
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్న వారితో ఆయన ప్రేమలో పడినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే, వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరిలాంటిదని చెప్పేశాడు. అయితే, ఇప్పుడు హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మ (Mahira Sharma)తో సిరాజ్ డేటింగ్‌లో ఉన్నాడంటూ బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది.
కొద్దిరోజుల క్రితం మహిరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌కు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మహిరా శర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చింది. ' సిరాజ్‌తో నేను డేటింగ్‌లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. సోషల్‌మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అభిమానుల పేరుతో చాలామంది మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. చిత్ర పరిశ్రమలో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మేము కొన్ని ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి మా ఫోటోలను వారు ఎడిట్‌లు కూడా చేస్తారు. కానీ వీటన్నింటికీ నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. కానీ, ఇలాంటి రూమర్స్ ఎవరు చేసినా తప్పేనని చెబుతాను.' అని ఆమె చెప్పింది.

సిరాజ్‌తో డేటింగ్ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మద్దొని ఆమె కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిని ఖండించారు. నా కూతురు గురించి మీడియా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బయట వాళ్లు ఎన్నో అంటారు.. అవన్నీ నిజాలు అయిపోతాయా..? నా కూతురు ఒక సెలబ్రిటీ కాబట్టే ఇలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొందరు అభిమానులే ఇలాంటి పనిచేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు.' అని సానియా శర్మ చెప్పారు.
హిందీ టీవీ సీరియల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు మహిరా శర్మ దగ్గరైంది. అలా బిగ్‌బాస్ 13లో అవకాశం రావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్‌సిరీసుల్లోనూ ఛాన్సులు దక్కించుకుని మరింత పాపులర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బిగ్‌బాస్ సమయంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని పరాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ, కొద్దిరోజుల్లోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కూడా ఆయన పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment