breaking news
Maharashtra
-
monorail: క్రేన్ సాయంతో ప్రయాణికులు బయటకు..
ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి దారుణంగా మారింది ప్రధానంగా మంగళవారం కురిసిన వర్షానికి అక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే ముంబైలోని చెంబూర్-భక్తిపార్క్ మధ్య నడిచే మోనో రైలు ఒకటి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై నిలిచిపోయింది. మెట్రో కంటే తక్కువ పరిమాణంతో పాటు ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనో రైల్లో చిన్నపాటి విద్యుత్ అంతరాయ ఏర్పడటంతో మంగళవారం సాయంత్రం సమయంలో ట్రాక్‌పైనే ఉన్నపళంగా ఆగిపోయింది.సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయిన మోనో రైలు ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. అక్కడకు చేరుకుని ప్రయాణికుల్ని క్రేన్ల సాయంతో కిందకు దించింది. అయితే పవర్ సప్లైలో చిన్నపాటి అంతరాయం కారణంగానే ఆ ట్రైన్ నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఆ ట్రైన్ మరమ్మత్తు చర్యలను స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు. అయితే ట్రైన్ ఉన్నపళంగా ట్రాక్‌పైనే నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అదే సమయంలో ట్రైన్లో ఉన్న ప్రయాణికులు ఎవరూ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు.#WATCH | Maharashtra: Passengers rescued from the Monorail that got stuck near Mysore Colony station in Mumbai due to a power supply issue. pic.twitter.com/Ch3zYgFohg— ANI (@ANI) August 19, 2025 -
పృథ్వీ షా 2.0.. సెంచరీతో కొత్త జర్నీ ప్రారంభం
టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా కొత్త జర్నీని సెంచరీతో ప్రారంభించాడు. దేశవాలీ క్రికెట్లో ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో షా ఛత్తీస్ఘడ్పై 122 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 140 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ ఇన్నింగ్స్‌లో షా యధేచ్చగా షాట్లు ఆడి కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించాడు. తొలి వికెట్‌కు సచిన్ దాస్‌తో కలిసి 71 పరుగులు జోడించిన అనంతరం మహారాష్ట్ర 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షా ఎంతో బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు.25 ఏళ్ల షా గత కొంతకాలంగా ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మధ్యలోనే అతన్ని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. విజయ్ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్ అలీ టోర్నీలో భాగమైనా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా..మకాంను మహారాష్ట్రకు మార్చాడు. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్ అని జనం అనుకుంటున్నారు.టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ చేసి భావి సచిన్‌గా కీర్తించబడిన షా.. కొద్దికాలంలోనే వివాదాల్లో తలదూర్చి, ఫామ్ కోల్పోయి, క్రమశిక్షణ లేకుండా విపరీతంగా బరువు పెరిగి చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. 2021 జులైలో టీమిండియా తరఫున చివరిసారిగా ఆడిన షా.. ప్రస్తుతం భారత సెలెక్టర్ల పరిధిలోనే లేడు. మహారాష్ట్రతో ప్రయాణం అతన్ని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తుందేమో చూడాలి. -
యూపీఐ వినియోగంలో టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..
యూపీఐ వినియోగంలో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని ఎస్బీఐ ఎకనామిక్ రిసెర్చ్ డిపార్ట్మెంట్(ఈఆర్డీ) తెలిపింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అయితే కొన్ని టీపీఏపీల(థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) మధ్య లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో దేశంలో ఫిన్‌టెక్ ఆవిష్కరణలు దెబ్బతింటున్నట్లు హెచ్చరించింది.ఎస్బీఐ ఈఆర్డీ తొలిసారిగా ప్రచురించిన యూపీఐ లావాదేవీలపై రాష్ట్రాల వారీగా డేటాను ప్రస్తావిస్తూ, జులైలోనే 9.8 శాతం వాల్యూమ్(యూపీఐల సంఖ్య) వాటాతో మహారాష్ట్ర స్థిరంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్ణాటక (5.5 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (4.1 శాతం), తమిళనాడు (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈఆర్డీలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జులై నెలలోనే డిజిటల్ చెల్లింపుల్లో(విలువ) మహారాష్ట్ర 9.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (5.8 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (5.1 శాతం), తమిళనాడు (4.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్విలువ, వాల్యూమ్ పరంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2025లోనే సగటు రోజువారీ విలువ జనవరిలో రూ.75,743 కోట్ల నుంచి జులైలో రూ.80,919 కోట్లకు, ఆగస్టులో రూ.90,446 కోట్లకు (ఇప్పటివరకు) పెరిగింది. -
ఛలానా వేస్తారని భయపడి.. మహిళా ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లి!
ఆమె విధినిర్వహణలో ఉంది. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోడ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌తో దూసుకొస్తున్నాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోయిందామె. అయితే ఆ డ్రైవర్ ఆగకుండా ఆమెనూ రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సతారా సిటీలో భాగ్యశ్రీ జాదవ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా.. ఓ ఆటో దూసుకురావడం ఆమె గమనించింది. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ఆటోను పట్టుకుని కిందపడిపోయింది. అది గమనించి.. ఆ ఆటోడ్రైవర్ ఆటోను మరింత వేగంగా పోనిచ్చాడు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోగా.. రోడ్డు మీదే కాస్త దూరం లాక్కెళ్లాడు. ఈలోపు.. స్థానికులు ఆ ఆటో వెంట పరిగెత్తి.. ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాను తాగేసి ఉన్నానని, పోలీసులకు దొరికితే ఛలానా వేస్తారనే భయంతోనే పారిపోయే ప్రయత్నం చేశానని ఆ ్రైవర్ దేవ్‌రాజ్ కాలే చెబుతున్నాడు. ఈ ఘటనలో భాగ్యశ్రీకి గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. Video: Drunk autorickshaw driver drags woman cop trying to stop him in Maharashtra#Maharashtra #Satara #KhandobaMaal #VIDEO #ViralVideos pic.twitter.com/t7pZivZi35— Princy Sharma (@PrincyShar14541) August 19, 2025 -
ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ఐదెంకల వేతనమిచ్చే ఐటీ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆ జంట కోరిక, చేసిన సాహసం వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మలిచింది. ఎవరా జంట? ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టారు? వారు సాధించిన విజయంఏంటి? తెలుసుకుందాం రండి.మహారాష్ట్ర(Maharashtra) లోని కొంకణ్ఖు కు చెందిన గౌరి, దిలీప్ పరబ్ దంపతులు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగలలైన వీరు ముంబైలోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేసేవారు.. జీతం, జీవితం సంతోషంగానే సాగిపోతున్నాయి. ఎలాగైనా మహారాష్ట్రలోని కొంకణ్‌కు తిరిగి వచ్చి, ఏదైనా సొంతంగా అదీ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే కోరిక రోజు రోజుకు పెరగసాగింది. దీంతో ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కొంకణ్ తిరిగొచ్చారు.కొంకణ్‌లోని కల్చర్, అందమైన తీరప్రాంతం, బీచ్‌లు, వ్యవసాయ ప్రకృతి దృశ్యం ఇవన్నీ తమను ఎల్లప్పుడూ మమ్మల్ని ఇంటికి రారమ్మని పిలుస్తూ ఉండేవని అందుకే తిరిగి సొంతూరికి వచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది గౌరి. 2021లో సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా అటు వ్యాపారాన్ని, ఇటు స్థానిక ఉపాధిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మార్కెట్‌ను స్టడీ చేసి తరువాత ఆ భూమిలో నిమ్మ గడ్డిని సాగు( lemongrass Farming ) చేయాలని భావించారు. నిమ్మగడ్డి పెంపకం లాభదాయమనీ, దీన్ని సౌందర్య సాధనాలు, ఔషధాలు, ఆహారం మరియు పానీయాలతో సహా వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు, దీని వలన డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్‌తో పాటు కొంకణ్ ఏరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా నిమ్మగడ్డి సాగుకు అనుకూమని గ్రహించామని అందుకే దీన్ని ప్రారంభించామని దిలీప్ వెల్లడించాడు. పైగా నిమ్మగడ్డిని సంవత్సరానికి మూడు -నాలుగు సార్లు పండించవచ్చు, దిగుబడిని పెంచుతుంది . ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలను సృష్టిస్తుందని దిలీప్ వివరించాడు. View this post on Instagram A post shared by Diilip Parab (@houseofsugandhaofficial)సేంద్రీయ వ్యవసాయం నుండి ప్రాసెసింగ్ వరకుఒక ఎకరంలో నిమ్మగడ్డి సాగు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఓ నర్సరీలో కొనుగోలు చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎకరా పొలంలో 25 వేల వరకు మొక్కలు నాటారు. ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మధ్యలో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో సేంద్రీయ నిమ్మకాయ గడ్డిని పండిస్తున్నారు. అందులో ఆరు ఎకరాలు వారి సొంతం, మిగిలినది లీజుకు తీసుకున్న భూమి.వర్మీకంపోస్ట్, ఆవు పేడ ,నిమ్మకాయ గడ్డి బయో వ్యర్థాలను వేస్తాము. పంట కోసేటప్పుడు మీరు వేర్లను కత్తిరించాల్సిన అవసరం లేదు కాబట్టి నిమ్మకాయ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మొదటి పంట నాలుగు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. ప్రతి 80 నుండి 90 రోజులకు ఒకసారి లెమన్ గ్రాస్‌ను కోయవచ్చు. మొదట ఎకరా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు చేరుకుంది. ఇందులో ఆరు ఎకరాలు సొంతం కాగా, మరో రెండు ఎకరాలను లీజుకు తీసుకున్నట్లు గౌరి తెలిపింది. లెమన్‌గ్రాస్ ఆయిల్ (Lemongrass Oil)ఒక ఎకరంలో దాదాపు 18 టన్నుల నిమ్మగడ్డి దిగుబడి వస్తుంది. ఒక టన్ను లెమన్‌గ్రాస్ నుండి 7 నుండి 8 లీటర్ల సుగంధ నూనెను పొందవచ్చు. వేసవిలో 1 టన్ను లెమన్‌గ్రాస్ నుండి నూనె ఉత్పత్తి 10 లీటర్లకు చేరుకోగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇది కేవలం 2.5 లీటర్లు శీతాకాలంలో 5 నుండి 6 లీటర్లకు తగ్గుతుంది, సగటున 7 లీటర్లు వస్తుందనీ, ఎకరా పొలంలో నిమ్మగడ్డితో 126 లీటర్ల ఆయిల్‌ను తయారు చేయొచ్చు.లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను రిటైల్ , బల్క్‌లో ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ కంపెనీలకు విక్రయిస్తారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరలు లీటరుకు రూ.850 నుండి రూ.1500 వరకు ఉంటుంది. సగటు లీటరుకు రూ.1200, అనిఇలా ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నట్లు దీలీప్ గౌరి జంట వెల్లడించారు.కాగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మొక్కలలో నిమ్మగడ్డి ఒకటి. CSIR-CIMAP (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) ప్రకారం, 2020లో ప్రపంచ నిమ్మగడ్డి మార్కెట్ 38.02 మిలియన్ డాలర్లు . 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 81.43 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లెమన్ గ్రాస్ నూనె మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది, దీనిని 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ , ఆసియా పసిఫిక్ ఖండాలు ఇందులో ఉన్నాయి. -
మహారాష్ట్రలో పాఠ్యాంశంగా బూర రాజేశ్వరి జీవితం
తన పరిస్థితిపై..మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు.. నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు..తెలంగాణ ఉద్యమంపై..భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం..ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితల రూపంలో పదిలం చేసింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగవిుస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది.వికసించిన రాజేశ్వరీ కవిత్వంరాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్‌మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్‌ఫోన్ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్‌లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది.వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్ తేజబూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ల్యాప్‌టాప్ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం.మహారాష్ట్రలో పాఠ్యాంశంరాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్‌తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్ తులసీ భారత్ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్‌రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం. -
‘బిర్యానీ పార్టీ’తో నిరసన
ఛత్రపతి శంభాజీనగర్/థానె: ఛత్రపతి శంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్ 20న జైన మతస్తుల ‘పర్యుషన్ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్ కమిషనర్ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు.చదవండి: మాంసం దుకాణాలు మూసివేయాలి.. మాకేం సంబంధం? -
కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్ర తరపున అరంగేట్రం చేసేందుకు టీమిండియా ఆటగాడు, ముంబై మాజీ ఓపెనర్ పృథ్వీ షా సిద్దమవుతున్నాడు. బుచ్చి బాబు మల్టీ-డే టోర్నమెంట్ 2025 కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.ఈ జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కింది. 25 ఏళ్ల పృథ్వీ షా ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో తెగదింపులు చేసుకుని మహారాష్ట్రకు తన మకాంను మార్చాడు. ఇక బుచ్చి బాబు టోర్నీ కోసం మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా అంకిత్ బావ్నేను సెలక్టర్లు నియమించారు. మహారాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని బావ్నేకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. గత రంజీ సీజన్లో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైర్హజరీలో బావ్నేనే జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహారాష్ట్ర తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్లలో రెండో ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సెలక్టర్లు గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడం వెనక ఓ కారణముంది. ఈ భారత ఓపెనర్ 2025-26 దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టుకు సెలక్ట్ చేశారు. ఆగస్టు 28న దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుందున, బుచ్చిబాబు టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు రుతు అందుబాటులో ఉండడు. అందుకే బావ్నే కెప్టెన్‌గా నియమించారు.ఈ ఏడాది బుచ్చిబాబు టోర్నీ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 18 నుండి 20 వరకు గురునానక్ కళాశాల మైదానంలో ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది.మహారాష్ట్ర జట్టుఅంకిత్ బావ్నే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ దాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్, సిద్ధార్థ్ మ్హత్రే, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), మందార్ భండారి, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, ప్రదీప్ దద్దే, ప్రదీప్ దద్దే సోలంకి, రాజవర్ధన్ హంగర్గేకర్ -
మాంసం దుకాణాలు క్లోజ్.. 'మాకేం సంబంధం'
'ఎవరు ఏం తింటారో తెలుసుకోవాలన్న ఆసక్తి మా ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయ'ని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. పంద్రాగస్టు నాడు మాంసం దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలపై విమర్శలు రావడంతో ఆయన ఈవిధంగా స్పందించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఫుడ్ చాయిస్‌పై ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించగా, ముందుగా మొదలు పెట్టింది మీరేనని బీజేపీ కౌంటరిచ్చింది.అసలేం జరిగింది?స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పశువధ శాలలు, మాంసం దుకాణాలు మూసివేయాలని మహారాష్ట్రలోని పలు నగర పాలక సంస్థలు అధికారికంగా ఆదేశాలిచ్చాయి. డోంబివ్లి, కొల్హాపూర్, నాసిక్, ఇచల్కరంజి, జల్గావ్ సహా పలు నగరాల్లో ఇలాంటి ఆదేశాలు వెలుపడ్డాయి. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కూడా ఆంక్షలు ఏమిటంటూ జనంతో పాటు పలువురు నాయకులు ప్రశ్నించారు. దీంతో సీఎం ఫడ్నవీస్ స్పందించారు.'ఎవరేం తినాలో చెప్పాలన్న ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మా ముందు చాలా సమస్యలు ఉన్నాయ'ని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక దినాల్లో పశువధ శాలలు మూసివేయాలని 1988లో ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీన్ని ఆనవాయితీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆదేశాలు అమలు చేశార'ని వెల్లడించారు. కాగా, పంద్రాగస్టు నాడు కబేళాల మూసివేత ఆదేశాలను శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడే మొట్ట మొదటిసారిగా అమలు చేశారని బీజేపీ పేర్కొంది.కరెక్ట్కాదు: పవార్పంద్రాగస్టు నాడు మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. 'ఇలాంటి నిషేధం సరికాదు. వివిధ మతాలు, కులాలకు చెందిన వారు పెద్ద నగరాల్లో నివసిస్తుంటారు. మహావీర్ జయంతి, మహాశివరాత్రి పర్వదినాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించినా ప్రజలు ఆమోదిస్తారు. కానీ స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఎటువంటి ఆంక్షలు విధించరాదని ప్రజలు కోరుకుంటార'ని చెప్పారు.నాన్-వెజ్ తింటా: జితేంద్రచికెన్, మటన్ సహా అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి నాన్-వెజ్ తింటామని ఎన్సీపీ- శరద్‌పవార్ వర్గం నేత జితేంద్ర అహ్వాద్ ప్రకటించారు. మరోవైపు తమ ఆదేశాలను వెనక్కు తీసుకోబోమని కేడీఎంసీ (KDMC) స్పష్టం చేసింది.హర్షవర్ధన్ ఆశ్చర్యంపంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలను నిషేధిస్తూ వివిధ నగర పాలక సంస్థలు ఉత్తర్వులు జారీ చేయడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను తప్పుబడుతూ, ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఏం తినాలో నిర్దేశించి హక్కు ప్రభుత్వానికి లేదన్నారాయన. చదవండి: పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!హైదరాబాద్‌లోనూ..పంద్రాగస్టు, జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 15, 16 తేదీల్లో పశువధ శాలలు మూసివేయాలని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే చికెన్, చేపల విక్రయాలపై ఎటువంటి ఆంక్షలు లేవని.. బీఫ్ విక్రయశాలలపై మాత్రమే నిషేధం ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిషేధం పంద్రాగస్టును మినహాయించాలని కొంతమంది కోరారు. కాగా, బీఫ్ దుకాణాలు, కబేళాలు సంవత్సరంలో ఏడు రోజులు మూసివేయడం అనేది రెండు దశాబ్దాలకు పైనుంచి జరుగుతోందని అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే కొన్ని ప్రత్యేక దినాల్లో బీఫ్ అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని వివరించారు. గాంధీ జయంతి, వర్ధంతి నాడు మటన్ విక్రయించరని చెప్పారు.అమానుషం: అసదుద్దీన్ఆగస్టు 15న కబేళాలను మూసివేయడం అమానుషం, రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సంతోషకరమైన సందర్భమని, ఇలాంటి రోజున ఆంక్షలు విధించడం సరికాదన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరుసగా రెండు రోజులు కబేళాలు మూసివేయాల్సిన పరిస్థితి రావడంతో, తమ జీవనోపాధి దెబ్బ తింటుందని దుకాణాదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆదేశాలను లా స్టూడెంట్ ఒకరు కోర్టులో సవాల్ చేశారు. -
కబుతర్ జా జా జా!
హైదరాబాద్ చాలా పెద్ద నగరం. కానీ..అబిడ్స్, కింగ్ కోఠీ, అమీర్‌పేట్ సర్కిల్‌తోపాటు కొన్ని చోట్ల ఒక దృశ్యం మాత్రం కామన్!ఏమిటయ్యా అదీ అంటే.. టూవీలర్స్, కార్లలో వచ్చి మరీ కొందరు పావురాలకు గింజలు వేస్తూంటారు!నిన్న మొన్నటివరకూ ఇలాంటి దృశ్యాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కనిపించేవి కానీ.. ఇకపై కాదు!ఎందుకంటారా? చదివేయండి..పావురాలకు కాసిన్ని గింజలు వేయడం హైదరాబాద్, ముంబైల్లో మాత్రమే కాదులెండి.. దేశంలోని చాలా నగరాల్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. జీవకారుణ్యానికి ఇదో పెద్ద నిదర్శనంగా చాలామంది పోజులు కొడుతూంటారు. ఆ పావురాలతో కలిసి రీల్స్ చేస్తూ కనిపిస్తారు. అయితే పది రోజుల క్రితం ముంబై హైకోర్టు ఈ తంతుకు ఫుల్స్టాప్ పెట్టమని స్పష్టం చేస్తూ ఆదేశాలిచ్చింది. ఎవరైనా మాట వినకపోతే.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని కూడా చెప్పింది. పిచ్చుకపై బ్రాహ్మాస్త్రం అన్నట్టు పావురాలకు తిండిపెడితే క్రిమినల్ కేసులు ఎందుకు అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పావురాలతో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాల్సిందే. పావురాల వ్యర్థాల దగ్గరే ఉన్నందుకు ఈ మధ్యే గుజరాత్‌లోని 42 ఏళ్ల మహిళ ఊపిరితిత్తి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో పదకొండేళ్ల బాలుడు పావురాల ఈకలను తట్టుకోలేక న్యుమోనిటిస్కు గురయ్యాడు. ముంబైలోనూ 2020లో ఇద్దరు మహిళలకు ఈ పావురాల కారణంగా ఊపిరితిత్తులు మార్చాల్సి వచ్చింది. అంత సమస్య ఉందన్నమాట ఈ పావురాలతో. ఏదో ముద్దుగా ఉంటాయి. కువకువలాడుతూంటే ముచ్చటేస్తుందని అనుకుంటాం కానీ... వాటితోపాటు వచ్చే ఆరోగ్య సమస్యలను మాత్రం విస్మరిస్తూంటాం. కావాల్సినంత తిండి ఫ్రీగా దొరుకుతూంటే అవి కూడా ఎప్పటికప్పుడు తమ సంతతిని పెంచుకుంటూ పోతున్నాయి. మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. భవనాల పిట్టగోడలపై, చిన్న చిన్న కంతల్లోకి చేరే పావురాలు అక్కడ వ్యర్థాలను వదులుతూంటాయి. ఎండకు ఎండిన ఈ వ్యర్థాల్లోంచి పుట్టుకొచ్చే ఫంగస్ గాల్లోకి చేరుతుంది. ఆ గాలిని పీల్చిన వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. మీరు తరచూ జలుబులాంటి సమస్యలు ఎదుర్కొంటూంటే... లేదా ఊపిరితిత్తుల సమస్య ఉన్నా, తరచూ ఫుడ్‌పాయిజనింగ్‌కు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నా... మీ చుట్టుపక్కల పావురాలు ఎక్కువగా ఉన్నయేమో ఒక్కసారి చూసుకోండి మరి! ఇందుకే ముంబై హైకోర్టు పావురాలకు తిండిపెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని ఆదేశించింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్..ముంబై హైకోర్టు ఆదేశాలకు అక్కడి జైన సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. నోరులేని మూగ జీవాలకు ఆహారం వేయడం తమ మత ధర్మం అంటూ వారు వీధుల్లోకి వచ్చారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాము పావురాలకు గింజలు వేసి తీరతామని ఎంత జరిమానా వేసిన భరిస్తామని కూడా తేల్చి చెప్పారు. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ముంబై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ కేసును సోమవారం విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయిల బెంచ్... హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టి వేసింది. హైకోర్టు తీర్పులో ఏదైనా సవరణలు కావాలనుకంటే అక్కడికే వెళ్లాలని స్పష్టం చేసింది. చూడాలి ఏమవుతుందో.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
‘నా భార్యను బ్రతికించుకోలేకపోయాను’
నగరం అంటే ట్రాఫిక్ నరకం. ఇది కాదనలేని సత్యం. ఉండటానికి ఫ్లై ఓవర్స్ ఉంటాయి. నేషనల్ హైవేలు సైతం అనుసంధానంగా కూడా ఉంటాయి. కానీ ట్రాపిక్ సుఖం మాత్రం ఉండటం లేదు. ఇక్కడ ఏదో ఒక నగరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ నగరం చూసినా ఇంచుముంచు ఇదే పరిస్థితి. ఇక వర్షం పడితే ఆ నరకం వర్ణనాతీతం. సాధారణ ప్రజలైతే ఆ నరకాన్ని దాటుకుంటూ ఏదో రకంగా తమ గమ్యాలకు చేరతారు. కానీ ఏదైనా విషమ పరిస్థితుల్లో ఉన్నవారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మాత్రం ఏం జరుగుతుందో మన ఊహకు కూడా అందదు. ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు మహారాష్ట్రలోని పాల్గర్ ప్రాంతానికి చెందిన దంపతులు. భర్త కళ్ల ముందు భార్య విపరీతమైన నరకయాతన అనుభవిస్తున్న చేసేది లేక అంబులెన్స్‌లో అలా ఉండిపోయాడు. భార్య పడిన నరకాన్ని కళ్లరా చూసి.. బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. దీనికి కారణం ట్రాఫిక్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను తీసుకుని నేషనల్ హైవే మీద చిక్కుకుపోయిన ఘటన హృదయవిదారకంగా ఉంది.పల్ఘార్కు చెందిన చయ్యా పూరవ్ అనే 49 ఏళ్ల మహిళకు తీవ్రంగా గాయపడింది. చయ్యా పూరవ్ ఇంటి వద్ద ఉన్న ఒక చెట్టు కొమ్ము ఆమెపై విరిగిపడింది. దాంతో ఆమె తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానిక ఆస్పత్రికి తీసుకెళితే, ముంబైలోని హిందుజా ఆస్పత్రి రిఫర్ చేశారు. దాంతో ఆమెను తీసుకుని అంబులెన్స్‌లో బయల్దేరాడు భర్త. అయితే నేషనల్ హైవే-48;పై వెళితే అక్కడకు చేరడానికి పెద్ద సమయం పట్టదు. పల్ఘార్ నుంచి ముంబై వెళ్లడానికి అది అనువైన రహదారి కూడా.100 కి.మీ దూరం ఉన్న ముంబైని చేరుకోవడానికి ఎంత లెక్కన వేసుకున్నా రెండు గంటలన్నర కంటే ఎక్కువ పట్టదు. అయితే నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సగం దూరం చేరడానికే మూడు గంటలకు పైగా సమయం పట్టింది. అప్పటికే ఆమె పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోతోంది. కానీ భర్త ఏం చేసే పరిస్థితి లేదు. ఆ ట్రాఫిక్‌ను ఛేదిస్తే గానీ భార్య పడే నరకానికి ఫుల్స్టాప్ పెట్టలేడు. ఈ క్రమంలోనే 70 కి.మీ దూరం వెళ్లేసరికి ఆమె సృహలోకి లేకుండా మారిపోయింది. దాంతో అక్కడ ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకు వెళితే ఆమె చనిపోయిందని డాక్టర్టు నిర్దారించారు. ఎంత ప్రేమేగా చూసుకునే భార్య కళ్ల ముందే విలవిల్లాడిపోతుంటే చేసేది లేకుండా పోయిందని భర్త అంటున్నారు. తన భార్య నాలుగు గంటల పాటు తీవ్ర నరకయాతన అనుభవించిందని, అది తన కళ్లతో చూశానని బోరు మంటున్నారు. ట్రాఫిక్ కారణంగానే తన భార్యను కాపాడులేకపోయానని భర్త పూరవ్ కన్నీటి పర్యంతమయ్యారు. అరగంట ముందుగా ముంబై ఆస్పత్రికి వెళ్లినా తన భార్యను కాపాడుకునే వాడినని పూరవ్ బాధాతప్త హృదయంతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. గత నెల 31వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
మాలెగావ్ తీర్పే కాదు, విచారణా విచిత్రమే!
మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పదిహేడేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్న ఏడుగురు నింది తులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తి ఏకే లాహోటీ ఈ ఏడాది జూలై 31న తీర్పు ప్రకటించారు. ఆరుగురి మరణానికీ, వంద మంది దాకా గాయపడటానికీ కారణమైన ఆ నేరం ఎవరు చేశారో ఇప్పటికీ బయటపడలేదు! ఈ కేసు గురించీ, విచారణ క్రమం గురించీ, తీర్పు గురించీ ఆలోచించవలసిన అంశాలెన్నో! ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మాలెగావ్‌లో ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్‌కు అమర్చిన బాంబులు పేలి, ఆరుగురు మరణించిన ఆ కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటి ఎస్)కు అప్పగించింది. అప్పటి ఏటిఎస్ అధిపతి హేమంత్ కర్కరే నాయకత్వంలో ఆ దర్యాప్తు జరిగి అక్టోబర్–నవంబర్లలో 11 మంది అనుమానితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అఖిల భారత విద్యార్థి పరిషత్ మాజీ నాయ కురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మతాచార్యులు దయా నంద పాండే అలియాస్ స్వామి అమృతానంద, రిటైర్డ్ సైనికాధికారి మేజర్ రమేశ్ ఉపాధ్యాయ, అప్పటికి సైన్యంలో పని చేస్తున్న అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ ఉన్నారు. వారిలో అత్యధికులు ‘అభినవ భారత్’ అనే సంస్థ సభ్యులనీ, ఆ సంస్థ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంతో విధ్వంసాలకు పూనుకుంటున్నదనీ ఏటిఎస్ అధి కారి హేమంత్ కర్కరే చెప్పారు. ఈ సంస్థకు, అనుబంధ సంస్థలకు దేశంలో 19 చోట్ల జరిగిన పేలుళ్లతో సంబంధం ఉందని తేలిందని కూడా కర్కరే అన్నారు. అప్పటికి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండిన భారతీయ జనతా పార్టీ, శివసేనలు ఇదంతా కాంగ్రెస్ పన్నాగమనీ, కేసు దర్యాప్తు ఇలా సాగించిన హేమంత్ కర్కరే ‘దేశద్రోహి’ అనీ ప్రకటించారు. అప్పటి గుజరాత్ సీఎం మోదీ ఏటిఎస్ దర్యాప్తు మన సైనిక బలగాల నైతిక ధృతిని కించపరిచేలా ఉందని విమర్శించారు. ఈ దర్యాప్తు వివరాలు బయటపెట్టి, నిందితులను అరెస్టు చేసిన నెల రోజుల తర్వాత ముంబా యిపై తీవ్రవాద దాడిలో హేమంత్ కర్కరేను గురిచూసి కాల్చి చంపారు. ఆయన తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయా రనే అభిప్రాయం ఎంత ఉందో, ఆయన హత్య వెనుక కుట్ర ఉందనే అభిప్రాయం అంత ఉంది. ఆయన చనిపోగానే తన ‘శాపం వల్లనే చనిపోయాడ’ని సాధ్వి అన్న మాటలు ఆ అనుమానాలకు ఆజ్యం పోశాయి. మరొకవైపు, ఏటిఎస్ 2009 జనవరి 20న పదకొండు మంది నిందితుల మీద చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటికి ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పింది. 2011 ఏప్రిల్‌లో ఈ కేసును ఎన్ఐఏ తన పరిధిలోకి తీసుకుని, 2012లో మరొక ఇద్దరిని అరెస్టు చేసి నిందితుల సంఖ్యను 14కు చేర్చింది. 2016 మేలో ఎన్ఐఏ కొత్త ఛార్జిషీట్ తయారు చేసింది. ‘ఉపా’ చట్టం కింద ఆరోపణలున్నప్పటికీ, 2017లో నిందితులందరూ బెయిల్‌మీద బయటికి వచ్చారు. 2018లో విచారణ ప్రారంభమయింది. 323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను, 8 మంది డిఫెన్స్ సాక్షులను విచారించిన తర్వాత, ప్రాసిక్యూషన్ నేర నిర్ధారణకు తగినంత విశ్వసనీయంగా సాక్ష్యాధారాలను సమర్పించలేదని తీర్పు వెలువడింది.ఆ తీర్పులోనే న్యాయమూర్తి కొందరు కీలకమైన సాక్షులను ఎన్ఐఏ ఉపసంహరించుకోవడం ప్రాసిక్యూషన్ ఉద్దేశాల గురించి ప్రతికూల నిర్ధారణలకు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఆ సాక్షులను ప్రవేశపెట్టి ఉంటే, ఆరోపణలను రుజువు చేయడంలో చాలా ఖాళీలు పూరింపబడేవని అన్నారు. కేసు విచారణకు, నేర నిరూపణకు ఉపయోగపడే సాక్షులను ప్రాసిక్యూషన్ తనంతట తానే ఎలా పక్కన పెట్టిందో తీర్పులో వివరంగా రాశారు. అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ దగ్గర నమోదు చేసిన పద ముగ్గురు సాక్షుల వాంఙ్మూలాలు మాయమై పోయాయని ఎన్ఐఏ కోర్టుకు చెప్పింది. ఆ పత్రాలు మాయమైనప్పుడు, అవి ఏ మేజిస్ట్రేట్ ముందర నమోదయ్యాయో ఆ మేజి స్ట్రేట్ను విచారించవలసి ఉంటుంది. కాని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. అయితే ఇలా ప్రాసిక్యూషన్ తప్పులన్నిటినీ జాగ్రత్తగా నమోదు చేసిన న్యాయమూర్తి, ప్రాసిక్యూషన్ వ్యతిరేకించినా అవసరమైన సాక్షులను పిలవడానికి తన కున్న హక్కును మాత్రం వాడుకోలేదు! విచారణలో మరొకమలుపు కూడా ఉంది. కేసు మొద లయిన నాటి నుంచీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉండిన రోహిణి సాలియాన్ ఈ కేసు విచారణలో వేగంగా సాగవద్దని ఎన్ఐఏ నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని 2015లో బయట పెట్టారు. ఆ తర్వాత ఆమెను ఎన్ఐఏ ప్రాసిక్యూటర్ల జాబితా నుంచి తొలగించారు. ఏటిఎస్ నేతృత్వంలో తాము చాలా బలమైన సాక్ష్యాధారాలు తయారు చేశామని, ప్రస్తుత కేసు ఓటమి సాక్ష్యాధారాల లేమి వల్ల జరగలేదనీ, సంస్థా గత, రాజకీయ నిజాయతీ కుప్పకూలడం వల్ల జరిగిందనీ ఆమె అన్నారు. ‘చట్టాన్ని అమలు చేయ వలసినవారే అధికా రంలో ఉన్నవారిని సంతృప్తి పరచడం కోసం దురుద్దేశాలతో పని చేస్తే న్యాయం పట్టాలు తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అన్నారామె. ఇదీ మన దర్యాప్తు వ్యవస్థల పని తీరు!! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
మరో వందేభారత్‌కు ప్రధాని మోదీ పచ్చజెండా.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: భారతదేశపు అత్యంత దూరం ప్రయాణించే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ రైలు మొత్తం 881 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలుకు మొత్తం 10 స్టాప్‌లు ఉంటాయి. సగటున 73 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.నాగ్‌పూర్‌లోని అజ్ని- పూణే మధ్య దీర్ఘ దూరం నడిచే వందే భారత్ రైలు మహారాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది రాష్ట్రంలోని 12వ వందే భారత్ రైలుగా నిలవనుంది. ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రైలు నంబర్లు 26101/26102. ఆగస్టు 11 నుండి పూణే స్టేషన్ నుండి, ఆగస్టు 12 నుండి అజ్ని స్టేషన్ నుండి తన సాధారణ సేవలను ప్రారంభించనుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది.మహారాష్ట్రలోని ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు,సాధారణ ప్రయాణాలు సాగించేవారికి ఈ రైలు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు వార్ధా, బద్నేరా, అకోలా, షెగావ్, భూసావల్, జల్గావ్, మన్మాడ్, కోపర్గావ్, అహ్మద్ నగర్ , దౌండ్ కార్డ్ స్టేషన్లలో ఆగనుంది. ఎనిమిది కోచ్‌లతో.. ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు స్టాండర్డ్ చైర్ కార్లు, మొత్తం 590 మంది ప్రయాణీకులకు కూర్చునేందుకు ఈ రైలు అవకాశం కల్పిస్తుంది. -
వంట బాగోలేదనడం వేధింపెలా అవుతుంది?
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఈ మధ్య ఆసక్తికరమైన తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నదే. తాజాగా.. బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కొట్టేసింది. ఈ క్రమంలో భార్య వంట బాగా లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని అనడం వేధింపుల కింద రాదని పేర్కొంది. 2022 మార్చిలో ఆ జంటకు వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. ఆమె భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ తరుణంలో తన భర్త, అత్తమామలు, భర్త తరఫు బంధువులపై 498A కింద కేసు పెట్టింది. ఈ కేసు చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. తన భర్త తాను వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని సూటిపోటి మాటలతో వేధించాడని ఆమె కోర్టులో వాపోయింది. పైగా భర్తకు శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం తన దగ్గర దాచారని, ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు.. బంధువులు హింసించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తనపై వేధింపులను ఆమె ఏరకంగానూ నిరూపించలేకపోయిందని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘భార్య దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం’’ అని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ సంజయ్ ఏ. దేశ్‌ముఖ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆమెకు ఇది రెండో వివాహం. 2013లో విడాకులు తీసుకున్న పిటిషనర్.. 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు "ఓమ్నిబస్" (సారవంతం లేని) విధంగా ఉన్నాయి. తగిన సాక్ష్యాలు లేకపోగా.. ఆమెవన్నీ అతిశయోక్తితో కూడిన ఆరోపణలనే అనే విషయం ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. వివాహానికి ముందు భర్త ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదని ఈమె చెబుతోంది. కానీ, ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అలాగే ఇల్లు కొనుగోలు కోసం డబ్బుకై వేధించారని చెబుతోంది. కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉంది. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముంది?.. వివాహ సంబంధం బలహీనపడినప్పుడే ‘వంట, దుస్తులు బాగోలేవనే..’ అతిశయోక్తులు జోడించబడతాయి. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సదరు భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
ఆర్మీ అన్నలకు ‘రాఖీ’ సెల్యూట్!
