పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు! | Electric Motorbike Battery Explodes In Thane | Sakshi
Sakshi News home page

Maharashtra: పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు!

Published Wed, Mar 20 2024 1:06 PM | Last Updated on Wed, Mar 20 2024 1:12 PM

Electric Motorbike Battery Explodes - Sakshi

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ పేలి, ఇద్దరు మహిళలతో పాటు ఒక వృద్ధునికి గాయలయ్యాయి. మంగళవారం రాత్రి  జరిగిన ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు,, పక్కనే ఉన్న గోడ కూలిపోయాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తాడ్వి తెలిపారు. శాంతి నగర్‌లోని  ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందన్నారు. 

రాత్రి 10.30 గంటల సమయంలో బ్యాటరీ పేలిపోయిందని అధికారి తెలిపారు. ఛార్జింగ్ కోసం ఇంట్లోనే బైక్‌ పెట్టుకున్నారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో 28 ఏళ్ల మహిళ, పొరుగింట్లో ఉంటున్న  66 ఏళ్ల వృద్ధుడు, 56 ఏళ్ల మహిళ గాయపడ్డారని పేర్కొన్నారు. 

సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement