
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో రూ. 8వేల కోట్లకుపైగా విలువైన లగ్జరీ ఫ్లాట్లను విక్రయించింది. లాంచింగ్ ముందే వీటిని విక్రయించడం విశేషం. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్)
ప్రీ-ఫార్మల్ లాంచ్ సేల్స్‌లో భాగంగా గురుగ్రామ్‌లోని సెక్టార్ 63లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ వద్ద నిర్మించిన ‘ది అర్బర్’ డీఎల్‌ఎఫ్ ప్రాజెక్ట్ ఈ ఫీట్ సాధించింది. లాంచింగ్‌కు మూడు రోజుల ముందుగానే పూర్తి సేల్స్‌ను నమోదు చేసింది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో ఐదు టవర్లు, 38/39 అంతస్తులున్నాయి. ఇందులో 4 BHK 1137 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటి ధరలు యూనిట్‌కు రూ. 7 కోట్ల నుండి ప్రారంభం. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!)
తమ ప్రాజెక్ట్‌కు అద్భతమైన స్పందన లభించిందనీ, డీఎల్‌ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం ప్రకటించారు. లగ్జరీ గృహాలు, జీవనశైలి సౌకర్యాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు. 75 ఏళ్లుగా కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా శ్రద్ధ, నిబద్ధతతో అందిస్తున్న సేవలు, కొనుగోలుదారుల విశ్వాసం నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం అధిక స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా, 95 శాతం మంది కొనుగోలు దారులు తమ తుది వినియోగం కోసం కొనుగోలు చేశారన్నారు.గురుగ్రామ్‌లో అర్బర్ నిస్సందేహంగా తమకొక మైలురాయి లాంటిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment