68 ఏళ్ల వృద్ధురాలిపై వీధికుక్కల దాడి, పరిస్థితి విషమం
వైరల్‌గా మారిన దాడి వీడియో
థానేలోని టిటా్వలా థానేలో కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ వృద్ధురాలిపై దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. ఈమేరకు పోలీసు అధికారి ఆదివారం వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నట్టుండి దాడిచేసిన నాలుగు కుక్కలు ఆమెపై ఎగబడ్డాయి. మహిళ వాటి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిది. అయినా కూడా ఒకదాని తరువాత ఒకటి నలువైపులా ఆమెపై ఎటాక్ చేశాయి.
దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఉల్హాస్‌నగర్ సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చారు. ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రికి అధునాతన సంరక్షణ కోసం తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమె స్టేట్‌మెంట్‌ను ఒకసారి నమోదు చేస్తాం. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని కల్యాణ్ తాలూకా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు.
ठाणे के टिटवाला में आवारा कुत्तों ने एक बुजुर्ग महिला पर हमला किया.
आवारा कुत्तों ने महिला को 50 मीटर तक घसीटा..
महिला बुरी तरह से घायल.
महिला का इलाज अस्पताल में चल रहा है..
चार आवारा कुत्तों ने महिला पर किया जानलेवा हमला..
पूरी घटना सीसीटीवी में कैद. pic.twitter.com/BX5CmYQFYj— Vivek Gupta (@imvivekgupta) December 8, 2024
Comments
Please login to add a commentAdd a comment