సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి ఈ–మెయిల్‌కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. నగర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రజ్ఞ సోమవారం మెయిల్ ద్వారా లేఖ రాసిన విషయం విదితమే. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్న అంశాన్ని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈమె పంపిన ఈ–మెయిల్‌పై రాష్ట్రపతి భవన్ స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అండర్ సెక్రటరీ పీసీ మీనా ప్రభుత్వానికి బుధవారం మెయిల్ పంపారు. ప్రజ్ఞ ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలంటూ అందులో ఆదేశించారు. ఈ పరిణామంతో ప్రజ్ఞ ఆమె కుటుంబీకులు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment