
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, ప్రధాన స్టేషన్లలో సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ సంకల్పించింది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఆర్‌ఈడీసీఓ) అధికారులతో చర్చించిన తర్వాత ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో టీఎస్‌ఆర్‌ఈడీసీఓ డైరెక్టర్ సుధాకర్‌రావు, అధికారులు ఒప్పంద పత్రాలపై పరస్పరం సంతకాలు చేశారు. ఒప్పందం 25 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని సోమారపు తెలిపారు. సోలార్ వినియోగంతో ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment