అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జూలై 12న అత్యంత ఘనంగా, విలాసవంతంగా జరిగింది. ఈ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.
పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్‌తక్ ప్రకారం, పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్ రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్‌వర్త్ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి ఎగిసింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ నెట్‌వర్త్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90% రాబడిని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment