గురుగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో రూ.2,700 కోట్లకు పైగా విలువైన ప్రీమియం అపార్ట్‌మెంట్లను విక్రయించినట్లు రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 71లో 'టైటానియం ఎస్పీఆర్' పేరుతో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సిగ్నేచర్ గ్లోబల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
విక్రయించాల్సిన అపార్ట్‌మెంట్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఆసక్తి వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేటాయింపు ప్రక్రియ ద్వారా రూ.2,700 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. కేటాయింపుల ప్రక్రియ ఖరారైన తర్వాత మొత్తం అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.
సిగ్నేచర్ గ్లోబల్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎన్ని హౌసింగ్ యూనిట్లను ప్రారంభించింది, వాటిలో ఇప్పటివరకు ఎన్ని విక్రయించింది వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాట్లను ఏ రేట్లకు విక్రయించిందో కూడా బహిరంగపరచలేదు. కంపెనీ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తుందని, మొదటిది 2.1 మిలియన్ చదరపు అడుగులు, రెండవది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉందని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment