gurugram
-
అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!
గూగుల్ (Google) గురుగ్రామ్‌లో 550,000 చదరపు అడుగుల భారీ ఆఫీస్ స్థలాన్ని (office space) లీజుకు తీసుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద వర్క్‌స్పేస్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని, గురుగ్రామ్‌లోని మొత్తం టవర్‌ను లీజుకు తీసుకోవడానికి టెక్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ అయిన టేబుల్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫీస్ స్థలాన్ని భవిష్యత్తులో అదనంగా 200,000 చదరపు అడుగుల వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఈ సంస్థ గూగుల్‌కు అందిస్తుందని సమాచారం.ఆసక్తికరంగా గూగుల్ గురుగ్రామ్‌లో 700,000 చదరపు అడుగుల లీజును 2022లో ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషిస్తుండటం గమనార్హం. గూగుల్ గతేడాదే బెంగళూరులోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో చదరపు అడుగుకి నెలవారీ అద్దె రూ.62 చొప్పున డీల్ కుదిరినట్లు సమాచారం.2022లో హైదరాబాద్‌లో 600,000 చదరపు అడుగుల లీజు పునరుద్ధరణ, బెంగళూరులోని బాగ్‌మేన్ డెవలపర్లతో 1.3 మిలియన్ చదరపు అడుగుల ఒప్పందంతో సహా భారతదేశంలో గూగుల్ గణనీయమైన విస్తరణల శ్రేణిని గురుగ్రామ్‌లో ఈ తాజా లీజింగ్ అనుసరించింది. -
భారత్‌లో కార్టర్ పేరిట గ్రామం!!
కార్టర్‌పురీ(గురుగ్రామ్): అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరు మీద భారత్‌లో ఒక గ్రామం ఉందని చాలా మందికి తెలీదు. 46 సంవత్సరాల క్రితం అంటే 1978 జనవరి మూడో తేదీన హరియాణాలోని గురుగ్రామ్ సమీపంలోని దౌల్తాబాద్ నసీరాబాద్ గ్రామంలో జమ్మీ కార్టర్ దంపతులు పర్యటించారు. కార్టర్ పర్యటించిన ఆ గ్రామం పేరును నాటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సిఫార్సు మేరకు కార్టర్పురీగా నామకరణంచేశారు. అంతకుపూర్వం ఈ గ్రామాన్ని ఖేదాగానూ సమీప గ్రామస్తులు పిలిచేవారు. కార్టర్ మరణవార్త తెల్సి కార్టర్‌పురీ గ్రామస్థులు విచారం వ్యక్తంచేశారు. ‘‘మా గ్రామం సొంత కుమారుడితో సమానమైన కార్టర్‌ను కోల్పోయింది’’అని కార్టర్‌పురీ గ్రామ మాజీ సర్పంచ్ యద్రామ్ యాదవ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. కార్టర్ తల్లి లిలియాన్ 1960వ దశకంలో శాంతిదళాలతో కలిసి భారత్‌లో ఆరోగ్యకార్యకర్తగా సేవలందించారు. జైల్దార్ సర్ఫరాజ్‌కు చెందిన ఒక భవనంలో ఉంటూ లిలియాన్ సామాజిక కార్యకర్తగా చిన్నారులకు సేవచేశారు. వైద్యసాయం అందించారు. ‘‘కార్టర్ మా గ్రామానికి వచ్చినపుడు ఆయన భార్య రోసాలిన్ సంప్రదాయ భారతీయ గ్రామీణ కట్టుబొట్టులో వచ్చి అందరితో కలిసిపోయారు. కార్టర్ దంపతులు గ్రామంలో కలియతిరిగారు. ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశించారు. అయితే ఆ తర్వాతి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడమే మానేశాయి. అయినా కార్టర్‌పై మాప్రేమ అలాగే ఉంది. 2003లో కార్టర్‌కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకున్నాం. గతంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ నుంచి ప్రత్యేక బృందం మా గ్రామంలో సందర్శించింది’’అని గ్రామస్థులు చెప్పారు. భారత్‌లో ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977లో జనతాపార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్టర్ భారత్‌లో పర్యటించారు. ఎమర్జెన్సీ తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి ప్రెసిడెంట్ ఈయనే. ఈ సందర్భంగా భారత పార్లమెంట్‌లోనూ కార్టర్ 1978 జనవరి రెండో తేదీన ప్రసంగించారు. 100 ఇళ్ల నిర్మాణంలో చేయూత మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పటాన్ గ్రామంలో దిగువ తరగతి వర్గాల కోసం 2006 ఏడాదిలో వంద ఇళ్ల నిర్మాణం కోసం కార్టర్ ఎంతో సాయపడ్డారు. ఆ ఏడాది అక్టోబర్‌లో ఒక వారంపాటు ఇక్కడే ఉండి పనుల్లో మునిగిపోయారు. స్వయంగా కార్పెంటర్‌గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో 2,000 మంది అంతర్జాతీయ, స్థానిక వలంటీర్లు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తదితరులూ తమ వంతు కృషిచేశారు. 1984 ఏడాది తర్వాత ప్రతి ఏటా ఒక వారం పాటు సమాజసేవకు కార్టర్ కేటాయించారు. ‘‘67 ఏళ్ల తల్లి లిలియాన్‌తో కలిసి నేను విఖ్రోలీలో కుషు్టరోగుల కాలనీలో సేవచేశా’’అని కార్టర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కార్పెంటరీ, లేబర్ పనుల్లో ఆరితేరిన కార్టర్ న్యూయార్క్‌లోనూ ఒక భవంతి ఆధునీకరణ పనుల్లో పాలుపంచుకున్నారు. -
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్‌లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్‌కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్‌లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్‌లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్‌గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్‌పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్‌కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్‌కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్‌లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. -
ఒకేచోట కోటి కార్లు: మారుతి సుజుకి సరికొత్త రికార్డ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్‌లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్‌లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్‌లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పుజపాన్కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం. -
పుట్టిన రోజు వేడుకలు.. అంతలోనే విషాదం
పుట్టిన రోజుల వేడుకలను ఆనందంగా జరుపుకున్న వేళ విధి ఆ స్నేహితుల కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సమీపంలో 19 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి తన కారు గార్డ్‌రైల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని ఐశ్వర్యా పాండే మృతి చెందింది.ఐశ్వర్య పాండే, తన నలుగురు స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అనంతరం అద్దెకు తీసుకున్న హ్యుందాయ్ కారులో గురుగ్రామ్ నుండి తిరిగి అతివేగంతో వస్తుండగా కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న గార్డ్‌రైల్‌పైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో గార్డ్‌రైల్ గుచ్చుకోవడంతో ఐశ్వర్యాతో పాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే దేశ్ పాండే చికిత్స పొందుతూ మృతి చెందారు. మద్యమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాదమిక విచారణ తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇదీ చదవండి : మా సంస్థపై విష ప్రచారం తగదు -
యాక్సిడెంట్ నిందితునికి అరగంటలోనే బెయిల్..!
ఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది. అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఓ యువ బైకర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. అయితే ఈ కేసులో గురుగావ్ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వారకాకు చెందిన 23 ఏళ్ల అక్షత్ గార్గ్.. తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం డీఎల్ఎఫ్ ఫేజ్ 2 గోల్ఫ్ కోర్స్ రోడ్లో వెళ్తున్నాడు. ఆ టైంలో హఠాత్తుగా రాంగ్రూట్లో వచ్చిన ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం అతని బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ ఎగిరి కాస్త దూరంలో పడింది. ఆ ప్రమాదం తర్వాత అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 24 గంటలు గడవక ముందే బెయిల్ మీద రిలీజ్ చేశారు.అక్షత్ స్నేహితుడి బైక్‌కు ఉన్న గోప్రో యాక్షన్ కెమెరా ద్వారా యాక్సిడెంట్ రికార్డయ్యింది. అయితే పోలీసులు ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించబోమని చెప్పారని, నిందితుడిని అరగంటలోనే బయటకు పంపించేశారని అక్షత్ స్నేహితుడు వాపోయాడు. విషయం బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. బెయిల్ రద్దు చేసి కేసు విచారణ చేపడతామని గురుగావ్ పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeforAkshat ట్రెండ్ నడుస్తోందిShocking Car-Bike Collision in Gurgaon, accused released on bail same day! Car driving on wrong side of Gurgaon Golf Course road DLF Phase-II rammed into a bike killing the rider Akshat Garg on the spot. Accused driver Kuldeep Thakur who was in the SUV with a BJP sticker on it… pic.twitter.com/qUETDrAZ1C— Nabila Jamal (@nabilajamal_) September 19, 2024 -
ప్రాణాపాయ స్థితిలో ఐర్లాండ్ టాప్ క్రికెటర్.. ఇండియాలో చికిత్స
ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్‌జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్‌జిత్‌కు కాలేయ మార్పిడి జరుగనుందని.. ఆస్పత్రి సిబ్బంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.మొహాలీ నుంచి ఐర్లాండ్‌కు సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సిమి.. దేశవాళీ క్రికెట్ ఆడాడు. అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.అయితే, ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో హోటల్ మేనేజ్మెంట్ చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి ఏడాది డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికాపై శతకం బాదిఅద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. ఐర్లాండ్ టాప్ క్రికెటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శతకం బాది సంచలనం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సిమి వంద పరుగుల మార్కు అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను అలరించింది. ఇక 2020లో ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న సిమి సింగ్.. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అతడి లివర్ పూర్తిగా పాడైపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొంది. భార్య కాలేయదానంకాగా సిమి భార్య అగమ్‌దీప్ కౌర్ అతడికి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. డబ్లిన్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తను కాపాడుకునేందుకు ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐర్లాండ్‌లో ఉన్నపుడు ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లకు సిమి సమస్య అర్థం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతడిని భారత్‌కు తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.చదవండి: T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్ -
గురుగ్రామ్‌లోని మాల్‌కు బాంబు బెదిరింపు..
హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్ బెదిరింపు అందింది. గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు శనివారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాల్ అధికారులు.. బిల్డింగ్ నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మాల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు.అయితే మాల్ మేనేజ్మెంట్కు వచ్చిన మెయిల్లో.. బిల్డింగ్‌లో బాంబులు అమర్చినట్లు, మాల్లోని ఏ ఒక్కరూ తప్పించుకోలేరని గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు గుర్తించలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.మరోవైపు నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం మాల్‌ను ఖాళీ చేసి తనిఖీ చేశారు. మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. ఈ డ్రిల్‌లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పారు. -
‘హౌస్’ఫుల్ డిమాండ్!! రూ. 2,700 కోట్ల అపార్ట్మెంట్లు విక్రయం
గురుగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో రూ.2,700 కోట్లకు పైగా విలువైన ప్రీమియం అపార్ట్మెంట్లను విక్రయించినట్లు రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 71లో 'టైటానియం ఎస్పీఆర్' పేరుతో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సిగ్నేచర్ గ్లోబల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.విక్రయించాల్సిన అపార్ట్మెంట్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఆసక్తి వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేటాయింపు ప్రక్రియ ద్వారా రూ.2,700 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. కేటాయింపుల ప్రక్రియ ఖరారైన తర్వాత మొత్తం అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.సిగ్నేచర్ గ్లోబల్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎన్ని హౌసింగ్ యూనిట్లను ప్రారంభించింది, వాటిలో ఇప్పటివరకు ఎన్ని విక్రయించింది వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాట్లను ఏ రేట్లకు విక్రయించిందో కూడా బహిరంగపరచలేదు. కంపెనీ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తుందని, మొదటిది 2.1 మిలియన్ చదరపు అడుగులు, రెండవది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉందని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. -
వింత వివాహం.. వీళ్లకు పెళ్లేంటి? అంటూ పురోహితుడు పరార్
హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన వింత పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశంగామారింది. ఇద్దరు యువతులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ, పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో ఇతర వివాహాలలో మాదిరిగానే అన్ని వ్యవహారాలు జరిగాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ వివాహ వేడుక హల్దీ వేడుకతో మొదలై అప్పగింతలతో ముగిసింది. కవితా టప్పు, అంజు శర్మలు వధూవరులుగా మారి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వధువు వేషధారణలో ఉన్న కవిత, వరుడి వేషధారణలో ఉన్న అంజు శర్మ వేదికపై కుర్చీలలో కూర్చుని అతిథుల ఆశీర్వాదాలు అందుకున్నారు.భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ వీరి వివాహానికి ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు. ఈ వివాహానికి కవిత, అంజుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే పెళ్లి జరిపించాల్సిన పురోహితునికి తాను ఇద్దరు యువతులకు పెళ్లి చేయాల్సి ఉందని తెలియానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వారి బంధువులలో ఒకరు ఆ పురోహితుడిని ఒప్పించి వివాహ వేడుక సవ్యంగా జరిగేలా చూశారు. -
1051 అపార్ట్మెంట్ల కోసం రూ.2000 కోట్లు: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ రియల్టీ సంస్థ 'క్రిసుమి కార్పొరేషన్' తన విస్తరణ ప్రణాళికలో భాగంగా గురుగ్రామ్‌లో 1,051 లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.క్రిసుమి కార్పొరేషన్ అనేది కృష్ణా గ్రూప్ అండ్ జపాన్‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్. ఇది ఇప్పటికే సెక్టార్ 36A, గురుగ్రామ్‌లో పెద్ద లగ్జరీ టౌన్షిప్ 'క్రిసుమి సిటీ'ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో మొదటి దశ 433 యూనిట్లతో కూడిన 'వాటర్‌ఫాల్ రెసిడెన్సెస్' పూర్తికాగా, రెండవ దశ 320 యూనిట్లతో కూడిన 'వాటర్‌ఫాల్ సూట్లు' 2028లో డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేసింది.ఇవి కాకుండా.. మరో 1,051 లగ్జరీ యూనిట్లతో కూడిన తమ టౌన్షిప్లో ఫేజ్ 3, ఫేజ్ 4లో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం క్రిసుమి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుంది. అదనంగా.. 350 కోట్ల రూపాయల పెట్టుబడితో టౌన్షిప్లో సుమారు 1,60,000 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో 2 ఎకరాలలో అత్యాధునిక క్లబ్‌ను సంస్థ అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు గత నెలలో ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
Lok Sabha Election 2024: గురుగ్రాంలో ముక్కోణం
గురుగ్రాం. మిలీనియం సిటీ. దేశ రాజధానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం. బహుళజాతి కంపెనీలకు నిలయం. శనివారం పోలింగ్ జరగనున్న ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి రావు ఇందర్జీత్ సింగ్, కాంగ్రెస్ నుంచి నటుడు రాజ్ బబ్బర్, జేజేపీ నుంచి హర్యాన్వీ గాయకుడు రాహుల్ యాదవ్ హోరాహోరీ తలపడుతున్నారు... మిలీనియం సిటీగా పేరొందిన గురుగ్రాంలో ఫార్చ్యూన్ 500 జాబితాలోని 250కి పైగా కంపెనీలున్నాయి. పెప్సికో, నెస్లే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలున్నాయి. ఇంతటి కీలక నగరంలో మౌలిక సదుపాయాల కొరత ప్రధాన సమస్య. వర్షాకాలంలో ఇది కొట్టొచి్చనట్టు కని్పస్తుంటుంది. నీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, ట్రాఫిక్ రద్దీ స్థానికులను ఆందోళనపరిచే అంశాల్లో కొన్ని మాత్రమే. గురుగ్రాం లోక్‌సభ స్థానంలో ఏకంగా 25.3 లక్షల మంది ఓటర్లున్నారు. ఓటర్లపరంగా హరియాణాలో ఇదే అతి పెద్ద లోక్‌సభ స్థానం. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఓటర్ ఇన్ క్యూ యాప్, ఓటర్లకు పోలింగ్ ఆహా్వనాలు, బహుళ అంతస్తుల సొసైటీల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు వంటివి చేశారు.ముక్కోణపు పోటీ... కేంద్ర మంత్రి రావ్ ఇందర్జీత్ సింగ్ గురుగ్రాం నుంచి ఐదుసార్లు గెలిచారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు బీజేపీ పట్టణ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకే అహిర్వాల్కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కెపె్టన్ అజయ్ సింగ్ యాదవ్‌ను పక్కన పెట్టి రాజ్ బబ్బర్‌కు టికెటిచి్చంది. ఈ స్థానంలో కాంగ్రెస్ యాదవేతర అభ్యర్థిని నిలబెట్టడం ఇదే మొదటిసారి. ఇది హరియాణా కాంగ్రెస్‌లో అసంతృప్తికి కారణమైంది. 2019లో ఓడిన అజయ్ సింగ్ యాదవ్ కూడా బబ్బర్ ఎంపికపై అసంతృప్తితో ఉన్నారు. యాదవ్ ఓట్లను రాబట్టుకునేందుకు జననాయక్ జనతా పార్టీ వ్యూహాత్మకంగా రాపర్ సింగర్ రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్పురియాకు టికెటిచి్చంది.విమర్శల హోరు... బబ్బర్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ ప్రకటించగానే ఆయనపై ‘ఔట్ సైడర్’ ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. దీన్ని రాజ్ బబ్బర్ గట్టిగానే తిప్పికొడుతున్నారు. దేశ విభజన తరువాత తన కుటుంబం అంబాలాకు చేరుకుందని, గురుగ్రాం, ఫరీదాబాద్ల్లో తమ బంధువులున్నారని చెబుతున్నారు. ‘మై బాహారీ నహీ హూ’ అని ప్రతి సభలోనూ ప్రత్యేకంగా చెబుతున్నారు. హరియా ణాకు భారీగా ఆదాయం సమకూరుస్తున్నా గురుగ్రాంలో మౌలిక సదుపాయాలే లేవంటూ బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ నగరంలో జరిగిన అభివృద్ధంతా తన హయాంలో జరిగిందేనని ఇందర్జీత్ అంటున్నారు. ఆయన తరఫున కూతురు ఆర్తి సింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుకోసమే తాను పోటీ చేస్తున్నానని ఫజిల్పురియా చెబుతున్నారు. పక్కా లోకల్ పార్టీ అయిన జేజేపీకే ఓటేయాలన్న ఆయన అభ్యర్థనకు మంచి స్పందనే వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nayi Disha Seema Seth: కార్పొరేట్ రంగం నుంచి కార్మిక లోకానికి...
కార్పొరేట్ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సీమా సేథ్ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది.... ‘ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్ దాస్ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు. ‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు. ‘సీమా మేడమ్ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్. బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్‌ను మార్చివేసింది సీమ. ‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు. ‘లేదు’ అని చెప్పింది సీమ. తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడిగింది సీమ. ‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్. ఆ తరువాత... ‘మేడమ్... మీరు అక్కడ స్కూల్ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్. సీమ ఆలోచనలో పడింది. ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్ స్టార్ట్ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది. గురుగ్రామ్‌లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్‌కు వచ్చి కంప్యూటర్ నుంచి థియేటర్ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది. ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు. ‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ. ‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్‌లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్. ‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్‌ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు. సిలబస్‌ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్–టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. ‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్ ఒక మీటింగ్‌లో చెప్పారు’ అంటున్నాడు అశోక్‌రావు అనే పేరెంట్. వినే వారు తప్పకుండా ఉంటారు మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి. – సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు -
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో ప్రారంభించారు. ఎనిమిదిలైన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే తొలి ఎలివేటేడ్ హైవే. ఈ రహదారి ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య నేషన్‌నల్ హైవే 48పై ట్రాఫిక్‌ను తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ. 4,100 కోట్లతో నిర్మించారు. ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం రూ. 10,000 కోట్లతో నిర్మిస్తుండగా.. హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి . ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి ఆర్ఓబీ(10.2 కి.మీ), బసాయి ఆర్ఓబీ నుంచి ఖేర్కి దౌలా (క్లోవర్లీఫ్ ఇంటర్చేంజ్) (8.7 కి.మీ) వరకు. ఇక దేశవ్యాప్తంగా 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు, ఇవి ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైనవి. #WATCH | Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of 114 road projects worth about Rs One Lakh Crore, in Gurugram, Haryana. pic.twitter.com/9ulZD98ncD — ANI (@ANI) March 11, 2024 #WATCH : Drone Footage of Dwarka Expressway in Gurugram. #DwarkaExpressway #Gurugram #Delhi pic.twitter.com/9QTbcBdJoN — shivanshu tiwari (@shivanshu7253) March 11, 2024 -
డ్రై ఐస్ నిజంగా అంత ప్రమాదమా?
గురుగ్రామ్‌లో జరిగిన ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. సరదాగా డిన్నర్ చేద్దామని కేఫ్‌కి వెళ్లితే మర్చిపోలేని చేదు అనుభవం ఎదురయ్యింది ఆ వ్యక్తులకు. డిన్నర్ చివరి టైంలో తీసుకున్న మౌత్ ప్రెషనర్ ఒక్కసారిగా ఆ వ్యక్తులను ఆస్ప్రతి పాలయ్యేలా చేసింది. ఏంటా మౌత్ ఫ్రెషనర్ కథ? ఎందువల్ల అలా అయ్యిందంటే.. గురుగ్రామ్‌లో అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య స్నేహితులతో కలిసి లాఫోరెస్టా కేఫ్‌కి వెళ్లి డిన్నర్ చేశారు. చివరిగా మౌత్ ఫ్రెషనర్‌గా రూపంలోని డ్రై ఐస్‌ని తీసుకోగానే వారంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. నోరు మండటం, నాలుకపై పగుళ్లు వంటివి వచ్చాయి. నీళ్లతో కడుక్కున్న లాభం లేకుండా పోయింది. ఐస్ నోటిలో పెట్టుకున్న ఉపశమనం లేకపోగా ఒకటే బాధ,నొప్పితో విలవిలలాడారు. సమయానికి పోలీసులు రంగంలోకి దిగి బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఏం తీసుకున్నారని ఆరా తీయగా..వారు తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్‌ని ప్యాకెట్‌ని చూపించారు. అది డ్రై ఐస్ అని వైద్యులు చెప్పారు. అది తీసుకుంటే మరణానికి దారితీసే యాసిడ్‌గా మారుతుందని చెప్పడంతో వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలేంటి డ్రై ఐస్? అంత డేంజరా అంటే?.. డ్రై ఐస్ అంటే.. కార్బన్డయాక్సైడ్(CO2) వాయువును శీతలీకరించి ఘనీభవించడం ద్వారా డ్రై ఎస్ ఏర్పడుతుంది. దీన్ని 1900ల ప్రారంభంలో కనుగొన్నారు. 1920లలో దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా వినియోగించటం ప్రారంభించారు. ఆహార, ఔషధ పరిశ్రమల్లో షిప్పింగ్ చేసేటప్పుడు ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉండేందుకు వినియోగిస్తారు. ఈ డ్రై ఐస్ దాదాపు 78 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో రవాణ సమయంలో పదార్థాలను స్తంభింపజేసి ప్యాకింగ్ చేయడంలో సహాయ పడుతుంది. అలాగే కొన్ని వ్యాక్సిన్లు తరలించే సమయంలో కూల్‌గా ఉంచేందుకు కూడా వినియోగిస్తారు. ధాన్యం ఉత్పత్తుల్లో కీటకాలు రాకుండా ఉండేందుకు వినియోగిస్తారు. అయితే ఈ డ్రై ఐస్ పెద్ద బ్లాక్స్ గానూ లేదా చిన్న గుళికల రూపంలోనూ వినయోగిస్తారు. దీన్ని తప్పుగా వినియోగిస్తే ప్రమాదాలు ఫేస్ చేయక తప్పదు. గురుగ్రామ్‌లో ఆ వ్యక్తులు కూడా అలా చేయడంతోనే రక్తపు వాంతులు కక్కుకుని విలవిలలాడటానికి కారణమయ్యింది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే.. పొడి మంచుకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల ఫ్రాస్ట్‌బైట్ ద్వారా చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది. ఇది పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారిపోవడంతో హైపర్క్యాప్నియా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ డ్రై ఐస్‌ను బాగా వెంటిలేషన్ ఉండే వాతావరణంలో మాత్రమే బయట గాలికి బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అలాగే కాక్టెయిల్ వంటి డ్రింక్లక పొగమంచులా కనిపించేందుకు ఈ డ్రై ఐస్‌ను ఉపయోగిస్తారు . అనుకోకుండా పానీయం నుంచి గనుక ఈ గుళికలను తీసుకుంటే ఆ వ్యక్తి అన్నవాహిక , కడుపు తీవ్రమైన కాలిన గాయాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు తినడంలో శాశ్వత సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి వేగవంతమైన రియాక్షన్ కారణంగా జీర్ణ అవయవాలను చిధ్రం చేసేలా గ్యాస్ ఏర్పడి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక్కడ గురుగ్రామ్ కేఫ్‌లోని వ్యక్తులు ఆ డ్రైఐస్ని నేరుగా లోపలికి తీసుకోవడంతోనే వారు కూడా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్నే వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ డ్రై ఐస్‌ని నోటిలో పెట్టుకునే యత్నం చేయకూడదు. ఇది ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ కావడంతో నోటిలోని లాలజలం తేమతో కలిసి రియాక్షన్ చెందడం జరుగుతంది. ఫలితంగా తీవ్రమైన గాయాలు, కణజాల నష్టం వంటివి జరుగుతాయి. అలాగే ఈ పొడిమంచు ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ని పీల్చినా ప్రాణాంతకమే. అందువల్ల పొడిమంచును వినియోగించేముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వినియోగించటం మంచిది. (చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..) -
ప్రాణం మీదకు తెచ్చిన మౌత్ ఫ్రెష్నర్.. రక్తపు వాంతులతో ఆసుపత్రికి..
హర్యానాలోని షాకింగ్ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్న అయిదుగురు వ్యక్తులు.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఏకంగా నోటీలో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గురుగ్రామ్‌లో మార్చి రెండున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, స్నేహితులతో కలిసి గురుగ్రామ్‌లోని సెక్టార్ 90లో లాఫోరెస్టా కేఫ్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అయిదుగురు రెస్టారెంట్‌లోని మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్నారు. అంతే వెంటనే ఒకరి తర్వాత ఒకరికి నోటిలో నొప్పి మొదలైంది. నోరు మండటం, నాలుకపై వేడి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. కొద్దిసేపటికే రెస్టారెంట్ ఫ్లోర్‌పై రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. నోటిని నీటితో శుభ్రం చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. రెస్టారెంట్లో ఉన్నవారు ఒకరు దీనిని వీడియో తీశారు. ఇదులో అందరూ నోటి బాధతో ఏడుస్తూ కనిపించారు. ఓ మహిళ తన నోటిలో ఐస్‌ను పెట్టుకోవడం, తన నోరు మండుతోందని పదే పదే చెబుతుండటం వినిపిస్తుంది. వెంటనే కేఫ్‌లోని వ్యక్తులను పోలీసులకు కాల్ చేయమని కోరారు. Five people started vomiting blood and reported a burning sensation in their mouths after eating mouth freshener after their meal at a cafe in Gurugram. They were hospitalized and two are critical. pic.twitter.com/brMnbWbZQW — Waquar Hasan (@WaqarHasan1231) March 4, 2024 అనంతరం పోలీసులు కేఫ్‌కు చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్ ప్యాకెట్‌ను వైద్యుడికి చూపంచగా.. అది డ్రై ఐస్ అని డాక్టర్ చెప్పారు. ఇది మరణానికి దారితీసే యాసిడ్‌గా పనిచేస్తుందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. குருகுராமில் உள்ள தனியார் உணவகத்தில் Mouth Freshener சாப்பிட்ட 05 பேருக்கு ரத்த வாந்தி ஏற்பட்டதை தொடர்ந்து ஆபத்தான நிலையில் மருத்துவமனையில் அனுமதி. pic.twitter.com/QB4jzeTW5C — Ramesh (@RHoneykumar) March 4, 2024 -
ఒక్క ఫ్లాట్.. రిజిస్ట్రేషన్ ఖర్చులే రూ.5 కోట్లు! ఎవరీ బిజినెస్ లేడీ?
Gurugram Property Deal : దేశ రియల్ ఎస్టేట్‌లో ఖరీదైన డీల్స్‌లో ఒకటి తాజాగా జరిగింది. ఇటీవల గురుగ్రామ్‌లోని అపార్ట్మెంట్ రూ.95 కోట్లకు అమ్ముడుపోయింది. దీనికి రిజిస్టేషన్ ఖర్చులే రూ.5 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తోంది. ఈ ఖరీదైన ఫ్లాట్‌ను ఓ బిజినెస్ లేడీ కొనుగోలు చేశారు. ఇంతకీ ఎవరీమె.. ఆ డీల్ విశేషాల్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వెస్బాక్ లైఫ్‌స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వీ బజార్ సీఎండీ హేమంత్ అగర్వాల్ సతీమణి స్మితి అగర్వాల్ గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్‌లో అపార్ట్‌మెంట్‌ను 95 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంపాదించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. స్మితి అగర్వాల్ పేరు మీద సేల్ డీడ్ 2024 జనవరి 18న ఖరారైంది. లావాదేవీలో భాగంగా ఆమె రూ. 4.75 కోట్ల స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 50,003 చెల్లించారు. పత్రాల ప్రకారం.. 10,813 చదరపు అడుగుల అపార్ట్మెంట్ డీఎల్ఎఫ్ ది కామెలియాస్‌లో ఉంది. ఇది గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్, డీఎల్ఎఫ్ ఫేజ్ 5లో ఉన్న ఒక ఉన్నత స్థాయి లగ్జరీ కండోమినియం. అదనంగా అపార్ట్మెంట్లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీని చదరపు అడుగు రూ.87,857.20 చొప్పున విక్రయించారు. గురుగ్రామ్ ఉన్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అనేక ఖరీదైన, లగ్జరీ ఆస్తి లావాదేవీలు జరిగాయి. ఇటీవలి డీల్స్ గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్ వద్ద 2023 అక్టోబరు3లో 11,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రీసేల్ చేయడం ద్వారా రూ. 100 కోట్లకుపైగా లభించింది. అదే నెలలో మేక్మైట్రిప్ గ్రూప్ సీఈవో రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్‌లోని 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే జెన్పాక్ట్ మానవ వనరుల అధిపతి పీయూష్ మెహతా అదే కాంప్లెక్స్‌లో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ. 32.60 కోట్లకు కొనుగోలు చేశారు. 2023 ఫిబ్రవరిలో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సతీమణి వసుధ రోహత్గీ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో 2,100 చదరపు గజాల బంగ్లాను రూ. 160 కోట్లకు కొనుగోలు చేశారు. -
‘హౌస్’ ఫుల్! రూ.7,200 కోట్ల ఇళ్లు మూడు రోజుల్లో కొనేశారు..
దేశంలో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం ఇది. దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేపట్టిన రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లోని మొత్తం 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు మూడు రోజుల్లోనే అమ్ముడైపోయాయి. అది కూడా నిర్మాణం ప్రారంభం కాకముందే.. శాటిలైట్ సిటీలో.. దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ (DLF Ltd.) గురుగ్రామ్‌లోని 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లో విక్రయించింది. ఇందులో పావు వంతు ఇళ్లను ప్రవాస భారతీయులు కొనడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్‌లోని ఏడు టవర్లలో అన్ని నాలుగు-పడక గదుల ఫ్లాట్లు, పెంట్‌హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డీఎల్ఎఫ్ తమ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. గూగుల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలతో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన నివాసాల వరకు గణనీయంగా అమ్మడవుతున్నాయి. ప్రీమియం అపార్ట్మెంట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బిల్డర్లను ప్రేరేపిస్తోంది. గతేడాదిలోనూ.. కాగా గత సంవత్సరంలోనూ డీఎల్ఎఫ్ ఇదేవిధంగా కేవలం మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. మరొక అగ్ర డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఢిల్లీ సమీపంలోని ప్రాజెక్ట్‌లలో సుమారు రూ.5వేల కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. -
Divya Pahuja: అశ్లీల ఫొటోలతో బెదిరిస్తోందనే చంపేశాడా?
మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య అనంతరం గురుగ్రామ్ హోట్ల నుంచి మృతదేహాన్ని తరలించిన బీఎండబ్ల్యూ కారును పోలీసులు తాజాగా పంజాబ్‌లోని పటియాలాలో గుర్తించారు. అయితే ఆ కారులో దివ్య మృతదేహం ఉందా, లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పటియాలాలోని బస్ స్టేషన్లో బీఎండబ్ల్యూ కారు పార్క్ చేసి ఉందని గురుగ్రామ్ పోలీస్, క్రైమ్ డిప్యూటీ కమిషనర్ విజయ ప్రతాప్ సింగ్ తెలిపారు. దివ్య మృతదేహాన్ని పంజాబ్‌కు తరలించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు నిందితులు బాల్‌రాజ్, రవి బంగర్ పరారీలో ఉన్నారని, వీరికోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యతోపాటు ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్‌కు చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, దివ్య వద్ద మరో ఫోన్ ఉందని ఆమె సోదరి చెప్పిందని, దాని కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు. కాగా పహుజా తన ప్రియుడు, గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించి గతేడాది జూన్‌లో బెయిల్‌పై విదుదల అయ్యారు. బుధవారం గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో విగత జీవిగా కనిపించారు. హోటల్ యజమాని అభిజీత్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజీత్ సింగ్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దివ్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వార్త: మాజీ మోడల్ దారుణ హత్య నిందితుడు అభిజీత్ మంగళవారం రాత్రి దివ్యను హోటల్ రూముకు తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు దివ్య ఫోన్లో ఉన్నాయని.. వాటిని డిలీట్ చేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోటోలతో అనేక సార్లు బ్లాక్ మెయిల్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను హతమార్చినట్టు అభిజీత్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దివ్య సోదరి నైనా పహుజా వాదన మరోలా ఉంది. సందీప్ గడోలీ సోదరి సుదేశ్ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్‌లే కలిసి అభిజీత్‌తో హత్య చేయించారని ఆరోపించింది. గడోలీ హత్య విషయానికి వస్తే.. 6 ఫిబ్రవరి 2016లో ముంబైలో పోలీసులు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లో గడోలీ మరణించాడు. అతడి గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉన్న దివ్య ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది. -
గ్యాంగ్‌స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య
గురుగ్రామ్: ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్ దివ్యా పహుజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఓ హోటల్ గదిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి ఆమెను హోటల్ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కారులో బయటకు తరలిస్తుండగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గడోలీ హత్య కేసులో నిందితురాలైన దివ్యా పహుజాకు గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరాదిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ 2016 ఫిబ్రవరి 7న ముంబైలో హత్యకు గురయ్యాడు. నకిలీ ఎన్కౌంటర్లో హరియాణా పోలీసులే అతడిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. గడోలీ ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ వీరేంద్ర కుమార్ అలియాస్ బిందర్ గుజ్జర్ హరియాణా పోలీసులతో చేతులు కలిపి ఈ ఎన్కౌంటర్ చేయించినట్లు వెల్లడయ్యింది. గడోలీని ముంబైకి రప్పించడానికి హరియాణా పోలీసులు అతడి ప్రియురాలు దివ్యా పహుజాను పావుగా వాడుకున్నారు. ఆమె ద్వారా అతడిని హనీట్రాప్ చేశారు. -
Ex-Model Divya Pahuja: గురుగ్రామ్‌లోని హోటల్లో మాజీ మోడల్ దారుణ హత్య
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోరం జరిగింది. ఓ హోటల్లో గదిలో 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలని మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు. నిందితుడిని సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్‌గా తేల్చారు. అబిజిత్తోపాటు అతడి హోటల్లో పనిచేసే మరో ఇద్దరు ప్రకాశ్, ఇంద్రజ్లను గురుగ్రామ్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దివ్య హత్యకు స్కెచ్ వేసిన అభిజిత్ ఆమె మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా పడేసేదుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. హత్య ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అభిజిత్, యువతి, మరో వ్యక్తి జనవరి రెండో తేదిన హోల్ రిసెప్షన్ వద్దకు రావడం కనిపిస్తుంది. అక్కడి నుంచి రూమ్ నెంబర్111కు వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రాత్రి అభిజిత్ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తోంది. హోటల్ నుంచి బీఎండబ్ల్యూ కారులో పారిపోవడం రికార్డయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. అయితే గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్, అభిజీత్‌తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కాగా 2016 ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది. -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
‘ఎక్స్’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్‌లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్‌లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్‌కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్‌పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!