కళ్ల ఎదుటే ఉన్న అన్నకు చెల్లెలెలాగూ రాఖీ కడుతుంది. ‘అండగా ఉండన్నా’ అంటూ అన్నదమ్ముల్ని అడుగుతుంది. కానీ... కొందరు అన్నలు అక్కడెక్కడో సుదూర మంచు పర్వత సానువుల్లోనో, ఎగిరిపడే రేణువుల ఎర్రటెడారి ఇసుకల్లోనే గస్తీ తిరుగుతూ ఉంటారు. అప్రమత్తంగా ఉంటూ అనునిత్యం మన సరిహద్దులకు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్లకు ఏ చెల్లెమ్మలూ కనబడరు. ఏ అక్కలకూ వాళ్లందుబాటులో ఉండరు. అయితే... సొంత అన్నదమ్ములైనా అవసరమైనప్పుడు రక్షణ కల్పించడానికి వస్తారో రారోగానీ ఆ సోదరులు మాత్రం ఎవరు రాఖీ కట్టినా కట్టకున్నా... శత్రువుల నుంచి నిర్భీతిగా నిత్యరక్షణకవచంలా నిరంతరమూ మనకడ్డుగా నిలబడిపోతుంటారు. వాళ్లే మన సరిహద్దులను అనుక్షణం రక్షిస్తుండే మన ఆర్మీ జవాన్లు! ఆ ఆర్మీ అన్నలకు చెల్లెళ్ల ప్రేమానురాగాలు తప్పక దక్కాలనే సంకల్పంతో కొందరు చెల్లెళ్లు గత 28 ఏళ్లుగా ప్రయాసపడుతునే ఉన్నారు. వాళ్లు పడే ఈ ప్రయాస ప్రాధాన్యమేమింటే... వాళ్లకు అత్యంత ఆనందాన్నిచ్చే ఓ అందమైన శ్రమ. ఆ చెల్లెళ్లు మరెవరో కాదు... మహారాష్ట్ర జలగావ్‌లోని ‘ఇందిరాగాంధీ సెకండరీ స్కూల్’కు చెందిన విద్యార్థినులు.ఒకటీ రెండేళ్లుగా కాదు... అసిధారావ్రతంలా అచ్చంగా గత ఇరవయ్యెనిమిదేళ్లుగా సైనిక సోదరులకిలా రాఖీలు పంపుతున్నారు. వాటిని ఆ విద్యార్థినులు ఇంకెవరినుంచో తీసుకోరు. మరెక్కణ్నుంచో కొనరు. స్వయంగా తమ చేతులతో ప్రేమగా తయారు చేస్తారు. ఇందుకు కావాల్సిన ముడిసరుకులనూ తమ పాకెట్ మనీతోనే కొంటారు. ఇలా ప్రతి ఏడాదీ వాళ్లు కనీసం 28,000 లకు తగ్గకుండా రాఖీలు తయారు చేసి పంపుతూ రక్షాబంధన్ పండుగ వేడుకలకు నిజమైన సంప్రదాయాన్నీ, స్ఫూర్తినీ అద్దుతున్నారు.వంద నుంచి వేలాది రూపాయల వరకు... ఓ చెల్లి తన అన్నకు రాఖీ కట్టాక ఉద్వేగాలను అదుపులో ఉంచుతూ ఆ అన్న తనకున్నంతలో తన చెల్లెలికిచ్చే బహుమతులు వంద రూపాయల నుంచి వేలలో ఉంటాయి. ఉదాహరణకు వంద రూపాయలలోపు వచ్చే రిబ్బన్ర్యాప్లో కట్టిన చాక్లెట్ బాక్స్నో, రెండొందల్లో వచ్చే ఆమె పేరులోని మొదటక్షరమో, ఆమె రాశీచక్రపు గుర్తుతో దొరికే కీచైనో, వెయ్యి రూపాయల విలువైన వన్ గ్రామ్ గోల్డ్ గొలుసో, రెండువేల విలువైన డ్రస్సూ– దుపట్టానో, పదివేల విలువ చేసే పెండెంటో లేదా లక్షల విలువ చేసే నిజం బంగారమో ఏదో ఒకటి రిటన్ గిఫ్టుగా ఇచ్చేందుకు ఇప్పుడు మార్కెట్లో రెడీలీ అవైలబుల్ గిఫ్ట్‌లు ఎన్నో ఉన్నాయి.మరి ఆ ఆర్మీ అన్నయ్యలేమిస్తారో... ఎర్రటెండల్లో వాచీతో పాటు రాఖీని చూసినపుడు తగిలే చల్లగాలి తెమ్మెరలాంటి హర్షోల్లాసపు ఆహ్లాదభావన ఆ చెల్లెలు అందించే గిఫ్ట్ అయితే... గస్తీ పనిలో భాగంగా పర్వతసానువులపైన పైపైకిపాకేవేళల... మణికట్టుపై కట్టి ఉన్న ఆ రాఖీని చూసినప్పుడు... ఆ తెలిమంచు తెరలపై తన చెల్లెలి ముఖం కనిపిస్తే కంటికి అడ్డుపడే ఆ కన్నీటితెరతోపాటు సంతోషాలు ఉబికి వస్తుండటమే ఆ అన్నయ్యిచ్చే అమూల్యమైన రిటర్న్ గిఫ్ట్. దేశరక్షణతో పాటు మనకు అది అదనం. – యాసీన్ -
బీసీల సమస్యలు ప్రధాని దృష్టికి..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన గురువారం గోవా యూనివర్సిటీ సమీపంలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగిన 10వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలు కోరుకున్న కులగణన ప్రక్రియను మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతోందన్నారు.వచ్చే ఏడాదిలో జరిగే జనగణనలో కులగణనను జోడించిందని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీలకు మేలు చేసే ఉద్దేశంతో కేబినెట్లో 27 మంది బీసీలకు అవకాశం కలి్పంచారన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ మహాసభల ద్వారా బీసీల ఐక్యత పెరుగుతుందని.. డిమాండ్లు సాధించుకొనే అవకాశం లభిస్తుందన్నారు. తన మంత్రివర్గంలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. గోవా కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాకూర్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు తేల్చి జనాభా ఆధారంగా బీసీలకు వాటా అందించాలన్నారు. సదస్సుకు విశిష్ట అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారం అహిర్ హాజరయ్యారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయాలి: జాజుల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం చేసిన కులగణన ప్రక టన 100% బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామన్నారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ ప్రకారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. -
మా వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయ్.. ఓట్ చోరీపై రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. LIVE: Press Conference - #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారుకొన్ని ఓటర్ ఐడీ కార్డ్‌లలో ఇంటి నెంబర్ జీరో ఉందినాలుగు పోలింగ్ బూత్‌లలో ఒకరి పేరు ఎలా వస్తుందిఎన్నికల ఎలక్షన్ డేటాను ఈసీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు మహరాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని మాకు అర్ధమైందికర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేశాం. మా అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ 9 సీట్లలో గెలిచింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశాంసింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయిఇంటి నెంబర్ ‘0’ తో వంద ఓట్లున్నాయిబెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్ని అనూహ్యంగా ఓడిపోయాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిఎన్నికల్లో చోరీ జరిగిందని మహారాష్ట్ర ఎన్నికలతో మాకు క్లారిటీ వచ్చిందిబెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిమహదేవ్ పూర్లో ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయి.ఓటరు కార్డు మీద పదివేల ఓట్లు పడ్డాయిమహదేవ్పూర్లో బీజేపీ 1,14,046 మెజారిటీ వచ్చిందిమహదేవ్పూర్లో 40వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయిఅలాంటి ఓట్లు వేలల్లోనే..బీహార్ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలికర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయిఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందిఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయిఇంటి నెంబర్ 0తోనూ వందల ఓట్లు ఉన్నాయిసింగిల్ బెడ్రూల్ ఇంటికి 48 ఓట్లు ఉన్నాయిఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయిమహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలుమహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయిమహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందిజనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయిపోలింగ్నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగిందిపోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది?మహారాష్ట్ర ఓటర్ జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా?కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయిఅంచనాలకు అందని ఫలితాలు.. ఎలా?బీహార్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారు.ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయిఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాంహర్యానా, మధ్యప్రదేశ్‌లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయిమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయిప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయిఅంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయికాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుబీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోంది. -
నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు
నాగపూర్: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న నితిన్ గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్.. గడ్కరీ ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. సోదాల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు. అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్‌పుర్ తులసి బాగ్ రోడ్‌లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్‌గా గుర్తించామన్నారు. బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.#WATCH | Nagpur, Maharashtra: Nagpur Police arrested a man for allegedly threatening to bomb Union Minister Nitin Gadkari’s residence. On this, DCP Nagpur, Rushikesh Singa Reddy says, "We received a call in which someone claimed they had planted a bomb in Nitin Gadkari's home,… pic.twitter.com/flrZc3k2LQ— ANI (@ANI) August 3, 2025 -
మోదీ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేశారు
ముంబై: 2008 నాటి మాలెగావ్ పేలుడు ఘటన కేసు నుంచి బయటపడిన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులకు పేలుళ్లతో సంబంధం ఉందని చెప్పాలంటూ అధికారులు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతోపాటు చిత్రహింసలు పెట్టారన్నారు. ‘నాపై ఒత్తిడి చేసి, నేను చెప్పిన ప్రతి విషయాన్ని రాత పూర్వకంగా తీసుకున్నారు. మేం చెప్పినట్లుగా ఆయా పేర్లను చెబితే కొట్టబోమని నాకు మాటలు చెప్పారని’ ఆరోపించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీయే ఆ కుట్ర పన్నిందని, కాషాయాన్ని, సాయుధ బలగాలను అప్రతిష్ట పాలు చేయాలన్న భారీ కుట్ర దీని వెనుక దాగుందని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లు నిర్దోషులు -
వర్కవుట్లు చేస్తుండగా ఆగిన గుండె
హఠాన్మరణాల గణాంకాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోగా.. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణేలోని పింప్రీ-చిన్చ్వడ్‌లో మిలింద్ కులకర్ణి అనే వ్యక్తి వర్కౌట్ అనంతరం నీరు తాగుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది జిమ్‌లోని CCTV కెమెరాలో రికార్డైంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. గుండెపోటు కారణంగా కులకర్ణి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. కులకర్ణి భార్య వైద్యురాలు. గత ఆరు నెలలుగా అతను జిమ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పర్యవేక్షణతో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిమ్‌లో ఆకస్మిక మరణాల కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM).. ఇది వంశపారంపర్యంగా వచ్చే గుండె కండరాల లావుదల, వ్యాయామ సమయంలో గుండె చలనం ఆగిపోయే ప్రమాదం ఉంది. కార్డియాక్ అరెస్ట్.. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండటం వల్ల గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలాగే.. తిన్నాక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడి వచ్చి ప్రమాదం కలగొచ్చు. ఇంతేకాదు.. స్టెరాయిడ్ వినియోగం.. కొంతమంది స్టెరాయిడ్లు(అనధికారిక) వాడటం వల్ల గుండె కండరాలు అధిక ఒత్తిడికి గురై, వ్యాయామ సమయంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం గండె సంబంధిత సమస్యలే కాదు.. వర్కౌట్లు చేసే సమయంలో బ్రెయిన్ ఎటాక్ (aneurysm rupture) వల్ల కూడా మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థితిలో మెదడులో రక్తనాళాలు పగిలి మరణించే అవకాశం ఉంటంది. జిమ్.. జాగ్రత్తలుజిమ్లకు వెళ్లేవాళ్లు.. వెళ్లాలనుకుంటున్నవాళ్లు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదికుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉంటే, మరింత జాగ్రత్త అవసరం.ఆహారం తర్వాత తక్షణం వ్యాయామం చేయకూడదు.అనధికారిక స్టెరాయిడ్లు, అధిక బరువులు ఎత్తడం వంటి చర్యలు నివారించాలి. #Maharashtra #Pune के पिंपरी चिंचवड में जिम में वर्कआउट के दौरान एक शख्स को आया हार्ट अटैक; अस्पताल पहुंचने से पहले हुई मौत..पूरी घटना CCTV में कैद..37 साल के शख्स की हुई मौत..@TNNavbharat @PCcityPolice pic.twitter.com/X7Nun52YpZ— Atul singh (@atuljmd123) August 2, 2025 -
వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురు!
నాగ్‌పూర్: ఆమె వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురి అవతారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని లక్షల్లో దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీసుల్ని సైతం షాక్ గురి చేసింది. గత 15 ఏళ్లలో భర్తలను మారుస్తూ ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా ధనం గుంజేసింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీరా ఫాతిమా అనే మహిళ తన నెక్స్ టార్గెట్ తొమ్మిదో వరుడు కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. వారి వద్ద నుంచి ఎంత దొరికితే అంత దోచేస్తుంది. ఇదొక ముఠాగా ఏర్పడి చేస్తున్న పని. ఆమె వృత్తి రీత్యా టీచర్. బాగా చదువుకుంది. కానీ డబ్బు ఆశతో ఇలా పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడుతోంది. ధనవంతుల్నే టార్గెట్‌గా ఎంచుకుంటుంది. అందులోనూ ముస్లిం కమ్యూనిటీలోని వారినే పెళ్లిళ్లు చేసుకుంటుంది. ఆమె చేసుకున్న ఒక భర్త నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేసింది. ఇంకొకరి నుంచి రూ. 15 లక్షలను దోపిడీ చేసింది. ఇలా మరొకర్ని మోసం చేస్తూ పోతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. ఇందుకోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా తదితర మార్గాల ద్వారా వరుల కోసం అన్వేషిస్తుంది. వారికి కట్టుకథలు చెబుతూ బురిడీ కొట్టించి వలలోకి దింపుతోంది.’ అని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
రమ్మీ ఎఫెక్ట్.. మాణిక్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ
సీరియస్‌గా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఓ మంత్రి సీరియస్‌గా ఫోన్ వంకే చూస్తూ వేళ్లు కదిలిస్తున్నారు. ఏం చేస్తున్నారా? అని చూస్తే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఆ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ మంత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా.. విపక్షాలు ఆ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మాణిక్‌రావ్ కోకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. అదే సమయంలో ఆయనకు వేరే పోర్ట్ పోలియోలు అప్పగించింది. మాణిక్‌రావ్ కొకటేకు క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలూ ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025ఎన్సీపీ(పవార్ వర్గం) ఎమ్మెల్యే అయిన కోకటే చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో ఆయన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ వివరణ తీసుకున్నారు. గురువారం ఆ నివేదికను సీఎం ఫడ్నవిస్‌కు పంపారు. ఆ వెంటనే ఆయనకు వేరే శాఖలను అప్పగించారు. అయితే.. మంత్రి వర్గం నుంచి తప్పించుకుండా శాఖను మార్చడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.మూడు నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ వ్యవసాయశాఖ మంత్రి తీరికగా చట్ట సభలో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా మంతత్రిగా కొనసాగించడం ఏంటి? అని ఫడ్నవిస్ ప్రభుత్వాన్నిఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సులే ప్రశ్నించారు.అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తాత్రేయ భరణేకి వ్యవసాయ శాఖను కేటాయించారు. -
డ్రగ్ పార్టీపై పోలీసుల దాడి.. మాజీ మంత్రి అల్లుడు అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆదివారం ఉదయం ఓ అపార్టుమెంట్లో జరుగుతున్న డ్రగ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలతో పాటు హుక్కాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి భర్త ప్రాంజల్ ఖెవల్కర్ సహా పలువురు పట్టుబడ్డారు.రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఖరాడీ ప్రాంతంలోని స్టూడియో అపార్టుమెంట్‌పై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దాడి చేశామని డీసీపీ(క్రైం) నిఖిల్ పింగ్లే చెప్పారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో 2.7 గ్రాముల కొకైన్, 70 గ్రాముల గంజాయి, హుకా సామగ్రి, మద్యం దొరికాయన్నారు. పట్టుబడిన వారిపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్)చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నివేదికలు అందాల్సి ఉందన్నారు.ఎన్సీపీ(ఎస్పీ)నేత అయిన ఏక్నాథ్ షిండే ఈ పరిణామంపై మీడియా ఎదుట స్పందించారు. పోలీసుల దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రోహిణీ ఖడ్సే వ్యవహరిస్తున్నారు. ఘటనపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక హెచ్చరిక వంటిదంటూ శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారె వ్యాఖ్యానించారు. प्रांजल खेवलकरांच्या रेव्ह पार्टीवर धाडीचा व्हिडिओ आला बाहेर, काय घडलं?#LokmatNews #MaharashtraNews #pranjalkhewalkar #raveparty #Policecase #MarathiNews pic.twitter.com/AufI7xJx0I— Lokmat (@lokmat) July 27, 2025 -
గూగుల్‌ను అనుసరిస్తూ నేరుగా మురుగుకాలువలోకి
ముంబై: సాఫీగా రోడ్డు ప్రయాణం సాగేలా దారిచూపాల్సిన గూగుల్స్ మ్యాప్స్ యాప్ ఒక్కోసారి ప్రయాణికులను కాలువల్లోకి, చిట్టడవుల చెంతకు చేరుస్తోంది. అలాంటి మరో ఘటనకు మహారాష్ట్ర వేదికైంది. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ ఒక మహిళ కారులో వంతెన మీదుగా ప్రయాణించాల్సిందిపోయి పక్కనే ఉన్న మురుగుకాలువలోకి నేరుగా పడిపోయింది. నవీ ముంబైలోని బేలాపూర్‌లో ఒక ఆడీ కారు కాలువలో పడిన ఈ ఉదంతం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒంటి గంటకు జరిగింది. శుక్రవారం రాత్రి మహిళ ఒంటరిగా ఆడీ కారు లో నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతానికి బయల్దేరారు. బేలాపూర్ వద్ద ఎదురుగా వంతెనను దాటా ల్సి ఉండగా గూగుల్ మ్యాప్స్ మాత్రం పక్కకు వెళ్లాలని తప్పుడు సూచన చేసింది. ఆమె మరో ఆలోచన చేయకుండా యాప్ చెప్పిన దారిలోనే కారును ముందుకు పోనిచ్చారు. హఠాత్తుగా దారి కాస్త మురుగుకాల్వగా మారింది. బేలాపూర్ పేద్ద కాల్వలో కారు పడిపోవడంతో ఆమె కాపాడండంటూ హాహాకారాలు మొదలెట్టారు. స్థానికుల సమాచారంతో మెరైన్సెక్యూరిటీ బృంద సభ్యులు రంగంలోకి దిగి పడవలో వెళ్లి ఆమెను కాపాడారు. -
వామ్మో.. ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ముంబై: దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్ వేల్లో ఒకటైన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 నుంచి 20 వాహనాల వరకూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వీటిలో కనీసం మూడు వాహనాల వరకూ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శనివారం(జూలై 26) మధ్యాహ్నం వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అంతే కాకుండా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. లోనావాలా ఖాందార్ ఘాట్ వద్ద.. ఓ కంటైనర్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందున్న వెహికల్‌ను ఢీకొట్టింది. ఇలా కార్లు చైన్ సిస్టమ్ మాదిరి ఒకదాని వెంటే మరొకటి ఢీకొట్టుకున్నాయి. కంటైనర్.. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందు ఉన్న వాహనాన్ని అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఆ వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టిందిఈ ఎక్స్‌ప్రెస్ వే పై నిత్యం లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ వాహనాల రద్దీ ఉంటుంది. అదే వీకెండ్లలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు వీకెండ్ కావడంతో ఆ రద్దీ మరింత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర విభాగాలు హుటాహుటీ ఇక్కడకు చేరుకుని గాయపడ్డ వారికి సహాయక చర్యలు చేపట్టాయి. Monsoon: Wet Concrete + cluster driving without Safe Braking Distance Gap.Worse pileup crash, 15 vehicles…3 similar accident within 10 Days, Krishnagiri, Assam & now this one.@DriveSmart_IN @dabir Mumbai - Pune Expressway pic.twitter.com/3Kdd8pKSpV— Dave (Road Safety: City & Highways) (@motordave2) July 26, 2025 -
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi) -
‘దాడి చేస్తే మరాఠీలో మాట్లాడేస్తారా?’: తమిళ అనుభవాన్ని చెప్పిన గవర్నర్
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న భాషా వివాదంపై రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి, మరాఠీలో మాట్లాడమంటూ ఆ భాష రానివారిపై దాడి చేస్తే, వారు వెంటనే మరాఠీలో మాట్లాడగలుగుతానా?.. అలా చేస్తే అది మహారాష్ట్రకే హాని కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.తమిళనాడులో తాను ఉన్న సమయంలో ఇలాంటి భాషా వివాదాన్ని చూశానని తెలిపారు. ఒకరోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తాను కారులో ప్రయాణిస్తుండగా, రోడ్డు పక్కన ఒక వ్యక్తిపై పలువురు దాడి చేయడాన్ని తాను చూశానన్నారు. తరువాత తాను జోక్యం చేసుకుని, ఆరా తీయగా, బాధితుడు ఉత్తర భారతదేశానికి చెందిన లారీ డ్రైవర్ అని తెలిసిందన్నారు. అతను హిందీలో మాత్రమే మాట్లాడగలడని, అయితే దాడి చేసిన వారు అతనిని తమిళంలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారని తెలుసుకున్నానన్నారు.భాషపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ప్రమాదకరమని గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ప్రజలను విభజించడమే కాకుండా ఇతరులు రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని, భాష ఎప్పుడూ హింస లేదా వివక్షకు కారణం కాకూడదని గవర్నర్ పేర్కొన్నారు.మనం మాతృభాషను చూసి గర్వపడుతూనే ఇతర బాషలను కూడా నేర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గవర్నర్ వ్యాఖ్యలను సమర్ధించిన మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ ‘మరాఠీ మన మాతృభాష. అది మనకు గర్వకారణం. అయితే ఎవరైనా మరాఠీలో మాట్లాడాలని బలవంతం చేయడం లేదా వారిపై దాడి చేయడం సరైనది కాదు. మనం కూడా మహారాష్ట్రను దాటి ఎప్పుడైనా బయటకు వెళతాం. అక్కడ ఎవరైనా తమిళం లేదా బెంగాలీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తే మనం ఏం చేయగలం? అని ప్రశ్నించారు. అన్ని భాషలను గౌరవించాలని గిరీష్ మహాజన్ అన్నారు. -
హైవేపై ఇరుక్కుపోవడమెందుకు? కారుతో రైలెక్కండి..
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కెడెక్కడో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో వాహనాల రాకపోకలతో రహదారులు కిక్కిరుస్తాయి. వందలకొద్దీ వాహనాలతో హైవేలు స్తంభిస్తాయి. ఇక కారు వేసుకుని వెళ్లి గంటలకొద్దీ ఆ హైవేలపై ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని సంక్రాంతి సమయంలో మన తెలుగురాష్ట్రాల మధ్య హైవేలపై చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ సమయంలో తలెత్తే రద్దీకి కొంకణ్ రైల్వే వినూత్న పరిష్కారంతో ముందుకువచ్చింది. భారతదేశపు మొట్టమొదటి కార్ ఫెర్రీ రైలు సేవను కోలాడ్ (మహారాష్ట్ర), వెర్నా (గోవా) మధ్య ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేవ ద్వారా ప్రయాణికుల తమ ప్రైవేట్ కార్లను రైలు ద్వారా రవాణా చేయనుంది. అదే సమయంలో వాహనదారులు కూడా ఆ రైలుకు జతచేసిన ప్యాసింజర్ బోగీలలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని కొంకణ్ రైల్వే పేర్కొంది.గణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్రలోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీని ఉంటుంది. ఇంతటి ట్రాఫిక్‌లో కార్లను రోడ్డు మార్గం ద్వారా కోలాడ్, వెర్నా మధ్య తీసుకెళ్లాలంటే 20–22 గంటల సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ కార్ ఫెర్రీ రైలు సహాయపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 12 గంటలకు తగ్గిస్తుంది.కోలాడ్-వెర్నా కార్ ఫెర్రీ రైలు సర్వీస్ ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కోలాడ్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వెర్నా చేరుకుంటుంది. అయితే మూడు గంటలు ముందే అంటే మధ్యాహ్నం 2 గంటలకే కోలాడ్ స్టేషన్ వద్దకు కారు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో రైలులో 20 ప్రత్యేక వ్యాగన్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో రెండు చొప్పున 40 కార్లు తీసుకెళ్తుంది. అయితే, కనీసం 16 కార్లు అయినా బుక్ అయితేనే ఈ రైలు నడుస్తుంది.ఒక్కో కారుకు సరుకు రవాణా ఛార్జీ రూ.7,875 (వన్ వే) ఉంటుంది. భద్రత కోసం వాహనాలను సురక్షితంగా బిగించి హ్యాండ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ సమయంలో కారులో కూర్చునేందుకు ఎవరినీ అనుమతించరు. వాహనదారులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన స్థలం ఉంటుంది. 3ఏసీ బోగీల్లో ఒక్కొక్కరికి రూ.935 చెల్లించి ఇద్దరు సీట్లు బుక్ చేసుకోవచ్చు. అదనంగా మరో వ్యక్తి ఉంటే రూ.190 చెల్లించి స్లీపర్ కోచ్ లో ప్రయాణించవచ్చు. దీని కోసం బుకింగ్స్ జూలై 21 నుంచి ఆగస్ట్ 13 వరకూ అందుబాటులో ఉంటాయి. -
రన్‌వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కొచ్చి(కేరళ) నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్ అయ్యింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగేశారు. ఈ ఘటనతో ఇంజిన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.Runway scare: #Kochi-bound #AirIndia flight veers off course during landing at #Mumbai airport; passengers safeMore details🔗https://t.co/nhauXEYCrs pic.twitter.com/NewRgbZFyD— The Times Of India (@timesofindia) July 21, 2025 -
డాగ్ వాకర్‌గా.. నెలకు ఏకంగా రూ. 4లక్షలు పైనే..
ప్రస్తుత అవసరాలను క్యాష్ చేసుకుని ఆ దిశగా అడుగులు వేసి లక్షలు ఆర్జించిన వాళ్లెందరో ఉన్నారు. ఇక్కడ కాస్త క్రియేటివిటీ..విభిన్నంగా ప్రత్యేకతను చాటుకోవడమే సక్సెస్ మంత్ర. అలాంటి సీక్రెట్‌ని ఫాలో అవుతూ ఇక్కడొక వ్యక్తి ఏకంగా సాప్ట్వేర్ ఉద్యోగులనే తలదన్నేలా లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడేం చేస్తున్నాడో వింటే తెల్లబోవడం ఖాయం. ఈ విధంగా కూడా ఇంతలా సంపాదించడం సాధ్యమేనా.. ? అనే సందేహం కలుగక మానదు.మహారాష్ట్రకు చెందని ఒక వ్యక్తి డాగ్ వాకర్‌గా పనిచేస్తూ..రూ. 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అతడు ఎంబిఏ డిగ్రీ ఉన్న తన సోదరడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడట. అతడి సోదరుడు ఓ కార్పొరేట్ కంపెనీలో నెలకు రూ. 70 వేలు సంపాదిస్తుంటే.. ఈ వ్యక్తి మాత్రం పెంపుడు కుక్కలను టేకర్‌గా తన సోదరుడి కంటే ఎక్కువ ఆర్జించడం విశేషం. అతడు మొత్తం 38 కుక్కల సంరక్షణను చూసుకుంటాడు. ఒక్కో కుక్కకు రూ. 15 వేళు ఛార్జ్ చేస్తాడట. అలా అతడు నెలకు రూ. నాలుగు లక్షల పైనే ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. అది సాధ్యమేనా..భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ 2026 నాటికి ₹7,500 కోట్లు దాటుతుందని అంచనా. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో డాగ్ వాకర్లు , పెంపుడు జంతువుల సంరక్షణ నిపుణుల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పెంపుడు జంతవుల యజమానులు డాగ్ వాకర్, సంరక్షణ నిపుణుల సేవలను కోరుకోవడంతో .. ఇప్పుడు ఇదే ..అత్యంత ఆదాయ మార్గ వృత్తిగా మారింది. ముంబై లేదా పూణే వంటి నగరాల్లోని చాలా మంది ప్రొఫెషనల్ డాగ్ వాకర్లు ఒక్కో కుక్కకు ₹300 నుండి ₹500 వరకు వసులు చేస్తారట. రోజుకు పది నుంచి 15కు పైగా పెంపుడు జంతువుల బాధ్యత తీసుకుంటే ఇలా లక్షల్లో ఆర్జించడం సాధ్యమే అని అంటున్నారు నిపుణులు. ఆ కేర్ టేకర్లు పెంపుడు జంతువుల సంరక్షణ, డాగ్ వాకింగ్ వంటి ప్రీమియం సేవలకు అనుగుణంగా డబులు వసూలు చేయడం జరుగుతుందట. జంతు యజమానుల నమ్మకాన్ని పొందిన జంతుకేర్ టేకర్లు, కచ్చితమైన షెడ్యూలింగ్‌తో ఈ రేంజ్లో డబ్బులు సంపాదిస్తారని చెబుతున్నారు. అయితే అధి మొత్తంలో ఆర్జించడం అనేది సంరక్షణ నిపుణుడి తీరు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ఈ ఉద్యోగాలదే డిమాండ్ కాబోలు..!. View this post on Instagram A post shared by The Bharat Briefing (@thebharatbriefing) (చదవండి: ప్రపంచంలోనే అతి సన్నని కారు..! ఎంతటి ఇరుకు సందుల్లో అయినా..) -
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫోన్ లో రమ్మీ ఆడిన మంత్రి
-
నేరం చేశారంటే నమ్మలేం
ముంబై: ముంబైలో 19 ఏళ్ల క్రితం 180 మందికిపైగా ప్రాణాలను బలిగొన్న రైలు పేలుళ్ల కేసులో సోమవారం కీలక పరిణామం సంభవించింది. పోలీసులు నేర నిరూపణలో ఘోరంగా విఫలమయ్యారని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితులు ఈ నేరం చేశారంటే నమ్మడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం మొత్తం 12 మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ‘నిందితుల నేరాంగీకార ప్రకటనలు ఏమా త్రం ఆమోదయోగ్యంగా లేవు. అవన్నీ కాపీ చేసినట్లుగా కనిపిస్తున్నాయి. నేరం అంగీకరించాలంటూ పోలీసులు తమను తీవ్రంగా హింసించారని పేర్కొనడం ద్వారా నిందితులు నేరాంగీకార విశ్వసనీయతను మరింత దెబ్బతీశారు’అని వ్యాఖ్యానించింది. నేరానికిగాను ఏ రకం బాంబులు వాడారనే విషయం కూడా పోలీసులు చెప్పలేకపోయారని, సేకరించిన ఆధారాలు నేరనిరూపణకు సరిపోయేవి కావంది. ‘బాంబులు, సర్క్యూట్ బాక్సుల వంటి స్వాధీనమైన వస్తువులకు సరిగ్గా సీళ్లు వేయలేదు. వాటిని జాగ్రత్తగా భద్రపర్చలేదు. కీలకమైన సాక్షులను ప్రశ్నించడంలోనూ విఫలమైంది’అంటూ ప్రాసి క్యూషన్ తీరుపై విరుచుకుపడింది. నిందితులకు న్యాయపరమైన సాయం అందించకుండానే నేరాంగీకార ప్రకటన రికార్డు చేయడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. నిందితుల నేరాంగీకార స్టేట్మెంట్లలో ఏమాత్రం స్పష్టత లేదంది. పేలుళ్ల కేసుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆప్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్(మోకా)ను వాడకపోవడాన్ని ఎత్తి చూపింది. ‘అసలైన నేరస్తుడిని శిక్షించడం నేర కార్యకలా పాలను అరికట్టడానికి, చట్టాన్ని నిలబెట్టడానికి, పౌరుల భద్రతను నిర్ధారించే దిశలో ఒక ముఖ్య మైన అడుగు’అని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌ల ధర్మాసనం తన 671 పేజీల తీర్పులో పేర్కొంది. ‘అందుకు విరుద్ధంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా, సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపేలా ప్రాసిక్యూషన్ వ్యవహరించింది. అసలైన ముప్పు ఇప్పటికీ తొలగలేదనే విషయం ఈ కేసుతో తేటతెల్లమైంది’అని మండిపడింది. ‘నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరానికి పాల్పడ్డారని నమ్మడం కష్టం. అందుకే వారిపై ఆరోపణలను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. రైళ్లలో బాంబులు అమర్చడం తదితర నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ప్రకటించిన నలుగురితోపాటు జీవిత కాల జైలు శిక్షలు పడిన ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వీరిలో మరణ శిక్ష పడిన కమాల్ అన్సారీ 2021లో జైలులోనే చనిపోయాడు. మహానగరం ముంబైలోని స్థానిక రైళ్లు ఏడింటిలో 2006 జూలై 11న పేలుళ్లు సంభవించాయి. ఘటనల్లో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి
ముంబై: మహారాష్ట్రలో అధికార ఎన్సీపీ నేత, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కొకటే మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సెల్ఫోన్లో రమ్మీ ఆడుతూ దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో గందరగోళం మొదలైంది. బీజేపీని సంప్రదించకుండా ఎన్సీపీ పక్షం ఏపనీ చేయలేకపోతోంది.దీంతో, పనిలేక ఆ పార్టీ మంత్రులు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నారని ఆరోపించారు. అన్నదాతల సమస్యల పరిష్కారంపై అధికార పక్షానికి శ్రద్ధ లేదని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ మండిపడ్డారు. విమర్శలపై కొకటే స్పందించారు. ‘అసెంబ్లీ సమావేశాల తీరును తెల్సుకునేందుకు నా సెల్‌ఫోన్‌ను తీశా. అయితే, అప్పటికే డౌన్లోడ్ చేసిన గేమ్ సడన్‌గా ఓపెనైంది. దాన్ని క్లోజ్ చేశాను.ఇదంతా కేవలం 5, 10 సెకన్లలోనే జరిగిపోయింది. అంతేతప్ప, గేమ్‌ను ఆడటానికి ఓపెన్ చేయలేదు’అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, కొకటే ఏప్రిల్‌లోనూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా అందిన డబ్బును వివాహాలకే ఖర్చు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో, ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. -
నోటీసు పీరియడ్‌లో ఉండగానే, పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ప్రాంతాల్లో ఉద్యోగులపై ఒత్తిళ్లు సహజమే. అయితే ఆ ఒత్తిళ్లు ఈ మధ్యకాలంలో ఉద్యోగులను తీవ్ర నిర్ణయాల వైపు అడుగులేయిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ బ్యాంకులో పని చేసే సీనియర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడడం.. అదీ బ్యాంకులోనే కావడం.. అందునా రాజీనామా చేసిన వారానికే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శివశంకర్ మిత్రా.. మహారాష్ట్ర పుణే బారామతిలోని ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో పని చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులో పని ఒత్తిడి, అనారోగ్య కారణాలతో జులై 11వ తేదీన ఆయన తన చీఫ్ మేనేజర్ పోస్టుకు రాజీనామా చేశారు. అయితే ఏమైందో ఏమోగానీ నోటీసు పీరియడ్‌లో ఉన్న ఆయన అనూహ్యంగా ఘాతుకానికి పాల్పడ్డారు.గురువారం రాత్రి బ్యాంకు నుంచి సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోయాక.. తాళాలు తాను వేస్తానంటూ వాచ్‌మెన్‌కు చెప్పి ఆయన ఒక్కరే లోపలే ఉండిపోయారు. అంతకు ముందే తనతో పాటు తెచ్చుకున్న తాడులో బ్యాంకులోపలే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదంతా అక్కడి సీసీటవీ కెమెరాల్లో రికార్డయ్యింది. భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్‌కాల్స్‌కి ఎంతకీ స్పందిచకపోవడంతో ఆమె అనుమానంతో అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుంది. అందరూ వెళ్లిపోయి ఉంటారని వాచ్మెన్ చెప్పగా.. లోపల లైట్లు వేసి ఉండడంతో అనుమానంతో గేట్లు తీసి చూశారు. లోపల ఆయన ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పని ఒత్తిడే కారణమని పేర్కొన్న ఆయన.. ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు తన భార్య, బిడ్డలను క్షమాపణ కోరుతూ.. వీలైతే తన కళ్లను దానం చేయాలని నోట్లో కోరారాయన. దీంతో ఆ కుటుంబం విలపిస్తోంది. రాజీనామా చేసిన కొన్నిరోజులకే ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో తోటి సిబ్బంది సైతం కంటతడి పెట్టారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే పుణేలో ఈవై కంపెనీలో పని చేసే కేరళ యువతి అన్నా సెబాస్టియన్(26) పని ఒత్తిడి కారణంగా హఠాన్మరణం చెందింది. ఆమె తల్లి బహిరంగ లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. దేశంలో పని గంటలు, ఒత్తిళ్లు తదితర అంశాలపై విస్తృత చర్చ నడిచింది. అప్పటి నుంచి ఈ తరహా మరణాలు నెలలో కనీసం ఒకటి రెండైనా వెలుగు చూస్తున్నాయి. మొన్నటి మే నెలలో ఒలా ఏఐయూనిట్ కృత్రిమ్‌లో పని చేసే నిఖిల్ సోమవాన్షి ‘టాక్సిక్ వర్క్‌కల్చర్, పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడడం సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా మరణాలకు ప్రధాన కారణాలుఅత్యధిక పని గంటలు (55+ గంటలు/వారానికి)అనియంత్రిత డెడ్లైన్లుపరిమిత మానసిక ఆరోగ్య మద్దతుముఖ్యంగా హస్టల్ కల్చర్ (Hustle Culture) ప్రభావం.. అంటే విశ్రాంతికి చోటు లేకుండా టార్గెట్లు రీచ్ అయ్యేందుకు ఎప్పుడూ పని చేయాలనే మానసిక ధోరణి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యాన్ని పట్టించుకోరు.Economic Times నివేదిక ప్రకారం, ఇండియాలో యువ ఉద్యోగులు అధిక పని గంటల వల్ల ఆత్మహత్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన EU నివేదిక ప్రకారం, వర్క్‌స్ట్రెస్ వల్ల ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు.. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయించి సాయం పొందండి. తెలంగాణలో.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఆంధ్రప్రదేశ్‌లో.. 1లైఫ్, ఫోన్ నెంబర్ 78930-78930; 100జీజీహెచ్ కాకినాడ.. 98499-03870 -
ఆషాఢ జాతర రికార్డు ఆదాయం రూ. 10.84కోట్లు
సోలాపూర్, మహారాష్ట్ర: ఈ ఏడాది ఆషాఢ ఏకాదశి జాతర సందర్భంగా మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని విష్ణువు అవతారమైన విఠోబా లేదా శ్రీ విఠల రుక్మిణి ఆలయానికి (Shri Vitthal Rukmini Mandire) కానుకలు, విరాళాల రూపంలో భారీ ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డుస్థాయిలో రూ. 10.84 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ కమిటీ సహాయ అధ్యక్షుడు గహినీనాథ్ ఔసేకర్ మహారాజ్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు అదనంగా లభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆషాఢ ఏకాదశి జాతరకు అత్యధికంగా 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఇది కూడా ఒక రికార్డే. లడ్డూ ప్రసాదం, భక్త నివాసాలు, హుండీ ఆదాయం కానుకల రూపేణా వచ్చిన మొత్తం 10.84 కోట్ల ఆదాయాన్ని భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని మేనేజర్ మనోజ్ శృత్రి తెలిపారు. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది! -
ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది!
గడ్చిరోలి: మహారాష్ట్ర నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి తొలిసారిగా ప్రభుత్వ బస్సు సర్వీసు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. మార్కనార్ గ్రామం గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగడ్ ఉపవిభాగంలో నక్సల్స్ బలమైన కోటగా ఉన్న అబుజమాడ్ పర్వత ప్రాంతంలో ఉంది. గిరిజన జనాభా సాంద్రతకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన గడ్చిరోలి జిల్లాలో ప్రజలు చాలా కాలంగా పరిసర ప్రాంతాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మర్కనార్ నుంచి ఆహేరీకి బస్సు సర్వీసును ప్రారంభించింది. గ్రామంలోకి మొదటిసారిగా అడుగిడిన ప్రభుత్వ బస్సును స్థానికులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. జాతీయ జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. మర్కనార్, మురుంభూషి, ఫుల్నార్, కోపర్షి, పోయార్కోఠి, గుండుర్వాహి సమీప గ్రామాల్లోని విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఈ సర్వీసుతో ప్రయోజనం పొందుతారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: US Woman 16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి -
45 ఏళ్ల తర్వాత.. మళ్లీతెరపైకి సరిహద్దు వివాదం!
స్తబ్దుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సరిహద్దు గ్రామాలు తమవేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ ప్రకటనను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆరు గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కొనసాగుతామంటూ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్లో వినతిపత్రం సైతం సమర్పించారు. ముంబైలో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జివితితోపాటు పలు సరిహద్దు గ్రామాలకు చెందిన 11 మంది నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. సరిహద్దు గ్రామాల విషయంలో స్పష్టతనివ్వాలని కోరడంతోనే విలీన విషయం మళ్లీ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.అసలు వివాదం ఇదీ.. 1955–56లో ఫజల్ అలీ కమిషన్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులను నిర్ధారించారు. ఈ క్రమంలో భాషా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న వివాదాస్పద 14 గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులు నిర్ణయించగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆర్టికల్–3 ద్వారా ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదీనంలో ఉంటాయని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపిన వివరాల ప్రకారం.. 1980 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగబోమని, మహారాష్ట్రలో విలీనం చేయాలని ఉద్యమం ప్రారంభమైంది. దీంతో 1983లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఏపీకి చెందినవేనని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని 1990 జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని, భాషా ప్రాతిపదికన విభజించాలని న్యాయవాది, రాజురా ఎమ్మెల్యే వామన్‌రావు చటప్ ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. అసెంబ్లీలోనూ సమస్యను లేవనెత్తారు. వివాదాస్పద గ్రామాలు భాషాపరంగా తమకు చెందుతాయని ‘మహా’సర్కార్ 1993 ఆగస్టు 5న 1990 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై 1996 ఏప్రిల్ 3న అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్‌ను వేసింది. అక్కడి ప్రభుత్వం అదే ఏడాది ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ 10338/96 దాఖలు చేసింది. కేసు వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు 1997 ఫిబ్రవరి 12న ఏపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఆగస్టు 21న బేషరతుగా వెనక్కి తీసుకుంది. అయితే ఆ ఉత్తర్వులపై స్థానిక ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. దీంతో ఇరు రాష్ట్రాలూ తమ పాలనను కొనసాగిస్తున్నాయి. ఇరు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఎన్నికల్లోనూ ప్రజలు ఓటు వేస్తున్నారు. 1965 నుంచి ఆయా గ్రామాలు మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్‌మోదా గ్రామ పంచాయతీలో ఉండగా, 1990లో మళ్లీ పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాలను విడదీసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ కూడా పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.ఇరు రాష్ట్రాల పాలన ప్రస్తుతం 14 గ్రామాలు ఇరు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గతంలో పరంధోళి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించలేదు. పట్టాల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. గ్రామాలను అనుసంధానిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. ఇరవై శాతం గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించింది. డెబ్భైయ్ శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలకు హక్కులు కల్పించకపోవడంతో.. వారిలో చాలామంది మహారాష్ట్రలో కలుస్తామని చెబుతున్నారు.రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు చూపిస్తున్న మహిళలుపట్టాలిస్తేనే.. నలభయ్యేళ్లుగా సాగు చేస్తున్నా నేటికీ భూములకు పట్టాలు లేవు. ఇరు ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రజలు పేదరికంలో బతుకుతున్నారు. ఏ ప్రభుత్వం సాగు భూములకు పట్టాలిస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతాం. :::కాంబ్డె లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరంధోళి‘మహా’సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మహారాష్ట్ర సర్కారు 14 గ్రామాలు తమవే అని ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరాఠీ మాట్లాడే మేమంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే ఉంటా మని 1980 నుంచి పోరాటం చేస్తున్నాం. గ్రామాలు మహారాష్ట్రకు చెందినవని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. :::రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడతెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అటవీ భూములకు హక్కు పత్రాలు ఇచి్చంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా అందనున్నాయి. తాగునీరు, సాగునీరు తదితర సౌకర్యాలు కలి్పస్తోంది. మా గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం. :::హడ్సె బాజీరావు, ఇంద్రానగర్ :::కెరమెరి (ఆసిఫాబాద్), సాక్షి ప్రతినిధి -
మరాఠీని వ్యతిరేకించిన మార్వాడీపై దాడి
ముంబై: మరాఠీవారిని అవమానిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేశారనే ఆరోపణలతో ముంబైలోని విక్రోలిలోగల ఒక మార్వాడీ దుకాణదారుడిపై దాడి చేసి, చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.రాజ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు మరాఠీ భాష మాట్లాడనివారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో విరివిగా జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మరాఠీ దుకాణదారుణ్ణి చుట్టుముట్టి, అతను చేసిన వాట్సాప్ పోస్ట్ గురించి అడగటాన్ని గమనించవచ్చు. తరువాత వారంతా అతనిపై దాడి చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బలవంతం చేయడాన్ని చూడవచ్చు. तुम्ही इथे येऊन अशी भाषा वापराल तर तुम्हाला त्याच भाषेत उत्तर मिळणार. तुला कोलला ! pic.twitter.com/xSGFk201Ts— MNS Videos (@mnsvideos) July 16, 2025మరాఠీ భాష, సంస్కృతిని అగౌరవపరచవద్దని ఎంఎస్ఎస్ కార్యకర్తలు ఇతరులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. మరాఠీ ప్రజలను అవమానించేవారి దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయవద్దని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. థానేలో ఫుడ్ స్టాల్ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. గతంలో మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఒక ఆటోరిక్షా డ్రైవర్‌పై కూడా దాడి జరిగింది. -
ఆ అయిదు రోజుల నిషేధంపై విజయం
రుతుస్రావం (menstrual) జరుగుతున్న మహిళలను అపవిత్రమైనవారిగా.. అంటరానివారిగా పరిగణించే గ్రామాలు ఇప్పటికీ మన దేశంలో ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని మాడియాతెగ మహిళలు శతాబ్దాలుగా 'ఆ ఐదు రోజులు' ఊరికి దూరంగా రుతు గుడిసె (menstrual huts or kurma ghars) లలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడా ఆచారానికి అక్కడి మహిళలంతా కలిసి స్వస్తి పలికారు. ఆ గ్రామంలోని అన్ని వయసుల మహిళలకు సమష్టిగా 'మావా ఆస్కాన్లోన్' (మహిళలుగా ఇది మా నిజమైన ఇల్లు) ను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసి, విజయం సాధించారు. ఈ నిర్మాణం మహిళలకు ఒక ఆశ్రయం మాత్రమే కాదు సమావేశాలు జరుపు కోవడానికి, ఒకరికొకరు మద్దతుగా నిలబడటానికి మహిళల కమ్యూనిటీ కేంద్రంగా కూడా పనిచే స్తుంది. సమీప గ్రామాల మహిళలు కూడా ఈ ఇంటికి వస్తున్నారు. మహిళలే మహిళల కోసం ఐక్య తగా సదస్సులు ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నారు.దశాబ్దాల కాలంగా కుర్మాఘర్ (రుతు గుడిసె) ఆచారాన్ని నిర్మూలించడానికి గడ్చిరోలికి చెందిన స్వర్మ్ అనే ఎన్జీవో అక్కడి మహిళలకు మద్దతుగా నిలిచింది. ఇది సహజమైన జీవప్రక్రియ. ఈ సమ యంలో మహిళలకు అవసరమైన భావోద్వేగ, శారీ లేక మద్దతు కుటుంబం నుండి మాత్రమే లభి స్తుంది, ఒంటరితనంతో కాదు" అని పదే పదే చెబుతూ గ్రామంలోని పురుష సభ్యులను, సంప్ర దాయ విశ్వాస నాయకులలో మార్పునకు కృషి చేసింది. 'మొదట్లో అసాధ్యం అనిపించింది. కానీ,చేశారు. శ్రమించారు. కానీ, నిజాయితీగా కృషి చేయడంతో మనస్తత్వాలు రడం ప్రారంభించాయి. ఇక నుంచి రుతు గుడిలో ఏ ఒక్క మహిళ కూడా ఉండకూడదు అని స్థంగా చెబుతున్నారు' అంటారు ఎన్టీవో డైరెక్టర్ దిలీప్ బర్సగా..ఒంటరి వేదన నుంచి విముక్తిమహిళల కోసం ఆశ్రమం నిర్మించాలనుకున్న డు కుర్మ ఘరాగా ఉండకూడదనే షరతుతో గీకరించారు. అంటే, వారు ఆ రుతు గుడిసెతో తటి మానసిక, శారీరక క్షోభను అనుభవించారో చేసుకోవచ్చు. మహిళలు ఒంటరిగా ఉండే. పది ఐదు రోజుల నుండి మూడు రోజులకు, వాత రెండు రోజులకు తగ్గింది. అయినప్పటికీ డా ఇళ్ల వాళ్లు రుతుస్రావం ఉన్న మహిళలను శ్లోకి అనుమతించడాన్ని నేటికీ వ్యతిరేకిస్తున్నాయి. రుతుస్రావం ఉన్న, లేని మహిళలు అందరూ ఒకే పైకప్పు కింద కలిసి ఉండటం వల్ల ఈ నిషేధం తొలగిపో యేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేశారు శ్రమించారు. ఫలితంగా నేడు అందరూ కలిసి ఉంటున్నారు. కొందరు రుతుక్రమంలో ఉన్న మహిళలు ఇప్పటికీ కేంద్రంలో పగటిపూట గడు పుతారు. కానీ, రాత్రికి ఇంటికి తిరిగి వెళతారు. ఈ ఇల్లు ఇప్పుడు అన్నిరకాల సమావేశాలకు ఉపయోగపడుతుంది. మహిళల విజయానికి చిహ్నంగా మారింది. ఆంక్షల నుంచి అవగాహనవైపుగానెల్గుండ గ్రామానికి చెందిన మాడియా తెగ సభ్యురాలు బేబీ మర్కుమే మాట్లాడుతూ 'ఊరికి దూరంగా 15 గుడిసెల వరకు ఉన్నాయి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. తుఫానుల వల్ల చాలా వరకు పైకప్పులు ఎగిరిపోయాయి. రుతు క్రమం సమయంలో నది నీటిని తాకడానికి కూడా వీల్లేని ఆంక్షలు, మూడవ రోజు, మళ్లీ ఐదవ రోజున స్నానం చేసి, ఊరి లోపలికి వెళ్లాలి. దీనివల్ల రకర కాల జబ్బులు వచ్చేవి. కానీ, ఊరి పెద్దవాళ్లు మొండిగా ఉంటారు' అని చెబుతుంది ఆమె. 201 1లో స్వర్క్ 223 రుతు గుడిసెలలో ఒక సర్వే నిర్వ హించింది. అందులో.. పాముకాటు, అడవి జంతు వుల దాడులు, ఒంటరితనం, అధిక రక్తస్రావం, వైద్య అత్యవసర పరిస్థితుల వల్ల 28 మంది అమ్మా యిలు మరణించారని గుర్తించింది. బాధితుల్లో దాదాపు 70 శాతం మంది 11 నుంచి 37 సంవత్స రాల మధ్య వయసు గలవారే అని చెబుతారు. ఇక్కడి మహిళలు, గిరిజన పరిశోధన శిక్షణ సంస్థ గడ్చిరోలిలోని 50 గ్రామాలకు తన బృందాన్ని పంపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో విద్య, వైద్యం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.. -
బస్సులో ప్రసవం.. బయటకు విసిరి పారేసిన తల్లి
నెలలు నిండిన ఓ యువతి బస్సెక్కింది. సరిగ్గా ప్రయాణంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చప్పుడు కాకుండా ప్రసవించిన ఆమె.. ఆ బిడ్డను గుడ్డలో చుట్టి రోడ్డు మీదకు విసిరి పారేసింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది.మహారాష్ట్ర పర్బానీలో దారుణం జరిగింది. బస్సుల్లోనే బిడ్డను ప్రసవించిన ఓ యువతి.. ఆపై దారుణానికి ఒడిగట్టింది. కళ్లు తెరవని ఆ పసికందును రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల ఆ యువతితో పాటు భర్తగా చెప్పుకున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పర్బానీ నుంచి పుణే వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే.. బస్సులోంచి ఓ చిన్నమూట బయటకు పడింది. కిటికీలోంచి అది చూసిన డ్రైవర్.. అనుమానం వచ్చి బస్సును ఆపి ప్యాసింజర్ల దగ్గరకు వచ్చి ఆరా తీశాడు. అయితే..తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. వాళ్లు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. దీంతో.. ప్రయాణికులంతా ఆ జంటను నిలదీశారు. తమ పేర్లు రితికా ధిరే, అల్తాఫ్ షేక్‌గా చెప్పుకున్న ఆ జంట.. ఏడాదిన్నరగా పుణేలో కాపురముంటున్నామని చెప్పారు. అయితే బిడ్డను పెంచి పోషించే స్తోమత తమకు లేదని.. అందుకే ఇలా చేశామని ఆ ఇద్దరు చెప్పారు. ఆపై ఎమర్జెన్సీ నెంబర్ 112 ద్వారా పోలీసులను ఈ సమాచారం అందించారు.పార్తీ స్టేషన్ పోలీసులు వచ్చి విచారణ జరపగా.. ఆ జంట భార్యభర్తలే అని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ అయిన యువతిని ఆస్పత్రికి.. సదరు వ్యక్తిని జైలుకి తరలించారు. డిశ్చార్జి తర్వాత ఆ జంటను కలిపి విచారణ జరిపే యోచనలో పోలీసులు ఉన్నారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. -
పోచమ్మ బోనాల పండుగ
సాక్షి ముంబై; దాదర్ నాయ్‌గావ్‌లోని పద్మశాలీ యువక సంఘం (పీవైఎస్) ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే సాధారణం కంటే భిన్నంగా జంతుబలికి తావు లేకుండా అందరూ శాఖాహార బోనాలే సమర్పించడం విశేషం. బోనాల పండుగ సందర్భంగా లక్ష్మీపతి శర్మ అర్చకత్వంలో ïమిరియాల రోజాగౌతమ్, మంగరి సలోని రాహుల్ దంపతుల చేతుల మీదుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిషేకం, హోమం, దేవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. పండుగ సందర్భంగా మహిళా భక్తులు తలపై బోనాలు ఎత్తుకుని పెద్ద సంఖ్యలో పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. తమ వెంట తెచి్చన పిండి వంటలు, ప్రసాదాలు, ఒడి బియ్యం అమ్మవారికి సమరి్పంచి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అందరిని చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని కోరినట్టు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు సంపిణీ చేశారు. మరోవైపు ఈ కార్యక్రమంలో సంస్ధ చైర్మన్ అనబత్తుల ప్రమోద్, మేనేజింగ్ ట్రస్టీ పొన్న శ్రీనివాసులు, కోడి చంద్రమౌళి, తిరందాసు సత్యనారాయణ, అ«ధ్యక్షుడు గంజి సీతారాములు, ఉపాధ్యక్షుడు లక్షేట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సహాయకార్యదర్శులు పేర్ల గీతాంజలి, కోశాధికారి దోర్నాల బాలరాజు, అధ్యాత్మికక సమితి చైర్మన్ దోమల్ శంకర్, కన్వీనర్ పుట్ట గణేశ్, కార్యవర్గ సభ్యులు పగిడిమర్రి సత్యనారాయణ, ఇతర పదాధికారులు సభ్యులు పాల్గొన్నారు. సాకినాకలో బోనాల సంబరాలు ముంబై సాకినాకాలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. స్థానిక తెలుగు ప్రజలు సంప్రదాయ వేషధారణతో తలపై బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి పోచమ్మ తల్లికి మొక్కుబడులు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కోళ్లను బలి ఇచ్చారు. తెలుగు మాదిగ మహా సంఘం బోనాలు ముంబైలోని తెలుగు మాదిగ మహా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ కమాటిపురాలోని పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వ్రస్తాలు, నైవేద్యాలు సమర్పించారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎరుల లక్ష్మణ్, తెడ్డు బాబు రాజన్న, జోగు రాజలింగం, కోశాధికారి గంగడొల్ల రాజరాం, మేకల బాబు, నల్లూరి బాబు, గుమ్మెర్ల ప్రభాకర్, గంగడోల్ల శంకర్, కొత్తూరి రామచంద్ర, మేకల ఆనంద్, గుమ్మెర్ల మధూకర్, జంగం మహేష్, రుల రోజారాణి, మేకల రాజమణి, మేకల శోభ, జోగు కాంతమ్మ, మేకల భారతి, మేకల సప్న, విమల గుండారం తదితరులు పాల్గొన్నారు. -
Tesla: భారత్‌లోకి ఈవీ దిగ్గజం టెస్లా అఫీషియల్ ఎంట్రీ
-
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్‌గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025 -
మరాఠీ మాట్లాడని ఆటో డ్రైవర్‌పై దాడి
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా విరార్ ప్రాంతంలో ఇటువంటి ఘటనే జరిగింది. శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ డ్రైవర్ గతంలో ఒక వీడియోలో తాను హిందీ, భోజ్‌పురిలో మాట్లాడటం కొనసాగిస్తానని ప్రకటించాడు. ఇది కొన్నివర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించింది.శనివారం సాయంత్రం విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు ఆ డ్రైవర్‌ను వెతికి పట్టుకుని, అతనిపై దాడి చేశారు. తరువాత మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) విరార్ నగర చీఫ్ ఉదయ్ జాదవ్ ఈ చర్యను సమర్థించారు. ‘ఎవరైనా మరాఠీ భాషను, మహారాష్ట్రను, మరాఠీ ప్రజలను అవమానించే ప్రయత్నం చేస్తే, వారికి శివసేన తనదైన శైలిలో సమాధానం ఇస్తుందని జాదవ్ హెచ్చరించారు. #Auto driver assaulted in #Virar for not speaking #Marathi, #UddhavThackeray Sena workers force public apology | Video#ShivsenaUBT #Shivsena #MarathiNews https://t.co/PLsFHzDsN0— IndiaTV English (@indiatv) July 13, 2025కాగా పలువురు ఈ దాడిని ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదికాదన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి అధికారిక ఫిర్యాదును నమోదు చేయలేదు. మహారాష్ట్రలో భాషా రాజకీయాలపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్న దరిమిలా.. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడుతోందనే మాట వినిపిస్తోంది. -
ముదురుతున్న భాషా యుద్ధం
-
నోట్ల కట్టల బ్యాగుతో శివసేన ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన(షిండే) నేత, రాష్ట్ర మంత్రి సంజయ్ షిర్సత్ డబ్బు నిండిన బ్యాగుతో కనిపిస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. ఈ వీడియోను ప్రతిపక్ష శివసేన(యూబీటీ)కి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం పోస్ట్ చేశారు. సంజయ్ షిర్సత్ తన బెడ్రూంలో కూర్చుని సిగరెట్ తాగుతూండగా, పక్కనే నిండా నోట్ల కట్టలున్న బ్యాగు తెరిచి ఉంది. మరో సూట్ కేస్, ఆయన పెంపుడు కుక్క కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘ఆసక్తికరమైన ఈ వీడియోను గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం ఫడ్నవీస్ చూడాలి. దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. మహారాష్ట్ర మంత్రి గురించిన చాలా విషయాలు ఈ వీడియోతో తెలుస్తాయి’అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలను సామాజిక న్యాయ శాఖ మంత్రి షిర్సత్ ఖండించారు. ఆ బ్యాగులో కనిపించేవి కరెన్సీ నోట్లు కావు..తన దుస్తులని చెప్పారు. ఇదంతా కావాలని చేసిన కుట్రగా పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో ఆయన వెల్లడించిన ఆస్తుల విలువ రూ.3.3 కోట్లు కాగా, 2024 నాటికి రూ.35 కోట్లకు పెరిగాయంటూ షిర్సాత్ చూపడంపై ఐటీ వివరణ కోరింది. ఐటీ నోటీసుకు తగు విధంగా సమాధానమిస్తానని చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవన్నారు. Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025 -
పప్పు పంచాయితీ.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై కేసు నమోదైంది. పాడైపోయిన పప్పు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకోవైపు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బుల్దానా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్.. ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్‌ను తీవ్రంగా కొట్టారు. పాచిపోయిన ఆహారం ఇచ్చారంటూ పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్ ముక్కు వద్ద పెట్టిన గైక్వాడ్.. ఆ వెంటనే అతనిపై ముష్టిఘాతాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్ కింద పడిపోయి.. లేవలేని స్థితిలో ఉన్నా.. తన దాడిని ఆపలేదు. ఈ దాడికి సంబంధించిన వీడియో బుధవారం నెట్టింట వైరల్ అయ్యింది.అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును ప్రతిపక్షాలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్, శివసేన బాస్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. అయినా కూడా గైక్వాడ్ తన నోటి దురుసును ఆపలేదు. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత.. శుక్రవారం ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేశారో స్పష్టత రావాల్సి ఉంది.గురువారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ భారతీయులపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా? ఏం తినాలో మాకు తెలుసు. దక్షిణాదివారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. పిల్లల్ని చెడగొడుతుంటారు. అలాంటి వారు మంచి ఆహారం ఎలా అందిస్తారు? అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రోడ్డు పరిశీలనలో అపశృతి.. ప్రాణ భయంతో అధికారుల పరుగో పరుగు..
అధికారుల అవినీతికి అద్ధం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంజినీర్లు, అధికారుల సమక్షంలోనే ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్ట్ డొల్లతనం బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల అవినీతకి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే..వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాడ్వానీ తాలూకాలోని ఖడ్కి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో, ఈ మార్గంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించి.. రోడ్డు వేయాలని స్థానికులు, విద్యార్థులు అధికారులను కోరారు. అంత వరకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇంతలో ఓ ఇంజినీరు మాత్రం అతికి పోయి.. అదే మార్గంలో పైపులు వేసి.. రోడ్డు నిర్మాణం చేపట్టాడు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద చిన్న బ్రిడ్జిలాగా పైపులైన్‌పై రోడ్డు నిర్మించారు. అనంతరం, రోడ్డు నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఇంజినీర్, అధికారుల బృందం అక్కడికి చేరుకున్నారు. అనంతరం, వారు నిర్మించిన రోడ్డుపై లారీ వస్తున్న సమయంలో.. రోడ్డు కుంగిపోయి.. ఆ లారో బోల్తా కొట్టింది.ఈ క్రమంలో భయంతో వణికిపోయిన అధికారుల బృందం.. పరుగులు తీశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే విధంగా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఓ అధికారి అయితే.. పక్కనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి బురద నీటిలో దాక్కునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది అధికారుల అవినీతికా ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Engineer and his entire team had arrived in Beed, Maharashtra to inspect the road.During the inspection, a truck got stuck on the road and overturnedThis is the live demo testing of Corruption 🤡pic.twitter.com/InEpS94e3z— 🚨Indian Gems (@IndianGems_) July 10, 2025 -
భక్తిధామం షిర్డీలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలు..!
-
ఎమ్మెల్యే ‘పాచిపోయిన పప్పు’ వివాదం.. క్యాంటీన్ లైసెన్స్ సస్పెండ్
ముంబై: ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న క్యాటరర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)సస్పెండ్ చేసింది. పాచిపోయిన పప్పు వడ్డించారనే ఆరోపణలతో శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన దరిమిలా ఎఫ్‌డీఏ చర్యలు చేపట్టింది.ఎఫ్‌డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్- 2006లోని కీలక నిబంధనలను, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్- 2011ను ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ ఉల్లంఘించించింది. హాస్టల్లో నిర్వహించిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు బయటపడినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. పన్నీర్, చట్నీ, నూనె, కంది పప్పు నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపుతామని, 14 రోజుల్లోగా నివేదిక వస్తుందని తెలిపారు. జూలై 10 నుండి హాస్టల్ ప్రాంగణంలో అన్ని ఆహార సేవల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆహార నియంత్రణ సంస్థ ఆదేశించింది. #WATCH | Mumbai: Food and Drug Administration (FDA) officials took food samples from the Akashvani MLA canteen. Shiv Sena MLA Sanjay Gaikwad thrashed a canteen employee here yesterday, alleging poor quality of food"Samples of paneer, Schezwan chutney, oil and toor dal have been… pic.twitter.com/SZw4hhBRuS— ANI (@ANI) July 9, 2025శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటీన్లో ఒక నిర్వాహకునిపై చేయిచేసుకున్న ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గైక్వాడ్ ఎమ్మెల్యే హాస్టల్లోని తన గదికి భోజనం ఆర్డర్ చేయగా, వచ్చిన ఆహారంలో పప్పు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన క్యాంటీన్లోని సిబ్బందిపై చేయిచేసుకుని, బిల్లు చెల్లించడానికి నిరాకరించారు. తరువాత ఆయన తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని, ఈ విషయంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. హోటల్‌పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత..! ఇంటర్ ఫెయిల్ నుంచి ఏకంగా ఐఐటీలో..
చుట్టూ దారుణమైన ఆర్థిక పరిస్థితి..అయినా బాగా చదవాలన్న గట్టి లక్ష్యం. పోనీ ఇంత కష్టపడుతుంటే..వచ్చిపడే కష్టాల కెరటాలు వెరసీ విరుచకుపడ్డ అనారోగ్యం ఇవేమి ఆ వ్యక్తి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సాధించాలేవ్ అంటూ పదేపదే అతడి గమ్యాన్ని చేరనివ్వకుండా చేస్తున్న సమస్యలకు తన గెలుపుతో గట్టి సమాధానం చెప్పాడు. ల్యాప్‌టాప్ వంటి సకల సౌకర్యాలు గానీ, ఆర్థికంగా భరోసా వంటివి ఏమి లేకపోయినా..అజేయంగా విజయతీరాలకు చేరుకోవచ్చు అని చూపించి స్ఫూర్తిగా నిలిచాడు. అతడే 19 ఏళ్ల హర్ష గుప్తా. మహారాష్ట్రలోని థానే జిల్లాకి నివాసి. అతడి తల్లిదండ్రుల జీవనాధారం పానీపూరీ బండి ఒక్కటే. వారే సంతోష్, రీతా దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురిలో పెద్దవాడే ఈ హర్ష్ గుప్లా. హర్ష తండ్రి పదికూడా పాసవ్వలేదు. అందువల్లే ఆయన తన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించాడు. అయితే వారికి వచ్చే ఆదాయానికి పిల్లల చదువుకి అయ్యే ఖర్చుకి పొంతన లేకపోవడంతో విపరీతమైన ఆర్థిక కష్టాలు మధ్య బతుకు సాగించేవారు. అయితే హర్ష చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు. పదిలో 90.8 శాతం మార్కలతో పాసయ్యాడు. అయితే ఇంటర్‌కి వచ్చేటప్పటికీ రెక్టల్ ప్రోలాప్స్ అనే అరుదైన అనారోగ్య సమస్య బారినపడ్డాడు. దాంతో తరగతులకు సరిగా హాజరుకాలేకపోయాడు. ఫలితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిలయ్యాడు. పైగా చుట్టూ ఉన్న స్నేహితులు నీలాంటి వ్యక్తులు ఐఐటీ వంటి చదువులు అందుకోవడం కష్టం అని ముఖంపైనే చెప్పేసేవారు. అయినా సరే ఎందుకో హర్షకి తనకిది సాధ్యమే అని గెలిచి చూపించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అది ఎలా అనేది అగమ్యగోచరంగా ఉండేది. ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పూర్తిచేసి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌కి సన్నద్ధమయ్యాడు. అందుకోసం నితిన్ విజయ్, మోషన్ ఎడ్యుకేషన్, కోట ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాడు. అందుకు అవసరమయ్యే డబ్బులకు కొందరు దాతలు సాయం చేయడంతో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అయితే ఎక్కడ ఉండాలన్నది మరో సమస్య. పోనీ పీజీ హాస్టల్ జాయిన్ అవుదామన్నా.. సరిపడా డబ్బులేదు. చివరికి హర్ష ఆ హాస్టల్ యజమానిని బతిమాలుకుని తక్కుడ డబ్బు చెల్లించేలా వసతి ఏర్పరుచుకున్నాడు. ఇన్ని కష్టాలు దాటుకుని జేఈఈకి సిద్ధమవుతుండగా..మరోవైపు అనారోగ్యం తిరగబెట్టింది. దాంతో హాస్టల్ ఖాళీ చేసి తిరిగి ఇంటికి వచ్చేసే పరిస్థితి ఎదురైంది. దాంతో చాలా క్లాస్‌లు మిస్సవ్వడం, మాక్‌టెస్ట్‌ల్లో వెనకబడటం జరిగింది. ఇక లక్ష్యం తనకు చాలా దూరమైపోతోందని, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్‌తో తన సమస్య వివరించగా..తన అనారోగ్యానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేయడం గురించి సూచనలిచ్చారు. అలా తొలి ప్రయత్నంలో జేఈఈ మెయిన్స్‌లో 98.59 శాతం సాధించాడు. అయితే అతడి అనారోగ్య దృష్ట్యా తగినంత విశ్రాంతి తప్పని పరిస్థితి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్‌కి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సాధ్యపడలేదు. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌కి అర్హత సాధించలేకపోయాడు. అయితే హర్షకి ఎన్ఐటీ వంటి వాటిల్లో ఆఫర్ వచ్చినా కాదనుకుని ఐఐటీ జాయిన్ అవ్వడమే తన ధ్యేయమని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిపోయాడు. అందువల్లే ఓటమి నైరాస్యం కుంగదీస్తున్నా.. తగ్గేదే లే అంటూ.. మళ్లీ మరోసారి జేఈఈకి ప్రిపరయ్యేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తల్లిదండ్రలు మద్దతు అందించారు. ఈసారి తన ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా కోచింగ్ ఫీజ కవర్ అయ్యేలా స్కాలర్షిప్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి మరి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. బాగా ప్రిపేరయ్యేలా మంచి హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈసారి ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మానస వికాసం పొందేలా పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తూ ప్రిపరేషన్ సాగించాడు. అలా JEE మెయిన్స్ 2025లో 98.94 శాతం సాధించి టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించాడు.నేర్చుకున్న జీవిత పాఠాలు..చదువుకి అవసరమయ్యే నిధుల కోసం దాతలు ముందుకు వచ్చినప్పుడు కలిగిన సంతోషం తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగేలా ప్రేరేపించిందని అంటున్నాడు హర్ష్ గుప్తాఅనారోగ్యంతో హాస్టల్ వదిలి ఇంటికి బాధగా వస్తుండగా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. దాంతో స్టేషన్ నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే ఓ వృద్ధ దంపుతులు తన కోసం క్యాబ్ బుక్‌చేసి డ్రాప్ చేసిన ఘటన మరువలేనని చెబుతున్నాడు. నిజానికి ఆ దపంతులు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ సాటి మనిషి పట్ల దయ చూపడం అంటే ఏంటో అప్పుడే తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే నేనే ఎదుర్కొన్న ఓటములు, అడ్డంకులు..సమస్యలను ప్రతిబంధకంగా చూడకుండా పరిష్కారం అన్వేషించాలి. ఒకవేళ పరిష్కారం తెలియకపోతే ఒత్తిడికి గురికాకుడదు మార్గదర్శకులను అన్వేషించాలి. అంతే తప్ప ఇంతే అని ఆగిపోకూడదు అని తాను తెలుసుకున్న జీవిత సత్యం అని చెబుతున్నాడు. అలాగే చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహతులు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు, విమర్శించొచ్చు..కానీ అవేమి తీసుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపోవడం తెలిస్తే గెలుపుని అందుకోవడం చాలా ఈజీ అని చెబుతున్నాడు హర్ష్ గుప్తా. (చదవండి: 'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!) -
కరెక్ట్ కాదు.. గైక్వాడ్ వీడియోపై ఫడ్నవిస్ స్పందన
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేశారు. పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ ఆపరేటర్‌ను గైక్వాడ్ చితకబాదిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫడ్నవిస్ స్పందించారు. ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(Sanjay Gaikwad) తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారాయన. ‘‘ఆయన వీడియో చూశాను. ఇలాంటి ప్రవర్తన సరికాదు. ప్రజాప్రతినిధుల ప్రతిష్టను మసకబార్చేదిగా ఉంది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదుల ద్వారా పరిష్కరించాలే తప్ప.. ఇలా దాడులతో కాదు’’ అని ఫడ్నవిస్ మీడియాతో అన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్లో పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గైక్వాడ్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారాయాన. అంతేకాదు.. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని చెబుతున్నారాయన.Shiv Sena (Shinde group) MLA Sanjay Gaikwad allegedly assaulted staff at the MLA canteen near the State Secretariat in Mumbai. #SanjayGaikwad #MLACanteen #MaharashtraPolitics #Shivsena #bjp pic.twitter.com/NCXaf1rdgJ— YourDailyNews (@yourdailynews9) July 9, 2025మరోవైపు సంజయ్ గైక్వాడ్ దాడి వీడియోపై ఉద్దశ్ శివసేన వర్గం భగ్గుమంది. అయితే.. సంజయ్ గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి షిండే శివసేన తరఫున కేవలం 841 ఓట్ల తేడాతో గైక్వాడ్ గెలుపొందారు.2024 సెప్టెంబర్‌లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన నాలుక కోసిన వారికి ₹11 లక్షల బహుమతి ప్రకటించారు. రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు బీసీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ గైక్వాడ్ ఈ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.2024 ఏప్రిల్‌లో.. మహారాష్ట్ర పోలీసులను ప్రపంచంలోనే అత్యంత అసమర్థమైన అధికారులుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేస్తూ ఏక్నాథ్ షిండేకు ఫోన్ చేశారు. ఆపైన గైక్వాడ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.2023 మార్చిలో.. ఒక యువకుడిని పోలీస్ లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయింది.2021లో.. అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కరోనాను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. కరోనా గనుక తన చేతికి దొరికితే ఫడ్నవిస్ నోట కుక్కి కథ ముగిస్తానంటూ వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 1987లో పులిని వేటాడానని చెబుతూ.. దాని పళ్లను లాకెట్‌గా ధరించానని చెప్పడంతో వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద సంజయ్ గైక్వాడ్ మీద కేసు నమోదైంది.తాజాగా: ముంబయిలోని ఎమ్మెల్యే హాస్టల్లో పాడైపోయిన పప్పు ఇచ్చారన్న కారణంతో కాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బతో కొట్టిన వీడియో వైరల్ అయింది. -
‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’.. ‘మహా’లో కొత్త వివాదం
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెరపైకి మరో వివాదం వచ్చింది. అదే ‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’. రాష్ట్రంలోని హోమియోపతి వైద్యులు ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన అనంతరం వారు అల్లోపతి మందులను సూచించేందుకు అనుమతినిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది.ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తోపాటు పలువురు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రోగుల భద్రత, వైద్య ప్రమాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో హోమియోపతి ప్రాక్టీషనర్లు కొన్ని షరతులతో ఆధునిక మందులను సూచించడానికి అనుమతించేలా చట్టంలో పలు సవరణలు చేసింది.దీని ప్రకారం, ఫార్మకాలజీలో ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులు, అల్లోపతి మందులను సూచించడానికి అర్హులు అవుతారు. మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (ఎంఎంసీ)ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐఎంఏ ఈ నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసింది. హోమియోపతి వైద్యులకు అల్లోపతి మందులను సూచించే అధికారం ఇవ్వడం రోగుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఐఎంఏ పేర్కొంది.ఆరు నెలల కోర్సుతో హోమియో వైద్యులు ఆధునిక వైద్యం నేర్చుకోవడం సాధ్యం కాదని, వైద్య ప్రమాణాలు దిగజారే అవకాశం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక రకమైన క్రాస్ ప్రాక్టీస్ అని, ఫలితంగా వైద్య రంగంలో గందరగోళం ఏర్పడవచ్చని వారు అంటున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఆధునిక ఫార్మకాలజీలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులకు మాత్రమే అల్లోపతి మందులను సూచించే అధికారం ఉంటుందని ఎఫ్‌డీఏ పేర్కొంది. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. -
పప్పు చెడిపోయిందని క్యాంటిన్ కాంట్రాక్టర్‌పై దాడి
ముంబై: పాడైపోయిన భోజనం పెట్టారన్న కారణంతో క్యాంటిన్ కాంట్రాక్టర్‌పై అధికార కూటమి ఎమ్మెల్యే దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ముంబైలోని ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటిన్లో రాత్రి భోజనం కోసం వచ్చారు. ఆయనకు వడ్డించిన పప్పు చెడిపోయినట్లు గుర్తించారు. దాంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే క్యాంటిన్ కాంట్రాక్టర్‌ను పిలిపించారు. పప్పు వాసన చూడాలంటూ కాంట్రాక్టర్‌ను ఒత్తిడి చేశారు. ఇది ఎలా తినాలంటూ మండిపడ్డారు. సహనం కోల్పోయి కాంట్రాక్టర్ చెంప చెల్లుమనిపించారు. ముఖంపై గట్టిగా కొట్టారు. దెబ్బల తీవ్రతకు కాంట్రాక్టర్ ఒక్కసారిగా కింద పడిపోయారు. పైకి లేచేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే మళ్లీ మళ్లీ దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Meet Shah Sena’s MLA Sanjay Gaikwad. Last year he had threatened&announced 11 lakh rupees to anyone who cuts off Sh. Rahul Gandhi’s tongue. Now the man is seen beating up a poor helpless canteen worker. But wait no news TV outrage here since its a BJP ally pic.twitter.com/XVwnEzJFSU— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 9, 2025శివసేన స్టైల్ ఇదే ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనుచిత ప్రవర్తన పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు సైతం మండిపడ్డాయి. ఇలాంటి ఘటనలు ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఫడ్నవీస్ అన్నారు. హింసను తాను సమర్థించబోనని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇతరులను అకారణంగా కొట్టడం సరైంది కాదన్నారు. మరోవైపు తన వ్యవహార శైలిని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సమర్థించుకున్నారు. శివసేన స్టైల్ ఇదేనని తేల్చిచెప్పారు. క్యాంటిన్లో ఆహారం నాణ్యంగా లేదని చాలాసార్లు ఫిర్యాదు చేశానని, ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. తన ఫిర్యాదును లెక్కచేయనప్పుడు ఇంకేం చేయాలి? చచ్చిపోవాలా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ను కొట్టడం పట్ల తానేమీ విచారించడం లేదన్నారు. సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుగాంచారు. -
ఠాక్రే సోదరుల యుగళం
రాజకీయాల్లో ఏ నిర్ణయం ఎటువైపు లాక్కెళుతుందో చెప్పటం కష్టం. మహారాష్ట్రలో నిరుడు నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 235 గెల్చుకుని అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి... అంతా సవ్యంగా ఉందనుకున్న వేళ హిందీని ప్రాథమిక విద్య స్థాయిలో ఒకటో తరగతి నుంచి తృతీయ భాషగా నేర్చుకు తీరాలని జీవో తీసుకొచ్చి కష్టాల్లో పడింది. అటు తర్వాత రాష్ట్రంలో క్రమేపీ హిందీ వ్యతిరేక, మరాఠీ ఆత్మగౌరవ ఉద్యమం బలపడు తుండటాన్ని గమనించి గత్యంతరం లేక దాన్ని వెనక్కు తీసుకుంది. కానీ ఇలా వచ్చి, అలా పోయిన ఆ జీవో చేసిన చేటు అంతా ఇంతా కాదు. రక్త సంబంధాన్ని కూడా బేఖాతరు చేసి గత రెండు దశాబ్దాలుగా పరస్పరం కత్తులు నూరుకుంటున్న రెండు దాయాది వర్గాలను అది ఏకం చేసింది. మహాయుతికి రాజకీయంగా తగని తలనొప్పి తెచ్చిపెట్టింది. బాల్ ఠాక్రే వున్న రోజుల్లోనే అన్న దమ్ముల పిల్లలైన రాజ్ ఠాక్రే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కయ్యానికి దిగారు. వీరిలో ఉద్ధవ్, బాల్ ఠాక్రే కుమారుడు. శివసేనపై ఎవరి ఆధిపత్యం ఉండాలన్న అంశంలో అన్నదమ్ములు తగువు పడ్డారు. అవసాన దశలో బాల్ ఠాక్రే రాజీకి ఎంతగానో ప్రయత్నించినా ఇద్దరికిద్దరూ పట్టుదలకు పోయారు. చివరకు 2005లో ఉద్ధవ్‌ను బాల్ ఠాక్రే తన వారసుడిగా ప్రకటించటంతో శివసేన నుంచి రాజ్ నిష్క్రమించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరిట పార్టీ స్థాపించారు. మధ్యలో ఒకటి రెండుసార్లు కుటుంబీకంగా కలిసిన సందర్భాలుండొచ్చుగానీ ఒకే వేదికను పంచు కున్నది లేదు. రాజకీయాల్లో కలిసి పనిచేస్తామని చెప్పింది లేదు. కానీ ఆ పని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేయగలిగారు. తప్పనిసరి హిందీ జీవోతో వారిని సన్నిహితం చేశారు. బీజేపీకి అధికారమే పరమావధి కాదు. దాని ఎజెండా దానికుంది. దేశవ్యాప్తంగా ఎప్పటికైనా హిందీని జాతీయ స్థాయిలో అధికార భాష చేసి తీరాలన్న సంకల్పం అందులో ఒకటి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలైనా ఇవ్వొచ్చుగానీ హిందీకి ప్రాముఖ్యమీయటం దాని ప్రచ్ఛన్న సంకల్పం. ఈమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లిష్ మాట్లాడేవారంతా సిగ్గుపడే రోజొకటి వస్తుందని ప్రకటించటం యాదృచ్ఛికం కాదు. ఆ మాటెలావున్నా బీజేపీకీ, ఠాక్రే సోదరులకూ రెండు అంశాల్లో ఏకీభావం వుంది. అవి ఒకటి – హిందూ, రెండు – హిందూస్తాన్. కానీ హిందీ విషయంలోనే ఆ సోదరులకు బీజేపీతో పేచీ. అధికార పంపకం సమస్య సరేసరి. ఏదేమైనా అసాధ్య మనుకున్నది జరిగిపోయింది. సోదరులిద్దరూ ఏకమయ్యారు. హిందీ జీవోను వెనక్కి తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజ్ ఠాక్రే భవిష్యత్తు కార్యాచరణ గురించి చెప్పటానికి కొంత మొహమాట పడ్డారుగానీ ఉద్ధవ్ ఠాక్రే నేరుగా చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందని ప్రకటించారు. బాల్ ఠాక్రే కాలంలో ముంబైలో శివసేన తిరుగులేని పక్షంగా ఉండేది. తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలన్నది ఉద్ధవ్ ఉద్దేశం. కానీ అదంత సులభమేమీ కాదు. నాయకులిద్దరూ కలిసినంత మాత్రాన శ్రేణులు అంత తేలిగ్గా ఏకమవుతాయా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే గత ఇరవైయ్యేళ్లుగా ఆ పార్టీల మధ్య దాయాది పోరు నడుస్తోంది. అదీగాక ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో ఇప్ప టికే మహావికాస్ అఘాదీ(ఎంవీఏ)లో భాగస్వామిగా ఉంది. సోదరులిద్దరూ ఏకమైతే ఎంవీఏ కూటమి అయోమయంలో పడుతుంది. ఉద్ధవ్ ఆ రెండు పార్టీలతో కలిసి ప్రయాణించగలుగు తున్నారు. కానీ రాజ్ అందుకు సిద్ధపడతారా లేక వారిద్దరూ కలిసి ఇక ఎంవీఏ కథ ముగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఈ కలయిక రాజకీయాల్లో ఒక కొత్త దూకుడును ప్రవేశపెట్టింది. ముంబైలో బతకడానికొచ్చినవారు మరాఠీ నేర్చుకు తీరాలని విజయోత్సవ ర్యాలీలో రాజ్ ప్రకటించారు. ఇక శ్రేణులు రెచ్చిపోవటంలో వింతేముంది? నిజానికి ఆ ప్రకటనకు ముందే ముంబైలో ప్రముఖ ఇన్వెస్టర్ సుశీల్ కేడియా ‘మరాఠీ నేర్చుకొనేది లేదం’టూ ట్విటర్లో ప్రకటించాక ఈ నెల 3న ఎంఎన్ఎస్ శ్రేణులు ఆయన కార్యాలయంపైబడి విధ్వంసానికి పూనుకున్నాయి. దీన్ని రాజ్ ఖండించకపోగా ‘మరాఠీ మాట్లాడనంత మాత్రాన ఎవరినీ కొట్టనవసరం లేదు. కానీ అనవసర డ్రామాకు దిగేవారి కర్ణభేరికి కింద తగిలేలా కొట్టండ’ని పిలుపునిచ్చారు.భాషాధిపత్యం తగువు ఈనాటిది కాదు. దేశానికి జాతీయ భాష అవసరమనీ, అది హిందీ అయితీరాలనీ జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ నేతలు వాదించారు. వారిపై వినాయక్ దామోదర్ సావర్కర్, ఆరెస్సెస్‌ల ప్రభావం ఉంది. కానీ తమిళనాడు ద్రవిడ ఉద్యమ నాయకులతోపాటు ప్రఖ్యాత తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి వారు హిందీ వ్యతిరేకతను చాటారు. స్వాతంత్య్రం వచ్చాక హిందీని జాతీయ భాషగా చేయబోమని హామీ ఇస్తేనే కాంగ్రెస్‌తో కలిసి నడ వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్డీయే పాలకులు మాత్రమే కాదు... యూపీఏ ఏలు బడిలో సైతం హిందీ ఆధిపత్యాన్ని నిలపాలని శతధా ప్రయత్నించారు. దక్షిణాదిన అందుకు ప్రతిఘటన వస్తూనే ఉంది. భాషా సంస్కృతులు సున్నితమైనవి. ప్రజామోదం లేకుండా వాటి జోలికి పోకపోవటం ఉత్తమం. ప్రస్తుతానికి రాజకీయంగా అయోమయంలో ఉన్న ఠాక్రే సోదరులకు మరో ఆర్నెల్లలో జరగబోయే స్థానిక ఎన్నికలకు హిందీ జీవో అందివచ్చిందన్నది వాస్తవం. ప్రజల మనోభావాల్ని బేఖాతరు చేస్తే అధికార కూటమికి చేటు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. -
ప్రతీ ఏడాది అక్టోబర్ 3న మరాఠీ భాషా దినోత్సవం, ఆదేశాలు
ముంబై: గత ఏడాది మరాఠీకి శాస్త్రీయ భాష హోదా లభించిన నేపథ్యంలో ఇకపై ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న ’శాస్త్రీయ మరాఠీ భాషా దినోత్సవం’గా జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, అక్టోబర్ 3 నుంచి 9 వరకు ప్రతి సంవత్సరం ’శాస్త్రీయ మరాఠీ భాషా వారోత్సవాలు’జరపాలని పేర్కొంటూ తీర్మానాన్ని విడుదల చేసింది. ప్రాచీన మరాఠీ భాషా, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలపై అవగాహన పెంపొందించడం, వాటిని సంరక్షించడమే ఈ తీర్మానం లక్ష్యమని పేర్కొంది. ఈ తీర్మాననుసరించి నిర్దేశిత వారంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఈ తీర్మానాన్న నుసరించి భాషా సంరక్షణకు సంబంధించి ఉపన్యా సాలు, సెమినార్లు, పురాతన గ్రంథాలు, శాసనాల ప్రదర్శనలు, క్విజ్లు, వ్యాస పోటీలు, ఇతర విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. పురాతన రచనల డిజిటలైజేషన్, శాస్త్రీయ గ్రంథాలను ఆధునిక మరాఠీలోకి అనువదించడం , భాషా సంరక్షణ పద్ధతులపై డాక్యుమెంటరీల ప్రదర్శనల వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిఉంటుంది. అరుదైన లిఖిత ప్రతులు, పురాతన రాగి ఫలక శాసనాల ప్రదర్శనలు విద్యార్థులు, ప్రజలను మరాఠీ భాష, సంప్రదాయంతో అనుసంధానించేందుకు ఎంతోగానో తోడ్పడతాయని జీఆర్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను మరాఠీ భాషా కమిటీలకు అధిపతులుగా నియమించారు. వీరు కార్యక్రమాల ప్రణాళిక రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించాల్సి ఉంటుందని కోరారు. ప్రత్యేక వారంలో నిర్వహించిన కార్యకలాపాల వివరణాత్మక నివేదికలను అక్టోబర్ 31 నాటికి లాంగ్వేజ్ డైరెక్టరేట్‌కు సమరి్పంచాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందుకవసరమైన ఖర్చును సంబంధిత విభాగాలు, కార్యాలయాల సాధారణ బడ్జెట్ నుంచి కేటాయిస్తామని తెలిపింది. -
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. పోలీసులు అదుపులో ఎంఎన్ఎస్ కార్యకర్తలు
థానే: మహారాష్ట్రలో భాషా వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్రంలోని థానేలో చోటుచేసుకున్న ఒక బాషా వివాదంపై రాజ్‌థాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు థానేలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఎన్ఎస్ పార్టీకి నిరసన తెలిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ, వారు కేటాయించిన మార్గంలో కాకుండా మరో రహదారిలో నిరసన తెలుపుతున్నందున వారిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ సమయంలో నిరసనల్లో పాల్గొన్న ఎంఎస్ఎన్ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ప్రజల మార్చ్‌కు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎంఎస్ఎన్కు నిరసన ప్రదర్శనలకు ఒక నిర్ధిష్ట మార్గాన్ని కేటాయించారని, అయితే అది కాదని, వారు వేరే మార్గంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి మార్చ్‌ను అడ్డుకున్నారని వివరించారు.మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు దుకాణ యజమానిపై ఇటీవల ఎంఎన్ఎస్ కార్యకర్తలు చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా వ్యాపారుల నిర్వహించిన ఆందోళనను తిప్పికొట్టేందుకు ఎంఎన్ఎస్ ఈ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఎంఎస్ఎస్ కార్యకర్తల నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ మీరా రోడ్దులో వ్యాపారులు మార్చ్ నిర్వహించారని, తమకు ఇదే ప్రాంతంలో నిరసన నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఇక్కడ తమకు మార్చ్‌కు అనుమతించే వరకు విశ్రమించేది లేదని ఎంఎన్ఎస్ ముంబై అధ్యక్షుడు సందీప్ దేశ్‌పాండే పేర్కొన్నారు.ఇటీవల మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఒక దుకాణ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన దరిమిలా వ్యాపారులు నిరసన చేపట్టారు. దీనిని ఖండిస్తూ ఈరోజు(మంగళవారం) ఎంఎన్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే దీనికిముందు స్థానిక ఎంఎన్ఎస్ నేత అవినాష్ జాదవ్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా రాష్టంలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాషా వివాదాన్ని మరింతగా పెంచాయి. ప్రతిపక్షాలతో పాటు వివిధ భాషా సంఘాల నుండి వ్యతిరేకత వచ్చిన దరిమిలా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
Maharashtra: బాల్ థాక్రే పాత వీడియో వైరల్.. ‘హిందీ’పై ఏమన్నారు?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒకటి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ హిందీని తప్పనిసరి చేస్తామని ప్రకటించిన దరిమిలా మరాఠీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలన్న ప్రణాళికను.. బాల్‌థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రే, అతని సోదరుడు (బాల్‌థాక్రే అన్న కుమారుడు) రాజ్ థాక్రేలు ఒకే వేదికపై చేరి, తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషంగా మారింది. ఆ వీడియోలో భుజంపై కాషాయ శాలువా ధరించిన బాల్‌థాక్రే ‘నేను మరాఠీ వాడినే కావచ్చు.. కానీ భారతదేశంలోని హిందువును’ అని పేర్కొనడాన్ని గమనించవచ్చు. అలాగే బాషా గుర్తింపుల కన్నా హిందుత్వాన్ని స్వీకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. "I may be Marathi in Maharashtra but I am Hindu in Bharat. We must embrace Hindutva over linguistic identities"Balasaheb Thackeray pic.twitter.com/KRrMVkGpYc— Kashmiri Hindu (@BattaKashmiri) July 5, 2025రెండు దశాబ్దాలుగా విబేధాలతో రగిలిపోతున్న ఉద్ధవ్, రాజ్ ముంబైలో ఒక వేదికపై చేరి, రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీ అనంతరం సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ వీడియో ప్రత్యక్షమై వైరల్‌గా మారింది. కాగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హిందీని తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టే ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉద్ధవ్, రాజ్‌లు తమ ర్యాలీలో నినదించారు.తండ్రి రాజకీయ సిద్ధాంతానికి వారసునిగా గుర్తింపు పొందిన ఉద్ధవ్ థాక్రే కొంతకాలంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంపై పోరాడుతున్నారు. రాజ్, తాను కలిసి ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఇదే సమయంలో రాజ్ థాక్రే తన సోదరునికి మద్దతు పలుకుతూ, బీజేపీ ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేయడాన్ని తాము అనుమతించబోమని, ఈ ఉద్యమానికి మరాఠీ జనాభా ఐక్యంగా మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: ‘మహా’తీరంలో పాక్ నౌక?.. అంతటా హై అలర్ట్ -
పృథ్వీ షా సంచలన నిర్ణయం
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెటర్‌గా తనకు గుర్తింపునిచ్చిన ముంబైతో బంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి (2025-26) దేశవాలీ సీజన్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. షా ఇటీవలే NOC (No Objection Certificate) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, తాజాగా అది జారీ అయ్యింది. PRITHVI SHAW JOINS MAHARASHTRA...!!!!- Waiting for Ruturaj × Shaw opening. 💛 pic.twitter.com/UPT4qF9mYv— Johns. (@CricCrazyJohns) July 7, 2025షా క్రమశిక్షణారాహిత్యం కారణంగా గత సీజన్లో ముంబై రంజీ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే డిసెంబర్ 14న జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో మాత్రం ఆడాడు. ఆ మ్యాచ్ షా రాణించనప్పటికీ ముంబై ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. ఇదే షాకు ముంబై తరఫున ఆఖరి మ్యాచ్.షా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు (MCA) రాసిన లేఖలో ఇలా పేర్కొన్నాడు. MCA క్రికెటర్‌గా తనకు జన్మనిచ్చిందని అన్నాడు. MCA తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపాడు. మహారాష్ట్రకు ఆడే ఆశాజనకమైన అవకాశాన్ని కాదనుకోలేకపోయానని తెలిపాడు. ఈ మార్పును (ముంబై నుంచి మహారాష్ట్రకు) తన క్రికెట్ ప్రయాణంలో ముందడుగుగా అభివర్ణించాడు. ఇది తన అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతున్నానని అన్నాడు.25 ఏళ్ల పృథ్వీ షా కెరీర్ హీన దశలో ఉన్నప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై తరఫున అవకాశాలు దాదాపుగా కనుమరుగు కావడంతో ఈ సాహసం చేశాడు. సహజంగా క్రికెటర్లకు ముంబై తరఫున ఆడుతుంటేనే జాతీయ జట్టులో అవకాశాలు వస్తుంటాయి. అలాంటిది షా ముంబైని వీడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేసి భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. వివాదాలు, ఫిట్నెస్, పేలవ ఫామ్ కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు.ఇవే కారణాలుగా అతను దేశవాలీ జట్టులోనూ చోటు కోల్పోయాడు. షాను తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. షా కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ దశలో అతను ముంబైని వీడి మహారాష్ట్రకు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. షా తదుపరి దేశవాలీ సీజన్లో మరో టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆడతాడు. రుతురాజ్ మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అన్నీ కుదిరితే షా, రుతురాజ్ మహారాష్ట్ర తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. -
Mumbai:‘మెట్రో’లో జనం కిటకిట.. తొక్కిసలాట భయంలో..
మహారాష్ట్రలోని ముంబై మెట్రోలో సోమవారం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ముంబై మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందున ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వెర్సోవా ఘట్కోపర్ లైన్ వన్‌లో మెట్రో రాకపోకల్లో జాప్యం జరుగుతున్నదన్నారు. Crazy commuter woes thanks to 1 service withdrawn tech issues with mumbai metro line 1 Stampede like situation in ghatkopar station@Dev_Fadnavis @CMOMaharashtra act fast before lives are lost Line 1 needs 6 bogie rakes & 3 times current rakes@MandarSawant184@BHiren@impuni… pic.twitter.com/bn0ujkJhBT— ANDHERI LOKHANDWALA OSHIWARA CITIZEN'S ASSOCIATION (@AndheriLOCA) July 7, 2025ప్రయాణికుల విపరీతమైన రద్దీ కారణంగా ఘాట్కోపర్ స్టేషన్లో తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడిందని, త్వరగా చర్యలు తీసుకోవాలని ఒక యూజర్ ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మెట్రో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ముంబై మెట్రో రద్దీపై సోషల్ మీడియా యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈరోజు ఆఫీసుకు వెళ్లలేమని, వర్క్ ఫ్రమ్‌హోమ్ కావాలని బాస్‌లకు మెసేజ్ పెట్టామని తెలిపారు. ప్రభుత్వం ముంబైలోని రైలు సేవలపై దృష్టి సారించాలని పలువురు కోరారు. -
తీరంలో అనుమానాస్పద బోటు.. మహారాష్ట్రలో హైఅలర్ట్
-
‘మహా’తీరంలో పాక్ నౌక?.. అంతటా హై అలర్ట్
ముంబై: మహారాష్ట్ర తీరంలో కలకలం చెలరేగింది. భారత నావికాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించగా, అది పాకిస్తాన్ ఫిషింగ్ నౌక అయివుండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవ్‌దండా తీరం సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించిన దరిమిలా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ తీరం వెంబడి భద్రతను మరింతగా పెంచారు.తీరం వెంబడి పోలీసు దళాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా రాయగఢ్ జిల్లాలో భద్రతను పెంచారని ఒక అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారత నావికాదళ రాడార్ రెవ్‌దండాలోని కొర్లై తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానస్పద నౌకను గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు, సముద్రతీర భద్రతా సిబ్బంది ఆ నౌక కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ), బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అనుమానాస్పద నౌక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఫీ) అంచల్ దలాల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు తీరానికి చేరుకున్నారు. ఆ నౌకను చేరుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవను గుర్తించి, దానిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. -
ముఠా నేత భార్యతో సభ్యుడు.. వెంటాడిన 40 మంది గ్యాంగ్స్టర్లు..
నాగపూర్: గ్యాంగ్స్టర్లు ప్రధాన పాత్రల్లో కనిపించే సినిమాను తలపించే ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది... గ్యాంగ్ నాయకుని భార్యతో అదే గ్యాంగ్‌లోని సభ్యుడు అఫైర్ నడిపితే.. ఆ విషయం గ్యాంగ్‌లోని అందరికీ తెలిస్తే.. ఇంతలో ఆ గ్యాంగ్ నాయకుని భార్య అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే... ఈ సీన్లన్నీ నిజంగా జరిగినవే.. మరి పర్యవసానం ఏమయ్యిందనే విషయానికొస్తే..మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇప్పా గ్యాంగ్‌లోని 40 మంది సభ్యులు నగరంతో పాటు, కాంప్టీ శివారు ప్రాంతాల్లో తిరుగుతూ, తమ గ్యాంగులోని సభ్యుడైన అర్షద్ టోపీని అంతమెందించాలని నిర్ణయించుకున్నారు. తమ గ్యాంగ్ లీడర్ భార్య మరణించాక.. వారంతా అర్షద్ టోపీని వెదుకుతున్నారు. అర్షద్ టోపీ ఆ పేరుమోసిన ముఠా నాయకుని భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరూ ఒక బైక్ వెళుతుండగా, ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ విషయం ముఠాలోని సభ్యులందరికీ తెలిసింది. గురువారం అర్షద్ టోపీ ఆ మహిళతో బయటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నాగ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అర్షద్ టోపీతో పాటు ఆ మహిళ బైక్‌పై ప్రయాణిస్తుండగా, వారి వాహనం జేసీబీని ఢీకొంది. అర్షద్ టోపీ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. కోరాడి థర్మల్ ప్లాంట్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఆ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో, ఆమెను కాంప్టీలోని మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమెకు చికిత్స అందించేందుకు నిరాకరించారు.ఎట్టకేలకు ఆమెను అర్షద్ టోపీ నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ వార్త తెలియగానే ఇప్పా గ్యాంగ్ సభ్యులు అర్షద్ టోపీని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ముఠా నాయకుని భార్యను అర్షద్ టోపీని హత్య చేసివుండవచ్చని ఇప్పా గ్యాంగ్ సభ్యులు భావిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా తన ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన అర్షద్ టోపీ పార్డిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కార్యాలయానికి రక్షణ కోరుతూ వెళ్లాడు. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న డీఎస్పీ అతనిని కొరాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఒక అధికారి తెలిపారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఆ మహిళ ప్రమాదంలో మరణించిందా? లేక హత్యకు గురైందా అనేదానిపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.ఇది కూడా చదవండి: ‘దళితులంటే అంత చులకనా? ‘జగద్గురువు’పై శశి థరూర్ విశ్లేషణ -
సంపద కొందరి వద్దే.. పేదల సంగతేంటి?: గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: దేశంలో పేదల సంఖ్య ఏటికేడు పెరుగుతూ పోతుండగా, సంపద మాత్రం కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల వద్దే కేంద్రీకృతం అవుతోందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటిది జరగరాదంటే సంపద వికేంద్రీకృతం కావాల్సిన అవసరముందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పారు.నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి గడ్కరీ వివిధ సామాజిక అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేశారేగాని, సంపద కేంద్రీకరణను ఆపే చర్యలను మాత్రం తీసుకోలేదని గడ్కరీ తెలిపారు. జీడీపీలో ఉత్పత్తి రంగం వాటా 22–24 శాతం, సేవా రంగం 52–54 శాతం వాటా కాగా, గ్రామీణ జనాభాలోని 65–70 శాతం మంది పాల్గొనే వ్యవసాయ రంగం వాటా కేవలం 12 శాతం మాత్రమేనని ఆయన వివరించారు.ఈ అసమతుల్యతను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు ఆర్థిక రంగానికి చార్టెర్డ్ అకౌంటెంట్ల అవసరం ఎంతో ఉందని, వారు చోదకశక్తుల వంటివారని అభివర్ణించారు. రోడ్ల నిర్మాణం కోసం బీవోటీ(బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్)విధానాన్ని అమల్లోకి తెచ్చిన వారిలో తానూ ఉన్నానంటూ గడ్కరీ..ఇప్పుడిక రోడ్ల అభివృద్ధికి నిధుల కొరతనేదే లేదని వివరించారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల నుంచి ఏడాదికి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే రెండేళ్లలో ఇది రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుందన్నారు. -
పుష్ప సినిమా నేనూ చూశా.. గడ్డం ఉంటే డైలాగూ కొట్టేవాడిని!
శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రే(Uddhav Thackeray) భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం ముంబై వేదికగా జరిగిన శివసేన-ఎంఎన్ఎస్ కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. అదే సమయంలో పుష్ఫ సినిమాలోని డైలాగులను ఆయన తన ప్రసంగంలో రిఫరెన్స్‌లుగా వాడారు.ముంబై: సుమారు 20 ఏళ్ల తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాక్రేతో కలిసి రాజకీయ వేదిక పంచుకున్న ఉద్దవ్ థాక్రే.. భావోద్వేగానికి గురయ్యారు. శనివారం ముంబైలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆవాజ్ మరాఠీచా కార్యక్రమం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. రాజ్ అద్భుతంగా మాట్లాడాడు. ఇంక నేనేం మాట్లాడక్కర్లేదనుకుంటున్న. ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా. మా మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఇక్కడికి వచ్చాం. అధికారం రావొచ్చు.. పోవొచ్చు. కానీ, కలిసి ఉంటేనే బలం అని చాటి చెప్పడానికి వచ్చాం. ఒక్కటి కలిసి ఉండేందుకు మేం ఒక్కటయ్యాం. ఇక మీదట కలిసి కట్టుగా ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర బడులలో బలవంతంగా హిందీని ప్రవేశపెట్టనివ్వబోం’’ అని ఉద్దవ్ అన్నారు.పుష్ప సినిమా నేనూ చూశా. నాకు కూడా అందులో హీరోలా గడ్డం ఉండి ఉంటే.. తగ్గేదేలే అని డైలాగ్ కొట్టేవాడిని అని ఉద్ధవ్ ఉన్నారు. దీంతో అక్కడున్న ఇరుపార్టీల కార్యకర్తలు విజిల్స్ వేశారు. మరాఠీ భాషను రక్షించేందుకు తామిద్దరం ఐక్యమైనట్లు ప్రకటించిన ఉద్దవ్.. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు చాలా ఉందన్నట్లు ఆయన చెప్పారు.పుష్ఫ సినిమాలో హీరో తగ్గేదేలే అన్నాడు. కానీ, ఇక్కడి ఓ ద్రోహి(ఏకనాథ్ షిండేను పరోక్షంగా ఉద్దేశించి) మాత్రం ‘దమ్ము ధైర్యం ఏమాత్రం లే’ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఆ ద్రోహికి సొంత ఆలోచనలు లేవు. కేవలం తన బాస్ వచ్చాడు కాబట్టి ఆయన్ని మెప్పించడానికే ‘జై గుజరాత్’ అన్నాడు. అలాంటోడు మహారాష్ట్రకు, మరాఠీ భాషకు ఏం గౌరవం ఇచ్చినట్లు? అని ఉద్దవ్ మండిపడ్డారు. Mumbai, Maharashtra: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "Gaddar (Eknath Shinde) said ‘Jai Gujarat’ just like the actor in the movie Pushpa says ‘Jhukega nahi s*la’; but this Gaddar follows ‘Uthega nahi s*la’. He doesn’t have his own thoughts. His boss came, so to please… pic.twitter.com/s7N4a0bog0— IANS (@ians_india) July 5, 2025మరాఠీలో మాట్లాడలేదని ఓ షాపు అతనిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మరాఠీ భాష పేరుతో చేసే గుండాగిరిని సహించేది లేదని సీఎం ఫడ్నవిస్ అన్నారు. అయితే.. ఈ వ్యవహారంలో తామూ గూండాలేమేనని, మరాఠా ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ గుండాగిరి ఇలాగే కొనసాగుతుందని ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ఫ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు, అందులోని డైలాగులు.. హీరో మేనరిజానికి బాగా అడిక్ట్ అయ్యారు. అందుకే మొదటి భాగం రిలీజ్ అయ్యాక.. అందులోని డైలాగులను పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు వాడుకున్నాయి. పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్‌ను బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగించింది. -
ఫడ్నవిస్ వల్లే మేం ఇలా! ఇక ఒక్కటిగానే..: థాక్రే సోదరుల ప్రకటన
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే మళ్లీ ఏకతాటిపైకి వచ్చారు. ఒక్కటిగా ఉంటాం.. ఇక ఒక్కటిగానే ముందు సాగుతాం అంటూ ఇద్దరు సోదరులు సంయుక్త ప్రకటన చేశారు.శనివారం హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ జరిగిన అవాజ్ మరాథిచా కార్యక్రమం.. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ అపూర్వ కలయికకు వేదికైంది. ఈ సందర్భంగా జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా హిందీని మహారాష్ట్రలో ప్రవేశపెట్టనివ్వబోమని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఈ ఇద్దరూ అల్టిమేటం జారీ చేశారు.బాల్ థాక్రే వల్ల కూడా కాలేదు..మా ఇద్దరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని శివసేన వ్యవస్థాపకులు బాల్‌థాక్రే ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆయన వల్ల కాలేదు. అది ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వల్ల అయ్యింది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. మా మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టాం అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే ప్రకటించారు.మహారాష్ట్రలో ప్రాథమిక పాఠశాలలో హిందీ తప్పనిసరిని చేస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే హిందీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్లు సంయుక్తంగా ఈ సభను నిర్వహించాలనుకున్నాయి. ఈలోపు ఫడ్నవిస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీని కేవలం ఆప్షన్ భాషగానే ప్రకటించింది. దీంతో భారీ విజయంగా పేర్కొంటూ ఇరు పార్టీలు ఈ సభను ముంబైలో ఇవాళ నిర్వహించారు.మీకు చట్ట సభలో అధికారం ఉండొచ్చు. కానీ మా శక్తి రోడ్లపై ఉంది. త్రిభాషా విధానంతో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ, మరాఠా ప్రజల బలమైన ఐకమత్యం కారణంగానే ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దమ్ముంటే.. మహారాష్ట్రను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది అని రాజ్ థాక్రే వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు.. శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ థాక్రే ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహారాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేస్తామని ఇరువురు సంయుక్తంగా పని చేస్తామని ప్రకటించారు.రాజ్ థాక్రే చివరిసారిగా 2005లో ఉద్దవ్‌తో రాజకీయ వేదికను పంచుకున్నారు. అదే ఏడాది శివసేనను విడిచి ఎంఎన్ఎస్ను స్థాపించుకున్న సంగతి తెలిసిందే. महाराष्ट्राने मनात जपलेला सुवर्णक्षण...! pic.twitter.com/kugbSPx0JU— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) July 5, 2025శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్‌నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. -
కొత్త మలుపు తిరిగిన అత్యాచారం కేసు
పూణేలో ఇటీవల జరిగిన ‘అత్యాచార ఘటన’ కొత్త మలుపు తిరిగింది. ఓ డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారానికి ఒడిగట్టాడని, మళ్లీ వస్తా అని మెసేజ్ కూడా ఫోన్లో టైప్ చేశాడని అని యువతి చెప్పిందంతా అంతా తూచ్ అని పోలీసులు తేల్చేశారు. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి అత్యాచారానికి పాల్పడలేదని, ఇది తన ఫ్రెండ్‌తో కలిసి ఆ 22 ఏళ్ల యువతి ఆడిన కట్టుకథ అని పోలీసులు స్పష్టం చేశారు. పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు.పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ శుక్రవారం( జూలై 4వ తేదీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆమెకు అతను కొత్త వ్యక్తి కాదు. ఆ సెల్ఫీని సైతం ఆమె స్వయంగా తీసుకుంది. ఐ విల్ బీ బ్యాక్( నేను మళ్లీ వస్తా) అనే మెసేజ్‌ను కూడా ఆమె టైప్ చేసింది’ అని చెప్పారు.మరి ఆరోపణలు ఎందుకు చేసింది..? డెలివరీ బాయ్ పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఆమెకు ఎందుకు చెప్పిందనే దానిపైనే ఇప్పుడు పూర్తి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉందని, అయితే యువతి మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఇంతకీ యువతి ఫిర్యాదు ఏమిటంటే..!పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి సదరు యువతి నివాసం ఉంటోంది. ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడని. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడని పేర్కొంది. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లినట్లు, ఆ తర్వాత డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. -
‘మరాఠిని అవమానిస్తే ఉపేక్షించం’
ముంబై: ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ భాషకు సంబంధించి రగడ మొదలైంది. ఇప్పటికే త్రి భాషా పాలసీ తీర్మానాన్ని రద్దు చేయించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు మరాఠి భాషను ఎవరైనా అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపుతున్నాయి. . ఓ షాపు కీపర్ మరాఠి భాష మాట్లాడలేదనే కారణంతో అతనిపై ఓ వర్గం దాడికి దిగడంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఎవరూ కూడా ఈ తరహా దాడులు చేసి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూనే మరాఠీ భాషను మహారాష్ట్రలో ఉండేవారు ఎవరైనా అవమానిస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన కార్యకర్తలు పలువురి కలిసి ఓ స్టీట్ షాపు కీపర్‌పై దాడి చేశారు. సదరు షాప్ కీపర్ మరాఠీ మాట్లాడనందుకు, ఆ భాషా మాట్లాడటం ఏమైనా తప్పనిసరి చేశారా? అని ప్రశ్నించినందుకు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జరిగి ఒక రోజు తర్వాత ఆదిత్యా ఠాక్రే మాట్లాడారు. ఎవరైన మరాఠీ భాషను అవమానిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఎవరూ భౌతిక దాడులకు దిగవద్దని, మరాఠీ భాషన అవమానించే వారికి చట్టపరంగా బుద్ధి చెబుదామన్నారు.ఇప్పుడు దీనిపై అధికార బీజేపీకి ప్రతిసక్ష పార్టీలకు మహారాష్ట్రలో తీవ్ర రగడ జరుగుతోంది. మరాఠీ భాష మాట్లాడడం అనేది తప్పనిసరిక, కానీ ఇలా భాష మాట్లాడలేదని దాడులకు దిగి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం తగదని మహారాష్ట్ర మంత్రి,, శివసేన నాయకుడు యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. #WATCH | Mumbai | On a viral video of a shop owner in Thane assaulted for purportedly refusing to speak in Marathi, Maharashtra Minister Yogesh Kadam says, "In Maharashtra, you have to speak Marathi. If you don't know Marathi, your attitude shouldn't be that you won't speak… pic.twitter.com/kSXV1JekAn— ANI (@ANI) July 3, 2025 -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలను గమనించిన కర్నాటక కూడా ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)దేశవ్యాప్తంగా పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా దానిని తిరస్కరించింది. మహారాష్ట్ర సర్కారు ప్రాథమిక పాఠశాలలకు త్రిభాషా విధానాన్ని నిలిపివేసిన దరిమిలా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యావిధానంలో ద్విభాషా సూత్రానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య తాము ద్విభాషా విధానానికి అనుకూలంగా ఉన్నామని, తమ ప్రభుత్వం దీనికే కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భాషా విధానాలపై చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక పాఠశాలల్లో ప్రస్తుతమున్న విద్యావిధానంలో.. విద్యార్థులు ఐదవ తరగతి వరకు రెండు భాషలు నేర్చుకోవాలి. ఆరవ తరగతి నుండి హిందీని మూడవ భాషగా ప్రవేశపెడతారు. ఎనిమిదవ తరగతిలో విద్యార్థులకు కన్నడ, ఇంగ్లీష్ లేదా సంస్కృతంలలో ఏదో ఒక దానిని మొదటి భాషగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న పక్షంలో, వారికి కన్నడ మూడవ భాషగా తప్పనిసరి అవుతుంది.ఇది కూడా చదవండి: ‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం -
Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు
ముంబై: మహారాష్ట ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై వెనక్కు తగ్గింది. త్రిభాషా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేసే ప్రభుత్వ ప్రయత్నాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించిన దరిమిలా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలుపై ఒక కమిటీ సమగ్రంగా చర్చించనున్నదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘పాఠశాలల్లో వివిధ భాషలను ఏ ప్రమాణాల ప్రకారం అమలు చేయాలి? విద్యార్థులకు ఏ ఎంపికలు ఇవ్వాలి? అనేది నిర్ణయించేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది. దీనిపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎన్సీపీ (ఎస్పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అలాగే ఇంగ్లీషును అంగీకరించిన ఉద్ధవ్ థక్రే తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాన్న డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను ఉద్ధవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్ అన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు -
దిగొచ్చిన ‘మహా’ సర్కారు.. 'హిందీ తప్పనిసరి' తీర్మానం రద్దు
ముంబై: దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ‘త్రి భాషా విధానం’లో భాగంగా హిందీని తప్పనిసరి చేయాలనే అంశంపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఈ సెగ గట్టిగానే ఉండటంతో ఫడ్నవీస్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ త్రి భాషా విధానం పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. గత ఉద్ధవ్ ఠాక్రే సర్కారే దీనికి ఆమోదం తెలిపి, ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడంపై ఫడ్నవీస్ తప్పుబడుతున్నారు. మహారాష్ట్రలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని ఉద్ధవ్ సర్కార్ అప్పుడు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. త్రి భాషా విధానంపై శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నిరసన సెగ తీవ్రతరమైంది. హిందీని తప్పనిసరి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తీర్మానాన్ని వ్యతిరేకించాలని, దానికి సంబంధించిన తీర్మానం ప్రతులను చించి వేయాలని శివసేన(యూబీటీ) చీఫ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. దక్షిణ ముంబైలో జరిగే నిరసన కార్య క్రమానికి నేటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ పాలసీని రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
అంబేడ్కర్ ఆశయం ‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం’
నాగపూర్: దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఒక్కటే రాజ్యాంగం అమల్లో ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నిర్దేశించారని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఆయన ఆశయం ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో శనివారం ‘రాజ్యాంగ ప్రవేశిక ఉద్యానవనాన్ని’ జస్టిస్ గవాయ్ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు ఏకైక రాజ్యాంగం అనే అంబేడ్కర్ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని, అందుకే ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందని తెలిపారు. ఈ ఆర్టీకల్ రద్దును సమర్థించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సైతం ఉన్న సంగతి తెలిసిందే. ఆర్టీకల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు తమ ముందుకు వచ్చినప్పుడు అంబేడ్కర్ మాటలు గుర్తుచేసుకున్నానని జస్టిస్ గవాయ్ చెప్పారు. దేశానికి ఒక్కటే రాజ్యాంగం ఉండాలన్న అంబేడ్కర్ బాటను అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఐక్య భారత్ రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నట్లు అంబేడ్కర్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. యుద్ధాలు జరిగితే దేశం ఐక్యంగా ఉండలేదని, ముక్కలవుతుందని చాలామంది అనుమానించారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతోపాటు అన్ని రకాల సవాళ్లు సమర్థంగా ఎదుర్కోగల సత్తా రాజ్యాంగానికి ఉందని అంబేడ్కర్ బదులిచ్చారని పేర్కొన్నారు. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతోందో చూడాలని, ఎన్ని సవాళ్లు ఎదురైనా మన దేశం మాత్రం దృఢంగా, ఐక్యంగానే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప బహుమతులను రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ మనకు అందించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా రంగాల బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని వెల్లడించారు. కొలీజియంపై పదవీ విరమణ తర్వాత మాట్లాడుతా.. ముంబై: న్యాయమూర్తులకు పదోన్నతులు, నియామకాలు, కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలపై పదవీ విరమణ (ఈ ఏడాది నవంబర్ 24) చేసిన తర్వాత వివరంగా మాట్లాడతానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఇప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా ఆయా అంశాలపై ఎక్కువగా స్పందించలేనని పేర్కొన్నారు. మనం కోరుకున్నట్లుగా ఏదీ జరగదని న్యాయమూర్తులు, న్యాయవాద వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బాంబే హైకోర్టు బెంచ్ ఆధ్వర్యంలో జస్టిస్ గవాయ్‌ని తాజాగా సన్మానించారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ సంజయ్ వి.గంగాపూర్వాలాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కలేదని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ వి.గంగాపూర్వాలాను ఉద్దేశిస్తూ.. ‘‘సంజయ్ భాయ్.. సుప్రీంకోర్టుకు రాకపోవడం వల్ల మీరు నష్టపోయింది ఏమీ లేదు. సుప్రీంకోర్టే నష్టపోయింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియంలో సభ్యుడిగా చేరినప్పటి నుంచి ప్రతిభకే పట్టం కట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ ఆధారంగా న్యాయమూర్తులను నియమించడానికి తపన పడుతున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న ఉత్తమమైన ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా రావాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం కొలీజియంలోని సహచర సభ్యులను ఒప్పిస్తుంటానని అన్నారు. జడ్జీల నియామకం కోసం పేర్లను ఒకసారి షార్ట్‌లిస్టు చేసే సమయంలో వారి కులం, మతం, ప్రాంతం చూసే అలవాటు లేదని చెప్పారు. వారికి అర్హత ఉందా? లేదా? వారికి చట్టాలు తెలుసా? లేదా? అనేది మాత్రమే చూస్తామని స్పష్టంచేశారు. జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఇటీవల బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చారని, ఆయన తన పాత మిత్రుడేనని, గతంలో కలిసి పని చేశామని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. ఆయనకు పదోన్నతి కలి్పంచే విషయంలో ఆ స్నేహాన్ని పక్కనపెట్టి, అర్హతలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. -
20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం?
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. రాజకీయంగా తీవ్ర విభేదాలతో రెండు దశాబ్దాలపాటు దూరంగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే.. ఒకే వేదికను పంచుకోబోతుండడమే ఇందుక కారణం. ఈ బ్రదర్స్ రీయూనియన్పై ఇప్పుడు మరాఠానాట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద త్రిభాషా సూత్రం అమలులో భాగంగా.. పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విపక్షాలు జులై 5వ తేదీన నిరసనకు పిలుపు ఇచ్చాయి. ఈ కార్యక్రమానికి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేతలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ పోస్టులో శివసేన (యూబీటీ)ఎంపీ, ప్రతినిధి సంజయ్ రౌత్ తెలియజేశారు. తొలుత ఈ రెండు పార్టీలు ఈ అంశంపై వేర్వేరుగా నిరసనలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఇద్దరు నేతలు మరాఠీల ప్రయోజనం కోసం వేర్వేరు నిరసనలు నిర్వహించడం సముచితం కాదని గ్రహించి, నిరసన ప్రదర్శనలను సంయుక్తంగా నిర్వహించాలని ప్రతిపాదించారు. మహారాష్ట్ర సర్కారు మరాఠీ , ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతుల వరకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై పలు వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్‌నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగాయి.దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ ఒకే సమస్యపై రాజకీయ వేదికను పంచుకోవాలనుకోవడం.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇది తాత్కాలిక ఐక్యతా? లేక శివసేన పునఃఏకీకరణకు సంకేతమా?.. బీజేపీ రాజకీయంపై ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతోందో?.. అంటూ మహారాష్ట్రలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇది కూడా చదవండి: kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ -
వెండి కంచాల్లో విందు.. వివాదంలో బీజేపీ సర్కార్
ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై కొత్త వివాదం నెలకొంది. ప్రభుత్వం వృథా ఖర్చులపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ కార్యక్రమంలో అతిథులకు భారీ ఖర్చుతో వెండి పళ్లెంలో ఆహారం వడ్డించడం వివాదాస్పదంగా మారింది. అంత ఖర్చు చేసి వెండి ప్లేట్లలో వడ్డించాల్సిన అవసరమేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై వేదికగా పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం జరిగింది. ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అతిథులకు విలాసవంతమైన హోటల్లో వెండి ప్లేట్లలో, భారీ ఖర్చుతో భోజనం వడ్డించారు. దీంతో, ఈ ఘటన వివాదానికి దారి తీసింది. అతిథులు ఒక్కొక్కరికి రూ.550 చొప్పున అద్దెకు తీసుకున్న వెండి డిన్నర్ ప్లేట్లపై రూ.5,000 విలువైన భోజనం వడ్డించారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ శాసనసభా నాయకుడు విజయ్ వాడేట్టివార్స్ స్పందిస్తూ..‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఇంత ఖర్చు చేసి వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ఎందుకు?. విలాసవంతమైన విందు ఎందుకు ఇచ్చారు. దీని కోసం దాదాపు 27 లక్షలు ఖర్చు చేశారు. ఇదంతా వృథా ఖర్చే కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయలేదు. బోనస్‌లు చెల్లించడం లేదు. అనేక సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. కానీ, ఇలాంటి ఖర్చులు చేయడానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం వెనుకాడదు అంటూ చురకలు అంటించారు.While enjoying ₹4,500 meals served in silver platters with royal Peshwa-style flair, and staying in luxury hotels like Taj and Trident, members of the Estimates Committee proclaimed in the conference that,“Estimates Committees must ensure that every rupee is spent for public… pic.twitter.com/mMwjbCkWGv— Vijay Kumbhar (@VijayKumbhar62) June 25, 2025మరోవైపు.. ఈ సమావేశంపై సామాజిక కార్యకర్త కుంభార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన..‘రాజ పేష్వా శైలి వైభవంతో వెండి ప్లేట్లతో అతిథులకు భోజనం వడ్డించారు. తాజ్, ట్రైడెంట్ వంటి లగ్జరీ హోటళ్లలో అంచనాల కమిటీ సభ్యులు బస చేశారు. అంచనాల కమిటీ అంటే ప్రతీ రూపాయిని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం కోసం ఆలోచించాలి. కానీ, ఇలాంటి దుబారా ఖర్చులు చేయడమేంటి?. ఇలాంటి వారు.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. 5000 ఖర్చు చేసే భోజనం పెట్టి వెండి ప్లేట్ల కోసం 27 లక్షలు ఖర్చు చేశారు’ అని మండిపడ్డారు.అయితే, కాంగ్రెస్ నేతలు, పలువురు ఆరోపిస్తున్నట్టు అవి వెండి ప్లేట్లు కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం వెండి పూత మాత్రమే ప్లేట్లకు పూసి ఉందని అంటున్నారు. అలాగే, భోజనం ఖర్చు కూడా 5000 కాదని తక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు. -
ఓ తండ్రి దారుణం.. మార్కులే జీవితమా?
సాంగ్లీ: నీట్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి.. కూతురిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాంగ్లికి చెందిన 17 ఏళ్ల సాధన వైద్య జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాసింది. ఇటీవలే ఫలితాలు వచ్చాయి. సాధనకు తక్కువ మార్కులు రావడంతో ఆగ్రహించిన ధోండి రామ్ భోస్లే శుక్రవారం రాత్రి ఆమెను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి ప్రీతి భోస్లే.. స్థానిక ఆసుపత్రికి తరలించింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.అనంతరం, అక్కడ చికిత్స పొందుతూ సాధన మరణించింది. కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ప్రీతి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు.. ధోండి రామ్ భోస్లేను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూన్ 24 వరకు పోలీసు కస్టడీకి విధించారు. -
నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్‌గా
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్‌గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్‌కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. -
పృథ్వీ షా ఆడబోయేది ఈ జట్టుకే!.. సీఎస్కే స్టార్ సారథ్యంలో..
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన సొంత జట్టు మంబైని వీడాడు. దేశవాళీ క్రికెట్లో జట్టు మారాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అందుకు అంగీకరించింది. అతడు కోరినట్లుగానే నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసింది.పరస్పరం హుందా ప్రకటనలు‘‘ముంబై క్రికెట్ అసోసియేషన్ నాకు విలువైన అవకాశాలెన్నో ఇచ్చింది. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచింది. అందుకు అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఎంసీఏకు చెందిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం.ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. అయితే, జట్టు మారాలని నిర్ణయించుకున్నాను’’ అని పృథ్వీ షా ఎంసీఏకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన ఎంసీఏ.. ‘‘క్రికెటర్ పృథ్వీ షా.. ముంబైకి చెందిన ఈ ప్రొఫెషనల్ ఆటగాడు వచ్చే దేశవాళీ సీజన్లో ఇతర జట్టుకు ఆడేందుకు అనుమతించాలని నిరభ్యంతర పత్రం కోరాడు.అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఎంసీఏ ఎన్ఓసీ జారీ చేసింది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పృథ్వీ జట్టు ఆడబోయే కొత్త జట్టు ఇదేనంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా పృథ్వీ ఇకపై మహారాష్ట్ర జట్టుకు ఆడబోతున్నట్లు తెలిపింది.మహారాష్ట్రకు ఆడేందుకే నిర్ణయం!కాగా 25 ఏళ్ల పృథ్వీ షాకు రెండు- మూడు అసోసియేషన్ల నుంచి పిలుపు వచ్చినప్పటికీ.. మహారాష్ట్రకు ఆడేందుకే అతడు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. టీమిండియా ఓపెనర్లలో ఒకడైన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పృథ్వీ షా ఆడతాడు. కాగా మహారాష్ట్ర దేశీ జట్టును ముందుండి నడిపిస్తున్న రుతు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్న విషయం తెలిసిందే.కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డే, 2021లో టీ20లలోనూ అరంగేట్రం చేశాడు.ఓపెనర్‌గా ఆరంభంలో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత పృథ్వీ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇవే కారణాలతో ఎంసీఏ కూడా అతడిని కొన్నాళ్లు పక్కనపెట్టింది.ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మొత్తంగా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ షా.. ఆయా ఫార్మాట్లలో 339, 189, ఒక పరుగు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు సాధించాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
ముంబైని వీడిన పృథ్వీ షా
ముంబై: భారత క్రికెట్లో మెరుపులా వచ్చివెళ్లిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాజాగా ముంబై జట్టును వీడాడు. ఈ మేరకు మరో జట్టుతో ఆడేందుకు వీలుగా తనకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాల్సిందిగా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)ను అభ్యర్థించాడు. అతని క్రికెట్ భవిష్యత్తు కోసం పృథ్వీ షా అభ్యర్థనను మన్నించిన ముంబై సంఘం ఎన్ఓసీ జారీ చేసింది. ఇదివరకే మహారాష్ట్ర సంఘంతో సంప్రదింపులు జరిపిన అతను ఈ సీజన్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో టీమిండియా తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు. చివరిసారిగా ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ మాత్రమే ఆడాడు. అందులోనూ పెద్దగా మెరుపుల్లేకపోవడంతో ఎంసీఏ అతన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అలా ఓ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కళ్లు తెరిచిన పృథ్వీ షా ఈ సీజన్లో ముంబై తరఫున అవకాశం రాదని గుర్తించాడు. దీంతో మరో జట్టును సంప్రదించిన మీదట ఎన్ఓసీ కోసం ముంబై సంఘాన్ని కోరాడు. ఈ సందర్భంగా ఎంసీఏ కూడా హుందాగా వ్యవహరించి అతను తమ దేశవాళీ జట్టుకు అందించిన సేవల్ని కొనియాడింది. ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదప్ యువ క్రికెటర్ భవిష్యత్తులో రాణించాలని అభిలషించారు. దీనికి ప్రతిగా పృథ్వీ కూడా కృతజ్ఞత చాటుకున్నాడు. తనకెన్నో అవకాశాలచ్చిన ముంబై ద్వారానే నేను క్రికెట్‌కు పరిచయమయ్యానని చెప్పుకొచ్చాడు. ఏడాదిగా... ఖాళీగా... క్రికెట్లోకి వచ్చీరాగానే యువ కెరటంగా మారిన పృథ్వీ షా దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ సహా పలువురి మన్ననలు పొందాడు. ఎంత వేగంగా వెలిగాడో... కానీ ఆటపై కొరవడిన ఆసక్తి, ఫామ్‌పై అలసత్వం, క్రమశిక్షణ రాహిత్యం, ఫిట్నెస్ సమస్యలతో అంతే వేగంగా కుంగాడు. మొదట టీమిండియాకు ఎప్పుడో దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్‌కు భారమయ్యాడు. తాజాగా సొంత జట్టు ముంబైకి అవసరం లేకుండా పోయాడు. క్రమంగా ఏ జట్టు అక్కున చేర్చుకోలేకపోవడంతో పూర్తిగా ఏడాదికిపైగానే ఖాళీగా ఉంటున్నాడు. మితీమీరిన శరీర బరువుతో సతమతమవుతున్న పృథ్వీ షా ముంబై జట్టులో స్థానం కోల్పోయాక... ఇప్పుడు మహారాష్ట్ర పంచన చేరేందుకు సిద్ధమయ్యాడు. -
కుమార్తె ‘నీట్’ స్కోర్ తగ్గిందని.. విచక్షణ మరచి..
సాంగ్లి: మహారాష్ట్రంలో మరో విద్యాకుసుమం నేలరాలింది. సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కుమార్తెను డాక్టర్‌గా చూడాలనుకున్న ఒక తండ్రి చేసిన పని అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమార్తె మరణానికి ప్రధానోపాధ్యాయుడైన ఆ తండ్రే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మంచి మార్కులు సాధించలేదని తన 17 ఏళ్ల కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. సాంగ్లి జిల్లాలోని నెల్కరంజి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన విద్యార్ధినిని సాధన భోస్లేగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. సాధన తండ్రి ధోండిరామ్ భోస్లే కుమార్తె చదువుతున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు.కుమార్తె నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు సాధించడంతో ఆమెను తండ్రి మందలించారు. అయితే సాధన తండ్రితో వాగ్వాదానికి దిగింది. కుమార్తె మాటలు ధోండిరామ్ భోస్లేకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే ఆయన ఒక కర్రతో కుమార్తెపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన సాధనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, అలానే వదిలివేశాడు. మర్నాడు కూడా కుమార్తెను పట్టించుకోకుండా, యధావిధిగా తన స్కూలుకు వెళ్లిపోయాడు. ధోండిరామ్ భోస్లే పాఠశాల నుంచి తిరిగి వచ్చేసరికి, ఇంటిలో సాధన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స ప్రారంభించేలోపే సాధన మృతిచెందింది. పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్? -
క్లాస్‌రూంలో నిద్రపోయిన టీచర్..
-
క్లాస్‌రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వీడియో వైరల్
జాల్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ టీచర్ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు.మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలో ఉన్న మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. "మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అసలు సినిమా ముందుంది.. 2029 ఎన్నికల్లో తన పాత్రపై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 11 ఏళ్ల పాలనలో తన పాత్రపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జరిగింది న్యూస్‌రీల్ మాత్రమే, అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. అయితే, నాయకులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలని అంశాన్ని పార్టీయే చూసుకుంటుందని, పార్టీ నిర్ణయాన్ని అనుసరించి పనిచేస్తానని తెలిపారు.‘ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే. అసలైన సినిమా మొదలు కావాల్సి ఉంది’ అని గడ్కరీ శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనపై పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని గురించి ఎన్నడూ చెప్పుకోలేదని, విమానాశ్రయాలలో తనకు అట్టహాస స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మద్దతుదారులను ఎప్పుడూ కోరలేదని ఆయన నొక్కి చెప్పారు. విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న వ్యక్తిగత లక్ష్యం మేరకు పనిచేస్తున్నానన్నారు.రహదారుల అభివృద్ధి కంటే వ్యవసాయం, సామాజిక కార్యక్రమాలపైనే ఆసక్తి ఎక్కువని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి అయిన గడ్కరీ వివరించారు. తలసరి ఆదాయం లెక్కన మన దేశం టాప్ 10లో లేకపోవడానికి అధిక జనాభాయే కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే, జనాభా నియంత్రణకు బిల్లు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇది మతానికో, భాషకో సంబంధించిన అంశం కాదు. ఇది ఆర్థిక పరమైన అంశం. అభివృద్ధి ఎంత జరిగినా, ఫలాలు కనిపించడం లేదు. జనాభా అధికంగా పెరగడమే ఇందుకు కారణం’అని వివరించారు. -
పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్‌ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం
-
అత్యంత కాలుష్యరహిత హిల్‌స్టేషన్..! మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే...
నగర జీవనంలో కోల్పోతున్న ప్రశాంతతను పొందడానికి కాలుష్యరహితమైన స్వచ్ఛమైన వాతావరణంలో కొన్ని రోజులైనా సేదతీరడానికి మనకు ఉన్న ఏకైక మార్గం హిల్ స్టేషన్స్. అందుకే సందు దొరికితే చాలు దగ్గర్లోని హిల్ స్టేషన్స్‌కి ఛలో అంటుంటారు నగరవాసులు. అయితే అందరూ అదే బాట పట్టడం వల్లనే...ఇప్పుడు ఊటీ లాంటి ఎన్నో హిల్ స్టేషన్స్ టూరిస్టుల రద్దీతో వాహనాల రణగొణధ్వనులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఈ వేసవి సీజన్లో ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యకు పరిమితి కూడా విధించారంటే... పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. హిల్ స్టేషన్స్ కూడా మన మహానగరాల్లా మారిపోతున్న నేపధ్యంలో...ఏం చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే ఉన్న ఒక అత్యంత కాలుష్యరహిత హిల్ స్టేషన్.సహ్యాద్రి పర్వాతాల్లో...స్వచ్ఛంగా...మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండలలో కొలువుదీరింది మాథెరాన్ హిల్ స్టేషన్. ఇది ఆసియాలోనే వాహనాలు పూర్తిగా నిషిద్ధం అయిన ఒకే ఒక్క పర్వత నగరం. దీని వల్ల పూర్తి కాలుష్య రహితమైన మంచి గాలీ, నీరు, వాతావరణ పరిసరాలు మనకి నిజమైన సేదతీరిన అనుభూతిని కలిగిస్తాయి. భౌగోళికంగా దీని ఎత్తు సుమారు 800మీటర్లు (2,625 చ.అడుగులు) ఈ హిల్ స్టేషన్ ముంబైకు 90 కి.మీ., పూణేకు 120 కి.మీ.దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని 2003లో కేంద్ర పర్యావరణ శాఖ ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. కాబట్టి మాథెరాన్ లోపల వాహనాలు వినియోగం పూర్తిగా నిషిద్ధం. అయితే అత్యవసరమైన సేవలకు ఈ–రిక్షా , అంబులెన్స్‌లను మాత్రమే అనుమతిస్తారు.తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి?మాథెరాన్ హిల్ స్టేషన్ హైదరాబాద్ కు సుమారు 580 కిలోమీటర్ల దూరంలో ఉంది (రోడ్డు మార్గం ద్వారా). మీరు వెళ్లే మార్గం ప్రయాణ వాహనంపై ఆధారపడి దూరం కొంతమేర మారవచ్చు. రైలుమార్గాన్ని ఎంచుకుంటే.. హైదరాబాద్ నుంచి పుణే లేదా కార్జత్ / నెరల్ వరకు రైలు లో వెళ్లవచ్చు. నెరల్ స్టేషన్ నుంచి టాయ్ ట్రెయిన్ (అమన్ లాడ్జ్ – మాథెరాన్) ఎక్కవచ్చు. లేదా టాక్సీ/జీప్ తీసుకుని మాథెరాన్ ఎంట్రీ పాయింట్ వరకూ వెళ్లొచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుంచి పుణే – లోనావాలా– నెరల్ వెళ్లవచ్చు. ప్రయాణ సమయం అంటే ఎంచుకున్న వాహనాన్ని బట్టి సుమారు 12 నుంచి 14 గంటలు వరకూ పడుతుంది. వాయు మార్గం ద్వారా అనుకుంటే ముంబైకి విమానం లో ప్రయాణించి అక్కడి నుంచి రైలులో లేదా టాక్సీ ద్వారా నెరల్ చేరుకొని మాథెరాన్ కు వెళ్ళవచ్చు.పర్యాటకుల్ని చివరి పాయింట్ వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడ నుంచి టాయ్ ట్రైన్, గుర్రపు బగ్గీల ద్వారా హిల్స్టేషన్లోకి ప్రవేశించవచ్చు. వీలున్నంత వరకూ ఈ ప్రాంతంలో నడక ద్వారా మాత్రమే పర్యాటక స్థలాలు చూడడానికి ప్రయత్నిస్తే మరింత ఆరోగ్యకరమైన ఆక్సిజన్‌ను మనం అందుకోవచ్చు. అయితే హెరిటేజ్ టాయ్ ట్రెయిన్‌ను మాత్రం మిస్ అవ్వొద్దు. అమన్ లాడ్జ్ నుంచి మాథెరాన్ స్టేషన్ వరకూ ఈ ట్రైన్ ప్రయాణించడానికి సుమారు 20నిమిషాలు పడుతుంది. ఇది 1907లో నిర్మించబడిన హిల్ రైల్వే, ప్రస్తుతం యునెస్కో వారసత్వ స్టేటస్ పొందిన ప్రసిద్ధ పర్వత రైళ్ళలో ఒకటి. దాదాపు 30కిపైగా అందమైన, వైవిధ్యభరిత అనుభూతిని అందించే వ్యూ పాయింట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణ అలాగే ఈ ఊరిలో ఉండే ఇంగ్లీష్ కాలనీల ఆధునిక నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. మంచినీటి చెరువులు, పార్కులు, పచ్చదనం మనసును సేదతీరుస్తుంది.నెరెల్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 2గంటలకు పైగా ప్రయాణించే టాయ్ ట్రైన్ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇది లోకల్ ట్రైన్ అయిన హెరిటేజ్ టాయ్ ట్రైన్‌కు అదనం. అయితే ఈ ట్రైన్ ఏడాదిలో సగం రోజులు అంటే ముఖ్యంగా వర్షాకాలంలో అందుబాటులో ఉండదు. కాబట్టి. ఈ ట్రైన్‌ను ఆస్వాదించాలనుకుంటే నవంబరు తర్వాత మాత్రమే అది కూడా సమాచారం నిర్ధారించుకుని వెళ్లాలి.(చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్ జారీ చేసింది.ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి -
అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన ఆస్పత్రి..
ముంబై: అస్థవ్యస్థమైన ఆరోగ్య వ్యవస్థ అత ని కూతురు ప్రాణాలు తీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే బిడ్డ ప్రాణాలు పోయాయి. పసికందు శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి ఆస్ప త్రి వర్గాలు నిరాకరించాయి. కూతురు మృతదేహాన్ని సంచిలో వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజనుడు. జూన్ 12న నాసిక్ జిల్లాలో జరిగి న అత్యంత అమానవీయ ఘటన సోమవా రం వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్ జిల్లాలోని జోగల్వాడి కుగ్రామానికి చెందిన సఖారామ్ కవార్ భార్య అవిత జూన్ 11న ప్రసవ వేదనకు గురైంది. సమీపంలోని ఖోడాలా ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి అంబులెన్స్ దొరకలేదు. 108కు కాల్ చేస్తే స్పందన రాలేదు. ప్రైవేట్ వాహనంలో పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. గంటసేపు ఎదురుచూసినా డాక్టర్లు రాలేదు. సమీపంలోని మోఖడా గ్రా మీణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు లు నాసిక్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ అందుబాటులో లేక మళ్లీ ఆలస్యమైంది. జూన్11న అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి చేరుకుంది. తెల్లవారుజామున ఆమెకు చనిపోయిన ఆడ శిశువును ప్రసవించింది. ఆస్పత్రి జూన్ 12న శిశువు మృతదేహాన్ని సఖారామ్‌కు అప్పగించింది. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. బిడ్డను బట్టలో చుట్టుకుని, బస్టాండ్‌కు వెళ్లి.. రూ. 20 క్యారీ బ్యాగ్ కొనుక్కుని, అందులో పెట్టుకుని ఎమ్ఎస్ఆర్టీసీ బస్సులో దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏమి మోసుకెళ్తున్నావని ఆయనను ఎవరూ అడగలేదు. ఆ దుఃఖాన్ని ఆయన కూడా ఎవరితో పంచుకోలేదు. అదే రోజు శిశువును ఖననం చేసి.. జూన్ 13న మళ్లీ ఆస్పత్రిలో ఉన్న భార్యకోసం నాసిక్‌కు తిరిగి వచ్చాడు. ఈసారి కూడా అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. పచి్చబాలింత అయిన భార్యను.. బస్సులోనే ఇంటికి తీసుకెళ్లాడు. ‘ఆస్పత్రి ఉదాసీనత వల్ల నేను బిడ్డను కోల్పోయాను. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి బాధ ఎదురు కాకూడదు’అంటూ నిస్సహాయతతో కూడిన బాధతో చెప్పాడు సఖారామ్. -
ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన.. ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు
-
మొదలు నరికినా మొలకెత్తే చేవ!
పది రోజుల కింద ‘మహారాష్ట్ర అంగన్వాడీ కర్మచారి సంఘటన్ వర్సస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌరి గాడ్సే, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ఇచ్చిన మధ్యంతర ఆదేశానికి అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. ఆ ఆదేశం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పాటించవలసిన కనీస నిబంధనలను గుర్తు చేసింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ఉద్యో గానికి కనీసం పదకొండు సంవత్సరాలుగా నియామకాలు జరగలేదనే వాస్తవాన్ని బయట పెట్టింది. అది ఆ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగులు ఇరవై సంవత్సరాలకు పైగా పదోన్నతి లేకుండా కింది స్థాయి ఉద్యోగంలో కొనసాగుతున్నారని చూపింది. అన్నిటికీ మించి, అంగన్వాడీ కర్మచారి సంఘటన్ తరఫున ఈ కేసు వాదించి గెలిచిన న్యాయవాది ఎన్నో ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని, తన ప్రజా జీవనాన్నీ, తన న్యాయవాద వృత్తినీ ధ్వంసం చేయడానికి పాలకులు చేసిన ప్రయత్నాలను ధిక్కరించి, ప్రజా ప్రయోజన, కార్మిక సంక్షేమ కృషిలో మొక్కవోని దీక్షతో కొనసాగుతున్నారని చూపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్’(ఐసీడీఎస్)లో భాగమైన అంగన్వాడీ ముఖ్య సేవిక అనే పర్యవేక్షక ఉద్యోగ నియామకాల కోసం 2021 జూన్ 4న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మళ్లీ 2025 ఫిబ్రవరి 4న కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించే మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటికే ఆ ఉద్యోగం కన్నా కిందిస్థాయి సేవిక (వర్కర్) ఉద్యోగంలో పది సంవత్సరాలకు పైగా, కొన్ని సందర్భాలలోనైతే ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాలకు పైగా పని చేస్తున్న వారికి ఈ ముఖ్య సేవిక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంగన్వాడి సేవికల సంఘమైన మహారాష్ట్ర అంగన్ వాడీ కర్మచారి సంఘటన్ తమకు జరిగిన ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయదలచుకుంది. వారి తరఫున న్యాయవాది సుధా భరద్వాజ్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో వీరికి కూడా అవకాశం కల్పించేలా మార్పులు చేయాలని, ఈ మార్పులకు తగినట్టుగా గడువు తేదీలు మార్చాలని కోర్టు ఇప్పుడు మధ్యంతర ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశం మహారాష్ట్రలో ఎన్నో సంవత్స రాలుగా సేవికలుగా ఎదుగూ బొదుగూ లేకుండా పని చేస్తున్న వేలాదిమందికి ఒక ఆశాసూచిక. దేశంలో మొత్తంగా కొన సాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలలో ఈ మధ్యంతర తీర్పు ఒక చిన్న ఊరట. సుధా భరద్వాజ్ ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు ప్రధానంగా కార్మిక వ్యవహారాల న్యాయ వాదిగా, ఆ తర్వాత ఢిల్లీలో ఒక న్యాయ శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసిన వ్యక్తి. సుధా భరద్వాజ్ ప్రపంచ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త కృష్ణా భరద్వాజ్ కూతురు. అమెరికాలో పుట్టి, ఆమెరికన్ పౌరురాలిగా అక్కడే పదకొండేళ్ల వయసు దాకా ఉన్నారు. ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నప్పుడు అక్కడి అర్థశాస్త్ర శాఖను నిర్మించమని కృష్ణా భరద్వాజ్‌కు పిలుపు వెళ్లగా, సుధ కూడా తల్లితో పాటుఢిల్లీ వచ్చారు. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే స్వచ్ఛందంగా తన అమెరికన్ పౌరసత్వం వదులుకున్నారు. కాన్పూర్ ఐఐటీలో గణితశాస్త్రంలో ఎంఎస్ చేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ ఎస్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్,బిహార్, మధ్యప్రదేశ్గ్రామీణ పాంతాలకు, కార్మిక ప్రాంతాలకు వెళ్లి, కుల,వర్గ అసమాన తలను చూసి, ఆ పేద ప్రజల సేవలోనే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి మధ్యప్రదేశ్‌లో గని కార్మికులను సంఘటితం చేస్తున్న శంకర్ గుహ నియోగి ఆలోచనలతో, ఆచరణతో ప్రభావితమై తన ఇరవై ఐదవ ఏట, 1986లో అక్కడ కార్మికుల మధ్య పని చేయడానికి వెళ్లారు. అనేక సంఘాల్లో పని చేయడం ప్రారంభించారు. భిలాయిలో ఎక్కువగా నిరక్షరాస్యులైన కార్మికుల మధ్య, పేదల మధ్య పని చేస్తున్నప్పుడు, అక్కడ చదువు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఆమె ఆ కార్మికులకు, పేదలకు జరుగు తున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి, న్యాయస్థానా లలో కేసులు వేయడానికి ఎక్కువగా న్యాయవాదులను కలవ వలసి ఉండేది. పిటిషన్లు రాయవలసి ఉండేది. అటు వంటి పనులు చేస్తుండగా, ఆ కార్మికులు ‘మీరే ఎందుకు న్యాయవాది కాకూడదు’ అని ప్రోత్సహించడంతో, 2000 నాటికి తానే న్యాయవాదిగా మారారు. భూకబ్జాలకు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులనూ, ఆదివాసుల సామూహిక అటవీ హక్కులనూ, పర్యావర ణాన్నీ పరిరక్షించడానికి ఎన్నో కేసులు వాదించారు. ‘జన హిత’ అనే న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’లో పని చేశారు. ఇలా ఛత్తీస్‌గఢ్‌లో, ముఖ్యంగా బిలాస్పూర్ హైకో ర్టులో, ఇతర న్యాయస్థానాల్లో ఆదివాసుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం ఆమె చేస్తున్న విస్తారమైన పని, ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఆమె పనిని అడ్డుకోవ డానికి, వేధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర కొట్టి 2018 ఆగస్ట్ 28నఆమెను అరెస్టు చేసి భీమా కోరేగాం కేసులో నిందితురాలిగా చూపారు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత 2021 డిసెంబర్లో షరతులతో కూడిన బెయిల్ మీద ఆమె విడుదల య్యారు. ఆ షరతుల్లో ప్రధానమైనది, ‘ముంబయి వదిలి పోకూడదు’ అనేది. అందుకే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈఅంగన్వాడీ సేవికల కేసులో గణనీయమైన విజయం సాధించారు.వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ -
లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్‌కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్‌కు బిగ్ షాక్ తగిలింది. -
బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయం
చీకూ చింతా లేని మంచి బ్యాంకు ఉద్యోగం వదిలి ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలంటే చక్కటి ప్రణాళికతో పాటు గుండెలు నిండుగా ధైర్యం, పట్టుదల, లక్ష్యసాధనకు అవసరమైన వనరులను సమకూర్చుకొని గొప్ప ఫలితాలు సాధించే తెలివితేటలు ఉండాలి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సంకేత్ మెహతా (Sanket Mehta)కు అదృష్టవశాత్తూ ఇవన్నీ ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగం వదిలేసి రసాయనిక పురుగుమందుల అవసరం లేని ఆధునిక హైడ్రోపోనిక్ వ్యవసాయం (hydroponic farming) లోకి దిగారు. ఆరోగ్య దాయకమైన ఆహారం కోసం వెదుకుతూ పురుగుమందుల్లేని ఆహారోత్పత్తి వైపు దృష్టి సారించారు. పూర్తి ఆర్గానిక్ కాకపోయినా రసాయనిక పురుగు మందుల్లేకుండా హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో కూరగాయ, ఆకుకూర పంటలు పండించి విక్రయించటం ద్వారా మంచి ఆహారాన్ని అందిస్తున్నామన్న తృప్తితో పాటు మంచి ఆదాయం కూడా వస్తుందని సంకేత్ భావించారు. చాలా కాలం నుంచి తెలిసిన గణేష్ నికం అనే వ్యక్తితో కలిసి న్యూట్రిఫ్రెష్ (Nutrifresh) పేరిట స్టార్టప్‌ను ఆరేళ్ల క్రితం నెలకొల్పి చక్కని ఆదాయం పొందుతున్నారు. View this post on Instagram A post shared by Nutrifresh Hydroponic Farms (@nutrifreshindia) హైడ్రోపోనిక్స్ అంటే పోషకాలతో కూడిన నీటిలో, నియంత్రిత వాతావరణంలో (అంటే పాలీహౌస్‌లలో) పంటలు పండించటం. ఈ పద్ధతిలో కూరగాయలు, సాధారణ ఆకుకూరలతో పాటు సలాడ్లలో నగరవాసులు తినే లెట్యూస్ వంటి విదేశీ జాతుల ఆకుకూరలు మొత్తం 42 రకాలను పెంచి, విక్రయించటం ద్వారా సంకేత్, గణేష్ మంచి ఆదాయం ΄పొందుతున్నారు. పుణే ప్రాంతంలో చల్లని వాతావరణం పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్ సేద్యానికి అనువుగా ఉండటంతో ఈ యువకుల కలల పంట పండుతోంది. కాసులు కురిపిస్తోంది. పురుగుమందులు వాడకుండా పండించటమే కాదు, పంట కోతలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవటం, కోసిన 24 గంటల్లోగా వినియోగదారుల ఇళ్లకు చేర్చటం వీరి విజయరహస్యం. సాధారణ గ్రామీణ మహిళలకు పంటల కోతలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి పనులు చేయిస్తున్నారు. ఆ ఫామ్‌లో పనిచేసేవారిలో 80% వీరే. దేశంలోని అనేక నగరాల్లో పురుగుమందుల్లేని ఆహారం కావాలనుకునే 40 వేల ఇళ్లకు న్యూట్రిఫ్రెష్ హైడ్రోపోనిక్ కూరగాయలు,ఆకుకూరలు, ఔషధ మొక్కల్ని అనుకున్న సమయానికి సరఫరా చేయగలుగుతోంది. నమ్మిన పనిని త్రికరణశుద్ధిగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేదానికి ఈ స్టార్టప్ పనితీరును నిదర్శనంగా చెప్పొచ్చు. శుద్ధిచేసిన నీటిని పంటల సాగుకు వాడటం, మొక్క పెట్టటం, పంట కోత, ప్యాకింగ్ వంటి పనులన్నీ ఖచ్చితత్వంతో నిర్వహిస్తూ నాణ్యమైన ఉత్పత్తుల్ని అందిస్తున్నారు. 2023 నాటి లెక్కల ప్రకారం సంకేత్ మెహతాతో సహా న్యూట్రిఫ్రెష్ వ్యవస్థాపకుల నికర విలువ రూ. 157 కోట్లుగా తెలుస్తోంది. (ఐదేళ్ల శ్రమ.. ఇంగువ పండిందోచ్! అవును నిజమే!) -
థానే లోకల్ ట్రైన్ ప్రమాదం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ప్రయాణికులకు నిత్యనరకం అనేది ఎలా ఉంటుందో.. ముంబై లోకల్ ట్రైన్ల రద్దీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా రైలు ప్లాట్‌ఫారమ్ మీదకు రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడిపోవడం, ఫుట్‌బోర్డు మీద వేలాడుతూనే ప్రయాణాలు చేయడం తరచూ సోషల్ మీడియాలోనూ చూస్తుంటాం. అయితే థానేలో ఇవాళ జరిగిన ఘోర ప్రమాదంతో(Thane Local Train Accident) రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. లోకల్ ట్రైన్స్‌కు కూడా ఆటోమేటిక్ తలుపులు బిగించాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. థానేలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు కొత్త రైళ్లకూ ఈ తరహా డోర్లు బిగించనున్నట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్ ప్రాంతంలో నడిచే అన్ని రైళ్లకూ ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రతే రైల్వే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన పేర్కొన్నారు. థానేలో ఇవాళ ఉదయం కసారా వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్ నుంచి పది మంది కింద పడిపోయారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల బ్యాగులు పరస్పరం తాకడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోవైపు.. ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు చేస్తోందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. ఇదీ చదవండి: బస్సు ప్రయాణికులకు బిగ్ షాక్ -
పైలట్ పంతంతో నిలిచిన ప్రాణం
థానే: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఆసక్తికర మైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే షెడ్యూల్ కంటే ముందే జల్గావ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం, విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడం.. చివరకు ఓ మహిళ ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యాయి. జల్గావ్ జిల్లాలోని ముక్తాయ్‌నగర్‌లో సంత్ ముక్తి పల్లకి యాత్రలో పాల్గొనేందుకు ఏక్నాథ్ షిండే శుక్రవారం తన చార్టెర్డ్ విమానంలో ముంబై నుంచి జల్గావ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు రావాల్సి ఉండగా, దాదాపు మూడు గంటలు ఆలస్యంగా 6.15 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ఏక్నాథ్ షిండే ఎయిర్‌పోర్టు నుంచి ముక్తాయ్‌నగర్ వెళ్లి పల్లకి యాత్రలో పాల్గొని ఎయిర్‌పోర్టుకు రాత్రి 9.15 గంటలకు తిరిగివచ్చారు. అయితే, గంట ముందే రావడంలో విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించాడు. షెడ్యూల్ ప్రకారమే వెళ్లాలని తేల్చిచెప్పాడు. మహారాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, గులాబ్‌రావు పాటిల్‌తోపాటు జిల్లా అధికారులు దాదాపు 45 నిమిషాలపాటు ఎయిర్‌పోర్టులో చర్చలు జరిపారు. పైలట్‌ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చివరకు అతడు అంగీకరించాడు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. ఏం జరిగింది? జల్గావ్కు చెందిన శీతల్ పాటిల్‌కు ముంబైలో అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచి కిత్స జరగాల్సి ఉంది. జల్గావ్ నుంచి విమానంలో వెళ్లాల్సి ఉండగా, ఎయిర్‌పోర్టుకు చేరుకొనేసరికే విమానం వెళ్లిపోయింది. అదే సమయంలో ఏక్నాథ్ షిండే అదే ఎయిర్‌పోర్టులో తన విమానం కోసం వేచి చూస్తున్నారు. పైలట్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో శీతల్ పాటిల్ గురించి స్థానిక నాయకులు ఏక్నాథ్ షిండే దృష్టికి తీసుకెళ్లారు. పైలట్ టేకాఫ్‌కు అంగీకరించడం, విమానం సిద్ధం కావడం జరిగిపోయాయి. దాంతో ఆయన శీతల్ పాటిల్‌ను, ఆమె భర్తను తనతోపాటు చార్టెర్డ్ విమానంలో ముంబైకి తీసు కెళ్లారు. ముందే సమాచారం ఇచ్చి ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యేక అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే శీతల్ బోర్డేను ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి అనుకున్న సమయానికే శీతల్ బోర్డే ఆసుపత్రికి చేరుకున్నారు. ఏక్నాథ్ షిండే విమానాన్ని టేకాఫ్ చేయడానికి పైలట్ మొండికేయడం ఆమె ప్రాణాలను కాపాడిందని స్థాని కులు పేర్కొన్నారు. సామాన్య ప్రజల బాగు కో సం ఏక్నాథ్ షిండే తపన పడుతుంటారని, వారి సేవ కోసం ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని మంత్రి గిరీష్ మహాజన్ చెప్పారు. -
రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించిన బీజేపీ
-
డిప్యూటీ సీఎం షిండేకు షాకిచ్చిన పైలట్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని జల్గావ్ నుంచి ముంబై వెళ్లేందుకు ఆయన విమానాశ్రయంలో దాదాపు గంటపాటు వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. షిండే వ్యక్తిగత విమానానికి చెందిన పైలట్ తన డ్యూటీ టైమ్ ముగిసిందని పేర్కొంటూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ముక్తాయ్ నగర్లో జరిగిన ఒక మతపరమైన ఊరేగింపులో పాల్గొన్న తరువాత జల్గావ్ నుంచి ముంబై బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. షిండేతోపాటు ఆయన ఆయన బృందం రాత్రి 9.15 గంటలకు జల్గావ్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే పైలట్ తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెబుతూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు. దీంతో కొందరు అధికారులు పైలట్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు. 45 నిముషాల తర్వాత పైలట్ విమానాన్ని నడిపేందుకు ఒప్పుకున్నాడు. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే విమానం ముంబైకి బయలుదేరింది.ఇది కూడా చదవండి: ఐదు దశల్లో ‘మహా’ మ్యాచ్ ఫిక్సింగ్: రాహుల్ సంచలన వ్యాసం -
‘మహా’ మ్యాచ్‌ఫిక్సింగ్
న్యూఢిల్లీ/నాగపూర్: మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపైనే తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోదీ సర్కారు భారీ స్థాయిలో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతూ వస్తోందని మండిపడ్డారు. అందుకోసం కీలకమైన జాతీయ స్థాయి సంస్థలను సైతం చెరబడుతోందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘నేను మాట్లాడుతున్నది చిన్నా చితకా ఎన్నికల అక్రమాల గురించి కాదు. ఒక పరిశ్రమ స్థాయిలో మొత్తం ఎన్నికల ప్రక్రియనే రిగ్గింగ్ చేసేస్తున్నారు. ప్రతిసారీ కాకున్నా ఇది తరచూ జరుగుతోంది. గతంలో పలు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అందరినీ విస్మయపరిచాయి. ఆ ఎన్నికల్లో పూర్తిగా ‘మ్యాచ్‌ఫిక్సింగ్’జరిగింది. మోదీ సర్కారు వాటి ఫలితాలను టోటల్‌గా రిగ్గింగ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఎలా చెరబట్టడమెలాగో చెప్పేందుకు ఆ ఎన్నికలు బ్లూప్రింట్‌గా నిలిచిపోయాయి’’అంటూ రాహుల్ తూర్పారబట్టారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పలు పోస్టులు చేశారు. ‘మ్యాచ్‌ఫిక్సింగ్–మహారాష్ట్ర’అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికలో తాను రాసిన ఎడిట్ పేజీ వ్యాసాన్ని షేర్ చేశారు. మ్యాచ్‌ఫిక్సింగ్ ప్రక్రియను ఐదు పాయింట్లలో వివరించారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే పరువు పోతుందనే భయంతో బీజేపీ అన్ని అక్రమాలకూ పాల్పడింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో కూడా మహారాష్ట్ర తరహా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పథకరచన చేస్తోంది’’అంటూ జోస్యం చెప్పా రు. హోరాహోరీ పోరు ఖాయమని అంతా భావించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ, దాని ఎన్డీఏ భాగస్వామ్య పక్షా లు కనీవినీ ఎరగని రీతిలో ఏకంగా 235 సీట్లలో నెగ్గడం తెలిసిందే. అంతకు ఐదు నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలోని 48 స్థానాల్లో విపక్ష ఎంవీఏ కూటమికి 31 రాగా ఎన్డీఏ కూటమి 17 సీట్లతో సరిపెట్టుకుంది. వయోజనుల కంటే ఓటర్లే ఎక్కువ! ‘‘2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు. 2024 మేలో లోక్‌సభ ఎన్నికల నాటికి 9.29 కోట్లకు పెరిగింది. అంటే ఐదేళ్ల వ్యవధిలో కేవలం 31 లక్షలు పెరిగింది. కానీ 2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా 9.7 కోట్లకు పెరిగింది! కేవలం ఐదు నెలల్లోనే ఓటర్లు ఏకంగా 41 లక్షల మేరకు పెరిగారు! ఇదెలా సాధ్యం? పైగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారమే మహారాష్ట్రలో మొత్తం వయోజనుల సంఖ్య 9.54 కోట్లు. ఓటర్ల సంఖ్య అంతకుమించి ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’’అని రాహుల్ ప్రశ్నించారు. ‘‘ఇదొక్కటే కాదు. పోలింగ్‌లోనూ తీవ్ర అక్రమాలు జరిగాయి. సాయంత్రం ఐదింటికి 58.22 శాతం పోలింగ్ నమోదైంది. మర్నాడు ఉదయం మాత్రం మొత్తం పోలింగ్ శాతం 66.05 అని ప్రకటించారు. ఏకంగా 7.83 శాతం పెరుగుదల ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. How to steal an election?Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.My article shows how this happened, step by step:Step 1: Rig the panel for appointing the Election Commission Step 2: Add fake voters to the rollStep 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025మళ్లీ అవే ఆరోపణలు: ఈసీ మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న రాహుల్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ‘‘పోలింగ్ ప్రక్రియ మొత్తం ఆయా పారీ్టల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పారదర్శకంగా జరిగింది. రాహుల్ ఆరోపిస్తున్నట్టు అసాధారణ ఓటింగ్ జరిగిందంటూ కాంగ్రెస్, ఆ పార్టీ పోలింగ్ ఏజెంట్లెవరూ ఫిర్యాదు చేయలేదు’’అని ఈసీ వర్గాలు గుర్తు చేశాయి. ఈసీ వర్గాల వాదనపై రాహుల్ స్పందించారు. అనధికారిక స్పందనలతో తప్పించుకోవడం ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను కాపాడబోదన్నారు. ‘‘లోక్‌సభతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలన్నింటికీ సంబంధించిన సమగ్రమైన డిజిటల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఐదింటి తర్వాత అన్ని బూత్‌ల్లో జరిగిన పోలింగ్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలి’’అని డిమాండ్ చేశారు. రిగ్గింగ్‌కు ఐదు సూత్రాలు ఎన్నికలల్లో మోదీ సర్కారు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించిన రాహుల్‌గాం«దీ, వాటిని పాయింట్లవారీగా వివరించారు... → కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానల్‌ను రిగ్గింగ్ చేయడం → ఎలక్టోరల్ రోల్స్‌లో భారీగా నకిలీ ఓటర్లను పొందుపరచడం → పోలైన ఓట్ల శాతాన్ని అక్రమంగా పెంచేయడం → బీజేపీ గెలిచి తీరాలనుకున్న చోట్ల బోగస్ ఓటింగ్‌కు పాల్పడటం → సాక్ష్యాలను ఎవరికీ చిక్కకుండా దాచేయడం ఇది కూడా చదవండి: బీజేపీ తదుపరి అధ్యక్షుడు.. ఆ ముగ్గురిలో ఎవరు? -
ముందే పలకరించిన వానలు : రెయిన్కోట్లకు, గొడుగులకు భలే బేరం!
దాదర్: వర్షాకాలం సమీపించడంతో గొడుగులు, రెయిన్ కోట్లు, ప్లాస్టిక్ క్యాప్‌లు తదితర సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముంబైలో గత పక్షం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఒకపక్క వర్షం మరోపక్క ఎండలు కాస్తున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటపడే సమయంలో గొడుగు తీసుకెళ్లాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడిపోయారు. ఈ సారి వర్షాలు కొంత తొందరగా కురుస్తాయని ఇదివరకే శాంతాకృజ్, కొలాబా వాతావరణ శాఖలు హెచ్చరించాయి. అనుకున్నట్లు ఈ సారి వర్షాలు గత పక్షం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఏటా వర్షాకాలం జూన్ ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి వర్షాలు దాదాపు పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్నాయి. దీంతో అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. దీంతో కొత్త గొడుగులు, రెయిన్ కోట్లు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల గొడుగులు.. డిజైన్లతో కూడిన రెయిన్ కోటుముంబైలో దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, చెంబూర్ తదితర ప్రాంతాల్లో వర్షాకాల సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కోనుగోలుదార్లను ఆకర్షించే రంగురంగుల గొడుగులు, వివిధ డిజైన్లతో కూడిన రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే వివిధ రంగులు, డోరెమాన్, ఛోటా బీం, మోటూ–పాత్‌లు, స్పైడర్ మెన్, బార్బీ డాల్, సిండ్రోలా తదితర కార్టూన్ బొమ్మలతో కూడిన రెయిన్ కోట్లు, గొడుగులు వచ్చాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దలు వినియోగించే ప్లాస్టిక్ జాకెట్లు, ప్యాంట్లు, క్యాప్‌లు, ఫోన్లు వర్షానికి తడవకుండా భద్రపర్చుకునే మొబైల్ కవర్లు, బైక్‌లు, కార్లపై కప్పడానికి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ సారి ధరలు 10–20 శాతం మేర పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ సామగ్రిని రిటైల్ వ్యాపారులు క్వాలిటీని బట్టి 20–30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ సారి కోనుగోలుదార్ల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: Chitrakoot Facts: చరిత్ర చెక్కిన రామాయణం చిత్రకూటం.. ఎన్ని విశేషాలో!రెయిన్ కోట్ రూ.30 నుంచి రూ.150 లోపే.. ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటపడే సామాన్యులు ఇదివరకు వాడిన లేజర్ బూట్లు, సాధారణ పాదరక్షలు పక్కన పెట్టేశారు. వర్షంలో వినియోగించే ప్లాస్టిక్ చెప్పులు, బూట్లు, స్లీపర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా గత సంవత్సరం అమ్మగా మిగిలిపోయిన సామగ్రిని బయటకు తీసి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సారి అకాల వర్షాలు పక్షం రోజుల ముందే కురవడంతో అనేక మంది వ్యాపారులు వర్షాకాల సామగ్రి ముందుగానే నిల్వచేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ గొడుగులతోపాటు డబుల్, ట్రిపుల్ ఫోల్డింగ్ గొడుగులు, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్లు, క్యాప్‌లు, కప్పుకునేందుకు ప్లాస్టిక్ పేపర్లు ఇలా అనేక రకాల వర్షాకాల సామగ్రి మార్కెట్లోకి వచ్చాయి. రూ.100–500 వరకు ధర పలికే హైక్లాస్ ప్లాస్టిక్ బూట్లు, రబ్బర్ చెప్పులు మార్కెట్లో ఉంచారు. వీటిని అధికంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. చాలామందికి వెంట రెయిన్ కోట్లు, గొడుగులు ఉంచుకోవడం ఇష్టముండదు. దీంతో ఇలాంటి వారికోసం యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కో రెయిన్ కోట్ ధర కేవలం రూ.30–150 వరకు పలుకుతున్నాయి. బరువు కూడా చాలా తక్కువ ఉండడంతో హ్యాండ్ బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సాధారణ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం -
మహారాష్ట్ర రాజకీయాల మెలోడ్రామా
మహారాష్ట్రలో గత మూడేళ్ల నుండి వాయిదాపడిన 29 మున్సిపల్ కార్పొరేషన్, 257 నగర పురపాలక, ఇతర స్థానిక పంచాయతీ ఎన్నికలను రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా 2025 మే 6న సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అంతే, ప్రాంతీయ పార్టీలు... ముఖ్యంగా, ఉభయ శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) పార్టీలు వారి వారి కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేర్కొనే ఈ ఎన్నికల జయాపజయాలు జాతీయ విషయాలపై కాకుండా, స్థానిక సమస్యలపైనే ఆధారపడుతుంటాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్ధవ్ థాకరే శివసేనకు... పుణె మునిసిపల్ కార్పొరేషన్, దగ్గర్లో ఉన్న పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలకు భాలే ఖిల్లా(కంచుకోట)గా చెప్పుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీలు ఇక్కడ పట్టు కోల్పోవటంతో, తిరిగి వారి ఉనికిని క్రియేట్ చేయటానికి సీనియర్ పవార్, ఉద్ధవ్ థాకరే క్షేత్ర స్థాయి ఎన్నికల విజయం కోసం పావులు కదుపుతున్నారు.227 కార్పొరేటర్లు ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్, దేశంలోనే అతిపెద్ద, అతి పురాతన (1889) ప్రజా ప్రతినిధుల సంస్థ. డెబ్భై నాలుగు వేల కోట్ల రెవెన్యూ బడ్జెట్‌తో, గత ముప్పై సంవత్సరాల నుండి గ్రేటర్ ముంబై కార్పొరేషన్ శివసేన ఆధీనంలో ఉంది. 2017 ఎన్నికల్లో 84 సీట్లు సాధించింది శివసేన. అప్పట్లో జరిగిన పోటా పోటీ ఎన్నికలో బీజేపీ 82 సీట్లు గెలిచి, కేవలం రెండు సీట్లు మాత్రమే శివసేనకు వెనుకంజలో ఉంది. కానీ, 2022లో పార్టీ చీలికతో 42 మంది సేన కార్పొరేటర్లు ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంలోకెళ్ళిపోయారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపించటంతో మాజీ కార్పొరేటర్లు కూడా కొందరు ఉద్ధవ్ పార్టీకి తిలోదకాలు ఇచ్చారు. అయినా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 20 మంది ఉద్ధవ్ శివసేన ఎమ్మెల్యేలలో ముంబై సిటీకి చెందినవారు 10 మంది! రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు ఇది వారికి ఒక విధంగా ఆశా కిరణమే అనొచ్చు.రాజ్ థాకరే ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఇప్పటివరకూ, ఉద్ధవ్ శివసేనకు ఓట్ కట్టర్ గానే నష్టం చేకూర్చింది. సందర్భోచితంగా స్థానిక బీజేపీ నేతలు, రాజ్ థాకరే పార్టీని తమకు అనుకూలంగా వాడుకుంటారు. ఉద్ధవ్, రాజ్ కలిసి ఎన్నికల బరిలో దిగితే ఇరు పార్టీలకు కలసి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులే కాక, పార్టీ కార్యకర్తలు సైతం తరచుగా చెపుతుంటారు. కానీ, అది ఇంత వరకూ జరగ లేదు. 2024 డిసెంబరులో రాష్ట్ర ముఖ్య మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ థాకరే వెళ్ళి ఆయనను కలవటం, మహాయుతి భాగస్వామి షిండే వర్గంలో కలకలం సృష్టించింది; ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్టు శివసేన (షిండే) నేత, ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, రాజ్ సాహెబ్ ఇంటికెళ్ళి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదంతా గమనిస్తే, ప్రస్తుతం ఇక్కడి రాజకీయాల్లో ‘దోస్తీ దుష్మనీ’కి నిర్వచనమే తెలియటం లేదు. ఇక, మొన్న జరిగిన మరాఠీ సినీ కార్యక్రమంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఎం.ఎన్.ఎస్. నేత రాజ్ థాకరే, ‘మహారాష్ట్ర సంక్షేమం కోసం తన పార్టీ ఉద్ధవ్ శివసేనకు మద్దతివ్వటానికి సిద్ధమే’ అని అన్నారు. మరుసటి రోజు ముంబై నగర వీధుల్లో, థాక్రే బ్రదర్స్ ‘మహారాష్ట్ర హిత్’ కోసం ఒక్కటవ్వాలి అని శివసేన పోస్టర్లు వెలిశాయి.ఇక బాబాయి, అబ్బాయిల (ఎన్సీపీ పార్టీల) విషయానికి వస్తే, ‘రాబోయే స్థానిక ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం, మీ పార్టీతో చేతులు కలుపుతుందా?’ అన్న విలేఖరి ప్రశ్నకు శరద్ పవార్, ‘మున్ముందు ఈ రెండు పార్టీలు విలీనం అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ తన పార్టీ నేతలను కూడా విస్మయంలో ముంచారు. 2019 నుండి మహారాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. భాజపాతో 30 ఏళ్ల సంబంధం తెగతెంపులు చేసుకుని ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ ఎన్సీపీలతో మైత్రి కుదుర్చుకుని ముఖ్యమంత్రి కావటం; తర్వాత, 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే 52 మంది శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి భాజపా సహాయంతో సీఎం కావటం; మరో సంవత్సరం గడిచాక (2023 జూలై) అజిత్ దాదా, 43 ఎన్సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి, భాజపా కనుచలువతో ఉపముఖ్యమంత్రి కావటంతో మహారాష్ట్ర రాజకీయ రంగస్థలంలో మెలోడ్రామా చోటు చేసుకుంది.రాష్ట్ర స్థాయి నేతలకు అతీతంగా, గ్రామ, జిల్లా, నగర స్థాయిలో అధికారం కోసం ఉబలాటపడే నాయకులు మాత్రం ముంబైలోని వారి అగ్ర నాయకుల ఫర్మాన్ పట్టించుకోదలచుకో లేదు. శివసేన, ఎన్సీపీ రెండూ రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఈ పార్టీల నాయకులు, వాలంటీర్లు వారికి తోచిన రీతిలో సమీకరణలు చేసుకుంటున్నారు. అయితే స్థానిక నాయకులను తమ ‘గ్రిప్’లో ఉంచుకోవాలనే ప్రయత్నమే పవార్, థాకరే పార్టీలు చెప్పే మెర్జర్ ధోరణి రహస్యం.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై ‘ 98190 96949 -
Operation Kagar: అభివృద్ధి అంటే అడవుల నరికివేతా?
ఈ వారం అన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికలూ, ఛానళ్లూ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఎన్కౌంటర్ వార్తతో, అనుబంధ వార్తలతో, వ్యాఖ్యా, విశ్లేషణా వ్యాసాలతో నిండిపోయాయి. సామాజిక మాధ్యమాలైతే చెప్పనక్కరలేదు. ఒక సుప్రసిద్ధ ప్రధాన స్రవంతి ఇంగ్లిష్ దినపత్రిక ఆ వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురిస్తూ, ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో ఆ మూడు కాలమ్‌ల వార్తకు పక్కనే మరొక రెండు కాలమ్‌ల వార్త కూడా వేసి... చాలా పెద్దవయ్యాయి గనుక రెండు వార్తలనూ రెండో పేజీలో కూడా పక్కపక్కనే కొనసాగించింది. ఆ రెండు వార్తల మధ్య కార్య కారణ సంబంధం ఉండడం ఆ పత్రిక చెప్పకుండానే చెప్పిన రహస్యం. ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత వల్ల పద్దెని మిదేళ్లుగా ఆగిపోతున్న ఆ ‘అభివృద్ధి’ పథకాన్ని కొనసాగించడం గురించి వార్తా, మావోయిస్టు ప్రధాన కార్యదర్శిని చంపి వేసిన వార్తా పక్కపక్కనే కలిసి రావడం ఒక తలకిందుల కవితాన్యాయం.మహారాష్ట్ర లోని మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలిజిల్లాలో ఇనుప ఖనిజం శుద్ధి కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖమే 12న అనుమతి ఇచ్చిందనేది ఆ వార్త. ఒకవైపు ‘ఆపరేషన్ కగార్’ పేరిట ఎడాపెడా ఎన్కౌంటర్లు జరుపుతూ ఆది వాసులను భయోత్పాతంలో ముంచుతున్న సందర్భంలోనే ఈ అనుమతి వచ్చిందని ప్రత్యేకంగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ముందు మహారాష్ట్ర మంత్రివర్గం గడ్చిరోలీ జిల్లా గనుల తవ్వకపు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసిందని కూడా ఆ వార్తలోనే ఉంది. మావోయిస్టు నిర్మూలన, ఆదివాసుల తరలింపు అనే ప్రణాళిక దండకారణ్యంలోని ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికే అనే ఆరోపణను నిజం చేస్తూ, ఈ శుద్ధి కర్మాగారం కోసం భారత ప్రభుత్వం ‘లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్’ అనే బహుళజాతి కార్పొరేట్ సంస్థకు 2,324 ఎకరాల అడవిని ధారాదత్తం చేసింది. ఈ ‘అభివృద్ధి’ కింద ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికి వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదీ చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్నిజానికి ఈ కంపెనీకి ఇక్కడ 2007లోనే ఇరవై సంవ త్సరాల లీజు కింద వెయ్యి ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఆ లీజు వ్యవధిని మరొక ముప్పై సంవత్సరాలు పెంచారు. అంటే ఆ కంపెనీ ఇక్కడి ఖనిజ వనరులను 2057 వరకూ తవ్వుకుపోవచ్చు. అయితే ఆ ప్రాంతంలో ఆదివాసులు తమ ‘జల్, జంగల్, జమీన్’లను కార్పొరేట్లకు ఇవ్వడానికి అంగీకరించబోమని, అలా ఇవ్వడం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో, ‘1996 పంచా యత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం’లో, ‘2006 అటవీ హక్కుల చట్టం’లో ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటానికి మావోయిస్టులుఅండగా నిలిచారు. ఆ కారణం వల్లనో, మరే కారణం వల్లనో లాయిడ్ స్టీల్ కంపెనీ 2016 దాకా తవ్వకాలు ప్రారంభించలేకపోయింది. 2016లో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత మరింత క్రియాశీలంగా మారి 2016 డిసెంబర్లో సుర్జాఘర్ గనుల దగ్గర లాయిడ్ కంపెనీకి చెందిన ట్రక్కులను, ఎర్త్ మూవర్లను తగులబెట్టడంతో గనుల తవ్వకం ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఆగిపోయిన గనుల తవ్వకానికి, అదనంగా అక్కడే ఒక శుద్ధి కర్మాగారం పెట్టుకోవడానికి అనుమతు లిచ్చా రన్నమాట. ఆ వార్త కూడా సరిగ్గా మావోయిస్టు కార్యదర్శి చని పోయిన రోజు ప్రకటించారన్నమాట. ఇప్పుడు ఇస్తున్న అనుమ తులకు కాగితం మీద కొన్ని షరతులు ఉన్నమాట నిజమే. ఇక్కడ ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికినందుకు, 2,400 ఎకరాల అడవిని నాశనం చేసినందుకు, అక్కడి నుంచి వెయ్యి కి.మీ. అవతల అరేబియా సముద్ర తీరంలో చిప్లున్, రత్నగిరి ప్రాంతాల్లో సమానమైన విస్తీర్ణంలో మొక్కలు నాటాలని ఒక షరతు ఉంది. ఇటువంటి అడవిని నరికే అనుమతులు పొందిన వారందరికీ అటువంటి షరతులు ఉండడమూ, వాటిని తుంగలో తొక్కి, భయంకరమైన ఉల్లంఘనలను ఆమోదించడమూ దశాబ్దాలుగా యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి.ఇలా అడవిని పందారం చెయ్యడం ఆదివాసుల హక్కులకు మాత్రమే కాదు... దేశ సంపదకు, ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు, పర్యావరణానికి, భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదకరం. ఈ గడ్చిరోలి అడవి మహారాష్ట్రలోకి విస్తరించిన దండకారణ్యంలో భాగం.చదవండి: అరుదైన ఆపరేషన్.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!దండకారణ్యం దేశానికే ఊపిరితిత్తుల వంటిది. అక్కడ ఆ సువిశా లమైన, దట్టమైన అరణ్యాలు ఉండడం వల్లనే దేశంలో జీవ వైవిధ్యం మిగిలి ఉంది. అక్కడ పుట్టిన అనేక నదులు దేశంలో, కనీసం మధ్య భారతంలో భూగర్భ జలాలను రక్షిస్తున్నాయి. ఆ అడవి సువిశాల ప్రాంతాలకు ప్రాణవాయువును అందిస్తున్నది. పర్యావరణ రీత్యా ఇంత సుసంపన్నమైన ఈ అడవిలో దాదాపు ముప్పై ఖనిజాలు కోట్లాది టన్నులు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ఖనిజ నిలువలు దేశ సంపద. దాన్ని పొదుపుగా వాడుకుని, భవిష్యత్త రాలకు అందించడం ఈ తరం బాధ్యత. ఐదేళ్ల కోసం అధికారం పొందినవారు యాభై ఏళ్ల భవిష్యత్తును కార్పొరేట్ లాభాపేక్షకు, ఆశ్రితులకు రాసి ఇస్తున్నారు. ఆ సంపద కొల్లగొట్టడానికి అక్కడి నుంచి ఆదివాసులను ఖాళీ చేయించదలచారు. ఆదివాసులకు మద్దతుగా ఉన్న ఉద్యమకారులను నిర్మూలించ దలచారు. ఆదివాసుల మీద ప్రభుత్వాలు, కార్పొరేట్లు, మైదాన ప్రాంతవాసులు దాడి చేసి జాతులకు జాతులనే అంతరింపజేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది గనుకనే, భారత రాజ్యాంగం ఐదవ, ఆరవ షెడ్యూళ్లలో ఆ ప్రాంతాలకు, ఆ ప్రాంతాలలోని ఆదివాసులకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. ‘పేసా చట్టం –1996’లో, ‘ఎఫ్ఆర్ ఏ చట్టం –2006’లో ఆ రక్షణలను విస్తరించింది. ఇప్పుడు జరుగుతున్న ఈ అడవుల పందారం ఆ చట్టాలన్నిటి ఉల్లంఘన. ఇది కేవలం మావోయిస్టుల సమస్యో, ఆదివాసుల సమస్యో కాదు. ఇది ఈ దేశంలో ప్రతి ఒక్కరి సమస్య. ఈ దేశాన్ని ప్రేమించేవారందరి సమస్య. -ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎడిటర్ -
బాహుబలికి మించిన బండిబలి
-
ఆర్భాటాలకు పోకండి.. వివాహాలు సాదాసీదాగానే జరిపించండి
ఆర్థిక స్తోమత లేకున్నా.. అప్పులు చేసి మరీ పిల్లల వివాహాలను ఘనంగా నిర్వహించే తల్లిదండ్రులను చూస్తున్నాం. అయినా కూడా గొంతెమ్మ కోరికలతో అత్తింటి వాళ్లను ఇబ్బంది పెట్టే అల్లుళ్లను.. ఆ వేధింపులను మౌనంగా భరించే కూతుళ్లను చూస్తున్నాం. మహారాష్ట్రలో ఇలాంటి వేధింపుల ఉదంతం.. సంచలన కేసు.. అక్కడి మరాఠా పెద్దలను చలించిపోయేలా చేసింది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర మరాఠా కమ్యూనిటీ (Maratha Community) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వివాహాల విషయంలో ఆర్భాటాలు వద్దని, వీలైనంత వరకు సాదాసీదాగానే జరిపించాలని ఒక తీర్మానం చేసింది. ఎన్సీపీ బహిష్కృత నేత రాజేంద్ర హగవానే చిన్న కోడలు వైష్ణవి అదనపు కట్నం వేధింపులకు బలైంది. ఈ ఘటన నేపథ్యంతో సోమవారం మరాఠా కమ్యూనిటీ ఉన్నత కుటుంబాలకు చెందిన కొందరు పెద్దలు, రాజకీయ నాయకులు సమావేశమై పై నిర్ణయం తీసుకున్నారు.వైష్ణవి(Vaishnavi) తల్లిదండ్రులు ఎన్సీపీ నేతలు. అదే పార్టీకి చెందిన నేత రాజేంద్ర హగవానే చిన్నకొడుక్కి 2023లో వైష్ణవిని ఇచ్చి వివాహం జరిపించారు. కోరినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా జరిపించినా.. ఫలితం లేకుండా పోయింది. మరో 2 కోట్ల రూపాయల అదనపు కట్నం తేవాలంటూ అత్తింటివాళ్లు ఆమెను వేధించారు. ఈ క్రమంలో నదిలో దూకి ఒకసారి, ఎలుకల మందు తిని మరోసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.ఇరు కుటుంబాలు రాజకీయాల్లో ఉండడంతో.. మరాఠా పెద్దలు విషయాన్ని పెద్దది కానివ్వకుండా పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించామనుకున్నారు. కానీ ఓ బిడ్డ పుట్టాక కూడా ఆ వేధింపులు అలాగే కొనసాగాయి. ఈ క్రమంలో.. ఆ వేధింపులు తాళలేక ఆమె పుణే పింప్రి-చించ్వాద్‌లోని పుట్టింటికి చేరింది.ఈ నెల 16వ తేదీన ఇంట్లో ఎవరూలేని టైంలో ఆమె ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. రాజేంద్ర హగావానే, అతని కోడుకు అరెస్ట్ కావడం, వైష్ణవి 10 నెలల కొడుకు ఆమె తల్లిదండ్రుల చెంతకు చేరడం పలువురిని కంటతడి పెట్టించింది. ‘‘ఈరోజుల్లో తల్లిదండ్రులకు తగిన ఆర్థిక స్తోమత లేకున్నా.. అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే వైష్ణవి ఉదంతం మమ్మల్ని కదిలించింది. ఇక నుంచి ఆర్భాటంగా వివాహాలు జరిపించొద్దని తల్లిదండ్రులను కోరుతున్నాం. వివాహాలను మేం ఏర్పాటు చేసిన నియమావళి ప్రకారమే జరిపించాలని తీర్మానించాం’’ అని మరాఠా పెద్దలు ప్రకటించారు. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. వివాహాలు సాదాసీదాగానే జరిపించాలి. అత్తవారింట్లో కోడళ్లకు తగిన గౌరవం, సముచిత స్థానం లభించాలి. అత్తలు కోడళ్లను కూతుళ్లలా, కోడళ్లు అత్తలను తల్లులుగా భావిస్తూ వాళ్ల మధ్య బంధం సజావుగా సాగాలి. అలాగే.. వరకట్న వేధింపులు ఎదురైనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా స్పందించాలి అనే విషయాలపైనా అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించాలని మరాఠా పెద్దలు తీర్మానించారు.ఇదీ చదవండి: పెళ్లి కొడుకును ఎత్తుకెళ్లిపోయారు, చివరకు.. -
‘గేట్ వే-మాండ్వా’ లాంచీల నిలిపివేత , జేజే ఆసుపత్రిలోకి నీరు
గేట్ వే ఆఫ్ ఇండియా–మాండ్వాల మధ్య సోమవారం నుంచి లాంచి సేవలను నిలిపివేశారు. మారిటైం బోర్డు ఆదేశాల మేరకు లాంచి యజమానులు సేవలు నిలిపివేశారు. దీంతో నిత్యం ఈ మార్గంలో లాంచీలలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకనుంచి ఎక్కువ చార్జీలు చెల్లించి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. లాంచీ సేవలు మళ్లీ సెప్టెంబరు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని లాంచీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ మహాడ్కర్ తెలిపారు. ముంబై పరిసరా ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు పక్షం రోజుల ముందే వర్షాలు ప్రారంభం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 26వ తేదీ నుంచి లాంచి సేవలు నిలిపివేయాలని మారిటైం బోర్డు నిర్ణయించింది. ఏటా వర్షా కాలంలో జూన్ ఒకటో తేదీ నుంచి లాంచీ సేవలు నిలిపివేస్తారు. కానీ ఈసారి వర్షాలు తొందరగా ప్రారంభం కావడంతో వారం రోజుల సర్వీసులను నిలిపివేశారు. రోరో సేవల కొనసాగింపు... ముంబైకి సమీపంలో ఉన్న వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అలీబాగ్ ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ 90 శాతం పర్యాటకులు లాంచీలను ఆశ్రయిస్తారు. రోడ్డు మార్గం కంటే సముద్ర మార్గం ద్వారా అలీబాగ్‌కు చేరుకోవడం చాలా సులభం. బస్సు చార్జీలతో పోలిస్తే లాంచీ చార్జీలు చాలా తక్కువ. గేట్ వే ఆప్ ఇండియా–మాండ్వా మ«ధ్య ప్రతీరోజు 40–50 లాంచీలు నడుపుతారు. వర్షాకాలంలో సముద్రంలో అలలు ఉవ్వేత్తున ఎగిసిపడతాయి. ముఖ్యంగా హై టైడ్ కారణంగా లాంచీలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈసారి ముందుగానే వర్షాలు మొదలుకావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకముందే లాంచీ సర్వీసులను నిలిపివేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే భావుచా ధక్క–మాండ్వా మధ్య రోల్ ఆన్–రోల్ ఆఫ్ (రోరో) సేవలు కొనసాగుతాయని మారిటైం బోర్డు తెలిపింది. ఉపాధి..ఆదాయానికి గండి.... గేట్ వే–మాండ్వా మధ్య పీఎన్పీ, మాల్దార్, అజంత, అపోలే కంపెనీల లాంచీలు సేవలందిస్తున్నాయి. దాదాపు మూడు నెలలకుపైగా లాంచిసేవలు నిలిచిపోనుండటంతో వీటి యజమానులు, అక్కడి హోటళ్లు, లాడ్జింగులు, వాహనాల యజమానుల ఆదాయానికి గండిపడనుంది. ముంబై నుంచి బయలుదేరే పర్యాటకులతోపాటు అలీబాగ్ నుంచి ముంబైకి వచ్చే వ్యాపారులు, ఉడ్యోగుల రాకపోకలు కూడా నిలిచిపోతాయి. ఇకనుంచి వీరంతా రోడ్డు మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది వ్యయ, ప్రయాసలతో కూడున్నదైనప్పటికీ తప్పదని అధికారులు అంటున్నారు. కేఈఎం, జేజే ఆసుపత్రుల్లోకి వరదనీరు మోకాల్లోతులో నీటిలో ఆసుపత్రుల ప్రధాన భవనాలు, పరిసరాలు వరదనీటిలోనే రోగుల క్యూ ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. వర్షాల కారణంగా కేఈఎం, జె.జె. ఆసుపత్రులు నీట మునిగాయి. పరేల్‌లోని కేఈఎం ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం , పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) వద్ద అలాగే కొన్ని రోగుల గదుల వెలుపల భా రీగా నీరు నిలిచిపోయింది. టాటా ఆసుపత్రి, కేఈఎం ఆసుపత్రి, వార్డు 4ఏ వరండాల్లో నీరు చేరింది. నీటి పంపులతో వెంటనే నీటిని తొల గించినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ జోషి తెలిపారు. ఇక జె.జె. ఆసుపత్రిలో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. ప్రధాన భవనం వెలుపల, అలాగే ఆసుపత్రి నివాస భవనాల పరిసరాలు మోకాలి లోతు నీటిలో మునిగిపోయింది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కోసం వచ్చిన రోగులు నీటిలోనే నిలబడాల్సి వచ్చింది. అవుట్ పేషెంట్ భవనం నుంచి ప్రధాన భవనానికి వెళ్లే రోగులు పూర్తిగా నీటిలోనే నడవాల్సి వచి్చంది. జె.జె. ఆసుపత్రి సమీ పంలోని పోలీస్ స్టేషన్ ప్రాంతం, ప్రజా పనుల విభాగం ఆవరణలోనూ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అ యితే గత సంవత్సరం లాగా ఆసుపత్రి భవనం ఈసారి పూర్తిగా నీటమునగలేదని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని జె.జె. ఆసుపత్రి డీన్ డాక్టర్ అజయ్ భండార్వర్ తెలిపారు. -
ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. గాంధీ వంతెనపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అత్యంత అనూహ్య రీతిలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిపై ఒక ఎస్యూవీ వాహనం డివైడర్‌ను ఢీకొంది. దీంతో అప్రమత్తమైన ఎస్‌యూవీలోని ఆరుగురు ప్రయాణికులు కిందకు దిగారు. ఇంతలో అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. బీడ్ పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ కన్వత్ ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ గెవ్రాయ్ పట్టణానికి సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిలోని గాంధీ వంతెనపై ఒక ఎస్యూవీ డివైడర్‌ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురిలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే డివైడర్ నుండి తమ వాహనాన్ని పక్కకు తప్పించేందుకు వారు ప్రయత్నిస్తుండగా, అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కన్వత్ తెలిపారు.ఇది కూడా చదవండి: Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక.. -
అకాల వర్షాలు.. కొండెక్కిన ధరలు.. ఇలాగే ఉంటే...!
దాదర్: గత వారం, పదిరోజులుగా రాష్టవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల వివిధ రకాల పంటలతోపాటు కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూరగాయల తోటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ట్రక్కులు, టెంపోలలో రవాణాకు సిద్ధంగా ఉంచిన కూరగాయలు కుళ్లిపోవడంతో అక్కడే రోడ్లపై పారేయాల్సిన పరిస్ధితి వచి్చంది. ఫలితంగా న్యూ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ), అలాగే థానేలోని హోల్‌సేల్ మార్కెట్లలో కూరగాయల లోడుతో వచ్చే వాహనాల సంఖ్య తగ్గిపోయింది. సరుకు కొరత ఏర్పడడంతో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు అకాల వర్షాల వల్ల చుక్కలను తాకుతున్నాయి. అసలే వర్షాలు, ఆపై కూరగాయల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. 18 ఏళ్ల తరువాత మళ్లీ... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత వారం, పదిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కొంత ముందుగానే ఆరంభమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 20 రోజుల ముందుగానే ఊహించని వర్షాలతో సామాన్య జనాలతో పాటు రైతులు కూడా ఆందోళనకు గురయ్యారు. గత 18 ఏళ్ల కిందట మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు రికార్డు బ్రేక్ చేశాయని కొలాబా, శాంటాకృజ్ వాతావరణ శాఖలు తెలిపాయి. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!ఇలాగే ఉంటే...మరింత పైపైకి... కొద్ది నెలలుగా స్ధిరంగా కూరగాయలు, ఉల్లి, బంగాళదుంపలు, టమాటాలు, ఆకు కూరల ధరలు కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటుండటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు. కొరత కారణంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు ఇప్పటికే 10–20 శాతం పెరిగాయి.రాష్ట్రంలోని అనేక జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సరుకులు కుళ్లీపోకే ముందే అక్కడే ఖాళీ చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి కనీసం పెట్టుబడి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రేట్లు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు -
ముంబై: నీట మునిగిన మహా నగరం.. 107 ఏళ్ల రికార్డు బద్దలు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైని వానగడం ఇప్పట్లో వీడేలా లేదు. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ముంబైని ముంచెత్తిన వర్షం కాస్త తెరిపిచ్చినప్పటికీ, ఇప్పుడు(మంగళవారం ఉదయం) మళ్లీ తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం దక్షిణ ముంబైలో మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నగరానికి వాతావరణ శాఖ(Meteorological Department) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో ముంబైకి జారీ చేసిన రెండవ రెడ్ అలర్ట్ ఇది. నారిమన్ పాయింట్, వార్డ్ మున్సిపల్ హెడ్ ఆఫీస్, కొలాబా పంపింగ్ స్టేషన్, కొలాబా ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు 200 మి.మీకి మించిన వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. సాధారణ జీవితం స్తంభించిపోయింది.గడచిన 24 గంటల్లో ముంబైలో కురిసిన వర్షపాతం 107 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. గత 75 ఏళ్లలో నగరంలో రుతుపవనాల ప్రభావం ఇంత భారీ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమాన, లోకల్ రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితమే ప్రారంభించిన మెట్రోలోని ఒక భూగర్భ స్టేషన్ నీటితో నిండిపోయింది. దీనితో అధికారులు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. కుర్లా, సియోన్, దాదర్, పరేల్‌తో సహా అనేక లోతట్టు ప్రాంతాలు వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వాహనాలు వరదలతో నిండిన వీధుల గుండా వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.థానేలో పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం, ఫలితంగా కురిసిన భారీ వర్షపాతం ముంబైలోని అనేక ప్రాంతాలలో ముంపునకు కారణంగా నిలిచిందన్నారు. ముంబైలో రుతుపవనాలు షెడ్యూల్ కంటే 16 రోజులు ముందుగానే వచ్చాయి. గత సంవత్సరం రుతుపవనాలు జూన్ 25న మహారాష్ట్ర రాజధానికి చేరుకున్నాయి. కాగా రుతుపవనాలు శనివారం కేరళకు చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: పాక్‌లో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ -
వీడియో: దంచికొట్టిన వర్షం.. వరద నీటిలో బస్సులు, రైల్వే ట్రాక్..
ముంబై: నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి మహారాష్ట్రలో భారీ కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వరద నీటి ప్రవాహం కారణంగా కార్లు కొట్టుకుపోయాయి. రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ వరకు వరద నీరు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మహారాష్ట్రలో కుండపోత వర్షం కారణంగా పూణే-సోలాపూర్ హైవే జలమయమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్లో ఇబ్బందులకు గురవుతున్నాయరు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. వరద నీరు కారణంగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.Heavy rains being reported in parts of South Mumbai now. In a one hour span from 9-10 am the Nariman Point Automatic Weather station has reported 104 mm of rains. Below video of Nepensea Road which is water logged. pic.twitter.com/EcTCjcbttK— Richa Pinto (@richapintoi) May 26, 2025ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు.Today won’t be the last time we see such rain. Few ideas on how to drive safe. Turn on your lamps (not blinkers) and drive slowly. Don’t change lanes if not required. Water accumulates quickly, so be prepared to navigate pockets of water safely #MumbaiRains pic.twitter.com/iUWEPxOSon— Siddharth Rangnekar (@themrsidey) May 26, 2025మరోవైపు.. మహారాష్ట్రలోని ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాయ్‌గఢ్, రత్నగిరి, మధుదుర్గ్ జిల్లాల్లో అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు నుండి నాలుగు గంటల్లో మహారాష్ట్ర అంతటా కొన్ని జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులతో కూడిన ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.Welcome to May 2025! And parts of South Mumbai are flooded owing to Tripple Digit rains in mere 2 hours! #MumbaiRains pic.twitter.com/pSxW9BSayk— Mumbai Nowcast (@s_r_khandelwal) May 26, 2025ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం ఉదయం బారామతిలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా అన్ని భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు 3,100 మంది నివాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. Situation outside Prabhadevi railway station (Churchgate end). Avoid this lane. Waterlogging till knee length. #MumbaiRains #waterlogging @mybmc pic.twitter.com/GA4HEKAzrW— Sagar Joshi (@sagarjjoshi87) May 26, 2025 Masjid station #mumbai #locals #BMC #monsoon #drowning #floods #rains #mumbairains What is our government doing? Who will answer this failure. First rain in Bombay and this is the situation??? pic.twitter.com/QWVmJeGmiN— **Isha** (@ibarthwal) May 26, 2025మరోవైపు.. ఢిల్లీ, కర్ణాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 49 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 32 ప్రాంతీయ సర్వీసులు, 17 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇక, కర్ణాటకలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Mumbaikars office jate hue #MumbaiRains pic.twitter.com/2NWPnkkSZ1— Desi Bhayo (@desi_bhayo88) May 26, 2025BJP's double engine is located underwaterBuses and cars submerged in #Delhi Cantt area after overnight rains Severe waterlogging in several parts of the National Capital of India#DelhiRains #BiharElections#Gujarat #Kerala #ByElection#युवा_आक्रोश_महारैली #NITIAayog pic.twitter.com/oD3nWXhPql— Taj INDIA (@taj_india007) May 25, 2025 -
వసతులు కరువు.. చదువులు బరువు
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా 30,116 మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నట్లు ఇటీవల విద్యా శాఖ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకు ప్రధాన కారణం అనేక పాఠశాలల్లో విద్యార్థులకు మౌలికసదుపాయాల కొరత ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పాఠశాలకు స్వస్తి చెప్పిన విద్యార్థుల్లో అధిక శాతం బాలికలే ఉన్నారు. స్వచ్ఛమైన మరుగుదొడ్లు లేకపోవడం ఒక కారణమైతే కొన్ని పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లే లేవనే ఆశ్చర్యకరమైన విష యం బయటపడింది. 5,373 పాఠశాలల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. అదేవిధంగా 530 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. కొన్ని పాఠశాల ల్లో ఆడ పిల్లల కోసం స్వతంత్రంగా మరుగు దొడ్లు లేవు. అలాగే 5,127 పాఠశాలల్లో అసలు మరు గుదొడ్లు లేవనే విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో గత్యంతరం లేక పాఠశాల ప్రహరీ గోడకు అవతల ఆనుకుని ఉన్న దట్టమైన పొదల్లోకి లేదా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక మంది పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రయత్నాలు ఘనం.. ఫలితం శూన్యం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ధనవంతులతోపాటు అనేక మంది పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోంచి డ్రాపౌట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోసాగింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్డడం, మరగుదొడ్లకు మరమ్మతులు చేపట్టడం, తాగు నీరు, విద్యా బోధన మెరుగుపర్చడం ఇలా అనేక సదుపాయాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. దీంతో ప్రతీ ఊరు, పల్లెటూర్లలో తిరిగి విద్యార్థులకు కౌన్సెలింగ్, తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు ప్రత్యేక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 33,470 ఉండగా అదే 2024–25లో ఈ సంఖ్య 30,116 చేరింది. దీన్ని బట్టి గత విద్యా సంవత్సరంలో 3,354 మంది విద్యార్థుల సంఖ్య మాత్రమే పెరిగిందని స్పష్టమవుతోంది. అంటే ఇంకా 30,116 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. విద్యార్థులు ఖాళీగా తిరగడంవల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం లేకపోలేదు. నేరాలకు కూడా పాల్పడతారని విద్యా శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ సంఖ్య తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో చేపట్టిన కౌన్సెలింగ్, మార్గదర్శక కార్యక్రమాలవల్ల కొంతమేర సత్ఫలితాలు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైన తరువాత 2025–26లో ఎంతమేర విద్యార్థుల సంఖ్య పెరిగిందనేది తెలుస్తోంది. దీన్ని బట్టి పాఠశాలకు ఇంక ఎంతమంది దూరంగా ఉంటున్నారనే దానిపై ఒక స్పష్టత వస్తుందని విద్యా శాఖ పేర్కొంది. -
మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
-
ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) డేటా ప్రకారం.. 2024-25లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 'మహారాష్ట్ర' మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో ముందుంది.SIAM డేటా ప్రకారం.. 2024-25లో మహారాష్ట్రలో ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు 5,06,254 యూనిట్లు (11.8 శాతం)గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 4,55,530 యూనిట్లు (10.6 శాతం), గుజరాత్ 3,54,054 యూనిట్లు (8.2 శాతం) అమ్మకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత నాల్గవ స్థానంలో కర్ణాటక 3,09,464 యూనిట్లతో (7.2 శాతం), హర్యానా 2,94,331 యూనిట్లతో (6.8 శాతం) ఐదవ స్థానంలో ఉన్నాయి.ద్విచక్ర వాహన విభాగంలో.. ఉత్తరప్రదేశ్ 28,43,410 యూనిట్ల అమ్మకాలతో (14.5 శాతం వాటా) అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర 20,91,250 యూనిట్లతో (10.7 శాతం), తమిళనాడు 14,81,511 యూనిట్లతో (7.6 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో కర్ణాటక (12,94,582 యూనిట్ల), గుజరాత్ (12,90,588 యూనిట్లు) ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీత్రిచక్ర వాహనాల విభాగంలో.. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 93,865 యూనిట్లు (12.7 శాతం) అమ్మకాలు జరపగా, గుజరాత్ 83,947 యూనిట్లు (11.3 శాతం), మహారాష్ట్ర 83,718 యూనిట్లు (11.3 శాతం) అమ్మకాలు జరిపాయని డేటా తెలిపింది. కర్ణాటక 70,417 యూనిట్లతో (9.5 శాతం) నాల్గవ స్థానంలో, బీహార్ 47,786 యూనిట్లతో (6.4 శాతం) ఐదవ స్థానంలో నిలిచాయి. -
బీజేపీ మమ్మల్నిటార్గెట్ చేసింది.. బాల్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: బీజేపీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, థాక్రే బ్రాండ్లను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ, అలాంటివి జరిగే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. థాక్రే బ్రాండ్ అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అది అంత సులభం కాదు. థాక్రే బ్రాండ్ విషయానికి వస్తే నా తాత ప్రభోదంకర్ థాక్రే మహారాష్ట్రపై మొదటి ప్రభావాన్ని చూపారు. ఆయన తర్వాత, బాలాసాహెబ్ థాక్రే, తరువాత నా తండ్రి శ్రీకాంత్ థాక్రే తమదైన ముద్ర వేశారు. అనంతరం, థాక్రే వారుసులమైన నేను, ఉద్దవ్ థాక్రే మా సత్తా ఏంటో చూపించాం అని అన్నారు.ఇదే సమయంలో..‘నేను ఒక ఫోటో చూశాను. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తత్కరే, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, ఛగన్ భుజ్బాల్, ఇతర నాయకుల మధ్యలో కూర్చున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు, నేను ఆశ్చర్యపోయాను. బీజేపీ మద్దతుదారులు దానిని ఎలా చూస్తున్నారో ఆలోచించాను?. మేము వారికి అధికారం రాకుండా ఎంతో కష్టపడ్డామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో కూర్చున్నారు అని ఆలోచిస్తున్నారు. ఇది వారి మనసులో ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అనంతరం, పహల్గాం ఘటనపై స్పందిస్తూ..‘పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు?. పాకిస్తాన్‌తో యుద్ధం అనేది ఒక ఎంపిక కాదు. మనం చేసింది యుద్ధం కూడా కాదు. యుద్ధం గురించి మీకు ఏం తెలుసు?. గాజాను చూడండి, అప్పుడు యుద్ధం ఎలాంటి విధ్వంసం తెస్తుందో మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్‌పై మన దాడులు పర్వాలేదు. కానీ, మన 26 మందిని చంపిన ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? వారు ఇప్పటికీ పరారీలో ఉన్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. భమ్రాగఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందాడు. -
మలబార్‌హిల్ ‘నైసర్గిక ఎలివేటెడ్’.. సూపర్! టూరిస్టుల రద్దీ
మలబార్ హిల్ ప్రాంతంలో నెల రోజుల కిందట ప్రారంభించిన ‘నైసర్గిక ఎలివేటెడ్ మార్గం’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం అనందాన్ని ఆస్వాదించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా లక్షకుపైనే చేరింది. పర్యాటకుల ఎంట్రీ టికెట్ల ద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి రూ.27 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. కొందరికి టెకెట్లు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. లేదంటే ఈ ఆదాయం మరింత పెరిగేదనే బీఎంసీ వర్గాలు తెలిపాయి. రూ.30 కోట్ల వ్యయం శివసేన యువనేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే 2022లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ తరహాలో ‘ట్రీ టాప్ వాక్’ నిర్మించాలని సంకల్పించారు. ఆ మేరకు కమలా నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న మలబార్ హిల్‌లో నైసర్గిక ఎలివేటెడ్ మార్గం పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యాయి. అందు కు రూ.30 కోట్లు ఖర్చుచేసిన ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం గత నెల నుంచి వినియోగంలోకి వచి్చంది. ప్రారంభం నుంచి ఈ ఎలివేటెడ్ మార్గానికి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించసాగింది. ట్రీ టాప్ వాక్ తరహాలో.. మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యానవనం ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచ్చితంగా ఈ రెండు ఉద్యాన వనాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులను మరింత ఉత్సాహపరిచాలనే ఉద్దేశంతో సింగపూర్‌లో ఉన్న ‘ట్రీ టాప్ వాక్’ తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించారు. ఇలాంటి ఎలివేటెడ్ మార్గాన్ని ముంబైలో నిర్మించడం ఇదే ప్రథమం కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మార్గానికి వందలాది చెట్లు అడ్డువచ్చినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉద్యానవనంలోని వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అలాగే కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చర్నిరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్‌క్లెస్ (మెరైన్ డ్రైవ్) తదితర విహంగం ద్వారా దృశ్యాలను తిలకించవచ్చు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.25 వసూలు చేస్తున్న నైసర్గిక ఎలివేటెడ్ మార్గానికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. శని, ఆదివారాలైతే కిక్కిర్సిన జనాలు, పర్యాటకులు ఉంటున్నారు. టికెట్లన్నీ ఆన్లైన్లోనే అమ్ముడు పోవడంతో ఆఫ్‌లైన్‌లో లభించడం లేదు. దీంతో అనేక మంది పర్యాటకులు నైసర్గిక ఎలివేటెడ్ మార్గం ద్వారా ప్రకృతి అందాలను తిలకించకుండానే వెనుదిరుగుతున్నారు. -
రోహిత్ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన సీఎం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్‌మ్యాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కాగా రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (Test Cricket Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ఇందుకు సంబంధించి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తెలుపు రంగు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అతడే వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది. అధికారిక నివాసానికి ఆహ్వానించిన సీఎంకాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతడిని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. పుష్ఫగుచ్ఛం అందించి.. శాలువాతో రోహిత్‌ను ఫడ్నవిస్ సత్కరించారు. అతడితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘భారత క్రికెట్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించడం.. ఆయనను కలిసి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపిస్తోంది.టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించిన రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. జీవితంలోని తదుపరి అధ్యాయంలోనూ ఆయన ఇలాగే మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.దిగ్గజ కెప్టెన్గాకాగా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) కూడా అందించాడు. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ప్రదర్శన ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా బాగాలేదు.రోహిత్ సారథ్యంలో టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సొంతగడ్డపై విదేశీ జట్టు చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఫలితంగా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2025) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.కోహ్లి కూడా ఇదే బాటలోఆ తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మ రంజీ బరిలో దిగి కూడా విఫలమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరు లేకుండానే జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. వాళ్లిద్దరు ఉంటే బెటర్! -
భక్తుల కొంగుబంగారం ముక్తీశ్వరుడు పుష్కరాలు : ఇక్కడి స్పెషల్ ఏంటంటే..?
రాష్ట్రంలోని మహాప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన మహాక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భక్తులతో నిత్యం పూజలందుకుంటూ విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఈనెల 15నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కర శోభను సంతరించుకోనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈలింగాలలో ఒకటి కాలుడు (యముడు), ముక్తీశ్వరుడు(శివుడు)గా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నా యి. ముక్తీశ్వర లింగానికి రెండు నాశికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసి నా బయటకు కనిపించవు. ఆ నీరు సొరంగ మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు తెలుపుతున్నారు. గర్భగుడికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజ స్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం విశేషం. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరి, అంతర్వాహిణి సరస్వతీ నదులు కలిసిన క్షేత్రం కాళేశ్వరమని ప్రాచుర్యంలో ఉంది. కాళేశ్వరం క్షేత్ర నిర్మాణం..పూర్వం యమ ధర్మరాజు ఓ కార్యం నిమిత్తం స్వర్గలోకంలో ఇంద్రుడి వద్దకు వెళ్లాడు. ఇంద్రలోకంలోని వైభవాలు చూశాడు. ప్రజలు ఇక్కడ సుఖసంతోషంగా ఉంటూ యమ లోకానికి రావడానికి ఇష్టపడడం లేదు. వీరంతా ఆ మహాశివుడిని పూజిస్తున్నట్లు తెలుసుకున్నాడు. మహాశివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని గ్రహించి ముక్తీశ్వర ఆలయం ఎదుట 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ముక్తీశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు..నీ కోరిక ఏంటని ప్రశ్నించాడు.అందుకు యమధర్మరాజు నీవు భక్తులకు సర్వపాపాలు తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తూ కైలాసానికి పంపుతున్నావు. యమలోకంలో నాకు పని లేకుండా పోయిందని పేర్కొన్నాడు. అందుకోసం ముక్తీశ్వరాలయంలో నీ లింగం పక్కనే నాకు చోటు కల్పించి భక్తులు నీకంటే ముందు నన్నే పూజించాలని ముక్తీశ్వరుడితో వేడుకున్నాడు. అందుకు ముక్తీశ్వరుడు తన పక్కన ఆలయంలో చోటు కల్పించాడు. అందుకే కాలుడు, ముక్తీశ్వరుడు ఇద్దరు వెలిసిన నేపథ్యంలో ‘కాళేశ్వరం’ అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరమనే పట్టణం నిర్మింతమైంది. ఈ ఆలయంలో ఒకే పానవట్టం పై ఓవైపు యముడు, మరోవైపు శివుడు కొలువయ్యారు. ముందు యముడి(కాలుడు)ని కొలిచిన తర్వాతే శివు(ఈశ్వరుడు)డిని భక్తులు ఆరాధిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తజనులతో ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానాలయంతో పాటు మహాసరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పూజలు చేస్తారు.శ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలుశ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా పితృదేవతలకు తీర్థశ్రాద్ధాలు, పిండప్రదానాలు ముఖ్యం. సంకల్ప స్నానాలు చేయాలి. నదీపూజ తప్పని సరి చేయాలి. -పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానంప్రయాగ కన్నా త్రివేణి స్నానం గొప్పనదిలో 12 రోజుల పాటు స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. 33 కోట్ల దేవతామూర్తులు నది జలాల్లో సంచరిస్తారు. పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. త్రివేణి సంగమం కలిసే చోట అంతర్వాహిణి సరస్వతీనదిలో పుష్కర స్నానం చేస్తే ప్రయాగ నది కన్నా కోటిరెట్ల పుణ్యమని పురాణాల్లో ఉంది. పుష్కర స్నానంతో సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. -త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, రిటైర్డ్ ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం -
జూన్ 2న మహారాజు పల్లకీ మహాయాత్ర ప్రారంభం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పండరీపురంలో జరగనున్న ఆషాడీ ఏకాదశి మహోత్సవం సందర్భంగా శ్రీసంత్ గజానన్ మహారాజ్ పల్లకీ యాత్ర జూన్ 2న ఉదయం 7 గంటలకు షేగావ్ నుంచి వైభవంగా ప్రారంభమవుతుంది. శతాబ్దాలనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ యాత్ర 56వ సంవత్సరంలోకి ప్రవేశించింది. డప్పులు, మృదంగాల శబ్దాలతో, చేతుల్లో భగవద్ ధర్మ పతాకాలు పట్టుకుని హరినామ జపం చేస్తూ వందలాది మంది వార్కారీలు ఈ పుణ్య యాత్రలో భాగమవుతున్నారు. ఈ పల్లకీ ఊరేగింపు ద్వారా భక్తులు విఠోబా దర్శనం చేసుకునేందుకు పండరీపురం చేరుకుంటారు. ఈ యాత్రలో జెండా మోసే వారు, గాయకులు, ముండాగ్ వాయించే కళాకారులు, సేవకులు కలిపి సుమారు 700 మంది పాల్గొంటున్నారు. యాత్రలో ఒక వినికారి, ఒక తల్కారి, ఒక జెండా మోసేవాడు తదితరులు క్రమశిక్షణతో నడుస్తూ ప్రతి గ్రామంలో భజన, కీర్తన, ఉపన్యాసాల ద్వారా భగవద్ధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. వర్షం అయినా, ఎండ అయినా, చలి అయినా వార్కారీలు హరినామ స్మరణతో ముందుకు సాగుతారు. జూన్ 2న నాగజారి శ్రీ క్షేత్రం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 33 రోజుల పాటు సాగి జూలై 4న పండరీపురానికి చేరుకుంటుంది. మంగళవేదం వద్ద చివరి బస అనంతరం శ్రీ పల్లకీ పండరీపురం ప్రవేశిస్తుంది. అక్కడ జూలై 4 నుంచి 9 వరకు ఉత్సవాల్లో పాల్గొని, జూలై 10న తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర షేగావ్‌లో జూలై 31న యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో పరాస్, గైగావ్, అకోలా, పర్లి, అంబజోగై, షోలాపూర్ వంటి అనేక పట్టణాలు, గ్రామాలు భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రతి రోజు ఉదయం హరిపథ్, భజనలు, శ్రీచి ఆరతి వంటి కార్యక్రమాలతో ఈ యాత్ర ప్రత్యేకంగా సాగుతోంది. పండరీభూమి అడుగుపెట్టే ముందు వార్కారీలు అక్కడి మట్టిని నుదుటిపై పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు. యాత్ర ముగిసే వరకు వారి నడకదారిలో విఠల్ విఠల్ నినాదమే ప్రతిధ్వనిస్తుంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
వార్ జోన్.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్ పాటిల్ తిరిగి విధుల్లో చేరాడు. పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.सगळ काही भारत मातेसाठी...लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025 -
మరాఠా ధీశాలి రాణి 'అహల్యా బాయి' జీవితంపై సినిమా
రాణి అహల్యా బాయి హోల్కర్(Ahilyabai Holkar) జీవితంపై సినిమా నిర్మించబోతున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) అధికారికంగా ప్రకటించారు. చాలాకాలంగా ఆమె జీవితాన్ని నేటి తరం యువతకు పరిచయం చేయాలని తాము అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. మరాఠ ధీశాలి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టామని సీఎం అన్నారు. గతంలోనే అహ్మద్‌నగర్ (Ahmednagar) జిల్లా పేరును అహల్యానగర్(Ahilya Nagar)గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అహల్యా బాయి మరాఠాలు పాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశానికి చెందిన రాణి అని సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. గతంలో ఆమె గురించి ఆయన ఇలా చెప్పారు. ' ప్రస్తుత అహ్మద్‌నగర్ జిల్లాలోని చౌంధీ (Chaundhi) అనే గ్రమంలో ఆమె జన్మించారు. మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారు. ఆమె కారణం వల్లే నేడు కాశీలో మహాశివుడి గుడి ఉంంది.' అని ఒక వేదికపై దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. అందుకే ఆమె జీవితాన్ని సినిమాగా దేశ ప్రజలకు చూపించాలని అనుకున్నట్లు ఆయన అన్నారు. దేశంలోని అన్ని భాషల్లో అహల్యా బాయి జీవిత చరిత్ర విడుదల అవుతుందన్నారు.రీసెంట్గా ఛావా సినిమాతో మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ గురించి దేశం మొత్తం తెలుసుకుంది. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి రాణి అహల్యా బాయి గురించి సినిమా ప్రకటన రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రయుల్లో ఆసక్తి కలుగుతుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా నిర్మించేందుకు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
బీజేపీ మహిళా మంత్రికి వేధింపులు.. మేసేజ్‌లు.. యువకుడు అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే (Pankaja Munde)ను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పూణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే (Pankaja Munde)ను కొద్దిరోజులుగా నిందితుడు వేధిస్తున్నాడు. తరచూ ఆమెకు ఫోన్లు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అలాగే, అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో, మహారాష్ట బీజేపీ కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిఖిల్ భమ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.మహారాష్ట్ర (Maharastra) నోడల్ సైబర్ పోలీసులు (Nodal Cyber Police) అతడిని అరెస్ట్ చేశారు. ఇక, సదరు వ్యక్తిని పూణేకు చెందిన అమోల్ కాలే(25) గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఎందుకు పంకజా ముండేను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు?. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Breaking News 🚨A man, Amol Kale (25), was arrested for harassing Maharashtra Minister Pankaja Munde with obscene calls and messages. The accused, from Pune, admitted to the acts, and he was sent to police custody for further investigation under the IT Act: Maharashtra Cyber… pic.twitter.com/slTDkbntOc— The Statesman (@TheStatesmanLtd) May 2, 2025 -
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
2025 కేర్ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో మహారాష్ట్ర
2025లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదటి వరుసలో నిలిచాయి. మంగళవారం విడుదలైన తాజా కేర్ఎడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్‌లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు ప్రధమ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సామాజిక, పాలన, పర్యావరణం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది.ఆర్ధిక, సామాజిక విషయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలువగా.. ఆర్థిక పనితీరులో గుజరాత్ ముందుంది. కర్ణాటక పారిశ్రామిక, పర్యావరణ సూచికలలో ముందు వరుసలో ఉంది. పశ్చిమ రాష్ట్రాలు ఆర్థిక పరంగా ముందు స్థానంలో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలు పాలన, పర్యావరణం, సామాజిక రంగాలలో రాణించాయి.ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సూచికలలో బలమైన ప్రదర్శనలతో.. ఈశాన్య, కొండ ప్రాంతాలు.. చిన్న రాష్ట్రాలలో గోవా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విశ్లేషణలో చేర్చలేదు.తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), పరిశ్రమలకు బలమైన స్థూల స్థిర మూలధన నిర్మాణం (GFCF) ద్వారా 'గుజరాత్' ఆర్థిక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్థూల విలువ ఆధారిత (GVA)లో పరిశ్రమ, సేవలలో మహారాష్ట్ర, కర్ణాటక అధిక వాటాను పొందాయి.రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపులు, రుణ స్థాయిలు, ఆర్థిక హామీలపై మంచి స్కోరు సాధించిన 'ఒడిశా' ఆర్థిక రంగంలో మంచి స్కోర్ సాధించింది. బ్యాంకులు, NBFCల బలమైన రుణ పంపిణీ, మ్యూచువల్ ఫండ్స్, ఆరోగ్య బీమా అధిక వ్యాప్తి ద్వారా మహారాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుంది.తలసరి విద్యుత్ లభ్యత, రైల్వే సాంద్రత, నికర నీటిపారుదల ప్రాంతం పరంగా పంజాబ్ & హర్యానా అధిక స్కోర్లతో మౌలిక సదుపాయాలలో అత్యుత్తమ స్థానాలను పొందాయి. సామాజిక సూచికలలో కేరళ ముందుంది. వ్యాపార వాతావరణం, న్యాయ సామర్థ్యం, పరిపాలనా బలం పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.పర్యావరణ పనితీరులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముందు వరుసలో నిలిచాయి, కర్ణాటక గాలి నాణ్యత, పునరుత్పాదక శక్తిలో ముందంజలో ఉంది. అటవీ విస్తీర్ణం మార్పులు, త్రాగునీటి లభ్యతలో తెలంగాణ మంచి స్కోర్ చేసింది. -
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం
ఢిల్లీ: మీరు మా కంటే (భారత్) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారుఅభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G— ANI (@ANI) April 27, 2025 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ డిమాండ్అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.షేమ్పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు. -
కుప్పలు తెప్పలు : రెట్టింపైన ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం
అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముంబైలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గడం లేదు. వాటర్ బాటిళ్లు, ఆయిల్ బాటిళ్లు, ఫినాయిల్, బాత్రూంలు శుభ్రంచేసే యాసిడ్, ఇతర రసాయనాల బాటిళ్ల వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. వివిధ అవసరాలకు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లవల్ల పర్యావరణానికీ హాని జరుగుతోంది. 2023తో పోలిస్తే 2024లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2023లో 67 లక్షల కేజీల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరగ్గా అదే 2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకుంది. దీన్ని బట్టి రెట్టింపునకుపైగా ప్లాస్టిక్ వినియోగం జరిగినట్లు స్పష్టమవుతోంది. వన్ టైం యూజ్ బాటిళ్లే ఎక్కువ.. ముంబైలోని వివిధ చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను బట్టి ఇందులో అధికంగా ఒకసారి వినియోగించే (వన్ టైం యూజ్) బాటళ్లే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వివిధ రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, తినుబండారాల పార్శిల్ ప్యాకింగులు ఉన్నాయి. ఒకప్పుడు గల్లీలలొ, ఫూట్‌పాత్‌లపై, రోడ్ల పక్కన, ఖాళీ మైదానాలలో బీఎంసీ ఏర్పాటుచేసిన కుండీలలో చెత్త అధికంగా కనిపించేది. కానీ ఇప్పడు అదే చెత్త కుండీలలో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలా చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వీర్యంచేసి మళ్లీ కొత్తగా తయారుచేయడానికి వీలున్న బాటిళ్లను బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది పోగు చేస్తున్నారు. బాటిళ్లతోపాటు భోజనం చేసే ప్లేట్లు, నీటి గ్లాస్లు, స్పూన్లు, పార్శిల్ కంటైనర్లు, స్ట్రాలు, కప్‌లు, సంచులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2023లో నిర్వీర్యం చేసి మళ్లీ వినియోగించే వీలున్న 85–90 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించగా అదే 2024లో 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. అదే 2022లో 67,12,557 కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ముంబైలో ప్రçస్తుతం చెత్త నిర్వీర్యం చేసే 48 కేంద్రాలు పని చేస్తున్నాయి. ముంబైలో రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కార్డు బోర్డులు, థర్మకోల్, పుట్ట బాక్స్‌లు, గాజు బాటిళ్లు, పాత దుస్తులు, ఈ–చెత్త ఉంటున్నాయి. 2024లో 6,15,513 కేజీల ఈ–చెత్త పోగుచేశారు. ఇందులో థర్మకోల్ కూడా అధికంగా ఉంది. ఇదిలాఉండగా 2005 జూలై 26వ తేదీన ముంబైలో వచి్చన వరదల్లో 200 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో వరదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగమేనని తేలింది. దీంతో తేరుకున్న బీఎంసీ 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఆ తరువాత 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్టాస్టిక్ క్యారీ బ్యాగులు తయారుచేసే కంపెనీలపై, నిల్వచేసే గోడౌన్లపై, విక్రయించే వ్యాపారులపై వినియోగదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో 833 మంది విక్రయించే వ్యాపారులు, వినియోగదారుల నుంచి 3,148 కేజీల ప్టాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.41.70 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు, విక్రయం, వినియోగించే వారిపై అంతగా చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా దాడులు చేసి కంపెనీలకు సీలు వేయడం, విక్రయించే వ్యాపారులు, వినియోగించే సామాన్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగం భారీగానే జరుగుతోంది. -
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఏఎన్ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
సమరయోధులపై అపహాస్యమా?
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది. ‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. ఎందుకంటే వైస్రాయ్ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. -
మూగజీవాల పట్ల ఆదరణ చూపండి
వేసవి ఎండలు మనుషులతోపాటు పశువులు, పక్షులపై కూడా తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. తాగునీరు లభించక, ఎండ వేడి తాళలేక అనేక పక్షులు నేల రాలుతున్నాయి. వీధి కుక్కలు, పిల్లులు వడదెబ్బ, అనారోగ్యంతో ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నాయి. ఇలాంటి మూగజీవాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రాణిమిత్రులు. అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సహకారంతో వాటికి చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఇలా మార్చి నుంచి ఇప్పటిదాకా 90పైగా పశువులు, పక్షులకు చికిత్స చేయించారు. అపూర్వ కృషితో..సాధారణ స్థితికి.. ప్రస్తుతం ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రికార్డు స్ధాయిలో ఎండలు కాస్తున్నాయి. దీని వల్ల పక్షులు, జంతువులు వడదెబ్బ, అనారోగ్యాలతో చెట్లు, రోడ్లు, ఖాళీ మైదానాలు ఇలా ఎక్కడపడితే అక్కడ నేలకూలుతున్నాయి. కొన్నిసార్లు వీటి ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రాణిమిత్రులు చేస్తున్న కృషి అపూర్వం. ఇలా అనారోగ్యంతో కునారిల్లుతూ తమ కంటబడిన ప్రాణులకు సకాలంలో వైద్య చికిత్స అందించి తిరిగి వాటిని సాధారణ స్థితి తీసుకురావడంలో వీరి పాత్ర ఎనలేనిది. ముంబైలో రోడ్లకు ఇరువైపుల, నివాస సొసైటీలు, టవర్ల ఆవరణలు, వాణిజ్య, వాపార సంస్ధల కాంపౌండ్లలో లక్షలాది చెట్లున్నాయి. వాటన్నింటిపై దృష్టిసారించడం ప్రాణి మిత్రులకు సాధ్యం కాని పని. అందుకే కొన్ని సార్లు అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సాయం తీసుకుని పక్షులు, జంతువులను కాపాడుతున్నారు. ఇలా కొద్దిరోజులుగా అటవీ శాఖ, రెస్క్యూ అసోసియేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్ధలు వందకుపైగా పక్షులను కాపాడాయి. చదవండి : Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!కోలుకోగానే..యథాస్థానాలకు... కాగా ఇటీవల ముంబై సిటీ, ఉప నగరాల్లోని బోరివలి, అంధేరీ తదితర ప్రాంతాల్లో పావురాలు, రామ చిలుకలు, పిచ్చుకలు, గుడ్లగూబలు, కాకులు, కోతులు, పిల్లులు, కుక్కలు ఇలా రకరకాల పశు, పక్షులు అనారోగ్య స్ధితిలో కనిపించాయి. స్ధానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీ శాఖకు, స్వయం సేవా సంస్ధలకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వైద్యుల బృందం వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకుని ఫస్ట్‌ఎయిడ్ చేసి పరేల్‌లోని యానిమల్ క్రూయాల్టీ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఇవన్నీ అబ్జర్వేషన్లో ఉన్నట్లు వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ శర్మ తెలిపారు. పూర్తిగా కోలుకోగానే తిరిగి బయట వదిలేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుట పడగానే వాటిని నైసర్గిక ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేస్తామని ఆయన అన్నారు. ప్రజలంతా పశు, పక్షుల పట్ల మానవతా ధృక్పదంతో వ్యవహరించాలని ఖాళీ ప్రదేశాలలో, రోడ్ల పక్కన నీటితో నింపిన గిన్నెలు, ప్లేట్లు, ప్లాస్టిక్ మగ్గులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బతో బాధపడుతున్న జంతువులు, ఎండ వేడికి నేలరాలుతున్న పక్షుల గురించి 1926 అనే హెల్ప్ లైన్ నంబరుకు తెలియజేయాలని శర్మ విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’ -
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్‌ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu -
‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’
ముంబై: మహారాష్ట్ర దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎన్సీపీ నేత జీషాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సిద్ధిఖీని చంపినట్లే చంపేస్తామంటూ మెయిల్ చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిందటి ఏడాది అక్టోబరు 12న బాబా సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. బెదిరింపు మెయిల్‌పై తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జీషాన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్షదీప్ గిల్‌ను పంజాబ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్ అని పోలీసులు తేల్చారు. -
ఈసారి ‘మహా’ వంతు!
ఏదేమైనా హిందీని అందరికీ నేర్పించి తీరాలన్న సంకల్పం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మహారాష్ట్రలో తాజాగా రాజుకుంటున్న వివాదాన్ని చూసైనా బీజేపీ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కావొచ్చు హిందీని బలవంతంగా రుద్దే విధానాన్ని అంగీకరించబోమని ప్రకటించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణాదిన దుమారం రేపారు. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా భాష ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేసే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో స్టాలిన్ దాన్ని తప్పుబట్టారు. అదింకా పూర్తిగా చల్లారక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకూ మూడో భాషగా హిందీని తప్పనిసరి చేయటమే ఆ నిర్ణయం సారాంశం. ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి భాషలు మరాఠీ, ఇంగ్లిష్ మాత్రమే. కానీ జాతీయ విద్యావిధానం చెబుతున్నట్టు ‘ఏదైనా మరో భాష’ కూడా తప్పనిసరి గనుక హిందీని ఆ రెండింటితో జత చేశామని ప్రభుత్వం అంటున్నది. సహజంగానే మహారాష్ట్రలో ఇది వివాదాన్ని రేకెత్తించింది. ‘మేం హిందువు లమేగానీ... హిందీ అవసరం లేద’ంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ముంబై నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టింది. నిజానికి ఎంఎన్ఎస్ అయినా, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) అయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా అయోమ యంలో పడ్డాయి. ఎంఎన్ఎస్ ఏర్పడి ఇరవయ్యేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ ఆ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయింది. యూబీటీగా చీలకముందు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఏక్నాథ్ షిండే రూపంలో వచ్చిపడిన విపత్తుతో పార్టీ నిలువునా చీలిపోవటమే కాక, అధికారాన్ని కూడా కోల్పోయింది. జనం సానుభూతి చూపిస్తా రనుకుంటే అదీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా ఆర్నెల్లు కాలేదు. కనుక విపక్షాలు ఏం చేయటానికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర సర్కారు విపక్షాలకు ఆయుధాన్ని అందించింది.తమిళనాడులో స్టాలిన్ హిందీ వివాదాన్ని రేకెత్తించినప్పుడు కేంద్రం తన విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక మాట చెప్పింది. మూడో భాషగా హిందీయే నేర్పాలని తాము పట్టుబట్టడం లేదని, దేశ భాషల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చని అన్నది. కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇస్తున్న వివరణ చూస్తే అందుకు భిన్నంగావుంది. నూతన విద్యావిధానంలో భాగంగా స్థానిక భాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీని కేంద్రం తప్పనిసరి చేసిందని, దాన్నే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వివరణ సహజంగానే తమిళనాడులో పాలక డీఎంకేకు అందివచ్చింది. మూడో భాషగా ‘మరేదైనా’ నేర్చుకోవచ్చన్న నిబంధన ఆంతర్యమేమిటో మహా రాష్ట్ర నిర్ణయం బట్టబయలు చేసిందని ఆ పార్టీ అంటున్నది. దేశంలో హిందీని ఏదో విధంగా దొడ్డిదోవన అనుసంధాన భాషగా చేయాలన్నదే కేంద్రంలోని ఎన్డీయే పాలకుల ఉద్దేశమని విమర్శి స్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రంనుంచి ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. వాటిని ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు వ్యతిరేకిస్తూనే వచ్చాయి.తమిళనాడు మాదిరే మహారాష్ట్రలో కూడా భాషాభిమానం బాగా ఎక్కువ. దాన్ని అన్నివిధాలా ఉపయోగించుకుందామని ఠాక్రే సోదరులు భావిస్తున్నట్టు కనబడుతోంది. సొంత అన్నదమ్ములు కాకపోయినా ఇద్దరూ శివసేనలో కలిసి పనిచేసేవారు. 2005లో వారిమధ్య పొరపొచ్చాలు బయల్దే రాక పార్టీ అధినేత బాల్ ఠాక్రే ఇద్దరి మధ్యా రాజీకి ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. 2006లో రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ స్థాపించారు. మొదట్లో యూపీ, బిహార్‌లనుంచి వలస వచ్చేవారి వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నదని, వారు దాదాగిరీ చలాయిస్తున్నారని ఆరోపిస్తూ నడిపిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత దుకాణాల బోర్డులన్నీ మరాఠిలో ఉండాలంటూ సాగించిన ఉద్యమం కూడా ఆ తోవలోనే నడిచింది. ఇవిగాక మరాఠీ ఆత్మగౌరవం పేరిట చాలా ఉద్యమాలు నడిపినా రాజ్ ఠాక్రేకు కలిసిరాలేదు. ఇప్పుడు బలవంతంగా హిందీ రుద్దుతున్నారన్న అంశంపై సాగించే ఉద్యమానికి స్పందన ఏమాత్రం వస్తుందన్నది చూడాలి. మహారాష్ట్రకు రావా ల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోవటాన్ని తప్పుబడుతూ నిరుడు లోక్‌సభ ఎన్నికల సమ యంలో తాను నిలదీసినప్పుడు రాజ్ కలిసిరాలేదని, అదే జరిగుంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండేది కాదని ఉద్ధవ్ వాదన. తమ మధ్య కేవలం చిన్న చిన్న అపోహలు మాత్రమే ఉండే వని ఉద్ధవ్ అంటుంటే... అసలు సోదరులిద్దరూ విడిపోయిందెక్కడని యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఠాక్రే సోదరుల ప్రకటనలు వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతు న్నారన్న సంకేతాలిస్తున్నాయి. అది బీజేపీ మనుగడను దెబ్బతీస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే పాలకులు మేల్కొనాల్సిన సమయం వచ్చింది. 1963 నాటి అధికార భాషల చట్టం, దానికి 1967లో తీసుకొచ్చిన సవరణలు గమనించి మసులుకుంటే భాషా వివాదం తలెత్తదు. అధి కార లావాదేవీలన్నిటా ఇంగ్లిష్, హిందీ వినియోగించాలని, హిందీ మాతృభాషగా లేని రాష్ట్రాలతో ఇంగ్లిష్‌లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పుడు అందరూ హిందీ నేర్చుకు తీరాలని శాసించటం సరికాదు. దేశ సమైక్యత, సమగ్రత పేరిట దాన్ని తలకెత్తుకుంటే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయి. మహారాష్ట్ర పరిణామాలు ఆ సంగతిని చాటుతున్నాయి. -
25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. పుట్టాక పుట్టుకతోనే అంధురాలైన ఈ బిడ్డ మా కొద్దు అంటూ చెత్త కుప్పలో పడేశారు తల్లిదండ్రులు . కట్ చేస్తే 26 ఏళ్ల వయసులొ నాగ్‌పూర్ కలెక్టరేట్లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్తబుట్టలో పడేశారు కన్నవాళ్లు. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుని సత్తా చాటుకుంది. గత ఏడాది మేలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) క్లర్క్-కమ్-టైపిస్ట్ పరీక్ష (గ్రూప్ సి)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాలా పాపల్కర్ వార్తల్లో నిలిచింది. తాజాగా అంత్యంత పోటీతత్వ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. త్వరలోనే నాగ్‌పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనుంది.చదవండి: మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలుమాలా పాపాల్కర్ ఎలా ఎదిగింది.అనాథాశ్రమంలో చేరిన మాలానుపద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ శ్రద్ధగా గమనించేవారు. ఆమె పట్టుదల, నైపుణ్యానికి ముచ్చటపడ్డారు. ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టారు. ఆమె ఉన్నత చదువులు చదివేందుకు తన వంతు కృషి చేశారు. అలా మాలా పట్టుదలగా చదివింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. తాజా మరో మెట్టు అధిగమించింది.‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆ దేవుడే దేవదూతలను పంపించాడంటూ తన విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారు.చదవండి: వేధింపులకు భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్! -
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.ముంబై: యూబీటీ సేన-ఎంఎన్ఎస్ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ నారాయణ్ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్ఎస్తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?. ఈ విషయాన్ని ఉద్దవ్ థాక్రేను మీరే(న్యూస్ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.శివసేన నుంచి రాజ్ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్ఎస్, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్ రాణే అన్నారు.ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే-రాజ్ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్ థాక్రేను బాల్ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు -
ఉద్ధవ్‌తో రాజ్ ఠాక్రే పొత్తు.. సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో విపక్ష శివసేన(ఉద్ధవ్), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చేతులు కలుపబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ రెండు పార్టీల అధినేతలు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వరుసకు సోదరులే. రెండు పార్టీల మధ్య త్వరలో పొత్తు కుదరబోతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అయితే, రెండు పార్టీలతో కూటమి ఏర్పాటు అనే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. రెండు పార్టీల నడుమ భావోద్వేగపూరిత చర్చలు నడుస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ కార్యక్రమాలు, వేడుకల్లో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలుసుకోవడం, మాట్లాడుకోవడం సాధారణమేనని చెప్పారు. ఉమ్మడి శివసేన పార్టీలో పని చేసినప్పుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఎలాంటి విభేదాలు తలెత్తలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ ఠాక్రే చెప్పడం సంచలనాత్మకంగా మారింది.ఇక, ఇరువురు నేతలు చేతులు కలుపబోతున్నట్లు మహారాష్ట్రలో ఊహాగానాలు మొదలయ్యాయి. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఇప్పటికే సంకేతాలిచ్చారు. తాజాగా రాజ్ ఠాక్రే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మా మధ్య ఉన్నవి చిన్న విభేదాలే. మహారాష్ట్ర ప్రయోజనాల ముందు ఇవి చాలా చిన్నవి. మేం కలవడం కష్టమేమీ కాదు. అందుకు సంకల్పం ఉండాలి అని ఆయన అన్నారు. అయితే, కలయికకు ఉద్ధవ్ థాక్రే ఓ షరతు విధించారు. చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టడానికి నేను సిద్ధం. కానీ, ఒకరోజు మద్దతిచ్చి, మరుసటి రోజు వ్యతిరేకించి, ఆపై రాజీ పడే ద్వంద్వ వైఖరి పనికిరాదు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వారితో కలిసేది లేదు అని స్పష్టం చేశారు. రాజ్ థాక్రే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. థాక్రే సోదరుల కలయికను బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. అయితే, వారు కలిసినా రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో తమ కూటమిని ఓడించలేరని బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేతలు కూడా ఈ కలయికను సానుకూలంగా చూస్తున్నారు. థాక్రే సోదరులు ఏకమైతే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఉమ్మడి శివసేనలో కీలకంగా వ్యవహరించిన రాజ్ ఠాక్రే 2006లో ఎంఎన్ఎస్ పేరిట సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబోయే భార్య వేధింపులకు తాళలేక పెళ్లి రోజే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసిక్‌కు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారి హరేరామ్(36)కి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మోహినికి నిశ్చితార్థం జరిగింది.మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసిన హరేరామ్.. నిలదీశాడు. ఈ సంఘటన ఆమె ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఈ విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగింది.నిరంతరం తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మానసిక ఒత్తిడికి గురై విసిగిపోయిన హరేరామ్.. నాసిక్‌లోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతితో పాటు ఆమె లవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. -
నగరంలో ఏకైక న్యూరో సర్జన్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
సోలాపూర్: పట్టణంలోని సుప్రసిద్ధ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వలసంగకర్ (65) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటల సమయంలో తన నివాసంలో రెండు సార్లు రివాల్వర్‌తో తల వద్ద కాల్చుకుని మృతి చెందారు. ఆ సమయంలో కూతురు ఉమ ఇంట్లోనే ఉన్నారు. తుపాకీ శబ్దం విన్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వెంటనే అక్కడకు వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ శిరీష్‌ను రామ్వాడి ప్రాంతంలోని ఆయన సొంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కుమారుడు డా.అశ్విన్, కోడలు డా. సోనాలి, ఇతర డాక్టర్లు ఆయనను కాపాడేందుకు రెండు గంటలపాటు తీవరంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 10:45 నిమిషాలకు ఆయన మరణించినట్లు వారు ధృవీకరించారు. డా. శిరీష్ మరణంపై పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది.శనివారం సాయంత్రం మోదీ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ శిరీష్ అంతిమ సంస్కారాలకు సామాజిక, రాజకీయ, వైద్య రంగ ప్రముఖులు , ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గత 35 సంవత్సరాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్ గా, బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన శిరీష్ వలసంగకర్ కుటుంబం మొత్తం వైద్య నిపుణులే. డాక్టర్ శిరీష్ నాలుగు భాషల్లో( మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు) ప్రావీణ్యుడు. ఆయన ఇటీవలే వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబల్ ఇంజన్ డైమండ్ ప్లేన్ కూడా కొనుగోలు చేశారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే జీవితాన్ని చేతులారా అంతం చేసుకున్నారు. ఖచ్చితమైన కారణంపై స్పష్టత లేనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు సంతాపండాక్టర్ శిరీష్ పద్మాకర్ వల్సంగ్కర్ అత్యంత గౌరవనీయమైన న్యూరాలజిస్ట్ మరియు మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని SP ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (వల్సంగ్కర్ హాస్పిటల్) వ్యవస్థాపకుడు. ఈ ప్రాంతంలో న్యూరాలజీ రంగంలో మార్గదర్శకుడిగా పేరుగాంచారు. మెదడుకు వివిధ , అధునాతన మార్గాల్లో చికిత్స చేయడానికి ఒక అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత ఆయన సొంతం. ఆందుకే సోలాపూర్‌లో న్యూరాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ అని పిలుస్తారు. ఈ సంఘటనతో యావత్ వైద్యలోకం షాక్‌కు గురైంది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన పరిణామంమని సోలాపూర్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ బల్దావా డా. శిరీష్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
మహారాష్ట్రలో దగ్గరవుతున్న ఠాక్రే సోదరులు
-
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
ఎన్నో ఏళ్లుగా ‘రాజకీయ కత్తులు’ దూసుకుంటూనే ఉన్నారు.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. వీరి వైరం సుమారు రెండు దశాబ్దాల నాటిది. ఒకప్పుడు కలుసున్న బంధం.. చాలా ఏళ్ల పాటు దూరంగానే ఉంటూ వచ్చింది. అది రాజకీయ వైరం కావడంతో ప్రజల్నే నమ్ముకుని పోరాటం సాగించారు. వారిలో ఒకరు ఉద్ధవ్ ఠాక్రే అయితే.. ఇంకొకరు రాజ్ ఠాక్రే. వరుసకు సోదర బంధం వారిది. కానీ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉన్న కాలంలోనే రాజ్ ఠాక్రే బయటకు వచ్చేశారు. శివసేనలో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఎమ్మెన్నెస్ అంటూ పార్టీ స్థాపించి తన ఉనికిని మహారాష్ట్రలో చాటుకునే యత్నం చేశారు. కానీ ఆయన ఆశించిన ఫలితాలు ఏమీ చూడలేకపోయారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసేందుకు సిద్ధమయ్యారు రాజ్ ఠాక్రే.శివసేనతో కలుస్తా..ప్రస్తుతం మహారాష్ట్రలో సైతం హిందీ భాషా యుద్ధం నడుస్తోంది. తమకు థర్ద్ లాంగ్వేజ్ గా హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వపు త్రి భాషా విధానంలో భాగంగా హిందీ థర్డ్ లాంగ్వేజ్ అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)తో పాటు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే తాము ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాజ్ ఠాక్రే తెలిపారు.ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలని ఉందని పేర్కొన్నారు. శివసేనతో కలిసి పోరాటం చేయటానికి నిశ్చయించుకున్నానని, అది కూడా వారికి ఇష్టమైతేనే అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక్కడ మరాఠీల కమ్యూనిటీని రక్షించడంతో పాటు మరాఠీ భాషను కాపాడుకోవడం ముఖ్యమన్నారాయన.మరి ఉద్ధవ్ ఏమన్నారంటే..తనతో రాజ్ ఠాక్రే కలుస్తానంటే ఏమీ ఇబ్బంది లేదన్నారు. తమ మధ్య భేదాభిప్రాయల కారణంగా ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నామని, రాజ్ వస్తానంటే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కాకపోతే మరాఠీ కమ్యూనిటీని వ్యతిరేకించే శక్తులను వెంటబెట్టుకు రావద్దని తన కండిషన్ అంటూ ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ మన శత్రువర్గాన్ని ఇంటికి ఆహ్వానించి.. వారికి భోజన తాంబూలం ఇచ్చే సాంప్రదాయాన్ని రాజ్ ఠాక్రే వదిలేతేనే తనతో కలవచ్చన్నారు. ఇక్కడ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్.. ఎన్డీఏకు దగ్గరై వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై అసహనంతో ఉన్న రాజ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) తో కలవడానికి సిద్ధం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.20 ఏళ్ల కిందటే.. బయటకుదాదాపు 19 ఏళ్ల కిందట బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెన్నెస్ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తన పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ను కలవడానికి సిద్ధమైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. -
Selenium శాపం: అప్పుడు వెంట్రుకలు.. ఇప్పుడు గోళ్లు
ముంబై: బుల్ధానా జిల్లాలోని షెగావ్ తాలూకా గ్రామాల ప్రజలను ‘సెలీనియం’శాపం వేధిస్తోంది. తాలుకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మంది గోళ్ల సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని బుల్దానా ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ బంకర్ తెలిపారు. సెలీనియం అధిక వినియోగం వల్లే... కాగా గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో షెగావ్ తాలూకా జాతీయ వార్తల్లో ప్రధానంగా నిలిచింది. తమకు హఠాత్తుగా బట్టతల వచ్చిందని, జుట్టు విపరీతంగా ఊడిపోయిందని పలువురు ఆరోగ్యశాఖ అధికారులను ఆశ్రయించారు. నిజనిజాలపై నిపుణులు ఆరా తీయగా రేషన్ దుకాణాలు పంపిణీ చేసిన గోధుమల్లో అత్యధిక శాతం సెలీనియం ఉండటం, దానిని వినియోగించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తేలింది. అయితే కొందరు ఈ వాదనను ఖండించారు. ఏది ఏమైనప్పటికీ బాధితులు తీవ్ర ఆవేదన చెందారు. కాగా తాజాగా షేగావ్ తాలూకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మందికి గోళ్ల సంబంధిత సమస్యలు తలెత్తాయి. కాగా సెలీనియం అధిక వినియోగం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చునని భావిస్తున్నట్లు అనిల్ బంకర్ తెలిపారు. గతంలో ఈ సమస్యను ఛేదించిన పద్మశ్రీ వైద్యుడు హిమ్మత్రావ్ బవాస్కర్రాత్రికి రాత్రే మహారాష్ట్రలోని బుల్ధానాలో, 4 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల 300 మంది గ్రామస్తుల ప్రజలు జుట్టు రాలిపోవడం, ఇతర సమస్యలతో బాధపడ్డాడు. తొలుతు దీనికి నీటి కాలుష్యం కారణమని అంతా భావించారు. కానీ తేలు కాటు చికిత్సలో తన కృషికి ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ దీన్ని నమ్మలేదు. 92 వేల రూపాయలకు పైగా సొంత ఖర్చులతో ఒక నెల రోజులపాటు పరిశోధన చేశారు. జుట్టు, రక్తం, మూత్రం, ఆహార నమూనాలను సేకరించి, ఆహారం, ఆహార వనరులు, లక్షణాలను నిశితంగా విశ్లేషించింది. దీనికి అధికమోతాదులో ఉన్న సెలీనియం కారణమని తేల్చారు. సురక్షితమైన పరిమితికి 600 రెట్లు ఎక్కువ ఉంటుంది. కలుషితమైన గోధుమలను,గోధుమ పిండి (అట్టా) పంపిణీతో, గ్రామస్తులు తెలియకుండానే వారి రోజువారీ భోజనం ద్వారా విషపూరిత స్థాయిలలో సెలీనియంను వినియోగించారని వెల్లడించారు.సెలీనియం ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలు దీర్ఘకాలంగా సెలీనియం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధినే సెలెనోసిస్ అంటారు.సెలీనియం అనేది ఒక రసాయన మూలకం. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. సెలీనియం ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది చిన్ని మొత్తంలోనే శరీరానికి అవసరం. జీవక్రియ, థైరాయిడ్ పనితీరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిసుంది. అయితే దీని వినియోగం ఎక్కువైతే కొన్ని దుష్పరిణామాలు తప్పవు.లక్షణాలు : జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం లేదా రాలిపోవడం, నోటిలో లోహ రుచి, శ్వాస వెల్లుల్లి వాసన, చర్మపు దద్దుర్లు, వికారం, విరేచనాలు, అలసట, చిరాకు, నాడీ వ్యవస్థలో లోపాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, తలనొప్పి.సెలీనియం విషప్రభావం తొలిలక్షణాలు: శ్వాసలో వెల్లుల్లి వాసన, నోటిలో లోహ రుచి.సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు: బ్రెజిల్ నట్స్ చేపలు, షెల్ షిఫ్ ఎర్ర మాంసం, ధాన్యాలు, గుడ్లు, కోడి మాంసం, కాలేయం, వెల్లుల్లి. ఇవీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్కరణ్ జోహార్ షాకింగ్ వెయిట్ లాస్ ఒజెంపిక్ ఇంజెక్షన్లే కారణమా? -
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
షెగావ్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడింది. ఆ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన వింత పరిస్థితి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.. అప్పుడు జుట్టు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు గోళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి బట్టతల కూడా వచ్చేసింది. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోయింది. జిల్లాలోని షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా జుట్టు సమస్య కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో సమస్యతో ఆ గ్రామాలు భయపడుతున్నాయి.ఇప్పుడు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు రాలిపోవడం, ముడతలు పడటం వంటి కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణం సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.ఇక్కడి గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోవడం, గోళ్లు రాలిపోవడానికా కారణం.. వారు తింటున్న గోధుములకు సంబంధముందని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ గోధుమల్లో సెలీనియం అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. గతంలో విపరీతంగా జుట్టు కోల్పోయిన వారిలో అనేక మంది ఇప్పుడు గోళ్ల సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. -
కావు కావు కాదు... హాయ్ హాయ్ : మాటలు నేర్చిన కాకి
సాధారణంగా చిలక పలుకులు అంటూ ఉంటాం కదా. రామచిలక మనిషి మాటలను అనుకరించడం మనకు తెలిసిందే. పెంపుడు పక్షి చిలుకు ముద్దార మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతుంది. తేనెలూరు ఆ మాటలు విని తెగ మురిసిపోతారు యజమానులు. ఇపుడు మాకేం తక్కువ అంటూ ఈ జాబితాలోకి వచ్చేసిందో కాకి. కాకి చేష్టలు, కారు కూతలు కావు... చక్కగా హాయ్.. హల్లో అంటూ పలకరిస్తూ.. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. సరైన శిక్షణ ఇస్తే.. ముద్దార నేర్పింపన్.. అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. పదండి ఆ విశేషాలేంటో చూద్దాం.అద్భుతమైన సామర్థ్యంతో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోందీ కాకి. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తుంది. మరాఠీలో మాట్లాడేస్తుంది. ఈ కాకి కావు కావు కాదు... హాయ్ హాయ్ అని అరుస్తుంది! అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఒక కాకి మనిషి మాటలను అనుకరిస్తూ అందరినీ బోలెడు ఆశ్చర్యపరుస్తోంది. వాడా తాలూకాలోని పాల్ఘర్కు చెందిన తనూజ ముక్నే అనే మహిళ తన తోటలో గాయపడిన కాకిని చూసి సపర్యలు చేసింది. కొన్ని రోజులు తరువాత కోలుకున్న కాకి తనూజ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. అంతేకాదు... మనుషులు మాట్లాడే మాటలను అనుకరించడం మొదలు పెట్టింది. ‘పపా’ ‘బాబా’ మమ్మీ’ అంటూ వరుసలు పెట్టి పిలవడం మొదలుపెట్టింది. దీంతో ఈ కాకి లోకల్ సెలబ్రిటీగా మారింది! View this post on Instagram A post shared by PUNE PULSE (@punepulse) -
‘షిండేపై గతంలోనూ దేశద్రోహి వ్యాఖ్యలు చేశారు కదా!’
ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట ఇచ్చింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యల కేసులో తాము తుది ఆదేశాలిచ్చేదాకా కమ్రాను అరెస్ట్ చేయొద్దంటూ బుధవారం ఆదేశాలు వెలువరించింది. కునాల్ కమ్రా వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఓ షోలో షిండేను ఉద్దేశించి పేరడీ సాంగ్ పాడే క్రమంలో ‘దేశద్రోహి’ అంటూ కునాల్ కమ్రా వ్యాఖ్యానించిన సంగతి తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగానూ ఖర్ పీఎస్‌లో కమ్రాపై కేసు నమోదు అయ్యింది. అయితే.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ కోత్వాల్, ఎస్ మోదాక్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.అయితే.. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అనే వ్యాఖ్యలు కేవలం కునాల్ కమ్రా ఒక్కరే చేయలేదని, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలు ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ వ్యాఖ్యలు చేశాయని(అప్పట్లో అజిత్ పవార్, ఉద్దవ్ థాక్రేలు షిండేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు), అయినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించలేదని కమ్రా తరఫు న్యాయవాది నవ్రోజ్ సీర్వై వాదించారు. కానీ, ఈ కేసులో కావాలనే తన క్లయింట్, అతని తల్లిదండ్రుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అంతేకాదు.. రాజకీయ పార్టీల నుంచి కునాల్‌కు బెదిరింపులు వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. పలు షోలలో కునాల్ కమ్రా ఇదే తరహాలో రాజకీయాలపై, రాజకీయ నేతలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడమూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అయితే.. కునాల్ క్వాష్ అభ్యర్థనను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిటెన్ వేణేగావోంకర్ బెంచ్‌ను కోరారు. ఇదేం చతురతతో కూడిన విమర్శ కానేకాదని.. వ్యక్తిగతంగా ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడమేనని వాదించారు. గతంలో ద్రోహి వ్యాఖ్యలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదనతో అంగీకరించిన పీపీ.. అలాగని ఇలాంటి వ్యవహారాలను చూస్తూ ఊరుకోకూడదన్నారు. అలాగే.. తనకు ప్రాణహాని ఉందని కునాల్ ముందుకు వస్తే భద్రత కలిగించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటిచింది. అంతకు ముందు ఇదే పిటిషన్‌పై విచారణ సందర్భంగా కునాల్‌కు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట అందించిన సంగతి తెలిసిందే. -
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
అదృష్టం ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో తెలియదు. నిన్న రోజున బీకరిని.. రేపటి రోజున కోటీశ్వరుడిని చేస్తుంది. ఇదే సమయంలో కోటిశ్వరుడిని.. బీకరిని సైతం చేయగలదు. అలాగని, అదృష్టం కోసం అక్కడే కూర్చుంటే.. అంతకన్నా బిగ్ మిస్టేక్ మరొకటి ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీంతో, సోషల్ మీడియాలో ఆయన పేరు చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పుసాద్ తాలూకా ఖుర్షి గ్రామంలో కేశవ్ షిండే అనే రైతు ఉన్నాడు. తన ఐదుగురు కొడుకులతో కలిసి తమకు ఉన్న ఏడు ఎకరాల భూమి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అనుకోని ఓ ఘటన వీరి జీవితాన్ని మలుపు తిప్పింది.కాగా, కేశవ్ షిండే ఊరి మీదుగా వార్దా-నాందేడ్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేశవ్ షిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు. షిండే పొలంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ.. ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని సేకరించింది. ఈ క్రమంలో షిండే తెలియని కొత్త అంశం బయటకు వచ్చింది.కేశవ్ షిండే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది. కేశవ్ షిండే పొలంలో మామిడి తోటలు, ఇతర పంటలు ఉండేవి. నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఏళ్ల తరబడిగా ఉన్నా.. వారికి ఆ విషయం తెలియలేదు. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు.. కొంతమంది రైల్వే ఉద్యోగులు సర్వే కోసం కేశవ్ షిండే ఊరికి వచ్చారు. వారిలో ఒక ఉద్యోగి.. ఈ విషయాన్ని గుర్తించి కేశవ్ షిండే కుటుంబానికి చెప్పారు. దీంతో షిండే ఫ్యామిలీ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేసింది. పొలంలో రైల్వే లైన్ వెళ్తుండటంతో కేశవ్ షిండే పొలానికి రైల్వే శాఖ పరిహారం అందించింది. అయితే తమ పొలంతో పాటుగా అందులో ఉన్న ఎర్రచందనం చెట్టు, పంటకు కూడా పరిహారం చెల్లించాలని కేశవ్ షిండే, ఆయన కొడుకులు డిమాండ్ చేశారు. ఎర్రచందనం చెట్టు విలువ లెక్కగట్టాలని అటవీ శాఖకు లేఖ రాశారు. కానీ, అధికారులు ఎర్రచందనం చెట్టుకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో కేశవ్ షిండే కుటుంబం.. జిల్లా కలెక్టర్, అటవీ, రైల్వే, నీటి పారుదల శాఖల అధికారులను ఆశ్రయించారు. అయినప్పటికీ, ఎలాంటి పరిహారం అందకపోవటంతో 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ వేశారు.షిండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం చెట్టు పరిహారం కోసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది. కోటి రూపాయలను నాగ్‌పూర్ బెంచ్‌లో డిపాజిట్ చేయాలని.. ఇందులో నుంచి రూ.50 లక్షలు కేశవ్ షిండే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9న బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయగా.. రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేసింది. దీంతో, ఈ కేసులో కేవలం ఏడాదిలోనే కేశవ్ షిండే కుటుంబం విజయం సాధించింది. కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు వయసు 100 ఏళ్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ దాదాపు రూ.5 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఔరంగజేబ్ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే
రాయ్‌గఢ్: జగజ్జేత(అలంగీర్)నని చెప్పుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జీవితమంతా మహారాష్ట్రలో మరాఠాలతో పోరాటంతోనే గడిపి, ఓటమిపాలై ఈ గడ్డపైనే సమాధి అయ్యాడని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. శివాజీ 345 వర్ధంతి సందర్భంగా ఆయన శనివారం రాయ్‌గఢ్ కోటలో ఆయనకు నివాళులరి్పంచారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి సూపర్ పవర్‌గా ఎదగాలన్న భారతదేశం లక్ష్యానికి శివాజీ మహారాజే స్ఫూర్తి అని అమిత్ షా పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మహారాష్ట్రకు మాత్రమే పరిమితం చేయవద్దని ప్రజలకు ఆయన విజŠక్షప్తి చేశారు. శివాజీ దీక్ష, పట్టుదల, సాహసం దేశానికే ఆదర్శమని, సమాజంలోని అన్ని వర్గాలను వ్యూహాత్మకంగా ఆయన ఏకం చేశారని చెప్పారు. మారాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న రాయ్‌గఢ్ కోటలోని శివాజీ సమాధి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంభాజీనగర్ జిల్లా ఖుల్టాబాద్‌లో ఉన్న 17వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి సమాధిని మరో చోటుకు తరలించాలన్న డిమాండ్లు ఇటీవల ఎక్కువైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
విదేశాల్లో ఉద్యోగాలని.. ‘సైబర్’ బానిసలుగా మార్చారు
ముంబై: మయన్మార్‌లో సైబర్ బానిసలుగా బతుకీడుస్తున్న 60 మందికి పైగా భారతీయులను మహారాష్ట్ర పోలీసుల సైబర్ విభాగం రక్షించింది. ఒక విదేశీ పౌరుడు సహా ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల మేరకు... థాయ్‌లాండ్‌లో మంచి ఉద్యోగావకాశాలున్నాయంటూ మొదట సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా ఓ ముఠా ప్రకటనలిచ్చిందిది. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు అమాయకులను సదరు ముఠా ఏజెంట్లు పాస్‌పోర్టులు, విమాన టికెట్లు ఏర్పాటుచేసి పర్యాటక వీసాలపై థాయ్‌లాండ్‌కు, అక్కడినుంచి మయన్మార్ సరిహద్దుకు పంపారు. ఆ తరువాత చిన్న పడవల్లో వారిని నది దాటించి సాయుధ తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రదేశాల్లో దింపారు. అక్కడ వారితో బలవంతంగా చీడిజిటల్ అరెస్ట్’ స్కామ్‌ల నుంచి నకిలీ పెట్టుబడి పథకాల దాకా అనేక సైబర్ మోసాలు చేయించారు. దీనిపై సమాచారమందుకున్న మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం , ఇతర ఏజెన్సీలతో కలిసి బాధితులను రక్షించింది. త్వరలోనే వీరిని స్వదేశానికి తీసుకురానున్నారు. చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులుమనీష్ గ్రే సహా నలుగురి అరెస్టు రిక్రూట్మెంట్ ఏజెంట్లుగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీష్ గ్రే అలియాస్ మాడీ, తైసన్ అలియాస్ ఆదిత్య రవి చంద్రన్, రూపనారాయణ్ రాంధర్ గుప్తా, జెన్సీ రాణి డి మరియు చైనీస్–కజకిస్తానీ జాతీయుడు తలానిటి నులాక్సీలను అరెస్టు చేసింది. వీరిలో మనీష్ గ్రే పలు వెబ్ సిరీస్‌లు టెలివిజన్ షోలలో నటించిన ప్రొఫెషనల్ నటుడు అని కొంతమంది వ్యక్తులను నియమించుకుని మయన్మార్‌కు మనుషులను అక్రమ రవాణా చేశాడని పోలీసులు తెలిపారు. తలానిటి నులాక్సీ భారతదేశంలో సైబర్ నేరాలకు పాల్పడేలా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, తదుపరి దర్యాప్తు కొనసా గుతోందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో? -
షిర్డీ సంస్థాన్‌కు 4.26 కోట్ల ‘రామ నవమి’ ఆదాయం
శిర్డీ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 నుంచి మొదలైన శ్రీరామ నవమి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాల సమయంలో 2.5లక్షల మంది సాయినాధుని దర్శించుకున్నారని, సంస్థానానికి రూ.4.26 కోట్ల ఆదాయం సమకూరిందని సంస్థాన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్రాజ్ దారాడే మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే భక్తులు 83.3 గ్రాముల బంగారం, 2,030 గ్రాముల వెండి సమర్పించినట్లు పేర్కొన్నారు. షిర్డీ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడికి ప్రపంచము నలుమూలల నుండి సాయి భక్తులు వస్తుంటారు. సాయికి భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.ఇదీ చదవండి: ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకు మహిళలపై దారుణంగా దాడి -
‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకు మహిళలపై దారుణంగా దాడి
మరాఠీలో బదులు ఇంగ్లీషులో మాట్లాడినందుకు మహిళలని కూడా చూడకుండా ఇద్దరిపై కొందరు వ్యక్తులు అమానవీయ దాడికి పాల్పడ్డ సంఘటన డోంబివిలీలోని విష్ణునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల మేరకు..మంగళవారం డోంబివిలీలో ఇద్దరు మహిళలు తొమ్మిదినెలలపాపతో సహా ఓ స్కూటీపై తాము నివసించే హౌసింగ్ సొసైటీ ఆవరణలోకి ప్రవేశిస్తుండగా ప్రవేశ ద్వారానికి అడ్డుగా ఉన్న యువకుడిని తప్పుకోమంటూ ‘ఎక్స్‌క్యూజ్‌మీ’అని అడిగారు. దీనికి కోపోద్రిక్తుడైన ఆ యువకుడు అతను మరాఠీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ పైపైకి దూసుకువచ్చాడు. అంతటితో ఆగకుండా మహిళల్లో ఒకరి చేయిని మెలితిప్పాడు. అదే సమయంలో అతని కుటుంబానికి చెందిన మరికొంతమంది వారిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కేవలం ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకే ఇంతలా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని బాధిత మహిళలు వాపోయారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు విష్ణునగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ పవార్ తెలిపారు. -
ఎడబాటు మానసికమా? భౌతికమా?
కాలం మారుతోంది... కాలం మారితే కొత్త ప్రశ్నలు వస్తాయి.భర్త మరణించిన తర్వాత స్త్రీల పట్ల వివక్షాపూరితమైన వ్యవహారశైలిమన దేశంలో అన్ని మతాలలో ఉంది.అయితే ఆ ఎడబాటును మానసికంగా ఉంచుకుంటే చాలదా... భౌతిక ఆనవాళ్లతో వివక్షకు గురవ్వాలా అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది. అక్కడి 7000 గ్రామాలు వితంతువులు తాము వితంతువులుగా వెలిబుచ్చే చిహ్నాలతో ఉండాల్సిన పనిలేదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్రామాల సంఖ్య ఇంకా పెరగనుంది.నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకుంటుంటే అందరూ అభ్యంతర పెట్టారు... వితంతువుకు చదువు ఏంటని. నా వయసు 42. ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాడు. చదువుకుని టీచర్ అయి నా పిల్లలను చూసుకోవాలని నా ప్రయత్నం. అందుకోసం సల్వార్ కమీజ్ వేసుకుని బయటకు వచ్చినా తప్పే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది’ అంది సోనాలి పాట్దర్. ఈమెది కొల్హాపూర్‌లోని అంబప్ అనే గ్రామం. ఈమే కాదు పశ్చిమ మహారాష్ట్రలోని సుగర్ బెల్ట్‌గా చెప్పుకునే ప్రాంతంలో ఒక విప్లవంలా ఉద్యమం రేగి వితంతువులు వివక్ష లేకుండా జీవించే మార్పులు జరుగుతున్నాయి.గ్రామాలే మారాలి... మారాయిమన దేశంలో గ్రామాల్లోనే పట్టింపు ఎక్కువ. ముఖ్యంగా వితంతువులకు గ్రామాల్లో ఎక్కడా లేని అనాదరణ ఉంటుంది. వాళ్లు బొట్టు, గాజులు, పూలు పెట్టుకోకూడదు. మంగళసూత్రం వేసుకోకూడదు. శుభకార్యాలకు రాకూడదు. కొన్నిచోట్లయితే గణేశ్ ఉత్సవాలకు వచ్చినా ఊరుకోరు. వీరిని పనిలో కూడా పెట్టుకోరు. కొన్ని ఇళ్లల్లో వీరు రావాల్సిన ఆస్తి రాక అవస్థలు పడుతుంటారు. వితంతువులు కావడం వారి తప్పా? భర్త చన΄పోయిన బాధ ఒకవైపు... బయట సమాజం నుంచి వచ్చే బాధలు మరోవైపు. తమ బాధ మానసికంగా ఉంచుకుని బయట మామూలు జీవితం గడిపే హక్కు తమకు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.2022లో మొదలైన ఉద్యమంమహారాష్ట్రలో పేరు పొందిన ప్రమోద్ జింజడే అనే సామాజిక కార్యకర్త పల్లెల్లో వితంతు స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఒకరోజు గమనించాడు. ‘భర్త చనిపోయాక ఒక స్త్రీ అతని గుర్తుగా బొట్టూ గాజులు ఉంచుకుంటానని బతిమిలాడుతుంటే సాటి స్త్రీలు వాటిని తొలగించడం చూశాను’ అన్నాడాయన. 2022లో ఒక అర్ధరాత్రి ఆయనకు సుస్తీ చేసింది. ప్రాణంపోపోయే స్థితి. కాని బయటపడ్డాడు. ఆయన ‘కర్మలా’ అనే ఊరిలో ఉంటాడు. వెంటనే ఆయన కర్మలా తాసిల్దార్ దగ్గరకు వెళ్లి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశాడు. ‘నేను చనిపోతే నా భార్య వొంటి మీద బొట్టు గాజులు మంగళసూత్రం తీసే హక్కు ఎవరికీ ఉండకూడదు. అలా చేసినవారిని చట్టపరంగా శిక్షించాలి’ అని ఆ అఫిడవిట్ సారాంశం. అక్కడున్న వారు ప్రమోద్‌కు పిచ్చెక్కిందనుకున్నా క్రమంగా ఈ సంగతి ప్రచారం పొందింది. మే 2022లో ఈ ఘటన జరిగితే వెంటనే ‘హెర్వాడ్’ అనే పల్లె నుంచి ఈ ఉద్యమం మొదలైంది.ముక్తి పొందిన 7,683 గ్రామాలుమహారాష్ట్రలో ఇప్పటికి 7,683 గ్రామాలు, 1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపం అని తీర్మానాలు చేశాయి. వితంతువులు తమకు నచ్చిన ఆహార్యంతో ఉండవచ్చని, అన్ని చోట్లకు రాక΄ోకలు సాగించవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని అవి వారిని ్ర΄ోత్సహించడానికి ముందుకొచ్చాయి. కొన్నిచోట్ల ఆగస్టు పదిహేనున వితంతువులతో జెండా వందనం కూడా చేయిస్తూ ఉన్నారు. ‘ఈ ఉద్యమం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ముందుగా గోవా అందుకుంది’ అని ఉద్యమకారులు అంటున్నారు. భర్త చనిపోయాక నిరాశ నిస్పృహల్లో ఉన్న స్త్రీలకు సమాజమే బాసట. దాని నుంచి వందల ఏళ్లుగా ఎదుర్కొంటున్న వివక్షతో ఎంత మంది స్త్రీలు కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకుంటే ఈ ఉద్యమం అవసరం తెలిసి వస్తుందని ఈ ఉద్యమకారుల వాదన. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. 78 శాతం గురించి ఆలోచించాలిమన దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి సంఖ్య సుమారు ఐదున్నర కోట్లు ఉంది. వీరిలో 78 శాతం స్త్రీలు. వీరిలో 32 శాతం సగటున 40 ఏళ్ల వయసున్న వారు. ఈ వయసు స్త్రీలు ఇందరు వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లలేక΄ోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది. బహుశా ఈ స్త్రీలే తమ ఆకాంక్షలను సమాజానికి మరింత గట్టిగా తెలియ చేస్తారు. -
రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడు. గతేడాదే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్.. ఇవాళ (ఏప్రిల్ 8) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. పలు కథనాల ప్రకారం జాదవ్ ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే కేదార్‌ను భాజపాలోకి ఆహ్వానించనున్నాడు. కేదార్ మహా సీఎం ఫడ్నవిస్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Former cricketer Kedar Jadhav set to start his political career Details:👉 https://t.co/2tpIz8m7ju pic.twitter.com/ftEYmpgP3u— CricTracker (@Cricketracker) April 8, 202540 ఏళ్ల కేదార్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. కేదార్ వన్డేల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1389 పరుగులు చేసి 27 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 122 పరుగులు చేశాడు. కేదార్ చాలా మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2017లో పూణేలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 120 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.టీమిండియాకు ఆడకముందే కేదార్ ఐపీఎల్లో మెరిశాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శనల కారణంగానే అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేదార్ 2010లో ఐపీఎల్‌లోకి ప్రవేశించి వివిధ ఫ్రాంచైజీల తరఫున (కొచ్చి టస్కర్స్ కేరళ, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, సన్‌రైజర్స్) 95 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 123.11 స్ట్రయిక్‌రేట్‌తో, 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. మహారాష్ట్ర మిడిలార్డర్లో కేదార్ చాన్నాళ్ల పాటు కీలక సభ్యుడిగా ఉన్నాడు. కేదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 9 సెంచరీలు చేశాడు. 2013-14 రంజీ సీజన్ కేదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ సీజన్లో అతను 1000కి పైగా పరుగులు చేయడమే కాకుండా ఓ ట్రిపుల్ సెంచరీ (327) కూడా చేశాడు. కేదార్ 2024 జూన్ 3న క్రికెట్లోని అన్ని ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. -
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతును తిలకించడానికి పట్టణంలోని నలుమూలల నుంచి తెలుగు భక్తులు, ఉత్తరాది ప్రజలతో పాటు రాజకీయ నాయకులు వందల సంఖ్యలో విచ్చేసి దర్శన భాగ్యాన్ని పొందారు. పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పద్మనగర్ ప్రాంతంలో గల శ్రీరామ మందిరంలో సీతారామ కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ మందిర్ ట్రస్ట్ నేతృత్వంలో 36వ వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు సీతారాములకు కల్యాణం వేద పండితులు గాజుల చంద్రశేఖర్, ద్యావణపెల్లి ఆనందం, వడిగొప్పుల శంకర్, గెంట్యాల గంగాధర్, శ్యావు మహారాజ్ పంతులు భద్రాచలంలో జరిపించే విధంగా మందిరం ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో మంగళవాయిద్యాల మధ్య కల్యాణ తంతు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయక మంత్రి కపిల్ పాటిల్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు హర్శల్ పాటిల్, మాజీ స్థానిక కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, సుమిత్ పాటిల్, స్థానిక మీనా బాలకిషన్ కల్యాడపు, పద్మ భూమేశ్ కల్యాడపు, అఖిల పద్మశాలీ సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కల్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లే సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, మాజీ అధ్యక్షుడు యేముల నర్సయ్య, కొంక మల్లేశం, సుంక శశిధర్, నిష్కం భైరి, భీమనాథిని శివప్రసాద్, బాలె శ్రీనివాస్, ట్రస్టీలు ఎస్.మల్లేశం, పాశికంటి లచ్చయ్య, పద్మశాలీ సమాజ్ యువక్ మండలి అధ్యక్షుడు వాసం రాజేందర్, మందిర కార్యవర్గ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల పదాధికారులు, పట్టణ వ్యాప్తంగా కామత్‌ఘర్, బాలాజీనగర్, బండారి కంపౌండ్, కన్నేరి, పాంజలాపూర్, నయీబస్తీ నుంచి తెలుగు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణతంతు అనంతరం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం చేపట్టిన అన్నదానం కార్యక్రమంలో సుమారు 12 వేల మంది భక్తులు హాజరయ్యారని శ్రీరామ మందిర ధర్మదాయ విశ్వస్త సంస్థ ట్రస్టీ డాక్టర్ అంకం నర్సయ్య తెలిపారు. పల్లకి ఊరేగింపు..సాయంత్రం 6 గంటలకు స్వామి వారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో 108 గంగా జలాలతో కూడిన కలశాలను మహిళలు తలపై పెట్టుకొని రామ నామం జపిస్తూ పద్మనగర్ పుర వీధులు రామ మందిరం నుంచి కన్నేరి, పీటీ హైసూ్కల్, పాయల్ టాకీజ్, ధామన్‌కర్ నాక, బాజీ మార్కెట్, బాలాజీ మందిరం, దత్తా మందిరం నుంచి తిరిగి రామ మందిరాన్ని రాత్రి 10 గంటల వరకు జరిగింది. ఊరేగింపులోని ప్రతి పురవీధిలో డీజే సౌండ్ సిస్టమ్‌ల మధ్య నృత్యాలు చేస్తూ స్వామివారి పల్లకికి స్వాగతం పలికారు. అలాగే చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భజన మండలి వారి శ్రీరామనామ కీర్తలను ఆలకించారు. స్వామివారిని దారి మధ్యలో భక్తులు మంగళ హారతులు పట్టి, టెంకాయలను కానుకలు సమర్పించు కున్నారు. రాత్రి ఊరేగింపులో పాల్గొన్న సుమారు వేయి మందికి నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ మైన సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. హనుమాన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ప్రతి సంవత్సరం మాదిరిగానే హనుమాన్ మాలధారణ ధరించిన భక్తులు 56 అడుగుల భక్తాంజనేయ స్వామి మందిరంలో సీతారాముల కల్యాణం గురుస్వామి కోడూరి మల్లేశం, అధ్యక్షుడు గుండేటి నాగేశ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు మాలధారణ ధరించిన దీక్షాస్వాములు వారం రోజులుగా హోమాలు, అభిõÙకాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాములకు ప్రత్యేక అలంకరణలతో పాటు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్న ముహూర్తమున సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచి, తంతు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి భక్తులు కానుకలు, ఒడిబియ్యం సమర్పించుకున్నారు. అనంతరం జరిగిన అన్నదానంలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారని వడ్లకొండ రాము తెలిపారు. -
Rama Navami 2025: రామాయణం మానవజాతికి దిక్సూచి
‘భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. రామాయణాది పౌరాణికాలు మానవజాతికి దిక్సూచి లాంటివి. మనిషి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలని రామాయణం మనకు నేర్పుతుంది. ఇందులో ప్రతి పాత్ర ఆదర్శవంతమే’ అని జస్టిస్ బి.ఎన్.కృష్ణ ఉద్ఘాటించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆంధ్ర మహాసభ, వేంకటేశ్వర పూజా మందిరం ట్రస్ట్ సంయుక్తంగా, శనివారం సాయంత్రం దాదర్ హిందూ కాలనీలోని ఆచార్య బి.ఎన్.వైద్య సభాగహంలో నిర్వహించిన రామాయణం నృత్యరూపక కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగులో ప్రదర్శించిన ఈ నృత్యరూపకం కనులపండువగా సాగింది. దర్శకత్వంతో పాటు కళాకారుల అభినయం అద్భుతంగా ఉంది’ అని కొనియాడారు. తొలుత ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ సభకు స్వాగతం పలికారు. ముందుగా పరిచయాత్మకంగా జరిగిన వేదిక కార్యక్రమంలో స్థానిక లోక్‌సభ సభ్యులు అనిల్ దేశాయ్, ఎమ్మెల్సీ సునీల్ శిందే పాల్గొన్నారు. అనిల్ దేశాయ్ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ గత తొమ్మిది దశాబ్దాలుగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అసామాన్యమైన సేవలందిస్తోందని, తెలుగువారికి, మరాఠీయులకు పురాతన కాలం నుంచి అవినాభావ సంబంధాలున్నాయని, ఆంధ్ర మహాసభ అభివృద్ధి పనుల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి తప్పకుండా సహాయం అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ తదితరులు అనిల్ దేశాయ్‌ని, సునీల్ శిందేని ఘనంగా సన్మానించారు. కనువిందు చేసిన నృత్యరూపకం తర్వాత జగన్నాథాచార్యులు రచించగా, సూర్యారావు సంగీత దర్శకత్వంలో, సూర్యనారాయణ గాత్ర సహకారంతో, భాగవతుల వెంకట రామశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన రామాయణం నృత్యరూపకం సభికుల్ని అక్షరాలా మంత్ర ముగ్ధుల్ని చేసింది. సంగీతం, గానానికి అనుగుణంగా నటీ నటుల అభినయం వీక్షించిన రసికుల్ని అబ్బురపరిచింది. రామాయణంలోని సీతా స్వయంవరం, పరుశరామ గర్వభంగం, మందర కైకేయి సంవాదం, శూర్పణక నాసికా ఖండనం, సీతాపహరణ దశ్యం, వాలి వధ, రామ రావణ యుద్ధం, చివరికి శ్రీరామ పట్టాభిõÙకం తదితర ప్రధాన ఘట్టాల్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ఆయా ఘట్టాల్లో సభికులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయా సందర్భాల్లో ఎంతో భావోద్వేగాలకు గురయ్యారు. దశాబ్దాల తర్వాత ఇంతటి అద్భుతమైన నృత్యరూపకాన్ని చూశామని ప్రేక్షకులు కొనియాడారు. విజయవాడకు చెందిన శ్రీనత్య అకాడమీ వారు ప్రదర్శించిన ఈ నృత్యరూపకంలో రాముడిగా, బి.ఎన్.ఎన్.సౌమ్య, సీతగా అలకనందాదేవి, రావణుడిగా సీహెచ్ రామకృష్ణ అనితరసాధ్యంగా నటించారు. తతిమ్మ నటీనటులు కూడా తమతమ పాత్రల్లో జీవించారు. ప్రముఖ రచయిత్రి తురగా జయశ్యామల, రవీంద్ర దంపతులు రూపకం తీరుకు ఆనందించి అప్పటికప్పుడే ఆర్థిక సహాయం అందించారు. రూపకం ప్రదర్శనానంతరం అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ, చక్కటి కార్యక్రమాలకు ప్రేక్షకాదరణ ఉంటుందని రుజువైందని, భవిష్యత్తులో కూడా వివిధ ప్రక్రియలకు సంబంధించిన నాణ్యమైన కార్యక్రమాల నిర్వహణకు ఆంధ్ర మహాసభ కట్టుబడి ఉందని ప్రకటించారు. తెలుగేతర నేలపై తెలుగు భాషా సంస్కృతుల్ని పరిరక్షించడమే కాకుండా, వాటి వికాసానికి కూడా మహాసభ తప్పకుండా ప్రయతి్నస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తలు బోగ సహదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, సంగం ఏక్నాథ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, పరిపాలన విభాగ ఉపాధ్యక్షుడు తాల్ల నరేశ్, సాహిత్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్, సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్, సంయుక్త కార్యదర్శి అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేశ్, చిలుక వినాయక్, కూచన్ బాలకృష్ణ, శేర్ల ప్రహ్లాద్, మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్యదర్శి పిల్లమారపు పద్మ, ఉపాధ్యక్షురాలు వి.శ్యామల రామ్మోహన్, సభ్యులు బోగ జ్యోతిలక్షి్మ, వీరబత్తిని రాజశ్రీ, తాళ్ల వనజ, పూజా మందిరం ట్రస్ట్ చైర్మన్ జి.హరికిషన్, కార్యదర్శి నూకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్ సభకు వందన సమర్పణ చేశారు. -
విమానంలో వృద్దురాలు మృతి.. అత్యవసర ల్యాండింగ్
ఔరంగాబాద్: విమానంలో ప్రయాణిస్తున్న ఒక వృద్దురాలు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి ముంబై నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. విమానంలో ప్రయాణిస్తున్న వృద్దురాలు సుశీలా దేవి(89) అస్వస్థతకు గురయ్యింది. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి సమీపంలోని చత్రపతి సంభాజీనగర్‌లోని చికల్థానా విమానాశ్రయం(ఔరంగాబాద్ విమానాశ్రయం, మహారాష్ట్ర)లో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయింది.అక్కడికి చేరుకున్న వైద్య బృందం సుశీలా దేవిని పరీక్షించింది. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వారు నిర్ధారించారు. విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అస్వస్థతకు గురైనప్పుడు విమానం గాలిలో ఉంది. సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అత్యవసర ల్యాండింగ్(Emergency landing) తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు అవసరమైన చట్టపర ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం ఆ ఇండిగో విమానం వారణాసి వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.కాగా సుశీలా దేవి మృతదేహాన్ని చత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గత నెలలో జైపూర్ నుండి చెన్నైకి వెళుతున్న విమానానికి సంబంధించిన టైర్ పేలిన ఘటన జరిగింది. అయితే ఈ ఉదంతంలో ఎవరూ గాయపడలేదు. ఈ రెండు సంఘటనలు విమాన ప్రయాణంలో భద్రత, అత్యవసర చర్యల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్