home loan
-
రుణగ్రహీతలకు శుభవార్త
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ గ్రహీతలకు తీపి కబురు చెప్పింది. రుణ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటన పేర్కొంది. దీనితో గృహ రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల (ఈఎంఐ) భారం తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవలే పావుశాతం తగ్గించిన నేపథ్యంలో (6.5 శాతం నుంచి 6.25 శాతానికి) ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రేట్లు ఇలా...→ వివిధ రుణాలకు వర్తించే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), అలాగే రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గించింది. ఈ తగ్గింపు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. → అయితే బ్యాంక్ మార్జినల్ కాస్ట్–బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్), బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్‌ను (బీపీఎల్ఆర్) యథాతథంగా కొనసాగించింది. రెపో ఆధారిత రుణల విషయానికి వస్తే...రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రత్యక్షంగా రెపో రేటుకు అనుసంధానమై ఉంటుంది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఈ రేటు 8.75 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గుతుంది. దీనితో ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాణిజ్య రుణాలు తగ్గుతాయి. ఆకర్షణీయం..ఈబీఎల్ఆర్ లేదా ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన రుణ గ్రహీతల రుణ నిబంధనలను బట్టి వారి ఈఎంఐలు లేదా రుణ వ్యవధి తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాలను మరింత ఆకర్షణీయంగా చేస్తూ, ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ను ఎస్బీఐ తగ్గించడం కస్టమర్లకు ప్రయోజనం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ తగ్గిన రుణ రేటు ప్రయోజనాలు పొందడానికి మార్జినల్ కాస్ట్ రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కస్టమర్లు తక్కువ వడ్డీరేటు రుణ విధానానికి మారవలసి ఉంటుంది. ‘రుణ’ పునఃపరిశీలనకు సూచన...తాజా రుణ రేట్లు, సంబంధిత పరిణామాల నేపథ్యంలో కొత్త రుణగ్రహీతలు రుణదాతను (బ్యాంక్) ఎంచుకునే ముందు వివిధ బ్యాంకుల రుణ రేట్లను సరిపోల్చుకోవాలని, వారి సామర్థ్యానికి అనువైన రుణ రేట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రుణగ్రహీతలు తప్పనిసరిగా తమ రుణ ఒప్పందాలను సమీక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. అవసరమైతే రీఫైనాన్సింగ్ ఎంపికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ రెపో తగ్గింపు నేపథ్యంలో కెనరా బ్యాంక్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు కూడా తమ రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించాయి. ఈ బ్యాంకుల నుండి గృహ రుణ గ్రహీతలు తమ ఈఎంఐలను అలాగే రుణ చెల్లింపు వ్యవధి కాల పరిమితులను సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈబీఎల్ఆర్ అంటే?ఈబీఎల్ఆర్ అంటే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్. ఎస్బీఐ 2019 అక్టోబర్ నుంచి తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను అనుసంధానించడానికి ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంది. దీనితో అన్ని ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లకు వడ్డీ రేట్లు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమవుతాయి. తాజా నిర్ణయంతో గృహ రుణ ఫ్లోటింగ్ రేట్లు తగ్గుతాయన్న మాట. దీనితోపాటు ఈబీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని వ్యక్తిగత ఇతర రిటైల్ రుణాలు సైతం దిగివస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం ఈబీఎల్ ఆర్ 9.15% నుంచి 8.90 శాతానికి తగ్గింది. -
ఎస్బీఐ గుడ్‌న్యూస్.. తగ్గనున్న ఈఎంఐ
భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) లోన్ తీసుకున్నవారికి శుభవార్త చెప్పింది. గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లోన్ రేటు (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ను తగ్గిస్తున్న ఇటీవల ప్రకటించింది. సవరించిన రుణ రేట్లు ఫిబ్రవరి 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించిన తర్వాత ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR), బేస్ రేటు & బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR)లలో ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకులు వినియోగదారులకు అందించే వడ్డీ రేట్లను.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) ఆధారంగా నిర్ణయిస్తాయి.గృహ రుణాలకు రేపో రేటును అనుసంధానం చేసేందుకు.. ఈబీఎల్ఆర్ విధానాన్ని ఎస్బీఐ 2019 అక్టోబర్ 1 నుంచి అనుసరిస్తోంది. ఈ కారణంగానే ఆర్బీఐ రేపు రేటును మార్చిన ప్రతిసారీ.. ఎస్బీఐ రేటు కూడా మారుతూ ఉంటుంది. ఈబీఎల్ఆర్ను 9.15 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి.. 8.90 శాతానికి చేర్చింది. దీంతో ఈబీఎల్ఆర్తో అనుసంధానం అయిన పర్సనల్ లోన్స్, హోమ్లోన్స్ వంటి వాటితో పాటు రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.రుణ రేట్లను సవరిస్తున్న బ్యాంకులుఎస్బీఐ మాత్రమే కాకుండా కెనరా బ్యాంక్ (9.25% నుంచి 9% శాతానికి), బ్యాంక్ ఆఫ్ ఇండియా (9.35% నుంచి 9.10%కి తగ్గించింది), బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( 9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది)లు కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి.ఇదీ చదవండి: నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ -
హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.50 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ప్రకటించారు. దీని వలన వడ్డీ రేట్లు, ఈఎంఐలు తగ్గేందుకు ఆస్కారం కలిగింది.2019 అక్టోబర్ 1 తర్వాత మంజూరైన అన్ని రిటైల్ ఫ్లోటింగ్-రేట్ రుణాలు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమై ఉంటాయి. చాలా సందర్భాలలో ఇదే రెపో రేటుగా ఉంటుంది. కాబట్టి రేటు తగ్గింపు గృహ రుణగ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోని గృహ రుణాలలో ఎక్కువ భాగం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఫలితంగా, వడ్డీ భారం, వాటి ఈఎంఐలు తగ్గుతాయి. దీంతో ఇంటి యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది.దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేట్లను తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుండి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది.హోమ్ లోన్ కస్టమర్లకు భారీ ప్రయోజనాలుప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల హోమ్ లోన్ కస్టమర్లకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు చూద్దాం.. ఒక సంవత్సరం క్రితం 9 శాతం వడ్డీ రేటు, 20 సంవత్సరాల కాలపరిమితి (240 నెలలు) తో రూ. 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నట్లయితే.. నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 44,986 ఉంటుంది. రుణ కాలంలో చెల్లించే అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 58 లక్షలు అవుతుంది.ఇప్పుడు 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో గృహ రుణ వడ్డీ రేటు 9 శాతం నుండి 8.75 శాతానికి తగ్గుతుంది. ఫలితంగా అసలు, వడ్డీ మొత్తం చెల్లింపు సుమారు రూ. 53.6 లక్షలకు తగ్గుతుంది. దీని వలన రూ. 4.4 లక్షలు ఆదా అవుతుంది. అలాగే రుణ కాలపరిమితి 230 నెలలకు తగ్గుతుంది. దీని వలన రుణాన్ని 10 నెలల ముందుగానే తిరిగి చెల్లించవచ్చు. -
జాబ్ లేకపోయినా ఈజీగా హోమ్ లోన్.. బ్యాంకులు చూసేది ఇవే..
ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు సొంత ఇల్లు (Home) కావాలని కోరుకుంటారు. అయితే ఇల్లు కొనడం లేదా ఇల్లు కట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇల్లు కొనాలంటే మధ్యతరగతి వాళ్లు దాచుకున్న డబ్బునంతా పెట్టాలి. అయినా కూడా సరిపోకుంటే గృహ రుణం (Home loan) తీసుకోవలసిన అవసరం ఉంటుంది. 90 శాతం మంది ఇలా హోమ్ లోన్ తీసుకునే ఇల్లు కట్టుకుంటున్నారు.జాబ్ చేస్తూ జీతం తీసుకునే వ్యక్తులకు బ్యాంకులు హోమ్ లోన్ సులువుగా మంజూరు చేస్తాయి. ఇందుకోసం ఉద్యోగి జీతం, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి చెక్ చేశాయి. మరి స్వయం ఉపాధి పొందేవారికి ఇంటి రుణాలు ఎలా ఇస్తారో మీకు తెలుసా? బ్యాంకులు వారికి ఎంత మేర గృహ రుణం ఇవ్వవచ్చు.. వడ్డీ రేటు ఎంత ఉండాలి అన్నది నిర్ణయించడానికి బ్యాంకులు చూసే కీలక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..వయసుగృహ రుణం ఇచ్చే సమయంలో ప్రతి బ్యాంకూ ఖచ్చితంగా రుణం తీసుకునే వ్యక్తి వయస్సును చూస్తుంది. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందేవారికి రుణాలు ఇస్తున్నప్పుడు వయస్సుపై చాలా శ్రద్ధ వహిస్తారు. స్వయం ఉపాధి పొందే వ్యక్తి వయస్సు తక్కువగా ఉంటే ఎక్కువ గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది. లోన్ కాల పరిమితి కూడా ఎక్కువగా పొందే ఆస్కారం ఉంటుంది. తద్వారా రుణాన్ని తిరిగి చెల్లించడంలో పెద్దగా కష్టం ఉండదు. ఎందుకంటే ఈఎంఐ (EMI) తక్కువగా ఉంటుంది.డాక్యుమెంట్లుహోమ్ లోన్ ఇవ్వడానికి ముందు, దరఖాస్తుదారు నుండి అనేక ముఖ్యమైన పత్రాలను తీసుకుంటారు. ఆదాయపు పన్ను రిటర్న్, లాభ-నష్ట స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి ఇందులో ఉంటాయి. వీటిని బట్టి ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తారు. దీంతో పాటు ఆ వ్యక్తి వ్యాపారం ఎలా సాగుతుందో కూడా తెలుస్తుంది.ఆదాయంగృహ రుణం ఇచ్చే బ్యాంకుకు స్వయం ఉపాధి పొందే వ్యక్తి నికర ఆదాయం చాలా ముఖ్యం. దీని ఆధారంగా ఆ వ్యక్తికి నెలకు ఎంత డబ్బు అందుతుందో బ్యాంకుకు తెలుస్తుంది. బ్యాంకు అనేక రకాల డాక్యుమెంట్ల నుండి ఈ విషయాన్ని గుర్తించి, దాని ఆధారంగా లోన్ ఇస్తుంది. రుణ గ్రహీత అన్ని ఈఎంఐలను సకాలంలో చెల్లించగలడా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నికర ఆదాయం బ్యాంకుకు సహాయపడుతుంది.ఇక రుణ గ్రహీతకు ఇతర ఆదాయాలు ఏమైనా ఉన్నాయా.. లేదా వ్యాపారంపై మాత్రమే ఆధారపడి ఉన్నాడా అని కూడా బ్యాంక్ చూస్తుంది. ఇతర వనరుల నుండి వచ్చే ఈ ఆదాయం అంటే అద్దె ఆదాయం, ఎక్కడైనా పెట్టుబడి లేదా రియల్ ఎస్టేట్ నుండి వచ్చే ఆదాయం కావచ్చు. ఆ వ్యక్తి ఇతర వనరుల నుండి కూడా సంపాదిస్తున్నట్లయితే అది మంచి సంకేతం. ఇది సులభంగా గృహ రుణం పొందే అవకాశాలను పెంచుతుంది.క్రెడిట్ స్కోర్ఏదైనా వ్యక్తికి హోమ్ లోన్ ఇచ్చే ముందు బ్యాంకు ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను (Credit score) కూడా తనిఖీ చేస్తుంది. సదరు వ్యక్తి క్రెడిట్‌కి సంబంధించి ఎలా ఉన్నాడు.. అంటే సకాలంలో రుణం చెల్లించాడా లేదా అనేది ఇది చూపిస్తుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే సులభంగా గృహ రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే లోన్ పొందడం కష్టం కావచ్చు. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ అనేది 300-900 మధ్య ఉంటుంది. -
లోన్ పట్టు.. ఇల్లు కట్టు!
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’అన్నారు పెద్దలు. జీవితంలో ఆ రెండు ఘట్టాలు దాటిన వారు సప్త సముద్రాలు దాటినట్టే లెక్క. అయితే ఈ తరంలో ఇల్లు యజమాని కావడం అంటే ఆషామాషీ కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకుని.. ఓ ఇంటి వాడయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్నగరాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాస్తో కూస్తో.. కుదిరితే ఏ అపార్ట్‌మెంట్‌లోనో ఓ ఫ్లాట్ కొనుక్కుని బతుకు బండి లాగిద్దామనుకునే వారే ఎక్కువ మంది. దానికి కూడా కూడబెట్టుకున్న కాస్త డబ్బుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తింట్లో అడుగుపెడుతున్నారు. తాజాగా నైట్ ఫ్రాంక్ అనే సంస్థ విడుదల చేసిన ‘బ్యాంకింగ్ ఆన్ బ్రిక్స్’అనే సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.ఇదీ చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్79% రుణాలపైనే భారం దేశవ్యాప్తంగా నగరాల్లో సొంతింటి కల నెరవేర్చుకున్నవారిపై లండన్‌కు చెందిన నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 1,629 మంది పాల్గొన్న ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 79 శాతం మంది ఇల్లు కొనుక్కునేందుకు బ్యాంకు రుణాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు తెలిపారు. 52 శాతం మంది అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది స్టూడియో (చిన్నపాటి) అపార్ట్మెంట్లు, 17 శాతం మంది మాత్రం ఇండిపెండెంట్ ఇళ్లు కోరుకున్నారు. 7 శాతం మంది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు, 5 శాతం మంది మాత్రం ఖాళీ భూమి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు.సొంతిళ్లే కావాలి సర్వేలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది తమకు సొంతిల్లు అవసరమని చెప్పారు. 19 శాతం మంది మాత్రం సొంతిల్లు కన్నా అద్దెకు ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు. 1 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. సొంతిల్లు విషయంలో ఒక్కో తరాన్ని బట్టి ఒక్కో విధంగా ఆలోచనలు ఉన్నాయి. బేబీ బూమర్స్ (1946–1964 మధ్య పుట్టిన వారు) 79 శాతం మంది సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. జెన్ ఎక్స్ (1965–1980 మధ్య పుట్టిన వారు)లో 80 శాతం మంది, మిలీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు)లో 82 శాతం మంది సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే వెరైటీగా జెన్–జీ (1997–2012) మధ్య జన్మించిన వారిలో 71 శాతం సొంతిల్లు ఉండాలని భావిస్తుండగా, ఏకంగా 27 శాతం మంది అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అని భావిస్తుండటం గమనార్హం.సొంతిల్లు ఎందుకంటే? సొంతిల్లు కావాలని చాలా మంది కోరుకుంటున్నా.. అందుకు కారణాలపై మాత్రం ఒక్కో తరం వారిలో ఒక్కో ఆలోచన ఉంది. బేబీ బూమర్స్ జెనరేషన్‌కు చెందినవారు ఇల్లు కొనుక్కోవడం అనేది ఓ పెట్టుబడిగా ఆలోచిస్తున్నారు. అదే మిలీనియల్స్ జెనరేషన్ వాళ్లు మాత్రం వారి సంపదను మరింత పెంచుకోవడంలో భాగంగా ఇల్లు కట్టుకుంటున్నారని సర్వేలో తేలింది. బేబీ బూమర్స్‌లో 29 శాతం మంది ఇల్లు కొనడాన్ని పెట్టుబడిగా భావిస్తే.. 15 శాతం మంది మాత్రం రిటైర్మెంట్ ప్లాన్‌గా కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుసర్వేలో పాల్గొన్న వారందరిలో 37 శాతం మంది ఉన్న ఇంటిని లగ్జరీ ఇళ్లుగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కొన్ని నగరాల్లోనే ఉండగా, ఇప్పుడు దేశంలోని ప్రథమ శ్రేణి నగరాలన్నింటిలో కనిపిస్తోంది. 32 శాతం మంది మాత్రం తొలిసారిగా ఇల్లు కొన్నామని, జీవితాంతం అదే గృహంలోనే ఉంటామని చెప్పారు. 25 శాతం మంది పెట్టుబడిగా కొనుక్కున్నామని, 7 శాతం మంది రిటైర్మెంట్, రెండో ఇల్లు ఉండాలని, వెకేషన్ కోసం అంటూ పలు కారణాల వల్ల ఇల్లు కొన్నామని వివరించారు.ప్రీమియం వైపు ఆలోచనలు..దేశంలో ఇల్లు కొనేవారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. తాజాగా మేం జరిపిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేలింది. దాదాపు 80 శాతం మంది సొంతిల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రీమియం, లగ్జరీ ఇళ్లు కట్టుకోవాలనే ట్రెండ్ పెరుగుతోంది. కేవలం దేశ ఆర్థిక వృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనకు మాత్రమే దేశ స్థిరాస్తి రంగం ఉపయోగపడదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా కొనేవారి ప్రాధాన్యాలను కూడా అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. – శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా, చైర్మన్, ఎండీఇదీ చదవండి: థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్ -
ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇకపై మరింత భారమయ్యాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల రేట్లను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.05 శాతాన్ని (5 బేసిస్ పాయింట్లు) పెంచడంతో 9 శాతానికి చేరింది. గృహ రుణం వంటి దీర్ఘకాల రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటే ప్రామాణికంగా ఉంటుంది.మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను సైతం ఇంతే మేర పెంచింది. ఓవర్‌నైట్, ఒక నెల, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లను మాత్రం సవరించలేదు. పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎంసీఎల్ఆర్ రేట్లను ఎస్బీఐ రెండుసార్లు పెంచడం గమనార్హం. డిపాజిట్లపై వ్యయాల పెరుగుదలతో బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాల్సి వస్తోంది. -
ఒక్క ఈఎంఐతో ఐదేళ్లు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. దీన్ని నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం డబ్బు పోగు చేస్తారు. కొంత నగదు సమకూరిన తర్వాత హోంలోన్ తీసుకుని ఇంటిని సొంతం చేసుకుంటారు. నెలవారీ ఈఎంఐల కోసం తిరిగి కష్టపడుతుంటారు. అయితే ఈ లోన్ వ్యవధి సుమారు 25 ఏళ్లపాటు ఉంటుంది. దాంతో భారీగా వడ్డీ చెల్లించాలి. ఆలోపు అనుకోకుండా ఏదైనా డబ్బు అవసరం ఏర్పడితే ఈఎంఐలకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ లోన్ కాలపరిమితిని తగ్గించుకుంటే త్వరగా అప్పు తీర్చడంతోపాటు ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చుకోవచ్చు. అయితే త్వరగా ఇంటి రుణం ఎలా చెల్లించాలో తెలుసుకుందాం.ఉద్యోగం చేస్తున్నవారు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వేతనం పెరుగుతుంది. అలా పెరిగిన డబ్బుతో ఏటా 10 శాతం ఈఎంఐ పెంచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 25 ఏళ్ల కాలానికి తీసుకున్న రుణం.. 10 ఏళ్లలోనే పూర్తవుతుంది.ఏటా 10 శాతం ఈఎంఐ పెంచడం కష్టం అని భావించేవారు తమ ఇంటి రుణాన్ని 13 ఏళ్లలో తీర్చవచ్చు. ఇందుకోసం నెలవారీ వాయిదాను ఏటా ఐదు శాతం వరకు పెంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఖర్చుల విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే సమయంలో రుణంపై వడ్డీ భారమూ తగ్గుతుంది.ఏటా 12 ఈఎంఐలకు బదులుగా కేవలం ఒక ఈఎంఐని అధికంగా చెల్లిస్తే మీ ఇంటిరుణం వ్యవధి ఏకంగా ఐదేళ్లు తగ్గుతుంది. అంటే 25 ఏళ్ల పాటు సాగే రుణ భారాన్ని 20 ఏళ్లలోనే పూర్తి చేసుకోవచ్చు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారంనెలవారీ సంపాదనలో అన్ని ఈఎంఐలు కలిపి 50 శాతానికి మించకూడదు. ఒకవేళ ఈ పరిధిదాటితే ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.సొంతింటిలో అదనంగా ఫ్లోర్లు ఏర్పాటు చేసి గదులు కిరాయికి ఇవ్వొచ్చు. అలా వచ్చే రెంట్‌తో ఈఎంఐ పెంచుకోవచ్చు. దాంతో తక్కువ సమయంలోనే లోన్ పూర్తి చేయవచ్చు. -
మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్‌లోన్‌కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్‌లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు..విజయ్ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్ తీసుకున్నాడని అనుకుందాం. లోన్ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు. -
లోన్ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!
ఇల్లు కొనడం సామాన్యుడి కల. ఈ కల నెరవేర్చుకోవడం కోసం చాలామంది జీవితాంతం కష్టపడుతుంటారు. కొందరు డౌన్‌పేమెంట్‌కు సరిపడా డబ్బు సంపాదించి మిగతాది లోన్ ద్వారా తీరుస్తుంటారు. అయితే హోంలోన్ వ్యవధి చాలా ఏళ్లు ఉంటుంది. ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసినా ఏటా దాని విలువ తగ్గిపోతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలాగని ఇల్లు కొనకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిట్కా పాటించి ఎలాంటి లోన్ అవసరం లేకుండా పదేళ్ల తర్వాత ఇల్లు కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మీరు కొనలనుకునే ఫ్లాట్ ధర రూ.50,00,000 అనుకుందాం. అందులో రూ.10 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టేందుకు సిద్ధంగా ఉంటే మరో రూ.40 లక్షలు లోన్ తీసుకోవాల్సిందే కదా. ముందుగా మీ దగ్గరున్న రూ.10 లక్షలు ఏటా 15 శాతం వృద్ధి చెందే మ్యుచువల్ ఫండ్స్‌లో పదేళ్లపాటు లమ్సమ్(ఒకేసారి పెట్టే పెట్టుబడి) ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాంతో రూ.40.4 లక్షలు సమకూరుతాయి. ఒకవేళ రూ.40 లక్షలు లోన్ తీసుకుని ఇప్పుడే ఇళ్లు కొనుగోలు చేస్తే 20 ఏళ్ల వ్యవధికిగాను 9 శాతం వడ్డీ లెక్కిస్తే నెలవారీ ఈఎంఐ రూ.36 వేలు చెల్లించాలి. అందులో నుంచి రూ.10 వేలు ప్రస్తుతం ఉంటున్న ఇంటి కిరాయికి కేటాయించండి. మిగతా రూ.26 వేలు క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా 14 శాతం వడ్డీ సమకూరే మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. దాని ద్వారా మొత్తం రూ.68 లక్షలు సమకూరుతాయి.ఇదీ చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మందిలమ్సమ్ పెట్టుబడి పెట్టిన రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలు, ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సిన రూ.26 వేల నుంచి పదేళ్ల తర్వాత రూ.68 లక్షలు కలిపి మొత్తం మీ చేతిలో రూ.1.08 కోట్లు ఉంటాయి. రియల్ఎస్టేట్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించినా ఆ డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పదేళ్ల తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
అదనపు రుణానికి రూట్.. టాపప్ హోమ్‌లోన్!
సొంతిల్లు.. చాలా మంది జీవిత లక్ష్యాల్లో ఒకటి. రుణంపై సొంతిల్లు సమకూర్చుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలా గృహ రుణం తీసుకున్న తర్వాతి కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం అదనపు రుణం తీసుకునే అవకాశం ఉంటే..? గృహ నవీకరణ లేదా విద్యా సంబంధిత ఫీజుల చెల్లింపు లేదా అనారోగ్యం.. అవసరం ఏదైనా గృహ రుణంపై టాపప్ రుణం సులభంగా లభిస్తుంది. కాకపోతే ఈ విధంగా తీసుకుంటున్న రుణం ఏ అవసరాలకు వినియోగిస్తున్నారనేది ఇంత వరకు బ్యాంక్‌లు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలే ఆర్బీఐ ఈ విషయమై బ్యాంక్‌లను హెచ్చరించింది. కనుక టాపప్ హోమ్‌లోన్‌ను ఏ అవసరం కోసం తీసుకుంటున్నామనేది రుణ గ్రహీతలు సైతం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందే. చౌకగా లభించే ఈ రుణాన్ని ముఖ్యమైన అవసరాల్లో వినియోగించుకోవడం ద్వారా తగినంత ప్రయోజనం పొందొచ్చు. టాపప్ అంటే... అప్పటికే తీసుకున్న గృహ రుణంపై అదనపు రుణాన్ని తీసుకోవడమే టాపప్ హోమ్‌లోన్ అవుతుంది. దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఇంటి విలువ ఎంత? ఇంటికి తీసుకున్న రుణానికి చెల్లింపులు ఏ విధంగా చేస్తున్నారు? అప్పటి వరకు ఎంత మేర చెల్లించారు? తదితర అంశాల ఆధారంగా ఈ రుణానికి అర్హత లభిస్తుంది. ఇది సెక్యూర్డ్ లోన్ కిందకే వస్తుంది. కనుక బ్యాంక్‌లకు వీటిపై రిస్క్ తక్కువే. అయితే రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే ఈ రుణంపై బ్యాంకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.ఎలా పనిచేస్తాయి? ‘‘గృహ రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తూ.. 18–24 నెలలు గడిచిన తర్వాత టాపప్ లోన్ తీసుకునేందుకు అర్హత లభిస్తుంది’’ అని విష్ఫిన్ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. వాస్తవంగా జారీ అయిన గృహ రుణం నుంచి అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి పోను మిగిలిన మొత్తం టాపప్‌గా లభిస్తుంది. అంటే అప్పటి వరకు తీర్చిన రుణం మొత్తమే తిరిగి రుణంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ.కోటి విలువ చేసే ఇంటి కోసం గరిష్ట పరిమితి మేరకు రూ.80 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. తర్వాత ఐదేళ్లలో రూ.10లక్షలు అసలు తీర్చివేసినట్టయితే.. అప్పుడు తిరిగి రూ.10 లక్షల మేర టాపప్ హోమ్‌లోన్‌కు అర్హత ఉంటుంది. అంతేకాదు ఈ ఐదేళ్లలో పెరిగిన ఇంటి విలువను సైతం బ్యాంక్‌లు పరిగణనలోకి తీసుకుంటాయి. రూ.కోటి విలువ చేసే ఇంటి విలువ ఐదేళ్లలో రూ.1.20 లక్షలకు చేరిందనుకుంటే అప్పుడు రుణ అర్హత రూ.96లక్షలకు పెరుగుతుంది. ఈ రుణ కాల వ్యవధి కూడా, గృహ రుణం కాలానికి మించకుండా ఉంటుంది. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు టాపప్ హోమ్‌లోన్‌ను 15 ఏళ్ల కాలవ్యవధి వరకు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ హోమ్ లోన్స్ హెడ్ రతన్ చౌదరి తెలిపారు. గృహ రుణం కాల వ్యవధి ఇంకా ఏడేళ్లు, అంతకు మించి ఉంటే.. ఇతర రుణాల కంటే తక్కువ ఈఎంఐకే రుణం పొందొచ్చని చౌదరి సూచించారు. సులభతరం టాపప్ హోమ్‌లోన్‌ను చాలా సంస్థలు డిజిటల్‌గా మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా రుణం చేతికి అందుతుంది. అప్పటికే గృహ రుణం కోసం అన్ని పత్రాలు సమరి్పంచి ఉంటారు కనుక.. అదనంగా ఎలాంటి డాక్యుమెంట్ల అవసరం ఏర్పడదు. అన్ని పత్రాలు దగ్గర ఉండడంతో బ్యాంక్‌లు వేగంగా నిర్ణయం తీసుకుంటాయి. రుణ గ్రహీత తాజా క్రెడిట్ రిపోర్ట్‌ను తప్పకుండా పరిశీలిస్తాయి. చౌక ఆప్షన్ అన్ని రుణాల్లోకి గృహ రుణం చౌక వడ్డీ రేటుకే లభిస్తుంది. గృహ రుణంపై ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటే.. టాపప్కి సైతం అమలవుతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్‌కార్డుపై రుణం, బంగారంపై రుణం కంటే టాపప్ హోమ్‌లోన్ చౌక అని పైసాబజార్ రతన్ చౌదరి తెలిపారు. ఒకవేళ అప్పటికే క్రెడిట్ కార్డ్‌పై రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకుని, అధిక వడ్డీ రేటు చెల్లిస్తుంటే.. అటువంటి వారు సైతం టాపప్ హోమ్‌లోన్ తీసుకుని వాటిని తీర్చివేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చు. పర్సనల్, క్రెడిట్ కార్డు రుణాలు అన్ సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకే వాటిపై వడ్డీ రేటు ఎక్కువ. గృహ రుణం సెక్యూర్డ్ (ఇల్లు తనఖాపై) కనుక వడ్డీ రేటు తక్కువ. అవసరం మేరకే.. సులభంగా, చౌకగా వస్తుందని చెప్పి టాపప్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపించే ముందు, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలన చేయడం ఎంతో అవసరం. టాపప్ రుణాలతో వచ్చే పెద్ద సమస్య నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ పెరిగిపోవడమేనని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (ఆర్ఐఏ), సహజ్ మనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ తెలిపారు. టాపప్ హోమ్ రుణాలు అనుత్పాదక అవసరాలకు వినియోగం అవుతుండడంపై ఆర్బీఐ ఇటీవలే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలను అప్రమత్తం చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు దేనికి వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని కోరింది. ముఖ్యంగా ఈ తరహా రుణాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. లోన్–టు–వేల్యూ రేషియో (ప్రాపర్టీ విలువపై జారీ చేసే రుణం మొత్తం/ఎల్టీవీ), రిస్క్‌లు, రుణ నిధుల వినియోగంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఈ తరహా రుణాలు స్పెక్యులేటివ్ అవసరాలకు తీసుకోవడం లేదని బ్యాంక్/ఎన్బీఎఫ్సీని నమ్మించాల్సి రావచ్చు. ఇలా తీసుకున్న నిధులను ట్రేడింగ్‌లో నష్టపోయి, తిరిగి చెల్లింపులు చేయలేకపోతే అప్పుడు రుణం ఇచ్చిన బ్యాంక్ ఇంటిని జప్తు చేస్తుందన్నది మర్చిపోవద్దు. ‘‘టాపప్ హోమ్ లోన్స్ అన్నవి సాధారణంగా గృహ నవీకరణ కోసమే. పిల్లల విద్య లేదా వైద్య వ్యయాలు వంటి ఇతర అవసరాలకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. రుణం తీసుకునే సమయంలోనే దీనిపై బ్యాంక్‌లు నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేస్తాయి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి వివరించారు. అయితే ఈ రుణాన్ని స్పెక్యులేటివ్ అవసరాలకు వినియోగించరాదని సూచించారు. ఇదే విషయం రుణ ఒప్పంద నిబంధనల్లోనూ స్పష్టంగా ఉంటుంది.రుణం రాకపోతే..? చాలా సంస్థలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సమయంలో (గృహ రుణం బదిలీ) టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ చౌదరి తెలిపారు. ఇంటి రుణం ఇచి్చన సంస్థ దగ్గర టాపప్ హోమ్ లోన్ పొందలేకపోతే.. లేదా అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నట్టు అయితే.. అప్పుడు మిగిలి ఉన్న గృహ రుణాన్ని (బ్యాలెన్స్) మరో సంస్థకు బదిలీ చేసుకోవడం ద్వారా టాపప్ హోమ్‌లోన్‌ను పొందొచ్చని చౌదరి సూచించారు. ఇవి గమనించాలి.. → విహార యాత్ర, ఖరీదైన వస్తు కొనుగోళ్ల కోసం టాపప్ హోమ్‌లోన్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. తమ ఆస్తి విలువ పెంచుకునేందుకు వినియోగించుకోవచ్చు. → టాపప్ హోమ్ లోన్‌ను వీలైనంత తక్కువ కాల వ్యవధికి (రెండు నుంచి నాలుగేళ్లు) పరిమితం చేసుకోవాలి. దీర్ఘకాలం ఎంపిక చేసుకోవడం వల్ల వడ్డీ భారం పెరిగిపోతుంది. → గృహ రుణం, దానిపై టాపప్‌తో కలిపి అసలు ఇంటి విలువలో 75 శాతం మించకుండా చూసుకోవడం సౌకర్యం. → ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను చాలా సంస్థలు వసూలు చేస్తున్నాయి. → బ్యాంక్‌తో సంప్రదింపులు చేయడం ద్వారా వీలైతే వడ్డీ రేటులో రాయితీ పొందొచ్చు. → టాపప్ హోమ్‌లోన్‌ను ఖరీదైన ఇతర రుణాల చెల్లింపులకు వినియోగించుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంబానీ కంపెనీ హోమ్లోన్ల విస్తరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్షియల్ లిమిటెడ్(జేఎఫ్ఎల్) త్వరలో హోమ్‌లోన్ సర్వీసులను విస్తరిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈమేరకు కంపెనీ తన లోన్ల వివరాలు వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కంపెనీ తన ‘జియో ఫైనాన్స్ యాప్ బీటా మోడ్’ వినియోగదారులకు హోమ్లోన్లు అందిస్తోంది.గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అనంతరం జియో ఫైనాన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా యూపీఐ సర్వీసులు, ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, బీమా సేవలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా సర్వీసు అందిస్తోంది. జేఎఫ్ఎల్ యాప్ బీటా మోడ్ వినియోగదారులకు హోమ్లోన్లు అందిస్తున్నారు. ఈ సర్వీసును త్వరలో కంపెనీ వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మార్కెట్లో వస్తున్న వార్తల ప్రకారం కంపెనీ ఈ సర్వీసును తీసుకొస్తే ఇదే రంగంలో సేవలందించే ఇతర హోమ్‌లోన్ కంపెనీలు, కొన్ని బ్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.మే 30, 2024న ప్రారంభమైన జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ యాప్ ఇప్పటికే 10 లక్షల డౌన్లోడ్లను అధిగమించిందని కంపెనీ తెలిపింది. జులై 2023లో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందుకోసం ఇరు కంపెనీలు రూ.1,258 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. -
ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!
సొంతిల్లు సామాన్యుడి కల.. కొందరికి అది పరువు మర్యాద.. ఇంకొందరికి తలకు మించిన భారం. కొత్తగా ఉద్యోగం వచ్చిన వారు బంధువుల ఇంటికి వెళితే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావని అడుగుతారు. పిల్లల పెళ్లిల్లు చేసినవారు వెళితే ‘అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా ఇల్లు తీసుకోండి’ అంటారు. సరపడా డబ్బు ఉండి సమాజంలో మరింత గౌరవం కోసం ఇల్లు తీసుకునే వారు కొందరైతే.. సమాజానికి భయపడి పక్కవారికి ఎక్కడ లోకువవుతామోనని ఇల్లు కొనేవారు కొందరు. ఇలాంటి వారు తమ ఆర్థిక స్తోమతకు మించి అప్పుచేసి ఇల్లు కొంటారు. అయితే చాలీచాలని జీతాలతో కాలం నెట్టుకొస్తున్నవారు ఇల్లు తీసుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.సాధారణంగా ఇల్లు కొనాలనుకునేవారు లోన్ తీసుకుంటారు. వచ్చే జీతంలో సగానికిపైగా ఈఎంఐలకు పోతుంది. కాబట్టి, ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ముందుగా ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఉండాలి.ప్రతినెల వచ్చే ఆదాయం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అప్పటికే ఏదైనా లోన్లు, ఇతర అవసరాలకు చెల్లించాల్సినవి ఉంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. తీరా ఇల్లు తీసుకుని ఈఎంఐలు చెల్లించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలవారీగా రుణాల మొత్తం ఎంతో లెక్క తీయండి. క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇతర అప్పులు ఎంతనే వివరాలను తెలుసుకోవాలి.మారుతున్న జీవన శైలిలో భాగంగా భవిష్యత్తులో అవసరాలకు కొంత డబ్బును సమకూర్చుకోవాలి.పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం నగదు పోగు చేసుకోవాలి.ఉద్యోగం చేస్తూంటే ఏదైనా అనివార్య కారణాలతో జాబ్ పోయినా ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం క్రమానుగత పెట్టుబడులను ఎంచుకుంటే మేలు.ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే కుటుంబ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.ఇదీ చదవండి: కంటెంట్ తొలగించకపోతే అరెస్టు తప్పదు!కుటుంబం అంతా మనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగి మనం చనిపోతే ఈఎంఐలు, అప్పులని ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తారు. కాబట్టి మంచి టర్మ్ పాలసీ తీసుకోవాలి. మనకు ఏదైనా జరిగితే మొత్తం డబ్బును చెల్లించేలా ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. -
హోమ్ లోన్ కోసం చూస్తున్నారా.. తప్పకుండా ఇవి తెలుసుకోండి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది అహర్నిశలు కష్టపడుతుంటారు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసినా, బ్యాంకుల నుంచి వంటివి తీసుకున్నా.. అంతా ఇల్లు కోసమే. ఇల్లు కొనేందుకు లేదా కట్టుకోవడానికి బ్యాంక్స్ లోన్ మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ పొందే వ్యక్తి తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్ - ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. సదరు వ్యక్తికి తప్పకుండా మంచి సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఉన్న సిబిల్ స్కోరును బట్టి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వారు సులభంగా కొంత తక్కువ వడ్డీకి లోన్ పొందవచ్చు.అవసరమైన డాక్యుమెంట్స్ - హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు బ్యాంకులకు లేదా ఇతర ఏదైనా లోన్ ఇచ్చే సంస్థలకు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ లేదా ఆస్తి పత్రాలు మాత్రమే కాకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేవారైతే మూడు నెలల సాలరీ స్లిప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ప్రాసెసింగ్ ఫీజు - ఏ లోన్ తీసుకున్న దానికి కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు పర్సనల్ లోన్ తీసుకునే వారికి కొంత ఎక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకునే వారికి మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారికి 0.5 నుంచి 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. లోన్ తీసుకునే ముందే వివిధ చార్జీలు, ఫీజుల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.లోన్ డ్యూరేషన్ (కాల వ్యవధి) - లోన్ తీసుకునేవారు కాల వ్యవధిని కూడా నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి అర్హతను బట్టి బ్యాంకులు గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కాల వ్యవధిని అందిస్తాయి. అయితే వీలైనంత త్వరగా లోన్ పూర్తి చేసుకోవడానికి తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. డ్యూరేషన్ వ్యవధి ఎక్కువగా ఉంటే వడ్డీ భారం కూడా ఎక్కువగా ఉంటుంది.వడ్డీ రేటు - లోన్ తీసుకునే వ్యక్తి ప్రధానంగా వడ్డీ రేటును గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని ప్రైవేట్ సంస్థలు భారీ వడ్డీలకు లోన్స్ అందిస్తాయి. కాబట్టి ఎక్కడైతే తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుందో తెలుసుకుని లోన్ తీసుకోవడం ఉత్తమం. ఈ వడ్డీ రేటు రేపో రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఈఎంఐ - లోన్ తీసుకునే వ్యక్తి.. తాను ఎంచుకునే కాల వ్యవధిని బట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా లోన్ తీసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంపాదన, ఖర్చులు వంటి వాటిని బేరీజు వేసుకుని ఈఎంఐ ఎంత కట్టాలనేది నిర్ణయించుకోవచ్చు. లోన్ ఈఎంఐ అనేది సంపాదనలో 45 శాతం కంటే ఎక్కువ కాకుండా ఉంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండిఇవి మాత్రమే కాకుండా హోమ్ లోన్ ప్రీ పేమెంట్, పన్ను రాయితీలు, హోమ్ లోన్ ఇన్సూరెన్స్, లోన్ డీఫాల్ట్ వంటి విషయాలను గురించి కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత హోమ్ లోన్ తీసుకోవాలి. బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా ఎగబడి తీసుకున్నారంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు. -
గృహ రుణం కావాలా..? ప్రాసెసింగ్ ఫీజు లేదు.. వడ్డీ తక్కువే..
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఇంటి రుణాలపై వడ్డీని తగ్గించింది. 8.45 శాతంగా ఉన్న వడ్డీ రేటులో 15 పాయింట్లు కట్ చేసింది. తమ బ్యాంకులో తీసుకునే గృహ రుణలపై 8.3 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సదరు రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. ఇది పరిమితకాలపు ఆఫర్ అని, ఈ నెలాఖరు వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. గృహ రుణాల జారీలో ముందు వరుసలో ఉన్న ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తమ బ్యాంక్ మాత్రం అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తోందని బ్యాంక్ పేర్కొంది. ఈ వడ్డీ రేటుకు 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే రూ.లక్షకు రూ.755 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. రుణ ప్యాకేజీలో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందిస్తున్నామని చెప్పింది. సోలార్ ప్యానెల్స్‌కు.. సంప్రదాయ గృహ రుణాలతో పాటు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్‌కు సైతం రుణాలు అందిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. 7 శాతం వడ్డీకే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజూ లేకుండా ఈ తరహా రుణాలు అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. గరిష్ఠంగా 120 నెలలకు గానూ ప్రాజెక్ట్ వ్యయంలో 95 శాతంగా రుణం పొందొచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.78 వేలు సబ్సిడీ సైతం పొందొచ్చని వివరించింది. గమనిక: ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు మార్చి 30, 31న పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం.. -
హోమ్‌లోన్‌పై గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రుణాలు
HDFC Bank Home Loans : దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్ లోన్‌పై గుడ్‌న్యూస్ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్’ పేరిట ఓ లోన్‌ను ఏప్రిల్‌లో, హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. హోమ్ సేవర్ ప్రొడక్ట్ అనేది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్బీఐ అందిస్తున్న మ్యాక్స్గెయిన్ హోమ్ లోన్ స్కీమ్‌కి పోటీగా దీన్ని భావించవచ్చు. ఇక హోమ్ రీఫర్బిష్మెంట్ లోన్ విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ లోన్‌ను అందించేది. ఇప్పుడు ఈ లోన్‌ను త్వరలో పునఃప్రారంభిస్తున్నారు. ఈ రెండు లోన్లు ఇప్పటికే ఉన్న కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు అందించనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్టగేజ్ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే బ్యాంకు గృహ రుణాలపై వసూలు చేసే రేటు కంటే హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుతో లింక్ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా ఇప్పటివరకూ ఉన్న హెచ్డీఎఫ్సీ సర్వీస్ సెంటర్లను దశలవారీగా బ్యాంక్ బ్రాంచ్‌లుగా మార్చబోతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. -
ఇంటి రుణం.. భారం దింపుకుందాం
గృహ రుణం.. రెండేళ్ల క్రితం వరకు ఇల్లు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా కనిపించిన సాధనం. కేవలం 6.7 శాతం వార్షిక రేటుపై ఇంటి కొనుగోలుకు రుణం లభించింది. కానీ, స్థూల ఆరి్థక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆర్బీఐ కీలక రేటును 2022 మే నుంచి 2.5 శాతం మేర పెంచింది. ఫలితంగా గృహ రుణం రేట్లు 9.5–10 శాతానికి చేరాయి. దీంతో అప్పటికే ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ భారంగా మారింది. 15 ఏళ్ల కనిష్టాలకు చేరిన గృహ రుణ రేట్లు ఒక్కసారిగా భారంగా మారాయి. ఆ తర్వాత ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి కొంత మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా కఠినతర ద్రవ్య విధానం దాదాపు చివరి దశకు చేరింది. దీంతో వడ్డీ రేట్ల పెంపు సైతం ముగింపునకు వచ్చేసిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్బీఐ సైతం రేట్ల యథాతథ స్థితినే కొనసాగిస్తోంది. అయినా కానీ, వడ్డీ రేట్ల తగ్గింపునకు మరికొన్ని త్రైమాసికాలు వేచి చూడాల్సి రావచ్చని భావిస్తున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్ల పెంపు భారాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. ఈ తరుణంలో ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో బ్యాలన్స్‌ను మరో రుణదాతకు బదిలీ చేసుకోవడం ఒకటి. దాని గురించి వివరించే కథనం ఇది... ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి ప్రస్తుత ఈఎంఐ భారంగా అనిపిస్తే, అప్పుడు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఇతర సంస్థలతో పోలిస్తే మీ బ్యాంక్ అధిక రేటు వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే కనుక, అప్పుడు దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఇలా మిగిలి ఉన్న రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకునే ముందు, ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ, ఇందుకు అయ్యే చార్జీలు, అసలు బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంత మేర? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. ఫ్లోటింగ్ రేటు విధానంలో రేట్లను ఎలా నిర్ణయిస్తారనేది కూడా తెలుసుకోవాలి. రేట్ల విధానాలు.. గృహ రుణంపై ఫిక్స్డ్ (స్థిర), ఫ్లోటింగ్ (అస్థిర) రేట్ల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్ రేటు రుణాలు ఆర్బీఐ కీలక రేట్ల సవరణకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఫిక్స్డ్ రేట్ విధానంలో నిరీ్ణత కాలం పాటు రుణంపై ఒకటే రేటు కొనసాగుతుంది. కనుక ఫ్లోటింగ్ రేట్ రుణాలతో పోలిస్తే ఫిక్స్డ్ రేట్ రుణాలపై వడ్డీ రేటు 1.5–2 శాతం వరకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక శాతం గృహ రుణాలు ఫ్లోటింగ్ రేట్ విధానంలోనే ఉంటున్నాయి. ఆర్బీఐ 2016లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులపై అయ్యే వ్యయంతోపాటు, జీ–సెక్ ఈల్డ్స్, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ తదితర అంశాలు ఈ విధానంలో రేట్లను ప్రభావితం చేస్తాయి. బ్యాంక్ సొంతంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంసీఎల్ఆర్ విధానంలో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ అంటే క్లుప్తంగా నిధులపై బ్యాంక్‌లకు అయ్యే వ్యయం. దీనికి అదనంగా తనకు కావాల్సిన మార్జిన్‌ను బ్యాంక్ జోడించి రుణాలపై రేటును నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రేట్లను మార్చినప్పుడు ఎంసీఎల్ఆర్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, వెంటనే కాదు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటుంది. ఎంసీఎల్ఆర్లో ఒక్క రెపో రేటు కాకుండా, ఇతర అంశాలు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. నిజానికి ఎంసీఎల్ఆర్ విధానం అంత పారదర్శకమైనది కాదు. రిటైల్ రుణ గ్రహీతలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఈ లోపాలను అధిగమించేందుకు వీలుగా ఆర్బీఐ 2019లో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రవేశపెట్టింది. రుణం బదిలీతో ఆదా ఎంత? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా బ్యాంక్‌లు గృహ రుణాలపై ఈఎంఐని పెంచడానికి బదులు, రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. దాంతో ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో ఇబ్బందేమీ లేదన్నట్టు వ్యవహరించరాదు. ప్రస్తుత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో మెరుగైన డీల్ కోసం సంప్రదించాలి. సానుకూల స్పందన రానప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని మరో బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. బ్యాలన్స్ బదిలీకి సంబంధించి అర్హత ఉందా? అన్నది తెలుసుకోవాలి. బ్యాలన్స్ బదిలీకి అనుమతించే విషయంలో కొన్ని బ్యాంక్‌లు, పూర్వపు సంస్థ వద్ద కనీసం 24 నెలల పాటు అయినా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించిన చరిత్రను అడుగుతున్నాయి. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, లేదా స్వా«దీనం చేసిన ఇళ్లకు సంబంధించి రుణం బ్యాలన్స్ బదిలీకే బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటికి అదనంగా వేతనం, క్రెడిట్ స్కోర్ కూడా కీలకమవుతాయి. ముఖ్యంగా మిగిలిన రుణాన్ని, తక్కువ వడ్డీ రేటుకు ఆఫర్ చేస్తున్న మరో సంస్థకు బదిలీ చేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకుందామని భావించే వారు.. అసలు ఎంత ఆదా అవుతుందన్న దానిపై అంచనాకు రావాలి. ఉదాహరణకు రూ.75 లక్షల రుణం, 20 ఏళ్ల కాలానికి మిగిలి ఉందని అనుకుందాం. 9.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా దీని ఈఎంఐ రూ.69,910 అవుతుంది. ఈ రుణాన్ని బదిలీ చేసుకుంటే, కొత్త సంస్థ 9.1 శాతం రేటుకు ఆఫర్ చేసిందనుకుంటే, అప్పుడు ఎంతో ఆదా అవుతుంది. కొత్త సంస్థ వద్ద 9.1 శాతం రేటు ప్రకారం ఇదే రుణంపై ఈఎంఐ రూ.67,963 అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రూ.4,67,280 ఆదా అవుతుంది. ఇది ఏడు నెలల ఈఎంఐకి సమానం. అంటే రుణం ఏడు నెలల ముందే తీరిపోతుంది. మరో సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఇలా ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత పెరిగిన ఆదాయం, మెరుగుపడిన క్రెడిట్ స్కోర్, మెరుగైన చెల్లింపుల చరిత్ర ఆధారంగా కొత్త సంస్థ తక్కువ రేటుకు ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. వడ్డీ రేటు ఎంత తగ్గితే ఆదా అయ్యే మొత్తం అధికంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తక్కువ రేట్లకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. 0.25–0.50 శాతం మేర వడ్డీ తక్కువగా ఉండి, రుణ చెల్లింపుల కాలం మరో 15 ఏళ్లు అయినా ఉంటే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. 2024 మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గితే, అప్పుడు ఈఎంఐ భారం మరింత దిగొస్తుంది. రూ. 20,000 వరకు చార్జీలు రుణ బదిలీలకు సంబంధించి న్యాయపరమైన, సాంకేతిక మదింపు చార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇవి రూ.5,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటాయి. కొన్ని బ్యాంక్‌లు విడిగా పేర్కొనకుండా, ఈ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజులో కలిపేస్తున్నాయి. కనుక చార్జీల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇక మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (ఎంవోడీటీ) గురించి కూడా తెలుసుకోవాలి. రుణ గ్రహీత తన ఇంటి డాక్యుమెంట్లను రుణదాతకు స్వా«దీనం చేయడం. రుణం ఇచ్చే సంస్థ తన పేరిట ఆ ప్రాపరీ్టని రిజి్రస్టేషన్ చేయించుకుంటుంది. ఇందుకు అయ్యే చార్జీలను రుణ గ్రహీత భరించాల్సి వస్తుంది. ఈ చార్జీలు రుణంలో 0.1–0.2 శాతంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి తగ్గింపు రాదు. సుమారు రూ.75 లక్షల గృహ రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసుకుంటున్నారని అనుకుంటే, ఇందుకోసం పలు రకాల చార్జీల రూపంలో రూ.62,500 వరకు కోల్పోవాల్సి వస్తుంది. లీగల్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల్లో తగ్గింపు పొందడం ద్వారా ఈ భారాన్ని వీలైనంత తగ్గించుకోవచ్చు. పారదర్శక.. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఎంతో పారదర్శకమైనది. రెపో రేట్‌కు బ్యాంక్‌లు తమకు కావాల్సిన మార్జిన్‌ను కలిపి రుణాలపై రేట్లను నిర్ణయిస్తాయి. దీంతో రుణ గ్రహీతలు సైతం సులభంగా అర్థం చేసుకోగలరు. రెపో రేటు పెరిగి, తగ్గినప్పుడు తమపై పడే భారం ఎంతన్నది సులభంగా తెలుసుకోగలరు. అంతేకాదు రేట్ల విధానం సులభంగా ఉండడంతో, ఆర్బీఐ రెపో రేటును సవరించిన వెంటనే బ్యాంక్‌లు రుణ గ్రహీతలకు దాన్ని బదలాయిస్తాయి. సాధారణంగా ఆర్బీఐ రెపో రేటు సవరణ అనంతరం వారం నుంచి నెల రోజుల వ్యవధిలో ఆర్ఎల్ఎల్ఆర్ రుణాల రేట్లు మార్పులకు లోనవుతాయి. రెపో రేటు విధానంలో.. వడ్డీ రేట్లు తగ్గించడం, పెంచడం వేగంగా జరుగుతుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఆ భారం వెంటనే రుణ గ్రహీతలకు బదలాయింపు అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ విధానంలో బ్యాంక్‌లు సాధారణంగా రెపో రేటుపై 2.5–3 శాతాన్ని తమ మార్జిన్ కింద చార్జ్ చేస్తుంటాయి. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంక్‌లు 9.5–10 శాతం వసూలు చేస్తున్నాయి. రెపో రేటు 6.5 శాతంపై 3–3.5 శాతం మార్జిన్‌గా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్బీఎఫ్సీలు అయితే 10.5 శాతం వరకు చార్జ్ చేస్తున్నాయి. అయితే, ఇదే రేటు అందరికీ ప్రామాణికంగా అమలవుతుందని చెప్పలేం. రుణం మొత్తం, కాల వ్యవధి, క్రెడిట్ స్కోర్ తదితర అంశాలు కూడా రేటుపై ప్రభావం చూపిస్తాయి. రేట్ల అస్థిరతలు పెద్ద పట్టింపు కాదంటే, రిటైల్ రుణ గ్రహీతలకు ఎంసీఎల్ఆర్ కంటే ఆర్ఎల్ఎల్ఆర్ రేటు అనుకూలంగా ఉంటుంది. చార్జీల పట్ల అవగాహన ఫిక్స్డ్ వడ్డీ రేటు విధానంలో రుణం తీసుకున్న వారు, మరో సంస్థకు దాన్ని బదిలీ చేసుకోవడం ఖరీదైన వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రుణం ఇచి్చన సంస్థ మిగిలి ఉన్న రుణాన్ని బదిలీ చేసేందుకు గాను, ఆ మొత్తంపై 2–4 శాతం వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. అదే ఫ్లోటింగ్ రేట్ విధానంలో రుణం తీసుకుని ఉంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపుల రుసుములు లేకుండా మిగిలి ఉన్న రుణాన్ని మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి బదిలీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపుల చార్జీలను ఆర్బీఐ నిషేధించింది. అయితే రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవాలంటే రుణ గ్రహీత కొన్ని రకాల చార్జీలు భరించాల్సి వస్తుంది. అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. రుణంపై (బదిలీ చేసుకునే మొత్తం) 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా బ్యాంక్‌లు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. నూతన తరం బ్యాంక్‌లు, కొన్ని ఎన్బీఎఫ్సీలు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నాయి. కాకపోతే అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో ఒకే మాదిరి చార్జీలు ఉంటాయని అనుకోవద్దు. కనుక ఆయా సంస్థల వెబ్సైట్లకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నేరుగా సంప్రదింపులు చేయడం ద్వారా చార్జీల భారం లేకుండా చూసుకోవచ్చు. బదిలీ చేస్తే అయ్యే వ్యయాలు బదిలీ రుణం :రూ.75 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు రుణంపై: 0.3–3% వరకు లీగల్ ఫీజు :రూ.5,000–20,000 ఎంవోటీడీ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం ఫ్రాంకింగ్ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం -
సొంతింటి రుణానికి ప్రభుత్వ వడ్డీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీ రామారావు అన్నారు. డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి పథకాలతో సమాంతరంగా మధ్యతరగతి వారి కోసం ఓ సరికొత్త పథకానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. బ్యాంకు రుణంతో 1,200 నుంచి 1,500 చదరపు అడుగుల మధ్య ఇల్లు కొనుగోలు చేసే వారి బ్యాంకు వడ్డీని ప్రభుత్వమే కట్టేలా ఈ పథకం ఉండే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ ఆధ్వర్వంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాతో, ఎన్నికలకు మరొక ఏడాది పోగా నికరంగా ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలించామని.. ఈ తక్కువ సమయంలో ప్రజలకు కనీస అవసరాలు మాత్రమే తీర్చగలిగామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సృజనాత్మకత కార్యక్రమాల అమలులో చిన్న చిన్న సమస్యలు ఎదురవడం సర్వసాధారణమేనని, అలాంటిదే ధరణి అని కేటీఆర్ చెప్పారు. గతంలో లంచం ఇవ్వకుండా రిజి్రస్టేషన్ జరిగేది కాదని, కానీ, ఇప్పుడు ధరణితో పారదర్శకంగా ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతున్నాయని తెలిపారు. ధరణికి సమస్యలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి చెప్పారు. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి అయినా ఒక గంటలో హైదరాబాద్ చేరుకునేలా ఒక రవాణా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హరిత భవనాలు, పునరుత్పాదక విద్యుత్‌కు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల షటిల్ సరీ్వస్‌లతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అర్బన్ పార్క్‌లను పెంచుతామన్నారు. అహంకారం కాదు.. చచ్చేంత మమకారం ప్రతిపక్షాలు మాకు అహంకారం అంటూ ప్రజలకు సంబంధం లేని అంశాలను చూపి తిడుతున్నాయని, తెలంగాణపై తమకుంది అహంకారం కాదని, చచ్చేంత మమకారమని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్‌ది సోషల్ మీడియాలో హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ లేదని విమర్శించారు. డిసెంబర్ 3న మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పారీ్టల్లో నిర్ణయాలు ఢిల్లీలో తీసుకోవాల్సి ఉంటుందని, సీఎం పీఠం కోసం కొట్లాడకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంతో నే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రెండున్నర దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతంపై ప్రభావం చూపిన నేతలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ అని అన్నారు. బాబు ఐటీ అభివృద్ధికి, రాజశేఖర్ రెడ్డి పేదల అభ్యు న్నతి కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఐటీ సహా పేదల వరకు అన్ని రంగాల వృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. -
Jio financial services: ఇకపై రిలయన్స్ జియో డెబిట్ కార్డులు!
రిలయన్స్ జియో టారిఫ్ పరంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో అదే రంగంలోని కొన్ని కంపెనీలు కుదేలయ్యాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. రిలయన్స్ ఫైనాన్షియల్ మార్కెట్లోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను సంస్థ రీలాంచ్ చేసింది. త్వరలో డెబిట్ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్లోన్లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్‌ను సైతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం చేస్తోంది. -
ఎస్బీఐ గుడ్‌న్యూస్, హోంలోన్ ఆఫ్ర్ పొడిగింపు, ఇక కార్ లోన్లపై..!
SBI Festive Offer: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.పండుగ సీజన్లో కార్ లోన్ తీసుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా కారు కనాలనుకునే కస్టమర్ల లోన్లపై తాజా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ఆఫర్ 2024, జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. హోమ్లోన్లపై రాయితీ పొడిగింపు అంతేకాదు హోమ్లోన్లపై అందిస్తున్న రాయితీని పొడిగించింది. గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల (bps) తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆఫర్నురానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో పొడిగించింది. డిసెంబరు 2023 దాకా తగ్గింపు వడ్డీరేట్లు వర్తిస్తాయిని బ్యాంకు వెల్లడించింది. (ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా) సంవత్సరానికి ఆటో రుణంపై బ్యాంకు MCLR రేటు 8.55 శాతం. గ్రీన్ కార్ లోన్ (ఎలక్ట్రిక్ వెహికల్) 9.65 శాతం నుండి 9.35 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. కస్టమరల క్రెడిట్ స్కోర్లు , విభిన్న కాలవ్యవధుల ప్రకారం వివిధ కార్ లోన్ రేట్లు నిర్ధారిస్తుంది. అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకు పేర్కొంది. కారు లోన్ కోసం గరిష్ట కాలవ్యవధి 7 సంవత్సరాలు. కారు ఆన్-రోడ్ ధరమొత్తంలో 90 శాతం వరకు రుణం ఇవ్వవచ్చు.ఈ లోన్ ద్వారా కొత్త ప్యాసింజర్ కారు, మల్టీ యుటిలిటీ వెహికల్ , SUVని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ ప్రీపేమెంట్ చేయాలనుకుంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపు ఛార్జీ తీసుకోబడదు. అలాగే ఏడాది తరువాత త కస్టమర్‌పై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీ ఉండదు. కారు రుణాలపై పరిమిత కాల వ్యవధిలో అందిస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ పొందాలంటే కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) అవసరమైన పత్రాలు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఫారం 16, ఐడీ కార్డు (పాన్ ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) లాంటివి ఇవ్వవచ్చు. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ ఎలా పొందాలి? ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ తీసుకోవడానికి, బ్యాంకు యాప్ యోనోకులాగిన్ అవ్వాలి. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అక్కడ మీ వివరాలను ధృవీకరించడంతోపాటు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ వస్తుంది దీన్ని సంబంధిత బ్యాంకు శాఖలో సమర్పించాలి. Make your festive season more joyful by driving home your dream car with amazing Car Loan deals!#SBI #CarLoan #FestiveOffers pic.twitter.com/MEAmMEAZJx — State Bank of India (@TheOfficialSBI) September 23, 2023 -
ఎస్బీఐలో హోమ్‌లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా?
ముంబై: నివాసిత ప్రాజెక్టులకు రుణాలివ్వాలంటే, పైకప్పులపై సోలార్ విద్యుదుత్పత్తి పరికరాల (సోలార్ ఇన్‌స్టాలేషన్స్) ఏర్పాటు నిబంధన అమలు చేయాలని ఎస్బీఐ భావిస్తోంది. జూన్ చివరికి ఎస్బీఐ గృహ రుణాల పుస్తకం రూ.6.3 లక్షల కోట్లుగా ఉంది. మా గ్రీన్ ఫండ్స్ (పర్యావరణ అనుకూల నిధి) నుంచి రుణ సాయం పొందే బిల్డర్లు రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను తప్పనిసరి చేయనున్నట్టు ఎస్బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. గృహ రుణ దరఖాస్తులకు దీన్ని అనుబంధంగా (బండిల్) జోడించనున్నట్టు చెప్పారు. ఈ రుణాలు 10–20 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. ఈ రుణాలపై బ్యాంక్‌లు ఫారెక్స్ రిస్క్‌ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. -
ఆర్బీఐ కొత్త రూల్స్ : హోమ్‌లోన్‌పై రూ. 33 లక్షల వరకు ఆదా
హోమ్ లోన్ ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. ఆర్బీఐ అమల్లోకి తేనున్న కొత్త రూల్స్‌తో ఇంటి రుణాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫలితంగా రూ.50 లక్షల హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ రూ.33 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది. గత ఏడాది ఆర్బీఐ వరుస వడ్డీ రేట్ల పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, వడ్డీ రేటు పెరిగినప్పుడు కస్టమర్లు నెలవారీ చెల్లించే ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం నుంచి కాపాడేందుకు బ్యాంకులు టెన్యూర్ కాలాన్ని పెంచుతున్నాయి. అయితే, కొన్నిసార్లు ఈ పొడిగింపులు ఎక్కువ కాల కొనసాగడంతో రుణాలు చెల్లించే సమయంలో రుణ గ్రహితలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో రుణగ్రహీతల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, హోమ్లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొన్ని రీపేమెంట్ నిబంధనలను రూపొందించింది . ఇందులో కొత్తదనం ఏమిటి? ఇది గృహ రుణ గ్రహీతలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? హోమ్లోన్లపై ఆర్బీఐ కొత్త ఆదేశాలు, చోటు చేసుకున్న మార్పులు అయితే ఆగస్టు 18,2023న విడుదల చేసిన నోటిఫికేషన్లో హౌస్‌లోన్ తీసుకున్న రుణదాతలు ఈఎంఐని పెంచడానికి లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను రీసెట్ చేసే సమయంలో రెండు ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. 1) ఈఎంఐ/టెన్యూర్..ఇలా రెండింటిలో మార్పుకు దారితీసే బెంచ్‌మార్క్ రేట్లలో మార్పుల్ని, వాటి ప్రభావాల్ని బ్యాంకులు ఇంటి రుణాలు తీసుకునే రుణగ్రహీతలకు తెలియజేయాలి. 2) వడ్డీ రీసెట్ సమయంలో, రుణగ్రహీతలకు స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశం ఇవ్వాలి. ఫ్లోటింగ్ నుండి ఫిక్స్‌డ్‌కి మారడానికి వర్తించే అన్ని ఛార్జీలు లోన్ ప్రాసెసింగ్ సమయంలో వెల్లడించాలి. 3) రుణ గ్రహీతలకు లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా ఈఎంఐలలో మెరుగుదలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. 4) రుణదాతలు ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ టెన్యూర్ కాలాన్ని పొడిగించడం వల్ల ప్రతికూల ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. అంటే రుణాలు తీసుకునే సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు రుణాలకు సంబంధించిన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. గృహ రుణాలపై కొత్త ఆర్బీఐ నియమం: ఇది రుణ గ్రహితలకు ఎలా ఉపయోగపడుతుంది? ఉదాహరణకు మీరు 2020లో 20 సంవత్సరాలకు (240 నెలలు) 7% వడ్డీతో రూ. 50 లక్షల గృహ రుణాన్ని ఈఎంఐ చెల్లించడం ప్రారంభించారు అని అనుకుందాం. లోన్ తీసుకునే సమయంలో మీ నెలవారీ ఈఎంఐ నెలకు రూ. 38,765. మొత్తం వడ్డీ రూ.43.04 లక్షలు. మూడేళ్ల తర్వాత వడ్డీ రేటు 9.25%కి పెరిగిందనుకుందాం. కొత్త ఆర్బీఐ ఆదేశం ప్రకారం, బ్యాంకులు మీ ఈఎంఐ లేదా టెన్యూర్ కాలాన్ని పెంచుకోవడానికి లేదా వడ్డీ రేటును రీసెట్ చేసేటప్పుడు పైన పేర్కొన్న రెండు ఆప్షన్లను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలి. మీరు మీ 20 సంవత్సరాల లోన్‌ను మిగిలిన 17 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటే (3 సంవత్సరాలు గడిచినందున), మీ ఈఎంఐ నెలకు రూ. 44,978కి పెరుగుతుంది. మీరు లోన్ టెన్యూర్ ముగిసే సమయానికి మొత్తం రూ. 55.7 లక్షల వడ్డీ చెల్లించుకోవచ్చు. అయితే, మీరు మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాలనుకుంటే మీ లోన్ ఈఎంఐ రూ. 38,765 చెల్లిస్తే.. అదే లోన్ 321 నెలలు లేదా 26 సంవత్సరాల 10 నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. లోన్ గడువు ముగిసే సమయానికి మీ మొత్తం వడ్డీ చెల్లింపు రూ. 88.52 లక్షలు అవుతుంది. ఈ సందర్భంలో మీరు అధిక ఈఎంఐకి బదులుగా ఈఎంఐ టెన్యూర్ కాలాన్ని పెంచుకుంటే మీరు రూ. 33 లక్షల అదనపు వడ్డీ చెల్లించకుండా ఉపశమనం పొందే అవకాశం లభిస్తుంది. మీరు హోమ్ లోన్ ఈఎంఐని పెంచాలా లేదా ఈఎంఐ చెల్లించే టెన్యూర్ కాలాన్ని పొడిగించాలా? వడ్డీ రేటు పెరిగినప్పుడు, గృహ రుణగ్రహీత ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ కాలాన్ని ఎంపిక చేసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. (Disclaimer: హోమ్లోన్ల గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. రుణ గ్రహితలకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు తీసుకోవాలనుకుంటున్న హోమ్లోన్లు, ఇతర లోన్లపై సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం విత్‌డ్రా.. ఎలాగో తెలుసా?
హోమ్ లోన్ (home loan) వడ్డీ భారం భరించలేకపోతున్నారా.. ముందస్తుగా చెల్లించేందుకు డబ్బు కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. మీ పీఎఫ్ ఖాతా (PF Account) లోంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీ లోన్ చెల్లించేయండి. ఇందుకోసం అత్యధికంగా నగదు విత్‌డ్రా (PF withdraw) చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) కల్పిస్తోంది. అయితే ఇది లాభదాయకమా.. కాదా? అన్నది ఆలోచించుకోవాలి. వడ్డీ రేటు, వయసు కీలకం హోమ్ లోన్ వడ్డీ రేటు.. ఈపీఎఫ్ చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసి ఈ మొత్తంతో రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. అయితే భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. అయితే కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వారు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకుని లోన్ చెల్లించవచ్చు. ఎందుకంటే డబ్బును కూడబెట్టుకోవడానికి వీరికి చాలా కాలం ఉంటుంది. (ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు) 90 శాతం వరకు.. గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్ మొత్తంలో గరిష్టంగా 90 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతిస్తుంది. అయితే ఇందుకోసం 10 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. జాతీయ బ్యాంకులు, రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్, నేషనల్ హౌసింగ్ బోర్డ్ వంటి సంస్థల నుంచి హోమ్ తీసుకుని ఉండాలి. హోమ్ లోన్ రీపేమెంట్ స్కీమ్ కింద ఈపీఎఫ్ఓ సభ్యులు వారి ఖాతా నుంచి ఈఎంఐలు కూడా చెల్లించవచ్చు. ఇదీ ప్రాసెస్.. ➤ EPFO e-service పోర్టల్‌కు లాగిన్ చేయండి. ➤ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ➤ ఆన్లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి. ➤ ఫారం 31 ద్వారా క్లెయిమ్ చేయండి. ➤ మీ బ్యాంక్ వివరాలను ధ్రువీకరించండి. ➤ డబ్బు ఉపసంహరణకు కారణాన్ని ఎంచుకోండి. ➤ సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. అత్యవసరమైతేనే డ్రా చేయండి చాలా అవసరం అయితే తప్ప పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయకూడదని మనీ మేనేజ్మెంట్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ చెల్లిస్తోంది.పీఎఫ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తే, రిటైర్మెంట్ ఫండ్‌పై అంత పెద్ద ప్రభావం పడుతుంది. పీఎఫ్ ఖాతాలో ఎంత జమవుతుంది? నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు తమ జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేయడం తప్పనిసరి. అదే సమయంలో కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్‌లో ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మిగిలిన 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లో జమవుతుంది. -
ఎస్బీఐ బంపరాఫర్..సిబిల్ స్కోర్ తక్కువుగా ఉన్నా ‘పండగ చేస్కోండి’
ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపెయిన్‌లో భాగంగా హొమ్లోన్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎస్బీఐ బ్యాంకులో ఇంటి రుణం తీసుకోలేకపోయిన వారికి, లేదంటే కొత్తగా లోన్ తీసుకోవాలనుకునేవారికి తాజా నిర్ణయం భారీగా లబ్ధి చేకూరనుంది. క్రిడెట్ కార్డు ఉండి సిబిల్ స్కోర్ (151- 200) తక్కువగా ఉన్న వారికి, లేదంటే అసలు క్రెడిట్ స్కోర్ లేని కస్టమర్లకు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హోం లోన్లు,టాప్-అప్ లోన్లపై గరిష్ఠంగా 65 బేసిస్ పాయింట్ల వరకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. సిబిల్ స్కోర్ 750కి పైగా ఉంటే సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎస్బీఐ బ్యాంకు నిర్వహించే ఈ క్యాంపెయిన్‌లో సిబిల్ స్కోర్ 750పైగా ఉన్న వారికి 55 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అంటే వడ్డీ రేట్లు 8.60 శాతానికి పొందవచ్చు. సిబిల్ స్కోర్ 700- 749 ఉంటే ఇప్పటికే అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయాలనుకున్న, లేదంటే ఉన్న ప్రాపర్టీని అమ్మాలనుకునే వారి సిబిల్ స్కోర్ 700 పైగా ఉంటే పైన పేర్కొన్న రాయితీల కంటే అదనంగా 20 బేసిస్ పాయింట్ల మేర రాయితీలు పొందవచ్చు. అంటే క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 8.40 శాతానికి, 700 - 749 మధ్య ఉంటే 8.50 శాతానికి హోం లోన్లను సొంతం చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ 700-749, 151-200 (టాప్-అప్ లోన్స్)ఉంటే టాప్-అప్ లోన్స్ పొందాలనుకునే కస్టమర్ల సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 45 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ పొందవచ్చు. 9.10 శాతంతో టాప్-అప్ లోన్లు తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 700-749, 151-200 ఉన్న ఖాతాదారులు 45 బేసిస్ పాయింట్ల వరకు కన్సెషన్ అందిస్తుంది. అంటే 9.30 శాతానికి ఈ టాప్-అప్‌లోన్ ఇస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ బ్యాంకు వెబ్సైట్ ప్రకారం.. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, టేకోవర్ లోన్లతో అనుబంధించబడిన టాప్-అప్ లోన్లకు (క్రెడిట్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉంటే) పైన ప్రతిపాదించబడిన రేట్ల కంటే బ్యాంకు 20 బేసిస్ పాయింట్ల వరకు రాయితీని ఇస్తుంది. టాప్-అప్ లోన్లు అంటే ఇప్పటికే తీసుకున్న హోమ్ లోన్పైఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆర్థిక సంస్థలు అందించే అదనపు లోన్‌ను టాప్-అప్ లోన్ అంటారు. బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తాయి. అత్యవసర సమయాల్లో వీటిని కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఖాతాదారులు తమ గృహ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే వీలు ఉంటుంది. హోమ్లోన్లపై వడ్డీ రేట్లు టాప్-అప్లోన్లపై వడ్డీ రేట్లు -
బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. లోన్ ప్రాసెసింగ్ నిబంధనల్లో మార్పులు
హోం లోన్, టూ వీలర్‌లోన్ తీసుకున్న వారికి భారీ ఉపశమనం కలిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ సిబిల్ స్కోర్ 700పైన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని షరతు విధించింది. ఆగస్టు 16, 2023 నుంచి నవంబర్ 15, 2023 మధ్య కాలానికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతే కాదు, ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి గృహ రుణాలను తీసుకునేందుకు సైతం ఈ ఆఫర్‌ను పొడిగించారు. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-2023 ఆర్థిక సంవత్సరానికి రూ.2022,23 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అత్యధిక డివిడెండ్ ఇదేనని బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. -
ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్? వచ్చే ఏడాది వరకు తప్పదంట
సొంతింటి కలల్ని నిజం చేసుకోవాలనుకునేవారికి, లేదంటే ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ ( equated monthly interest) చెల్లించే వారికి ఆర్బీఐ భారీ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రుణ గ్రస్తులు హోంలోన్లపై కడుతున్న ఈఎంఐలు వచ్చే ఏడాది మార్చి వరకు తగ్గవని సమాచారం. అప్పటి వరకు రెపోరేటు (ప్రస్తుతం 6.50 శాతం) అలాగే కొనసాగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల, ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఎకనమిస్ట్ సర్వే నిర్వహించింది. స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎక్కువ వడ్డీ రేట్లు మార్చి 2024వరకు కొనసాగనున్నాయని సర్వేలో ఆర్ధిక వేత్తలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగు నెలల తగ్గుదల ధోరణి కనిపించినప్పటికీ పెరిగిన ఆహార ధరల కారణంగా ద్రవ్యోల్బణం గత నెలలో 4.81 శాతానికి పెరిగింది. కొనసాగనున్న రెపోరేటు జూన్ సర్వేలో,ఆర్బీఐ మార్చి 2024 చివరి నాటికి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. మొదటి రేటు తగ్గింపు 2024 రెండవ త్రైమాసికం వరకు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల కొనుగోలుదారులకు ఇబ్బందే హోం లోన్ ఈఎంఐ చెల్లిస్తుంటే 2024 వరకు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్బీఐ ప్రస్తుత రెపో రేటును కొనసాగిస్తున్నంత కాలం, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు, ఫలితంగా రుణగ్రహీతలకు ఎంఎంఐల భారం తగ్గదు. రెపో రేట్ల తగ్గింపు ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉండవు. కాబట్టే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయని భావిస్తున్నా’ అని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ సుమన్ చౌధరి అన్నారు. -
అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్
సాక్షి, సిటీబ్యూరో: హరిత భవనాలను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒకడుగు ముందుకేసింది. సాధారణ గృహ రుణ గ్రహీతలతో పోలిస్తే హరిత గృహ కొనుగోలుదారులు 5 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందుకోవచ్చని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జీఎం, బ్రాంచ్ హెడ్ రాజేష్ కుమార్ తెలిపారు. అంటే ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.50 శాతంగా ఉండగా.. హరిత గృహ రుణాలకు వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే వడ్డీ రేటు 8.45 శాతంగా పడుతుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 527 ప్రాజెక్ట్ డెవలపర్లతో ఎస్బీఐ గృహ రుణ ఒప్పందం చేసుకుందని.. ఇందులో 75 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ పొందిన ప్రాజెక్ట్లేనని తెలిపారు. అపర్ణా, రాజపుష్ప, మైహోం, గిరిధారి, వాసవి, పౌలోమి, ప్రణవ వంటి నిర్మాణ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్ దేశవ్యాప్తంగా ఎస్బీఐ పోర్ట్‌ఫోలియో రూ.6.5 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో హైదరాబాద్ వాటా రూ.55 వేల కోట్లని చెప్పారు. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.12 వేల కోట్ల గృహ రుణాలు అందించామని.. ప్రస్తుతం నెలకు రూ.1,500 కోట్ల రుణాల చొప్పున రూ.16–18 వేల కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
స్కోర్ కొట్టు... లోన్ పట్టు!
అనుకోకుండా ఖర్చు వచ్చి పడితే ఏం చేయాలో తోచదు. వైద్యం, ఇంటి మరమ్మతులు, వేతనంలో కోత, ఉద్యోగం కోల్పోవడం, స్కూల్ ఫీజు.. అవసరం ఏదైనా వెంటనే డబ్బు కావాల్సి వస్తే.. క్రెడిట్ కార్డు నుంచి పరిమితి మేరకు డ్రా చేసుకుని గట్టె్టక్కేస్తుంటారు. ఇది కాకుండా అందుబాటులో ఉన్న మరో మార్గం వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్). హామీతో పని లేకుండా ఆదాయ వనరు ఉన్న ప్రతి ఒక్కరూ సులభంగా పొందగలిగి రుణం ఇది. దాదాపు అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. వేగంగా ఒకటి రెండు రోజుల్లోనే రుణం మొత్తం చేతికి అందుతుంది. ప్రక్రియ ఎంతో సులభం, అందుకే నేటి రోజుల్లో పర్సనల్ లోన్ సాధనాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణం అయినా, గృహ రుణం అయినా వడ్డీ రేటు విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. దీనివల్ల పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కనీసం ఐదారేళ్ల కాలానికి వ్యక్తిగత రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అన్నేళ్లలో వడ్డీ రూపేణా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అందుకని వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాన్ని పొందే మార్గాలను అన్వేషించాలి. వీటిపై అవగాహన కల్పించే కథనమే ఇది. వ్యక్తిగత రుణం తీసుకునే వారు ముందు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజును పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, వడ్డీ రేటు ఆధారంగా బ్యాంక్‌ను ఖరారు చేసుకోవాలి. ఖాతా ఉన్న బ్యాంకులోనే వ్యక్తిగత రుణం పొందాలనేమీ లేదు. తక్కువ రేటుకు వస్తుంటే ఇతర బ్యాంకుల ఆఫర్లను అయినా పరిశీలించొచ్చు. అయితే తక్కువ రేటుకు వ్యక్తిగత రుణం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇందులో ముందుగా వ్యక్తిగత క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒకవైపు మన వ్యక్తిగత రుణ చరిత్ర బలంగా ఉండేలా (మెరుగైన స్కోర్) చూసుకోవాలి. మరోవైపు తక్కువ రేటుకు వ్యక్తిగత రుణాన్ని ఆఫర్ చేసే బ్యాంక్‌లను గుర్తించాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్నిచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఆ రుణం నమ్మకంగా తిరిగి వస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఉండవు. రిస్క్ దాదాపుగా ఉండదు కనుక తక్కువ రేటుకు ఇస్తాయి. ‘‘వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి తనఖా లేదా హామీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి. కనుక బ్యాంకులు ఎంత రుణం ఇవ్వాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, ఎంత వడ్డీ రేటుకు ఇవ్వాలనే అంశాలను నిర్ణయించే విషయంలో రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. అధిక క్రెడిట్ స్కోరు ఉన్న వారు వడ్డీ రేటు తగ్గించాలంటూ బ్యాంకులను డిమాండ్ చేయవచ్చు’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సూచించారు. (పెళ్లికొడుకు లుక్‌లో జబర్దస్త్‌గా..మస్క్: ఫోటోలు వైరల్) క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను ఉపయోగించుకునే వారు సకాలంలో బిల్లులను చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫాల్ట్ కాకూడదు. అలాగే, రుణం ఏదైనా కానీయండి ఈఎంఐల చెల్లింపుల విషయంలో బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాలి. వీలుంటే ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరిగే ఆప్షన్ నమోదు చేసుకోవాలి. వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తుంటే, అప్పటికే ఉన్న ఇతర రుణాలను తీర్చివేయడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ‘‘మీ క్రెడిట్ కార్డ్ వినియోగ చరిత్ర చాలా సాఫీగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కొన్ని రోజులు కూడా ఆలస్యం చేయొద్దు. ఒకటి రెండు సార్లు సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, అది క్రెడిట్ చరిత్రలో మచ్చగా చేరొచ్చు. అప్పుడు రుణాలిచ్చే సంస్థలు దీన్ని రిస్క్‌గా భావిస్తాయి. రుణ వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది’’ అని ఇన్‌క్రెడ్ రిస్క్ అండ్ అనలైటిక్స్ ప్రెసిడెంట్ పృథ్వీ చంద్రశేఖర్ తెలిపారు. అవగాహన లేక క్రెడిట్ కార్డ్, వాహన, ఇతర రుణ వాయిదాల చెల్లింపుల్లో వైఫల్యం చోటుచేసుకుంటే అది భవిష్యత్తులో వారు తీసుకోబోయే రుణాలపై అధిక రేట్లకు దారితీస్తుందని గమనించాలి. అందుకే బ్యాంక్‌లు రుణ చరిత్రలో మచ్చలు ఉండి, రిస్క్ ఖాతాలుగా భావిస్తే అటువంటి వారికి సాధారణం కంటే అధిక వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తాయి. అదే సమయంలో చెల్లింపుల్లో ఎలాంటి వైఫల్యం లేని, మెరుగైన రుణ చరిత్ర ఉన్న వారికి తక్కువ రేటుకు ఆఫర్ చేస్తాయి. ఆఫర్లు.. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల ఆఫర్లను, రుణ రేట్లు, నియమ, నిబంధనలు, షరతులు అన్నీ చూడాలి. ఆ తర్వాతే ఆకర్షణీయమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలి. ముందుగా వేతన ఖాతా, డిపాజిట్లు ఉన్న బ్యాంకును అడిగి చూడాలి. ఆ తర్వాత వివిధ బ్యాంకుల రుణ రేట్లు, ఇతర ఆఫర్ల సమాచారం పొందొచ్చు. సాధారణంగా బ్యాంకుల వెబ్సైట్లో వ్యక్తిగత రుణాలపై ఫిక్స్డ్ రేటు ప్రదర్శించరు. కనిష్టం నుంచి గరిష్టం రేటును ప్రదర్శిస్తాయి. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి అందులో కనిష్ట రేటుకే రుణం లభించే అవకాశాలున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు ఒక్కటే కాకుండా, కోరుకుంటున్న రుణం మొత్తం, లోన్ టు వ్యాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, ఉద్యోగ స్వరూపం, ఇతర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని పైసా బజార్ సీనియర్ డైరెక్టర్ సని అరోరా తెలిపారు. కొన్ని బ్యాంకులు పండుగలు, ఇతర సమయాల్లో ప్రత్యేక రుణ మేళాలను నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీ రేటుపై రాయితీలు ఇస్తుంటాయి. కనుక వాటిని పరిశీలించొచ్చు. వీలైనన్ని రుణ సంస్థల మధ్య వ్యక్తిగత రుణ ఆఫర్లను పోల్చుకోవాలని అరోరా సూచించారు. ప్రముఖ సంస్థల ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) మార్గాలు.. రుణ చెల్లింపులు సకాలంలో చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రుణ వినియోగ రేషియో కూడా క్రెడిట్ స్కోరు లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే మీకు అందుబాటులో ఉన్న రుణం పరిమితిలో ఎంత వినియోగించుకున్నారనేది. రుణంపై మీరు ఏ మేరకు ఆధారపడుతున్నారో ఇది తెలియజేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. క్రెడిట్ యూసేజ్ రేషియో 30 శాతం లోపు కొనసాగించాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందని అనుకుందాం. అప్పుడు మీ వినియోగం రూ.30 వేల వరకు ఉండాలి. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒకే సమయంలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేస్తుండడం కూ డా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభా వం చూపి స్తుంది. అందుకే ఒకేసారి వెంటవెంట ఒక టికి మించిన క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవద్దు. అంతేకాదు ఒకటికి మించిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద వ్యక్తిగత రుణానికి అభ్యర్థనలు ఇవ్వొ ద్దు. దీనివల్ల ఏకకాలంలో ఒకటికి మించిన క్రెడిట్ అ భ్యర్థనల సమాచారం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుంది. అది క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) వేతన ఖాతా.. ఉద్యోగులకు పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకుల నుంచి మంచి ఆఫర్లు లభిస్తుంటాయి. వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తీసుకోవడం అనుకూలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ వేతన జమ, మీ ఖర్చులు, ఉపసంహరణ వివరాలు ఖాతాలో నమోదై ఉంటాయి. కనుక రుణానికి ముందు బ్యాంక్ అధికారి వాటిని చూసి ఓ అంచనాకు రాగలరు. అందుకే వేతన ఖాతాలున్న వారికి ఇన్స్టంట్ పర్సనల్ లోన్‌ను చాలా బ్యాంకులు డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి తక్కువ రేటుకు రుణం పొందొచ్చు. ‘‘బ్యాంకులు సాధారణంగా తమ ఖాతాదారులకు సంబంధించి నియమ నిబంధనలు, షరతుల విషయంలో కొంచెం అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. అంటే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించడం, వేగంగా మంజూరు చేస్తాయి. సంబంధిత ఖాతాదారుకు సంబంధించి వేతనం, ఇతర వ్యయాల సమాచారం అందుబాటులో ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాన్ని బ్యాంకులు అంచనా వేయగలవు’’అని అప్నా పైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీ స్వామినాథన్ పేర్కొన్నారు. ఇతర చార్జీలనూ చూడాలి.. వ్యక్తిగత రుణంలో ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. రుణంపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందుగా తీర్చేస్తే పడే చార్జీలు తెలుసుకుని నిర్ణయానికి రావాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు రుణం మొత్తంపై 1–3 శాతం మధ్య ప్రాసెసింగ్ ఫీజు విధిస్తున్నాయి. రుణం ముందుగా చెల్లిస్తే విధించే చార్జీలు కూడా బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. అందుకే భవిష్యత్తులో ముందుగా తీర్చివేసే ఉద్దేశం ఉందా అని చూడాలి. వడ్డీ రేటుపై అవగాహన... తక్కువ రేటుపై వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నా.. రుణం కాల వ్యవధిలో వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే చెల్లిస్తుంటారు. ముందుగా బ్యాంకులు రుణంపై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తాయన్నది తెలుసుకోవాలి. ఫ్లాట్ రేటు, లేదా తగ్గింపు రేటును బ్యాంకులు ఆఫర్ చేయొచ్చు. ఫ్లాట్ వడ్డీ రేటు అయితే రుణం కాల వ్యవధి అంతటా అసలు మొత్తం (ప్రిన్సిపల్)పైనే వడ్డీ రేటు అమలవుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణాన్ని 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారనుకోండి. మొత్తం మీద రూ.1,80,000ను వడ్డీ కింద చెల్లించాలి. నెలవారీ ఈఎంఐ రూ.18,889 అవుతుంది. అదే తగ్గింపు వడ్డీ రేటు విధానంలో.. ప్రతీ వాయిదాకు ముందు మిగిలిన ఉన్న బకాయిపైనే వడ్డీ రేటును బ్యాంకులు లెక్కిస్తాయి. రూ. 5 లక్షల రుణాన్ని తగ్గింపు రేటు విధానంలో 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మూడేళ్లలో వడ్డీ రూపేణా రూ.97,858 చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.16,607 అవుతుంది. దీంతో మొత్తం మీద ఈ విధానం వల్ల రూ.82,142 ఆదా అవుతుంది. అందుకే రెడ్యూసింగ్ ఇంటరెస్ట్ రేట్ విధానంలోనే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. పర్సనల్ లోన్‌పై తక్కువ రేటుకు ఇస్తామంటే బుట్టలో పడిపోకుండా.. రుణంపై వడ్డీ రేటును నెలవారీ ఎలా లెక్కిస్తారో అడిగి స్పష్టత తెచ్చుకోవాలి. -
సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?
