
మెగాఫ్యామిలీ ప్రస్తుతం యూకేలో సందడి చేస్తున్నారు. చిరంజీవితో సహా రామ్ చరణ్ దంపతులు సైతం లండన్‌లో ఉన్నారు. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహంతో పాటు పెట్ డాగ్ రైమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మే 10న ఈ అరుదైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో తన మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ ఫోటోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కాగా.. మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం.
అయితే విగ్రహం ఆవిష్కరణ తర్వాత రామ్ చరణ్ ఫోటోలు దిగారు. ఆ సమయంలో చెర్రీ-ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార సందడి చేసింది. రామ్ చరణ్ తన విగ్రహంతో ఫోటోలు దిగుతుండగా నాన్న వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ఉపాసన కారా.. కారా.. అంటూ అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రానుంది.
Most Beautiful Video on Internet today ❤️ #RamCharanWaxStatue ! pic.twitter.com/73mqiirlPA
— Trends RamCharan ™ (@TweetRamCharan) May 12, 2025