-
Delhi : స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు శుక్రవారం ఉదయం ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని తెలిపారు. స్కూల్స్‌లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సల్వాన్ స్కూల్, మోడరన్ స్కూల్,కేంబ్రిడ్జ్ స్కూల్స్‌తో పాటు ఇతర పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించాలని అధికారులు సూచించారు. ఈరోజు పిల్లలను స్కూళ్లకు పంపొద్దని, ఒకవేళ పంపితే వెనక్కి తీసుకుని వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. బాంబు బెదింపులు ఇ-మెయిల్స్ డార్క్ వెబ్ నుంచి పంపినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఆ బెదిరింపుల్లో ‘మీ విద్యార్థులు స్కూల్లోపలికి వచ్చే సమయంలో మీరు తనిఖీలు చేయరని నమ్ముతున్నాను. మేం అమర్చిన బాంబులు భవనాలను ధ్వంసం చేయడంతో పాటు, ప్రజలకు ప్రాణనష్టం జరగుతుంది. డిసెంబర్ 13,14, రెండు రోజులు మీ స్కూళ్లలో ఈ తరహా విధ్వంసం జరగొచ్చు. డిసెంబరు 14న పలు పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగడం బాంబులు పేల్చేందుకు మాకు ఇదొక మంచి అవకాశం.మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాటిని మీరే నెరవేర్చాలి. అందుకు మీరు అంగీకరిస్తే వెంటనే మేం పంపిన మెయిల్స్‌కు రిప్లయి ఇవ్వండి ’అని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగంతకులు వచ్చిన ఇ-మెయిల్స్‌పై అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ, పోలీసులు, బాంబు డిటెక్షన్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు పాఠశాలలకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఇ-ఇమెల్స్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు. -
సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడపై పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత.. ఒకేసారి దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోమవారం రాత్రి పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు ఈ-మెయిల్స్‌ను దుండగులు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నారు. ఢిల్లీ తోపాటు హైదరాబాద్‌లోని అన్ని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపుల సందేశాలు రావటంతో అన్ని స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్‌గా భద్రత అధికారులు భావిస్తున్నారు.ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్ ధృవీకరించింది. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది. గత వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న పలు భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. టార్గెట్ చేసిన ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా మరియు అకాసా ఎయిర్ ఉన్నాయి.చదవండి: ‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’ -
అలాస్కాలో అమెరికా చివరి ఓటరు
ఎటు చూసినా మంచు. గడ్డి తప్పించి నిలబడటానికి ఒక్క చెట్టు కూడా పెరగడానికి అనుకూలంగాకాని మైదాన ప్రాంతాలు. ఎవరికీ పట్టని అమెరికా చిట్టచివరి ప్రాంతంగా మిగిలిపోయిన అలాస్కా గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. గత 12 సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయానికి మళ్లీ అక్కడి ఓటర్లు సిద్ధమవడమే ఇందుకు కారణం. అమెరికా పశి్చమ దిశలో చిట్టచివరి పోలింగ్ కేంద్రం ఈ టండ్రా ద్వీపంలోనే ఉంది. అడాక్ ద్వీప ప్రజలు గతంలో మెయిల్ ద్వారా ఓటు పంపించే వారు. 2012 అమెరికా ఎన్నికలప్పుడు మేం కూడా అందరిలా స్వయంగా పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహం చూపారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇక్కడ తొలిసారిగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ప్రధాన ఓటర్ల జాబితాలో ఇక్కడి వాళ్లంతా చేరిపోయారు. ‘‘మా నగర వాసులం చిట్టచివర్లో ఓటేస్తాం. ఓటింగ్ సరళిని బట్టి ఆలోపే దాదాపు విజేత ఎవరో తెల్సేవీలుంది. అయినాసరే చివర్లో ఓటేస్తున్నామన్న ఉత్సాహం మాలో రెట్టిస్తుంది. ఆ రోజు మాకందరికీ ప్రత్యేకమైన రోజు. మేం ఓటేసేటప్పటికి అర్ధరాత్రి దాటి సమయం ఒంటిగంట అవుతుంది’’అని సిటీ మేనేజర్ లేటన్ లాకెట్ చెప్పారు. అమెరికా చిట్టచివరి భూభాగం అలాస్కా ప్రాంతం అగ్రరాజ్యానికి ప్రత్యేకమైనది. గతంలో రష్యా అ«దీనంలో ఉండేది. ఎందుకు పనికిరాని భూభాగంగా భావించి చాన్నాళ్ల క్రితం అమెరికాకు అమ్మేసింది. ఇటీవలికాలంలో ఇక్కడ చమురు నిక్షేపాలు బయటపడటంతో ఈ ప్రాంతమంతా ఇప్పుడు బంగారంతో సమానం. అత్యంత విలువైన సహజవనరులతో అలరారుతోంది. చిట్టచివరి పోలింగ్ కేంద్రాలున్న అడాక్ ద్వీపం నిజానికి అలేటియన్ ద్వీపాల సముదాయంలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన బేరింగ్ నది ఈ ద్వీపసముదాయాలకు ఉత్తరదిశలో ఉంటుంది. దక్షిణ దిశలో పసిఫిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతం ఉంటుంది. అమెరికా ఈ ద్వీపాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్థావరంలా ఉపయోగించుకుంది. తర్వాత నేవీ స్థావరంగా అభివృద్ధిచేసింది. ‘‘ఇక్కడ చివరిగా ఓటేసింది నేనే. 2012లో మిట్ రోమ్మీపై బరాక్ ఒబామా బరిలోకి దిగి గెలిచిన విషయం మాకు మరుసటి రోజు ఉదయంగానీ తెలీలేదు’అని 73 ఏళ్ల మేరీ నెల్సన్ చెప్పారు. గతంలో అక్కడ పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రానికి మారారు. అలాస్కా ఆవల ఉన్న గ్వామ్, మేరియానా ద్వీపాలు, అమెరికన్ సమోవా వంటి ద్వీపాల్లో ప్రజలు ఉన్నా వారిని ఓటర్లుగా గుర్తించట్లేరు. దీంతో చివరి ఓటర్లుగా అలాస్కా ఓటర్లు చరిత్రలో నిలిచిపోయారు. రెండో ప్రపంచయుద్ధ స్థావరం ఎక్కువ రోజులు మంచును చవిచూసే అలాస్కా గతంలో యుద్ధాన్ని చవిచూసింది. రెండో ప్రపంచయుద్దకాలంలో జపాన్ అ«దీనంలోని అటూ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా తన సేనలను ఇక్కడికి పంపింది. 1942 ఆగస్ట్‌లో సేనలు ఇక్కడికొచ్చి సైనిక శిబిరాల నిర్మాణం మొదలెట్టాయి. దీంతో శత్రుదేశ విమానాలు ఇక్కడ 9 భారీ బాంబులను జారవిడిచాయి. 1943 మేలో 27,000 మంది అమెరికా సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మెషీన్ గన్లమోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ప్రాంతంపై మక్కువతో రచయితలు డాషిల్ హామెట్, గోరే విడల్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్, బాక్సింగ్ ఛాంపియన్ జో లెవీస్, పలువురు హాలీవుడ్ తారలు తరచూ ఇక్కడికి వచి్చపోతుంటారు. 33 వృక్షాల జాతీయవనం ! అలాస్కాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ వృక్షాల ఎదుగుదలకు సరిపడవు. దీంతో ఇక్కడ గడ్డి, చిన్న మొక్కలు తప్పితే వృక్షాలు ఎదగవు. ఇక్కడ చెట్లు పెంచి అడవిని సృష్టించాలని అమెరికా ప్రభుత్వం 1943–45కాలంలో ఒక ప్రయత్నంచేసింది. చివరికి చేసేదిలేక చేతులెత్తేసింది. అప్పటి ప్రయత్నానికి గుర్తుగా 1960లలో అక్కడి 33 చెట్ల ముందు ఒక బోర్డ్ తగిలించింది. ‘‘మీరిప్పుడు అడాక్ జాతీయ వనంలోకి వచ్చి వెళ్తున్నారు’అని దానిపై రాసింది. నేవీ బేస్ ఉన్నంతకాలం 6,000 మందిదాకా జనం ఉండేవారు. తర్వాత ఇక్కడ ఉండలేక చాలా మంది వలసవెళ్లారు. 2020 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 171 మంది ఉంటున్నారు. 2024 అనధికార గణాంకాల ప్రకారం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నది కేవలం 50 మంది మాత్రమే. కనీసం పది మంది విద్యార్థులయినా వస్తే స్కూలు నడుపుదామని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా గత ఏడాది ఆరుగురు విద్యార్థులతో స్కూలు మొదలుపెట్టారు. తీరా గత ఏడాది నవంబర్‌కు వచ్చేసరికి ఐదుగురు మానేశారు. ఇప్పుడు అక్కడ ఒకే విద్యార్థి ఉన్నారని అలేటియన్ రీజియన్ స్కూల్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ మైక్ హన్లీ చెప్పారు. ‘‘జనం వెళ్లిపోతున్నారు. చివరికి ఎవరు మిగులుతారో. ఈసారి చివరి ఓటు ఎవరేస్తారో చూడాలి’అని అడాక్ సిటీ క్లర్క్ జేన్ లికనాఫ్ చెప్పారు. – యాంకరేజ్(అమెరికా) -
నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ
కష్టపడి చదవి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకోవాలని ఆశపడింది కలలు కనింది 26 ఏళ్ల యువతి. కానీ ఆశలన్నీ ఆవిరై తన తల్లిదండ్రులకే తీరని శోకాన్ని మిగల్చబోతున్నానని కలలో కూడా ఊహించి ఉండదు. ఎన్నో ఆశలతో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో యువతి తల్లి తీరని విషాదంలో మునిగిపోయింది. పని ఒత్తిడితో, తన బిడ్డ కలల్ని, జీవితాన్ని నాశనం చేశారు, తనలాగా మరే తల్లికి ఇలాంట దుర్గతి పట్టుకూడదంటూ కంపెనీ చైర్మన్‌కి పంపిన ఈమెయిల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..కేరళకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరైల్ బహుళజాతి సంస్థ ఎర్నెస్ట్ & యంగ్, EYలో ఉద్యోగంలో చేరింది. తొలి ఉద్యోగం కావడంతో చాలా కష్టపడి చేసింది. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలని రాత్రింబవళ్లు పనిచేసి తన టార్గెట్‌ను పూర్తి చేసింది. అయినా ఆమె మేనేజర్ చేసిన ఒత్తిడిని ఆమె గుండె తట్టుకోలేకపోయింది. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే 26 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన బిడ్డ విషాదాంతానికి కారణం పని ఒత్తిడే అంటూ అన్నా తల్లి, అనితా అగస్టిన్ ఆ కపెంనీ ఛైర్మన్ ఇండియా చీఫ్ రాజీవ్ మెమనికి ఇమెయిల్ రాశారు. తన కుమార్తె మరణానికి దారితీసిన పరిస్థితులపై తన బాధను వ్యక్తం చేశారు. దీంతో కంపెనీలో ఉద్యోగుల పనిపరిస్థితులపై చర్చకు దారి తీసింది. ఆసియా దేశాల్లోఅంతే,టాక్సిక్‌కల్చర్, దుర్మార్గం అంటూ సోషల్ మీడియా యూజర్లు మండి పడుతున్నారు. ఈమెయిల్ అన్నా తల్లి బరువెక్కిన గుండెలతో రాసిన ఈమెయిల్ సమాచారంలో అందించిన వివరాల ప్రకారం అన్నా సెబాస్టియన్ పెరైల్ బాల్యం నుంచీ చాలా తెలివైనది. చిన్నప్పటి నుంచీ చదువులో,ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో రాణించింది. స్కూల్ టాపర్, కాలేజీ టాపర్. అంతేకాదు సీఏ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ‘‘నా బంగారు తల్లిని పొగొట్టుకున్నాను. నేను ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆరోగ్యం, జీవితం కన్నా, ఏదీ ఎక్కువ కాదని ఆమెకు నచ్చజెప్పి, బిడ్డను కాపాడుకోవలసింది. ఈ బాధతోనే ఈ లేఖ రాస్తున్నా.. ఆమె గురించి రాస్తోంటే.. నా గుండె బద్దలవుతోంది. నా శోకం, బాధ మరే కుటుంబానికి రాకూడదనే ఇది రాస్తున్నాను.2023 నవంబరులో సీఏ పాస్ అయింది. 2024 మార్చి19న పూణేలో ఉద్యోగంలో చేరింది. అంత గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు పొంగిపోయింది. ఉద్యోగంలో చేరిన కంపెనీ కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. పగలూ, రాత్రి, చివరికి ఆదివారాలు కూడా పని చేసేంది. ఉద్యోగం, ఊరు, భాష అన్నీ కొత్త అయినా సర్దుకుపోవడానికి ఆమె చాలా ప్రయత్నించింది.పడుకున్నా, కూర్చున్నా పనిధ్యాసే. సరిగా తిండి లేదు. నిద్ర లేదు. అంతులేని ఒత్తిడిని భరించింది. శారీరకంగా, మానసికంగా అలిసిపోయినా, కష్టపడి పనిచేయడం, పట్టుదల విజయానికి కీలకమని నమ్ముతూ నెట్టుకుంటూ వచ్చింది. ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా, వారాంతాల్లో కూడా అర్థరాత్రి వరకు పని చేసి, చేసి చివరికి ఆ ఒత్తిడితోనే నాలుగు నెలల తర్వాత, జూలై 20 శాశ్వతంగా నాకు దూరమైపోయిందన్న వార్త విన్నాక నా ప్రపంచం కుప్పకూలింది. 26 ఏళ్లకే నా బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయి. కనీసం ఆమె అంత్యక్రియలకు కంపెనీ తరపునుంచి ఒక్కరుకూడా రాలేదు. ఇదింకా నన్ను బాధించింది.జూలై 6వ తేదీన నేను, నాభర్త సీఏ కాన్వకేషన్ కోసం పూణే వచ్చాం. అప్పుడే గుండెల్లో ఏదో భారంగా ఉందని చెప్పింది అన్నా. డాక్టర్ దగ్గరికెళ్లేందుకు ఆమె సమయం దొరకలేదు. కానీ బలవంతంగా ఆసుపత్రికి వెళ్లాం. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయినీ, ఆందోళన అవసరం లేదని కార్డియాలజిస్ట్ చెప్పారు. కానీ తిండి, నిద్ర సమయానికి తీసుకోవడం లేదని, విశ్రాంతి తీసుకోవాలని, జాగ్రత్త అని చెప్పారు. కానీ ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని గమనించలేదు. జూలై 7, ఆమె కాన్వకేషన్ రోజు అపుడు కూడా ఆమెకు సెలవు దొరకలేదు. ఆ రోజు కూడా మధ్యాహ్నందాకా వర్క్ ఫ్రం హోం చేసింది. దీంతో కాన్వకేషన్‌కు లేట్‌గా వెళ్లాం. కష్టపడి సంపాదించిన డబ్బుతో తన తల్లిదండ్రులను తన కాన్వకేషన్‌కు తీసుకెళ్లాలనేది నా కుమార్తె గొప్ప కల. ఆమె మా విమాన టిక్కెట్లు బుక్ చేసి మమ్మల్ని తీసుకువెళ్లింది. మా బిడ్డతో చివరిగా గడిపిన ఆ రెండు రోజులు కూడా పని ఒత్తిడి కారణంగానే మాతో ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఇది తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది. తరచుగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో మీటింగ్‌లను రీషెడ్యూల్ చేసేదట ఆమె టీమ్ మేనేజర్. చివరి నిమిషంలో పని ఒత్తిడి పెంచేదట. ఆమె కింద పనిచేయడం నీ బ్యాడ్ లక్ అని ఒక ఆఫీస్ పార్టీలో, ఒక సీనియర్ లీడర్ చెప్పాడట అన్నాతో. అయినాదురదృష్టవశాత్తూ, తప్పించుకోలేకపోయింది. ధిక పని భారం కారణంగా చాలామంది ఉద్యోగులు రాజీనామా చేశారని కూడా తెలిపింది. దయచేసి ఇలాంటి పరిస్థితి మరో ఉద్యోగికి రాకుండా జాగ్రత్తపడండి. ఇంత పెద్ద కంపెనీలో కనీస మానవహక్కులను పట్టించుకోకపోతే ఎలా? మీ హెచ్ఆర్ కాపీ మొత్తం చదివాను.ఇది నా కుమార్తె గురించి మాత్రమే కాదు, ఎన్నో ఆశలు, కలలతో మీ కంపెనీలో చేరి ప్రతి యువ నిపుణుడి గురించి కూడా. అన్నా మరణం మీ కంపెనీకి ఒక హెచ్చరిక లాంటిది.మీ సంస్థలోని పని సంస్కృతిని ప్రతిబింబించే సమయం ఇది, ఆచరణ సాధ్యంకాని అంచనాలతో వారిపై ఒత్తిడి పెంచకండి.మీ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోండి.నాబిడ్డ అనుభవం నిజమైన మార్పుకు దారితీస్తుందని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి దుఃఖం ఏ ఇతర కుటుంబమూ రాకుండా చూడండి. నా అన్న ఇప్పుడు మాతో లేదు. కానీ ఆమె గాథ మార్పుకు నాంది కావాలి..’’ అంటూ రాసుకొచ్చారు అనితా అగస్టిన్. అయితే దీనిపై కంపెనీనుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.అలాగే అన్నా మరణానికి అసలైన కారణాలు ఏమిటి అనేదానిపై స్పష్టత లేదు. -
గురుగ్రామ్‌లోని మాల్‌కు బాంబు బెదిరింపు..
హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్ బెదిరింపు అందింది. గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు శనివారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాల్ అధికారులు.. బిల్డింగ్ నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మాల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు.అయితే మాల్ మేనేజ్మెంట్కు వచ్చిన మెయిల్లో.. బిల్డింగ్‌లో బాంబులు అమర్చినట్లు, మాల్లోని ఏ ఒక్కరూ తప్పించుకోలేరని గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు గుర్తించలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.మరోవైపు నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం మాల్‌ను ఖాళీ చేసి తనిఖీ చేశారు. మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. ఈ డ్రిల్‌లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పారు. -
ఢిల్లీలోని పాఠశాలకు మరోసారి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సౌత్ ఢిల్లీలోని ఓ పాఠశాలకు బెదిరింపులు అందడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ కైలాష్‌లోని ప్రైవేటు పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబు అమర్చినట్లు గురువారం అర్థరాత్రి ఈ మెయిల్ రాగా.. పాఠశాల అధికారులు 10 నిమిషాల్లోనే విద్యార్థులను ఖాళీ చేయించారు.బాంబు డిటెక్షన్ టీమ్, డాగ్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాల మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా.. ఎలాంటి అనుమానాస్పదంగా ఏమీ కనుగొనలేదని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఈ బెదిరింపు బూటకమని అధికారులు ధృవీకరించారు. కాగా ఇటీవలే రాజధాని నగరంలోని పలు పాఠశాలలకు (వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. -
రేపటి నుంచి ఈ బ్యాంక్ అలర్ట్స్ బంద్.. కానీ ఇలా చేస్తే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ .100 లోపు విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం నిలిపివేయనుంది.జూన్ 25 నుంచి రూ.100 లకు పైబడిన చెల్లింపులు, రూ.500 లకు మించి అందుకున్న లావాదేవీలకు మాత్రమే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఉంటాయని బ్యాంక్ గతంలోనే ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్స్ అందుకునే అవకాశం ఉంది.ఈమెయిల్ ఇన్‌స్టా అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా..నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే టాప్ బ్యానర్ పై ఉన్న ఇన్ స్టాఅలర్ట్స్ పై క్లిక్ చేసి సూచనలను పాటించండి.మొబైల్ యాప్ ద్వారా అయితే మెనూకు వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. మేనేజ్ అలర్ట్స్ పై క్లిక్ చేయండిఇన్స్టా అలర్ట్స్ డీయాక్టివేట్ చేయాలంటే..» మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌తో నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వండి» పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ఇన్‌స్టా అలర్ట్స్‌పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ డీ రిజిస్టర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ ఎంచుకోండి.» అలర్ట్స్ రకాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ సెలెక్ట్ అయ్యాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. -
దేశవ్యాప్తంగా 41 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు!
న్యూఢిల్లీ: దేశంలో 41 ఎయిర్‌పోర్ట్‌లలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. దీంతో వరుస బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌తో అప్రమత్తమైన కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దేశం మొత్తం జల్లెడపట్టి అవి నకిలీ బెదిరింపులేనని నిర్ధారించారు.దేశంలోని తమిళనాడులోని చెన్నై,కోయంబత్తూర్,బీహార్‌లోని పాట్నా, గుజరాత్‌లోని వడోదర, రాజస్థాన్‌లోని జైపూర్ 41 విమానాలలో బాంబు హెచ్చరిక ఈమెయిళ్లు వచ్చాయి. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని,ఎలాంటి ఆధారాలు లభించలేదేని సీనియర్ అధికారులు వెల్లడించారు.ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం 13ఏళ్ల బాలుడు ఎయిర్ కెనడా విమాన బెదిరింపు ఈమెయిల్‌ను పంపినట్లు అధికారులు గుర్తించారు. -
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆగంతకుల బాంబు బెదిరింపులు మరోసారి కలకలానికి కారణమయ్యాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)తోపాటు ఎనిమిది ఆస్పత్రులకు ఈ–మెయిల్ హెచ్చరికలు అందాయి. మే ఒకటో తేదీన దేశ రాజధాని పరిధిలోని 150కి పైగా స్కూళ్లకు కూడా ఇదేవిధంగా బెదిరింపు మెయిళ్లు అందడం, పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం అవన్నీ వట్టివేనని తేలడం తెల్సిందే. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐజీఐ టెరి్మనల్–3లో బాంబులు పెట్టినట్లు మెయిల్ అందడంతో తనిఖీలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీ ప్రాంతంలోని 8 ఆస్పత్రులకు బెదిరింపులు అందాయి. అదేవిధంగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ అందింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆయాచోట్లకు ఫైరింజన్లను పంపించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసు బృందాలు పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని ఢిల్లీ నార్త్‌జోన్ డీసీపీ ఎంకే మీనా చెప్పారు. బురారీ ఆస్పత్రి, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, దాదాదేవ్ హాస్పిటల్, గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, బారా హిందూరావ్ హాస్పిటల్, జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి, అరుణా అసఫ్ అలీ గవర్నమెంట్ ఆస్పత్రులకు ఈ బెదిరింపులు వచ్చాయి. -
Elon Musk: ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది !
వాషింగ్టన్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ పేరును ‘ఎక్స్’గా మార్చిన దాని నూతన యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ అదే పేరుతో ఒక ఈమెయిల్‌ను తీసుకురానున్నారు. ‘ఎక్స్ మెయిల్’ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈమెయిల్ సేవల ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు. అయితే సొంత ఎక్స్‌మెయిల్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు, అందులోని ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు నెటిజన్లు అందరూ వాడే గూగుల్ వారి జీమెయిల్ త్వరలో తన సేవలను నిలిపివేయనుందన్న పుకార్ల నడుమ ఎక్స్‌మెయిల్ అరంగేట్రం చేయనుండటం గమనార్హం. జీమెయిల్ 2024 ఆగస్ట్ ఒకటో తేదీన కనుమరుగుకానుందంటూ ‘ఎక్స్’లో ఒక వార్త ప్రత్యక్షమై విస్తృత చర్చకు తెరలేపింది. గూగుల్ పంపిన ఒక ఈమెయిల్లో ‘త్వరలో జీమెయిల్ అస్తమించబోతోంది’ అంటూ ఒక సందేశం ఉందని ఆ వార్తలోని సారాంశం. దీనిపై జీమెయిల్ మాతృసంస్థ గూగుల్ స్పందించింది. ‘అవన్నీ శుద్ధ అబద్ధాలు. ఇన్నాళ్లూ బేసిక్ హెచ్‌టీఎంఎల్ వ్యూ ఫార్మాట్లో జీమెయిల్ సేవలు అందించాం. ఆ సేవలను ఈ ఏడాది నిలిపివేసి త్వరలోనే ‘స్టాండర్డ్’ వ్యూలో జీమెయిల్ సేవలను అధునాతనంగా అందిస్తాం’ అని గూగుల్ స్పష్టతనిచి్చంది. దీంతో జీమెయిల్ యూజర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా రాబోయే ఎక్స్‌మెయిల్ ఏమేరకు జీమెయిల్‌కు పోటీ ఇవ్వగలదో చూడాలి మరి. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’ ఇంజనీరింగ్, సెక్యూరిటీ టీమ్ సీనియర్ సభ్యుడు న్యాట్ మెక్గ్రేడీ వెల్లడించారు. -
కొత్త సినిమా టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టేసిన ఆ హీరోయిన్
ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలో నటించిన కొత్త మూవీ 'ఈ-మెయిల్'. మురుగ అశోకన్ హీరోగా చేశాడు. ఇందులో హిందీ, భోజ్‌పురి మూవీస్ ఫేమ్ ఆర్తి శ్రీ, ఆదవ్ బాలాజీ, అక్షయ్‌కుమార్, తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్సార్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఈ క్రమంలోనే చిత్ర టీజర్‌ను ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఇక మూవీ గురించి మాట్లాడిన దర్శకుడు... ప్రస్తుతం ఎందరో ప్రాణాలను బలిగొంటున్న ఆన్లైన్ గేమ్స్ మోసాల కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇదని అన్నాడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్.. అన్ని అంశాలను ఉంటాయని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్!
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తి 48 గంటల్లో బిట్‌కాయిన్ రూపంలో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) డిమాండ్ చేసినట్లు సమాచారం. quaidacasrol@gmail.com ద్వారా బెదిరింపు ఈమెయిల్ పంపినందుకు గుర్తు తెలియని వ్యక్తిపై సహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు మెయిల్ వచ్చినట్లు తెలిసింది. ‘బిట్‌కాయిన్‌లో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) బదిలీ చేయకపోతే 48 గంటల్లో టెర్మినల్ 2ను పేల్చేస్తాం. 24 గంటల తర్వాత మరొక హెచ్చరిక ఉంటుంది’ అని మెయిల్ వచ్చింది. ఇదీ చదవండి: 2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ.. : టెస్లా దాంతో ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 385(బలవంతపు వసూళ్లు), 505(1)(బి) (ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రకటనలు చేయడం) కింద కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ప్రాథమిక విచారణలో ఈమెయిల్ పంపిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐసీ) చిరునామాను పోలీసులు ట్రాక్ చేశారు. పోలీస్ సైబర్ విభాగం మెయిల్ లొకేషన్‌ను గుర్తించినట్లు సమచారం. -
మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్పీరియన్స్..
Microsoft Outlook Lite: ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఔట్లుక్ లైట్లో కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇమెయిల్ అండ్ ఎస్ఎమ్ఎస్ యాప్ పరిచయం చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ (Microsoft Outlook Lite) అనేది భారతదేశంలోని వినియోగదారుల కోసం కంపెనీ రూపొందించిన ఒక ప్రత్యేకమైన యాప్. ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి అనుకూలంగా ఇది స్థానిక భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది 3G, 4G, 5G లాంటి ఏ నెట్‌వర్క్‌లో అయినా చాలా వేగంగా పనిచేస్తుంది. ప్రాంతీయ భాషల్లో.. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ భారతదేశంలో విభిన్న భాషా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది. ఇందులో వాయిస్ టైపింగ్, ట్రాన్స్లేషన్ వంటివి మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో ఇమెయిల్ చదవడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ ద్వారా వినియోగదారుడు తమ మాతృభాష లేదా ప్రాధాన్య భాషలో ఇమెయిల్‌లను కంపోజ్ చేసుకోవచ్చు, తద్వారా సులభంగా చదువుకోవచ్చు. అంతే కాకుండా ఒక భాషలో ఈ కంటెంట్ టైప్ చేసి దాన్ని తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. హిందీలో ఇమెయిల్ టైప్ చేసి, దాన్ని ఆటోమాటిక్‌గా ఇంగ్లీష్‌లో లేదా ఇతర భాషల్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఔట్లుక్ లైట్ సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ వంటి ఐదు భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది మరిన్ని భాషలు, మాండలికాల్లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఎస్ఎమ్ఎస్.. ఇక ఎస్ఎమ్ఎస్ మెసేజింగ్ విషయానికి వస్తే, ఔట్లుక్ లైట్ కేవలం ఇమెయిల్స్‌కి మాత్రమే కాకుండా.. ఎస్ఎమ్ఎస్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్లేషన్, ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ వంటి వాటి కోసం సంస్థ 'స్మార్ట్ ఇన్‌బాక్స్' అందిస్తుంది. ఇది సమాచారాన్ని సులభతరం చేయడమే కాకుండా.. సంబంధిత సందేశాలను ఒకే చోట చూడటానికి అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ముఖ్యమైన అపాయింట్మెంట్లు, ట్రావెల్ బుకింగ్స్, బిల్ పేమెంట్స్, గ్యాస్ బుకింగ్ వంటి వాటిని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఔట్లుక్ లైట్ భారతీయ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది, కంపెనీ త్వరలోనే ఈ ఫెసిలిటీని కూడా అందించే అవకాశం ఉంది. ఆ తరువాత వినియోగదారుడు తనకు నచ్చిన భాషల్లో మెసేజస్ చదువుకోవచ్చు. నచ్చిన భాషలో అనువాదం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఫీచర్స్ పరిచయం చేసిన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ & మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, ఇండియా గ్రూప్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ 'రాజీవ్ కుమార్' మాట్లాడుతూ.. భారతదేశం టెక్నాలజీలో దూసుకెళ్తున్న తరుణంలో డిజిటల్ అనుభవాలను పెంపొందించడంలో ఔట్లుక్ లైట్ ఫీచర్స్ ఉపయోగపడతాయని, వినియోగదారుల మధ్య బలమైన కమ్యూనికేషన్ పెంపొందించడం సహాయపడతాయని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ప్రతి వ్యక్తి లేదా వినియోగదారుడు తన ప్రాధాన్య భాషతో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, రోజువారీ పరస్పర చర్యలను సులభతరం చేయడంలో ఇది సహకరిస్తుందని చెబుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్స్ తీసుకురావడంలో కంపెనీ కృషి చేస్తుందని వివరించారు. -
ఈసారి రూ.400 కోట్లు డిమాండ్..అంబానీకి వరుసగా మూడో బెదిరింపు ఈమెయిల్
ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్ వస్తున్నాయి. గతంలో రూ.20కోట్లు, రూ.200కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈమెయిల్ ఇచ్చాయి. ఈసారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. నాలుగు రోజుల్లో అంబానీకి పంపిన మూడో బెదిరింపు ఈమెయిల్ ఇదని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 27న ఓ వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెయిల్ రావడంతో అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జీ చేసిన ఫిర్యాదు ఆధారంగా గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 28న రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఈమెయిల్ వచ్చింది. తాజాగా కంపెనీకి సోమవారం మూడో ఈమెయిల్ వచ్చినట్లు అధికారి తెలిపారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచి, సైబర్ బ్రాంచి బృందాలు ఈమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను గతేడాది బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్‌ను పేల్చివేస్తామని నిందితులు గతంలో బెదిరించారు. -
ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ..
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ'కి (Mukesh Ambani) గత 48 గంటల్లో రెండు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 27న పంపిన మెయిల్లో రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితుడు.. అదే మెయిల్ నుంచి రూ. 200 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తూ మెయిల్ చేసాడు. ఇండియాలో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, అడిగిన డబ్బు ఇవ్వకుంటే చంపుతామని మెయిల్లో నిందితుడు ప్రస్తావించారు. దీనిపైన యాంటిలియా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ దేవేంద్ర మున్షీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉపయోగించాడని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ద్వారా అతడిని గుర్తించాలని లేఖ రాశామని పోలీసు అధికారి తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 387, 506 (2) కింది గుర్తు తెలియని వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్ 5న రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ఒక హాస్పిటల్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆసుపత్రిలో బాంబ్ పేల్చనున్నట్లు పేర్కొన్నాడు. ఆ తరువాత రోజే ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ వారసులు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. -
ముకేశ్ అంబానీకి బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంబానీ సంస్థకు చెందిన ఓ ఈ–మొయిల్ ఐడీకి శుక్రవారం మెయిల్ వచ్చింది. ‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’అని ఆ మెయిల్ సారాంశం. దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ మెయిల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది సైతం ముకేశ్ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్ ఆస్పత్రికి ఫోన్ చేసి ‘ఆసుపత్రిని పేల్చేస్తాం. అంబానీ కుటుంబాన్ని చంపేస్తాం’అని బెదిరించాడు. 2021లో ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. -
సరికొత్త వంగడాల అన్వేషణ..ఏకంగా అంతరిక్షం నుంచి!
భూతాపాన్ని, కరువును తట్టుకునే సరికొత్త వంగడాల కోసం అన్వేషణ ఇప్పుడు అంతరిక్షంలోకి చేరింది. అంతరిక్షంలో కాస్మిక్ కిరణాల రేడియేషన్‌లో కొన్ని నెలలు ఉంచిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్) వంగడాలు భూమ్మీద క్లైమెట్ ఎమర్జెన్సీని దీటుగా తట్టుకోగలుగు తాయని ఎఫ్.ఎ.ఓ. భావిస్తోంది. మొట్టమొదటిగా జొన్న విత్తనాలతో స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో కలసి ఎఫ్.ఎ.ఓ. శ్రీకారం చుట్టింది. కేరళకు చెందిన శాస్త్రవేత్త డా. శోభా శివశంకర్ ఈ పరిశోధనలకు సారధ్యం వహిస్తుండటం విశేషం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల (అక్టోబర్ 4–10) సందర్భంగా డా. శోభ ‘సాక్షి సాగుబడి’కి ఈ–మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కరువును తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలు రూపొందించుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడు తుందని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. స్పేస్ బ్రీడింగ్ ద్వారా చైనా ఇప్పటికే 260 వంగడాలను తయారు చేసుకొని వాడుతుండటం విశేషం. అంతరిక్షంలో రేడియేషన్‌కు గురిచేసిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ బ్రీడింగ్) వంగడాల వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? భూమిపై కరువు, అధిక ఉష్ణోగ్రతలు, నేల లవణీయత వంటి పర్యావరణ సంబంధమైన ఒత్తిళ్లు పంటలను వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిణామాత్మక ఉత్పరివర్తనాలు (ఎవల్యూషనరీ మ్యుటేషన్స్) చెందేందుకు ప్రేరేపిస్తాయి. అయితే, అంతరిక్షంలో కాస్మిక్ రేడియేషన్, మైక్రోగ్రావిటీ, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కఠినమైన పరిస్థితులు నెలకొని ఉంటుంది. అందువల్ల, అంతరిక్షం విత్తనాలపై పెను ఒత్తిడిని కలిగిస్తుంది. కఠిన పరిస్థితులను మరింత సమర్థవంతంగా తట్టుకునేలా పంట విత్తనాల్లో సాధారణం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అత్యంత వేగవంతంగా సరికొత్త ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి బహుశా అంతరిక్షం మంచి వాతావరణం కావచ్చు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన విత్తనాలతో సరికొత్త వంగడాలను రూపొందించే ప్రక్రియనే ‘స్పేస్ ఇండ్యూస్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్’ అంటాం. ప్రస్తుతం, స్పేస్ బ్రీడింగ్ ద్వారా విడుదలైన వంగడాల ద్వారా వచ్చిన ఫలితాలు కొన్ని మాత్రమే. అంతేకాదు, ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి మొక్కల డిఎన్ఏపై అనంత విశ్వం చూపే ప్రభావాలేమిటో తెలియజెప్పే ప్రచురిత సమాచారం చాలా పరిమితమనే చెప్పాలి. స్పేస్ బ్రీడింగ్‌ను ఇప్పటి వరకు ఎన్ని దేశాలు, ఎన్ని పంటల్లో ఉపయోగిస్తున్నాయి? చైనా స్పేస్ బ్రీడింగ్‌లో ముందుంది. వివిధ పంటల విత్తనాలను అంతరిక్షంలోకి పంపి, అక్కడ కొన్నాళ్లు ఉంచి తిరిగి నేల మీదకు తెప్పించిన తర్వాత వాటిని పరీక్షించి, మెరుగైన ఫలితాలు ఉన్నట్లు గుర్తించిన చాలా రకాల పంటల వంగడాలను చైనా తమ దేశంలో రైతులకు అందించింది. ఈ జాబితాలో వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, మిరప, టమోటో తదితర పంటలున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతులు సాగు చేసే వరి, మిరప, పత్తి తదితర పంటలు అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడంలో జన్యుమార్పిడి విత్తనాల కన్నా ‘అంతరిక్ష విత్తనాలు’ ఎలా మెరుగైనవి? పోల్చడం కష్టం. సాధారణంగా జన్యుమార్పిడి చేయడానికి అందుకు అవసరమైన ప్రత్యేక జన్యువును ముందుగా గుర్తించడం అవసరం. గుర్తించిన జన్యువును జన్యుమార్పిడి/జన్యు సవరణ సాంకేతికతలలో ఉపయోగించి తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, ఐరాసకు చెందిన ఆహార– వ్యవసాయ సంస్థ వియన్నా (ఆస్ట్రియా) లో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నిక్స్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’లో ప్రత్యేక జన్యువులపై ముందస్తు అవగాహన లేకుండానే.. నేలపై ల్యాబ్‌లో మ్యుటేషన్ బ్రీడింగ్ ద్వారా ప్రత్యేక లక్షణాలను ఆశించి సరికొత్త పంట రకాలను అభివృద్ధి చేస్తుంది. ఎక్స్, గామా కిరణాల రేడియేషన్ ద్వారా జరిగే ఈ ప్రక్రియ విత్తనంలో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను సృష్టిస్తుంది. ఆ విత్తనాలను సాగు చేసి వాటిలో మనం ఆశించిన మార్పు వచ్చిందో లేదో జాగ్రత్తగా పరీక్షించి చూసుకోవాలి. ఈ స్క్రీనింగ్పైనే స్థిరమైన వ్యవసాయక పరిస్థితులకు అనువైన వంగడాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికి 70కి పైగా దేశాలకు చెందిన 210కి పైగా వృక్ష జాతులతో పాటు అనేక ఆహార పంటలు, అలంకరణ మొక్కలు, చెట్లకు సంబంధించి మ్యూటేషన్ బ్రీడింగ్ జరిగింది. 3,400కి పైగా అధికారికంగా విడుదలైన ఉత్పరివర్తన రకాలు మా డేటాబేస్‌లో వున్నాయి. ‘ఆసియాలో విత్తనోత్పత్తిదారులు వైవిధ్యమైన వాతావరణంలో పనిచేసే చాలా మంది చిన్న రైతుల కోసం విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు లక్షణాలను ఆశించి జన్యుమార్పిడి/సవరణ చేయడం వీరి అవసరాలను తీర్చదు. అధిక వేడిని, కరువును తట్టుకోవడం.. నిస్సారమైన/చౌడుబారిన నేలల్లో పెరిగే సామర్థ్యం వంటి మరింత సంక్లిష్టమైన గుణాలు కలిగిన వంగడాలు వారికి అవసరం. ఏదో ఒక జన్యువును మార్పిడి/సవరణ చేసే సాంకేతికతలతో ఇది సాధించలేం..’ అని మీరు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. దయచేసి దీని గురించి వివరిస్తారా? ఒక జన్యువు లేదా కొన్ని జన్యువులతో సవరించగలిగే సాధారణ లక్షణాలు జన్యుమార్పిడి మార్పు లేదా జన్యు సవరణకు అనుకూలంగా ఉంటాయి. కరువును తట్టుకోవటం, దిగుబడిని పెంపొందించటం వంటివి అనేక జన్యువులతో సంబంధం ఉండే సంక్లిష్ట లక్షణాలు. ఇవి జన్యుమార్పిడి లేదా జన్యుసవరణతో సాధ్యం కావు. యావత్తు జన్యువ్యవస్థ వ్యాప్త మార్పులు(జీనోమిక్ వైడ్ ఛేంజెస్) అవసరం. ఇవి మ్యుటేషన్ బ్రీడింగ్‌తో లేదా ప్రకృతిలో ఆయా లక్షణాలున్న వంగడాల ఎంపిక (టార్గెటెడ్ సెలక్షన్) ద్వారానే సాధ్యం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: ‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా? ) -
అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. చందన్ జీ ఠాకూర్(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్‌మెంట్‌ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్ స్కూల్.. బాంబు బెదిరింపు మెయిల్‌తో ఉలిక్కిపడింది. పాఠశాల ఆవరణలో బాంబులు ఉన్నాయని పేర్కొంటూ ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఐతే అలాంటి దేమి కనుగొనలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఢిల్లీలోని మధుర రోడ్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 8.10 గంటల ప్రాంతంలో పాఠశాల అధికారుల నుంచి ఈ విషయమై తమకు ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తాము హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని పాఠశాలను వెంటనే కాళీ చేయించామని చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనలేదన్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని సాదిక్నగర్లో ది ఇండియన్ స్కూల్‌కి ఈమెయిల్ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపు మరువకు మునుపే అలాంటి ఘటనే మరోకటి చోసుకోవడం గమనార్హం. ఐతే ఆ ఘటనలో బాంబు స్క్వాడ్, ఇతర ఏజెన్సీలు తనిఖీలు చేపట్టడా అలాంటివేమీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ మెయిల్ బూటకమని ప్రకటించారు కూడా. (చదవండి: వందే భారత్ రైలుపై కాంగ్రెస్ ఎంపీ పోస్టర్లు కలకలం) -
92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులిచ్చిన కోటీశ్వరుడు
వాషింగ్టన్: అమెరికా బిలియనీర్, మీడియా మొగల్‌గా ప్రఖ్యాతి గాంచిన రుపర్ట్ ముర్డోచ్ 92 ఏళ్ల వయసులో తన నాలుగో భార్య జెర్రీ హాల్(65)కు విడాకులు ఇచ్చారు. కేవలం 11 పదాల సందేశాన్ని ఈమెయిల్ చేసి ఆమెకు కటీఫ్ చెప్పారు. ఈ సమయంలో ఆమె ఇంట్లోనే ముర్డోచ్ కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. 'మనమిద్దరం కచ్చితంగా మంచి సయమం గడిపాం. కానీ నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. నా న్యూయార్క్ లాయర్ తక్షణమే వచ్చి నిన్ను కలుస్తారు' అని జెర్రీకి ముర్డోచ్ విడాకుల సందేశం పంపారు. ఈ జంట దాదాపు 6 ఏళ్లు కలిసి ఉంది. ఇది ముర్డోచ్‌కు నాలుగో వివాహం కాగా.. జెర్రీకి మాత్రం మొదటిది. అయితే ఆమె అంతకుముందు రాక్‌స్టార్ మిగ్ జాగర్‌తో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్నారు. గతేడాది జూన్‌లో వీరి విడాకులు ఎలా జరిగాయనే విషయాన్ని జెర్రీ స్నేహితులు తాజాగా వెల్లడించారు. ముర్డోచ్ సందేశం చూసి జెర్రీ హాల్ మైండ్ బ్లాంక్ అయిందని వాపోయారు. ఆమెకు ఏం చేయాలో తెలియలేదని పేర్కొన్నారు. అంతేకాదు విడాకుల విషయం చెప్పిన అనంతరం కాలిఫోర్నియాలోని తన మ్యాన్షన్ హౌస్ విడిచి పెళ్లిపోవాలని జేర్రీకి ముర్డోచ్ 30 రోజులే గడువు ఇచ్చాడని తెలిపారు. ముర్డోచ్ 14.5 బిలియన్ డాలర్లకు అధిపతి. ఆయనకు మొత్తం ఆరుగురు సంతానం. వీరిలో ఒక్కరు కూడా జెర్రీ సంతానం కాదు. దీంతో అతని ఆస్తిలో ఆమెకు వాటా వచ్చే అవకాశం లేదు. 2016లో సెంట్రల్ లండన్‌లో ముర్డోచ్, జెర్రీల వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. ఈ ప్రపంచంలో తాను అత్యంత అదృష్టవంతుడినని, సంతోషమైన వ్యక్తిని అని ముర్డోచ్ రాసుకొచ్చారు. ఇక ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెట్టొబోనని కూడా ఈ సందర్భంగాప్రకటించారు. మరో పెళ్లి అని ప్రకటించి.. అయితే జేర్రీకి విడాకులిచ్చి ఏడాది కూడా గడవక ముందే తాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత నెలలోనే ప్రకటించారు ముర్డోచ్. అన లెస్లే స్మిత్‌ను మనువాడుతానని చెప్పాడు. ఈమె ఏడు నెలలక్రితమే పరిచయమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరు పెళ్లి ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. దీంతో ఐదో పెళ్లి అనుకోకుండా రద్దయింది. ది సన్, ది టైమ్స్ వంటి న్యూస్‌పేపర్లు, ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి మీడియా సంస్థలకు ముర్డోచ్ యజమాని. ఆస్ట్రేలియాలో జన్మించిన ఈయన అమెరికాలో స్థిరపడ్డారు. మీడియా మొగల్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు. చదవండి: ఇదేందిరా అయ్యా.. పెళ్లి వేడుకలో వధువుకు చేదు అనుభవం -
ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇటీవలికాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలోదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగులకు జుకర్‌బర్గ్ అంతర్గత ఇమెయిల్ ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 2010లో ఉద్యోగులకు రాసిన ఈమెయిల్ తాజాగా (మంగళవారం. మార్చి 21) లీక్ అయింది. తాజా నివేదికల ప్రకారం ఫేస్బుక్ సొంత మొబైల్ ఫోన్లో పనిచేస్తోందని టెక్ క్రంచ్ కథనానికి ప్రతిస్పందనగా 2010 ఇమెయిల్ పంపించారు. ఈ వార్తను ఖండిస్తూ సిబ్బందిపై జుకర్ బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నెట్వర్క్ భవిష్యత్తు ప్రణాళికల గురించి తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కంపెనీ రహస్యంగా ఫోన్‌ను నిర్మిస్తోందన్న టెక్ క్రంచ్ కథనంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నమ్మక ద్రోహమే.. ఈ పని ఎవరు చేశారో దయచేసి తక్షణమే రాజీనామా చేయండి అని జుకర్‌బర్గ్ మండిపడ్డారు. 2010, సెప్టెంబరులో నాటి ఈ ఇ-మెయిల్ "కాన్ఫిడెన్షియల్-డోంట్ షేర్" అనే లైన్‌తో మొదలవుతుంది. ఒక ప్రశ్నోత్తరాల సమయంలో తాను ఫోన్ తయారీ గురించి అస్సలు మాట్లాడలేదని, అన్ని ఫోన్లు, యాప్స్ మరింత సోషల్ కావడం, భవిష్యత్తు ప్రణాళికలపై మాత్రమే సుదీర్ఘంగా మాట్లాడాను అంటూ టెక్ క్రంచ్ కథనాన్ని కోట్ చేశారు. ఈ విషయాన్ని ఎవరు లీక్ చేసినా వెంటనే రాజీనామా చేయాల్సిందేనంటూ ఆగ్రహించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని లీక్ చేసిన వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి.. లేదంటే అదెవరో ఖచ్చితంగా తెలుసుకుంటామని జుకర్‌బర్గ్ హెచ్చరించారు. కాగా గత ఏడాదంతా మెటాకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతికూల ఆర్థిక వాతావరణామాలు, ఆదాయాలు పడిపోవడంతో వేలాదిమందిని తొలగించింది. అంతేకాదు మిడిల్ మేనేజ్మెంట్ను లక్ష్యంగా రాబోయే నెలల్లో 10వేల మందిని మెటా తొలగిస్తుందని, అలాగ 5 వేల ఇతర జాబ్స్‌ను కూడా భర్తీ చేయడంలేదని మార్చి నెల ప్రారంభంలో జుకర్‌బర్గ్ ఉద్యోగులకు ఇమెయిల్ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
మృణాల్ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!
బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఫేమ్ సంపాదించింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే తాజాగా మృణాల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మృణాలు తన ఇన్‌స్టాలో వీడియో షేర్ చేస్తూ.. ' నా ఈ-మెయిల్ ఖాతా హ్యాక్ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన వ్యక్తిగత సమాచారం, స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు అసలేం జరిగిందని షాక్‌కు గురయ్యారు. కానీ అయితే ఇదంతా నిజంగా జరగలేదని తెలుస్తోంది. కేవలం ఓ షో ప్రమోషన్ కోసం దీనిని షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోలు రానా , వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో రానా.. సెలబ్రిటీల సమస్యలు తీర్చే పాత్రలో కనిపించారు. తాజాగా మృణాల్ ఠాకూర్ రానానాయుడు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో 'తన మెయిల్ ఖాతా హ్యాక్‌కు గురైందని.. ఏం చేయాలో తెలియక రానా నాయుడుని సంప్రదించానని చెప్పుకొచ్చింది. రానా సాయంతోనే సమస్య పరిష్కారించారని తెలిపింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధిగమించాలో తెలియాలంటే రానా నాయుడు చూడాలని సలహా ఇచ్చింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇప్పటికే ఈ సిరీస్ ప్రమోషన్లలో జాన్వీకపూర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
ఈ-మెయిల్ యాప్‌ను బ్లాక్ చేసిన యాపిల్.. కారణం ఇదే..
ఏఐ(కృత్రిమ మేధ) అనుసంధానంతో రూపొందించిన బ్లూమెయిల్ అనే ఈ-మెయిల్ యాప్‌ను యాపిల్ మొబైల్ సంస్థ నిషేధించింది. ఈ-మెయిల్‌కు చాట్‌జీపీటీని అనుసంధానించడం వల్ల పిల్లలు దీని నుంచి అనుచితమైన కంటెంట్‌ను పొందే ప్రమాదం ఉందన్న కారణంతో ఈ-మెయిల్ యాప్‌కి అప్డేట్ను ఆమోదించడాన్ని యాపిల్ ఆలస్యం చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం వెలువరించింది. ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన జీపీటీ-3 లాంగ్వేజ్ మోడల్ కస్టమైజ్డ్ వెర్షన్‌ని ఉపయోగించి బ్లూమెయిల్ తమ యాప్‌ను ఇటీవల అప్డేట్ చేసింది. అయితే ఆ అప్డేట్ను యాపిల్ ఆమోదించకుండా బ్లాక్ చేసిందని బ్లూమెయిల్ తయారీ సంస్థ బ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు బెన్ వోలాచ్ చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను ఉపయోగించుకుని మునుపటి ఈ-మెయిల్స్, ఈవెంట్ల కంటెంట్ ఆధారంగా ఆటోమేటిక్‌గా ఈ-మెయిల్ రాసేలా బ్లూమెయిల్ కొత్త ఫీచర్‌ను రూపొందించింది. ఇది మనుషుల మాదిరే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వడమే కాకుండా సుదీర్ఘ మెయిల్లను కూడా క్షణాల్లో రాయగలదు. తమ ఈ-మెయిల్యాప్ అప్డేట్ను యాపిల్ ఆమోదించకుండా నిషేధించడంపై బ్లూమెయిల్ యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దావా కూడా వేసినట్లు పేర్కొంది. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు -
అసలు డౌట్ రాలేదు.. అక్షరం మార్చి రూ. కోటి కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలు చేసే కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. అకౌంట్ టేకోవర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ–మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లింపుల సమయం వరకు వేచిచూసి బ్యాంక్ ‘ఖాతా’ మార్చేయడం ద్వారా తేలిగ్గా సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఈ నేరగాళ్ల బారినపడి 1.39 లక్షల డాలర్లు (రూ.1.15 కోట్లు) చెల్లించి.. అతికష్టం మీద తిరిగి పొందిన హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఎల్రక్టానిక్ వస్తువుల కోసమని.. బ్యాటరీలు, పలు రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసే హెచ్‌బీఎల్ సంస్థ.. పలు రకాల విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన ఎక్సెల్ పాయింట్ అనే సంస్థ నుంచి మైక్రో కంట్రోలర్లు, చిప్‌ల కొనుగోలు కోసం సంప్రదింపులు జరిపింది. ఎక్సెల్ పాయింట్ సంస్థకు మన దేశంలోని పెద్ద నగరాల్లోనూ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలోని ఓ కార్యాలయంలో పనిచేసే నవ్య అనే ఉద్యోగి.. హెచ్‌బీఎల్ సంస్థతో ఫోన్ ద్వారా, తన పేరిట ఉన్న ఈ–మెయిల్ ఐడీ ద్వారా సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో ఎక్సెల్ సంస్థ విడిభాగాలకు సంబంధించి 1.39 లక్షల డాలర్లను.. ఈనెల 2న సింగపూర్ బ్యాంక్‌లోని తమ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ వివరాలను హెచ్‌బీఎల్‌కు ఈ–మెయిల్ చేసింది. అదేరోజున సాయంత్రం 4:30 గంటలకు ఎక్సెల్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా హెచ్‌బీఎల్ సంస్థకు మరో ఈ–మెయిల్ అందింది. అందులో ఐటీ, పలు ఇతర కారణాల వల్ల బ్యాంకు ఖాతాను మార్చాలని, యూఏఈకి చెందిన ఓ బ్యాంకు ఖాతాకు సొమ్ము ట్రాన్స్ఫర్ చేయాలని అందులో ఉంది. దీంతో హెచ్‌బీఎల్ సంస్థ అదేరోజున 1.39 లక్షల డాలర్లను యూఏఈ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కానీ రెండు రోజులు వేచి చూసినా సింగపూర్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పరిశీలించిన హెచ్‌బీఎల్ సంస్థ ప్రతినిధులు.. రెండోసారి వచ్చిన ఈ–మెయిల్ నకిలీదని, సొమ్ము వేరే ఎవరికో ట్రాన్స్ఫర్ అయిందని గుర్తించారు. దీనిపై వెంటనే సంస్థ ఖాతా ఉన్న ఎస్బీఐకి ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం యూఏఈ బ్యాంకు నుంచి నగదును వెనక్కి రప్పించగలిగింది. ఈ–మెయిల్ ఐడీని హ్యాక్ చేసి.. సైబర్ నేరగాళ్లు సింగపూర్ సంస్థకు చెందిన ఈ–మెయిల్ ఐడీని హ్యాక్ చేసి ఉంటారని, లావాదేవీలు ఇతర విషయాలను క్షుణ్నంగా పరిశీలించి మోసానికి దిగి ఉంటారని సైబర్‌క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. హెచ్‌బీఎల్ సంస్థతో సంప్రదింపుల కోసం ఎక్సెల్ సంస్థ వాడిన ఈ–మెయిల్ ఐడీని గుర్తించి, కేవలం ఒక్క అక్షరం మార్చి మరో ఈమెయిల్ ఐడీని సృష్టించారని.. దీనిని గమనించలేక పోవడంతో డబ్బు వేరేవారికి ట్రాన్స్ఫర్ అయిందని వివరిస్తున్నారు. ఈ తరహా నేరాల్లో నగదు రికవరీ కావడం కష్టమని.. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్‌కి పిలిచి దారుణంగా.. -
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్‌పై స్పందించిన రాష్ట్రపతి భవన్
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి ఈ–మెయిల్‌కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. నగర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రజ్ఞ సోమవారం మెయిల్ ద్వారా లేఖ రాసిన విషయం విదితమే. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్న అంశాన్ని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. ఈమె పంపిన ఈ–మెయిల్‌పై రాష్ట్రపతి భవన్ స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అండర్ సెక్రటరీ పీసీ మీనా ప్రభుత్వానికి బుధవారం మెయిల్ పంపారు. ప్రజ్ఞ ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలంటూ అందులో ఆదేశించారు. ఈ పరిణామంతో ప్రజ్ఞ ఆమె కుటుంబీకులు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి -
వావ్! గూగుల్ యూజర్లకు శుభవార్త!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఇంటర్నెట్తో అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో జీ మెయిల్‌ను ఉపయోగించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. జీమెయిల్. పరిచయం అక్కర్లేని పేరు. గూగుల్‌కు చెందిన ఈమెయిల్ సర్వీస్‌ను 18శాతం ఈమెయిల్ క్లయింట్ మార్కెట్ షేర్‌తో గతేడాది 1.8 బిలియన్ల మందికిపై గా వినియోగించారు. 75శాతం మందికి పైగా వినియోగదారులు స్మార్ట్ఫోన్లలో జీమెయిల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ తరుణంలో రూరల్ ఏరియాలు, నెట్ స్లోగా ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీమెయిల్‌ను ఆఫ్ లైన్లో వినియోగించుకోవాలంటే ♦ముందుగా జీమెయిల్ సెట్టింగ్ ఆప్షన్లో ట్యాప్ చేయాలి. ♦కాగ్ వీల్ బటన్ పై క్లిక్ చేసి అందులో సీ ఆల్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ♦మీరు ఆన్లైన్లో ఉంటే అక్కడ ఆఫ్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦అనంతరం చెక్ బాక్స్ ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ క్లిక్ చేయండి. ♦మీరు చెక్ బాక్స్ ను క్లిక్ చేసిన మరుక్షణం, జీమెయిల్ కొత్త సెట్టింగ్ లను చూపుతుంది. ♦ఆ సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తే జీమెయిల్ ఆఫ్‌లైన్ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. -
పరారీలో లేను.. అమెరికాలో ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం పరారీలో ఉన్న కిరణ్ రాజు పెనుమత్స నుంచి పోలీసులకు ఈ–మెయిల్ వచ్చింది. తాను సదరు పబ్‌లో భాగస్వామినని, పెట్టుబడి పెట్టాను తప్ప కార్యకలాపాలను పర్యవేక్షించట్లేదని తెలిపారు. తన సోదరికి ఆపరేషన్ కావడంతో కొన్ని నెలలుగా తాను అమెరికాలో ఉంటున్నానని పేర్కొన్నారు. పబ్‌పై దాడి జరిగిన తర్వాత తాను పారి పోయినట్లు మీడియాలో వస్తోందని, కానీ తాను పరారీలో లేనంటూ ఈ–మెయిల్లో వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్‌కు వచ్చిన తర్వా త పోలీసుల ఎదుట హాజరై పూర్తి వివరణ ఇస్తానన్నారు. ఈ మెయిల్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సాంకేతిక అంశా లపై ఆరా తీస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి కిరణ్ దీన్ని పంపారో పరిశీలిస్తున్నారు. కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు అర్జున్ వీరమాచినేని కోసం గాలింపు కొనసా గుతోంది. ఈయన పశ్చిమ బెంగాల్లో ఉన్న ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర నిందితులు అభిషేక్ ఉప్పల, అనిల్‌కుమార్‌ల కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. -
కేంద్రానికి ఈమెయిల్ ద్వారా మెసేజ్‌లు
-
లాగర్స్తోనే సొమ్ము లాగేశారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సైబర్ నేరగాళ్లు ఈ వ్యవహారాన్ని కీలాగర్స్ (ఇదో రహస్య సాఫ్ట్వేర్) సాయంతో చేశారని, హైదరా బాద్ కేంద్రంగా ప్రాక్సీ సర్వర్‌లో కథ నడిపారని గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందించిన యువకుడు, యువతిని ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరిని గురువారం నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. సైబర్ సెక్యూరిటీ పక్కాగా లేని మహేష్ బ్యాంక్‌ను కొల్లగొట్టడానికి సైబర్ కేటుగాళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న దళారుల సాయంతో 128 ఖాతాలు ఎంపిక చేసుకున్నారు. ఈ ఖాతాదారులకు 10–15 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సూత్రధారులకు, వీరికి మధ్యలో నాలుగు అంచెల్లో అనేక మంది సహకరించారు. వీరిలో నైజీరియన్లతోపాటు వివిధ మెట్రో నగరాలు, ఈశాన్య రాష్ట్రాలకు చెం దిన వారున్నారు. నగదు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధమైన తర్వాత అసలు పని ప్రారం భించిన సైబర్ నేరగాళ్లు హైద రాబాద్‌లో ఉన్న సూత్రధా రులకు సమాచారం ఇచ్చారు. ఈ–మెయిల్ రూపంలో కీలాగర్స్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాకింగ్ చేసేందుకు ముగ్గురు సూత్రధారులు హైదరాబాద్ శివార్లలో అడ్డా ఏర్పాటు చేసుకున్నారు. ప్రాక్సీ సర్వర్లు వాడుతూ నవంబర్ నుంచి కీలాగర్స్ ప్రయోగించారు. ఇంటర్నెట్తోపాటు డార్క్ నెట్లో విరివిగా లభిస్తున్న ఈ నిగూఢ సాఫ్ట్‌వేర్‌ను సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారిక ఈ–మెయిల్‌కు జోక్స్, బొమ్మలు, ఆఫర్లు లేదా ఆర్బీఐ పేరుతో పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్‌నకు పదుల సంఖ్యలో కీలాగర్స్తో కూడిన మెయిల్స్ పంపారు. దీన్ని అవతలి వ్యక్తి క్లిక్ చేయగానే అతడికి తెలియకుండానే వారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయింది. దీంతో వారి పని సులువైంది. ఈ సాఫ్ట్వేర్ ఉన్న కంప్యూటర్లో కీ బోర్డులో ఒక్క బటన్ నొక్కినా ఆ వివరాలు పూర్తిగా సైబర్ నేరగాడికి ఈ–మెయిల్ రూపంలో చేరిపోతాయి. ఇలానే మహేష్ బ్యాంక్ సూపర్ అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ సైబర్ నేరగాళ్లకు చేరాయి. వీటి ద్వారానే బ్యాంక్ నెట్వర్క్ నుంచి సర్వర్లోకి చొరబడి దఫదఫాలుగా రూ.12.93 కోట్లను నాలుగు ఖాతాల్లోకి బదిలీ చేశారు. వాటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మరో 128 ఖాతాల్లోకి మళ్లించారు. ప్రస్తుతం ముగ్గురు కీలక సైబర్ నేరగాళ్లతోపాటు బ్యాంకు ఖాతాలు అందించిన, దళారులుగా వ్యవహరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నీలం రంగులో లింకులు! ‘సాధారణంగా మెయిల్స్ ద్వారా వచ్చే కీలాగర్స్ లింకులు నీలం రంగులో ఉంటాయి. అపరిచిత ఈ–మెయిల్స్‌లో ఇలాంటి లింక్స్ ఉంటే వాటి జోలికి పోకపోవడం ఉత్తమం. ఆ లింక్‌ను కాపీ చేసి అడ్రస్ బార్లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే అది అసలుదా? నకిలీదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై బ్యాంకు అధికారులకు అవగాహన లేకపోవడమే సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
అమ్మ బాబోయ్..మెయిల్స్ పంపిస్తున్నారు, దర్జాగా కోట్లు నొక్కేస్తున్నారు..!
బనశంకరి: పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థల ఈమెయిల్స్‌ను పోలిన నకిలీ ఈమెయిల్స్ రూపొందించి వాటి ద్వారా తప్పుడు సమాచారం పంపి కోట్ల రూపాయలను సైబర్ ముఠాలు దోచుకుంటున్నాయి. బెంగళూరులో ఇటువంటి వంచక మెసేజ్‌లను నమ్మి అనేక కంపనీలు డబ్బు కోల్పోతున్నాయి. ఇలా ఐదు ప్రముఖ కంపెనీలు నగరంలోని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కాంటినెంటల్, ఫ్యూచర్‌రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, అద్విక్ ఆటో, ఇతర కంపెనీలు ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఎలా జరుగుతుందంటే తాము ముడిసరుకులను ఒక సంస్థ నుంచి తెప్పించుకుంటామని ఓ బాధిత కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈమెయిల్, బ్యాంకు అకౌంట్ల ద్వారా లావాదేవీలను నిర్వహిస్తుంటామని చెప్పారు. తమకు సరుకులను సరఫరా చేసే సంస్థ ఇటీవల నగదు జమచేయాలని ఈ మెయిల్ చేసిందని, వారు సూచించిన ఖాతాల్లోకి రూ.60 లక్షలను పంపామని తెలిపారు. కానీ అది కంపెనీకి చెందిన మెయిల్, అకౌంటు కాదని, సైబర్ నేరగాళ్లు తప్పుడు ఈమెయిల్ ద్వారా తమ డబ్బును కొట్టేశారని వాపోయారు. రూ.34 లక్షలు ఒక సంస్థ, రూ.2 లక్షలు మరో సంస్థ ఇలాగే మోసపోయాయి. కొద్దిరోజుల తరువాత కంపెనీ వారిని సంప్రదించగా, తమకు ఏ డబ్బూ అందలేదని చెప్పారన్నారు. దాదాపు ప్రతి సంస్థదీ ఇదే సమస్య. జాగ్రత్తలు పాటించాలి కంపెనీల మధ్య సాగే ఈమెయిళ్లను హ్యాక్ చేయడమో, లేదా ఇంటి దొంగల ద్వారా మెయిల్ ఐడీలను కనుక్కుని, అచ్చం అటువంటి ఈమెయిల్‌నే క్రియేట్ చేస్తారు. తద్వారా బురిడీ కొట్టిస్తారని పోలీసులు తెలిపారు. ఈమెయిల్‌పైనే ఆధారపడకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు, ఫోన్లలో మాట్లాడుకుని నిర్ధారించుకోవాలని, ఆ తరువాతే నగదు లావాదేవీలు జరడం సురక్షితమని సూచించారు. -
నీట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం రూరల్/చిలకలపూడి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ–2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డి 23వ ర్యాంక్‌తో మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్‌లు సాధించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్లకు ర్యాంక్ కార్డులను పంపింది. 720కి 720 మార్కులు సాధించింది వీరే.. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in,http://taresults.nic.in/NTARESULTS&CMS/ వెబ్సైట్లలో చూసుకోవచ్చు. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్టీఏ విడుదల చేసింది. కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్మర్ తదితర సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు.. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ కటాఫ్ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కటాఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచ్చినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ ► నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ► అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ► దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ► నీట్లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. ► ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. కౌషిక్‌రెడ్డికి పలువురి అభినందన నీట్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించిన కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. కౌషిక్‌రెడ్డి తిరుపతి భారతీయ విద్యాభవన్‌లో పదో తరగతి చదివి 500కు గానూ 488 మార్కులు సాధించాడు. అనంతరం ఇంటర్మీడియెట్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి 985 మార్కులు పొందాడు. సమాజ సేవ చేస్తా.. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పటికీ.. సమాజానికి ఎక్కువ సేవ చేసేందుకు వైద్య రంగమైతే బాగుంటుందని ఎంబీబీఎస్‌ను ఎంచుకున్నా. వైద్య రంగం ఎంతో ఆసక్తికరమైందే కాకుండా సవాళ్లతోనూ కూడుకున్నది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా అధ్యయనం చేశా. ఏకధాటిగా చదవడం కంటే ప్రతి 45 నిమిషాలకు 10– 15 నిమిషాల విరామమిచ్చేవాడిని. టీవీ చూడటం, వీడియోగేమ్స్ వంటి వాటితో ఒత్తిడిని జయించాను. అమ్మ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, నాన్న హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు. – మృణాల్ కుట్టేరి, నీట్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ న్యూరాలిజిస్ట్గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తా. ఆ తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి పేదలకు సేవలందించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్న లక్ష్మి,Ðð వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించగలిగాను. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు, ఏపీ ఈపీసెట్లో ప్రథమ ర్యాంకు సాధించాను. – చందం విష్ణువివేక్, నీట్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు న్యూరో ఫిజీషియన్ అవుతా మాది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వట్టెం గ్రామం. నీట్లో ఐదో ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్ చదివాను. రోజూ 10 గంటలు అధ్యయనం చేశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతాను. న్యూరో ఫిజీషియన్ అవుతా. అమ్మ.. సీనియర్ లెక్చరర్‌గా, నాన్న.. బిజినెస్ మెడిక్యూర్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. – ఖండవల్లి శశాంక్, ఆలిండియా ఐదో ర్యాంకర్ చదవండి: మన పరీక్షలు ఎంత ‘నీట్’? -
రిజల్ట్స్ విడుదల చేస్తారా.. లేదంటే బాంబు వేయమంటారా?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫలితాలు విడుదల చేయకపోతే విశ్వవిద్యాలయాన్ని బాంబులు వేసి పేల్చేస్తామని ఈమెయిల్స్‌లో హెచ్చరికలు వచ్చాయి. డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయకపోతే తాము చెప్పిన పని చేస్తామని స్పష్టం చేశారు. ఆ పని విద్యార్థులే చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. బ్యాచిల్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్) సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ, మూల్యంకన విభాగం డైరెక్టర్ మెయిల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అధికారులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముంబై విశ్వవిద్యాలయం ఇటీవల చివరి సంవత్సర విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు ఆలస్యంగా విడుదల చేసింది. మిగిలిన వారి ఫలితాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులు విశ్వవిద్యాలయానికి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. -
టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్..!ఇప్పడు మరింత సులువుగా..
న్యూఢిల్లీ: టాక్స్‌పేయర్లకు శుభవార్త! పన్ను చెల్లింపులో ఉన్న ఇబ్బందులు తొలగించేందుకు మరో వెసులుబాటును ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ అందుబాటులోకి తెచ్చింది. మధ్యవర్తుల జోక్యం లేకుండా పన్ను చెల్లించేలా ఫేస్‌లెస్ అసెస్మెంట్ పథకాన్ని 2020 ఆగస్టు 13 న ఆదాయపు పన్నుశాఖ ప్రారంభించింది. అయితే వాస్తవంలో ఫేస్‌లెస్ ద్వారా ఇన్‌కంట్యాక్స్ ఫైల్ చేసేప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు తప్పని పరిస్థితుల్లో కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఫేస్‌లెస్ పథకం ప్రయోజనాలు పన్ను చెల్లింపుదారులు పొందలేక పోతున్నారు. ఫేస్‌లెస్ ఐటీఫైలింగ్లో వస్తున్న ఇబ్బందులు, ఇతర ఫిర్యాదులను తెలియజేసేందుకు వీలుగా కొత్తగా మూడు అధికారిక ఈ-మెయిల్ చిరునామాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌలభ్యం 2021 ఆగస్టు ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఈ-మెయిల్ళ్లకు తమ ఫిర్యాదులను అందివచ్చుననీ ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన ఇబ్బందులు పరిష్కరించుకునేందుకు ఇకపై కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని... ఈమెయిల్‌తోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఐటీ శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను సంబంధిత వ్యాపారాల కోసం డిపార్ట్మెంట్ అధికారిని కూడా కలవాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ వెల్లడించింది. ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేసిన మూడు ఈ-మెయిల్ ఐడీలు ఫేస్‌లెస్ అసెస్మెంట్స్ కోసం: samadhan.faceless.assessment@incometax.gov.in ; ఫేస్‌లెస్ పెనాల్టీల కోసం: samadhan.faceless.penalty@incometax.gov.in ; ఫేస్‌లెస్ అప్పీళ్ల కోసం: samadhan.faceless.appeal@incometax.gov.in. Grievances can be furnished as under: For Faceless assessments: samadhan.faceless.assessment@incometax.gov.in; For Faceless penalty: samadhan.faceless.penalty@incometax.gov.in; For Faceless Appeals: samadhan.faceless.appeal@incometax.gov.in. (2/2) — Income Tax India (@IncomeTaxIndia) August 7, 2021 -
ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?
ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్‌ను కనుగొన్నాడు. ఈ-మెయిల్‌ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు. శివ అయ్యదురై 1978లో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశాడు. దానిని ఈ-మెయిల్ అని పిలుస్తారు. ఈ-మెయిల్ టు బాక్స్, ఇన్‌బాక్స్, ఫోల్డర్లు, మెమోలు వంటి ఈ ప్రోగ్రామ్‌లు శివ అయ్యదురై ఈ మెయిల్లో కనిపించే ప్రధాన లక్షణాలు, ఇప్పటికీ అవి ఉన్నాయి. శివ అయ్యదురైని ఈమెయిల్ కనుగొన్న వ్యక్తిగా అమెరికా ప్రభుత్వం ఆగష్టు 30, 1982 అధికారికంగా గుర్తించింది. ఈ-మెయిల్ సృష్టికర్తగా శివ అయ్యదురైకి 1978లో యూఎస్ కాపీరైట్ హక్కులు లభించాయి. తమిళ కుటుంబానికి వెల్లయప్ప అయ్యదురై శివ డిసెంబర్ 2, 1963న ముంబైలో జన్మించారు. తనకు ఏడు ఏళ్లు ఉన్నప్పుడు శివ కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. అయ్యదురై 14 ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని కొరెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌లో ఒక ప్రత్యేక ఇంటిగ్రేషన్ కార్యక్రమంలో చేరాడు. అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి నాలుగు డిగ్రీలు పొందాడు. కొంచెం ఈ-మెయిల్ సృష్టికర్త విషయంలో కొందరు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రే టాంలిన్సన్ ఈ-మెయిల్ సృష్టించినట్లు భావిస్తున్నారు. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ -
SBI: ఎస్బీఐ ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్
ముంబై: ఎస్బీఐ తన ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. కొద్దీ రోజుల క్రితమే గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు అని భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిర్ణయించింది. ఏప్రిల్ 30 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17 స్థానిక ప్రధాన కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఇచ్చిన సమాచారంలో కస్టమర్ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా కెవైసి అప్డేట్ చేసిన అభ్యర్థనలను అంగీకరించాలని సూచించారు. ఈ చర్యను ఇతర ప్రభుత్వ రంగ రుణదాతలు అనుసరిస్తారని భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లోని విధించిన కోవిడ్ -19 లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులు పోస్ట్ ద్వారా స్వీకరించిన పత్రాల ఆధారంగా శాఖలు కేవైసీ నవీకరణను నిర్వహించగలవని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేవైసీ నవీకరణ కోసం కస్టమర్‌ను వ్యక్తిగతంగా బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. "అంతేకాక కేవైసీ అప్డేట్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నాం” అని ఎస్బీఐ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF — State Bank of India (@TheOfficialSBI) May 1, 2021 చదవండి: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ఎస్బీఐ -
టీఎస్పీఎస్సీ పేరుతో నకిలీ ఈమెయిల్
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేరుతో నకిలీ ఈమెయిల్ సృష్టించారు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు. ఈ మేరకు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ విభాగానికి నకిలీ ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో పౌరసరఫరాలు, పోలీస్‌శాఖ సహా పలు శాఖల్లో ఖాళీలున్నాయని ఉంది. దీంతో టీఎస్పీఎస్సీ ముఖ్యకార్యదర్శి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఫేస్బుక్ లో మరో లోపం
ఫేస్బుక్ లో మరో బగ్ బయటపడింది. ఈ బగ్ ద్వారా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత ఈ-మెయిల్, చిరునామా, పుట్టినరోజుల వివరాలు బహిర్గతం అవుతునట్లు ఇటీవల ఒక భద్రతా పరిశోధకుడు సౌగత్ పోఖారెల్ తెలిపారు. సాదారణంగా మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతా కోసం సైన్ అప్ చేసినప్పుడు వినియోగదారుల ఇమెయిల్, చిరునామా, పుట్టినరోజులు వివరాలు వెల్లడిస్తాం. అయితే ఈ బగ్ కారణంగా వినియోగదారుల సున్నితమైన సమాచారం లీక్ అవుతుందని పరిశోదకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో సైబర్ నెరగాళ్లు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.(చదవండి: యూజర్లకు షాక్ ఇచ్చిన ఇన్స్టాగ్రామ్) పోఖరెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్బుక్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ ని పరీక్షిస్తున్న సమయంలో ఈ బగ్ గుర్తించినట్లు తెలిపారు. కొన్ని బిజినెస్ అకౌంట్ల కోసం తీసుకొస్తున్న ఫీచర్ పరీక్ష దశలో భాగంగా తీసుకొచ్చిన ఫేస్బుక్ బిజినెస్ సూట్ టూల్ కారణంగా ఇలా జరుగుతుందట. ఈ సమస్య గురుంచి ఫేస్బుక్ ప్రతినిది మాట్లాడుతూ.. "బిజినెస్ అకౌంట్ల కోసం చేసిన పరీక్ష దశలో భాగంగా పరిశోధకుడు పోఖరెల్ ఈ సమస్యను కనుగొన్నారు. బిజినెస్ అకౌంట్ల కోసం అక్టోబర్ లో నిర్వహించిన ఒక చిన్న పరీక్షలో వినియోగదారులు షేర్ చేసిన మెసేజ్ ఇతర వివరాలు బయటకి వచ్చాయి. అయితే వెంటనే గుర్తించి సమస్యను పరిష్కరించాం. ఈ బగ్ ను కనుగొన్న పరిశోదకుడికి మా బగ్ బౌంటీ ప్రోగ్రాం కింద బహుమతి కూడా ఇచ్చాం" అని చెప్పారు. -
టిక్‌టాక్ బ్యాన్పై వెనక్కి తగ్గిన అమెజాన్!
వాషింగ్టన్: టిక్‌టాక్ యాప్‌ను తమ ఫోన్ల నుంచి తీసేయాలని కోరుతూ ఉద్యోగులకు మొయిల్ పంపిన అమెజాన్ సంస్థ కొన్ని గంటల్లోనే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పొరపాటుగా ఈ- మొయిల్ పంపామని, టిక్‌టాక్ నిషేధంపై ప్రస్తుతం తమకు ఎలాంటి విధానాలు లేవని పేర్కొంది. టిక్‌టాక్ పునరుద్ధరణకు సంబంధించి ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అమెజాన్ డాట్‌కామ్ ప్రతినిధి జాకీ అండర్సన్ నిరాకరించారు. ఓ సీనియర్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ తెలిపిన దాని ప్రకారం.. టిక్‌టాక్ యాప్‌ను తీసేయాలని ఉద్యోగులకు మొయిల్ పంపగా ఆ విషయం కాస్తా టిక్‌టాక్ ప్రతినిధి వరకు చేరింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆయన అమెజాన్ ప్రతినిధి జాకీ అండర్సన్‌తో పరస్పరం చర్చలు జరిపారు. దీంతో టిక్‌టాక్ నిషేధంపై అమెజాన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం బహిష్కరించిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా సైతం టిక్‌టాక్ బ్యాన్ దిశగా అడుగులు వేస్తోంది. తమ దేశంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సైతం ప్రకటించారు. అంతేకాకుండా రిపబ్లికన్ జాతీయ కమిటీ టాక్‌టాక్ యాప్‌ను ఇకపై డౌన్లోడ్ చేయవద్దని తమ సభ్యులను శుక్రవారం ఈ- మెయిల్ ద్వారా కోరింది. సైబర్ ముప్పు ఉందనే సమాచారంతో గతేడాది నేవీ సభ్యులు టిక్‌టాక్‌ను ఉపయోగించరాదని అమెరికా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (చైనా యాప్‌ల బ్యాన్ దిశగా అమెరికా?) అమెరికాలో రోజురోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ టిక్‌టాక్ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన యాజమాన్య బోర్డు, చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం లాంటి మార్పులను టిక్‌టాక్ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్‌టాక్ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్ మాజీ చీఫ్ అలెక్స్ జూ, లాస్ఏంజెలెస్ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈఓ కెవిన్ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు. (చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్‌టాక్) -
కరోనా ఎఫెక్ట్: ఇకపై వాట్సాప్‌లో పరీక్షా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటూ భారత్‌లో కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. అయితే ఈ వైరస్ విస్తరించకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నాయి. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయించారు. పలు రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతుండడంతో వాటిని మాత్రమే కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిలో కూడా స్కూల్స్ మూతపడ్డాయి. అయితే ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఫలితాలు గతంలో ఎప్పుడూ కూడా విద్యార్థుల చేతికి ఇచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో విద్యార్థులను టచ్ చేయవద్దని అధికారులు నిర్ణయించారు. వినూత్నంగా ఫలితాలను తెలియచేయాలని అధికారులు భావించారు. దీంతో వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పరీక్షా ఫలితాలను పంపేందుకు సిద్ధమౌతున్నాయి. చదవండి: వృద్ధి రేటుకు కరోనా కాటు.. అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఫలితాలను నేరుగా కాకుండా.. ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా చేరవేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే.. పాఠశాలల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా కాలేజీలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని చెప్తున్నారు. కేంద్రీయ విద్యాలయాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుసరించాలని ఇతర విద్యాసంస్థలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫోర్డ్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ -
డిజిటల్ కెమెరా పుట్టక ముందే మోదీ చేతికి
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను డిజిటల్ కెమెరాను 1987–1988 ప్రాంతంలో ఉపయోగించాను. అప్పుడు చాలా తక్కువ మందికి ఈ మెయిల్ సర్వీసు అందుబాటులో ఉండేది. ఒక రోజు వీరంగమ్ తెహసిల్‌లో (గుజరాత్) అద్వానీ బహిరంగ సభ జరుగుతుందంటే అక్కడికి నేను నా డిజిటల్ కెమెరాను తీసుకొని వెళ్లాను. ఇప్పట్లాగా కాకుండా అప్పట్లో ఆ కెమేరా చాలా పెద్దగా ఉండేది. అద్వానీ సభలో ప్రసంగిస్తున్న దశ్యాన్ని ఫొటో తీసి వెంటనే దాన్ని నేను ఢిల్లీకి ట్రాన్సిమిట్ చేశాను. ఆ మరుసటి రోజు ఉదయమే ఆయన కలర్ ఫొటో అచ్చయింది. ఒక్క రోజులోనే ఆయన ఫొటో అచ్చవడం చూసి అద్వానీ ఆశ్చర్యపడ్డారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ‘న్యూస్ నేషన్’ అనే హిందీ టెలివిజన్ ఛానెల్‌కు మే 11వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డిజిటల్ కెమేరా 1991లో మార్కెట్లోకి ప్రపంచంలోనే తొలి కమర్శియల్ డిజిటల్ కలర్ కెమెరా ‘కొడాక్ 100’ 1991లో మార్కెట్లోకి వచ్చింది. అప్పటికీ భారత్‌లో ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులో లేదు. ఫొటోలు, చిత్రాలు కాకుండా కేవలం టెక్ట్స్(లిపి)ని మాత్రమే పంపించే ఈ మెయిల్ సర్వీస్‌ను భారత ప్రభుత్వం 1995, ఆగస్టు 15వ తేదీన ప్రారంభించింది. 1998లో ప్రైవేటు కంపెనీలు ఈ మెయిల్ సర్వీసులను ప్రారంభించాయి. 1987లో కమర్శియల్‌గా ఎలాంటి డిజిటల్ కెమెరా అందుబాటులో లేనేలేదని ‘మీడియా అండ్ డిజిటల్’ కన్సల్టెంట్ ప్రశాంతో కుమార్ రాయ్ తెలిపారు. ‘కొడాక్ ఫస్ట్ డిజిటల్ మూవ్మెంట్’ శీర్షికతో ‘న్యూయార్క్ టైమ్స్’ 2015లో రాసిన ఓ వార్తా కథనం ప్రకారం ప్రపంచంలోనే తొలి బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ కెమెరాను కొడాక్ ఇంజనీరు స్టీవెన్ సాసన్ 1975లో కనుగొన్నారు. 0.1 మెగా పిక్సల్ కలిగిన దీన్ని ‘ఎలక్ట్రానిక్ స్టిల్ కెమెరా’గా పేర్కొంటూ 1978లో పేటెంట్ తీసుకున్నారు. అప్పటి వర కు ఈ కెమెరాను కనుగొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఇంజనీరు స్టీవెన్‌ను కట్టడి చేశారు. డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాను 1989లో స్టీవెన్ సాసన్, రాబర్ట్ హిల్స్ కనిపెట్టారు. అయితే అది కూడా వెంటనే మార్కెట్లోకి రాలేదు. అంతుముందు 1986లోనే మెగా ఫిక్సల్ డిజిటల్ కెమెరా ‘ప్రోటోటైప్’ను తయారు చేశారు. అంటే, ప్రపంచంలోనే అది ఒక్కటే కెమెరా ఉంటుంది. దాని కమర్షియల్ మోడల్ కొడాక్ డీసీఎస్ (డిజిటల్ కెమెరా సిస్టమ్) 100, 1.3 మెగాఫిక్సల్ సామర్థ్యంతో 1991లో ప్రపంచ మార్కెట్లోకి వచ్చింది. ‘నికాన్ ఫిల్మ్ కెమెరా’ బాడీలో దాన్ని అమర్చారు. దాన్ని పదివేల డాలర్ల నుంచి 20వేల డాలర్ల వరకు ఉపయోగించారు. భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం భారత ప్రభుత్వరంగ సంస్థ ‘విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్)’ సంస్థ 1995, ఆగస్టు 15వ తేదీన దేశంలో ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించింది. దాంతో ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపుకునే సౌకర్యం అందుబాటులోకి మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందికానీ ఫొటోలను పంపుకునే సామర్థ్యం అప్పటికీ రాలేదు. ఈ రంగంలోకి ప్రవేటు కంపెనీలను 1998లో భారత ప్రభుత్వం అనుమతించింది. 2008లో టాటా గ్రూప్ వీఎస్‌ఎన్‌ఎల్‌ను కొనుగోలు చేసుకుంది. తర్వాత దాన్ని టాటా కమ్యూనికేషన్లుగా మార్చుకుంది. 1992లో ఈఆర్ఎన్ఈటీ (ఎడ్యుకేషన్ అండ్ రీసర్ట్ నెట్వర్క్), బిజినెస్ ఇండియా యాక్సెస్ పేరిట దేశంలో రెండు ఈ మెయిల్ సర్వీసులు ఉండేవి. ఒకటేమో అకాడమిక్ సంస్థల మధ్య ఈ మెయిళ్లుకు, రెండోది వ్యాపార సంస్థలకు మధ్య ఈ మెయిళ్ల కోసం ఈ రెండు నెట్‌వర్క్‌లు పనిచేశాయి. అవి అప్పుడు అత్యంత ఖరీదైనవి. వాటికి కూడా ఫొటోలు పంపించే సౌకర్యం లేకుండే. మోదీ ఏ పద్ధతి ఉపయోగించారో! 1986–87 సంవత్సరాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఏ పద్ధతిన ఢిల్లీకి డిజిటల్ ఫొటోను పంపించారంటూ నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. మోదీ తన ఇంటర్వ్యూలో ట్రాన్సిమిట్ చేశానని చెప్పారుగానీ ఏ పద్ధతిన ట్రాన్సిమిట్ చేశారో చెప్పలేదు. తెలుసుకొని వివరించాల్సిందిగా ‘బీజేపీ సమాచార, సాంకేతిక విభాగం’ అధిపతి అమిత్ మాల్వియాకు మీడియా ఈ మెయిల్ పెట్టింది. ఇంతవరకు ఆయన నుంచి సమాధానం రాలేదు. ఈ మెయిల్ ఎక్స్ఛేంజ్కు 1986లోనే డైలప్ లింక్ పద్ధతి అనేది ఒకటి ఉండేది. అది కూడా ‘నేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ (ఎన్సీఎస్టీ), ముంబై ఐఐటీ మధ్యనే ఉండింది. 1987లో మద్రాస్ ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ మధ్య అలాంటి డైలప్ లింక్‌ను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతికి డయల్ చేయడానికి ఓ కంప్యూటర్, దాన్ని మోడమ్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి మరో కంప్యూటర్ ఉంటే చాలు. వాటి ద్వారా ఈ మెయిళ్లను పంపించడమే కాకుండా మాట్లాడుకునే సౌకర్యం కూడా ఉంది. ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు! ప్రధాని నరేంద్ర మోదీనే తన పాత జ్ఞాపకాలకు కొత్త టెక్నాలజీని జోడించి మాట్లాడుతున్నారా? ఎవరో తెలిసీ తెలియక రాసిస్తున్న ‘స్క్రిప్టు’ను ఆయన అనుసరిస్తున్నారా? చెప్పే మాటలు వింటారు తప్పించీ, లోతుల్లోకి వెళ్లి ఎవరు నిజానిజాలను చూస్తారులే అన్న అభిప్రాయమా ? ఏదైమైనా చరిత్ర గురించి, సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పులోనే కాలేస్తున్నారు. -
ప్రధాని మోదీని హత్య చేస్తామంటూ ఈమెయిల్
-
ఇంద్రాణీ చెబితే.. తప్పక అలా చేశా!
ముంబై : సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగుచూసింది. షీనాను హత్య చేసిన తర్వాత ఆమె పేరుతో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షీనాను హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణీ ముఖర్జియా అప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మతో చెప్పి ఆ మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారు. తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణీ అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రాజీనామా లేఖలో షీనాబోరా సంతకాన్ని ఫోర్జరీ చేశానని, ఇంద్రాణీ నుంచి తనకు ఎలాంటి తప్పుడు సంకేతాలు రాకపోవడంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. ఇంద్రాణీ దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్పా తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ స్కైప్ ఐడీ నుంచి కాల్స్ కూడా మాట్లాడినట్లు కోర్టులో వివరించారు. 2012 ఏప్రిల్‌లో షీనా బోరా హత్యకు గురికాగా, మూడేళ్ల అనంతరం 2015లో ముంబై పోలీసులు ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ ముఖర్జీయాను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ తన వాంగ్ములంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
నీ కూతురికి అదే గతి పట్టాలి: ఓ విద్యార్థిని
సాక్షి, న్యూఢిల్లీ : 'సార్ మీకు సభ్యత, సంస్కారం లాంటివి లేవు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌కి ఓ పీహెచ్డీ విద్యార్థిని ఈమెయిల్ చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తన నచ్చకనే వర్సీటీ నుంచి తాను పారిపోయానని చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఓ 26 ఏళ్ల యువతి జేఎన్‌యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ చేస్తోంది. ఇటీవల ఆమె యూనివర్సిటీ నుంచి పారిపోయి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎ.కె.జోరి దురుసు ప్రవర్తన వల్లే యూనివర్సీటీని వదిలి వెళ్లాలని ఆ విద్యార్థిని లేఖ సారాంశం. ‘ గౌరవనీయులైన ప్రొఫెసర్ గారికి నమస్కారం. మీరు దేశంలోనే గొప్ప గైడ్ (నిర్దేశకుడు) అని అనుకుంటున్నారు. నేను కూడా మొదట్లో ఇలానే అనుకున్నా. మీరు మాకు గైడ్‌గా ఉండడం వరంగా భావించా. కానీ తర్వాత మీ నిజస్వరూపం తెలిసింది. మీకు సభ్యత, సంస్కారాలు తెలియవు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. నీ దురుసు ప్రవర్తన వల్లే నేను వర్సీటీ వదిలి వెళ్లాను. నాలాగ మరో అమ్మాయి బలి కాకుడదని అనుకుంటున్నాను. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితే రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. కనీసం అప్పుడైనా అమ్మాయిల బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మెయిల్ పంపింది. కాగా ప్రొఫెసర్ ఎ.కె.జోరి తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను గత నెల 27న వరుసగా గైర్హాజరైన తొమ్మిమంది విద్యార్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపాను. ‘మీరు సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా అయితే మీ పీహెచ్‌డీని పూర్తి చేయడం కష్టం. మీరు మరో ల్యాబ్‌ను చూసుకోండి’అని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అందరు విద్యార్థుల్లాగే రెగ్యులర్‌గా హాజరు కావాలని కోరానన్నారు. అందరితో ప్రవర్తించినట్లే ఆమెతోను వ్యవహరించానని తెలిపారు. ఆ విద్యార్థిని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రొఫెసర్ ఎ.కె.జోరి అన్నారు. -
నా ‘జాతకాన్ని’ ముందే రాసేశారు
సాక్షి, ముంబై: పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ చుట్టు ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఎదురుదాడికి దిగాడు. చట్టంతో నిమిత్తం లేకుండా తన విధిరాతను అధికారులే నిర్ణయించేశారంటూ ఈడీకి పంపిన ఈ మెయిల్లో నీరవ్ వాపోయాడు. ఉద్దేశపూర్వకంగా ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దాడి జరుగుతోందని నీరవ్ ఆరోపించాడు. మెరుపు వేగంతో కదులుతున్న అధికారులు చర్యలే ఇందుకు నిదర్శనమన్నాడు. తన భవిష్యత్తును ముందుగానే నిర్ణయించినట్లుగా కనిపిస్తోందని మోదీ పేర్కొన్నాడు. ఒకవైపు తన పాస్‌పోర్టును పాస్‌పోర్టు అధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు తనను విచారణకు హాజరు కావాల్సిందిగా దర్యప్తు సంస్థలు ఆదేశించాయి. ఇంతలో తన పాస్‌పోర్టు ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పమని కోరాను. ఇలా అడిగిన కేవలం కొన్ని నిమిష్లాలోనే.. తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, చట్టం గురించి ఏమాత్రం ఆలోచించకుండా చట్టవిరుద్ధంగా తన పాస్‌పోర్టును రద్దు చేశారన్నాడు. అయితే ఇప్పటికీ విదేశాల్లో వ్యాపార లావాదేవీల్లో తనమునకలై ఉన్న తాను సాధ్యమైనంత తొందరగా ఈ స్థితినుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నానని తన మెయిల్లో నీరవ్ మోదీ వివరించాడు. మరోవైపు పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టు నీరవ్‌మోదీ, చోక్సీలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇది ఇలా ఉంటే నీరవ్ మోదీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన పిటీషన్‌పై సానుకూలంగా స్పందించింది. శుక్రవారం దీన్ని విచారణను కోర్టు రుణదాతలు నీరవ్ దగ్గర నుంచి రుణాలను ఇప్పుడే వసూలు చేయొద్దని.. అతడి మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు పేజీల నివేదికను విడుదల చేసింది. -
‘నీళ్ల శాఖ’ మెయిల్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్, ట్వీటర్లను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా నీటిపారుదల శాఖనే టార్గెట్ చేశారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) పరిధిలోని నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులకు సంబంధించి వినియోగిస్తున్న మెయిల్‌నే హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన మెయిల్ నుంచే ఏకంగా ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు ‘వుయ్ నీడ్ ఏ ఫేవర్’అంటూ మెయిళ్లు పంపారు. మెయిల్‌ను రిసీవ్ చేసుకున్న కొందరు ఎలాంటి ఫేవర్ కావాలంటూ శాఖ అధికారులకే ఫోన్లు చేయడంతో హ్యాక్ విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే... రాష్ట్ర ప్రభుత్వం 2008లో ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనులకు సంబంధించి ‘కాడా’అధికారులు అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ వాటర్ సెక్టార్ ఇంప్లిమెంట్ ప్లాన్‌ను తయారు చేశారు. అదే అర్థం వచ్చేలా ఏపీడబ్ల్యూఎస్ఐపీ’పేరుతో ఒక మెయిల్ అడ్రస్‌ను క్రియేట్ చేసి దాని నుంచే ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, ఇతర శాఖల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే మంగళవారం రాత్రి ఈ మెయిల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, దాన్నుంచి అందులోని ప్రధాన మెయిల్ అడ్రస్‌లన్నింటికీ ‘వుయ్ నీడ్ ఏ ఫేవర్’అంటూ మెయిల్ సందేశం పంపారు. సుమారు 50 నుంచి 60 మంది వరకు ఇదే రకమైన మెయిల్ వెళ్లింది. ఈ మెయిల్ రాత్రిపూట పంపడంతో దీన్ని శాఖ అధికారులెవరూ గుర్తించలేదు. అయితే ఉదయం ఈ విభాగం ప్రాజెక్టు డైరెక్టర్, ‘కాడా’కమిషనర్‌గా ఉన్న మల్సూర్‌కు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది. ‘రాత్రి మెయిల్ పంపారు. మీకు ఎలాంటి ఫేవర్ కావాలి’అని ఆ ప్రపంచబ్యాంకు ప్రతినిధి అడగడంతో ఆయన అవాక్కయ్యారు. ఎలాంటి మెయిల్ పంపలేదని చెప్పడంతో ఫోన్ చేసిన ప్రతినిధి సైతం కంగుతిన్నారు. ‘ఉదయం ప్రపంచబ్యాంకు ప్రతినిధి ఫోన్‌చేసి ఎలాంటి ఫేవర్ కావాలని అడగ్గానే కంగారు పడ్డా. తరువాత మెయిల్ విషయం చెప్పాడు. మరికొద్ది సేపటికే మరో ప్రపంచ బ్యాంకు అధికారి నుంచి ఫోన్‌చేసి మెయిల్ విషయమే అడిగారు. అయితే నేను హైదరాబాద్‌లో లేకపోవడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. మళ్లీ కొద్దిసేపటికే ప్రస్తుతం ఏపీలో సెక్రటరీ స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారి నుంచి ఇదే మెయిల్ గురించి ఫోన్ వచ్చింది. వెంటనే మా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో అసలు విషయం బయటపడింది’అని మల్సూర్ ‘సాక్షి’కి తెలిపారు. వెంటనే దీనిపై బషీర్‌బాగ్‌లోని సైబర్ సెల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో దీన్ని నైజీరియన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిసింది. అనంతరం మెయిల్ సందేశం పంపిన అడ్రస్‌లన్నింటికీ ‘ఈ మెయిల్ హ్యాక్ చేయబడింది. ఫేవర్ చేయాలంటూ వచ్చిన మెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు’అంటూ తిరిగి మెయిల్ పంపారు. -
వీసా రావడం ఇక చాలా కష్టమే!
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాల్లో మార్పులపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి భారతీయ కంపెనీలకు షాకిచ్చినా ట్రంప్ ప్రభుత్వం, తాజాగా మరోసారి వీసా అభ్యర్థులపై బాంబు పేల్చింది. వీసాలు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కఠినతరమైన ప్రశ్నలు ఎదుర్కొనేలా అదనపు విచారణ వారెంట్ ను అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతిపాదించింది. ఈ విచారణలో భాగంగా అభ్యర్థులందరూ అన్ని పాస్ పోర్టు నెంబర్లను, ఐదేళ్ల విలువైన సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లను, అదేవిధంగా 15 ఏళ్ల బయోగ్రాఫికల్ సమాచారాన్ని అమెరికా వీసా అప్లయ్ చేసే ముందు సమర్పించాల్సి ఉంటుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్ల యూజర్లు పాస్ వర్డ్ లను ఆఫీసర్లు అడగరు. గురువారం ప్రచురించిన డాక్యుమెంట్లో స్టేట్ డిపార్ట్ మెంట్ ఈ విషయాలను వెల్లడించింది. అమెరికా టెర్రర్ అటాక్స్ ను నిరోధించే అవసరం ఎంతైనా ఉందని భావించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు కఠినతరమైన నిబంధనలు అమలుచేయాలని వెల్లడించినట్టు డాక్యుమెంట్లో పేర్కొంది. ఈ క్వశ్చన్స్ లో సోషల్ మీడియా అకౌంట్ల విచారణ కూడా ఓ భాగమని తెలిసింది. ఏడాదికి 65వేల మంది అమెరికాకు వీసాలను అప్లై చేస్తున్నట్టు స్టేట్ డిపార్ట్ మెంట్ అంచనావేసింది. ఏ ఒక్క దేశాన్నో టార్గెట్ చేసి ఈ నిబంధనలు తీసుకురావడం లేదని పేర్కొంది. ఈ అదనపు విచారణ ప్రభావం 65వేలమందిపై చూపనుంది. వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉంటే సోషల్‌మీడియా ద్వారా తెలుసుకుని వీసా జారీని నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ అదనపు స్క్రీనింగ్ తో ఒక్కో అప్లికెంట్ కు గంటకు పైగా పట్టనుందని, 65వేల మందికోసం అదనంగా 65వేల గంటలను వెచ్చించాల్సి ఉందని తెలుస్తోంది. -
మహిళకు బూతుపదంతో ఈమెయిల్ పంపి..!
ముంబై: మహిళా ఉద్యోగికి అసభ్యంగా బూతుపదంతో ఈమెయిల్ పంపిన ఓ ప్రబుద్ధుడు జైలుపాలయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో 52 ఏళ్ల నిందితుడు 30 ఏళ్ల మహిళా జర్నలిస్టుకు బూతుపదంతో ఈమెయిల్ పంపాడు. కొన్ని కారణాలతో అతను పంపిన ఈమెయిల్ చూసి షాక్ తిన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుడు అప్పటి నుంచి అమెరికాలోనే ఉండిపోయాడు. భారత పోలీసులు సమన్లు పంపించినా అతను స్పందించలేదు. అతను సోమవారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా.. లుకౌట్ నోటీసులతో కాచుకొని ఉన్న అధికారులు అతన్ని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపులు, మహిళలను అసభ్యంగా దూషించి వేధించడం, పని ప్రదేశాల్లో మహిళలను వేధింపులకు గురిచేయడం వంటి పలు అభియోగాలను నమోదుచేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పకడ్బందీగా పరీక్షలు
- ఈ-మెయిల్లో ప్రశ్నపత్రాలు -ఎస్కేయూ యూజీ, పీజీ , దూరవిద్య విభాగాల్లో అమలు ఎస్కేయూ : ఎస్కేయూ దూరవిద్యలో ఈ- మెయిల్ ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షల నిర్వహణకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు అవకాశంలేకుండా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే జేఎన్టీయూ అనంతపురంలో ఆన్లైన్ విధానం ద్వారా ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు పంపే విధానం విజయవంతం అయింది. ఎస్కేయూ యూజీ, పీజీ, దూరవిద్య పరీక్షల్లో నూతన విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలో దూరవిద్య, యూజీ, పీజీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపనున్నారు. రెండు రాష్ట్రాల్లో అమలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 205 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. మొత్తం 90 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు సిబ్బందే ప్రశ్నాపత్రాలను చేరవేయాల్సిన అనివార్య పరిస్థితి. దీనికి తోడు అధిక వ్యయంతో పాటు , సిబ్బంది పది రోజుల ముందే ఈ విధుల్లో తలమునకలయ్యేవారు. మూడేళ్ల కిందట దూరవిద్య ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరకముందే ముందే ప్రశ్నాపత్రాలు వెల్లడయ్యాయి. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పేట్టేందుకు ఈ మెయిల్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. అరగంట ముందు ఈ– మెయిల్ : పరీక్షలు ప్రారంభానికి నిర్ధేశించిన సమయం కంటే అరగంట ముందు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆ రోజు సబ్జెక్టుకు సంబంధించి ఈ –మెయిల్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపుతారు. రహస్య ప్రదేశంలో వీటిని వెంటనే జిరాక్స్ చేసుకోవాలి. ఇందుకు ప్రతి ప్రిన్సిపల్ కార్యాలయంలో అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. దీనిపై ప్రిన్సిపాళ్లకు ముందస్తు శిక్షణ ఇచ్చారు. ఎస్కేయూ అనుబంధ పీజీ, డిగ్రీ కళాశాలలు, దూరవిద్య అధ్యయన కేంద్రాలకు సంబంధించిన ప్రిన్సిపాళ్లకు అధికార మెయిల్స్‌కు ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు క్రోడీకరించారు. ప్రశ్నాపత్రాలు రహస్యంగా ఉంచడం, పరీక్షలు నిర్వహణ పకడ్భందీగా నిర్వహించే బాధ్యత ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. -
సీఐఏ ఈమెయిల్‌పై స్టూడెంట్ ఎటాక్ !
వాషింగ్టన్: ఓ టీనేజీ హ్యాకర్ సీఐఏ గుట్టును దొంగిలించాడు. సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నాన్ వ్యక్తిగత ఈమెయిల్‌ను దొంగిలించడమే కాకుండా అందులోని సున్నితమైన అంశాలకు సంబంధించిన అంశాలను, రక్షణ వ్యవహారాలకు కీలక అంశాలను కూడా దొంగిలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఒక వేళ ఈ విషయాలు నిజమే అని సీఐఏ అధికారికంగా గుర్తించినట్లయితే.. సీఐఏకు గట్టి ఎదురుదెబ్బతగిలినట్లవుతుంది. ఇప్పటికే నాటి విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సీఐఏ సూచించిన ఈమెయిల్ కాకుండా ఓ ప్రైవేట్ ఈమెయిల్ ద్వారా లావాదీవీలు నెరిపిందనే వివాదం అక్కడ సంచలనం సృష్టించగా నేడు సీఐఏ డైరెక్టర్ ఈమెయిల్ హ్యాకింగ్‌కు గురికావడం అమెరికా రక్షణ సంస్థలో వణుకుపుట్టిస్తోంది. సీఐఏ ఫైల్స్‌ను హ్యాక్ చేసిన వ్యక్తి తనను తాను ఓ అమెరికా విద్యార్థిగా చెప్పుకున్నాడు. మొత్తం 47 పేజీల్లో ఉన్న సెక్యూరిటీకి సంబంధించిన వివరాలను తాను కొల్లగొట్టానని చెప్పాడు. అయితే, సీఐఏ వర్గాలు మాత్రం ఇది ఎవరో అమెరికా విదేశాంగ విధానం నచ్చని పాలస్తీనాకు చెందిన వ్యక్తులై ఉంటారని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, అతడు ముస్లిం వ్యక్తి అయుండకపోవచ్చని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. -
ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు ఈ-మెయిల్
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌కు బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనకు ఒక ఈ- మెయిల్ వచ్చినట్టుగా సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బెదిరింపులు రావడంతో రాజన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఈ విషయాన్ని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఈమెయిల్లో రాజన్‌కు బెదిరింపు లేఖ వచ్చిందని మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) కేపీ బక్షి తెలిపారు. అయితే ఈమెయిల్ వివరాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ఈమెయిల్ అందిన తర్వాత ఆర్బీఐ అధికారులు క్రైంబ్రాంచి పోలీసులకు విషయం తెలిపారు. సైబర్ క్రైం విభాగం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తోంది. ఈమెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంది. -
ఐఏఎస్‌లకు నెలకో ‘పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల పనితీరును ఇక ప్రతినెలా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతోపాటు శాఖాధిపతులందరూ ప్రతి నెలా పనితీరు నివేదికలను రూపొందించి 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. నవంబర్ నుంచి పని తీరు నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఆమోదంతో సీఎం కార్యాలయానికి పంపాలని సూచించారు. మంత్రులు అందుబాటులో లేకుంటే పనితీరు నివేదికలను ముఖ్యమంత్రికి ఈ-మెయిల్లో పంపాలని పేర్కొన్నారు. ప్రాథమికంగా ఆయా శాఖలు చేయాల్సిన పనులు, ఆ నెలలో ఏం చేశారో నివేదికలో పేర్కొనాలి. సమీక్షల్లో ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలను అమలు చేశారా? గత నెలలో చర్యల నివేదికలోని అంశాలు, కేంద్ర పథకాలు, అంశాల అమలుపై పురోగతి, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాల వివరాలను పనితీరు నివేదికల్లో ఐఏఎస్ అధికారులంతా వెల్ల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!
బెంగళూరు: అడవుల్లో చిక్కుకుపోయిన 14 మంది సాప్ట్వేర్ ఇంజనీర్లు ఈ-మెయిల్ ద్వారా సురక్షితంగా బయటపడగలిగారు. చెన్నైకి చెందిన ఈ ఇంజనీర్లు కర్ణాటక హాసన్ జిల్లాలోని అడవుల్లోకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దట్టమై ఆ అడవుల్లో వారు దారి తప్పారు. తాము దారి తప్పిన విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా వారు తమ మిత్రులకు తెలియజేశారు. ఆ మిత్రులు ఈ విషయం అటవీ శాఖ సిబ్బందికి తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే స్పందించి అడవిలో వెతికి వారిని పట్టుకున్నారు. అటవీ సిబ్బంది కనిపించగానే ఆ ఇంజనీర్లకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినంత పనైంది.