
హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్ బెదిరింపు అందింది. గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు శనివారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాల్ అధికారులు.. బిల్డింగ్ నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మాల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు.
అయితే మాల్ మేనేజ్‌మెంట్‌కు వచ్చిన మెయిల్‌లో.. బిల్డింగ్‌లో బాంబులు అమర్చినట్లు, మాల్‌లోని ఏ ఒక్కరూ తప్పించుకోలేరని గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మాల్‌లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు గుర్తించలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.
మరోవైపు నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్‌ఎఫ్ మాల్‌లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం మాల్‌ను ఖాళీ చేసి తనిఖీ చేశారు. మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. ఈ డ్రిల్‌లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment