
భారతదేశంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నరాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఒకటి. అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులకు ఈ రాష్ట్రం నిలయం. 2025లో సంపద విషయంలో మహారాష్ట్ర ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. మొత్తం మీద ఇండియాలోని బిలియనీర్లు ఇప్పుడు 1.1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది 2019తో పోలిస్తే.. రెట్టింపు కంటే ఎక్కువ. ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా వంటి దిగ్గజాలు ఈ రాష్ట్రానికి చెందినవారే. ఈ కథనంలో మహారాష్ట్రలోని కుబేరులు ఎవరో తెలుసుకుందాం.
➤ముఖేష్ అంబానీ: 119.5 బిలియన్ డాలర్లు
➤దిలీప్ సంఘ్వీ & ఫ్యామిలీ: 32.4 బిలియన్ డాలర్లు
➤రాధాకిషన్ దమాని & ఫ్యామిలీ: 31.5 బిలియన్ డాలర్లు
➤కుమార్ మంగళం బిర్లా: 24.8 బిలియన్ డాలర్లు
➤సైరస్ పూనవాలా: 24.5 బిలియన్ డాలర్లు
➤బజాజ్ ఫ్యామిలీ: 23.4 బిలియన్ డాలర్లు
➤షాపూర్ మిస్త్రీ & ఫ్యామిలీ: 20.4 మిలియన్ డాలర్లు