
మెగా కోడలు ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ చేసింది. తల్లిదండ్రులు అనిల్-శోభన 40వ పెళ్లి రోజు వేడుకలకు హాజరైంది. భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకారతో కలిసి ఫుల్ హ్యాపీగా కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా)
"40వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మ-నాన్న. మాపై మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది" అని ఉపాసన వీడియో దిగువన రాసుకొచ్చింది. ఇది చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఉపాసన తల్లిదండ్రులకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.
2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత వీళ్లకు కూతురు పుట్టింది. వీలు కుదిరిన ప్రతిసారీ తన కూతురుతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. ఇప్పుడు కూడా వీడియోలో కూతురు ఉంది. కానీ ముఖం మాత్రం చూపించలేదు.
(ఇదీ చదవండి: పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న ఓటీటీ నటి)
Comments
Please login to add a commentAdd a comment