Thane
-
‘నీ వల్లే నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’.. అంటూ వీడియో కాల్
అతనొక టైలర్. వృత్తి చేసుకుంటూ జీవనం సాగించడానికి ఒక ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అంతా ప్రశాంతంగానే గడిచింది. తిరిగి సొంతూరికి వచ్చిన తర్వాత ఒక మహిళతో వివాహేతర సంబంధానికి దారి తీయగా, అ సంబంధం కాస్తా ఇప్పుడు అతన్ని ప్రాణాలు తీసింది. చాలా కాలం ఆమెతో వివాహేతర బంధాన్ని కొనసాగించిన సదరు వ్యక్తి.. ఆమె బ్లాక్ మెయిలింగ్ కు బలయ్యాడు. ఆమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్న విషయాన్ని ఆమెకు వీడియో కాల్ లో తెలిపి మరీ చనిపోయాడు.వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ జిల్లాకు చెందిన అల్తాఫ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని థానేలో టైలర్ గా జీవనం సాగిస్తున్నాడు. గతేడాది తన తల్లి చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన అల్తాఫ్.. ఆపై థానేకు తిరిగి వెళ్లిపోయాడు. అయితే అతని కుటుంబ సభ్యులు ఇక్కడే(థానే)లో పని చేసుకోమని చెప్పడంతో అక్కడకు తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సమీప బంధువులైన ఒక మహిళతో అల్తాఫ్ కు వివాహేతర బంధం ఏర్పడింది. అయితే మహిళతో వివాహేతర సంబంధాన్ని గ్రహించిన అతని కుటుంబ సభ్యులు.. తిరిగి థానేకు పంపించేశారు.అయినప్పటికీ ఆ మహిళ.. అతన్ని ఫోన్ లో వేధింపులకు గురి చేసింది. తాను కడుపుతో ఉన్నానని, రూ. 10 వేల నుంచి లక్ష వరకూ పంపాలంటూ డిమాండ్ చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసు బనాయించిన సదరు మహిళ.. డబ్బుల కోసం వేధించేదని అల్తాఫ్ సోదరి అంటోంది. జైలుకు పంపుతానని బెదిరింపులకు గురి చేయడంతోనే తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని సోదరి రేష్మ స్పష్టం చేసింది.చనిపోతున్నానని చెప్పినా..తాను చనిపోయే ముందు వివాహేత బంధం కొనసాగించిన మహిళకు వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, నీ వేధింపులు భరించలేక చనిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ‘చనిపోతే చనిపో.. నాకేమీ నష్టం లేదు. నాకు భర్త ఉన్నాడు. నువ్వు చనిపోవడం వల్ల నేనేమీ కోల్పోను’ అని చెప్పినట్లు వీడియో కాల్ లో రికార్డు అయ్యింది.నేను విషం తీసుకుంటున్నా. నేనేమీ డ్రామా ఆడటం లేదు. నేను బాధలో ఉన్నా. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నీవల్ల నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’ అంటూ మరొక వీడియో కాల్ లో రికార్డు అయ్యింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు
థానే: థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పత్రాలు, ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆవిష్కరించారు. థానే తెలుగు మహాసభ స్వర్ణోత్సవాలు (50 సంవత్సరాలు) జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఏర్పాట్లతోపాటు ఇటీవలే నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలకు సంబంధించి థానే లోకపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు విషయాలపై చర్చించారు. ఏప్రిల్ 6వ తేదీ వాగ్లే ఇస్టేట్ డిసూజా వాడిలోని సెయింట్ లారెన్స్ స్కూల్ హాల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మొదటిసారిగా థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీసీతారామ కల్యాణోత్సవాల కోసం పంచలోహాల ఉత్సవ విగ్రహాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఉత్సవ విగ్రహాలను థానే తెలుగు మహాసభకు అందించేందుకు కేవీ రమణ దంపతులు ముందుకు రావడం విశేషం. మరోవైపు సీతమ్మవారికి బంగారు మంగళసూత్రం తయారుచేసి ఇచ్చేందుకు గుండా మాధురి శ్రీనివాస్ దంపతులు ముందుకురాగా పట్టువ్రస్తాలను జయశ్రీ రమేశ్ తూము దంపతులు అందించేందుకు ముందుకొచ్చారు. పానకం వడపప్పు ప్రసాదాన్ని విజయ బులుసు దంపతులు అందిచేందుకు ముందుకు వచ్చారు. తెలుగు బ్రాహ్మణ సంఘం శ్రీసీతారామ కల్యాణోత్సవాలలో వచ్చే వారందరికీ భోజనాలు అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించడంలో కృషి చేసిన వారందరినీ అభినందించారు. 1974లో ఏర్పాటైన థానే తెలుగు మహాసభ గత కొన్ని సంవత్సరాలపాటు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల అనంతరం నూతనంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏవీ గుప్తా, కార్యదర్శి శివకుమార్‌ల టీమ్ నేతృత్వంలో మరోసారి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇందులో బాగంగా ఇప్పటికే అత్యంత ఘనంగా శ్రీనివాస కల్యాణోత్సవాలు జరిపిన అనంతరం మరింత ఉత్సాహంగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహించిన సమావేశాల్లో థానే తెలుగు మహాసభ అధ్యక్షుడు ఏవీ గుప్తా, గౌరవ అధ్యక్షుడు బీవీహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎన్.జగదీశ్ రావు, కార్యదర్శి శివకుమార్, కోశాధికారి పద్మజ, మంజుల, ఎంఎస్ కిశోర్, జగన్నాథరావు, జయశ్రీ తూము, రమణి, తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. సండే స్పెషల్ అంటూ పోస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రౌండ్లో అడుగుపెట్టారు. తన క్రికెట్ టీమ్‌తో కలిసి మైదానంలో సందడి చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఉన్న దడోజి కొండేవ్ స్డేడియంలో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఐఎస్‌టీఎల్ టీ10 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో తన టీమ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ బరిలో నిలిచింది. తాజాగా తన టీమ్‌కు మద్దతు తెలిపిందుకు మన స్టార్ హీరో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చారు.(ఇది చదవండి: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్)ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. Sunday special at Dadoji Konddev Stadium! 🏟️ Cheering for my team Falcon Risers Hyderabad! 🙌Watch @ispl_t10 live on @DisneyPlusHS & @StarSportsIndia #ISPLT10 #Street2Stadium #NewT10Era #Season2 #DikhaApnaGame #ISPLonJioStar pic.twitter.com/TYuAYjPMBy— Ram Charan (@AlwaysRamCharan) February 9, 2025 -
నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!
ఇటీవల రోజుల్లో దాంపత్యం అన్న మాట విలువలేనిదిగా అయిపోతోంది. ఎక్కడ చూసినా..విడాకులు కేసులే అధికమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ జంటను చూస్తే భార్యభర్తల బంధం అంటే ఇది కదా అనిపిస్తుంది. ప్రేమ అనే ఒక్క పదం ఇరువురి మధ్య ఉంటే ఎలాంటి వైకల్యమైనా జయించొచ్చు అనిపిస్తుంది. ఈ ఏజ్‌లో తమ కాళ్లపై తాము నిలబడాలనే తపనతో ఆ జంట పడుతున్న పాట్లు చూస్తే..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఎవరంటే వారు..థానే రైల్వే స్టేషన్(Thane Station) వద్ద స్నాక్ అమ్ముకుని జీవించే వృద్ధ జంట(Elderly Couple). వారితో ఇన్స్టాగ్రామ్ వ్లాగర్(vlogger) సిద్ధేష్ లోకారే మాటలు కలిపి..ఆ సంభాషణను నెట్టింట వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వృద్ధ జంట కథ నెట్టింట వైరల్‌గా మారింది. బీం రావు శోభ దంపతులతో వ్లాగర్ సిద్ధేష్ సంభాషిస్తూ..మీకు ఎప్పుడు పెళ్లి అయ్యిందని ప్రశ్నిస్తారు. వారు 1982లో పెళ్లై అయ్యిందని బదులిస్తారు. మూడు దశాబ్దాలకు పైగా కలిసే ఉన్నామని అంటారు. ఇక్కడకి ప్రతిరోజు వచ్చి స్నాక్స్ అమ్ముతామని, ఎవ్వరైన స్నాక్స్/స్వీట్లు కావాలని ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వెళ్లి డెలివరీ చేస్తామని చెప్పారు. బీంరావు తాను రెండేళ్ల వయసులో చూపుకోల్పోగా, భార్య శోభాకు ఒక చేయి సరిగా లేదు. అయినా ఇరువరు ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పారు. రోజువారీ పనులను ఎలా ఇరువురు చకచక చేసుకోగలరో కూడా వివరించారు. అంతేగాదు భీంరావు తనకు చూపులేకపోయినా తన భార్యకు వంట చేయడంలో సహకరిస్తారట. పైగా కూరగాయాలు కట్ చేయడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని భర్తపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది శోభా. ఆ జంటని వ్లాగర్ సిద్ధేష్ ప్రేమంటే ఏంటనీ అడగగా..వారు "ఒకరికొకరు" అని గొప్పగా సమాధానం ఇచ్చారు. యవతకు మీరిచ్చే సందేశం ఏంటని అడిగితే.." "కష్టపడితే దేన్నైనా పొందగలం". అలాగే నీ కోసం బతకడం కాదు ఇతరుల మేలు కోరితేనే జీవితానికి అసలైన అర్థం అని చెప్పారు". చివరిగా వ్లాగర్ మీకు ఏదైనా కావాలా అని అడగగా..ఒక స్టాల్ ఉంటే బాగుండునని, ఇంతలా నిలబడాల్సిన శ్రమ ఉండదని నవ్వుతూ చెబుతారు ఆ దంపతులు. ఈ వీడియో నెటిజన్లను కదలించింది. ప్రేమకు అసలైన నిర్వచనం ఆ దంపతులు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: ఏజ్‌లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..) -
Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ!
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలయ్యాడు. తీవ్రమైన అనారోగ్యంతో శనివారం రాత్రి థానెలోని ఓ హాస్పిటల్లో చేరాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వార్తా సంస్థ IANS అందించిన వివరాల ప్రకారం.. క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.ఈ నేపథ్యంలో ఆయనను శనివారం రాత్రి థానెలో గల ఆకృతి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. కాస్త విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు IANS ఎక్స్ ఖాతాలో వివరాలను పోస్ట్ చేసింది.కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్కు చిన్ననాటి స్నేహితుడు. ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద ఓనమాలు నేర్చుకున్న వీళ్లిద్దరు అద్భుతమైన నైపుణ్యాలు కలవాళ్లే. చెడు వ్యసనాల వల్లే?అయితే, సచిన్ ఆటలో శిఖర స్థాయికి చేరుకోగా.. కాంబ్లీ మాత్రం పాతాళానికి పడిపోయాడు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం, చెడు అలవాట్ల వల్లనే అతడికి ఈ పరిస్థితి ఎదురైందని కాంబ్లీ సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. గతంలో కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి ముంబైలో వేదిక పంచుకున్న సమయంలో.. కాంబ్లీ పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపించింది.సాయం తీసుకుంటా.. చెప్పినట్లు వింటాఈ నేపథ్యంలో కపిల్ దేవ్ సారథ్యంలోని 1983 వరల్డ్‌కప్ విజేత జట్టులోని సభ్యులు.. కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, అతడు రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటేనే సహాయం అందిస్తామని షరతు విధించారు. ఇందుకు అంగీకరించిన వినోద్ కాంబ్లీ.. తాను మద్యం, పొగతాగడం మానేశానని.. చికిత్స తీసుకుంటానని స్పష్టం చేశాడు.అయితే, తాజా సమాచారం ప్రకారం వినోద్ కాంబ్లీ మరోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. కాగా భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. తన తొమ్మిదేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 రన్స్ చేశాడు. అంతేకాదు.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. తిలక్ వర్మకు చేదు అనుభవం In pictures: Cricketer Vinod Kambli's condition deteriorated again, leading to his admission at Akriti Hospital in Thane late Saturday night. His condition is now stable but remains critical. pic.twitter.com/7NBektzQ54— IANS (@ians_india) December 23, 2024 -
వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో
థానేలోని టిటా్వలా థానేలో కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ వృద్ధురాలిపై దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. ఈమేరకు పోలీసు అధికారి ఆదివారం వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నట్టుండి దాడిచేసిన నాలుగు కుక్కలు ఆమెపై ఎగబడ్డాయి. మహిళ వాటి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిది. అయినా కూడా ఒకదాని తరువాత ఒకటి నలువైపులా ఆమెపై ఎటాక్ చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఉల్హాస్నగర్ సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చారు. ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రికి అధునాతన సంరక్షణ కోసం తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమె స్టేట్మెంట్ను ఒకసారి నమోదు చేస్తాం. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని కల్యాణ్ తాలూకా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. ठाणे के टिटवाला में आवारा कुत्तों ने एक बुजुर्ग महिला पर हमला किया.आवारा कुत्तों ने महिला को 50 मीटर तक घसीटा..महिला बुरी तरह से घायल.महिला का इलाज अस्पताल में चल रहा है..चार आवारा कुत्तों ने महिला पर किया जानलेवा हमला..पूरी घटना सीसीटीवी में कैद. pic.twitter.com/BX5CmYQFYj— Vivek Gupta (@imvivekgupta) December 8, 2024 -
‘నా మేనకోడలిని కావాలని చంపలేదు’
ముంబై: మహారాష్ట్ర థానేలో దారుణం చోటు చేసుకుంది. మేనమామతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి చనిపోగా.. ఆ మరణాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని కాల్చేశాడా వ్యక్తి. మిస్సింగ్ కాస్త విషాదంతంగా ఈ కేసు మారిన వివరాల్లోకి వెళ్తే..థానే ఉల్లాస్‌నగర్‌లో ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన మూడేళ్ల బాలిక నవంబర్ 18వ తేదీ నుంచి కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. పోలీస్ ఇంటరాగేషన్‌లో ఆమె మేనమామ.. పొంతన లేని సమాధానాలిచ్చాడు. దీంతో తమ శైలిలో పోలీసులు విచారించగా.. అసలు విషయం చెప్పాడు. కావాలని తాను తన మేనకోడలిని చంపలేదని కన్నీరు పెట్టుకున్నాడతను. మేనకోడలితో ఆడుకుంటున్న టైంలో.. సరదాగా ఆమెను చెంప దెబ్బ కొట్టాడట. ఆ దెబ్బకు కిచెన్ శ్లాబ్‌కు తగిలి ఆమె కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోయిందట. ఆమె చనిపోవడంతో భయంతో శవాన్ని కాల్చేసి.. ఊరికి దూరంగా పొదల్లో పడేసినట్లు చెప్పాడు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిచ్చిన సమాచారంతో చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకి తరలించారు. -
సీఎం యోగికి బెదిరింపులు.. యువతి అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు.. బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సత్వర విచారణ జరిపి ఆ వాట్సాప్ మెసేజ్ చేసింది ఓ యువతిగా గుర్తించి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల్లోగా యోగి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే.. బాబాను సిద్ధిఖీని హతమార్చినట్లే చంపేస్తామని ఓ నెంబర్ నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఈ నేరానికి పాల్పడిన యువతిని గుర్తించి, అరెస్టు చేశారు. నిందితురాలు థానేకు చెందిన ఫాతిమా ఖాన్(24)గా తేలింది. బీఎస్సీ(ఐటీ) చేసిన ఫాతిమాకు గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేదని పోలీసులు తెలిపారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఉల్హాస్నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నిందితురాలిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా మహారాష్ట్రలో బెదిరింపు సందేశాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ప్రాణహాని పొంచి ఉందన్న విషయం తెలిసిందే. ఈ మధ్యలోనే ఆయనకు కొన్ని బెదిరింపు సందేశాలు వచ్చాయి. మరోవైపు ఎన్సీపీ నేత బాబా సిద్ధికీ తనయుడు, బాంద్రా ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీకి కూడా చంపుతామంటూ ఆగంతకులు సందేశాలు పంపుతున్నారు. మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అయిన బాబా సిద్ధిఖీ అక్టోబర్ 12వ తేదీన తన కార్యాలయం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యకు తామే బాధ్యులమంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అలాగే.. సిద్ధిఖీకి, సల్మాన్ ఖాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.ఇదీ చదవండి: 2009లో ఇంటర్.. 2024లో 8వ తరగతి!! -
Maharastra: ఐదు రోజుల శిశువు విక్రయం.. ఆరుగురు అరెస్ట్
మహారాష్ట్రలోని నాగపూర్‌లో పసికందును లక్ష రూపాయలకు విక్రయించిన ఉదంతం వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.నాగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ స్క్వాడ్ (ఎహెచ్టీఎస్) ఈ శిశువు అక్రమ విక్రయానికి సంబంధించిన కేసును ఛేదించింది. ఈ ఉదంతంలో డబ్బులు తీసుకున్నవారి, ఇచ్చినవారే కాకుండా లావాదేవీకి మధ్యవర్తిత్వం వహించిన మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది. ఆ తల్లిదండ్రులు తమ నవజాత శిశువును సంతానం లేని దంపతులకు విక్రయించారని తెలుస్తోంది. అయితే వారు శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన ప్రక్రియను పాటించలేదు. ఈ ఉదంతంలో పోలీసులు బయలాజికల్ తల్లిదండ్రులతో పాటు, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులను, ఈ డీల్‌కు సహకరించిన ఇద్దరు మధ్యవర్తులను కూడా అరెస్టు చేశారు.అరెస్టయిన నిందితులను సునీల్ అలియాస్ భోండు దయారామ్ గెండ్రే (31), అతని భార్య శ్వేత (27), పిల్లలు లేని దంపతులను పూర్ణిమ షెల్కే (32), ఆమె భర్త స్నేహదీప్ ధరమ్‌దాస్ షెల్కే (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా థానే జిల్లాలోని బద్లాపూర్‌కు చెందినవారు. వీరికి సహకారం అందించిన మధ్యవర్తులను కిరణ్ ఇంగ్లే (41), ఆమె భర్త ప్రమోద్ ఇంగ్లే (45)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. -
రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదం
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు, థానే, పుణెల్లోని మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం రూ.30,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘బెంగళూరు , థానే , పుణెల్లో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా అనుమతులు వచ్చాయి. ఈ కీలక ప్రాజెక్టులు ఆయా నగరాల వృద్ధికి దోహదపడుతాయి. 2014కి ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేది. కానీ ప్రస్తుతం 21 నగరాలకు మెట్రో విస్తరించింది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల కోట్ల ఖర్చు చేసేలా ఆమోదం లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు‘బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3లో రెండు కారిడార్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,611 కోట్ల భారం పడబోతోంది. ఈ ఫేజ్-3 ప్రాజెక్ట్ 44.65 కిలోమీటర్లతో 31 స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. మెట్రో విస్తరణలో భాగంగా మూడో దశ పనులు పూర్తయిన తర్వాత బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుంది. థానేలో కొత్తగా 22 స్టేషన్లతో ఏర్పాటు చేసే 29 కిమీ కారిడార్ కోసం రూ.12,200 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో మంత్రివర్గం ఆమోదించిన మరో ప్రాజెక్ట్ కోసం రూ.2,954.53 కోట్లు ఖర్చు అవుతాయి’ అని మంత్రి వివరించారు. -
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
Heavy Rains: ‘రెడ్ అలెర్ట్’లో ముంబై.. కరెంట్ షాక్‌తో ముగ్గురి మృతి
మహారాష్ట్రను భారీ వర్షాలు బెంబేలెతిస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని ముంబైతోపాటు, పుణె, థానె, కొల్హాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై, పుణె వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ జీవితం స్తంభించిపోయింది. స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. పుణె పింప్రి-చించ్వాడ ప్రాంతంలో అనేక అపార్ట్మెంట్లోకి వరద నీరు చేసింది. కాగా డెక్కన్ జింఖానా ప్రాంతంలో నీటితో నిండిన వీధుల్లో వీధిలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అభిషేక్ ఘనేకర్, ఆకాష్ మానే, శివ పరిహార్ వీధి వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు.This city needs prayers today 🙏#MumbaiRains pic.twitter.com/1XRK582CRr— Nikita Dutta (@nikifyinglife) July 25, 2024> ముంబై, థానే వంటి పొరుగు ప్రాంతాలు కూడా భారీ వర్షాల కారణంగా అల్లాడిపోతున్నాయి. అంధేరి, సియోన్, చెంబూర్, కుర్లా, థానేలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబయిలోని అంధేరి సబ్వే వరద నీరు కారణంగా మూతపడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో విహార్ సరస్సు, మోదక్ సాగర్ సరస్సు నేడు తెల్లవారుజామున పొంగిపొర్లుతున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. రంగంలోకి దిగిన జాతీయ విపత్తు ప్రదిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) మూడు బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొంది.కుండపోత వర్షాలతోనీటి మట్టం పెగిఠా నదిపై ఉన్న బాబా భిడే వంతెన నీటిలో మునిగిపోయింది. అదే విధంగా ఖడక్వాస్లా డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. ముఠా నది ఒడ్డున నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొల్లాపూర్‌లో పంచగంగ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదికి సమీపంలోని ప్రాంతాల ప్రజలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయం చేస్తోంది.🌧️ 𝗣𝘂𝗻𝗲 𝗪𝗲𝗮𝘁𝗵𝗲𝗿 𝗔𝗹𝗲𝗿𝘁 🌧️ •Schools, private offices, tourist places shut down, 4 dead in rain-related incidents.•It's been raining continuously in pune for the last 12 hours.🌧️⛈️#PuneRains #MumbaiRains pic.twitter.com/Iw3ZPWFZHd— RAJA👑 (@SWAPNIL_2211) July 25, 2024 ముంబైలో కూడా పరిస్థితి భయంకరంగా మారింది. 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది జూలైలో రెండవ అత్యంత ఎక్కవగా రికార్డైంది. శుక్రవారం ఉదయం వరకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల మధ్య ముంబైకి వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యం కానున్నాయని, కొన్నింటిని దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు తెలియజేసింది. This is how #MumbaiRains look from a flight! 😻 https://t.co/QrPE5X9lGO pic.twitter.com/FvnIGjjTC0— WabiSabi (@Geeky_Foodie) July 20, 2024రాష్ట్రంలో పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సమీక్ష చేపట్టారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని పుణె కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. మునిగిపోయే ప్రమాదం ఉన్న వంతెనలపై ట్రాఫిక్‌ను నిషేధిస్తామని చెప్పారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. -
పాక్ ప్రియుణ్ణి పెళ్లాడిన యూపీ మహిళ
ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటుతున్న వారి జాబితాలో ఇప్పుడు యూపీకి చెందిన నగ్మా చేరింది. ఇటువంటి ఉదంతాలు అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని థానేకు చెందిన పోలీసులు తాజాగా 24 ఏళ్ల మహిళను విచారిస్తున్నారు. ఆమె గత మే నెలలో పాకిస్తాన్ వెళ్లి, తరువాత ముంబైకి తిరిగి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. నగ్మా తన బిడ్డతో సహా పాకిస్తాన్ వెళ్లినట్లు పోలీసులకు తెలియవచ్చింది. అయితే ఆ మహిళ నకిలీ పత్రాలు, మారుపేరుతో పాకిస్తాన్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నకిలీ పత్రాలను ఉపయోగించి పాస్‌పోర్ట్, వీసా పొందడంలో నగ్మాకు సహాయం చేసిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆమె తాను పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నానని, అతనిని పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది. ఈ నేపధ్యంలో ఆమె వివాహ ధ్రువీకరణ పత్రం కూడా పోలీసులకు దొరికింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగ్మా స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఆమె ఉద్యోగరీత్యా థానేలో ఉంటోంది. ప్రస్తుతం పోలీసులు నగ్మా డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. -
తండ్రి స్నాప్‌చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
ఈ మధ్య కాలంలో యువత ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనియ్యలేదని, స్నేహితులు అల్లరి చేశారని.. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన ఫోన్లో స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంది. ఇది చూసిన ఆమె తండ్రి ఆమెను సున్నితంగా స్నాప్‌చాట్‌ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటలో సిక్స్... జీవితంలో ఔట్!
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిన ఆకస్మిక గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్ల ముందు హుషారుగా ఉన్న వారు క్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు ఆకస్మాత్తుగా కుప్పకూలి అందరికి దూరమవుతున్నారు.తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర థానెలోని మీరా రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రౌండ్లో రెండు టీమ్‌లు క్రికెట్ ఆడుతుండగా.. పింక్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేస్తున్న యువకుడు బంతిని గట్టిగా సిక్స్ కొట్టాడు. బాల్ అమాంతం ఎగిరి పార్క్ గ్రౌండ్ బయట పడింది. ఇంతలో ఏమైందో ఏమో వెంటనే ఉన్నచోటే బ్యాటర్ కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి క్రీడాకారులు అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడు కుప్పకూలడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#DisturbingVisuals : On camera, man dies immediately after hitting six in match near mumbai. In a shocking incident in Thane's Mira Road area in Maharashtra, a man died while playing cricket. #shocking#Thane #HeartAttack #Cricket #heartattack pic.twitter.com/882Zi9QwcS— Indian Observer (@ag_Journalist) June 3, 2024 -
కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరిలోని బాయిలర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్‌లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 దీంతో సమాచారం అదుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది.#THANE: Massive explosion in #Dombivli MIDC, preliminary information about explosion in amber company's boiler, fire tenders have rushed to the spot. Smoke billowing in the area. pic.twitter.com/mOFdJwylKu— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 -
పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు!
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి, ఇద్దరు మహిళలతో పాటు ఒక వృద్ధునికి గాయలయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు,, పక్కనే ఉన్న గోడ కూలిపోయాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తాడ్వి తెలిపారు. శాంతి నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో బ్యాటరీ పేలిపోయిందని అధికారి తెలిపారు. ఛార్జింగ్ కోసం ఇంట్లోనే బైక్ పెట్టుకున్నారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో 28 ఏళ్ల మహిళ, పొరుగింట్లో ఉంటున్న 66 ఏళ్ల వృద్ధుడు, 56 ఏళ్ల మహిళ గాయపడ్డారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
క్రికెట్ లీగ్‌లో రామ్ చరణ్.. సచిన్‌తో కలిసి స్టేడియాన్ని ఊపేసిన హీరో!
మెగా తనయుడు, హీరో రామ్ చరణ్ క్రికెట్ లీగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. గతంలోనే హైదరాబాద్‌ను జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఐఎస్పీఎల్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా ఉన్నారు. అంతే కాదు.. తనతో పాటు టీమ్‌లో చేరాలంటూ ట్విటర్ వేదికగా చెర్రీ పిలుపునిచ్చారు. తాజాగా ఐఎస్పీఎల్ టీ10 లీగ్ మహారాష్ట్రలోని థానేలో ప్రారంభమైంది. దడోజి కోనదేవ్ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మెగా హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ సూర్య, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్టేడియంలో సందడి చేశారు. చీర్ లీడర్స్‌తో కలిసి నాటు నాటు సాంగ్‌కు కాలు కదిపారు. చరణ్ డ్యాన్స్ చేస్తుండగా.. రవిశాస్త్రి, సచిన్ తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సచిన్, సూర్య, అక్షయ్ కుమార్, రవిశాస్త్రితో కలిసి మరోసారి స్టెప్పులు వేశారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా తెగ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీకి చెర్రీకి జంటగా కనిపించనుంది. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పని చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Sachin, Ram Charan, Suriya, Akshay Kumar doing the "Naatu Naatu" step in the inaugural function of ISPL. 🔥pic.twitter.com/d6YORP0JL8 — Johns. (@CricCrazyJohns) March 6, 2024 #RamCharan 🤝 #Suriya for @ispl_t10 Opening Ceremony !!@AlwaysRamCharan @Suriya_offlpic.twitter.com/spCjejkRC3 — Raees (@RaeesHere_) March 6, 2024 Man Of Masses @AlwaysRamCharan 🦁👑 Joins With a NAATU NAATU 🕺STYLE the Opening Ceremony Of @ispl_t10 at Dadoni Kondadev Athletics Stadium 📸✨💥🔥 In Frame Master #SachinTendulkar#Ravishastri ❤☺🤩#GameChanger #RamCharan 🦁👑🌟 pic.twitter.com/tNnUUwFCnN — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) March 6, 2024 -
పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు!
ప్రపంచంలో అంతకంతకూ అడుగంటుతున్న మానవత్వానికి ఉదాహరణగా నిలిచే ఉదంతం మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. స్థానిక కళ్యాణ్ నగర్లో ఓ భార్య.. భర్త పెన్షన్ కోసం అతనికి నిప్పంటించి, హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరో ఇద్దరి సహకారంతో ఈ మహిళ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. 61 ఏళ్ల భర్తకు నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన నేరంపై సదరు మహిళపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితుని కుమార్తె స్నేహితులైన ఇద్దరు యువకులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కాగా ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అతని భార్య.. అతనికి నెలనెలా వచ్చే పెన్షన్ విషయమై గొడవ పడేది. అలాగే ఆ ఇద్దరు యువకులు తమ ఇంటికి రావడంపై అతను అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. తన ప్రాణాలకు ఆ యువకుల వలన ముప్పు ఉందని బాధితుడు గతంలో ఆ యువకులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్యతో పాటు ఆ ఇద్దరు యువకులు అతనికి నిప్పంటించారు. దీనిని గమనించిన పొరుగింటివారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’ -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్‌డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్‌కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!
ఇళ్లలోకి కొడచిలువలు రావడం అనేది ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా జరుగతుంది. అక్కడ గ్రామాలు, పట్టణాల్లోని అపార్టమెంట్లోకి కూడా కొండ చిలువలు వస్తాయి. ఎందుకంటే ఈ కొడచిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. దీంతో పొరపాటున జొరబడటం లేదా అటాక్ చేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన తొలిసారిగా భారత్‌లో చోటు చేసుకుంది. భారత్‌లో గ్రామాల్లోని ఇళ్ల మద్య కొండచిలువ కనపడటం అరుదు. అందులోనూ అపార్టమెంట్లోకి చొరబడటం అనేది అస్సలు జరగుదు. అలాంటిది భారత్‌లోనే ఓ అపార్ట్మెంట్లో ఈ అరుదైన ఘటన జరగడం అదర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే.ఈ అనూహ్య ఘటన మహారాష్ట్రాలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భవనంలోని అపార్టమెంట్ విండోలోకి భారీ కొండచిలువ చొరబడింది. పాపం అది ఆ విండోకి ఉండే గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగిన దాన్ని రక్షించే యత్నం చేశారు. ఒకరు కిటికిలోంచి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా మరొకరు కిటికి బయటకు వచ్చి దాన్ని ఆ గ్రిల్ నుంచి విడిపించే యత్నం చేశారు. ఐతే చివరికి ఆ కొండచిలువ ఆప్రయత్రంలో అంత ఎత్తున్న ఉన్న అపార్ట్మెంట్ నుంచి కిందకు పడిపోయింది. అయితే ఆ తర్వాత ఆ కొండచిలువ అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పామును రక్షించే యత్నం చేసిన ఆ వ్యక్తులను ప్రశంసిస్తున్నారు కానీ ఆ భారీ కొండచిలువ అంత ఎత్తు నుంచి పడిపోయింది కాబట్టి ఎన్నో రోజులు అది బతకదు అంటూ ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరూ అస్సలు అది ఎలా అపార్ట్మెంట్లోకి చొరబడిందని ప్రశ్నిస్తూ మరొకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు పెట్టారు. A huge snake was spotted at a Thane Building, it was rescued by two brave persons, rescue video. 👇. #thane #mumbai pic.twitter.com/j2ZWrs9mR9 — Sneha (@QueenofThane) September 25, 2023 (చదవండి: కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కార్మికుల మృతి..!
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైరైజ్అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. టెర్రస్ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రంవెలుగు చూసింది. ఈ మేరకు థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కాగా థానేలోని ఘోడ్‌బందర్ రోడ్లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. ఆదివారం బిల్డింగ్ టెర్రస్‌పై వాటర్ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. సాయంత్రం పనులు ముగించుకున్న కార్మికులు 5.30 గంటల సమంలో పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి తెగిపోవడంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడింది. ఈ ఘటనలో యిదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతులను మహేంద్ర చౌపల్(32), రూపేష్ కుమార్ దాస్(21), హరున్ షేక్(47), మిత్లేష్(35), కారిదాస్(38)తోసహా మరో ఇద్దరి గుర్తించాల్సి ఉంది. ప్రమాదంపై థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదని తెలిపారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి P3 (అండర్ గ్రౌండ్ థర్డ్ లెవల్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా) వద్ద పడిందని యాదవ్ పేర్కొన్నారు. చదవండి: అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది... #WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW — ANI (@ANI) September 10, 2023 -
మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి
ముంబై: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. షాపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక బ్రిడ్జి గిర్డర్ లాంచర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిలాలోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్ ప్రెస్ నిర్మాణం మూడో దశ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రిడ్జిల నిర్మాణానికి ఉపయోగించే గిర్డర్ లాంచర్ సుమారుగా 100 అడుగుల ఎత్తు నుండి కుప్పకూలడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు మాత్రం గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన గురించి తెలుసుకుని పోలీసులు, NDRF, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, గాయపడినవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతకుముందు ఆదివారం రోజున బుల్దానా జిల్లాలో 6వ నెంబరు జాతీయ రహదారి మీద ఒక ట్రక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడం ఇక్కడి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. #UPDATE | Maharashtra: Two NDRF teams are working at the site after a crane fell on the slab of a bridge in Shahapur tehsil of Thane district. Till now 14 dead bodies have been retrieved and 3 have been injured. Another six are feared to be trapped inside the collapsed… https://t.co/3QiIuUwoIP pic.twitter.com/tptIFDfAfb — ANI (@ANI) August 1, 2023 ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం -
పుట్టినరోజున ప్రత్యేక కానుక.. షాక్ అయిన యువతి
ముంబై: పుట్టినరోజు అంటే సంబరం. అందులోనూ జన్మదిన వేడుకలో అందుకునే చిన్న చిన్న కానుకలు అంటే అపురూపంగా చూసుకుని మురిసిపోతారు. అలాంటిది ఒక మహిళ అనూహ్యంగా టమాటాలను గిఫ్ట్‌గా అందుకుని ఆశ్చర్యంలో మునిగింది. మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఈ కొత్తరకం బహుమతి ఘటన జరిగింది. సంబంధిత వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. థానె జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలోని కొచాడీలో ఉండే సోనల్ బోర్సే పుట్టినరోజు వేడుక ఆదివారం జరిగింది. ఆ ప్రాంతంలో కేజీ టమాటా ఏకంగా రూ.140 ధర పలుకుతోంది. అదే రోజు ఆమె నాలుగు కేజీలకుపైగా టమాటాలు ఉన్న బుట్టలను బహుమతిగా అందుకున్నారు. ఈసారి అకాల వర్షాలు, బిపర్జోయ్ తుపాను మిగిల్చిన విషాదం కారణంగా పంట నాశనమై దిగుబడి భారీగా తగ్గిపోయి టమాటా ధర రిటైల్ మార్కెట్లో చుక్కలనంటుతోంది. కొద్దిరోజులు గడిస్తే కొత్త పంట వచ్చి ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. -
కొన్నాళ్లుగా ప్రేమ.. నడిరోడ్డుపై దుస్తులు విప్పించి నగ్నంగా వదిలేసి
ముంబై: కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే తాను అనుకున్న టైం రానే వచ్చింది. వెంటనే మాట్లాడాలని పిలిచి తన స్నేహితులతో తీవ్రంగా కొట్టించడమే గాక.. బాయ్‌ఫ్రెండ్ దగ్గరున్న డబ్బు, నగదు లాగేసుకుంది ఓ ప్రియురాలు. అంతటితో ఆగకుండా దుస్తులు విప్పించి నడిరోడ్డుపై అతడిని నగ్నంగా వదిలేసి వెళ్లిపోయింది. బాధితుడిని షాహాపూర్‌లో నివాసం ఉంటున్న బాలాజీ శివ్భగత్గా పోలీసులు గుర్తించారు. అతను నిర్మాణ వ్యాపారం చేస్తున్నాడు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని భావికా బోయిర్, నదీమ్ ఖాన్‌లుగా గుర్తించారు. మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివభగత్ గత కొన్నాళ్లుగా ఓ యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడు. జూన్ 28న, తన ప్రియురాలు శివ్భగత్తో మాట్లాడాలని.. షాహాపూర్‌లోని అట్గావ్ హైవేపై సాయంత్రం ప్రాంతంలో రావాలని కోరింది. అయితే, ఆ లేడి కిలేడి అని తెలియని భగత్.. ప్రియురాలు చెప్పిన ప్రదేశానికి ఒంటరిగా వెళ్లాడు. ఆమె కోసమని కొన్ని బహుమతులు కూడా తీసుకెళ్లాడు. యువతి అతను మాట్లాడుతుండగా, నలుగురు ఎక్కడి నుంచో వచ్చారు గానీ అకస్మాత్తుగా భగత్‌పై దాడి చేశారు. అతడి వద్ద ఉన్న బంగారు చైన్, ఉంగరాలు లాగేసుకున్నారు. బాలాజీ తెచ్చిన బహుమతులను ఆ యువతి తీసేసుకుంది. ఆ తర్వాత అందులో ఒకడు బాలాజీని బెదిరించి దుస్తులు విప్పించాడు. ఈ తతంగమంతా మరో వ్యక్తి వీడియోలో రికార్డ్ చేశాడు. చివరిలో భగత్ కళ్లలో కారం కొట్టి అక్కడి నుంచి కారుతో సహా ఉడాయించారు. ఆ యువతి కూడా వారితో పాటే వెళ్లిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: బండ్లగూడ ప్రమాదం: లైసెన్స్ లేదు.. బర్త్‌డే నాడు దోస్తులతో హుషారుగా వెళ్తూ.. -
వార్తల్లో పృథ్వీ షా.. సీజ్ చేసిన లాంజ్‌లో తెల్లవారుజాముదాకా
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. కొంతకాలంగా మోడల్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్న పృథ్వీ షా ఈ సోమవారం రాత్రి థానేలోని నెహ్రూ నగర్లో ఉన్న మిట్రన్ లాంజ్‌కు వచ్చాడు. ఈ లాంజ్ హాంగ్ఔట్ ప్లేస్‌కు పాపులర్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఎయిర్ సీటింగ్ సౌకర్యం ఉన్న ఈ లాంజ్‌కు ఎంతో మంది సెలబ్రిటీలు వస్తుంటారు. అయితే మంగళవారం మిట్రన్ లాంజ్‌ను వేగల్ ఎస్టేట్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్ నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లాంజ్‌లో రెక్కీ నిర్వహించి సీజ్ చేశారు. ఆ సమయంలో పృథ్వీ షా అదే లాంజ్‌లో ఉన్నట్లు తేలింది. సీజ్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని పృథ్వీ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ బినూ వర్గీస్ తన ట్విటర్లో మిట్రన్ లాంజ్ గురించి రాయడం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ''ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత లాంజ్ బయట ఒక ఆరుగురు బౌన్సర్స్ కస్టమర్స్‌తో గొడవ పడుతున్నట్లు తెలిసింది. అయితే అన్ని బార్స్, లాంజ్, రెస్టారెంట్లకు అర్థరాత్రి 1:30 తర్వాత మూసేయాలని నిబంధన ఉంది. కానీ మిట్రన్ లాంజ్‌కు ఆ నిబంధన వర్తించదా. సెలబ్రిటీలు ఎక్కువగా వస్తారన్న కారణంతో స్పెషల్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా.. దీనివల్ల లాంజ్ చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీలు ఇబ్బంది పడుతాయి కదా.. దీనిపై వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాల్సిందే'' అంటూ రాసుకొచ్చాడు. బినూ వర్గీస్ ట్వీట్‌పై స్పందించిన ఎక్సైజ్ శాఖ వెంటనే అప్రమత్తం అయింది. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఇన్స్పెక్టర్ ఆర్సీ బిరాజ్దార్ తన సిబ్బందితో కలిసి లాంజ్‌లో రెక్కి నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్నడుస్తున్నందున పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో రెండు చార్జీషీట్లు దాఖలు చేశారు. చార్జీషీట్లో పేర్కొన్నవన్నీ కోర్టులో నిజమని తేలితే మెట్రజ్ లాంజ్ పర్మినెంట్‌గా క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక పృథ్వీ షా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పృథ్వీ 13.25 సగటుతో 106 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్థసెంచరీ ఉంది. Excise Department have lodge the Breech Case against Mitron Lounge, 2 More cases The Lounge will Shutdown Permanently #Nightlife #ThaneCitypolice #earthquake https://t.co/dKlv8f9Pek pic.twitter.com/LeOnlrZ7Xo — SBT News (@TimesSukhi) June 13, 2023 చదవండి: ఒక్క బంతికి 18 పరుగులా.. నువ్వు దేవుడివయ్యా! -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
నడిరోడ్డుపై స్నానం.. నవ్వులపాలే కాదు జైలుపాలు కూడా!
వైరల్ వీడియో: సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయేందుకు కొందరు చేసే ప్రయత్నాలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తి, ఓ యువతితో కలిసి స్కూటీపై స్నానం చేసిన వీడియో వైరల్ కాగా, దానికి పోలీసులు అంతే లెవల్లో రిప్లై ఇచ్చారు. థానే(మహారాష్ట్ర) ఉల్లాస్‌నగర్‌లోని ఓ సిగ్నల్ వద్ద ఆ ఇద్దరూ ఈ చేష్టలకు దిగారు. వెనక కూర్చున్న యువతి బకెట్లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తూ కనిపించింది. దారినపోయేవాళ్లంతా వాళ్ల వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. అయితే.. ఆ వీడియో వైరల్ కావడం, అది కాస్త థానే పోలీసుల దాకా చేరడం, వాళ్లూ స్పందించడం చకచకా జరిగిపోయాయి. వీ డిజర్వ్ బెటర్ గవర్నమెంట్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది. దీంతో స్పందించిన పోలీసులు.. సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే.. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు ఆ వీడియోను షేర్ చేసి మరీ చర్యలు తీసుకోవాలని కోరారు. నడిరోడ్డుపై పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడడిన కారణంగా అతనిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు సైతం అతనిపై కేసు నమోదు చేసి ఛలానా విధించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్ ఆదర్శ్ శుక్లా అట. తాను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్చేశాడతను. అయినా కూడా చర్యలు తప్పవని థానే పోలీసులు చెబుతున్నారు. @DGPMaharashtra @ThaneCityPolice This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa — WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023 -
ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం.. డబ్బుల విషయంలో గొడవ.. చివరకు
సాక్షి, ముంబై: మహారాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. థానే జిల్లాలోని భీవండీ పట్టణంలోని ట్రాన్స్‌జెండర్ తలపై బండతో కొట్టి హత్య చేసిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీబస్తీ ప్రాంతానికి చెందిన హిజ్రా (ట్రాన్స్‌జెండర్) తౌహిక్తో లాహోటి ప్రాంతానికి చెందిన స్నేహితుడు కామిల్ జమీల్ అన్సారీ గత కొన్ని నెలలుగా అసహజ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య పరస్పర తగాదాలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు రోడ్డుపై ఇదే విషయమై మరోసారి ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. కోపంతో ట్రాన్స్‌జెండర్ బెబ్బొ తలపై జమీల్ బలమైన రాయితో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనంతరం అనేక మంది హిజ్రాలు భీవండి పట్టణ పోలీస్ స్టేషన్ చుటుముట్టి వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఇన్స్పెక్టర్ చేతన్ కాకడే ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: ఎంత విషాదం.. పెళ్లి రిసెప్షన్ నుంచి వెళ్తుండగా ఊహించని ప్రమాదం -
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం
మహారాష్ట్ర: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థానేలోని షాపింగ్ మాల్లో మంగలవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓరియన్ బిజినెస్ పార్క్, సినీ వండర్ మాల్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరగడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. మెత్తం 10 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు సమాచారం. -
‘అయేషా వస్తేనే నీ కొడుకు క్షేమంగా ఉంటాడు.. లేదంటే!’
ముంబై: వివాహేతర సంబంధం కోసం మహిళ కొడుకును అపహరించిన సంఘటన థానే జిల్లాలోని శాంతినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టణంలోని మహ్మద్ అలీ ఫకీర్, అయేషా బీబీ దంపతులు టెమ్‌ఘర్ మురికివాడలో ఉంటున్నారు. రిపోన్ వ్యాపారి అనే వ్యక్తితో అయేషాకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తనతోపాటు వచ్చేయాలని అయేషాపై ఒత్తిడి పెంచాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఏప్రిల్ 3న సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆషిక్ (4)ను కిడ్నాప్ చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించిన అలీ, అయేషా స్థానిక శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి వచిన వారికి రిపోన్ వ్యాపారి ఫోన్ చేసి ‘మీ కుమారుడు నావద్దనే ఉన్నాడు. అయేషా వస్తేనే సురక్షితంగా ఉంటాడు. లేదంటే హతమారుస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే శాంతినగర్ పోలీసులకు తెలిపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాసిక్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గ్రహించిన సీనియర్ ఇన్స్పెక్టర్ శంకర్ తన బృందంతో 24 గంటల్లో నిందితుని పట్టుకొన్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. -
ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్ నయం చేస్తానంటూ రూ.15 లక్షలు టోకరా!
ఆదునిక టెక్నాలజీతో కూడిన వైద్యం వచ్చాక ఆయుర్వేదం వైద్యం వైపుకి జనం వెళ్లటం చాలా వరకు తగ్గిపోయారు. ఐతే ఇంకా అక్కడక్కడ కొంతమంది ఆయుర్వేద వైద్యాన్నే నమ్ముతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునే కొందరు దుండగలు అమాయక ప్రజలను పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..థానే రైల్వే సిబ్బంది ఒక ఆయుర్వేద సెంటర్‌పై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆయుర్వేద వైద్యంతో తగ్గిస్తానంటూ ఇద్దరు వ్యక్తులు సుమారు రూ. 15 లక్షలు తీసుకున్నారని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు రైల్వే పెయింటర్. గత ఏడాది ఫిబ్రవరి నుంచి తన భార్యకు ఆ ఆయుర్వేద సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. అయితే తన భార్య పరిస్థితిలో మార్పురాలేదని వాపోయాడు. దీంతో ఆ ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులు ముఖం చాటేస్తూ..తప్పించుకుని తిరుగుతన్నారని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు సదరు ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని, ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!) -
గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు.. 13 ఖరీదైన బైక్‌లు చోరీ
ముంబై: గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయాలని ఓ యువకుడు దొంగగా మారాడు. ఖరీదైన బైకులు దొంగతనం చేశాడు. మొత్తం 13 ద్విచక్ర వహనాలకు తస్కరించి కటకటాలపాలయ్యాడు. మహారాష్ట్ర థానె జిల్లా కల్యాణ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ యువకుడి పేరు శుభం భాస్కర్ పవార్. ఓ బైక్‌ను దొంగిలించిన ఇతడ్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే అతడ్ని విచారించగా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. తాను మొత్తం 13 బైక్‌లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు. కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పాడు. ఈ బైక్‌ల విలువ రూ.16లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు చెప్పారు. చదవండి: లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్ -
పోలీసులే డబ్బు రికవరీ చేస్తారని పక్కాగా స్కెచ్..కానీ చివర్లో..
