
వాలైంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన కొణిదెల ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రేమికుల దినోత్సవానికి సరికొత్త అర్థం చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫిబ్రవరి 14 కేవలం వారికి మాత్రమేనని సరదా కొటేషన్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఉపాసన ఏం రాసిందో మీరు ఓ లుక్కేయండి.

మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నవ్వులు తెప్పిస్తోంది. వాలంటైన్స్ డే అనేది కేవలం 22 ఏళ్ల లోపు ఉన్నవారికి మాత్రమే.. మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అయితే.. ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వరకు వేచి చూడండి' అని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. లవర్స్ డే రోజున ఉపాసన చేసిన ఈ సరదా పోస్ట్ నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment