daughter in law
-
సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తండ్రి, కొడుకులను కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. చిలమత్తూరు మండలం బొమ్మనపల్లిలో ఘటన చోటుచేసుకుంది. పేపర్ మిల్లులో వాచ్మెన్ కుటుంబంపై దాడి చేసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం సత్యసాయి జిల్లాకు వలస వచ్చారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వారి నివాసానికి వచ్చి దారుణానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఎస్పీ రత్న పరిశీలించారు.ఇదీ చదవండి: వామ్మో ఇన్ని ట్విస్టులా.. పోలీసులే అవాక్కయ్యారు! -
చెవి కొరికిన కోడలు.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన అత్త
సాక్షి,గుంటూరు:అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో మంగళవారం(అక్టోబర్8)జరిగింది.కుటుంబ కలహాల నేపధ్యంలో అత్త నాగమణి,కోడలు పావని మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలోనే అత్త చెవిని కోడలు పావని కొరికింది. బలంగా కొరకడంతో అత్త చెవిలోని ఒక ముక్క ఊడిపడింది.ఊడిపడిన చెవి ముక్కను తీసుకుని అత్త నాగమణి గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చింది.చెవి ముక్క తెగిపోయి సమయం ఎక్కువవడంతో తిరిగి అతికించడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు. ఇదీ చదవండి: ధర్మవరం సీఐ కిడ్నాప్ ఆపై హత్య -
పెళ్లి చేసుకున్న అత్తాకోడళ్లు!.. ఇదేం కర్మరా బాబు
-
చురుకైన ఈ ఎంటర్‌ప్రిన్యూర్ అనిల్ అంబానీ కోడలు
ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ఈనెల 12న అత్యంత విలాసంగా జరిగింది. అబ్బురంగా జరిగిన ఈ వేడుకల విశేషాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సోదరుడు, పెద్దగా వార్తల్లో లేని అనిల్ అంబానీ కోడలు ఎంటర్‌ప్రిన్యూర్ క్రిషా షా (Khrisha Shah) గురించి, ఆమె వ్యవస్థాపక స్ఫూర్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనిల్ అంబానీ, టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీని క్రిషా షా వివాహం చేసుకున్నారు. క్రిషా నికుంజ్ ఎంటర్ప్రైజెస్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివంగత నికుంజ్ షా, ఫ్యాషన్ డిజైనర్ నీలం షా కుమార్తె ఈ క్రిషా షా. ఈమెకు ఇద్దరు పెద్ద తోబుట్టువులు ఉన్నారు. సోదరుడు మిషాల్ షా వ్యాపారవేత్త కాగా సోదరి నృతి షా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్.ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. క్రిషా షా, జై అన్మోల్ అంబానీలు వారి కుటుంబాల ద్వారా పరిచయం అయ్యారు. కొన్నేళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో వీరి వివాహం కూడా విలాసవంతంగానే జరిగింది.‘డిస్కో’ స్థాపనక్రిషా షా వృత్తిపరమైన ప్రయాణం యూకేలో యాక్సెంచర్ సంస్థలో ప్రారంభమైంది. అక్కడ ఆమె భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ సర్వీస్ ప్రాజెక్ట్‌లలో సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత ఆమె భారీ సంపాదననిచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ఏర్పాటు కలల వైపు పయనించారు. అలా సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ ‘డిస్కో’ను స్థాపించారు. ఇది ప్రొఫెషనల్స్ కోసం ఆన్లైన్ హైపర్ లోకల్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. ఫ్రీలాన్సర్లు, ఎంటర్‌ప్రిన్యూర్లు, ప్రొఫెనల్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వొచ్చు. తమ విశేషాలను పంచుకోవచ్చు.ఎంటర్ప్రిన్యూర్గానే కాకుండా క్రిషా షా సామాజిక కార్యకర్త, మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా. ప్రేమ, ఆశ, శాంతి, ఐక్యత విలువలను ప్రోత్సహించే సాంస్కృతిక, మానసిక ఆరోగ్య అవగాహన చొరవ అయిన #LOVEnotfear అనే ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. క్రిషా షా విద్యా నేపథ్యం విషయానికి వస్తే యూఎస్‌లోని యూసీ బర్కిలీ నుంచి పొలిటికల్ ఎకానమీలో బీఏ, ఇంగ్లండ్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషల్ పాలసీ అండ్ డెవలప్మెంట్లో ఎంఎస్సీ పట్టా పొందారు.జై అన్మోల్ అంబానీ, క్రిషా షా దంపతులు ప్రస్తుతం అనిల్ అంబానీ, టీనా అంబానీలతో కలిసి ముంబైలోని పాలి హిల్‌లోని సంపన్న నివాస ప్రాంతంలో తమ 17-అంతస్తుల ఇల్లు, అబోడ్లో నివసిస్తున్నారు. వార్తా సంస్థ డీఎన్ఏ ఇండియా ప్రకారం దీని విలువ రూ. 5,000 కోట్లు. -
ఉపాసన పుట్టినరోజు స్పెషల్.. మెగా ఫ్యామిలీ కోడలా మజాకా! (ఫొటోలు)
-
కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!
అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జూలై 12న అత్యంత ఘనంగా, విలాసవంతంగా జరిగింది. ఈ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్‌తక్ ప్రకారం, పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్ రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్‌వర్త్ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి ఎగిసింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ నెట్‌వర్త్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90% రాబడిని అందుకున్నారు. -
మరణశయ్యపై భర్తకు మాట...తోడుగా కోడలు : 67 ఏళ్ల వయసులో
అబ్బ! వంటలు భలే ఉన్నాయండి..అంటూ అతిథులు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే కష్టపడి వండిన వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కేరళలోని అలప్పూలో నివసించే మహిళ ఫిలోకు కూడా అంతే. పెళ్లిళ్లు, పేరంటాలు, పార్టీలు అంటే చాలు కష్టపడి వెజ్.. నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేసి ఇచ్చేసేది. ఆమె పికెల్స్కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆమె చేతి మహిమను అర్థం చేసుకోవచ్చు. మధ్యలో ఆటంకాలొచ్చినా.. చివరికి భర్తకిచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్తగా మారిపోయింది. బెటర్ ఇండియా అందించిన వివరాల ప్రకారం స్టోరీ ఏంటంటే..ఫిలో ఇంటర్ అయిపోయిన వెంటనే ఒక ఇంటికి భార్యగా వెళ్లిపోయింది. చిన్నప్పటినుంచి వంటలు చేయడం ఆసక్తి. ఇక పచ్చళ్లలో ఆమె చేయని ప్రయోగం లేదని చెప్పవచ్చు. అలాగే ఏదైనా చేయాలనే గాఢమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే 2015లో భర్త, కోడలు టిన్సీ సాయంతో ఊరగాయ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. కానీ మొదట్లో పెద్దగా విజయంసాధించలేదు. మళ్లీ తిరిగి కోడలి సహకారంతో ఫిలో 60 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా అవతరించింది. అత్తాకోడళ్లు ద్వయం విజయవంతంగా వ్యాపారాన్ని నడిపించారు. View this post on Instagram A post shared by മുഹമ്മ ക്കാരൻ (@muhammakkar)కేవలం ఫేస్బుక్ పేజీతో చిన్న స్థాయిలోనే వ్యాపారాన్ని ప్రారంభించారు. చికెన్, స్వీట్ లైమ్, బీఫ్ వంటి రెండు మూడు రకాల ఊరగాయలను విక్రయించేవారు. కేవలం నోటి మాట ద్వారానే అయినా వ్యాపారం బాగానే సాగింది. మళ్లీ అనుకోకుండా భర్త థామస్ అనారోగ్యం కారణంగా వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కేన్సర్‌తో బాధపడుతూ మూడు నెలలు ఆయన ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఆ తరువాత కూడా చికిత్స కోసం తరచుగా వెల్లూరుకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వ్యాపారం ముందుకు సాగలేదు. ఇదంతా గమనించిన థామస్ తన భార్యకు ఒకటే మాట చెప్పారు. ‘ఫిలో.. నీలో చాలా టాలెంట్ ఉంది. నీ పచ్చళ్లు అందరికీ నచ్చుతాయి. ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంది. వ్యాపారాన్ని కొనసాగించు. ఏదో ఒకరోజు కచ్చితంగా నువ్వు గొప్పదానివి అవుతావు. నామాట విను’’ అంటూ తన కోరికను వెల్లడించారు.ఆ మాటలే వేదమంత్రాలయ్యాయి. ఈ సారి పకడ్బందీగా రంగంలోకి దిగారు అత్తాకోడళ్లు. 2018లో కొత్త అవతార్‌లో లోగో, ప్యాకేజింగ్ మార్చేసి, ‘ఫిలోస్ పికిల్స్’ స్టార్ట్ చేశారు. దీనికి తోడు ముఖ్యమైన FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫుడ్ లైసెన్స్ తెచ్చుకున్నారు. 10వేల రూపాయల పెట్టుబడితో మళ్లీ పచ్చళ్ల తయారీ మొదలు పెట్టారు. స్థానిక సూపర్ మార్కెట్లకు అందించే వారు. ఇది ప్రచారానికి బాగా ఉపయోగపడింది. ఫుడ్ బ్లాగర్ మృణాల్ దాస్ వెంగలాట్ 2019లో వారి ఉత్పత్తుల గురించి ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇది మంచి ఆర్డర్లను తెచ్చిపెట్టింది. దీంతో ఒక ఇన్‌స్టా పేజీని కూడా స్టార్ట్ చేశారు. ఇక అప్పట్నించి విదేశాలకు సైతం రుచికరమైన పచ్చళ్లను సరఫరా చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. రొయ్యల ఊరగాయ, చేపలు, మాంసం ఊరగాయలు, చెమ్మీన్ చమ్మంతి పొడి (ఎండిన రొయ్యల పొడి) బెస్ట్ సెల్లర్స్‌గా నిలిచాయి. మామిడి, నిమ్మకాయ. సీజన్ల వారీగా, అనేక కూరగాయల ఊరగాయలను కూడా తయారు చేస్తారు. చాలా శ్రద్ధగా ప్రేమతో పచ్చళ్లు తయారు చేస్తాం అంటారు ఫిలో. ‘‘జీవితం అంతా బాధ్యతలతోనే గడిచిపోయింది. 60 ఏళ్లు దాటాక విసుగు, అలసట వస్తుంది..దీంతో ఈ వయసులో ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ ఈ ధోరణి మారాలి. మన నైపుణ్యంపై దృష్టి పెట్టాలి. అలా నేను ఫిలోస్ ప్రారంభించాక, ఒత్తిడి, ఆందోళన మాటుమాయమైంది. కొత్త ఉత్సాహం వచ్చింది. గౌరవం, ప్రేమ లభిస్తోంది’’ అంటారామె ఆ స్వర్గంనుంచి తన భర్త కేజే థామస్ తనను, తన విజయాన్ని చూస్తూ ఉంటాడనే ఆశతో. -
కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్‌కు ముందు అనేక వింతలు, విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జలోర్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. జలోర్ సిరోహి సీటుపై పోటీకి దిగిన భర్త వైభవ్ గెహ్లాట్‌కు మద్దతుగా అతని భార్య, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమార్తె హిమాన్షి గెహ్లాట్ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాన్షి గెహ్లాట్ జలోర్‌లో కూరగాయలు అమ్ముతూ కనిపించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అతని కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు హిమాన్షి గెహ్లాట్ జలోర్-జైసల్మేర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భర్త వైభవ్ గెహ్లాట్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమె గతంలో సిడ్నీలో చదువును పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగుల కోసం స్వ్ఛంద సంస్థను నడుపుతున్నారు. వైభవ్, హిమాన్షి దంపతులకు కాశ్వని అనే కుమార్తె ఉంది. హిమాన్షి లాగే కాశ్వనికి కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమట. -
పొలిటికల్ ఎంట్రీపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ..
-
బామ్మ సీక్రెట్ రెసిపీ : హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో నెలకు రూ. 50 లక్షలు
అటు బామ్మ సీక్రెట్, ఇటు అమ్మను మించిన అమ్మ అత్తగారి సాయంతో సక్సెస్‌పుల్ బిజినెస్ విమెన్‌గా అవతరించింది ఓ కోడలు. హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ అత్తా కోడళ్ల జంట నెలకు రూ. 50లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. ఈ అద్భుతమైన వీరి వ్యాపార ప్రస్థానం ఎలా మొదలైందో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. గురుగ్రామ్‌కు చెందిన అత్తా కోడళ్లు తమ బంధానికి కొత్త అర్థం చెప్పారు. విజయవంతమైన వ్యాపార మహిళలుగా రాణించడమే కాదు తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అసలు ఈ వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే.. జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్య. ఐటీ ఉద్యోగి నిధికీ ఈ సమస్య బాగా ఉండేది. 2019 వరకు ఊటీ ఉద్యోగంలో ఉంది. 2010లో పెళ్లి. మూడేళ్ల తరువాత ఒక కొడుకు పుట్టాడు. కానీ కొడుకుకు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె తన ఉద్యోగాన్ని విడిచి పెట్టి, కుమారుడుపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. ఈ సమయంలో ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన అస్సలు లేదు. కానీ ఆర్థికంగా బలపడాలని, ఏదైనా చేయాలని మాత్రం అనుకుంటూ ఉండేది. ఒక రోజు తన జుట్టు సమస్యను కూడా అత్తగారు రజనీ దువాకు చెప్పుకుంది. ఆమెకు కూడా ఇదే సమస్య ఉండటంతో ఏదైనా చేయాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇక్కడే వీరి జీవితాల్లో సరికొత్త అధ్యాయం షురూ అయింది. చిన్నపుడు బామ్మ చేసే మసాజ్, ఆయిల్ గుర్తొచ్చాయి నిధికి. ఐడియా మెరిసింది. అత్తగారితో కలిసి రంగంలోకి దిగిపోయింది. చాలా మంది స్త్రీలకు కూడా ఇదే సమస్య ఉందని గమనించారు. అలాగే, ఈ సమస్య నుండి బయటపడటానికి, ఆన్లైన్లో ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా, చవకగా, ఇంతకంటే మంచి, సహజమైన ఉత్పత్తులు ఎందుకు తయారు చేయకూడదని ప్రశ్నించుకుంది. అంతే ఆమె తల్లి, బామ్మ చెప్పిన చిట్కాలతో మంచి రెసిపీని తయారు చేసింది. ఇది మంచి ఫలితాలనిచ్చింది. చుట్టు పక్కల వాళ్లు కూడా బావుంది అంటూ కితాబిచ్చారు. అంతే 2023, మార్చిలో 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్' పేరుతో హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారానికి నాంది పలికింది. అత్తగారి సంపూర్ణ మద్దతుతో పూర్తి సహజసిద్దమైన తలనూనె తయారీ మొదలు పెట్టింది. “నూనెలో ఉపయోగించే చాలా పదార్థాలు నా తోటలో మాత్రమే పెరుగుతాయి. అలోవెరా, మందార పువ్వులు, కరివేపాకు లాంటి ఇతర సహజ పదార్థాలతో, ఇంట్లోనే తయారు చేస్తాం. మా తోటలోనే పెద్ద కుండలో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం మొదలు పెట్టామని నిధి తెలిపింది. ప్రతి నెల దాదాపు 200 నుండి 300 ఆర్డర్లు వస్తాయని తెలిపింది. సోషల్ మీడియాతో షాపింగ్ ఆరంభంలో సోషల్ మీడియా గ్రూప్‌లో చుట్టుపక్కల మహిళలకు నూనె అమ్మడం ప్రారంభించింది. అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ రావడంతో వారిలో నమ్మకం ధైర్యంపెరిగింది. ఇదే ఉత్సాహంతో నిధి సోషల్ మీడియాలో మరింత ప్రచారాన్ని మొదలు పెట్టింది. చిన్న రీల్స్‌తో నూనెను ఎలా తయారు చేస్తుందో వివరించేది. క్రమంగా ఈ రీల్స్ వైరల్ అయ్యాయి. నెటిజన్స్, ముఖ్యంగా మహిళల ఆదరణకు నోచుకున్నాయి. ఫలితంగా ఆర్డర్లు పెరిగాయి. 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్’ వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ విక్రయాలను మొదలు పెట్టారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ, కండీషనర్, స్కాల్ప్ స్క్రబ్, హెయిర్ ఆయిల్ కాంబో ప్యాక్ లాంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ఆయిల్ 67వేల మందికి చేరుకుంది, లక్షకు పైగా బాటిళ్లను విక్రయించి, నెలవారీ రూ. 50 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్’ అనే ఇనస్టాకు 71 వేలకు పైగా ఫాలోయర్లు ఉండడం విశేషం. View this post on Instagram A post shared by Nidhi’s Grandmaa Secret (@grandmaasecret) -
Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ కోడలు ఓ బైకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనదారునిపై కోపంతో రంకెలు వేశారు. కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే పేర్కొంటూ బైకర్ని చివాట్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ స్వగ్రామం ఉడిపిలోని సాలిగ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఓ బైకర్ ఆమె కారును ఓవర్‌టేర్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రేవణ్ణ కారు టొయేటా వెల్‌ఫైర్‌ను బైకర్ ఢీకొట్టాడు. దీంతో భవాని రేవన్న అతనిపై కోపంతో ఊగిపోయారు. తన కారు విలువ రూ.1.5 కోట్లు.. రిపేర్‌కు రూ.50 లక్షలు ఇవ్వగలవా? అని అతనిపై రంకెలు వేశారు. చనిపోవాలనుకుంటే.. ఏ బస్సు కిందో పడి చావొచ్చుగా? రాంగ్ సైడ్‌లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అతనిపై మండిపడ్డారు. A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ — Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023 బైకర్ని తిట్టే క్రమంలో భవాని రేవణ్ణ కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే చెప్పారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ రేవన్నకు మరికొందరు మద్దతు కూడా తెలుతున్నారు. రైడర్ రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం తప్పుకదా? అని ప్రశ్నిస్తున్నారు. భవానీ రేవన్న భర్త హెచ్డీ రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆమె కుమారులు ప్రజ్వాల్, సూరజ్ రేవన్న ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా? -
MP: చారిత్రక విజయం మాదే.. మాజీ సీఎం కోడలు ధీమా
భోపాల్: మధ్యప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 160 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 67 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. కాగా మధ్యప్రదేశ్‌లో తాము చారిత్రక విజయం సాధిస్తున్నట్లు మాజీ సీఎం బాబూలాల్ గౌర్ కోడలు, గోవింద్‌పురా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని కృష్ణ గౌర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 2024 లోక్‌సభ ఎన్నకలలో రాష్ట్రంలోని 29 స్థానాల్లోనూ విజయం సాధించడమే తమ తదుపరి లక్ష్యమని కృష్ణ గౌర్ పేర్కొన్నారు. -
కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు కొడుకు పెళ్లిని చాలా సింపుల్‌గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది. సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ' సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్‌లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది. -
ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే?
ముఖేష్ అంబానీకి కాబోయే కోడలు 'రాధికా మర్చంట్' అని మాత్రమే చాలామందికి తెలుసు. అయితే ఈమె బ్యాగ్రౌండ్ ఏమిటి? సంపాదన ఎంత అనే చాలా వివరాలు తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇటీవలే రాధికాతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అనంత్ & రాధికా చిన్ననాటి స్నేహితులు. ఈమె చాలా సంవత్సరాలుగా అంబానీ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటోంది. ఈమె ప్రముఖ వ్యాపార దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె. క్లాసికల్ డ్యాన్సర్.. రాధిక మర్చంట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 60,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో దిగిన ఫోటోలు చాలా వరకు ఈమె ఖాతాలో చూడవచ్చు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన రాధికా మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ అండ్ దివాన్లలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆమె రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్‌గా కూడా పనిచేసింది. ఆ తరువాత కుటుంబం వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా పనిచేసింది. సంపద విలువ.. విలాసవంతమైన జీవనశైలిని కొనసాగిస్తున్న ఈమె ఖరీదైన దుస్తులు, వస్తువులు వినియోగించడానికి చాలా ఆసక్తి చూపుతుంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె సంపద విలువ రూ. 8 నుంచి రూ. 10 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. రాధిక మర్చంట్ తండ్రి వీరేన్ మర్చంట్ నికర విలువ దాదాపు రూ.755 కోట్లు. రాధికకు చదవడం, ప్రయాణం, ట్రెక్కింగ్ అండ్ స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. కాగా అనంత్ & రాధికా 2024 జూలై 10, 11, 12 తేదీల్లో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. -
కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది!
జీవితం సంతోషంగా సాగుతున్న టైంలోనే కదా మనిషికి కష్టాలు వచ్చేవి. అలా ఆమెకూ అనుకోని కష్టం వచ్చి పడింది. హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారినపడ్డ అమిషాకు.. కిడ్నీ జబ్బు ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో ఆమె, ఆమె భర్త జితేష్ కుదేలయ్యారు. పైగా రెండు కిడ్నీలు దెబ్బతిని.. వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకుందని.. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే ఆమె బతికేదని తేల్చి చెప్పడంతో.. కుంగిపోసాగారు ఆ భార్యాభర్తలు. ముంబైకి చెందిన అమిషా జితేష్ మోటా(43)కు రెండు కిడ్నీలు దెబ్బతిని.. జబ్బు అడ్వాన్స్డ్ స్టేజీకి చేరిందని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మారిస్తేనే ఆమె బతుకుతుందన్నారు. అమిషా భర్త జితేష్‌కు అంతకు కొన్నిరోజుల ముందే షుగర్ వచ్చింది. దీంతో ఆయన కిడ్నీ డొనేట్ చేయడం కుదరదని వైద్యులు తేల్చారు. అమిషా తల్లిదండ్రులతో పాటు రక్తసంబంధీకులను ముందుకురాగా.. వైద్య ప్రమాణాల దృష్ట్యా అది వీలుకాలేదని వైద్యులు తెగేసి చెప్పారు. అంతా చీకట్లు అలుముకున్న తరుణంలో.. అనుకోని వ్యక్తి రూపంలో ఓ వెలుగురేఖ కిడ్నీ దానానికి ముందుకొచ్చింది. ఆమె పేరు ప్రభ కంటిలాల్ మోటా. జితేష్ తల్లి.. అమిషా అత్త. కానీ.. ప్రభ వయసు 70 ఏళ్లు. వయసురిత్యా ఆమె కిడ్నీ ఇచ్చేందుకు సరిపోతారా? అనే విషయంలో వైద్యులు తర్జన భర్జనలు చేశారు. ఆశ్చర్యంగా అన్ని టెస్టుల్లోనూ ఆమె ఫిట్‌గా తేలారు. అయినప్పటికీ వైద్యుల నుంచి ఆమెకు చెప్పాల్సింది చెప్పారు. భర్త, ఇద్దరు కొడుకులు వద్దని వారించినా ఆమె వినలేదు. చివరకు.. అమిషా కూడా వద్దని బతిమాలుకుంది. మొండిగా తన కోడలి ప్రాణం కాపాడుకునేందుకే ముందుకు వచ్చారు ప్రభ. ఆ అత్త సంకల్పానికి తగ్గట్లే.. కిడ్నీ కూడా అమిషాకు మ్యాచ్ అవుతుందని వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం క్షీణిస్తూ అమిషా పడుతున్న బాధను మా అమ్మ చూడలేకపోయింది. అందుకే ఆమెను కాపాడాలనుకుంది. వద్దని నేను, నా సోదరుడు ఆమెను ఎంతో బతిమాలాం. మా నాన్న కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కోడలి కోసం మా అమ్మ సాహసం చేసింది. ‘‘అమిషా నా బిడ్డ లాంటిది.. బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎంతదాకా అయినా వెళ్తుంది కదా’’ అని ప్రభ తేల్చేశారు. కిందటి నెలలో నానావతి ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్ జతిన్ కొఠారి నేతృత్వంలో విజయవంతమైంది. అంతా హ్యాపీస్.. ఆ అత్తాకోడళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సర్జరీ నుంచి కోలుకున్న ప్రభ.. ఆగష్టు 4వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబం.. చుట్టుపక్కల వాళ్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమిషా తల్లి ఆమెను హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తల్లిగా తాను జన్మ ఇచ్చినప్పటికీ, అత్తమ్మగా.. అదీ కిడ్నీ దానంతో పునర్జన్మ ఇచ్చిందంటూ భావోద్వేగానికి లోనైంది. సమాజంలో అత్తాకోడళ్లంటే.. ఎప్పుడూ కస్సుబుస్సు లాడుతూనే ఉండాలా? కలిసి ‘సెల్ఫీ’లు తీసుకుని ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోతుందా?.. ప్రభ-అమిషా ప్రేమానురాగాల గురించి తెలిశాక ఇది కదా మనకు కావాల్సింది అనిపించకమానదు. -
పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు
అత్తా కోడళ్ల గొడవలనేవి తెగని పంచాయితీ.. ప్రతి ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య గొడవలు సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ గొడవలు పెద్దవై భార్యభర్తలు విడిపోవడం, లేదా వేరే కాపురం పెట్టే వరకు పోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే అత్తా కోడళ్ల గొడవలోకి మగాళ్లు వెళ్లే సాహసం చేయరని అందరికీ తెలిసిందే. ఒకవేళ వెళ్లినా.. లేదా అటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక తలలు పట్టుకోవాల్సిందే. తాజాగా ఇద్దరు అత్తా కోడళ్లు గొడవపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది అట్టాంటి ఇట్టాంటి పంచాయితీ కాదు. అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు భయంకరంగా దాడి చేసుకునే వరకు పోయింది. వంటింట్లో కూర్చొని ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. అరవింద్ కుమార్, ప్రీతి దేవి కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరవింద్ తన తల్లిదండ్రులు భూప్ ప్రకాష్, రాణి దేవితో కలిసి గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివిసిస్తున్నారు. అరవింద్ నిరుద్యోగి కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గతంలో ప్రీతి తన అత్త రాణి దేవిపై దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి రాణి కోడలపై దాడి చేసింది. ఆమెను తలను నేలకేసి కొట్టడం, కాలితో తన్నడం, గోడకేసి నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. కోడలు ఏడుస్తూ అత్తను ఆపడం కూడా చూడవచ్చు. ఇక విచిత్రం ఏంటంటే ఈ తంతంగాన్ని మొత్తం మహిళా కొడుకే వీడియో తీయడం కొసమెరుపు. అంతేగాక దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వంట పేరుతో అత్త రోజు దూషించేదని, మగ పిల్లాడిని కనలేదనే కారణంతో వేధించేదని కోడలు ప్రీతి ఆరోపించింది. అయితే అత్త వర్షన్ ఇందుకు విరుద్దంగా ఉంది. తనకు ఒక్కడే కొడుకు కావడం, ఇతర సంతానం ఏం లేకపోవడంతో వారు నివసించే ఇంటిని తన పిల్లల పేరు మీద రాయాలని కోడలు బలవంతం చేస్తుందని రాణి ఆరోపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా సదరు మహిళలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #उत्तरप्रदेश : #अलीगढ़ में बहू के तीन बेटियां पैदा होने पर नाराज सास ने बहू से की मारपीट#Violence #fightvideos #viralvideo #UttarPradesh #DelhiRains #OperationVijay #Gadar2Trailer #Haryanaclerk35400 #KargilVijayDiwas #अध्यात्म_के_शिरोमणि pic.twitter.com/XDLtOPeNs6 — NCR Samachar (@ncrsamacharlive) July 26, 2023 -
ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు
లక్నో: యూపీలోని బారాబంకిలో నెలలు నిండిన తమ బిడ్డ డెలివరీకి ఏసీ వార్డులో చేర్పించలేదని కోపంతో ఓ గర్భవతి తల్లిదండ్రులు ఆమె అత్తమామలను చితక బాదారు. ఈ వీడియోని అక్కడున్నవారిలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. తమ బిడ్డకు నెలలు నిండడంతో డెలివరీ నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుసుకుని బిడ్డను చూసేందుకు ఆత్రుతతో హాస్పిటల్ కు వెళ్లారు గర్భవతి తల్లిదండ్రులు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏసీ వార్డులో కాకుండా నాన్ ఏసీ వార్డులో ఉన్న తమ బిడ్డను చూసి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట మాటల యుద్ధానికి తెరతీసిన వారు మెల్లగా ముష్టియుద్ధానికి తెగబడ్డారు. వియ్యంకుడు రామ్ కుమార్ తోపాటు అతని భార్యని ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకొట్టేశారు. వారు కూడా తిరగబడటంతో గొడవ మరీ పెద్దదైంది. రోడ్డు మీద నలుగురు చూస్తుండగానే ఈ వీరంగమంతా జరగడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో ఎక్కడెక్కడో చక్కెర్లు కొడుతోంది. #Barabanki में बहू के लिए अस्पताल में AC रूम न बुक करने पर मायके वालों ने की ससुराल पक्ष के लोगों की पिटाई, विडियो वायरल। pic.twitter.com/bfuKZ5j4uA — Priya singh (@priyarajputlive) July 5, 2023 ఇది కూడా చదవండి: కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం.. -
తోడి కోడళ్ల సిగపట్లు.. మధ్యలోకి వెళ్లిన మామ, చిన్నకోడలు కాలితో తన్నడంతో
ఆగ్రా: అత్తింటిలో దీపం పెట్టడానికి వచ్చిన తోడి కోడళ్ళు పందెం కోళ్లలా గొడవపడుతుంటే విడదీసే ప్రయత్నంలో మామగారు చిన్న కోడలి తల నరికేశాడు. అనంతరం ఆగ్రా జిల్లాలోని కిరావాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హంతకుడి చిన్నకొడుకు, మృతురాలి భర్త ఫరూఖాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రఘువీర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగ్రాలోని మాలిక్ పూర్ గ్రామంలో నివాసముండే రఘువీర్ (62)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చనిపోగా అతని భార్య తమతోనే ఉంటోందని.. ఆమెతో చిన్న కోడలు ప్రియాంక సింగ్ (28) తరచూ గొడవపడుతూ ఉండేదని చెప్పాడు. వారిని కలిసి ఉండాలని ఎంత చెప్పినా వినేవారు కాదని పోలీసులకు తెలిపాడు రఘువీర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇద్దరి కోడళ్ల మధ్య వాగ్వాదం చెలరేగిందని, ఇద్దరూ సిగపట్లు పట్టుకున్నారని.. విడదీసేందుకు మధ్యలోకి వెళ్లిన రఘువీర్ ను ప్రియాంక కాలితో తన్నగా.. దూరాన పడిన మామగారు కోపోద్రిక్తుడై గొడ్డలి అందిపుచ్చుకుని చిన్న కోడలి మెడ మీద వేటు వేశాడని.. దాంతో ఆమె తల మొండెం రెండూ వేరై అక్కడికక్కడే చనిపోయిందని తెలిపారు. మృతురాలు ప్రియాంక సింగ్ తండ్రి ఫిర్యాదు ప్రకారం తండ్రీ, కొడుకులు ఇద్దరి పైనా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇది కూడా చదవండి: 5 గంటల్లో రూ.40.. కర్ణాటక ఆటో డ్రైవర్ల దయనీయ స్థితి.. -
కోడలిపై మామ అరాచకం.. పొట్టి షార్ట్ వేసుకుందని వేడి వేడి సూప్ పోసి..
ఆధునిక కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. అయినా కొంతమంది ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుత్ను ఇంకా పితృస్వామ్య మూస ధోరణిలోనే జీవిస్తున్నారు. మా మాటే వినాలి, మేము చెప్పిందే చేయాలనే విధంగా స్త్రీలపై అధిపత్యం చెలాయిస్తున్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో అలాంటి ఓ సంఘటనే తాజాగా వెలుగు చూసింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కోడలిని వేధింపులకు గురిచేశాడు. పొట్టి బట్టలు వేసుకుందని ఆమెపై వేడి వేడి సూప్ పోసి దాడి చేశాడు. ఈ ఘటన జూన్ 12 న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. కోడలు సరైన బట్టలు వేసుకోలేదని మామ ఆమెపై అరిచాడు. ఆమె ధరించిన హాట్ ప్యాంట్( పొట్టి షార్ట్) చాలా చిన్నగా ఉందని తిట్టాడు. ఇలాగే బయటకు వెళ్తే ఇరుగు పొరుగు వారు చూస్తే తమ పరువు పోతుందని అన్నాడు. దీనిపై కోడలు స్పందిస్తూ.. ‘నా డబ్బులతో నేను దుస్తులు కొనుకున్నాను. నాకు నచ్చినట్లు వేసుకుంటాను’ అని సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె మామయ్య ఒక్కసారిగా హింసాత్మకంగా మారాడు. కోడలు ముఖంపై వేడి సూప్ గిన్నెను విసిరాడు. అంతటితో ఆగకుండా ఈ గొడవను పెద్దది చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని లాగి ‘ నేను నిన్ను ఈరోజు చంపేస్తాను’ అంటూ బెదిరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మహిళ కొడుకు.. తల్లిని రక్షించేందుకు ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి తాళం వేశాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది. వారు ఇంటికి చేరుకొని మహిళ దుస్తుల వల్ల ఎవరికి ఏ నష్టం లేదని దుస్తుల పేరుతో ఆమెను వేధించడం మానేయాలని మామను హెచ్చరించారు. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. మామ వేధింపుల గురించి భర్తకు తెలియజేయగా అతను సైతం తండ్రి వైపే నిలిచాడు. అలాంటి దుస్తులు ధరించవద్దని భార్యను వారించాడు. తనకు అండగా ఉంటాడనున్న భర్త సైతం తండ్రి వైఖరితోనే ఉండటంతో తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే మామ ఆమెను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మామ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ‘ఆమెను చంపేస్తానని బెదిరించడానికి అతనికి ఎంత ధైర్యం? చాలా భయంకరంగా ఉంది ఇది. మనం ఇంకా రాజుల కాలంలో జీవించడం లేదు. ఆమె ఆ దుస్తులు ఎందుకు ధరించవద్దంటూ ప్రశ్నిస్తున్నారు. -
మేనమామ ప్రాణాలు తీసిన కోడలి ప్రేమ వ్యవహారం..
సాక్షి, విజయవాడ: ప్రేమ వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తన మేనకోడలితో మాట్లాడదామని వెళ్లిన శ్రీనివాస్ అనే వ్యక్తి అనూహ్యంగా హత్యకు గురయ్యాయి. ఈ ఘటన సత్యనారాయణపురంలోని ఖుద్దూస్ నగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నవీన్ అనే యువకుడికి ఒంగోలుకు చెందిన శ్వేత అనే యువతితో పరిచయం ఏర్పడింది. అయితే, వాళ్ళిద్దరూ ఇంటినుంచి వెళ్లిపోవడంతో వివాదం తలెత్తింది. ఇంటినుంచి వెళ్లిపోయిన శ్వేతతో మాట్లాడేందుకు ఆమె మేనమామ శ్రీనివాస్ సహా పలువురు కుటుంబ సభ్యులు నవీన్ ఇంటికి వెళ్ళారు. అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో ఈ వివాదం మరింత ముదిరింది. శ్వేతను తమతో ఒంగోలుకు తీసుకుపోతామని శ్రీనివాస్ అనడంతో నవన్ అన్న జగదీష్ కోపోద్రిక్తుడయ్యాడు. శ్రీనివాస్‌పై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, దారిలోనే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. జగదీష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. జగదీష్ గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ -
అనుమానం వచ్చింది.. ఇంట్లో నిద్రపోతుండగా కోడలి ముఖంపై
తిరువొత్తియూరు(చెన్నై): కడలూరు జిల్లాలో కోడలిపై ఆసిడ్ పోసి హత్యాయత్నం చేసిన అన్నాడీఎంకే మహిళా నాయకురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన కలివరదన్ భార్య ఆండాళ్ విరుదాచలం అన్నాడీఎంకే ఉప కార్యదర్శిగా ఉన్నారు. వీరి కుమారుడు ముకేష్ రాజ్. ఇతని భార్య కృతిక (26). వీరికి రిషిత (5), రిషిక (1) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో కృతికపై అనుమానం పెంచుకున్న అత్త ఆండాలు కోడల్ని తరచూ వేధింపులకు గురి చేసేది. ఆదివారం రాత్రి ఆండాళ్కు కృత్తికకు గొడవలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృత్తిక ఇంటిలో నిద్రపోతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆండాలు టాయిలెట్‌కు ఉపయోగించే ఆసిడ్‌ను కృత్తిక ముఖంపై పోసి నోటిలో కూడా పోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. కృత్తిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు దీనిపై విరుదాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృత్తికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆండాలును అరెస్టు చేశారు. చదవండి: ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి.. -
షాకింగ్.. ‘టీ’ చల్లారిందన్న అత్తను.. కోడలు ఏం చేసిందంటే?
తమిళనాడు: ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొన్ని వాటిలో చిన్న చిన్న గొడవలే హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వేడి వేడి ‘టీ’ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో జరిగింది. మలైక్కుడిపట్టికి చెందిన వేల్, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. పళనియమ్మాళ్ కుమారుడు సుబ్రమణ్యన్ వద్ద ఉంటోంది. మంగళవారం రాత్రి బయటి నుంచి వచ్చిన పళనియమ్మాళ్.. కోడలు కనుకును పిలిచి టీ పెట్టాలని కోరింది. కోడలు పెట్టిన టీ చల్లారిపోవడంతో ఆమె.. కోడలిని మందలించింది. దీంతో ఆగ్రహించిన కనుకు.. ఇనుప రాడ్డు తీసుకుని అత్త తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పళనియమ్మాళ్‌ను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించింది. అయితే సుబ్రమణియన్ తల్లి పళనియమ్మాళ్, కనుకు మధ్య సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలు చాలాకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోందని తెలిపారు. చదవండి: నవీన్‌తో బ్రేకప్ అయ్యాకే హరి దగ్గరయ్యాడు: నిహారిక! -
మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది
సాక్షి, మహబూబాబాద్: కోడలు వండిన టమాట కూర.. ఆ అత్త ప్రాణం మీదకు తెచ్చింది. భార్యను అవమానించిందంటూ సొంత తల్లిపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలో జరిగింది. వేంనూరులో ఆత్తకోడళ్ళ మధ్య ఘర్షణ.. ఒక ప్రాణం మీదకు తెచ్చింది. వండిన టమాటా కూర బాగలేదని కోడలిని మందలించింది అత్త బుజ్జి. ఈ విషయంపై భర్తకు ఫిర్యాదు చేసింది నందిని. తన భార్యనే అట్లా అంటావా అంటూ మటన్ కొట్టే కత్తితో కొడుకు మహేందర్ సొంత తల్లిపైనే దాడికి దిగాడు. ఈ దాడిలో తల్లి బుజ్జి తల్లి తలకు తీవ్రగాయ్యాలు. వెంటనే ఆమెను స్థానికులు మహబూబాబాద్ ఏరియా హస్పటల్ కి తరలించారు. ఆపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్‌పై స్పందించిన రాష్ట్రపతి భవన్
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి ఈ–మెయిల్‌కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. నగర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రజ్ఞ సోమవారం మెయిల్ ద్వారా లేఖ రాసిన విషయం విదితమే. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్న అంశాన్ని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. ఈమె పంపిన ఈ–మెయిల్‌పై రాష్ట్రపతి భవన్ స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అండర్ సెక్రటరీ పీసీ మీనా ప్రభుత్వానికి బుధవారం మెయిల్ పంపారు. ప్రజ్ఞ ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలంటూ అందులో ఆదేశించారు. ఈ పరిణామంతో ప్రజ్ఞ ఆమె కుటుంబీకులు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి -
న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి ఆయన కుటుంబీకులు–కోడలు ప్రజ్ఞా రెడ్డి మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞ ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. తనను న్యాయం చేయాలని కోరడంతో పాటు ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీలో మీ పర్యటనను రాఘవరెడ్డి తదితరులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తదితరులు రెండేళ్లుగా తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్నారని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు తమను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని వాపోయారు. తామను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు. చదవండి: Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక.. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు. రాఘవరెడ్డి ఇప్పటికే తన పలుకుబడి వినియోగించి తమను బెదిరించడంతో పాటు దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29న వారికి చెందిన జి.నారాయణమ్మ కళాశాలలో మీ పర్యటనతో మరింత రెచ్చిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకునే వాళ్లు తనను మరింత వేధించడంతో పాటు దర్యాప్తు సంస్థలను ఇంకా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ప్రజ్ఞ లేఖలో పేర్కొన్నారు. ఈమె తన మెయిల్లో కోర్టు ఆదేశాల మేరకు గది బయట గోడను తొలగిస్తున్న అధికారుల వీడియోను జత చేశారు.