ఒక వ్యక్తి పోలీసులనే బురిడీ కొట్టించాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని థానేలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 27 ఏళ్ల వ్యక్తి డబ్బులు పోయాయంటూ థానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కంపెనీకి సంబంధించిన బ్యాంకు నుంచి సుమారు రూ. 5 లక్షల నగదును డ్రా చేసి వస్తుండగా.. నలుగురు దుండగులు తన బైక్‌ని ఆపి కళ్లలోకి కారం జల్లి నగదు బ్యాగ్ పట్టుకుపోయారంటూ కట్టుకథ అల్లి మరీ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్మాప్తు చేయడం ప్రారంభించారు. అతను ఎక్కడ డబ్బు పోయిందన్నాడో ఆయా పరిసరాల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లో పరిశీలించగా..వాటిల్లో ఎక్కడా అతను బైక్‌పై బ్యాగుతో వెళ్తున్నట్లు కనిపించలేదు. ఆఖరికీ అతని బైక్‌ని ఆపిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఆ వ్యక్తిపై మరింత అనుమానం కలిగి తమదైన తరహాలో విచారించారు. దర్యాప్తులో అతడు చెప్పిన విషయాలు వినీ పోలీసులే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సంస్థ తరుఫున విత్ డ్రా చేసిన మనీ తన వద్దే ఉంచుకోవాలనిపించిందని, అందుకనే ఇలా కట్టుకథ అల్లి ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. ఆ డబ్బును పోలీసులే ఏదోవిధంగా రికవరీ చేస్తారనుకున్నాని చెప్పడంతో..పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఠారెత్తించే ఘోర ప్రమాదం..కానీ చివర్లో అదిరిపోయే ట్విస్ట్) -
బీజేపీ నేతపై మిత్రపక్ష వర్గీయుల దాడి
ముంబై: బీజేపీ మద్దతుతో శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి విదితమే. అయితే.. ప్రత్యర్థి పక్షంగా ఉన్న రోజుల నుంచి ఈ రెండు వర్గాల నడుమ కొనసాగుతున్న వైరం.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఉవ్వెత్తున పైకి లేచి.. ఇప్పుడు తారాస్థాయిలో కొనసాగుతోంది. అదీ నియోజకవర్గాల వారీగా కావడం గమనార్హం. తాజాగా షిండే వర్గం మిత్రపక్ష నేతపైనే దాడికి పాల్పడింది. మిత్ర పక్షాల నడుమ పోరు మంచిది కాదని, ఐక్యతతో ముందుకు సాగాలని ఇటు సీఎం షిండే, అటు డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఇస్తున్న పిలుపు ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకు చెవికెక్కడం లేదు. థానేలో బీజేపీ ఆఫీస్ బేరర్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ జాదవ్‌కు, షిండే వర్గీయులకు గొడవ జరిగింది. గురువారం వాగ్లే ఎస్టేట్‌లోని పరబ్‌వాడీ దగ్గర బ్యానర్లు, ఫ్లకార్డులు ఏర్పాటు విషయంలో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలను హెచ్చరించి పంపించారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ జాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని షిండే వర్గీయులకు దాడికి దిగారు. పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఆయన్ని చితకబాదారు. ఈ దాడిలో తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం!. ఆపై ఈ గొడవపై ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఇరు పక్షాలు ఎవరికి వాళ్లు అవతలి వాళ్ల మీదే నిందలు వేయడం ప్రారంభించారు. हल्लेखोरांवर तात्काळ कारवाई करा @ThaneCityPolice असले नीच कृत्य करणाऱ्यांचा तिव्र निषेध@CMOMaharashtra @Dev_Fadnavis https://t.co/JfciHraaem — Chitra Kishor Wagh (@ChitraKWagh) December 30, 2022 మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని స్టేషన్ బయట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీంతో మరోసారి గొడవ జరుగుతుందేమోనన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి అక్కడ. ఇక ఈ ఘర్షణలపై బీజేపీ మహిళా మోర్చా పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. దోస్తీకి దోస్తీ.. దెబ్బకు దెబ్బ.. రక్తానికి రక్తం అంటూ ట్వీట్లో పేర్కొంది. పరిస్థితి చల్లార్చేందుకు ఇరు పార్టీలు కీలక నేతలను థానేకు పంపనున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరిహారంగా రూ.65.62లక్షలు
సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా రూ.65.62 లక్షలు చెల్లించాలని థానె జిల్లా మోటారు ప్రమాదాల క్లెయిమ్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) బీమా సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను, ప్రమాదానికి కారణమైన మరో వాహనదారుడిని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఏడాదికి 8శాతం వడ్డీతో సహా సదరు బాధిత కుటుంబానికి అందజేయాలని ఎంఏసీటీ స్పష్టం చేసింది. ఈమేరకు ఎంఏసీటీ సభ్యుడు హెచ్.ఎం భోశాలే ఆదేశాలిచ్చారు. అయితే ఈ ఆదేశాలను గతనెల 16న ఇవ్వగా సోమవారం లిఖితపూర్వకంగా బీమా సంస్థకు, సదరు వాహన యజమానికి అందజేశారు. పిటిషనర్‌తరఫున ఎస్టీ కదమ్ ట్రిబ్యునల్ వాదనలు వినిపించారు. సందేశ్ షిండే (35) అనేవ్యక్తి తన స్నేహితుడితో కలసి మోటార్ సైకిల్‌పై కోపార్టైన్‌కు 2020 మార్చి 18 రాత్రి బయల్దేరి వెళ్తుండగా.. ఒక ట్రాలర్ వచ్చి వారిని వేగంగా ఢీకొట్టండంతో వాళ్లిద్దరూ పడిపోయారు. అయితే సందేశ్ షిండే అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. షిండే చనిపోయేనాటికి ఓ ప్రైవేటు కంపెనీలో నెలకు రూ.32.655 జీతాన్ని సంపాదిస్తున్నాడు. ఆ కుటుంబానికి షిండేనే ఆధారం కావడంతో అతని మృతితో కుటుంబం రోడ్డున పడిపోయింది. అతడికి భార్య, ఇద్దరు కొడుకులు, తల్లి ఉన్నారు. షిండే మృతి అనంతరం ప్రమాదానికి కారణమైన ట్రాలర్ యజమానితోపాటు బీమా సంస్థ నేష నల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా వీరికి నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకోకుండా వివి« ద రకాల కారణాలను చూపి అడ్డుకున్నారు. అయితే ఎంఏసీటీలో వాదనల అనంతరం బాధిత కుటుంబానికి రూ.63.96లక్షలు నష్టపరిహారంగా, రూ.16,500 మట్టి ఖర్చులకుగా ను, భార్యకు రూ.44000, తల్లికి రూ.88,000 చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత -
వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్
సాక్షి, థానె: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ మహిళను మానవ అక్రమ రవాణా నిరోధక శాఖ విభాగం పోలీసులు రెడ్ హ్యెండెడ్‌గా పట్టుకున్నారు. రాష్ట్రంలోని థానె నగరంలో ఓ ఖరీదైన ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన మహిళ బయట ప్రాంతాలకు చెందిన నలుగురు యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తోందన్న సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. కాగా ఈ వ్యభిచార ముఠా నుంచి నలుగురు యువతుల్ని పోలీసులు రక్షించారు. వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరిని వ్యభిచార రొంపిలోకి దించిన సదరు మహిళను పోలీసులు అరెస్టు చేసి ఆమెపై ఐపీసీ, మావన అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
కార్పొరేటర్‌పై దౌర్జన్యం.. కర్రలు, రాళ్లతో దాడి
సాక్షి, ముంబై: భివండీ పట్టణంలోని లాహోటి కంపౌండ్ ప్రాంతంలో గురువారం రాత్రి బీజేపి కార్పొరేటర్ నిత్యానంద్ నాడార్ అలియాస్ వాసు అన్నాపై దాడి జరిగింది. తన మర్సిడీస్ కారులో కార్యాలయం నుంచి వెళ్తున్న వాసు అన్నాపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తలపై, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవిలో రికార్డు అయినట్లు తెలుస్తుంది. బీజేపీ కార్పొరేటర్ వాసు అన్నా తన కార్యాలయంలో పనులు ముగించుకొని రాత్రి సుమారు 9 గంటలకు తన స్వంత మర్సిడీస్ కారులో డ్రైవర్, బాడీగార్డ్‌తో కలిసి ఇంటికి బయలుదేరాడు. తన కార్యాలయానికి కేవలం వంద అడుగుల దూరంలోనే ఓ వ్యక్తి కారుని ఆపడంతో హుటాహుటిన ఓ ముఠా కారుని అడ్డుకొని రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో కూర్చున్న నిత్యానంద్ నాడార్‌పై కూడా దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడిలో నిత్యానంద్‌కు ముఖంపై, తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ వేగంగా కారును తోలడంతో ఆయన ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు. కళ్యాన్ రోడ్‌లోని హిల్ లైఫ్ ఆనే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ చేతన్ కాఖడే తో పాటు బృందం సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సతీష్ వావిలాల, కోళి దేవా, ఇబ్రహీం, దాసి సాయినాథ్తో పాటు పది పన్నెండు మంది వ్యక్తులు దాడి చేశారని నిత్యానంద్ నాడార్ పిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సతీష్ వావిలాలను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మరికొద్ది నెలల్లో కార్పొరేషన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, వార్డు నంబర్ 16లో పలువురు అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించడంతో ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీలో వివాదాల వల్లే ఈ దాడి జరిగిందని, పార్టీలో లాబీయింగ్ జరుగుతుందని ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పడంవల్లే నాపై దాడి జరిగిందని కార్పొరేటర్ నిత్యానంద్ నాడార్ ఆరోపించారు. సీసీ టీవి ఆధారంగా దాడి చేసిన ముఠాల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ చేతన్ కాఖడే తెలిపారు. అయితే పారీ్టలోని విభేదాల కారణంగానే ఈ దాడి జరిగిందా అన్న విషయంలో ఇంకా స్పస్టత రాలేదు. చదవండి: వణికిస్తున్న వైరస్.. మీజిల్స్‌తో మరో బాలుడి మృతి -
నకిలీ నోట్ల ముఠా హల్చల్: గుట్టలుగా రూ.2 వేల నోట్ల కట్టలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు అయింది. ఈ సందర్బంగా థానే క్రైమ్ బ్రాంచ్ భారీ ఎత్తున నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ. 2 వేల నకిలీ నోట్ల 400 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం) ఇదీ చదవండి: అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా? నిందితులు రామ్ శర్మ, రాజేంద్ర రౌత్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. వీరి నుంచి భారీ మొత్తంలో రూ.2000 నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.8 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులిద్దరూ పాల్ఘర్ నివాసితులని తెలిపారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్‌కు తరలించాలని ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. కాసర్వాడవలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెట్వర్క్ ఎంత విస్తరించిందీ దర్యాప్తు చేస్తున్నారు. (ఓలా ఎలక్ట్రిక్ బైక్ కమింగ్ సూన్, సీఈవో ట్వీట్ వైరల్) #WATCH | Maharashtra: Unit 5 of Thane Crime Branch seized fake Indian currency notes in Rs 2000 denomination with face value of Rs 8 Cr. Two people, both of them residents of Palghar, arrested. Search for other accused underway, probe initiated. (Video: Thane Crime Branch) pic.twitter.com/DwkZcmMK7e — ANI (@ANI) November 12, 2022 (హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్) (ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?) -
'హర్ హర్ మహాదేవ్' ప్రదర్శన నిలిపివేత.. ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరాఠీ చిత్రం ‘హర్ హర్ మహదేవ్’ సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించినందుకు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్సీపీ నేత అవద్, తన అనుచరులతో కలిసి థానే నగరంలోని ఓ మల్టిప్లెక్స్లోకి బలవంతంగా ప్రవేశించారు. ‘హర్ హర్ మహాదేవ్’ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ ఆరోపిస్తూ స్క్రీనింగ్‌ను అడ్డుకున్నారు. అంతేగాక సినిమా చూస్తున్న ప్రేక్షకులపై దాడి చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. హర్ హర్ మహాదేవ్ చూసినందుకు సినిమా ప్రేక్షకులను కొట్టడాన్ని సహించేది లేదని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తాను సినిమా చూడలేదని, ఈ వివాదం గురించి తెలియదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు అనుమతి ఉంది కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని ఫడ్నవీస్ హెచ్చరించారు. చదవండి: Gyanvapi Mosque Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం -
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. కిడ్నాప్ డ్రామాతో జైలుపాలు
ముంబై: ఇద్దరు భార్యలున్నా తనను పట్టించుకోవట్లేదని సూపర్ ప్లాన్ వేశాడు ఓ భర్త. తాను కన్పించకపోతే వాళ్లే వెతుక్కుంటూ వస్తారని భావించాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్‌తో కిడ్నాప్ డ్రామా ఆడాడు. అంతా పథకం ప్రకారమే జరిగినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగడంతో దొరికిపోయాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్ర ఠాణెలోని కల్యాణ్‌లో ఈ ఘటన జరిగింది. వివారాల్లోకి వెళ్తే.. కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి పేరు సందీప్ గైక్వాడ్. మొదటి పెళ్లి విషయం దాచి సునీత గైక్వాడ్‌ను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు భార్యలు ఇతడ్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. మొదటి భార్య దూరంగా ఉంటోంది. అయితే అక్టోబర్ 14న సునీతతో కలిసి దిలీప్ ఓ రోడ్డుపై స్కూటీని పార్కు చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడ్ని కొట్టి తీసుకెళ్లారు. దీంతో వెంటనే సునీత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత ఆ ఆటో ఎక్కడుందో ట్రేస్ చేశారు. దిలీప్‌ను, అతనిపాటు ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే విచారణలో సునీత తల్లే.. దిలీప్‌ను కిడ్నాప్ చేయమని చెప్పిందని, అతడ్ని తన బిడ్డ నుంచి దూరం చేయాలనే ఇందంతా చేసిందని ముగ్గురూ చెప్పారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి కచ్చితమైన వివరాలతో మరోసారి విచారించగా అప్పుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు నిందితులు. తామంతా స్నేహితులమని, దీలిప్ తన భార్యల సింపతీ కోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా! -
ISSF World Championship: 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్
కైరో: విశ్వ వేదికగా మరోసారి భారత షూటర్ గురి అదిరింది. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత్ ‘పసిడి’ ఖాతా తెరిచింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో రుద్రాంక్ష్ 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. థానేకు చెందిన రుద్రాంక్ష్ ఫైనల్లో 17–13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్ సొలాజో (ఇటలీ)పై గెలుపొందాడు. తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న రుద్రాంక్ష్ ఫైనల్లో ఒకదశలో 4–10తో వెనుకంజలో ఉన్నాడు. అయినా ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యంపై గురి పెట్టిన ఈ టీనేజ్ షూటర్ చివరకు నాలుగు పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు 114 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 633.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన అంకుశ్ కిరణ్ జాదవ్ 630.6 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్ మ్యాచ్‌కు అర్హత సాధించారు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో సొలాజో 262.7 పాయింట్లతో, రుద్రాంక్ష్ 261.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వర్ణ పతక పోరుకు అర్హత పొందారు. అంకుశ్ 154.2 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో 261.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన చైనా షూటర్ లిహావో షెంగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ షూటర్‌గా రుద్రాంక్ష్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రుద్రాంక్ష్ రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రుద్రాంక్ష్ రజతం నెగ్గగా.. ఈ ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరమే సీనియర్ జట్టులోకి వచ్చిన రుద్రాంక్ష్ రెండు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా పతకం సాధించలేకపోయాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసి స్వర్ణంతోపాటు ఒలింపిక్స్‌కు అర్హత పొంది ఔరా అనిపించాడు. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆరో భారతీయ షూటర్ రుద్రాంక్ష్ . గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్‌జిత్ సంధూ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్) ఈ ఘనత సాధించారు. -
షాకింగ్ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ క్రూరంగా ప్రవర్తించాడు. ఈ ఘోరం సీఎం ఏక్నాథ్ షిండే నియోజకవర్గం థానే నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు 21 ఏళ్ల యువతి కళాశాలకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో యువతి అతినిపై ఎదురు తిరిగి ప్రశ్నించగా.. అతడు ఆమె చేతిని పట్టుకొని లాగాడు. తరువాత నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా యువతి అతడిని వదిలిపెట్టలేదు. ఆటో తీసి పరారవుతుండగా అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అయితే ఆటో డ్రైవర్ యువతిని అలాగే 500 మీటర్లు తన బండితోపాటు ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమెను ఓ చోట కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. యువతిని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది Shocking! In CM’s constituency by an autodriver. HM should resign.#Maharashtra https://t.co/dL5JV3kMip — Shraddhey (@shraddhey) October 14, 2022 -
నిప్పు రాజేసిన వివాహేతర సంబంధం... భర్త చేతిలో తల్లి కూతుళ్లు సజీవ దహనం
థానే: మహారాష్ట్రలోని ఒక వ్యక్థి ఘోరమైన అకృత్యానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యని, కూతుళ్లను నిర్ధాక్షణ్యంగా సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డోంబివిలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఈ ఘటనలో నిందితుడి భార్య 35 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కూతుళ్లు సమీర(14), సమీక్ష(11) 90 శాతం తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ఐతే వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అలాగే నిందితుడు ప్రీతీ శాంతారామ్ పాటిల్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడని, అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. పోలీసులు విచారణలో నిందుతుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యని కూతుళ్లను వేధిస్తున్నాడని, అందులో భాగంగానే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ఐతే ఈ ఘటన శనివారం సాయంత్రం 5.30 గం.ల ప్రాంతంలో జరిగితే సుమారు 8.30 గం.లకు...అంటే దాదాపు మూడు గంటల ఆలస్యంతో వెలుగులోకి వచ్చిందని, అందువల్లే బాధితులు తీవ్రంగా గాయలపాలయ్యారని అన్నారు. (చదవండి: దారుణం.. కత్తులతో పొడిచి చంపుతున్నా చూస్తూ ఉండిపోయారు!) -
ఒలెక్ట్రాకు 123 ఈ–బస్‌ల ఆర్డర్.. ఏడు కోట్ల కిలోమీటర్ల ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్ కన్సార్షియం తాజాగా 123 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరాకై లెటర్ ఆఫ్ అవార్డును అందుకుంది. థానే మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్ నుంచి దీనిని చేజిక్కించుకుంది. ఆర్డర్ విలువ రూ.185 కోట్లు అని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. ఈవీ ట్రాన్స్ ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుండి కొనుగోలు చేసి 9 నెలల్లో డెలివరీ చేయనుంది. లిథియం అయాన్ బ్యాటరీని బస్‌లకు పొందుపరిచారు. నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే కంపెనీ తయారీ బస్‌లు ముంబై, పుణే, నాగ్‌పూర్‌లో పరుగెడుతున్నాయి. ఒలెక్ట్రా ఈ–బస్‌లు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
రోడ్డుపై గుంత ఎంతపని చేసింది.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు!
ముంబై: రోడ్లపై పడిన గుంతలను సకాలంలో పూడ్చకుండా అధికారులు చేసిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గుంత కారణంగా బైక్ అదుపుతప్పి లారీ టైర్ కింద పడి నుజ్జునుజ్జయ్యాడు ఓ యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుడిని గణేష్ ఫాలే(22)గా గుర్తించినట్లు థానే మున్సిపల్ కర్పోరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. అదుపుతప్పి లారీ టైర్ల కింద పడిపోయిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దివా-అగసాన్ రోడ్డులో యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా ట్యాంకర్ లారీ వస్తోంది. దీంతో పక్కనుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ మార్గంలో గుంత ఉంది. బైక్ వెనుక చక్రం అందులోకి వెళ్లగానే అదుపుతప్పింది. దీంతో లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు బాధితుడు. లారీ డ్రైవర్ చూసుకోకపోవటం వల్ల అతడిపై నుంచి వెళ్లింది. ఎదురుగా వస్తున్న కొందరు వెంటనే స్పందించి లారీ ఆపాలని సూచించారు. ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. బాధితుడిని వెంటనే కల్వా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారిన క్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఎమ్మెల్యే రాజు పాటిల్ ట్వీట్ చేశారు. రోడ్డుపై గుంతల కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అధికారులపై విమర్శలు చేశారు. ఏక్నాథ్ షిండేకు ట్యాగ్ చేస్తూ రోడ్డు పనులు కేవలం పేపర్‌పైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. दिवा ठाण्यात, आणि ठाण्याचेच मुख्यमंत्री…..दिव्यात आज पुन्हा एकदा खड्ड्यामुळे बळी गेला. कामांच्या फक्त कागदावर घोषणा होत आहेत पण कामं होत नाहीत. @TMCaTweetAway अजून किती बळी घेणार ? @mieknathshinde @CMOMaharashtra pic.twitter.com/vKo3K8bBWa — Raju Patil ( प्रमोद (राजू) रतन पाटील ) (@rajupatilmanase) August 28, 2022 ఇదీ చదవండి: వాహనదారులకు అలర్ట్: ఆ హైవేపై భారీ వాహనాలకు నిషేధం -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముంబై, గుజరాత్ల నుంచి అమ్మాయిలను..
ముంబై: గుట్టు చప్పుడు కాకుండా థానె పట్టణంలో వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని థానె పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిలాల్ కొకాన్ మోరల్ (26) అనే వ్యక్తి థానె, ముంబై, నవీ ముంబై, పుణె, చెన్నై, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లనుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార ముఠాను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారాన్ని అందుకున్న థానెలోని మానవ అక్రమరవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీసీ) పోలీసులు వలపన్ని బిలాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటుగా మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం థానెలోని కోప్రీ పోలీసు స్టేషన్లో బిలాల్‌ను ఉంచి మరింత సమాచారాన్ని పోలీసులు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. -
మానవత్వం: మమతమ్మా... నీ మేలు మరువనమ్మా!
సమైక్య భావన స్ఫూర్తి గురించి చెప్పడానికి... పెద్ద పెద్ద సిద్ధాంతాలే అక్కర్లేదు. చిన్న సంఘటనలు చాలు! ఆరోజు ఏమైందంటే... థానే (ముంబై)లోని దివ రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫామ్ నంబర్:1 ఎప్పటిలాగే ఆ ఉదయం రైలు బండ్ల శబ్దాలు, ప్రయాణికుల అరుపులు, కేకలతో ౖరైల్వేస్టేషన్ సందడిగా ఉంది. తిత్వాల ప్రాంతానికి చెందిన నజ్‌మింజహాన్ తన భర్త ఫసిముద్దీన్తో కలిసి ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.ఆమె గర్భిణి. రొటీన్–చెకప్‌లో భాగంగా నాయర్ హాస్పిటల్ వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చింది. కొద్దిసేపటి తరువాత... ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త ఆందోళన పడుతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడంలేదు. ‘ఎవరో ఒకరు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళతారులే’ అని ఎవరికి వారు అనుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. కొందరు మాత్రం రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. హుటాహుటిన రైల్వే అధికారులతోపాటు అక్కడికి వచ్చింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మమత దంగి. నొప్పులు ఎక్కువయ్యాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మహిళా రైల్వే ఉద్యోగులు, మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారిని నజ్‌మింజహాన్ దగ్గరకు తీసుకువచ్చింది మమత. అందుబాటులో ఉన్న వస్తువులతో మేక్‌షిఫ్ట్ క్లాత్ కర్టెన్ను తయారుచేసింది. అందరిలో ఉత్కంఠ! ఏమవుతుందో ఏమో!! ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించాయి. నజ్‌మింజహాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ‘హమ్మయ్య’ అనుకున్నారు జనాలు. ‘ఆమె మీ ఇంటి అమ్మాయే అనుకోండి... ఒకసారి రండి.... ప్లీజ్... చేతులెత్తి దండం పెడతాను’ అనే మమత మాటలు ప్రయాణికులను కదిలించాయి. ఆ తరువాత...తల్లీబిడ్డలను దివలోని ఒక ప్రైవెట్ హాస్పిటల్లో చేర్పించారు. తల్లీబిడ్డలను హాస్పిటల్లో చేర్పించడానికి ప్రయాణికులు కొందరు తమ ప్రయాణాలు మానుకొని మరీ హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ‘ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చూడడం ఇదే మొదటిసారి. నిజానికి ఆరోజు నేను అర్జంటుగా వేరే చోటుకు వెళ్లాలి. ట్రైన్ వచ్చే సమయం అయింది. అయితే మమత మాటలు నన్ను కదిలించాయి. నా పని, ప్రయాణం గురించి పట్టించుకోకుండా ఆమెతోపాటు వెళ్లాను’ అంటుంది సహాయక కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి. సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సతారా మమత కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. -
గాయపడ్డ మహిళా కానిస్టేబుల్.. పెద్ద మనసు చాటుకున్న సీఎం షిండే
సాక్షి,ముంబై: మహారాష్ట్ర నూతన సీఎం ఏక్నాథ్ షిండే మంచి మనసు చాటుకున్నారు. థానేలో బుధవారం ఓ సమావేశంలో పాల్గొని తిరిగివెళ్తుండగా అక్కడే గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఆయన గమనించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో సిబ్బంది హుటాహుటిన ప్రత్యేక వాహనంలో కానిస్టేబుల్‌ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. థానే కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం షిండే. జులై 10న ఆషాడి ఏకాదశి సందర్భంగా విఠలుడిని ఆరాధించే వార్కీల ఏర్పాట్ల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఆ రోజు పండరీపూర్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే వార్కీల వాహనాలకు టోల్ రుసుం తీసుకోవద్దని ఆదేశించారు. దీని కోసం వారు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకని స్థానిక పోలీసుల వద్ద నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు. ఈ సమావేశం అనంతరం షిండే కార్యాలయాన్ని వీడుతుండగా.. ఆయనను చూసేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఆ సమూహంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆమెను చూసిన షిండే.. కాసేపు ఆగి ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీ మద్దతుతో షిండే సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. -
Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్కమ్ చెప్పిన భార్య
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఏక్నాథ్ షిండే తన సొంత నియోజకవర్గమైన థానే స్వగృహానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. బ్యాండు, మేళాలు, బాణసంచా పేలుస్తూ శిండేకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి లతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. షిండే రాక సందర్భంగా ఆమె స్వయంగా డ్రమ్స్ వాయించి భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బ్యాండ్, పాటు లతా షిండే డ్రమ్స్ వాయించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Wife of Maharashtra CM Eknath Shinde, Lata Shinde, beat a drum to welcome him in Thane yesterday, 5th July. He was arriving at his home for the first time after becoming the CM of the state and received a warm welcome from his supporters. pic.twitter.com/0yzZUDJvtY — ANI (@ANI) July 6, 2022 ఏ ఒక్క శివసైనికుడికి అన్యాయం జరగదు కాగా షిండే తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం ముంబై నుంచి థానేకు బస్సులో బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు థానే చేరుకున్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చిన కార్యకర్తలు భారీ వర్షంలో అలాగే నిలుచుండి స్వాగతం పలికారు. సుమారు నాలుగు గంటల పాటు స్వాగత ర్యాలీ జరిగింది. దివంగత శివసేన నేత ఆనంద్ దిఘే స్మృతి స్ధలంవద్ద షిండే నివాళులర్పించారు. ఈ సందర్బంగా షిండే మాట్లాడుతూ.. దివంగత హిందు హృదయ్ సమ్రాట్, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే, ధర్మవీర్ ఆనంద్ దిఘే ఆశీర్వాదంతో రాష్ట్రంలో శివసేన–బీజేపీ ప్రభుత్వం అస్థిత్వంలోకి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, ఏ ఒక్క శివసైనికుడికి కూడా అన్యాయం జరగదని నూతన ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. చదవండి: Eknath Shinde-బీజేపీ మీరనుకుంటున్నట్టు కాదు: సీఎం షిండే ట్రాఫిక్ జామ్ శిండే స్వాగత కార్యక్రమం కారణంగా థానే–ముంబై సరిహద్దులో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చింది. గత్యంతరం లేక వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఒక పక్క భారీ వర్షం, మరోపక్క రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా అప్పటికే థానేలో ట్రాఫిక్ మందకొడిగా సాగుతోంది. దీనికి తోడు సీఎంకు స్వాగతం పలికేందుకు అక్కడక్కడ ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు, కటౌట్లు ట్రాఫిక్‌ను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. -
పవార్‌పై అనుచిత పోస్ట్.. 20 కేసులతో జైల్లోనే నటి
ముంబై: మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ షేరింగ్ చేసిన వ్యవహారంలో నటికి ఊరట దొరకడం లేదు. బెయిల్ దొరికినా.. మరాఠీ నటి కేతకి చిటలే(29) ఇంకా జైల్లోనే ఉన్నారు. అందుకు కారణం.. ఆమెపై ఏకంగా 20 దాకా కేసులు నమోదు కావడం. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే.. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న థానే పోలీసులు.. మే 14వ తేదీన ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మధ్యలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. ఇది జరిగి నెల కావొస్తోంది. అయితే.. థానే కోర్టు తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆమె ఇంకా జైల్లోనే ఉంది. అనుచిత పోస్ట్ షేరింగ్ విషయంలో ఆమెపై 20 కేసులు నమోదు అయ్యాయని, అందుకే ఆమె రిలీజ్ కుదరదని జైళ్ల శాఖ తెలిపింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వచ్చే వారం పిటిషన్ విచారణకు రానుంది. అదే విధంగా ఆయా కేసుల్లో విచారణపై స్టే విధించాలంటూ మరో పిటిషన్‌ను వేయగా.. ఆ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది. మరోవైపు.. కేతకి చిటలేతో పాటు పవార్ వ్యతిరేక పోస్టును ట్విటర్లో షేర్ చేసిన నిఖిల్ భర్మే(23) అనే ఫార్మసీ స్టూడెంట్ సైతం అరెస్ట్ అయ్యాడు. నిఖిల్‌పై సైతం ఆరు కేసులు నమోదుకాగా, నెలపైనే జైల్లో ఉన్నాడు. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. -
బంధం తెగినా.. ఒక్కటిగానే మృత్యువు ఒడిలోకి..
Indian Family Died in Nepal Plane Crash: మనస్పర్థలు పెరిగాయి. భార్యాభర్తల బంధానికి బీటలు వారింది. చట్టం దృష్టిలో విడాకులతో వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ, కన్నబిడ్డల రూపంలో దగ్గరగా గడిపే అవకాశం దొరికింది ఆ జంటకు. వారి మధ్య సంతోషాన్ని చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో.. విషాదాంతంగా ముగిసింది ఆ కుటుంబం కథ. నేపాల్ ఎయిర్‌క్రాఫ్ట్ దుర్ఘటనలో ఇప్పటిదాకా 22 మృతదేహాలను గుర్తించారు. ఘటనస్థలం నుంచి బ్లాక్‌బాక్స్‌ను సేకరించి.. ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. దుర్మరణం పాలైన వాళ్లలో భారత్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఉండడం.. విషాదాన్ని నింపుతోంది. ఒడిషాకు చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి(54), ఆయన భార్య వైభవి బందేకర్ త్రిపాఠి(51)కి చాలాకాలం కిందటే వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అశోక్ కుమార్ మరో వివాహం చేసుకున్నాడు. కానీ, వైభవి మాత్రం తన తల్లితో ఉంటూ.. కన్నబిడ్డలిద్దరి బాధ్యతలు చూసుకుంటోంది. అయితే విడాకులతో విడిపోయినా ఆ జంటకు కలిసే అవకాశం కల్పించింది న్యాయస్థానం. ఏడాదిలో పది రోజుల పాటు కొడుకు, బిడ్డతో కలిసి సరదాగా గడపాలని ఈ మాజీ జంటకు ఆదేశించింది. విడాకుల తర్వాత అశోక్ ఒడిషాలోనే ఉంటూ ఓ కంపెనీని రన్ చేస్తున్నాడు. థానే(ముంబై)లో ఉంటూ ఓ ఫైనాన్షియల్ కంపెనీని నడిపిస్తోంది వైభవి. ఈ క్రమంలో.. కొడుకు ధనుష్ (22), కూతురు రితిక(15)తో కలిసి ఈ ఏడాదికిగానూ హిమాలయా పర్యటనకు వెళ్లారు. ఆదివారం నేపాల్ టూరిస్ట్ సిటీ అయిన పొఖారాకు వెళ్లారు. అదే రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ఈ కుటుంబం దుర్మరణం పాలైంది. వీళ్ల మరణ వార్తతో థానేలోని బల్కమ్ ఏరియాలో విషాదం నెలకొంది. ఇక్కడే రుస్తోమ్జీ అథేనా హౌజింగ్ సొసైటీలో వైభవి నివాసం ఉంటోంది. ప్రమాదం వార్త విని స్థానికులంతా షాక్‌లో ఉన్నారు. -
కసాయి తల్లి...మరో పెళ్లి కోసం నెలల పసికందుని....
