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు ఢాకా క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. -
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఈ టోర్నీ కోసం ఎంపికయ్యారు. ఈ జట్టులో టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్దర్ లాంటి కొత్త ముఖాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇదే తొలి 50 ఓవర్ల ఐసీసీ టోర్నీ.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 21న ఆడనుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ప్రొటీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 25న రావల్పిండిలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తదనంతరం మార్చి 1న కరాచీలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.కాగా, సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. సౌతాఫ్రికా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో చేసిన ప్రదర్శనలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రిపీట్ చేయాలని భావిస్తుంది. సౌతాఫ్రికాకు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనుభవం కూడా ఉంది. ఈ జట్టు 1998 ఇనాగురల్ ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పాక్‌ను మట్టికరిపించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ అనంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించింది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హష్మతుల్లా షాహిదీ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో షాహిదీకి డిప్యూటీగా రహమత్ షా వ్యవహరించనున్నాడు. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ గాయం కారణంగా గతేడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్.. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సెడిఖుల్లా అటల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కాదని ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు కావాల్సినంత ఫిట్నెస్ లేకపోడంతో ముజీబ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ముజీబ్‌ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావాలని అతని డాక్టర్లు సలహా ఇచ్చారట. ముజీబ్ 2023 వన్డే వరల్డ్‌కప్ చివరిసారి ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డే ఆడాడు.2023 వరల్డ్ కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికయ్యారు. ముజీబ్, నవీన్ ఉల్ హక్, రియాజ్ హసన్, అబ్దుల్ రెహ్మాన్, నజీబుల్లా జద్రాన్ లాంటి సీనియర్లకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత రెండు ఐసీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆఫ్ఘన్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వీటిలో పాటు ఆఫ్ఘన్లు గతేడాది వన్డేల్లో సౌతాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించారు. అదే ఊపుతో ఆఫ్ఘన్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సంచలనాలు సృష్టించాలని ఆశిస్తున్నారు.మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 21న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు సౌతాఫ్రికాను ఢీకొంటారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ దశలో ఇంగ్లండ్ (ఫిబ్రవరి 26న లాహోర్‌లో), ఆస్ట్రేలియాతో (ఫిబ్రవరి 28న లాహోర్‌లో) తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ఎఎమ్ గజన్హర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్‌కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య పాకిస్తాన్‌తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే అత్యధిక వయస్కులు వీరే..!
ఐపీఎల్-2025లో పాల్గొనే అత్యధిక వయస్కుల వివరాలను ఈ ఐటంలో చూద్దాం. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనబోయే అత్యధిక వయస్కుడిగా ధోని రికార్డు సృష్టించాడు. ధోని 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 ఆడతాడు. ధోనిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకుంది. సీఎస్కేకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన ధోని ఈసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే రెండో అత్యధిక వయస్కుడు ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ 40 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్ 2025 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. మెగా వేలంలో డీసీ డుప్లెసిస్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్ ఐపీఎల్లో 145 మ్యాచ్‌లు ఆడి 4571 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో మూడో అత్యధిక వయస్కుడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ 38 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడతాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యష్‌ను 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. అశ్విన్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు.ఐపీఎల్-2025 నాలుగో అత్యధిక వయస్కుడు రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్ 37 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్‌కు ఆడతాడు. ముంబై ఇండియన్స్ 16.3 కోట్లకు రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ తదుపరి సీజన్లో సాధారణ ఆటగాడిగా బరిలో ఉంటాడు. రోహిత్ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 6628 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనే ఐదో అత్యధిక వయస్కుడు మొయిన్ అలీ. మొయిన్ అలీ 37 ఏళ్ల వయసులో (రోహిత్ కంటే చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. మెగా వేలంలో కేకేఆర్ మొయిన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. మొయిన్ తన ఐపీఎల్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఆరో అత్యధిక వయస్కుడు కర్ణ్ శర్మ. కర్ణ శర్మ 37 ఏళ్ల (రోహిత్, మొయిన్ కంటే రోజుల్లో చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ ఐపీఎల్లో 84 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఏడో అత్యధిక వయస్కుడు ఆండ్రీ రసెల్. రసెల్ 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు రసెల్‌ను కేకేఆర్ రీటైన్ చేసుకుంది. రసెల్ ఐపీఎల్లో 126 మ్యాచ్‌లు ఆడి 2484 పరుగులు చేసి 115 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఎనిమిదో అత్యధిక వయస్కుడు సునీల్ నరైన్. నరైన్ 36 ఏళ్ల వయసులో (రసెల్ కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు కేకేఆర్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది. నరైన్ ఐపీఎల్లో 1534 పరుగులు చేసి 180 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే తొమ్మిదో అత్యధిక వయస్కుడు అజింక్య రహానే. రహానే 36 ఏళ్ల (రసెల్, నరైన్ కంటే రోజుల్లో చిన్నవాడు) వయసులో క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నాడు. రహానేను మెగా వేలంలో కేకేఆర్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. రహానే తన ఐపీఎల్ కెరీర్లో 185 మ్యాచ్‌లు ఆడి 30.14 సగటున 4642 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే పదో అత్యధిక వయస్కుడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ 36 ఏళ్ల వయసులో (రసెల్, నరైన్, రహానే కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. ఇషాంత్‌ను 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇషాంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇషాంత్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. -
డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఆడుతున్న ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే.. హరికేన్స్‌తో మ్యాచ్‌లో సిడ్నీ థండర్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను రిలే మెరిడిత్ బౌలింగ్ చేశాడు. వార్నర్ స్ట్రయిక్‌లో ఉన్నాడు. తొలి బంతిని మెరిడిత్ డ్రైవ్ చేసే విధంగా ఆఫ్ స్టంప్ ఆవల బౌల్ చేశాడు. ఈ బాల్‌ను వార్నర్ మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేశాడు. అయితే వార్నర్‌కు ఊహించిన ఫలితం రాలేదు. బౌలర్ స్పీడ్ ధాటికో ఏమో కాని డ్రైవ్ షాట్ ఆడగానే వార్నర్ బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. క్రికెట్లో ఇలా జరగడం సాధారణమే. ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. బ్యాట్ విరగగానే రెండో భాగం కాస్త వార్నర్ తల వెనుక భాగాన్ని తాకింది. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించినందుకు గాను వార్నర్‌కు ఏమీ కాలేదు. ఇలా జరగ్గానే వార్నర్ గట్టి అరిచాడు. కామెంటేటర్లు సరదాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలలో వైరలవుతుంది.David Warner's bat broke and he's hit himself in the head with it 🤣#BBL14 pic.twitter.com/6g4lp47CSu— KFC Big Bash League (@BBL) January 10, 2025మ్యాచ్ విషయానికొస్తే.. కొత్త బ్యాట్ తీసుకున్న తర్వాత వార్నర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా ఆడిన వార్నర్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. వార్నర్ అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వార్నర్ 66 బంతుల్లో 7 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు. థండర్ ఇన్నింగ్స్‌ను వార్నర్ ఒక్కడే నడిపించాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. సామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 28; 4 ఫోర్లు), ఒలివర్ డేవిస్ (17 బంతుల్లో 17; ఫోర్) కాసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. థండర్ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. భారీగా బిల్డప్ ఇచ్చిన సామ్ కొన్‌స్టాస్ 9 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మాథ్యూ గిల్కెస్ 7 బంతుల్లో 9, క్రిస్ గ్రీన్ 7 బంతుల్లో 8 పరుగులు చేశారు. అసిస్టెంట్ కోచ్ కమ్ ప్లేయర్ అయిన డేనియల్ క్రిస్టియన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాన్లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ దక్కించుకున్నారు.భీకర ఫామ్‌లో వార్నర్ఈ సీజన్లో సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో వార్నర్ స్కోర్లు..7 (5)17 (10)19 (15)86 నాటౌట్ (57)49 (33)50 (36)88 నాటౌట్ (66)టాప్‌లో థండర్ప్రస్తుత బీబీఎల్ సీజన్లో సిడ్నీ థండర్ అద్భుత విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు (9 పాయింట్లు) సాధించింది. రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. పాయింట్ల పట్టికలో థండర్ తర్వాతి స్థానాల్లో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు), హోబర్ట్ హరికేన్స్ (9), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్బోర్న్ రెనెగేడ్స్ (6), మెల్బోర్న్ స్టార్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4) ఉన్నాయి.