పదవీ విరమణ తీసుకున్నారు. ఉండడానికి సొంతిల్లు ఉంది. కానీ, పింఛను సదుపాయం లేదు. ఉద్యోగం లేదా సంపాదనా కాలంలో పెద్దగా పొదుపు చేయలేకపోయారు. చేసిన పొదుపు ఇప్పటి జీవన అవసరాలను తీర్చే స్థాయిలో లేదు. అదనపు ఆదాయం కావాలి. ఇందుకోసం వృద్ధాప్యంలో ఏం చేయాలి..? ఇలాంటి సందిగ్ధత ఎదుర్కొనే ప్రతి ఒక్కరి ముందున్న ఆప్షన్ రివర్స్ మార్ట్గేజ్ లోన్. వృద్ధాప్యంలో జీవన అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర సర్కారు 2007లోనే దీన్ని తీసుకొచ్చింది. కానీ, మన దేశంలో అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. దీని గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి ప్రకటనలు ఇవ్వడం గమనించే ఉంటారు. కానీ, ఏ బ్యాంకు కూడా ఎక్కడా రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ గురించి ప్రకటన ఇచ్చినట్టు కనిపించదు. దీనికి కారణం బ్యాంకులకు ఈ ఉత్పత్తిపై ఆసక్తి లేకపోవడమే. వృద్ధాప్యంలో పోషణకు ఎలాంటి ఆదాయం లేని వారిని సొంతిల్లే ఆదుకుంటుంది. ఇంటిని బ్యాంకు తనఖాగా ఉంచుకుని నెలవారీ ఆదాయం సమకూరుస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు, అర్హతలపై మరిన్ని వివరాలు అందించే కథనమే ఇది. ఇది ఎలా పనిచేస్తుంది..? రివర్స్ మార్ట్గేజ్ అంటే నివాస యోగ్యమైన గృహంపై తీసుకునే రుణం. మార్ట్గేజ్ అన్నది ఇంటిని సొంతం చేసుకోవడం కోసం తీసుకునే రుణం. దీనికి విరుద్ధంగా ఇంటిపై రుణం తీసుకునేది కనుక రివర్స్ మార్ట్గేజ్ అని పేరు పెట్టారు. ఇంటి కోసం మార్ట్గేజ్ రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎలా అయితే చెల్లిస్తారో.. రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంక్ కూడా రుణ గ్రహీతకు అదే విధంగా చెల్లిస్తుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఈ రుణానికి అర్హత ఉండదు. సొంతిల్లు, దానిపై సంపూర్ణ హక్కులు ఉన్న వారే దీన్ని తీసుకోగలరు. ఇంటి విలువ ఎంత, అది ఏ ప్రాంతంలో ఉంది? తదితర అంశాలను చూసిన తర్వాత బ్యాంక్‌లు ఎంత రుణం ఇవ్వాలన్నది నిర్ణయిస్తాయి. ఇంటి విలువలో రుణంగా (ఎల్టీవీ) 60 నుంచి 80 శాతం మధ్య నిర్ణయిస్తాయి. రివర్స్ మార్ట్గేజ్ కింద చాలా బ్యాంకులు గరిష్టంగా రూ. కోటి రుణ పరిమితిని అమలు చేస్తున్నాయి. అంటే రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టే ఇంటి విలువ రూ.2 కోట్లు ఉన్నా సరే గరిష్టంగా రూ.కోటి వరకే పొందగలరు. గరిష్టంగా 20 ఏళ్ల కాలానికి రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! రుణాన్ని చెల్లించక్కర్లేదు.. వృద్ధాప్యంలో జీవన అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారని అనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఎలా చెల్లించగలం? అన్న ప్రశ్న రావచ్చు. నిజమే తీసుకున్న రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలనేమీ లేదు. ఉదాహరణకు వినయ్ (62) 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆయన 82 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. కాల వ్యవధి ముగిసింది కనుక ఆ తర్వాత నుంచి బ్యాంక్ ఎలాంటి చెల్లింపులు చేయదు. అయినా, రుణ గ్రహీత అదే ఇంటిలో నిశ్చింతగా నివసించొచ్చు. ఇంటి యజమాని మరణించిన తర్వాతే అది బ్యాంక్ పరం అవుతుంది. ఒకవేళ భార్యా, భర్త జాయింట్‌గా రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకుంటే వారిద్దరి మరణానంతరమే బ్యాంకులకు హక్కులు లభిస్తాయి. రుణ గ్రహీత మరణానంతరం రుణం, దానిపై వడ్డీ బకాయిలు చెల్లించే ఆప్షన్‌ను బ్యాంక్‌లు వారసులకు కల్పిస్తాయి. వారు ముందుకు రాకపోతే అప్పుడు ఆ ఇంటిని బ్యాంక్ వేలం వేస్తుంది. అన్ని బకాయిలు మినహాయించుకుని ఏమైనా మిగిలి ఉంటే వారసులకు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం బకాయిలు తీర్చేంత లేకపోతే, మిగిలినది బ్యాంక్ నష్టం కింద సర్దుబాటు చేసుకుంటుంది. వారసులకు బాధ్యత ఉండదు. చదవండి👉 హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు! రెండు రకాల చెల్లింపులు... రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని రుణ గ్రహీత కోరిక మేరకు బ్యాంక్‌లు రెండు రకాలుగా చెల్లిస్తాయి. ఒకటి ప్రతి నెలా వాయిదాల రూపంలో అందుకోవచ్చు. లేదంటే త్రైమాసికం, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చెల్లింపులు చేస్తుంది. రెండు ఏక మొత్తంలో మంజూరు చేస్తుంది. బ్యాంక్ నుంచి రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఏక మొత్తంలో ఒకే విడత అందుకున్నా లేక నెలవారీ వాయిదాల రూపంలో అందుకున్నా, ఆ మొత్తంపై పన్ను పడదు. ఎందుకంటే ఆదాయపన్ను చట్టం దీన్ని ఆదాయం కింద పరిగణించదు. రుణంగానే భావిస్తుంది. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. చెల్లింపుల మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్ లేదు. ఉదాహరణకు ప్రాపర్టీ విలువ రూ.కోటి ఉందని అనుకుందాం. లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ) 80 శాతం అనుకుంటే అప్పుడు రుణం కింద రూ.80 లక్షలు ఖరారు అవుతుంది. ఇందులో వడ్డీ భాగం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. రూ.80 లక్షలను 8.5 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే, అప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రూ.45 లక్షలు అవుతుంది. రూ.80 లక్షల్లో రూ.45 లక్షలు పోను రూ.35 లక్షలను బ్యాంక్ రుణ గ్రహీతకు చెల్లిస్తుంది. ఇది నెలవారీ చెల్లింపులకు సంబంధించి అనుసరించే విధానం. ఏక మొత్తంలో చెల్లింపులు కోరుకుంటే అప్పుడు లోన్టు వ్యాల్యూలో 50 శాతం లేదా రూ.15 లక్షలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? ఎప్పుడైనా చెల్లించొచ్చు.. రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. కాల వ్యవధి పూర్తి కాక ముందు చెల్లించినా ఎలాంటి చార్జీలు ఉండవు. ‘‘ఒకవేళ మరో బ్యాంక్‌కు రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా పాత బ్యాంకు వద్ద ముందే తీర్చేస్తున్నట్టు అయితే, అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి మొత్తంపై 0.5–2 శాతం మధ్య పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది’’అని మైలోన్‌కేర్ డాట్ ఇన్ సంస్థ సీఈవో గౌరవ్‌గుప్తా తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్లు గతేడాది నుంచి 2.5 శాతం మేర పెరిగాయి. ఇక ఇక్కడి నుంచి పెరుగుదల పెద్దగా ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంతేకాదు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు సర్దుకుని, అనిశ్చితులు తగ్గితే తిరిగి రుణ రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని తీసుకునే వారు వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయని వెనుకాడక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవడానికి అవసరమే ప్రామాణికం. జీవనానికి ఇతరత్రా ఆదాయం లేని వారు, ఉన్నా చాలని వారు, తమ వారసులకు తమ ప్రాపర్టీ అవసరం లేని వారు, మరింత సుఖవంతమైన జీవనం సాగించాలని అనుకునే వారు, అవసరాల్లో రాజీ పడే ఉద్దేశ్యం లేని వారు రివర్స్ మార్ట్గేజ్ రుణానికి వెళ్లొచ్చు. ఎస్బీఐ రివర్స్ మార్ట్గేజ్ రుణంపై రేటును రెపో రేటుతో అనుసంధానిస్తోంది. దాదాపు గృహ రుణం స్థాయిలోనే రేట్లు ఉంటాయి. రెపో రేటుకు అనుసంధానమై ఉండడం వల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వెంటనే అది రుణాలపై ప్రతిఫలిస్తుంది. విలువ మదింపు.. రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా ఉంచిన ఇంటి విలువను బ్యాంక్‌లు ఐదేళ్లకోసారి మదింపు వేస్తుంటాయి. తనఖా పెట్టిన ప్రాపర్టీ విలువ రుణం మంజూరు చేసే నాటి విలువ స్థాయిలోనే ఉందా? పెరిగిందా లేక తగ్గిందా? అన్నది సమీక్షిస్తుంటాయి. ఎందుకంటే రివర్స్ మార్ట్గేజ్ రుణాల్లో ఎక్కువ శాతం ఆయా ప్రాపర్టీలు బ్యాంక్‌ల స్వాధీనం అవుతుంటాయి. రుణం తీసుకున్న వారు లేదా వారి వారసులు తిరిగి చెల్లించే దాఖలాలు తక్కువ. దీంతో బ్యాంక్‌లు తాము ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ బకాయిల వసూలుకు వాటిని వేలం వేస్తుంటాయి. వేలంలో సరైన విలువను పొందేందుకు వీలుగా బ్యాంక్‌లు రిస్క్ కోణంలో ఇలా ప్రాపర్టీ విలువను ఐదేళ్లకోసారి మదింపు వేస్తాయి. కివర్స్ మార్ట్గేజ్ రుణానికి ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులే మెరుగైన ఆప్షన్. సమర్పించాల్సినవి ఇవీ.. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవాలని అనుకునే వారు.. గుర్తింపు, నివాస గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. ప్రాపర్టీ అసలు పేపర్లు, గడిచిన ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, అప్పటికే ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి సంబంధించి చివరి ఏడాది స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. చదవండి👉వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు! ఎందుకు ఆదరణ లేదు..? రివర్స్ మార్ట్గేజ్ గురించి అందరికీ తెలియకపోవడం ఇది పెద్దగా విస్తరించపోవడానికి ఒక కారణం. సాధారణంగా ఇంటితో అనుబంధం ఉంటుంది. అంత సులభంగా దాన్ని తెంపుకోలేరు. తమ గుర్తుగా, వారసత్వంగా పరిగణిస్తుంటారు. బ్యాంకులు దీని గురించి ప్రచారం చేయకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. ఎక్కడా ప్రకటనలు ఇవ్వవు. కనీసం వాటి వెబ్సైట్లలోనూ వివరాలను అందుబాటులో ఉంచవు. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఉదాహరణకు బ్యాంక్ 15 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం ఇచ్చిన తర్వాత.. ఇంటి యజమాని 30 ఏళ్లు జీవించారని అనుకుందాం. అప్పటి వరకు ఆ ఇంటిని బ్యాంకులు ఏమీ చేయలేవు. ఇచ్చిన రుణాన్ని స్వచ్చందంగా చెల్లిస్తే తప్ప అవి వసూలు చేసుకోలేవు. రుణ గ్రహీత చనిపోయే వరకు ఆగాల్సిందే. నివసిస్తున్న ఇల్లు వారసులకు అవసరం లేనట్టయితే అప్పుడు దాన్ని విక్రయించే ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. మంచి విలువ పలికే ప్రాంతంలో ఉంటే విక్రయించి, తక్కువ రేటున్న ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మార్గం. ఈ రూపంలో మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాల్లోకి మళ్లించుకుని ప్రతి నెలా ఆదా యం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి👉 మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ►60 ఏళ్లు నిండిన ఎవరైనా రివర్స్ మార్ట్గేజ్ రుణానికి అర్హులు. జీవిత భాగస్వామి సహ దరఖాస్తుదారు అయితే ఆమె వయసు 55–58 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. బ్యాంకుల మధ్య ఇది వేర్వేరుగా ఉంది. ► గరిష్టంగా రూ.కోటి వరకే రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని రుణ గ్రహీత ఏ అవసరం కోసం అయినా వినియోగించుకోవచ్చు. ►ఇంటి విలువ, రుణ గ్రహీత వయసు, అమల్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల వ్యవధిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ►కనీసం పదేళ్లు, గరిష్టంగా 20 ఏళ్ల కాలాన్ని చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ► సొంతిల్లు అయి ఉండి, దాన్ని అద్దెకు ఇవ్వకుండా, అందులో నివసిస్తుంటే రివర్స్ మార్ట్గేజ్ చేసుకోవచ్చు. ► ఇంటిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదు. ► వాణిజ్య ఆస్తిపై రివర్స్ మార్ట్‌గేజ్‌కు అవకాశం లేదు. ►తనఖా పెట్టే ఇంటి జీవన కాలం అక్కడి నుంచి 20 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండకూడదు. ► ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వీటిపై జీఎస్టీ చార్జీలను చెల్లించాలి. ►పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించొచ్చు. ► ప్రతి ఐదేళ్లకోసారి ప్రాపర్టీ విలువను బ్యాంక్‌లు మదింపు వేస్తాయి. ►రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టిన ఇంటిని నవీకరించాలని అనుకుంటే, బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. ►ఇంటి నిర్వహణకు అయ్యే ఖర్చులను రుణ గ్రహీత (ఇంటి యజమాని) పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ఆ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర పన్నులు ఏవైనా ఉంటే అందులో నివసిస్తున్న వారే చెల్లించుకోవాలి. చదవండి👉 తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
పెరిగిపోతున్న హోమ్లోన్లు.. రూ.19.36 లక్షల కోట్లకు చేరిన రుణాలు!
ముంబై: వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ గృహ రుణాలు (రుణ గ్రహీతలు చెల్లించాల్సిన మొత్తం) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.19.36 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది మే నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లను 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై రేట్లు పెరిగాయి. 2022 మార్చి చివరికి గృహ రుణాలు రూ.16.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి చివరికి రూ.14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల్లో 20.6 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 12.6 శాతంతో పోలిస్తే పెరిగింది. కన్జ్యూమర్ రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా, వాహన రుణాలన్నీ పర్సనల్ లోన్ కిందకు వస్తాయి. పరిశ్రమలకు రుణాల మంజూరు 5.7 శాతం పెరిగింది. పెద్ద పరిశ్రమలకు ఇది 3 శాతంగా ఉంది. మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాల మంజూరులో 19.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణ వితరణ 12.3 శాతం పెరిగింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రుణాల మంజూరు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15.4 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంతో పోలిస్తే మంచి పురోగతి కనిపించింది. -
పర్సనల్ లోనే కావాలి!
ముంబై: డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణాలకు డిమాండ్ తగ్గింది. కానీ, అదే కాలంలో అన్సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు మాదిరి వినియోగ ఆధారిత ఉత్పత్తులను ఎక్కువ మంది వినియోగిస్తుండంతో అన్సెక్యూర్డ్ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! రుణానికి దరఖాస్తు వచ్చిన తర్వాత, సంబంధిత దరఖాస్తు దారుడి క్రెడిట్ స్కోరు కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రిడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలను సంప్రదిస్తుంటాయి. డిసెంబర్ త్రైమాసికంలో తన వద్దకు గృహ రుణాల కోసం వచ్చిన విచారణలు ఒక శాతం తగ్గినట్టు సిబిల్ తెలిపింది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులకు సంబంధించి వచ్చిన విచారణలు 50 శాతం, 77 శాతం మేర పెరిగినట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు! ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం ఫలితంగా గృహ రుణాలకు విచారణలు తగ్గి ఉండొచ్చని సిబిల్ తెలిపింది. రుణాలు తీసుకుంటున్న వారిల్లో 43 శాతం మంది 18–30 ఏళ్లలోపు ఉన్నారని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వీరి శాతం 40 శాతంతో పోలిస్తే పెరిగినట్టు సిబిల్ తన నివేదికలో వెల్లడించింది. మెట్రోలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే విచారణలు పెరిగినట్టు పేర్కొంది. -
రేట్ల పెంపు రూటు..ఇంటికి దారెటు
సొంతింటి కలను రుణం సాకారం చేస్తుంది. రుణం తీసుకోకపోయినా సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. కాకపోతే మధ్య తరగతి వాసులు రుణం జోలికి వెళ్లకుండా ఉండాలంటే.. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పొదుపు, మదుపు చేసినప్పుడే ఇంటి కొనుగోలుకు కావాల్సినంత సమకూరుతుంది. అదే గృహ రుణం అయితే, కొన్నేళ్ల ముందుగానే ఇంటి కల నెరవేరుతుంది. పైగా రుణం తీసుకున్న తర్వాత ఎలా అయిన తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక దానికి కట్టుబడి ఉంటాం. కానీ, 20–30 ఏళ్లపాటు ఇంటి కోసం పొదుపు చేసే క్రమంలో.. జీవితంలో వచ్చే ముఖ్యమైన అవసరాల కోసం గృహ రుణ నిధి విషయంలో రాజీపడే ప్రమాదం ఉంటుంది. కనుక గృహ రుణం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కాకపోతే, గృహ రుణం విషయంలో సరైన ప్రణాళిక, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలూ, ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. గృహ రుణం అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కనుక దీనిపై వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువే. గత 10 నెలలుగా వడ్డీ రేట్లు అసాధారణంగా పెరిగాయి. రుణం తీసుకున్న వారు, తీసుకోబోయే వారు ఈ రిస్క్‌లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకునే ముందు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం... గృహ రుణంపై ఫ్లోటింగ్ రేటు చాలా తక్కువ రేటు ఆప్షన్లలో ఒకటి. అదే ఫిక్స్డ్ రేటు (స్థిరంగా ఉండే వడ్డీ రేటు, అదీ కొన్నేళ్ల పాటే) అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫ్లోటింగ్ రేటు కంటే ఫిక్స్డ్ వడ్డీ రేటు 2 శాతం అధికంగా ఉంటుంది. గృహ రుణం తీసుకునే వారిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ రేటును ఎంపిక చేసుకోవడానికి ఈ వ్యత్యాసమే కారణం. కానీ, ఫ్లోటింగ్ రేటు అన్నది రెండు వైపులా పదునున్న కత్తి మాదిరే అనుకోవాలి. వడ్డీ రేట్లు తగ్గిపోయే క్రమంలో ఫ్లోటింగ్ రేటు వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. కానీ, అదే వడ్డీ రేట్లు పెరిగిపోయే తరుణంలో రుణ గ్రహీతలను మరింతగా బాధిస్తుంది. ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాలు తీసుకుంటే, అవి రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. అందుకని ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణం తీసుకునే వారు, వడ్డీ రేట్లు పెరిగే సమయంలో అదనంగా చెల్లించేందుకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రేట్లు ఇంకా పెరగొచ్చు సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణంగా అవి తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటారు. కానీ, వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఇలాంటి కోరికలు నెరవేరవు. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం పెంచింది. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. చాలా మంది నిపుణులు రెపో రేటు 6.5 శాతానికి చేరిన వెంటనే వడ్డీ రేట్ల పెంపు ముగుస్తుందని లోగడ అంచనా వేశారు. కానీ, పరిస్థితులు తర్వాత మారిపోయాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగా తయారైంది. అందుకే అన్ని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రుణ గ్రహీతలు మరో విడత లేదంటే, మరిన్నిసార్లు రెపో రేటు పెంపును చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు. చాలా సైకిల్స్ వడ్డీ రేట్లన్నవి ఆర్థిక చక్ర భ్రమణాల మాదిరే ఉంటాయి. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. మరి గృహ రుణం అంటే ఎంత లేదన్నా 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటూ ఉంటారు. దీంతో వడ్డీ రేట్ల సైకిల్స్ ఎన్నో వచ్చి పోతుంటాయి. దీనిపై రుణం తీసుకునే వారు ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. గృహ రుణం ఈఎంఐ అనేది ఆర్జించే వేతనంలో 40 శాతం మించకుండా చూసుకుంటే, ఇలాంటి ఆర్థిక అనిశ్చితులు, వడ్డీ రేట్ల పెరుగుదలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సరైన సమయం కోసం వేచి చూడొద్దు ఏదీ శాత్వతం కాదు. కనిష్ట వడ్డీ రేట్లు అయినా, గరిష్ట వడ్డీ రేట్లు అయినా ఒక నిర్ణీత కాలం పాటే కొనసాగుతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల గృహ రుణ కాలవ్యవధిలో ఒకటి నుంచి రెండు సైకిల్స్ అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు. కనుక కనిష్ట వడ్డీ రేట్లు ఉన్నప్పుడే గృహ రుణం తీసుకుందామని అనుకోవద్దు. దీనివల్ల విలువైన కాలం గడిచిపోతుంది. ఇంటి కొనుగోలు ధర కూడా పెరగొచ్చు. కనుక తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తే, అందులో మిగిలేది, పెరిగే ఇంటి ధరతో పోలిస్తే తక్కువే ఉండొచ్చు. అవసరం, తక్కువ ధరలే ఇంటి కొనుగోలుకు ఆధారం కావాలి కానీ, వడ్డీ రేట్లు కాదని నిపుణుల సూచన. రేట్ల పెంపునకు సన్నద్ధం ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొందరు తమ అభిరుచులకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అదనపు ఖర్చుకూ వెనుకాడరు. ఇంటి బడ్జెట్ పెంచుకోవడం అన్నది అదనపు భారానికి దారితీస్తుంది. తీసుకునే గృహ రుణం పెరుగుతుంది. దీంతో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో మరింత చెల్లించాల్సి రావచ్చు. కనుక అధిక మొత్తానికి గృహ రుణం తీసుకోవడం అన్నది పెద్ద సవాలు అవుతుందని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి. స్వామినాథన్ పేర్కొన్నారు. కనుక అవసరమైతే, వడ్డీ రేట్లు ఊహించని విధంగా పెరిగిపోతే, నెలవారీ ఈఎంఐ 20–25 శాతం అధికంగా చెల్లించేందుకు వీలుగా, నెలవారి ఆదాయంలో వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు నెలవారీ గరిష్టంగా రూ.40,000ను ఈఎంఐ కింద చెల్లించే సామర్థ్యం ఉంటే, అప్పుడు రూ.30,000–32,000 ఈఎంఐకి పరిమితమై గృహ రుణం తీసుకోవాలి. దీంతో వడ్డీ రేట్లు పెరిగినా, ఇబ్బంది లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కాలవ్యవధి పెంపు వడ్డీ రేట్లు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ రుణమిచ్చిన సంస్థలు రుణగ్రహీతల ఈఎంఐ పెంపు కంటే, కాల వ్యవధిని పెంచేందుకు మొగ్గు చూపిస్తుంటాయి. అయితే, దీనికీ పరిమితి ఉంది. రుణ గ్రహీతలు పదవీ విరమణకు ఇంకా ఎన్నేళ్లు ఉందన్న అంశాన్ని బ్యాంకులు చూస్తాయి. సాధారణంగా గృహ రుణ కాలాన్ని బ్యాంకులు రుణ గ్రహీతల వయసు, ఆర్జన ఆధారంగా నిర్ణయిస్తుంటాయి. అదే పనిగా వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో.. బ్యాంకులు రేటు పెరిగినప్పుడల్లా ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకుంటూ పోతే, తిరిగి చెల్లింపుల కాలం రిటైర్మెంట్ వయసుకు త్వరగా చేరిపోవచ్చు. ఇక ఆ తర్వాత కాలవ్యవధి పెంచుకోవడానికి ఉండదు. దీనికి బదులు ఈఎంఐ మొత్తాన్ని పెంచుతుంటాయి బ్యాంకులు. దీంతో అదనపు భారం పడుతుంది. రుణ కాల వ్యవధి పెంచుకోవడం వల్ల అంతిమంగా చెల్లించే వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక రుణదాత కాల వ్యవధి పెంచేందుకు ఆసక్తి చూపించినా.. రుణ గ్రహీతలు దీనికి మొగ్గు చూపకపోవడమే మంచిది. కాల వ్యవధి పెంచుకోవద్దంటే, పెరిగిన వడ్డీ రేట్ల మేర అదనపు ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధం కావాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐని పెంచడం వల్ల గృహ రుణాన్ని త్వరగా తీర్చేయవచ్చు. అందుకే గృహ రుణ గ్రహీతలకు నెలవారీ మిగులు ఉండాలి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అదనంగా చెల్లించే సామర్థ్యం ఉంటుంది. దీంతో కాల వ్యవధి పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంపునకే మొగ్గు చూపుతారు. ఫలితంగా అదనపు వడ్డీ భారం పడదు. ముందస్తు చెల్లింపులు వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకనే గృహ రుణం తీసుకున్న తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పాక్షిక చెల్లింపులకు మొగ్గు చూపించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. దీనివల్ల గృహ రుణం బకాయిని వేగంగా తగ్గించుకోవచ్చు. నిర్ణీత కాలం కంటే ముందుగానే తీర్చివేయవచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా పెద్ద భారం పడకుండా ఉంటుంది. ఉద్యోగులు అయితే బోనస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని గృహ రుణానికి చెల్లింపులు చేసుకోవచ్చు. అదే మాదిరి, ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనంలో సగ భాగాన్ని గృహ రుణ ఈఎంఐ పెంచి కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. క్రెడిట్ స్కోరు అనుకూలత వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అప్పుడు ఫ్లోటింగ్ రేటును ఎంచుకోవడమే మార్గం. అప్పటికే తీసుకున్న గృహ రుణానికి సంబంధించి వడ్డీ భారాన్ని భరించలేకపోతుంటే.. దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే బ్యాంకుకు లేదా ఇతర సంస్థకు బదిలీ చేసుకోవడం ఒక మార్గం. సేవలు బాగుండి, తక్కువ రేటుకు ఆఫర్ చేసే సంస్థకు నిశ్చింతంగా మారిపోవచ్చు. గృహ రుణ బ్యాలన్స్‌ను బదిలీ చేసుకునే ముందు, కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకులో ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీలను కూడా చూడాలి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే కాస్త డిమాండ్ చేసి రేటును తగ్గించుకోవచ్చు. బ్యాలన్స్ బదిలీ విషయంలోనూ మెరుగైన క్రెడిట్ స్కోరు ఉపయోపడుతుంది. -
వడ్డీ రేట్లు పెరిగినా.. ఇంటి కొనుగోలులో తగ్గేదేలే!
న్యూఢిల్లీ: ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ‘వడ్డీరేట్ల’ పెరుగుదల పెద్ద అడ్డంకిగా కనిపించడం లేదని రియల్టీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినప్పటికీ, రూ.30–50 లక్షలు, రూ.50–75 లక్షల విభాగాల్లో ఇళ్ల రుణ డిమాండ్ పెరిగిందని ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ (ఐఎంజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. వడ్డీరేటు పెరుగుదల తీరిదీ.. కరోనా కాలంలో 4%గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), 2022 మే 4న తొలిసారి 0.40% పెరి గింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో 0.5% చొప్పున పెరుగుతూ, 5.9%కి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు 0.35% ఎగసి 6.25 శాతాన్ని తాకింది. వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5% రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఈ పెంపుతో ఈ రేటు 6.5%కి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి నేపథ్యం. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా గృహ రుణ రేట్లను పెంచుతూ వచ్చాయి. వినియోగదారులు నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) భారమూ పెరిగింది. ఈ పరిణామాలపై ఐఎంజీసీ తాజా నివేదికను ఆవిష్కరించింది. నివేదికలో ముఖ్యాంశాలు.. ► తక్కువ రుణ అర్హత, అలాగే ఆకర్షణీయమైన లీజింగ్ (అద్దె) ఎంపిక విధానాల ఆవిర్భావం కారణంగా మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించినవారు) గృహ కొనుగోలు నిర్ణయాలను ఎక్కువగా వాయిదా వేస్తున్నారు. ► రెపో రేట్ పెంపుదల భారం రుణ గ్రహీతలకు బదలాయించడం జరుగుతోంది. దీనివల్ల వినియోగదారుల నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) భారం 10 నుంచి 25 శాతం శ్రేణిలో గణనీయంగా పెరిగింది. వడ్డీరేట్లు వార్షికంగా ప్రస్తుతం 9 నుంచి 9.25 శాతం పెరిగాయి. ► ఉద్యోగ కోతల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో గత త్రైమాసికంలో మొండిబకాయిలు (ఎన్పీఏ) కొంత పెరిగాయి. సమస్య మరింత తీవ్రమైతే ఎన్‌పీఏలూ పెరగవచ్చు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నవారు రుణ కాల వ్యవధిని పెంచుకోడానికి బ్యాంకర్‌తో చర్చించవచ్చు. ఈఎంఐల చెల్లింపునకు తమ పొదుపులనూ వినియోగించుకోవచ్చు. రుణ చెల్లింపుల వైఫల్యం జరక్కుండా సాధ్యమైనంతగా ప్రయత్నించాలి. ఐఎంజీసీ కీలకపాత్ర... ప్రైవేటు రంగంలో 2014లో ఐఎంజీసీ కార్యకలాపాలు ప్రారంభించింది. 2008లో జారీ అయిన తనఖా గ్యారెంటీ మార్గదర్శకాల ప్రకారం దీనిని ఆర్బీఐ నియంత్రిస్తుంది. ఈ కంపెనీ టాప్ 5 ఒరిజినేటర్స్సహా 17 బ్యాంకింగ్ భాగస్వాములతో పని చేస్తుంది. వీటిలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు ఉన్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్ వీటిలో ఉన్నాయి. ప్రత్యేకంగా గృహ రుణాలకు సంబంధించి క్రెడిట్ డిఫాల్ట్ బీమాను ఐఎంజీసీ అందిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక కస్టమర్ హోమ్ లోన్‌పై డిఫాల్ట్ అయినట్లయితే, ఐఎంజీసీ బ్యాంకుకు నష్టపరిహారం ఇస్తుంది. తద్వారా బ్యాంక్నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. భారం తగ్గింపునకు ప్రయత్నం అవసరం రుణ రేట్లు పెరిగిన ప్రస్తుత తరుణంలో రుణ గ్రహీతముందు ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది... క్రెడిట్ ప్రొఫైల్, రీపేమెంట్ చరిత్ర ప్రాతిపదికన సాధ్యమైన తక్కువకు వడ్డీని అమలుచేయించుకునేలా తమ రుణదాతతో చర్చించాలి. మీ బ్యాంకర్ అభ్యర్థనను పట్టించుకోకపోతే, తక్కువ, పోటీపూర్వక వడ్డీరేటును పొందేందుకు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండవ ఎంపిక విషయానికి వస్తే.. కస్టమర్లు తమ వార్షిక బోనస్‌లు, పొదుపుల నుంచి పాక్షిక ప్రీ–పేమెంట్లు చేయడం వల్ల అధిక రుణ భారం నుంచి ఊరట పొందవచ్చు. గృహ రుణాల ప్రీ–పేమెంట్లకుగాను తక్కువ వడ్డీరేట్లలో వేసిన స్థిర డిపాజిట్లను కూడా ఉపసంహరించుకోవచ్చు. వినియోగదారులు తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకోవడం తగదు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే త్రైమాసికాల్లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. రుణ తిరిగి చెల్లించే సామర్థ్యం పరంగా భద్రతను పెంపొందించుకోడానికి తగిన మార్జిన్లను చేతిలో ఉంచుకోవాలి. – అమిత్ దివాన్, ఐఎంజీసీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ -
RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!
సాక్షి,ముంబై: ఈఎంఐలు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 6.25 శాతం ఉన్న కీలకమైన రెపోరేటును 6.50 శాతానికి పెంచింది. దీని ప్రభావం అన్నిరకాల లోన్లపైనా పడనుంది. కార్లు, వివిధ రకాల వాహనాల లోన్లు, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. తాజా రెపో రేటు పెంపుతో అన్ని రకాల లోన్లపై రుణ భారం సుమారు 2-4 శాతం వరకు పెరగనుంది. దీంతో ఖాతాదారులపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. అయితే ఈ భారం నుంచి కాస్త ఊరట కలగాలంటే.. అవకాశం ఉన్న రుణగ్రహీతలు లేదా వారి రుణాలను తిరిగి చెల్లించడానికి అదనపు నగదు చెల్లింపును లేదా ఈఎంఐ భారాన్ని భరించలేని వారు రుణకాలాన్ని పొడిగించుకోవడమో చేయాల్సి ఉంటుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నవారు కూడా పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీ శాతాన్నే రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. అదుపులో ఉన్నప్పుడు తగ్గిస్తుంది లేదా అదే రేటును కొనసాగిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు వడ్డీ భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా ఖాతాదారుల మీదకు మళ్లించి ఆ మేరకు వడ్డీలను వసూలు చేస్తాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్ల బాదుడుకు సిద్ధపడతాయి. అయితే ఈ మేరకు ఖాతాదారుల డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు కూడా పెరగ నుంది (ఇదీ చదవండి: సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ) -
హోమ్ లోన్ ఖాతాదారులకు ఎస్బీఐ బంపరాఫర్
హోమ్ లోన్ ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. పండుగ సీజన్ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఎస్బీఐ హోమ్ లోన్ల వడ్డీ రేటుపై 0.15-0.25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణ రేట్లు 8.55-9.05 శాతంగా ఉండగా, పండుగ ఆఫర్లో భాగంగా అవి 8.40 నుంచి 9.05 శాతం మధ్యలో లభించనున్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటులో రాయితీ, ఈఎంఐలు ఉంటాయని వివరించింది. ఎస్బీఐ సాధారణ గృహ రుణాల రేట్లు ►ఫ్లెక్సీపే,ఎన్ఆర్ఐ,నాన్ శాలరీ, ప్రివిలేజ్/శౌర్య, అపాన్ ఘర్‌తో పాటు మిగిలిన సాధారణ గృహ రుణాల సిబిల్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు బ్యాంక్ 8.40% వడ్డీ రేటును అందిస్తోంది. ఇది సాధారణ రేటు 8.55%తో పోలిస్తే 15 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంది. ►ఇంకా, సాధారణ రేటు 8.65%తో పోలిస్తే 750 - 799 నుండి 8.40% మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు 25 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వబడుతుంది. అదనంగా, 700 -749 సిబిల్ స్కోర్లపై 20 బేసిస్ పాయింట్ల రాయితీ, ►1 నుండి 699 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్లను కలిగి ఉన్న రుణగ్రహీతలకు గృహ రుణాలపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. 650-600 మధ్య క్రెడిట్ స్కోర్లను కలిగి ఉన్న రుణగ్రహీతలకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8.85%గా ఉంటుంది. -
రెపోరేటు పెంచిన ఆర్బీఐ : హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల బాదుడు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను 0.5 శాతం( 50 బేసిస్) పెంచింది. సెప్టెంబర్ 28న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభం కాగా..సెప్టెంబర్ 30న ముగిసింది. ఆర్బీఐ రెపోరేట్లను పెంచడం కారణంగా..బ్యాంకులు రుణ గ్రస్తులకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. అదే జరిగితే కార్ల లోన్లు, పర్సనల్, హోమ్ లోన్లు మరింత భారం కానున్నాయి. అయితే ఇప్పుడు రెపో రేట్ల పెరుగుదలతో రుణగ్రస్తులపై హోమ్ లోన్ భారం ఏ విధంగా పడుతుందో తెలుసుకుందాం. రెండు ఆప్షన్లు ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇంటి కోసం రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి రుణ భారం కాకుండా ఉండేందుకు రెండు ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఈఎంఐ కాల వ్యవధిని పెంచుకోవడం, రెండవది ప్రతి నెలా కట్టే ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవడం. హోమ్ లోన్ భారం ఎంతంటే ఉదాహరణకు..ఓ వ్యక్తి గతంలో 8.12 శాతం వడ్డీతో 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం తీసుకున్నారు. అయితే తాజాగా రెపోరేట్లు పెరిగాయి కాబట్టి సదరు వ్యక్తి తీసుకున్న రుణ టెన్యూర్ కాలం ఆటో మెటిగ్గా 2 సంవత్సరాల 3 నెలలకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ మొత్తానికి 8.62 శాతం వడ్డీతో రూ.50 లక్షలకు అదనంగా రూ.11 లక్షలు అదనంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ కేవలం పెంచిన 5 నెలల వ్యవధి రెపోరేటు 1.90 శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే వడ్డీ కలుపుకొని 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి రూ.50 లక్షలు తీసుకుంటే..రూ. 59 లక్షలు చెల్లించాలి. ఒక వేళ ఈఎంఐని పెంచితే ఒక వేళ నెలవారి చెల్లించే ఈఎంఐని పెంచినా అదే భారాన్ని రుణ గ్రహిత మోయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 20 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 50 లక్షల రుణంపై మీరు గతంలో నెలకు చెల్లించే రూ.37,929 ఈఎంఐతో పోలిస్తే తాజా పెరిగిన 1.9 శాతం రెపో రేట్ల కారణంగా రూ. 43,771 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ రూ.5,842కి పెరుతుంది. చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది. -
ఇళ్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంకేతాలిచ్చారు. అయితే ఇన్నిరోజులు ఆయా బ్యాంకులు ఇంటి రుణాల్ని తక్కువ వడ్డీ రేట్లకే ఆఫర్ చేశాయి. కానీ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో ఇంటి రుణాలపై వడ్డీలను పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్ని ద్రవ్యోల్బణం తీవ్రంగా వేధిస్తోంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలకు చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పనిలో పనిగా ఆర్బీఐ సైతం పలు వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ(మే) నెలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ..40 బేసిస్ పాయింట్లు వరకు వడ్డీ రేట్లను పెంచింది. అంతేకాక తదుపరి సమావేశాలలో కూడా వడ్డీ రేట్లను పెంచుతామని హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కరోనాకు ముందు హోం లోన్‌పై ఎంత వడ్డీ కడుతున్నామో..ఇప్పుడు కూడా అంతే కట్టాల్సి ఉంటుంది.దీంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు 10 శాతం వరకు పెరగొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆర్బీఐ హోం లోన్లపై ఎంత వడ్డీ విధిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. -
వాట్సాప్‌లో 2 నిమిషాల్లో ఆ బ్యాంకు నుంచి గృహ రుణం
న్యూఢిల్లీ: గృహ రుణాల్లో అతిపెద్ద సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ.. వాట్సాప్ ద్వారా గృహ రుణలను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. కొనుగోలుదారులకు రెండు నిమిషాల్లోపే గృహ రుణానికి సంబంధించి సూత్రప్రాయ ఆమోదం ఇస్తున్నట్టు తెలిపింది. హెచ్డీఎఫ్సీ వాట్సాప్ నంబర్ 9867000000కు రుణం కావాల్సిన వారు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా హోమ్‌లోన్ ఆఫర్ లెటర్‌ను రెండు నిమిషాల్లోనే జారీ చేస్తుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులు ఈ సేవ అందుబాటులో ఉంటుం దని హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. గృహ రుణ ఆమోద లేఖ జారీకి వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. మొదటిసారి ఇళ్ల కొనుగోలు దారుల నుంచే కాకుండా, ఇప్పటికే ఇంటిని సమకూర్చుకున్న వారి నుంచి సైతం డిమాండ్ ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ ఎండీ రేణు సూద్ కర్ణాడ్ తెలిపారు. చదవండి: భారతీయుల దగ్గర ఎన్నివేల బంగారం ఉందో తెలుసా! -
తెలుగు రాష్ట్రాల్లో రూ. 7,200 కోట్ల గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నాటికల్లా రూ. 7,200 కోట్ల గృహ రుణాల మంజూరును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ (ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్) ఈడీ మోనూ రాత్రా వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4,320 కోట్లు, తెలంగాణలో రూ. 2,880 కోట్లు ఉండనున్నట్లు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17,000 పైచిలుకు కుటుంబాలకు రూ. 2,448 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో హరిత గృహాల నిర్మాణంపై డెవలపర్లలో అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన 9వ ’కుటుంబ్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోనూ ఈ విషయాలు తెలిపారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌తో (ఏడీబీ) కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పర్యావరణ హిత నిర్మాణాలు చేపట్టే డెవలపర్లకు చౌకగా రుణాలివ్వడంలో తోడ్పడేందుకు ఏడీబీ 10 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చిందని వివరించారు. సగటు గృహ రుణ పరిమాణం సుమారు రూ. 15 లక్షలుగా ఉంటోందని మోనూ చెప్పారు. ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 87 శాఖలు ఉన్నాయని, 2023 నాటికి వీటి సంఖ్యను 120కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: డార్మిటరీలో మొదలైన స్టార్టప్.. నేడు 101 బిలియన్ డాలర్ల కంపెనీ -
స్థలం కొనుగోలుకు రుణం.. ఇల్లు కట్టుకునే వారికి ప్లాట్ రుణాలు
ఆకర్షణీయమైన ధరకు ప్లాట్ (స్థలం) విక్రయానికి ఉందని తెలిసినప్పుడు.. అందుబాటులో డబ్బు ఉండకపోవచ్చు. అటువంటి అవకాశం మళ్లీ రాదనుకుంటే, కొనుగోలుకు అప్పు తీసుకోవడం ఒక్కటే మార్గం. తెలిసిన వారి దగ్గర బదులు తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆశ్రయించాలా? లేక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) తలుపు తట్టాలా? అసలు స్థలం కొనుగోలుకు రుణం లభిస్తుందా? ఎన్నో సందేహాలు వస్తాయి. ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కడదామనుకునే వారు.. పెట్టుబడి కోణంలోనూ ప్లాట్‌ను కొనుగోలు చేసేవారూ ఉన్నారు. వీరి కల సాకారం కోసం అందుబాటులో ఉన్న మార్గాలేమిటో తెలియజేసే కథనమే ఇది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్లాట్ కొనుగోలుకు రుణాలను (ప్లాట్ లోన్స్) ఆఫర్ చేస్తున్నాయి. కానీ, ఆ ప్లాట్ ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తున్నదై ఉండాలి. పెట్టుబడి కోణంలో ప్లాట్ కోసం రుణం తీసుకోవాలంటే వేరే మార్గాలను వెతుక్కోవాల్సిందే. ఇంటి కొనుగోలు కోసమే ప్లాట్‌ను సమకూర్చుకునే వారికి రుణం సులభంగానే లభిస్తుంది. నివాస యోగ్యమైన ప్లాట్‌ను రుణంపై కొనుగోలు చేసుకుంటే.. ఆ తర్వాత రుణ ఒప్పందం మేరకు 1–3 ఏళ్లలోపు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. వీటినే ప్లాట్ లోన్స్గా చెబుతారు. రుణం తీసుకుని నివాస యోగ్యమైన ప్లాట్‌పై ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత ఇల్లు కట్టలేదనుకోండి. కావాలని ఇల్లు కట్టకుండా వదిలేసే వారు ఉంటారు. పలు రకాల కారణాల వల్ల ఇల్లు కట్టడానికి వీలు పడని పరిస్థితులూ ఉండొచ్చు. నిజానికి ప్లాట్ లోన్ తక్కువ వడ్డీ రేటుపై లభిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తుండడమే ఇందుకు కారణం. రుణ ఒప్పందంలో పేర్కొన్న కాల వ్యవధిలోపు ఇంటిని నిర్మించి, పూర్తయినట్టు సర్టిఫికెట్ బ్యాంకుకు సమర్పించకపోతే.. అప్పుడు ఆ రుణం సాధారణ రుణంగా మారుతుంది. బ్యాంకులు అదనపు వడ్డీరేటును వసూలు చేస్తాయి. ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రుణంపై 2–3 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును అమలు చేసే స్వేచ్ఛ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఉంటుంది. దీనివల్ల అదనపు వడ్డీ భారం పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒప్పందంలో పేర్కొన్న కాలవ్యవధి ముగిసిన తర్వాత కూడా రుణ గ్రహీత బ్యాంకులను సంప్రదించని పరిస్థితుల్లో.. బ్యాంకులే కస్టమర్లకు సందేశం పంపిస్తాయి. అప్పటికీ స్పందించకపోతే అప్పుడు సాధారణ రుణంగా వర్గీకరించి ఆ మేరకు చర్యలు తీసుకుంటాయి. అదనపు వడ్డీ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంటేనే ప్లాట్‌లో ఇంటిని నిర్మించకుండా ఉండొచ్చన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ప్లాట్ లోన్ అర్హతలు 18–70 ఏళ్ల వారు ప్లాట్ లోన్‌కు అర్హులు. సిబిల్ స్కోరు కనీసం 650కు పైన ఉండాలి. గరిష్టంగా 15 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించే విధంగా ప్లాట్ లోన్ మంజూరవుతుంది. రుణం ఇచ్చే ముందు.. ఆ ప్లాట్ కొనుగోలు ప్రదేశం, ఎందుకోసం కొనుగోలు చేస్తున్నారు, తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణాల చెల్లింపుల చరిత్ర ఇలా ఎన్నో అంశాలను బ్యాంకులు చూస్తాయి. లోన్ టు వ్యాల్యూ లోన్ టు వ్యాల్యూ అన్నది ప్రాపర్టీ విలువలో లభించే రుణంగా అర్థం చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో గరిష్టంగా 85–90 శాతం వరకు రుణాన్ని (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అదే ప్లాట్ కోసం అయితే ఎల్టీవీ 60–70 శాతం మధ్యే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారులు స్వయంగా సమకూర్చుకోవాలి. సేల్‌డీడ్‌లో పేర్కొన్న విలువను ప్లాట్ విలువగా బ్యాంకులు పరిగణిస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని రుణం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి. రుణం తీసుకునే ముందు విచారిస్తే ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. పైగా కొన్ని బ్యాంకులు సేల్డీల్ వ్యాల్యూ లేదా మార్కెట్ వ్యాల్యూలో రుణాన్ని 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. సమాచార లోపం కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వొచ్చు. ప్లాట్ రుణం తీసుకుని, అందులో ఇల్లు కట్టకపోయినా ఫర్వాలేదు? అన్న మాట వినిపిస్తే అది నిజం కాదని గుర్తించాలి. వారు తమ స్వప్రయోజనాల కోసమే అలా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతకీ అనుమానం ఉంటే లోన్ డాక్యుమెంట్‌ను ఒక్కసారి సమగ్రంగా చదవాలి. ప్రతి ఒక్కరికీ ఆవాసం కల్పించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందులో భాగంగానే తక్కువ రేటుపై ప్లాట్ రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అలాకాకుండా రుణం తీసుకుని కొనే ప్లాట్.. భవిష్యత్తులో లాభం కోసం విక్రయించేది అయితే అందుకు తక్కువ వడ్డీ రేటుపై రుణాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని తెలుసుకోవాలి. ఇంటిని నిర్మించేట్టయితే బ్యాంకులకు రుణం చెల్లింపులపై భరోసా లభించడం కూడా తక్కువ రేటుకు ఇవ్వడానికి ఒక కారణం. పైగా ఇంటి నిర్మాణం చేస్తే దానిపై ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. లేదంటే అందులో నివాసం ఉంటే రుణ గ్రహీత ఇంటి అద్దె రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని రుణ ఈఎంఐల చెల్లింపునకు వెసులుబాటుగా బ్యాంకులు చూస్తాయి. ఒక్కటే రుణం? కొన్ని బ్యాంకులు ప్లాట్ కొనుగోలుకు, తర్వాత అందులో ఇంటి నిర్మాణానికీ రుణం ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు చేసిన 2–3 ఏళ్ల తర్వాత గృహ రుణాన్ని జారీ చేస్తోంది. కానీ, ఈ రెండు రుణాలకు వేర్వేరు ఖాతాలు ఉంటాయి. వడ్డీ రేటులోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు ఒక్కటే రుణం ఇచ్చేందుకూ ముందుకు వస్తున్నాయి. ఒప్పందంలో ఇందుకు సంబంధించి వివరాలు ఉంటాయి. మంజూరు చేసే రుణంలో ప్లాట్‌కు ఎంత, ఇంటి నిర్మాణానికి ఎంతన్న వివరాలు కూడా ఉంటాయి. పన్ను ప్రయోజనాలు ప్లాట్ కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు లే వు. పన్ను ప్రయోజనం కావాలనుకుంటే ఒక్కటే రుణంగా (ప్లాట్, ఇల్లు) తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం. అప్పుడు అసలు, వడ్డీ చెల్లింపులపై ఒక ఏడాదిలో రూ.3.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని గుర్తుంచుకోవాలి.. ► ప్లాట్‌లో ఇంటిని నిర్మించేట్టు అయితేనే రుణం తీసుకోవాలి. ► ప్లాట్, ఇంటి నిర్మాణానికి కలిపి ఒక్కటే రుణం మంజూరు చేస్తుంటే.. ముందు ప్లాట్ కోసం ఒక పర్యాయం, ఇంటి నిర్మాణ సమయంలో మిగిలిన భాగాన్ని బ్యాంకులు ఇస్తాయి. ఇంటి నిర్మాణానికి కూడా ముందుగానే రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. ► ఒకవేళ రుణంపై ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఏడాది లేదా రెండేళ్లకు ఇల్లు కట్టకుండానే విక్రయించారనుకోండి. అప్పుడు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో విచారించాలి. అటువంటప్పుడు వాటిని సాధారణ/పర్సనల్ లోన్‌గా పరిగణించి అదనపు వడ్డీ, చార్జీలు వసూలు చేయవచ్చు. ► ప్లాట్ లొకేషన్ కూడా కీలకం. మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొనుగోలు చేస్తున్న ప్లాట్ ఉండాలి. గ్రామాల్లో ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు కాదు. ► అలాగే, పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాట్‌కు, వ్యవసాయానికి వినియోగించే ప్లాట్‌కు కూడా రుణం మంజూరు కాదు. ► ఇంటి కోసం రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధిపైనా తీసుకోవచ్చు. అదే ప్లాట్ రుణం 15–20 ఏళ్లకే పరిమితం అవుతుంది. ► ప్లాట్ రుణానికి గరిష్ట పరిమితి కూడా ఉంది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకులు పరిమితులు విధిస్తున్నాయి. ► రుణాన్ని ముందుగా చెల్లిస్తే అదనపు చార్జీలు చెల్లించాలేమో విచారించుకోవాలి. ఈ చార్జీలపై అధికారులను అడిగి తెలుసుకోవాలి. ► కొనుగోలు చేస్తున్న ప్లాట్‌కు రుణం వస్తుందా? లేదా? ముందే స్పష్టం చేసుకోవాలి. పెట్టుబడి కోసం అయితే..? ఇంటి నిర్మాణానికి కాకుండా పెట్టుబడి కోణంలో ప్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే.. అందుకు ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుంది. అప్పటికే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే.. లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (ఎల్ఏపీ)ని తీసుకోవచ్చు. నివాస, వాణిజ్య ప్రాపర్టీలను బ్యాంకులకు హామీగా ఉంచితే, రుణం లభిస్తుంది. ఇలా తీసుకునే రుణా న్ని ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే స్వేచ్ఛ రుణగ్రహీతకు ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధిపై ఈ రుణం లభిస్తుంది. ప్రాపర్టీ ఏమీ లేని వారు.. బంగారం ఉంటే దాన్ని తనఖా ఉంచి రుణాలను తీసుకోవచ్చు. బ్యాం కులు బంగారం రుణాలను 7.2–7.8శాతానికే ఆఫర్ చేస్తున్నా యి. వీటి కాల వ్యవ« ది 1–3 ఏళ్లే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత చెల్లించే వెసు లుబా టు లేకపోతే రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ మార్గం లేకపోతే, ప్లాట్ చౌకగా వస్తుంటే చివరిగా వ్యక్తిగత రుణం కూడా ఒక ఆప్షన్ అవుతుంది. కాకపోతే 10–12శాతం వరకు వడ్డీ రేటు భరించాల్సి ఉంటుంది. -
కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!
కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇక వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టం 1960 సెక్షన్ 80 ఈఈఏ కింద అందించే రూ.1.5 లక్షల అదనపు పన్ను ప్రయోజనాన్ని గృహ కొనుగోలుదారులు పొందలేరు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందరికీ ఇళ్లు పథకం కోసం ఆదాయపు పన్ను చట్టం 1960సెక్షన్ 80 ఈఈఏ కింద ఇప్పటి వరకు పన్ను మినహాయింపు కల్పించారు. కొద్ది రోజుల క్రితం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో 2022-2023 సంవత్సరానికి ఈ పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. ఈ పన్ను రాయితీ 2019-2022 ఏడాది వరకు మాత్రమే అందుబాటులో ఉంది. గృహాలు కొనుగోలు చేస్తున్న వారికి ఇకపై పన్ను రాయితీ పొందే అవకాశం లేదు. గృహకొనుగోలుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి), సెక్షన్ 80సీ కింద రెండు పన్ను మినహాయింపులను పొందవచ్చు. రుణగ్రహీతలు సెక్షన్ 24(బి) కింద వడ్డీపై మినహాయింపు రూ.2 లక్షల వరకు, సెక్షన్ 80సీ కింద అసలు మొత్తంపై రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. సెక్షన్ 24(బి) కింద రూ.2 లక్షల కంటే ఎక్కువగా పన్ను రాయితీ అందుకొన్నవారు ఇల్లు కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల అదనంగా తగ్గింపును పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు సెక్షన్లు 24(బి), 80 ఈఈఏ కింద గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.3.5 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేసుకొనే వీలు ఉంది. అయితే, కొన్ని షరతులు పాటించే వ్యక్తులు మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. మొదట ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2022 మధ్య కాలంలో గృహ రుణం మంజూరు కావాలి. రెండవది నివాసం స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలకు మించి ఉండకూడదు. మూడవది ఈ ప్రయోజనాన్ని పొందే వ్యక్తి రుణం మంజూరు చేసిన తేదీనాటికి మరే ఇతర ఇంటి ఆస్తిని కలిగి ఉండకూడదు. రుణాన్ని ఆస్తికొనుగోలు కొరకు మాత్రమే ఉపయోగించాలి. రిపేర్, మెయింటెనెన్స్ లేదా నిర్మాణం కోసం కాదు. వ్యక్తులు మాత్రమే ఈ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. మార్చి 31, 2022న లేదా అంతకు ముందు గృహ రుణాన్ని పొందిన వ్యక్తి, సెక్షన్ 80ఈఈఏ కింద ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చని ఐటీఆర్ ఫైలింగ్ వెబ్సైట్ Tax2win సీఈఓ అభిషేక్ సోనీ తెలిపారు. "2022 మార్చి 31వ తేదీ లేదా అంతకు ముందు గృహ రుణం తీసుకున్న వ్యక్తి సెక్షన్ 80ఈఈఏ ప్రకారం ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి రుణం మంజూరు అయితే.. భవిష్యత్ ఆర్థిక సంవత్సరాల్లో గృహ రుణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఈ మినహాయింపును క్లెయిమ్ చేయగలరు’ అని అభిషేక్ సోనీ చెప్పారు. (చదవండి: అదిరిపోయిన స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!) -
మీకు తెలుసా..కొత్త ఇంటి కొనుగోలుపై రూ. 5 లక్షలకు పైగా టాక్స్ బెనిఫిట్స్..!
సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వాలు కూడా ఇళ్లపై పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. అందుకే సెక్షన్ 80C కింద గృహ రుణంపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. మీరు గృహ రుణంపై ఇంటిని కొనుగోలు చేసినప్పుడు పన్ను భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం అందిస్తోన్న పలు సెక్షన్ల ద్వారా కొత్త ఇంటి కొనుగోలుపై సుమారు రూ. 5 లక్షలకు పైగా టాక్స్ ప్రయోజనాలను పొందవచ్చును. ఈ ప్రయోజనాలు జాయింట్ హోమ్‌లోన్‌పై వర్తిస్తాయి. పలు సెక్షన్ల కింద వచ్చే ప్రయోజనాలు ఇవే..! సెక్షన్ 80సి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి తో సుమారు రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చును. ఇది నేరుగా గృహ అసలు రుణంపై రానుంది. ఈ రుణాన్ని కేవలం ఆర్బీఐ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల నుంచి తీసుకుని ఉంటేనే అర్హులు. ఇల్లు నిర్మాణంలో ఉన్నా 5 సంవత్సరాల లోపు ఇంటిని విక్రయిస్తే ఈ ప్రయోజనం వర్తించదు. సెక్షన్ 24బీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు వర్తిస్తోంది. ఇది గృహరుణ వడ్డీ చెల్లింపులపై రానుంది. ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మాత్రమే టాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణం లోన్ తీసుకున్న 5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈ ప్రకారం రూ. 50 వేల వరకు డిడక్షన్ పొందవచ్చును. ఇది కేవలం సదరు లోన్ అమౌంట్ రూ. 35 లక్షలకు మించకూడదు. దాంతో పాటుగా ప్రాపర్టీ వాల్యూ కూడా రూ. 50 లక్షలకు మించకూడదు. ఇది గృహరుణ వడ్డీ చెల్లింపులపై రానుంది. సెక్షన్ 80ఈఈఏ ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 24 లిమిట్ పూర్తైన తర్వాత మాత్రమే సెక్షన్ 80ఈఈఏ కింద డిడక్షన్ పొందేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్ కింద రూ. 1.50 లక్షల వరకు అదనపు తగ్గింపు పొందచ్చు. ఆస్తి స్టాంప్ డ్యూటి విలువ రూ. 45 లక్షలకు పెరగకూడదు. ఇది 'అఫర్జబుల్' గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలంటే..సదరు వ్యక్తులు తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసి ఉండాలి. లోన్ తీసుకునే నాటికి ఎటువంటి రుణం వ్యక్తి పేరుపై ఉండకూడదు. చదవండి: ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..! -
కొత్త ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. క్రెడిట్ స్కోరు 750 పైగా ఉండాలి అలాగే, దరఖాస్తుదారుడి సిబిల్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపింది. వీరికి మాత్రమే గృహ రుణాలు 6.65% వడ్డీ రేటుకు లభిస్తాయి. 750 నుంచి 799 మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారు కూడా ఈ వడ్డీ రేటును పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చివరి షరతు ఏమిటంటే కొత్త ఇల్లు కొనేవారు 26 జనవరి 2022 నాటికి రుణదాత అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28 డిసెంబర్ 2021 నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి, 25 ఫిబ్రవరి 2022 నాటికి రుణం తీసుకున్న వారు మాత్రమే ఈ వడ్డీ రేటు పొందడానికి అర్హులు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!) -
గృహ రుణం కోసం అప్లై చేసే ముందు.. ఇవీ తప్పక తెలుసుకోండి!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడం కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. తమ దగ్గర ఉన్న కొంత సొమ్ముతో పాటు గృహ రుణం కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. గృహ రుణం అనేది ఒక అతిపెద్ద రుణం. గృహ రుణం తీసుకొనే ముందు ఒకసారి భవిష్యత్ గురుంచి ఆలోచించాలి. ఎందుకంటే, ఈ రుణం తీసుకున్న తర్వాత ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే కష్టాల్లోకి కూరుకొని పోవాల్సి వస్తుంది. అందుకే, గృహ రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ దరఖాస్తుదారులు గృహ రుణం కోసం అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి. డౌన్ పేమెంట్: గృహ రుణం అనేది ఆ ఇంటి ఆస్తి విలువలో 60 శాతం కంటే ఎక్కువ మించకూడదు. వాస్తవానికి దరఖాస్తుదారులకు 70-80 శాతం ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. కానీ, గృహ కొనుగోలుదారాలు 60 శాతం లోపు రుణం తీసుకుంటే మంచిది. మిగతా 40 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా గృహ రుణం రావడంతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే, భవిష్యత్‌లో ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే, తట్టుకునే సామర్ధ్యం మన దగ్గర ఉంటుంది. క్రెడిట్ స్కోరు: ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయాలి అనుకున్నప్పుడు, మొదటగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు చెక్ చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి(ఉదా:750 పైన) సాధారణంగా రుణ ఆమోదానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు తక్కువ వడ్డీకె రుణాలను ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. ఇల్లు కొనడానికి ముందు మన క్రెడిట్ స్కోరు మెరుగు పరుచుకోవడం మంచిది. (చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..) ఈఎమ్ఐ: రుణగ్రహీత నెలవారీ ఆదాయంలో కొత్త గృహ రుణం కోసం తీసుకునే ఈఎమ్ఐ 50-60 శాతం లోపు గల దరఖాస్తుదారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒకవేల మీకు ఇతర రుణాలు ఉంటే అవి పూర్తిగా చెల్లించిన తర్వాత లేదా కొంత మేరకు(50 శాతం వరకు) చెల్లించి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. అలాగే, మీకు ఇతర ఖర్చులు గనుక ఉంటే సుదీర్ఘ రుణ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. అత్యవసర నిధి: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఒక ఆర్ధిక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, భవిష్యత్‌లో ఎలాంటి ఊహించని కరోనా మహమ్మారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైనా కావచ్చు. అందుకే, ఈ నిదిలో ఎల్లపుడూ 6-12 నెలల ఈఎమ్ఐలకు సరిసమానమైన నగదు ఉంటే మంచిది. మీరు గనుక ఒక ఈఎమ్ఐను చెల్లించకపోయిన అది మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ అత్యవసర నిధి వల్ల అటువంటి తీవ్రమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. (చదవండి: ఆహా ఏమి అదృష్టం!.. లక్షకు రూ.55 లక్షలు లాభం) -
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఆ బ్యాంకులో వడ్డీ రేటు 6.40% మాత్రమే!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎమ్) 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ కింద ప్రస్తుతం గృహ రుణాలపై ఉన్న వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, మార్కెట్ పోటీకి అనుగుణంగా కారు రుణాలపై ప్రస్తుతం ఉన్న 7.05 శాతం వడ్డీ రేటును కూడా 6.80 శాతానికి బ్యాంకు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి ఉంటాయని బీఓఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ రేటు రుణగ్రహీతల క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుందని తెలిపింది. బ్యాంకు ఇప్పటికే తన బంగారం, గృహ నిర్మాణం & కారు రుణం కోసం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు తెలిపింది. "రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్ వల్ల వినియోగదారులు తమ రుణాలపై మరింత ఆదా చేసుకోవచ్చు అని, ఇది వారి జీవితాల్లో సంతోషాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని మేము నమ్ముతున్నాము" అని బీఓఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు. (చదవండి: మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా) -
అతి తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
Home Loan Interest Rates: మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్టపడతారు. ఈ సొంతింటి కోసం వారు ప్రతి నెల ఎంత కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. తమ దగ్గర ఉన్న ఆ సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కలల గృహాన్ని కట్టుకుంటారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే బ్యాంకులకు హోమ్ లోన్స్ కోసం ధరఖాస్తు చేసుకుంటారు. కరోనా మహమ్మారి తర్వాత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రేపో రేటును భారీగా తగ్గించడంతో బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ప్రతి బ్యాంక్ బట్టి వడ్డీ రేటు అనేది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి. గృహ రుణాలపై తాజా బ్యాంకు వడ్డీ రేట్లు: (చదవండి: రూపేకార్డులపై అమెరికన్ కంపెనీ కుతంత్రం..!) -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు దీపావళి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. రెపో ఆధారిత రుణ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రభుత్వం రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బుధవారం(నవంబర్ 3) ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 6.55 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. తాజా నిర్ణయం నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. గృహ, కారు, విద్య, వ్యక్తిగత రుణాలకు తాజా తగ్గింపు రేటు వర్తిస్తుంది. సెప్టెంబర్ 17నే బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ను 6.80 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటే-రెపో రేటు. ప్రస్తుతం ఈ రేటు 4 శాతంగా ఉంది. ఎలక్ట్రిక్/గ్రీన్ వాహనాలను కొనే కస్టమర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం పంచుకునేందుకు పీఎన్బీ ఈవీ, సిఎన్జి వాహనాలపై వడ్డీ రేటును 6.65%కు తగ్గించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్ మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇల్లు, వాహనం, వ్యక్తిగత, బంగారం, ఆస్తి రుణాలపై సర్వీస్ ఛార్జీలు/ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసింది. (చదవండి: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!) -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యూజర్లకు గుడ్‌న్యూస్!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుభవార్త తెలిపింది. ఐపీపీబీ బ్యాంకుకు చెందిన వినియోగదారులకు గృహ రుణాలు అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ గృహ రుణాలను అందించడానికి ఇండియా పోస్ట్ తన దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్‌లతోపాటు 1,36,000 పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఐపీపీబీ, హెచ్డీఎఫ్సీ మధ్య అవగాహన ఒప్పందం(ఎంఒయు) చేసుకున్నాయి. "ఈ భాగస్వామ్యం ఐపీపీబీ వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ గృహ రుణాలను సులభంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బ్యాంకు లేని ప్రాంతాల్లోని చాలా మందికి ఫైనాన్స్ అందుబాటులో లేదు. కొత్త ఇల్లు కట్టుకోవాలనే వారి కలను నెరవేర్చడానికి ఐపీపీబీ దాదాపు 190,000 బ్యాంకింగ్ సర్వీస్ప్రొవైడర్ల(పోస్ట్ మెన్, గ్రామీణ్ డాక్ సేవక్) ద్వారా గృహ రుణాలను అందిస్తుంది" అని తెలిపింది. ఈ ఎంఒయు ప్రకారం అన్ని గృహ రుణాలకు సంబంధించిన క్రెడిట్, సాంకేతిక, చట్టపరమైన విషయాలు, ప్రాసెసింగ్, పంపిణీని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నిర్వహిస్తుంది. అయితే ఐపీపీబీ కేవలం రుణాన్ని అందించడంలో బ్యాంకుకు, వినియోగదారుల మధ్య వారదులగా పని చేస్తారని వెల్లడించింది. (చదవండి: క్రోమాతో జట్టుకట్టిన ఇన్నోవిటీ..!) -
బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు..లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్) ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ- ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు హోంలోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. దీంతో కొనుగోలు దారులు బ్యాంకులు ఇచ్చే లోన్ల సాయంతో తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల్లో హోం లోన్, పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసేముందు కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఆర్దిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అప్పులు,క్రెడిట్ కార్డును క్లియర్ చేయడం బ్యాంకులో లోన్ల కోసం అప్లయ్ చేసే ముందు ఉన్న అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్స్‌ను పూర్తిగా చెల్లించడం మంచిదని అర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇక మీ ఆదాయాన్ని బట్టి బ్యాంకులు రుణాల్ని ఇవ్వడమో,లేదంటే ఆదాయం తక్కువగా ఉందని లోన్ రిజెక్ట్ చేస్తాయని క్లిక్ క్యాపిటల్ సంస్థ తెలిపింది. ఒకవేళ రుణం మంజూరైనా కట్టలేని పరిస్థితులు తలెత్తితే ఇబ్బందులు పడే అవకాశం ఉందని సూచించింది. సాధారణంగా, మీరు ప్రస్తుతం చెల్లించే మొత్తం ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో 30 లేదా 40శాతం మించకూడదు. లేదంటే లోన్ కోసం అప్లై చేసే ముందు.. మీకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తిన మీరు తీసుకున్న రుణాన్ని చెల్లించే ఆరు నెలలు,సంవత్సరం మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ క్రెడిట్ కార్డ్ స్కోర్ చాలా కీలకం. ఎందుకంటే పర్సనల్ లోన్, హోం లోన్ ఇవ్వాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డ్ స్కోర్‌ను బట్టి మీ ఆర్ధిక స్థోమతను అంచనా వేస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే మీకు కావాల్సిన లోన్లను వెంటనే ఇచ్చేస్తాయి. సాధారణంగా 725 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే మీరు తీసుకున్న రుణాల్ని సరైన సమయానికే చెల్లిస్తున్నారని అర్ధం. 725 లోపు క్రెడిట్ కార్డ్ స్కోర్ ఉంటే మీరు తీసుకున్న మొత్తాన్ని చెల్లించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. అదే సమయంలో మీ లోన్లను రిజెక్ట్ చేస్తాయి. ఒకవేళ ఆన్లైన్ ద్వారా లోన్ అప్లయ్ చేయాలని చూస్తే బ్యాంకులు అధిక మొత్తంలో వడ్డీని విధిస్తాయి. అన్ని ఆదాయ వనరులను చేర్చండి బ్యాంక్‌లోన్ కోసం ప్రయత్నిస్తుంటే మీ శాలరీ ఎంత వస్తుంది. మీ పార్ట్ టైమ్ జాబ్ చేయడం వల్ల ఎంత సంపాదిస్తున్నారు. ఒకవేళ మీ సొంతిల్లును అద్దెకిస్తే .. నెలవారీ రెంట్ ఎంత వస్తుంది. అనే అంశాలపై బ్యాంకు అధికారులకు స్పష్టత ఇవ్వాలి. లోన్ కోసం ఎక్కువ సార్లు అప్లయ్ చేయొద్దు మీరు అప్లయ్ చేసిన ప్రతి సారి లోన్ రిజెక్ట్ అయ్యిందని మరోసారి ప్రయత్నిస్తారేమో? అలా చేయడం వల్ల బ్యాంకులు మీలోన్లను రిజెక్ట్ చేసే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. లోన్ అప్లయ్ చేసిన సమయంలో క్రెడిట్ బ్యూరో అధికారులు అన్నీ రకాలుగా విచారణ చేపడతారు. మీకు ఆర్ధిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తారు. అంతేకాదు క్రెడిట్ స్కోర్ తగ్గడం, బ్యాంక్ లోన్లను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అర్హత ఉందో లేదో చెక్ చేసుకోండి బ్యాంక్ లోన్ పెద్ద మొత్తంలో అప్లయ్ చేయొద్దు. అలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోన్ అప్లయ్ చేసే ముందుకు తీసుకున్న రుణాన్ని చెల్లించగలిగే సామర్ధ్యం ఉందా? లేదా? అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. చదవండి: హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు, ఇళ్లకు డిమాండ్ -
హోం లోన్స్‌పై యాక్సిస్ ఫెస్టివల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్.. దీపావళి పండుగ సందర్భంగా కొన్ని గృహ రుణాల పథకాలపై ప్రత్యేక ఆఫర్లు అందించనుంది. అంతేకాదు ఆన్లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఎంపిక చేసిన హోమ్ లోన్ పథకాలపై 12 నెలసరి వాయిదాల (ఈఎంఐ) మినహాయింపుతో బంపరాఫర్ అందించింది. అంతేకాదు టూవీలర్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఆన్–రోడ్ ఖరీదు మొత్తాన్ని రుణంగా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ ఈ పండుగ సీజన్‌కు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్: ఎందుకంటే ప్రతి రోజూ దీపావళి రాదు‘ పేరిట యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించింది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 స్థానిక దుకాణాదారుల నుంచి కొనుగోళ్లు జరిపితే 20 శాతం దాకా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు, కాబట్టి కస్టమర్లు, యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ సుమిత్ బాలి పిలుపు ఇచ్చారు. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్! -
ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?
ప్రజలు సాధారణంగా తమ కలల గృహాన్ని కొనుగోలు చేయడం కోసం గృహ రుణం(Home Loan) తీసుకుంటారు. గృహ రుణాలు ఎక్కువగా దీర్ఘకాలం వరకు ఉంటాయి. అయితే గృహరుణం తీసుకున్న తర్వాత కొందరు ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం గృహ రుణాల ఈఎమ్ఐ చెల్లించకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. అవేంటో తెలుసుకుందాం.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం మీరు గనుక హోమ్ లోన్ ఈఎమ్ఐ కట్టకపోతే ఆలస్య ఫీజులు కింద జరిమానాలు విధిస్తారు. ఈ పెనాల్టీ ఛార్జ్ సాధారణంగా ఈఎమ్ఐలో 1-2% వరకు ఉంటుంది. అయితే, పరిస్థితిని బట్టి, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కాలానికి మొత్తం బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణదాత వసూలు చేసే ఆలస్య ఫీజులకు ఇది అదనంగా ఉంటుంది. ఒక్క ఈఎమ్ఐ పేమెంట్ కట్టకపోయిన అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. మీ ఇంటి రుణంపై సింగిల్ డిఫాల్ట్ వల్ల మీ క్రెడిట్ స్కోరు 50-70 పాయింట్ల వరకు తగ్గవచ్చు. అటువంటి పరిస్థితి వల్ల తర్వాత ఏదైనా లోన్ పొందే అవకాశం కోల్పోతారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త కంపెనీలు) నిరర్ధక ఆస్తిగా లోన్ అయితే, ఒకవేళ మీరు ఈఎమ్ఐని మిస్ అయినట్లయితే చివరి పేమెంట్ చేసిన 90 రోజుల్లోగా కట్టాల్సి ఉంటుంది. ఇది చిన్న డిఫాల్ట్ గా వర్గీకరిస్తారు. మీరు సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే దాని ప్రభావం నుంచి మీరు కోలుకోవచ్చు. మిస్ అయిన ఈఎమ్ఐని తర్వాత గడువు తేదీనాటి నుంచి చెల్లించండి. అలాగే, మిగతా ఈఎమ్ఐలను మిస్ కాకుండా చూసుకోండి. ఉద్యోగ నష్టం/ ఆరోగ్య పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణదాతను సంప్రదించండి. వారిని ఏదైనా పరిష్కారం చెప్పమనండి. మీ రుణం నిరర్ధక ఆస్తి(ఎన్‌పిఎ)గా మారడానికి ముందు మీ బకాయిలను చెల్లించడానికి మీకు 90 రోజుల గడువు ఉంది. ఒకవేళ మీరు 90 రోజుల తర్వాత కూడా మీ ఈఎమ్ఐ బకాయిలను తిరిగి చెల్లించలేకపోతే SARFAESI 2002 చట్టం ప్రకారం.. మీ ఆస్తిని వేలం వేసే హక్కు రుణదాతకు లభిస్తుంది. కాబట్టి, అలా౦టి పరిస్థితుల నుంచి తప్పి౦చుకోవడానికి ము౦దుగానే చర్యలు తీసుకో౦డి. గృహ రుణ ఎగవేత నుంచి తప్పించుకోవడం కోసం మీరు మీ రుణదాతను తక్కువ ఈఎమ్ఐ కోసం అభ్యర్థించవచ్చు.ఒకవేళ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయిన/మీ వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే ఈఎమ్ఐ చెల్లింపులపై బ్యాంకులు మీకు మూడు నుంచి ఆరు నెలల మాఫీని ఇవ్వవచ్చు. అయితే, రుణదాత తర్వాత ఈ కాలానికి బకాయి రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయవచ్చు. (చదవండి: రిలయన్స్ జియో సరికొత్త రికార్డు..!) ఆస్తిపై హక్కులు చేజారిపోతాయి మీరు ఇక రుణం చెల్లించని పక్షంలో మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇతర సంస్థలు గానీ ఇంటి వాస్తవ విలువను అంచనా వేసి తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. ఒకవేళ వేలంలో పేర్కొన్న విలువ వాస్తవ విలువ కంటే తక్కువ అని యజమాని భావిస్తే ఆ సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంత వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకున్న తర్వాత అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని మీకు పంపిస్తుంది. మరో మార్గం ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు మరో మార్గం ఉంటుంది. బ్యాంక్/రుణం తీసుకున్న సంస్థ వేలం వేయడానికి ముందే మీరు ఆ ఇంటిని విక్రయించండి. ఎందుకంటే, రుణదాతలు ఎక్కువ సార్లు మార్కెట్ విలువ కంటే తక్కువకు ఆ ఇంటిని విక్రయిస్తాయి. దీని వల్ల మీరు మరింత నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఆ ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఈఎమ్ఐని ఒకేసారి క్లియర్ చేయండి. దీని వల్ల మీరు కొంత లాభపడే అవకాశం ఉంది. మీకు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి గృహ రుణం తీసుకునే ముందు మీ ఆదాయంలో 40% ఈఎమ్ఐ చెల్లింపులు ఉండే విధంగా చూసుకోండి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది) -
హౌసింగ్ లోన్, పోటీ పడి మరీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో నెలకొనే గృహ రుణ డిమాండ్‌లో మెజారిటీ వాటా పొందడానికి పోటీ పడుతున్న బ్యాంకుల్లో తాజాగా ప్రైవేటు రంగంలోని హెచ్ఎస్బీసీ, యస్ బ్యాంక్ లు చేరాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... వడ్డీ భారం ఎక్కువై ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణం మార్చుకునే వారికి (బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్) సంబంధించి వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.45 శాతంగా అమలు చేస్తున్నట్లు హెచ్ఎస్బీసీ ప్రకటించింది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఇది అతి తక్కువ గృహ రుణ వడ్డీరేటు. ► ఇక కొత్త రుణాల విషయంలో బ్యాంక్ 6.70 శాతం వడ్డీ ఆఫర్ ఇస్తోంది. ఇది ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు సమానం. ► డిసెంబర్ 31 వరకూ అమలవుతుందని, తాజా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండబోదని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ► యస్ బ్యాంక్ కూడా 6.70 శాతానికి గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. వేతనం పొందే మహిళలకు సంబంధించి ఈ ఆఫర్ 6.65 శాతంగా ఉంటుంది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. ఇక మరో ప్రభుత్వ రంగ బీఓబీ కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుందని ప్రకటించింది. ప్రభుత్వ రంగ పీఎన్బీ కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది. హెడ్‌డీఎఫ్‌సీ రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది. చదవండి: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!
Bajaj Housing Finance Home Loan Rates: మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(బిహెచ్ఎఫ్ఎల్) నేడు (అక్టోబర్ 1) గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. వేతన, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం & ఉపాధి ఉన్న దరఖాస్తుదారులు ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహితలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో తెలిపింది. ఇప్పటికే ఉన్న గృహ రుణం తీసుకున్న వినియోగదారులు గృహ రుణ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవడం ద్వారా కొత్త రేటును పొందవచ్చని సంస్థ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)తో సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సీ)లు ఇటీవల పండుగ ఆఫర్లలో భాగంగా గృహ రుణ రేట్లలో భారీగా కోత విధించాయి. సెప్టెంబర్ 21న హెచ్డీఎఫ్సీ పండుగ ఆఫర్లలో భాగంగా 6.7 శాతానికే గృహ రుణాలను అందిస్తుందని తెలిపింది. రుణ మొత్తం, ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుంది. (చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్!) -
హోమ్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్ట పడుతారు. అయితే, వారి దగ్గర ఉన్న సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కట్టుకుంటారు. అయితే, అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశంలోని అతిపెద్ద రుణదాత 6.70 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ఎస్బీఐ ఇటీవలి ప్రకటనలో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు గృహ రుణం పొందడానికి అవసరమైన పత్రాల జాబితాను విడుదల చేసింది. ఎస్బీఐ గృహ రుణాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!) ఉద్యోగి గుర్తింపు కార్డు లోన్-అప్లికేషన్: పూర్తిగా నింపిన రుణ దరఖాస్తు ఫారం మీద మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అతికించాలి. గుర్తింపు రుజువు (ఏదైనా ఒకటి): పాన్ /డ్రైవర్ లైసెన్స్/ పాస్ పోర్ట్/ఓటర్ ఐడి కార్డు నివాస రుజువు లేదా చిరునామా(ఏదైనా ఒకటి): ఇటీవల విద్యుత్ బిల్లు/టెలిఫోన్ బిల్లు/ వాటర్ బిల్లు/ పైప్డ్ గ్యాస్ బిల్లు లేదా పాస్ పోర్ట్/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ప్రాపర్టీ పేపర్లు: నిర్మాణానికి అనుమతి (వర్తించే చోట) అమ్మకానికి నమోదు చేసుకున్న ఒప్పందం (మహారాష్ట్రకు మాత్రమే)/అమ్మకానికి స్టాంప్డ్ ఒప్పందం/కేటాయింపు లేఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఆస్తిని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంటే) మెయింటెనెన్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఆమోదించబడ్డ ప్లాన్ కాపీ(జిరాక్స్ బ్లూప్రింట్), బిల్డర్ రిజిస్టర్డ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్, కన్వేయన్స్ డీడ్(కొత్త ఆస్తి కోసం) చెల్లింపు రసీదులు లేదా బిల్డర్ లేదా విక్రేతకు చేసిన అన్ని చెల్లింపులను చూపించే బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ బ్యాంక్ ఖాతా వివరాలు దరఖాస్తుదారుడు కలిగి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్లు ఒకవేళ ఇతర బ్యాంకులు నుంచి రుణం తీసుకుంటే, గత సంవత్సరం రుణ ఖాతా స్టేట్ మెంట్ వేతన దరఖాస్తుదారుడు శాలరీ స్లిప్ లేదా గత మూడు నెలల వేతన సర్టిఫికేట్ గత రెండు సంవత్సరాలుగా ఫారం 16 కాపీ లేదా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐటి రిటర్న్‌ల కాపీ వేతనేతర దరఖాస్తుదారుడు బిజినెస్ చిరునామా రుజువు గత మూడు సంవత్సరాల ఐటి రిటర్న్స్ గత మూడు సంవత్సరాలుగా బ్యాలెన్స్ షీట్, లాభం మరియు నష్టం ఖాతా బిజినెస్ లైసెన్స్ వివరాలు(లేదా సమానమైనవి) టీడీఎస్ సర్టిఫికేట్ (ఫారం 16ఏ - ఒకవేళ వర్తిస్తే) అర్హత సర్టిఫికేట్(సి.ఏ/డాక్టర్ లేదా ఇతర ప్రొఫెషనల్స్ కోసం) -
రూ. 2 కోట్ల గృహ రుణానికీ 6.66% వడ్డీ
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) ఇకపై రూ.2 కోట్ల వరకూ గృహ రుణంపై కూడా అతి తక్కువ వడ్డీరేటు 6.66 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకూ రూ.50 లక్షల రుణం వరకూ ఉన్న ఈ అతితక్కువ వడ్డీరేటు ఆఫర్‌ను రూ.2 కోట్ల వరకూ రుణానికి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కొత్త రుణ గ్రహీతలకు రూ.50 లక్షల వరకూ 6.66 శాతం వద్ద అతితక్కువ రుణ రేటు నిర్ణయాన్ని ఈ యేడాది జూలైలో సంస్థ ప్రకటించింది. అయితే 6.66 శాతం వడ్డీరేటు కోరుకునే వారికి సిబిల్ స్కోర్ 700, ఆపైన ఉండాలి. 2021 సెపె్టంబర్ 22 నుంచి నవంబర్ 30 మధ్య రుణ మంజూరు జరిగి, మొదటి దఫా రుణ పంపిణీ 2021 డిసెంబర్‌లోపు జరిగి ఉండాలి. వేతనం పొందుతున్న వారితోపాటు స్వయం సంపాదనా పరులకూ తాజా నిర్ణయం వర్తిస్తుందని సంస్థ ఎండీ, సీఈఓ వై విశ్వనాథ్ గౌడ్ తెలిపారు. రూ.2 కోట్ల వరకూ రుణం తీసుకున్న సందర్భంలో రుణ మొత్తంపై 0.25% లేదా గరిష్టంగా రూ.10,000కానీ ఏది తక్కువైతే అంతమొత్తం ప్రాసెసింగ్ ఫీజు రాయితీ లభిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. గృహ రుణానికి ఆన్లైన్ దరఖాస్తు, ఆమోదానికి ఉద్దేశించి ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఇటీవలే ‘హోమై యాప్’ను ఆవిష్కరించింది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) , పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హెచ్డీఎఫ్సీ గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. -
హెచ్డీఎఫ్సీ గృహ రుణ రేటు 6.7 శాతానికి డౌన్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో గృహ రుణ మార్కెట్లో తన వాటా పెంపు లక్ష్యంగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది. తద్వారా ఇప్పటికే ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్న ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వరుసలో నిలిచింది. ముఖ్యాంశాలు చూస్తే... ►అన్ని గృహ రుణ శ్లాబ్‌లకు, 800 ఆపైన క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 6.7% వడ్డీ ఆఫర్ వర్తిస్తుంది. ►సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ►ఇంతక్రితం వేతన జీవులకు క్రెడిట్ స్కోర్ 800 దాటిఉండి, తీసుకునే రుణం రూ.75 లక్షలపైన ఉంటే 7.15 శాతానికి వడ్డీరేటు లభించేది. స్వయం ఉపాధి పొందుతున్న వారి విషయంలో ఈ రేటు 7.30 శాతంగా ఉండేది. దీని ప్రకారం ఈ 2 కేటగిరీల్లో తాజాగా రుణ రేటు వరుసగా 0.45%, 0.60% తగ్గినట్లయ్యింది. ►క్రెడిట్ స్కోర్ అధికంగా ఉండే వారికి వర్తించే తాజా ఆఫర్ అక్టోబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ►అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70% నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇక బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75% వద్ద ప్రారంభమవుతుందని తాజాగా ప్రకటించింది. అదేవిధంగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది. -
లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్
మీరు కొత్తగా హోమ్ లోన్, వ్యక్తి గత రుణాలు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. బ్యాంకులు కొద్ది రోజుల నుంచి వడ్డీ రేట్లు తగ్గయిస్తున్నాయి. ఈ విషయంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందువరుసలో ఉన్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెపో అనుసంధానిత రుణ రేటును(ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.80 శాతం నుండి 6.55 శాతానికి తగ్గించింది. బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తగ్గిస్తున్న ఆర్ఎల్ఎల్ రేటు అనేది నేటి(17-09-2021) నుంచి అమలులోకి రానుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు చాలా బ్యాంకులు తమ గృహ రుణాలను రెపో రేటుకు లింక్ చేయడం ప్రారంభించాయి. దీంతో రెపో రేటు తగ్గినప్పుడు రుణగ్రహీతలు వెంటనే ప్రయోజనం పొందుతారు. రెపో రేటు అంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణం రేటు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకొనేటప్పుడు ఫ్లోటింగ్ రేటు ఎంచుకున్న రుణగ్రహితలకు దీని వల్ల లాభం చేకూరుతుంది. ఆర్ఎల్ఎల్ఆర్ రేటు తగ్గడం వల్ల అంత మేర మీరు ప్రతి నెల వడ్డీ తగ్గుతుంది. ఈ బ్యాంకుతో పాటు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్ శుభవార్త!) -
పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం
ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ పండుగ రాకముందే ఖాతాదారులకు ఆఫర్ల వర్షం కురిపించింది. త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారంగా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో కేవలం 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇంతకు ముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాన్ని పొందాలంటే రుణగ్రహీత 7.15% వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టడంతో రుణగ్రహీత ఇప్పుడు 6.70% కంటే తక్కువ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. రూ.8 లక్షలు ఆదా.. ఈ ఆఫర్ వల్ల 45 బీపీఎస్ పాయింట్లు ఆదా అవుతుంది. దీని వల్ల పరోక్షంగా రుణగ్రహీతకు రూ.8 లక్షలకు పైగా భారీ వడ్డీ ఆదా కానున్నట్లు సంస్థ పేర్కొంది. 30 సంవత్సరాల కాలానికి రూ.75 లక్షల రుణం అందించే అవకాశం ఉంటుంది. అలాగే, గతంలో వేతనేతర రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు వేతన రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు మధ్య 15 బీపీఎస్ వ్యత్యాసం ఉండేది. వేతన, వేతనేతర రుణగ్రహీతల మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎస్బీఐ తాజాగా తొలగించింది. ఇక వేతనేతర రుణగ్రహీతలకు 15 బీపీఎస్ వడ్డీ ఆదా అవుతుంది. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) ఈ కొత్త ఆఫర్ల వల్ల పండుగ సీజన్లో ఖాతాదారులు, రుణగ్రహితలు మరింత సంతోషంగా పండుగలు జరుపుకుంటారు అని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ సెట్టీ మాట్లాడుతూ.. "ఈసారి, మేము ఆఫర్లను మరింత సమ్మిళితంగా చేసాము. రుణ మొత్తం అనేది రుణగ్రహీత వృత్తితో సంబంధం లేకుండా అందిరికి ఒకేవిధంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 6.70% వడ్డీరేటు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీ వడ్డీ రేట్లు గృహ రుణాలను మరింత చౌకగా చేస్తాయని మేము నమ్ముతున్నాము. ఈ మహమ్మారి సమయంలో మన దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. ప్రతి భారతీయుడికీ బ్యాంకర్ గా అందరికీ గృహవసతి కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో మా వంతు కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఆయన అన్నారు. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉందా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులకు తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు అందిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలనే వారి కోసం వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించింది. గృహ రుణాలపై ఇప్పటివరకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది.(చదవండి: మీ క్రెడిట్ స్కోరు వేగంగా ఎలా పెంచుకోవాలి..?) రుణ పరిమితి ఎంత? ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం.. సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు రూ.50 లక్షల రుణంపై వడ్డీ రేటు 6.90 శాతంతో ప్రారంభమవుతుంది. 700 కంటే ఎక్కువ స్కోరు ఉన్న వినియోగదారులకు రూ.80 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ రేటు పడనుంది. మీ సిబిల్ స్కోరు అనేది ఒక వ్యక్తి ఇంతకు ముందు రుణం తీసుకున్నాడా? ఒకవేళ రుణం తీసుకున్నట్లయితే సకాలంలో చెల్లించాడా అనే దానిపై స్కోరు ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్లను రుణదాతలు చెక్ చేసేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. -
దశాబ్దం కనిష్టానికి కోటక్ మహీంద్రా గృహ వడ్డీ
ముంబై: పండుగల సీజన్లో గృహ రుణ మార్కెట్లో వాటా పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ విభాగంలోని వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ గృహ రుణ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జూ్యమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుచ్ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్ రెండు నెలలు అంటే నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగిన ఉద్యోగులకు మాత్రమే దిగువ స్థాయి రుణ రేటు ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ గృహ రుణ విభాగం మంచి పనితీరును కనబరుస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎస్బీఐ శుభవార్త!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. 2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని ప్రకటించింది. "ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, గృహ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. గృహ రుణాలపై అందించే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. This Independence Day, step into your dream home, with ZERO* processing fee on Home Loans. Apply Now: https://t.co/N45cZ1DqLD #SBIHomeLoan #FreedomFromRent #SBI #StateBankOfIndia #AzadiKaAmrutMahotsav pic.twitter.com/Gs2qunIDwL — State Bank of India (@TheOfficialSBI) August 13, 2021 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజును ఉండదు. ఎస్బీఐ మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎస్బీఐ యోనో వినియోగదారులకు కూడా యోనో ద్వారా అప్లై చేస్తే 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎస్బీఐ కస్టమర్లకు 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు పొందవచ్చు. రుణగ్రహీతలు గృహ రుణం కొరకు 7208933140 నెంబరుకు మిస్ డ్ కాల్ ఇవ్వవచ్చు. -
లోన్ ఇవ్వనందుకు ఎస్బీఐకి మొట్టికాయ
సాక్షి, హైదరాబాద్: ఇంటి కొనుగోలుకు అవసరమైన రుణం మంజూరు చేయనందుకు బాధితుడికి రూ. 20 వేల ఖర్చును వడ్డీతో పాటు చెల్లించాలని, పరిహారం కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వినియోగ దారుల ఫోరం–3... 2018లో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ఎంఎస్కే జైస్వాల్ బుధవారం తాజా ఉత్తర్వులు ఇచ్చారు. టీఎస్ఆర్టీసీలో ఉద్యోగిగా పని చేస్తున్న గుడవల్లి భాస్కర్‌బాబు.. మలక్‌పేటలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు రూ. 10 లక్షల రుణం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీఎస్ఆర్టీసీ బ్రాంచ్‌లో 2017 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగి కావడంతో అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, ఫ్లాట్ విలువ వివరాలను నిపుణుల నుంచి తీసుకొని ఎస్బీఐకి సమర్పించారు. దరఖాస్తుదారుడి వివరాలను పరిశీలించిన ఎస్బీఐ కేవలం రూ. 4,35,000 మాత్రమే మంజూరు చేసింది. దీంతో భాస్కర్‌బాబు లక్ష రూపాయల పరిహారం, జరిగిన నష్టానికి రూ. 50,000 చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం–3ని ఆశ్రయించారు. తాను రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, వాల్యుయేషన్ సర్టిఫికేట్ తదితర వాటి కోసం చేసిన ఖర్చు వివరాలను పొందుపరిచారు. దీనిపై విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం–3 ఫిర్యాదుదారుడికి ఖర్చుల కింద రూ.40 వేలు, రుణం విషయంలో వేధింపులకు గాను రూ.50 వేలు, మరో 3వేలు ఇతర ఖర్చులకు ఇవ్వాలని 2018 డిసెంబర్ 12న ఆదేశించింది. దీనిపై ఎస్బీఐ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడు, ఎస్బీఐతో పాటు ఈ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను, సంస్థలను విచారించిన కమిషన్, భాస్కర్బాబుకు ఖర్చుల కింద రూ.20 వేలు, పరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని బుధవారం ఆదేశించింది. రూ. 20 వేలకు జూన్ 2017 నుంచి ఇప్పటివరకు 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని పేర్కొంది. -
మీరు అప్పులు చేస్తున్నారా? అవసరాల కోసం కాకుంటే మంచిదే!
అవసరాలు గట్టెక్కేందుకేనా అప్పు.. ఇలానే ఎందుకు ఆలోచించాలి..? కొంచెం భిన్నంగా ‘రుణంతో ఆస్తులను కూడబెట్టుకుందాం’ అని సంకల్పం చెప్పుకోవచ్చుగా..! ఇలా ఆలోచించే వారు రుణంతో నిజంగానే సంపదను సృష్టించుకోవచ్చు. అందుకు మార్గాలు కూడా ఉన్నాయి. అవసరాలు ఎదురై అప్పును ఆశ్రయించే వారే మన సమాజంలో ఎక్కువ. కానీ, కొందరు తెలివిగా అదే అప్పుతో ఆస్తులను సమకూర్చుకునే విధానాలను అనుసరిస్తుంటారు. ఇటువంటి వారు మిగిలిన వారికి భిన్నం. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉన్నాయి. తక్కువ వడ్డీ వ్యయాలను అనుకూలంగా చేసుకుని రుణంతో ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మంచి మార్గం. కరోనా కారణంగా ఆర్థిక వృద్ధి కనిష్టాలకు చేరిన తరుణంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను సాధ్యమైనంత కనిష్టాలకు తీసుకొచ్చింది. దీనికితోడు ప్రాపర్టీల ధరలు కూడా దిగివచ్చాయి. పన్ను ప్రయోజనాల కోణం నుంచి చూసినా రుణంతో ఆస్తి ఏర్పాటుకు అనుకూల సమయం ఇదేనంటున్నారు నిపుణులు. రుణంతో ఆస్తిని సమకూర్చుకోవాలన్నా.. సంపద సృష్టికి అడ్డుగా ఉన్న రుణాల భారాన్ని దింపుకోవాలన్నా.. అందుకు ఏం చేయాలన్నది ప్రాఫిట్ ప్లస్ కథనంతో తెలుసుకుందాం.. వడ్డీ రేట్ల పరంగా చూస్తే రుణానికి ఇదే మంచి తరుణం. కానీ, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అస్థిరతలను పరిశీలిస్తే రుణం తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు లేదా గృహ నవీకరణ తదితర వినియోగ రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి ఆస్తులను తెచ్చి పెట్టేవి కావు. దీనికి బదులు ఇల్లు సమకూర్చుకునేందుకు లేదా వాణిజ్య సముదాయం లేదా వాణిజ్య భవనాన్ని కొనుగోలు చేసేందుకు రుణం బాట పట్టడం అనుకూలమైనదే. ‘‘ఆదాయం విషయమై అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తుల ఆధారిత రుణాలు మరింత ఆర్థవంతమైనవి’’ అని మైలోన్‌కేర్ సీఈవో గౌరవ్ గుప్తా అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ వ్యయాలు వార్షికంగా 11–36 శాతం వరకు ఉన్నాయి. కానీ, గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.63 శాతం నుంచే అందుబాటులో ఉన్నాయి. ‘‘మొదటిసారి ఇంటిని సమకూర్చుకునే వారికి ఇది మంచి తరుణం. ఎందుకంటే ప్రాపర్టీల ధరలు, వడ్డీ రేట్లు ఇంత తక్కువ ఎప్పుడూ లేవు’’ అని మైమనీ మంత్ర ఎండీ రాజ్‌ఖోస్లా పేర్కొన్నారు. నాణేనికి మరో కోణం అన్నట్టు.. ఇతర అవసరాలకు కూడా రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితులు, అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం వంటి అంశాలు రుణం తీసుకునేందుకు దారితీయవచ్చు. ఒకవేళ ఇవే పరిస్థితులు ఎదురైతే వ్యక్తిగత రుణాలకు బదులు బంగారంపై రుణాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే రుణం పొందేందుకు ఇది సులభమార్గం. ‘‘బ్యాంకులు బంగారం విలువ లో 90% వరకు రుణంగా ఇస్తున్నాయి. అయితే బంగారం ఆభరణాల విలువలో 60–70 శాతానికి మించి రుణం తీసుకోకపోవడమే మంచిది’’ అని ఖోస్లా సూచించారు. మిగులు నిధులు ఉంటే..? అందుబాటులో ఉన్న మార్గాల్లో ఏది మెరుగైనదన్న పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారు.. తమ వద్ద మిగులు నిధులు ఉన్నాయని చెప్పి గృహ రుణాన్ని తీర్చేద్దామనుకుంటున్నారా..? దీనికంటే కూడా మెరుగైన రాబడులను ఇచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే గృహ రుణంపై వడ్డీ రేటు 7 శాతం స్థాయిలో ఉన్నప్పుడు.. దీన్ని తీర్చేయడానికి బదులు దీర్ఘకాలం కోసం ఈక్విటీలు లేదంటే మరో ప్రాపర్టీని సమకూర్చుకునే ఆలోచన చేయవచ్చు. పైగా గృహ రుణం వల్ల ఎంతో పన్ను ఆదా చేసుకునే చక్కని మార్గం కూడా ఉంది. తమవద్ద మిగులు నిల్వలతో గృహ రుణాన్ని తీర్చేద్దామని అనుకునేవారు దీనికి బదులు అధిక వడ్డీ భారంతో ఉన్న ఇతర రుణాలను తీర్చేసే ఆలోచన కూడా చేయవచ్చు. అధిక వడ్డీతో కూడిన రుణాలను వదిలించుకోవడం కూడా సంపద సృష్టించుకునే మార్గాల్లో ఒకటి. ‘‘రుణ గ్రహీత వద్ద మిగులు నిల్వలు ఉంటే వాటితో అధిక వడ్డీ పడే క్రెడిట్‌కార్డు, వ్యక్తిగత, ఆటో రుణాలను వదిలించుకోవడాన్ని పరిశీలించొచ్చు’’ అని ఖోస్లా సూచించారు. చెప్పడానికి, ఆచరించడానికి మధ్య ఎంతో అంతరం ఉంది. కనుక మిగులు నిధులు ఉన్న వారు దీర్ఘకాలంలో మెరుగైన విలువను తెచ్చిపెట్టే ఆస్తులపై ఇన్వెస్ట్ చేయలేక.. తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎఫ్డీపై వడ్డీ రేటు 6 శాతం వస్తుంది. దీనిపై ఆదాయపన్ను కూడా పడుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం తీసివేసి చూస్తే మిగిలేదేమీ ఉండదు. అందుకుని ఇటువంటి వారు ప్రస్తుత రుణాలను (గృహ రుణం అయినా సరే) తీర్చేయడానికి మిగులు నిధులను వినియోగించుకోవచ్చు. సంపద సృష్టికి రుణంతో ఆస్తిని సమకూర్చుకోవడం ఎంత ముఖ్యమో.. అధిక వడ్డీ భారంతో ఆదాయాన్ని మింగేస్తున్న రుణాలను వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. తమ వద్దనున్న నిధులపై కనీసం 10 శాతం పైన రాబడులు సమకూర్చుకునే మార్గం ఉంటే గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి దూరంగా ఉండొచ్చని మైలోన్‌కేర్ గుప్తా సూచించారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రుణాలకు చేసే చెల్లింపులు ఆదాయంలో 50 శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. పన్ను ప్రయోజనాలు.. రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే కాదు.. పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇంటి రుణ ఈఎంఐలో (నెలవారీ వాయిదా) వడ్డీ భాగంతోపాటు అసలు కూడా కొంత కలసి ఉంటుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే అసలు చెల్లింపులు గరిష్టంగా రూ.1.5 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను చెల్లించక్కర్లేదు. అదే విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపైనా సెక్షన్ 24(బి) కింద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా సెక్షన్ 80ఈఈఏ కింద అందుబాటు ధరల ఇంటికి తీసుకున్న రుణం అయితే మరో రూ.1.50లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే రుణాన్ని ముందుగానే తీర్చివేస్తే ఈ పన్ను ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. పన్ను ప్రయోజనం కోసమే ఇంటి గురించి ఆలోచిస్తున్నట్టు అయితే రూ.20 లక్షల గృహ రుణం తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఖోస్లా. 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను ప్రయోజనాన్ని పొందేందుకు రూ.20 లక్షల రుణం చాలంటున్నారు. ఈ మొత్తంపై వార్షికంగా రూ.50,000–60,000 మేర పన్ను ఆదా చేసుకోవచ్చు. అధిక పన్ను పరిధిలో ఉన్న వారు అందుబాటు ధరల్లోని ఇంటిని రూ.20 లక్షల రుణంతో కొనుగోలు చేసుకోవచ్చని రిటైల్ లెండింగ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుకన్యకుమార్ సైతం సూచించారు. టాపప్ లోన్ ఇప్పటికే గృహ రుణం తీసుకుని కొంత తీర్చేశారనుకుందాం. దీనిపై టాపప్ రుణాన్ని పొందే అర్హత పొందినట్టే. అంటే అదనంగా మరికొంత రుణాన్ని తీసుకోవచ్చు. అప్పటికే కొనసాగుతున్న గృహ రుణంపై రేటుతో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటు టాపప్ లోన్‌పై అమలవుతుంది. అయినప్పటికీ వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలతో పోలిస్తే చాలా తక్కువే ఉంటుంది. అందుకుని టాపప్ లోన్ తీసుకుని ప్లాట్ కొనుగోలును పరిశీలించొచ్చు. కాకపోతే టాపప్ లోన్ విషయంలో బ్యాంకులు ప్రస్తుతం కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ‘‘ప్రాపర్టీల ధరలు తగ్గాయి. గతంలో రూ.కోటి విలువైన ఇంటి ధర ప్రస్తుతం రూ.80 లక్షలకు తగ్గిపోయింది. కనుక విలువ పరంగా చూస్తే ఇంటి రుణంపై టాపప్ లోన్‌ను ఇచ్చేందుకు క్రెడిట్ మేనేజర్లు సౌకర్యంగా భావించడం లేదు’’ అని సుకన్య కుమార్ వివరించారు. అయితే వ్యక్తిగత రుణ చరిత్ర, ఆదాయం ప్రకారం తగిన అర్హతలు ఉంటే టాపప్ లోన్‌ను సులభంగానే పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రుణంతో ఇంటిని కొనుగోలు చేసిన ఆ ఇంటి వ్యాల్యూషన్ పెరిగిపోయినట్టయితే మరింత అధికంగా టాపప్లోన్ను అర్హత లభించినట్టే. ఒక వేళ గతంలో రుణ చెల్లింపుల్లో విఫలమైన చరిత్ర ఉండి, రుణ మారటోరియాన్ని వినియోగించుకుని ఉంటే అప్పుడు బ్యాంకులు టాపప్‌లోన్ మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. పాత రుణంపై అధిక రేట్లు లోగడ ఎప్పుడో గృహ రుణం తీసుకున్నవారు ఇప్పటికీ అధిక వడ్డీ రేటే చెల్లిస్తుంటారు. ‘‘బేస్ రేటుతో అనుసంధానమైన గృహ రుణాలు తీసుకున్న వారికి ఇప్పటికీ అధిక వడ్డీ రేటే అమలవుతోంది. కస్టమర్లు అడగకుండా బ్యాంకులు సొంతంగా పాత రుణాలను కొత్త విధానంలోకి మార్చే చర్యలు తీసుకోవు’’ అని సుకన్య కుమార్ పేర్కొన్నారు. కనుక పాత విధానాల్లో గృహ రుణం తీసుకున్న వారు రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లు ఆధారిత రేట్ల విధానానికి మారిపోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు నూతన విధానంలో బ్యాంకులు సైతం వేగంగా ఆ మేరకు రుణ రేట్లను సవరిస్తున్నాయి. ‘‘గృహ రుణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఉన్నట్టయితే అది ప్రైమ్ లెండింగ్ రేటు అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో రెపో రేటుకు ఆ రుణాన్ని మార్చుకోవా లనుకుంటే అందుకు బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఒక మార్గం’’ అని మైలోన్ కేర్‌కు చెందిన గుప్తా సూచించారు. రుణం బదిలీ ప్రస్తుతం గృహ రుణాలపై రేట్లు 6.63–7.25% మధ్య ఉన్నాయి. ‘‘ప్రస్తుత మీ గృహ రుణ రేటు ఈ రేట్ల కంటే 0.35 శాతం లేదా అంతకు మించిన వ్యత్యాసంతో ఉంటే తగ్గించాలని రుణదాతను కోరాలి. అది ఫలించకపోతే అప్పుడు మీ గృహ రుణం బ్యాలన్స్‌ను తక్కువ వడ్డీ రేటుతో ఆఫర్ చేస్తున్న సంస్థకు బదిలీ చేసుకోవాలి’’ అని మార్ట్గేజ్ వరల్డ్ వ్యవస్థాపకుడు విపుల్ పటేల్ సూచించారు. అయితే రుణాన్ని బదిలీ చేసుకోవడం ఎంత మేర ప్రయోజనం ఉంటుందన్నది ముందే అంచనాకు రావాలి. ఎందుకంటే రుణాన్ని బదిలీ చేసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలను భరించాల్సి రావచ్చు. మార్ట్గేజ్ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ చార్జీలు మిగిలే ప్రయోజాన్ని హరించొచ్చు. ఈ చార్జీలు రూ.10,000–20,000 మధ్యన ఉండొచ్చు. న్యాయ, సాంకేతిక చార్జీల రూపంలో మరో రూ.2,500–10,000 వరకు చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇటువంటి చార్జీలన్నీ మినహాయించిన తర్వాత తగిన మిగులుంటుందని భావిస్తే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూలై 2న ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ కింద గృహ రుణ వడ్డీ రేట్లను 6.66 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఆగస్టు 31, 2021 లోపు రుణాలు కోసం దరఖాస్తు చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని ఎల్ఐసీ తెలిపింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే, రుణగ్రహీతల సీబీల్ స్కోర్ కచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొంది. సీబీల్ స్కోర్ మంచిగా ఉన్న వారికి 6.66 శాతం నుంచి వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గరిష్టంగా 30 సంవత్సరాల గడువు వరకు గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రుణగ్రహీతలు గృహ రుణాల కోసం ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కి చెందిన HomY app ద్వారా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొంది. అలాగే, ఆన్లైన్ ద్వారానే రుణ దరఖాస్తులను ట్రాక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ HomY app ద్వారా తమ వినియోగదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందిస్తుందని తెలిపింది. మిగతా వివరాల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(https://www.lichousing.com) పోర్టల్ సందర్శించవచ్చు. LIC Housing Finance Ltd slashes Home loan rates to all time low of 6.66%. It's the right time to grab this offer and make your dream home come true...#LICHFL #homeloans #HousingForAll #deal #Offers #HomY — LIC Housing Finance Limited (@LIC_HFL) July 2, 2021 చదవండి: డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్ -
సులభంగా సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా..?
మీరు ఏదైన లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? లేదంటే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలి. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా కూడా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ బాగుంటే పర్వాలేదు. లేదంటే మీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. సిబిల్ స్కోరు అంటే ఏమిటి? సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL). మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యాయా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి. సిబిల్ ట్రాన్స్‌యూనియన్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను సూచించే 3 అంకెల సంఖ్య. సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. అధిక స్కోరు ఉంటే త్వరగా రుణాలు ఆమోదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి, స్కోరును ఎక్కువ శాతం 750 పైన ఉండే విధంగా చూసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే మీరు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును రద్దు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ స్కోర్ కనుక 750 కంటే తక్కువగా ఉంటే ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీరు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించే క్రమంలో కచ్చితంగా సమయానికి తిరగి చెల్లించడం చాలా ముఖ్యం. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సమయానికి ఈఎంఐ చెల్లించక పోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వండి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించండి. హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. ఒకవేళ మీరు కనుక రెండు రుణాలు తీసుకుంటే అసురక్షిత రుణాలు ముందుగా క్లోస్ చేయండి. మల్టీపుల్ క్రెడిట్ కార్డులను తీసుకోవడం మానేయండి. ఎక్కువ లోన్స్ లేదా కార్డులు తీసుకోవడం వల్ల రుణ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో అంతిమంగా క్రెడిట్ స్కోర్‌గా ఎఫెక్ట్ పడుతుంది. గడువు తేదీ కంటే ముందే క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించండి. ఎప్పుడు క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించండి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగాఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉమ్మడిగా రుణాలు తీసుకోవడం తగ్గించండి లేదా గ్యారెంటీగా ఉండటం మానుకోండి, ఎందుకంటే అవతలి వ్యక్తి వల్ల ఏదైనా డిఫాల్ట్ ఉంటే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ వంటి ప్రముఖ బ్యాంకుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్‌కు వ్యతిరేకంగా సెక్యూర్ కార్డు తీసుకుంటే, ఆ బకాయిలను నిర్ణీత తేదీ లోపు తిరిగి చెల్లించడం వల్ల మీ సిబిల్ స్కోరు పెరుగుతుంది. మీ క్రెడిట్ స్కోరు తక్కువగా రాకుండా ఉండటానికి మరొక రుణాన్ని తీసుకునే ముందు ప్రస్తుత రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా మంచిది. ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కోసం మీకు తగినంత నిధులు ఉండకపోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ త్వరగా పెరగాలంటే ఒక లోన్ తిరగి చెల్లించిన తర్వాతే మరో రుణాన్ని తీసుకోండి. రుణం తీసుకునేటప్పుడు డబ్బు తిరిగి చెల్లించడానికి ఎక్కువ కాలం ఎంచుకోండి. దీనివల్ల ఈఎంఐ తక్కువగా ఉండటం వల్ల మీ మీద ఆర్ధిక భారం తగ్గుతుంది. మీరు అన్ని చెల్లింపులను సకాలంలో సులభంగా చేయగలుగుతారు. మీరు డిఫాల్టర్ల జాబితా నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. అలాగే మీ స్కోర్ కూడా పెరగుతుంది. చాలా మంది తమ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడం కోసం ఇష్టపడరు. కానీ, ఈసారి అలాకాకుండా బ్యాంకులు మీ కార్డు లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆఫర్ చేస్తే తిరస్కరించొద్దు. దీని వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ లిమిట్ కూడా పెరుగుతుందని గమనించాలి. తక్కువ క్రెడిట్ కలిగి ఉండటం వల్ల మీ స్కోర్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితిని బట్టి మీ క్రెడిట్ స్కోర్‌ను పెరగడానికి 4- 13 నెలలు పడుతుంది. డబ్బు ఖర్చు చేసేటప్పుడు, రుణం తీసుకునేటప్పుడు తెలివిగా ఉండాలి. చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? -
హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?
వెబ్‌డెస్క్: సీజన్స్‌తో, సంక్షోభాలతో, సమస్యలతో సంబంధం లేకుండా డబ్బు అవసరమైన వారిని ఆదుకునేది ఏదైనా ఉందా అంటే అవి బ్యాంకులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు కోసం బ్యాంకులు పర్సనల్ లోన్ ఇస్తాయి. అలాగే, కొత్త ఇల్లు కొనుక్కోవాలి అన్న హోమ్ లోన్ పేరుతో బ్యాంకలు రుణాలు అందిస్తాయి. అయితే, ఇలా ధరఖాస్తు చేసుకున్న రుణాలను బ్యాంకులు తొందరగా ఆమోదించాలంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి. అందుకే ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సిబిల్ స్కోర్ గురుంచి ముందుగా తెలుసుకోవాలి. సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ నిర్ణయిస్తారు. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి. రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం? సిబిల్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను చూపిస్తుంది. మీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రుణదాత ఆమోదం తెలిపే శాతం పెరుగుతుంది. ఈ సిబిల్ స్కోర్ గతంలో మీరు తీసుకున్న రుణాల తిరిగి చెల్లించడంలో ఎంత బాధ్యతగా ఉన్నారు అని చూపిస్తుంది. సిబిల్ స్కోర్ లో మినిమం స్కోర్ 300 కాగా అత్యదిక స్కోర్ 900గా ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మీకు రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ స్కోర్ వస్తే.. మీ దరఖాస్తు చేసుకున్న లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ దరఖాస్తు ఆమోదం పొందాలంటే మీ క్రెడిట్ స్కోరు మాత్రమే ప్రమాణం కాదని గుర్తుంచుకోండి. మీకు నెలానెలా వచ్చే ఆదాయం, వేతనం ఎంత? ఆదాయంలోంచి వ్యయం పోగా మిగిలిన దాంట్లో తిరిగి రుణం చెల్లించే పరిస్థితి ఉందా లేదా? మీరు ఉంటున్న నగరం, అప్పులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలన్నింటినీ బ్యాంకులు పరిశీలిస్తాయి. వ్యక్తిగత రుణం కోసం ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి? మీరు ఇంటి అవసరాల కోసం వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ వెల్లడించిన వివరాల ప్రకారం 720-750 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే కానీ పర్సనల్ లోన్ మంజూరు చేయడం సులభం కాదు. అంతకంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే, మీరు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది లేదా సాధారణ స్థాయి వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేయడం జరుగుతుంది. గృహ రుణం ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి? బజాజ్ ఫిన్సర్వ్ వెల్లడించిన వివరాల ప్రకారం గృహ రుణం అనేది సురక్షితమైన లోన్, ఎందుకంటే మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు తాకట్టుగా పనిచేస్తుంది. అందువల్ల, మీ క్రెడిట్ స్కోరు 750 కన్నా తక్కువగా ఉన్నప్పటికీ గృహ రుణం పొందడం సాధ్యమవుతుంది. మీ క్రెడిట్ స్కోరు 650 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా కొంతమంది రుణదాతలు గృహ రుణాలను మంజూరు చేస్తారు. అయితే వడ్డీరేటు ఎక్కువ విధించే అవకాశం ఉంటుంది అని మరిచిపోవద్దు. చదవండి: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఎలా..? -
పేద వర్గాల కోసం పీఎన్బీ సరికొత్త హోమ్ లోన్ స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉన్నతి హోమ్ లోన్ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందిస్తున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. దీని కింద రూ.35 లక్షల దాకా లేదా ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా (ఉద్యోగులకు), స్వయం ఉపాధి పొందుతున్న వారికి 80 శాతం దాకా రుణం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టియర్-1 నగరాల్లో కనిష్టంగా రూ.8 లక్షలు, టియర్-2 నగరాల్లో రూ.6 లక్షల మేర రుణం పొందవచ్చన్నారు. ఇక నగర పరిధిలో 225 చ.అ. లేదా 40 చ.గ.ల్లో ఇంటి నిర్మాణానికి కూడా ఉన్నతి స్కీమ్ ద్వారా లోన్ పొందవచ్చని ప్రసాద్ వివరించారు. ఇంటి వద్దే బీమా పాలసీలు, సర్వీసులు అందించేందుకు పలు బీమా దిగ్గజాలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!
మీరు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీ దగ్గర సొంతిల్లు కట్టుకోవడానికి సరిపడినంత డబ్బులు మీ వద్ద లేవా? అయితే మీకు ఒక శుభవార్త. చాలా బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. అయితే గృహ రుణాలను బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తంతో కూడుకున్న వ్యవహారం. అందుకే వడ్డీ రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన దీర్ఘకాలంలో భారీ లాభం కనిపిస్తుంది. అందువల్ల వడ్డీ రేటు తక్కువున్న బ్యాంకులో లోన్ తీసుకోండి. మేము మీ కోసం చౌక వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు జాబితాను మీ కోసం అందిస్తున్నాం. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతం ఐసీఐసీఐ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.85 శాతం ఐడీబీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం కెనరా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం ఎస్బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గృహ రుణాల కనీస వడ్డీ రేటును పెంచింది. ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణ వడ్డీ రేట్లు 6.95 శాతం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వడ్డీ రేటులో మార్పు అనేది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో అతిపెద్ద రుణదాత అయిన ఎస్బీఐ మార్చిలో గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మార్చి నెలలో 6.70 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు గృహ రుణాలు అందించింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంది. బ్యాంకు ఇప్పుడు గృహ రుణాల వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేటు ఇప్పుడు 6.95 శాతంగా ఉంది. గృహ రుణాలపై ఏకీకృత ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇది రుణ మొత్తంలో 0.40 శాతం, అలాగే జీఎస్టీ చార్జీలు కూడా ఉంటాయి. మార్చిలో ఎస్బీఐ గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజును మార్చి 31 వరకు మాఫీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో గృహ కొనుగోలుదారులు ఇతర బ్యాంకుల వైపు చూసే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. ఇది దేశంలో అతిపెద్ద తనఖా రుణదాత. బ్యాంకు యొక్క గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్లు. చదవండి: షియోమీ కొత్త లోగోపై నెటిజన్ల ట్రోల్స్ -
లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు
మీ కలల గృహం లేదా కారు కోసం లోన్ తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. వివిధ అవసరాల కోసం లోన్ తీసుకునే వారి కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్, విదేశాలలో విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ వంటి మీకు అవసరమైన రుణం పొందొచ్చు. లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రుణం తీసుకోవాలని భావించే వారు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకోవాలని వారికీ వడ్డీ రేటు 6.7 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కొత్త కారు కోసం లోన్ పొందాలని చూస్తే 7.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. బంగారంపై లోన్ కోసం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఎడ్యుకేషన్ లోన్‌పై 9.3 శాతం వడ్డీ ఉంటే ఎస్బీఐ కొంత మంది కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. ఈ తరహా పర్సనల్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటు ఉండనున్నట్లు పేర్కొంది. ఇకపోతే సిబిల్ స్కోర్ ప్రాతిపదికన మీరు పొందే రుణంపై వడ్డీ రేటు మారొచ్చు. కొత్త ఇళ్ల కోసం రుణాలు తీసుకునే వారికీ ఇది వర్తిస్తుంది. చదవండి: నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్! -
ఎల్ఐసీ గ్రిహా వరిష్ట లోన్ తీసుకున్నవారికి శుభవార్త!
మీరు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ గ్రిహా వరిష్ట కింద హోమ్ లోన్ లేదా ప్లేట్ కోసం లోన్ తీసుకున్నారా అయితే మీకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్ధ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గ్రిహా వరిష్ట కింద లోన్ తీసుకున్న వారికీ ఆరు ఈఎంఐలు మాఫీని(వేవర్) ప్రకటించింది. రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ అఫర్ ప్రకటించింది. ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొంటే ఈ అఫర్ వర్తిస్తుంది. బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలలో 37వ, 38వ, 73వ, 74వ, 121వ, 122వ ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. పేన్షనర్ల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గృహ వరిష్ట పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. ఉద్యోగ పదవి విరమణ పొందిన వారు/ భవిష్యత్ లో ఖచ్చితమైన పెన్షన్ సదుపాయాన్ని కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి రుణ వడ్డీ రేటును తగ్గించింది. 700 కంటే ఎక్కువగా సిబిల్ స్కోరు ఉన్న వారికి 6.90 శాతం రుణ రేటు వర్తిస్తుంది. రుణాన్ని పొందాలని అనుకునే వారికి రూ.50 లక్షల వరకు కంపెనీ గృహ రుణం ప్రస్తుతం అందిస్తోంది. చదవండి: పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ! -
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
హోమ్ లోన్ అప్లై చేసే ముందు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి (స్పాన్సర్డ్)
ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు. అది దీర్ఘకాలిక ఆర్థిక కమిట్మెంట్ కాబట్టి హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఏళ్లలో వారి ఆదాయంలో పెద్ద మొత్తం దానికే పోతుంది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు ఇవి: 1. వడ్డీ చెల్లింపులు హోమ్ లోన్ తక్కువ వడ్డీరేట్లు పొందేందుకు ఆర్థిక సంస్థలను కంపేర్ చేయడం ముఖ్యం. అంతేకాదు రెండు రకాల వడ్డీరేట్లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం: ● ఫ్లోటింగ్ ● ఫిక్స్డ్ ఫ్లోటింగ్ రేట్లు అనేవి ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు, మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఎప్పుడు మారవు అన్నమాట. భవిష్యత్ లో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫార్సు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ రేట్లతో పోల్చితే ఫ్లోటింగ్ రేట్లు 1శాతం నుంచి 2 శాతం వరకు తక్కువుంటాయి. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు ఆర్థికవ్యవస్థలో కనిపించినప్పుడు ఫిక్స్డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. ఈఎంఐ మొత్తాలు చెల్లించేందుకు దరఖాస్తులు సౌకర్యవంతంగా ఉంటారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్ల మధ్య ఎంపిక చేసుకోవాలి. 2. వ్యవధి హౌసింగ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది, అంటే 360 వాయిదాలు. ఈఎంఐ భారం తక్కువుంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. అయితే వడ్డీ చెల్లింపును తగ్గించుకునేందుకు స్వల్పవ్యవధి అనువైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ చెల్లింపును స్వల్పకాలానికే లెక్కిస్తారు. ఉదాహరణకు, 15 సంవత్సరాల వ్యవధికి రూ.80 లక్షల హౌసింగ్ లోన్ ను 8.25 శాతం వార్షిక రేటు లెక్కన తీసుకుంటే ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే, చెల్లించే మొత్తం వడ్డీ రూ.59,70,000గా ఉంటుంది. ఒకవేళ ఈ రుణవ్యవధిని 20 ఏళ్లకు పెంచినట్టు అయితే, ఇన్స్టాల్మెంట్ మొత్తం రూ.68,165కు తగ్గుతుంది. కాని చెల్లించే వడ్డీ మొత్తం రూ.83.59,760 అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు హోమ్ లోన్ కాలిక్యూలేటర్ ఉపయోగించాలి. ఇన్స్టాల్మెంట్ మొత్తం తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయస్సు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 3. డౌన్ పేమెంట్ రుణమిచ్చే సంస్థలు ఆస్తివిలువలో కొంతమొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి, మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తిధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది75 శాతం నుంచి 90శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. రుణంగా ఎంత మొత్తం తీసుకోవాలి, బిల్డర్ లేదా అమ్మకందారుకు తన దగ్గరనున్న సొమ్ములోఎంత చెల్లించాలనే విషయాన్ని కొనుగోలుదారులు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. గణనీయస్థాయిలోడౌన్ పేమెంట్ చెల్లించేందుకు ముందుకు వస్తే హోమ్ లోన్(Home Loan) అర్హత అవకాశాలు మెరగువుతాయి. కాబట్టి, కుదిరిన పక్షంలో ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ గా చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన రీపేమెంట్ భారం కూడా తగ్గుతుంది. అర్హత విషయానికి వస్తే తమకు ముందుస్తు ఆమోదిత ఆఫర్ తో కూడిన హోమ్ లోన్ అందుబాటులోఉందా అన్నది పరిశీలించుకోవాలి. ఇలా చేయడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఇలాంటి ఆఫర్లు అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పై ఉంటాయి, ఉదాహరణకు ఆస్తిపై లోన్. ముందస్తు ఆమోదిత ఆఫర్ గురించి తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు తమపేరు, ఫోన్ నెంబర్ అందించాల్సిఉంటుంది. 4. అనుబంధఛార్జీలు హోమ్ లోన్ పై కేవలం వడ్డీ మాత్రమే ఉండదు. దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే దీనిని రుణదాతతో చర్చించడం మంచిది. ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటువిషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం మంచిది. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. 5. క్రెడిట్ స్కోర్ హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవ డానికి ముందు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ పెంపొందించుకోవడం మంచిది. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడమన్నది చాలాపెద్ద నిర్ణయం, అది రానున్న సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలాముఖ్యం. పైన పేర్కొన్న విషయాలన్నీ మీరు అర్థంచేసుకున్నారు కాబట్టి, హోమ్ లోన్ సంబంధించి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ముఖ్యం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తున్నహోమ్ లోన్ ఎంచుకోవడమన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక సౌకర్యవంతమైన ఆప్షన్. మీ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు మీరు రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు సౌకర్యవంతంగా 30 ఏళ్లవ్యవధిలోపు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. (అడ్వర్టోరియల్) -
ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా!
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) సంస్థ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నగదు నిల్వ, వడ్డీలు, పన్ను మినహాయింపు, పింఛన్ లాంటి పలు రకాల సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఏడాదికిగానూ ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీని అందించింది. ఈపీఎఫ్ ఖాతాదారులు పన్ను ఆదా ప్రయోజనాలతో పాటు ఈపీఎఫ్ ఖాతా ద్వారా ఇంటితో సహా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీ వివాహం, మీ కొడుకు & కుమార్తె వివాహం కోసం రుణం పొందవచ్చు. ఇలా పలు రకాల రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల ఈ కింది పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈపీఎఫ్‌వో అధికారిక ఈపీఎఫ్ వెబ్సైట్ లో యూఏఎన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. మేనేజ్ సెక్షన్ వెళ్లి అందులో ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా లాంటి కేవైసి వివరాలు వెరిఫై చేసుకోవాలి. ఆన్లైన్ సర్వీసెస్ కు వెళ్లి అందులో క్లెయిమ్(ఫార్మ్- 31, 19, 10సీ) ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ ఖాతాదారుడి వివరాలు కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలు నమోదు చేయాలి. ఇప్పుడు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం మీ వివరాలు మొత్తం నమోదు పూర్తయ్యాక ఎస్ ఆప్షన్ ఓకే చేయాలి. అనంతరం ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై I want to Apply For అప్షన్ మీద క్లిక్ చేయాలి. లోన్ తీసుకోవడానికి గల కారణాలు, ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తైన తర్వాత Employer ఆమోదం తెలిపితే అనంతరం 15 నుంచి 20 రోజుల్లోగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌కు నగదు జమ అవుతుంది. చదవండి: 2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ మారుతి సుజుకి బంపర్ అఫర్ -
పన్నుభారం తగ్గించుకోండిలా!
పన్ను చెల్లించే ప్రతి వ్యక్తి పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం సహజం. పన్ను భారం తగ్గించు కోవడం చట్ట రీత్యా నేరం కాదు. ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలు చూసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. ప్లానింగ్‌లో ఒక అవకాశం కుటుంబ సభ్యుల దగ్గర ఉంది. అనురాగం మాటున పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. ఆర్థిక కూడా ఆదా అవుతుంది. చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లొచ్చు. తల్లిదండ్రులకు అద్దె ఇవ్వండి! అవును... మీది ఉమ్మడి కుటుంబం అనుకోండి.. కలిసి ఉంటున్నారు.. ఇల్లు మీ నాన్నగారి పేరు మీదో, మీ అమ్మగారి పేరుమీదో ఉందనుకోండి.. మీరు ప్రతి నెల అద్దె వారికే ఇవ్వండి.. ఆ మేరకు ఖర్చు చూపించండి. బ్యాంకు ద్వారా రెంటు డిపాజిట్ చేయండి. మీ స్వంత ఆదాయం లెక్కించేటప్పుడు ఇంటి అద్దెని క్లెయిం చేయండి. ఆ మేరకు ఆదాయం తగ్గడం వలన మీకు పన్ను భారం తగ్గుతుంది. మీ కుటుంబ ఆదాయంలో కానీ ఖర్చుల్లో కానీ ఏ మార్పు ఉండదు. అటుపక్క వారికి వారి ఆదాయంలో ఈ అద్దెను ఆదాయంగా చూపించండి. అద్దెలోంచి మున్సిపల్ పన్నులు.. 30శాతం మరమ్మతులు కింద తగ్గుతాయి. ఇంటి మీద లోన్ ఉంటే వడ్డీ కూడా తగ్గించుకోవచ్చు. ఎలాగూ అమ్మ నాన్న సీనియర్ సిటిజన్లు కాబట్టి వారికి బేసిక్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. ఆ మేరకు ఆదాయం పన్నుకి గురి కాదు. ఈ విధంగా మీకు ప్రయోజనం కలుగుతుంది. అవసరమయితే ఈ మేరకు అగ్రిమెంటు రాసుకోండి. మీ యజమానికి మీ తల్లి దండ్రుల పాన్ కార్డు జిరాక్స్ ఇవ్వండి. పన్ను భారం కుటుంబం మీద పడదు. ఎవరి ఆదాయం వారిదే, ఎవరి పన్ను భారం వారిదే. మీ తల్లిదండ్రులు మీ మీద ఆధార పడ్డ వారయితే వారి బాగోగులు మీరు చూసుకోవాలి. ఈ రోజుల్లో ఆరోగ్యం విషయం ఇంకా జాగ్రత్త వహించాలి. సెక్షన్ 80ఈ కింద మెడి క్లెయిమ్ చెల్లించితే పూర్తి మినహాయింపు ఆదాయం లోంచి వస్తుంది. తల్లి దండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే రూ.75,000 వరకు ఆదాయంలోంచి తగ్గిస్తారు. దీని వలన 30శాతం రేటులో ఉన్నవారికి రూ.23,400 పన్ను భారం తగ్గుతుంది. మెడిక్లెయిమ్ ద్వారా అవసరం వస్తే మెడికల్ ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు. పెద్దల బాగోగులు చూసి, వారి ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మీకు పన్ను భారం తగ్గుతుంది. ఇక తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎన్నో లక్షలు వెచ్చించి పిల్లల్ని చదివిస్తున్నారు. పెద్దలు చదువు కొంటున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు అప్పలు చేసి మరీ చదివిస్తున్నారు. అప్పులు చేసినందుకు అసలు తీర్చక తప్పదు. వడ్డీ కట్టక తప్పదు. అలాంటి వడ్డీకి సెక్షన్ 80యు కింద ఆదాయం లోంచి మినహాయింపు ఇస్తారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ మినహాయింపు ఇస్తారు. పన్ను భారం తగ్గుతుంది. - ట్యాక్సేషన్ నిపుణుల సూచనలు చదవండి: రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట -
వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త
సాక్షి,ముంబై: భారత్ ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ గృహ రుణ రేటును బుధవారం ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా నిర్ణయం ప్రకారం మంచి సిబిల్ స్కోర్ ఉన్న వారికి 6.75 శాతం నుంచి గృహ రుణం లభ్యమవుతుంది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), కొటక్ మహీంద్రా బ్యాంక్‌లు తమ రుణ రేట్లను వరుసగా 6.70 శాతం, 6.65 శాతానికి తగ్గించిన రెండు రోజుల తర్వాత హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం తీసుకుంది. మార్చి 4వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. తాజా మార్పు హెచ్డీఎఫ్సీ ప్రస్తుత గృహ రుణగ్రహీతలకూ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. అయితే తాజా రుణ రేటుకు మార్చుకోవాలనుకునే కస్టమర్లు సంస్థను సంప్రదించి, కొంత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. (‘గంగవరం’.. అదానీ పరం!) రూ.5,000 కోట్ల సమీకరణ: ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించుకున్నట్లు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 5న ఇష్యూ ప్రారంభమై, అదేరోజు ముగుస్తుంది. (గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు) -
గృహ కొనుగోలుదారులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్
గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. రుణ మొత్తంపై సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ₹75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతం వడ్డీ, ₹75 లక్షల నుంచి ₹5 కోట్ల వరకు రుణ మొత్తంపై 6.75 శాతం వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది. ప్రాసెసింగ్ ఫీజుపైనా నూరు శాతం రాయితీ అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అదేవిధంగా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ తీసుకుంటే మరో 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో ఇప్పటికే ₹ 5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. 31 డిసెంబర్ 2020 నాటికి బ్యాంక్ ₹35 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ బేస్ కలిగి ఉంది. చదవండి: ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్! రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ -
హోంలోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : హోంలోన్ కస్టమర్లకు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ భారీ ఊరట కల్పించింది. గృహరుణాలపై వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. కస్టమర్ల సిబిల్ స్కోర్ ఆధారంగా వారికి వడ్డీపై 25 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ ఇస్తామని వెల్లడించింది. యోనో యాప్ ద్వారా రూ 75 లక్షలకు పైబడిన గృహ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. కాగా పండుగ ఆఫర్లలో భాగంగా రూ 30 లక్షల నుంచి రూ 2 కోట్ల లోపు గృహ రుణాలపై కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ఆధారంగా 20 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇదే రాయితీని ఎనిమిది మెట్రో నగరాల్లో రూ 3 కోట్ల లోపు గృహ రుణాలపై కూడా అందచేస్తామని బ్యాంకు తెలిపింది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. బ్యాంకు ప్రస్తుతం రూ 30 లక్షలలోపు విలువ కలిగిన గృహ రుణాలపై కనిష్టంగా 6.9 శాతం నుంచి వడ్డీ ఆఫర్ చేస్తుండగా రూ 30 లక్షలు పైబడిన గృహ రుణాలపై కనిష్ట వడ్డీ 7 శాతంగా నిర్ణయించింది. చదవండి : రుణానుబంధానికి మించి కార్పొరేట్‌తో సంబంధం! -
బ్యాంక్ ఆఫ్ బరోడా.. పండుగల ఆఫర్లు
ముంబై: పండుగల వాతావరణం నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్‌ను పెంచడానికి పలు చర్యలు తీసుకుంటున్న బ్యాంకుల జాబితాలో తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. గృహ, కారు రుణ గ్రహీతలకు పలు ప్రోత్సాహకాలను మంగళవారం ప్రకటించింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం– బరోడా గృహ రుణాలు (ఇతర బ్యాంక్ నుంచి రుణాన్ని బదలాయించుకున్న ఖాతాలకు సంబంధించి) , బరోడా కారు రుణాలకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న వడ్డీరేటుపై పావుశాతం తగ్గింపు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రద్దు ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ ఇప్పటికే పండుగ ఆఫర్లను ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100% మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికీ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వివరిం చింది. ఇక, క్రెడిట్ స్కోర్, గృహ రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) దాకా రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ పొందవచ్చని పేర్కొంది.