సాక్షి ముంబై: వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని తమ కన్న పిల్లల్నే హతమారుస్తున్న కసాయి తల్లిదండ్రులను చూస్తున్నాం. మరికొంతమంది తమ అక్రమసంబంధాలు గురించి పిల్లలకు తెలిసిపోయిందనో లేక వాళ్లు చూశారనో చంపేస్తున్నారు. కొంతమంది జంటలు విడాకులు తీసుకుని మరోకరితో కొత్తజీవితాన్ని పంచుకునేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని వాళ్లను రోడ్ల మీద, బస్టాండ్‌ల్లోనూ, లేదా చెత్తబుట్టలోనూ వదిలేసి వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడో మహిళ అలాంటి దారుణానికే పాల్పడింది. వివరాల్లోకెళ్తే...ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లోని డస్ట్‌బిన్ దగ్గర 15 రోజుల పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయిన 22 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బీహార్‌లోని తన గ్రామంలో వయస్సులో తన కంటే రెట్టింపు వయసు ఉన్న వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆ మహిళ తెలిపింది. పెళ్లైయిన కొన్ని నెలలు తర్వాత ఆమె తన భర్త ఇంటి నుంచి పారిపోయి తన సోదరుడి సహాయంతో మహారాష్ట్రకు వచ్చి ఖడావ్లీలో నివసిస్తుంది. కొన్ని రోజుల తర్వాత తాను గర్భవతినని తెలుసుకుంది. ఐతే ఆమె మరొ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఉల్హాసనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ మహిళ తన సోదరుడి సాయంతో ఆ బిడ్డను మెరైన్ డ్రైవ్‌కు సమీపంలోని డస్ట్‌బిన్ దగ్గర శిశువును వదిలి వెళ్లిపోయారు. పైగా ఆ బిడ్డను డబ్బున్న కుటుంబం దత్తత తీసుకుంటుందని భావించాం అని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు మెరైన్ డ్రైవ్ పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సదరు మహిళను గుర్తించినట్లు వెల్లడించారు. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..) -
శరద్ పవార్‌పై అనుచిత పోస్ట్.. నటిపై కేసు
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌పై అనుచిత పోస్ట్ షేర్ చేసినందుకు నటిపై కేసు నమోదు అయ్యింది. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద శనివారం థానే పోలీసులు కేసు నమోదు చేశారు. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. శుక్రవారం ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో.. ఆమెపై కేసు నమోదు అయ్యింది. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. ఈ పోస్ట్‌ను నటి చిటలే పోస్ట్‌చేయడంతో ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు థానేలోని కాల్వా పోలీసులు. ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్ వెనుక బీజేపీ, ఆర్సెస్ ప్రమేయం ఉందని ఎన్సీపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, శివ సేనతో ఎస్పీపీ జట్టుకట్టడం బీజేపీకి సహించడం లేదని, ఈ క్రమంలోనే తమ పార్టీ, అధినేత శరద్ పవార్‌పై అభ్యంతర ప్రచారం సోషల్ మీడియాలో చేస్తోందని అంటున్నారు. చదవండి: గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్ -
కిచిడీలో ఉప్పెక్కువైందని.. భార్య గొంతు నులిమాడు
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం మరో ఘోరం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందని కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతు నులిమి చంపేశాడు. భయందర్‌లోని ఫాఠక్ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలేశ్ ఘాఘ్ (46) తనకు వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందంటూ భార్య నిర్మల (40)తో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేశంతో గొంతు నులిమి చంపేశాడు. అతనిపై హత్య కేసు నమోదైంది. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. చదవండి: (చాయ్‌తోపాటు టిఫిన్ ఇవ్వలేదని.. కోడలిపై మామ చేసిన పనికి అంతా షాక్!) -
చాయ్‌తోపాటు టిఫిన్ ఇవ్వలేదని.. కోడలిని కాల్చి చంపాడు
ముంబై: పిచ్చి పీక్స్‌కు వెళ్లిన ఓ వ్యక్తి కోడలిపై దాష్టీకానికి పాల్పడ్డాడు. చాయ్ (టీ)తో పాటు అల్పాహారం ఇవ్వలేదని ఏకంగా తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన థానేలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)కు అతని కోడలు సీమా రాజేంద్ర (42) గురువారం ఉదయం టీ అందించింది. అయితే, టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వాలని తెలియదా? అంటూ రెచ్చిపోయిన ఆ పెద్ద మనిషి ఆమెపై మాటలతో విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న లైసెన్స్డ్ తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. బాధితురాలి పొట్ట భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కళ్లముందే ఘోరం జరగడంతో నిశ్చేష్టులైన కుటుంబ సభ్యులు గాయాలపాలైన ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచిందని థానే సీనియర్ పోలీస్ అధికారి సంతోష్ ఘటేకర్ తెలిపారు. మృతురాలి తోడి కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కాశీనాథ్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఘటనకు మరేదైన కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. (చదవండి: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి..) -
Crime News: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై ప్లాన్ చేసి..
డోంబివిలి(థానే.. ముంబై)లో కలకలం రేపిన సుప్రియ ఆంటీ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. కిరాతకంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని సోఫా కమ్ బెడ్లో కుక్కేసి వెళ్లిపోయాడు నిందితుడు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ కేసును చేధించడంలో నిందితుడి చెప్పులే కీలకంగా వ్యవహరించాయి. ముంబై: దావ్ది ఏరియా డొంబివిలో సంచలనం సృష్టించిన 33 ఏళ్ల గృహిణి హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు మాన్‌పాడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సుప్రియ భర్త క్లోజ్‌ఫ్రెండ్, ఆమె పొరుగింటి వ్యక్తి విశాల్ గెహావత్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసులో దర్యాప్తు కష్టతరంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజున(మంగళవారం), అంతకు ముందు రోజు నిందితుడు బాధితురాలి ఇంటి బయట చెప్పులు విడిచాడు. మరో పక్కింట్లో ఉండే మహిళ ఆ చెప్పుల ఆనవాళ్లు వివరించగా.. ఆ చిన్న క్లూతో నిందితుడిని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. అవి సుప్రియ భర్త కిషోర్ ఫ్రెండ్, పక్కఇంట్లో ఉండే విశాల్‌కి చెందినవిగా తేలడంతో.. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిందితుడు నిజం ఒప్పేసుకున్నాడు. లొంగలేదనే కోపంలో.. నిందితుడు విశాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాల్, సుప్రియ భర్త కిషోర్ షిండేలు చాలాకాలం నుంచి స్నేహితులు. కానీ, స్నేహితుడి భార్యపైనే విశాల్ కన్నేశాడు. కావాలనే కిషోర్ వాళ్ల పక్కింట్లోనే అద్దెకు దిగాడు. ఎలాగైనా సుప్రియను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆమె అతన్ని పట్టించుకోలేదు. సుప్రియకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఆ వంకతో ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఘటన జరిగిన ముందురోజు కూడా పుస్తకం కోసం సుప్రియ ఇంట్లోకి వెళ్లాడు విశాల్. భర్త కిషోర్, కొడుకుతో సుప్రియ ఆ టైంకి సుప్రియ భర్త ఆఫీసుకి, కొడుకు స్కూల్‌కి వెళ్లడం గమనించాడు. ఆ మరుసటి రోజూ సుప్రియ ఒంటరిగా ఉన్న టైంలో తలుపు తట్టాడు. పుస్తకం కావాలంటూ సుప్రియతో మాటలు కలిపి తన కోరికను బయటపెట్టాడు. దీంతో ఆమె అతని చెంప చెల్లుమనిపించింది. కోపంతో ఆమెను బలవంతం చేయాలని ప్రయత్నించాడు. ప్రతిఘటించేసరికి తల నేలకేసి బాది.. ఆపై నైలాన్ తాడును సుప్రియ మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఆపై శవాన్ని సోఫా కమ్ బెడ్లో కుక్కేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు. కొడుకును స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు ఆమె ఎంతకీ రాకపోవడంతో.. సుప్రియ కోసం వెతుకులాట మొదలైంది. కుటుంబ సభ్యులంతా సుప్రియ కోసం గాలిస్తున్న టైంలోనూ ఏమీ ఎరగనట్లు కిషోర్ పక్కనే ఉన్నాడు విశాల్. సుప్రియ ఎంతకీ కనిపించకపోయేసరికి కిషోర్‌తో కలిసి మరీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చి వచ్చాడు. ఈ లోపు సోఫా కుషన్ చినిగి ఉండడం అనుమానించిన చుట్టుపక్కల వాళ్లు.. పైకి ఎత్తి చూడగా అందులో నుంచి సుప్రియ షిండే మృత దేహం బయటపడింది. -
ఉత్త సక్సెస్ కాదు.. గొప్ప సక్సెస్ కావచ్చని నిరూపించింది!
యూట్యూబ్‌లో అందరూ వీడియోలు చేస్తారు. కాని ప్రాజక్తా కోలి సరదా వీడియోలతో పాటు బాధ్యత కలిగిన వీడియోలు చేసేది. ∙ఆడపిల్లల చదువు ∙బాడీ షేమింగ్ ∙మానసిక ఆరోగ్యం వీటి పట్ల చైతన్యం కలిగించే వీడియోలు పెద్ద హిట్. 65 లక్షల సబ్స్క్రయిబర్లు కలిగిన ఒక యువ యూట్యూబ్ స్టార్‌గా యువత మీద ఆమె ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యు.ఎన్.డి.పి)కి మన దేశ ‘తొలి యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. యువత బాధ్యత చూపితేమరింత గుర్తింపు తెచ్చే బాధ్యత వస్తుందనడానికి ప్రాజక్తా ఒక ఉదాహరణ. గలగలమని పొంగే మాట, నిశితమైన గమనింపు, భళ్లుమనే వ్యంగ్యం, లక్ష్యాన్ని చేరుకునే చురుకుదనం ఉంటే సక్సెస్ కావచ్చా? ఉత్త సక్సెస్ కాదు గొప్ప సక్సెస్ కావచ్చు అని ప్రాజక్తా కోలి నిరూపించింది. తన సరదా వీడియోలతో వ్యక్తుల ప్రవర్తనను, లోకం పోకడలను ఎత్తి చూపే ప్రాజక్తా తొలితరం యూట్యూబ్ స్టార్లలో అందరి కంటే అందనంత ఎత్తుకు చేరుకుంది. అందుకే ఐక్యరాజ్య సమితి తన ‘డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ కింద పర్యావరణ స్పృహ కలిగించే వివిధ దేశాల యూత్ క్లయిమెట్ ఛాంపియన్ల ఎంపికలో భాగంగా ప్రాజక్తాను మన దేశం నుంచి తొలిసారిగా ‘యూత్ క్లయిమేట్ ఛాంపియన్’గా ఎంపిక చేసింది. 28 ఏళ్ల ప్రాజక్తా ఇక మీదట మన దేశంలోని యువతలోనే కాదు అనేక దేశాల యువతలో కూడా పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేస్తున్న లియొనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి పని చేయనుంది. ఒక భారతీయ యువతికి దక్కిన గొప్ప గుర్తింపు ఇది. ‘ఇది నాకు ఇష్టమైన పని. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రాజక్తా ఈ సందర్భంగా. మనం మార్చగలం ‘ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మనమే తెచ్చాం. మనమే వాటిని పరిష్కరించగలం. నా దృష్టిలో యువత ఈ విషయంలో మొదటి వరుస సైనికులుగా ఉండాలి. యువత తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో మానవజాతే అంతరించి పోయే పరిస్థితులు వస్తాయి. అలా జరక్కుండా ఉండటానికి మన దేశంలో యువత చైతన్యవంతం కావాలి. అందుకు నేను పని చేస్తాను. అలాగే ప్రపంచ యువత ఆలోచనలను పంచుకుంటాను’ అంది ప్రాజక్తా. (చదవండి: ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!) థానే అమ్మాయి ప్రాజక్తా మహరాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. ముంబైలో చదువుకుంది. తండ్రి మనోజ్ కోలీ చిన్న సైజు రియల్టర్. తల్లి అర్చన కోలి టీచర్. ఈమెకు నిషాంత్ అనే తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ప్రాజక్తా ఉత్త వాగుడుకాయ. స్కూల్లో ప్రతి పోటీలో పాల్గొని మాట్లాడేది. ప్రైజులు కొట్టేది. తమ అమ్మాయి ఇంట్లో, క్లాస్‌రూమ్‌లో వొదిగి ఉండటానికి పుట్టలేదని, స్టేజ్ మీద జనాన్ని అలరించడానికి పుట్టిందని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ప్రాజక్తాను బాగా ప్రోత్సహించారు. ఆరవ తరగతిలోనే రేడియో జాకీ అవ్వాలనుకున్న ప్రాజక్తా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసి ముంబై ‘ఫీవర్’ రేడియోలో ఒక సంవత్సరం ఇన్‌టర్న్‌గా చేసింది. కాని ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో గెస్ట్‌గా వచ్చిన హృతిక్ రోషన్‌తో ప్రాజక్తా చేసిన ఒక చిన్న వీడియో చూసిన డిజిటల్ కంటెంట్ ఎక్స్పర్ట్ సుదీప్ లహరీ ‘నీ మాటలో మంచి విరుపు ఉంది. ఇది యూట్యూబ్ యుగం. యూ ట్యూబ్ చానల్ మొదలెట్టు’ అని సలహా ఇచ్చాడు. అలా 2015లో ప్రాజక్తా మొదలెట్టిన యూట్యూబ్ చానల్ ‘మోస్ట్‌లీసేన్’. మోస్ట్‌లీసేన్ ‘మోస్ట్‌లీసేన్’ చానల్లో అన్నీ తానుగా ప్రాజక్తా వీడియోలు చేసి రిలీజ్ చేస్తుంది. అంటే వీడియోలో ఆమె ఒక్కతే రకరకాల పాత్రలుగా కనిపిస్తుంది. అందుకు ఆమె తాను గమనించిన మనుషుల ప్రవర్తనలను ముడి సరుకుగా చేసుకుంటుంది. ‘మనకు తెలిసిన 10 రకాల టీవీ ప్రేక్షకులు’, ‘పది రకాల విద్యార్థులు’, ‘వీరండీ మన ఇరుగు పొరుగు’, ‘మన అమ్మలు... వారి చాదస్తాలు’... ఇలా టాపిక్ తీసుకుని ఆ పాత్రలన్నీ తానే ధరిస్తుంది. ఈ వీడియోల్లో తమను తాము చూసుకున్న ప్రేక్షకులు వెంటనే సబ్స్క్రయిబర్లుగా మారారు. ఒక్క సంవత్సరంలోనే లక్ష మంది సబ్స్క్రయిబర్లను పొందింది ప్రాజక్తా. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 65 లక్షలకు చేరింది. వారంలో మూడు వీడియోలు ఆమె విడుదల చేస్తే యూట్యూబ్ ద్వారా బోలెడు ఆదాయం వచ్చి పడుతోంది. మిషేల్ ఒబామాతో కాఫీ ప్రాజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అంతే కాదు యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్‌గా ఎదిగింది. ఇవన్నీ ఆమె తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది. యువత తన కెరీర్ కోసం కష్టపడాలి. తప్పదు. దాంతో పాటు సామాజిక బాధ్యత చూపిస్తే ప్రాజక్తాలా గొప్ప గొప్ప బాధ్యతలు వరిస్తాయి. జీవితంలో సక్సెస్‌ను అలా కదా చూడాలి. -
ఆ ఇంట్లో ఎటుచూసినా సెల్‌ఫోనే!:కొట్టేసినవి కాదు.. కొన్నవే
ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్. ఎదుటివాళ్లు మాట్లాడేది పట్టించుకోకుండా అందులోనే ముఖం పెట్టేయడం. స్మార్ట్‌ఫోన్ ధ్యాసలో తిండి, నిద్రకు దూరం.. ఇవన్నీ ఫోన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనాలు. అయితే ఇక్కడో పిచ్చోడు ఫోన్‌కు అడిక్ట్ కాలేదు. కానీ, ఫోన్ల కలెక్షన్లతో తన ఇంటిని నింపేసుకుంటూ పోతున్నాడు. కప్‌బోర్డులు, బెడ్రూం, కిచెన్ డబ్బాల్లో.. ఆఖరికి కారును కూడా ఫోన్లతోనే నింపేశాడు. ఇదంతా ఎందుకని అడిగితే ఓ ప్రత్యేక కారణం ఉందని చెప్తూ పోయాడు. ‘నా పేరు జయేష్ కాలే. ముద్దు పేరు మిస్టర్ నోకియా. వయసు 35 సంవత్సరాలు. ఓ కంపెనీలో డిజైన్ హెడ్‌గా పని చేస్తున్నాడు. ఉండేది ముంబై(మహారాష్ట్ర) థానేలో ఓ అపార్ట్మెంట్లో. ప్రస్తుతం నా కలెక్షన్స్‌లో 3,500 హ్యాండ్సెట్స్ ఉన్నాయి. వీటి కోసం 20 లక్షల దాకా ఖర్చు చేశా. వర్కింగ్ కండిషన్ ఫోన్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కే ప్రయత్నం చాలా క్రితమే చేశా. కానీ, ఇప్పటికైతే నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరెక్కింది. మీ వరకు ఇవి ఫోన్ కలెక్షన్లు. కానీ, నా వరకు ఇవి చంటిపాపలు. మీకు తెలిసి ఇంకేమైనా మోడల్స్ ఉంటే నా దృష్టికి తెండి’ అంటూ వాటిని లెక్కపెట్టుకుంటూ ఉండిపోయాడు జయేష్. ఆ ఘటన తర్వాత.. చదువుకునే రోజుల్లో జయేష్ ‘నొకియా 3310’ మోడల్ ఫోన్ వాడేవాడు. ఓరోజు రెండో అంతస్థు నుంచి అది కిందపడిపోయిందట. భయంతో కిందకు పరిగెత్తి చూస్తే.. ఫోన్ పార్ట్ పార్ట్‌లుగా పడి ఉందట. అయినా కూడా ఫోన్ కండిషన్లోనే పని చేసేసరికి అతను ఆశ్యర్యపోయాడట. ‘ఆ ఘటనతో నోకియాకు వీరాభిమానిగా మారిపోయా’ అంటాడతను. అందుకే అతని దగ్గర ఉన్న కలెక్షన్లలో చాలావరకు నోకియా హ్యాండ్‌సెట్లే ఉన్నాయి. ఐదు నుంచి ఆరేళ్ల కష్టపడి ప్రపంచంలోని చాలా దేశాల నుంచి హ్యాండ్సెట్లు తెప్పించుకున్నాడు. మాగ్జిమమ్ ఫీచర్ ఫోన్ తాలుకావే. చాలావరకు రేర్ పీసులు. వీటిలో ఎక్కువ వర్కింగ్ కడింషన్లో గనుక ఉండిఉంటే ఈపాటికే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేవాడే. కానీ, చాలావరకు పని చేయడం ఆగిపోయాయి. కొన్నింటికి యాక్సెసరీస్ దొరకట్లేదు. అందుకే లిమ్కా బుక్ రికార్డుతో సరిపెట్టుకున్నాడు. భార్య కోపం.. పిచ్చోడు అనుకున్నారట జయేష్ కాలేకి చాలా కాలం క్రితమే నోకియా మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ దక్కింది. ఫోన్ల కోసం ఇప్పటికే 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాడతను. ఇదంతా చూసి ఇంట్లోవాళ్లు తెగ తిట్టారు. భార్య చాలా రోజులు మాట్లాడడమే మానేసిందట. బంధువులు, స్నేహితులు అతనికి ‘ఫోన్ పిచ్చోడు’ అనే ముద్ర వేశారు. కానీ, జయేష్ వాటన్నింటిని నవ్వుతూ స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే అతని లక్క్ష్యం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కడం కాబట్టి. అప్పటిదాకా వీలైనన్ని ఎక్కువ ఫోన్లను సేకరించి తీరతానని అంటున్నాడతను. పాత వీడియో చదవండి: భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు.. -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్
థాణే: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు థాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) ఒక వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చింది. నగరంలో విద్యుత్ వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల కోసం చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, సంస్థలు, హౌజింగ్ సొసైటీలకు ఆస్తి పన్నుల్లో రాయితీ కల్పించాలని థాణే మున్సిపల్ కార్పొరేషన్ ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను మంజూరీ కోసం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా ప్రకారం ఎవరైనా సొంతం కోసం చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆస్తి పన్నుల్లో రెండు శాతం, ఇతరుల కోసం ఏర్పాటు చేస్తే అయిదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ రాయితీలు 2025 వరకు మాత్రమే అమలులో ఉంటాయని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2030 వరకు విద్యుత్ వాహనాల వాడకాన్ని గణనీయంగా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో థాణేలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించారు. అయితే వాహనాలకు సరిపడా చార్జింగ్ సెంటర్లు లేవని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ సంజయ్ జైస్వాల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. థాణే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వంద చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. స్మార్ట్ సిటీగా ఎంపికై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ థాణే నగరంలో ఇంతవరకు ఒక్క చార్జింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కాకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై..
థానె: బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన వీటిని అరికట్టడం అంత సులువులా కనిపించడం లేదు. తాజాగా ఓ వృద్ధురాలిపై 25 ఏండ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానె జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. థానె నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ సొసైటీలోని ఒక ఇంట్లో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు ఆమె బంధువులు తనని చూడటానికి వచ్చి పోతూ ఉంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఓ రోజు మంచినీళ్ల నెపంతో వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె నీళ్లు తీసుకుని వచ్చేలోపు అదును చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 3న ఈ దారుణం జరగగా.. ఘటన జరిగినప్పటి నుంచి ఆమె బాధపడుతూ ఉండేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను డాక్టర్ దగరకు తీసుకెళ్లగా నిజం బయటపెట్టింది. దీంతో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చదవండి: స్నానం పూర్తి చేసుకున్న భర్త.. టవల్ త్వరగా ఇవ్వలేదని భార్య తలపై... -
గొడవ ఆపాలని ప్రయత్నించిన పోలీసు ముఖంపై..
ముంబై: రెండు పార్టీల మధ్య జరిగిన గొడవను పరిష్కరించాలని ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కత్తిదాడికి గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల.. ప్రకారం థానే జిల్లాలోని ఉల్హసన్నగర్ పట్టణానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే నరేష్ లెఫ్టీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగి ఇవ్వకపోవటంతో సంజయ్‌ను డబ్బులు త్వరగా ఇవ్వాలని నరేష్ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరేష్, సంజయ్‌లు తమ మిత్రులతో ఉల్హసన్నగర్లో 4లో కలుసుకున్నారు. సంజయ్ తనతో పాటు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అవినాష్‌ను తీసుకువచ్చాడు. అతడు మరో మూడు నెలలు ఆగాల్సిందిగా నరేష్‌కు చెప్పాడు. దీంతో ఇంకా ఎన్ని నెలలు ఆగాలంటూ కోపంతో నరేష్ కత్తితో అవినాష్, సంజయ్‌పై దాడి చేశాడు. గొడవ గురించి తెలుసుకున్న తరువాత, పోలీసు కానిస్టేబుల్ గణేష్ దమాలే, ఒక సహోద్యోగితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. గణేష్ దమాలే ఈ గొడవను ఆపడానికి జోక్యం చేసుకున్నప్పుడు, నరేష్ అతని ముఖంపై కూడా పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. తరువాత, మరి కొందరు పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నరేష్, శశి చిక్నా అలియాస్ సుఖీ, ఓమీలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు -
మహారాష్ట్రలో దారుణం.. బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం
-
మహారాష్ట్రలో దారుణం.. బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం
ముంబై: మహారాష్ట్రలోని థానేలో మరో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా అత్యంత కౄరంగా 29 మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. బుధవారం రాత్రి బాధితురాలు డోంబివాలిలోని మాన్పాడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బాలిక స్నేహితుడు. ముందుగా ఈ ఏడాది జనవరిలో మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడి, ఈ దృశ్యాలను వీడియో తీశాడు. ఈ వీడియోను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ మిగతావారు ఆమెపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారు. అలా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 29 మంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: భర్త వస్తుంటే చూసి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకిన భార్య ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారందరిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దత్తాత్రేయ వెల్లడించారు. గత తొమ్మిది నెలలుగా బాధితురాలిపై అత్యాచారం పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు -
థానేలో బాలికపై అత్యాచారం..!
థానే: 15 ఏళ్ల బాలికపై సుత్తితో దాడి చేసి, అత్యాచారంచేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని, ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు ఆదివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి షిర్డీ నుంచి తన మిత్రులు ఇద్దరితో కలసి బాధిత బాలిక ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఉల్హాస్నగర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు శ్రీకాంత్ గైక్వాడ్ (30) వారిని అడ్డగించాడు. బాలికపై సుత్తితో దాడి చేశాడు. తోడుగా ఉన్న మిత్రులను కూడా బెదిరించాడు. అనంతరం బాలికను రైల్వే స్టేషన్ పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తప్పించుకోవాలని చూడగా మళ్లీ సుత్తితో దాడి చేశాడు. అయితే శనివారం ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే కల్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఈ యాక్సిడెంట్ చూస్తే షాక్.. గాల్లో అంతెత్తు ఎగిరిపడ్డ భార్యాభర్తలు
ముంబై: థానేలోని షాహాపూర్‌కు సమీపంలో ఉన్న ఆగ్రా రోడ్‌లోని కోర్టు ముందు కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదం కోర్టు దగ్గరున్న సిసిటివిలో రికార్డు అయింది. గాయపడిన వారిద్దరూను దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు..షాహాపూర్‌లోని ఆగ్రా రోడ్లో అసంగావ్ వైపు ఓ కారు వెళ్తుంది. అస్సలే ఆ రోడ్డు చాలా ఇరుకైనది. ఈ క్రమంలో అతివేగంతో ఎదరుగా వస్తున్న బైక్ నేరుగా కారును ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న భార్య, భర్తలు ఇద్దరూ గాల్లో పల్టీలు కొడతూ కిందపడ్డారు.అయితే వెంటనే బైక్ రైడర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ వెంటనే స్థానికులు అక్కడకి చేరుకునిఅంబెలెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. -
హలో సార్.. వచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లండి
చిన్నపాటి నిర్లక్క్ష్యం ఒక్కోసారి పెద్ద అనర్థాలకే దారి తీస్తుంది. కరోనా టైంలో ప్రజా సంక్షేమం గురించి బాగానే ఆరాలు తీసిన అధికారులు.. చిన్న తప్పిదంతో బతికున్న ఓ వ్యక్తిని రికార్డులో చంపేశారు. అంతేకాదు కాల్ చేసి మరీ మరణ ధృవీకరణ పత్రం తీసుకెళ్లమని ఆయనకే ఫోన్ చేసి చెప్పారు. ఊహించని ఆ అనుభవంతో ఖంగుతిన్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు. ముంబై: థానే మాన్‌పడాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ దేశాయ్(54). కిందటి ఏడాది ఆగష్టులో ఆయన కరోనా వైరస్ బారినపడి కోలుకున్నాడు. ఇంట్లో ఉండే ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఐసోలేషన్ టైంలో తన ఆరోగ్యం గురించి మున్సిపాలిటీ అధికారులు రోజూ ఆరాతీస్తుంటే మురిసిపోయాడాయన. కట్ చేస్తే.. ఈమధ్యే ఆయనకు మరో కాల్ వచ్చింది. ఈసారి ఆయన కూడా ఊహించని ప్రశ్న ఎదురైంది. థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ ఆయన నెంబర్‌కు కాల్ చేసి.. చంద్రశేఖర్ దేశాయ్ పేరు మీద డెత్ సర్టిఫికెట్ సిద్ధమైందని, వచ్చి తీసుకెళ్లాలని కోరింది. అయితే తాను బతికే ఉన్నానని చెప్పడంతో ఆమె కంగారుపడిపోయింది. ఆ ఇంట్లో ఇంకెవరైనా కొవిడ్‌తో చనిపోయారా? అని ఆమె ఆరా తీసిందట. ‘లేదు’ అని చెప్పడంతో ఆ కాల్ కట్ అయిపోయిందని చంద్రశేఖర్ మీడియా ముందు వాపోయాడు. ఇక ఈ ఘటన తర్వాత సరాసరి థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాడాయన. అక్కడి అధికారులకు ఘటనపై ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటీ వాళ్లు పంపకుండా ఐసీఎంఆర్‌కు తన పేరు ఎలా వెళ్లిందని, దీనికి సమాధానం కావాలని కోరుతున్నాడాయన. ఇక ఈ ఘటనపై టీఎంసీ అధికారులు స్పందించారు. పొరపాటు జరిగిందని చెబుతూ.. దానిని సవరించే ప్రయత్నం చేస్తారని వెల్లడించారు. చదవండి: చిన్నగొడవ.. డాక్టర్ దంపతుల ఆత్మహత్య -
మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్
ముంబై: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 32కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం పరిపాటి. అయితే మహారాష్ట్రలోని ఓ మహిళా ఏకంగా మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకుంది. అది కూడా కేవలం ఒకరోజులోనే. థానే మున్సిపల్ కార్పోరేషన్లో పనిచేస్తున్న మహిళ గంటల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్ వేశారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పడంతో వ్యాక్సినేన్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య తొలిసారి టీకా వేసుకుంటున్నందున వ్యాక్సిన్ ప్రక్రియ గురించి అవగాహన లేదన్నారు. సిబ్బంది గంటల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వడంతో ఆమెకు జ్వరం వచ్చిందన్నారు. మరుసటి రోజు ఉదయం అది తగ్గి.. ఇప్పుడు బాగానే ఉందన్నారు. ఇక ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్ వద్ద లేవనెత్తగా.. మున్సిపల్ కార్పొరేన్ ఆమెకు సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు .అయితే ఆమె భర్త అదే చోట పనిచేస్తున్నందున ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి ఆమెకు ఇష్టం లేదని తెలిపింది. కాగా సిబ్బంది గమనించకుండా మూడుసార్లు టీకాలు ఏలా వేస్తారని బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ దావ్‌ఖారే మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని టీఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఖుష్బూ తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. ధీటైన రిప్లై.. షాకిచ్చిన ట్విటర్ -
మొబైల్ దొంగతనం.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది
ముంబై: ముంబై సమీపంలోని థానేలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న మహిళ నుంచి ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ దొంగతనం చేశారు. మొబైల్‌ను తిరిగి లాక్కునే క్రమంలో ఆ మహిళ కిందపడిపోగా.. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహిపూర్‌కు చెందిన కన్మిలా రైసింగ్ అనే మహిళ థానేలోని ఓ 'స్పా'లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. స్నేహితురాలితో కలిసి ఆమె ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో... బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్‌ను తిరిగి లాక్కునే క్రమంలో ఆమె ముందుకు వంగడంతో ఆటో నుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయాలవడంతో ఆమెకు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఆటోలో ప్రయాణించిన తన స్నేహితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేఈ, సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా ఇద్దరు నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పేర్లు అల్కేష్ పర్వేజ్(20),మొమిన్ అన్సారీ(18)గా తెలిపారు. చోరీ చేసిన మొబైల్‌ను రికవరీ చేశారా లేదా అన్నది తెలియరాలేదు. గతంలోనూ వీరు మొబైల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. చదవండి: క్షుద్ర పూజలు: యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి.. -
అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి
ముంబై: పిల్లలను అపహరిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతానికి చెందిన అయిదుగురిని ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..రామవ్తార్ ధోబీ అనే వ్యక్తి తన కూతురిని అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఆమె తండ్రి అతడిని వెంబడించాడు. తర్వాత ఓ పదిమంది కలిసి అతడిపై దాడి చేయడంతో ధోబీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అయితే వీరిలో అరెస్ట్ అయిన నిందితులను అతిక్ ఖాన్, మొహసిన్ షేక్, అఫ్సర్ వస్తా, హరీష్ సోలంకి, మహ్మద్ అన్సారీలుగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన మిగితా నిందితులను పట్టుకోవడాకి వేట కొనసాగుతోందని తెలిపారు. వీరిపై భారత శిక్షాస్మృతి, మహారాష్ట్ర పోలీసు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. (చదవండి: భారతీయ అమెరికన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష) -
వ్యాక్సినేషన్: చిక్కుల్లో మీరా చోప్రా
ఒకవైపు వ్యాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూప్ గందరగోళం నడుస్తుండగా, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ డోస్‌లను బ్లాక్‌లో అమ్ముకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు తేలికగా వ్యాక్సిన్లు దొరుకుతున్న తీరు.. రోజుల తరబడి, గంటల సేపు లైన్లో క్యూ కడుతున్న వాళ్లకు కోపం తెప్పిస్తోంది. తాజాగా నటి మీరాచోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం.. రాజకీయ విమర్శలకు దారితీసింది. థానే: నటి, మోడల్ మీరా చోప్రా ఈమధ్యే కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆ ఫొటోను ఉంచింది. అయితే ఆమె ఫ్రంట్‌లైన్ వారియర్ కోటాలో ఫేక్ఐడీతో ఈ పని చేసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ మండిపడుతోంది. మీరా చోప్రా అలియాస్ నీలా తమిళంతో పాటు తెలుగు, హింది సినిమాల్లో నటించింది. ఆమె థానేలోని పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర డోస్ వేయించుకుంది. ఓం సాయి ఆరోగ్య కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆమె సూపర్వైజర్గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. ఇది ముమ్మాటికీ రూల్స్‌ను ఉల్లంఘించినట్లే. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ కోరుతోంది. కాగా, ఈ విచారణపై దర్యాప్తునకు ఆదేశించామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై క్రిమినల్ చర్యలు తప్పవని థానే మున్సిపల్ కార్పొరేషన్ పీఆర్వో సందీప్ మాల్వీ చెబుతున్నారు. కాగా, తెలుగులో బంగారం, మారో, వాన లాంటి సినిమాల్లో నటించిన మీరా చోప్రా.. పలు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అయితే వ్యాక్సినేషన్‌పై దుమారం చెలరేగడంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ తొలగించడంతో పాటు మీడియాకు దొరక్కుండా తిరుగుతోందని సమాచారం. A good decision and a good deed should always be acknowledged https://t.co/m08lkynwYi — meera chopra (@MeerraChopra) May 29, 2021 -
కరోనా వ్యాక్సిన్ అనుకొని ఎత్తుకెళ్లారు.. ట్విస్ట్ ఏంటంటే
ముంబై: మహారాష్ట్రలోని థానేలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 300 వివిధ రకాల వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. వారు ఎత్తుకెళ్లిన వాటిలో ఎక్కువ శాతం చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఉన్నట్లు తెలిసింది. కాగా అధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తులు హెల్త్ సెంటర్లో యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ ఏమైనా ఉందేమోనని... ముఖ్యంగా కోవిషీల్డ్ దొంగలించడానికి చొరబడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్స్‌పై ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ స్టిక్కర్లను తీసేసి అక్కడే వదిలేసి వెళ్లారు. కాగా వచ్చిన వ్యక్తులు ఎలాంటి ఆధారాలు ఉండకూదని సీసీ కెమెరాలతో పాటు మానిటర్‌ను తమ వెంట తీసుకెళ్లారు . కాగా సెక్షన్ 380, సెక్షన్ 427,సెక్షన్ 454 కింద ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈరోజు ఉదయం విధుల్లో చేరేందుకు వచ్చిన పీహెచ్సీ ఉద్యోగులు హెల్త్ సెంటర్లో ఫ్రిజ్ డోర్ పగులగొట్టి ఉండడం... వ్యాక్సిన్ ట్రేలు చెల్లాచెదరుగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. '' ఈరోజు ఉదయం రాగానే ఫ్రిజ్ డోర్ తాళం విరిగి ఉండడంతో వ్యాక్సిన్ స్టాక్‌ను తనిఖీ చేశాము. సాధారణంగా మాకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వస్తుంటాయి. కానీ గత శుక్రవారం నుంచి మా హెల్త్ సెంటర్‌కు ఎలాంటి కరోనా వ్యాక్సిన్లు రాలేదు. ప్రస్తుతం చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఎక్కువగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ అని భావించి వాటిని ఎత్తుకెళ్లి ఉంటారు.పిల్లల వ్యాక్సిన్లలో అందుబాటులో ఉన్న 40 శాతం నిల్వలను ఎత్తుకెళ్లారు'' అని పీహెచ్సి వైద్య అధికారి డాక్టర్ దీపక్ చావా తెలిపారు. చదవండి: Covid-19: పుక్కిలించిన సెలైన్‌తో కరోనా టెస్ట్ -
ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
-
ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. థానెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఐసీయూలోని ఆరుగురు రోగులతో సహా మరో 20 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందినవారిని యస్మీన్ జెడ్ సయ్యద్(46), నవాబ్ ఎం షేక్ (47), హలీమా బి.సల్మనీ (70)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మృతుల కుటుంబానికి రూ. ఐదు లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక, ఇటీవల ముంబైకి సమీపంలోని విరార్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు చెలిరేగిన విషయం తెలిసిందే. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు. చదవండి: మహారాష్ట్రలో మరో ఘోరం.. ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’ -
వాజేనే ప్రధాన నిందితుడు
ముంబై: థానేకు చెందిన వ్యాపారి మన్సుఖ్ హిరన్ హత్య కేసులో ముంబై పోలీసు అధికారి సచిన్వాజేనే ప్రధాన నిందితుడని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఆదివారం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి శనివారం రాత్రి పోలీసు వినాయక్ షిండేను, బుకీ నరేశ్ గౌర్‌ను అరెస్ట్ చేసింది. పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్ధాల వాహనాన్ని నిలిపి ఉంచిన కేసులో సచిన్ వాజే ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. 2006 లఖాన్ భయ్యా నకిలీ ఎన్కౌంటర్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన వినాయక్ షిండే గత సంవత్సరం ఫర్లోపై జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన వాజేతో టచ్‌లో ఉంటున్నారు. ముకేశ్ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం అంతకుముందు, మన్సుఖ్ హిరన్ స్వాధీనంలో ఉంది. మార్చి 5న మన్సుఖ్ మృతదేహం థానెలో ఒక కాలువ పక్కన కనిపించింది. ఈ కేసును కేంద్రం శనివారం ఎన్ఐఏకు అప్పగించింది. కాగా, మన్సుఖ్ హత్యకు ప్రధాన కుట్రదారు ఎవరో తేల్చే పనిలో ఉన్నామని ఏటీఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. -
పెళ్లికి అతిథులుగా వెళ్లి కేసుల్లో ఇరుక్కున్నారు
థానే: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో పాటు చాలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కూడా 50 మందికి మించి హాజరు కావొద్దని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కానీ ప్రభుత్వ ఆంక్షలను బేఖాతరు చేస్తూ థానే జిల్లాలోని కల్యాణ్‌లో జరిగిన ఓ పెళ్లికి ఏకంగా 700 మంది అతిథులు హాజరయ్యారు. దీనికి సంబంధించి పెళ్లి పెద్దలపై కేసులు నమోదు చేసినట్లు కల్యాణ్ డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పెళ్లి మార్చి 10న జరిగిందని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారని తెలియగానే కేడీఎంసీ అధికారులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారని, అప్పుడు అక్కడ 700 మంది వరకు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పెళ్లికి హాజరైనవారు మాస్కులు ధరించలేదని, భౌతికదూరం సహా ఎలాంటి కోవిడ్–19 నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. దీంతో పెళ్లి జరిపించిన రాజేశ్ మాత్రే, మహేశ్ రావూత్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే గత పది రోజుల్లో కరోనా నిబంధనలు పాటించని 1,131 మంది నుంచి రూ.5,64,900 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) -
రెండేళ్లుగా అత్యాచారం: యువకుడి అరెస్టు
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని తానే పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో 21 ఏళ్ల యువతిపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై బాధిత యువతి గత వారం తానే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. తానేలోని గౌతమ్ నగర్‌కు చెందిన 21 ఏళ్ల యువతికి ఖాన్ అనే వ్యక్తితో 2018లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతడు సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ సాకుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా పెళ్లి పేరుతో 2018 నుంచి 2020 వరకు సదరు యువతి ఇష్టానికి వ్యతిరేకంగా ఖాన్ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాధిత యువతి గతేడాది అక్టోబర్ నుంచి ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతడు మాట్లాడటం, ఫోన్ చేయడం తగ్గించాడు. దీంతో బాధితురాలు తానే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పి ఖాన్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఖాన్‌పై ఐపీసీ సెక్షన్ 376తో పలు కేసులు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం
మనం ఎప్పుడైనా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఏం చేస్తాం.. ఆలస్యం అవుతుందని సణుగుతూ అక్కడినుంచి తప్పించుకునేందుకు వేరే రూటు ఉందేమోనని వెతుకుతాం. కొందరైతే ఎటూ వెళ్లలేని పరిస్థితిలో అక్కడే ఉండి చిరాకుపడుతూ ఉంటారు. కానీ థానేకు చెందిన గౌరవ్ లోండే ఒకసారి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినప్పుడు ఒక మంచి బిజినెస్ ఐడియాను ఆలోచించి.. నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఓ రోజు గౌరవ్ ముంబై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ సమయంలో అటుగా వేయించిన బఠానీలు విక్రయిస్తున్న వ్యకిని గౌరవ్ చూశాడు. అదిచూసిన గౌరవ్‌కు ఓ ఆలోచన వచ్చింది. బఠానీలు అమ్మినట్టే ట్రాఫిక్‌జామ్‌లో వడా పావ్ అమ్మితే ఎలా ఉంటుంది? అనే ఐడియా తట్టింది తనకు. అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 జులైలో ‘ట్రాఫిక్ వడా పావ్’ బిజినెస్‌ను ప్రారంభించాడు. నాణ్యతే గాకుండా ఫ్రెష్‌గా టేస్టీగా ఉండే వడా పావ్ ప్యాకెట్‌తోపాటు ఒక చిన్న వాటర్ బాటిల్‌ను కూడా దానికి జతచేసి అమ్మడం ప్రారభించాడు. వడాపావ్ ప్యాకెట్ ధరను రూ.20లుగా నిర్ణయించి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సాయంకాల సమయంలో 5 గంటల నుంచి 10 గంటల మధ్య వడాపావ్‌ను విక్రయించడం ద్వారా నెలకు 2 రూ లక్షల వరకు సంపాదిస్తున్నాడు. (చదవండి: ట్రాఫిక్‌లో 40 గంటలు నరకయాతన..!) ‘‘2009లో నేను పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడిని. సాయంత్రం 5:30 నుంచి 6 గంటలలోపు నా వర్క్ పూర్తయ్యేది. అప్పుడు అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఒక గంట సమయం పట్టేది. ఈ క్రమంలో ఎన్నోసార్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయేవాడ్ని. ఆ సమయంలో నాకు విపరీతం గా ఆకలి వేసేది. తినడానికి ఏమీ ఉండేది కాదు. 10 ఏళ్ల తరువాత 2019లో ట్రాఫిక్ వడా పావ్ పెట్టడానికి ఈ అనుభవం కూడా ఒక ప్రేరణ అని 30 ఏళ్ల గౌరవ్ చెప్పాడు. ఇంట్లో అమ్మచేసే వడాపావ్ చాలా రుచిగా ఉంటుంది. ఆ వడాపావ్నే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అమ్మితే క్లిక్ అవుతుందనిపించింది. అందుకే ఐడియా రాగానే ధైర్యంగా ముందుకుసాగానని గౌరవ్ చెప్పాడు. గౌరవ్ అమ్మ 52 ఏళ్ల రంజన మాట్లాడుతూ.. స్థిరంగా... నెలకు రూ. 35,000 వచ్చే ఉద్యోగాన్ని మానేయడం సరైన నిర్ణయం కాదనిపించింది. పైగా ఇప్పటికే చాలామంది వడాపావ్ బిజినెస్ చేస్తున్నారు. మేము ఈ పోటీలో నెగ్గుకు రాగలమా..? అనిపించింది కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి వ్యాపారం ప్రారంభించేందుకు సాయం చేశాను. మొదట్లో నేను వడాపావ్ తయారు చేసి ఇస్తే గౌరవ్ భార్య వాటిని ప్యాక్ చేయడంలో సాయం చేసేది. మొదటి రోజు గౌరవ్ 50 వడాపావ్‌లను అమ్మడానికి ట్రాఫిక్ జంక్షన్ల్ వద్దకు వెళ్లాడు. ఎవరూ కొనలేదు. ఇది ఇలానే మరో ఐదు రోజులపాటు కొనసాగింది. ఆ తరువాత గౌరవ్ తన మిత్రుల సాయంతో వడాపావ్‌లను అమ్మడం మొదలు పెట్టాడు. ఆ తరువాతి వారం గౌరవ్ ఫోన్ చేసి ఇంకొన్ని వడాపావ్‌లు తయారు చేసి ఇవ్వమన్నాడు. అలా ఆ ఒక్కరోజే 100 వడాపావ్‌లను అమ్మాము. అప్పటినుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బిజినెస్ అలా ముందుకు సాగిపోతోంది. ప్రస్తుతం రోజుకి 800 వడాపావ్‌లు అమ్మడం ద్వారా నెలకు రూ.2 లక్షలు ఆర్జిస్తున్నట్లు సంతోషంతో చెప్పారు. (చదవండి: గూగుల్‌నే ఫూల్ చేశాడు!) ఐడియాలు... అందరికీ వస్తాయి. అయితే వాటిని అమలు చేయడంలోనే ఉంది అసలు కిటుకు. గౌరవ్‌కి ఐడియా వచ్చింది... దానిని ఆచరణలో పెట్టాడు. మొదట్లో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఆ తర్వాత నిలదొక్కుకున్నాడు. కాస్త వ్యాపారం పుంజుకున్నాక గౌరవ్ ఒక షాపును అద్దెకు తీసుకుని, రూ.6000 వేతనంతో 8 మంది డెలివరీ బాయ్స్‌ను నియమించుకున్నాడు. వీళ్లంతా ఒక యూనిఫామ్ వేసుకుని వడాపావ్‌ను విక్రయిస్తున్నారు. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏది లేదని గౌరవ్ సక్సెస్ స్టోరీ మనకు చెప్పకనే చెబుతోంది. – పోకల విజయ దిలీప్ -
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు శివసేన షాక్!
థానే: అహ్మదాబాద్– ముంబై మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శివసేన ఝలక్ ఇచ్చింది. రైల్వే లైను నిర్మాణానికి జిల్లాలో కావాల్సిన భూమిని ప్రాజెక్టుకు బదలాయించేందుకు శివసేన నేతృత్వంలోని థానే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) నిరాకరించింది. థానే జిల్లాలోని షిల్– దాయ్‌ఘర్ ప్రాంతంలో 3,800 చదరపు మీటర్ల భూమిని రూ. 6కోట్ల పరిహారం తీసుకొని బదలాయించాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను టీఎంసీ పాలక మండలి తోసిపుచ్చింది. -
2020లో ఏదైనా సాధ్యమే ..!
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై, థానే పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, వేడి నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా ఈ నెల 13 వరకు ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇలా డిసెంబర్లో అకాలవర్షం కురవడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో వాన కురిసిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆకాశం మేఘావృతమైన, వర్షంతో తడిసిన వీధులను ఉద్దేశించి నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తూ, జోకులు పేలుస్తున్నారు. ఉదయం వర్షం పడటంతో, ఆ శబ్దం ఏంటో అర్ధం కాలేదని కొంతమంది చమత్కరించగా... మరికొంత మంది.. ‘‘ఇది శీతాకాలం. ఇది డిసెంబర్ అయినా వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఇది 2020. కాబట్టి ఏదైనా సాధ్యం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది.. ‘‘వర్షం , చలి, వేడి, కరోనా , తుఫాన్ ఇవన్నీ కలిపి డిసెంబర్ నెలగా దేవుడు నిర్ణయించాడు’’ అని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఫొటోలు షేర్ చేస్తున్నారు. ట్విటర్లో వైరల్ అవుతున్న మీమ్స్ : Mumbaikars expecting Winter season but #MumbaiRains pic.twitter.com/gwILL52zNn — Ȑ̫̰͍ͭa̤̩͊̌̑h͎̳̲̒ͫû̑͋̐́l̯̾ͩͣͭ (@Rahulismm) December 11, 2020 It's Winter Its December Its Raining But its 2020 So...#rains #MumbaiRains pic.twitter.com/EOVjxst6H3 — Prathamesh Dinis (@pwdesque) December 11, 2020 *God deciding december* barish, thand, garmi, corona, light strom. #MumbaiRains pic.twitter.com/ItZYWL67s2 — prayag sonar (@prayag_sonar) December 11, 2020 Bin Mausam Barsaat🌧🌧☔☔ #MumbaiRains 😶😶 pic.twitter.com/N1emmmrqz8 — Anand Kayralath (@kayralath) December 11, 2020 -
ప్రముఖ నటుడు కన్నుమూత
ముంబై: సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సెలబ్రిటీలు వరుస మరణాలు చెందుతుండడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ టీవీ, సినీ నటుడు రవి పట్వర్ధన్(83) నిన్న రాత్రి థానేలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి నిన్న రాత్రి ఊపిరి ఆడకపోవడంతో ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారు అని ఆయన పెద్ద కుమారుడు నిరంజన్ పట్వర్ధన్ తెలిపారు. రవి పట్వర్ధన్ కి సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. (చదవండి: రైతులు తల్లిదండ్రులతో సమానం) 1980లలో వచ్చిన హిందీ చిత్రాలైన తేజాబ్, అంకుష్ వంటి చిత్రాలలో నటించాడు. హిందీలో యశ్వంత్(1997), ఆశా అసవ్య సన్(1981), ఉంబార్థ(1982), జంజార్(1987), జ్యోతిబా ఫులే వంటి చిత్రాలలో నటించారు. 250కి పైగా సినిమాలలో నటించిన పట్వర్ధన్ హిందీ, మరాఠీ భాషలకు చెందిన టీవీ సీరియల్స్‌లోను నటించారు. అనిల్ కపూర్-మాధురి దీక్షిత్ చిత్రం తేజాబ్ లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తుజా అహే తుజ్‌పాష్‌లో ఆయన పోషించిన చిరస్మరణీయ పాత్ర పట్వర్ధన్‌ను ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుందని థానే సంరక్షకుడు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. అతను చివరిసారిగా ప్రముఖ టీవీ సిరీస్ అగ్గబాయి ససుబాయిలో కనిపించాడు. -
మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. శిశువు జననం
ముంబై (థానే): పట్టణంలోని కల్యాణ్ ప్రాంతంలో 15 ఏళ్ల మైనర్ బాలికపై 21 ఏళ్ల వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో ఆ బాలిక గర్భం దాల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో మైనర్ బాలిక ఇంటిపక్కనే ఉన్న 21 ఏళ్ల వ్యక్తి బాధితురాలికి మాయమాటలు చెప్పి గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టడంతో బాలిక గర్భవతి అయింది. దీంతో కొద్ది రోజుల క్రితం బాధితురాలు ఓ శిశువుకి జన్మనిచ్చింది. విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు బిహార్ పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. (ఆన్లైన్ గేమ్.. మరో యువకుడు బలి) -
నడిరోడ్డుపై ఎమ్మెన్నెస్ నేత హత్య
థానే: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పదాధికారి జమీల్ షేక్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగడు తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనలో జమీల్ షేక్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. థానే రాబోడిలోని బిస్మిల్లా హోటల్ ఎదురుగా సోమవారం మధ్యాహ్యం 1.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న జమీల్‌పై దుండగుడు కాల్చిన బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన జమీల్‌ను స్థానికులు జుపిటర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెన్నెస్ పదాధికారులు అవినాష్ జాదవ్, రవీంద్ర మోరేలతోపాటు పోలీస్ డిప్యూటీ కమిషనర్ అవినాష్ అబురే, నేర పరిశోధన శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మికాంత్ పాటిల్, సహాయక కమిషనర్ నీతా పాడవి, రాబోడి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర శిరతోడే తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. థానేలో జరిగిన ఈ సంఘటనతో పోలీసు యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హంతకుని కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాబోడిలో క్లస్టర్ యోజనను ఎమ్మెన్నెస్ ముఖ్యంగా జమీల్ షేక్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కస్టమర్‌ని కొట్టి చంపిన వెయిటర్లు
థానే : అపరిశుభ్రమైన టిష్యూ పేపర్లు కాకుండా మంచివి ఇవ్వమని అడిగినందుకు ఓ కస్టమర్‌ని కొట్టి చంపారు ఇద్దరు ధాబా వెయిటర్లు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధానేకు చెందిన నవ్‌నాథ్ పావ్నే అనే యువకుడు తన స్నేహితుడు మహేశ్‌తో కలిసి ఆక్టోరోయి నాకాలోని బాబా దాబాకు వెళ్లాడు. టిష్యూ పేపర్లు ఇవ్వాలని ధాబాలోని వెయిటర్లను అడిగాడు. అందుకు ధాబాలో పనిచేస్తున్న వెయిటర్ రాంలాల్ గుప్తా కట్టకట్టిన టిష్యూ పేపర్లని తీసుకొచ్చి ఇచ్చాడు. (చదవండి : ప్రదీప్ లీలలు : చెప్పేవి నీతులు.. చేసేవి చెడ్డ పనులు) అవి దుమ్ము పట్టి ఉండడంతో నవ్‌నాథ్ మంచి టిష్యూ పేపర్లు తీసుకురమ్మని చెప్పాడు. వాటిని తీసుకొచ్చి టిష్యూ బాక్స్‌లో పెట్టాలని సూచించాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ధాబాలోని మరో ఇద్దరు సిబ్బంది వచ్చి నవ్‌నాథ్ గొడవకు దిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాంలాల్ గుప్తా ధాబాలో ఉన్న టైల్తో అతని తలపై గట్టిగా బాదాడు. దీంతో పావ్నే అక్కడిక్కడే కిందపడిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రాంలాల్ గుప్తాతో పాటు మరో ఇద్దరు ధాబా సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
కరోనా రోగులపై చార్జీల బాదుడు : షాక్
సాక్షి, ముంబై: దొరికిందే చాన్స్ అన్నట్టుగా కోవిడ్-19 రోగులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్న ఆసుపత్రికి థానే మున్సిపల్ కార్పొరేషన్ భలే షాక్ ఇచ్చింది. భారీగా చార్జీలు వసూలు చేశారంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రి లైసెన్సును రద్దు చేసింది. (చెవుల్లో కూడా కరోనా వైరస్) కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరిన రోగులనుంచి అధికంగా చార్జీలు వసూలు చేశారన్న ఆరోపణలతో మహారాష్ట్ర, థానే నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను శనివారం నిలిపివేసింది. అలాగే కోవిడ్-19 సెంటర్‌ను కూడా రద్దు చేసింది. థానే మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీ నివేదిక మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 ఆస్పత్రుల ద్వారా 27 లక్షల రూపాయల మేర అదనపు చార్జీలను వసూలు చేసినట్టు ఆడిట్ కమిటి నివేదించింది. దీని ఆధారంగా ఘోడ్‌బందర్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను నెల పాటు నిలిపివేసినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. జూలై 12 వరకు ఇక్కడ చికిత్స పొందుతున్న 797మంది రోగులనుంచి 56 బిల్లుల్లో 6,08,900 రూపాయలను అదనంగా వసూలు చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో చేరిన రోగుల చికిత్సను పర్యవేక్షించడానికి, వారికి చార్జీల భారం లేకుండా నియంత్రించేందుకు ఇద్దరు అధికారులను నియమించామన్నారు. మరోవైపు అసుపత్రులపై నిఘా కొనసాగుతుందనీ, మిగిలిన ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సందీప్ మాలావి ప్రకటించారు. -
సొంత సోదరి హత్య.. ముగ్గురు అరెస్ట్
థానే: సొంత సోదరిని అతికిరాతకంగా హత్య చేసిన ముగ్గురు సోదరులను పట్టుకున్నామని మహారాష్ట్రలోని థానే పోలీసులు బుధవారం తెలిపారు. మొత్తం నలుగురు సోదరులు కలిసి తమ సోదరి ప్రతిభ మాత్రే(29)ని హత్యచేయగా తాజాగా నథా అశోక్ పాటిల్(31), భగవాన్ అశోక్ పాటిల్(24), బాలాజీ అశోక్ పాటిల్(20) అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పాండురంగ్ అశోక్ పాటిల్ కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే జిల్లాలోని దాయ్‌గఢ్ గ్రామానికి చెందిన ప్రతిభ మాత్రే భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోవడంతో సోదరులతో కలిసి ఉంటూ ఓ బార్ షాప్‌లో పనిచేస్తోంది. అయితే, సోదరి ప్రవర్తన నచ్చని సోదరులు ఆమెను వేరుగా ఉండాలంటూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలోనే గత మే1న రాత్రి నలుగురు సోదరులు కలిసి ఆమె గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలోపెట్టి పొలంలో కిరోసిన్ పోసి తగులబెట్టారు. ఈ హత్య గురించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం చేరడంతో నిందితులు పారిపోయారు. అప్పటి నుంచి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం రాత్రి ముగ్గురిని పట్టుకున్నారు. -
ఆస్పత్రుల నిర్లక్ష్యం : ఆటోలో గర్భిణి మృతి
ముంబై : నిండు గర్భిణికి చికిత్స అందించేందుకు పలు ఆస్పత్రులు నిరాకరించడంతో ఆటోలోనే బాధితురాలు మరణించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించిన మూడు ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మే 25 ఆర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. గర్భిణి అస్మా మెహంది (26)కి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లగా ఆమెను చేర్చుకునేందుకు నిర్వాహకులు నిరాకరించారు. వరుసగా మూడు ఆస్పత్రుల్లోనూ వారికి నిరాశే ఎదురైంది. బిలాల్ హాస్పిటల్, ప్రైమ్ క్రిటికేర్, యూనివర్సల్ హాస్పిటల్లకు వెళ్లగా ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగే క్రమంలో నొప్పులు అధికమై గర్భిణి ఆటోలోనే మరణించారు. కుటుంబ సభ్యులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మూడు ఆస్పత్రులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరించడంతో మహిళ రోడ్డుపైనే మరణించడం దిగ్భ్రాంతికరమని మహారాష్ట్ర బీజేపీ నేత రామ్ కదం ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క రోడ్డుపైనే మరణిస్తున్నారని అన్నారు. చదవండి : ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్ -
కరోనా వదిలేసింది.. పాము కాటేసింది
ముంబై : కరోనా వైరస్ నుంచి కోలుకొని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన శివసేన ఎమ్మెల్సీ .. మరుసటి రోజే పాము కాటుకు గురయ్యారు. దీంతో ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. థానేకి చెందిన శివసేన ఎమ్మెల్సీకి మే 9న కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ములుంద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం మే 15న ఆయనను డిశ్చార్జి చేశారు. (చదవండి : ఎంత కష్టం: కావడిలో కన్నబిడ్డలను మోస్తూ) కొద్ది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్న వైద్యుల సలహా మేరకు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న తన బంగ్లాలోకి వెళ్లాడు. పార్టీ కార్యకర్తలకు, అనుచరులకు దూరంగా ఉండేందుకు ఆయన ఆ బంగ్లాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా, శనివారం సాయంత్రం ఇంటిముందు కూర్చున్న ఆయనను ఓ విష పూరిత పాము కాటేసింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రసుత్తం ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1391284009.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కరోనా రాలేదు.. క్వారంటైన్‌కు పంపలేదు’
సాక్షి, చెన్నై: కరోనా సమయంలో సెలబ్రెటీల మీద తప్పుడు వార్తలు రోజు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తూనే ఉన్నాయి. వారు కాస్త ఆస్వస్థతకులోనైనా, ఏ కారణంతోనైనా ఆస్పత్రి దరిదాపుల్లోకి వెళ్లినా వారికి కరోనా అంటగడుతూ సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారు. దీంతో తమకు, తమ కుటుంబసభ్యులెవరికీ కరోనా సోకలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి సెలబ్రెటీలకు ఏర్పడింది. ఈ క్రమంలో దక్షిణాది దిగ్గజ దర్శకుడు భారతిరాజాలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. ‘భారతిరాజా క్వారంటైన్‌కు తరలించారంటూ వార్తలు వస్తున్నాయి. థానేలో ఉన్న మా సహోదరికి శస్త్ర చికిత్స జరిగింది. ఆమెను చూడటానికి అధికారుల నుంచి పాస్ తీసుకునే బయలుదేరాను. థానేకు వెళ్లాక నేనే అధికారులకు చెన్నై నుంచి వచ్చాను అని చెప్పాను. వారు కరోనా టెస్టులు నిర్వహించారు. నెగటీవ్ అని వచ్చింది. ఆ తర్వాత మళ్లీ చెన్నైలో టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలింది. మొత్తం మూడు చోట్ల నాకు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలింది. అన్ని చోట్లా నేనే స్వచ్చందంగా పరీక్షలు చేయించుకున్నా. అయితే పలు జిల్లాలు, రాష్ట్రాలు తిరిగొచ్చానందుకు నాకు నేను నా ఇంట్లో స్వీయ నిర్భంధంలో ఉంటున్నాను. అంతేకాని నన్నెవరూ బలవంతంగా క్వారంటైన్ సెంటర్‌కు తరలించలేదు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. వదంతులు నమ్మకండి. నాపై తప్పుడు వార్తలు రాయకండి’అంటూ భారతీరాజా విజ్ఞప్తి చేశారు. చదవండి: కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన ప్రకాష్ రాజ్ విష్ణు టిక్‌టాక్ వీడియో.. అద్భుతః -
లాక్డౌన్ పాటించండి: బహుమతులు గెలవండి!
థానే : కరోనా లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, నియమాలు పాటించేలా చేసేందుకు థానే మున్సిపల్ కార్పోరేషన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నియమాలను పాటించే వార్డులకు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం వార్డు స్థాయిలో కాంటెస్ట్‌లు నిర్వహిస్తోంది. అంతేకాకుండా నిర్ణీతకాలం పాటు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాని వార్డులకు 25-50 లక్షల రూపాయలు అందించనుంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి డిజిథానే యాప్‌ను తప్పక ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి.. ) కాంటెస్ట్‌లో పాల్గొనే వార్డులపై టీఎమ్‌ఎసీ ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఆ వార్డులు లాక్డౌన్ నియమాలు పాటిస్తున్నాయా లేదా తెలుసుకోవటానికి సీసీటీవీ కెమెరాలు, పోలీసుల సహాయం తీసుకోనుంది. దీనిపై మేయర్ నరేష్ మస్క్ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 80 శాతం ప్రజలు లాక్డౌన్ నియమాలు పాటిస్తున్నారు. మిగిలిన 20శాతం మంది కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే టీఎమ్సీ ఈ నిర్ణయం తీసుకుంద’’ని తెలిపారు. (యూపీలో అరుదైన దృశ్యాలు కనువిందు ) -
డెలివరీ బాయ్ ముస్లిం అని...
థానే: ముస్లిం డెలివరీ బాయ్ నుంచి సరుకులు తీసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. కశిమీరా ప్రాంతానికి చెందిన ఘనశ్యామ్ చతుర్వేది ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేశాడు. వీటిని డెలివరీ చేసేందుకు ఓ ముస్లిం వ్యక్తి మంగళవారం చతుర్వేది ఇంటికి వచ్చాడు. అతను ముఖానికి మాస్కులతోపాటు చేతులకు గ్లవ్స్ కూడా ధరించి ముందుజాగ్రత్త చర్యలను పాటించాడు. ఇంతలో చతుర్వేది, తన భార్యతో కలిసి గేటు దగ్గరకు వచ్చి ముందు అతడి పేరు అడిగాడు. అతను సమాధానం చెప్పగానే ముస్లిం అని అర్థమై సరుకులు తీసుకోడానికి నిరాకరించాడు. ముస్లిం తెచ్చిన వస్తువులను ముట్టుకునేది లేదని కరాఖండిగా చెప్పాడు. దీంతో ఖంగుతిన్న డెలివరీ బాయ్ అక్కడ సంభాషణ అంతటినీ ఫోన్లో రికార్డు చేసి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చతుర్వేదిని అరెస్టు చేశారు. నేడు అతడిని జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. (రోడ్లపైకి భారీగా జనం.. గుంజీలు తీయించిన పోలీసులు) -
లాక్డౌన్ బేఖాతరు చేస్తున్నవారికి హారతి
-
లాక్డౌన్ బేఖాతరు చేస్తున్నవారికి హారతి
థానే: "మనం ఇంట్లో ఉండి కరోనాను తరిమికొడదాం" అని ప్రభుత్వమిస్తున్న నినాదాలు కొందరి చెవికెక్కట్లేదు. అవసరమున్నా లేకపోయినా, చీటికీమాటికీ రోడ్ల మీదకు వస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్ని రకాలుగా చెప్పినా లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఇలాంటి వారికి హారతిచ్చి మరీ ప్రస్తుత పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెప్తూనే బయటకు రావద్దంటూ పోలీసులు సూచనలిస్తున్నారు. ఈ కొత్త తరహా పనిష్మెంట్ మహారాష్ట్రలోని థానేలో విధించారు. (మరో కొన్నిగంటల్లో ఇంటికి చేరుతుందనగా..) వివరాల్లోకి వెళితే.. థానేలో మంగళవారం ఉదయం పూట కొంతమంది మార్నింగ్ వాక్ కోసం రోడ్ల మీదకు వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డగించగా కారణం తెలుసుకుని నివ్వెరపోయారు. ఇలాంటి ప్రమాద పరిస్థితుల్లో మార్నింగ్ వాక్ ఏంటని ప్రశ్నించారు. ఇంతలో ముఖానికి మాస్కు ధరించి ఉన్న ఓ మహిళా పోలీసు హారతి పళ్లెంతో వారి ముందుకు వచ్చింది. లాక్డౌన్ ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యువకులందరికీ హారతి పడుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పకనే చెప్పింది. ఈ హారతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇరుకు బతుకుల్లో ఊపిరాడేనా?) -
నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే..!
థానే: మహారాష్ట్రలోని థానేలో భగవాన్ అనే వ్యక్తి నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్వా ప్రాంతంలోని ఓ బ్రిడ్జికి తాడుకట్టి మెడలో తాడు వేసుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు నివ్వెరపోయారు. వెంటనే అతన్ని గమనించిన థానే ట్రాఫిక్ పోలీసులు చురుగ్గా స్పందించి.. అతన్ని కాపాడారు. స్థానికుల సహాయంతో సురక్షితంగా కిందకు దించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డు మీద ఉరేసుకొని చనిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు భగవాన్ అని, కొడుకు చనిపోయిన దగ్గరి నుంచి అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. -
కూతురిని చంపి.. టీవీ నటి ఆత్మహత్య
ముంబై : థానేలో విషాదం చోటుచేసుకుంది. కూతురిని హతమార్చిన ఓ టీవీ ఆర్టిస్టు.. అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. ప్రాద్య్నా పర్కార్(40) అనే మహిళ మరాఠీ సీరియళ్లలో నటిస్తోంది. ఆమె భర్త చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి పన్నెండో తరగతి చదివే కుమార్తె శ్రుతి ఉంది. కాగా గత కొంతకాలంగా ప్రాద్య్నాకు సీరియల్ అవకాశాలు తగ్గిపోయాయి. అదే విధంగా భర్త కూడా వ్యాపారంలో నష్టపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భర్త జిమ్‌కు వెళ్లిన సమయంలో ప్రాద్య్నా... కూతురిని గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగొచ్చిన ఆమె భర్త తలుపు తట్టగా లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో తలుపులు బద్దలు గొట్టగా తల్లీకూతుళ్లు విగతజీవులుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ప్రాద్య్నా భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాద్య్నా సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
రత్నగిరి డ్యామ్‌కు గండి, ఆరుగురు మృతి
సాక్షి, ముంబై : ఆర్థిక రాజధాని ముంబయిని కుండపోత వర్షాలు వీడటం లేదు. గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంత అయ్యారు. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా రత్నగిరిలోని తివారీ డ్యామ్‌కు గండిపడింది. దీంతో సమీపంలోని ఏడు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ఆరుగురు మృతి చెందగా, 23మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకూ రెండు మృతదేహాలను వెలికి తీశారు. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి కాగా థానేలో ఓ హోటల్లో వరద నీరు చేరటంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. వరద నీరు ఒక్కసారిగా కిచెన్‌లోకి రావడంతో... ఫ్రిజ్‌నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్రిజ్ స్విచ్ ఆపేందుకు విద్యుత్ వైరును పట్టుకోవడంతో వీరేంద్ర దాస్ బనియా (27), రాజన్ దాస్ (19) మృతి చెందినట్లు థానే రూరల్ పోలీస్ అధికారి యువరాజ్ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రేపటి (గురువారం) వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు. -
జై శ్రీరాం అనాలంటూ క్యాబ్ డ్రైవర్‌పై దాడి
ముంబై : జై శ్రీరాం అని నినదించాలంటూ ఓ ముస్లిం క్యాబ్ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన థానేలో జరిగింది. మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు థానేలోని దివా ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ ఫైజల్ ఉస్మాన్ ఖాన్‌ను అటకాయించి జై శ్రీరాం అనాలని బెదిరించారు. జై శ్రీరాం అనకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భౌతిక దాడికి పాల్పడ్డారు. రోడ్డు మధ్యలో కారును ఎందుకు ఆపావంటూ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై దౌర్జన్యానికి దిగారని డ్రైవర్ చెప్పారు. తాను ముస్లింనని గ్రహించిన వారు కారు నుంచి తనను బయటకు లాగి కొట్టారని వెల్లడించారు. జైశ్రీరాం అంటేనే తనను విడిచిపెడతామని బెదిరించారని తెలిపారు. క్యాబ్‌లో కూర్చున్న ప్రయాణీకుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేయగా, డ్రైవర్ మొబైల్ ఫోన్‌ను లాక్కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి నిందితులు వాడిన బైక్ రిజిస్ర్టేషన్ నెంబర్‌ను ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనాన్ని ట్రేస్ చేసి నిందితులను జైదీప్ ముండే, మంగేష్ ముండే, అనిల్ సూర్యవంశీగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ముగ్గురు మృతి
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు 8 మంది మురుగును శుద్ధి చేసే ప్లాంట్‌లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్‌లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. -
తెలుగు ఓటర్ల ప్రభావమెంత?
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నాలుగో విడత, ఆఖరి దశ పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ముంబైలోని ఆరు స్థానాలతోపాటు 17 స్థానాలకు సోమవారం ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముంబై, థాణేతోపాటు భివండీలో నివసించే తెలుగు ప్రజలు అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేశాయి. తెలుగు రాజకీయ నేతలతో ప్రచారం చేయించాయి. బీజేపీ తరఫున రాపోలు ఆనంద్ భాస్కర్, బాబూ మోహన్, కాంగ్రెస్ తరఫున విజయ శాంతి, నేరెళ్ల శారద తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మహానగరి ముంబైలో.. దక్షిణ ముంబై ఎంపీ స్థానంలోని వర్లీ, కమాటిపురా, కొలాబా, సాత్‌రాస్తా తదితర ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది తెలుగు ఓటర్లున్నారు. దక్షిణమధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలోని ధారావి, వాడాలా, చెంబూర్, సైన్ కొలివాడా తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు సుమారు 45 వేల మంది ఉంటారు. మరోవైపు ఉత్తర ముంబైలోని బోరివలి, దహిసర్, కాందివలి తదితర ప్రాంతాల్లో సుమారు 40 వేల ఓటర్లుండగా ఉత్తర పశ్చిమ ముంబైలో సుమారు 30 వేల వరకు ఓటర్లుంటారని అంచనా. అదేవిధంగా ఉత్తర తూర్పు ముంబై, ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ములూండ్, విక్రోలి, ఘాట్కోపర్, విలేపార్ల, కుర్లా, బాంద్రా తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ఓటర్లున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నేతలు ప్రత్యేక దృష్టిపెట్టారు. భివండీలో మనవాళ్లే కీలకం.! భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. భివండీ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకమైన తూర్పు భివండీ, పశ్చిమ భివండీ, పశ్చిమ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో తెలుగు వారున్నారు. ఈ మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 1.50 లక్షల మంది తెలుగు ఓటర్లుంటారు. వీరిలో తెలంగాణ వాసులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. దీంతో భివండీ లోక్‌సభ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములపై తెలుగు ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ధాణేలో కొంతమేర.. థాణే లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. థాణేలోని కిసన్‌నగర్, సిపి తలావ్, హజూరి, కల్వా, లోకమాన్యనగర్, బాల్కుమ్, గాంధీనగర్, సుభాష్‌నగర్, మీరా–భయిందర్, ఐరోలి, బేలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలున్నారు. భివండీలో బాబూమోహన్ ప్రచారం భివండీలోని తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ పేర్కొన్నారు. ముంబైతోపాటు భివండీలో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం ఇక్కడికి చేరుకున్న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలుగు భవన్, ముంౖ»ñ వర్సిటీలో తెలుగు పీఠం ఏర్పాటుతో పాటు తెలుగు ప్రజల ఇతర సమస్యలపై స్థానిక నేతలతో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. -
మహారాష్ట్రలో ఐసిస్ అనుమానితుల అరెస్ట్
సాక్షి, ముంబై : నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో థానే, ఔరంగాబాద్‌ల నుంచి బుధవారం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఈ తొమ్మిది మందిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) నిర్బంధంలోకి తీసుకుందని పోలీసులు వెల్లడించారు. వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు వీరి కదలికలను పసిగడుతున్న ఏటీఎస్ గత రెండు రోజులుగా థానే, ఔరంగాబాద్‌ల్లో వలపన్ని అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు. సోదాల్లో భాగంగా వీరి నుంచి కొన్ని రసాయనాలు, పౌడర్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, ఏసిడ్ బాటిల్, పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
‘నా చావుకు ఎవరూ కారణం కాదు’
ముంబై : నా చావుకు ఎవరూ కారణం కాదంటూ.. సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడో యువకుడు. థానేలోని కళ్యాణ్పూర్ స్టేషన్ వద్ద గురువారం చోటు చేసుకుంది ఈ దారుణం. వివరాలు.. రోహిత్ పరదేశి(20) అనే వ్యక్తి కదులుతున్న సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పక్కన ఇతని తలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోహిత్ మృత దేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాజేష్ సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చనిపోయేముందు అతను వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఈ మెసేజ్‌లో ‘నా చావుకి ఎవరూ కారణం కాదు.. ఎవరి బలవంతం వల్లనో నేను ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. నాకు బతకాలని లేదు. నా తదనంతరం ఆస్తి మొత్తం నా సోదరుడికే చేందుతుంది’ అని వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. -
‘నవీ ముంబై, థానే, పూణె పేర్లు మార్చండి’
ముంబై: మహారాష్ట్రలోని పలు నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. శివసేన చాలా కాలం నుంచి జౌరంగబాద్ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ కూడా రాష్ట్రంలోని పలు నగరాల పేర్లు మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీలో ఆజ్మీ మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనను సభ ముందు ఉంచారు. అదేవిధంగా ఈ ప్రతిపాదనల వెనుక బీజేపీకిలాగా ఎలాంటి రహస్య ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్ల మార్పు ఎవరి మత విశ్వాసాలను దెబ్బతినకుండా ఉండాలని అన్నారు. అందుకే నవీ ముంబై పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ నగర్‌గా, థానే పేరును జిజామాతా నగర్‌గా, పూణె పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చాలని కోరారు. మరోవైపు జౌరంగబాద్ పేరు మార్పుపై శివసేన ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పేరుతో దానికి ఆ పేరు వచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు ఒకవేళ మతం పేరుతో నగరాల పేరును మార్పు చేస్తున్నట్టయితే.. వారి పార్టీలోని నాయకుల పేర్లు కూడా మార్చాలని అన్నారు. ఆ క్రమంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును ముఖేశ్ చంద్రగా, షాహనవాజ్ హుస్సేన్ పేరును శంకర్ మహాదేవన్‌గా మార్చాలని ఎద్దేవా చేశారు. కాగా, ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్ర గురించి ఆజ్మీకి తెలియదని విమర్శించారు. సోదరులను చంపి, సంగీతంపై నిషేధం విధించిన క్రూరమైన పాలకుడు జౌరంగజేబు.. అటువంటి వ్యక్తిని ఆజ్మీ కీర్తిస్తున్నాడని మండిపడ్డారు. తాము జౌరంగబాద్ పేరు శంభాజీనగర్‌గా మార్చాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. -
వంట వండలేదని అత్తను కత్తితో.. దారుణం
థానే : ఉదయపు అల్పాహారం వండలేదన్న కోపంతో అత్తను చంపిందో కోడలు. ఈ సంఘటన శనివారం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని థానే ఖోఫట్ ఏరియాకు చెందిన 39ఏళ్ల స్వప్న కులకర్ణి అనే మహిళ అల్పాహారం తయారు చేయవల్సిందిగా 75ఏళ్ల అంధురాలైన శోభా కులకర్ణి అనే మహిళను కోరింది. అయితే ఆ వృద్ధురాలు అల్పాహారం తయారు చేయటానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్పప్న వృద్ధురాలిపై విరుచుకుపడింది. కత్తితో ఆమెను విచక్షణా రహితంగా పొడిచిచంపింది. అతి దారుణంగా.. దాదాపు 15సార్లు ఆమెను పొడిచింది. విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితురాలిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబట్టడానికి విచారణ చేపట్టారు. -
భర్త పెట్టే టార్చర్ భరించలేక...
సాక్షి, ముంబై: భర్త పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన చంటి బిడ్డతోసహా రైల్వే ట్రాక్ మీదకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. డ్రైవర్ అప్రమత్తం అయ్యేలోపే ఘోరం జరిగిపోయి ఆ తల్లీకూతుళ్లు నలిగిపోయారు. థానే జిల్లా భాయందర్ రైల్వే స్టేషన్లో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగో ఫ్లాట్ ఫామ్‌పై తన కూతురిని ఎత్తుకుని ఆ మహిళ రైలు కోసం ఎదురు చూస్తూ ఉంది. రైలు దగ్గరికి రాగానే ఒక్కవేటున దూకేసింది. అది గమనించిన డ్రైవర్ బ్రేకులు వేయగా.. అప్పటికే ఆ తల్లీకూతుళ్లు రైలు చక్రాల కింద పడి నలిగిపోయారు. ఆనవాళ్ల ఆధారంగా మృతులను రేణుకా పింటూ(24), ఆరోహి(2)గా నవఘడ్ పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజీల్లో ఆ షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. భర్త వేధింపులు తాళలేకనే ఆమె బిడ్డతో సహా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బుల్లెట్ బండి కొనటానికి డబ్బులు తేవాలంటూ ఆమెను భర్త ఏడాదిగా హింసిస్తున్నాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని రేణుకా తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఫిర్యాదుతో రేణుకా భర్త రాహుల్ పింటూ సింగ్ యాదవ్‌ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ముంబై మిర్రర్ ఓ కథనం ప్రచురించింది. -
ప్రేమించలేదన్న కోపంతో నడిరోడ్డుపై యువతిని..
థానే : ప్రేమించలేదన్న ఆగ్రహంతో యువతిని పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడో యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానేకు చెందిన ప్రాచీ జేడ్(20) అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన ఆకాష్ పవార్(25) గతకొద్ది నెలలుగా ప్రేమించమని వెంటబడుతూ వేధిస్తున్నాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోగా తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పటంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆకాష్‌ను ఇకపై అలాచేయవద్దని మందలించి పంపేశారు. అయినా ఆకాష్ పద్దతిలో మార్పు రాకపోగా ఆమెపై ధ్వేషం పెంచుకున్నాడు. ఆమె తనను ప్రేమించటానికి ఒప్పుకోకపోతే హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం పక్కా ప్లాన్ ప్రకారం రెండు కత్తులను వెంటతీసుకొని వెళ్లి ఆమె ఇంటి దగ్గర వేచిచూశాడు. ఆమె ఓ పనిమీద స్కూటిపై బయటకు వెళుతున్న సమయంలో వెంబడించి ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్దకు రాగానే స్కూటిని ఆపాడు. ఆమెను తిడుతూ ప్రేమను అంగీకరించాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆమె బదులు చెప్పకపోవటంతో అందరూ చూస్తుండగానే వెంటతెచ్చుకున్న కత్తితో పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడి వారు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలో ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ శనివారం స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మహరాష్ట్రలో కొనసాగుతున్న రిజర్వేషన్ల బంద్
-
బస్సు కింద నలిగి మహిళ దుర్మరణం
-
ప్రాణం తీసిన రోడ్డు గుంత.. వైరల్
సీసీ టీవీ ఫుటేజీల్లో భయానక యాక్సిడెంట్ రికార్డయ్యింది. రోడ్డు గుంతలో బైక్ అదుపుతప్పి పడిపోగా, బస్సు కింద నలిగి ఓ మహిళ దుర్మరణం పాలైంది. ముంబైలో జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న ఓ షాపు సీసీ ఫుటేజీల్లో రికార్డుకాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాక్షి, ముంబై: థానే జిల్లా కళ్యాణ్‌లో ఓ స్కూల్లో పని చేస్తున్న మనీషా బోయిర్(40) తన బంధువు బైక్‌పై శనివారం సాయంత్రం ఇంటికి వెళ్తోంది. శివాజీ చౌక్‌కు చేరుకోగానే బైక్ గుంతలో పడి అదుపుతప్పి ఆమె కింద పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఓ ప్రైవేట్ బస్సు పక్కనుంచి వెళ్తుండగా, వెనక టైర్ కింద ఆమె పడిపోవటం.. కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. సురక్షితంగా బయటపడ్డ ఆ వ్యక్తి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా.. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్షకాలంలో వేగంగా వెళ్లటం మంచిది కాదని వాహనదారులకు అధికారులు జాగ్రత్తలు సూచిస్తుండగా. మరోవైపు ఆదివారం స్థానికులే రోడ్డుపై గుంతలను పూడ్చటం విశేషం. -
పోలీసులకు సహకరిస్తా: అర్బాజ్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. థానే పోలీసుల(ఏఈసీ) నుంచి సమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం అర్బాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. ఝ‘పోలీసులు నా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణకు సంబంధించి పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. ఈ కేసులో వారికి సహకరిస్తా’ అని తెలిపాడు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం మేరకు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు సమాచారం. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫొటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన చాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడని తెలుస్తోంది. చదవండి: ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న సల్మాన్ సోదరుడు -
ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు విప్పిన సల్మాన్ సోదరుడు
-
ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న అర్భాజ్ ఖాన్
సాక్షి, ముంబై: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్(50) పేరు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడైంది. థానే పోలీసుల(ఏఈసీ) నుంచిసమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫోటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన ఛాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడంట. డైరీ ఆధారంగానే... ‘బెట్టింగ్‌లో ఓడిపోయిన డబ్బును అర్బాజ్ చెల్లించకపోవటంతో జలన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవసరమైతే ఈ విషయంలో సల్మాన్‌ను నిలదీస్తామని వారు బెదిరించారు’ అని శర్మ మీడియాకు వెల్లడించారు. 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్ కేసును దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, దర్యాప్తులో భాగంగా హైప్రొఫైల్ బుకీ జలన్తోపాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న థానే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. గతంలో జరిగిన సీజన్లలోనూ జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతోపాటు ఈ సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతోపాటు వంద మంది బుకీల పేర్లను జలన్ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు. అంతేందుకు ఈ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారని సోనూ విచారణలో వెల్లడించాడు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఈ వ్యవహారం నడిచిందని, బాలీవుడ్ సెలబ్రిటీల స్వయంగా హాజరై బుకీలతో మంతనాలు నడిపినట్లు జలన్ తెలిపాడు. అయితే వారందరినీ విచారణ చేపడతారా? అన్న ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదు. ముంబై కమీషనర్ ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, మరో ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడటం గమనార్హం. స్పందించిన ఐపీఎల్ చైర్మన్... ‘ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఈ అంశం పోలీసుల పరిధిలో ఉంది. ఐసీసీ-బీసీసీఐలకు అవినీతి నిరోధక విభాగాలు ఉన్నాయి. అవసరమైతే పోలీసులు ఆయా విభాగాలను సంప్రదించొచ్చు’ అని శుక్లా సూచించారు. -
ప్రముఖ బుకీ అరెస్టు
ముంబై : ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ప్రముఖ బుకీని మంగళవారం నాడు థానే పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ముంబైలోని దొంబివాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న థానే దోపిడీ వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి బుకీని అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌లను, పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితుడు దేశంలోనే టాప్‌మోస్ట్ బుకీ సోను జలాన్ అలియాస్ సోను మలాద్గా పోలీసులు ప్రకటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జలాన్ ఈ ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్‌లు నిర్వహించడానికి సోషల్ మీడియా ద్వారా కొన్ని లింకులను పంపించేవాడు. ఇతర ఏజెన్సీలకు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం. బెట్టింగ్‌లో పాల్గొనాలనుకునే వారు ఆ లింకుల ద్వారా బెట్టింగ్ పెడతారు. ఇలా పెట్టినవారికి జలాన్‌కు సంబంధించిన వ్యక్తుల ద్వారా కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. జలాన్ దొంబివాలా పరిసరాలలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలను కూడా బెట్టింగ్‌కు అడ్డగా మార్చుకున్నాడని తెలిపారు. -
చిన్నారిని చిదిమేసిన ‘హై హీల్స్’
థానే : కాస్తా ఎత్తుగా, మరికాస్తా అందంగా కనిపించడానికి ధరించిన హై హీల్స్(చెప్పులు) మహారాష్ట్రలో ఓ పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. వినాడానికి షాకింగ్ ఉన్న ఇది నిజం. వివాహ వేడుకకు కోసం ఓ మహిళ ధరించిన హై హిల్స్ కాస్తా పట్టు తప్పడంతో చేతిలో ఉన్న ఆరు నెలల చిన్నారి బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఫెహ్మిద షేక్ (23) తన 6 నెలల కుమారుడు మహ్మద్‌ను తీసుకుని భర్తతో కలిసి రాంభాగ్‌లో జరుగుతున్న బంధువుల వివాహ వేడుకకు హజరయ్యింది. వివాహం ముగిసిన అనంతరం ఇంటికి వెళ్దామని బయలుదేరారు. మొదటి అంతస్తులో బాల్కని వెంబడి కిందకు వస్తున్నారు. ఆ సమయంలో ఫెహ్మిదా ధరించిన హై హీల్స్ కాస్తా పట్టు తప్పడంతో ఆమె చేతిలో ఉన్న 6 నెలల మహ్మద్ మొదటి అంతస్తు నుంచి జారి కిందపడ్డాడు. ఫెహ్మిద భర్తతో కలిసి కిందకు పరిగెత్తే చూసే సరికి పసివాడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మహ్మద్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మహ్మద్ మృతిని ప్రమాదం వల్ల జరిగినట్లు నమోదు చేసుకున్నారు. అంతేకాక తదుపరి విచారణకు ఆదేశించినట్లు మహాత్మ ఫౌలే పోలీసు స్టేషన్ అధికారి విజయ్ ఖేడేకర్ తెలిపారు. -
మూడో సంతానం ఆడబిడ్డే... హత్య చేసిన తల్లి
థానే: మూడో సంతానం కూడా ఆడ్డపిల్లే పుట్టిందని ఓ తల్లి చేతిగోళ్లతో గొంతు కోసి శిశువును దారుణంగా చంపేసింది. మహారాష్ట్రలోని థానే సమీపంలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వైశాలి ప్రధాన్ (27) అనే మహిళకి ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం కూడా ఆడ శిశువు కావడంతో వారంరోజుల వయస్సు గల నవజాత శిశువును గొంతుకోసి హత్య చేసింది. తనకేమి తేలియనట్టు పాపను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. శిశువు గొంతుపై రక్తపు మరకలు, గాయలు ఉండటంతో వైద్యులు ఆమెను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకొచ్చింది. తన భర్త తాగుడికి బానిసగా మారడం.. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో వైశాలి తన బిడ్డను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదివరకే ఇద్దరు బిడ్డలు ఉన్నారని, మూడో బిడ్డ వద్దని అబార్షన్ కోసం అప్పు చేస్తే ఆ డబ్బును తన భర్త తాగుడు కోసం వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వైశాలిని ఆదివారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు. -
ఆధార్ లింక్ పేరుతో వేల రూపాయలు స్వాహా
థానే : ఆధార్ లింక్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సీనియర్ సిటిజన్ అకౌంట్ నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు. కోప్రి పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐపీసీ సంబంధిత చట్టాల కింద దీనిపై కోప్రి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన బపురావు షింగోట్కు ఏప్రిల్ 2న ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్ నెంబర్‌తో లింక్ చేస్తున్నామని ఆ ఫోన్ చేసిన వ్యక్తులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మీ మొబైల్ నెంబర్‌కు పంపిన ‘వెరిఫికేషన్ కోడ్’ను పంపించమని వారు అడిగారు. టెక్ట్స్ మెసేజ్ రూపంలో తాను పొందిన మెసేజ్‌ను షింగోట్ వారికి చెప్పాడు. ఇక అంతే, షింగోట్ అకౌంట్ నుంచి కొద్ది క్షణాల్లో 75 వేల రూపాయలు విత్‌డ్రా అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాంకు అకౌంట్ నుంచి నగదు విత్‌డ్రా చేశారని తెలుసుకున్న షింగోట్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంకులు నగదును ఆన్లైన్లో ట్రాన్సఫర్ చేయాలంటే వన్ టైమ్ పాస్వర్డ్లు ఎంతో అవసరం. ఓటీపీ టైప్ చేస్తే, లావాదేవీ పూర్తవుతుంది. దీన్నే క్యాష్ చేసుకున్న కొందరు బ్యాంకు వారిగా కాల్స్ చేస్తూ.. ఆధార్ లింక్ ప్రక్రియ చేపడుతున్నామంటూ... ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను రాబడుతున్నారు. నిజంగానే బ్యాంకు అధికారులు ఆధార్ లింక్ చేపడుతున్నారని భావిస్తున్న కస్టమర్లు ఈ పాస్వర్డ్ చెప్పి వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న కోప్రి పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు. -
ఐదేళ్ల బాలికను పైశాచికంగా..
థానే : మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై సామూహిక అత్యచారం జరిగింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బాలికపై అతి పైశాచికంగా అత్యచారానికి పాల్పడినట్లు వైద్యులు తెలిపారు. ఓ బాలిక రోడ్డుపై ఏడుస్తుండగా ఒక వ్యక్తి ఆ బాలికను థానే పోలీస్‌స్టేషన్‌కి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అనుమానం వచ్చిన పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్కామ్‌లో ఇరుకున్న నటుడు
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్‌లో బాలీవుడ్ నటుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావటంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీసులు.. కాల్ డేటా రికార్డ్ స్కామ్ పేరిట దీని దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఉన్నారు. నవాజ్ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని అతను చెప్పాడు. దీంతో విచారణకు సహకరించాల్సిందిగా నవాజుద్దీన్ పోలీసులు కోరారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవటంతో థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ ట్విట్టర్లో స్పందించాడు. తన కూతురు స్కూల్ ప్రాజెక్టు కోసం హాజరయ్యానని చెబుతూ.. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించటం దిగ్భ్రాంతి కలగజేస్తోందని అంటున్నాడు. Last evening, I was helping my daughter to prepare her school project Hydroelectric Power Generator & went to her school this morning for Project Exhibition. To my surprise the media had questions about some random allegations on me #Disgust pic.twitter.com/APPaEK373q — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 10 March 2018 -
రూపాయి కోసం హత్య
సాక్షి, ముంబై: మనుషుల్లో పెరిగిపోతున్న అసహనానికి, నశిస్తున్న మానవీయతకు నిదర్శనం ముంబై లో జరిగిన హత్య. కేవలం ఒక రూపాయి ఒక సీనియర్ సిటిజన్ ప్రాణాలను బలితీసుకుంది. ముంబైలోని థానేలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..థానే కళ్యాణ్ పట్టణానికి చెందిన మనోహర్ గమ్నే (54) కోడిగుడ్లుకొనడానికని సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ దుకాణదారుడికి చెల్లించాల్సిన డబ్బులో ఒక రూపాయి తక్కువైంది. షాపు ఓనర్ గమ్నేని దుర్భాషలాడాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న బాధితుని కుమారుడు దీనిపై దుకాణదారుడిని ప్రశ్నించాడు. అంతే...వివాదం మరింత ముదిరింది. విచక్షణ మరిచిన షాపు యజమాని కొడుకు గమ్నే పై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆయన అక్కడిక్కడకే ప్రాణాలువిడిచాడు. ఈ ఘటనపై నిందితుడు సుధాకర్ ప్రభు (45) అరెస్ట్ చేశామని, హత్య కేసు నమోదు చేసినట్టు థానే పోలీసు అధికారి సుఖదా నర్కార్ చెప్పారు. -
పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్
థానె: ఒక రోజు వయసున్న బాలుడిని దొంగతనం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను థానే పోలీసులు సోమవారం అరెస్టు చేసి ఆ బాలుడితోపాటు మరో ఐదుగురు పిల్లలను రక్షించారు. ఇన్స్పెక్టర్ నితిన్ థాక్రే ఆధ్వర్యంలోని పోలీసుల బృందం కళ్యాణ్ తహసిల్‌లోని పీసావలి గ్రామంలోని ఓ ఇంటిపై దాడిచేసి గుడియా సోను రాజభర్(35), ఆమె భర్త సోను రాజ్‌భర్(40), విజయ్ కైలాస్ శ్రీవాత్సవ (55)లను అరెస్టు చేసింది. ఆ ఇంటి నుంచి థానే సివిల్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దొంగిలించిన శిశువుతోపాటు మరో ఐదుగురు పిల్లలను పోలీసులు కనుగొన్నారు. వీరిలో 2 నెలల ఆడశిశువు, పదకొండు, తొమ్మిది, ఐదు సంవత్సరాల వయసున్న బాలికలు, మరో మూడేళ్ల వయసున్న బాలుడు ఉన్నారు. పసికందును అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఓ మహిళ ఈ పసికందు తల్లి వద్దకు వచ్చి మీ తల్లి బాలుడిని చూడాలనుకుంటోందని చెప్పి తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. తమకందిన ఫిర్యాదు మేరకు థానే పోలీసులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వరకు అన్ని రైల్వే స్టేషన్లలో సోదా చేశారని, అలాగే ఆస్పత్రి, రైల్వే స్టేషన్లలోని సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించి పీసావలి గ్రామానికి పోలీసులు వెళ్లి ఆ ఇంట్లో సోదా చేశారని కమిషనర్ మధుకర్ పాండే వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వీరు పిల్లలను దొంగిలించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
భగ్గుమన్న మహారాష్ట్ర
సాక్షి, ముంబై: భీమా కోరేగావ్ బంద్ మహారాష్ట్రలో ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా ముంబై, థానే, పూణే నగరాల్లో బంద్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెండు నగరాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో ప్రజా రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడ ఆగిపోయింది. ముంబై నగరంలో మెట్రో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలావుండగా థానే నగరంలో 144 సెక్షన్‌ను అధికారులు విధించారు. ప్రస్తుతం పూణేలో మొదలైన దళిత ఉద్యమం మొత్తం మహరాష్ట్ర అంతటా విస్తరించింది. పూణెలో అందోళనకారులు బస్సులకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను నిలవరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పూణే అడిషనల్ కమిషనర్ రవీంద్ర సెంగోన్కర్ తెలిపారు. భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణిచారు. దీంతో మంగళవారం రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. హింసాత్మక ఘటనలను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. అంబేద్కర్ మనవుడు ప్రకాశ్ అంబేద్కర్ బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం బంద్ సందర్భంగా మహారాష్ట్రలో పాఠశాలలు మూసేశారు. ప్రజారవాణ దాదాపు ఆగిపోయింది. థానేలో ఆందోళనకారులు రైలు సేవలకు ఆటంకం కల్గించేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. దీంతో యథావిధంగా రైళ్లు నడుస్తున్నాయి. థానేలో గురువారం అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ముంబై నగరంలో బస్సులు, ఆటోలు, ప్రయివేట్ క్యాబ్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బాంబే ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు మాత్రం పాక్షికంగా తిరుగుతున్నాయి. దళితలు బలంగా ఉన్న బీడ్, లాతూర్, షోలాపూర్, అహ్మద్ నగర్, నాసిక్ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన హింసలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 187 బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో బుధవారం సున్నితమైన ప్రాంతాలకు బస్సు సర్వీసులను అధికారులు నిలిపేశారు. రాజ్యసభలో వాడివేడి చర్చ భీమా కోరేగావ్ ఘటనపై రాజ్యసభలో బధవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు బాధ్యులు మీరంటే.. మీరని సభ్యులు అరుచుకున్నారు. దీంతో సభ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. జీరో అవర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సభలో పరిస్థితి ఇలాగే ఉండడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ ప్రసారాలను నిలిపేశారు. -
అలా.. మాజీ లవర్‌ను చంపించింది!
సాక్షి, థానే: మహారాష్ట్రలో మరో స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ స్వాతి భర్తను హత్య చేయిస్తే.. మహరాష్ట్రలో మాజీ ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రియుడు చేస్తున్న విపరీత ఒత్తిడిని తట్టుకోలేకే ప్రస్తుత ప్రియుడితో.. అతన్ని హత్య చేయించినట్లు నిందితురాలు 45 ఏళ్ల సుమారి యాదవ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సుమారి యాదవ్‌కు 46 ఏళ్ల రాంజీ శర్మ మధ్య చాలాకాలం పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ కొన్నేళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. మూడేళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సుమారీ యాదవ్.. ఈ మధ్య 35 ఏళ్ల జయప్రకాష్ చౌహాన్‌తో సహజీవనం సాగిస్తోంది. దాదాపు నాలుగు నెలల నుంచి మాజీ ప్రియుడు రాంజీ శర్మ డబ్బుకోసం సుమారిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులు, ఇతర ఒత్తిడులు తట్టుకోలేక శర్మను హత్య చేసేందుకు ప్రస్తుత ప్రియుడు చౌహాన్‌తో కలిసి సుమారి ప్లాన్ వేసింది. రాంజీ శర్మకు మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉండడంతో.. పార్క్‌లోనే అతన్ని హత్య చేసేందుకు ఇద్దరూ ప్రణాళిక రూపొందించారు. అనుకున్నట్లుగానే నవంబర్18న శర్మ మార్నింగ్ వాక్నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. చౌహాన్ అత్యంత వేగంగా కారుతో అతన్ని ఢీకొట్టి హత్య చేశాడు. ఈ ఘటన తరువాత కారును శుభ్రం చేసి.. యాక్సిండెంట్ అయినట్లు అందరినీ నమ్మించాడు. తాను కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు నటించాడు. ఎవరికీ అనుమానం రాకుండా కారును సర్వీసింగ్ చేయించాడు. ఇంత వరకూ బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు విస్మయం కలిగించే ఈ విషయం బయట పడింది. వెంటనే పోలీసులు సుమారి యాదవ్, చౌహాన్, శర్మల ఫొన్ రికార్డును పరిశీలించారు. విషయం అర్థమైన వెంటనే చౌహాన్, సుమారి యాదవ్‌లను అదుపులోకి తీసుకుని విచానించడంతో.. విషయం మొత్తం బయటపడింది. ఇదిలావుండగా సుమారి యాదవ్‌కు మొత్తం ఐదుగురు సంతానం ఉన్నట్లు తెలిసింది. -
కుప్పకూలిన భవనం : నాలుగుకి చేరిన మృతులు
ఠాణే : ముంబైలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. శుక్రవారం భివాండిలో తహిర్ బిజ్నోర్ అనే భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. భవనాన్ని నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మృతులను పర్విన్ ఖాన్(65), రుస్కర్ యాకుబ్ ఖాన్(18), అస్ఫక్ ముస్తాక్ ఖాన్(38), జైబున్నిసా రఫీక్ అన్సారీ(61)లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనలోనే గాయపడిన తొమ్మిది మందిని నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించినట్లు వివరించారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయ సహకారాలను అందించినట్లు తెలిపారు. భవన యజమాని పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు టీంలు రంగంలోకి దిగాయని వివరించారు. -
సిగరెట్ల డబ్బులడిగాడని.. మహిళ దౌర్జన్యం
థానే: అప్పుగా ప్యాకెట్ల కొద్ది సిగరెట్లు తీసుకుంది. అమావాస్యకో, పౌర్ణమికో బాకీ చెల్లిస్తుంది. దీంతో విసుగెత్తిన దుకాణదారుడు తన బాకీ చెల్లించమని అడిగాడు. అంతే ఆవిడ గారికి కోపం వచ్చింది. నన్నే డబ్బు అడుగుతావా అంటూ కత్తితో దాడికి పాల్పడింది. అయినా సదరు మహిళ కోపం చల్లారలేదు. పక్కనే దుకాణంలో కాగుతున్న వేడి టీని తీసుకొచ్చి దుకాణం యజమానిపై పోసింది.. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని థానే నగరం, నౌపడా ప్రాంతంలోని విష్ణు నగర్లో ఓ మహిళ(34) నివాసం ఉండేది. సమీపంలో ఓవ్యక్తి(75) సిగరెట్ల దుకాణానికి వచ్చి తరచూ సిగరెట్లు కొనుగోలు చేసేది. అయితే తీసుకున్న సిగరెట్లకు అప్పుడప్పుడు మాత్రమే డబ్బులు ఇచ్చేది. ఈ క్రమంలో ఈనెల18న కూడా ఆమె దుకాణానికి వచ్చి సిగరెట్లు ప్యాకెట్లు తీసుకుంది. అయితే సిగరెట్లకు డబ్బులు ఇవ్వమని దుకాణ నిర్వాహకుడు గట్టిగా అడగాడు. అంతే ఆవిడాగారికి కోపం వచ్చింది. కోపంగా యజమానిని దూషిస్తూ షాపులోని కత్తి తీసుకుని దాడికి పాల్పడింది. అంతేగాక బయటకు లాక్కొచ్చి కొట్టింది. అంతటితో అగకుండా పక్కనే దుకాణంలో కాగుతున్న టీ తీసుకొచ్చి దుకాణం యజమానిపై పోసి పారిపోయింది. స్థానికులు పరుగున వచ్చి దుకాణదారుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ మహిళను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సి.జె.కాదవ్ వెల్లడించారు. మారణాయుధాలతో దాడి చేసిన, తోటి వ్యక్తికి ప్రాణభయం కలిగించడం, మోసం చేయడం నేరాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. -
ఆరు నెలలుగా రూ. 45కోట్లు అక్కడే.!
టీనగర్(చెన్నై): పాతనోట్ల రద్దు సమయంలో నగరంలోని ఓ వ్యాపారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ.45 కోట్ల డబ్బు పోలీసు స్టేషన్లో మగ్గుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోకుండా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నాయి. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో గల వ్యాపారి దండపాణి ఇంట్లో గత మే నెలలో చెన్నై నగర పోలీసులు హఠాత్తుగా తనిఖీలు జరిపారు. అతని ఇంట్లో దాచిన రూ.45 కోట్ల పాత 500, 1000 రూపాయిల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి చెన్నై పోలీసులు కేంద్ర ఆదాయపన్ను శాఖకు, రిజర్వు బ్యాంకులకు సమాచారం తెలిపారు. అయితే, వారు స్పందించలేదు. దీంతో ఆ నగదును పోలీసులు కోర్టులో అప్పగించారు. కోర్టు ఆ నగదును ఠాణాలోనే ఉంచాలని ఉత్తర్వులిచ్చింది. దీంతో రూ.45 కోట్ల నగదును ట్రంకు పెట్టెలో ఉంచి కోడంబాక్కం పోలీసు స్టేషన్లో ఉంచారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర సంస్థలకు పోలీసులు లేఖ పంపారు. అయినా వారు స్పందించలేదు. దీంతో ఆ డబ్బు అప్పటి నుంచి స్టేషన్లోనే ఉండిపోయింది. నగదు రద్దు చేయడంతోనే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. దీంతో చెల్లని నోట్లలో 10 నోట్లకు పైన కలిగివుంటే శిక్షార్హమని, దీంతో రూ.10 వేల అపరాధం లేదా ఆ నగదుకు ఐదు రెట్ల అపరాధం విధించే వీలుంది. దీంతో రూ.45 కోట్లు ఉంచుకున్నందుకు చర్యలు తీసుకునే వీలుంది. అయినప్పటికీ పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ఎటువంటి అధికారం లేదు. దీన్ని ఐటీ శాఖ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మాత్రమే చేసే వీలుంది. అయితే వారు ఇన్నాళ్లయినా చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారు. అలాగే, నోట్ల రద్దు సమయంలో షెనాయ్‌నగర్, అన్నానగర్, కోయంబేడు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కూడా కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోలేదు. కోర్టుకు కేసు: ఈ వ్యవహారంపై ఐటీ శాఖ న్యాయవాది షీల మాట్లాడుతూ.. చెల్లని నోట్లపై చర్యలు తీసుకోవడానికి వ్యతిరేకంగా కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం ఇవి ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఎదుట విచారణలో ఉన్నాయని అన్నారు. దీంతో తదుపరి చర్యలు తీసుకోలేక పోతున్నామని అన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. -
2.5 లక్షల గుడ్లు పంచేశారు!
సాక్షి, థానే : 'వరల్డ్ ఎగ్ డే'ను పురస్కరించుకుని ముంబై, థానేలలో విద్యార్థులకు కోడిగుడ్లను పంపిణీ చేశారు. థానేతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల గుడ్లను పిల్లలకు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లా అధికార యంత్రాంగం ఉడికించిన గుడ్లను అంగన్వాడీలు, బాల్వాడీలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలలో పంచారు. అంతేకాక గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును తీసుకోవడం ద్వారా మంచి ప్రోటీన్ అందుతుందని చెప్పారు. థానే జిల్లా ముఖ్యఅధికారి వివేక్ భిమన్వార్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 1,230 అంగన్వాడీలు, బాల్వాడీలు, ఫ్రీస్కూల్స్ ఉన్నాయని, సుమారు 1.3 లక్షల మంది బాలలు ఈ కేంద్రాల్లో చదువుకుంటున్నారని, వారందరకీ గుడ్లను పంచామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యానిమల్ హస్బెండరీ అధికారి డాక్టర్ ప్రశాంత్ కాంబ్లే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారంతా రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తింటే సరిపడా పోషకాహారం అందుతుందన్నారు. -
నంబర్ ఇవ్వకుంటే చంపేస్తా..!
థానే(మహారాష్ట్ర) : దేశంలో ఎక్కడో చోట ప్రతిరోజు ఆడ పిల్లలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇంట, బయట వారికి రక్షణ కరువైంది. తన ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలను వేధించాడు ఆ ఆటో డ్రైవర్. ఈ సంఘటన థానే జిల్లా కల్యాణ్‌లో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలివీ.. పట్టణానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెలు(16,13) గురువారం సాయంత్రం తమ తల్లి పనిచేసే హోటల్ వద్దకు వెళ్లారు. తమ తల్లితో మాట్లాడిన అనంతరం వారు ఆటోలో ఉల్హాస్‌నగర్‌లోని ఇంటికి తిరిగి పయనమయ్యారు. అయితే, ఆ ఆటో డ్రైవర్ వారి మాటలు వింటూ తల్లి ఫోన్ ఇవ్వాలని అడిగాడు. వారు ఇవ్వటానికి నిరాకరించడంతో ఆటోను మరో దారికి మళ్లించాడు. అక్కడ వారిద్దరినీ పట్టుకుని వేధించాడు. నంబర్ ఇవ్వకుంటే చపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక(13) అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం ఆటో డ్రైవర్ మరో బాలికను పట్టుకుని సమీపంలోని పెట్రోల్ బంకు పక్కకు తీసుకెళ్లి వేధించాడు. అనంతరం ఆమె ఇంటివైపు ఆటోను మళ్లించగా ఆ బాలిక ఆటో నుంచి కిందికి దూకింది. బాలికలిద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్టు
-
దావూద్ సోదరుడు అరెస్టు
ఠాణె: డబ్బులివ్వాలంటూ ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ఠాణె ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ వ్యాపారవేత్తను డబ్బులివ్వాలంటూ ఇక్బాల్, అతని గ్యాంగ్ బెదిరించారు. దీంతో ఆ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఠాణె క్రైమ్ బ్రాంచ్ చీఫ్, ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ.. ఠాణెలోని నివాసం నుంచి సోమవారం రాత్రి ఇక్బాల్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. 2003లో యూఏఈ నుంచి భారత్‌కు వచ్చిన ఇక్బాల్.. ఓ హత్యకేసు, అక్రమ నిర్మాణం కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు. అయితే 2007లో అతన్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 2015 ఫిబ్రవరిలో ఓ వ్యాపారిని డబ్బులివ్వాలంటూ బెదిరించి, అతనిపై దాడికి పాల్పడిన కేసులో ఇక్బాల్‌తోపాటు మరో ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇక్బాల్ బెయిల్‌పై బయటకొచ్చాడు. -
మహిళను ‘చమ్మక్ చల్లో’ అనడం నేరమే
- థానే కోర్టు అనూహ్య తీర్పు.. నిందితుడికి జైలు,రూ.1 జరిమాన సాక్షి, థానే: షారూక్ ఖాన్ సినిమా ‘రా.వన్’లో సూపర్ హిట్ పాట ‘చమ్మక్ చల్లో..’ గుర్తుందికదా! అయితే ‘చమ్మక్ చల్లో..’ అనే పదంతో ఓ మహిళను పోల్చడం చట్టరీత్యా నేరమని, అక్రమమని థానే కోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. ఈ పదంతో మహిళల వినయాన్ని అవమానపరిచినట్టేనని పేర్కొన్న కోర్టు.. ఒక మహిళను ‘చమ్మక్ చల్లో..’ అన్న నేరానికిగానూ ఓ వ్యక్తికి సాధారణ జైలు శిక్ష, ఒక రూపాయి జరిమానా విధించింది. అసలేం జరిగింది? 2009 జనవరి 9న.. థానేకు చెందిన ఓ మహిళ మార్నింగ్ వాక్ నుంచి తిరిగొచ్చే సరికి ఇంటి మెట్ల వద్ద చెత్త డబ్బా కనిపించింది. ఆ చెత్త డబ్బాను అక్కడ ఎవరు పెట్టారనే విషయమై ఓ వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి.. మహిళను ‘చమ్మక్ చల్లో..’ అని అన్నాడు. హిందీలో ఈ పదానికి ‘హాట్ సెక్సీ గర్ల్’ అని అర్థం వస్తుంది. దీన్ని అవమానకరపు కామెంట్‌గా గుర్తించిన సదరు మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు ఫిర్యాదును నమోదుచేసుకోవడానికి తిరస్కరించారు. దీంతో ఆమె మహిళా కోర్టును ఆశ్రయించింది. 8 ఏళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు సోమవారం ముగిసింది. మహిళ తరఫు వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ‘చమ్మక్ చల్లో’ అనడం ముమ్మాటికే నేరమేనని, ఐపీసీ సెక్షన్ 509 కింద నిందితుడికి సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు చెప్పారు. అదనంగా ఒక్క రూపాయి జరిమానా కూడా విధించారు. ''ఆంగ్లంలో ఇలాంటి పదమేమీ లేదు. కానీ హిందీలో ఈ పదం ఉంది. సాధారణంగా ఈ పదాన్ని మహిళలను అవమానపరచడానికి వాడతారు. ప్రశంసించే పదం ఇది కాదు. చమ్మక్ చలో అంటే ఏ మహిళకైనా కోపం, చిరాకు వస్తుంది'' అని మెజిస్ట్రేట్ తన తీర్పులో పేర్కొన్నారు. -
ప్రసాదం బదులు..విత్తనాలు పంపిణీ
సాక్షి, ముంబై: ఠాణేకు చెందిన ఓ గణేశ్ మండలి వినూత్న రీతిలో భక్తులకు ప్రసాదం పంచి పెడుతోంది. భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. శ్రీరంగ్ సహనివాస్ గణేశోత్సవ్ మండల్ తమ మండలిని సందర్శించేందుకు వచ్చిన భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. సీతాఫల్, బల్సమ్ (ఒక రకమైన తైలం), గుమ్మడి కాయ, నారింజ, నిమ్మకాయ, సపోట, జీడి పప్పు, చింత పండు, కర్జూరం తదితర విత్తనాలు మట్టితో రోల్ చేసి (సీడ్ బాల్స్) భక్తులకు ఇస్తున్నారు. వీటిని భక్తులు పక్క ఇంటి పెరట్లో లేదా ఇంటి ఆవరణంలో స్థలం ఉన్నా అక్కడ నాటాల్సిందిగా సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ మండలి 8,000 క్లే బాల్స్ (విత్తనం ఉంచిన మట్టి ఉండ)ను తయారు చేసింది. మరి కొన్ని రోజుల్లో మరో 25 వేల క్లే బాల్స్‌ను తయారు చేసి భక్తులకు పంపిణి చేస్తామని మండలి నిర్వాహకులు తెలిపారు. అయితే ఉత్సవాల సమయంలో విత్తనాన్ని దానం చేసేందుకు వీలుగా వీటిని సీడ్స్ బాంబ్లుగా మార్చారు. ఈ సందర్భంగా మండలి అధ్యక్షుడు ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. తాము క్లీన్ అండ్ గ్రీన్ పర్యావరణాన్ని నమ్ముతామన్నారు. దీంతో తాము ఈ ఏడాది భక్తులు విత్తనాలను నాటేందుకు సీడ్ బాంబులను ప్రసాదంగ పంపిణి చేస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా తమకు మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. వివిధ మార్గాల ద్వారా తాము విత్తనాలను సేకరించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా స్థానిక పాఠశాల విద్యార్థులు, వాలెంటీర్లు కూడా సీడ్ బాంబ్స్‌ను తయారు చేయడంలో పాలుపంచుకున్నారని తెలిపారు. మండలి సంయుక్త కార్యదర్శి ఓంకార్ పట్నే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గౌరీ తనయుడు ఆశీర్వాదం పొందేందుకు భక్తులు తమ మండపానికి దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈకో–ఫ్రెండ్లీ గణేష్ సందేశంతో పాటు పర్యావరణానికి హాని కలుగకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. -
అరగంటలో మూడు చైన్ స్నాచింగ్‌లు
థానే: చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కేవలం అరగంట వ్యవధిలోనే మూడు చోట్ల మహిళ మెడల్లో గొలుసులు లాక్కుపోయారు. థానే జిల్లా అంబర్నాథ్ టౌన్ షిప్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య ఈ దోపిడీ ఘటనలు జరిగాయి. ఓ మహిళ(65) భర్తతో కలిసి రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రూ.1.10 లక్షల విలువైన గొలుసును లాక్కుపోయారు. అదే ప్రాంతంలో ఓ గృహిణి(35) రోడ్డుపై వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఆగంతకులు ఆమె మెడలోని రూ.40 వేల విలువైన పుస్తెలతాడను తెంపుకుని పోయారు. అదేవిధంగా మరో మహిళ మెడలోని రూ. లక్ష విలువైన బంగారు గొలుసు ఎత్తుకుపోయారు. ఈ మూడు ఘటనల్లోనూ ఒక్కరే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అంబర్నాథ్ డివిజన్ శివాజీనగర్ పోలీసులు ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజీల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
మరో భారీ కాల్ సెంటర్ గుట్టు రట్టు
థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ నకిలీ కాల్ సెంటర్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్థానిక బిపిఓపై దాడిచేయడంతో రాకెట్ గుట్టు రట్టయింది. అమెరికన్లే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతున్న కాల్ సెంటర వ్యవరం బట్టబయలైంది. ఈ నకిలీ కాల్ సెంటర్ల ద్వారా అమెరికన్ పౌరులకు భారీ లోన్ల పేరుతో ఎరవేసినట్టునట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుకర్ పాండే చెప్పారు. మధుకర్ పాండే అందించిన సమాచారం ప్రకారం గత రాత్రి జిల్లాలోని అంబర్‌నాథ్‌లోని ఆనంద్ నగర్ వద్ద మౌంట్ లాజిక్ సొల్యూషన్స్ సంస్థ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొంతమంది మహిళలతోపాటు, 25మందిని అదుపులోకి తీసుకున్నారు. 31 హార్డ్ డిస్క్‌లు మూడు ల్యాప్ టాప్‌లు, ఇతర అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కొలంబస్ బ్యాంక్‌నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికి, కమీషన్ ముట్టిన అనంతరం బాధితులకు మొఖం చాటేస్తున్నారని తెలిపారు. కాల్ సెంటర్‌కు ఇది 2015 నుంచి ఉనికిలోఉన్న ఈ కాల్ సెంటర్ ద్వారా యజమాని జయా గుంజాల్ నెలకు రూ. 7-8 లక్షలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. సిబ్బందికి అమెరికన్ యాసతో శిక్షణ ఇప్పించి మరీ దోపిడీకి పాల్పడుతున్నారని పోలిస్ సీనియర్ అధికారి చెప్పారు. ఈ వ్యవహారంపై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాగా గత ఏడాది, థానే జిల్లాలోని మీరా రోడ్డులో ఇదే తరహా కాల్ సెంటర్ రాకెట్‌ను ఛేదించామని, 75మందిని అరెస్ట్చేశామని పోలీసులు వెల్లడించారు. అప్పట్లో ఈ భారీ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
ధానేలో పేలుడు పదార్ధాలు స్వాధీనం
-
మైనర్లతో బట్టలిప్పించి.. చెప్పుల దండలేసి..
ఠాణే: స్వీట్ షాపులో దొంగతనానికి పాల్పడినందుకు ఇద్దరు మైనర్ల బట్టలిప్పించి వారి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించిన దారుణ సంఘటన మహారాష్ట్రలోని ఠాణేలో చోటు చేసుకుంది. స్వీట్ షాపుకు చేరువలో ఉండే ఇద్దరు బాలురు షాపు నుంచి ఫుడ్‌ను దొంగిలించారు. దీంతో ఆగ్రహించిన షాపు యజమాని అతని కుమారుల సాయంతో వారిని పట్టుకున్నాడు. తొలుత పిల్లల జుట్టును కట్ చేయించాడు. అక్కడితో ఆగకుండా వారి బట్టలను తీసేయించాడు. ఆపై చెప్పుల దండలు వేసి వీధిలో ఊరేగించాడు. పిల్లలపై షాపు యజమాని ఒడిగట్టిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు స్వీట్ షాపు యజమాని మెహమూద్ పఠాన్(69)తో సహా అతని తనయులు ఇర్ఫాన్(26), సలీమ్(22)లను అరెస్టు చేశారు. -
కోటి రూపాయల పాతనోట్లు పట్టుబడ్డాయ్!
థానె : పాత నోట్లు రద్దయి ఆరు నెలలకు పైగా గడుస్తున్నా.. ఇంకా భారీ మొత్తంలో రద్దైన నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. మంగళవారం రద్దయిన కోటిరూపాయల నోట్లను పోలీసులు సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మే 16వ తేదీన ముమ్ ద్రా టౌన్ షిప్ లోని పార్సిక్ సర్కిల్ వద్ద కారును అడ్డగించి పోలీసులు ఈ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 2016నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రద్దు చేసిన 500, 1000 నోట్లను కారులో వీరు కలిగిఉన్నారని, వీటి విలువ మొత్తం కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ ప్రైవేట్ బ్యాంకు మహిళా ఉద్యోగి కూడా ఉన్న థానె పోలీసులు తెలిపారు. కొత్త బిల్స్ రూపంలో ఈ పాతనోట్లను మార్చడానికి నిందితులు వెళ్తున్నారని, వారిని పట్టుకుని వారిపై కేసు నమోదుచేశామని థానె పోలీసు పీఆర్ఓ సుఖడ నర్కార్ చెప్పారు. -
మహిళకు ఆపరేషన్ చేస్తూ వీడియో తీసిన డాక్టర్
థానే(మహారాష్ట్ర): ఆపరేషన్ కోసం వచ్చిన మహిళను మాటలతో వేధిస్తూ.. అభ్యంతరకరంగా వీడియో తీయటమే కాకుండా మిగతా వారికి వాటిని పంపించి, అసభ్యకర కామెంట్లు పెట్టాడో వైద్యుడు. గౌరవప్రదమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన సదరు వైద్యులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది. భివండి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన ఒక మహిళకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ సందర్భంగా వైద్యుడు అభ్యంతరకరంగా కామెంట్లు చేస్తూ తీవ్రంగా మనోవేదనకు గురిచేశాడు. ఆమెకు సంబంధించిన వీడియోను దొంగతనంగా తీయటంతోపాటు దానిని తన స్నేహితుడైన మరో డాక్టర్‌కు ఫోన్లో పంపించాడు. వీటన్నిటినీ సదరు స్నేహితుడు మరో వ్యక్తికి పంపించాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. ఇద్దరు వైద్యులతోపాటు మూడో వ్యక్తిపైనా 354ఏ, 500, 509 సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. -
స్కాం చేసి గర్ల్‌ఫ్రెండ్‌కు ఆడికారు: షాగీ అరెస్టు!!
అమెరికాలోని పన్ను ఎగవేతదారుల నుంచి రూ. 500 కోట్లు (300 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టిన మహారాష్ట్ర థానె యువకుడు సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాది ఈ స్కాం వెలుగుచూసిన నాటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షాగీని శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో తలదాచుకున్న అతన్ని జాడ గుర్తించి..డిపోర్టేషన్ ముంబై ఎయిర్‌పోర్టుకు తరలించగా.. అక్కడికి వచ్చిన వెంటనే థానె కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని థానె తరలించి విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. 2013లో థానెకు చెందిన కనీసం డజను కాల్ సెంటర్లు.. అమెరికాలోని 15వేలమంది పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకొని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కాల్ సెంటర్ కుంభకోణానికి తెరలేపాయి. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన డబ్బులో రూ. రెండుకోట్లు పెట్టి షాగీ తన గర్ల్‌ఫ్రెండుకు ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చాడు. అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. -
కాల్ సెంటర్ స్కామ్: మాస్టర్ మైండ్ జాడ తెలిసింది!
దుబాయి: మహారాష్ట్రలోని థానెలో ఉండి అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి దాదాపు రూ.500 కోట్లు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ వివరాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అతడు ప్రస్తుతం దుబాయిలో ఉన్నట్లు థానె అధికారులు వెల్లడించారు. కాల్ సెంటర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. గతేడాది తన గర్ల్‌ఫ్రెండుకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చిన విషయాన్ని గతంలోనే తెలిపారు. దుబాయి పోలీసులు ఠక్కర్‌ను గుర్తించి అడ్డుకున్నారని థానే పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడినా.. పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. గత నెలలో సాగర్ ఠక్కర్ యూఏఈకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా దుబాయి విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పుణే పోలీసులకు స్థానిక సిబ్బంది సమాచారం అందించారు. అయితే అతడిపై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వ్యవహారం తేలిన తర్వాతే విదేశాలకు అనుమతిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దుబాయి అధికారులు వారి ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత తమ కస్డడీకి ఠక్కర్‌ను అప్పగించాలని కోరనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాల్ సెంటర్ స్కామ్‌కు సంబంధించి గత అక్టోబర్‌లో 9 బోగస్ కాల్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు దాదాపు 70 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. -
బాలిక సాక్ష్యం.. ఇద్దరికి యావజ్జీవం
థానే: న్యాయస్థానంలో నిర్భయంగా ఓ బాలిక చెప్పిన సాక్ష్యం ఇద్దరు నేరస్తులకు శిక్ష పడేలా చేసింది. హత్య కేసులో తొమ్మదేళ్ల బాలిక ఇచ్చిన సాక్ష్యంతో దోషులకు మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కామ్లిబాయ్ వాఘె(46), ఫారూఖ్ ఖాన్ లకు సెషెన్స్ కోర్టు జడ్జి విలాస్ వీ బామ్ బార్డె జీవితఖైదు విధించారు. మరో నిందితుడు విజయ్ పవార్(40)ను ‘సంశయ లాభం’ కింద విడుదల చేశారు. భివాండీలోని గాయత్రినగర్ లో శివాజీ జాదవ్ అనే వ్యక్తి 2010, అక్టోబర్ 2న హత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో విజయ్ తన స్నేహితులతో కలిసినట్టు జాదవ్ ను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించినా ఎవరూ నిందితులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వలేదు. తొమ్మిదేళ్ల బాలిక మాత్రం నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దోషులకు కోర్టు శిక్ష విధించింది. -
సహజీవనం: మహిళా టెక్కీతో గొడవపడి..!
సహజీవనం చేస్తూ.. పెళ్లి విషయమై గొడవపడ్డందుకు ఓ 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఆమె భాగస్వామి గొంతునులిమి చంపాడు. ఈ ఘటన మహారాష్ట్ర థానె జిల్లాలోని బద్లాపూర్‌లో బుధవారం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్‌కు చెందిన పూనం పూన్యకర్ గజ్‌బియే గత మూడేళ్లుగా బద్లాపూర్‌లో నివసిస్తోంది. ఆమె ముంబై కన్జుర్‌మార్గ్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని... విజయ్ సంజయ్ ఝార్కడ్(22)తో అనే యువకుడితో ఆమె సహజీవనం చేస్తోంది. తమ సహజీవనం గురించి ఇంట్లో తెలిసిపోయిందని, దీనిని తమ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారని, కాబట్టి ఇక తమ అనుబంధం కొనసాగబోదని పూనం చెప్పడంతో ఇద్దరి మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో విజయ్ చున్నీతో పూనం గొంతు నులిమి చంపేశాడు. ఆ వెంటనే ఇంటి బయటి నుంచి తలుపు పెట్టి స్నేహితుడి ఇంటికి పరారయ్యాడు. అక్కడ స్నేహితుడికి జరిగిన విషయం చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని.. ఆ తర్వాత విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. బద్లాపూర్‌లోని ఓ మొబైల్ రిపేర్ షాపులో పూనం, విజయ్ను మొదట కలిసింది. కొన్నాళ్లుగా వారిరువురు సహజీవనం చేస్తున్నారు. 'ఆరు నెలల కిందట పూనం కొనుగోలు చేసిన గదిలో ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. రెండేన్నరేళ్లుగా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. ఇటీవల వారి సహజీవనం గురించి పూనం ఇంట్లో తెలిసిందే. దీనిని వారు వ్యతిరేకించడంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా తరచూ గొడవలు జరిగాయి' అని జోన్ 4 డిప్యూటీ కమిషనర్ సునీల్ భరద్వాజ్ తెలిపారు. -
ఆ'పరేషన్' థియేటర్..
థానే: ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం లోపిస్తే పేషెంట్లతో పాటు డాక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపరేషన్ థియేటర్లోకి బొద్దింక రావడంతో డాక్టర్ తన సహనాన్ని కోల్పోయి కొద్దిసేపు ఆపరేషన్ ఆపేసి.. ఆస్పత్రిలో బొద్దింకలు తిరగడాన్ని మొబైల్లో చిత్రించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర థానేలో ఓ ఆస్పత్రిలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొన్ని నిమిషాల్లోనే పేషెంట్‌కు ఆపరేషన్ చేసి ఆస్పత్రిలో కొనసాగుతున్న పారిశుధ్యలోపాన్ని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదుచేశారు. థానేలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ హాస్పిటల్లో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా డాక్టర్ సంజయ్ బరన్వాల్ పనిచేస్తున్నారు. గత శుక్రవారం కాలు ఫ్రాక్చర్ అయిందని 45 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన ఓ సీరియస్ కేసు ఆస్పత్రికి వచ్చింది. జూనియర్ డాక్టర్లతో కలిసి ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ బరన్వాల్ సర్జరీ చేస్తున్నారు. ఇంతలో కొన్ని బొద్దింకలు ఆ రూమ్‌లో తిరగడం ఆయన గమనించారు. అవి తమ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని కాసేపు ఆపరేషన్ నిలిపివేసి.. ఈ విషయాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత విజయవంతంగా పేషెంట్‌కు సర్జరీ పూర్తిచేశారు. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ హాస్పిటల్‌ను థానే మునిసిపల్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నారు. గతంలో తాను ఎన్నో పర్యాయాలు పారిశుద్ధ్యం అంశంపై ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. తమ సర్జరీలు సక్సెస్ అయినా వారిలో 25 శాతం షేషెంట్లకు కీటకాల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని సీనియర్ సర్జన్ బరన్వాల్ మండిపడ్డారు. సిబ్బంది కొరతే వీటికి ప్రధాన కారణమని వివరించారు. హాస్పిటల్ డీన్ మైత్రాను ఈ విషయంపై సంప్రదించగా.. ఆమె నుంచి స్పందనరాలేదు. -
ఇద్దరు అమ్మాయిలపై ఆరు నెలలు అత్యాచారం
వ్యాన్‌లో ప్రతి రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి వచ్చే వ్యాన్ డ్రైవర్.. గత ఆరు నెలలుగా ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం థానెలోని భివాండిలో వెలుగుచూసింది. తులసీరాం మనేరే (35) అనే ఈ నిందితుడిని అరెస్టు చేసినట్లు నిజామ్పురా ఇన్స్పెక్టర్ ఎస్వీ జాదవ్ తెలిపారు. 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలపై తన కారులోనే గత ఆరు నెలలుగా పలు సందర్భాల్లో అతడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఇద్దరు బాలికలు మాత్రమే అతడి అఘాయిత్యం గురించి చెప్పారని, అయితే ఇతడి బాధితులు మరింతమంది ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు స్కూలుకు రాకపోవడంతో.. వారి గురించి వాళ్ల తల్లిదండ్రులను టీచర్లు అడగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలిద్దరూ తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారని, వాళ్లు ఆ తర్వాత విచారణ జరిపి, పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇన్స్పెక్టర్ జాదవ్ తెలిపారు. నిందితుడిపై 376 (అత్యాచారం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశామన్నారు. -
ముంబైలో శ్రీవారి కల్యాణ రజతోత్సవాలు
ముంబై: ఠాణే జిల్లా డోంబివలిలోని ‘ఆంధ్ర కళా సమితి’ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ రజత్సోవాలు జరగనున్నాయి. గత 24 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఈసారి రజతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తూర్పు డోంబివలి, గర్ద సర్కిల్ వద్ద ఉన్న కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ (కేడీఎంసీ స్పోర్స్ట్ కాంప్లెక్స్)లో స్వామివారి కళ్యాణ రజతోత్సవాలు ఈ నెల 26, 27న (శని, ఆదివారాల్లో) జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో మాదిరి పూజా కార్యక్రమాలుంటాయి. ప్రస్తుతం ‘ఆంధ్ర కళా సమితి’ సంస్థకు 600 మందిపైగా సభ్యులున్నారు. సమితి ప్రస్తుత అధ్యక్షుడు ఎ శంకర్రావు, ప్రధాన కార్యదర్శులు కేవీ నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు కేవీ రమణా రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర కుమార్, కోశాధికారి విజయ్‌మోహన్ తదితరులు ఉన్నారు. -
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. థానేలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మొదట ఓ రూమ్‌లో చిన్నగా మంటలు వచ్చాయి. తర్వాత కొంతసేపటికే మంటలు ఫ్యాక్టరీ మొత్తాన్ని వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే దాదాపు ఫ్యాక్టరీలోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. 10 ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోనికి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ఎంతమేరకు నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
శాపమైన సోషల్ మీడియా సంబంధం
పుణె: సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయం ఆ యువతి పాలిట శాపంగా మారింది. తొలుత మిత్రుడిలా పరిచయమైన ఆ యువకుడు అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత మొహం చాటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇంకా అతడిని అరెస్టు చేయాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేలో 17 ఏళ్ల యువతి ఉంది. ఆమెకు పుణెలోని ధయారి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకుడితో ఈ ఏడాది జనవరిలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తొలుత స్నేహంగా అనంతరం చనువుగా మారింది. అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అనంతరం ఆమెను పుణె రమ్మన్నాడు. అతడి మాటలు నమ్మి ఆ యువతి వెళ్లడంతో అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం మొహం చాటేశాడు. బాధిత యువతి అతడి తల్లిదండ్రులను బంధులను కలిసినప్పటికీ ఆమను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి మంగళవారం కేసు నమోదు చేసింది. -
గగుర్పొడిచే షాకింగ్ ఘటన!
ఓ మహిళ పట్టుతప్పి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద కిందపడిపోయి అలాగే దొర్లుతూ వెళ్లి రైలు కింద పడబోతుండగా చుట్టుపక్కల వారు సకాలంలో స్పందించి సాయం చేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని థానేలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఓ మహిళ తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ జంక్షన్ కు వచ్చింది. అయితే అప్పటికే తాను వెళ్లాల్సిన ట్రైన్ సమయానికి స్టేషన్ చేరుకోలేక పోయింది. అయితే సరిగ్గా అదే సమయంలో స్టేషన్ నుంచి ఓ రైలు వెళ్తుంది. అది తాను ఎక్కాల్సిన ట్రెయిన్ అనుకుని ఎలాగోలాగ కష్టపడి ఎక్కింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. రన్నింగ్ ట్రెయిన్ ఎక్కిన ఆ మహిళకు షాక్.. అది తాను ఎక్కాల్సిన రైలు కాదని తెలుసుకుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న మహిళా ప్యాసింజర్ ఒక్కసారిగా ప్లామ్ ఫాం మీదకి దూకేశారు. అసలే అది రన్నింగ్ ట్రెయిన్ కావడంతో పట్టుతప్పి కిందపడిపోయిన ఆమె క్షణాల్లో దొర్లుకుంటూ రైలు కింద పడబోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ మహిళ ట్రెయిన్ కింద పడకుండా రక్షించారు. అయితే ఈ ఘటనలో మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ఘటన!
-
23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు!
అమెరికాలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని.. అక్కడ ఎవరెవరు పన్నులు ఎగ్గొడుతున్నారో జాబితా సేకరించి.. వాళ్లను బెదిరించడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏడు అంతస్థుల భవనంలో ఒక కాల్‌సెంటర్ నియమించి అతి తక్కువ కాలంలోనే 500 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇంత చేసిన వ్యక్తి వయసు ఎంతో తెలుసా.. కేవలం 23 ఏళ్లు. అతడిపేరు షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ. స్కాం బయటపడి ఇప్పటికే వారం రోజులు దాటినా ఈ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి అయిన షాగీ, అతడి సన్నిహిత మిత్రుడు తపష్ ఇప్పటివరకు దొరకలేదు. చాలా తక్కువ వయసులోనే అయినా ఠక్కర్ చాలా పెద్దమొత్తంలో వెనకేశాడని.. అది కూడా చాలా తక్కువ సమయంలోనే సంపాదించాడని కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీసు అధికారి తెలిపారు. భారతదేశంలోనే కూర్చుని ఎక్కడో అమెరికాలో ఉన్న ఆ దేశ పౌరులను దోచుకోవడం అంటే చిన్న విషయం కాదని ఆయన చెప్పారు. బహుశా అతడు ఇప్పటికే దేశం వదిలి పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!) ఠక్కర్‌కు చాలా పెద్దపెద్ద కార్లు ఉన్నాయని, అతడు చాలా ధనవంతుడని పోలీసుల అదుపులో ఉన్న నిందితులతో పాటు సాక్షులు కూడా చెప్పారు. ఠక్కర్ విలాసవంతమైన జీవనశైలిని ఉదాహరణగా చూపించి.. అతడిలా జీవితాన్ని ఆస్వాదించాలంటే మరింత కష్టపడి మరింత ఎక్కువ సంపాదించాలని కొందరు సీనియర్లు చెప్పేవారన్నారు. తమ కాల్ సెంటర్లలోని ఉద్యోగులందరి నంబర్లతో వాట్సప్ గ్రూపులు ఉండేవని, వాటిలోనే తమకు అమెరికా పౌరుల గురించిన సమాచారం అందేదని మరో ఉద్యోగి చెప్పారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్లకు నెలకు కేవలం రూ. 1.5 లక్షల డాలర్లు మాత్రమే వస్తే.. కింద ఉన్న ఫ్లోర్ల నుంచి నెలకు 5-7 లక్షల డాలర్లు వచ్చేవట. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న థానె పోలీసులను అమెరికాకు చెందిన పలు దర్యాప్తు సంస్థలు కూడా సంప్రదిస్తున్నాయి. ఇరువర్గాలూ తమ వద్ద ఉన్న వివరాలను పంచుకుంటున్నాయి. కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినా, మొత్తం స్కాంలో ఇది చాలా చిన్న భాగం మాత్రమేనని, దీని మూలాలు వెలికితీస్తే ఇంకా పెద్ద స్కాం బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా రెవెన్యూ లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుంటూ ఫోన్లు చేసే కాల్ సెంటర్ ఉద్యోగులు.. పన్నులు కట్టనందుకు వాళ్లను బెదిరించి లక్షలాది డాలర్లు దండుకునేవారు. ఈ కేసులో ఇప్పటికి ఆ కాల్ సెంటర్ ఉద్యోగులలో 70 మందిని అరెస్టుచేయగా, మరో 630 మందికి నోటీసులు ఇచ్చారు. -
ఆర్పీఎఫ్ జవాన్లపై రేప్ కేసు..
థానెః ప్రజలకు, దేశ పౌరులకు భద్రత కల్పించాల్సిన సైనికులే మహిళపై ఆఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ రైల్వేకు చెందిన నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు 25 ఏళ్ళ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ రైల్వే డీపీసీ రుపాలీ అంబురే తెలిపారు. దివాలోని ఆర్పీఎఫ్ క్యాబిన్ లో జనవరి 14న తనపై జవాన్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధిత మహిళ ఇటీవల ఫిర్యాదు చేయడంతో నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లపై థానే రైల్వే పోలీసులు రేప్ కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 376-డి, 326 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసు కమిషనరేట్ పరిథిలోది కావడంతో థానె సిటి పోలీసులకు బదిలీ చేశామని చెప్పారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు డీసీపీ వివరించారు. -
దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే