
ముంబై: నివాసిత ప్రాజెక్టులకు రుణాలివ్వాలంటే, పైకప్పులపై సోలార్ విద్యుదుత్పత్తి పరికరాల (సోలార్ ఇన్‌స్టాలేషన్స్) ఏర్పాటు నిబంధన అమలు చేయాలని ఎస్‌బీఐ భావిస్తోంది. జూన్ చివరికి ఎస్‌బీఐ గృహ రుణాల పుస్తకం రూ.6.3 లక్షల కోట్లుగా ఉంది.
మా గ్రీన్ ఫండ్స్ (పర్యావరణ అనుకూల నిధి) నుంచి రుణ సాయం పొందే బిల్డర్లు రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లను తప్పనిసరి చేయనున్నట్టు ఎస్‌బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. గృహ రుణ దరఖాస్తులకు దీన్ని అనుబంధంగా (బండిల్) జోడించనున్నట్టు చెప్పారు. ఈ రుణాలు 10–20 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. ఈ రుణాలపై బ్యాంక్‌లు ఫారెక్స్ రిస్క్‌ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment