Bigg boss reality show
-
అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ..
బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).. ఇటీవలే హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడింది. ఈ విషయాన్ని శిల్ప శిరోద్కర్ స్వయంగా వెల్లడించింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నమ్రతతో గొడవైందని.. రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్‌లో నమ్రత రావాలని కోరుకుంది.పట్టించుకోలేదా?కానీ నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్‌బాస్‌కు వెళ్లింది. ఇకపోతే శిల్పకు సపోర్ట్‌గా ఆమె అక్కాబావ నమ్రత- మహేశ్‌బాబు తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. షో నుంచి వచ్చిన వెంటనే శిల్ప ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. నమ్రత ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. తను కచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని చెప్పను. ఇలాంటివి మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. తను నాకు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా తనేంటో నాకు తెలుసు.. నేనేంటో తనకు తెలుసు అని చెప్పింది.బర్త్‌డే విషెస్తాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్‌డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మహేశ్- నమ్రత దంపతులు.. శిల్పకు సపోర్ట్‌గా లేరు, పట్టించుకోవట్లేదన్న రూమర్లకు ఈ పోస్ట్‌తో చెక్ పడినట్లైంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..! -
‘సల్మాన్ అవమానించాడు’.. స్పందించిన అక్షయ్ కుమార్
'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్ ఖాన్ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్మెంట్ల కారణంగానే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా వార్కి పుల్‌స్టాఫ్ పెట్టేశాడు.అసలేం జరిగింది?గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలేకి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆలస్యంగా సెట్‌కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్లోనే వేచి చూసిన అక్షయ్.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్ సెట్‌కి వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్‌ను సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్‌బాస్ నిర్వాహకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.వాస్తవం ఎంటంటే..?సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకున్న కమిట్మెంట్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్ సెట్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్‌కు టైమ్ కావడంతో ఫినాలే షూట్ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్‌తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్‌బాస్ సెట్లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్ అన్నారు.బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్ విన్నర్((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్ వీర్ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్ 6లో చోటు సంపాదించుకున్నారు. -
Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్‌బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్‌గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్‌కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.సినిమాల నుంచి సీరియల్స్దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్‌లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులుఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)2023లో ఎంగేజ్మెంట్ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్‌న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్‌ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.ఎవరీ కార్తీక్?కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్! -
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్‌లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‌తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్‌కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్‌ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చాహత్ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్‌బాస్ టీమ్‌కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్‌పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్‌బాస్ టీమ్‌నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో భార్య ఎంట్రీ.. రొమాన్స్ వీడియో వైరల్
బాలీవుడ్లో బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. జనవరి 19న ఫైనల్ కూడా జరగనుంది. ఈ క్రమంలో అన్ని సీజన్స్ మాదిరే అక్కడ కూడా ఫ్యామిలీ వీక్ ఇప్పుడు జరుగుతుంది. టైటిల్ రేసులో ఉన్న వివియన్ డిసేనా అనే కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా తన సతీమణి వహ్బిజ్ దొరాబ్జీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తన సతీమణితో ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.వివియన్ డిసేనా బాలీవుడ్ సీరియల్స్లలో ఆయనకు చాలా పాపులారిటీ ఉంది. పలు రియాలిటీ షోలలో కూడా సత్తా చాటాడు. ఇప్పుడు కూడా బిగ్‌బాస్ 18 టైటిల్ రేసులో ఉన్నాడు. అయితే, ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చాలా రోజుల తర్వాత తనను కలవడానికి వచ్చిన భార్యతో ఆయన రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దానిని చూసిన నెటిజన్లు వివియన్‌ను ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో అన్ని కెమెరాల ముందు వివియన్, నూరాన్ ఇద్దరూ బెడ్‌పై చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలను టెలికాస్ట్ చేశారు. వివియన్ సతీమణి నూరాన్ కూడా పలు సీరియల్స్లలో నటించింది. ఆమె మోడల్‌గా కూడా రానించింది.పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న ఇలాంటి షోలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో బిగ్‌బాస్ నిర్వాహుకుల మీద కూడా వారు ఫైర్ అవుతున్నారు. హిందీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలాంటివి కొత్త కాదు. గత సీజన్స్లలో కూడా ఇలాంటి సీనే వైరల్ అయింది. హౌస్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటిమేట్ సీన్ అంటూ ట్రెండ్ అయింది. దీంతో షో నిర్వాహకులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అదంతా ఫేక్ అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, తాజాగా బిగ్ బాస్ 18 నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో మాత్రం నిజమైనదేనని చెప్పవచ్చు. -
బిగ్‌బాస్ షోకి వెళ్లనున్న రామ్‌చరణ్!
హీరో రామ్‌చరణ్ (Ram Charan) మరోసారి బిగ్‌బాస్ షోకి వెళ్లనున్నాడు. మొన్న తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer Movie) చిత్ర ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లనున్నాడట! వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో చరణ్ స్టేజీపై కనిపించనున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది.గేమ్ ఛేంజర్ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వారికి హైప్ ఎక్కించడం కోసం చరణ్ బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హోస్ట్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ముచ్చటించి తన సినిమా ట్రైలర్‌ను చూపించనున్నారట! కాగా సల్మాన్- చరణ్ మధ్య ఇదివరకే స్నేహం ఉంది. (చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఏంటమ్మా పాటలో చరణ్, వెంకటేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. సల్లూభాయ్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చరణ్ ఇంటికి పిలిచి ఆతిథ్యమిస్తుంటాడు. అటు చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ తనను ఇంటికి ఆహ్వానిస్తుంటాడు. వీరిద్దరి కలయిక కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అంజలి కీలక పాత్ర పోషించింది. ఎస్జే సూర్య విలన్‌గా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.చదవండి: 'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి -
రెండుసార్లు నటికి గర్భస్రావం.. ఆ భయంతోనే చెప్పట్లేదా?
మెరీనా అబ్రహం (Marina Abraham Sahni).. అమెరికా అమ్మాయి సీరియల్‌తో అందర్నీ ఇట్టే కట్టిపడేసింది. బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ (Bigg Boss Reality Show)లో భర్త రోహిత్ సాహ్నితో కలిసి పాల్గొంది. వీరిద్దరూ కలిసి సొంతంగా ఓ ఫోటోస్టూడియో కూడా నెలకొల్పారు. ఇకపోతే కొంతకాలంగా యాక్టింగ్‌కు దూరంగా ఉంటోంది మెరీనా. ఈ మధ్య కాస్త బొద్దుగా అవడంతో తను ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ మొదలయ్యాయి. దీనికి మెరీనా.. యూట్యూబ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. 2021లో ప్రెగ్నెంట్లావయ్యానంటే దానికి చాలా కారణాలుంటాయి. మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను. 2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మొదటి స్కానింగ్‌లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్‌బీట్ వస్తుందేమోనని ఎదురుచూశాం. మూడునెలలవరకు తీయించుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో దాన్ని తీసేయించుకోవాల్సి వచ్చింది. 2022లో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు హార్ట్‌బీట్ వచ్చింది. అందుకే..ఒత్తిడి వల్లో.. నా శరీరం వీక్‌గా ఉందనో కానీ గర్భస్రావమైంది. అప్పుడు నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చింది. తినకపోయినా లావైపోయాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నేను ప్రెగ్నెంటా? కాదా? అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటవేసింది. కానీ తన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మెరీనా ప్రెగ్నెంట్ అని సులువుగా తెలిసిపోయిందంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) చదవండి: కీర్తికి వింత అనుభవం.. దోస అని పిలవడంతో.. -
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్‌బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పృథ్వీ, నిఖిల్‌తో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్ చేస్తే షో నుంచి ఎలిమినేట్ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్ చేసేయాలనుకుంది.నిఖిల్‌కు ఆహ్వానం.. కానీ!అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్ నిఖిల్‌నే నామినేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సోనియా రిసెప్షన్‌కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు. పుష్ప లెవల్లో ఎంట్రీఈమేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్‌బాస్ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ -
మొన్నటిదాకా సినిమాలతో బిజీ.. ఇప్పుడు కొత్తగా వ్యాపారంలోకి!
బిగ్‌బాస్ షోలో పాల్గొనేవారికి క్రేజ్, పాపులారిటీ వస్తుంది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇకపోతే బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న సోహైల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనకు వచ్చిన క్రేజ్ చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. వరుస ఆఫర్లు వస్తుండటంతో సంతోషంగా ఓకే చేసేశాడు. ఒకేసారి మూడు నాలుగు సినిమాల వరకు సంతం చేశాడు. కొత్త బంగారు లోకం సినిమాలో కేవలం ఒకటీరెండు సెకన్ల పాటు కనిపించిన సోహైల్ బిగ్‌బాస్ తర్వాత హీరోగా మారాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్‌కట్ బాలరాజు వంటి చిత్రాలు చేశాడు.ఇందులో మిస్టర్ ప్రెగ్నెంట్ తప్ప మిగతావన్నింటినీ ప్రేక్షకులు తిరస్కరించారు. దాన్ని సోహైల్ తట్టుకోలేకపోయాడు. తన సినిమాను చూడమని, ఎంకరేజ్ చేయమని కన్నీళ్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న అతడు కొత్త బిజినెస్‌లోకి దిగాడు. మణికొండలో కొత్త రెస్టారెంట్ ప్రారంభిస్తున్నాడు. డిసెంబర్ 23న ఈ రెస్టారెంట్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు.చదవండి: దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ బ్యూటీ -
Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది!
'అన్నా.. నేను రైతుబిడ్డనన్నా..', 'జై జవాన్- జై కిసాన్' అంటూ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్లో డైలాగ్స్ పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా.. నేను గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.చేతులు దులిపేసుకున్న ప్రశాంత్?ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్‌మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్‌లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లుక్ మార్చిన రైతు బిడ్డతాజాగా ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఇన్‌స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య -
గతంలో కంటే రెట్టింపు పారితోషికం, అవేవీ ఎపిసోడ్లో వేయలేదు: గౌతమ్
అశ్వత్థామకు చావు లేదన్నది అందరికీ తెలుసు. కానీ ఈ అశ్వత్థామకు తిరుగులేదని నిరూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో తనకు తాను అశ్వత్థామ అన్న బిరుదు ఇచ్చుకున్నాడు. అప్పుడు తనపై సెటైర్లు వేసినవాళ్లే.. ఎనిమిదో సీజన్‌కు వచ్చేసరికి చప్పట్లు కొట్టారు. గౌతమ్ మాట తీరు, ఆటతీరుకు ఫిదా అయ్యారు. ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచిన్నప్పటికీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గౌతమ్ తాజాగా సాక్షి.కామ్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూసేయండి..ట్రోలింగ్‌పై మీ అభిప్రాయం?గౌతమ్: గత సీజన్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. అందుకు నాపై ట్రోలింగ్ జరిగింది. తర్వాత నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుని ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టాను. మొదటివారం ఎలిమినేషన్ అంచున నిలబడినప్పుడు బాధపడ్డాను. కానీ నాకు ఒక అవకాశం వచ్చిందన్నప్పుడు ధృడంగా నిలబడ్డాను, గట్టిగా ఆడాను. అశ్వత్థామ అంటే ట్రోల్ చేసినవారే మళ్లీ అదే పేరుతో పొగిడారు. నాకెంతో పాజటివిటీ దొరికింది. ఈ జర్నీని నేనెప్పటికీ మర్చిపోలేను.ఫినాలే వరకు రావడానికి మణికంఠ కారణమని భావిస్తున్నారా?గౌతమ్: లేదు. ఒక్క వారం మణికంఠ వల్ల సేవ్ అయ్యాను. కానీ ఫినాలే వరకు నా స్వయంకృషితో వచ్చాను.చిరంజీవి సతీమణి సురేఖగారిని ఎప్పుడు కలుస్తారు?గౌతమ్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని త్వరలోనే కలుస్తాను.గత సీజన్లో నాగార్జున గ్రూప్ గేమ్స్ తప్పన్నారు. ఈ సీజన్లో మాత్రం గ్రూప్ గేమ్స్ తప్పేం కాదని వెనకేసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?గౌతమ్: నేనూ చాలా మీమ్స్‌లో చూశాను. ఫ్రెండ్స్‌గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడటం తప్పు కాదు. కానీ గ్రూప్‌గా ఉంటూ వేరేవాళ్లను టార్గెట్ చేయడం తప్పు. అది నాకు నచ్చలేదు.విన్నర్ అయినందుకు నిఖిల్‌ను అభినందించారా?గౌతమ్: ఫినాలే స్టేజీపై వెంటనే కంగ్రాట్స్ చెప్పాను. కానీ ఎపిసోడ్లో వేయలేదు. అలాగే నాగార్జునగారు కూడా నేను చరిత్ర సృష్టిస్తానని మెచ్చుకున్నారు. అది కూడా ఎపిసోడ్లో వేయలేదు.రెమ్యునరేషన్ సంతృప్తికరంగా ఉందా?గౌతమ్: గత సీజన్ కంటే రెట్టింపు పారితోషికం ఇచ్చారు.చదవండి: ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా..: రాధికా ఆప్టే -
బిగ్‌బాస్: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా?
రియాలిటీ షోలకు బాస్.. బిగ్‌బాస్. ఈ షోను ఆదరించేవాళ్లు ఎంతోమంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో విజయవంతంగా రన్ అవుతోంది. షో గెలిచినవారికి కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ఇస్తుంటారు. తెలుగులో విజేతకు రూ.50 లక్షలు ఇస్తుండగా హిందీలో మొదట్లో రూ.1 కోటి ఇచ్చేవారు. ఆరో సీజన్ నుంచి మాత్రం అది తగ్గుతూ వచ్చింది. కోట్లల్లో రెమ్యునరేషన్మధ్యలో రూ.30 లక్షలదాకా వెళ్లిన ప్రైజ్‌మనీ ప్రస్తుత సీజన్లో మాత్రం రూ.50 లక్షలుగా ఉంది. అయితే వీటితో సంబంధం లేకుండా కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ కూడా ఇస్తుంటారు. కొందరు ఈ పారితోషికం రూపంలోనే లక్షలు, కోట్లు సంపాదించారు. అలా బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్నది ఎవరో తెలుసా? కెనడియన్ నటి పమేలా ఆండర్సన్. ఈమె హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. సెకండ్ ప్లేస్‌లో ఎవరంటే?ముచ్చటగా మూడు రోజులు హౌస్‌లో ఉండి వెళ్లిపోయింది. అందుకుగానూ రూ.2.5 కోట్ల పారితోషికం తీసుకుందట! కాగా పమేలా.. స్కూబీ డూ,స్నేరీ మూవీ 3, స్నాప్‌డ్రాగన్ చిత్రాలతో పాటు బేవాచ్ యాక్షన్ సిరీస్‌లోనూ నటించింది. చివరగా ద లాస్ట్ షోగర్ల్ అనే సినిమాతో మెప్పించింది. ఈ బ్యూటీ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న కంటెస్టెంట్ గ్రేట్ ఖాలి అని తెలుస్తోంది. ఇతడు వారానికి రూ.50 లక్షలవరకు తీసుకున్నాడట! తర్వాతిస్థానంలో కరణ్వీర్ బొహ్ర రూ.20 లక్షలు అందుకున్నట్లు భోగట్టా!చదవండి: ఆస్కార్‌లో నిరాశ.. లాపతా లేడీస్‌ను సెలక్ట్ చేయడమే తప్పంటున్న డైరెక్టర్ -
క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్
షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు సోషల్ మీడియాలో ఒకప్పుడు సెన్సేషన్. పలు వెబ్ సిరీస్‌లతో మిలియన్ల కొద్ది వ్యూస్, అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌తో బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన జస్వంత్ విన్నర్ రేసు నుంచి తీవ్రమైన నెగటివిటీ తెచ్చుకున్నాడు. హోస్ నుంచి బయటకు వచ్చాక కూడా వివాదాలు.. కేసులు.. గొడవలతో పాటు అరెస్ట్‌లు వంటి ఘటనలు తన జీవితంలో జరిగాయి. అయితే, షణ్ముఖ్ జస్వంత్ కుంగిపోకుండా తన ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు. జీవిత పోరాటంలో తాను ఎన్నో నేర్చుకున్నానని తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పలు విషయాలు పంచుకున్నాడు.సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నాడు జస్వంత్. ఇప్పుడు ఓటీటీ కోసం ' లీల వినోదం' చిత్రంలో ఆయన నటించారు. డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఘటనలను మీడియాతో పంచుకున్నాడు.స్టేజీపైనే షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడారు. నా జర్నీ అంతా మొదట వైజాగ్‌లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నా కెరీర్ ఎటు పోతుందో తెలియని అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు హైదరబాద్‌కు వచ్చి కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్ అయ్యాను. కానీ, ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా.. ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి కుమారుడు అనుకుంటాడు. అయితే, నా వల్లే కుటుంబానికి వారికి చెడ్డపేరు వచ్చింది. అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అమవాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడు. నా జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు ' లీల వినోదం' ప్రాజెక్ట్ వచ్చింది. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ, ఒక్కసారి కింద పడినప్పుడు మనతో ఎవరుంటారో వాళ్లే నిజమైన మిత్రులు. నా అనుభవంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాను.' అని జస్వత్ పేర్కొన్నాడు.షణ్ముఖ్ జస్వంత్ జీవితంలో వివాదాలుబిగ్ బాస్‌లో టైటిల్ విన్నర్ అవుతాడని షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు అనుకున్నారు. అయితే, హౌజ్‌లో సిరి-షణ్ముఖ్‌ల తీరుపై ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆపై కొద్దిరోజులకే గంజాయి కేసులో అరెస్ట్ కావడం. వెనువెంటనే ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పట్టుకోవడానికి అతని ఫ్లాట్‌కి పోలీసులు వెళ్లడం. అక్కడ షణ్ముఖ్ గదిలో గంజాయి దొరికందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో షణ్ముఖ్ కెరీర్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు పడిలేచిన కెరటంలా లీల వినోదం అనే సినిమాతో ఆయన మరోసారి తెరపైకి వస్తున్నాడు. -
షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్.. ఇప్పుడేమో!
బిగ్‌బాస్ 8 ట్రోఫీ గెలిచిన నిఖిల్ చాలా సెన్సిటివ్. చిన్నచిన్న విషయాలకే ఎమోషనలైపోయి కంటతడి పెట్టుకుంటుంటాడు. హౌస్‌లో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యష్మితో ఎక్కువ క్లోజ్ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తను సింగిల్ కాదంటూ లవ్‌స్టోరీ బయటపెట్టాడు.హౌస్‌లో కన్నీళ్లుసీరియల్ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్‌లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసుంటా.. తనే నా భార్య అని ఫిక్సయిపోయా! షో అయిపోగానే తన దగ్గరికే వెళ్తాను. యూటర్న్?ఆమె కోప్పడుతుందని తెలుసు. అయినా వెళ్తా.. తిడితే పడతాను, కొడితే కొట్టించుకుంటాను.. పిచ్చి లేస్తే లేపుకెళ్లిపోతా.. షో అయిపోగానే నీ ముందు నిలబడతా.. అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు. తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో అడుగుపెట్టిన నిఖిల్‌ను యాంకర్ అర్జున్ అంబటి ఇదే ప్రశ్న అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్‌గా తన దగ్గరకే వెళ్తానన్నావు.. మరి వెళ్తున్నావా? అని ప్రశ్నించాడు. ఆలస్యంగానైనా..అందుకు నిఖిల్ బయటకు వెళ్లేదాక తెలియదు పరిస్థితి! అని చెప్పాడు. అప్పుడేమో వెంటనే వెళ్తానని ఇప్పుడేమో పరిస్థితులు చూసి చెప్తానంటున్నాడేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఆలస్యంగానైనా నిఖిల్.. కావ్య దగ్గరకు వెళ్లి తన ప్రేమను నిలబెట్టుకుంటాడేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ షోకు గౌరవం దక్కట్లేదు.. అందుకే హోస్టింగ్‌కు గుడ్‌బై
కన్నడలో బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్లు విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న ఆయన పదకొండో సీజన్‌ను కూడా తనే నడిపిస్తున్నాడు. అయితే ఇకమీదట రాబోయే సీజన్స్‌కు తాను హోస్ట్‌గా చేయనని, ఇదే తన చివరి బిగ్‌బాస్ సీజన్ అని అక్టోబర్‌లో ప్రకటించాడు.మనసుకు అనిపించింది చెప్పాఅందుకు గల కారణాన్ని తాజాగా బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్తున్నానంటూ ట్వీట్ చేసిన రోజు చాలా అలిసిపోయి ఉన్నాను. అప్పుడు నా మనసుకు అనిపించింది చెప్పాను. అంతర్గత లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఆరోజు గనక ఆ ట్వీట్ చేయకపోయుంటే తర్వాత నా ఆలోచనలు, అభిప్రాయాలు మారేవేమో!ఆలోచన వచ్చిన వెంటనే..అందుకే నాకు బిగ్‌బాస్‌ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశాను. ఆ మాటపై ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరి కోసం నేను కష్టపడాల్సిన పనిలేదనిపించింది. అక్కడ ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండట్లేదు, అలాంటప్పుడు అంతే శ్రమ నా సినిమాలపై పెట్టుంటే బాగుండనిపించింది. కన్నడ బిగ్‌బాస్‌కు..మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్‌బాస్‌కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. కాగా ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ప్రస్తుతం మ్యాక్స్ సినిమాలో నటించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. Thank you all for the great response shown towards #BBK11.The TVR (number) speaks in volumes about the love you all have shown towards the show and me.It's been a great 10+1 years of travel together, and it's time for me to move on with what I need to do. This will be my last… pic.twitter.com/uCV6qch6eS— Kichcha Sudeepa (@KicchaSudeep) October 13, 2024 చదవండి: Bigg Boss Telugu 8: ఆ రెండూ జరగకపోయుంటే ఫినాలే వేరేలా ఉండేది! -
బిగ్‌బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్‌కార్డ్స్‌ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్‌బాస్⇒ ప్రైజ్‌మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్‌మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్‌లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్‌కార్డ్స్‌ను రాయల్స్ క్లాన్‌గా విభజించిన బిగ్‌బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్‌బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్‌లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్‌ను అవినాష్‌కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్‌లో అన్ని గేముల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్⇒ బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిఖిల్, రన్నరప్‌గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్‌లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్‌లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
బిగ్ బాస్ ఆఖరి వారం విశ్లేషణ... తెలుగు బిగ్ బాస్‌లో విజేత కన్నడ నటుడు
భాషేదైనా భావం ముఖ్యమన్న విషయాన్ని నిరూపించింది ఈ సీజన్ బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో విన్నర్ గా కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. 22 మంది కంటెస్టెంట్స్ తో 105 రోజుల హోరాహోరీగా జరిగిన పోరాటంలో అజేయంగా నిలిచాడు. మొదటి ఎపిసోడ్ నుండీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే వస్తున్నాడు నిఖిల్. ఓ దశలో ఫస్ట్ రన్నరప్ గౌతమ్ గట్టి పోటీ ఇచ్చినా చివరికి విజయం మాత్రం నిఖిల్‌నే వరించింది. ఫైనల్ ఎపిసోడ్ లో టాప్ 5 గా నిలిచిన అవినాష్, ప్రేరణ, ముందుగా ఎలిమినేట్ అయ్యి టాప్ 3లో నబీల్, గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఈ ముగ్గురిలో విన్నర్గాల్ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఈ సీజన్లలో ప్రత్యేకత ఏంటంటే విన్నర్ పరభాషా నటుడవడం. ఆదివారం ప్రసారమైన గ్రాండ్ ఫినాలే యధావిధిగా ఆర్భాటంగా జరిగింది. ఈ సీజన్ లో పలు సెలబ్రిటీస్ తో పాటు ఫినాలేలో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా రావడం ఎపిసోడ్ కే హైలైట్. ఇక ఈ సిజన్ విశ్లేషణకొస్తే.. 14మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌజ్‌లోకి తర్వాత మరో 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తంగా 22 మంది పార్టిసిపెంట్స్ తో 15 వారాలు ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ అనేది ప్రపంచ ప్రేక్షకాదరణ పొందిన కాన్సెప్ట్. అటువంటిది తెలుగులోనూ విశేష ఆదరణ లభించింది. ఇదే ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నెం.1గా నిలబెట్టింది. అన్ని సీజన్లకు మాదిరిగానే ఈ సీజన్ లోనూ పార్టిసిపెంట్స్ మధ్య వాడి, వేడి టాస్కులతో సెగలు పుట్టించగా.. హోస్ట్ నాగార్జున వారాంతంలో వీరి ఆట తీరుపై విశ్లేషణతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు. నత్తి మెదడు, మగళై, కుట్టి వంటి పదాలు ఈ సీజన్లో పార్టిసిపెంట్స్ మధ్య బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సీజన్‌ని ఫాలో అయ్యే ప్రేక్షకులకు రొటీన్ టాస్కుల పరంగా కాస్తంత అసహనం కలిగించినా సెలబ్రిటీలతో సీజన్ కవర్ చేయడానికి బాగానే ప్రయత్నించారు. బిగ్ బాస్ టీవి షోనే అయినా దీని తాకిడి మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. సోషల్ మీడియాలోనే పార్టిసిపెంట్స్ పరంగా గ్రూపులతో పాటు కార్యక్రమంలోని అంశాలపై రోజువారీ చర్చలు జరిగాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి కావలసిందీ ఇదే. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కువగా యాంకరింగ్ చేసింది నాగార్జునే. తన ఛరిష్మాతో ఇటు పార్టిసిపెంట్స్‌ను అటు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. పార్టిసిపెంట్స్ గొడవ ఓ ఎత్తయితే ఆ గొడవకు సంబంధించిన నాగార్జున విశ్లేషణ మరో ఎత్తు. దీని కోసమే చాలా మంది వెయిట్ చేసేవారు. మామూలుగా అపరిచితులతో ప్రయాణం చేసేటప్పుడు జరిగే చిన్నపాటి ఘర్షణ తలెత్తినా చుట్టూ పదిమంది గుమిగూడి గొడవ సద్దుమణిగేదాకా సినిమా చూసినట్టు చూస్తారు. అలాంటిది 22 మంది అపరిచితులను వంద రోజులకు పై ఓ ఇంట్లో పెట్టి వారి మధ్య టాస్కులు పెడితే ఆ బొమ్మ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ ఒకే స్క్రీన్ మీద 22కు పైగా సినిమాలను చూసినట్టుండేది.. అదే బిగ్ బాస్. ఈ సీజన్ తో బిగ్ బాస్ కార్యక్రమానికి కామా పడింది. మరో సీజన్ సినిమా కోసం ప్రేక్షకులు మరో 9 నెలలు వెయిట్ చేయాల్సిందే. వచ్చే సీజన్ వరకు ఈ సీజన్ వేడి మాత్రం చల్లారేదేలే. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికీ అస్సలు తగ్గేదేలే. - హరికృష్ణ ఇంటూరు -
ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..!
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ బిగ్‌బాస్ షోలో ఫలితం ఆశించి కష్టపడ్డా కొన్నిసార్లు ప్రతిఫలం దక్కదు. ఈ సీజన్లో వైల్డ్ ఫైర్‌లా మారిన గౌతమ్ కృష్ణ గత సీజన్లోనూ పాల్గొన్నాడు. అప్పుడు కూడా గ్రూప్ గేమ్స్ జోలికి వెళ్లకుండా సోలో బాయ్‌లా ఆడాడు. అయితే కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నించావన్నదానికి బదులు ఎన్ని గెలిచావన్నదే చూస్తారు. ఈ విషయంలో గౌతమ్ వెనకబడిపోయాడు.బెడిసికొట్టిన అశ్వత్థామ బిరుదుకానీ శివాజీ కపట నాటకాన్ని వేలెత్తి చూపించి హైలైట్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌కు కూడా కొందరు ఫేవరెట్స్ ఉంటారు. వాళ్లనేమైనా అంటే ఆ కంటెస్టెంట్ గేటు బయట ఉండాల్సిందే! హోస్ట్ నాగార్జున కూడా అతడి నోరు నొక్కేసి నానామాటలన్నారు. చివరకు 13వ వారంలో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అశ్వత్థామ 2.0 అంటూ తనకు తాను ఇచ్చుకున్న బిరుదు కూడా జనాలకు రుచించలేదు, ట్రోల్ చేశారు.దారి తప్పిన గౌతమ్అయితే ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాలనుకున్నాడు. మళ్లీ బిగ్‌బాస్ 8లో అడుగుపెట్టాడు. ఈసారి ఏదేమైనా వెనక్కు తగ్గకూడదని బలంగా ఫిక్సయ్యాడు. కానీ వచ్చినవారంలోనే క్రష్ అంటూ యష్మిపై ఫీలింగ్స్ బయటపెట్టడంతో జనం అతడిని తిరస్కరించాడు. వెంటనే ఎక్కడ తప్పు చేశానన్నది గ్రహించి తనను మార్చుకున్నాడు. కేవలం ఆటపైనే దృష్టిసారించాడు. తప్పు జరుగుతుంటే వేలెత్తి చూపించాడు. (చదవండి: ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?)ఆ ఒక్క మాటతో విపరీతమైన నెగెటివిటీగ్రూప్ గేమ్స్ తప్పు కాదని హోస్ట్ చెప్తున్నా సరే అది తప్పని వాదించాడు. అతడి గుండెధైర్యానికి జనాలు ఫిదా అయ్యారు. అతడి ప్రవర్తన, మాటతీరుకు సెల్యూట్ చేశారు. గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో నిఖిల్‌పై అనవసరంగా నోరు జారాడు. అమ్మాయిలను వాడుకుంటున్నావ్ అనడంతో గౌతమ్‌పై ఉన్న పాజిటివిటీ కాస్త తగ్గిపోయింది. అది ఎంత పెద్ద మాట అని నాగార్జున చెప్తున్నా కూడా అతడికి చెవికెక్కలేదు. వివరణ ఇస్తూనే పోయాడు. ఈ వ్యవహారం అతడికి మైనస్ అయింది.సెటైర్.. అంతలోనే ప్రశంసగౌతమ్ ఎదుటివారు చెప్పేది వినిపించుకోకుండా తన పాయింట్స్ తను చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. ఫినాలేలో గౌతమ్ తండ్రి కూడా అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చూసిన నాగ్.. ఎవరైనా మాట్లాడుతుంటే వినకుండా నీ వర్షన్ నువ్వు చెప్పే క్వాలిటీ మీ తండ్రి నుంచే వచ్చిందా? అని సెటైర్ వేశాడు. అయితే ఎక్కువగా తన చేతిలో తిట్లు తినే గౌతమ్‌ను చిట్టచివరిసారి మెచ్చుకున్నాడు నాగార్జున. గౌతమ్‌ను రన్నరప్‌గా ప్రకటించినప్పుడు.. గర్వించే కొడుకును కన్నారంటూ అతడి పేరెంట్స్‌ను ప్రశంసించాడు. అది చూసిన ఫ్యాన్స్.. ఇది కదా సక్సెస్ అంటే, నువ్వు జనాల మనసులు గెలిచేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?
సరైనోడు, దమ్మున్నోడు, జెంటిల్మెన్.. ఇలాంటి ట్యాగులన్నీ నిఖిల్‌కు సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా అది క్షణకాలం మాత్రమే! వంద రోజుల జర్నీలో అతడు కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఎవరెన్ని నిందలు వేసినా తనలో తను బాధపడ్డాడే తప్ప తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్కుల విషయానికి వస్తే అతడిని ఢీ కొట్టేవాడే లేడన్నంతగా రెచ్చిపోయాడు. నిందలు పడ్డ చోటే నిలబడ్డాడునిఖిల్ ఆటలో అడుగుపెడితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది అన్న లెవల్లో ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా లెక్కచేయలేదు. కంటెస్టెంట్ల సూటిపోటి మాటల వల్ల హౌస్‌ను వీడాలనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోటే నిలబడాలనుకున్నాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేశాడు. (Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)సంపాదన ఎంత?సీరియల్ యాక్టర్‌గా పేరు గడించిన నిఖిల్ బిగ్‌బాస్ ప్రియుల మనసు గెలుచుకుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీనితోపాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. ఇకపోతే నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు వెనకేశాడు. చదవండి: కోరిక మిగిలిపోయిందన్న తేజ.. నాగార్జున బంపరాఫర్ -
ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, వేలెత్తిచూపించినవారే తలదించుకునేలా చేయాలి.. తిట్టినవారితోనే పొగిడించుకోవాలి.. ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అతడు ఏం కోల్పోయాడో దాన్ని ఈ సీజన్లో తిరిగి సంపాదించాడు. అప్పుడు మూటగట్టుకున్న నెగెటివిటినీ తన మాటతీరుతో, ఆటతీరుతో కడిగిపారేశాడు.(Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నప్పుడు నవ్వినవాళ్లే ఈడు మగాడ్రా బుజ్జి అంటున్నారు! బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వైల్డ్ ఫైర్‌లా మారాడు. టైటిల్ రేసులో ఉన్న నిఖిల్‌కు గట్టి పోటీనిచ్చాడు. గతంలో ఫైనల్స్‌కు రాకుండానే వెనుదిరిగిన గౌతమ్ ఇప్పుడేకంగా టాప్ 2లో చోటు దక్కించుకున్నాడు. వారానికి రూ.1.75 లక్షల చొప్పున సంపాదించాడు. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో పారితోషికం రూపేణా పది వారాలకుగానూ దాదాపు రూ.17,50,000 వెనకేసినట్లు తెలుస్తోంది.(చదవండి: బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?) -
బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?
అందాల రాక్షసి.. బిగ్‌బాస్ ప్రేరణకు అంకితమిచ్చిన ట్యాగ్‌లైన్ ఇది. ఈ అందాల భామకు ముక్కు మీద కోపం. ఎవరైనా ఒక్క మాటంటే దానికి పది మాటలు తిప్పి కొడుతుంది. తనను చులకన చేస్తే బుసకొట్టిన పాములా లేస్తుంది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంది. మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. బుద్ధిబలం కూడా మెండు.విపరీతమైన నెగెటివిటీకానీ నోటిదురుసే ఎక్కువ! సిగ్గు లేదా? క్యారెక్టర్‌లెస్? ఆ ముఖం చూడు.. ఇలాంటి మాటలన్నీ తన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే! మెగా చీఫ్ అయ్యాక నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించింది. తిండి దగ్గర కూడా ఆంక్షలు పెట్టి అభాసుపాలైంది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. పారితోషికం ఎంతంటే?కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందుకే టాప్ 5లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది. తనకు సూట్‌కేస్ ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పింది. ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తానని నిలబడింది. నాలుగో స్థానంలో వీడ్కోలు తీసుకుంది. ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు వెనకేసిందట!చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం.. -
బిగ్‌బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున ఒక టీచర్‌లాగా! పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. మంచి చేస్తే చప్పట్లు కొడతాడు. బాధలో ఉంటే మోటివేట్ చేస్తాడు. సంతోషాన్ని నలుగురితో పంచుకోమంటాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు గురువుగా, అండగా ఉండేది నాగార్జున ఒక్కరే!గత సీజన్లో..అయితే వీకెండ్లో నాగార్జున వేసుకొచ్చే షర్ట్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పోయిన సీజన్లో షర్ట్ కావాలని శోభా శెట్టి ఇలా అడగ్గానే నాగ్ అలా ఇచ్చేశాడు. అమర్దీప్ అడిగితే మాత్రం అసలు లెక్కచేయలేదు. ఈ సీజన్లో టేస్టీ తేజ కూడా తనకు చొక్కా కావాలని సిగ్గు విడిచి అడిగాడు. సన్నబడితే షర్ట్ ఇస్తానని నాగ్ మాటిచ్చాడు. అందుకోసం తేజ కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. బరువు తగ్గకుండానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు.నేను ఫిక్స్ చేస్తాతాజాగా ఫినాలేకు వచ్చిన తేజ మీ షర్ట్ దక్కలేదన్న కోరిక అలాగే మిగిలిపోయిందన్నాడు. అందుకు నాగ్ ముందు పెళ్లి ఫిక్స్ చేసుకో.. అప్పుడు నీకు పెళ్లి డ్రెస్ నేను ఫిక్స్ చేస్తా అని హామీ ఇచ్చాడు. ఊహించని బంపరాఫర్ తగలడంతో తేజ తెగ సంతోషపడిపోయాడు.చదవండి: కప్పు గెలిచేసిన నిఖిల్.. అడుగుదూరంలో ఆగిపోయిన గౌతమ్! -
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే
టాప్-5లో ఉన్న అవినాష్.. ఫినాలే ఎపిసోడ్లో తొలుత ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి బిగ్‌బాస్ హౌసులో కాస్తోకూస్తో ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరివల్లే. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్లిద్దరూ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా అవినాష్ నిలిచి టాప్-5లో అడుగుపెట్టాడు. కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్‌తో పోలిస్తే అవినాష్‌కి ఓటింగ్ శాతం తక్కువే! గతంలో నాలుగో సీజన్లోనూ అవినాష్.. వైల్డ్ కార్డ్గానే హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్-7 వరకు వచ్చాడు కానీ ఫైనల్‌కు రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు.అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం.. బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టిన అవినాష్ చివరివరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌసులో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లే!