
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రౌండ్‌లో అడుగుపెట్టారు. తన క్రికెట్ టీమ్‌తో కలిసి మైదానంలో సందడి చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఉన్న దడోజి కొండేవ్ స్డేడియంలో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఐఎస్‌టీఎల్ టీ10 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో తన టీమ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ బరిలో నిలిచింది. తాజాగా తన టీమ్‌కు మద్దతు తెలిపిందుకు మన స్టార్ హీరో గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
(ఇది చదవండి: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్)
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా మెప్పించింది.
Sunday special at Dadoji Konddev Stadium! 🏟️
Cheering for my team Falcon Risers Hyderabad! 🙌
Watch @ispl_t10 live on @DisneyPlusHS & @StarSportsIndia #ISPLT10 #Street2Stadium #NewT10Era #Season2 #DikhaApnaGame #ISPLonJioStar pic.twitter.com/TYuAYjPMBy— Ram Charan (@AlwaysRamCharan) February 9, 2025