హోమ్‌ లోన్‌ ముందుగా చెల్లించడం మంచిదేనా..? | Is prepaying home loan a smart financial move what need to know | Sakshi
Sakshi News home page

హోమ్‌ లోన్‌ ముందుగా చెల్లించడం మంచిదేనా..?

Published Sun, Apr 20 2025 10:34 AM | Last Updated on Sun, Apr 20 2025 11:50 AM

Is prepaying home loan a smart financial move what need to know

సగటు మనిషి తన జీవితంలో తీసుకునే అతిపెద్ద రుణం ఇంటి కోసమే.. ఇది కనీసం 15–30 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం అన్ని సంవత్సరాలు చెల్లించడం వల్ల చాలా ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. మనకు తెలియకుండానే తీసుకున్న రుణం కంటే దాదాపు రెట్టింపుపైనే చెల్లిస్తాం. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నప్పుడు ఇంటి రుణం ముందుగా చెల్లించడం మంచిదేనా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మీకు అందుబాటులో డబ్బు ఉన్నప్పుడు ఇంటి రుణం తీర్చుకోవడం తెలివైన పని అని సూచిస్తున్నారు. అయితే ఇంటి రుణం ముందుగా చెల్లించాలా? లేదా అనే నిర్ణయం మీరు ఎంచుకున్న పన్ను విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. - సాక్షి, సిటీబ్యూరో

వీరికి ప్రయోజనకరం

ఇంటి రుణం ముందస్తు చెల్లింపు.. ముఖ్యంగా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆదాయం తగ్గకముందే బాధ్యతలను క్లియర్‌ చేయడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు చెల్లింపు రుణ కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. పైగా ముందస్తు చెల్లింపు ఈఎంఐలను తగ్గించడంలో సహాయపడుతుంది. రుణ గ్రహీత గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు, అతిపెద్ద ప్రయోజనం మొత్తం వడ్డీ అవుట్‌గో తగ్గడం, వడ్డీని బాకీ ఉన్న అసలుపై లెక్కించినందున, ఒకేసారి చెల్లింపులు చేయడం వల్ల వడ్డీ వచ్చే బకాయి మొత్తం తగ్గుతుంది.

ఈఎంఐల భారం తగ్గుతుంది..

ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధికి 9 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే.. రుణ గ్రహీత ఐదు సంవత్సరాల తర్వాత రూ.5 లక్షలను ముందస్తుగా చెల్లిస్తే.. మిగిలిన రుణ బ్యాలెన్స్‌ సుమారు రూ.39.35 లక్షలకు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తు ఈఎంఐల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంక్‌ పాలసీని బట్టి రుణ గ్రహీత ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా రుణ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత ఈఎంఐని మార్చకుండా ఉంచాలని ఎంచుకుంటే రుణ కాలపరిమితి 20 ఏళ్ల నుంచి దాదాపు 15 ఏళ్లకు తగ్గుతుంది. తద్వారా వడ్డీ చెల్లింపులతో సుమారు రూ.16.30 లక్షలు ఆదా అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement