solar energy
-
విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ప్యూర్(Pure) సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఇళ్లతోపాటు, వాణిజ్య, గ్రిడ్స్థాయిలో ఉపయోగపడే ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ (విద్యుత్తును నిల్వ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా వాడుకునేందుకు వీలు కల్పించే) ఉత్పత్తులను ‘ప్యూర్-పవర్(Pure-Power)’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఇవి సాధారణ యూపీఎస్‌లలో మాదిరిగా వీటిల్లో లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలు కాకుండా.. అత్యాధునిక లిథియం-అయాన్ బ్యాటరీలు ఉండటం ఒక ప్రత్యేకతైతే.. సౌర విద్యుత్తు లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా ఎటువంటి అదనపు పరికరాల అవసరం లేకుండా నిల్వ చేసుకోగలగడం ఇంకో ప్రత్యేకత. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే.. మీ ఇంటిపైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ‘ప్యూర్-పవర్: హోం’ను వాడటం మొదలుపెట్టారనుకోండి.. మీ ఇంటికి కావాల్సిన విద్యుత్తును అక్కడికక్కడ ఉత్పత్తి చేసుకుని వాడుకోవడమే కాకుండా.. మిగిలిపోయిన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి అమ్ముకోవచ్చునన్నమాట. నీతీఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి.కె.సారస్వత్ మంగళవారం హైదరాబాద్‌లోని నోవోటెల్లో ప్యూర్-పవర్ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్యూర్ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ ‘‘దేశం మొత్తమ్మీద రానున్న 18 నెలల్లో 300 మంది డీలర్ల ద్వారా ‘ప్యూర్-పవర్’ ఉత్పత్తులను మార్కెట్ చేయనున్నాము’’ అని తెలిపారు. యూపీఎస్‌లతో పోలిస్తే ప్యూర్-పవర్ ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనవని, నానో పీసీఎం మెటీరియల్ ద్వారా భద్రతకు పెద్దపీట వేశామని ఆయన తెలిపారు. ప్యూర్-పవర్లో ప్రస్తుతం రెండు రకాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని, గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’ను వచ్చే ఏడాది లాంచ్ చేస్తామన్నారు. ఇళ్లల్లో, అపార్ట్మెంట్లలో వాడుకోగలిగిన ‘ప్యూర్-పవర్:హోం’ 3 కిలోవోల్ట్ ఆంపియర్ (కేవీఏ), 5కేవీఏ, 15కేవీఏ సామర్థ్యాల్లో లభిస్తాయని ధర రూ.74,999తో ప్రారంభమవుతాయని చెప్పారు.దుకాణాలు, కార్యాలయాలు, టెలికాం టవర్స్ వంటి వాటి కోసం 25 కేవీఏ నుంచి 100 కేవీఏల సామర్థ్యం గల ‘ప్యూర్-పవర్’ కమర్షియల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని నిశాంత్ వివరించారు. వీటి వాడకం ద్వారా డీజిల్ జనరేటర్ల అవసరాన్ని లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు. ప్యూర్-పవర్ మూడో ఉత్పత్తి గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకునేదని, 20 అడుగుల పొడవైన కంటెయినర్లోకి ఇమిడిపోయే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’లో ఏకంగా నాలుగు మెగావాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చునని ఆయన వివరించారు. సోలార్ పార్కుల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే.. విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఎక్కువ ఉన్న సమయంలో సరఫరా చేసేందుకు వీలేర్పడుతుందన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ ఉత్పత్తులను బుక్ చేసకోవచ్చునని, నెలాఖరు నుంచి డెలివరీ మొదలవుతుందని తెలిపారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..దేశ అభివృద్ధికి కీలకం..2070 నాటికి కర్బన్ ఉద్గారాలను సున్నాస్థాయికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో విద్యుత్తు వాహనాలతోపాటు ప్యూర్-పవర్ లాంటి ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్ స్పష్టం చేశారు. ప్యూర్-పవర్ ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2030 నాటికి వాహనాల్లో 40 శాతం విద్యుత్తుతో నడిచేవిగా చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సంకల్పించిందని వివరించారు. అయితే ప్రస్తుతం దేశం మొత్తమ్మీద ఉన్న విద్యుత్తు వాహనాల సంఖ్య (అన్ని రకాలు కలుపుకుని) ఇరవై లక్షలకు మించడం లేదని తెలిపారు. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ కోసం గ్రిడ్‌ను వాడటం మొదలుపెడితే గ్రిడ్‌పై అధిక భారం పడుతుందని, ఈ నేపథ్యంలోనే ప్యూర్-పవర్ వంటి ఉత్పత్తులకు ప్రాధాన్యం ఏర్పడుతోందని అన్నారు. బ్యాటరీల ధరలు తగ్గించేందుకు, మరింత సమర్థమైన వాటిని తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలితస్తే మరింత మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్యూర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వడేరా తదితరులు పాల్గొన్నారు. -
టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కొత్త మైలురాయి
దేశంలోనే నంబర్ వన్ రూఫ్‌టాప్ సోలార్ ప్రొవైడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ టాటా పవర్ దేశవ్యాప్తంగా 1,50,000 రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మొత్తం సామర్థ్యం ఇప్పుడు సుమారు 3 గిగా వాట్లకు చేరింది. భారతదేశ పునరుత్పాదక విద్యుత్ పరివర్తనలో కంపెనీ పోషిస్తున్న కీలక పాత్రకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.దేశంలోని 700 పైచిలుకు నగరాల్లో కార్యకలాపాలతో టాటా పవర్ రెన్యువబల్ ఎనర్జీ లిమిటెడ్‌లో (TPREL) భాగమైన టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్, సుస్థిరమైన, విద్యుత్తును ఆదా చేసే భవిష్యత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రస్థానంలో ముందువరుసలో ఉంటోంది.కంపెనీ తమ తమిళనాడు ఫ్యాక్టరీలో ఏఎల్ఎంఎం ఆమోదిత సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తోంది.ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సహా 20 పైగా ఆర్థిక భాగస్వాముల ద్వారా టాటా పవర్ సరళతరమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. తద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి తెస్తోంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాలు, తమ ఫ్లాగ్షిప్ ‘ఘర్‌ఘర్ సోలార్’ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమల్లో కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కంపెనీకి దేశవ్యాప్తంగా 300 పైచిలుకు నగరాల్లో 575 పైగా చానల్ పార్ట్నర్లు, 400 పైగా నగరాల్లో 225 పైగా అధీకృత సర్వీస్ భాగస్వాములు ఉన్నారు. రెసిడెన్షియల్ రంగంలో 1,22,000 పైగా వినియోగదారులు సహా 1.5 లక్షలకు పైగా కస్టమర్ల బేస్‌తో కంపెనీ పటిష్టమైన స్థానాన్ని దక్కించుకుంది. -
PMSGMBY: పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల లోన్
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన (PMSGMBY) కింద ఇప్పటికే 10 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి మొత్తం కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన.. ఈ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద 10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ 'ప్రహ్లాద్ జోషి' వెల్లడించారు.డాక్యుమెంట్స్ అవసరం లేకుండా రూ.2 లక్షల లోన్ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకం కింద.. ఇళ్లలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ. 2 లక్షల వరకు లోన్ అందిస్తాయి. ఇందులో రూ. 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.ఏడాదికి 6.75 శాతం వడ్డీ రేటుతో.. రూ. 6 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే రూ. 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం వరకు బ్యాంక్ ఫైనాన్సింగ్ సదుపాయం ఎంచుకోవచ్చు.ఎవరు అప్లై చేసుకోవచ్చు➤భారతీయ పౌరుడై ఉండాలి.➤సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.➤చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.➤ఇప్పటివరకు సౌర ఫలకాలను సంబంధించిన ఎలాంటి ఇతర సబ్సిడీలను పొంది ఉండకూడదు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!ఎలా అప్లై చేసుకోవాలి?➤అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అక్కడే కనిపిస్తున్న కన్స్యూమర్ ట్యాబ్‌కి వెళ్లి, అందులో 'అప్లై నౌ' ఎంచుకోండి.➤లాగిన్ డ్రాప్‌డౌన్ మెనుని ఓపెన్ చేసి కూడా కన్స్యూమర్ లాగిన్ ఎంచుకోవచ్చు.➤మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి.. ద్రువీకరించండి. పేరు, రాష్ట్రం మరియు ఇతర వివరాలను అందించండి. ➤మీ ఈమెయిల్ ఐడీని ధ్రువీకరించిన తరువాత.. మీ ప్రొఫైల్‌ను సేవ్ చేయండి. ➤విక్రేత కోసం, మీ అవసరాన్ని బట్టి అవును లేదా కాదు సెలక్ట్ చేసుకోండి.➤'సోలార్ రూఫ్‌టాప్ కోసం అప్లై చేసుకోండి'పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను అందించండి.➤అన్ని పూర్తి చేసిన తరువాత విక్రేతను ఎంపిక చేసుకుని మీ బ్యాంక్ వివరాలను అందించండి.➤మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. -
ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి వ్యాపారంలో స్థిరపడినవాళ్లను చూశాం. దేశానికి సేవ చేయాలన్న కతృనిశ్చయంతో ఐఏఎస్,ఐపీఎస్ ర్యాంకులను సాధించిన వారినీని చూశాం. కానీ సముద్రంపై శాశ్వతంగా ప్రయాణించేందుకు, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించేం దుకు ఉద్యోగాలనూ, ఇంటినీ..అంతెందుకు సర్వస్వాన్ని వదిలేసిన ఫ్యామిలీ గురించి విన్నారా? రండి ముగ్గురు సభ్యులతో కూడిన ఇండియాకు చెందిన అరుదైన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం!రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహి చిట్నావిస్, కుమార్తె కైయా రివా గౌతమ్. సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టిరావడానికి, పర్యటనల పట్ల తమకున్న మక్కువను కొనసాగించడానికి ఈ జంట తమ పూర్తికాల ఉద్యోగాలను విడిచిపెట్టారు. దాదాపు ప్రతి ఆస్తిని అమ్మేసుకున్నారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్‌లో ఏదో ఒక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యేలా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ అయిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజనులను ఆశ్చర్యపరిచింది.ఈ ఆలోచన ఎలా వచ్చింది?భారత నావికాదళంలో సంవత్సరాలు గడిపిన గౌరవ్‌కి సముద్రంతో విడదీయలేని సంబంధం ఉంది. మరోవైపు, వైదేహి చాలా కాలంగా సరళమైన, అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలో 2015లో గౌతమ్ కొచ్చి నుండి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగిణికి కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితుడైనప్పుడు ప్రత్యామ్నాయ జీవనశైలి గురించి ఆలోచన వచ్చింది. భార్య ,కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో పడవల మీద నివసిస్తున్న , ప్రయాణించే అనేక కుటుంబాలు తారపడ్డాయి. దీంతో వారి ఆలోచనలకు మరింత ప్రేరణ వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత, ఈ జంట చూడాల్సినవి, ఆస్వాదించ వలసినవి ఇంకా చాలా ఉన్నాయని భావించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం వారి కలలకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు మరింత ఆకర్షించాయి. అంతే ఇక ఆలస్యం చేయదల్చుకోవలేదు వీరు. 2022లో గౌతమ్ నావీ వీఆర్ఎస్ తీసుకున్నాడు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరూ వదిలేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయ జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ప్రతిదీ అమ్మేశారు. ఇంటి సామానును 6వేల కిలోల నుండి 120 కిలోలకు తగ్గించేశారు. పడవలో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకెళ్లడం వృధా అనుకున్నారు. రెండు క్యాబిన్లు, వంటగది, తొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్ , ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయ జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుల పడవ వాంకోవర్ రీవాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మూలల్లో ప్రయాణించడం వల్ల జీవితంపై అద్భుతమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.పడవపై ఎలా బతుకుతున్నారు?సంవత్సరంలో దాదాపు 70 శాతం సమయం ఏకాంత దీవుల వెలుపల లంగరు వేసి గడుపుతారు. మిగతా అన్నిసమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది కాబట్టి, వంతులవారీగా బోటు నడపటం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటారు. అప్పుడప్పు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండల్ని వాడతారు.ఎక్కడికైనా వెళ్లి సముద్ర మీదే. అయితే వాతావరణం, నావిగేషన్ సమస్యలు వీరికి ఛాలెంజ్. మొదట్లో ఇబ్బంది పడినా కాలక్రమేణా, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యాప్‌లు, వాతావరణ హెచ్చరిక వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడంలో రాటు దేలారు. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల(1988లో దీన్ని తయారు చేశారు) పడవ నిర్వహణ ఖర్చులు, చాలా తొందరగా తుప్పు పట్టడం లాంటి సవాళ్లు కూడా ఎదురైనాయి. రీవా 760-వాట్ల సోలార్ ప్యానెల్స్‌తో ఛార్జ్ చేయబడిన 800-AH బ్యాటరీ బ్యాంక్ ద్వారా నడుస్తూనే ఉంటుంది . దీనికి విండ్ జనరేటర్ కూడా అమర్చుకున్నారు. మలేషియాలోని పెనాంగ్‌లో ప్రారంభమైన వీరి సముద్రయానం లంకావీ (మలేషియా), థాయిలాండ్‌కు చేరారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారల పాటు ఉన్నారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాల వెంబడి వారాల తరబడి గడిపారు. సముద్రంలో స్నార్కెలింగ్ , డైవింగ్ చేస్తూ,కొత్త ఇల్లు రీవా అనే సెయిల్ బోట్లో సరికొత్త అనుభవాలతో గత రెండేళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారిపోయింది. వీలైనన్ని ఎక్కువ దేశాలను చూడడమే దీర్ఘకాలిక ప్రణాళిక.తూర్పు మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్లను కవర్ చేస్తూ మరింత తూర్పుకు ప్రయాణించి, తరువాత 17,500 దీవులతో కూడిన ఇండోనేషియాని చుట్టేయాలని ప్లాన్. అలాగే యూట్యూబ్ ద్వారా నౌకాయాన సాహసాలను డాక్యుమెంట్ చేస్తున్నారుట .“పడవలో జీవించడం సాధ్యమేనా?” అన్న ప్రశ్నకు వీరి జీవనమే సజీవ సాక్ష్యం. వీరి ఇన్‌స్టా పేజ్‌లోని వీడియోలను చూస్తూ ఉంటే.. సమయమే తెలియదు. (వీలైతే ఒకసారి చూడండి) View this post on Instagram A post shared by Sailing Yacht Reeva | 🇮🇳 | Gogo, VC & Kay (@the_reeva_project)ప్రయాణం, ముఖ్యంగా సమయం, గమ్యం ఇలాంటి సంకెళ్లేవీ లేకుండా హాయిగా స్వేచ్ఛగా చేసే ప్రయాణాలు జీవితంపై దృక్పథాన్ని కచ్చితంగా మారుస్తాయి. ఒక విశాలమైన అవగాహనను కలిగిస్తాయి. -
ఆరబెడితే అధికాదాయం!
పూలను కష్టపడి పండించటంతోనే సరిపోదు. మార్కెట్లో గిరాకీ తగ్గినప్పుడు.. పండించిన పంటను రూపం మార్చి అమ్మగలిగితే మంచి ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు అభ్యుదయ రైతు గాదె రాజశేఖర్. అందుకోసం 2.5 టన్నుల పంటను ఆరబెట్టగల పెద్ద సోలార్ డ్రయ్యర్‌ను తానే సొంతంగా రూపొందించుకున్నారు. అందులో గులాబీ తదితర రకాల పూల రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గండిగూడ వద్ద గల తన 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మిశ్రమ పంటలు సాగు చేస్తున్నారు. సోలార్ డ్రయ్యర్‌ను వినియోగిస్తూ గులాబీ రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్ చేస్తున్నారు. ఆరబెట్టిన ఈ గులాబీ రేకులను పాన్మసాలాలో, స్వీట్ల తయారీలో వాడుతున్నారు. ఆరబెట్టిన మునగ ఆకుల పొడిని అనేక ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నందున మార్కెట్లో గిరాకీ ఉందని చెబుతున్నారు.దేశవాళీ గులాబీ రేకులతో..రెండు ఎకరాల్లో దేశవాళీ పింక్ సెంటెడ్ గులాబీ తోటను రాజశేఖర్ సాగు చేస్తున్నారు. ఈ పూల రేకులను సోలార డ్రయ్యర్లో ఆరబెడుతున్నారు. తాను పండించిన పూలే కాకుండా, మార్కెట్లో ఈ రకమైన పూల ధర కిలో రూ.20 లోపు ఉన్నప్పుడు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి, వాటిని కూడా తన డ్రయ్యర్లో ఆరబెడుతున్నారు. పది కిలోల గులాబీ రేకులను ఆరబెడితే కిలో ఎండు పూల రేకులు తయారవుతాయి. వీటిని కిలో రూ.600 చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సోలార్ డ్రయ్యర్లో చామంతి, మందార, శంకపుష్పం, మల్లెపూలను కూడా ఆరబెట్టి మార్కెట్ చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. మునగ ఆకులతో..వ్యవసాయ క్షేత్రంలో 8 ఎకరాల్లో ఇతర పంటల మధ్యన మిశ్రమ పంటగా సాగు చేసిన మునగ చెట్ల నుంచి సేకరించిన ఆకును ఆరబెట్టి, పొడి చేసి ఆయన అమ్ముతున్నారు. ఏపుగా పెరిగిన మునగ చెట్ల కొమ్మలను కత్తిరించినప్పుడు వాటి ఆకులను వృథాగా పారేయకుండా డ్రయర్లో ఆరబెట్టి పొడిగా మార్చుతున్నారు. ఇరవై కిలోల ఆకును ఆరబెడితే కిలో పౌడర్ తయారవుతుంది. దీన్ని కిలో రూ.800 వరకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. – బూరుగు ప్రభాకర్‌రెడ్డి, శంషాబాద్ రూరల్, రంగారెడ్డి జిల్లాసొంత ఆలోచనఏడాది కిందట రాజశేఖర్ ఓ కంపెనీ నుంచి చిన్న సైజు సోలార్ డ్రయ్యర్‌ను కొనుగోలు చేశారు. అందులో 350 కిలోల పూల రేకులను, ఆకులను ఆరబెట్టవచ్చు. అయితే, అది తన అవసరాలకు సరిపోలేదు. వ్యవసాయ క్షేత్రంలో వినియోగంలో లేని ఇనుప పైపులతో మూడు నెలల కిందట సొంత ఆలోచనతో పెద్ద సైజు సోలార్ డ్రయ్యర్‌ను తానే నిర్మించుకున్నారు. 60 అడుగుల పొడవు, 22 అడుగుల పొడవుతో 10 అడుగుల ఎత్తు ఉండేలా దీన్ని రూపొందించారు. ఇందుకు 2ఎంఎం మందం ఉన్న అక్రాలిక్ షీట్‌ను వాడారు. దీని లోపలి నుంచి తేమతో కూడిన గాలిని బయటకు పంపేందుకు చుట్టూ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి 2,500 కిలోల ఆకులు లేదా పూల రేకులను ఆరబెట్టవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్తుతో నడిచే డ్రయ్యర్ కంటే సోలార్ డ్రయ్యర్ నిర్వహణ సులువుగా ఉందన్నారు.సోలార్ డ్రయ్యర్ లోపలి ఉష్ణోగ్రత బయటికంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలుంటే ఆకులు, పూల రేకులను ఆరబెట్టడానికి ఒక రోజు సమయం చాలు. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే మరింత ఎక్కువ సమయం పడుతుంది. మునగాకు పొడిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ఆలోచన ఉందని రాజశేఖర్ (99123 33444) అన్నారు. -
సోలార్ విద్యుత్ @100 గిగావాట్లు
న్యూఢిల్లీ: సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది.‘‘గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ దార్శనిక నాయకత్వంలో భారత్ చరిత్రాత్మక 100 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించింది. పరిశుద్ధమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం విశ్రమించని మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని కేంద్ర సర్కారు లక్ష్యాన్ని విధించుకోగా, ఇందులో 100 మెగావాట్లు సోలార్ ద్వారా సమకూర్చుకోవాలన్నది ప్రణాళిక. కానీ, కరోనా విపత్తు, ఆ సమయంలో లాక్డౌన్లతో లక్ష్యం చేరిక రెండేళ్లు ఆలస్యమవడం గమనార్హం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘‘సోలార్ ప్యానెళ్లు, సోలార్ పార్క్‌లు, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఫలితమే నేడు భారత్ 100 గిగావాట్ల సోలార్ ఇంధన లక్ష్యాన్ని సాధించింది. పర్యావరణ అనుకూల ఇంధనంలో భారత్ స్వీయ సామర్థ్యాలపై ఆధారపడడమే కాకుండా, ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిస్తోంది’’అని ప్రహ్లాద్‌జోషి పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ప్రతి ఇంటికి శుద్ధ ఇంధనాన్ని అందిస్తుందన్నారు. పదేళ్లలో చేరిక 2014 నాటికి దేశంలో సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 2.82 గిగావాట్లుగానే ఉండగా, పదేళ్లలో 100 గిగావాట్లను చేరుకోవడం విశేషం. 2025 జనవరి 31 నాటికి స్థాపిత సోలార్ సామర్థ్యం 100.33 గిగావాట్లు అయితే, మరో 84.10 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉంది. మరో 47.49 గిగావాట్లు టెండర్ దశలో ఉండడం గమనార్హం. కేవలం 2024లోనే 24.5 గిగావాట్ల సామర్థ్యం కొత్తగా అందుబాటులోకి వచి్చంది. మరోవైపు 2014 నాటికి దేశంలో కేవలం 2 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం ఉంటే, 2024 నాటికి 60 గిగావాట్లకు చేరుకుంది. -
బోటులోనే మంచినీటి తయారీ
పిఠాపురం: విద్యుత్ అవసరం లేకుండా సౌరశక్తిని ఒడిసిపట్టి తక్కువ ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే సోలార్ డిస్టిలేషన్ పరికరాన్ని ఓ యువతి రూపొందించారు. రోజుల తరబడి సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులు మంచినీటి కోసం పడే ఇబ్బందులను తొలగించేందుకు దీనిని ఆవిష్కరించినట్టు వైఎస్ ప్రసన్న చెప్పారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రసన్న పీహెచ్డీ పరిశోధనలో భాగంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. దీంతో ఎలాంటి మురికి నీటినైనా మంచినీటిగా మార్చుకోవచ్చని చెప్పారు. పరిశోధనలో భాగంగా తాను తయారు చేసిన యంత్రాన్ని ఇటీవల కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రంలో ప్రయోగాత్మకంగా బోటులో అమర్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంట్లో కూడా నీటిశుద్ధి పరికరాలను అమర్చుకోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అనేక నీటిశుద్ధి యంత్రాలు అధిక ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ అవసరం లేకుండా ఎక్కడైనా.. ఎప్పుడైనా నీటిని శుద్ధి చేసుకునే యంత్రాన్ని తయారు చేయాలనే పట్టుదలతో సోలార్ డిస్టిలేషన్ మెషిన్ తయారు చేశానని ప్రసన్న చెప్పారు. సముద్రంలో రోజుల తరబడి చేపల వేట సాగించే మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు వచ్చానన్నారు. ఈ యంత్రం విజయవంతంగా పని చేస్తోందన్నారు. గోమూత్రం నుంచి సైతం..తన ప్రొఫెసర్ సందీప్ ఎస్.దేశ్‌ముఖ్ ప్రోత్సాహంతో దీనిని తయారు చేశానని ప్రసన్న తెలిపారు. ఎక్కడ కావాలన్నా ఈ యంత్రాన్ని అమర్చుకోవచ్చన్నారు. ఒక రోజుకు ఒక కుటుంబానికి అవసరమైనంత నీరు ఇందులో తయారవుతుందని చెప్పారు. ఈ యంత్రం ద్వారా రోజ్ వాటర్, జాస్మిన్ వాటర్, అత్తరు వంటి వాటితో పాటు ఆవు మూత్రాన్ని శుద్ధి చేసి గోమాత ఆర్కా (దీనిని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు) తయారు చేయవచ్చని వివరించారు. గోమూత్రాన్ని ఒకసారి వేస్తే గోమాత ఆర్కా వస్తుందని, మూడుసార్లు వేస్తే పూర్తిగా శుద్ధి జరిగి మంచినీటిగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే ఈ మెషిన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకూ చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఎటువంటి అదనపు ఖర్చు, వృథా లేకుండా రూపొందించిన మొట్టమొదటి చిన్న పరికరం ఇదేనని ఆమె చెప్పారు. -
జీరో కార్బన్ ఉద్గారాల వైపు ప్యూర్ ఈవీ
జీరో కార్బన్ ఉద్గారాల వైపు అడుగులు వేస్తూ.. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ప్యూర్ ఈవీ' (Pure EV) పునరుత్పత్పాదక శక్తి ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకుంది. తెలంగాణలోని కంపెనీ సదుపాయంతో డీజీ అండ్ గ్రిడ్‌తో కూడిన 500 కిలోవాట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్.. 125 కిలోవాట్ సిస్టం వంటి వాటిని ఏకీకృతం చేయడం ద్వారా.. ఎనర్జీ ఎఫిషియన్సీలలో సరికొత్త మైలురాయిని సాధించింది. మునుపటి ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. విద్యుత్ బిల్లులకు సంబంధించిన ఖర్చులలో 60 శాతం, డీజీ ఇంధన బిల్లులలో 65 శాతం తగ్గింపును నమోదు చేసింది.సోలార్ ఇన్స్టాలేషన్ అనేది కంపెనీ కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి.. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా గ్రిడ్ నుంచి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి సహాయం చేస్తుంది. 500 KWh పూర్తిగా కొత్త బ్యాటరీలను కలిగి ఉంటుంది. అంటే పాత బ్యాటరీల స్థానంలో లేటెస్ట్ జనరేషన్ బ్యాటరీలను అమర్చింది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్తిగా ఎలక్రిక్, సోలార్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు.పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకునే శక్తిని కంపెనీ పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని ప్యూర్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డా. నిశాంత్ దొంగరి అన్నారు. లేటెస్ట్ పవర్ స్టోరేజ్ టెక్నాలజీతో కలిసి సోలార్ పవర్ (Solar Power) ఉపయోగించడం ద్వారా.. మేము భవిష్యత్తులో గొప్ప పురోగతిని సాధించవచ్చని ఆయన అన్నారు. అంతే కాకుండా జీరో కార్బన్ ఉద్గారాలు మా లక్ష్యం అని అన్నారు. -
సోలారే సోబెటరూ..
సాక్షి, సిటీబ్యూరో: ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతన సాంకేతిక మార్పుగా అవతరించి, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాటిలో ‘సోలార్ విద్యుత్ శక్తి, ఈ–వాహనాలు’ హవా కొనసాగిస్తున్నాయి. ఈ రెండు అంశాలు సామాజిక జీవన వైవిధ్యంలో పెను మార్పులకు నాంది పలికాయి. ఒక వైపు విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్ వాడకం, దానికి అనుగుణంగానే పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు. వెరసీ అందరి చూపూ సోలార్ విద్యుత్ వైపునకు మళ్లింది.దశాబ్ద కాలంగానే సోలార్కు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అది నగరాల వరకే పరిమితమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్ సెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ వ్యవస్థను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్సిడీలను సైతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా సోలార్ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యాపార సంస్థలు సైతం ఈ సందర్భంగా వారి సేవలు పెంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వివిధ జిల్లాల్లోని టౌన్లలో ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఆవిష్కరించి ఈ సోలార్ సెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.సూర్య ఘర్ స్కీంతో సబ్సిడీ..హైదరాబాద్ వంటి నగరాల్లో సోలార్ వాడకంపై అవగాహన మెరుగ్గానే ఉంది. సోలార్ విద్యుత్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ సోలార్ పద్ధతులు వ్యక్తిగత ఇళ్లతో పాటు చిన్న–పెద్ద తరహా పరిశ్రమల్లోనూ విరివిగా వాడుతున్నారు. వారి వారి విద్యుత్ వాడకానికి అనుగుణంగానే పీఎం సూర్య ఘర్ స్కీంలో ఒక కిలో వాట్ నుంచి వినియోగాన్ని బట్టి అవసరమైనన్ని కిలో వాట్ల సోలార్సెట్లను, వాటికి సబ్సిడీని అందిస్తుంది. ఈ సోలార్ విధానాన్ని రెసిడెన్షియల్ ఏరియాలో, స్కూల్స్, ఫామ్ హౌజ్‌లు, రైస్‌మిల్స్ వంటి చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. పరిశ్రమలైనా, వ్యక్తిగత వినియోగమైనా.. టెక్నాలజీ పెరగడంతో కరెంట్ వినియోగం సైతం అధికంగా పెరిగిపోయింది. గతంలో ఇళ్లలో రూ.200 నుంచి రూ.500ల కరెంట్ బిల్ అత్యధికం అనుకుంటే.. ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిషనరీ, అధునాతన సాంకేతికత వినియోగం పెరగడంతో వాటి చార్జీలు మూడింతల కన్నా పైగానే పెరిగాయని నిపుణులు తెలుపుతున్నారు. పర్యావరణ హితం.. సోలార్ సిస్టం..విద్యుత్ తయారీ కోసం ప్రస్తుతం వాడే పద్ధతులన్నీ ఏదో విధంగా పర్యావరణానికి హాని చేసేవే అని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా థర్మల్, గ్యాస్, విండ్, హైడ్రో తదితర పద్ధతుల్లో విద్యుత్‌ను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కొన్ని వందల మొక్కలు పెంచిన దానితో సమానమని, అంతటి కాలుష్యాన్ని తగ్గించే విధానంగా సోలార్ నిలుస్తుందని నిపుణుల మాట. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పెరగడం, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం, వెరసీ పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో కాలుష్యరహిత పద్ధతులైన సోలార్ సిస్టమ్ అత్యంత శ్రేయస్కరమని భావిస్తున్నారు. అంతా లాభమే.. – రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ కోఫౌండర్రాష్ట్రంలో సోలార్ వినియోగంపై అవగాహన పెరిగింది. ఈ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నాం. కరోనా అనంతరం సోలార్ ఎనర్జీను వినియోగించేవారి సంఖ్య అధికంగా పెరిగింది. పీఎం సూర్య ఘర్ స్కీం కూడా దీనికి కారణం. ఇందులో భాగంగా రూ.2 లక్షల సోలార్ సెట్ బిగించుకుంటే దాదాపు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగతా పెట్టుబడి కూడా రెండు మూడేళ్ల కరెంట్ ఛార్జీలతో సమానం. కాబట్టి మూడేళ్ల తర్వాత వినియోగించే సోలార్ కరెంట్ అంతా లాభమే. -
అమెరికా ఆరోపణలకు ఆధారాలు లేవు తేల్చి చెప్పేసిన...
-
చంద్రబాబు, ఎల్లో మీడియా.. నిజం చెబితే ఒట్టు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ఇందులోకి లాగి.. చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం అబద్ధమని తేలిపోయింది. ఈనాడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వండి వారుస్తున్న తప్పుడు కథనాలు దురుద్దేశ పూరితమని స్పష్టమైంది. జరగనిది జరిగినట్లు.. లేనిది ఉన్నట్లు అందంగా అసత్యాలను అచ్చేస్తున్నారని తేటతెల్లమైంది. విద్యుత్ కొనుగోలు విషయంలో ఈనాడు దుష్ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కళ్ల ముందు స్పష్టంగా సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనిపిస్తున్నా.. అన్నింటినీ వదిలేసి కేవలం దుర్బుద్ధితో అప్పటికప్పుడు అబద్ధాన్ని సృష్టించడం.. దానిపై విష ప్రచారం చేయడం అనే విద్యను ఈనాడు నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా ఇలాగే విషం చిమ్ముతోంది. రాష్ట్ర అప్పులపై కూడా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ఒప్పుకున్నారు. సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది. మళ్లీ బయటకు వచ్చి వారు రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు, రూ.11 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారు. ఈనాడు నిస్సిగ్గుగా అలాగే తప్పుడు కథనాలు వండివారుస్తోంది. వారు బడ్జెట్లో చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. తిరుమల లడ్డూ విషయంలో కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. అసలు ఆ నెయ్యిని వాడనే లేదని, ఆ ట్యాంకర్లను తిరుమలకు అనుమతించనే లేదని సాక్షాత్తు టీటీడీ ఈవోనే చెప్పారు. తిరుపతి నుంచే వెనక్కు పంపామని మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. అయినా కల్తీ నెయ్యి వాడారంటూ అబద్ధాలు చెబుతూ విషం చిమ్మారు. తిరుమలలో ప్రసాదాల తయారీకి సంబంధించి దశాబ్దాలుగా స్పష్టమైన ప్రొసీజర్ ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వాటిని పాటిస్తున్నప్పటీకీ దుర్మార్గంగా అబద్ధాలు చెప్పారు. మొన్న విజయవాడ వరదల విషయంలోనూ అదే పాట పాడారు. అసలు నగరంలోకి వరదను మళ్లించిందే వారు కదా! ఎన్నికలకు ముందు ఇదే ఈనాడు, ఇదే దుష్టచతుష్టయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చేసిన యాగీ, దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంతా చేసి ఇప్పుడు రీసర్వేను కొనసాగిస్తామని చెబుతున్నారంటే అర్థమేంటి? ఆ యాక్ట్ మంచిదనే కదా! ఇదేంటని అడిగితే వెంటనే మాట మార్చేస్తారు. లేదా టాపిక్ డైవర్ట్ చేస్తారు. చౌకగా సౌర విద్యుత్ కొనుగోలు విషయంలోనూ ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆత్మనిర్బర్ భారత్ కింద రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్‌కు ఇన్సెంటివ్ ఉంది. లేఖలో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. అయినా కూడా పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారు. కళ్లెదుటే ఎన్నో సాక్ష్యాలుసౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ(ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని సెకీ చెప్పినా ఎల్లో మీడియాకు కనపడదు. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల్చినా వారికి పట్టదు. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) స్పష్టం చేసినా వారి చెవికెక్కదు. చివరికి సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోరు. కేవలం గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్‌పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. ఇదే అజెండాగా కొద్ది రోజులుగా టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వందసార్లు వారంతా వాదించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ‘సెకీ’ ఒప్పందం నేపథ్యంలో నమోదైన ఏ వాస్తవం కూడా మారిపోదు.తీరు మార్చుకోని ఎల్లో మీడియాసెకీ ఒప్పందానికి ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవంటూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, సీఈఆర్సీ, సెకీతో జరిగిన ఒప్పందంలోనూ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ, దాని అనుబంధ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఐఎస్టీఎస్ ఛార్జీల భారాన్ని రాష్ట్రం భరించాల్సి వస్తుందంటూ మళ్లీ అదే అబద్ధాన్ని పదే పదే వండి వారుస్తున్నాయి.సీఈఆర్సీ కూడా చెప్పింది2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(సీఈఆర్సీ) ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం (మొదటి సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. ఉత్పాదక ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌కు ఎక్స్‌ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు కొంత కాలం పాటు ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు లభిస్తుంది. అది సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు వస్తుందని సీఈఆర్సీ స్పష్టం చేసింది.ప్రతిపాదన లేఖలోనే స్పష్టత‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆర్థిక భారం పడుతుందంటూ మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాన్ని బుధవారం అచ్చేసింది. ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవని ఇప్పటికే అనేకసార్లు నిజాలు వెల్లడించినప్పటికీ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. యూనిట్ రూ.2.49 చొప్పున చవక్చ ధరకే సౌర విద్యుత్‌ను అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 15న సెకీ రాసిన లేఖ ద్వారా ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు(కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి ఛార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది.కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లలో స్పష్టం2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్‌లో భాగంగా సెకీ టెండర్ ద్వారా స్థాపించే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు ఈ ప్రయోజనం అందుతుందని కేంద్రం స్పష్టం చేసింది. 2021 నవంబర్ 30న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ సీఈఆర్సీ కూడా చెప్పింది2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(సీఈఆర్సీ) ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం (మొదటి సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. ఉత్పాదక ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌కు ఎక్స్‌ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు కొంత కాలం పాటు ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు లభిస్తుంది. అది సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు వస్తుందని సీఈఆర్సీ స్పష్టం చేసింది.సెకీ ఒప్పందంలోనూ అదే..ఐఎస్టీఎస్ చార్జీల ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ముందే గుర్తించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ.. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం(పవర్ సేల్ అగ్రిమెంట్)లోనూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశాన్ని భాగం చేసింది. సెకీతో జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయని పేర్కొన్న భాగం -
సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి
-
ఎనర్జీ సంస్థ ప్రచారకర్తగా మహేశ్ బాబు
హైదరాబాద్: సోలార్ ఎనర్జీ సెక్టార్‌లోని సన్‌టెక్ ఎనర్జీ బ్రాండ్ ‘ట్రూజన్ సోలార్’కు సినీనటుడు మహేశ్‌బాబు ప్రచారకర్తగా నియమితులయ్యారు. రూఫ్టాఫ్ సోలార్ ఇన్స్టలేషన్లో 2025 మార్చి నాటికి భారత్‌లో అగ్రగామిగా నిలిచేందుకు కట్టుబడి ఉన్నామని సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకులు, ఎండీ, సీ.హెచ్. భవానీసురేశ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని మహేశ్‌బాబు తెలిపారు. -
ఇంటింటికి సౌర సిరులు
మనకు సూర్యుడున్నాడు.వద్దన్నా రోజూ ఉదయిస్తాడు.సిస్టమ్ ఉంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాడు.కరెంట్ కష్టాలకు చెల్లు చీటి ఇస్తాడు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘనంగా 75 ఏళ్ల ఉత్సవాలను కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు దీపం వెలగని గ్రామాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇలాంటి గ్రామాల్లో వెలుగులు నింపారు ఈ హైదరాబాద్ ఇంజనీర్. వాహనం వెళ్లడానికి దారి లేని పాడేరు కొండలను కాలినడకన చుట్టి వచ్చిన రాధికా చౌదరి అక్కడి యాభై గ్రామాల్లో సౌరశక్తితో దీపాలు వెలిగించారు. కోటి ఇళ్లకు సౌర వెలుగులను అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆమె నాలుగు లక్షల ఇళ్లకు సర్వీస్ అందించారు. సోలార్ ఎనర్జీలో కెరీర్‌ని నిర్మించుకున్న రాధిక... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ది పొందమని సూచిస్తున్నారు.మూడు తర్వాత బయటకు రారుపాడేరు కొండల్లో నివసించే ఆదివాసీలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బయటకు రారు. బయటకు వెళ్లిన వాళ్లు సూర్యుడు అస్తమించేలోపే తిరిగి ఇల్లు చేరాలి కాబట్టి మధ్యాహ్నం మూడు తర్వాత ఇల్లు కదలేవాళ్లు కాదు. అలాంటి వాళ్లకు సౌరశక్తితో దీపం వెలుతురును చూశారు. మన పాడేరు వాసులే కాదు, కశ్మీర్‌లోయలోని లధాక్, లేప్రాంతాలు కూడా సౌర వెలుగును చూశాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ జిల్లాలతో సహా మొత్తం 27 రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో సేవలు అందించారామె. సోలార్ ఉమన్రాధికకు యూఎస్‌లో ఎమ్ఎస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. సోలార్ పవర్‌తో శాటిలైట్లను పనిచేయించడం అనే అంశంలో కోర్సు చేయడానికి నాసా స్పాన్సర్ చేసింది. యూఎస్‌లో కొంతకాలం విండ్ ఎనర్జీలో ఉద్యోగం, మరికొన్నేళ్లు స్వీడిష్ కంపెనీకి పని చేశారామె. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టార్లో అడుగు పెట్టడం నుంచి సోలార్ పవర్ విభాగంలో పని చేయడంలో ఆసక్తి పెంచుకున్నారు రాధిక. ఇండియాలో సర్వీస్ ఇచ్చే అవకాశం రాగానే 2008లో ఇండియాకి వచ్చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు సోలార్ ఎనర్జీలో పని చేసిన సౌరవ్‌తో కలిసి ఫ్రేయర్ ఎనర్జీ ప్రారంభించారు. ‘‘నలుగురు వ్యక్తులం, ఓ చిన్న గది. ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఆ తర్వాత కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విస్తరించాం. ఇప్పుడు 450 మంది ఉద్యోగులతో పని చేస్తోంది మా సంస్థ’’ అన్నారామె. మనదేశంలో సోలార్ ఎనర్జీ విభాగంలో ఇంత భారీ స్థాయిలో సర్వీస్ అందిస్తున్న ఏకైక మహిళ రాధిక. ఏ వ్యాపారానికైనా ఇండియా చాలా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా మొత్తాన్ని కవర్ చేయాలన్న కేంద్రప్రభుత్వం విధానాలతో కలిసి పనిచేస్తూ దేశాన్ని సౌరవెలుగులతో నింపడమే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన’’ అన్నారామె. ప్రత్యామ్నాయం ఇదిబొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి బొగ్గు గనుల మీద ఆధారపడడం తగ్గించి ఆల్టర్నేటివ్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకోవాలి. విండ్ పవర్ అనేది వ్యవస్థలు చేపట్టాల్సిందే కానీ వ్యక్తిగా చేయగలిగిన పని కాదు. ఇక మిగిలింది సోలార్ పవర్. సౌరశక్తిని వినియోగించుకోవడం సాధ్యమే. నిజమే... కానీ ఒక ఇంటికి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? దాదాపు లక్ష అవుతుంది. సగటు మధ్య తరగతి నుంచి ‘అమ్మో ఒక్కసారిగా అంత ఖర్చా మా వల్ల కాదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి వాళ్లకు రాధిక ఇచ్చే వివరణే అసలైన సమాధానం.నాలుగేళ్ల్ల బిల్ కడితే ఇరవై ఏళ్లు ఫ్రీ పవర్ సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే పాతికేళ్లు పని చేస్తుంది. నెలకు రెండువేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి రెండు కిలోవాట్ల కెపాసిటీ ΄్లాంట్ అవసరమవుతుంది. దాని ఖర్చు లక్షా నలభై వేలవుతుంది. ప్రభుత్వం నుంచి 60 వేల సబ్సిడీ వస్తుంది. వినియోగదారుడి ఖర్చు 80 వేలు. ఏడాదికి 24 వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్లకు నాలుగేళ్లలోపు ఖర్చు మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఇక కనీసంగా ఇరవై ఏళ్లు సోలార్ పవర్‌ని ఫ్రీగా పొందవచ్చు. సోలార్ పవర్‌ను పరిశ్రమలకు కూడా విస్తరిస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుంది.– రాధికా చౌదరి,కో ఫౌండర్, ఫ్రేయర్ ఎనర్జీ– వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
2050 నాటికి 100 కోట్ల మందికి స్థిర ఆదాయం!
ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది. 2050 నాటికి సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) నివేదించింది. దాదాపు 100 కోట్ల మందికి ఆ రంగం స్థిర ఆదాయం కల్పించనుందని తెలిపింది. ఈమేరకు బాకులోని కాప్29 సదస్సుకు హాజరైన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కర్మ షెరింగ్ సమక్షంలో అధికారికంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ తయారీకి ఐఎస్ఏ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమీకరించే ఎనర్జీ పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. దేశ స్థిరాభివృద్ధిలో సౌరశక్తి పాత్రను కేంద్రం గుర్తించిందని, అందుకు తగిన విధంగా సోలార్ ఎనర్జీ పరిధిని విస్తరించేందుకు ప్రపంచ వాటాదారులతో కలిసి పని చేస్తోందన్నారు. ఐఎస్ఏ నివేదికలో సూచించిన వినూత్న విధానాల ద్వారా మరింత మెరుగ్గా సౌరశక్తిని వినియోగించుకోవచ్చని చెప్పారు.నివేదికలోని వివరాల ప్రకారం.. సౌరశక్తితో గణనీయమైన సామాజిక, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. 2050 నాటికి ప్రపంచ సౌరశక్తి సామర్థ్యం 20 రెట్లు పెరుగనుంది. స్లో ట్రాన్సిషన్, డైనమిక్ ట్రాన్సిషన్, షైన్ అనే మూడు విధానాలతో నెట్-జీరో(కార్బన్‌ను విడుదలను పూర్తిగా తగ్గించడం) లక్ష్యాన్ని సాధించవచ్చు.స్లో ట్రాన్సిషన్: సౌరశక్తిని పెంచడానికి అవసరమయ్యే విధానాలను నెమ్మదిగా పెంచాలి. ప్రస్తుతం పరిమిత పెట్టుబడుల వల్ల ఈ విభాగం విస్తరణ కొంత వెనకబడి ఉంది. భవిష్యత్తులో ఈ ఇది పెరగనుంది.డైనమిక్ ట్రాన్సిషన్: స్లో ట్రాన్సిషన్‌తో పోలిస్తే సౌరశక్తిని పెంచడానికి మరింత చురుకైన, ప్రతిష్టాత్మక విధానాన్ని ఇది సూచిస్తుంది.షైన్: షైన్ (సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్) ద్వారా సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థను సృష్టించవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్(పీవీ) సిస్టమ్‌ను శక్తి నిల్వ కోసం వినియోగించుకోవచ్చు.స్థిర ఆదాయం: ప్రభుత్వాలు ప్రజలకు సౌరశక్తిపై అవగాహన కల్పిస్తే నిర్ణీత ఖర్చుతో సోలార్ ఎనర్జీను గ్రిడ్‌కు కనెక్ట్ చేయవచ్చు. దాంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మందికి స్థిర ఆదాయం ఏర్పడుతుంది.ఉపాధి: 2050 నాటికి ఈ విభాగంలో మహిళలు, యువతకు గణనీయమైన అవకాశాలు కల్పించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2.7 కోట్లకు పైగా ఈ సెక్టార్లో ఉద్యోగాలను సృష్టించవచ్చు.పర్యావరణ ప్రభావం: సౌరశక్తిని పెంచడం వల్ల సంప్రదాయ ఇంధన వనరులను తగ్గించి పారిస్ ఒప్పందం ప్రకారం 1.5°C ఉష్ణోగ్రతను తగ్గించేందుకు వీలవుతుంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 శాతం హానికర కర్బన ఉద్గారాలను కట్టడి చేయవచ్చు.తగ్గనున్న వ్యయ సామర్థ్యం: సౌరశక్తి అందించడం ప్రస్తుతం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా, 2050 నాటికి వీటి ఖర్చులు 60 శాతం తగ్గుతాయని అంచనా.ఇదీ చదవండి: ‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’పునరుత్పాదక ఇంధన వనరులతో శిలాజ ఇంధనాల వాడకం తగ్గడంతోపాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలు చేకూరుతాయని ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ అన్నారు. భవిష్యత్తులో స్థిరమైన ఎనర్జీ సరఫరాకు సౌరశక్తి కీలకంగా మారనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిర్బన్ ముఖర్జీ తెలిపారు. -
బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ - రేటెంతో తెలుసా?
-
ఎన్టీపీసీ గ్రీన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి
ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు.రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్‌ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు. ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు. 2027కల్లా 19,000 మెగావాట్లు.. ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్ వెల్లడించారు.నవంబర్ 19 నుంచి ఐపీవో.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్‌తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్‌కు బిడ్లు వేసుకోవచ్చు.ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్‌ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. -
ఛార్జింగ్ పెట్టాల్సిన పనేలేదు.. 60 కిమీ రేంజ్ ఇస్తుంది
-
Israel Hezbollah War: నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు
బీరుట్: వాకీటాకీలు, సౌర విద్యుత్ వ్యవస్థల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌పై భీకర భూతల, గగనతల దాడులతో తెగబడిన ఇజ్రాయెల్ తాజా తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిందని బుధవారం నాటి అనూహ్య పేలుళ్ల స్పష్టమైంది. హెజ్బొల్లా సాయుధులు విరివిగా వాడే పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో బుధవారం వాకీటాకీలు, సౌరవిద్యుత్ వ్యవస్థలు పేలిపోయాయి. ఈ అనూహ్య పేలుళ్ల ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేజర్ల పేలుళ్లతో 13 మంది చనిపోయి 2,800 మంది రక్తమోడిన తరుణంలో మరో ‘సాంకేతిక’ పేలుళ్ల పర్వానికి దిగి ఇజ్రాయెల్ కొత్త యుద్ధతంత్రానికి తెరలేపిందని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో దాదాపు మొత్తం భూభాగాన్ని జల్లెడపట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన లక్ష్యాన్ని లెబనాన్‌కు మార్చుకుందని తాజా ఉదంతం చాటుతోంది. అంతిమయాత్ర వేళ పేలుళ్లు పేజర్ల పేలుళ్లలో మరణించిన ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు, ఒక చిన్నారి అంతిమయాత్రలు బీరుట్ శివారులోని దహియేలో కొనసాగుతున్నపుడే వాకీటాకీలు పేలడం గమనార్హం. ‘‘బీరుట్లో చాలా చోట్ల వాకీటాకీలు పేలాయి. ఎల్రక్టానిక్ పరికరాలు పేలిన ఘటనల్లో 9 మంది చనిపోయారు’’ అని లెబనాన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. బీరుట్ నగరంతోపాటు లెబనాన్‌లో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయని హెచ్»ొల్లా ప్రతినిధులు చెప్పారు. వాయవ్య తీర పట్టణమైన సిడాన్లో ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ దుకాణం వాకీటాకీల పేలుడుకు ధ్వంసమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్తమోడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పోటెత్తుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి. ‘‘ఇలాంటిది నేనెప్పడూ చూడలేదు. గాయపడిన వారిలో చాలా మందికి చేతివేళ్లు తెగిపోయాయి. కళ్లు దెబ్బతిన్నాయి’’ అని బీరుట్‌లోని దీయూ ఆస్పత్రిలో వైద్యురాలు నౌర్ ఎల్ ఓస్తా చెప్పారు. ‘‘ వరుస అనూహ్య పేలుళ్లతో ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యంపోస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.దాడికి ఇదే సరైన సమయమా? వేలాది మంది హెజ్బొల్లా సైనికులు గాయాలపాలై ఆస్పత్రులకు పరిమితమయ్యారు. పేజర్ల పేలుడుతో హెజ్బొల్లాలో కమ్యూనికేషన్ నెట్వర్క్ కోలుకోనంతగా దెబ్బతింది. వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లతో పౌరుల్లో ఆందోళనల నడుమ దేశంలో శాంతిభద్రతలపై లెబనాన్ దృష్టిపెట్టాల్సిఉంది. ఈ తరుణంలో దాడి చేస్తే శత్రువును భారీగా దెబ్బ కొట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గడ్డపై వరుస పేలుళ్లతో ఆగ్రహించిన లెబనాన్, హెజ్బొల్లా సాయుధాలు దాడులకు తెగబడొచ్చన్న ఇజ్రాయెల్ భావించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రాయెల్ అదనపు బలగాలను తరలించింది. అక్టోబర్ 8న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దమనకాండ మొదలైననాటి నుంచి ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది. ఉద్రిక్తతలను ఆపండి: ఐరాస లెబనాన్ వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తచేసింది. ‘‘ పరిస్థితి చేయిదాట కుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ‘‘ బందీలను విడిచిపెట్టి శాంతి స్థాపనకు కట్టుబడాలి. ఎల్రక్టానిక్ పరికరాల పేలుళ్లకు పాల్పడటం చూస్తుంటే ఇది భారీ సైనిక చర్యకు కసరత్తులా తోస్తోంది’’ అని గుటెరస్ వ్యాఖ్యానించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ చెప్పారు. యుద్ధంలో కొత్త దశ మొదలైంది: ఇజ్రాయెల్వాకీటాకీల ఉదంతం తర్వాత రమాట్ డేవిడ్ వైమానిక స్థావరంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో కొత్త దశకు తెరలేపుతున్నాం. యుద్ధక్షేత్ర కేంద్ర స్థానం ఉత్తరం నుంచి దిశ మార్చుకుంటోంది. మాకు ఇప్పుడు స్థిరత్వం అవసరం. బలగాలు, వనరులను వేరే లక్ష్యం వైపు వినియోగించే అవకాశముంది. బుధవారం అద్భుత ఫలితాలు సాధించాం’’ అని సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హెజ్బొల్లాపై అదనపు దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో లెబనాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోందని అర్థమవుతోంది. కాగా, వరుస పేలుళ్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఐరాస మానవహక్కుల సంస్థ చీఫ్ వోకర్ టర్క్ డిమాండ్‌చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు!
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయని ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' సోమవారం తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ ఈ ప్రకటన చేశారు.సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్స్టాలేషన్ పనులు పూర్తయ్యాయని మోదీ వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు తమ వినియోగానికి కావలసిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి రూ. 25000 ఆదాయం పొందుతున్నారు.ఇదీ చదవండి: రూ. 75వేలు దాటేసిన బంగారం.. రూ. లక్షకు చేరువలో వెండిఒక చిన్న కుటుంబం నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఉపయోగించుకున్న తరువాత.. కూడా కొంత ఆదాయాన్ని పొందటం అనేది చాలా గొప్ప విషయం. ఈ పథకం ద్వారా ఉపాధి కల్పన కూడా ఏర్పడుతుందని పేర్కొంటూ.. గ్రీన్ ఉద్యోగాలు వేగంగా పెరుగుతాయని అన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని మోదీ వెల్లడించారు. పీఎం సోలార్ రూఫ్‌టాప్ పథకం ద్వారా భారతదేశంలోని పొరతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారుగా మారుతుందని అన్నారు. -
రాత్రిని పగలుగా మార్చేయండిలా..
అసాధ్యాలను సుసాధ్యం చేయడమే మనిషి పని. ఇప్పటికే అనేక అద్భుతాలను సృష్టించిన మానవుడు.. రాత్రి పూట కూడా వెలుతురును అందించడానికి కొత్త ప్రయోగాలను చేస్తున్నాడు. ఇదే జరిగితే.. రాత్రి పూట ఎక్కడ వెలుతురు కావాలన్నా ఇట్టే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవానికి అదేమైనా ఫుడ్ అనుకున్నావా? అనే అనుమానం మీకు రావొచ్చు.. వినడానికి కొంత వింతగా కూడా అనిపించవచ్చు. కానీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యాపోవడం తప్పకుండా మీ వంతు అవుతుంది. ఇక ఆలస్యమెందుకు ఈ కథనంలో చదివేయండి..కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' (Reflect Orbital) అనే కంపెనీ సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యరశ్మిని (కాంతిని) అందించడానికి ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కంపెనీ సీఈఓ 'బెన్ నోవాక్' కొన్ని వివరాలను కూడా షేర్ చేసుకున్నారు.బెన్ నోవాక్ ప్రకారం.. భూమి ఉపరితలం మీద భారీ సౌరఫలకాలను ఏర్పాటు చేసి కాంతి ఎక్కడ కావాలనుకుంటారో అక్కడకు మళ్లించడానికి కొత్త టెక్నాలజీలను తీసుకువస్తున్నారు. సమయంలో సంబంధం లేకుండా.. సూర్యరశ్మిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ప్లాన్‌ను కూడా బెన్ నోవాక్.. లండన్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్'లో వివరించారు.ప్రస్తుతం ఎక్కువమంది సోలార్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయమే. అయితే ఇక్కడ వచ్చిన ఓ సమస్య ఏమిటంటే కోరుకున్నప్పుడు సౌరశక్తి అందుబాటులో ఉండదు. సోలార్ ఫామ్‌లు రాత్రిపూట శక్తిని ఉత్పత్తి చేయలేక పోతున్నాయని వెల్లడించారు. కాబట్టి తమ ప్రాజెక్ట్ ద్వారా రాత్రి సమయంలో కూడా వెలుగును అందిస్తామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం నోవాక్ బృందం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులోని ప్రతి ఒక్కటీ 33 చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్తో అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ భూమి ఉపరితం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి. అత్యవసర సమయంలో.. భూమి ఉపరితలం మీద నిర్మించిన పవర్ ప్లాంట్లకు అదనంగా 30 నిమిషాల కాంతిని అందించగలవని పేర్కొన్నారు.మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే.. కక్ష్యలోని ఉపగ్రహాలు సూర్యుని నుంచి కాంతిని గ్రహించి, భూమిపై అమర్చిన సోలార్ ఫలకాల మీద పడేలా చేస్తాయి. ఆ తరువాత కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే డైరెక్షన్ ఆధారంగా ఆపరేటర్లు ఎక్కడ లైటింగ్ కావాలో అక్కడ ప్రసరించేలా చేస్తారన్నమాట.ఏడుగురు సభ్యులతో కూడిన నోవాన్ బృందం దీనిని అర్థం అయ్యేలా చెప్పడానికి ఒక ప్రయోగం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌కు సుమారు ఎనిమిది అడుగుల మైలార్ మిర్రర్ జోడించారు. సౌర ఫలకాలపై సూర్యరశ్మిని పరావర్తనం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఉపయోగించిన మైలార్ మిర్రర్స్ గాజుతో కాకుండా.. అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌ను కలిగి ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: జాబిల్లిపై రోబో గోడలు!ఈ వీడియోలో ఒక కంట్రోలర్ సాయంతో అక్కడే ఉన్న ట్రక్కు మీదికి కాంతిని ప్రసరింపజేయడం చూడవచ్చు. ప్రయోగంలో 800 అడుగులు దూరంలో హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న మైలార్ మిర్రర్.. కింద ఉన్న సోలార్ ప్యానెల్స్‌పై కాంతిని ప్రసరించేలా చేసింది. అన్నీ అనుకున్న విధంగా పూర్తయితే.. ఇది 2025 నాటికి అమలులోకి వస్తుంది. ఇప్పటికే దీనికోసం 30000 మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.ఇదెలా పనిచేస్తుందంటే..ఇప్పటికే అప్లై చేసుకున్నవారు.. రాత్రి పూట కాంతి అవసరమైన ప్రదేశంలో లైటింగ్ కావాలనుకున్నప్పుడు కంపెనీ లోకేషన్ ఆధారంగా కాంతిని ప్రసరింపజేస్తారు. అయితే ఈ కాంతి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 -
కేంద్ర సబ్సిడీ ప్రక్రియ గడువు తగ్గింపు
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.6 లక్షల మందికి సబ్సిడీ అందించినట్లు కేంద్రం తెలిపింది. వినియోగదారుల ఖాతాల్లో జమయ్యే సబ్సిడీకి సంబంధించి ప్రక్రియ సమయాన్ని నెల నుంచి ఏడు రోజులకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన బడ్జెట్ సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రవేశపడుతున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఫిబ్రవరిలో కేంద్రమంత్రి ఈ పథకం వివరాలు ప్రకటించినప్పటి నుంచి దాదాపు 1.3 కోట్ల దరఖాస్తులు నమోదయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందులో 3.85 లక్షల గృహ వినియోగదారుల ఇళ్లలో సోలాన్ ప్యానెళ్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తియిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.6 లక్షల మంది లబ్ధిదారులకు సబ్సిడీ అందిందని చెప్పారు. గతంలో ప్రభుత్వం సబ్సిడీ అందించేందుకు బ్యాంక్ ఖాతాలు, చెక్‌లను వినియోగించేది. తాజాగా వాటి స్థానంలో ఎన్పీసీఐ సేవలు వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఫిబ్రవరి 15, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలో కోటి గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లను వినియోగించేలా ప్రోత్సాహకాలు అందిస్తారు. ఈ సోలార్ ప్యానెళ్లను అమర్చుకునే గృహ వినియోగదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందవచ్చు. దీనికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి. సోలార్ ప్యానెల్లకు తగిన ఇంటి పైకప్పు ఉండాలి. ఇతర సోలార్ ప్యానెల్ సబ్సిడీని పొందకూడదు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (ఎన్పీఏఐ), రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (ఎస్ఐఏ) నిర్వహిస్తున్నాయి. -
అన్నింటా టెక్నాలజీ అన్వేషించాలి: ఆనంద్ మహీంద్రా
అభివృద్ధి చెందిన భారత్ (వికసిత భారత్) మన లక్ష్యం అంటూ ప్రధాన చెబుతూనే ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీని మరింత విస్తరించాలని.. పునరుత్పాదక వనరులను ఉపయోగించుకోవాలని కేంద్రమంత్రులు సైతం అనేక సమావేశాలలో పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి జరుగుతున్న పనులు చూడవచ్చు. ఇందులో ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ వంటి పరికరాలను అమర్చుతూ ఉండటం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. సౌర శక్తి పరిశ్రమలో ఆవిష్కరణల వేగం కేవలం నమ్మశక్యం కాదు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తున్నప్పుడు.. మన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కొత్త టెక్నాలజీలను ఆన్చేసించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ చాలా అవసరమని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.The pace of innovation in the solar energy industry is simply incredible. As the fastest growing large economy in the world, our energy needs are going to be daunting…So we need to explore not one, but each and EVERY one of these new technologies…. pic.twitter.com/kcG6YVLYL2— anand mahindra (@anandmahindra) August 21, 2024 -
వెండి విమానం! సూర్యుడే ఇంధనం!!
ఇది విమానంలా కనిపిస్తున్నా.. విమానం కాదు. సిల్వర్-ఫాయిల్ తయారు చేసిన, హీలియం నింపిన ఓ పేద్ద బుడగ లాంటిది. గాల్లోకి ఎగిరి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందిస్తుంది. పగలంతా సౌరశక్తిని వాడుకుని రాత్రిళ్లు కూడా పనిచేస్తుంది.రిమోట్ ప్రాంతాలలోని వ్యక్తులకు ఎత్తులో ఎగిరే బ్లింప్ లాంటి విమానం నుంచి ఎందుకు అందించకూడదు? అన్న ఆలోచనతోనే న్యూ మెక్సికోకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కీయే (Sceye) సౌర శక్తిని ఉపయోగించుకుని స్ట్రాటోఆవరణలో సంచరించే హ్యాప్స్ (HAPS- హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్ స్టేషన్)ను రూపొందించింది.స్కీయే హ్యాప్స్ 65 మీటర్ల (213-అడుగులు) పొడవైన సిబ్బంది లేని హీలియం నిండిన విమానం. దీన్ని నిలువుగా నింగిలోకి ప్రయోగిస్తారు. 60,000 నుంచి 65,000 అడుగుల (18,288 నుండి 19,812 మీ) ఎత్తుకు ఇది వెళ్తుంది. సిల్వర్-ఫాయిల్ తయారైన దీని ఉపరితలంపై ఉండే గాలియం సెలీనైడ్, గాలియం ఆర్సెనైడ్ సౌర ఘటాల శక్తి ద్వారా జీపీఎస్ సాయంతో నిర్దేశిత ఎత్తులో దీన్ని సంచరించేలా చేస్తారు. ఇది మారుమూల ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ని ప్రసారం చేయడం, వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, అడవుల్లో మంటలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటి పనులను చేయగలదు.ఈ విమానానికి సంబంధించిన సరికొత్త మైలురాయి గత వారమే వచ్చింది. దాని సౌర ఘటాల ద్వారా పగటిపూట దాని బ్యాటరీలను ఛార్జ్ చేసుకుని, ఆ బ్యాటరీ శక్తిని ఉపయోగించి రాత్రిపూట కూడా ఆ స్థానంలో నిలిచి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7:36 గంటలకు న్యూ మెక్సికోలోని స్కీయే స్థావరం నుంచి దీన్ని ప్రయోగించగా 61,000 అడుగుల (18,593 మీ) ఎత్తుకు చేరుకుని మరుసటి రోజు మధ్యాహ్నం 12:21 గంటల వరకూ నిర్దేశిత ఎత్తులోనే సేవలందించింది. -
బంగారు పూతతో తొలి సోలార్ ప్యానెల్.. 140 ఏళ్ల చరిత్ర
-
Reva Jhingan Malik: పర్యావరణ హితమైన జీవనశైలిలో.. మేడ మీద వంట!
మేడ మీద వడియాలు పెటుకున్నట్టే, మేడ మీద పంటలు కూడా ఇటీవల ఎక్కువైంది. బెంగళూరుకు చెందిన రేవా జింగాన్ మాలిక్ మాత్రం రోజూ ఉదయం తొమ్మిది గంటలకు మేడ మీదకెళ్లి వంట మొదలుపెడుతుంది. అదే సోలార్ కుకింగ్. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ హితమైన జీవనశైలిలో భాగంగా ఆమె ఈ సోలార్ కుకింగ్‌ని అనుసరిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ వాడకం వల్ల భూమికి జరిగే హానిని తనవంతుగా నిలువరించగలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. వండడానికి, ఎండబెట్టడానికి అనువుగా ఆమె డిజైన్ చేయించుకున్న సోలార్ ఎక్విప్మెంట్ గురించి...ప్రత్యామ్నాయ జీవనశైలి..ఎల్పీజీ వాడకం ఎక్కువైంది. గడచిన ఐదేళ్లలో మనదేశం దిగుమతులు కూడా ఆ మేరకు పెరిగి΄ోతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.4 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 2022–23 నాటికి 18.3 ఎమ్ఎమ్టీలకు చేరింది. మన ఉత్పత్తుల శాతం నాలుగుగా ఉంటే వినియోగ శాతం 22కి చేరింది. అందుకే సస్టెయినబుల్ లివింగ్ మాత్రమే అసలైన ప్రత్యామ్నాయం అనుకున్నాను. అదే విషయాన్ని పిల్లలకు, పెద్దలకు బోధిస్తున్నాను. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని ఎదురు చూడరాదు, మనవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి.కొన్ని దేశాల్లో సూర్యరశ్మి తగినంత ఉండదు, కానీ మనదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. ఇతర ఇంధనాల వలె వాడుకకు అనువుగా చేయడానికి ప్రాసెసింగ్ అవసరం, సోలార్ ఎనర్జీని వాడడానికి మనం ప్రత్యేకంగా శ్రమించాల్సింది ఏమీ లేదు. ఒకసారి సోలార్ కుకర్ని కొంటే సంవత్సరాలపాటు వినియోగించుకోవచ్చు. నాలుగేళ్ల కిందట 18వేల రూ΄ాయలకు కొన్నాను. శీతాకాలం, వర్షాకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది. 850 వాట్స్ సోలార్ ఇన్వర్టర్ అమర్చడం ద్వారా ఆ సమస్యనూ పరిష్కరించుకున్నాను.అన్నం, పప్పు, కూరగాయలకు మూడు అరల సోలార్ కుకర్ డిజైన్ చేయించుకున్నాను. ఉదయం ఎనిమిది గంటలకు బియ్యం, పప్పు కడిగి, నానబెట్టి, కూరగాయలు తరిగి తొమ్మిదింటికి మేడ మీదకు వెళ్లి కుకర్ ఆన్ చేసి వస్తాను. పదకొండు గంటలకల్లా వంట పూర్తవుతుంది. పాలు మరిగించడం నుంచి ప్రతిదీ ఇందులోనే చేస్తున్నాను. పప్పులు, గింజలు, రైజిన్స్, వేయించడం నుంచి ఎండబెట్టి పొడి చేసుకునే పసుపు, ఎండుమిర్చి వరకు అందులోనే చేస్తున్నాను. మంట లేని వంట మాది’’.ఇవి చదవండి: ప్లాస్టిక్ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్ -
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ సౌలబ్యాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. రైతులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ ఎక్కువగా అమలు కాలేదు. ఇప్పుడు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది ప్రారంభమైన 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' మాదిరిగానే.. ఇప్పుడు రైతులు ఈ సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం నేషనల్ పోర్టల్ ద్వారా విక్రేతలతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రైతులు ఇష్టపడే సోలార్ పంపుల రకాన్ని ఎంచుకోవడంలో మాత్రమే కాకుండా ఇన్స్టాలేషన్ సమయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.కుసుమ్ యోజన స్కీమ్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. అవి 10000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం, 2 మిలియన్ స్టాండ్-అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేయడం, 1.5 మిలియన్ వ్యవసాయ పంపులను సోలారైజ్ చేయడం. వ్యవసాయ పంపుల ఇన్స్టాలేషన్, సోలారైజేషన్ కోసం హేతుబద్ధీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ సబ్సిడీలో ఎటువంటి మార్పులు లేదు. కేంద్రం దీనికోసం రూ.34,422 కోట్లు కేటాయించింది.సోలార్ పంప్ ఇన్స్టాలేషన్లు, సోలారైజేషన్ కోసం కేంద్రం 30% సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్రాలు కూడా 30 శాతం సబ్సిడీ అందిస్తాయి. ఈ పథకం కోసం బ్యానుకులు కూడా తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర సబ్సిడీ కాంపోనెంట్ కూడా పోర్టల్‌లో పేర్కొనటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. దీని ద్వారా రైతు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచి కరెంటు కొంటారు.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో 10 మిలియన్ల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన పథకానికి ఇప్పటి వరకు 8,00,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను తలదన్నిన భారత్
భారత్ 2023లో సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌరశక్తి ఉత్పాదక దేశంగా అవతరించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ అంబర్ తన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.2015లో సౌరశక్తి వినియోగంలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్ గత కొన్ని ఏళ్లుగా సౌరశక్తి వినియోగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దాని ఫలితమే ఈ విజయం. ‘గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’ పేరుతో అంబర్ ఈ నివేదికలో 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 5.5 శాతం సౌరశక్తి రూపంలో లభించిందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వృద్ధి 2023లో ఆశా జనకంగా ఉందని, అయితే చైనాలో కరువు కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.ప్రపంచంలో అత్యంత చౌకైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం భారతదేశం అయితే అత్యంత ఖరీదైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం కెనడా. 2023 నాటికి భారతదేశం సౌరశక్తి ఉత్పత్తి విషయంలో ప్రపంచంలోనే నాల్గవ దేశంగా నిలిచింది. ఈ విషయంలో చైనా, అమెరికా, బ్రెజిల్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. సౌరశక్తి వృద్ధిలో ఈ నాలుగు దేశాల వాటా 2023లో 75 శాతంగా ఉంది. జపాన్.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి సహకారం 2015లో 0.5 శాతంగా ఉండగా, ఇది 2023లో 5.8 శాతానికి పెరిగింది. సౌర శక్తి 2030 నాటికి ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 22 శాతానికి పెరగనున్నదనే అంచానాలున్నాయి. 2030 నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని యోచిస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. -
భారత్‌లో సోలార్ సొల్యూషన్స్ అందిస్తున్న నం.1 కంపెనీ
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో సోలార్ సొల్యూషన్స్ అందించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్‌మాక్స్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంయుక్త సంస్థ భారతదేశంలోని ఆరు పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్‌లను అమర్చింది. తాజాగా రెండు కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్‌లతో 2.07 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు ఇండియాలో యాపిల్ తన కార్పొరేట్ కార్యకలాపాలను పెంపొందించుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై అవగాహన కలిగిస్తూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని క్లీన్మాక్స్ తెలిపింది. -
Ramoji, RK: సైకోల నుంచి సైతాన్లుగా ప్రమోషన్!
రోజు-రోజుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దిగజారిపోయి పాఠకులను హింసిస్తున్నాయి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఈ రెండు సంస్థల యజమానులు రామోజీరావు, రాధాకృష్ణలు సైకోల నుంచి సైతాన్ల స్థాయికి ప్రమోషన్ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రడ్డిపై విద్వేషంతో ఏపీపై పగబట్టి రాస్తున్న వార్తలు దారుణంగా ఉంటున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల వరకు ఈ బాధ తప్పదని తెలిసినా, మరీ నీచంగా మారడం అత్యంత శోచనీయం అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈనాడు పచ్చి మోసపూరిత వార్తలు రాసింది. రామోజీరావు ఈ విధానం కరెక్టు అని భావిస్తే దానినే ధైర్యంగా రాసి బీజేపీని తీవ్రంగా విమర్శించాలి. కాని అంత ధైర్యం లేదు. పైగా వారు ఈయనకు పద్మ విభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు కదా! దానికి సదా కృతజ్ఞతగా లొంగి ఉండాలి కదా! బీజేపీ తనకు ఎన్నికల నిధులు ఇవ్వడం లేదనుకున్నవారిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వంటివాటిని ప్రయోగిస్తోందన్న ఆరోపణ వస్తోంది. అది నిజమా? కాదా? కొన్ని ఆంగ్ల పత్రికలలో ఏ ఏ కంపెనీలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి. వాటిలో అత్యధిక భాగం బీజేపీకే దక్కాయా? లేదా? అన్నది ఆ వార్తల సారాంశం. బీజేపీకి మొత్తం విరాళాలలో ఏభై శాతం నిధులు దక్కితే ఆ తర్వాత టీఎంసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎమ్‌కే వంటి పార్టీలు ఉన్నాయి. తదుపరి వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ విరాళాలపై విశ్లేషిస్తే బీజేపీకి నిదులు ఇచ్చిన కంపెనీలు ఏవి? స్వచ్చందంగా ఇచ్చాయా? లేక భయపడి ఇచ్చాయా? అన్న అంశాలపై పరిశోధన చేయవచ్చు. కొన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయంలో వివరణాత్మక స్టోరీలు ఇచ్చాయి. ఈనాడు మీడియాకు, దాని అదినేత రామోజీరావుకు దేశం అంతా ఎటు పోయినా ఫర్వాలేదు. ఎవరికి ఎన్నివేల కోట్ల రూపాయల నిధులు వచ్చినా ఇబ్బంది లేదు.. కాని ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు నిదులు వస్తే మాత్రం ఏదో ఒక చెత్తరాసి బురదచల్లుతారు. ఈ కధనంలో అవేవో కంపెనీలకు భూములు ఇచ్చి ఫేవర్ చేసినందుకే అవి విరాళాలు ఇచ్చాయని రాశారు. వైసీపీకి అందుకే ఇచ్చారని అనుకుందాం. మరి తెలుగుదేశంకు ఎందుకు విరాళాలు ఇచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీకి 499 కోట్లు విలువైన బాండ్లు వస్తే, తెలుగుదేశంకు 320 కోట్ల మేర బాండ్లు వచ్చాయి. అంటే ఆయాకంపెనీలను తెలుగుదేశం బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును సంపాదించిందా? తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోని కంపెనీలే ఎందుకు వచ్చాయి? చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాయా? లేక ఆయన బెదిరించి సంపాదించారా? ఉదాహరణకు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిది అని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు కదా? వారు ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నా అటు తెలుగుదేశం కాని, ఇటు ఈనాడు రామోజీరావు కాని దానిని అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేసేవారు కదా! ఎంతో విషం చిమ్మేవారు కదా! అదే కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల విరాళం ఎలా అందింది. నిజంగానే అది వైఎస్సార్సీపీ సంబందించిన వారిది అనుకుంటే టీడీపీ తిరస్కరించి ఉండవచ్చుకదా! అంటే బ్లాక్ మెయిల్ చేసి ఆ కంపెనీ నుంచి విరాళం రాగానే టీడీపీ నోరు మూసేసుకుందా? బీజేపీకి రూ.8,250 కోట్ల బాండ్లు, కాంగ్రెస్‌కు రూ.1,951 కోట్లు, టీఎమ్‌సీకి రూ.1,716 కోట్లు, బీజేడీకి రూ.1,019 కోట్లు, డీఎంకేకి రూ.656 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. బీఆర్ఎస్కు రూ.1,408 కోట్ల బాండ్లు లబించాయి. చివరికి ఒక్క అసెబ్లీ సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనకు కూడా 21 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి కదా! వీరందరికి ఏ రకంగా వచ్చాయో ఎందుకు విశ్లేషించలేదో రామోజీ చెప్పగలరా! టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఒక విశ్లేషణ ప్రకారం డీఎమ్‌కే , వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లకు వాటికి రావాల్సిన వాటా రాలేదని వెల్లడించింది. వైఎస్సార్సీపీ, డీఎంకేల కన్నా చిన్న పార్టీ అయిన బీఆర్ఎస్కు రెండు, మూడు రెట్ల నిదులు ఎందుకు వక్కువ వచ్చాయి? వైసీపీకి 23 మంది లోక్ సభ, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రావల్సినంత రాలేదన్నది దీని అర్ధం. అదే టైమ్‌లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 లోక్ సభ , ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న టీడీపీకి 320 కోట్ల బాండ్లు ఎలా దక్కాయో చెప్పాలి కదా! కొన్ని కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాతే అవి బీజేపీకి బాండ్ల రూపంలో నిదులు సమకూర్చిన విషయాన్ని కొన్ని ఆంగ్ల పత్రికలు సమగ్రంగా ఇచ్చాయి. ఇవన్ని పక్కనబెట్టి రామోజీరావు వైసీపీపైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? విశేషం ఏమిటంటే ఒకపక్క వైఎస్ జగన్మోహన్రడ్డి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను తరిమేశారని పదే, పదే రాస్తుంటారు కదా? అదంతా అబద్దమని శనివారం నాడు రాసిన పత్రికలో రాసిన ఈ బాండ్ల కధనంతో తేలిపోయింది. వైసీపీకి 96 కంపెనీల నుంచి విరాళాలు అందితే అందులో 26 విద్యుత్ కంపెనీలు అని ఈ పత్రిక రాసింది. అంటే కొత్తగా కేవలం విద్యుత్ రంగంలోనే 26 కంపెనీలు వస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా? వారు విరాళం ఇచ్చారంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెడుతున్నట్లే కదా! 30826 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, ముఖ్యంగా సౌర, పవన, పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని తెలిపింది. వీటి స్థాపనకు లక్ష ఎకరాలు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి ఉపయోగం లేదని మరో దిక్కుమాలిన రాత రాసింది. అదే వార్తలో మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున గ్రీన్ టాక్స్ వస్తుందని తెలిపింది. విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు దేనికి కూడా భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. రైతుల నుంచి ఈ పరిశ్రమలవారు లీజుకు తీసుకుని ఏటా ఏకరాకు ముప్పైవేల రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమలో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా రైతులకు మేలు చేస్తే, అదేదో తప్పు అయినట్లు ఈ పత్రిక దరిద్రపు గొట్టు వార్త రాసింది. ఈ భూములు ఇచ్చారు కనుక విరాళాలు పొందిందని నీచమైన విశ్లేషణ చేసింది. గ్రీన్కో కంపెనీకి 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇస్తే, ఆ కంపెనీ వైసీపీకి పది కోట్లు ఇచ్చిందట. ఏమన్నా మతి ఉండి ఈనాడు రామోజీ ఇలా రాస్తారా? కొన్ని వేల కోట్ల కంపెనీ కేవలం పది కోట్లు ఇస్తే అది కూడా ఫేవర్ చేసినట్లా? ఇక మెఘా కంపెనీ ఇచ్చిన 37 కోట్ల మీద కూడా ఇలాంటి చెత్తనే రాశారు. ఆ కంపెనీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కలిపి సుమారు 900 కోట్లు ఇచ్చింది. అదే వైసీపీకి 37 కోట్లే. కాని టీడీపీకి 25 కోట్లు ఇచ్చింది. దీనిపై ఈనాడు రాసిన వార్త చదివితే ఎంత బుద్ది, జ్ఞానం లేకుండా ఈ పత్రిక విషం చిమ్ముతోందా అనిపిస్తుంది. సీలేరు, పోలవరం హైడల్ ప్రాజెక్టులతో పాటు తాజాగా 12 వేల కోట్ల రూపాయల విలువైన ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఇచ్చినందుకే ఈ విరాళం ఇచ్చిందని రాశారు. మరి తెలుగుదేశం కూడా మరి పాతిక కోట్లు ఎందుకు ఇచ్చింది రాయలేదు. ఏమీ లేని జనసేనకు 21 కోట్లు ఎలా వచ్చాయని ఈ పత్రిక ప్రశ్నించలేదు. తెలుగుదేశంకు భారత్ బయోటెక్ పది కోట్లు, పశ్చిమ యుపి పవర్ ఇరవై కోట్లు, నాట్కో పద్నాలుగు కోట్లు, రెడ్డి లాబ్స్ పదమూడు కోట్లు ఎందుకు ఇచ్చాయో విశ్లేషించాలి కదా! అధికారం లేదు కనుక ప్రతిపక్షంగా ఉండి టీడీపీ వారిని బ్లాక్ మెయిల్ చేసిందని రామోజీ ఎందుకు చెప్పడం లేదు? ఇక టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన రాజ్యసభ సబ్యుడు సీఎమ్.రమేష్ కాంగ్రెస్, జేడీఎన్లకు కలిపి 40 కోట్లు ఎలా ఇచ్చారు? టీడీపీకి ఐదు కోట్లు ఎలా ఇచ్చారు. అంటే ఈ పార్టీలతో కూడా సంబంధ బాంధవ్యాలు మెయిటెన్ చేస్తున్నట్లే కదా! రామోజీ వికృత రాతలకు, పక్షపాత కధనాలకు ఇదో పెద్ద ఉదాహరణగా తీసుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘పీఎం సూర్య ఘర్’కు కోటి రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: సుమారు నెల క్రితం ప్రారంభించిన రూఫ్ టాప్ సోలార్ స్కీం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అనూహ్య స్పందన వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం కోసం ఇప్పటికే కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అద్భుతమంటూ శనివారం ‘ఎక్స్’లో హర్షం వ్యక్తం చేశారు. అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఇప్పటికీ రిజస్ట్రేషన్ చేయించుకోని వారు సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని సూచించారు. -
బీడు భూముల్లో ఇం‘ధనం’..!
రాయదుర్గం: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల చెంతకు వ్యవసాయ సేవలను తీసుకొచ్చింది. విత్తనం మొదలు పంట దిగుబడుల మార్కెటింగ్ వరకు సాయమందిస్తోంది. మరో వైపు వ్యవసాయం చేసే పరిస్థితులు లేక భూములు బీడు పెట్టుకున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో బీడు భూములు కలిగిన రైతులకు ఇంధన రంగం ద్వారా శాశ్వత ఉపాధి మార్గం చూపేందుకు ముందుకొచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో రూ.12,065 కోట్ల వ్యయంతో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటైతే ప్రత్యక్షంగా 3,300 మంది, పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి లభించనుంది. నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో భూసేకరణ.. సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమయ్యే భూములను నెడ్‌క్యాప్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. నెడ్‌క్యాప్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్రామసభలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం మండలాల్లో ఇప్పటికే 15 వేల ఎకరాలు గుర్తించారు. అందులో 6,750 ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం తీసుకున్నారు. ప్రస్తుతం డీ హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అదనంగా మరో 2,250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇన్వెస్టర్లను ఒప్పించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాప్తాడులో 1,050 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో 1,050 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను నెడ్‌క్యాప్ ప్రతినిధులు ముమ్మరం చేశారు. 30 ఏళ్ల లీజుతో సుస్థిర ఆదాయం.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటైతే బీడు భూములకు మహర్దశ కలగనుంది. రైతుల అంగీకారం మేరకు 30 ఏళ్ల పాటు లీజు అగ్రిమెంట్‌తో నెడ్‌క్యాప్ ఒప్పందం చేసుకోనుంది. సాధారణంగా రైతు గుత్త (కౌలు)కు ఇస్తే ఎకరా రూ.5వేల నుంచి రూ.8 వేలకు మించదు. అలాంటిది ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు ధర నిర్ణయిస్తే, రైతు సంక్షేమం దృష్ట్యా మరో రూ.5 వేలు పెంచి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను ఒప్పించింది. సోలార్ ప్లాంట్ ప్రతీకాత్మక చిత్రం ఈ నేపథ్యంలో ఎకరాకు రూ.30 వేల చొప్పున రైతు ఖాతాకు నేరుగా జమ కానుంది. పంట పండినా ఇంత మొత్తం చూడటం సాధ్యం కాదని అన్నదాతలు అంటున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రెండింతల సుస్థిర ఆదాయం లభిస్తుండడంతో చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మౌలిక వసతులు మెరుగు.. సోలర్ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంలో రెండు శాతం సీనరేజ్ నిధులను సమీప గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. తద్వారా రైతు, కూలీల జీవనోపాధికి తోడు గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. వలస మాటే లేకుండా సొంతూళ్లలోనే వేలాది మంది నిరుద్యోగులు, కూలీలకు ఉపాధి లభించనుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాయదుర్గం రూపురేఖలు మారుస్తాం రాయదుర్గం ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది రూపురేఖలు మార్చుతాం. పేదరికం శాశ్వతంగా దూరం చేసేలా కృషి చేస్తాం. ఇప్పటికే జాజరకల్లు వద్ద రూ.533 కోట్ల వ్యయంతో ఇథనాల్ ఇంధన తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించింది. తాజాగా సోలర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 3వేలకు పైగా మెగావాట్ల సోలర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఇన్వెస్టర్లను ఒప్పిస్తాం. రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సోలార్ ప్లాంట్లలో స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేస్తాం. – మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రైతులు ముందుకు రావాలి బీడు భూములు, వర్షాధారంగా అరకొరగా పంట పండే రైతులు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఐదు ఎకరాలున్న రైతు కూడా పైసా పెట్టుబడి లేకుండా ఏడాదికి రూ.1.50 లక్షలు పొందవచ్చు. భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దీనివల్ల ప్రయోజనం తెలిశాకే అంగీకారం పొందవచ్చు. – రాణీ సుస్మిత, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
పిక్నిక్ కోసం సోలార్ ప్యానల్ టెంట్..ధర ఎంతంటే?
శీతాకాలంలో చాలామంది పిక్నిక్లకు, వనవిహారాలకు వెళుతుంటారు. ఆరుబయట టెంట్లు వేసుకుని కాలక్షేపం చేస్తుంటారు. పగటివేళ ఫర్వాలేకున్నా, రాత్రివేళల్లో చలి వణికించేటప్పుడు టెంట్లలో గడపడం కష్టంగానే ఉంటుంది. దుప్పట్లు, రగ్గులు ఎన్ని తీసుకువెళ్లినా చలితీవ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో టెంట్లు పూర్తి సౌకర్యాన్ని ఇవ్వలేవు. టెంట్లలో వెలుతురు కోసం లాంతర్లు లేదా ఎమర్జెన్సీ లైట్లను, పూర్తిస్థాయి విద్యుత్తు సరఫరా కావాలనుకుంటే భారీ బ్యాటరీలను మోసుకుపోవాల్సి ఉంటుంది. ఇంత తతంగం లేకుండా, తేలికగా ఏర్పాటు చేసుకునే సోలార్ టెంట్‌ను అమెరికన్ కంపెనీ జాకరీ ‘లైట్ టెంట్–ఎయిర్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. చాలా తేలికగా ఉన్న టెంట్‌ను ఆరుబయట ఎక్కడైనా సులువుగా వేసుకోవచ్చు. దీంతోపాటే సోలార్ ప్యానల్స్‌ను, బ్యాటరీని అమర్చుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా ఈ బ్యాటరీ 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేసుకుంటుంది. రాత్రివేళ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉపయోగ పడుతుంది. రాత్రంతా టెంట్‌ను వెచ్చగా ఉంచుతుంది. దీని ధర సుమారు 3 వేల డాలర్లు (రూ.2.49 లక్షలు) మాత్రమే! -
37,490 మెగావాట్ల సోలార్‌పార్క్‌లు.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే..
దేశవ్యాప్తంగా పరిశ్రమలు, గృహావసరాలకు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కానీ అందుకు సరిపడా కరెంట్ తయారవడం లేదు. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి బదులుగా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారుచేయాలని చాలాకాలంగా అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ఏడాది నవంబర్ 30 వరకు 37,490 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 50 సోలార్ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మంగళవారం పార్లమెంటులో వెల్లడింకచారు. ప్రభుత్వం 40 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ పార్లమెంట్లో తెలిపారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం కింద నవంబర్ 30 నాటికి దేశంలోని 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను మంజూరు చేసినట్లు సింగ్ చెప్పారు. ఇప్పటికే 10,401 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 19 సోలార్ పార్కులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? రాష్ట్రాల వారీగా గుజరాత్లో సుమారు 12,150 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (8,276 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్ (4,200 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (4,180 మెగావాట్లు), ఉత్తర్‌ప్రదేశ్ (3,730 మెగావాట్లు), కర్ణాటకలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌పార్క్‌లు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. జార్ఖండ్‌లో 1,089 మెగావాట్లు, మహారాష్ట్రలో 750 మెగావాట్లు, కేరళలో 155 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 100 మెగావాట్లు, మిజోరాంలో 20 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు కూడా మంజూరైనట్లు వివరించారు. -
సౌర విలయం!
వాషింగ్టన్: వజ్రపు మొనపై కాంతి ఒక క్రమంలో చెదిరిపోయి చిత్రించిన అందమైన వెలుగు రేఖల్లా కని్పస్తున్నాయి కదూ! కానీ ఇవేమిటో తెలుసా? సూర్యునిపై చెలరేగుతున్న ప్రచండమైన మంటలు! వీటిని ఎక్స్ కేటగిరీకి చెందిన సోలార్ ఫ్లేర్స్‌గా నాసా పేర్కొంది. గత 20 ఏళ్లలో నమోదైన అత్యంత శక్తిమంతమైన మంటలు ఇవేనట! సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు పునఃసంధానమయ్యే క్రమంలో ఈ మంటలు చెలరేగుతుంటాయి. తీవ్రతను బట్టి వాటిని బీ, సీ, ఎం, చివరగా అతి తీవ్రమైన మంటలను ఎక్స్‌గా వర్గీకరిస్తారు. ఇవి వరుసగా ఒక దానికంటే మరొకటి పదిరెట్లు శక్తిమంతమైనవన్నమాట. తాజా మంటలు ఎక్స్ కేటగిరీలోనూ అతి తీవ్రతతో కూడినవని నాసా వివరించింది. వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కొద్దిసేపు రేడియో ధారి్మకత బాగా పెరిగిపోయింది. వీటి దెబ్బకు ఆయా చోట్ల రెండు గంటలకు పైగా సిగ్నల్స్‌కు అంతరాయం కూడా కలిగిందట. 2003లో వీటికంటే 15 రెట్లు శక్తిమంతమైన సోలార్ ఫ్లేమ్స్ నమోదయ్యాయి! -
పార్కింగ్ ప్లేస్ పైకప్పులుగా సోలార్ ప్యానెల్స్.. వేల ఎకరాల్లో ఏర్పాటు!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పునరుత్పాదక వనరులు వినియోగించుకుని విద్యుత్ తయారుచేయడంలో చాలాదేశాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రధానంగా సౌరశక్తి, పవనశక్తిని ఉపయోగించి కరెంట్ తయారుచేయడంలో ఎన్నో కంపెనీలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా కొన్నిదేశాల్లో స్థలం వృధా కాకుండా కాలువలపై సోలార్ ఎనర్జీ ప్లేట్లను ఏర్పాటుచేస్తుంటే.. కొన్నిచోట్ల జలాశయాలపై వాటిని వినియోగించి కరెంట్‌ను తయారుచేస్తున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఏకంగా 8,500 ఎకరాల్లో సోలార్‌ప్లేట్లతో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేశారు. న్యూయార్క్ సిటీలో పునరుత్పాదకత వనరులను వినియోగించుకునేలా అక్కడి జోనింగ్ చట్టాలను సడలించించడంతో ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ‘సిటీ ఆఫ్ యెస్ ఫర్ కార్బన్ న్యూట్రాలిటీ’ని ఆమోదించింది. అక్కడి జోనింగ్ కోడ్‌ను అప్డేట్ చేయడంతో క్లీన్ ఎనర్జీ, ఈవీ ఛార్జర్లను ఇంప్లిమెంట్ చేయడానికి స్థిరమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్‌సిటీలో జోనింగ్ కోడ్‌ను ఆధునీకరించడం ద్వారా పరిశుభ్రమైన గాలి, వ్యర్థాల నిర్వహణ, ఈవీ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. గతంలో తక్కువ ఆదాయాలు కలిగిన ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల్లో సోలార్ప్లేట్లకు సంబంధించిన మైక్రోగ్రిడ్లను ఇన్స్టాల్ చేసేందుకు అనుమతులుండేవి కాదు. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలతో అక్కడి ప్రదేశాలతోపాటు పార్కింగ్ స్థలాల్లో సౌరఫలకలను ఏర్పాటు చేసుకునేలా అనుమతిస్తున్నట్లు ఆడమ్స్ తెలిపారు. ఇది సిటీలో పూర్తిగా కార్యరూపం దాలిస్తే దాదాపు 1,30,000 గృహాలకు తక్కువ ఖర్చుతో కరెంట్ లభిస్తుందని అన్నారు. ఇదీ చదవండి: బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే... తాజాగా జోనింగ్ చట్టాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల 8,500 ఎకరాల పార్కింగ్ స్థలాల్లో సోలార్ ఎనర్జీని తయారుచేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. -
10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం
న్యూఢిల్లీ: 2027 నాటికల్లా 10 గిగావాట్ల స్థాయిలో సమీకృత సౌర విద్యుత్ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలని అదానీ గ్రూప్ నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది 4 గిగావాట్లుగా ఉంది. గ్రూప్‌లో భాగమైన అదానీ సోలార్కు 3,000 మెగావాట్ల విలువ చేసే ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇటీవలే 394 మిలియన్ డాలర్లు కూడా సమీకరించినట్లు వివరించాయి. దేశీయంగా 2014లో 2.63 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుదుత్పత్తి 2023 నాటికి 71.10 గిగావాట్లకు పెరిగినప్పటికీ తయారీ వ్యవస్థ వేగంగా విస్తరించలేదు. ఈ నేపథ్యంలో దేశీ యంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎల్ఐ వంటి స్కీములను ప్రవేశపెట్టింది. అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థలు సోలార్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. -
ఎస్బీఐలో హోమ్‌లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా?
ముంబై: నివాసిత ప్రాజెక్టులకు రుణాలివ్వాలంటే, పైకప్పులపై సోలార్ విద్యుదుత్పత్తి పరికరాల (సోలార్ ఇన్‌స్టాలేషన్స్) ఏర్పాటు నిబంధన అమలు చేయాలని ఎస్బీఐ భావిస్తోంది. జూన్ చివరికి ఎస్బీఐ గృహ రుణాల పుస్తకం రూ.6.3 లక్షల కోట్లుగా ఉంది. మా గ్రీన్ ఫండ్స్ (పర్యావరణ అనుకూల నిధి) నుంచి రుణ సాయం పొందే బిల్డర్లు రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను తప్పనిసరి చేయనున్నట్టు ఎస్బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. గృహ రుణ దరఖాస్తులకు దీన్ని అనుబంధంగా (బండిల్) జోడించనున్నట్టు చెప్పారు. ఈ రుణాలు 10–20 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. ఈ రుణాలపై బ్యాంక్‌లు ఫారెక్స్ రిస్క్‌ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. -
ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!
నాటు పడవలు నడపాలంటే, తెడ్లు వేయాలి. మరపడవలు నడపాలంటే, ఇంధనం కావాలి. ఎలక్ట్రిక్ పడవలను నడపాలంటే, రీచార్జబుల్ బ్యాటరీలు కావాలి. ఈ పడవను నడపాలంటే, ఎండ చాలు. ఇది పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవ. దీని పైకప్పు మీద అమర్చిన సౌరఫలకాలు ఇందులోని 200 వాట్ల విద్యుత్తును నిరంతరం బ్యాటరీకి చార్జ్ చేస్తుంటాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 1.3 కిలోవాట్లు. కాబట్టి పొద్దుగూకినా, ప్రయాణానికి ఇబ్బందేమీ ఉండదు. పదిహేనుడు అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉండే ఈ పడవలో ఆరుగురు వరకు ఏకకాలంలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. నదులు, సరస్సుల్లో విహారయాత్రలకు పూర్తిగా అనువుగా ఉండే ఈ పడవ గంటకు ఆరు నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అమెరికన్ కంపెనీ ‘గోసన్’ ఇటీవల ఈ సోలార్ పడవను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులోని హంగులు సౌకర్యాలను బట్టి దీని ధర 7,950 నుంచి 12,750 డాలర్ల వరకు (రూ.6.60 లక్షల నుంచి 10.59 లక్షల వరకు) ఉంటుంది. (చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...) -
సోలార్ విద్యుత్ ఇన్స్టలేషన్లలో క్షీణత
న్యూఢిల్లీ: సోలార్ అదనపు విద్యుత్ సామర్థ్యం ఏర్పాటు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1.7 గిగావాట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన 4 గిగావాట్లతో పోలిస్తే 58 శాతం తగ్గినట్టు మెర్కామ్ ఇండియా సంస్థ తెలిపింది. జూన్ త్రైమాసికంలో సోలార్ మార్కెట్‌కు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏర్పాటైన 1.9 గిగావాట్ల ఇన్స్టాలేషన్స్తో పోలి్చనా 10 శాతం తగ్గింది. జూన్ త్రైమాసికంలో కొత్తగా ఏర్పాటైన సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 77 శాతం భారీ ప్రాజెక్టుల రూపంలో ఉంది. అంటే 1.3 గిగావాట్లు ఈ రూపంలోనే సమకూరింది. రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు 23 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో, 3.6 గిగావాట్ల సోలార్ ఇన్స్టాలేషన్లు నమోదయ్యాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏర్పాటైన 7.6 గిగావాట్లతో పోల్చి చూసినప్పుడు 53 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక దేశం మొత్తం మీద సోలార్ విద్యుత్ ఇన్స్టాలేషన్ సామర్థ్యం జూన్ చివరికి 66 గిగావాట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో భారీ సోలార్ ఇన్స్టాలేషన్లలో గుజరాత్ 41 శాతం వాటా ఆక్రమించింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 20 శాతం, కర్ణాటకలో 14 శాతం చొప్పున ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మద్య దేశంలో 8.4 గిగావాట్ల నూతన విద్యుత్ సామర్థ్యం సమకూరగా, అందులో 43 శాతం సోలార్ రూపంలోనే ఉండడం గమనించొచ్చు. ప్రాజెక్టుల్లో జాప్యం.. ప్రాజెక్టుల్లో జాప్యం, విస్తరణ ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. 2024 సంవత్సరం ఎంతో ఆశావహంగా ఉందన్నారు. సోలార్ విడిభాగాలు, ప్రాజెక్టుల వ్యయాలు వేగంగా తగ్గుతుండడం ఈ పరిశ్రమ వృద్దికి ప్రేరణగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో సోలార్ ఇన్స్టాలేషన్లు బలహీనంగా ఉన్నాయి. దీంతో రెండో త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లు మరింత నిదానించాయి. కొన్ని భారీ సోలార్ ప్రాజెక్టుల విస్తరణకు అనుమతులు వచ్చాయి. అయినా కానీ భూమి, బదిలీ అంశాలు జనవరి–జూన్ త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లపై ప్రభావం చూపించాయి’’అని రాజ్‌ప్రభు వివరించారు. -
దటీజ్ "మహాలక్ష్మీ ఐస్ క్రీం"! అద్గది.. టెక్నాలజీని వాడటం అంటే..!
మన చుట్టూ సాధరణంగా ఉండే సామాన్యులు సైతం టెక్నాలజీని వాడుకునే సామర్థ్య కలిగి ఉంటారు. అవసరం వచ్చినప్పుడూ గానీ వారి నైపుణ్యం ఏంటో మనకు తెలియదు. వారు తమ నిత్యావసరాలకు టెక్నాలజీని వాడి చూపిస్తే..అందరూ అశ్చర్యపోతారు. నాలెడ్జ్ అనేది ఎవరీ సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వడైనా తమకు అందుబాటులో ఉన్నవాటితోనే అద్భుతాలు చేసి చూపగలరు. అచ్చం అలాంటి అద్భుత ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని మహాలక్మీ ఐస్ క్రీం బండి చూస్తే..కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఐస్ క్రీం ట్రక్ టెక్నాలజీని వాడేంత స్థాయిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాడగలిగే స్థోమత ఆ ఐస్‌క్రీం విక్రయించే అతనికి ఉండటమే..ఇక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి వీధుల్లో అమ్మే ఐస్‌క్రీం బండి వాళ్లు శీతలీకరణం కోసం ఇంటెన్సివ్ గ్లైకాల్ ఫీజర్లపైనే ఆధారపడతారు. అవి భారీగా ఉండటమే కాకుండా గణనీయమైన విద్యుత్‌ని డిమాండ్ చేస్తుంది. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఐసీక్రీంని కూల్‌గా ఉంచటం కోసం అని సోలార్ విద్యుత్‌ని వాడాలన్న ఆలోచనే గ్రేట్గానూ, కొత్తగానూ ఉంది. ఇక అంత సాంకేతికతకు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఆ ఐస్‌క్రీం విక్రయించే వ్యక్తికి ఉండటం..అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను ఆ వ్యాపారంలో లాభాలు గడించి ఆ స్థాయికి వచ్చాడని కొందరూ, విక్రయించే వ్యక్తికి వ్యక్తిగత సోలార్ టెక్నాలజీకి సంబంధించి కనెక్షన్ ఉంటే తప్ప ఇలా ఐస్‌క్రీం ట్రక్‌కి పెట్టలేరని కొందరూ కామెంట్లు చేస్తూ..పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: -
రాష్ట్రంలో 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు. కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఆర్థి క చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్ స్టేట్ లీడ్ సుభాష్ కిరణ్ కే, మేనేజర్ సీహెచ్ సాయి శ్రీనివాస్, బ్యాంక్ రీజనల్ మేనేజర్లు కె.విజయరాజు, పి.అమర్నాథ్రెడ్డి, ఎంవీ శేషగిరి, ఎంపీ సుధాకర్, రీజనల్ ఇన్చార్జి డి. రాజాప్రదీప్, డీఆర్ఎం ఏవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా ఎన్ని కనిపెడతావ్ బాబు ?
-
ఇకపై మీ పంట వృథా కాదు, ఇంజనీర్ సృష్టించిన సోలార్ డ్రైయర్
ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్‌ను రూపొందించాడు. గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్‌లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది. ఆలోచన... ఆసక్తి! ‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది. ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్న్షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్‌ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్‌తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. మేధ సమాజానికి ఉపయోగపడాలి! నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం. పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు. -
ప్రపంచంలో తొలిసారి.. ఈ సోలార్ ప్యానళ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
కాగితాలతో చిత్రవిచిత్రమైన ఆకృతులను రూపొందించే జపనీస్ కళ ఒరిగామి. ఒరిగామి కళ స్ఫూర్తితో తేలికగా మడిచిపెట్టి ఎక్కడికైనా తీసుకుపోయేందుకు అనువైన సోలార్ ప్యానల్స్‌ను రూపొందించింది ఇంగ్లండ్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘సెగో ఇన్నోవేషన్స్’. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఒరిగామి సోలార్ ప్యానల్’. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు, విద్యుత్ సరఫరా లేని అడవుల్లో రాత్రివేళ బస చేయాల్సి వచ్చేటప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ చక్కగా ఉపయోగపడతాయి. వీటిని 20 వాట్, 50 వాట్, 100 వాట్, 400 వాట్ మోడల్స్‌లో ‘సెగో ఇన్నోవేషన్స్’ అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రీ–ఆర్డర్లపై సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. గత జూన్ 6 నుంచి ప్రీ–ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించింది. -
పెరిగిపోతున్న సామర్ధ్యం.. 9.3 గిగా వాట్లకు రూఫ్‌టాప్ సోలార్
న్యూఢిల్లీ: దేశంలో రూఫ్‌టాప్ సోలార్ (పై కప్పులపై సోలార్ విద్యుదుత్పాదన) సామర్థ్యం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.35 శాతం పెరిగింది. మొదటి మూడు నెలల్లో 485 మెగావాట్ల సామర్థ్యం మేర సోలార్ రూఫ్టాఫ్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నట్టు మెర్కామ్ ఇండియా తెలిపింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇలా ఏర్పాటైన సామర్థ్యం 456 మెగావాట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2023 మార్చి నాటికి భారత్‌లో మొత్తం రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 9.3 గిగావాట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. 2022 చివరి మూడు నెలల్లో ఏర్పాటైన 483 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంతో పోలిస్తే 0.4 శాతం మేర ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు వివరించింది. ఈ మేరకు ‘క్యూ1, 2023 మెర్కామ్ ఇండియా రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ రిపోర్ట్’ను విడుదల చేసింది. 2023 జనవరి – మార్చి త్రైమాసికంలో ఏర్పాటైన మొత్తం 485 మెగావాట్లలో 58 శాతం గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నదే కావడం గమనార్హం. పరిశ్రమలపై 28 శాతం, వాణిజ్య వినియోగదారులు ఏర్పాటు చేసుకున్న సామర్థ్యం 14 శాతం చొప్పున ఉంది. దేశంలో మొత్తం సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో రూఫ్‌టాప్ సోలార్ వాటా 26 శాతానికి చేరుకుంది. 2022లో హెచ్చు తగ్గులను చూసిన తర్వాత రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు విషయంలో స్థిరమైన పురోగతి కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘విద్యుత్ రేట్లు పెరుగుతుండడంతో రూఫ్‌టాప్ సోలార్ ఆకర్షణీయంగా మారుతోంది. రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుంది’’ మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్‌ప్రభు తెలిపారు. గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఏర్పాటైన రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యంలో 70 శాతం వాటా ఆక్రమించాయి. ఇందులో గుజరాత్ వాటా అత్యధికంగా 24 శాతం మేర ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ అత్యధిక సామర్థ్యం కలిగి ఉన్నాయి. -
కోతల్లేని కరెంట్..
నాడు చీకటి రోజులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా విద్యుత్ సరఫరా ఉండదు’ అని అధికారికంగా ప్రకటనలు జారీ అయ్యేవి. ‘ఎండా కాలం కదా.. పవర్ కట్ మామూలే’ అని అప్పటి పాలకులు దబాయించే వారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. వంటింట్లో మిక్సీలు తిరక్క గృహిణులు, హాల్లో ఫ్యాన్ తిరక్క పిల్లలు, ఆఫీసుల్లో ఏసీలు పని చేయక ఉద్యోగులు, జిరాక్స్ సెంటర్ల వద్ద విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. విద్యుత్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజులను గుర్తు చేస్తే చాలు ప్రజలు కథలు కథలుగా చెబుతారు. నేడు వెలుగు జిలుగులు ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్న పదానికి తావు లేకుండా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ రీతినా సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు బయటి మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు చేశారు. సరఫరాలో నాణ్యత పెరిగేలా వ్యవస్థాగత మార్పులు చేశారు. ఈ ఏడాది ఇదివరకెన్నడూ లేనంతగా అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో అక్కడక్కడ ఓవర్‌లోడ్‌తో ట్రిప్ కావడం తప్పించి ఏ సమస్యా లేకుండా శ్రద్ధ పెట్టారు. అలాంటి చోట్ల నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు చేసేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. తద్వారా ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్నమాటే వినిపించడం లేదు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వ్యవసాయానికి 18.49 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేసింది. తద్వారా 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా ఏర్పాటు చేసింది. పరిశ్రమలకూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ, ఎక్కడా కోతలన్నదే లేకుండా సరఫరా సవ్యంగా సాగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, ఎండలు మండిపోతుండటం వల్ల విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. అయినా కాసేపు కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గత సంవత్సరం గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఇప్పుడు 27.51 శాతం అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం రాకార్డు స్థాయిలో పెరిగిపోయింది. రోజువారీ డిమాండ్ 248.985 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 195.266 మిలియన్ యూనిట్లుగా ఉండింది. రోజులో పీక్ డిమాండ్ 12,482 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 9308 మోగావాట్లు మాత్రమే. అంటే 34.10 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,374 మెగావాట్లు, సాయంత్రం వేళల్లో 9,582 మెగావాట్లకు చేరుకుంది. అయినప్పటికీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఇలా దేశంలోనే ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చెప్పడానికి ఇదొక పెరామీటర్‌గా చెప్పవచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 89.981 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.414 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 43.012 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 28.510 మి.యూ, సోలార్ నుంచి 25.605 మి.యూ, విండ్ నుంచి 11.591 మి.యూ, ఇతర మార్గాల్లో 1.496 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.537 చొప్పున రూ.33.936 కోట్లతో 45.023 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రతి రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జార్ఖండ్‌లో 4.62 మి.యూ, హర్యానాలో 2.64 మి.యూ, ఉత్తరప్రదేశ్‌లో 2.03 మి.యూ, కర్ణాటకలో 1.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. సరిపడా బొగ్గు నిల్వలు దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. ఇందులో ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గుకు దాదాపు 40 శాతం నుంచి 50 శాతం అదనంగా బొగ్గును సమకూర్చుకోవాలని, విదేశీ బొగ్గును 6 శాతం దిగుమతి చేసుకుని స్వదేశీ బొగ్గుతో కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా రైల్వే ర్యాక్స్‌ను పెంచాలని ఏపీజెన్కో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, రైల్వేను కోరాయి. 14 రైల్వే ర్యాకులు సరిపోవడం లేదని, వీటితో పాటు మరో ఆరు ర్యాకులు పెంచాలని అడిగాయి. దీంతో మరో మూడు ర్యాకులు అదనంగా వచ్చాయి. వీటి ద్వారా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి, సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును తీసుకువస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం వీటీపీఎస్‌లో 83,479 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 30,001 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 29,000 మెట్రిక్ టన్నులు, హిందూజా వద్ద 19200 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటీపీఎస్ పునరుద్ధరణ సోలార్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, థర్మల్ జనరేటర్లు పీక్ లోడ్‌లో పని చేస్తున్నప్పుడు వీటీపీఎస్ వద్ద జనరేటర్లు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు ట్రిప్ అయ్యాయి. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఆ రోజు వాతావరణం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్ మట్టం తక్కువగా ఉన్నందున శ్రీశైలంలో హైడల్ ఉత్పత్తి అందుబాటులో లేదు. గ్యాస్ పరిమితి కారణంగా గ్యాస్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. అదే సమయంలో వీటీపీఎస్‌లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ఎక్కడా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ సరఫరా దుస్థితిని వ్యూహాత్మకంగా విస్మరిస్తోంది. గంటల తరబడి కోతలు విధించారనే విషయాన్ని దాస్తోంది. అప్పట్లో వేసవిలో కరెంటు పరిస్థితి చెప్పనలవి కాదు. వేసవిలో కాకుండా కూడా కోతలు విధించిన రోజులున్నాయి. పరిశ్రమలకైతే ఏకంగా పవర్ హాలిడేలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు పరిశ్రమలన్నింటికీ తాళం వేయాల్సి వచ్చేది. జిరాక్స్ మిషన్లు, పిండి మరలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, కూలింగ్ వాటర్ ప్లాంట్లు గంటల తరబడి పని చేయక చిరు వ్యాపారులు నష్టాలు చవిచూశారు. విద్యుత్ కోతల గురించి మాట్లాడితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దబాయించే వారు. ‘ఎండా కాలం.. ఆ మాత్రం విద్యుత్ కోత ఉండదా.. ఇప్పుడే కొత్తగా కోతలు విధిస్తున్నా.. ఇది వరకు కోతల్లేవా’ అని ఎదురు దాడికి దిగేవారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం కోత అన్నదే లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. వంకర బుద్ధి చూపిస్తూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్ పోయిన ప్రాంతాలను చూపుతూ దుష్ప్రచారం చేస్తోంది. -
సెవెన్ సీటర్ బైక్ : ఇది కదా.. మేకిన్ ఇండియా అంటే..
మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ఔత్సాహిక వేత్తలు.పెద్దగా చదువుకోకున్నా, టెక్నాలజీ గురించి తెలియకపోయినా.. పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకునేందుకు సరికొత్త దారులు వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చూస్తే.. ఆశ్చర్యపోతాం. తమ అవసరాలు తీర్చుకునేందుకు ఓ యువకుడు అత్యంత చౌకగా సోలార్ బైక్‌ను రూపొందించుకున్నాడు. మార్కెట్లో దొరికే వివిధ వస్తువులను ఉపయోగించి ఏకంగా సెవెన్ సీటర్ బైక్ తయారు చేశాడు. ఈ ఆవిష్కరణపై ప్రశ్నించినప్పుడు ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. "ఈ బైక్‌పై ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. పైగా ఇది సోలార్ తో నడుస్తుంది. దీనిపై 200 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి 8 నుంచి 10వేల దాకా ఖర్చు వచ్చింది. చూశారుగా నా సోలార్ బైక్" నిజమే.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇప్పుడు మరెన్నో ఆవిష్కరణలు కావాలి. దానికి బ్రాండ్ పేర్లు పెట్టి భారీగా ధర నిర్ణయించేకంటే.. చౌకగా ప్రజల అవసరాలు తీర్చే.. వినూత్న ఆవిష్కరణలు కావాలి. అప్పుడే మేకిన్ ఇండియాకు నిజమైన అర్థం దొరుకుతుంది. So much sustainable innovation in one product - produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW — Harsh Goenka (@hvgoenka) April 29, 2023 చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
ఛార్జింగ్ అవసరం లేని స్మార్ట్‌వాచ్.. ఇంకెలా పనిచేస్తుందంటే?
ఈ ఫొటోలో చేతికి తొడుక్కున్న వాచీ చూస్తున్నారు కదా! ఇది స్మార్ట్ వాచీ. మిగిలిన స్మార్ట్ వాచీల మాదిరిగా దీని బ్యాటరీకి చార్జింగ్ అవసరం లేదు. ఇది పూర్తిగా సోలార్ స్మార్ట్ వాచ్. ఎండలో కాసేపు తిరిగితే చాలు, ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ పూర్తిస్థాయి సోలార్ స్మార్ట్ వాచ్‌ను ‘ఇన్స్టింక్ట్–2’ పేరుతో విడుదల చేసింది. దీనికి అమర్చిన లెన్స్ ద్వారా ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. రోజుకు మూడుగంటల సేపు ఎండసోకితే, ఈ వాచ్ ఇరవైనాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎండసోకని పరిస్థితులు రోజుల తరబడి ఉంటే, యూఎస్బీ చార్జర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో ఫ్లాష్‌లైట్ కూడా ఉండటం విశేషం. ఆరుబయట పిక్నిక్లు, ట్రెక్కింగ్‌లకు వెళ్లే వారికి ఈ వాచ్ పూర్తి అనుకూలంగా ఉంటుందని ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ వైస్ ప్రెసిడెంట్ డాన్ బార్టెల్ చెబుతున్నారు. దీని మోడల్స్‌లో వైవిధ్యాన్ని బట్టి దీని ధర 389.99 డాలర్ల (రూ.32,027) నుంచి 469.99 డాలర్ల (38,597) వరకు ఉంది. -
ఆవిష్కరణలు.. అద్భుతం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో గురువారం ఫ్యూచర్ ఇన్వెంటర్స్ (భవిష్యత్ ఆవిష్కర్తలు) ఫెయిర్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 24 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఈ ఫెయిర్‌లో ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్ డిష్ వాషర్‌కు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు అనేది తమ నినాదం మాత్రమే కాదని, తమ విద్యాసంస్థ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలున్నాయని, సరైన మార్గదర్శకత్వం, సరైన వేదికలు లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగాలు చేయడం కాదు, ఉన్నత ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఈ నూతన ఆవిష్కరణలతో లభిస్తుందని చెప్పారు. కాగా ఈ ఫెయిర్‌లో మొత్తం ఐదు ఆవిష్కరణలకు బహుమతులు లభించాయి. సోలార్ హ్యాండ్ డిష్ వాషర్ వంట పాత్రలను శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడే నూతన సోలార్ హ్యాండ్ డిష్ వాషర్‌ను కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించారు. అన్ని వైపులా తిరిగేందుకు వీలుండే ఓ మోటార్‌కు స్క్రబ్బర్‌తో కూడిన ప్రత్యేక పరికరం అమర్చారు. సౌర విద్యుత్‌తో పాటు, బ్యాటరీతో కూడా పనిచేసేలా దీనిని తయారు చేశారు. అందుబాటులో ఉన్న సామగ్రితో తయారైన ఈ హ్యాండ్ డిష్ వాషర్‌కు ఫెయిర్‌లో మొదటి బహుమతి లభించింది. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే పాత్రలను శుభ్రం చేయడానికి పడుతున్న ఇబ్బందులను చూసి ఈ హ్యాండ్ డిష్ వాషర్‌ను రూపొందించామని విద్యార్థులు సాకేత్, హర్ష, ప్రణయ్, నవీన్, రక్షితలు పేర్కొన్నారు. పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లు రసాయనాలతో కూడిన శానిటరీ న్యాప్కిన్ లను వాడటంతో మహిళలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి పర్యావరణానికి కూడా హాని చేస్తున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు సహజ సిద్ధంగా లభించే పత్తి, అరటి ఫైబర్ (కాండంలో ఉండే నార), మొక్కజొన్న పిండి, వేప రసాన్ని వంటి వాటిని ఉపయోగించి న్యాప్కిన్లు తయారు చేశారు. వీటివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రావు. లీక్ ప్రూఫ్‌తో పాటు పర్యావరణానికి కూడా అనుకూలమైనవి. ఈ న్యాప్కిన్లు అందుబాటు ధరలో లభించే అవకాశాలు న్నాయని విద్యారి్థనులు అక్షయ, హన్సి క, మానసలు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణకు రెండో బహుమతి లభించింది. అగ్ని ప్రమాదాలపై ‘డ్రయిడ్’ అలర్ట్ అగ్ని ప్రమాదాలపై అలర్ట్ చేయడంతో పాటు, ప్రమా దం జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం లేకుండా నివారించే ‘కెలామెటీ కంట్రోల్ డ్రయిడ్ ’ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్) విద్యార్థులు ఆవిష్కరించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ డ్రయిడ్ అగ్నిప్రమాదం జరిగితే వెంటనే గుర్తించి., మొబైల్ టెక్నాలజీతో ఫైర్ స్టేషన్‌కు సమాచారాన్ని పంపుతుంది. మంటలు విస్తరించకుండా నీటితో ఆర్పివేస్తుంది. సెన్సార్ల సాయంతో అగ్నిప్రమాదంలో ఎవరైనా మనుషులు చిక్కుకున్న విషయాన్ని కూడా పసిగట్టి ఫైర్ స్టేషన్‌కు సమాచారం పంపుతుంది. ఈ ఆవిష్కరణకు తృతీయ బహుమతి వచ్చింది. విద్యార్థులు సూరజ్ గుప్తా, రిషిక్, కార్తికేయలు ఈ డ్రయిడ్ను ఆవిష్కరించారు. ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్.. కల్వర్టుల వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొనడం గానీ, పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొనడం వంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఇలాంటి కల్వర్టుల వద్ద ప్రమాదాల నివారణకు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఎక్స్లెంట్ స్టార్ హైసూ్కల్ విద్యార్థి రయాన్ ‘ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్’అనే నూతన పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. కల్వర్టుల వద్ద ఆర్.ఎఫ్ ట్రాన్స్‌మీటర్, వాహనంలో ఆర్.ఎఫ్.రిసీవర్లను అమర్చ డం ద్వారా వాహనం లైట్ ఆటోమెటిక్‌గా లోయర్ డిప్పర్లోకి మారుతుంది. దీంతో ఎదు రుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి రోడ్డు ప్రమాదం తప్పుతుంది. దీనికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టర్.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించే బాధ్యతను మహిళా సంఘాలే చూస్తున్నాయి. ఎక్కువ బరువున్న వంట పాత్రలను పొయ్యి పైనుంచి దించడం, అన్నం వార్చడం వంటి పనులు చేయలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో భారీ వంట పాత్రలోని అన్నాన్ని సులభంగా వార్చడానికి ఉపయోగపడే ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టు పరికరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపకల్పన చేశారు. దీన్ని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంది. వినీల, నందు, శ్రీచైత్ర, సుప్రియ రూపొందించిన ఈ పరికరానికి కూడా కన్సొలేషన్ బహుమతి లభించింది. -
నానో సోలార్ కార్! రూ.30కే 100 కిలోమీటర్లు..
పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నగరంలో నివాసం ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయారు. తన టాటా నానో కారును సోలార్ కారుగా మార్చి వీధుల్లో రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! మోండల్ కారు నడపడానికి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అవసరం లేదు. ఇది పూర్తిగా సౌర శక్తితో నడుస్తుంది. అయితే ఈ కారుకు అయ్యే ఇందన ఖర్చు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ. 30 నుంచి రూ. 35 లతో 100 కిలోమీటర్లు నడుస్తుంది. అంటే కిలోమీటరుకు 80 పైసలు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో నడిచేలా మోండల్ రూపొందించిన నానో సోలార్ కార్ ఇప్పుడు అక్కడ సూపర్ పాపులర్ అయింది. ఇంజిన్ లేదు.. సౌండ్ లేదు.. ఈ సోలార్ కారులో గేర్ సిస్టమ్ ఉంది. కానీ ఇంజిన్ లేదు. ఇది నడుపుతున్నప్పుడు అసలు శబ్దం రాదు. నాల్గవ గేర్‌లో ఇది గంటకు 80 కిలోమీటర్లు వెళ్తుంది. మోండల్ చేసిన తయారు ఈ సోలార్ కార్ సౌరశక్తిలో ఆవిష్కరణల దిశగా దిశానిర్దేశం చేయడమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ కారును రూపొందించేటప్పుడు మోండల్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ పట్టు వదల్లేదు. కొత్తగా ఏదైనా చేయాలనే అతని చిన్ననాటి కలను ఈ కారు ద్వారా నిజం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి! -
ఇక.. అంతరిక్ష విద్యుత్
సాక్షి, అమరావతి: అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టడమంటేనే ఒకప్పుడు అత్యంత అద్భుతంగా భావించేవారు. కానీ విజ్ఞాన ప్రపంచం విశ్వమంతా వ్యాపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అసాధ్యమనుకున్నవాటిని సుసాధ్యం చేస్తూ ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ ఆవిష్కరణే అంతరిక్ష సౌరవిద్యుత్ (స్పేస్ సోలార్ పవర్ – ఎస్ఎస్పీ). నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. భూమి మీద వివిధ పద్ధతుల ద్వారా, అనేక వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం గురించే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ.. తాజా ఆవిష్కరణ వాటికి విభిన్న విధానం. అంతరిక్షంలో పగలు, రాత్రి, రుతువులు, మేఘాల కవచం వంటి కాలచక్రాలతో సంబంధం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండే విద్యుత్‌ను భూమి మీదకు తీసుకొచ్చే పరిశోధనలు 2011లో మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ పరిశోధనల్లో మరో అడుగు ముందుకుపడింది. నాలుగు శాతమే వాడుతున్నాం సౌరవిద్యుత్‌ను 1800 సంవత్సరం చివరి నుంచి వాడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలోని విద్యుత్‌లో నాలుగు శాతం (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శక్తినివ్వడంతోపాటు) మాత్రమే సౌరవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది. బొగ్గు, నీటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నీటివనరులు ఇప్పటికే చాలావరకు తగ్గిపోగా.. బొగ్గు వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్యమం ప్రపంచ దేశాల్లో మొదలైంది. దీంతో అపారంగా ఉన్న సౌరశక్తిని వాడుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. దీన్లో భాగమే ఈ ప్రయోగం. భవిష్యత్‌లో దీనిద్వారా భూమి మీదకు వైర్లెస్ విధానంలో సౌరవిద్యుత్ ప్రసారం చేయగలమని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. ఏమిటీ ప్రయోగం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమనుకున్న అనేక విషయాలను నేడు శాస్త్రవేత్తలు నిజం చేస్తున్నారు. ఆ కోవలో మొదలైనదే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) స్పేస్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎస్‌పీపీ). ఇదొక అంతరిక్ష పరిశోధన. ఈ పరిశోధన కోసం గత నెలలో కాలిఫోర్నియా నుంచి స్పేస్ సోలార్ పవర్ డెమాన్స్ట్రేటర్ (ఎస్ఎస్పీడీ)ను అంతరిక్షంలోకి పంపారు. ట్రాన్స్పోర్టర్–6 మిషన్‌లో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా మోమెంటస్ విగోరైడ్ అంతరిక్షనౌక 50 కిలోల బరువున్న ఎస్ఎస్పీడీని అంతరిక్షానికి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యరశ్మిని సేకరించి, దాన్ని విద్యుత్తుగా మార్చే మాడ్యులర్ స్పేస్‌క్రాఫ్ట్ సముదాయాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఇది విద్యుత్తును చాలా దూరం వరకు వైర్లెస్ రూపంలో ప్రసారం చేస్తుంది. కొన్ని పరిణామాల అనంతరం చివరికి పవర్ స్టేషన్‌గా ఏర్పడుతుంది. 32 రకాల ఫోటోవోల్టాయిక్‌లు అంతరిక్ష వాతావరణంలోని సౌరకణాలను విద్యుత్‌గా మార్చేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తాయి. మైక్రోవేవ్ పవర్ ట్రాన్స్‌మీటర్ ద్వారా వైర్లెస్ విధానంలో విద్యుత్‌ను ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ సెటప్ అంతా అంతరిక్షంలో అమర్చగానే భూమిపై ఉన్న కాల్టెక్ బృందం తమ ప్రయోగాలను ప్రారంభించింది. కొన్ని కెమెరాలు ప్రయోగం పురోగతిని పర్యవేక్షిస్తూ, భూమికి సమాచారం పంపిస్తున్నాయి. కొద్దినెలల్లోనే ఎస్ఎస్పీడీ పనితీరుపై పూర్తి అంచనా వేయగలమని ఎస్‌ఎస్‌పీపీ బృందం భావిస్తోంది. -
ఈ టెంట్ ఉంటే అడవిలోనైనా హాయే! ప్రత్యేకతలు ఏంటంటే..
అడవుల్లోకి వెళ్లి అక్కడే టెంట్లు వేసుకుని గడపాలనే సరదా చాలామందికే ఉంటుంది. అడవుల్లో టెంట్లు వేసుకోవడం చాలా కష్టమైన పని. అడవుల్లో విద్యుత్తు సరఫరా ఉండదు. మరి టెంట్లలో మకాం చేసేవారి పరిస్థితి ఊహించుకోవాల్సిందే! ఇదివరకటి కాలంలో లాంతర్లు, విసనకర్రలు తీసుకువెళ్లేవారు. ఇటీవలి కాలంలో పోర్టబుల్ బ్యాటరీలు, రీచార్జబుల్ లైట్లు, ఫ్యాన్లు వంటివి తీసుకువెళుతున్నారు. ఇంత ఇబ్బంది లేకుండా, టెంట్లకు నేరుగా విద్యుత్తు సరఫరా ఉంటే పరిస్థితి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కదూ! ఇదే ఆలోచనతో అమెరికాకు చెందిన సోలార్ పరికరాల తయారీ సంస్థ ‘జాకెరీ’ ఏకంగా సోలార్ టెంట్‌ను రూపొందించింది. టెంట్ పైభాగంలో ఉన్న సోలార్ ప్యానెల్స్ సౌరశక్తిని గ్రహించి, ఇందులోని ‘ఫొటో వోల్టాయిక్ సోలార్ సెల్స్’లో 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేస్తాయి. ఈ విద్యుత్తుతో టెంట్లో లైట్లు, ఫ్యాన్లు వంటివి ఇంట్లో మాదిరిగానే వాడుకోవచ్చు. ఈ సోలార్ టెంట్లు నలుగురైదుగురు వరకు బస చేయడానికి అనువుగా రూపొందించారు. ఇటీవల జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2023 ప్రదర్శనలో దీనిని ప్రదర్శించారు. ఇది ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?) -
నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అద్భుతాన్ని చూశారు..!
నాసా శాస్త్రవేత్తలు ఈ మధ్య ఓ అద్భుతాన్ని చూశారు! సూర్యుడిపై కార్యకలాపాల వీడియో ఒకటి చూస్తూండగా ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది! కుతకుత ఉడుకుతూండే ఈ పోగు చూస్తూండగానే విడిపోయింది! అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది! సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది!! సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు... సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి. ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ డైరెక్టర్ స్కాట్ మాకింతోష్ వివరించారు. ‘‘పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్ సైకిల్లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు’’ అని వివరించారు. కారణాలు మిస్టరీయే! సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది. ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు. తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్ సైకిల్లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ‘‘ఈ సోలార్ సైకిల్ 2024లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్ ఏర్పడి ఉండవచ్చు’’ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్య వయస్సులోకి ఆదిత్యుడు... సూర్యుడిప్పుడు మధ్య వయసులోకి అడుగుపెట్టాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త గియా అంతరిక్ష నౌకతో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్ల సంవత్సరాలని, ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని, రెడ్‌జెయింట్‌గా మారి భూమితోపాటు ఇతర గ్రహాలనూ మాడ్చి మసి చేసేస్తుందని అంచనా. ఆ తర్వాత వేడి తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందట. ఏమిటీ సోలార్ సైకిల్? సూర్యుడు విద్యుదావేశంతో కూడిన భారీ వాయుగోళం. ఈ విద్యుదావేశపు వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ఉత్తర, దక్షిణ ధ్రువాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతూంటాయి. ఇదే సోలార్ సైకిల్. దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైనా ఉంటుంది. సూర్యుడిపై జరిగే పేలుళ్ల ఫలితంగా నల్లటి మచ్చల్లాంటివి (సన్ స్పాట్స్) కనిపిస్తూంటాయి. ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాల తీవ్రత తెలుస్తూంటుంది. సన్‌స్పాట్స్ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్ సైకిల్ పతాక స్థాయికి చేరుతోందని అర్థం. ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి. తర్వాత మళ్లీ ఇంకో సోలార్ సైకిల్ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి. సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడే తీవ్రత కూడా సోలార్ సైకిల్‌కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతూంటుంది. వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌర కాంతులు: సోలార్ విద్యుత్‌పై పెరుగుతున్న ఆసక్తి
నెల్లూరు సిటీ: ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తున్న సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తిపై జిల్లా ప్రజలు దృష్టి సారించారు. ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు, గృహ వినియోగంలో సోలార్ గ్రిడ్ సిస్టమ్‌పై ఆసక్తి పెరిగింది. భవిష్యత్‌లో తమ అవసరాలకు పోను మిగులు విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు విక్రయించే అవకాశం ఉండడంతో దీనిపై దృష్టి సారిస్తున్నారు. ఇటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు రాబడిని పెంచుకునేందుకు ఇదొక మార్గంగా ఉండడంతో రోజు రోజుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్స్ ఏర్పాటుకు ఆదరణ పెరుగుతోంది. గ్రిడ్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌కు విద్యుత్ శాఖ సంపూర్తిగా సహకరిస్తోంది. సోలార్‌ను వినియోగించడం ద్వారా బొగ్గు వినియోగం, కాలుష్య సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో 60 కేడబ్ల్యూపీ గ్రిడ్ కనెక్ట్డ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.32.50 లక్షలు ఖర్చు చేశారు. ప్రతి రోజూ 240 కేడబ్ల్యూహెచ్ విద్యుత్ వినియోగం ఖర్చు అవుతోంది. నెలకు 7,200 కేడబ్ల్యూహెచ్ ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి నెలా రూ.55,080 ప్రకారం ఏడాదికి రూ.6,60,960 ఖర్చు అవుతుంది. నెల్లూరులోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ ప్యానల్స్ వినియోగిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నూనతంగా కార్పొరేషన్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ విద్యాసంస్థలు గీతాంజలి, నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయదారులు, విద్యాసంస్థలు, వ్యాపారస్తులు, ఇళ్లకు కలిపి దాదాపు 500 సోలార్ కనెక్షన్లు ఉన్నాయి. సోలార్‌లో రెండు రకాలు సోలార్‌లో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ రెండు రకాలు ఉన్నాయి. వినియోగదారుడు తనకు రెండింట్లో ఏది అవసరమో దానిని వినియోగించుంటారు. రెండింటి ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు, పూర్తిగా రాకుండా ఉండేందుకు ఉపయోగ పడుతుంది. వినియోగదారుడు తన ఇంటికి ఎంత అవసరమో ఆ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంది. సోలార్ గ్రిడ్లు ఒక కిలోవాట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఒక కిలో వాట్‌కు రోజుకు 4 యూనిట్లు విద్యుత్ తయారు అవుతుంది. ß ఆన్‌గ్రిడ్ సిస్టమ్: ఆన్‌గ్రిడ్ సోలార్ ప్యానల్స్ ఏర్పా టు చేసుకోవడం ద్వారా సూర్యరస్మి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు కనెక్ట్ చేసుకోవాలి. తయారైన విద్యుత్‌ను గ్రిడ్ నుంచి ఉపయోగించుకోవచ్చు. కరెంట్ మీటర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఎంత వరకు విద్యుత్‌ను వినియోగిస్తామో, అంత వరకు గ్రిడ్ ద్వారా తీసుకుని, మిగిలినది విద్యుత్ శాఖకు విక్రయించవచ్చు. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్: ఇది బ్యాటరీని రీచార్జ్ చేసుకున్న తర్వాత ఇంట్లో విద్యుత్ వినియోగ వస్తువులకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఇన్వర్ట్లా పని చేస్తుంది. మూడేళ్ల నుంచి వినియోగిస్తున్నాను.. ప్రతి నెలా నాకు రూ.1500 నుంచి రూ.2000 విద్యుత్ బిల్లు వచ్చేది. మూడు కిలో వాట్ల సోలార్ ప్యానెల్‌ను పెట్టుకున్నాను. ప్రతి రోజూ 12 యూనిట్లు కరెంట్ తయారవుతుంది. నెలకు 250 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నాను. మిగిలిని విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు విక్రయిస్తున్నాను. మూడేళ్ల నుంచి సోలార్‌ను వినియోగిస్తున్నాను. – వీ సుధాకరన్, ఉస్మాన్‌సాహెబ్‌పేట రూ.6 వేల విద్యుత్ బిల్లు ఆదా నాకు దుస్తుల దుకాణం ఉంది. నేను ఇటీవల సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాను. నా దుకాణానికి ప్రతి నెలా రూ.6 వేల విద్యుత్ బిల్లు వచ్చేది. వ్యాపారస్తులు సోలార్‌ను వినియోగించడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. – రాజీవ్, వస్త్ర వ్యాపారి, కావలి 50 కిలో వాట్స్ ఇన్స్టాలేషన్ చేశాను నేను రెండేళ్లుగా సోలార్ ఇన్స్టాలేటర్గా ఉన్నాను. ఇప్పటి వరకు 50 కిలో వాట్స్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేశాను. ప్రజలు కూడా అవగాహన పెంచుకుని సోలార్‌ను వినియోగించాలి. భవిష్యత్‌లో విద్యుత్ ధరలను తగ్గించుకునేందుకు సోలార్ సిస్టం ఉపయోగపడుతోంది. – పీ శ్రావణ్, సోలార్ ఇన్స్టాలర్ ఐదు రకాలు 1. సోలార్ వాటర్ హీటర్ 2. సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్ 3. సోలార్ ఫెన్సింగ్ ఫర్ అగ్రికల్చర్ 4. సోలార్ స్ట్రీట్ లైట్ 5. సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ సోలార్ వాటర్ హీటర్: చల్లటి నీటిని వేడినీళ్లుగా మార్చే సాధనాలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. 100 లీటర్ల సోలార్ వాటర్ హీటర్ నుంచి 10 వేల లీటర్లకు పైగా వేడి చేసేందుకు వీలు ఉంటుంది. సోలార్ అగ్రికల్చర్ మోటర్: విద్యుత్ శాఖ రాత్రి సమయాల్లోనే వ్యవసాయానికి విద్యుత్‌ను అందజేస్తున్నారు. పగలు సమయంలో ఫ్యాక్టరీలు, ఇతర సంస్థలు అధికంగా విద్యుత్‌ను వాడడం ద్వారా కరెంట్ సమస్య ఉంది. అయితే విద్యుత్ సమస్యను అధిగమించేందుకు తక్కువ ఖర్చుతో సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్‌తో పగటి పూట మోటార్స్‌ను వినియోగించవచ్చు. సోలార్ ఫెన్సింగ్: రైతులకు తమ పొలాల్లో ఇతర జంతువులు దాడి నుంచి తప్పించుకునేందుకు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్‌ను వినియోగిస్తుంటారు. రైతులు పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్న సమయంలో కరెంట్ లేని సమయాల్లో పొలంలోకి ఇతర జంతువులు దాడి చేసే అవకాశం ఉంది. సోలార్‌ను వినియోగించడం ద్వారా 24 గంటలు రక్షణ కవచంగా మారుతుంది. సోలార్ స్ట్రీట్ లైట్: ప్రభుత్వాలు ఇప్పటికే రోడ్లు డివైడర్లకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు కొన్ని ప్రధాన రోడ్లలో సోలార్ స్ట్రీట్ లైట్స్‌ను వినియోగిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సోలార్ స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం సమయాల్లో విద్యుత్‌ను స్టోరేజ్ చేసుకుని రాత్రి సమయాల్లో వినియోగించుకుంటుంది. సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ: సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవ చ్చు. ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, విద్యుత్ బిల్లులు కట్టాలనే సమస్య లేకుండా ఉండొచ్చు. -
వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!
వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం! ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్ ఆథర్ ఆండ్రూ వొజోవిక్ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్ నేచర్‌లో పబ్లిషయ్యాయి. శక్తి కేంద్రం... మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌర విద్యుత్‌కు ట్రాన్స్మిషన్ లైన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కొత్తగా అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు కానున్నాయి. కర్ణాటకతో పాటు ఏపీలోని మూడు సోలార్ ఎనర్జీ జోన్లలో ఈ లైన్లు ఏర్పాటు చేసేందుకు త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. బీదర్‌లోని సోలార్ ఎనర్జీ జోన్ 2.5 గిగావాట్లు, అనంతపురంలో 2.5 గిగావాట్లు, కర్నూలులోని సోలార్ ఎనర్జీ జోన్లో 1 గిగావాట్ సామర్థ్యంతో.. మొత్తం 6 గిగావాట్ల సామర్థ్యం గల లైన్ల నిర్మాణం చేపట్టాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన నేషనల్ కమిటీ ఆన్ ట్రాన్స్మిషన్ (ఎన్సీటీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో విండ్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల స్థాపన ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 29 ప్రాంతాల్లో 33,240 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లను నెలకొల్పడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరో 10 వేల మినీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఇటీవల గుర్తించింది. మొత్తంగా 44,240 మెగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీటి కోసం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల భూమితో టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించింది. పెట్టుబడులు, పరికరాల తయారీ సౌకర్యాల ప్రాజెక్ట్ డెవలపర్ల కోసం సుమారు 5 లక్షల ఎకరాలను లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. తొలి దశలో వైఎస్సార్ జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూలు జిల్లా ఓక్ రిజర్వాయర్, విజయనగరం జిల్లా కురుకూటి, కర్రివలస విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలో 6,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ఏడు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. వీటి నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ పంపిణీకి ఏపీ ట్రాన్స్‌కోకు సంబంధించిన 400 కేవీ సబ్ స్టేషన్లతో లైన్లను అనుసంధానం చేయనున్నారు. ఆరు జిల్లాల్లో 361.86 కిలోమీటర్ల విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి సోలార్ పవర్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో కనీసం 5 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సోలార్ పార్కులను అభివృద్ధి చేయడం, ఉత్పత్తిని ప్రోత్సహించడం, సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపుసెట్లను తీసుకురావడం, స్థానిక తయారీ సౌకర్యాలను ప్రోత్సహించడం వంటివి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడం ద్వారా రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఆదాయాన్ని సృష్టించడం, స్థానిక ఉపాధిని కల్పించడం, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిని పెంచడం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటుతో పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపునివ్వడంతో ఆ మేరకు కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరనుంది. -
విద్యుత్ వస్త్రాలు.. కరెంట్ రోడ్లు..!
సాక్షి, అమరావతి: మనం ధరించే వస్త్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దానితో మన జేబులోనే సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. నడిచే రోడ్లపై కూడా కరెంట్‌ను సృష్టించవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు నిశ్చింతగా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా... దీనిని ఆచరణలో సాధ్యం చేసి చూపించారు ఇంగ్లండ్, చైనా, స్విట్జర్లాండ్ వంటి దేశాల శాస్త్రవేత్తలు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో గ్రీసు దేశానికి చెందిన థేల్స్ అనే శాస్త్రవేత్త మొదటిసారి విద్యుత్ ఉనికిని గుర్తించారు. నాటి నుంచి విద్యుత్ రంగంలో సాంకేతికత రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. అవసరాలకు అనుగుణంగా నిత్యం కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ ఆవిష్కరణలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి. ఒంటిపైన విద్యుత్ ఉత్పత్తి ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వస్త్రాన్ని తయారు చేశారు. దీంతో ఫ్యాంట్ జేబులోనే సెల్‌ఫోన్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్ ప్యానెల్స్‌ను అమర్చి ఈ వస్త్రాన్ని ఎండలో ఉంచి సౌరశక్తిని గ్రహించేలా చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇందుకోసం పరిశోధకులు 51 సెంటీమీటర్ల పొడవు, 27 సెంటమీటర్ల వెడల్పు ఉన్న వస్త్రాన్ని తయారు చేశారు. నీటిలో తడిచినా పాడవకుండా అందులో ఒక్కో సోలార్ సెల్‌ను పాలిమర్ రెజిన్ కోటింగ్ చేసి వాటర్ ప్రూఫ్‌గా మార్చారు. ఒక్కో సోలార్ సెల్‌ను చిన్న వైరుతో అనుసంధానం చేసి తీగగా మార్చారు. రెండు నూలు పోగుల మధ్య సోలార్ సెల్ తీగను అమర్చుకుంటూ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాలు 400 మిల్లీవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. ఈ విద్యుత్ సెల్‌ఫోన్ చార్జింగ్కు సరిపోతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వస్త్రాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకవచ్చని వెల్లడించారు. దీనిని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్త్రాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపైనే కరెంట్ ఉత్పత్తి విద్యుత్, ఆటోమొబైల్ రంగాలకు మధ్య సంబంధం రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సోలార్ వంటి సా«ధనాల ద్వారా బ్యాటరీలకు చార్జింగ్ పెట్టడం జరుగుతోంది. ఇటీవల విద్యుత్ వాహనాలు పెరుగుతుండటంతో టైర్ల తయారీ కంపెనీలు చార్జింగ్ విభాగంలో కూడా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి. విద్యుత్‌ను ఉత్పత్తి చేసే టైర్లను తయారు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన గుడ్ ఇయర్ అనే అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థ ‘గుడ్ ఇయర్ బీహెచ్03’ అనే పేరుతో తయారు చేసిన కొత్త రకం టైర్లు, రోడ్డుతో రాపిడి (ఫ్రిక్షన్) వలన కలిగే వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి సహకరిస్తాయి. ఇలా మారిన విద్యుచ్ఛక్తి కారులోని బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చైనా, స్విట్జర్లాండ్, మరికొన్ని దేశాల శాస్త్రవేత్తలు సైకిల్, బైక్‌లు, కార్లు వంటి వాహనాలు నడిచే రోడ్లపై విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసి ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నాన్–స్లిప్ ఉపరితలం ఉన్న రోడ్లపై 50 చదరపు సెంటీ మీటర్ల పరిమాణం, రెండు సెంటీ మీటర్ల మందంతో ఉన్న సౌర పలకలను అమర్చుతున్నారు. ఇవి కాంక్రీట్ రహదారులకంటే గట్టిగా, వాహనాల బరువును తట్టుకునేలా రూపొందిస్తున్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గృహ, వ్యాపార సముదాయాల అవసరాలకు వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సోలార్ హెడ్‌ల్యాంప్ ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో
హెడ్‌ల్యాంప్‌లు కొత్తవేమీ కాదు గాని, సౌరశక్తితో పనిచేసే హెడ్‌ల్యాంప్‌లు మాత్రం కొత్తే! అమెరికాకు చెందిన సోలార్ వస్తువుల తయారీ సంస్థ ఎంపవర్డ్ ‘లూసిబీమ్’ పేరుతో సౌరశక్తితో పనిచేసే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది హెడ్‌ల్యాంప్‌గానే కాదు, ఫ్లాష్‌లైట్‌గా కూడా ఉపయోగపడుతుంది. క్యాంపులు, పిక్నిక్లు వెళ్లేటప్పుడు, చీకటి ప్రదేశాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. చుట్టూ చీకటి ఉన్నా, దీనికి ఉండే ఎలాస్టిక్ హెడ్‌బ్యాండ్‌ను తలకు తగిలించుకుని, దీపిపి ఆన్ చేసుకుంటే చాలు. దీని నుంచి వెలువడే వెలుతురులో హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చు. దీని నుంచి 300 ల్యూమెన్స్ వెలుతురు నిరంతరాయంగా వెలువడుతుంది. దీనికి ఉన్న యూఎస్బీ పోర్ట్‌తో సెల్ఫోన్లు వంటి ఎలక్ట్రిక్ పరికరాలను కూడా చార్జ్ చేసుకోవచ్చు. దీని ధర 35.68 డాలర్లు (రూ.2,920) మాత్రమే! -
ఎలక్ట్రిక్ హైవేలు కమింగ్ సూన్: కేంద్రం భారీ కసరత్తు
న్యూఢిల్లీ: సౌరశక్తిని వినియోగించుకుని భారీ ట్రక్కులు, బస్సుల చార్జింగ్కు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశీయంగా విద్యుత్‌తోనే నడిచే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉపరితలంపై ఉన్న విద్యుత్ లైన్స్‌తో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలకు కూడా చార్జింగ్ కోసం విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దే రోడ్లను ఎలక్ట్రిక్ హైవేగా పరిగణిస్తారు. మరోవైపు, టోల్ ప్లాజాల్లో కూడా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. మౌలిక సదుపాయాలను పటిష్టంగా అభివృద్ధి చేస్తే ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని, కొత్త వ్యాపారాలు.. ఉద్యోగాల కల్పనకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత లాజిస్టిక్స్, రోప్‌వేలు, కేబుల్ కార్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. అలాగే, చౌకైన, విశ్వసనీయమైన ఎలక్ట్రోలైజర్లు, హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా కంపెనీ సహకారం అందించాలని ఆయన కోరారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లకు మించి రాబడులు లభించేలా ఇన్విట్ వంటి వినూత్న పథకాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వాడకాన్ని బట్టే టోల్ ఫీజు.. టోల్ ప్లాజా రద్దీని తగ్గించేలా నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. అలాగే, టోల్ రహదారులపై ప్రయాణించినంత దూరానికి మాత్రమే వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వివరించారు. టోల్ బూత్‌ల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా, అలాగే రహదారిని ఉపయోగించినంత దూరానికే చెల్లింపులు జరిగేలా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాల టెక్నాలజీ ఉపయోగపడగలదని మంత్రి పేర్కొన్నారు. 2018-19లో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల నిరీక్షణ సయమం సగటున 8 నిమిషాలుగా ఉండగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టాక 2021-22లో ఇది 47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ చెప్పారు. నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గినప్పటికీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్దిష్ట సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల పైనా, ప్రస్తుతం ఉన్న 4 పైగా లేన్ల హైవేలపైనా అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎంఎస్) ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2024నాటికి జాతీయ రహదారులపై 15వేల కి.మీ. మేర ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ సిస్టంను(ఐటీఎస్) అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. -
రిలయన్స్ భారీ పెట్టుబడులు: మరో విదేశీ కంపెనీతో డీల్
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో విదేశీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకుంది. అమెరికాలోని కాలిఫోర్నరియాకు చెందిన చెందిన సెన్స్‌హాక్‌లో 79.4 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీనికి విలు32 మిలియన్ డాలర్లు.సెన్స్‌హాక్ ఇంక్. (సెన్స్‌హాక్)తో కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ మంగళవారం ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన సెన్స్‌హాక్, 2018లో స్థాపించబడింది. ఇది సౌరశక్తి ఉత్పత్తి పరిశ్రమకు సాఫ్ట్వేర్ బేస్డ్ మేనేజ్మెంట్ టూల్స్‌ను అందించే సంస్థ. ఆటోమేషన్‌ను ఉపయోగించడం ద్వారా సౌర ప్రాజెక్టు ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, ఎండ్-టు-ఎండ్ సోలార్ అసెట్ లైఫ్‌సైకిల్‌ను నిర్వహించేలా నిరంతరమైన సేవలందించే సోలార్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాయని రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తెలిపారు. 2030 నాటికి 100 GW సౌరశక్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. సెన్స్‌హాక్ సహకారంతో ఖర్చులను తగ్గించుకుని ఉత్పాదకతను పెంచుతామన్నారు. అలాగే రిలయన్స్ మద్దతుతోసెన్స్హాక్ అనేక రెట్లు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ డీల్‌పై సెన్స్‌హాక్ ఫౌండర్ సీఈవో స్వరూప్ మావనూర్, ప్రెసిడెంట్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ సాంఖే సంతోషం వ్యక్తం చేశారు. -
విక్రమ్ సోలార్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: దేశీ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అను మతి లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 50 లక్షల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. స్టాక్ ఎక్స్చేంజీల లిస్టింగ్‌కు వీలుగా కంపెనీ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీసహా.. సమీకృత సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను 2,000 మెగావాట్ల సామర్థ్యంగల సమీకృత సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు వినియోగించనుంది. 2021 డిసెంబర్‌కల్లా రూ. 4,870 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. -
IGI: ఇందిరాగాంధీ విమానాశ్రయం అరుదైన ఘనత
ఢిల్లీ: నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI) అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్పోర్ట్ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం హైడ్రో, సోలార్ పవర్‌తోనే నడుస్తోంది. 2030 నాటికి.. పునరుత్పాదక ప్రయత్నంతో పూర్తిస్థాయి కార్బన్ ఉద్గార రహిత ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించుకుంది. సుమారు రెండు లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంగా తెలిపింది. ఇదిలా ఉంటే.. 2036 దాకా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు హైడ్రోఎలక్ట్రిసిటీ సరఫరా చేసే ఉద్దేశంతో.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది డయల్. కిందటి ఏడాది భారత్‌తో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు దక్కించుకుంది ఐజీఐ. -
ఎక్కడైనా సరే తగ్గేదేలే! 'మెగా' జాక్ పాట్ కొట్టేసిన ముఖేష్ అంబానీ!
దేశీయంగా బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రూ.18,100 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి నాలుగు సంస్థలు ఎంపికయ్యాయి. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, ఓలా ఎలక్ట్రిక్, హ్యుందాయ్ గ్లోబల్ మోటర్స్ కంపెనీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వీటిలో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎల్ఐ స్కీము కింద ఎంపికైన సంస్థలు..రెండేళ్ల వ్యవధిలోగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా తయారు చేసిన బ్యాటరీల అమ్మకాలపై అయిదేళ్ల పాటు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. అమర రాజా బ్యాటరీస్,లూకాస్–టీవీఎస్ తదితర 10 కంపెనీలు పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తులకు గడువు జనవరి 14 కాగా, జనవరి 15న సాంకేతిక బిడ్లను తెరిచారు. చదవండి: అంబానీ అదరహో..ఈసారి ఏకంగా!! -
సౌరశక్తిపై అవగాహనకు బస్సుయాత్ర
ఖైరతాబాద్: గ్లోబల్ వార్మింగ్ చేరుకోవడానికి ఇంకా 8–10 సంవత్సరాలు మాత్రమే ఉందని, అందువల్ల వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి తీవ్రమైన తక్షణ చర్యలు అవసరమని సోలార్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశరయ్య భవన్లో సోలార్ ఎనర్జీపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టిన బస్సు యాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ యాత్ర మొత్తం బస్సులోనే నిర్వహించే విధంగా రూపొందిన బస్సులో 3.2 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్, ఆరు కిలోవాట్ల బ్యాటరీ స్టోరేజీ అమర్చారు. ఇది సౌరశక్తితో పేనిచేసే మూడు కిలోవాట్ల ఇన్వర్టర్‌ని కలిగి ఉంటుంది. లైట్లు, ఏసీ, కుక్‌స్టవ్, టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్ మరియు బస్సులోపల అన్ని చార్జ్ అవుతాయి. సుదీర్గ ప్రయాణంలో భాగంగా ఎనర్జీ స్వరాజ్ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు చేతన్ సింగ్ సోలంకి తెలిపారు. ఎనర్జీ స్వరాజ్ బస్సు రెండు రోజుల పాటు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఐ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: జాలీ జర్నీ...మళ్లీ రానున్న డబుల్ డెక్కర్ బస్సులు!) -
వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ఇలా చేస్తే సైక్లింగ్ బూమ్ రావచ్చు: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ కీలక అంశాలపై స్పందిస్తారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. నెటిజన్లతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉంటారు. కరెంట్ అఫైర్స్ మీద, స్ఫూర్తినిచ్చే కథనాలు ఇలా అన్ని విషయాలపై ఆనంద్ ట్వీట్లు చేస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్రా మరొక పోస్టు చేశారు. దేశవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ కవరేజీని పెంచడానికి ఊదేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.."వాట్ ఆన్ ఐడియా సర్జీ.. మా దేశంలో సోలార్ ఉత్పత్తి కోసం కాలువలపై సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ నిర్మిస్తాము, కానీ మీ ఐడియా మాత్రం సోలార్ ఎనర్జీ కవరేజీని గణనీయంగా పెంచుతుంది. సైక్లిస్టులు ఎక్స్ ప్రెస్ వేలను ఉపయోగించకుండా చూడటం విలువైనది.. ఎవరికి తెలుసు, బహుశా ఇది సైక్లింగ్ బూమ్ క్రియేట్ చేయవచ్చు" అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ఎరిక్ సోల్హిమ్ చేసిన ట్వీట్'ను మహీంద్రా రీట్వీట్ చేశారు. What an idea sirji… We have been doing similar things by covering canals, but this would substantially increase coverage. It’s worth looking at even if cyclists don’t use expressways…and who knows, maybe it’ll kick off a recreational cycling boom.. @nitin_gadkari https://t.co/zrZk8CqjFK — anand mahindra (@anandmahindra) March 2, 2022 దక్షిణ కొరియా హైవే మధ్యలో సోలార్ ప్యానెల్స్ అమర్చిన ఒక వీడియోను సోల్హిమ్ పంచుకున్నారు. ఫిబ్రవరి 25న సోల్హిమ్ ట్వీట్ చేస్తూ.. "దక్షిణ కొరియాలో హైవే మధ్యలో ఉన్న సోలార్ ప్యానెల్స్ కింద సైకిల్ మార్గం ఉంది. సైక్లిస్టులు సూర్యుడి నుంచి రక్షించబడతారు. అలాగే, ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడంతో పాటు ఆ దేశం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయగలదు" అని అన్నారు. (చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!) -
వెలుగుదారులు.. అసామాన్యులు
సోలార్ పవర్.. సౌరశక్తి. ఎంత కావాలంటే అంత. పూర్తిగా ఉచితం. చిన్న పెట్టుబడితో పర్యావరణానికి మేలు చేసే ఎంతో శక్తిని ఉచితంగా పొందవచ్చు. దీనికంతటికీ మూలం సౌర వ్యవస్థ. సూర్యుడి బాహ్య వాతావరణ పొరలో 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంది. అంటే భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటా వాట్ల శక్తి గల సూర్యకిరణాలు వెలువడతాయి. వీటిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. ఇలా ప్రకృతి ఉచితంగా అందించే సౌర శక్తిని ఫొటో వోల్టాయిక్ ఘటాల ద్వారా విద్యుత్తుగా మార్చుతారు. చాలా కాలం క్రితమే సోలార్ విద్యుత్‌ను గుర్తించినా.. అమల్లో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. సులభంగా దొరుకుతుంది కదా.. అని బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడ్డాం. హైడ్రో పవర్ అంటే జలవిద్యుత్ ఉన్నా.. దానిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. అందుకే సోలార్ విద్యుత్‌పై దృష్టి పెట్టింది లోకం. అందుకే ఇప్పుడు కొత్త నినాదం ఊపందుకుంది. ఒకే సూర్యుడు – ఒకే ప్రపంచం – ఒకే గ్రిడ్. అంటే వీలైనంత సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. అన్ని దేశాల విద్యుత్ వ్యవస్థలను అనుసంధానం చేయగలిగితే.. పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లమవుతాం. ఎండకాసే దేశాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్.. చీకట్లు నిండిన చోట వెలుగులు నింపుతాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఇండియా డాటా పోర్టల్ ప్రకారం గత ఏడున్నరేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 2.6 గిగా వాట్ల నుంచి 46 గిగావాట్ల సామర్థ్యం స్థాయికి చేరింది. ఇక పవన విద్యుత్ ఉత్పత్తి 5.5 గిగా వాట్లకు చేరింది. ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ఏకంగా 26 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. రైతుల సాగు కోసం వినియోగించే సోలార్ పంప్‌లు 20 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లలో మూడు మన దేశంలో ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద ప్లాంట్, మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో భాడ్లా అనే గ్రామంలో నిర్మించిన ప్లాంట్. దీన్ని 2,700 మెగావాట్ల సామర్థ్యంతో 14 వేల ఎకరాలలో నిర్మించారు. ఇక కర్ణాటకలో 13 వేల ఎకరాలలో 2,050 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్‌కు నాలుగో స్థానం దక్కింది. ఏపీలోని అనంతపురం జిల్లా నంబులపులకుంటలోనూ భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. దీని సామర్థ్యం 1200 మెగావాట్లు. ఇటీవల స్మార్ట్ సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో కైలాసగిరి రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ 3వ ర్యాంక్‌ను సాధించింది. 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి రావడంతో తిరుపతి కార్పొరేషన్ కు భారీగా బిల్లు తగ్గింది. ఏకంగా రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండడంతో మరిన్ని సోలార్ ప్లాంట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సూర్యశక్తిని ఒడిసి పట్టుకుంటున్నది ప్రభుత్వాలే కాదు.. సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ ప్రిన్స్ విలియం ఈ ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ను నెలకొల్పారు. గతేడాది ప్రారంభించిన ఈ ప్రైజ్ ఫైనలిస్టుల జాబితాలో మన దేశానికి చెందిన వాళ్లు ఇద్దరున్నారు. అందులో ఒకరు తిరువణ్ణామళైలోని 9వ తరగతి విద్యార్థిని వినీష. చిన్నప్పటి నుంచే తనకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. దీనికి తోడు సైన్సుపై ఆసక్తి. ఈ రెండింటి కలబోతగానే సోలార్ ఐరన్ కార్ట్‌ను తయారు చేసిందీ టాలెంటెడ్ గర్ల్. ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఇంటి దగ్గర ఇస్త్రీ బండి వ్యాపారిని చూసింది వినీష. బాగా మండించిన బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో వేసి దుస్తులు ఇస్త్రీ చేస్తున్న పద్ధతిని గమనించింది. ఇంటికొచ్చాక బొగ్గు మండించడం వల్ల కలిగే నష్టాలను ఇంటర్నెట్లో వెతికింది. బొగ్గును ఉత్పత్తి చేయాలంటే చెట్లను నరకాలి. కట్టెలను కాల్చాలి. ఆ పొగతోపాటు కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది. ఇవన్నీ తెలుసుకున్నాక.. వినీషలో కొత్త ఆలోచన మొదలయింది. ఆ తపన నుంచి వచ్చిన ఆవిష్కరణే ‘సోలార్ ఐరన్ కార్ట్’. ఈ మొబైల్ ఇస్త్రీ బండి సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకుని పని చేస్తుంది. ఈ ప్రయత్నానికి ఎర్త్ షాట్ ప్రైజ్ దిగి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 750 ఎంట్రీల్లో తుది అంచెకు చేరుకున్న 15లో మరొకటి ఢిల్లీకి చెందిన ‘విద్యుత్ మోహన్’ ప్రాజెక్టు. విద్యుత్ మోహన్ .. గత కొన్నాళ్లుగా దేశ రాజధాని ఎదుర్కొంటున్న వాయు కాలుష్యాన్ని గమనిస్తున్నాడు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఓ వైపు ఉత్తరాది పొలాల్లోని మంటల నుంచి వచ్చే పొగ.. దానికి ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం.. అన్నీ కలగలసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. టకా అంటే డబ్బు, చార్ అంటే బొగ్గు లేదా కార్బన్ .. కాలుష్యం నుంచి డబ్బు అన్న కాన్సెప్ట్‌లో టకాచార్ అనే ఓ సంస్థను ప్రారంభించాడు మోహన్ . దీని ప్రధాన ఉద్దేశం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టును నడుపుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తయ్యే చెత్త, చెదారం, పంట కోసిన తర్వాత ఉండే మొదళ్లు, ఇతర వ్యర్థాలను సాధారణంగా చాలా మంది రైతులు తగులబెడతారు. అలా తగులబెట్టే బదులు ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ ఓ యంత్రంలో వేయడం ద్వారా బయోచార్గా మారుతాయి. బయోచార్ను భూసారాన్ని పెంచే ఎరువుగా రైతులు తిరిగి వాడుకోవచ్చు. తద్వారా పంట వ్యర్థాలు మళ్లీ భూమిలోకి చేరడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. (క్లిక్: రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?) ముంబైకి చెందిన మధురిత గుప్తాది మరో విజయగాథ. ముంబైలో వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తా ఓ వైల్డ్ లైఫ్ సంస్థలో వ్యవస్థాపక సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్స్‌ను తగులబెట్టడం లేదా భూమిలో పారేయడాన్ని గమనించారు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని నివారించాలన్న ఆలోచన కలిగింది. శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతోంది. ఐఐటీలో చదివి ఇంజినీర్‌గా పని చేస్తోన్న తన తమ్ముడు రూపన్ తో కలిసి సోలార్ లజ్జా అనే యంత్రాన్ని రూపొందించారు మధురిత. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్‌ను ఈ మెషీన్ లో వేయడం వల్ల క్షణాల్లో వాటిని బూడిదగా మార్చవచ్చు. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్ . సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్ పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్ ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపోన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. ప్రకృతికి మంచి చేసే మెషిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్ లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ లో ‘ఇన్ స్ప్రెన్యూర్ 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ విమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటు దక్కించుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హరియాణా, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చారు. ఇప్పుడు జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. (క్లిక్: ఆర్ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్ 500 ఎం.జీ దాటితే!) గుజరాత్ వడోదర జిల్లాకు చెందిన నీల్ షా వయస్సులో చిన్నోడయినా.. సమాజానికి పెద్ద పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు. ఇంటర్ చదువుతున్న నీల్‌ది ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. అయితే మాత్రం ఆవిష్కరణలపై ఆసక్తి తగ్గించుకోలేదు నీల్‌షా. ఓ సారి స్కూల్లో ప్రాజెక్ట్ కింద అసైన్ మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా సోలార్ సైకిల్ రూపొందించాడు. రూ. 300లతో పాత సైకిల్ కొనుగోలు చేసిన నీల్‌షా.. దానికి రెండు సోలార్ ప్యానెళ్లను అమర్చాడు. ఒక సారి చార్జింగ్ చేస్తే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఈ సైకిల్. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ సైకిల్.. పల్లెల్లో పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరం. తమిళనాడులోని మధురైకి చెందిన ధనుష్ కూడా ఇలాంటి సైకిల్‌నే తయారు చేశాడు, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదివిన ధనుష్.. తాను తయారు చేసిన సైకిల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చూపించాడు. కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు రుపాయి కన్నా తక్కువే. కేరళ పోలీసులకు వినూత్న ఆలోచన వచ్చింది. రోడ్లపై గంటల కొద్దీ నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు సోలార్ గొడుగులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ గొడుగు రెండు రకాలుగా పని చేస్తుంది. మండుటెండల్లో డ్యూటీ చేసే పోలీసులకు నీడ ఇస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేలా అందులోనే ఫ్యాన్ ఉంటుంది. అంటే గొడుగుపైన సోలార్ ప్యానెల్, గొడుగు కింద బ్యాటరీ. ఇదే టెంట్లో కింద లైటింగ్ సౌకర్యం కూడా ఉంది. రాత్రి పూట కూడా పోలీసులకు ఇది ఉపయోగపడుతుంది. ఎర్నాకుళం జిల్లాలో మొదలైన ఈ ప్రాజెక్టును మరిన్ని జిల్లాలకు విస్తరించారు కేరళ పోలీసులు. (క్లిక్: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే!) ఇప్పుడంటే ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అయిదేళ్ల కిందటే సోలార్ కార్‌ను తయారు చేశారు కర్ణాటకలోకి మణిపాల్ యూనివర్సిటీ విద్యార్థులు. పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచే ప్రోటో టైప్ సోలార్ ఎలక్ట్రిక్ కార్‌ను రూపొందించారు. సోలార్ మొబిల్ పేరిట రూపొందించిన ఈ కారుకు టాటా పవర్ తమ వంతుగా సహకారం అందించింది. అనుదీప్ రెడ్డి, జీత్ బెనర్జీ, వరుణ్ గుప్తా, శివభూషణ్ రెడ్డి, సులేఖ్ శర్మలు కలిసి రూపొందించిన ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి చార్జింగ్ పూర్తయితే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో చార్జింగ్ చేసుకోగలదు. సూర్యరశ్మితో నడిచే కార్లను అభివృద్ధి చేసేందుకు విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్ల కోసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు ఈ పోటీ జరుగుతుంది. (చదవండి: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?) ఇవే కాదు.. సౌరశక్తితో మరెన్నో వినూత్న ఆవిష్కరణలు మన చుట్టున్నవాళ్లు చేస్తున్నారు. భవిష్యత్తులో మనకెన్నో పర్యావరణ అనుకూల పరిష్కారాలు చూపించనున్నారు. - శ్రీనాథ్ గొల్లపల్లి సీనియర్ అవుట్‌పుట్ ఎడిటర్, సాక్షి టీవీ g.srinath@sakshi.com -
ప్రపంచంలోనే అతి చిన్న ఇయర్‌ఫోన్స్, సోలార్‌పవర్‌తో ఛార్జ్..!
ప్రముఖ స్వీడిష్ ఆడియో బ్రాండ్ అర్బనిస్టా(Ubanista) భారత మార్కెట్లలోకి అడుగుపెట్టింది. టీడబ్ల్యూఎస్ కేటగిరీలోనే కాకుండా, హెడ్‌ఫోన్, ఇయర్‌ఫోన్ ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశ పెట్టనుంది. ప్రత్యేక ఆకర్షణగా సోలార్ హెడ్‌సెట్స్..! ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో అర్బనిస్టా అందుబాటులో ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని లాస్ ఏంజెల్స్ మోడల్, లిస్బాన్ మోడల్ ఇయర్‌ఫోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాస్ ఏంజెల్స్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ సోలార్ పవర్‌తో ఛార్జ్ చేయవచ్చును. ఇకపోతే లిస్బాన్ మోడల్ ఇయర్‌బడ్స్ ప్రపంచంలోనే అతి చిన్న టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌గా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా అర్బనిస్టా సీఈఓ అండర్స్ ఆండ్రీన్ మాట్లాడుతూ...“భారత మార్కెట్‌కు మా ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రపంచ మొబైల్ క్యాపిటల్‌గా భారత్ నిలుస్తున్నందున , మా బ్రాండ్ ఉత్పత్తులు భారతీయులను ఆకట్టుకుంటాయ’ని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ప్రీమియం ఆఫ్‌లైన్ రిటైలర్ స్టోర్లలో ,ఎంపిక చేసిన యాపిల్ ప్రీమియం ఐఫోన్ రీసెల్లర్ స్టోర్ అందుబాటులో ఉంటాయని అర్బనిస్టా ఇండియా హెడ్ విజయ్ కణ్ణన్ తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రధాన ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. భారత్‌లో బూమ్..! ఆడియో ఉత్పత్తుల విభాగంలో భారత్ 11 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కల్గి ఉంది. ప్రపంచంలోనే ఆడియో ఉత్పత్తుల్లో భారత్ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. దీంతో ఆయా విదేశీ కంపెనీలు భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైనాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. చదవండి: Amazon Saving Sales: త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..! -
‘తమ్ముడితో కలిసి ఈ పని చేశా’.. క్షణాల్లో బూడిద చేస్తుంది సోలార్ లజ్జా!
"Solar Lajja" Machine: Learn How to Burn Sanitary Pads and PPE Kits and How to Dispose Diapers.. ‘‘శానిటరీ ప్యాడ్స్ వల్ల ఒక రకంగా మంచి జరిగితే మరోరకంగా పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోంది. ఈ ముప్పును నివారించేందుకు విద్యుచ్ఛక్తితో పని చేసే మెషీన్ల ద్వారా వాటిని కాల్చివేయడం జరుగుతోంది. అయితే అలా చేయాలన్నా, ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలున్నాయి. ఒకవేళ సౌకర్యం ఉన్నా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు వసు ్తందో తెలియని పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్‌తో పని చేసే మెషిన్‌ను తయారు చేయాలని తమ్ముడు, నేను అనుకున్నాము. అనుకున్నట్లుగానే సోలార్ లజ్జాను రూపొందించాం. ఇతర మెషిన్లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు’’ అని చెబుతోంది ముంబైకి చెందిన మధురిత గుప్తా. ప్రకృతికి మంచిచేసే మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో ‘ఇన్స్పెన్య్రూరు 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ ఉమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటుదక్కించుకుంది. వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తాకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకపక్క తన విధులను నిర్వహిస్తూనే ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘మేవాట్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్’లో వ్యవస్థాపక సభ్యురాలిగా పనిచేస్తున్న మధురిత గుప్తా పదేళ్లకు పైగా జూలలో పనిచేస్తూ జాతీయ పార్కుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను సందర్శించేది. అడవులకు దగ్గర్లోని గ్రామాల్లో పర్యటించినప్పుడు నెలసరి సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధురిత నిశితంగా గమనించేది. అవగాహన లేమితో కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు గోనెపట్టాను ప్యాడ్‌గా వాడడం చూసింది. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ఆ రోజుల్లో వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు సరిగా లేవని భావించి వెంటనే ఆ మహిళలకు.. నెలసరి సమయంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసింది. ప్యాడ్స్ ఇచ్చి మహిళల సమస్యకు పరిష్కారం చూపినప్పటికి, వాడేసిన ప్యాడ్స్‌ను ఆరుబయట పడేయడంతో.. రక్తం వాసనకు క్రూరమృగాలు అక్కడ చేరి, ప్యాడ్లను ఆరగించేవి. ఇది ఇటు గిరిజన మహిళలకు, అటు జంతువులకు కూడా మంచిది కాదు. ప్రాణాలకూ ముప్పే. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుని ‘సోలార్ లజ్జా’ను తీసుకొచ్చింది మధురిత. సోలార్ లజ్జా.. అలా కనుగొన్నాం ‘‘శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం వెదకాలి’’ అని మధురిత తన ఐఐటీ ఇంజినీర్ తమ్ముడు రూపన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి దాదాపు ఏడాదిపాటు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 2019లో ‘‘సోలార్ లజ్జా’’ మెషిన్‌ను అర్ణవ్ గ్రీన్ టెక్ స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్. సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్‌పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్‌ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపాన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. పర్యావరణ హితం... మహిళలకు ఉపాధి ‘‘మేము కనిపెట్టిన ఈ మెషిన్ రోజుకి రెండువందల ప్యాడ్లను బూడిద చేస్తుంది. ఈ బూడిదను పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కంపెనీ, స్కూళ్లు కాలేజీల్లో అమర్చాము. ప్యాడ్స్‌ను పంపిణీ చేయడమేగాక, వాటిని మెషిన్లో ఎలా పడేయాలో కూడా నేర్పిస్తున్నాము. దీనిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. 2019లో ప్రారంభించిన సోలార్ లజ్జా మెషిన్లను పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చాము. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హర్యాణ, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చాము. జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు లేదా పబ్లిక్ స్థలాలకోసం ఆర్డర్లు వస్తున్నాయి. సోలార్ లజ్జా ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. భవిష్యత్‌లో వీటి ఉత్పత్తిని పెంచుతాము’’ అని మధురిత వివరించింది. -
సహారా ఎడారిలో సౌర విద్యుత్ ఉత్పత్తి .. ఇదంతా అయ్యే పనేనా?
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పేరు మార్మోగుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. సౌర, పవన, అలల శక్తి లాంటి పునరుత్పాదక ఇంధనాల వాడకం పెంచాలంటున్నారు. మరి ఆ ప్రకారమే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే సహారా ఎడారిని సౌర విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటే? ఎడారంతా సోలార్ ప్యానళ్లు పెట్టేసి కరెంటు ఉత్పత్తి చేస్తే? కనీసం కొంతభాగంలోనైనా ప్యానళ్లు పెడితే? ఇసుకలో ఇదంతా అయ్యే పనేనా? ఒకవేళ అయితే ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయగలం? ఎన్ని దేశాలకు సరిపోతుంది? లాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ మీ కోసం.. ఇంతకీ ఎడారి విస్తీర్ణమెంత? ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి సహారా. ఆఫ్రికాలోని 11 దేశాల్లో విస్తరించి ఉంది. ఒకవేళ సహారా కనుక దేశమైతే ప్రపంచంలోనే ఐదో పెద్ద దేశమయ్యేది. ఈ ఏడారి విస్తీర్ణం 90 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియాకు మూడింతలు పెద్దది. బ్రెజిల్ కన్నా పెద్దది. చైనాతో పోలిస్తే కాస్త చిన్నది. చదవండి: గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్ ప్రపంచానికంతా 254 చ.కి.మీ.లు చాలు సహారా ఎడారి ప్రతి సంవత్సరం 22 బిలియన్ గిగావాట్స్ అవర్ సూర్యశక్తిని గ్రహిస్తుంది. అంటే ప్రతి చదరపు మీటర్‌కు 2 వేల నుంచి 3 వేల కిలోవాట్ అవర్ శక్తి అన్నమాట. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే జర్మనీ దేశం పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చడానికి సహారాలోని కేవలం 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సూర్యశక్తిని వాడుకుంటే చాలు. యూరప్‌లోని 25 దేశాల విద్యుత్ అవసరాలకు 110 చదరపు కిలోమీటర్లు చాలు. ఇక ప్రపంచమంతా కావాల్సిన విద్యుత్ కోసం 254 చదరపు కిలోమీటర్ల ప్రాంతం సరిపోతుంది. 2005 నాటి నడిన్ రీసెర్చ్‌లో ఇవన్నీ వివరించారు. 350 వాట్ల సోలార్ ప్యానళ్లను సహారాలోని 1.2 శాతం ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే 5,100 కోట్ల ప్యానళ్లు కావాలి. ఈ 1.2 శాతం న్యూ మెక్సికో ప్రాంతం విస్తీర్ణంతో సమానం. మొత్తం సహారానే ప్యానళ్లతో కప్పేస్తే? సహారాలో ఏర్పాటు చేసిన ప్యానళ్లన్నీ 20 శాతం సామర్థ్యం వరకే పని చేసినా ఏడాదికి 2,760 ట్రిలియన్ కిలోవాట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ అవసరాలకు మాత్రం ఏడాదికి 23 ట్రిలియన్ల కిలోవాట్ అవర్ విద్యుత్ సరిపోతుంది. సహారాతో చాలా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కదా. నిపుణులు కూడా సహారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు 4 రెట్లు ఎక్కువగా ఎడారి ఉత్పత్తి చేయగలదని అంటున్నారు. చదవండి: Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ.. మరి ప్యానళ్లు పెట్టడానికి ఇబ్బందేంటి? ఇంతలా సహారాను వాడుకోవచ్చు కదా? మరి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే తొలి కారణం రాజకీయపరమైన చిక్కులు. రెండోది భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసే సోలార్ ప్యానళ్ల నిర్వహణ కష్టంతో కూడున్నపని. ఇక ఎడారిలో రోడ్లు వేయడమంటే సాహసమే. అయితే ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయి. సహారా వ్యాప్తంగా సోలార్ జనరేటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని డిసర్టిక్ ఫౌండేషన్ ప్రతిపాదించింది. కానీ అందుకు ముందడుగు పడలేదు. అయితే సహారాలో రోడ్లు వేయడం మాత్రం ఆ ఫౌండేషన్ మొదలుపెట్టింది. మనతో పాటు సహారాకూ ప్లస్సే.. సహారాలో భారీ స్థాయిలో సోలార్ ప్యానళ్లు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్లు ఏర్పాటు చేస్తే ఇంకో ఉపయోగం కూడా ఉందండోయ్! మనం గనక ఈ పని చేస్తే ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువవుతుందంట. వృక్ష సంపద కూడా 20 శాతం పెరుగుతుందట. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గత 7 ఏళ్లలో భారీగా పెరిగిన సౌరశక్తి సామర్థ్యం
గత 7 ఏళ్లలో 17 రేట్లు పెరిగిన తర్వాత భారతదేశ సౌరశక్తి సామర్థ్యం సుమారు 45 గిగావాట్లకు చేరుకుందని నేడు జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో ఇండియా తెలిపింది. ప్రపంచ జనాభాలో 17 శాతం జనాభా కలిగిన దేశం, కాలుష్య ఉద్గారాల పరంగా 4 శాతం మాత్రమే అని నొక్కి చెప్పింది. సీఓపీ26 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో 11వ ఫెసిలిటేటివ్ షేరింగ్ ఆఫ్ వ్యూస్(ఎఫ్ఎస్ వి) సందర్భంగా తన మూడవ ద్వైవార్షిక నవీకరణ నివేదిక(బియుఆర్)పై ప్రజంటేషన్ ఇస్తూ భారతదేశం ఇలా చెప్పింది. ప్రస్తుత వార్షిక గ్రీన్ హౌస్ వాయువు(జీహెచ్ జీ) ఉద్గారాలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపింది. గత ఏడేళ్లలో భారత దేశం ఏర్పాటు చేసిన సౌరశక్తి సామర్థ్యాన్ని 17 రెట్లు పెంచామని, సౌరశక్తి సామర్థ్యాన్ని ఇప్పుడు 45 గిగావాట్లకు చేరుకున్నట్లు అని భట్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. "2015 - 2019 మధ్య, అడవి విస్తీర్ణం 13,031 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఆసియా సింహం, ఏనుగు, ఖడ్గమృగాల సంఖ్య గత 5 నుంచి 6 సంవత్సరాలలో అనేక రెట్లు పెరిగింది" అని భారతదేశం ప్రకటనలో తెలిపింది. (చదవండి: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు) -
ఒకే ప్రపంచం.. ఒకే సౌర గ్రిడ్
గ్లాస్గో: సకల జగత్తుకు సూర్యుడే మూలాధారమని... సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని మనుగడ సాధించాలంటే ప్రపంచ సౌర గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై కాప్–26 సదస్సులో ‘స్వచ్ఛ సాంకేతికల ఆవిష్కరణలను వేగవంతం చేయడం– వినియోగంలో పెట్టడం’ అనే అంశంపై మోదీ మంగళవారం గ్లాస్గోలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని ఏమూలలోనైనా సౌర విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలను లెక్కించే కాలిక్యులేటర్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ప్రపంచానికి అందించనుందని వెల్లడించారు. ఉపగ్రహాలు అందించే డాటా ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవకాలంలో శిలాజ ఇంధనాల శక్తి మూలంగా పలు దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా అవతరించాయని... అయితే అదే సమయంలో పర్యావరణం బలహీనపడిందని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలతో నెలకొన్న పోటీ మూలంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, కానీ ఈ రోజు సాంకేతిక మనకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపుతోందని అన్నారు. ‘సకల జగత్తుకు సూర్యుడే ఆధారమని సూర్యోపనిషత్తు చెబుతోంది. శక్తికి మూలం భానుడే. సౌరశక్తి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సమతౌల్యతను కాపాడినంత కాలం భూగోళం సురక్షితంగానే ఉందని, ఎప్పుడైతే ఆధునికయుగంలో ముందుకెళ్లాలనే పోటీ మొదలైందో... అప్పుడే విధ్వంసం ఆరంభమైందని అభిప్రాయపడ్డారు. సౌరవిద్యుత్తును అందుబాటులో ఉంచాలంటే ప్రపంచ సౌరగ్రిడ్ను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు. ద్వీపాలకు భారత్ అండ ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే చిన్న దేశాలకు భారత్ అండగా నిలిచింది. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. కాప్26 వాతావరణ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామన్నారు. -
‘గ్రీన్ ఎనర్జీ’లో రిలయన్స్ జోరు
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా పర్యావరణహిత విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) వ్యాపార విభాగంలో దూకుడు మరింతగా పెంచింది. రెండు కంపెనీలతో జట్టు కట్టింది. జర్మనీకి చెందిన ఫొటోవోల్టెయిక్ సోలార్ వేఫర్ల తయారీ సంస్థ నెక్స్‌వేఫ్ జీఎంబీహెచ్‌లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్ఐఎల్ తెలిపింది. ఇందులో భాగంగా 25 మిలియన్ యూరోలు (సుమారు రూ. 218 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. అటు, డెన్మార్క్‌కు చెందిన స్టీస్డాల్ సంస్థ నుంచి హైడ్రోలైజర్ల తయారీ టెక్నాలజీకి లైసెన్స్ తీసుకుంటున్నట్లు వివరించింది. ‘ఫొటోవోల్టెయిక్ తయారీలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టే దిశగా నెక్స్వేఫ్లో పెట్టుబడులు తోడ్పడగలవు. ఇక స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం.. వచ్చే 1 దశాబ్దకాలంలో 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను 1 డాలర్‌కు అందించాలన్న మా లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదు‘ అని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ పెట్టుబడులతో ఉత్పత్తి, టెక్నాలజీల అభివృద్ధికి మరింత ఊతం లభించగలదని నెక్స్‌వేఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్ ఇటీవలే వరుసగా రెండు సంస్థల్లో కీలక వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో తాజా డీల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నార్వేకు చెందిన సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆర్ఐఎల్ మరోవైపు షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌లో భాగమైన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాలను దక్కించుకుంది. రిలయన్స్ .. రాబోయే రోజుల్లో నాలుగు గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు అవసరమైన టెక్నాలజీ, నైపుణ్యాలకు తాజా డీల్స్ అన్నీ గణనీయంగా తోడ్పడనున్నాయి. తగ్గనున్న ఉత్పత్తి వ్యయం.. స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం ద్వారా భారత్‌లో హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీకి అవసరమైన టెక్నాలజీ రిలయన్స్‌కు అందుబాటులోకి వస్తుంది. ఫ్యుయల్ సెల్స్ తయారీకి కావాల్సిన టెక్నాలజీ కోసం కూడా ఈ ఒప్పందాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్యావరణహిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎలక్ట్రోలైజర్లు ఉపయోగపడతాయి. ప్రస్తుత టెక్నాలజీలతో పోలిస్తే స్టీస్డాల్ సాంకేతికతతో ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని రిలయన్స్ పేర్కొంది. ప్రస్తుతం 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ రేటు 5 డాలర్లుగా ఉండగా.. రానున్న దశాబ్దకాలంలో దీన్ని 1 డాలర్ స్థాయికి తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్..! విదేశీ కంపెనీను కొనుగోలుచేసిన రిలయన్స్..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 44వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ వచ్చే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీరంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్ అడుగులు వేస్తోంది. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ అక్టోబర్ 10న ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యాజమాన్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) చైనా నేషనల్ బ్లూస్టార్ కో లిమిటెడ్ నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..! హెటెరోజంక్షన్ టెక్నాలజీ (హెచ్జెటి) యాక్సెస్‌తో గ్లోబల్-స్కేల్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ తయారీలో దిగ్గజ ప్లేయర్‌గా మారడానికి ఆర్ఐఎల్ పనిచేస్తోంది. 2030 నాటికి 100GW సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది పునారుత్పాదక శక్తి విషయంలో భారత్ లక్ష్యంగా పెట్టుకున్న 450GW సౌరశక్తికి మద్దతుగా నిలుస్తోందని కంపెనీ రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్ఈసీ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది. నార్త్ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. చదవండి: టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్‌లో... -
పువ్వులతోనే వేడినీళ్లు
మనం వేడి నీళ్లు కావాలంటే హీటర్ పెట్టుకోవడం లేదా గేజర్ ఆన్ చేసుకుంటాం కదా. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు దాని స్థానంలో మనం పువ్వులతో నీళ్లని వేడి చేసుకోవచ్చు ఎలా అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఏం లేదండి సోలార్ ప్యానెల్‌తో తయారు చేసిన పూలు మరి. ఇవి నీటిలో వేసినప్పుడు అవి సూర్యకాంతిని గ్రహించి చాలా తక్కువ సమయంలోనే నీళ్లను వేడిగా మార్చేస్తాయట. అందుకే చాలా మంది వీటిని కోనేసుకుని వాళ్ల స్విమ్మింగ్ పూల్‌లో వేసేసుకుంటున్నారట. (చదవండి: ఓల్డ్ కార్ సీట్ బెల్ట్‌తో బ్యాగ్‌లు) మరికొంత మంది అయితే బకెట్లలో ఆ పువ్వులు వేసుకుని బాల్కనీలో ఆరుబయట సూర్యునికి ఎదురుగా కాసేపు పెట్టి ఆ తరువాత వాడేసుకుంటున్నరట. ఈ పూలు చూడటానికి అందంగా ఆకర్షణియంగా ఉండటంతో పాటు పూల్ నీటి కొలనులో ఉండే తామర పూలు మాదిరి అందంగా ఉంటుంది. అంతేకాదండోయ్ ఇవి ప్యాక్‌కి 12 ఉంటాయట. ఇవి ఎక్కువగా నీలం,నలుపు, రెయిన్బో హ్యూడ్ రంగులలో లభిస్తాయట. ఇక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి (చదవండి: స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్) -
వినీషా సోలార్ ఇస్త్రీ బండి
మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్ ఇస్త్రీ బంyì రూపకల్పన చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్ యువరాజు కిందటేడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్ జాబితాలో వినీషా ఉమాశంకర్ ’క్లీన్ అవర్ ఎయిర్’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్ ఇస్త్రీ బండిని డిజైన్ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. మేలైన ప్రయోజనాలు ఎర్త్‌షాట్ ప్రైజ్ విశ్లేషకులు వినిషా సోలార్ పవర్డ్ కార్డ్ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్ పాయింట్ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు. బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్ టాప్ అప్, ఛార్జింగ్ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు. ఫైనల్స్‌కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్ కాన్సెప్ట్ కంపెనీ టకాచర్ కో ఫౌండర్ విద్యుత్మోహన్ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్ రంగ వ్యాపారాల నెట్వర్క్ అయిన ఎర్త్‌షాట్ ప్రైజ్ గ్లోబల్ అలియన్స్ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్ 17న లండన్‌లోని అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. -
మరింత లాభం, చైనా కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను
ముంబై: సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ ఆర్ఈసీ గ్రూప్‌ను దక్కించుకోవడంపై దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దృష్టి పెట్టింది. చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్ (కెమ్‌చైనా) నుంచి కంపెనీని కొనుగోలు చేయాలని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఈ డీల్ విలువ సుమారు 1–1.2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. దీని కోసం దాదాపు 500–600 మిలియన్ డాలర్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు అంతర్జాతీయ బ్యాంకులతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి : కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! త్వరలోనే ఈ డీల్ గురించి ప్రకటన చేయొచ్చని వివరించాయి. నార్వే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్ఈసీ గ్రూప్ .. యూరప్‌లోనే అతి పెద్ద సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ. సింగపూర్‌లో రిజిస్టర్ అయ్యింది. ఫొటోవోల్టెయిక్ (పీవీ) అప్లికేషన్లకు అవసరమైన సిలికాన్ మెటీరియల్, మల్టీ–క్రిస్టలైన్ వేఫర్లు, గృహాలు .. పరిశ్రమలు .. సోలార్ పార్కుల్లో ఉపయోగించే మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఆర్ఈసీ కొనుగోలు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధునాతన టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాలు కూడా కంపెనీకి అందుబాటులోకి వస్తాయని వివరించాయి. సౌర విద్యుత్ పరిశ్రమ ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆర్ఈసీని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్‌కి ఏటా 3 గిగావాట్ల సోలార్ సెల్స్, 15 గిగావాట్ల మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నాయి. 90 శాతం ఉత్పత్తులను చైనా, చైనీస్ కంపెనీల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. 2019–20లో భారత్ 2.5 బిలియన్ డాలర్ల విలువ చేసే సోలార్ వేఫర్లు, సెల్స్, మాడ్యూల్స్, ఇన్వర్టర్లను దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
నాలుగేళ్లలో ఈ రంగంలో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్ పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) సామర్థ్యం వచ్చే ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరో 11 గిగావాట్లు (జీడబ్ల్యూ) పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. మాడ్యూల్ ధరల పెరుగుదల వల్ల సోలార్ బిడ్ టారిఫ్‌లు పెరిగినప్పటికీ, ఈ రంగం పురోగమిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన రంగం అదనపు సామర్థ్యం 8.7 గిగావాట్లు పెరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రేరిత సవాళ్ల పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ఈ వేగం మందగించి పురోగతి 7.4 జీడబ్ల్యూకు పడిపోయింది. కాగా, 2021–22లో తిరిగి ఈ విభాగం 10.5 నుంచి 11 జీడబ్ల్యూ వరకూ అదనపు సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉంది’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఈ రంగంలో 38 గిగావాట్ల పటిష్ట ప్రాజెక్ట్ పైప్‌లైన్ అమలు జరుగుతున్న విషయాన్నీ ఇక్రా గుర్తు చేసింది. అలాగే మరో 20 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ నోడెల్ ఏజెన్సీల నుంచి టెండరింగ్ దశలో ఉండడాన్ని ప్రస్తావించింది. ఆయా అంశాలన్నీ ఈ రంగాన్ని సమీప కాలంలో పటిష్టం చేస్తాయని విశ్లేషించింది. ఈ విభాగానికి సంబంధించి ఇక్రా నివేదిక తదితర అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గిగావాట్లు. 2022 నాటికి దాదాపు 180 గిగావాట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. 2030 నాటికి ఈ లక్ష్యం 450 గిగావాట్లగా ఉంది. దీన్ని సాధిస్తే మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా 54 శాతానికి చేరుకుంటుంది. ► వచ్చే నాలుగేళ్లలో ఈ రంగంలోకి రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అంచనా. ► భారత్ మొత్తం విద్యుత్ వ్యవస్థీకృత సామర్థ్యంలో పోల్చితే 2021 మార్చి నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్య 25 శాతం అయితే 2025 మార్చి నాటికి ఇది 34 శాతానికి చేరుతుందని అంచనా. ► అయితే ఈ రంగంలో సవాళ్లు కూడా ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు, అమ్మకం ఒప్పందాలపై (పీపీఏలు పీఎస్ఏలు) సంతకాల్లో ఆలస్యం అయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. టారిఫ్‌లు తగ్గుతాయన్న అంచనాలతో బిడ్స్ రద్దయిన నేపథ్యమూ ఉంది. ఈ తరహా అంశాలు ఇకముందూ సవాలుగా కొనసాగే అవకాశం ఉంది. ► నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు భూ సేకరణ, మౌలిక సదుపాయాల పెంపు వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి పవన విద్యుత్ విషయంలో ఈ తరహా ఇబ్బందులు కొనసాగే వీలుంది. ► డిస్కమ్‌ల నుంచి పునరుత్పాదక ఇంధన స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు (ఐపీపీ) బకాయిల విలువ 2021 ఏప్రిల్ నాటికి రూ.11,840 కోట్లని పీఆర్ఏఏపీటీఐ పోర్టల్ పేర్కొంటోంది. ► ఈ రంగానికి ఇక్రా ‘సేబుల్’ అవుట్‌లుక్ కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న విధానపరమైన మద్దతు, భారీ వృద్ధి అవకాశాలు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలకు సంబంధించి రుణ సామర్థ్యాలు, చార్జీల విషయంలో పోటీతత్వం వంటి అంశాలు దీనికి కారణం. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింపచేయడం ఈ రంగానికి సానుకూల అంశం. ► దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్ మాడ్యూల్స్, సెల్స్ విషయంలో కేంద్ర నూతన, పునరుత్పదక ఇంధన మంత్రిత్వశాఖ ఇటీవల కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై 40 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే సెల్స్ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. 2022 మార్చి 31 వరకూ సోలార్ మాడ్యూల్స్ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది. విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యం దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం గరిష్ట డిమాండ్ (ఒక్క రోజులో అత్యధిక సరఫరా) 200.57 గిగావాట్ల మార్క్‌ను అధిగమించి జీవితకాల గరిష్టానికి చేరి నట్టు కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వర్షాలు ఆలస్యం కావడం వల్ల దేశం లోని చాలా రాష్ట్రాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనడంతోపాటు.. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తుండడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన మంగళవారం విద్యుత్ డిమాండ్ 197.07 గిగావాట్లుగా నమోదైంది. గత నెలలో (జూన్ 30న) విద్యుత్‌కు రోజువారీ గరిష్ట డిమాండ్ 191.51 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. 2020 జూన్‌లో డిమాండ్ 164.98 గిగావాట్లుగా ఉంటే, 2019 జూన్ నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 182.45 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. -
ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు!
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఈ మధ్య ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలలో ఉన్న ప్రధాన లోపం ఛార్జింగ్ సమస్య. ఇవి పెట్రోల్ వాహనాలలో పెట్రోల్ పోసినంత సులభంగా ఛార్జింగ్ కావు. ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక కంపెనీలు దాని మీద దృష్టి పెట్టాయి. తాజాగా అమెరికాకు చెందిన ఒక స్టార్ట్-అప్ కంపెనీ ఛార్జింగ్ అవసరం లేని ఒక కారును తయారు చేసింది. అది ఎలా అని అనుకుంటున్నారా? సూర్యశక్తి సహాయంతో బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా కారును ఆప్టెరా అనే ఒక స్టార్ట్-అప్ రూపొందించింది. ఆప్టెరా పారాడిగ్మ్ అనేది సౌర ఎలక్ట్రిక్ కారు పేరు. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది ఎప్పటికీ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. సౌర శక్తితో రహదారిపై బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మరో ప్రత్యేకత ఏమిటంటే, కేవలం 3.5 సెకన్లలో ఈ కారు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, దీని గరిష్ట వేగం గంటకు 177 కిలోమీటర్లు. ఆప్టెరా పారాడిగ్మ్ కారు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ కారు 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్లు నడపవచ్చు. ఆప్టెరా ఇటీవలే తన సోలార్ ఎలక్ట్రిక్ కారును ప్రీ-ఆర్డర్స్ పై అందిస్తుంది. ఈ కారు చూడటానికి ముంగిస ఆకారంలో ఉంది. దీనిలో ఇద్దరు కలిసి ప్రయాణించవచ్చు. గత సంవత్సరం ఈ కారును సేల్ కి తీసుకొచ్చినప్పుడు 8 రోజుల్లో మూడు వేలకు పైగా ఆర్డర్స్ లభించాయి. పారాడిగ్మ్ ధర 29,000 డాలర్లు కాగా, పారాడిగ్మ్ ప్లస్ ధర 46,900 డాలర్లు. చదవండి: గుడ్‌న్యూస్: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు -
సోలార్ మాడ్యూల్స్ ‘దేశీయ తయారీ’కి ఊతం!
న్యూఢిల్లీ: దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్ మాడ్యూల్స్, సెల్స్ విషయంలో కేంద్ర నూతన, పునరుజ్జీవ ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఈ) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై 40 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు వెల్లడించింది. సెల్స్ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. ఈ మేరకు తన ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం వేసినట్లు వెల్లడించింది. ఎంఎన్ఆర్ఈ విడుదల చేసిన మెమోరాండం ప్రకారం, 2022 మార్చి 31 వరకూ సోలార్ మాడ్యూల్స్ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది. అటుపై వీటిపై సుంకాలు వరుసగా 40 శాతం, 20 శాతాలుగా ఉంటాయి. ఇక మీదట వేసే బిడ్ల విషయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్ఈ (పునరుత్పాదక ఇంధనం) అమలు సంస్థలు, సంబంధిత ఇతర వర్గాలకు మంత్రిత్వశాఖ సూచించింది. 2030 నాటికి గిగావాట్ల లక్ష్యం... 2022 నాటికి 100 జీడబ్ల్యూ (గిగావాట్ల) సౌర విద్యుత్‌సహా 175 జీడబ్ల్యూ వ్యవస్థాగత పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) సామర్థ్యానికి చేరుకోవాలన్నది భారత్ ప్రధాన లక్షంగా ఉంది. 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 450 జీడబ్ల్యూకి పెంచాలన్నది కూడా దేశం లక్ష్యం. సోలార్ రంగంలో పరికరాలకు ప్రస్తుతం దేశం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందుకు సంబంధించి అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశీయ సోలార్ పరికరాల పరిశ్రమ దేశీయ దిగుమతుల నేపథ్యంలో మరింత పతనం అవుతోంది. స్వావలంభన భారత్ దిశలో భాగంగా సోలార్ ఇన్వర్టర్లు, ల్యాంప్లపై దిగుమతి సుంకం పెంపును ఆర్థికమంత్రి సీతారామన్ ఫిబ్రవరి బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘‘సౌర ఇంధనం భారత్‌కు ఎంతో విశ్వసనీయమైనదిగా ఇప్పటికే గుర్తించాము. సోలార్ సెల్స్, సోలార్ ప్యానెళ్ల దశల వారీ దేశీయ తయారీ ప్రణాళికను నోటిఫై చేస్తాము. ప్రస్తుతానికి దేశీయ తయారీని ప్రోత్సహించేం దుకు సోలార్ ఇన్వర్టర్లపై డ్యూటీని 5 శాతం నుంచి 20 శాతానికి, సోలార్ ల్యాంటర్న్లపై 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నాము’’అంటూ బడ్జెట్లో భాగంగా మంత్రి ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సోలార్ పవర్ డెవలపర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలోనే సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై సుంకాన్ని విధించాలన్న ప్రతిపాదనకు ఆర్థికశాఖ అమోదముద్ర గమనార్హం. ప్రస్తుతం భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గెగావాట్లు. -
ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు!
పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం.. ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ.. అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతినే ఒడిసిపడతాయి. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్న మాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణా లను ఈ పదార్థం ఉపయోగించుకుం టుంది. ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది. వెలుగునిచ్చే పదార్థం... భూమిపై అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూ వబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందు కున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీల లోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్‌గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజీని నియంత్రిం చుకుంటూ ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసు కోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు. ఎన్నో లాభాలు నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేం దుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధా రణ సోలార్ ప్యానెల్స్‌ను ఎప్పుడూ సూర్యుడికి అభిము ఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండ దు. కాంక్రీట్ గోడలు, ఫుట్‌పాత్‌లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు 9 రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నా యాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుం దని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్ను వాడుకోవచ్చని తెలిపారు. -
లేజర్ కిరణాలతో నక్షత్రాల శక్తి!
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌లాగా కాలుష్యం గొడవ లేదు. అణు విద్యుత్తుతో వచ్చే రేడియోధార్మికత, వ్యర్థాల సమస్య ఉండదు. ఛర్నోబిల్, ఫుకుషిమా వంటి అణు ప్రమాదాలకూ ఆస్కారం లేదు. బయటకొచ్చేదంతా హాని చేయని హీలియం. ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నేరుగా వాడుకోవడమే.. ఏమిటిదీ.. ఎలా సాధ్యం? ప్రపంచం మొత్తం దశాబ్దాలుగా పరిష్కరించేందుకు మల్లగుల్లాలు పడుతున్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని ‘హెచ్‌బీ11 ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ఓ వినూత్నమైన పరిష్కారం కనుక్కుంది. వీరి ఆలోచన విజయవంతమైతే.. భూమ్మీద విద్యుత్తు కొరత అసలే ఉండదు. సూర్యుడితో పాటు నక్షత్రాలన్నింటిలోనూ శక్తి ఉత్పత్తి అయ్యేందుకు కారణమైన కేంద్రక సంలీన ప్రక్రియపై ఆ సంస్థ కన్నేసింది. కేంద్రక సంలీన ప్రక్రియ అంటే? అణు విద్యుత్ శక్తి ప్లాంట్ల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. ఇందులో అణువులను విడగొట్టడం ద్వారా పుట్టే వేడిని విద్యుత్తుగా మారుస్తారు. కేంద్రక సంలీన ప్రక్రియ అనేది దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇందులో విపరీతమైన వేడిని ఉపయోగించి అణువులను ఒకదాంట్లో ఒకటి లయమయ్యేలా చేస్తారు. సూర్యుడు, ఇతర నక్షత్రాలన్నింటిలోనూ హైడ్రోజన్ హీలియం అణువులు లయమైపోవడం ద్వారానే శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. ఈ శక్తిని మనం వెలుతురు రూపంలో అనుభవిస్తున్నాం. అయితే నక్షత్రాల్లో కోటాను కోట్ల ఏళ్లుగా జరుగుతున్న కేంద్రకసంలీన ప్రక్రియను భూమ్మీద సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. హైడ్రోజన్, హీలియం వంటి ఇంధనాలను లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా మాత్రమే ఆ రెండు అణువులు కలసిపోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి ఓ విద్యుదుత్పత్తి రియాక్టర్‌ను నిర్మించేందుకు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ పేరుతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఫ్రాన్స్‌లో ప్రయత్నం చేస్తోంది. అణువులను లయం చేయడం, ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాధ్యమైతే? ఆ తర్వాత ఈ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయాన్ని ఆలోచిస్తారు. హెచ్‌బీ11.. కాస్త డిఫరెంట్.. అయితే హెచ్‌బీ11 అభివృద్ధి చేసిన టెక్నాలజీలో ఇంధనాలను వేడి చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా శక్తిమంతమైన లేజర్లను ఉపయోగిస్తారు. అత్యంత సూక్ష్మ సమయం మాత్రమే వెలువడే ఈ లేజర్ల ద్వారా సూర్యుడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను పుట్టిస్తారు. ఈ టెక్నాలజీలో లోహంతో తయారు చేసిన ఓ బంతిలాంటి నిర్మాణం ఉంటుంది. దీని మధ్యభాగంలో హెచ్‌బీ11 గుళిక ఉంచుతారు. గుళికపై ఇరువైపులా చిన్న కణతలు ఉంటాయి. అయస్కాంత శక్తితో ఒక లేజర్ ప్లాస్మాను పట్టి ఉంచితే.. రెండో లేజర్ కేంద్రకసంలీన ప్రక్రియ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో విడుదలయ్యే ఆల్ఫా కణాలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్తును నేరుగా గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. ఈ పద్ధతిలో ఉపయోగించే బోరాన్ ప్రపంచవ్యాప్తంగా విరివిగా లభిస్తుందని, యురేనియం థోరియం వంటి అణు ఇంధనాల కంటే సులువుగా వెలికితీసి వాడుకోవచ్చని హెచ్‌బీ11 వ్యవస్థాపకుడు డాక్టర్ హెన్రిక్ హోరా చెబుతున్నారు. అణు రియాక్టర్లలోలా స్టీమ్ ఇంజన్లను ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషమంటున్నారు. అరవై ఏళ్ల ప్రస్థానం.. 1960: తొలి లేజర్ ఆవిష్కరణ 1960–78: లేజర్ల సాయంతో సంలీన ప్రక్రియపై ప్రొఫెసర్ హెన్రిక్ హోరా పరిశోధనలు 1978: శక్తిమంతమైన లేజర్లతో హైడ్రోజన్, బోరాన్ –11 (హెచ్‌బీ11)లను బాగా వేడి చేయకుండానే లయం చేయొచ్చని హెన్రిక్ హోరా ప్రకటన. 1985: అందుబాటులోకి చిర్ప్డ్ పల్స్ ఆంప్లిఫికేషన్ టెక్నాలజీ(సీపీఏ). డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న లేజర్ కిరణాల శక్తిని లక్షల రెట్లు పెంచేందుకు వీలేర్పడింది. 2005–2015: సీపీఏ టెక్నాలజీ సాయంతో హెచ్‌బీ11ను లయం చేయొచ్చని, ఇందుకు 2 పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయాల్సిన అవసరం లేదని పలువురు శాస్త్రవేత్తల నిరూపణ. 2014–2017: కేంద్రక సంలీన ప్రక్రియను సులువుగా సాధించే టెక్నాలజీపై పేటెంట్ హక్కులు నమోదు చేసిన హెచ్‌బీ11 2018: డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూలకు భౌతిక శాస్త్ర నోబెల్. 2019: హెచ్‌బీ11 ఎనర్జీ కంపెనీ ఏర్పాటు. తొలి అమెరికన్ పేటెంట్ మంజూరు! -
తేలికైన సౌరఫలకాలు..
సౌరశక్తిని విస్తృత స్థాయిలో వాడకపోయేందుకు కారణాలేంటో తెలుసా? బరువు ఎక్కువగా ఉండటం.. కావాల్సినట్లు మడతపెట్టే అవకాశం లేకపోవడం వంటివి రెండు కారణాలు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియాలోని సన్మ్యాన్ ఎనర్జీ సంస్థ వినూత్నమైన సౌర ఫలకలను అభివృద్ధి చేసింది. తేలికగా, గాజు లేకుండా తయారు చేసింది. ఫలితంగా వీటిని ఎలా అంటే అలా మడతపెట్టి వాడుకోవచ్చు. దీంతో వంపులున్న భవనాల్లోనూ ఎక్కువ సంఖ్యలో సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి పెంచుకోవచ్చు. ఈ–ఆర్చ్ అని పిలుస్తున్న ఈ సోలార్‌ప్యానెల్ ఒకొక్క దాంట్లో దాదాపు వంద వరకు ఘటకాలు ఉంటాయి. రెండు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ ప్యానెల్‌ను కావాల్సిన ఆకారంలో మార్చుకునే అవకాశం ఉంది. సంప్రదాయ సోలార్ ప్యానెల్స్ ఒకొక్కటి 20 కిలోల బరువు ఉంటే ఈ ఆర్చ్ 2.4 కిలోలు మాత్రమే ఉంటుంది. భవనాల కిటికీలతో పాటు పైకప్పులపై కూడా ఇవి తేలిగ్గా ఇమిడిపోతాయని సన్మ్యాన్ ఎనర్జీ సీఈవో డారెన్మిల్లర్ తెలిపారు. -
డ్రైవర్ అక్కర్లేని సోలార్ బస్
సాక్షి, హైదరాబాద్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థులు దేశంలోనే తొలి డ్రైవర్ రహిత, సౌరశక్తితో నడిచే బస్‌కు రూపకల్పన చేశారు. వర్సిటీలో జనవరి 3 నుంచి జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ బస్సు లో తొలిసారిగా ప్రయాణిస్తారని యూనివర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. త్వరలోనే ఈ బస్‌ను వాణిజ్య వినియోగంలోకి కూడా తెస్తామ న్నారు. దీన్ని రూపొందించేందుకు విద్యార్థులు ప్రత్యేకంగా వెహికల్ టు వెహికల్ (విటువి) టెక్నాలజీని వినియోగించారని, దీనివల్ల అల్ట్రా సోనిక్, ఇన్ఫ్రారెడ్ సంకేతాల ఆధారంగా, జీపీఎస్, బ్లూటూత్ ద్వా రా నేవిగేషన్ ప్రక్రియ సాగు తుందని తెలిపారు. సౌరశక్తి, బ్యాటరీ ఇంజిన్‌తో నడిచే ఈ బస్ విలువ సాధారణ బస్‌లతో పోలిస్తే రూ.6 లక్షలు అధికమని పేర్కొన్నారు. బస్సు సామర్థ్యం ఆధారంగా 10 నుంచి 30 మంది వరకు ప్రయాణించవచ్చని, 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. -
వ్యవసాయానికి రోబో వచ్చేసింది...
మూడేళ్ల క్రితం పోర్చుగల్‌లో ఓ రోబోను ప్రపంచానికి పరిచయం చేశారు. ద్రాక్షతోటల్లో పనిచేసేందుకు ఉద్దేశించిన ఈ వైన్‌రోబో దానికి మరిన్ని మెరుగులు దిద్దింది. తాజాగా వైన్‌స్కౌట్ పేరుతో మళ్లీ విడుదల చేసింది. అత్యాధునిక లిడార్ టెక్నాలజీని ఉపయోగించుకుని వైన్‌స్కౌట్ ద్రాక్షపండ్లు ఎంతమేరకు మగ్గాయి? పంటకు ఏమైనా చీడపీడలు ఆశించాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటుంది.ద్రాక్షతోటల వరుసల్లో తనంతట తాను ప్రయాణించేందుకు, మొక్కలకు ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఒక వరుస నుంచి ఇంకోదాంట్లోకి వెళ్లేందుకు ఇందులో కృత్రిమ మేధను ఉపయోగించారు. అంతేకాకుండా రాత్రివేళల్లోనూ పనిచేయగలగడం దీనికి ఉన్న మరో ప్రత్యేకత. మొక్కల ఆకుల ఉష్ణోగ్రత, అందులోని నీటి తేమ మోతాదును గుర్తించేందుకు ఇందులో పరారుణ కాంతితో పనిచేసే కెమెరా, మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు రెండూ ఉంటాయి. ఒక్కో వైన్ స్కౌట్ గంటకు దాదాపు మూడువేల సమాచారాలను సేకరించగలదు. ఈ సమాచారం మొత్తాన్ని ఒక మ్యాప్ రూపంలో అందిస్తుంది కూడా. వైన్‌స్కౌట్ బాడీపైనే ఉండే సోలార్‌ప్యానెల్స్ ఎప్పటికప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ లిథియం అయాన్ బ్యాటరీల్లో నిల్వ చేస్తూంటాయి. -
ఆకలి అన్నీ నేర్పిస్తుంది..!
ఆదిలాబాద్ ,జైనథ్: ఆకలి, అవసరం ఉన్న మనిషికి అన్ని నేర్పిస్తాయని అంటుంటారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది కూడా అలాంటి కోవకు చెందిన ఉదాహరణే అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ సంచార కుటుంబం గ్రామ గ్రామాన తిరుగుతూ..తమకు వచ్చిన మూలిక వైద్యాన్ని అందిస్తుంటారు. చెట్ల కింద చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ముందర ఓ చిన్న చెట్టు కింద కొన్ని రోజులుగా వాళ్లు బస చేస్తున్నారు. అయితే వీరు ఎక్కడకు వెళ్లినా ఓ సోలార్ ప్యానెల్, బ్యాటరీ వెంట బెట్టుకొని వెళ్తుంటారు. ఇదే విషయమై వారిని అడగగా తమకు గ్రామాల్లో కరెంట్ సదుపాయం ఎవరూ ఇచ్చే వారు కాదని దీంతో ఎనిమిది నెలలక్రితం రూ.8 వేలు పెట్టి ఓ సోలార్ ప్యానెల్, ఒక బ్యాటరీ కొనుగోలు చేసామన్నారు. సాధారణంగా ఇదే సోలార్ ఇన్వర్టర్ కొనుగోలు చేస్తే కనీసం రూ.30 వేలు ఖర్చు అవుతాయి. వీరు మాత్రం చిన్న ప్యానెల్‌తో బ్యాటరీని రీచార్జ్ చేస్తూ.. దాని నుంచి ఒక టీవీ, ఒక బల్బ్, ఒక మైక్‌సెట్ నడిపిస్తున్నారు.. ఇది చూసిన చాలా మంది ఇలాంటిది కొనుగోలు చేసుకుంటే అసలు కరెంట్ సమస్యనే ఉండదు కదా అని చర్చించుకుంటున్నారు. -
కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియకు ఊతం..
సూర్యుడి నుంచి వెలువడే శక్తిని ఇంధనంగా మార్చుకోవడంలో చెట్ల ఆకులకు మించినవి ఇప్పటివరకు లేవు. సోలార్ ప్యానెల్స్ కూడా ఆకుల స్థాయిలో సూర్యుడి కిరణాలను విద్యుత్తుగా మార్చగలిగితే విద్యుచ్ఛక్తి ఫ్యాక్టరీల అవసరం అస్సలు ఉండదు. ఈ అద్భుతాన్ని సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. కొన్ని కోట్ల సంవత్సరాల కిత్రమే మొక్కల్లో నిద్రాణమైపోయిన కొన్ని ఎంజైమ్‌లను మళ్లీ చైతన్యవంతం చేయడం ద్వారా ఆకుల నుంచి మరింత ఎక్కువ ఇంధనాన్ని తయారుచేయవచ్చునని వీరు గుర్తించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము ఆకుల్లా పనిచేసే ఒక యంత్రాన్ని తయారుచేశామని సూర్యుడి వెలుతురులోని ఎరుపు, నీలి రంగులను మాత్రమే శోషించుకునే హైడ్రోజనేస్ ఎంజైమ్‌ను వాడటం ద్వారా తాము మంచి ఫలితాలు సాధించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కటర్జైనా సోక్ చెబుతున్నారు. నాచుమొక్కల్లో ఉండే ఈ హైడ్రోజనేస్ ఎంజైమ్ కాంతి కిరణాల్లోని ప్రోటాన్లను హైడ్రోజన్‌గా మారుస్తుందని ఆమె వివరించారు. ఈ ఎంజైమ్‌ను యంత్రంలో ఉపయోగించినప్పుడు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టడం చాలా సులువైందన్నారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ యంత్రం పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశముందని, అన్ని రకాల కాంతులతోనూ పనిచేసేలా చేస్తే ఇంధనంగా ఉపయోగపడే హైడ్రోజన్‌ను మరింత ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు. భవిష్యత్తులో దీన్ని సోలార్ ప్యానెల్స్‌లోనూ వాడవచ్చునని అన్నారు. -
రైతులకు ప్రేమతో..!
పలమనేరు :తన ప్రయోగాల ద్వారా ఎంతోపేరుప్రఖ్యాతలు గడించిన గ్రామీణశాస్త్రవేత్త పవన్ మరో వినూత్నప్రయోగాన్ని చేపట్టాడు. చీడపీడలనివారణకు క్రిమి సంహారక మందులను కొట్టే స్ప్రేయర్‌ను సోలార్‌తో పనిచేసేలా తయారుచేశాడు. పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్ ఇప్పటికే వందకు పైగా ప్రయోగాలు చేసి ప్రజలకుఅవసరమైన కొత్త వస్తువులను తయారు చేశాడు. కేవలంఏడో తరగతి చదువుకున్న ఇతడుకొత్త ఆవిష్కరణల ద్వారాకీర్తి గడిస్తున్నాడు. తండ్రి కష్టం చూసి.. పలమనేరుకు చెందిన పవన్ సోలార్ స్ప్రేయర్లు తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకుంటు న్నాడు. ఇతని తండ్రి సుబ్బన్న టమాట, మునగ, బీర తదితర పంటలను సాగుచేస్తున్నాడు. ఈ పంటలకు క్రిమి సంహార మందులను పిచికారీ చేయాలంటే కాలుతో తొక్కే స్ప్రేయర్లను వాడేవారు. దీనికోసం ఒకరు స్పేయర్లను కాలితో తొక్కాలి, ఇంకొకరు పైపును పట్టుకోవాలి, మరొకరు స్ప్రే చేయాలి. ఒకరు నీటిని తీసుకురావాలి. సొంత కుటుంబీకులుంటే పర్వాలేదుగానీ కూలీలతో సేద్యం చేసేవారికి ఈ పని చేయాలంటే నలుగురు కూలీల అవసరం పడుతుంది. ఇందుకోసం కూలీకి రూ.300 చొప్పున రూ.1200 ఇవ్వాల్సిందే. మరికొన్నాళ్లకు చేతితో ప్రెస్‌చేస్తూ మందును పిచికారీ చేసే స్ప్రేయర్లు వచ్చాయి. ఇది వాడేవారికి ఓ వైపు చేయి విపరీతంగా నొప్పి వస్తుంది. ఆపై పెట్రోలుతో నడిచే స్ప్రేయర్లు వచ్చాయి. దీని ఇంజిన్ చాలా బరువుగా ఉంటుంది. వీపుపై మోయడం భారంగా ఉంటుంది. పెట్రోలు ఖర్చు అదనం. ఆ తర్వాత ఎలక్ట్రిక్ చార్జింగ్‌తో నడిచే స్ప్రేయర్లు వచ్చాయి. వీటిధర ఎక్కువగా ఉండడంతో పేదరైతులకు కష్టసాధ్యమే. తన తండ్రి పడుతున్న కష్టాలను చూసిన పవన్ సోలార్‌తో పనిచేస్తూ ఎక్కువ బరువులేకుండా సౌకర్యవంతంగా ఉండే స్ప్రేయర్‌ను తయారు చేయాలనే తలంపుతో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశాడు. కేవలం రూ.1800తోనే.. 20లీటర్ల స్ప్రేయర్‌కు వెనుకవైపు ఓ సోలార్ ప్యానెల్‌ను అమర్చాడు. దీనికి ఓ కంట్రోల్ యూనిట్, స్ట్రక్చర్బోర్డు, ఆన్,ఆఫ్ స్విచ్ విత్ ఇండికేటర్స్ పెట్టాడు. రైతు పొలంలో తిరుగుతూ మందును పిచికారీ చేస్తుంటే వెనుకనున్న సోలార్ ఎండకు చార్జ్ అవుతూ ఉంటుంది. సోలార్ చార్జ్ ఫుల్ అవగానే మిగిలిన శక్తిని స్టోర్కూడా చేసుకుంటుంది. ఇందుకోసం ఆటోకట్ఆఫ్ను అమర్చాడు. చార్జింగ్ ఎంతఉందో తెలుసుకునేందుకు ఎరుపు, పచ్చ ఎల్ఈడీలను సెట్ చేశాడు. దీంతో పెట్రోలు, కరెంటుతో పనిలేకుండా సున్నా పెట్టుబడితో పని జరిగినట్టే. ఇప్పటికే స్ప్రేయర్లున్న వాటికి కేవలం రూ.1800 ఖర్చుతో దీన్ని అమర్చుతున్నాడు. రైతులకు అందుబాటులోకి తెస్తా పంటలకు మందు కొట్టడానికి మా నాన్న పడిన కష్టాలను ప్రత్యక్ష్యంగా చేశాను. సులభంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో వారం రోజుల్లో దీన్ని తయారుచేసి ప్రయోగాత్మకంగా చూశా. అన్ని సక్రమంగా పనిచేయడంతో ఓ యంత్రాన్ని మా తండ్రికిచ్చా. ఇప్పుడు ఆయన చాలా తేలిగ్గా తోటకు క్రిమిసంహాకర మందును పిచికారీ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వీటని ప్రతిరైతుకు అందుబాటులోకి తేవాలన్నదే నా లక్ష్యం. ఇందుకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే రైతులు నా సెల్ నెం: 9959845143కు సంప్రదించవచ్చు.–పవన్, గ్రామీణశాస్త్రవేత్త,మొరం, పలమనేరు -
3రోజులు ఆలస్యంగా కొచ్చి ఎయిర్పోర్ట్ సేవలు
సాక్షి, కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో నీటమునిగిన కొచ్చి విమాశ్రయం మూడు రోజులు ఆలస్యంగా తన సేవలను ప్రారంభించనుంది. ముందు ప్రకటించినట్టుగా ఆగస్టు 26నుంచి కాకుండా 29వ తేదీ నుంచి పూర్తి స్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో జరిగిన సమీక్షా సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్ధకు జరిగిన నష్టంపై చర్చించారు. కేరళలోవరద పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ విమాన సేవలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాజా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొచ్చి విమానాశ్రయం సోలార్ పవర్ మీద నడుస్తుంది. అధికారులు విమానాశ్రయం నుంచి వరద నీటిని తొలగించినప్పటికీ, విమానాశ్రయం లోపల భారీ వరదలకారణంగా సౌర ఫలకాలు బాగా దెబ్బతిన్నాయి. సుమారు 800 రన్‌వే లైట్లు మరమ్మతు చేయాలి, 2,600 మీటర్ల పొడవు గోడల పునర్నిర్మించటం అవసరం. దాదాపు 90శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులే వరద బాధితులు, వారందరూ వాళ్ల ఇళ్లలో చిక్కుకుపోయారు. మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం అందించలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి తమ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇతర సదుపాయాలు, కేటరింగ్ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్ పోర్టు కేరళ వరదలతో రూ.220 కోట్లు నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేశారు. కొచ్చి విమానాశ్రయం ప్రపంచంలోనే మొట్టమొదటి సౌరశక్తి విద్యుత్ వ్యవస్థకు కలిగిన ఎయిర్ పోర్టు. వరదలతో దీనికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెరియార్ నదికి వరదల కారణంగా రన్‌వే, టాక్సీ బే, కస్టమ్స్ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టెర్మినల్స్ నీట మునిగాయి. రన్‌వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు నాశనమయ్యాయి. -
సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్‌పై 4 రోజుల శిక్షణ
సౌరశక్తితో పండ్లు, కూరగాయల శుద్ధిపై రైతులు, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సొసైటీ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) స్వచ్ఛంద సంస్థ 4 రోజుల శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్ 4–7 తేదీల్లో శిక్షణ ఇస్తారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్., పి.జె.టి.ఎస్.ఎ.యు., ‘సీడ్’ నిపుణులు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 040–23608892, 23546036, 96526 87495 -
సూర్యుడిని ముద్దాడే దిశగా..
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో అందని ద్రాక్షలా ఊరిస్తున్న అద్భుత ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించింది. దశాబ్దాలుగా అసాధ్యమైన కలగా మిగిలిన సూర్యుడిపై ప్రయోగాన్ని ‘పార్కర్ సోలార్ ప్రోబ్’వ్యోమనౌకతో సుసాధ్యం చేసింది. కేప్ కెనెవెరాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి డెల్టా–4 హెవీ రాకెట్ సహాయంతో నిప్పులు విరజిమ్ముతూ సూర్యుడిని ముద్దాడేందుకు వ్యోమనౌక బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.01 గంటలకు నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా అనుకున్న ప్రకారం శనివారమే ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా.. పలు సాంకేతిక వైఫల్యాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. సుమారు లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ మిషన్ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. సూర్యుడి వాతావరణాన్ని స్పృశించి అక్కడి రహస్యాల గుట్టు విప్పేందుకు ప్రారంభమైన ఈ ప్రయోగం అనేక ఆటంకాలను ఎదుర్కొని చివరికి గమ్యస్థానం దిశగా సాగింది. ఉష్ణకవచం లేకుంటే.. ప్రయోగమే లేదు.. అన్ని అంతరిక్ష ప్రయోగాలు ఒక ఎత్తు అయితే.. సూర్యుడిపై ప్రయోగం చేపట్టడం మరో ఎత్తు. సూర్యుడి వాతావరణంలో ఉండే అధిక వేడిని తట్టు కుని ప్రయోగాలు చేపట్టడం శాస్త్రవేత్తలకు కొరకరాని కొయ్యగా ఉంది. అయితే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఉష్ణ కవచమే ఈ ప్రయోగానికి బాటలు వేసింది. పార్కర్ ముందు భాగంలో అమర్చిన ఈ ఉష్ణ కవచం 8 అడుగుల వ్యాసం, నాలుగున్నర అంగుళాల మందమున్న కార్బన్ మిశ్రమ లోహంతో తయారైంది. దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలగడం దీని ప్రత్యేకత. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే çసూర్యుడి ఉపరితలంలో 5,500 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయి. కరోనాలో అంతకన్నా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. దీనిపైనే పార్కర్ ప్రోబ్ ప్రధానంగా దృష్టిపెట్టనుంది. సూర్యుడికి ఎంత దగ్గర.. సోలార్ ప్రోబ్ మిషన్ 2024 డిసెంబర్ 19 నాటికి తొలిసారి సూర్యుడికి సుమారు 60 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వెళ్లనుంది. 60 లక్షల కిలోమీటర్లు అనేది చూడటానికి చాలా పెద్ద దూరంలా కనిపిస్తున్నా.. ఇదేమీ అంత దూరం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నుంచి సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరం. దీనికోసం వారు ఓ నమూనాను వివరిస్తున్నారు. ఉదాహరణకు భూమి, సూర్యుడి మధ్య దూరం ఒక మీటర్ ఉందనుకుంటే.. సోలార్ ప్రోబ్ మిషన్‌కు సూర్యుడికి మధ్య దూరం 4 సెంటీమీటర్లు మాత్రమేనని చెబుతున్నారు. ముందు ఏం ఉందో చూద్దాం.. సూర్యుడి వాతావరణంపై పరిశోధనలు చేసిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యూజీన్ పార్కర్(91) గౌరవార్థం ఈ నౌకకు పార్కర్ సోలార్ ప్రోబ్ అని పేరు పెట్టారు. 1958లోనే పార్కర్ సౌర గాలుల ఉనికిని గుర్తించారు.అందుకే నాసా తొలిసారి తన మిషన్‌కు జీవించి ఉన్న ఓ వ్యక్తి పేరు పెట్టింది. వ్యోమనౌకలో పార్కర్ రాసిన ‘ముందు ఏం ఉందో చూద్దాం’ అనే సందేశాన్ని పంపారు. అలాగే 1.1 మిలియన్ల పేర్లున్న మెమరీ చిప్‌ను కూడా పంపారు. ప్రోబ్ ప్రత్యేకతలు.. ఈ సోలార్ ప్రోబ్ మిషన్ బరువు సుమారు టన్ను ఉంటుంది. పార్కర్ 7 సంవత్సరాల పాటూ అంతరిక్షంలో ప్రయాణించనుంది. పార్కర్ ప్రోబ్ గంటకు 6 లక్షల 90 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ప్రతి 88 నుంచి 150 రోజులకు ఒకసారి భ్రమణాన్ని పూర్తి చేస్తూ కరోనాను తాకుతుంది. సూర్యుడి బాహ్యవలయమైన కరో నా కాంతి వలయంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కరోనాలో సూర్యుడి నుంచి వెలువడే వేడి అధికంగా ఉంటుంది. కరోనాలో తరచుగా సౌర తుపానులు ఏర్పడతాయి. ఇవి భూమిని తాకితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో సౌర తుపాన్లు ఎలా ఏర్పడతాయి, వాటి వేగం పెరుగుదల.. లాంటి శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలకు దీని ద్వారా సమాధానం లభించే అవకాశం ఉంది. ఈ సమాచారం ఆధారంగా సౌర తుపాన్ల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషించనున్నారు. -
నేడే సోలార్ మిషన్
టాంపా: భగభగ మండే సూర్యుడి ఆవరణం గుట్టువిప్పే తొలి అంతరిక్ష ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. పార్కర్ సోలార్ ప్రోబ్ అనే భారీ వాహక నౌకను నింగిలోకి పంపేందుకు నాసా పూర్తి ఏర్పాట్లు చేసింది. శనివారం వేకువజామున ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం ప్రారంభమైంది. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా పొర రహస్యాలను ఛేదించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని నాసా ప్రకటించింది. సౌర పవనాల్లో ఏర్పడే అలజడులు భూమిపై ఎప్పుడు, ఎలా ప్రభావం చూపుతాయో అంచనావేయడానికి ఈ ప్రయోగం దోహదపడుతుందని తెలిపింది. సూర్యుడికి సమీపంగా వెళ్లిన తరువాత పార్కర్ గంటకు 7 లక్షల కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. -
సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్‌పై 4 రోజుల శిక్షణ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లలో 25%, కూరగాయల్లో 30% వరకు వినియోగదారులకు చేరకముందే కుళ్లిపోయి వృథా అవుతున్నాయి. ఈ దుస్థితిని నివారించాలంటే పండ్లు, కూరగాయలను శుద్ధి చేసి, తదనంతరం వినియోగించే రూపంలోకి మార్చాలి. ఈ నేపథ్యంలో సౌరశక్తితో పండ్లు, కూరగాయల శుద్ధిపై రైతులు, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సొసైటీ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) స్వచ్ఛంద సంస్థ 4 రోజుల శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్ 4–7 తేదీల్లో శిక్షణ ఇస్తారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్., పి.జె.టి.ఎస్.ఎ.యు., ‘సీడ్’ నిపుణులు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 040–23608892, 23546036, 96526 87495 -
సోలార్, విండ్ పవర్ రంగాల్లో 3 లక్షల ఉద్యోగాలు!
సాక్షి, న్యూఢిల్లీ: సోలార్, విండ్ పవర్ రంగాల్లో 2022 నాటికి దేశంలో 3 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి ఆర్.కె.సింగ్ మంగళవారం రాజ్య సభలో చెప్పారు. దేశంలో 2022 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ రంగం 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, దేశంలో సోలార్ ఎనర్జీ రంగం స్థిరంగా పురోగతి సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోందని వివరించారు. ప్రభుత్వం సైతం సోలార్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే సోలార్ ఎనర్జీ రంగంలోకి దిగుతున్న కంపెనీలకు అతి తక్కువ జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీలో రాయితీలు, పదేళ్ళపాటు ఆదాయ పన్ను మినహాయింపు, వయబులిటీ గ్యాప్ ఫండింగ్ వంటి పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే సోలార్ పార్క్‌ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ల ఏర్పాటు, సువిశాలమైన ప్రభుత్వ భవనాలు, సముదాయాలలో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ కలిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు మాత్రమే ఇంటి రుణాలు ఇచ్చే నిబంధన ఈ చర్యలలో భాగమే అని మంత్రి అభివర్ణించారు. -
ఆలియాభట్ చొరవతో వెలుగులు
మండ్య: బాలీవుడ్ యువ హీరోయిన్ ఆలియా భట్ మండ్య జిల్లాలోని కిక్కేరి గ్రామప్రజల ఇళ్లల్లో విద్యుత్ కాంతులు వెలగడానికి కారణమయ్యారు. బెంగళూరులోని ఒక సంస్థ ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన కొత్త బాటిళ్లను విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో విద్యుత్ సౌకర్యం లేని పేదలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ఉపకరణాలను అందిస్తోంది. ఈ క్రమంలో పేదల ఇళ్లల్లో విద్యుత్ కాంతులు వెలిగించే కార్యానికి సహకరించాలంటూ సంస్థ ప్రతినిధులు ఆలియాభట్‌ను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆలియాభట్ కొద్ది రోజుల క్రితం తమ దుస్తులు వేలం వేయడం ద్వారా వచ్చిన నిధులను సంస్థకు అందించింది. అలియా అందించిన నిధులతో సంస్థ ప్రతినిధులు మండ్య జిల్లా కిక్కెరి గ్రామంలో 40 మంది పేదలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ఉపకరణాలు అందించారు. -
భ్రమా..? బ్రహ్మా..?
సమస్త చరాచర జగత్తంతా బ్రహ్మ సృష్టేనని అంటారు.మనం నివసిస్తున్న భూగోళమే మనకు తెలిసిన బ్రహ్మాండం.సృష్టిలో ఇదొక్కటే బ్రహ్మాండమా? మరో నాలుగువేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయా? విశాల విశ్వంలో ఎన్నో సౌర కుటుంబాలు ఉంటే అక్కడ మనలాంటి కుటుంబాలు ఉండవా? భూమిని మింగిన మానవుడు ఆ నింగినిమింగక మానేస్తాడా? మనకు తెలిసిన సృష్టి మాత్రమేనా? మిగిలినదంతా మనిషి సృష్టేనా? ఎన్నో నిజాలను ఛేదించిన మానవుడు అన్నే అబద్ధాలనూఅల్లాడుగా! మన నింగి అవతల జీవం ఉందా? బ్రహ్మ సృష్టిలో అది కూడా ఒక మాయా? లేక అంతా మన భ్రమా? మనం నివసించే భూమికి వెలుపల మరింకెక్కడైనా జీవం ఉందా..? ఉంటే, ఎక్కడ ఉంది? ఎలా ఉంది? జీవం ఉన్నత ఇతరేతర గ్రహాలకు వెళ్లి భూమ్మీది మనుషులు మనుగడ సాగించగలరా..? చాలాకాలంగా ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి శతాబ్దాలుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. భూమికి వెలుపల గ్రహాలపై జీవానికి సంబంధించి ఇప్పటివరకు లభించినవల్లా చిన్నచిన్న ఆధారాలు మాత్రమే! సౌర కుటుంబానికి వెలుపల ఎక్కడో ఒకచోట గ్రహాంతరవాసులు ఉండవచ్చని, వారు మనకంటే తెలివైన వారై ఉంటారని సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డాడు. విశాల విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఒకటి కాదు, రెండు కాదు కోటాను కోట్లుగా ఉన్నాయి. ‘కెప్లర్ స్పేస్ మిషన్’ 2013లో వెల్లడించిన నివేదిక ప్రకారం భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఏకంగా 4 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇవన్నీ సూర్యుని వంటి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి. భూమిని పోలిన ఈ గ్రహాలపై ఎక్కడో ఒక చోట జీవజాలం మనుగడ సాగిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తల ఊహ. గ్రహాంతర జీవుల ఉనికిని ఆధునిక శాస్త్రవేత్తలెవరూ కొట్టిపారేయడం లేదు. భూమికి వెలుపల– ఇంకా చెప్పాలంటే మన సౌరకుటుంబానికి వెలుపల ఉన్న కొన్ని గ్రహాలపై జీవులు ఉండవచ్చని, ఆ జీవుల్లో మనుషులను పోలిన తెలివితేటలు గల జీవులు కూడా ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంత రిక్షంలో అక్కడక్కడా గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ) కనిపించినా, గ్రహాంతర వాసులు భూమిపైకి లేదా కనీసం భూమి పరిసరాల్లోకి వచ్చారనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు. అలుపెరుగని అన్వేషణ భూమికి ఆవల జీవం కోసం శాస్త్రవేత్తలు అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అంగారకునిపై జరిపిన అన్వేషణల్లో కొన్ని ఆశాజనకమైన ఫలితాలు లభించాయి. అంగారకుని ఉపరితలం నుంచి సేకరించిన మట్టిలోని మూలకాలు, అక్కడ వ్యాపించి ఉన్న వాయువుల నమూనాలు సూక్ష్మజీవుల మనుగడకు సానుకూలంగా ఉన్నట్లు ‘నాసా’ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూమిపై రాలిపడ్డ గ్రహశకలాలను కూడా ‘నాసా’ శాస్త్రవేత్తలు నిశితంగా పరీక్షించారు. వీటి కణాల్లో జీవానికి కీలకమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ నిర్మాణాలను గుర్తించారు. దీని ఆధారంగా భూమ్మీద పడిన అంతరిక్ష ధూళి నుంచి ఇక్కడ జీవం ఆవిర్భవించి ఉండవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ‘నాసా’ శాస్త్రవేత్తలు 2011 నవంబర్‌లో ప్రయోగించిన ‘క్యూరియాసిటీ రోవర్’ 2012 ఆగస్టులో అంగారకుని ఉపరితలంపై ‘గేల్ కార్టర్’ ప్రాంతంలో దిగింది. అయితే, ఇది అంగారకునిపై జీవుల ఉనికిని మాత్రం కనుగొనలేకపోయింది. ఒకవైపు ‘నాసా’ తనవంతు ప్రయోగాలు, ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై జీవం ఉనికి కనుగొనే లక్ష్యంతో 2014లో న్యూయార్క్‌లోని కార్నెల్ వర్సిటీలో కార్ల్ సాగన్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ఈ సంస్థ రెండు భారీ టెలిస్కోప్‌ల సాయంతో సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై నెలకొన్న పరిస్థితులను తిలకించి, వాటిపై జీవం మనుగడకు ఉండే అవకాశాలపై పలు అంచనాలు వేసింది. ఇదిలా ఉంటే, భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో సౌరమండలాన్ని తలపించే నక్షత్ర వ్యవస్థలో ‘గ్లైకోలాల్డిహైడ్’ అనే చక్కెర అణువుల ఉనికిని కోపెన్‌హాగెన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవకణాల నిర్మాణంలో కీలకమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏల్లో కీలకమైనవి ఈ చక్కెర అణువులే కావడంతో అక్కడ జీవుల ఉనికి ఉండవచ్చనే అంచనాకు వచ్చారు. భూమిలాంటి మరికొన్ని గ్రహాలు సౌరకుటుంబానికి వెలుపల భూమిలాంటి గ్రహాల కోసం శాస్త్రవేత్తలు చిరకాలంగా అన్వేషణ సాగిస్తూ వస్తున్నారు. శక్తిమంతమైన టెలిస్కోప్‌ల సాయంతో అంతరిక్షాన్ని తరచి తరచి చూస్తూ వస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా 1992 నుంచి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భూమిని సరిపోలిన 3,797 గ్రహాలను గుర్తించారు. అలాగే, సౌరకుటుంబం తరహా 632 బహుళ గ్రహ వ్యవస్థలను గుర్తించారు. ఈ గ్రహాలపై తగినంత పరిమాణంలో ఆక్సిజన్ ఉన్నట్లయితే, వాటిపై జీవం మనుగడకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ వాటిపై ఆక్సిజన్ ఎంత ఉందనేది మాత్రం వారు అంచనా వేయలేకపోతున్నారు. భూమిలాంటి గ్రహాలు మరికొన్ని ఉంటాయని, వాటిపై సాధారణ జీవజాలంతో పాటు మనుషులను పోలిన తెలివైన జీవులు కూడా ఉంటారని శతాబ్దాల నాటి నుంచి కొందరు తత్వవేత్తలు నమ్ముతూ వస్తున్నారు. ఫ్రెంచి తత్వవేత్త బెర్నార్డ్ లె బొవియర్ డి ఫాంటినెల్, ఇంగ్లిష్ వైద్యుడు, తత్వవేత్త జాన్ లాకె, ఫ్రెంచి ఖగోళవేత్త నికోలస్ కామిల్ ఫ్లెమారియన్ వంటి వారు సౌరకుటుంబానికి వెలుపల ఇదే తరహా గ్రహ వ్యవస్థలు ఉంటాయని, వాటిలోనూ భూమిలాంటి గ్రహాలు ఉంటాయని, ఆ గ్రహాలపై జీవజాలం ఉంటుందనే విశ్వాసాన్ని తమ రచనల్లో ప్రకటించారు. పద్దెనిమిదో శతాబ్దిలో యురేనస్‌ను కనుగొన్న విలియమ్ హెర్షెల్ సహా ఆయన సమకాలికులైన ఖగోళవేత్తలు పలువురు సౌరకుటుంబంలో గ్రహాంతరవాసులు ఉంటారని నమ్మేవారు. అద్భుతాలకు ఆలవాలం అంతు చిక్కని అంతరిక్షం అంతులేని అద్భుతాలకు ఆలవాలం. ఆది నుంచి ఆకాశాన్ని చూసినప్పుడల్లా మానవుడు అబ్బురపడుతూనే ఉండేవాడు. పగటి వేళ తూర్పున ఉదయించే సూర్యుడు మధ్యాహ్నం నడినెత్తికి చేరుకుని, పశ్చిమాన అస్తమించడం, సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి అలముకున్నాక ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ లెక్కించలేనన్ని నక్షత్రాలు, నక్షత్రాల సరసనే కనిపించే నెలవంక దినదినాభివృద్ధి చెంది, పున్నమి నాటికి నిండుగా కనువిందు చేయడం, అలాగే క్రమ క్రమంగా క్షీణించి అమావాస్య నాటికి అసలే కనిపించకుండా పోవడం వంటి క్రమం తప్పని దృశ్యాలు, కాలంతో మారే రుతువులు, అప్పుడప్పుడు వచ్చే గ్రహణాలు మనుషుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కొందరు ఆలోచనాపరులు వీటి కారణాలను అన్వేషించడం ప్రారంభించారు. అంతరిక్ష అద్భుతాలపై అన్వేషణ క్రీస్తుపూర్వం నాలుగు వేల ఏళ్ల నాడే మొదలైంది. గ్రహణాలను లెక్కించడమే తొలి పురోగతి అంతరిక్ష పరిశీలనతో గ్రహణాలను కచ్చితంగా లెక్కించడమే ఖగోళ శాస్త్రంలోని తొలి పురోగతి. క్రీస్తుపూర్వం నాలుగువేల ఏళ్ల కిందట చైనా జ్యోతిషులు ఈ ఘనతను సాధించారు. క్రీస్తుపూర్వం 2698–2598 మధ్య కాలంలో హ్వాంగ్ టే అనే చైనా చక్రవర్తి అబ్జర్వేటరీని నిర్మించాడు. అప్పటి వారికి సూర్య చంద్రులతో పాటు బుధ, శుక్ర, అంగారక, గురు, శని గ్రహాల గురించి తెలుసు. క్రీస్తుపూర్వం 2449లో సంభవించిన పంచగ్రహ కూటమిని వారు రికార్డు చేశారు. ప్రాచీన ఖగోళ శాస్త్రానికి ఆద్యులు బాబిలోనియా ప్రాంతానికి చెందిన కాల్డియన్లు, ఈజిప్షియన్లు అని గ్రీకు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కాల్డియన్లు పెద్ద పెద్ద సిద్ధాంతాలను ప్రతిపాదించకపోయినా, శతాబ్దాల తరబడి ఆకాశాన్ని నిశితంగా పరిశీలించి కొన్ని కీలకమైన విషయాలను కనుగొన్నారు. భూమి తనలో తాను తిరిగే వేగం ఆధారంగా ప్రతి 18 సంవత్సరాల 11 రోజుల వ్యవధిలో 235 చాంద్రమాసాలు వస్తాయి. ఈ వ్యవధిలో ఏర్పడిన గ్రహణాలను గుర్తు పెట్టుకుని, మళ్లీ వచ్చే 235 చాంద్రమాసాలలో అవే గ్రహణాలు పునరావృతం అవుతాయని కనిపెట్టారు. కాల్డియన్లు రికార్డు చేసిన గ్రహణ సమయాలలో తేడాను డాక్టర్ జె.కె.ఫాదరింగ్ హామ్ అనే ఆధునిక శాస్త్రవేత్త సవరించాడు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలోని సూక్ష్మమైన తగ్గుదల, ఫలితంగా రోజు కాల పరిమితిలో ఏర్పడ్డ పెరుగుదలను గుర్తించి, ఆయన గ్రహణ సమయాలను మరింత నిక్కచ్చిగా సూచించాడు. వేదాలలో ఖగోళ విజ్ఞానం ప్రపంచంలో ప్రాచీన నాగరికతలు విలసిల్లిన కాలంలోనే భారతదేశంలో వేదాలు ఉనికిలో ఉన్నాయి. వేదాలు ఏ కాలానికి చెందినవనే విషయమై కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే, మన వేదాలలో ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన అనేక శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా రుగ్వేదంలో రాశిచక్ర వర్ణన ఉంది. ‘‘పన్నెండు ఆకులు గల కాలచక్రం గగనంలో తిరుగుతోంది. ఆ చక్రం మీద 720 మిథునాలు ఉన్నాయి.’’ అనే వర్ణన రుగ్వేద శ్లోకాల్లో ఉంది. భగవద్గీతలో విశ్వరూపాన్ని వర్ణించే శ్లోకాలు ఉన్నాయి. ఆది మధ్యాంతాలు లేని భూ గగన దిగంతరమంతా విశ్వరూపంలో సాక్షాత్కరిస్తుందని, సమస్త చరాచర ప్రపంచం దానిలో ఏకకాలంలో కనిపిస్తుందని వర్ణించాడు గీతకారుడు. మరే దేశపు ప్రాచీన సాహిత్యంలోనూ అనంత విశ్వం గురించి ఇలాంటి కవితాత్మక వర్ణన కనిపించదు. భారతీయ ఖగోళ విజ్ఞానానికి మూలగ్రంథం ‘సూర్య సిద్ధాంతం’. ఇది పూర్తిగా దొరకలేదు. శిథిలమైన లిఖిత ప్రతులు మాత్రమే దొరికాయి. దీని కర్త ఎవరో, రచనా కాలమేదో తెలియదు. సూర్యుడు మయుడికి ఉపదేశించిన సిద్ధాంతమే ఈ గ్రంథం అని సంప్రదాయవాదులు భావిస్తారు. ‘సూర్యసిద్ధాంతం’ గ్రంథంలో దొరికిన భాగాలలోని విషయాల ప్రకారం భూమి వ్యాసం 1600 యోజనాలు. యోజనం అంటే 4.9 మైళ్లు. ఈ లెక్కన ‘సూర్యసిద్ధాంతం’ ప్రకారం భూమి వ్యాసం 7,849 మైళ్లు. ఇది నేటి లెక్కకు దాదాపు దగ్గరగానే ఉంది. ఆధునిక పరిశోధనల ప్రకారం భూమధ్యరేఖ వద్ద భూమి వ్యాసం 7,917, 5 మైళ్లు. భూమి నుంచి చంద్రునికి గల దూరం 51,566 యోజనాలుగా (2.53 లక్షల మైళ్లు) లెక్కగట్టింది ‘సూర్యసిద్ధాంతం’. ఇది కూడా ఆధునిక లెక్కలకు దగ్గరగానే ఉంది. ఆధునిక పరిశోధనల ప్రకారం ఈ దూరం 2,38,900 మైళ్లు. ‘సూర్యసిద్ధాంతం’ రచించిన నాటికి టెలిస్కోప్ వంటి పరికరాలేవీ అందుబాటులో లేవు. ఏ పద్ధతిలో ఈ లెక్కలను గుణించారో కూడా తెలియదు. ‘సూర్యసిద్ధాంతం’ తర్వాత భారతదేశం నుంచి వెలుగులోకి వచ్చిన గొప్ప ఖగోళ శాస్త్ర గ్రంథం ‘ఆర్యభట్టీయం’. దీనిని క్రీస్తుశకం 476 ప్రాంతానికి చెందిన ఆర్యభట్టు రచించాడు. కాలాన్ని లెక్కించేందుకు జలగడియారం, ఛత్రయంత్రం వంటి పరికరాలను కనుగొన్నాడు. భూభ్రమణ వేగాన్ని, రోజు వ్యవధిని, గ్రహణ కాలాలను నిర్దుష్టంగా లెక్కగట్టాడు. గ్రహణాలు ఛాయల ప్రభావం వల్ల ఏర్పడతాయని తేల్చిచెప్పాడు. ఆర్యభట్టు తర్వాత మొదటి భాస్కరాచార్యుడు, వరాహ మిహిరుడు, రెండవ భాస్కరాచార్యుడు ఖగోళ, గణిత, జ్యోతిష శాస్త్రాల్లో గణనీయమైన కృషి చేశారు. కోపర్నికస్ కంటే ముందే... సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని ప్రపంచానికి ముందుగా చెప్పిన శాస్త్రవేత్త కోపర్నికస్ అనే చాలామంది నమ్ముతారు. నిజానికి ఈ విషయాన్ని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త అరిస్టార్కస్ లోకానికి వెల్లడించాడు. భూమి నుంచి సూర్య చంద్రుల దూరాలను లెక్కించడానికి అతడు చాలా ప్రయత్నాలు చేశాడు. అరిస్టార్కస్ సమకాలీనులు, అతడి తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిన శాస్త్రవేత్తలు అతడి సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. ప్రాచీన గ్రీకు ఖగోళ చరిత్రలో చిట్టచివరి ప్రసిద్ధుడైన టాలెమీ భూ కేంద్ర సిద్ధాంతాన్ని పునరుద్ధరించాడు. విశ్వానికి భూమి కేంద్రంగా ఉందనే వాదాన్ని బలంగా వినిపించాడు. దాంతో అరిస్టార్కస్ సిద్ధాంతం పూర్తిగా మరుగునపడింది. నవీనయుగ ప్రారంభంలో క్రీస్తుశకం పదిహేనో శతాబ్దికి చెందిన పోలిష్ శాస్త్రవేత్త కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదనే వాదాన్ని పునరుద్ధరించాడు. కోపర్నికస్ సిద్ధాంతంతో ఖగోళశాస్త్రంలో పురోగమనం మొదలైంది. కోపర్నికస్‌కు శతాబ్దం తర్వాతి వాడైన గెలీలియో టెలిస్కోప్‌ను కనుగొనడంతో ఖగోళ శాస్త్ర పురోగమనం మరింతగా ఊపందుకుంది. గెలీలియో కనుగొన్న టెలిస్కోప్ సాయంతో నాటి శాస్త్రవేత్తలు శుక్ర గ్రహం గమనాన్ని, గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను భౌతికంగా చూడగలిగారు. అంతరిక్షంలోనూ వ్యాపారం గ్రహాంతర జీవుల ఉనికి గురించి కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, కొందరు తెలివైన మనుషులు అంతరిక్షంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. వ్యాపారం అంతరిక్షానికి సంబంధించినదే అయినా వారి లావాదేవీలు సాగేది మాత్రం ఈ భూమ్మీదనే. చంద్రుడి మీద మనిషి కాలు మోపిన తర్వాత అతితెలివి వ్యాపారులకు కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగి, ఏకంగా చంద్రుడిపై స్థలాలను ఎడాపెడా అమ్మడం మొదలుపెట్టారు. భూమికి వెలుపల ఉండే గ్రహాలపై ఉన్న స్థలాలను ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోజాలరంటూ 1979లో ఐక్యరాజ్య సమితి చొరవతో ‘ఇంటర్నేషనల్ మూన్ ట్రీటీ’ అమలులోకి వచ్చినా, చాలా దేశాలు దానికి ఆమోదం తెలపలేదు. ఇదే అదనుగా కొందరు చంద్రునిపై స్థలాల అమ్మకాలను ప్రారంభించారు. ఇప్పుడైతే వ్యవహారమంతా ఆన్లైన్లోనే సాగిస్తున్నారు. చంద్రుడిపై ఎకరా స్థలాన్ని 30 డాలర్లకే (రూ.2,067) విక్రయిస్తూ, భలే మంచి చౌకబేరము... అనే రీతిలో ఊరిస్తున్నారు. భూమ్మీద ఎడారి ప్రదేశాల్లో సైతం ఇంత చౌకగా స్థలాలు దొరికే వీలు లేకపోవడంతో కొందరు ఎందుకైనా పనికొస్తుందనే ఉద్దేశంతో చంద్రునిపై స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. అంతరిక్షంలోని గ్రహాంతర స్థలాలను సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఈనాటిది కాదు. జగజ్జేతగా చరిత్రకెక్కిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కూడా అంతరిక్షాన్ని సొంతం చేసుకోవాలని తలచాడు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన ప్రష్యా రాజు ఫ్రెడెరిక్ తన జబ్బును నయం చేసిన జుర్గెన్ అనే వైద్యుడికి చంద్రుడిని రాసిచ్చేశాడు. జుర్గెన్ వారసుల్లో ఒకరు చంద్రుడిపై వారసత్వ హక్కుల కోసం 1996లో కోర్టుకెక్కడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడక్కడా కొందరు విచిత్రమైన వ్యక్తులు చంద్రుడిపైనే కాదు, ఇతరేతర గ్రహాలపై హక్కులు తమవేనంటూ కోర్టులకెక్కిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి తలతిక్క మనుషుల వల్ల సీరియస్‌గా అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు, పరిశోధన సంస్థలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ‘నాసా’ అంగారకుడిపైకి ‘క్యూరియాసిటీ రోవర్’ పంపడంతో, యెమెన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ‘నాసా’పై కేసు వేశారు. అంగారక గ్రహం మూడువేల ఏళ్ల కిందటే పూర్వీకుల నుంచి తమ వంశానికి సంక్రమించిందని, తమ అనుమతి లేకుండా ‘నాసా’ అంగారక గ్రహంపై చొరబాటుకు తెగబడిందని, అందువల్ల ‘నాసా’ తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ వాదించారు. ఈ కేసు వల్ల ‘నాసా’కు, కోర్టుకు కాలహరణం తప్ప ఒరిగిందేమీ లేదు. అంతరిక్షంపై హక్కుల కోసం మనుషులు నానా తంటాలు పడుతుండటం ఒక ఎత్తయితే, సమీప భవిష్యత్తులోనే మనుషులు గ్రహాంతర వాసులను కలుసుకోగలుగుతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత శతాబ్ది ముగిసేలోగానే మనుషులు గ్రహాంతర జీవులను భౌతికంగా కలుసుకోగలరని, వారితో సంభాషణలు నెరపగలరని అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మిచియో కకు చెబుతున్నారు. ఒకవేళ ఆయన అంచనా ఫలిస్తే, ఇప్పటి తరం వాళ్లు విదేశీయానాలు చేస్తున్నంత తేలికగా మన తర్వాతి తరాల వాళ్లు గ్రహాంతర యానాలు చేయగలరేమో! · అంతరిక్ష అన్వేషణలో కొన్ని మైలురాళ్లు 1610 గెలీలియో టెలిస్కోప్ కనుగొన్నాడు. టెలిస్కోప్ సాయంతో గురు గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను, శుక్ర గ్రహ గమనాన్ని గుర్తించాడు. 1840 టెలిస్కోప్ సాయంతో చంద్రుని ఫొటోను స్పష్టంగా తీయగలిగారు. 1865 జూల్స్ వెర్న్ రాసిన ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’ నవల ప్రచురితమైంది. ఇది తర్వాతి కాలంలో అంతరిక్ష పరిశోధనలకు ఎంతగానో దోహదపడింది. 1924 రష్యాలో గ్రహాంతర యానాల సంఘం స్థాపన. 1946 అంతరిక్షం నుంచి భూగోళం ఫొటోలను తీయగలిగారు. 1947 తొలిసారిగా ప్రాణులను (ఈగలు) అంతరిక్షంలోకి పంపారు. 1951 తొలిసారిగా రెండు జాగిలాలను అంతరిక్షంలోకి పంపారు. 1961 తొలిసారిగా మానవుడు అంతరిక్షంలోకి వెళ్లాడు. ఈ ఘనత సాధించినది రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్. 1969 తొలిసారిగా మానవుడు చంద్రునిపై అడుగు మోపాడు. ఈ ఘనత అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు దక్కింది. 1971 అంతరిక్షంలో తొలి పరిశోధన కేంద్రాన్ని (శాల్యూట్–1) రష్యా ఏర్పాటు చేసింది. 1990 ‘నాసా’ తొలిసారిగా మొత్తం సౌర కుటుంబాన్ని ఫొటో తీయగలిగింది. 2011 ‘నాసా’ తొలిసారిగా అంగారకునిపైకి ‘క్యూరియాసిటీ రోవర్’ను విజయవంతంగా పంపింది. -
తెలుగు రాష్ట్రాల్లో బ్యాటరీ అసెంబ్లింగ్ యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ సెల్స్, బ్యాటరీల తయారీలో ఉన్న యూఎస్ కంపెనీ ట్రైటన్ సోలార్.. నిర్మాణ రంగంలో ఉన్న అరిడ హోమ్స్ భాగస్వామ్యంతో తెలుగు రాష్ట్రాల్లో లిథియం అయాన్ బ్యాటరీల అసెంబ్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో 2018 సెప్టెంబర్‌కల్లా ప్లాంటు సిద్ధం కానుంది. అలాగే హైదరాబాద్ సమీపంలో డిసెంబర్ నాటికి యూనిట్ రెడీ అవుతుందని అరిడ హోమ్స్ ఎండీ నాగార్జున్ జి.వి.రావు తెలిపారు. ట్రైటన్ సోలార్ ఫౌండర్ హిమాన్షు బి పటేల్, అరిడ ప్రతినిధి వెంకట్ తదితరులతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఒక్కో కేంద్రానికి రూ.600 కోట్లకుపైగా వెచ్చిస్తామన్నారు. యూఎస్‌లోని ట్రైటన్ తయారీ కేంద్రాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటామని తెలియజేశారు. పూర్తి తయారీ సైతం... దేశీయంగా బ్యాటరీలను పూర్తిగా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించామని నాగార్జున్ తెలిపారు. ‘తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో తయారీ కేంద్రం నెలకొల్పాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రభుత్వం తోడ్పాటునిస్తే ఈ ప్లాంటు ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుంది. అసెంబ్లింగ్ యూనిట్ల ద్వారా 1,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. భవిష్యత్తులో సోలార్ థిన్ ఫిల్మ్ తయారీని సైతం ఇక్కడ చేపడతాం. ఇందుకు మరో తయారీ కేంద్రం నెలకొల్పుతాం. ఇరు సంస్థలు చెరి సగం పెట్టుబడి పెడతాయి’ అని వివరించారు. 10 మెగావాట్ల సామర్థ్యం వరకు బ్యాటరీలను తయారు చేస్తున్నట్టు హిమాన్షు వెల్లడించారు. ఇవి తక్కువ బరువుతో విద్యుత్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తాయని చెప్పారు. -
అడవి పందులు, పక్షులను పారదోలే గాలిమర
అడవి పందులు, ఉడతలు, పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడానికి ఓ కౌలు రైతు గాలిమరను తయారు చేశారు. అంబడిపూడి శేషగిరిరావు బీకాం చదువుకొని జనరేటర్ల డీలర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం షాద్‌నగర్ మండలం కమ్మదనం గ్రామం వద్ద భూమిని కౌలుకు తీసుకొని కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేశారు. తొలి ఏడాది అడవి పందులు, ఇతర జంతువులు, ఉడతలు, పక్షుల వల్ల పూర్తిగా పంటను కోల్పోయారు. పంటలను కాపాడుకోవడానికి మార్గాలు అన్వేషించారు. నిరంతరం శబ్దం చేసే గాలిమరను తయారు చేసుకొని తన పొలంలో ఏర్పాటు చేసి విజయం సాధించారు. 90% శాతం మేరకు పంటను రక్షించుకోగలిగానని ఆయన తెలిపారు. 10–15 అడుగుల ఎత్తున సరివి బాదుకు ఈ గాలిమరను అమర్చాలి. గాలికి పంకా తిరుగుతూ స్టీలు పళ్లెంపై నిరంతరం శబ్దం చేస్తూ ఉంటుంది. దీనితో పగలు ఎకరంన్నర, రాత్రిపూట రెండెకరాల విస్తీర్ణంలోని పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీని ఖరీదు రూ. 1,800. ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్లో ఉంచడంతో దేశంలోని 12 రాష్ట్రాల నుంచి రైతులు ఇప్పటికే సుమారు వెయ్యి గాలిమరలను కొనుగోలు చేశారని తెలిపారు. ఇటీవల సంగారెడ్డి ‘ఆత్మ’ 5 గాలిమరలను కొనుగోలు చేసి రైతులకు అందించిందని శేషగిరిరావు తెలిపారు. కోస్తా జిల్లాల్లో ఆక్వా చెరువుల రైతులు కూడా దీనిపై వాడుతున్నారన్నారు. ఈ ఉత్సాహంతో శేషగిరిరావు సౌర విద్యుత్తుతో నడిచే మరో పరికరాన్ని తయారు చేశారు. అడవి జంతువులు, పక్షుల నుంచి 6–8 ఎకరాల్లో పంటలను ఈ పరికరం కాపాడగలుగుతుంది. విచిత్ర శబ్దాలు చేసే 8 రకాల బజర్లు ఇందులో అమర్చారు. ఒక్కో బజరు ఒక్కో ఎకరంలో అమర్చుకోవచ్చు. రైతు కూర్చున్న దగ్గర నుంచే బజర్లను ఆన్/ఆఫ్ చేయడానికి వీలుంది. రెండు సోలార్ లైట్లను కూడా వెలిగించుకోవచ్చు. దీని ధర రూ. 9 వేలు. ఏయే వేళల్లో శబ్దాలు చేయాల్సిందీ నిర్దేశించే టైమర్‌ను కూడా జోడించుకోవచ్చని, దానికి రూ. 2,500 అదనంగా ఖర్చవుతుందని శేషగిరిరావు(99486 61386) తెలిపారు. పేటెంట్‌కు ధరఖాస్తు చేయనున్నట్లు వివరించారు. -
ఆ ఊళ్లో రాత్రిళ్లు సూర్యుడు!
సాక్షి, సిద్దిపేట: జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో బంజేరుపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 124 కుటుంబాలు, 632 మంది జనాభా, 368 మంది ఓటర్లు ఉన్నారు. అంతా వ్యవసాయదారులే. ఈ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. అది ప్రతి ఇంటికీ సోలార్ లైట్లు ఉండటం విశేషం. విద్యుత్ కష్టాలతో విసిగి వేసారి.. మారుమూల గ్రామం బంజేరుపల్లి. నాలుగేళ్ల క్రితం విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి. చిన్న ఫ్యూజ్ పోయినా రాత్రంతా జాగారమే. ఇలా విద్యుత్ కష్టాలతోవిసిగివేసారినగ్రామస్తులకు నాబార్డు అధికారి రమేశ్.. ఒక రోజు గ్రామాన్ని పర్యటించి సౌర విద్యుత్ గురించి వివరించారు. నాబార్డు సబ్సిడీ, లబ్ధిదారులు చెల్లించాల్సిన డబ్బుల వివరాలు తెలియజేశారు. దీనికి గ్రామస్తులు సమ్మతించారు. ఫలితంగా 120 కుటుంబాలకు సౌర పలకలు బిగించారు. ఇంకేముంది గ్రామంలో ప్రతి ఇంట్లో సౌర వెలుగులు వచ్చాయి. నాబార్డు సహకారం.. ప్రభుత్వ సాయం.. సౌర విద్యుత్ అంటే పరికరాలు బిగించడానికి వేల రూపాయల ఖర్చుతో పాటు మరమ్మతులు చేయడం కష్టం. 500 యూనిట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు (నాలుగు ట్యూబ్‌లు, 5 ఫ్యాన్లు, కూలర్, టీవీ, ఫ్రిడ్జ్,వన్ హెచ్‌పీ మోటార్ మొదలైనవి వినియోగించేందుకు సరిపడా విద్యుత్) రూ.85,000 ఖర్చు అవుతుంది. అయితే, నాబార్డు చెల్లించే సబ్సిడీ 40 శాతం పోగా.. లబ్ధిదారుడు చెల్లించే వాటా కోసం స్థానిక బ్యాంకు నుంచి సులభ వాయిదాలతో రుణాలు ఇప్పించారు. మిగిలిన డిపాజిట్ కుటుంబానికి రూ.8,500 చొప్పున వసూలు చేశారు. వీటితో సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, వైరింగ్ తెచ్చి నాబార్డు అనుబంధ మెకానిక్‌లు బిగించారు. పిడుగుపాటు నుంచి రక్షణగా లైట్నింగ్ అరెస్టర్లు కూడా బిగించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు గ్రామస్తులను అభినందించారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నామమాత్రంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు.. ఊరంతా సౌర విద్యుత్ వినియోగించడంతో విద్యుత్ బిల్లులు నామ మాత్రంగానే చెల్లిస్తున్నారు. గ్రామం లో 120 గృహలకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, గతం లో నెలకు గ్రామం మొత్తానికి కలిపి రూ.25 వేలకుపైగా బిల్లులు చెల్లించేవారు. సోలార్ విద్యుత్‌కు సంబంధించి 2 నెలలకోసారి మినిమం చార్జీ కింద రూ.12 వేలు చెల్లిస్తే సరిపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో వీధి దీపాల కోసం 60 యూనిట్లు బిగించారు. వీటి నిర్వహణ గ్రామ పంచా యతీ చూసుకుంటోందని గ్రామస్తులు తెలిపారు. -
సోలార్ బాధితులకు పునరావాసం కల్పించాలి
సాక్షి, కల్లూరు : గని, శకునాల గ్రామాలకు చెందిన సోలార్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ డిమాండ్ చేశారు. సోమవారం శకునాలలో సోలార్ బాధిత కుటుంబాలతో ఏపీ రైతు సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామక్రిష్ణ మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ స్థాపనకు సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోర్టు ఆదేశించిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కూడా బాధితులకు అవార్డు పాస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే, అధికారుల ఒత్తిడితో గని, శకునాల గ్రామాల్లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న వారి నుంచి సంతకాల సేకరణ చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. బాధితులకు అందించే పునరావాసం ఎగ్గొంటేందుకే ఉన్నతాధికారులు పనిచేయడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధితులు చాంద్‌బాషా, శ్రీధర్, శేఖర్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆవెర’ సోలార్ చార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ టూ–వీలర్ల తయారీలో ఉన్న ఆవెర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మోటో కార్ప్ టెక్... సోలార్ ఆధారిత చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. సోలార్‌తో పనిచేసే చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. తొలి దశలో వైజాగ్, అమరావతి, తిరుపతిలో ఆగస్టు నాటికి 25 కేంద్రాలు రానున్నాయి. రెండవ దశలో 2019 మార్చికల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 75 సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్క హైదరాబాద్‌లోనే 50 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ‘ఆవెర’ ఫౌండర్ ఆకుల వెంకట రమణ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఒక్కో కేంద్రానికి రూ.10 లక్షల వరకు కంపెనీ వెచ్చిస్తోందన్నారు. సీఎంఆర్, ఎంవీఆర్, చందన షోరూంల వద్ద కూడా చార్జింగ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. కొద్దిపాటి స్థలంలో.. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 250 చదరపు అడుగుల విస్తీర్ణం సరిపోతుంది. ఆధునిక లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను వాడుతున్నారు. స్టేషన్లో 7 కిలోవాట్ వరకు విద్యుత్ స్టోర్ చేసుకోవచ్చు. ఒక గంటలో వాహనం చార్జింగ్ పూర్తవుతుంది. కంపెనీ సొంత స్టేషన్లలో ఆవెర వాహనాలకు ఉచితంగా చార్జింగ్ సౌకర్యం ఉంది. ఫ్రాంచైజీ విధానంలోనూ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఔత్సాహిక యువతకు కేంద్ర, రాష్ట్రాల నుంచి సబ్సిడీ అందించి వీటిని నెలకొల్పాలన్నది ఆలోచన. స్టేషన్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను నెట్ మీటరింగ్ విధానంలో గ్రిడ్‌కు అనుసంధానించి అదనపు ఆదాయం పొందవచ్చు. త్రీ–వీలర్ల తయారీలోకి.. ఆవెర ప్రస్తుతం అయిదు రకాల ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది. సబ్సిడీ పోను వాహనం ధర రూ.70–90 వేలు ఉంది. మోడల్‌ను బట్టి ఒక్కొక్కటి ఒకసారి చార్జింగ్ చేస్తే 140 నుంచి 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీ 10 ఏళ్లకు పైగా పనిచేస్తుంది. 1–2 కిలోవాట్ల విద్యుత్ ఈ బ్యాటరీల్లో నిల్వ అవుతుంది. వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లింగ్ ప్లాంటులో వాహనాలను తయారు చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని నున్న వద్ద 63 ఎకరాల్లో రూ.50 కోట్ల ప్రారంభ వ్యయంతో శాశ్వత ప్లాంటు నిర్మిస్తున్నట్టు వెంకట రమణ చెప్పారు. త్రీ–వీలర్ల తయారీలోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడించారు. నమూనా వాహనం రెడీ చేశామన్నారు. -
భలే ఉందే ఈ బిల్డింగ్..
ఈ భవనమే కాదు.. దీని వెనుక ఉన్న ఐడియా కూడా సూపర్. పైర్‌పాలో లాజరానీ అనే ఇటాలియన్ డిజైనర్ సముద్రంపై ఇలాంటి పిరమిడ్ ఆకారపు ఇళ్లు, నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదిస్తున్నాడు. ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పంటలు పండే గ్రీన్‌హౌస్‌లు, హోటళ్లు, సినిమాలు ఇలా బోలెడన్ని భవనాలను ఒకదగ్గర చేర్చి.. ఓ కొత్త నగరాన్ని కట్టేయాలన్నది లాజరానీ ఆలోచన. దీనికి ఆయన పెట్టిన పేరు.. ‘వాయాల్యాండ్’. ఒక్కో భవనాన్ని వాయా అని పిలుస్తారు. ఫైబర్‌గ్లాస్, కార్బన్లు, ఉక్కుతో తయారయ్యే ‘వాయా’లను మాయన్, జపనీస్ ఆర్కిటెక్చర్ ఆధారంగా డిజైన్ చేశారు. అన్నింటిపై వీలైనంత ఎక్కువ ప్రదేశంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటై ఉంటాయి. వీటితోపాటు వాటర్ టర్బయిన్ల ద్వారా కూడా కరెంటు ఉత్పత్తి అవుతుంది. అవసరమైనప్పుడు ఒక చోటి నుంచి మరోచోటికి వాయాలను తరలించేందుకు మోటార్లు కూడా ఉంటాయి. ఒక్కో వాయా (చిన్నసైజులో ఉండేది) ఖరీదు దాదాపు రూ.రెండున్నర కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వాయాల్యాండ్ నిర్మాణం కోసం లాజరానీ నిధులు సేకరిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2022 నాటికి ఏదో ఒక మహా సముద్రంలో దీనిని నిర్మిస్తానని చెబుతున్నారు. -
ఆర్టీసీలో సోలార్ కాంతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, ప్రధాన స్టేషన్లలో సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ సంకల్పించింది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ఆర్ఈడీసీఓ) అధికారులతో చర్చించిన తర్వాత ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో టీఎస్ఆర్ఈడీసీఓ డైరెక్టర్ సుధాకర్‌రావు, అధికారులు ఒప్పంద పత్రాలపై పరస్పరం సంతకాలు చేశారు. ఒప్పందం 25 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని సోమారపు తెలిపారు. సోలార్ వినియోగంతో ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. -
సోలార్ పరిశ్రమ దిగ్బంధం
ఓర్వకల్లు : భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం శనివారం శకునాల గ్రామం వద్ద సోలార్ పరిశ్రమను దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. ముందుగా గని, శకునాల, దేవనూరు గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు, బాధిత రైతులు పెద్ద ఎత్తున సోలార్ పరిశ్రమ వద్దకు తరలి వెళ్లారు. పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు. విష యం తెలుసుకున్న పాణ్యం, కర్నూలు పోలీసులు అక్కడికి చేరుకొని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అయితే అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాక కదిలేదని రైతులు, కూలీలు భీష్మించి కూర్చున్నారు. అక్కడే టెంట్ వేసుకొని నాలుగు గంటల పాటు బైఠాయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని, స్థానిక యువతకు పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఆర్డీవో హుసేన్ సాహెబ్, ఓర్వకల్లు తహసీల్దార్ రజనీకుమారి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సోలార్ పరిశ్రమలో కోల్పోయిన భూములకు పరిహారం చెల్లింపులో నాలుగేళ్ల నుంచి జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని ఆర్డీఓ అంగీకరించారు. మొత్తం 980 ఎకరాలకు పరిహారం ఇవ్వడానికి రూ.81 కోట్లు అవసరమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. ఇందులో మొదట జనరల్ అవార్డు కింద గుర్తించిన 210 ఎకరాలకు రూ.27 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారం కారణంగా పెండింగ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. రెక్టిఫికేషన్ అవార్డు కింద గుర్తించిన మరో 230 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో కాలయాపన జరుగుతోందన్నారు. పరిహార విషయంలో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న బోయ మద్దిలేటి కుటుంబానికి జాతీయ కుటుంబ యోజన పథకం(ఎన్‌ఎఫ్‌బి) కింద ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబంలో ఒకరికి సోలార్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్థానిక యువతకు అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ ఈఈ సుధాకర్‌ను ఆర్డీఓ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించిన తర్వాత 15 రోజుల్లో రూ. 81 కోట్ల్ల పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఆందోళనను విరమించుకున్నారు. సీపీఎం మండల కన్వీనర్ నాగన్న , రైతు సంఘం నాయకులు రామకృష్ణ , భూ నిర్వాసిత కమిటీ సభ్యులు చంద్రబాబు, చాంద్‌బాషా షంషీర్‌ఖాన్, జయరాముడు, మల్లమ్మ, రమాదేవి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలు, బాధిత రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో హుసేన్ సాహెబ్ -
వీధి దీపాలకు సోలార్
సాక్షి, హైదరాబాద్ : ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు అమ్ముడవ్వడానికి బిల్డర్లు వీధుల్లో ఆధునిక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తారు. విదేశాల్లో తలపించేలా పరిసరాలుంటాయని గొప్ప లూ చెబుతారు. కానీ, నిర్మాణం పూర్తయి నివాసితుల సంఘానికి అప్పజెప్పాక.. పెరిగే విద్యుత్ బిల్లులు చూసి నివాసితుల సంఘాలు బెంబేలెత్తక తప్పదు. కాబట్టి, ఇలాంటి ఇబ్బందులు అధిగమించాలంటే విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి. ♦ బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లాలు.. ఏ నిర్మాణమైన నిర్వహణ విషయంలో బిల్లులు తడిసిమోపెడవుతాయి. ప్రత్యేకించి విద్యుత్ బిల్లుల భారాన్ని తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకూ సౌర విద్యుత్ దీపాలనే వినియోగించాలి. ప్రాజెక్ట్ ఆవరణలో, సెల్లార్లలో సాధారణ విద్యుత్ దీపాల స్థానంలో సౌర వీధి దీపాల్ని ఏర్పాటు చేసుకుంటే సరి. నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ♦ సౌర వీధి దీపాలు రెండు రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో స్తంభం మీద ఒక్కో దీపం ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని స్టాండ్ ఎలోన్ సిస్టం అంటారు. మనకెన్ని కావాలో అన్ని వీధి దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిలోని ప్రతికూలత ఏంటంటే.. ఈ పరికరంపై ఎండ నేరుగా పడితేనే పని చేస్తుంది. అపార్ట్మెంట్ నీడ పడితే పని చేయదు. ♦ రెండో రకానికొస్తే.. అపార్ట్మెంట్ పైకప్పు మీద సోలార్ ఫొటో వోల్టెక్ (ఎస్పీవీ) మాడ్యూళ్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కన్నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్‌ను వీధి దీపాలకు సరఫరా చేస్తారు. ♦ఈ విధానంలో గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక కిలో వాట్ సోలార్ పవర్‌ప్యాక్ ఏర్పాటు చేసుకుంటే 25 వీధి దీపాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. దాదాపు 12 అడుగులుండే ఒక్కో స్తంభానికి 9 వోల్టుల ఎల్ఈడీ లైట్‌ను బిగించుకోవచ్చు. ఇది ఎంతలేదన్నా 30 అడుగుల దూరం దాకా వెలుగునిస్తుంది. దీని కోసం ఎంతలేదన్నా రూ.2 నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో నుంచి 30 శాతం సబ్సిడీగా అందజేస్తారు. పరికరాన్ని బట్టి, దాని పనితీరు, పవర్ బ్యాకప్ ఆధారపడుతుందని గుర్తుంచుకోండి. ♦ ఇక బ్యాటర్ బ్యాకప్ విషయానికొస్తే.. 3 రోజుల దాకా విద్యుత్ ప్రసారంలో ఎలాంటి అంతరాయం ఉండదు. మరింత ఎక్కువ కాలం సరఫరా కోరుకునేవారు కాస్త ఖర్చెక్కువ పెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు అధిక సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్లను కొనాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు లైట్లనూ ఎంచుకోవాలి. ♦ ఎస్వీపీ పరికరాల్ని వినియోగించేవారు ఆటోమెటిక్ సెన్సార్లనూ ఏర్పాటు చేసుకునే సౌలభ్యమూ ఉంది. మనం కోరుకున్న సమయంలో లైట్లు వెలగడం, ఆరిపోవటం వంటివి ముందే నిర్ణయించుకోవచ్చు. లేదా ఎప్పుడెప్పుడు ఎంతెంత వెలుతురు కావాలో ముందే ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. రాత్రి 10 గంటల వరకు ఎక్కువ వెలుతురు.. అర్ధరాత్రి 12 దాటితే 50 శాతం వెలుతురు.. ఇలా మనం కోరుకున్నట్టుగా ప్రణాళికలు చేసుకోవచ్చు. -
పీఎన్బీ స్కాం: సోలార్ ప్లాంట్ సీజ్
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు నీరవ్‌మోదీకి ఈడీ మరోషాక్ ఇచ్చింది. అహ్మద్‌నగర్‌లోని సోలార్ ప్లాంట్‌ను, వందల ఎకరాల భూమిని తాజాగా ఈడీ సీజ్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణానికి సంబంధించి నీరవ్ కు చెందిన సౌర విద్యుత్ ప్లాంట్, 134 ఎకరాల భూమిని ధృవీకృత ఆస్తులుగా స్వాధీనం చేసుకుంది. ఈ మెగా స్కాంలో ఇప్పటికే మోదీకి చెందిన 21 రకాల స్థిరాస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. వీటి విలువ దాదాపు రూ.523 కోట్లు. కాగా అహ్మద్‌నగర్ జిల్లా కర్జత్‌లోగల 134 ఎకరాల స్థలం ఉండగా, 53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ విలువ రూ.70 కోట్లుగా ఉన్నట్టు ఈడీ తెలిపింది. కాగా వేలకోట్ల రూపాయల బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన కేసులో డైమండ్వ్యాపారి నీరవ్‌మోదీ, ఆయన మామ, గీతాంజలి జెమ్స్ ఎండీ మెహల్ చోక్సి తదితులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వీరి పాస్‌పోర్టులను రద్దుచేసింది. -
భూమిపై సౌర తుపాను ప్రళయం..!
వాషింగ్టన్ : భారీ సౌర తుపాను బుధవారం భూమిని తాకనున్నట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ(ఎన్ఓఏఏ) పేర్కొంది. ఈ మేరకు జీ1 హెచ్చరికను జారీ చేసింది. సౌర తుపాను ధాటికి ఉపగ్రహాలు, విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావొచ్చని హెచ్చరించింది. భారీ స్థాయిలో శక్తివంతమైన కణాలు, భూమిని ఢీ కొట్టడం వల్ల విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీంతో ఉత్తర ధ్రువం నుంచి భారీ ఎత్తున వెలుగు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని వివరించింది. సూర్యుడిపై గల వాతావరణంలో గత వారం భారీ పేలుడు సంభవించినట్లు తెలిపింది. ఈ ఘటనలో వెలువడిన కోట్లాది శక్తిమంతమైన కణాలు అతి వేగంగా భూమి వైపునకు దూసుకొస్తున్నాయి. ఇదే సమయంలో భూమి అయస్కాంత ఆవరణలో ‘ఈక్వినాక్స్ క్రాక్స్’ ఏర్పడుతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది మార్చి 20, సెప్టెంబర్ 23 తేదీల్లో భూమి అయస్కాంత ఆవరణంలో ఈక్వినాక్స్ క్రాక్స్ ఏర్పడతాయి. ఈ సమయంలో విశ్వం నుంచి కణాలను భూమి తట్టుకోగలిగే సహజ శక్తి కొద్దిగా తగ్గుతుంది. దీంతో భూమి ఆవరణంలో ఉన్న జీపీఎస్ వ్యవస్థలు, ఆకాశంలో ఎగురుతున్న విమానాలు సౌర తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్నస్థాయిలో జియో సౌర తుపాను ఈ నెల 14, 15 తేదీల్లో సౌర తుపాను భూమిని తాకొచ్చని చెప్పింది. ధ్రువాల వద్ద సంభవించే వెలుగులు మాత్రం స్కాట్లాండ్, ఉత్తర ఇంగ్లండ్, అమెరికాలోని మిచిగాన్, మైన్ ప్రాంతాల్లో కనిపిస్తాయని తెలిపింది. -
రైతుల ర్యాలీలో సెల్ఫోన్ల చార్జింగ్ ప్రత్యేకం
సాక్షి, న్యూఢిల్లీ : నాసిక్ నుంచి ముంబైకి 35 వేల మంది తరలి రావడం ఎంత కష్టమో అంతమందికి వారం రోజులపాటు అన్న పానీయాలు ఏర్పాటు చేయడం కూడా అంత కష్టమే. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి సమాజంలో సెల్ఫోన్లు వాడకుండా ఉండాలంటే కూడా ఎంతో కష్టం. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో నేడు రైతులకు కూడా మొబైల్ ఫోన్ల వాడకం తప్పనిసరైందని తెల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఫోన్లను చార్జింగ్ చేసుకోవడ ఎలా? దీనికి కూడా రైతులే పరిష్కారం కనుగొన్నారు. స్థానికంగా లభించే పలకలాంటి సోలార్ ప్యానెళ్లను వారు సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు ఉపయోగించారు. ఆ సోలార్ ప్యానెల్ ద్వారా ఒకే సారి నాలుగైదు సెల్ఫోన్లను చార్జింగ్ చేయవచ్చట. ఒక్కసారి చార్జి చేస్తే రెండు, మూడు గంటల వరకు ఫోన్ పనిచేస్తుందట. చాలా మంది రైతులు ఇలాంటి సోలార్ ప్యానెళ్లను తమ వెంట తెచ్చుకున్నారు. మండుటెండలో కాలినడకను వారం రోజులపాటు నడిచిన రైతులకు ఇంటివారితో మాట్లాడేందుకు ఫోన్లు అందుబాటులో ఉండడం ఎంతో ఉపశమనం కలిగించి ఉంటుంది. రైతుల ర్యాలీలో తలలపై చార్జింగ్ సోలార్ ప్యానెళ్లను పెట్టుకొని కొంత మంది రైతులు ప్రత్యేకంగా కనిపించారు. -
పరి పరిశోధన
వానొచ్చినా కరెంటు పుట్టించే సోలార్ ప్యానెల్! సూర్యుడు వెలుగులు చిమ్ముతున్నప్పుడు మాత్రమే కాకుండా.. వాన చినుకులు పడుతున్నప్పుడూ విద్యుత్తు ఉత్పత్తి చేయగల సరికొత్త సోలార్ ప్యానెల్స్‌ను చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు. ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచిలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. ఈ హైబ్రిడ్ సోలార్ ప్యానెల్లో సాధారణ సిలికాన్ సోలార్సెల్స్తోపాటు ట్రైబోఎలక్ట్రిక్ నానో జనరేటర్లు ఉంటాయి. సిలికాన్ సెల్స్ సూర్యుడి వెలుతురును విద్యుత్తుగా మార్చేస్తే.. నానో జనరేటర్లు యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మారుస్తాయి. వాన చినుకులు ఈ ప్యానెల్‌పై పడినప్పుడు ఈ జనరేటర్లు వాటి ద్వారా అందే యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మారుస్తాయి. ఇలా రెండు రకాలుగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును జత చేసేందుకు ఒకే ఎలక్ట్రోడ్‌ను వాడటం ఇందులోని విశేషం. నానో జనరేటర్‌కు, సోలార్ సెల్‌కు మధ్య ఉండే ఈ ఎలక్ట్రోడ్ సోలార్ సెల్‌కు రక్షణ కవచంగానూ ఉపయోగపడుతుందని తద్వారా దాని సామర్థ్యం తగ్గకుండా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రోడ్ కాంతి ఎక్కువగా బయటకు వెళ్లకుండా అడ్డుకుని విద్యుదుత్పత్తిని పెంచుతుందని వివరించారు. ఆ బ్యాక్టీరియాతో మధుమేహులకు మేలు! పీచుపదార్థాలను పేగుల్లో పులిసిపోయేలా చేసే బ్యాక్టీరియాతో మధుమేహులకు ఎక్కువ లాభం చేకూరుతుందని రట్గర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వేర్వేరు రకాల పీచుపదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ రకమైన బ్యాక్టీరియా పేగుల్లో వృద్ధి చెందేలా చేసుకోవచ్చునని.. తద్వారా రక్తంలో గ్లూకోజ్ మోతాదులను నియంత్రణలో ఉంచుకోవచ్చునని వారు అంటున్నారు. ఆరేళ్లపాటు కొంతమంది ఆహారపు అలవాట్లను.. వారు తీసుకునే పీచుపదార్థాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లిపింగ్ ఝావ్ తెలిపారు. పేగుల్లో మనం తినే ఆహారంలోని పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లను బ్యాక్టీరియా చిన్నచిన్న ముక్కలుగా చేస్తుందని.. ఈ క్రమంలో ఏర్పడే షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు పేగు గోడలకు చేరి వాపు/మంటలను తగ్గిస్తాయి. ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్లు తక్కువైనప్పుడు మధుమేహం వంటి వ్యాధులు వస్తాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ ఆహారం తీసుకునే వారితో పోలిస్తే... వేర్వేరు రకాల పీచు పదార్థాలు ఆహారం రూపంలో తీసుకునే వారి రక్తంలో గ్లూకోజ్ మోతాదు నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. దాదాపు పన్నెండు వారాలపాటు సాగిన ఈ అధ్యయనంలో మూడు నెలల గ్లూకోజ్ మోతాదులను లెక్కించారు. బంగారం, టైటానియంతో అంధత్వానికి చెక్? అంధత్వంతో బాధపడుతున్న వారికి ఎంతో కొంత స్థాయిలో చూపు కల్పించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో పాక్షిక విజయం సాధించారు కూడా. బంగారం, టైటానియం వంటి లోహాలతో చూపు కోల్పోయిన ఎలుకలు మళ్లీ చూడగలిగేలా చేశారు వీరు. కళ్లల్లో కాంతికి స్పందించే కొన్ని ప్రత్యేక భాగాలు ఉంటాయి. వీటిని ఫొటో రిసెప్టర్లు అంటారు. కొన్ని ఎలుకల్లో జన్యుమార్పుల తద్వారా ఈ ఫొటో రిసెప్టర్లు క్రమేపీ నాశనమయ్యేలా చేసి వీరు కొన్ని పరిశోధనలు చేశారు. నాశనమైన ఫొటో రిసెప్టర్ల స్థానంలో బంగారం, టైటానియం నానో తీగలతో చేసిన ఫొటో రిసెప్టర్లను అమర్చినప్పుడు ఆ ఎలుకలు మళ్లీ కొన్ని రంగులను చూడగలిగినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. అంతేకాకుండా లోహపు ఫొటో రిసెప్టర్లు కలిగి ఉన్న ఎలుకలు వెలుతురుకు స్పందించడం మొదలుపెట్టాయని.. ఎనిమిది వారాల తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదని వివరించారు. రెటినైటిస్ పిగ్మెంటోసా, మాక్యులర్ డిజనరేషన్ వంటి కంటివ్యాధులకూ ఈ పరిశోధన ద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు వీలుందని నిపుణుల అంచనా. -
శని ఉపగ్రహంలో గ్రహాంతర జీవులు?
గ్రహాంతర జీవుల కోసం బోలెడన్నిచోట్ల వెతికే పని లేదని.. మన సౌర కుటుంబంలోని శనిగ్రహపు ఉపగ్రహమైన ఎన్‌సెలడూస్‌లోనే ఇవి ఉండే అవకాశముందని అంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. భూమ్మీద అతిక్లిష్టమైన పరిస్థితుల్లో నివసించే మీథెనోథెర్మో కాకస్ అనే బ్యాక్టీరియాతో పరిశోధనలు చేయడం ద్వారా తామీ అంచనాకు వచ్చామని సైమన్ రిట్‌మాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. సముద్రపు అడుగున ఉండే అగ్నిపర్వత బిలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే చోట్ల ఈ బ్యాక్టీరియా కార్బన్ డైయాక్సైడ్ ను మీథేన్ వాయువుగా మారుస్తూంటుంది. శాస్త్రవేత్తలు ఎన్సెలడూస్పై ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి ఈ బ్యాక్టీరియాను వదిలినప్పుడు అవి బాగా ఎదిగాయి. ఆ గ్రహపు ఉపరితలంపై కూడా మీథేన్ పొగలు వెదజల్లే బిలాలు కొన్ని ఉన్నాయని ఇప్పటికే వెల్లడైన నేపథ్యంలో ఈ బ్యాక్టీరియా అక్కడ కూడా ఉండే అవకాశమున్నట్లు తాము భావిస్తున్నామని సైమన్ తెలిపారు. తమ పరిశోధన కేవలం బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ఉనికికి సంబంధించింది మాత్రమేనని.. మనలాంటి బుద్ధిజీవులపై ఏమాత్రం కాదన్నది గుర్తుంచుకోవాలని సైమన్ వివరించారు. ఎన్సెలడూస్పై సముద్రాలు ఉన్నాయని గత పరిశోధనలు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజా పరిశోధన అక్కడ ఏదో ఒకరకమైన జీవం ఉండేందుకూ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. -
ఈలాన్ మస్క్ ప్లాన్... ఇల్లిల్లూ ఓ జనరేటర్
సౌరశక్తిని వాడుకునే విషయంలో ఉన్న ప్రధాన అడ్డంకి... ప్యానెల్స్ కోసం పెట్టే పెట్టుబడి. వేలల్లో పెట్టుబడి పెడితే వందల్లో కరెంటు బిల్లు ఆదా అవుతుంది కాదా అని చాలామంది సౌరశక్తి వాడకం విషయంలో వెనుకంజ వేస్తూంటారు. ఈ సమస్యను తీర్చేందుకు టెస్లా కార్ల కంపనీ వ్యవస్థాపకుడు ఈలాన్ మస్క్ ఓ వినూత్నమైన ప్రణాళిక సిద్ధం చేశాడు. తన కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సోలార్ పెంకులు, బ్యాటరీలను 50 వేల ఇళ్లకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ ప్రయోగం జరగబోతోంది. పైకప్పులకు వాడే పెంకుల మాదిరిగానే మస్క్ కంపెనీ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రయోగంలో భాగంగా ముందు వెయ్యి ఇళ్లల్లో ఈ ప్యానెల్స్, బ్యాటరీలను ఏర్పాటు చేస్తారు. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా ఆ వెయ్యి కుటుంబాల వారు ఉచితంగా వాడుకుంటారు. వాడుకోగా మిగిలిన విద్యుత్తును బ్యాటరీలలో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు గ్రిడ్‌కు పంపుతారు. ఇలా సంపాదించే డబ్బుతోనే ప్యానెల్స్, బ్యాటరీల ఏర్పాటుకు పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు మస్క్ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఐడియా భలే ఉంది కదూ... -
మామూళ్లు ఇస్తేనే పరిశ్రమలకు అనుమతి
సాక్షి, పెద్దపల్లి : ‘‘పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో సోలార్ ఇండస్ట్రీస్ అనే సంస్థ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు గతేడాది ముందుకు వచ్చింది. సింగరేణిలో ఎక్స్ప్లోజివ్కు వాడే ముడిసరుకు మాత్రమే తయారు చేసే పరిశ్రమ ఇది. సుమరు రూ.20 కోట్లతో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ పరిశ్రమతో స్థానికంగా నేరుగా కనీసం 200 మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి దొరుకుతుంది. కాలుష్యం, రక్షణ తదితర అన్ని రకాల అనుమతులు వచ్చినా, ఇప్పటివరకు ఆ పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేయలేకపోతున్నారు. కారణం ఓ ప్రజాప్రతినిధి అవినీతి ఆపేక్ష. రూ.5 లక్షలు ఇస్తేనే ముందుకు సాగనిస్తానంటూ బేరం పెట్టాడు. పైగా అక్కడ నెలకొన్న రాజకీయ విభేదాలు కూడా కొంత కారణమయ్యాయి. దీనితో ఆ పరిశ్రమను ఏర్పాటు చేయాలా..వద్దా...అని పారిశ్రామిక వేత్తలు పునరాలోచనలో పడ్డారు.’’ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటూ ప్రభుత్వం ఓ వైపు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను సరళతరం చేస్తుంటే, మరో వైపు అవినీతి, రాజకీయ కారణాలతో అడ్డుపడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి దేశవ్యాప్త గుర్తింపు పొందిన పరిశ్రమలు ఈ జిల్లాలో ఉన్నాయి. వీటికి తోడు చిన్న తరహా పరిశ్రమలు కూడా వస్తే జిల్లా పురోగతి త్వరితగతిన సాధ్యమని ప్రభుత్వ పెద్దలు, అధికారులు నానా తంటాలు పడుతున్నారు. కాని తమ మామూళ్ల కోసం, గ్రామ, మండల స్థాయి రాజకీయాల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులు పరిశ్రమల ఏర్పాటును ముందుకు సాగనీయడం లేదు. డబ్బులిస్తేనే..: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులకు కొంతమంది అవినీతి ప్రజాప్రతినిధుల తీరు ఆటంకంగా మారింది. ఉత్సాహంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సింది పోయి, మామూళ్ల కోసం వేధిస్తున్న ఉదంతాలు జిల్లాలో చోటుచేసుకొంటున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే పరిశ్రమపై లేనిపోని అపోహలు సృష్టించి అడ్డంకించడం, డబ్బులు ఇస్తే దగ్గరుండి ఏర్పాటు చేయించడం ఇక్కడ బహిరంగరహస్యంగా మారింది. సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లోనూ రాగినేడు తరహాలోనే సంఘటనలు జరిగినట్లు ప్రచారంలో ఉంది. ఆయా ప్రాంతాల్లో రెస్మిల్లులు, ఇతర పరిశ్రమలు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహికులను మామూళ్లు, రాజకీయ కారణాలతో వేధించడంతో కొంతమంది తమ ప్రయత్నాన్ని ఆదిలోనే విరమించుకొన్నట్లు సమాచారం. స్థానికులకే ఉపాధి: జిల్లాలో ఏర్పాటవుతున్న చిన్నతరహా పరిశ్రమల మూలంగా స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఆ గ్రామం, చుట్టు ప్రక్కల గ్రామాల్లోని వారికే ఉపాధి అవకాశాలు కల్పి స్తున్నారు. దీనితో కొంతైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాని కొంతమంది ప్రజాప్రతినిధుల అవినీతి మూలంగా ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. ఎక్కువ పరిశ్రమలు రావాలి –ప్రేంకుమార్, జిల్లా మేనేజర్, పరిశ్రమల శాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలో మరిన్ని పరిశ్రమలు రావాలి. జిల్లాలో భూములు, విద్యుత్, నీళ్లు పరిశ్రమలకు అవసరమయ్యే అన్ని వనరులున్నాయి. పరిశ్రమలు నెలకొల్పాడానికి ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం టీఎస్ఐపాస్ను ప్రవేశపెట్టింది. అనుమతులు కూడా సకాలంలోనే ఇస్తున్నాం. సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తేనే, ఉపాధి మెరుగవుతుంది. ఇందుకు అందరు సహకరించాలి. -
ప్రపంచ సోలార్ దిగ్గజాల్లో అదానీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సోలార్ విద్యుదుత్పత్తి సంస్థల్లో అదానీ గ్రూపు స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలో యుటిలిటీ సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పరంగా టాప్–15 జాబితాలో చేరిన అదానీ గ్రూపు 12వ స్థానం దక్కించుకుంది. గ్రీన్‌టెక్ మీడియా రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకైన భారతీయ కంపెనీ అదానీ ఒక్కటే. గ్రీన్‌టెక్ మీడియా రూపొందించిన జాబితాలో ఫస్ట్ సోలార్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 4,619 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పాదన చేస్తుండగా, దీనికి అదనంగా 4,802 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. అదానీ గ్రూపు 788 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. -
ఈ కిటికీలతో బోలెడంత కరెంటు...
ఇంటి కిటికీలు వెలుతురుతోపాటు కరెంటు కూడా అందిస్తే బాగుంటుందని చాలాకాలంగా అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు తీరే రోజు దగ్గరకు వచ్చేసింది. అమెరికాలోకు చెందిన లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తల బందం ఇలాంటి సరికొత్త కిటికీలను అభివద్ధి చేసింది మరి! మార్కెట్లో ఇప్పటికే కొన్ని పారదర్శక సోలార్ ప్యానెల్స్ ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా తాము చేయగలిగామని ఈ ప్రాజెక్టుకుకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త విక్టర్ క్లిమోవ్ తెలిపారు. రెండు పొరలుగా ఉండే ఈ కొత్త రకం సోలార్ ప్యానెల్ సాధారణ ప్యానెల్స్ విద్యుత్తు ఉత్పత్తి చేయలేని కాంతులనూ వాడుకోగలగడం విశేషం. కిటికీలోని రెండు పొరలు వేర్వేరు రంగులను శోషించుకోవడమే కాకుండా.. ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ రంగులను కిటికీకి ఒకవైపున ఉండే చిన్నసైజు సోలార్ ప్యానెల్స్వైపు మళ్లిస్తారు. దీంతో అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మోతాదు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల అంచనా. -
సౌర వెలుగుల కాలం చెల్లిందా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడేళ్ల కిందట విద్యుత్ కొరతతో సతమతమైన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. 14,913 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ కోతలకు కాలం చెల్లింది. ఇదంతా బాగానే ఉంది!!. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన సోలార్ కంపెనీల భవిష్యత్తే అగమ్యగోచరంగా తయారయింది. రెండేళ్లుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లేవు. వీలింగ్ అగ్రిమెంట్లకూ ప్రభుత్వం అనుమతులివ్వడం లేదు. నెట్ మీటరింగ్‌కు పర్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో 20కి పైగా కంపెనీలు కనుమరుగయ్యాయని, 10,000 మంది ఉద్యోగులు వీధిన పడ్డారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇవీ పెట్టుబడులు.. తెలంగాణ రాష్ట్రంలో 3,142 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. పరిశ్రమ ప్రతినిధుల సమాచారం ప్రకారం 50 దాకా కంపెనీలు సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీలోకి ప్రవేశించాయి. ఇంటిగ్రేటర్లు 200 దాకా ఉన్నారు. సౌర విద్యుత్ రంగంలోకి రూ.15,000–20,000 కోట్ల పెట్టుబడులొచ్చాయి. పలు కంపెనీలు సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీకి రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దేశవ్యాప్తంగా 45% ప్యానెళ్లను సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్రంలోని కంపెనీలు ఇప్పుడు 5% లోపు కూడా అందించడం లేదు. 20 కంపెనీలకుపైగా మూతపడ్డాయని, 10,000 మంది పైచిలుకు రోడ్డున పడ్డారని ఓ ప్రముఖ కంపెనీ డైరెక్టర్ చెప్పారు. తమ కంపెనీలో 600 నుంచి ఉద్యోగుల సంఖ్య 150కి వచ్చిందని చెప్పారాయన. వాస్తవానికి సంప్రదాయ విద్యుత్‌కు ఒక్కో యూనిట్‌కు రూ.3.90 ఖర్చయితే, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కంపెనీలకు రూ.6.30 వరకూ ఖర్చవుతోంది. అధిక వడ్డీలు కూడా ఇందుకు కారణమన్నది ఓ కంపెనీ సీఈవో మాట. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఊతమివ్వకపోతే తయారీ కంపెనీలకు గడ్డుకాలమేనని అన్నారు. కనీసం 100 మెగావాట్లు.. సోలార్ కంపెనీ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసి.. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఏదైనా కంపెనీకి విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తున్న ఓపెన్ యాక్సెస్ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని పరిశ్రమ కోరుతోంది. ‘ప్రభుత్వం ఏటా కనీసం 100 మెగావాట్ల మేర ఓపెన్ యాక్సెస్‌కు తప్పనిసరిగా అనుమతివ్వాలి. ఇలా అయితేనే పరిశ్రమ నిలబడుతుంది. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ తిరిగి ఉపాధి లభిస్తుంది’ అని సురానా సోలార్ ఎండీ నరేంద్ర సురానా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలు ఓపెన్ యాక్సెస్‌ను అమలు చేస్తున్నాయన్నారు. రెండేళ్లుగా తెలంగాణలో పీపీఏలు లేవని మరో కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కంపెనీలకు రూఫ్టాపే దిక్కా? వ్యవసాయ పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్‌ను జనవరి 1న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో కొత్తగా సోలార్ పంపుసెట్లు అమ్ముడయ్యే చాన్స్ లేదని ఓ కంపెనీ ఎండీ వ్యాఖ్యానించారు. ఇక కంపెనీలు రూఫ్‌టాప్ విభాగంపైనే ఫోకస్ చేయాల్సి ఉందన్నారాయన. నెట్ మీటరింగ్ విషయంలో మిగులు విద్యుత్‌కు ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ.3.90 చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని పెంచితేనే రూఫ్‌టాప్‌కు కస్టమర్లు మొగ్గు చూపుతారని సైరస్ సోలార్ ఫౌండర్ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్ మీటరింగ్‌కు కస్టమర్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు. -
అంగారకుడిని సౌర తుఫానులు తాకలేవు
లండన్ : అంగారకుడుపై నాసా ప్రయోగాలు మొదలు పెట్టిన క్షణం నుంచి ఆ గ్రహం గురించిన ఆసక్తిర విశేషాలు వరుసగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అంతరిక్షాన్ని, గ్రహాలను వణికించే సౌరతుపానులు అంగారకుడిని తాకలేవని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. అత్యంత శక్తివంతమైన సౌర తుఫానులనుంచి అంగారకుడిని అక్కడి వాతావరణం కాపాడుతోందని పరిశోధన తెలిపింది. సూర్యుడి నుంచి వచ్చే సౌర తుపానుల నుంచి అక్కడి వాతావరణం రక్షణంగా ఉందని.. అందువల్లో అరుణగ్రహం మనుడగ సాగిస్తోందని పరిశోధన తేల్చింది. ప్రధానంగా అరుణ గ్రహం కూడా రెండు ధృవాలను కలిగి ఉందని.. ఇది భూమిని పోలి ఉంటాయని పరిశోధన తేల్చింది. భూమిమీద వాతావరణ పీఢనం కన్నా.. కొంచెం తక్కువగా అంగారకుడిపై వాతావరణ పీడన ప్రభావం ఉంటుందట. అందువల్లే అక్కడ అతి చల్లగా, పొడిగా వాతావరణం ఉంటుందట. అరుణగ్రహం మీద భౌతిక పరిస్థితులు, వాతావరణం బట్టి.. అక్కడ నాలుగు బిలియన్ల సంవత్సరాల కింద జలం సమృద్ధిగా ఉండేదని నివేదిక తెలిపింది. ఇప్పటికీ అంగారకుడిపై నీటి సంబంధిత అనవాళ్లు ఉన్నాయని.. స్వీడన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ చెబుతోంది. అయితే భీకరమైన ఉష్ణ గాలులు, గ్రీన్ హౌజ్ వాతావరణ ప్రభావం ఇతర కారణాల వల్ల అంగారకుడిపై నీరు ఆవిరగా మారిపోయిందని తెలుస్తోంది. ఈ విషయంలో భూమికి అంగారకుడికి పోలిక లేదని కూడా నివేదిక చెబుతోంది. స్వీడిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్ సైంటిస్ట్ రాబిన్ రామ్స్టాడ్ మాట్లాడుతూ.. అంగారకుడిపై అయస్కాంతవాతావరణం తక్కువగా ఉంటుందని చెప్పారు. -
కారు కొంటే.. కరెంటు ఫ్రీ!
బైక్ కొంటే పెట్రోలు ఫ్రీ అన్న ప్రకటనలు మీరెప్పుడైనా చూశారా? ఐదు, పది లీటర్ల పెట్రోలు ఇవ్వడం గొప్ప కాకపోవచ్చుగానీ.. స్వీడన్‌కు చెందిన ఓ కంపెనీ ఐదేళ్లపాటు కారుకు ఇంధనం ఉచితంగా ఇచ్చేస్తామని ప్రకటించింది. అవునండి.. ఇది నిజం. ఫొటోలో కనిపిస్తోందే.. ఆ కారు పేరు యూనిటి. పూర్తిగా విద్యుత్తుతో నడుస్తుంది. మోడల్‌ను బట్టి ఇద్దరు లేదంటే నలుగురు వెళ్లగలిగే ఈ కారు బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 నుంచి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో విద్యుత్తు కారును తయారు చేయడం వరకూ బాగానే ఉందిగానీ.. కరెంటు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? అంటే ‘‘కారు కొన్న తరువాత చాలామంది తమ ఇళ్లల్లోనే ఛార్జింగ్ చేసుకుంటారు. ఈ విద్యుత్తు తయారీ వెనుక మళ్లీ కాలుష్యకారక శిలాజ ఇంధనాలు ఉంటాయి. అందుకే మేము వినూత్న రీతిలో కేవలం సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును యూనిటీ కార్ల కోసం ఐదేళ్లపాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం’’ అంటారు టోబియాస్ ఎక్మాన్. సౌరశక్తి సరఫరాకు యూనిటి ఇప్పటికే ఈ–ఆన్ అనే కంపెనీతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కారు తయారీ, ఇంధనం విషయంలో కొత్త పోకడలకు తెరతీసిన యూనిటి అమ్మకాల విషయంలోనూ అంతే వినూత్నంగా ఆలోచన చేస్తోంది. ఆన్లైన్ పోర్టల్‌లో మొబైల్ ఫోన్లు కొనుక్కున్నట్లుగానే తమ కార్లను కూడా కొనుక్కోవచ్చునని.. ఆర్డర్ వచ్చిన తరువాత నేరుగా వినియోగదారుడి ఇంటికే కారు డెలివరీ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇంకో విషయం.. ఇప్పటికే దాదాపు వెయ్యి కార్లకు అర్డర్లు అందుకున్న యూనిటి కారు... స్వీడన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి వచ్చేది నేడే! -
కిటికీ అద్దం...బోలెడంత కరెంటు!
కరెంటు కష్టాలు ఇక దాదాపుగా తీరినట్లే.. ఎందుకంటారా? ఇంకొన్నేళ్లలో ఇంటి కిటికీలకు బిగించిన అద్దాలే సోలార్ ప్యానెల్స్గానూ పనిచేయనున్నాయి కాబట్టి! ఈ రకమైన పారదర్శక ప్యానెళ్లను కొంత కాలంగా తయారు చేస్తున్నా.. వాటి సామర్థ్యం తక్కువ కావడం వల్ల ఇప్పటివరకూ అవి విస్తృత వినియోగంలోకి రాలేదు. అమెరికాకు చెందిన ద నేషనల్ రెన్యుయబుల్ ఎనర్జీ లేబొరేటరీ (ఎన్ఆర్ఈఎల్) తాజాగా ఈ ఇబ్బందిని కూడా అధిగమించింది. ఈ సంస్థ శాస్త్రవేత్తలు తయారు చేసిన పారదర్శక సోలార్‌ప్యానెళ్లు తనపై పడే సూర్యరశ్మిలో 11 శాతాన్ని విద్యుత్తుగా మార్చడంలో విజయం సాధించాయి. సాధారణ సోలార్ప్యానెళ్ల సామర్థ్యం 15 శాతం వరకూ ఉంటుంది. ఈ స్మార్ట్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకుంటే అమెరికా మొత్తమ్మీద వాడే విద్యుత్తులో 80 శాతం అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చునని ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లాన్స్ వీలర్ తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో పారదర్శకంగా ఉండే ఈ ప్యానెల్ ఎండ తాకగానే నలుపు రంగును సంతరించుకుంటుంది. ఫలితంగా భవనం లోపలికి వచ్చే ఎండ తగ్గిపోతుంది. అదే సమయంలో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. పెరోవ్స్కైట్స్ అనే వినూత్న పదార్థం, ఒక పొర కార్బన్నానోట్యూబ్ల వాడకం ద్వారా వీటి ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని అంచనా. -
సూర్యుడే ఇస్తాడు మంచినీరు!
సోలార్ ప్యానెల్స్‌తో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చుగానీ.. మంచినీరు ఎలా? అని కదా మీ డౌటు. కాని సాధ్యమే. అమెరికాలోని అరిజోనా ప్రాంతానికి చెందిన ‘జీరో మాస్ వాటర్’ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసిన వినూత్నమైన హైడ్రోప్యానెల్స్తో ఇది సాధ్యమే. ఇళ్ల పైకప్పులపై వీటిని ఏర్పాటు చేసుకుంటే చాలు... ఇవి ఒక పక్క విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఇంకోపక్క గాల్లోని తేమను నీటిగా మార్చి అందిస్తాయి. ఒక్కో హైడ్రోప్యానెల్ ద్వారా రోజుకు పది లీటర్ల స్వచ్ఛమైన తాగునీరును ఉత్పత్తి చేయవచ్చు. ప్యానెల్ మధ్య భాగంలో ఉండే ఒక ఫ్యాన్ సౌరశక్తి ద్వారా తిరుగుతూంటే కంపెనీ సిద్ధం చేసిన ప్రత్యేక పదార్థాల పొరలు గాల్లోని వేడిని తీసేస్తూ తేమను మాత్రమే గ్రహిస్తూ నీటిని ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఈ నీరు కాస్తా ప్యానెల్ అడుగుభాగంలో ఉండే 30 లీటర్ల ట్యాంక్‌లోకి చేరుతుంది. అక్కడ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను చేర్చిన తరువాత అది తాగడానికి సిద్ధమైపోతుంది. గాల్లో తేమశాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఈ ప్యానెల్స్ ద్వారా సమర్థంగా నీటిని ఒడిసిపట్టవచ్చునని, పదేళ్లపాటు మన్నే ప్యానెల్స్ ద్వారా ఒక్కోలీటర్ నీటి ఉత్పత్తికి అయ్యే ఖర్చు రెండు రూపాయల వరకూ ఉండవచ్చునని కంపెనీ సీఈవో కోడీ ఫ్రీసెన్ అంటున్నారు. ఎనిమిది దేశాల్లో పేదలకు ఈ ప్యానెల్స్‌ను కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పంచి ఫలితాలు అందజేస్తున్నాయి. -
దారి తప్పిన గ్రహశకలం
లండన్: మన సౌర కుటుంబం మీదుగా ఎర్రటి, పొడవాటి ఓ వస్తువు గతనెలలో దూసుకు పోయింది. అన్ని గ్రహశకలాల మాదిరిగానే ఇది కూడా సాధారణమైందని ఖగోళ శాస్త్రవేత్తలు భావించారు. అయితే అది వేరే నక్షత్ర సమూహం నుంచి వచ్చిన తొలి గ్రహశకలం అని వారి పరిశీలనలో తెలిసింది. గత నెలలో ఆకాశంలో ఏదో వస్తువు వెలుగుతూ వెళ్లినట్లు హవాయిలోని పాన్–స్టార్స్1 అనే టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత చిన్న పరిమాణంలో ఉండే సాధారణ గ్రహశకలం అని భావించినా.. ఆ తర్వాత దాని కచ్చితమైన కక్ష్యను గుర్తించగలిగారు. ఈ వస్తువు వేరే నక్షత్ర మండలం నుంచే వచ్చినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తొలుత ఆ వస్తువును తోకచుక్కగా భావించారు. అయితే సెప్టెంబర్‌లో తోకచుక్క వంటివేవీ సూర్యుడికి దగ్గరగా వెళ్లినట్లుగా ఎలాంటి గుర్తులు కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ తర్వాత ఆ వస్తువును వేరే నక్షత్ర మండలానికి చెందిన గ్రహశకలమని గుర్తించారు. దానికి ‘ఔమువామువా’అని పేరు పెట్టారు. ఈ గ్రహశకలం 400 మీటర్ల పొడవుతో.. వెడల్పుతో పోల్చుకుంటే 10 రెట్ల పొడవుతో ఉంది. ఔమువామువా ఇప్పటికే సూర్యుడికి అతి దగ్గరి నుంచి వెళ్లిందని, అక్కడి నుంచి మన సౌర కుటుంబం దాటి వేరే నక్షత్ర మండలానికి వెళ్లిపోతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. భూమిని ఢీకొననున్న అపోఫిస్! కాలిఫోర్నియా: ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది. దీని పరిమాణం దాదాపుగా రెండున్నర ఫుట్‌బాల్ మైదానాలంత ఉంటుందని అంచనా. అప్పటి నుంచి దాని కదలికలను నిశితంగా గమనిస్తోంది. 2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నాసా వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2036 ఏప్రిల్ 13 మన భూ గ్రహానికి చివరిరోజు కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2029లో కూడా అపోఫిస్ గ్రహశకలం భూమికి సమీపంలో, 32 వేల కిలోమీటర్ల దూరంలోనే వెళ్లొచ్చనీ, అప్పుడు దాని మార్గంలో ఏ చిన్న తేడా వచ్చినా, భూమిపై పెను విధ్వంసం జరగొచ్చని రష్యా శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఇంకా చీకట్లోనే..
సీతంపేట: గిరిజన బతుకులు ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నాయి. వీరికి వెలుగు అందించడానికి సర్కారు చెప్పిన సోలార్ కథ కంచికి చేరేలా కనిపిస్తోంది. గిరిజన గ్రామాల్లో గతంలో వేసిన సోలార్ లైట్లు దాదాపుగా పాడైపోయాయి. వీటిని పట్టించుకునే వారే లేకపోవడంతో గిరిజన గూడల్లో చీకట్లు అలముకుం టున్నాయి. కొండలపై ఉన్న గ్రామాలతో పాటు కొండ దిగువన ఉన్న గ్రామాల్లో సైతం చాలా లైట్లు వెలగడం లేదు. ఈ దీపాలు వేసిన కొద్ది రోజుల వరకు మాత్రమే వెలిగాయి. దీంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సదుపాయం ఉన్నా వీధి లైట్లు లేని గ్రామాలకు, కొండలపై ఉన్న గ్రామాలకు సౌర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో మూడేళ్ల కిందట నెడ్‌క్యాప్ సంస్థ ద్వారా 325, ప్రైవేట్‌గా మరో 250 సోలార్ దీపాలు దాదాపు వంద గ్రామాల వరకు ఇచ్చారు. ఒక్కో గ్రామంలో రెండు, మూడు లైట్ల వరకు వేశారు. రాత్రి వేళ అడవి జంతువుల భయం ఉండకుండా ఈ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా ఇవి వెలుగుతాయి కాబట్టి వీటిని కొండలపై ఏర్పాటు చేశారు. అలాగే ఏనుగుల ప్రభావిత గ్రామాలకు కూడా పంపిణీ చేశారు. ఈ గ్రామాల్లో ఎక్కువగానే దీపాలు ఇచ్చారు. ఒక్కో దీపం ఖరీదు రూ.18,400 వరకు ఉంటుంది. ఇలా కోటి రూపాయల వరకు వెచ్చించారు. అయితే ఈ దీపాల్లో 50 శాతం వెలగడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి జంతువులతో కష్టాలే ఆడవి జంతువులతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సీజన్లో అడవి పందులు వంటివి ఎక్కువగా తిరుగుతుంటాయి. దీంతో గిరిజనులు భయాం దోళనలు చెందుతున్నారు. ఏనుగుల ప్రభావిత గ్రామాల్లో కూడా వేసిన లైట్లు సైతం వెలగడం లేదు. వాస్తవానికి ఏనుగులు లైటింగ్ ఎక్కువగా ఉంటే గ్రామాలకు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే చాలా గ్రామాల్లో లైట్లు వెలగకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని పరిస్థితి ఉంది. పర్యవేక్షణ లేకనే.. సోలార్ లైట్లు వినియోగించాలంటే ప్రతి రెండునెలలకొక మారు ఈ సోలార్ లైట్లకు ఉండే బ్యాటరీల్లో డిస్టల్ వాటర్ వేయాలి. అలాగే బ్యాటరీ పోకుండా జెల్లీ పది గ్రాముల వరకు బ్యాటరీకి రాయాలి. అలాంటి మెయింటెనెన్స్లు ఏవీ చేయకపోవడంతో సోలార్ లైట్లు కొన్ని మొరాయించగా మరికొన్ని చోట్ల మిణుకుమిణుకుమంటూ వెలుగుతున్నాయని గిరిజ నులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఎలాంటి డిస్టల్ వాటర్, జెల్లి వంటివి పెట్టకపోవడంతో కొన్ని సోలార్ లైట్లకు అయితే బ్యాటరీలు కూడా పోయి ఉంటాయని పలువురు మెకానిక్‌లు తెలియజేస్తున్నారు. అయితే వీటి మెయింటెనెన్స్‌కు గతంలో ఇద్దరిని కూడా నియమించారు. వారికి అవసరమైన టూల్కిట్లు వంటివి లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. నెడ్‌క్యాప్ అధికారులు బ్యాటరీలు ఎత్తుకుపోయారని, తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. -
ప్రమాదంలో భూమి?!
సాక్షి, న్యూఢిల్లీ : సౌర మండంలో సంభవిస్తున్న సౌర తుఫానులు భూమికి అత్యంత ప్రమాదకరంగా పరణమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నక్షత్ర మండలం వైపు ప్రయాణించే సౌర తుఫానులు తమ గమనం మార్చుకుని భూమివైపు ప్రమాణిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సౌర తుఫానులు భూ కక్షలోకి ప్రవేశించాయి. ఈ సౌర తుఫానుల వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ సర్వనాశనం దెబ్బతినే ప్రమాదముంది. సౌర తుఫానుల వల్ల శాటిలైట్లు మాడిమసి అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మన సౌర వ్యవస్థకు ఆవల నిబురు అనే ఊహాత్మక సౌర వ్యవస్థ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సౌర వ్యవస్థకు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. భూమిమీదకు వేగంగా..! మన సౌర వ్యవస్థకు మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న నిబురునుంచి ప్లానెట్ - X అనే ఉపగ్రహం భూమిని ఢీ కొట్టేందుకు అత్యంత వేగంగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లానెట్ - X నిజంగానే భూమిని ఢీ కొడితే.. ఇక్కడ జీవరాశి మనుగడే ప్రమాదంలో పడుతుంది. 2012 నుంచే..! నిబురు గ్రహం, ప్లానెట్ - X గురించి 2012 నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో భూమి మీద అనేక భీకర ప్రమాదాలు సంభవించాయి. అంతరిక్షంలోనూ ఊహించడానికి భమపడేంత స్థాయిలో విపరీతాలు జరిగాయి. తాజాగా సౌర తుఫానులు మన సమాచార వ్యవస్థలనే నాశనం చేసేలా వస్తున్నాయి. ఇవే అత్యంత ప్రమాదరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
చెత్త నుంచి కొత్త ఫర్నిచర్
సాక్షి నాలెడ్జ్ సెంటర్: వీధుల్లోకి వెళితే ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్త ఏమైనా ఉందీ అంటే అది ప్లాస్టిక్ మాత్రమే. ఇప్పటివరకూ వదిలించుకునే దారి లేదు కాబట్టి నడిచిపోయిందిగానీ ఇకపై మాత్రం అలా కాదు. ఎందుకు అంటారా? సమాధానం ఈ ఫొటోల్లో ఉంది. ప్లాస్టిక్‌తోపాటు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను కూడా అక్కడికక్కడే రీసైకిల్ చేసే యంత్రం ఇది. పేరు ట్రాష్ ప్రెస్సో. పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతోనే ఇది పని చేస్తుంది. పెంటాటోనిక్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్ తయారు చేస్తుంది. ఇటీవల లండన్‌లో జరిగిన డిజైన్ ఫెస్టివల్లో దీన్ని సోమర్సెట్ హౌస్ వద్ద ప్రదర్శించారు. అక్కడికొచ్చిన వారందరినీ తమ వద్ద ఉన్న వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తమకివ్వమని కోరి.. అక్కడికక్కడే ఆ బాటిళ్లతో ఫుట్‌పాత్‌లపై వేసుకోగల టైల్స్‌ను తయారు చేశారు. ఎలాంటి ప్రమాదకర రసాయనాలను వాడకుండా తాము ఈ పని చేయగలుగుతున్నామని, దీనివల్ల ఉత్పత్తి అయ్యే టైల్స్ కూడా పెద్దగా ఖరీదు చేయవని పెంటాటోనిక్ వ్యవస్థాపకుడు జొహాన్ బోడెకర్ తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తయారైన టైల్స్‌ను నల్లటి గోళాల ఆకారంలో అమర్చి వాటిని అక్కడే అందంగా ఏర్పాటు చేశారు కూడా. అమెరికన్ కంపెనీ స్టార్ బక్స్ యూకే విభాగం ఈమధ్యే పెంటాటోనిక్తో చేతులు కలిపింది. తమ కాఫీ షాపుల్లోని ఫర్నిచర్ మొత్తాన్ని ట్రాష్ ప్రెస్సో లాంటి యంత్రాలు తయారు చేసే రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ప్లాస్టిక్ చెత్తను ఎక్కడో దూరంగా తరలించి రీసైకిల్ చేసే పద్ధతికి ట్రాష్ ప్రెస్సో ఫుల్స్టాప్ పెట్టేయగలదన్నమాట! -
కిరణ కరుణ లేదు
శ్రీకాకుళం, అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుడిని తొలి సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూడాలని ఆశ పడిన భక్తులకు నిరాశ తప్పలేదు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చిన కాలమార్పుల్లో భాగంగా కన్పించే తొలికిరణ అద్భుత దృశ్యం ఆదివారం ఆలయ రాజగోపురం వద్ద మబ్బులు కమ్మిన దృశ్యం కనిపించలేదు. ఏటా మార్చి, అక్టోబర్ నెలల్లో తొలి సూర్యకిరణాలు నేరుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును స్పృశిస్తుంటాయి. ఆదివారం ఉదయం మబ్బులు కమ్మేయడంతో ఈ దృశ్యం కనిపించలేదు. భక్తుల కోసం ఆలయ ఈఓ శ్యామలాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు కిరణ దర్శన ప్రాప్తి కలుగలేదు. నేడు, రేపు కూడా అవకాశం ఏటా మార్చి 8, 9, 10 తేదీలతో పాటు అక్టోబర్ 1,2,3 తేదీల్లో తొలి సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకుతాయి. తూర్పు దిశ నుంచి తొలి కిరణాలు ఆలయ రాజ గోపురం మధ్య నుంచి అనివెట్టి మండపం గుండా ధ్వజ స్తంభాన్ని తాకుతూ నేరుగా గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్ పాదాలపై పడి అలాగే స్వామి వారి ముఖం వరకు కిరణ స్పర్శ కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఆదివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆకాశం మేఘావృతం కావడంతో తొలిరోజు మబ్బులు సూర్య కిరణాలను తాత్కాలికంగా అడ్డుకున్నాయి. దీంతో సూర్యోదయ సమయంలో సుమారు ఐదారు నిమిషాలు వరకు కనిపించే ఈ దృశ్యం ఈ మారు కన్పించలేదు. సోమ, మంగళవారాల్లో కూడా ఈ దృశ్యం చూసేందుకు అవకాశముందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. -
అంగారకుడిపై బలమైన సౌర తుపాను
వాషింగ్టన్ : అంగారకుడిపై గత నెలలో బలమైన సౌర తుపాను సంభవించినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని కారణంగా గ్రహంపై రేడియేషన్ స్థాయిలు రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు. ఈ సౌర తుపాను సమయంలో ఏర్పడిన కాంతి పుంజం నాసా ప్రయోగించిన ‘మావెన్ ఆర్బిటర్’గతంలో పరిశీలించిన కాంతి పుంజాల కంటే 25 రెట్లు ప్రకాశవంతమైనదని వివరించారు. మావెన్ ఆర్బిటర్ 2014 నుంచి అంగారక గ్రహ వాతావరణం.. సౌర గాలులకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది. ఈ రేడియేషన్ ప్రభావం రెండు రోజులకు పైగా కొనసాగినట్లు క్యూరియాసిటీ రోవర్‌లోని రేడియేషన్ అసెస్మెంట్ డిటెక్టర్ ద్వారా గుర్తించినట్లు పేర్కొన్నారు. నాసా చేపట్టిన పలు ప్రయోగాలు సూర్యుడు, అంగారకుడిపై ఏర్పడే సౌర తుపానుల ప్రభావం వంటివి వాటిని అధ్యయనం చేస్తున్నాయని నాసా శాస్త్రవేత్త ఎల్సాయిడ్ తలాత్ తెలిపారు. వీటి ద్వారా సౌర తుపానులు అంగారకుడి వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవచ్చని అమెరికాలోని సౌత్‌వెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు డాన్ హాస్సెలర్ వివరించారు. -
ఈ సోలార్ సెల్స్‌ను ఉతికేయొచ్చు..
సూర్యుడు వెలుగుతుంటే చాలు.. నీళ్లల్లో నానబెట్టినా.. రబ్బరులా సాగదీసినా.. కాగితంలా నలిపేసినా.. నిత్యం విద్యుత్ ఉత్పత్తి చేయగల సరికొత్త సోలార్ సెల్ ఇది. టోక్యోలోని రైకిన్, టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. కాగితం కంటే పలుచగా ఉండే ఈ సోలార్ సెల్స్ ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అక్కడికక్కడే చార్జ్ చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒక్కో చదరపు సెంటీమీటర్‌కు దాదాపు 7.86 మిల్లీవాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. రెండు గంటల పాటు నీళ్లలో ఉంచినా దీని సామర్థ్యం నామమాత్రంగానే తగ్గుతుంది. పీఎన్టీజెడ్4ఓ అనే పదార్థంతో దీన్ని తయారు చేశారు. -
అవి భూమిని తాకితే..?!
సాక్షి, న్యూయార్క్ : సూర్యుడు మండుతున్నఅగ్నిగోళం. ఆయన నుంచే అన్నీ వెలుగు, వేడి వస్తున్నాయని మనకు తెలుసు. ఆయన నుంచే అత్యంత శక్తివంతమైన అల్ఫా, గామా, బీటా కిరణాలు భూమ్మీదకు వస్తున్నాయని.. వాటిని ఓజోన్‌పొర అడ్డుకుంటోందని తెలుసు.. ఈ మధ్యకాలంలో సూర్యుడి నుంచి శక్తివంతమైన కిరణాలు, విపరీతమైన ఉష్ణం భూమ్మీదకు వస్తోంది. తాజాగా అత్యంత శక్తివంతమైన సూర్యకిరణాలు.. దాదాపు 48 గంటల పాటు విశ్వంలోకి ప్రసరించాయి. స్వీడన్‌లోని లా ప్లామా అనే శక్తివంతమైన టెలిస్కోప్ నుంచి సోమవారం ఈ ఉష్ణకిరణాల ప్రసారాన్ని.. వాటి తీవ్రతను సైంటిస్టులు గుర్తించారు. గత 12 ఏళ్లలో ఇంతటి శక్తివంతమైన ఉష్ణ కిరణ ప్రసారాలను చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని ఎక్స్- కేటగిరీ మంటలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కిరణాల శక్తిని అంచనా ప్రపంచ శాస్త్రవేత్తలు ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఈ కిరణాలు నేరుగా మన భూమిని తాకి ఉంటే.. ఇప్పటికి ఒక్క చిన్న ముక్క కూడా మిగలకుండా మండిపోయి ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎక్స్-కిరణాల శక్తి దాదాపు వెయ్యి బిలియన్ల హైడ్రోజన్ బాంబులకు సమానంగా ఉండొచ్చని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. వాటిని శక్తిని శాస్త్రవేత్తలు ఎవరూ అంచనా వేయలేకపోయారు.. కానీ సూర్యుడి నుంచి వెలువడిన ఆ వేడిని దాదాపు 12 హైడ్రోజన్ బాంబుల శక్తికి సమానం అని.. నాసా సైంటిస్టులు ఒక అంచనాకు వచ్చారు. -
ఇల్లే జెన్కో.. ఇల్లే ట్రాన్స్‌కో
ఎక్కడో కరెంటు ఉత్పత్తి అవుతుంది. అక్కడినుండి తీగల వెంబడి కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తే మనం వాడుకుంటాం. ఇలా విద్యుత్ సరఫరా అవుతుంది. కానీ ఫొటోల్లో కనిపిస్తున్న ఇళ్లున్నాయి చూశారా.. ఇవి చాలా స్పెషల్. ఎందుకంటే వీటిల్లో ఒకొక్కటీ ఓ విద్యుత్తు జనరేటర్! అర్థం కాలేదా? బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలో పదహారు ఇళ్లతో కూడిన ఓ కాంప్లెక్స్‌ను కడుతున్నారు. సింగిల్‌బెడ్ రూమ్‌లతోపాటు టూ, త్రీ బెడ్రూమ్ ఇళ్లు కూడా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఇంట్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం మాత్రమే ఈ కాంప్లెక్స్ తాలూకూ విశేషం కాదు. విద్యుత్ అవసరాలన్నింటినీ అక్కడికక్కడే తీర్చేసేలా అన్ని రకాల టెక్నాలజీలనూ వాడారు. దాంతోపాటే విద్యుత్తును వీలైనంత ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉందిక్కడ. పైగా అంతా ఉచితం. ‘బిల్డింగ్స్ యాస్ పవర్స్టేషన్స్’ పేరుతో స్వాన్సీ విశ్వవిద్యాలయ విభాగం స్పెసిఫిక్ చేపట్టిన ప్రాజెక్టు ఇది. ఇందులోని పైకప్పులు, గోడలపైన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును బ్యాటరీల్లో నిక్షిప్తం చేయడం.. దీపాలు, ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాల కోసం వాటిని వాడటం మామూలే. మిగిలిపోయిన విద్యుత్తును కామన్ బ్యాటరీల్లోకి చేర్చి విద్యుత్తు వాహనాలను చార్జ్ చేసేందుకు వాడతారు. దీంతోపాటు ఇంటి భాగాలు కొన్నింటిని ఉక్కు పలకలతో కప్పేస్తారు. సూర్యుడి తీక్షణ కాంతికి వేడెక్కే పలకల వెనుకభాగంలోని గాలిని ఇంటిని వెచ్చబెట్టుకునేందుకు వాడతారు. ఈ ఏర్పాట్లు అన్నింటి వల్ల దాదాపు 15 శాతం వరకూ ఉన్న విద్యుత్తు పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చునని, పెద్దస్థాయిలో అమలు చేస్తే కొత్తగా విద్యుత్తు ప్లాంట్లు కట్టాల్సిన అవసరమూ ఉండదని అంటున్నారు స్పెసిఫిక్ సీఈవో కెవిన్ బైగేట్. వేల్స్ ప్రాంతంలోని ఈ పైలట్ ప్రాజెక్టు తరువాత 1,200 ఇళ్లతో ఇంకో పెద్ద ప్రాజెక్టు చేపడతామని బైగేట్ అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఇళ్ల నిర్మాణనికయ్యే ఖర్చు పది నుంచి 20 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్తు బిల్లుల ఆదా ద్వారా అదనపు వ్యయాన్ని తొందరగానే భర్తీ చేసుకోవచ్చునట. బ్రిటన్‌లోని సంప్రదాయ విద్యుత్తు వ్యవస్థపై ఉన్న డిమాండ్‌ను మూడు గిగావాట్ల వరకూ తగ్గిస్తే ఏడాదికి 1,100 కోట్ల పౌండ్లు ఆదా చేయవచ్చునని ఆయన అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సోలార్ ప్యానెలే ఇక రూఫ్
విశాక ఇండస్ట్రీస్ నుంచి ‘ఆటమ్’ మిర్యాలగూడలో 60 మెగావాట్ల ప్లాంటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్ తాజాగా సోలార్ విపణిలోకి ప్రవేశించింది. ఆటమ్ పేరుతో సోలార్ రూఫింగ్ సిస్టమ్స్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. సంప్రదాయ రూఫింగ్ సిస్టమ్స్‌కు భిన్నంగా భారత్‌లో తొలిసారిగా వినూత్న డిజైన్‌తో వీటిని రూపొందించింది. ఫైబర్ సిమెంటు బోర్డుకు సోలార్ సిస్టమ్‌ను జోడించడంతో సోలార్ ప్యానెలే రూఫ్‌గా మారిపోయింది. దీని మందం కేవలం 12 మిల్లీమీటర్లు. చదరపు అడుగుకు ధర రూ.700గా నిర్ణయించామని విశాక జేఎండీ జి.వంశీకృష్ణ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆటమ్ జీవిత కాలం 25 ఏళ్లని చెప్పారు. ఏడాదిన్నరపాటు పరిశోధన చేసిన అనంతరం వీటిని విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదార్లను తొలుత లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. నూతనంగా నిర్మించే గృహాలకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మూడు నెలల్లో ప్లాంటు.. సోలార్ ప్యానెళ్ల తయారీకి నల్గొండ సమీపంలోని మిర్యాలగూడ వద్ద ప్లాంటును నిర్మిస్తున్నట్టు వంశీకృష్ణ తెలిపారు. ‘60 మెగావాట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్లాంటుకై తొలి దశలో రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాం. ఉత్పాదనకు పేటెంటు దాఖలు చేశాం. పర్యావరణానికి ఇది అనుకూలమైంది. మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం. ఆటమ్‌ను విదేశాలకూ ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వివరించారు. పశ్చిమ బెంగాల్లో వి–బోర్డుల తయారీ ప్లాంటు 2019లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశాక ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ జి.వివేకానంద్ తెలిపారు. హర్యానాలోని జజ్జర్ వద్ద రూ.100 కోట్లతో నిర్మిస్తున్న మూడో ప్లాంటు వచ్చే ఏడాది మార్చికల్లా సిద్ధం అవుతుందని చెప్పారు. కాగా, ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీఈవో జి.వి.ప్రసాద్, విశాక ఎండీ సరోజ వివేకానంద్ పాల్గొన్నారు. -
కళ్లజోడుతో విద్యుత్
కళ్లజోడు నుంచి విద్యుత్ ఏంటి అనుకుంటున్నారా..? నిజమేనండీ.. సోలార్ గాగుల్స్ అనే కొత్తరకం కళ్ల జోడును శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఇవి సూర్యరశ్మిని విద్యుత్‌గా మారుస్తాయి. ఫ్రేమ్‌లో ఉండే సర్క్యూటరీ ద్వారా బ్యాటరీల్లో నిల్వ కూడా చేసుకోవచ్చు. సిలికాన్‌ను ఉపయోగించకుండా.. కేవలం సేంద్రియ పదార్థాలతో తయారైన సోలార్ ప్యానెల్స్‌ను ఇందులో వాడటం విశేషం. జర్మనీకి చెందిన కార్ల్హ్రూసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ పారదర్శక సోలార్ ప్యానెళ్లను కళ్లజోడులో వాడటం పెద్ద విశేషమేమీ కాదుగానీ.. ఈ రకమైన ప్యానెల్స్‌ను భవిష్యత్తులో మన కిటికిల్లో, భవనాల ముందువైపు పానెళ్లలో వాడితే ఎక్కడికక్కడ కాలుష్యం లేని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ కళ్లజోడులోని సోలార్ ప్యానెల్స్ తో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో తెలుసా? దాదాపు 200 మిల్లీ వాట్లు. బధిర యంత్రాలు, కొన్ని రకాల ఫిట్నెస్ ట్రాకర్లకు ఈ విద్యుత్ సరిపోతుంది! -
సూర్యుడికి స్విచ్ వేసినట్లే..!
సోలార్ ప్యానెళ్లు పెట్టుకుంటే.. కరెంటు కోతల్లేకుండా చేసుకోవచ్చుగానీ.. ఏర్పాటుతోనే వస్తుంది చిక్కు. ఉన్న ప్యానెళ్లేమో బోలెడంత బరువున్నాయి. ప్యానెళ్లతోపాటు బ్యాటరీ, ఇన్వర్టర్ వంటివీ అవసరమవుతాయి. ఖరీదు కూడా ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటి వల్లే కాబోలు.. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై ఈ చికాకులేవీ ఉండవులెండి! ఎందుకంటే.. ఫొటోల్లో కనిపిస్తున్న సోల్ప్యాడ్ ప్యానెళ్లు వచ్చేస్తున్నాయి మరి! ఈ ప్యానెల్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది ఆల్ ఇన్ వన్! ఇన్వర్టర్, బ్యాటరీ, ప్యానెళ్లు అన్నీ కలగలిపి వస్తాయి. అలాగే అవసరానికి తగినంత విద్యుత్తును మాత్ర మే సరఫరా చేయడం మిగిలినదాన్ని బ్యాటరీల్లో నిల్వ చేయడం ఆటోమేటిక్‌గా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో జరిగిపోతుంటుంది. ఇంట్లోని ఏయే ఎలక్ట్రిక్ పరికరాలకు సోలార్ విద్యుత్తు వాడాలన్నదాన్ని కూడా మనమే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో నిర్ణయించుకోవచ్చు. కావాల్సినప్పుడు మార్చుకోవచ్చు. ఇది కాకుంటే.. సోల్ కంట్రోల్ పేరుతో ఈ కంపెనీ తయారు చేసిన ఒక్కో స్మార్ట్ గాడ్జెట్‌ను వాడుకోవచ్చు. ఇది మనం తరచూ ఆన్/ఆఫ్ చేసే పరికరాలను పరిగణనలోకి తీసుకుని వేటికి సోలార్ ఎనర్జీ అందించాలో నిర్ణయిస్తుంది. ప్యానెల్ వెనుకన ఉండే యూఎస్బీ పోర్ట్స్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లకు నేరుగా చార్జ్ చేసుకునే అవకాశముంది. ఒక్కో ప్యానెల్‌ను కావాల్సిన చోటికి తీసుకెళ్లవచ్చు. బరువు 12 కిలోలు మాత్రమే. ఎక్కువ విద్యుత్తు అవసరమైతే.. ఒకటి కంటే ఎక్కువ ప్యానెళ్లను జత చేసుకునే ఏర్పాట్లున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ తయారు చేస్తున్న ఈ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కూడా ఎక్కువేనని అంచనా. -
ఇక సోలార్ గృహోపకరణాలు
ఈ రోజుల్లో సౌరశక్తికి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వీలైనంత చౌకగా... పర్యావరణానికి నష్టం కలిగించకుండా వేర్వేరు మార్గాల ద్వారా సూర్యుడి వెలుతురును విద్యుత్తుగా మార్చుకుని వాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూరోపియన్ దేశాల్లో కొన్నిచోట్ల రోడ్లపై సోలార్ ప్యానెళ్లు పరిచేస్తే.. తాజాగా భారత్‌లో రైళ్లపై కూడా వీటిని వాడేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. పక్క ఫొటోల్లో కనిపిస్తున్న అందమైన ఫర్నిచర్‌కు, సోలార్ ఎనర్జీకి సంబంధం ఉంది కాబట్టి. హంగెరీ రాజధాని బుడపెస్ట్‌లో అక్కడక్కడా ఇలాంటి ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల కూర్చునేందుకు వీలుంటే.. ఇంకొన్నిచోట్ల కాళ్లు బారజాపుకుని కాసేపు సేదదీరే అవకాశమూ ఉంది. ఇంకొన్నిచోట్ల పది, ఇరవైమంది కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు లేదంటే చిన్నసైజు ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలున్నాయి. ఈ ఏర్పాట్లలో పెద్ద విశేషమేమీ లేదుగానీ.. ప్రతి ఫర్నిచర్‌లోనూ కొంత భాగం సోలార్ప్యానెళ్లతో నిండి ఉండటం మాత్రం చెప్పుకోదగ్గ విషయమే కదా.. ప్లాటియో అనే స్టార్టప్ కంపెనీ ఐడియా నుంచి పుట్టుకొచ్చాయి ఈ సోలార్ ఫర్నిచర్లు. ఫుట్‌పాత్‌ల టైల్స్‌లా వాడగల రీతిలో వీరు సోలార్ ప్యానెల్స్‌ను తయారు చేశారు. వాటిని బల్లలు, సోఫాల్లాంటి ఫర్నిచర్లో భాగంగా మార్చారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేసుకునేందుకు వీటిల్లోనే బ్యాటరీలూ ఉన్నాయి. అలాగే.. ఫర్నిచర్లో ఒకవైపున ఉండే చార్జింగ్ పాయింట్‌తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేసుకోవచ్చు. దాదాపు 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే సోలార్ ప్యానెల్స్ ద్వారా 11.7 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని.. 11 యూఎస్బీ పోర్ట్‌ల ద్వారా ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఛార్జ్ చేసుకోవచ్చునని కంపెనీ అంటోంది. హంగెరీతోపాటు ఇటీవలే ఈ సంస్థ కజకిస్తాన్‌లోని ఆస్తానాలోనూ ఈ సోలార్ ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి , విశాఖపట్నాల్లోనూ ఎండలు బాగానే ఉంటాయి కదా.. అక్కడా ఇలాంటివి ఉంటే ఎంత బాగుండునో! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎండలో పాండా
సౌరశక్తితో కాలుష్యం తగ్గుతుంది.. పర్యావరణానికి మేలు జరుగుతుంది.. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకోవచ్చు. ఇలాంటి మాటలు బోలెడన్ని ఇప్పటికే వినేసుంటాం. పైగా, సోలార్ ఫామ్స్ చూసేందుకు కూడా గొప్పగా ఏమీ ఉండవు.. కనుచూపుమేరలో అన్నివైపులా నల్లటి రంగులో ఒకే రీతిలో సోలార్ ప్యానెల్స్ ఉంటే ఎం బాగుంటుంది చెప్పండి? అయితే చైనా ఇప్పుడు సోలార్ఫామ్స్ని కూడా ఫ్యాషనబుల్‌గా తయారు చేస్తోంది. ఫొటోలో ఉన్నది అచ్చంగా అలాంటి సోలార్ ఫామే! చైనీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన జంతువు పాండా ఆకారంలో సిద్ధం చేసిన ఈ సోలార్ ఫామ్ డటాంగ్ ప్రాంతంలో ఉంది. దీని ద్వారా పుట్టే విద్యుత్తు ఎంతో తెలుసా? దాదాపు 50 మెగావాట్లు! పాండా ఆకారంలో నల్లగా కనిపిస్తున్న చోట్ల మోనో క్రిస్టలీన్ సిలికోన్ సోలార్సెల్స్తో తయారైన ప్యానెల్స్ ఉంటే.. కొంచెం తెలుపు రంగులో ఉన్న ప్రాంతాల్లో అధిక విద్యుత్తును ఉత్పత్తిచేయగల అత్యంత పలుచటి సోలార్ ప్యానెల్స్‌ను వాడారు. ఐక్యరాజ్య సమితి కార్యక్రమంలో భాగంగా పాండా గ్రీన్ ఎనర్జీ పేరుతో ఏర్పాటైన ఈ సోలార్ ఫామ్‌లో ఈ పాండా ఆకారం తొలి దశ మాత్రమే. త్వరలోనే మరో వంద మెగావాట్ల సామర్థ్యంతో మరో పాండా ఆకారపు ఫామ్ సిద్ధం కానుంది. ఈ ఫామ్స్ ద్వారా వచ్చే పాతికేళ్లలో కనీసం 27.4 లక్షల టన్నుల విషవాయువులు వాతావరణంలో కలవకుండా నిరోధించవచ్చు. దాదాపు పదిలక్షల టన్నుల బొగ్గు మండడం ద్వారా ఇంత మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇంకో విషయం.. దేశ యువతకు సౌరశక్తిపై మక్కువ పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫామ్స్‌లో ఓ యూత్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారట. రానున్న ఐదేళ్ల కాలంలో పాండా 100 కార్యక్రమంలో భాగంగా ఇలాంటి భారీసైజు సోలార్ఫామ్స్ మరిన్ని ఏర్పాటు చేస్తామంటోంది పాండా గ్రీన్ ఎనర్జీ సంస్థ. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సోలార్ చికెన్
మీరు ఇంతవరకు సోలార్ లైట్లు, సోలార్ పంపుసెట్లు, సోలార్ వాహనాల గురించి వినే ఉంటారు కానీ సోలార్ చికెన్ గురించి ఎప్పుడైనా విన్నారా. దాని గురించి తెలుసుకోవాలంటే థాయిలాండ్ వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎవరైనా చికెన్‌ను అగ్గి మీద కాలుస్తారు లేదా స్టవ్ మీద రెడీ చేస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్ అనే వీధి దుకాణాదారుడు మాత్రం ఈ రెండింటికీ విరుద్ధంగా చికెన్‌ను తయారు చేస్తాడు. ఓవెన్ లేదా చార్కోల్ బార్బెక్యూ వాడేందుకు బదులుగా 1000 మొబైల్ మిర్రర్లను ఉపయోగిస్తాడు. సూర్యుని నుంచి వచ్చే బలమైన కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి దాని ద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తాడు. 300 డిగ్రీల సెల్సియస్ సహజ సూర్య కాంతి ద్వారా మాంసాన్ని వండుతాడు. అందరిలాగే సిలా తొలుత చార్కోల్పై చికెన్‌ను వండేవాడు. కానీ 1997లో ఒకసారి కదులుతున్న బస్సు అద్దాలపై సూర్య కాంతి పడి అది కాస్తా రిఫ్లెకై్ట సిలా ముఖంపై పడింది. అప్పుడు ముఖంపై వేడి తగిలి చివుక్కుమనింది. దీంతో అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సూర్యకాంతిని ఎందుకు శక్తిగా వినియోగించుకోకూడదు అని .. అలా వచ్చిన ఐడియాతో సూర్యకాంతిని ఉపయోగించి చికెన్‌ను తయారు చేసే స్థితికి నేడు చేరుకున్నాడు. తొలుత అతని ఐడియాను చుట్టుపక్కల వారు ఎగతాళి చేశారు. నవ్విన నాప చేనే పండుతుంది అన్న తీరుగా ఇప్పుడు నవ్విన వారే సిలాను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం 1.5 కేజీల చికెన్‌ను 10–15 నిమిషాల్లో వండేస్తున్నాడు. తాను రూపొందించిన లోహయుతమైన అద్దాలు సూర్యకాంతిని శోషించుకుని సుమారు 312 డిగ్రీ సెల్సియస్ వేడిని ఉత్పత్తి చేయగలవని సిలా తెలిపారు. ఆ వేడిని తట్టుకునేందుకు ముఖానికి వెల్డింగ్ మాస్క్‌ను ధరిస్తాడు. -
భూములు లాక్కొని.. పరిహారం ఎగ్గొట్టి..
- ఎన్పీకుంట సోలార్ బాధిత రైతులకు తీరని అన్యాయం - మూడేళ్లు పూర్తయినా అందని పరిహారం - ప్రకటించింది అరకొరే.. దాన్నీ ఎగ్గొడుతున్న ప్రభుత్వం! - సర్వం కోల్పోయిన సాగుదారులు - పరిహారం రాదన్న ఆవేదనతో ఇటీవల ఓ రైతు ఆత్మహత్య - అయినా చలనం లేని సర్కారు సోలార్ ప్లాంటు కోసం సేకరించిన భూములు భూమి వివరము ఎకరాలు ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు పట్టా భూమి 290.11 ఎకరాలు అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు సాగుభూమి 1840.77 ఎకరాలు మొత్తం 9,015.02 ఎకరాలు వారంతా కష్టజీవులు. వ్యవసాయం తప్ప మరో పని తెలీదు. అనేక ఏళ్లుగా నేలతల్లినే నమ్ముకున్నారు. కష్టమైనా, నష్టమైనా పంటల సాగుపైనే ఆధారపడ్డారు. అలాంటి రైతుల్లో ఒక్కసారిగా కుదుపు. ‘భూములు మీవి కాదు..సర్కారువి’ అంటూ నిర్ధాక్షిణ్యంగా లాగేసుకున్నారు. అయ్యా..తరతరాలుగా సాగు చేస్తున్నామని రైతులు మొత్తుకున్నా..అధికారులు విన్పించుకోలేదు. ‘రికార్డు ప్రకారం మీవి కాదు..అయినా ఎంతోకొంత ఇస్తాం లే..’ అంటూ ‘ఉదారత’ ప్రదర్శించారు. తీరా భూములు లాగేసుకున్నాక, వాటిలో సోలార్‌ప్లాంటు కూడా ఏర్పాటు చేశాక..ఇప్పుడు పరిహారం ఊసే ఎత్తడం లేదు. దీంతో జీవనాధారం కోల్పోయిన రైతులు తీవ్ర మానసిక వేదనతో కుంగిపోతున్నారు. కదిరి : ఎన్పీకుంటకు చెందిన మౌలాసాబ్ (68)కు అదే పంచాయతీ పరిధిలోని కావమ్మ ఆలయానికి సమీపంలో పదెకరాల సాగుభూమి ఉండేది. అందులో బోరు వేయించి.. వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించేవాడు. ఆ భూమికి పట్టాతో పాటు పాసుపుస్తకాలు కూడా మంజూరు చేయాలని అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసమని ఆ భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంది. మౌలాసాబ్ను సాగుదారుడిగా గుర్తించి.. పదెకరాలకు కలిపి రూ.లక్ష పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే.. మూడేళ్లు గడిచినా చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. గతంలో వరుస పంట నష్టాలతో అప్పుల పాలు కావడంతో పాటు పరిహారం అందక, కుటుంబ పోషణ సైతం భారమై మౌలాసాబ్ చివరకు ఇల్లు కూడా అమ్మేశాడు. అయినా అప్పులు తీరలేదు. తనకు వేరేదారి లేక ఈ నెల 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క మౌలాసాబ్ మాత్రమే కాదు.. ఎన్పీకుంట సోలార్ ప్లాంటు బాధిత రైతులలో చాలామంది పరిస్థితి దయనీయంగా మారింది. సాగుభూములు కోల్పోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులు 1,156 మంది ఉన్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఇక పరిహారం అందేది అనుమానమేనని సంబంధిత అధికారులే అంటుండడంతో రైతులు కుంగిపోతున్నారు. ఎన్పీకుంట మండల కేంద్రానికి సమీపాన దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు చాలావరకు పూర్తయ్యాయి. వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్లాంటు బా«ధ్యతను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తీసుకుంది. దీనికోసం ఎన్పీకుంట పంచాయతీ పరిధిలో 2,079.38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి మొత్తం 7,174.25 ఎకరాలను మూడు విడతల్లో సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతు పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మరో 1,840.77 ఎకరాల రైతుల సాగుభూమిని బలవంతంగా లాక్కున్నారు. నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ప్రభుత్వం ఇస్తోంది. ఎన్పీకుంటలో మాత్రం తీరని అన్యాయం చేసింది. పట్టా భూమికి రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షల చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ.44.44 కోట్లు చెల్లించారు. ఇంకా పట్టా, అసైన్డ్ భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. ఇదంతా ఓ ఎత్తయితే.. ఏళ్ల తరబడి భూములు సాగుచేసుకుంటూ వివిధ కారణాలతో పట్టాలు పొందని 1,156 మంది రైతుల పరిస్థితి మరో ఎత్తు. ఈ రైతులకు ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు సాగు చేసుకుంటున్నప్పటికీ సాగు రైతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చెల్లిస్తామని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ డబ్బు కూడా ఎగ్గొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 6 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు – రైతు కేశవరెడ్డి, పి.కొత్తపల్లి, ఎన్పీకుంట మండలం మాకు పి.కొత్తపల్లి పరిధిలో ఆరెకరాల సాగుభూమి ఉంది. ఈ భూమి మొత్తం సోలార్ ప్రాజెక్టు కోసమని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. అంతటికీ కలిపి రూ.లక్ష ఇస్తామన్నారు కానీ.. ఇప్పటి దాకా ఒక్క రూపాయి చెల్లించలేదు. ఉన్న భూమిని లొక్కొని, పరిహారం కూడా ఇవ్వకపోతే మా గతి ఏం కావాలి?రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక తప్పదు. సాగుభూమికి పరిహారం రాకపోవచ్చు – ఎ.వెంకటేశు, ఆర్డీఓ, కదిరి నాకు తెలిసి పట్టా, అసైన్డ్ భూములకు పరిహారం వస్తుంది కానీ ఎటువంటి పత్రాలూ లేని సాగుభూములకు పరిహారం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవు. గతంలో అధికారులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఎన్పీకుంట సోలార్ ప్రాజెక్టు బాధిత రైతులకు పరిహారం చెల్లించే విషయం ఇప్పుడు నా పరిధిలో లేదు. జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంది. మెడలు వంచి ఇప్పిస్తాం - డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త సోలార్ ప్లాంటు కోసం తీసుకున్న భూములు బాగా సారవంతమైనవి. వాటికి ఎగువన పెడబల్లి ప్రాజెక్టు, దిగువన వెలిగల్లు ప్రాజెక్టు ఉన్నాయి. ఆ భూముల మధ్యలోనే హంద్రీ-నీవా కాలువ కూడా వెళ్తోంది. అలాంటి భూములను బలవంతంగా లాక్కున్నదే కాకుండా ఇప్పుడు సాగుదారులకు పరిహారం ఇవ్వకపోతే ఎలా? ఈ సర్కారు మెడలు వంచైనా పరిహారం ఇప్పిస్తాం. రైతుల కోసం అవసరమైతే న్యాయ పోరాటానికీ సిద్ధం. సాగురైతు మౌలాసాబ్ మృతికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. -
భీమవరం విద్యార్థుల వినూత్న ప్రయోగం
-
భీమవరం విద్యార్థుల వినూత్న ప్రయోగం
మాటలు వినే సోలార్ వీల్‌చైర్ తయారు చేసిన ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భీమవరం: మాటవిని మసలుకునే వారు దొరికితే కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అది జీవిత భాగస్వామి అయినా.. చివరకు వీల్‌చైర్ అయినా అదే భావం. ఓ సోలార్ వీల్ చైర్ మన మాటలను వింటుంది. నడవమంటే నడుస్తుంది.. ఆగమంటే ఆగుతుంది.. వెనక్కి.. కుడి లేదా ఎడమ వైపునకు ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. వికలాంగుల కోసం మాటల ఆధారంగా నడిచే సోలార్ వీల్‌చైర్‌ను భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థులు నవ్య, ప్రసాద్, గీత, రాధ, రాజా దీనిని రూపొందించారు. చైర్‌కు ప్రత్యేక యాప్‌ను రూపొందించి.. బ్లూటూత్ ద్వారా పనిచేయిస్తున్నట్టు ఈ విద్యార్థులు తెలిపారు. దీని తయారీకి రూ.60 వేలు ఖర్చయిందని, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద ఈ వినూత్న ప్రయోగం చేశామని వివరించారు. దీని పనితీరును కళాశాల ఆవరణలో ప్రదర్శించారు. -
గోల్మాల్ ’ప్లాంటు’ అరాచకాలు
-
‘సిరిసిల్ల’ సోలార్ ప్లాంట్‌లో ప్రమాదం
సిరిసిల్లటౌన్(రాజన్న సిరిసిల్ల): సోలార్‌ప్లాంటులో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ ఎలక్ట్రికల్ డిప్యూటీ మేనేజర్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో బుధవారం జరిగింది. నామాపూర్‌లో ఆరునెలలుగా సోలార్ పవర్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. స్టెర్లింగ్ విల్సన్ కంపెనీ ఆధ్వర్యంలో ముంబయి నుంచి 30మంది ఉద్యోగుల బృందం వచ్చి పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్లాంటులో ట్రాన్స్ఫార్మర్ను గద్దెపై కూర్చోపెట్టడానికి క్రేన్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో హఠాత్తుగా క్రేన్ హైడ్రాలిక్ ఊడిపోయి డిప్యూటీ మేనేజర్ యోగేశ్ విశ్వనాథ్ పూజారి, మరో ఉద్యోగి మనీశ్‌రెడ్డిపై పడింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ సహోద్యోగులు వెంటనే ముస్తాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకునేలోగానే విశ్వనాథ్‌పూజారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. మనీశ్‌రెడ్డి గాయాలపాలైనా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. విశ్వనాథ్‌పూజారి కుటుంబ సభ్యులు ముంబాయిలోనే ఉంటారని స్థానికులు తెలిపారు. ప్లాంటు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. -
సావ్ధాన్... ఒన్ టూ త్రీ వాక్ ఇన్ టు బేర్‌ఫుట్
చైతన్యం తిలోనియా... ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో చిన్న కుగ్రామం. ఆరునెలలకు ఒకసారి ప్రపంచం నలుమూలల నుంచి కొంత మంది బామ్మలు వస్తారిక్కడికి. వారంతా కాలేజ్ స్టూడెంట్స్. నిజమే... వాళ్లు బేర్‌ఫుట్ కాలేజ్‌లో చేరడానికే వస్తారు. వాళ్లలో చాలామంది స్కూలు ముఖం కూడా చూసి ఉండరు. ఏకంగా కాలేజ్‌లో చేరిపోవడానికి వచ్చేస్తారు. అక్షరం ముక్క రాకపోయినా... ఒకరి భాష ఒకరికి తెలియకపోయినా... అంతా కలిసిపోతారు. అందరి లక్ష్యం ఒక్కటే. నైపుణ్యం సాధించడం... సొంతూరికి సాయపడటం! బేర్‌ఫుట్ కాలేజ్‌లో చేరిన మహిళలు ఆరు నెలల్లో ఇంజినీర్లు అవుతారు. వారిలో కొందరు తమ గ్రామంలో చీకటిని తరిమి వెలుగులు నింపడానికి సోలార్ లైట్ తయారీ నేర్చుకుంటారు. ఇంకొందరు చుక్క చుక్క వాననీటిని ఒడిసిపడతారు. మరికొందరు భావితరాలను అక్షర సైనికులుగా తీర్చిదిద్దే గురువులు అవుతారు. ఇంకా... ఎలక్ట్రీషియన్లు, డెంటిస్ట్‌లు, హస్తకళాకారులుగా ఎదుగుతారు. ఆశ్చర్యంగా ఉంటే ముక్కున వేలేసుకోవడం తప్ప మనం మరేమీ చేయలేం. గ్రామీణుల నైపుణ్యమే పెట్టుబడి... బేర్‌ఫుట్ కాలేజీ... ఇతర కాలేజీల మాదిరి చదువు చెప్పదు. సర్టిఫికెట్లు ఇవ్వదు. పల్లెటూళ్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఆ గ్రామాల్లోని నిరక్షర నిపుణులే పెట్టుబడిగా బతుకును సాఫీగా మార్చుకునేందుకు అవసరమైన సాధన సంపత్తిని అందిస్తుంది అంతే. ‘‘బేర్‌ఫుట్ కాలేజీని 12 మంది తిలోనియా గ్రామ మేస్త్రీలే కట్టారన్నా... ముప్ఫై ఏళ్ల క్రితమే ఈ కాలేజీ మొత్తం సౌరశక్తితోనే నడిచిందన్నా... ఐదేళ్ల కరవును సైతం తట్టుకునేలా దీంట్లో నాలుగు లక్షల లీటర్ల సామర్థ్యమున్న వాననీటి సంరక్షణ ట్యాంకు ఉందన్నా.. అంతా ఈ ఫిలాసఫీ చలవే. అందుకే ఈ కాలేజీలో చేరేందుకు డిగ్రీలు అస్సలు పనికిరావు. మీ చేతులతో పనిచేయాలి... మీ పల్లె లేదా మీ చుట్టూ ఉన్న వారి సమస్యల్లో ఏదో ఒకదానికి పరిష్కారం చూపగలగాలి. అన్నింటికీ మించి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటేనే బేర్‌ఫుట్ కాలేజీలోకి ప్రవేశం. ఒకవేళ మీరు ఇంకెక్కడో పెద్దపెద్ద చదువులు చదువుకుని సామాజిక ప్రయోజనమున్న ఆలోచనలకు పదును పెట్టాలనుకుంటే మాత్రం ఎప్పుడైనా రావచ్చు... ఎంతకాలమైనా మాతో ఉండవచ్చు’’ అంటారు బంకర్ రాయ్. ఎవరీ బంకర్! స్వాతంత్య్రానికి రెండేళ్ల ముందు ఆగస్టు రెండున వెస్ట్ బెంగాల్‌లోని బర్న్‌పూర్‌లోని సంపన్న కుటుంబంలో జన్మించాడు సంజిత్ బంకర్ రాయ్. డూన్ స్కూల్లో చదువుకున్నాడు. 1962 తరువాత ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ చేశారు. స్క్వాష్‌లో జాతీయ ఛాంపియన్ కూడా. అనుకోవాలేగానీ... ఓ డాక్టర్, ఓ సైంటిస్ట్, ఓ దౌత్యవేత్త.. ఇలా ఏమైనా కాగలిగేవాడు. చదువు పూర్తయిన తరువాత ఆయనకు కొద్దిరోజులు పల్లెటూళ్లో గడిపితే ఎలా ఉంటుంది... అనే చిత్రమైన కోరిక కలిగింది. అంతే... బీహార్‌కు పయనమయ్యాడు. అప్పటికి అంటే 1965కి బీహార్ మహా కరవు రక్కసి కోరల్లో విలవిల్లాడి... జీవచ్ఛవంలా ఉంది. ఆ గ్రామాలను దగ్గర నుంచి చూశాడు. పల్లెటూరి సమస్యలేమిటో? ఎలా ఉంటాయో? గ్రామీణులు ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉంటారో అర్థమైంది. వెనుదిరిగి రావడమే తడవు.. తాను పల్లెబాట పట్టబోతున్నట్లు ఇంట్లో ప్రకటించేశాడీ శ్రీమంతుడు. తల్లి బిత్తరపోయింది.. వీడికేమైనా పిచ్చెక్కిందా? అనేసింది కూడా. బంకర్ రాయ్ చాలా సింపుల్‌గా ‘‘మీరు చెప్పించిన చదువు నన్ను ఆలోచించేలా చేసిందమ్మా. అందుకే మన పల్లెటూళ్లకు నాదైన రీతిలో సేవ చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘ఏం చేస్తావక్కడ? ఏముంది? ఉద్యోగం లేదు... డబ్బులు ఉండవు.. పూట గడుస్తుందన్న నమ్మకం కూడా లేదు కదా’’ అని అమ్మ అంటే... ‘‘ ఏమీ చేతకాకపోతే బావులు తవ్వుతా’’ అన్నాడు సినీఫక్కీలో బంకర్ రాయ్. అనడమే కాదు... అన్నంత పనీ చేశాడు. ఆ పని చేసింది రాజస్థాన్‌లోని తిలోనియా గ్రామంలో. దాదాపు వంద గ్రామాల్లో కరవు పరిస్థితులను అధ్యయనం చేసిన ఆయన ముందుగా తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి నడుం బిగించాడు. ఈ నేపథ్యంలోనే 1972లో ప్రారంభమైంది బేర్‌ఫుట్ కాలేజీ!!! తొలి ఇంజనీర్ బామ్మ! బేర్‌ఫుట్ కాలేజీ రాజస్థాన్‌లో తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం మొదలైనప్పటికీ కాలక్రమంలో దీని పంథా మారిపోయింది. మహిళల స్వావలంబన మొదలుకొని ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంలో తనవంతు సహకారం అందిస్తోంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియాదేశాల్లోని మారుమూల ప్రాంతాల బామ్మలకు మాత్రమే ఈ కాలేజీలో ప్రవేశం. ⇒సౌరశక్తితో పనిచేసే దీపాలు, వేడినీటియంత్రాల తయారీలో వీరికి శిక్షణ ఇస్తారు. తిలోనియాలో బేరఫుట్ కాలేజీ మొత్తానికి సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసిన నిరక్షరాస్య ఇంజినీర్ ఒకరు వీరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ తరువాత ఈ బామ్మలు వారి వారి స్వస్థలాల్లో సోలార్ లైట్లు, ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా... మరింత మందికి శిక్షణ ఇస్తారు. ⇒వాన నీటి సంరక్షణ మెళకువలు, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ, యంత్రాల తయారీలోనూ ఇదే తరహా తర్ఫీదు లభిస్తుందిక్కడ. ⇒చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యాబోధనకూ, సామాజిక దురాచారాల నిర్మూలనలపై కూడా బేర్‌ఫుట్ కాలేజీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తారు. తిలోనియాలో శిక్షణ పూర్తి చేసుకన్న తొలి సోలార్ ఇంజినీర్ కనకా దేవి. 1997 డిసెంబరులో కాలేజ్‌లో చేరింది. ఇప్పటివరకూ బేర్‌ఫుట్ కాలేజీ దాదాపు 77 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మందిని సోలార్ ఇంజినీర్లుగా తీర్చిదిద్దింది. అవార్డు వద్దు! బహుమతి వద్దు!! ‘‘నిరుపయోగంగా ఉన్న క్షయవ్యాధి కేంద్రాన్ని నెలకు రూపాయికి అద్దెకు తీసుకున్నాం. అలా మొదలైన బేర్‌ఫుట్ కాలేజీకి 2002లో ఆగాఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డు లభించింది. ట్రస్ట్ తరఫున కాలేజీని సందర్శించిన వారు దీన్ని కట్టింది మా ఊరి మేస్త్రీలే, ఈ కాలేజ్‌లో పని నేర్చుకున్న వారేనంటే వాళ్లు అస్సలు నమ్మలేదు. ఆర్కిటెక్ట్‌లు బ్లూప్రింట్ మాత్రమే ఇచ్చారు... నిర్మాణం మొత్తం మా మేస్త్రీలే చేశారు. వారికి నమ్మకం కలగకపోవడంతో ఆ అవార్డును తిరస్కరించాం. నగదు బహుమతి 50 వేల డాలర్లను తిరిగి ఇచ్చేశాం’’ – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
సోలార్ కారు.. హాయిగా షికారు
- జి.పుల్లయ్య కాలేజీ విద్యార్థుల ఆవిష్కరణ - త్వరలోనే వికలాంగులకు సైతం సోలార్ ట్రైసైకిళ్ల తయారీకి చర్యలు - విద్యార్థులను అభినందించిన కాలేజీ చైర్మన్ జి.వి.ఎం మోహన్ కుమార్ కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని వెంకయ్యపల్లె సమీపంలోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థు«లు తమ ప్రతిభతో సోలార్ కారును ఆవిష్కరించారు. అలాగే ఇంట్లో పైసా ఖర్చూ లేకుండా ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసుకునేందుకు సోలార్ కుక్కర్‌ను సైతం తయారు చేశారు. ఈ మేరకు బుధవారం ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల చైర్మన్ జి.వి.ఎం మోహన్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కాలుష్యం సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. దీంతో తమ వంతుగా సమాజానికి మెరుగైన వాహనాలను తయారు చేయాలనే ఉద్దేశంతోనే సోలార్‌తో రెండు ప్రాజెక్టులను ఈ ఏడాది తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థు«లు చాలా శ్రమతో అధ్యాపకుల సహయంతో సోలార్ కారు, సోలార్ కుక్కర్‌ను రూపొందించారన్నారు. నూతన ఆవిష్కరణలకు ఇది ప్రారంభమని, మునుముందు ఎన్నో ప్రాజెక్టులు చేపడుతామన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. సమావేశంలో ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు, వైస్ చైర్మెన్ జి.వంశీధర్, డీన్ డా.ఎస్ ప్రేమ్‌కుమార్, కార్పొరేట్ వ్యవహారాల డీన్ డా.ఎం.గిరిధర్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతోనే కారు: చైర్మన్ జి.వి.ఎం మోహన్‌కుమార్ కాలుష్య నివారణకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సోలార్ కారును ఆవిష్కరించాలనుకున్నాం. రూ. 1.25 లక్షల బడ్జెట్‌ను నిర్ణయించాం. అయితే మెకానికల్ తృతీయ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు జె.నిర్మల్, డి.ఆశిష్, హూసేన్ బాషా, సాయినాథ్‌గౌడ్, రంజిత్, యోగేష్, అనిల్ దాదాపు 45 రోజులపాటు స్టడీ చేసి మోకానికల్ విభాగాధిపతి డాక్టర్ కె. మల్లికార్జున పర్యవేక్షణలో కేవలం రూ. 70 వేలు మాత్రమే ఖర్చు చేసి సోలార్ కారును తయారు చేశారు. ఇందులో ఆరుగురు ప్రయాణించవచ్చు. 2 నుంచి 3 గంటలు చార్జీ అయితే సరిపోతుంది. గంటకు 32 నుంచి 40 కి.మీ వేగంతో వెళ్తుతుంది. సాధారణ వాహనాల వలే రోడ్డుపై ప్రయాణం చేయవచ్చు. సోలార్ ఫలకాలను పెంచుకుంటే మరింత వేగంగా కూడా వెళ్లవచ్చు. ప్రస్తుతం నాలుగు బ్యాటరీలతో కారు నడుస్తుంది. క్యాంపస్‌లో దీన్ని వినియోగిస్తున్నాం. త్వరలోనే దివ్యాంగుల కోసం సోలార్ ట్రైసైకిళ్ల తయారు చేసే అంశంపై ఆలోచన చేస్తున్నాం. -
దొనకొండలో సోలార్ ప్లాంట్ !
► రుద్రసముద్రం గ్రామ సమీపంలో ఏర్పాటుకు ప్రతిపాదనలు ► వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు పరిశీలించిన ట్రానా ఎనర్జీ ప్రతినిధులు దొనకొండ : జిల్లాలో వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని, ముంబైకి చెందిన ట్రానా ఎనర్జీ కంపెనీ పార్టనర్ కె.వి రమణశాస్త్రి పేర్కొన్నారు. మండలంలోని రుద్రసముద్రం గ్రామ పొలాలను ఆ కంపెనీ డైరెక్టర్ యోగేష్ చపానీరాతో కలిసి శనివారం పరిశీలించారు. కె.వి రమణశాస్త్రి మాట్లాడుతూ వంద మెగా వాట్స్ సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు భూములు³రిశీలించేందుకు దొనకొండ పర్యటనకు వచ్చామన్నారు. లా మెగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ట్రానా ఎనర్జీ ఒక భాగమన్నారు. సర్వే నంబర్లు 262, 264లో 100 ఎకరాలు, 370 నుంచి 470 వరకు 200 ఎకరాలు వారు పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. ఇది ప్రాథమిక సర్వే మాత్రమే అని.. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించడానికి తమ కంపెనీ తరఫున మరోసారి వస్తామన్నారు. టెక్నికల్, ఆర్థికం, సామాజికం, సస్టెయినబుల్ అనే నాలుగు అంశాలపై తమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధారపడి పనిచేస్తుందన్నారు. వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపడితే సుమారు 250 నుంచి 1500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి 600–1000 ఎకరాల భూమి అవరసమవుతుందని, నిర్మాణ ఖర్చు రూ. 600 కోట్లు అని చెప్పారు. అన్నీ కుదిరి ఇక్కడ సోలార్ సిస్టమ్ నిర్మించినట్లయితే భవిష్యత్‌లో టైల్స్, అడెటివ్ కెమికల్ ఉత్పత్తి చేసేందుకు తమ గ్రూప్ ఆఫ్ కంపెనీ పనిచేస్తుందన్నారు. ఇక్కడి పరిస్థితులను డిప్యూటీ తహసీల్దార్ గోగు వెంకటేశ్వర్లు, మ్యాపుల ద్వారా భూముల వివరాలను సర్వేయర్ వెంకట్రావు వారికి వివరించారు. ఆయన వెంట ఐటీ ప్రమోషనల్ అధికారి వి.వి. భూపాల్, కన్సల్టెంట్ భాను చందర్, ఏపీఐఐసీ ఏఈ కుమార్ ఉన్నారు. -
ఎడారిలో తాగునీరిచ్చే పరికరం
నీటిచుక్క కనుచూపు మేరలో కనిపించని ఎడారుల్లో కూడా గాలిలోని తేమ నుంచి నీటిని ఒడిసి పట్టి స్వచ్ఛమైన మంచినీటిగా మనకందించే ఓ పరికరాన్ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ బృందం కనిపెట్టింది. పైగా ఈ పరికరం సౌరశక్తితో పనిచేస్తుంది. డబ్బా ఆకారంలో ఉంటే గది లోపల గాలిలోని తేమను పీల్చుకునేందుకు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఓఎఫ్) అనే పలక ఉంటుంది. నీటిని పీల్చేందుకు ఈ పలకకు స్పాంజ్ లాంటి గుణం ఉంటుంది. పైగదిలో నీటిని చల్లబర్చేందుకు ఓ కండెన్సర్, మేడమీద సౌరశక్తిని గ్రహించుకునేందుకు సోలార్ ప్లేట్స్ ఉంటాయి. గాలిలోని తేమను మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ పీల్చుకుంటే సౌర విద్యుత్ ద్వారా అది వేడెక్కుతుంది. అప్పుడు ఆవిరి రూపంలో నీరు కండెన్సర్ ఉన్న గదిలోకి వెళుతుంది. కండెన్సర్ వల్ల ఆవిరి చల్లబడి మంచినీరుగా మారుతుంది. గాలిలో నుంచి తేమను గ్రహించి మంచినీరిచ్చే ఇలాంటి పరికరాలు ఇంతకుముందే మార్కెట్లో ఉన్నాయి. అయితే అవి గాలిలో 50 శాతం తేమ ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఇప్పుడు కనుగొన్న పరికరానికి గాల్లో 20 శాతం తేమ ఉంటే సరిపోతుంది. అంటే ఎడారిలో కూడా పనిచేస్తుందన్నమాట. ఇందులో ఉండే ఫ్రేమ్‌వర్క్ కిలోబరువుంటే 2.8 లీటర్ల మంచినీరు లభిస్తుంది. అంటే అది ఎంత ఎక్కువ బరువుంటే అన్ని నీళ్లు ఎక్కువగా వస్తాయి. నలుగురు సభ్యులుంటే కుటుంబానికి సరపడా మంచినీళ్లు కావాలంటే మొత్తం ఈ పరికరం ఓ సూట్‌కేసంత తయారుచేయాల్సి ఉంటుంది. దానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంశాన్ని ఇప్పుడే అంచనా వేయలేదని, ఇలాంటి పరికరాలను తయారు చేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తే సహకరించాలన్నదే తమ అభిమతమని పరిశోధకులు తెలిపారు. -
సోలార్ వ్యాపారం ఇక ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించాలని ఉన్నవారికి ఎలాంటి అనుభవం లేకున్నా వ్యాపారం చేసేందుకు వీలుగా ‘సన్‌ప్రో’ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. సౌర విద్యుత్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్ ఎనర్జీ భారత్‌లో తొలిసారిగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 150 కంపెనీలు 40 రకాల పరికరాల వివరాలను యాప్‌లో జోడించాయి. ఔత్సాహిక వ్యాపారులు కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సౌర విద్యుత్ పరిష్కారాలను అందించేందుకు వీలుగా యాప్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సౌరభ్ మర్దా తెలిపారు. సహ వ్యవస్థాపకురాలు రాధిక చౌదరితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 80 మంది వ్యాపారులు ఇప్పటి వరకు చేతులు కలిపారని, కంపెనీకి రూ.60 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని చెప్పారు. ఫ్రేయర్ ఎనర్జీ 2016–17లో రూ.12 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు ఆశిస్తోంది. -
లంకంత సొంతిల్లు.. కట్టుకుంది ఇద్దరు!
‘‘మేడంటే మేడా కాదు... గూడంటే గూడు కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది..’’ అని అరవై ఆరేళ్ల వేన్ ఆడమ్స్, యాభై తొమ్మిదేళ్ల కేథరీన్ కింగ్ దంపతులు పాడుకుంటున్నారు. కెనడాలోని వాంకోవర్ ద్వీపం వద్ద రణ గొణధ్వనులకు దూరంగా.. ప్రకృతికి దగ్గరగా ఈ దంపతులు కట్టుకున్న ఇల్లే మీకు ఫొటోల్లో కనిపిస్తున్నది. ఆశ్చర్యంగా ఉందా? ‘వావ్ ...’ అనే అంశాలు ఇంకా అనేకమున్నాయి ఇందులో. వాటిలోకి వెళ్లేముందు ఆడమ్స్, కేథరీన్‌ల గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇద్దరూ మంచి కళాకారులు. ఆడమ్స్ కార్వర్ (వడ్రంగి), కేథరీన్ బ్యాలే నర్తకి. 1992 నుంచి వీళ్లు ఈ ఇంట్లోనే ఉంటున్నారుగానీ... అప్పటికీ ఇప్పటికీ అస్సలు పోలికే లేదు. అప్పట్లో సరస్సుపై తేలియాడుతున్న చిన్న ఇల్లు ఉంటే.. ఇప్పుడది 12 ప్లాట్‌ఫార్మ్‌తో ఏ చిన్న విషయానికీ ఇతరులపై ఆధారపడని రీతిలో అభివృద్ధి చెందింది. క్రెడిట్ మొత్తం ఆ జంటదే సుమీ! ఏమేమున్నాయి వీళ్లింట్లో అనుకుంటున్నారా? ఓ లైట్ హౌస్, డ్యాన్స్ ఫ్లోర్, ఆర్ట్ గ్యాలరీ, గ్రీన్హౌస్. అంతేకాదు.. కరెంటు కోసం 14 సోలార్ ప్యానెళ్లు కూడా ఉన్నాయి. ఆకలైనప్పుడు సరస్సులో చేపలు పట్టుకోవడం.. పక్కనే ఉన్న అర ఎకరం తేలియాడే పొలంలో పండే కాయగూరలు, ఆకు కూరలతో వండుకోవడం. అంతే! కోళ్లు కూడా పెంచుకునేవారుగానీ... ఆ మధ్య జంతువుల బెడద ఎక్కువైందని మానేశారు. వేసవిలో సరస్సు పక్కనే ఉన్న జలపాతం నుంచి, చలికాలంలో కురిసే మంచు నుంచి నీళ్లు సేకరించి వాడుకుంటారట! తమ ఇంటిని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారిని ప్రతి ఏడాది వేసవి సమయంలో అతిథులుగా ఆహ్వానిస్తారు కూడా! ఇంతకీ వీళ్ల ఇంటిపేరు ఏమిటో చెప్పలేదు కదూ.. ‘ఫ్రీడమ్ కోవ్’! బాగుంది కదూ! నిజంగానే ఇది స్వేచ్ఛా గుడారం! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘కృత్రిమ సూర్యుడి’ని పరీక్షించిన శాస్త్రజ్ఞులు
బెర్లిన్: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. జర్మనీలోని జ్యూలిచ్‌లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేషన్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. హైడ్రోజన్ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు హైడ్రోజన్ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి దానిని విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు. -
సోలార్ సైకిల్
–ఇంజనీరింగ్ విద్యార్థుల అవిష్కరణ గోనెగండ్ల: తొక్కకుండా నడిచే సోలార్ సైకిల్.. కర్నూలు బృందావన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థుల ఆవిష్కరణ. శుక్రవారం గోనెగండ్లలో ప్రయోగాత్మకంగా దానిని నడిపి చూపించారు. ఎమ్మిగనూరుకు చెందిన మహమ్మద్ రఫీక్, ఉదయ్‌కుమార్, కర్నూలుకు చెందిన కిరణ్‌స్వామి, సూర్యదీప్, రాజేష్ అనే విద్యార్థులు..సైకిల్‌కు సోలార్ ప్యానెల్‌తో పాటు బ్యాటరీ, మోటర్ అమర్చారు. ఇందుకు రూ. 10వేలు ఖర్చు చేశారు. పదిరోజుల కృషి ఫలితం..సోలార్ ద్వారా 24 ఓల్ట్‌ల విద్యుత్ ఉత్పత్తి గంటకు 25 కిలో మీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళ్లే సైకిల్ తయారైంది. దీనిపై 4గంటల మేర ప్రయాణం చేయవచ్చని ఇంజినీరింగ్ విద్యార్థి మహమ్మద్ రఫీక్ తెలిపారు. ఎండ లేనప్పుడు విద్యుత్‌తో బ్యాటరీని చార్జింగ్ 2 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సైకిల్ తయారీకి కళాశాల అధ్యాపకులు కైలాస్ కృష్ణప్రసాద్, ఒన్నూరప్పతో పాటు గోనెగండ్లకు చెందిన టెక్నిషియన్ మజీద్బాషాలు సహకారం అందించినట్లు చెప్పారు. -
ఈ భవనం... నీడ కూడా పడదు!
-
ఈ భవనం... నీడ కూడా పడదు!
ఒడిశాలోని జగన్నాథ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరం పొడవునా... ఈ మహా దేవాలయ ప్రధాన గోపురం తాలూకూ నీడ ఎక్కడా కనిపించదట! వందల ఏళ్ల క్రితమే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టడం వల్ల ఇది సాధ్యమైందని మనకు తెలుసు. ఇప్పుడు పక్క ఫొటోలు చూడండి. ఇది న్యూయార్క్ మహా నగరంలో త్వరలో నిర్మించబోయే భవనం. పేరు... సోలార్ కార్వ్ టవర్. ఇది కూడా జగన్నాథ ఆలయం మాదిరిగా ఎలాంటి నీడ సృష్టించదు! నగరాల్లో భవనాలు పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల ఉన్న వారికి గాలి వెలుతురు తగ్గిపోతాయన్నది మనకు అనుభవమైన విషయమే. ఈ విషయమై న్యూయార్క్ నగరంలో ఇప్పటికే చాలా ఆందోళనలు జరిగాయి. దీంతో అక్కడి అధికారులు పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికి అనుమతులివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ‘స్టుడియో గ్యాంగ్’ అనే సంస్థ ఈ నీడ ఏర్పరచని భవన నిర్మాణానికి ముందుకొచ్చింది. అయినాసరే... దాదాపు మూడుసార్లు న్యూయార్క్ అధికారులు దీన్ని తిరస్కరించారు. చివరకు నాలుగో ప్రయత్నంలో నిర్మాణానికి ఓకే చెప్పారు. దాదాపు 213 అడుగుల ఎత్తున కట్టే ఈ భవనం పూర్తిగా పారదర్శకమైన అద్దాలతో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫొటోలు చూస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. మొత్తం 1.66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండే సోలార్ కార్వ్ టవర్ మాన్‌హటన్‌లోని మీట్ ప్యాకింగ్ డిస్ట్రిక్ట్ వద్ద ఏర్పాటు కానుంది. భవనం ప్రత్యేకమైన డిజైన్ కారణంగా పక్కనే ఉన్న భవనాల్లోని వారికి వెలుతురుతోపాటు పరిసరాల తాలూకూ ‘వ్యూ’ అలాగే ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వారికి గాలి కూడా మామూలు స్థాయిలో వీచేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు... ఈ భవనం రూఫ్‌టాప్‌పై ఓ భారీ గార్డెన్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా... భవన నిర్మాణంలో రీసైకిల్డ్ మెటీరియల్‌ను ఎక్కువగా వాడటం, నీటిని సమర్థంగా వాడుకోవడం, వాననీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం వంటి అదనపు ఫీచర్లు ఏర్పాటు చేసి అత్యంత పర్యావరణ అనుకూల భవనానికి ఇచ్చే లీడ్ గోల్డ్ సర్టిఫికెట్‌ను అందుకోవాలని చూస్తోంది స్టుడియో గ్యాంగ్! ఆల్ ద బెస్ట్ చెబుదామా? – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గోల్మాల్
-తలారి చెరువు సోలార్‌ప్లాంట్ భూసేకరణలో అక్రమాలు –భూమి లేకపోయినా పరిహారం కోసం ఎత్తులు –ఆలస్యంగా గుర్తించిన రెవెన్యూ అధికారులు – ఆగిపోయిన 17 రిజిస్ట్రేషన్లు –అజ్ఞాతంలోకి వీఆర్ఓ తాడిపత్రి : తాడిపత్రి మండలం తలారిచెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ కోసం భూసేకరణలో అక్రమాలు జరుగుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, సిబ్బంది స్థానిక అధికార పార్టీ నేతలతో ఽకుమ్మక్కై గోల్మాల్ చేస్తున్నారు. భూములు లేని వారి పేరు మీద సైతం ఉన్నట్లు పట్టాలు సృష్టించి నిధులు కొల్లగొట్టేందుకు పథకం పన్నారు. ఇక్కడ 500 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ జెన్కో సంస్థ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం దాదాపు నాలుగు వేల ఎకరాలు సేకరిస్తోంది. ప్రస్తుతం తలారిచెరువు, ఆలూరు గ్రామాల్లో భూసేకరణ జరుగుతోంది. సేకరించనున్న భూముల్లో 106 ఎకరాల పట్టా, 80 ఎకరాల అసైన్డ్, మిగిలినవి ప్రభుత్వ భూములు ఉన్నాయి. పట్టా భూములకు ఎకరాకు రూ.4.25 లక్షలు, అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.3.72 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు రంగంలోకి దిగారు. పట్టాలుండి స్థానికంగా భూయజమానులు లేని వారు, ఆన్లైన్లో నమోదు చేసుకోని వారి వివరాలను సేకరించారు. వారి స్థానంలో ఇతరుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. ఇప్పటికే ఇలా 23 ఎకరాలకు పైగా బినామీల ఽపేర్లతో చేయించారు. ఇందుకు వీఆర్ఓ, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఽసహకారం అందజేశారు. పాసు పుస్తకాల్లో ఫోర్జరీ సంతకాలు చేశారు. తలారిచెరువు గ్రామానికి చెందిన 111, 97, 92, 94బీ సర్వే నంబర్లలో లొసుగులు ఉన్నాయని ఆలస్యంగా గుర్తించిన రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు జరిగిన 17 రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయించారు. ఒక వ్యక్తికి రెండెకరాలు ఉండగా ఏకంగా 32 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో చూపారు. అందులో కొంతమేర ఇతరులకు అమ్మినట్లు కనబరిచారు. సదరు వ్యక్తికి రూ.25లక్షల పరిహారం చెక్కు కూడా అందింది. అయితే..గోల్మాల్ జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ చెక్కు డ్రా చేయకుండా బ్యాంకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తలారిచెరువు వీఆర్ఓ గంగన్న పాత్రపై అనుమానం రావడంతో ఆయన మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భూసేకరణలో ‘బినామీల భాగోతం’ వెలుగులోకి రావడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెవెన్యూ, ఏపీ జెన్కో అధికారులు సిద్ధమవుతున్నారు. 17 రిజిస్ట్రేషన్లు ఆపేశాం–ప్రసాద్, తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ అసలైన రైతుల పట్టాలు, రికార్డులు చూసిన తర్వాత, వీఆర్ఓ అనుమతితోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. కొన్నింటిపై ఫిర్యాదులు రావడంతో రిజిస్ట్రేషన్లు ఆపేశాం. ఇప్పటి వరకు ఇలా 17 రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా ఆపేశాం. రెవెన్యూ అధికారుల అనుమతి తర్వాతనే ముందుకు వెళ్తాం. విచారణ చేస్తున్నాం–యల్లమ్మ, తహశీల్దార్, తాడిపత్రి పట్టా భూముల లబ్ధిదారుల విషయంలో కొన్ని పొరపాట్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, సవరణలు ఉన్న భూముల రికార్డులను పరిశీస్తున్నాం. తమవి కాని భూములను ఇతరులు ఎవరైనా రికార్డుల్లో నమోదు చేయించుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.