![Kutty Return Home To Ram Charan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/ram-charan.jpg.webp?itok=g5OvuiNA)
టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌తో పాటు ఆయన సతీమణి జంతు ప్రేమికులు అని తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తప్పిపోయిందనుకున్న 'కుట్టి' అనే ఆఫ్రికన్ గ్రే చిలుక తమ చెంతకు చేరడంతో వారు ఎగిరిగంతేశారు. కొద్దిరోజుల క్రితం 'కుట్టి' అనే చిలుక తప్పిపోయిందని ఒక ఫోటోతో సోషల్ మీడియా ద్వారా ఉపాసన తెలిపారు. జుబ్లీహిల్స్ ఏరియాలోని రోడ్డు నంబర్ 25లో ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైనా కనిపిస్తే చెప్పండంటూ ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ చూసిన కొన్ని యానిమల్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎలాగైనా వారి చిలుకను ఎతికి అప్పజెప్పాలని పూనుకున్నారు. ఫైనల్‌గా కొందరు ఆ చిలుకను రామ్‌చరణ్ దంపతులకు తిరిగి ఇచ్చారు.
గత శనివారం ఓ యువతి ఈ పక్షి కనబడిందంటూ ఓ ఫోటోను ఎనిమిల్ కన్జర్వేషన్ వెల్ఫేర్ సొసైటీ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సదరు సంస్థ ఈ పక్షి వివరాలను తమ గ్రూపులో పోస్ట్ చేశారు. చివరకు ఇది రామ్‌చరణ్ ఇంటి నుంచి తప్పిపోయిన పక్షిగా తేల్చి ఆదివారం వారికి అప్పగించారు. చిలుక కాలి రింగుకు ఉన్న ఐడీ ద్వారా వారు దీనిని గుర్తించారు. అయితే కుట్టి( చిలుక) రామ్ చరణ్ చూడగానే.. ఆయన భుజంపై వాలిపోయింది. ఆ సమయంలో చరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment